ఆమంచి ఆటవిక రాజ్యం..

ఆమంచి ఆటవిక రాజ్యం.. - Sakshi


జర్నలిస్టుపై టీడీపీ గూండాయిజం

♦ అక్రమాల్ని ప్రశ్నించినందుకు కర్రలతో దాడిచేసి చావబాదిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ సోదరుడు, అనుచరులు

♦ చీరాల పోలీసు స్టేషన్‌ ఎదుటే దౌర్జన్యకాండ



సాక్షి ప్రతినిధి, ఒంగోలు, సాక్షి, చీరాల రూరల్‌ : నిన్న అనంతపురం.. నేడు చీరాల.. టీడీపీ నేతల దౌర్జన్యానికి హద్దే లేదు... అధి కార మదంతో విర్రవీగిపోతున్నారు. అక్రమాలను, అన్యాయాన్ని ప్రశ్నిస్తే సహించలేక పోతున్నారు. దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా చీరాలలో తమ అక్రమాలను, అవినీతిని బైటపెట్టినందుకు  చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ కుటుంబ సభ్యులు నియోజకవర్గంలోని వేటపాలేనికి చెందిన నాయుడు నాగార్జునరెడ్డి అనే  ఫ్రీలాన్స్‌ జర్నలిస్టుపై దాడికి దిగి, తీవ్రంగా గాయపరిచారు. పట్టపగలు అంతా చూస్తుండగా పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగానే దాడి జర గడం సంచలనం సృష్టించింది. కాగా తమను కులం పేరుతో దూషించాడంటూ ఓ మాజీ కౌన్సిలర్‌ చేత ఫిర్యాదు చేయించి దాడికి గురైన జర్నలిస్టుపైనే పోలీసులు కేసుపెట్టారు.  



అవినీతిపై రాశాడనే కోపంతో..

ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ నాగార్జునరెడ్డి ఓ పత్రికలో ఆమంచి కుటుంబ అవినీతిపై ఇటీవల ‘చీరా ల చీడ పురుగు ఆమంచి’ పేరుతో ఓ కథనం రాశాడు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ సోదరుడు శ్రీనివాస రావు (స్వాములు), కుటుంబసభ్యులు, అను చరులతో కలసి ఆదివారం మధ్యాహ్నం చీరా లలో నాగార్జునరెడ్డి కోసం గాలించారు. మాజీ మంత్రి పాలేటి రామారావు ఇంట్లో ఉంటాడని భావించి అక్కడా వెతికారు. అడ్డం వచ్చిన వారిపై దౌర్జన్యం చేశారు. నీ సంగతీ తేలుస్తా మంటూ  పాలేటిని హెచ్చరించి గడియారం స్తంభం సెంటర్‌లో అతడి కోసం కాపుకాశారు.


( చదవండి : ఎమ్మెల్యే ‘ఆమంచి’ మోసం చేశారు)




కారుతో ఢీకొట్టి.. చుట్టుముట్టి..

నాగార్జునరెడ్డి తన కొడుకుతో కలసి టూ వీలర్‌పై  మధ్యాహ్నం వచ్చాడు. స్వాములు, ఆయన అనుచరులు కారుతో టూవీలర్‌ను ఢీకొట్టగా నాగార్జున రెడ్డి బైక్‌తో సహా పడిపో యాడు. స్వాములు, అనుచరులు  కర్రలతో అతడి తలపై బలంగా కొట్టారు. కాళ్లు చేతు లతో తన్నారు. దీంతో నాగార్జునరెడ్డి  తలకు, కాలికి తీవ్రగాయాలై కుప్పకూలిపోయాడు. పోలీసుస్టేషన్‌ ఎదురుగానే దౌర్జన్యం సాగు తున్నా పోలీసులెవరూ రాలేదు. మధ్యాహ్నం ఒంటిగంటకు  సీఐ వెంకటేశ్వరరావు వచ్చి నాగార్జునరెడ్డిని చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



చీరాలలో ఉద్రిక్తత: ఈ దాడి ఘటనతో చీరాలలో ఉద్రిక్తత నెలకొంది. ఆమంచి అను చరులు తన ఇంటిపై దాడి చేశారంటూ మాజీ మంత్రి పాలేటి రామారావు తన అనుచరు లతో  ఏరియా ఆసుపత్రి రోడ్డులో బైఠాయిం చారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రాత్రి 7 వరకు అక్కడే ఉన్నారు. ఆమంచి అనుచరులు సైతం అక్కడ గుమిగూడటంతో ఉద్రిక్తత ఏర్పడింది. కాగా నాగార్జునరెడ్డిని బాపట్ల పార్లమెంటు నియో జకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌ వరికూటి అమృతపాణి, చీరాల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పోతుల సునీత వర్గీయులు, పాలేటి అనుచరులు పరామర్శించారు.



ఆమంచి సోదరునిపై కేసు నమోదు

నాగార్జున రెడ్డి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కృçష్ణమోహన్‌ సోదరుడు స్వాములుపై కేసు నమోదు చేసినట్లు చీరాల ఒన్‌టౌన్‌ సీఐ కె. వెంకటేశ్వరరావు తెలిపారు. కాగా నాయుడు నాగార్జున రెడ్డిపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసినట్లు సీఐ తెలిపారు. నాగా ర్జున రెడ్డి ‘బాస’ అనే మాస పత్రికలో తమను రౌడీలుగా చిత్రీకరించి కథనాలు రాయడంపై అతడిని ప్రశ్నించగా తనను కులంపేరుతో దూషించాడని మాజీ కౌన్సిలర్‌ శీలం శ్యాం ఫిర్యాదుతో కేసు నమోదు చేశా మన్నారు. ఇదిలా ఉండగా.. టీడీపీ నేత పాలేటి రామారావు ఫిర్యాదు మేరకు ఆమంచి సోదరుడు, అతని అనుచరు లపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. కాగా నాగార్జున రెడ్డిపై దాడిచేసిన ఎమ్మెల్యే ఆమంచి సోదరుడు స్వాములు, అతని అను చరులను 24 గంటల్లో అరెస్టు చేయాలని వైఎస్సార్‌ సీపీ బాపట్ల పార్లమెంటరీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ అమృత పాణి డిమాండ్‌ చేశారు. ఈ దాడి ఆమంచి  గూండాయిజానికి నిదర్శనమని టీడీపీ నాయకురాలు పోతుల సునీత అన్నారు. 



Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top