కీలక డాక్యుమెంట్లు స్వాధీనం | Kīlaka ḍākyumeṇṭlu svādhīnaṁ | Sakshi
Sakshi News home page

కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

Nov 20 2015 2:14 AM | Updated on Aug 13 2018 3:10 PM

చిత్తూరు మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసులో పోలీసు లు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మేయర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు
చింటూ పాస్‌పోర్టు, బ్యాంకు ఖాతాలు సీజ్
అనుమానితుల్ని {పశ్నిస్తున్నాం పోలీసు అధికారుల {పకటన  

 
 చిత్తూరు (అర్బన్) :  చిత్తూరు మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసులో పోలీసు లు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే చింటూ ఇంట్లో సోదాలు నిర్వహించి అతని పాస్‌పోర్టు, బ్యాంకు ఖా తాను సీజ్ చేయడంతో పాటు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీసు అధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హత్యాకాండలో పాల్గొన్న వారికి నగదు లావాదేవీలు ఎలా జరిగాయి..? ఇందు లో ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, ఘటన జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం, కార్పొరేటర్లు, అధికారుల వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక చింటూ పరారీలో ఉన్న ట్లు, అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు కూడా వివరించారు. ఈ కేసులో అనుమానితులను సైతం ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.

కోర్టుల వద్ద  నిఘా
 చింటూ న్యాయస్థానంలో లొంగిపోతాడనే ప్రచారంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని అన్ని కోర్టుల వద్ద సీఐ సహా మఫ్టీలో పోలీసు సిబ్బందితో పహారా కాస్తున్నారు.

 9 సెక్షన్ల కింద నలుగురిపై కేసు
 చిత్తూరు వన్‌టౌన్ పోలీసులు 130/2015 నెంబరు పేరిట ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రధాన నిందితుడిగా చింటూ, ఇతర నిందితులుగా మంజునాథ్, వెంకటాచలం, జయప్రకాష్‌రెడ్డి పేర్లను వరుస నింది తులుగా చూపించడంతోపాటు మరి కొందరు ఉన్నట్లు పేర్కొన్నారు. 147, 148, 302, 307, రెడ్‌విత్ 149తోపాటు 25, 27 ఆయుధాల నిరోధక చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
 
 ఆటో డ్రైవర్ కొడుకే జయప్రకాష్
 ఈ కేసులో ముళబాగిల్‌కు చెందిన మాజీ ఆర్టీసీ డ్రైవర్ వెంకటాచలం, పలమనేరుకు చెందిన మంజునాథ్ హత్య జరిగిన వెంటనే వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయిన విషయం తెలిసిందే. వీరితో పాటు అదే రోజు తాలూకా పోలీసులు మురకంబట్టు వద్ద ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపేరు జయప్రకాష్‌రెడ్డి(19). చిత్తూరు నగరంలోని గంగనపల్లెలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న మునిరాజులురెడ్డి కుమారుడే జయప్రకాష్‌రెడ్డి. హత్యాకాండ జరిగిన రోజున ఇతను మురకంబట్టు వద్ద వెళుతుండగా అక్కడే గస్తీలో ఉన్న పోలీసులు ప్రశ్నించారు. ‘కఠారి మోహన్‌ను కత్తితో రెండు పోట్లు పొడిచింది నేనే. అప్పుడు ఓ గ్లాస్ పగిలి నా చేతికి తగిలింది’ అని ఆ యువకుడు సమాధానమిచ్చాడు. వెంటనే సమాచారాన్ని తాలూకా సీఐ చంద్రశేఖర్‌కు చెప్పడంతో ఆయన వచ్చి జయప్రకాష్‌రెడ్డిను అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. జేబులో డబ్బుల్లేకపోవడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక కార్పొరేషన్ కార్యాలయ గోడ దూకి కొత్త బస్టాండు మీదుగా నడుచుకుంటూ వెళుతున్నట్లు దుండగుడు పోలీసులకు చెప్పాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement