'బొత్స ఎవరి మాటా వినే పరిస్థితుల్లో లేరు' | Raghuveera reddy takes on Botsa Satyanarayana | Sakshi
Sakshi News home page

'బొత్స ఎవరి మాటా వినే పరిస్థితుల్లో లేరు'

Jun 5 2015 10:45 AM | Updated on Mar 18 2019 7:55 PM

'బొత్స ఎవరి మాటా వినే పరిస్థితుల్లో లేరు' - Sakshi

'బొత్స ఎవరి మాటా వినే పరిస్థితుల్లో లేరు'

మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ చాలా పెద్ద తప్పు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు.

విశాఖపట్నం: మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ చాలా పెద్ద తప్పు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం విశాఖపట్నంలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ... బొత్స ప్రస్తుతం ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేరన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారు కాంగ్రెస్ను విడిచి వెళ్లి పోయినా పర్వాలేదు... కానీ పార్టీకి నష్టం కలిగిస్తే మాత్రం సహించేది లేదని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు.

కాగా బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీకి మూడు రోజుల క్రితమే రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి కూడా బొత్స సత్యనారాయణ తన రాజీనామా విషయాన్ని తెలియచేశారు. కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ  బొత్సపై కాంగ్రెస్‌ అధిష్టానం సస్పెండ్‌  వేటు వేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement