పొరపాటుగా మాట్లాడిన చంద్రబాబు | chandrababu naidu mouth slip | Sakshi
Sakshi News home page

పొరపాటుగా మాట్లాడిన చంద్రబాబు

Dec 29 2013 7:48 PM | Updated on Aug 11 2018 4:02 PM

తిరుపతి ప్రజాగర్జన సభలో ప్రసంగిస్తున్న చంద్రబాబు - Sakshi

తిరుపతి ప్రజాగర్జన సభలో ప్రసంగిస్తున్న చంద్రబాబు

భారతదేశాన్ని అవినీతి భారతదేశంగా తయారు చేసేవరకు పని చేస్తానని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పొరపాటుగా మాట్లాడారు.

తిరుపతి: భారతదేశాన్ని అవినీతి భారతదేశంగా తయారు చేసేవరకు పని చేస్తానని  టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పొరపాటుగా మాట్లాడారు. శపథం కూడా చేశారు. తిరుపతిలోని నెహ్రూ మునిసిపల్ గ్రౌడ్లో ఈ రోజు జరిగిన ప్రజా గర్జన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

సభలో ఆయన చాలా ఆవేశంగా మాట్లాడుతూ ''మీరు నన్నుగాని ముందుకు నడిపిస్తే, బుల్లెట్టు మాదిరిగా దూసుకెళతా, అవినీతిపై రామబాణం సంధిస్తా భారత దేశాన్ని అవినీతి భారతదేశంగా తయారు చేసేవరకు ఎన్టీ రామారావు గారి స్పూర్తితో వెంకటేశ్వర స్వామి ఆశిస్సులతో పని  చేస్తాను తమ్ముళ్లు. అది నా ప్రతిజ్ఞ'' అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement