ఇంజనీర్ కావాలన్నది ఆ కుర్రాడి లక్ష్యం. ఇంటర్ వరకు అతని జీవితం సాఫీగా సాగిపోయింది. ఇంజనీరింగ్ సీటు కూడా వచ్చింది. ఇంకేం తన కల నెరవేరబోతోందని, వృద్యాప్యంలో ఉన్న తల్లదండ్రులను బాగా చూసుకోవాలని ఆశించాడు.
ఇంజనీర్ కావాలన్నది ఆ కుర్రాడి లక్ష్యం. ఇంటర్ వరకు అతని జీవితం సాఫీగా సాగిపోయింది. ఇంజనీరింగ్ సీటు కూడా వచ్చింది. ఇంకేం తన కల నెరవేరబోతోందని, వృద్యాప్యంలో ఉన్న తల్లదండ్రులను బాగా చూసుకోవాలని ఆశించాడు. ఐతే అంతలోనే అతని జీవితంతో విధి ఆడుకుంది. ప్రాణాంతక వ్యాధి సోకడంతో మంచానికి పరిమితమయ్యాడు. వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేక ఆపన్నుల కోసం ఎదురు చూస్తున్నాడు. జీడిమెట్లకు చెందిన 19 ఏళ్ల రాహుల్ వ్యథ ఇది.
పద్మిని, కిషన్ దంపతులకు రాహుల్ ఒక్కడే కొడుకు. అతనికి బోన్ మ్యారో హై బో ప్లెసియా అనే వ్యాధి సోకింది. ఎముకల్లో రక్తం తయారు కాకపోవడం ఈ వ్యాధి లక్షణం. దీనికి బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ చేయాలి. ప్రస్తుతం అతను నిమ్స్ల్లో చికిత్స పొందుతున్నాడు. వ్యాధి నయం కావాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. ప్రత్యామ్నాయ చికిత్సలో భాగంగా ఎనిమిది వేల రూపాయల ఖరీదు చేసే 40 ఇంజెక్షన్లు ఇవ్వాలి. తమ దగ్గరున్న డబ్బంతా ఖర్చు చేసి ఇప్పటి వరకు 30 ఇంజెక్షన్లు చేయించారు. ఇకపై వైద్యం చేయించే స్థోమత తమకు లేదని రాహుల్, అతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు.
తాను సివిల్ ఇంజనీరింగ్ చదువుకోవాలనుందని, వ్యాధిని నయం చేసుకునేందుకు సాయం చేయాలని రాహుల్ వేడుకుంటున్నాడు. అతనికి సాయం చేయదలచిన వారు అకౌంట్ నెంబర్ 20173323989, ఎస్బీఐ, జీడిమెట్ల ఇండస్ర్టియల్ ఏరియా బ్రాంచ్కు పంపవచ్చు. బ్యాంక్ IFSC code SBINOOO5321. రాహుల్తో సంప్రదించాలనుకున్నవారు 9550882748 నెంబర్కు ఫోన్ చేయవచ్చు.


