ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌లను బహిష్కరిస్తున్నాం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా అణగదొక్కేందుకు పచ్చ మీడియా దిగజారుడు రాజకీయాలు చేస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
- వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి
- వైఎస్ జగన్ లేఖను తారుమారు చేసి క్రిమినల్ మైండ్ కథనాలు
- ఆంధ్రజ్యోతికి లీగల్ నోటీసులిస్తాం.. క్రిమినల్ డిఫమేషన్ కూడా వేస్తాం
సాక్షి, హైదరాబాద్: రాజకీయంగా ఎదుర్కోలేక వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని కించపరిచేందుకు పాత్రికేయ విలువలను కూడా లెక్కచేయకుండా దిగజారుడు వార్తలు రాస్తున్న ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ చానల్‌ను ఇకముందు తమపార్టీ కార్యక్రమాలకు హాజరు కాకుండా బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు.
ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పై విషం కక్కుతూ తప్పుడు కథనాలను ప్రచు రిస్తున్నారన్నారు. ఊçహాజనితంగా ఇష్టానుసా రంగా వండివార్చటం, వాటిని ప్రజలతో నమ్మించే ప్రయత్నం చేయటం ఒక్క ఆంధ్ర జ్యోతికే చెల్లిందని మండిపడ్డారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లా డారు. వాడరాని పదజాలంతో వైఎస్ జగన్ తన ప్రయోజనాల కోసమే ప్రధానిని కలసిన ట్లుగా ‘అమ్మ జగనా’ అంటూ తప్పుడు కథనా న్ని ప్రచురించిందని చెప్పారు. వైఎస్సార్ సీపీని సర్వనాశనం చేయాలనే దుగ్ధతో ఆంధ్రజ్యోతి సిగ్గూ,లజ్జా లేకుండా దిగజారి చేసిన నేరానికి క్షమార్హత కూడా లేదన్నారు.
విలువలను దిగజార్చిన ఆంధ్రజ్యోతి
జగన్ ఇచ్చిన వినతిని తారుమారుచేసి తన కేసులకు సంబంధించి ప్రధానిని కలసిన ట్లుగా రాసి పత్రికా విలువలను దిగజార్చి, పత్రికలనే అసహ్యించుకునే స్థాయిలో వ్యవహరించిందని దుయ్యబట్టారు. ఈడీలో పనిచేస్తున్న అధికారులు ఉమాశంకర్‌గౌడ్, గాంధీ తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. జగన్ ఫిబ్రవరి 17వ తేదీన ప్రధానికి లేఖ రాశారని చెప్పారు. ఆ లేఖను ప్రధాని మోదీ హోం మంత్రిత్వశాఖకు పంపించారని, వైఎస్ జగన్ లేఖ కాపీలను అధికారులకు పంపిస్తున్నామని ఏప్రిల్ 13న సమాధానం వచ్చిందని తెలిపారు. కానీ ఆంధ్రజ్యోతి ఫిబ్రవరి 17న రాసిన లేఖను, మే 10న ప్రధానికి జగన్ ఇచ్చినట్టుగా చిత్రీకరించి క్రిమినల్ మైండ్‌తో తప్పుడు వార్త రాసిందని చెప్పారు. మే 10న ప్రధానికి జగన్ సమర్పించిన వినతిపత్రాన్ని అన్ని పత్రికలకు ఇచ్చామని, అందులో అగ్రిగోల్డ్, ప్రత్యేకహోదా సహా అన్ని అంశాలను ప్రస్తావించారని చెప్పారు.


