రామ్‌చరణ్‌తో తదుపరి చిత్రం : శ్రీను వైట్ల | Next movie ramchran in Srinu Vaitla | Sakshi
Sakshi News home page

రామ్‌చరణ్‌తో తదుపరి చిత్రం : శ్రీను వైట్ల

Sep 18 2014 1:34 AM | Updated on Jul 25 2018 2:35 PM

రామ్‌చరణ్‌తో తదుపరి చిత్రం : శ్రీను వైట్ల - Sakshi

రామ్‌చరణ్‌తో తదుపరి చిత్రం : శ్రీను వైట్ల

‘నా ప్రతి సినిమా విడుదలకు ముందు శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి దర్శనానికి సింహాచ లం వస్తాను... ఆయన ఆశీస్సులతో ఆగడు సినిమా ఘన విజయం సాధిస్తుంది’ అని ఆ చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల అన్నారు.

  • సింహాచలం సెంటిమెంట్ కలిసొస్తుంది
  • రామ్‌చరణ్‌తో తదుపరి చిత్రం
  • స్వామిని దర్శించుకున్న సినీ దర్శకుడు శ్రీను వైట్ల
  • సింహాచలం: ‘నా ప్రతి సినిమా విడుదలకు ముందు శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి దర్శనానికి సింహాచ లం వస్తాను... ఆయన ఆశీస్సులతో ఆగడు సినిమా ఘన విజయం సాధిస్తుంది’ అని ఆ చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల అన్నారు. మహేష్‌బాబు హీరోగా ఆయ న తెరకెక్కించిన ఆగడు సినిమా శుక్రవారం విడుదల కానున్న సందర్భంగా శ్రీను వైట్ల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని బుధవారం దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతారాలయంలో అష్టోత్తర పూజ ను నిర్వహించారు. గోదాదేవికి కుంకుమార్చ న చేశారు.

    ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. తాను దర్శకత్వం వహించే ప్రతి సినిమా విడుదలకు ముందు సింహాచలేశుని దర్శించుకోవడం జరుగుతోం దన్నారు. ఆగడు సినిమాకి కూడా స్వామి ఆశీస్సులు ఉంటాయన్నారు. సింహగిరికి వచ్చినప్పుడల్లా కొత్త ఎనర్జీ వస్తుందన్నారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి తనకు ఇష్టదైవమని, సెంటిమెంట్, పవర్‌ఫుల్ దేవుడని అభివర్ణించారు.

    ఆగడు సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. కృతజ్ఞతను చూపించే కాన్సెప్ట్‌తో ఆగడు ఉంటుందన్నా రు. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్, ఎనర్జిటిక్‌గా ఉంటుందన్నారు. రామ్‌చరణ్‌తో తదుపరి చిత్రం రూపొందుతుందన్నారు. పలువురు భక్తులు, దేవస్థానం సిబ్బంది శ్రీను వైట్లతో ఫొటోలు దిగి ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. ఆయన వెంట ఆగడు చిత్ర నిర్మాతల్లో ఒకరైన పరుచూరి కోటి ఉన్నారు.
     

Advertisement
 
Advertisement
Advertisement