2014 ఎన్నికల్లోగా విభజన జరగదు: కిరణ్ | no bifurcation before 2014 elections, says kiran kumar reddy | Sakshi
Sakshi News home page

2014 ఎన్నికల్లోగా విభజన జరగదు: కిరణ్

Oct 4 2013 2:16 PM | Updated on Jul 29 2019 5:31 PM

2014 ఎన్నికల్లోగా విభజన జరగదు:  కిరణ్ - Sakshi

2014 ఎన్నికల్లోగా విభజన జరగదు: కిరణ్

ఎట్టి పరిస్థితుల్లోనూ 2014 ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరిగే సమస్య లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌ : ఎట్టి పరిస్థితుల్లోనూ 2014 ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరిగే సమస్య లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతో ఆయన తన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఆరు వారాల్లోగా అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం వస్తుందని, దాన్ని ఓడిస్తే విభజన ప్రక్రియ ఆగిపోతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయం గురించి ఆందోళన చెందవద్దని ఆయన సీమాంధ్ర ప్రాంత నాయకులకు సూచించారు.

ఈ సమావేశంలో  పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, 17మంది మంత్రులు, 44 మంది ఎమ్మెల్యేలు, పదిమంది ఎమ్మెల్సీలు, కేంద్రమంత్రి చిరంజీవి కూడా పాల్గొన్నారు. భవిష్యత్ కార్యచరణపై చర్చిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement