కిరణ్ దీక్ష.. ప్లాప్ షో | KT Ramarao takes on Kiran kumar Reddy | Sakshi
Sakshi News home page

కిరణ్ దీక్ష.. ప్లాప్ షో

Feb 5 2014 8:29 PM | Updated on Jul 29 2019 5:31 PM

కిరణ్ దీక్ష.. ప్లాప్ షో - Sakshi

కిరణ్ దీక్ష.. ప్లాప్ షో

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం ఢిల్లీలో చేపట్టిన దీక్ష ప్లాప్ షోగా ముగిసిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీ రామారావు అన్నారు. K

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం ఢిల్లీలో చేపట్టిన దీక్ష ప్లాప్ షోగా ముగిసిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీ రామారావు అన్నారు.  ఢిల్లీ నడివీధుల్లో తెలుగువారి పరువు తీశారని విమర్శించారు. సీఎం స్థాయి వ్యక్తి ధర్నా చేస్తే ప్రజల మద్దతే లేదని చెప్పారు.

తెలంగాణ బిల్లును తిరస్కరించామని చెబుతున్న కిరణ్ ఇదే మాటను అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్తో చెప్పిస్తారా అన్ని కేటీఆర్ ప్రశ్నించారు. అసెంబ్లీ తీర్మానమే బ్రహ్మాస్త్రమని చెప్పిన సీఎం ఎందుకు దీక్ష చేశారని విమర్శించారు. మూజువాణి ఓటుతోనే టి.బిల్లు ఆమోదం పొందుతుందని, సీఎం కిరణ్‌కు రాజకీయ సన్యాసం తప్పదని కేటీఆర్ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement