'బీజేపీ ఓడిపోతే టీడీపీ నేతలు పండగ చేసుకున్నారు' | bjp leader sam kishore blames tdp | Sakshi
Sakshi News home page

'బీజేపీ ఓడిపోతే టీడీపీ నేతలు పండగ చేసుకున్నారు'

Mar 1 2015 1:42 PM | Updated on Mar 29 2019 9:31 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై టీడీపీ నేతల తీరుపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్ మండిపడ్డారు.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై టీడీపీ నేతల తీరుపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్ మండిపడ్డారు. ల్యాండ్ పూలింగ్ పూర్తి కాకుండానే కేంద్రం రాజధానికి నిధులు ఎలా ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ, సచివాలయం సహా ఏ బిల్డింగ్ ఎక్కడ కడతారో ఇంతవరకూ చెప్పలేదని శ్యాంకిషోర్ పేర్కొన్నారు. ఢిల్లీలో బీజేపీ ఓడిపోతే టీడీపీ నేతలు ఫేస్ బుక్ లో పండగ చేసుకున్నారని విమర్శించారు.

 

మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణానికి భూమి పూజ చేస్తామంటే ఏపీ ప్రభుత్వం సహకరించలేదన్నారు. టీడీపీ తమకు మిత్రపక్షమేననని ఇప్పటికీ అనుకుంటాన్నామని.. వారు మాత్రం ఏమనుకుంటున్నారో తెలియదన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement