నందమూరి యువసేన వీరంగం | Nandamuri Yuvasena rash driving at National Highway | Sakshi
Sakshi News home page

నందమూరి యువసేన వీరంగం

Sep 7 2017 3:54 AM | Updated on Aug 29 2018 1:59 PM

నందమూరి యువసేన వీరంగం - Sakshi

నందమూరి యువసేన వీరంగం

నందమూరి యువసేన కార్యకర్తలు బుధవారం కృష్ణా జిల్లాలో వీరంగం సృష్టించారు.

- జాతీయ రహదారిపై అడ్డదిడ్డంగా డ్రైవింగ్‌
మద్యం తాగి.. కార్లపై కూర్చుని హల్‌చల్‌
 
కంచికచర్ల (నందిగామ): నందమూరి యువసేన కార్యకర్తలు బుధవారం కృష్ణా జిల్లాలో వీరంగం సృష్టించారు. జాతీయ రహదారిపై అడ్డదిడ్డంగా వాహనాలు నడుపుతూ హల్‌చల్‌ చేశారు. మద్యం తాగి కార్లపై కూర్చొని ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. కంచికచర్లలోని ఓ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులు నందమూరి యువ సేన పేరుతో స్థానిక పేరకలపాడు రోడ్డు పక్కన సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

అనంతరం కార్లు, బైక్‌లతో క్రాస్‌ రోడ్‌ నుంచి కంచికచర్లకు ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై మరమ్మతు పనులు చేస్తున్న కార్మికులు తమకు రక్షణగా ఏర్పాటు చేసుకున్న ప్లాస్టిక్‌ కోన్‌లను  తొక్కిస్తూ భయానక వాతావరణం సృష్టించారు. కార్మికులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా విషయం తెలుసుకున్న ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు కార్మికులతో మాట్లాడి కేసు పెట్టవద్దని నచ్చజెప్పినట్లు తెలిసింది. 
Advertisement
 
Advertisement
Advertisement