'సహకరిస్తే మంచిది... లేకుంటే యుద్ధమే' | Jupally krishna rao appeals to Supports Creation of Telangana State | Sakshi
Sakshi News home page

'సహకరిస్తే మంచిది... లేకుంటే యుద్ధమే'

Sep 17 2013 12:32 PM | Updated on Oct 20 2018 5:03 PM

'సహకరిస్తే మంచిది... లేకుంటే యుద్ధమే' - Sakshi

'సహకరిస్తే మంచిది... లేకుంటే యుద్ధమే'

శాంతియుతంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరిస్తే మంచిదని లేకుంటే... యుద్ధానికి సిద్ధం కావల్సి వస్తుందని మాజీమంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణరావు హెచ్చరించారు.

హైదరాబాద్ : శాంతియుతంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరిస్తే మంచిదని  లేకుంటే...  యుద్ధానికి  సిద్ధం కావల్సి వస్తుందని మాజీమంత్రి,  టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణరావు హెచ్చరించారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో మంగళవారం నాయిని నర్సింహరెడ్డి  జాతీయ జెండా, టీఆర్ఎస్ జెండా ఎగరేశారు.

సమైక్యాంధ్రలో తెలంగాణను అన్నివిధాల అన్యాయం జరిగిందని నాయిని విమర్శించారు.  నిజాం పాలనలోనే తెలంగాణకు న్యాయం జరిగిందని..ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించారని టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహరెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలపైన సీమాంధ్ర పెత్తందారులు అధికారం చలాయిస్తున్నారన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement