ఏపీకి ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు: చంద్రబాబు
చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన రెండోరోజు కొనసాగుతోంది
కుప్పం : చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. రామకుప్పంలో ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రానికి 14వ ఆర్థిక సంఘం 42 శాతం నిధులను కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రానికి అయిదేళ్లలో రూ.22,113 కోట్ల రెవెన్యూ లోటు ఉందన్నారు. 2013 జనాభా లెక్కల ప్రకారం కేంద్రం నిధులు కేటాయించినట్లు చంద్రబాబు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం మరిన్ని నిధులు ఇవ్వాలని ఆయన అన్నారు. పన్నుల వాటా 42 శాతం పెంచటం అభినందనీయమన్నారు. ఆర్థిక సంఘం సిఫార్సులోఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయించింది ఏమీ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


