Top Stories
ప్రధాన వార్తలు
మా అక్కలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలబడతా: వైఎస్ అవినాష్
సాక్షి, వైఎస్సార్: టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలో సునీత, షర్మిల పావులుగా మారారు. వీరితో పోరాడే శక్తిని ప్రజలే నాకు ఇస్తారని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ప్రతీరోజు నన్ను తిట్టడమే పనిగా పెట్టుకుని పచ్చ మీడియాకు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, వైఎస్ అవినాష్ రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. 2021 తర్వాత చంద్రబాబు కుట్రలో సునీత, షర్మిల పావులుగా మారారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నోటికి ఎంత మాట వస్తే అంత వరకు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్లు అలా మాట్లాడుతుంటే కోపం కంటే ఎక్కువగా బాధేస్తోంది. వాళ్లే నన్ను టార్గెట్ చేస్తున్నారు.రెండున్నరేళ్లు ఎవరూ మాట్లాడలేదు. వాచ్మెన్ రంగన్నకు నార్కో అనాలసిస్ టెస్ట్ చేసినా ఏమీ మాట్లాడలేదు. రెండున్నరేళ్ల తర్వాత రంగన్న మాట్లాడుతున్నాడు. ఓవైపు తానే చంపానని చెబుతున్న దస్తగిరి గురించి వీరద్దరూ ఏమీ అనడం లేదు. అతను ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి బయట తిరుగుతున్నాడు. అన్నీ తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు మాటలు చెబుతున్నారు.వైఎస్ భాస్కర్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉండి ఏ పని కావాలన్నా చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టించారు. నా తప్పు లేకపోయినా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా గట్టిగా నిలబడతాం. మీ అందరి మద్దతుతో గెలిచి తీరుతాను. ఇప్పుడు తిట్టిన వాళ్లే మళ్లీ క్షమాపణలు చెప్పాలి.. అది నేను వినాలి. వివేకం చిన్నాన్నను చంపిన వాస్తవం వెలుగులోకి వస్తుంది. ఈ కుట్రలు ఎవరో చేశారో తప్పకుండా బయటకు వస్తుంది.దివంగత వైఎస్సార్ తాను బ్రతికినంత కాలం.. టీడీపీ, ఈనాడుతో పోరాడారు. అటువంటి వారితో ఇప్పుడు వీరిద్దరూ చేతులు కలిపారు. మీరు వాళ్ల వారసులా.. లేక వైఎస్సార్ వారసులా?. నన్ను కనుమరుగు చేయాలంటే దేవుడు ఒప్పుకోడు. మా అక్కలతో పోరాడే శక్తిని ప్రజలే ఇస్తారు. వైఎస్సార్సీపీ ఓట్లు చీల్చి టీడీపీకి లబ్ధి చేకూర్చాలనేది షర్మిలకు కాంగ్రెస్ పెట్టిన టాస్క్. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎవరిది నాటకమో.. ఎవరు నిజమో ప్రజలే నిర్ణయిస్తారు అని కామెంట్స్ చేశారు.
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (గురువారం) మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల మే 9 వ తేదీ షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ బుధవారం విడుదల చేశారు.సీఎం జగన్.. గురువారం ఉదయం 10 గంటలకు కర్నూలు పార్లమెంట్ పరిధిలోని కర్నూలు సిటీ వై ఎస్సార్ సర్కిల్లోని ఎస్వీ కాంప్లెక్స్ రోడ్డులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు అనంతపురం పార్లమెంట్ పరిధిలోని కళ్యాణ దుర్గం నియోజకవర్గం కొల్లపురమ్మ టెంపుల్ రోడ్డులో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పార్లమెంట్ పరిధిలో రాజంపేట నియోజకవర్గంలో కోడూరు రోడ్డులో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు.
తెలంగాణ: మళ్లీ భారీ వర్షం కురిసే ఛాన్స్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో బుధవారం(మే8) కూడా భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురవచ్చని పేర్కొంది.పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్. నాగర్ కర్నూల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే చాన్స్ ఉందని తెలిపింది. గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. కాగా రాజధాని హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షం ప్రభావంతో జిల్లాల్లో పంట నష్టపోయి రైతులు ఇబ్బంది పడగా హైదరాబాద్ నగరంలో తీ వ్ర ట్రాఫిక్‌జామ్‌లతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొ న్నారు.
ఓటరు జాబితాలో పేరు తొలగించినా ఓటేయవచ్చు !
అర్హత కలిగిన ప్రతి పౌరుడూ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమైన ఓటింగ్‌లో పాల్గొనేందుకు వీలుగా ఎన్నికల సంఘం అనేక సౌకర్యాలు కల్పించింది. ఓటరు జాబితా సవరణలో ఏ కారణం చేతనైనా మీ పేరు తొలగించినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఓటు వేసేందుకు అవకాశం ఉంది. ఓటరు జాబితా పరిశీలనకు అధికారులు వచ్చినప్పుడు మీరు లేకపోతే మీ పేర్లను తొలగించేందుకు అవకాశాలు ఎక్కువ. అయితే ఇలా అబ్సెంట్ అయిన వారి కోసం ప్రత్యేకంగా ఒక జాబితా రూపొందుతుంది. అంతేకాకుండా... ఒకవేళ మీ అడ్రస్ మారి ఉంటే, ఇంకో జాబితా, మరణించిన వారి కోసం కూడా ప్రత్యేకంగా జాబితా సిద్ధం చేస్తారు.ఈ జాబితాలన్నీ ఓటరు జాబితాతోపాటు ప్రిసైడింగ్ అధికారికి అందుబాటులో ఉంటాయి. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే వ్యక్తి పేరు ఓటరు జాబితాలో లేకపోతే, ఆ వ్యక్తి పేరును ఏఎస్డీ ఓటర్ల జాబితాలో వెతకాలి. ఏఎస్డీ ఓటర్ల జాబితాలో ఆ వ్యక్తి పేరుంటే ఓటరు గుర్తింపు కార్డు/ లేదా ఇతర గుర్తింపు కార్డుల ఆధారంగా ఆ వ్యక్తి గుర్తింపును ప్రిసైడింగ్ అధికారి ముందుగా నిర్ధారించుకుంటారు.అనంతరం ఆ వ్యక్తి పేరును ఫారం 17ఏలో నమోదు చేసి సంతకంతో పాటు వేలిముద్ర తీసుకుంటారు. ఈ క్రమంలో తొలి పోలింగ్ అధికారి సదరు ఏఎస్డీ ఓటరు పేరును పోలింగ్ ఏజెంట్లకు గట్టిగా వినిపిస్తారు. సదరు ఓటరు నుంచి నిర్దిష్ట ఫార్మాట్లో డిక్లరేషన్ తీసుకోవడంతో పాటు ఫొటో, వీడియో తీసుకుంటారు. అనంతరం అతడికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. దివ్యాంగులకు వాహన సదుపాయం...దివ్యాంగులు, వృద్ధులు ఓటేసేందుకు వాహన సదుపాయం కోసం స్థానిక బూత్ లెవెల్ అధికారి (బీఎల్ఓ)ని సంప్రదించాలి. ఆటో ద్వారా ఓటర్లను ఇంటి నుంచి పోలింగ్ తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తారు.పోలింగ్ కేంద్రం తెలుసుకోవడం ఇలా... ఓటర్లందరికీ ఎన్నికల సంఘం ఫొటో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు జారీ చేస్తుంది. ఈ ఓటర్ స్లిప్పుల వెనకభాగంలో పోలింగ్ కేంద్రం రూటు మ్యాప్‌ను పొందుపరిచింది. ఈ రూట్ మ్యాప్‌తో సులువుగా పోలింగ్ కేంద్రానికి చేరుకోవచ్చు.
May 8th: ఏపీ ఎన్నికల సమాచారం
AP Political And Elections News Updates In Telugu 2:30 PM, May 8th, 2024కుప్పంలో బాబు ఓడిపోతున్నాడు: లక్ష్మి పార్వతి సంఘ విద్రోహులు చంద్రబాబు అండ్ కొఎన్టీఆర్ వెన్నుపోటులో పురందేశ్వరి ప్రధాన పాత్ర పోషించిందినేతి బీరకాయలో నెయ్యి లాంటిది పురందేశ్వరి మంచితనంపురందేశ్వరి కూడా చంద్రబాబు లాంటి మనిషిFIRలో వైఎస్సార్ పేరును చేర్చిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం ఏమిటి..?వీరందరినీ చంద్రబాబు ఆడిస్తున్నారురాజకీయ నీచుడు చంద్రబాబుబాబు కంటే సీఎం జగన్ అధిక పెట్టుబడులు తీసుకొచ్చారుఏపీ అభివృద్ధిలో విశాఖ కీలకంఏం మాట్లాడాలో అర్ధంకాక బాబు ఇచ్చిన స్క్రిప్ట్ మోడీ చదివాడుసీఎం జగన్‌ను గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారుఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలి అంటే సీఎం జగన్ అధికారంలోకి రావాలినేను రాష్ట్రం మొత్తం తిరిగానుగీతం మూర్తి ఎన్టీఆర్ వెన్నుపోటులో కీలక పాత్ర పోషించిన దుర్మార్గుడుగీతం భరత్‌ను ఓడించాలిగీతం అంటేనే భూ కబ్జాలుఏయూను నాశనం చెయ్యాలనే ఉద్దేశంతోనే గీతంను అభివృద్ధి చేశారు.1:50 PM, May 8th, 2024మోదీకి కుటుంబం లేదన్న వ్యక్తి చంద్రబాబు: జోగి రమేష్జోగి రమేష్ కామెంట్స్ఎన్డీఏ కూటమి కొత్త కూటమి ఏమి కాదు .2014లో ఇదే కూటమి జతకట్టింది.కలిసి పోటీ చేయడం ఎందుకు.. విడిపోవడం ఎందుకు..పవన్ వలన మేము గెలవలేదని చంద్రబాబు అన్నాడు.మోడీకి కుటుంబం లేదు అన్న వ్యక్తి బాబు.మేనిఫెస్టోలో ఒక్క పథకం కూడా చంద్రబాబు అమలు చేయలేదు.అందుకే గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు..కుట్రలతో ఇప్పుడు కూటమి ఏర్పాటు చేశారు.పొత్తులు ముక్కలవడం ఖాయం .అన్నం పెట్టే జగన్న కు ప్రజలు మద్దతుగా ఉన్నారురెండు ఓట్లు ఫ్యాన్ కే వేస్తామని ప్రజలు అంటున్నారు.మంచి చేశాడు కాబట్టే ప్రజల గుండెల్లో జగన్ ఉన్నారు 1:30 PM, May 8th, 2024టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి: తానేటి వనితటీడీపీ నేతల రౌడీయిజంపై చర్యలు తీసుకోవాలిటీడీపీ నేతల దాడులు నశించాలిప్రజాస్వామ్యం పరిరక్షించాలినేనున్న ఇంటిపై దాడి చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది?ఎవరు ఎంత రెచ్చగొట్టినా కార్యకర్తలు రెచ్చిపోవద్దుప్రజల్లో మనం ఉన్నాము సర్వేలు బాగున్నాయిప్రజలంతా కూడా జగనన్న పరిపాలనకు ముక్తులై.. మనకే ఓటేయాలని ఎదురుచూస్తున్నారుటీడీపీ కార్యకర్తలు రౌడీ రాజకీయాలు, గూండా రాజకీయాలు చేస్తున్నారుభౌతికంగా దాడులు చేసి.. మనం చేసినట్టు లైవ్‌లు పెట్టారు.గోపాలపురం నియోజకవర్గంలో ఒక రెడ్ బుక్ ఉందని అంటున్నారు.ఒక్కసారి కూడా ఎన్నిక కాని వారు గూండా రాజకీయాలు చేస్తున్నారురాత్రి జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసామునేనేమీ వారికి ఛాలెంజ్‌లు కూడా చేయలేదుమా నాయకుడు చేసిన మంచే మాట్లాడాను.జగనన్న నాకు హోం మంత్రి పదవి ఇచ్చారుజగనన్న నాకు రాజ్యాధికారం ఇచ్చారుదళితలమైన నాపై దాడులు చేస్తూ కించపరిచేలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారుఈరోజు నాపై దాడి చేశారు అధికారం లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?నోటికి వచ్చిన వాగ్దానాలు ఇస్తున్నారు.చట్టం ఎవరికీ చుట్టం కాదు.ప్రతీ కార్యకర్త ఎలక్షన్‌పై దృష్టి పెట్టాలి. 12:30 PM, May 8th, 2024చంద్రబాబుపై ఎమ్మెల్సీ రుహుల్లా ఫైర్మైనార్టీల 4% రిజర్వేషన్ గురించి మోదీతో మాట్లాడే దమ్ము చంద్రబాబుకు ఉందా?.విజయవాడ పర్యటనలో మోదీతో చంద్రబాబు మైనార్టీల గురించి మాట్లాడించాలి.హజ్ యాత్రకు వెళ్లే మైనార్టీలను సీఎం జగన్ ఆర్థికంగా అందుకున్నారు.గుంటూరులో దళితులపై దేశద్రోహి కేసులు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు.రాష్ట్రంలో ఉన్న మైనారిటీలు అందరూ ఈ విషయంపై ఆలోచించాలి.మైనారిటీలను ఓట్ల కోసం వాడుకుంది చంద్రబాబు నాయుడురాష్ట్రంలో మైనార్టీలు అంటే చంద్రబాబు, బీజేపీకి చిన్న చూపు.సీఎం జగన్ మైనార్టీలకు అభివృద్ది చేశారుమైనార్టీల ద్రోహి చంద్రబాబు నాయుడుమైనార్టీలకు ద్రోహం చేయడానికి చంద్రబాబు మోదీతో జత కట్టారు 12:00 PM, May 8th, 2024పవన్‌పై ముద్రగడ సంచలన కామెంట్స్పవన్ కళ్యాణ్ నిఖార్సైన కాపో కాదో లోకానికి తెలియాలినేను నిఖార్సైన కాపుని.. నా కుటుంబం కూడా స్వచ్చమైన కాపు కుటుంబంపవన్ కుటుంబం స్వచ్చమైన కాపు ఐతే చరిత్ర బయట పెట్టమనండి.మాటి మాటికీ కాపు ముసుగులో ఉండి కాపులకు సాయం చేయ్యరా అని అడుగుతున్నావ్.మా వంగా గీతా కాపు కాదా?కొందరు దుష్టుల వల్ల నా కూతురు దూరమైపోయిందిమళ్ళీ వచ్చే జన్మలోనే కలుసుకుందాం 11:30 AM, May 8th, 2024అభివృద్ధి అంటే జగనే: దేవినేని అవినాష్ప్రతీ గడపలో జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారుఅభివృద్ధి లేదు అంటున్న టీడీపీ నేతలు మూడో డివిజన్లో పర్యటించాలిఐదేళల్లో జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయమని కోరుతున్నాంఈ డివిజన్ మొత్తం సీసీ రోడ్లు వేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందిటీడీపీ ఎమ్మెల్యేకు ఈ ప్రాంతం, నియోజకవర్గ అభివృద్ధిపై చిత్త శుద్ధి లేదుఅభివృద్ధి సంక్షేమం చూసి మీ బిడ్డగా ఒక్క అవకాశం ఇవ్వాలిఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఆశీర్వదించండి 11:00 AM, May 8th, 2024ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ కామెంట్స్సీఎం జగన్ ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు.జగనన్న పథకాలపై ఈసీకి ఫిర్యాదుకు చేసి వాటిని ఆపిన దుర్మార్గుడు చంద్రబాబు.చంద్రబాబుకు పేద ప్రజల పట్ల అంత అసూయ ఎందుకు?.ప్రజలను ఇబ్బంది పెట్టడం చంద్రబాబుకు అలవాటే.గతంలో చంద్రబాబు పసుపు కుంకులకు ఎలక్షన్ సమయంలో పర్మిషన్ ఇచ్చారు.ఎలక్షన్ కోడ్ రాకముందు అందించిన సంక్షేమ పథకాలను ఎందుకు ఆపారు.ఎన్నికల కమిషనర్ ఈ విషయాన్ని పున: పరిశీలన చేయాలి.విద్యాదీవెన ఆపిన కారకులు చంద్రబాబు, జనసేన, బీజేపీదుర్మార్గపు ఆలోచనలకు కేరాఫ్ అడ్రస్ వీరి ముగ్గురే.పేద ప్రజలపై కక్ష సాధింపు చర్యలు వద్దు.సీఎం జగన్ పేద ప్రజలకు కవచంలా అండగా ఉంటారు. 10:30 AM, May 8th, 2024బాబుకు ఓటమి భయం పట్టుకుంది: మంత్రి పెద్దిరెడ్డిమంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్కుప్పంలో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందిఇందుకే పిచ్చి పట్టినట్లు బాబు మాట్లాడుతున్నారుసీఎం జగన్‌తో పాటు నాపై చంద్రబాబు ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారువేల కోట్లు నేను సంపాదించానని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటుచంద్రబాబు ఆరోపణలకు రుజువులు ఉన్నాయా?.ఈసారి కుప్పంలో చంద్రబాబును ప్రజలు రాజకీయంగా భూస్థాపితం చేయనున్నారు. 10:00 AM, May 8th, 2024చంద్రబాబుపై మాట మార్చిన మోదీ..నాడు చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎం మార్చుకున్నాడని మోదీ వ్యాఖ్యలునేడు చంద్రబాబుపై మోదీ ప్రశంసలు. వెన్నుపోటు, పార్టీలు మార్చడం, తిట్టినవారి చంకనెక్కడంలో బాబు నిపుణుడు.మోదీ కూడా చంద్రబాబులాగే మాట్లాడుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో మన ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించండి. చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు మోడీ గారు ఏమన్నారో గుర్తుందా? పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడని, వెన్నుపోట్లు, పార్టీలు మార్చడం, తిట్టినవారి చంకనెక్కడంలో చంద్రబాబు నిపుణుడని, అత్యంత అవినీతిపరుడని చెప్పారు. కానీ ఇప్పుడు అదే మోడీ గారు ఎన్డీయే గూటికి చేరిన చంద్రబాబుని ఇంతకంటే… pic.twitter.com/rSUlLqQzQB— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2024 08:45 AM, May 8th, 2024మోదీ, బాబుకు వడ్డే శోభనాద్ధీశ్వర రావు సవాల్ప్రధాని మోదీ, చంద్రబాబుకి మాజీ మంత్రి వడ్డే శోభనాద్ధీశ్వర రావు సవాల్ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ని రద్దు చేయించగలరా?ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సిఫార్సు చేసింది కేంద్ర ప్రభుత్వమే కదా?.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కి అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ మద్దతు పలకలేదా?టీడీపీ లోపల మద్దతు పలుకుతూ, పైకి మాటల గాంభీర్యం ప్రకటించడం కరెక్టేనా?ఈటీవీ, అన్నదాతల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనుకూల కథనాలు ప్రసారం చేయడం వాస్తవం కాదా?ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు మోదీని ప్రశ్నించాలి, నిలదీయాలి.మోదీ విజయవాడ పర్యటనలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయించే హామీని ఇవ్వగలవా చంద్రబాబు? 07:35 AM, May 8th, 2024టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు: తానేటి వనితహోంమంత్రి తానేటి వనిత కామెంట్స్.. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. మహిళ అని చూడకుండా దాడికి ప్రయత్నించారు. హోంమంత్రి దాడి చేయడమంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. మాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు. 07:15 AM, May 8th, 2024తానేటి వనితపై టీడీపీ నేతల దాడి యత్నం..తూర్పుగోదావరిలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌నల్లజర్లలో టీడీపీ కార్యకర్తల బీభత్సంహోంమంత్రి తానేటి వనితపై దాడికి యత్నం. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది. హోంమంత్రిని సురక్షితంగా గదిలో ఉంచిన సెక్యూరిటీ. వైఎస్సార్సీపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణుల మూకుమ్మడి దాడి.టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్సీపీ నేతలకు తీవ్ర గాయాలు. టీడీపీ శ్రేణుల దాడిలో వాహనాలు, ఫర్నీచర్ ధ్వంసంసీసీ కెమెరాలో రికార్డయిన టీడీపీ నేతల దాడి దృశ్యాలు. నల్లజర్లలో భారీగా పోలీసుల మోహరింపు. 07:00 AM, May 8th, 2024గాజువాక రోడ్‌షోలో సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..మరో ఆరు రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహా సంగ్రామం జగన్‌కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు, ఇదే చరిత్ర చెప్పే సత్యంప్రతి రంగంలోనూ అనూహ్యమైన మార్పులు తీసుకురాగలిగాం, బటన్ నొక్కుతూ నేరుగా లబ్ధి అందజేశాంగతంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరిగింది13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చడమే కాక ప్రజలకు మరింత దగ్గరయిన ప్రభుత్వం మీ బిడ్డదివిశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయడమే కాక జూన్ 4 న మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, తర్వాత పాలన కొనసాగించేది విశాఖ నుంచే..ఈ 59 నెలల్లో మీ బిడ్డ చేసిన అభివృద్ది గమనించండి అని చెబుతున్నా, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్పాడు మీ బిడ్డలంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, అన్ని పథకాలు, ఇది కాదా అభివృద్దిఉద్దానం సమస్యను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ప్రతి ఏడాది మొదటి స్ధానమే, మీ బిడ్డ పాలనలో ఏకంగా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయిసస్టెయినబుల్ డెవలప్మెంట్ అంటే ఇది కాదా అని అడుగుతున్నారాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కూటమిగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారునాడు నేడు ద్వారా స్కూల్స్, ఆసుపత్రులు రూపురేఖలు మారుతున్నాయి,ప్రధాని విమర్శలు చూస్తుంటే నాకు ఒకటనిపించింది, మోదీ గారు ఇదే చంద్రబాబు గురించి ఎన్నికల ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి, వెన్నుపోట్లు, అత్యంత అవినీతిపరుడన్న నోటితోనే ఇవాళవారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటమారుస్తున్నారు, రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా*బాబు, దత్తపుత్రుడు, మోదీ గారు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏంటి, ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా, స్టీల్ ప్లాంట్ ప్రేవేట్ పరం చేయమని జట్టు కట్టారా అందరూ ఆలోచించండిమీ జగన్ ఆమోదం లేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది, జగన్ ఒప్పుకోలేదు కాబట్టే అది జరగలేదు, ఈ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్‌కు ఓటేసి దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపండి 06:50 AM, May 8th, 2024నేడు ఏపీలో మోదీ ప్రచారంనేడు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంమధ్యాహ్నం ప్రత్యేక విమానం తిరుమలకు మోదీరాజంపేట లోక్‌సభ పరిధిలో కలికిరిలో ఎన్నికల ప్రచారంసాయంత్రం విజయవాడలో రోడ్ షో 06:40 AM, May 8th, 2024అప్పుడూ ఇప్పుడూ 'అంతే'పేదల పొట్ట కొట్టడమే లక్ష్యంగా వికృతరూపం దాల్చిన బాబు పెత్తందారీ పోకడవారికి లబ్ధి జరిగేది ఏదైనా అడ్డుకోవడమే ఆయన లక్ష్యంఅప్పట్లో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంగ్లిష్ మీడియం చదువులు అడ్డుకునేందుకు ఎల్లోగ్యాంగ్ చేయని ప్రయత్నంలేదు.. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకుని ఎప్పటినుంచో కొనసాగుతున్న డీబీటీలకూ అడ్డంకులుతొలి నుంచీ పేదలకు మేలు జరగకుండా కోర్టులకు వెళ్లి మరీ అడ్డుకున్న బాబు బ్యాచ్‌తాజాగా కోడ్ పేరుతో విద్యా దీవెన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మహిళలకు చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలను అడ్డుకున్న పచ్చముఠా.. ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలపైనా కుట్రలుతెలంగాణలో ఇన్పుట్ సబ్సిడీకి ఓకే చెప్పిన ఈసీ.. ఏపీలో మాత్రం నో 06:30 AM, May 8th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనాప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదుకొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందిపోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగింపుకొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందిఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఇవాళ, రేపు ఓటేసుకోవచ్చుసెక్యూర్టీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల 9వ తేదీన కూడా అవకాశంఅలాగే సొంత సెగ్మెంట్లల్లోవి ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చువచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టంఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చాంకొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుకొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారుఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చాంకొందరు వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారుదీనిపై విచారణ చేపడుతున్నాంతప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాంపోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబులును సస్పెండ్ చేశాంలీడర్లకు సెక్యూర్టీగా ఉన్న సిబ్బంది.. రేపటి ప్రధాని బందోబస్తులో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తున్నాంపల్నాడులో హోలో గ్రామ్ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుపల్నాడు ఎపిసోడ్ పై విచారణ చేపడుతున్నాం
‘రైతుల భూ డాక్యుమెంట్లను బుగ్గిపాలు చేసింది బాబేగా!’
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకుంటున్నారు. ప్రత్యేకించి రైతుల మనోబావాలతో చెలగాటమాడుతున్నారు. ఎవరికైనా భూమితో ఉండే సంబంధం చెప్పనవసరం లేదు. అందులోను రైతులకు మరింతగా ఉంటుంది. వారు భూమిని దైవంగా పరిగణిస్తారు. ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. ఆ భూముల డాక్యుమంట్లను చాలా జాగ్రత్తగా భద్రపరచుకుంటారు. వాటిని తమ కుటుంబ భవిష్యత్తుకు చిహ్నాలుగా చూసుకుంటారు. అలాంటి డాక్యుమెంట్లను చంద్రబాబు నాయుడు దగ్దం చేసే సాహసం చేశారు. ఆయన చేసింది చాలా పెద్ద తప్పు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆయనకు ఎంత ద్వేషమైనా ఉండవచ్చు. ఎంత అక్కసు అయినా ఉండవచ్చు.కాని జగన్‌ను దూషించడానికి రైతుల డాక్యుమెంట్లను తగులబెట్టి దారుణమైన చర్యకు ఉపక్రమించారు. పైగా అదేదో గొప్ప పని మాదిరి ఏమి తమ్ముళ్లూ తగులబెట్టానా? అంటూ ఒకటికి రెండుసార్లు సభలో వికటాట్టహాసం చేయడం. ఈ మధ్యకాలంలో చంద్రబాబుకు ఎవరు ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు ఇస్తున్నారో కాని, ఆయన చేష్టలన్నీ రోత పుట్టిస్తున్నాయి. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని అర్ధం చేసుకోవచ్చు. బూతులు తిట్టడం, డాక్యుమెంట్లు కాల్చడం ఏమిటి? 2014-2019 టరమ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులను పీడించి 33 వేల ఎకరాలను సమీకరించారు. కొందరు ఇష్టంతోనే ఇచ్చినా, చాలామంది అందుకు సిద్దపడలేదు. వారిపై రకరకాల కేసులు పెట్టి, చివరికి వారి పంటలను కూడా దహనం చేయించారన్న విమర్శలకు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం గురి అయింది. దాని ప్రభావంతో ఏపీలో ఆయన ఏకంగా అధికారాన్ని కోల్పోయి, కేవలం 23 సీట్లకే పరిమితం అయ్యారు. వైఎస్సార్సీపీకు 151సీట్లతో స్వీప్ వచ్చింది.అమరావతి రాజధాని గ్రామాలు ఉన్న తాడికొండ, మంగళగిరిలలో కూడా టీడీపీ ఓటమిపాలైంది. మంగళగిరిలో స్వయంగా చంద్రబాబు కుమారుడు లోకేష్ పోటీచేసినా ఫలితం దక్కలేదు. దానిని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఏదో ఒక వివాదం సృష్టిస్తూ జగన్ ప్రభుత్వాన్ని సజావుగా నడవకుండా అడ్డుపడుతూ వచ్చారు. అలాగే మళ్లీ 2024 ఎన్నికల సమయంలో కూడా అనేక గొడవలు సృష్టించడానికి, అబద్దపు ప్రచారాలు చేయడానికి చంద్రబాబు బృందం పూనుకుంది. నిప్పుకు గాలి తోడైనట్లు పవన్ కల్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ వంటి మరికొందరు ఆ బాచ్‌లో చేరి అడ్డగోలు ప్రచారాలకు దిగుతున్నారు. చంద్రబాబు నాయుడు నిజానికి తానేమి చేస్తున్నాననో అర్ధం చేసుకోలేని మానసిక స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది.ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని నీ అమ్మమొగుడు, అమ్మమ్మ మొగుడు, నానామ్మ మొగుడు.. ఇలా పిచ్చి మాటలు మాట్లాడతారా? మైండ్ ఉన్నవాళ్లెవరైనా ఇలాంటి బూతులు మాట్లాడతారా? రెండు రోజుల క్రితమే మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఒక సమావేశంలో మాట్లాడుతూ బూతులు తిట్టే రాజకీయ నేతలను ఓడించాలని పిలుపు ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబును ఓడించాలని వెంకయ్య నాయుడు పిలుపు ఇస్తే బాగుంటుంది. ఎన్నికల సంఘం కూడా చంద్రబాబు పట్ల చాలా ఔదార్యంతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రెండు రోజుల నిషేధం పెట్టిన ఎన్నికల సంఘం చంద్రబాబుపై మాత్రం ఆ స్థాయిలో చర్య తీసుకోవడం లేదు. జగన్‌ను చంపితే ఏమి అవుతుందని చంద్రబాబు ప్రశ్నించినా, ఎన్నికల సంఘం మాత్రం చూస్తూ ఊరుకుంటోంది. అదే సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు వైఎస్సార్సీపీ పైన, సీనియర్ అధికారులపై ఫిర్యాదు చేస్తే చాలు.. ఆఘమేగాల మీద చర్యలు చేపట్టి వారిని బదిలీ చేస్తోంది. తద్వారా చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్న లక్ష్యాన్ని ఎన్నికల సంఘం కూడా నెరవేర్చుతున్నట్లు అనిపిస్తుంది.కేంద్ర హోం మంత్రి అమిత్-షా వచ్చిన రోజున డీజీపీని బదిలీ చేసి, ప్రధాని మోదీ ఏపీకి వచ్చిన రోజున మరికొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసి కూటమి నేతలను సంతోషపెట్టినట్లు అనిపిస్తుంది. ఎన్నికల సంఘం ఏపీలో ఎప్పటి నుంచో అమలు అవుతున్న ఆయా స్కీములకు గాను ప్రజలకు వెళ్లవలసిన డబ్బు వెళ్లకుండా అడ్డుపడుతోంది. కూటమి నేతలు చంద్రబాబు, దగ్గుబాటి పురందేశ్వరి, పవన్ కల్యాణ్ వంటివారు చేసే ఫిర్యాదుల ఆధారంగా ఈసి పనిచేస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్ కూడా ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారు. ఎన్నికలనైనా సజావుగా జరగనిస్తారా? అన్న సందేహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పక్కనబెడితే, రైతు భూమి డాక్యుమెంట్‌ను చంద్రబాబు దగ్దం చేయడానికి కారణం ఏమిటని పరిశీలిస్తే అందులోను చంద్రబాబు డబుల్ గేమ్ బయటపడుతుంది. రామోజీ జర్నలిజాన్ని ఎంతగా దిగజార్చింది అర్దం అవుతుంది.2019 జూలైలో శాసనసభలో లాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లును జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అది చాలా గొప్ప చట్టమని, కేంద్రం దీనిపై ఎప్పటినుంచో కసరత్తు చేస్తోందని, పలు దేశాలలో ఇప్పటికే ఈ తరహా చట్టాలు ఉన్నాయని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మెచ్చుకున్నారు. అప్పుడు చంద్రబాబు ఎక్కడా వద్దనలేదు. కాని శాసనసభ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో దానిని కాంట్రవర్శీ చేసి రాజకీయ లబ్ది పొందడానికి యత్నిస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి. తదితర ఎల్లో మీడియా అడ్డగోలు కధనాలు రాసి ప్రజలలో భయాందోళనలు సృష్టించాలని తలపెట్టాయి. మొదట వైఎస్సార్సీపీ అంత సీరియస్‌గా తీసుకోలేదు. కాని ప్రజల్ని నమ్మించడానికి చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, పవన్ కల్యాణ్‌లు కుయుక్తులు పన్నారన్న విషయం అర్దం చేసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు మేల్కొని అసలు విషయాలు చెప్పడం ఆరంభించారు. ఆ క్రమంలో అసెంబ్లీలో టీడీపీ ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన వీడియోని, రామోజీకి చెందిన టీవీలలో ఈ బిల్లు గొప్పదని చెప్పిన సంగతులను బయటపెట్టారు. దాంతో వారికి నోట మాటరాని పరిస్థితి ఏర్పడింది. వెంటనే ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి ప్లేట్ పిరాయించాయి. ఇంత తొందరేముంది అంటూ మరో చెత్త కధనాన్ని వండి యత్నం చేశాయి. చంద్రబాబు అయితే నిర్లజ్జగా ఆ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం మరింత వికృతంగా వ్యవహరించారు. అందులో భాగంగానే రైతుల సెంటిమెంట్ దెబ్బతినే విదంగా వారి భూ డాక్యుమెంట్‌ను దగ్దం చేశారు. ఆ పనేదో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్-షాల సభలలో వారి సమక్షంలోనే తగులబెడితే వారు ఏమి చెప్పేవారో తెలిసేది కదా? కాని ఆ పని చేయరు.కేవలం ప్రజలను మోసం చేయడానికి, తాను ఆత్మరక్షణలో పడిన విషయాన్ని కప్పిపుచ్చడానికి డాక్యుమెంట్లను దగ్దం చేసి రైతుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారని చెప్పాలి. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా డబుల్ గేమ్ ఆడారు. ఒకటికి రెండుసార్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలం అంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాశారు. తీరా కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు రెడీకాగానే సోనియాగాంధీని దెయ్యం, బూతం అంటూ బండబూతులు తిట్టారు. ఆంధ్రుల పొట్టకొట్టిందని అన్నారే తప్ప తాను సమైక్యవాదినని, తాను ఇచ్చిన లేఖను ఉపసంహరించుకుంటున్నానని మాత్రం చెప్పలేదు. తెలంగాణలో జరిగిన సభలలో తనవల్లే రాష్ట్రం వచ్చిందని గొప్పగా చెప్పుకున్నారు. ఇలా ఎన్నిసార్లు డబుల్ గేమ్ ఆడారో లెక్కలేదు. రెండు నాలుకల దోరణిలో బహుశా దేశంలోనే చంద్రబాబుకు అగ్రస్థానం ఉండవచ్చు. వలంటీర్ల వ్యవస్థను రకరకాలుగా దూషించారు. ఆ తర్వాత తాను అదే వ్యవస్థను కొనసాగిస్తానని, ఇంకా ఎక్కువ వేతనం ఇస్తానని అంటారు.జగన్ సంక్షేమ స్కీములు అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని అన్న చంద్రబాబు అంతకు రెట్టింపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని హామీ ఇస్తుంటారు. ఈ డబుల్ టాక్‌తో రాజకీయ ప్రయోజనం కోసం ఆయన ఎంతకైనా దిగజారుతారు. అలాగే ఇప్పుడు లాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన డబుల్ టాక్ చేసి అప్రతిష్టపాలయ్యారు. అమలులోకి రాని చట్టంతో ఏదో ప్రమాదం జరిగినట్లు పచ్చి అబద్దాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచారం చేయడం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ పిచ్చి ప్రసంగాలు చేయడం నిత్యకృత్యం అయింది. అందులో బాగంగా చంద్రబాబు రైతుల బూమి డాక్యుమెంట్ ను దగ్దం చేసి రైతుల సెంటిమెంట్‌ను దెబ్బతీశారు. గతంలో అమరావతిలో పంటపొలాలు దహనం చేయించిన తర్వాత ఘోర పరాజయం చెందారు. అలాగే ఈసారి రైతుల భూమి డాక్యుమెంట్‌ను బుగ్గిపాలు చేయడం ద్వారా కూటమి అదికారంలోకి వస్తే రాష్ట్రాన్ని కూడా అలాగే తగులబెడతామని ప్రజలకు వారికి తెలియకుండానే సంకేతం పంపించారు. కనుక భూ డాక్యుమెంట్ తగులబెట్టిన చంద్రబాబుకు మరోసారి ఓటమి తప్పదన్న భావన వ్యక్తం అవుతోంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
కల్కిలో మహేశ్ బాబు.. నాగ్ అశ్విన్ ప్లానింగ్ అదుర్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సగటు సీనీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సలార్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న ఈ చిత్రం కచ్చితంగా సంచలనాలను క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నాగ్ అశ్విన్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు.అలాగే ఈ మూవీలో చాలామంది స్టార్స్ నటిస్తున్నారు . ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపఠాని లాంటి స్టార్స్‌ను ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్టులో మరో స్టార్ హీరో కూడా భాగం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా కనిపించబోతున్నాడట. ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ మహేశ్ బాబును సంప్రదించారట. అయితే ఇందులో మహేశ్ కేవలం వాయిస్ ఓవర్ మాత్రమే ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ విష్ణు అవతారంలో కనిపించబోతున్నాడు. ప్రభాస్ పాత్రను పరిచయం చేసేందుకు మహేశ్‌ని రంగంలోకి దించబోతున్నాడట నాగ్ అశ్విన్. ప్రభాస్ ఇంట్రో, ఎలివేషన్ కు మహేష్ బాబు వాయిస్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. గతంలోనూ మహేశ్ పలువురు స్టార్ హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. పవన్ కల్యాణ్ ‘జల్సా’, ఎన్టీఆర్ ‘బాద్షా’, చిరంజీవి ‘ఆచార్య’సినిమాలకు మహేశ్ తన గాత్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ప్రభాస్ కోసం మళ్లీ వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
జేపీ నడ్డాకు పోలీసుల సమన్లు
బెంగళూరు: రిజర్వేషన్లపై సోషల్ మీడియలో అభ్యంతరకర పోస్టు పెట్టిన కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్యాకు బెంగళూరు పోలీసులు సమన్లు జారీ చేశారు. అభ్యంతరకర పోస్టు పెట్టిన కేసులో తమ ముందు విచారణకు హాజరవ్వాలని సమన్లలో కోరారు. కాగా, ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో సర్క్యులేట్ చేసిన కేసులో తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కూడా ఢిల్లీ పోలీసులు సమన్లు ఇవ్వగా ఆయన తన రాతపూర్వక సమాధానాన్ని న్యాయవాది ద్వారా పంపారు.
T20 WC: ద్రవిడ్, రోహిత్‌కు నచ్చకపోవచ్చు.. కానీ నా సలహా ఇదే!
టీ20 వరల్డ్‌కప్-2024 నేపథ్యంలో టీమిండియా కూర్పు గురించి వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ నంబర్ వన్ స్టార్ సూర్యకుమార్ యాదవ్‌ను టాపార్డర్‌కు ప్రమోట్ చేయాలని సూచించాడు.తన సూచన టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మకు నచ్చకపోవచ్చని.. అయితే, జట్టు ప్రయోజనాల కోసమే తాను ఈ సలహా ఇస్తున్నానని లారా పేర్కొన్నాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ఐసీసీ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా జూన్ 5న భారత జట్టు తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో తాజా వరల్డ్‌కప్‌లో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సారథ్యంలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.ఒంటిచేత్తో జట్టును గెలిపించిఇదిలా ఉంటే.. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఐపీఎల్-2024 బరిలో దిగిన ముంబై ఇండియన్స్ స్టార్ సూర్యకుమార్ ఆరంభంలో తడబడ్డాడు. అయితే, త్వరగానే తిరిగి ఫామ్ అందుకున్న స్కై.. ఆఖరిగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో దుమ్ములేపాడు.నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 51 బంతుల్లోనే 12 ఫోర్లు, ఆరు సిక్స్‌ల సాయంతో 102 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. కాగా సూర్య సాధారణంగా మిడిలార్డర్లోనే బ్యాటింగ్‌కు వస్తాడన్న విషయం తెలిసిందే.అయితే, టీ20 ప్రపంచకప్-2022 తర్వాత వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్న సమయంలో మూడో స్థానంలో దిగాడు సూర్య. అలా 14 ఇన్నింగ్స్ ఆడి 479 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, నాలుగు అర్ధ శతకాలు ఉండటం విశేషం.మూడో నంబర్‌లోనే ఆడించాలిఇక నాలుగో స్థానంలో ఓవరాల్‌గా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 35 ఇన్నింగ్స్ ఆడిన సూర్య 1402 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో బ్రియన్ లారా ఆసక్తికర విశ్లేషణతో ముందుకు వచ్చాడు.‘‘టీమిండియా మేనేజ్మెంట్కు నచ్చుతుందో లేదో గానీ నా సలహా మాత్రం ఇదే. సూర్యను మూడో నంబర్‌లోనే బ్యాటింగ్‌కు పంపాలి. వన్‌డౌన్‌లోనే అతడు ఆడాలి.టాపార్డర్‌లో ఆడటమే సరైందిటీ20 అత్యుత్తమ ప్లేయర్లలో సూర్య ఒకడు. సర్ వివియన్ రిచర్డ్స్లాంటి వాళ్లతో మాట్లాడితే.. తాను మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు.అలాగే స్కై కూడా టాపార్డర్‌లో ఆడటమే సరైందని నేను భావిస్తాను. అతడు ఎలాగూ ఓపెనర్ కాదు.. కాబట్టి కనీసం మూడో స్థానంలోనైనా పంపిస్తే బాగుంటుంది.10- 15 ఓవర్ల పాటు సూర్య క్రీజులో ఉంటే ఏం జరుగుతుందో మనకి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసినా.. లక్ష్య ఛేదనలో అయినా సూర్య వన్‌డౌన్‌లో వస్తే ప్రయోజనకరం.కోహ్లి త్యాగం చేయాలికాబట్టి కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తే బెటర్. సూర్య స్టార్ టీ20 ప్లేయర్ కాబట్టి అతడి కోసం తన స్థానం త్యాగం చేయాలి’’ అని బ్రియన్ లారా చెప్పుకొచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోహ్లి ఓపెనింగ్ చేయనున్నాడన్న వార్తల నడుమ బ్రియన్ లారా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చదవండి: SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్‌కు వెళ్తున్న వారికి అలర్ట్! ప్రత్యేకంగా మీకోసమే..
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- వెస్ట్ నైలు వైరస్‌ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్‌కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- ఓటు వేద్దాం ఇలా.!
సినిమా
కట్టప్పతో స్టార్ హీరో.. ఈ మధ్యే రూ.150 కోట్ల హిట్ మూవీతో..!
నటుడు సత్యరాజ్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో బోలెడన్ని సినిమాలు చేశాడు. మొదట్లో విలన్‌గా, తర్వాత హీరోగా.. అనంతరం సహాయక నటుడిగా మెప్పించాడు. బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రతో పాన్ ఇండియా స్థాయిలో క్లిక్కయ్యాడు. ఈ మధ్య ఇతడు సింగపూర్ సెలూన్ మూవీలో మెరిశాడు. ఫోటో వైరల్తాజాగా ఈ నటుడు యుక్తవయసులో ఉన్నప్పటి ఫోటో ఒకటి వైరల్‌గా మారింది. ఇందులో సత్యరాజ్ ఓ బుడ్డోడితోపాటు కెమెరావైపు నవ్వులు చిందిస్తున్నాడు. ఈ బుడ్డోడు సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ యాక్టర్. ఇతడి తండ్రి కూడా నటుడే! ఆయనతో కలిసి సత్యరాజ్ రెండు సినిమాలు కూడా చేశాడు. ఇంతకీ ఈ చిన్నోడెవరో గుర్తుపట్టారా? తెలుగులో విపరీతమైన పాపులారిటీఅతడే మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్. పుష్ప సినిమాతో తెలుగులో విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న ఇతడు ఈ మధ్యే ఆవేశం అనే సినిమాతో మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా రాబట్టింది. 1980లో అతడు సత్యరాజ్‌తో దిగిన ఫోటోను ఓటీటీ ప్లాట్‌ఫామ్ ముబి ఇండియా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. Sathyaraj and Fahadh Faasil in the 1980s. pic.twitter.com/H9DidxzScV— MUBI India (@mubiindia) May 7, 2024చదవండి: నాన్నతో కోపంలో అన్నా.. అదే నిజమైంది: బన్నీ
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నటి కనకలత కన్నుమూశారు. తిరువనంతపురంలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె చాలా కాలంగా పార్కిన్సన్స్, మతిమరుపుతో బాధపడుతున్నారు. దీంతో కోలుకోలేక మరణించారు. కాగా.. 22 ఏళ్లకే పెళ్లి చేసుకున్న కనకలత.. 16 ఏళ్ల తర్వాత తన భర్తతో విడాకులు తీసుకున్నారు. ఆమెకు ఎలాంటి సంతానం లేకపోవడంతో 34 ఏళ్లుగాతన సోదరి విజయమ్మతో కలిసి ఉంటోంది.కాగా.. కనకలత మలయాళం, తమిళ సినిమాలు, సీరియల్స్‌లో ఎక్కువగా నటించారు. దాదాపు రెండు భాషల్లో 360కి పైగా చిత్రాలు చేశారు. యాత్రామొళి, గురు, కిలుకిల్ పంబరం, పార్వతీ పరిణయం, తుంపోలి కడపురం, అతిర కన్మణి, ఎఫ్ఐఆర్, ఆకాశ గంగ, దోస్త్, నెమలి, మంత్రమోతీరం, కౌరవులు, కార్య, జాగురా, రాజు లాంటి సినిమాలు చేసింది. కనకలత చివరిసారిగా ‘పూక్కాళం’, ‘మూడు రోజులు సినిమాల్లో నటించింది. ఆమెకు చిత్ర పరిశ్రమ నుండి ఆఫర్లు వచ్చనప్పటికీ.. ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె నటనకు విరామం తీసుకుంది. ఆమెకు మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(అమ్మ), ఫిల్మ్ అకాడమీ ఆర్థిక సాయంతో చికిత్స తీసుకున్నారు.
కల్కిలో మహేశ్ బాబు.. నాగ్ అశ్విన్ ప్లానింగ్ అదుర్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సగటు సీనీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సలార్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న ఈ చిత్రం కచ్చితంగా సంచలనాలను క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నాగ్ అశ్విన్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు.అలాగే ఈ మూవీలో చాలామంది స్టార్స్ నటిస్తున్నారు . ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపఠాని లాంటి స్టార్స్‌ను ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్టులో మరో స్టార్ హీరో కూడా భాగం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా కనిపించబోతున్నాడట. ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ మహేశ్ బాబును సంప్రదించారట. అయితే ఇందులో మహేశ్ కేవలం వాయిస్ ఓవర్ మాత్రమే ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ విష్ణు అవతారంలో కనిపించబోతున్నాడు. ప్రభాస్ పాత్రను పరిచయం చేసేందుకు మహేశ్‌ని రంగంలోకి దించబోతున్నాడట నాగ్ అశ్విన్. ప్రభాస్ ఇంట్రో, ఎలివేషన్ కు మహేష్ బాబు వాయిస్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. గతంలోనూ మహేశ్ పలువురు స్టార్ హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. పవన్ కల్యాణ్ ‘జల్సా’, ఎన్టీఆర్ ‘బాద్షా’, చిరంజీవి ‘ఆచార్య’సినిమాలకు మహేశ్ తన గాత్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ప్రభాస్ కోసం మళ్లీ వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఆ మాట అనగానే నాకు కోపం వచ్చేసింది: అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అను మెహతా, శివబాలాజీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆర్య. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మే 7, 2004లో థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం రిలీజై ఇప్పటికీ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా చిత్రయూనిట్ 20 ఏళ్ల సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకలో సుకుమార్, అల్లు అరవింద్, దిల్‌రాజు లాంటి ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆర్య రిలీజ్ తర్వాత ఆ విషయంలో తనకు కోపం వచ్చిందని తెలిపారు.అల్లు అర్జున్ మాట్లాడుతూ..'సినిమా రిలీజయ్యాక ఆ రోజుల్లో 70 డేస్ కాదు.. 100 డేస్ ఆడితేనే సక్సెస్. రిలీజ్ రోజు నేను, సుకుమార్ థియేటర్‌కు వెళ్లి చూస్తే అప్పటికీ 40 శాతమే ఉంది. థియేటర్స్ మెల్ల మెల్లగా ఫిల్ అవుతున్నాయి. మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. తీరా ఆ రోజు రిపోర్ట్ చూస్తే మాత్రం 10 వీక్స్ మాత్రమే అన్నారు. అప్పుడు నాకు ఏంటి ఇది 100 డేస్ సినిమా కాదా? అనిపించింది. కానీ నాకు మాత్రం ఆ ఫీలింగ్ లేదు.. సాయంత్రం కల్లా ఫుల్ అవుతుంది అన్నా. కచ్చితంగా రైజ్ అవుద్ది అని చెప్పా. ఇలాంటి సినిమాకు 70 రోజులంటేనే సక్సెస్ అయినట్లు అని చాలామంది అన్నారు. కానీ ఆ మాట అనగానే నాకు, సుకుమార్‌కు కోపమొచ్చేసింది. అలా ఒకరోజు అయిపోగానే నాన్న ఓ మాట అన్నారు. ఏంటి మొహం అలా పెట్టుకున్నావ్.. పదివారాలు అంటే పెద్ద సక్సెస్ తెలుసా? అని అన్నారు. ఏంటి 10 వీక్స్?..125 డేస్ షీల్డ్ తీసుకోకపోతే నా పేరు మార్చుకుంటా అని చెప్పా. ఆ తర్వాత మెగాస్టార్ చేతుల మీదుగా షీల్డ్ తీసుకున్నా. అది నా పిచ్చి అనుకోండి. ఇంకేమైనా అనుకోండి. థ్యాంక్ యూ' అని అన్నారు. #TFNReels: Icon Star @alluarjun reminisces about his confidence in the #Arya movie result!🔥Watch Full Speech here - https://t.co/MwPKCcVoVm#20YearsForArya #AlluArjun #TeluguFilmNagar pic.twitter.com/C7bOUWk3Wl— Telugu FilmNagar (@telugufilmnagar) May 8, 2024
ఫొటోలు
HBD Pat Cummins: సన్‌రైజర్స్ కెప్టెన్ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)
కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్’ (ఫొటోలు)
Ragini Dwivedi: వైట్ అవుట్ ఫిట్ తో రాగిణి ద్వివేది అందాలు (ఫొటోలు)
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
Sanjeeda Sheikh: చీరలో అదరగొడుతున్న హీరోయిన్ లుక్స్ (ఫోటోలు)
క్రీడలు
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్ ఛాంపియన్‌గా శ్రీలంక
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్-2024 పోటీల్లో శ్రీలంక జట్టు విజేతగా అవతరించింది. అబుదాబీలో నిన్న (మే 7) జరిగిన ఫైనల్లో లంక జట్టు స్కాట్లాండ్పై 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లంక కెప్టెన్ చమారీ ఆటపట్టు మెరుపు శతకంతో (63 బంతుల్లో 102; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక చమారీ రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో చమారీ మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. నీలాక్షి డిసిల్వ 26 నాటౌట్, కవిశ దిల్హరి 15, విశ్మి గుణరత్నే 9, హర్షిత మాధవి 8, హాసిని పెరెరా 0 పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో రేచల్ స్లేటర్ 2, ప్రయనాజ్, కేథరీన్ ఫ్రేజర్, అబ్తహా మక్సూద్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 170 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 101 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఉదేషిక ప్రబోధని 3 వికెట్లతో చెలరేగగా.. ఇనోశి ప్రియ, సుగందిక కుమారి, కవిశ దిల్హరి తలో వికెట్ పడగొట్టారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో ప్రియనాజ్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఫలితంతో సంబంధం లేకుండా శ్రీలంక, స్కాట్లాండ్ జట్లు ఈ ఏడాది అక్టోబర్‌లో జరుగబోయే మహిళల టీ20 ప్రపంచకప్‌కు క్వాలిఫై అయ్యాయి. మహిళల పొట్టి ప్రపంచకప్ బంగ్లాదేశ్ వేదికగా అక్టోబర్ 3న ప్రారంభమవుతుంది.
టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టును ఏప్రిల్ 30న ప్రకటించారు. ఈ జట్టులో 15 మంది రెగ్యులర్ ఆటగాళ్లు, నలుగురు ట్రావెలింగ్ రిజర్వ్స్ ఉన్నారు. రోహిత్ శర్మ ఈ జట్టుకు సారధిగా వ్యవహరించనుండగా.. హార్దిక్ అతనికి డిప్యూటీగా ఎంపికయ్యాడు. రెగ్యులర్ జట్టులో విరాట్ కోహ్లి, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, బుమ్రా లాంటి స్టార్ ప్లేయర్లు ఉండగా.. శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు. అందరూ ఊహించిన విధంగానే ఐపీఎల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్, శివమ్ దూబేలకు చోటు దక్కింది. యశస్వి జైస్వాల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చహల్, అర్షదీప్ సింగ్, సిరాజ్ మిగతా సభ్యులుగా ఎంపికయ్యారు.ఈ జట్టును ప్రకటించిన అనంతరం పలువురు ఆటగాళ్లకు అన్యాయం (19 మంది సభ్యుల జట్టులో చోటు దక్కక పోవడంపై) జరిగిందని సోషల్‌మీడియా గగ్గోలు పెట్టింది. మాజీలు, విశ్లేషకులు రింకూ సింగ్, కేఎల్ రాహుల్, రుతురాజ్, రియాన్ పరాగ్, నటరాజన్, రవి భిష్ణోయ్ లాంటి ఆటగాళ్లను పక్కకు పెట్టడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. Wisden picks India's T20I "B Team" for T20 World Cup 2024: (Who didn't pick in main)1. KL Rahul (C).2. Abhishek Sharma.3. Ruturaj Gaikwad.4. Riyan Parag.5. Tilak Verma.6. Shashank.7. Nitish Reddy.8. Ravi Bishnoi.9. Harshit Rana.10. Varun Chakravarthy.11. T Natarajan. pic.twitter.com/DmwAh1iAfn— Tanuj Singh (@ImTanujSingh) May 8, 2024రింకూ సింగ్ విషయంలో కొందరు మాజీలు ఏకంగా సెలక్టర్లనే తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ప్రముఖ క్రికెట్ గైడ్ విజ్డన్ ప్రపంచకప్‌కు ఎంపిక కాని అర్హులైన ఆటగాళ్లతో ఓ జట్టును ఎంపిక చేసింది.ఈ జట్టుకు కేఎల్ రాహుల్ సారధిగా ఎంపికయ్యాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆయా ఆటగాళ్ల ఫామ్ ఆధారంగా మిగతా జట్టు సభ్యుల ఎంపిక జరిగింది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, అభిషేక్ శర్మ, వన్‌డౌన్‌లో రుతురాజ్ గైక్వాడ్, నాలుగో స్థానంలో రియాన్ పరాగ్, ఐదో ప్లేస్‌లో తిలక్ వర్మ, ఆరో స్థానంలో శశాంక్ సింగ్, ఆల్‌రౌండర్ కోటాలో విశాఖ చిన్నోడు నితీశ్ కుమార్ రెడ్డి, స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.. పేసర్లుగా హర్షిత్ రాణా, నటరాజన్ ఎంపికయ్యాడు. ఈ జట్టుకు విజ్డన్ భారత-బి జట్టుగా నామకరణం చేసింది.
T20 WC: ద్రవిడ్, రోహిత్‌కు నచ్చకపోవచ్చు.. కానీ నా సలహా ఇదే!
టీ20 వరల్డ్‌కప్-2024 నేపథ్యంలో టీమిండియా కూర్పు గురించి వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ నంబర్ వన్ స్టార్ సూర్యకుమార్ యాదవ్‌ను టాపార్డర్‌కు ప్రమోట్ చేయాలని సూచించాడు.తన సూచన టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మకు నచ్చకపోవచ్చని.. అయితే, జట్టు ప్రయోజనాల కోసమే తాను ఈ సలహా ఇస్తున్నానని లారా పేర్కొన్నాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ఐసీసీ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా జూన్ 5న భారత జట్టు తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో తాజా వరల్డ్‌కప్‌లో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సారథ్యంలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.ఒంటిచేత్తో జట్టును గెలిపించిఇదిలా ఉంటే.. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఐపీఎల్-2024 బరిలో దిగిన ముంబై ఇండియన్స్ స్టార్ సూర్యకుమార్ ఆరంభంలో తడబడ్డాడు. అయితే, త్వరగానే తిరిగి ఫామ్ అందుకున్న స్కై.. ఆఖరిగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో దుమ్ములేపాడు.నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 51 బంతుల్లోనే 12 ఫోర్లు, ఆరు సిక్స్‌ల సాయంతో 102 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. కాగా సూర్య సాధారణంగా మిడిలార్డర్లోనే బ్యాటింగ్‌కు వస్తాడన్న విషయం తెలిసిందే.అయితే, టీ20 ప్రపంచకప్-2022 తర్వాత వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్న సమయంలో మూడో స్థానంలో దిగాడు సూర్య. అలా 14 ఇన్నింగ్స్ ఆడి 479 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, నాలుగు అర్ధ శతకాలు ఉండటం విశేషం.మూడో నంబర్‌లోనే ఆడించాలిఇక నాలుగో స్థానంలో ఓవరాల్‌గా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 35 ఇన్నింగ్స్ ఆడిన సూర్య 1402 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో బ్రియన్ లారా ఆసక్తికర విశ్లేషణతో ముందుకు వచ్చాడు.‘‘టీమిండియా మేనేజ్మెంట్కు నచ్చుతుందో లేదో గానీ నా సలహా మాత్రం ఇదే. సూర్యను మూడో నంబర్‌లోనే బ్యాటింగ్‌కు పంపాలి. వన్‌డౌన్‌లోనే అతడు ఆడాలి.టాపార్డర్‌లో ఆడటమే సరైందిటీ20 అత్యుత్తమ ప్లేయర్లలో సూర్య ఒకడు. సర్ వివియన్ రిచర్డ్స్లాంటి వాళ్లతో మాట్లాడితే.. తాను మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు.అలాగే స్కై కూడా టాపార్డర్‌లో ఆడటమే సరైందని నేను భావిస్తాను. అతడు ఎలాగూ ఓపెనర్ కాదు.. కాబట్టి కనీసం మూడో స్థానంలోనైనా పంపిస్తే బాగుంటుంది.10- 15 ఓవర్ల పాటు సూర్య క్రీజులో ఉంటే ఏం జరుగుతుందో మనకి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసినా.. లక్ష్య ఛేదనలో అయినా సూర్య వన్‌డౌన్‌లో వస్తే ప్రయోజనకరం.కోహ్లి త్యాగం చేయాలికాబట్టి కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తే బెటర్. సూర్య స్టార్ టీ20 ప్లేయర్ కాబట్టి అతడి కోసం తన స్థానం త్యాగం చేయాలి’’ అని బ్రియన్ లారా చెప్పుకొచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోహ్లి ఓపెనింగ్ చేయనున్నాడన్న వార్తల నడుమ బ్రియన్ లారా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చదవండి: SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్‌కు వెళ్తున్న వారికి అలర్ట్! ప్రత్యేకంగా మీకోసమే..
టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభంకాబోయే పురుషుల పొట్టి ప్రపంచకప్ కోసం మరో జట్టును ప్రకటించారు. రెండో సారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన పపువా న్యూ గినియా ఇవాళ (మే 8) తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యుల ఈ జట్టుకు అస్సద్ వలా కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సీజే అమీనీ అస్సద్‌కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) ఎంపికయ్యాడు. తూర్పు ఆసియా పసిఫిక్ రీజియనల్ పోటీల ద్వారా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన పపువా న్యూ గినియా 2021లో తొలిసారి ప్రపంచకప్‌కు క్వాలిఫై అయ్యింది. ఆ ఎడిషన్‌లో ఈ జట్టు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టులో 10 మంది 2021 ప్రపంచకప్ స్క్వాడ్‌లో ఉన్నారు. 2024 ప్రపంచకప్‌లో గినియా జర్నీ జూన్ 2న ప్రారంభమవుతుంది. ఆ రోజు జరిగే మ్యాచ్‌లో గినియా.. పటిష్టమైన వెస్టిండీస్‌ను ఢీకొంటుంది. ప్రపంచకప్ గ్రూప్-సిలో ఉన్న గినియా.. గ్రూప్ దశలో వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, ఉగాండ జట్లతో పోటీపడుతుంది.టీ20 ప్రపంచకప్ 2024 కోసం పపువా న్యూ గినియా జట్టు: అస్సద్ వలా (కెప్టెన్), సీజే అమీనీ (వైస్ కెప్టెన్), అలీ నావో, చాడ్ సోపర్, హిలా వరే, హిరి హిరి, జాక్ గార్డనర్, జాన్ కారికో, కబువా వాగి మోరియా, కిప్లింగ్ డోరిగా, లెగా సియాకా, నార్మన్ వనువా, సెమా కమియా, సెసే బావు, టోనీ ఉరాపొట్టి ప్రపంచకప్ కోసం ఇప్పటిదాకా 15 జట్లను ప్రకటించారు. మరో జట్లను ప్రకటించాల్సి ఉంది. జట్ల వివరాలను వెల్లడించిన దేశాలు..భారత్ఇంగ్లండ్ఆస్ట్రేలియాఒమన్సౌతాఫ్రికాన్యూజిలాండ్ఆఫ్ఘనిస్తాన్నేపాల్కెనడావెస్టిండీస్యూఎస్ఏఉగాండస్కాట్లాండ్ఐర్లాండ్పపువా న్యూ గినియాజట్లను ప్రకటించాల్సిన దేశాలు..పాకిస్తాన్నమీబియానెదర్లాండ్స్శ్రీలంకబంగ్లాదేశ్
బిజినెస్
అందరూ పోలింగ్‌లో పాల్గొనాలి: అదానీ
ఆసియా కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ కుటుంబ సమేతంగా అహ్మదాబాద్‌లో మంగళవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓటుహక్కు కలిగి ఉన్న పౌరులందరూ పోలింగ్‌లో తప్పక పాల్గొనాలని ఆయన తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ శాతం పెంచేలా ప్రకటనలు, సెలబ్రిటీ యాడ్స్..వంటి చాలా కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే.అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్‌గా గౌతమ్ అదానీ వ్యవహరిస్తున్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రూ.3.5లక్షల కోట్లుగా ఉంది. గౌతమ్ అదానీ ఎంటర్ప్రైజ్ బిజినెస్‌తోపాలు పోర్ట్ మేనేజ్మెంట్, ఎలక్ట్రిక్ పవర్, మైనింగ్, పునరుత్పాదక ఇందనం, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫ్రా..వంటి రంగాల్లో కంపెనీలు స్థాపించి విజయవంతంగా వాటిని కొనసాగిస్తున్నారు.
ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
విమాన సేవలందిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ 70కి పైగా సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించింది. సిబ్బంది అనారోగ్యంతో ఉండడమే ఇందుకు కారణమని చెప్పింది. రద్దైన విమానాల్లో అంతర్జాతీయ, దేశీయ విమానాలు ఉన్నాయి. దాంతో ఉన్న సర్వీసులు ఆలస్యంగా నడిచినట్లు తెలిసింది. ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని పౌర విమానయాన అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.సిబ్బంది అనారోగ్యంగా ఉన్నారని దాంతో విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత సంస్థ తన ‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్ వేదికగా స్పందించింది. ‘మా క్యాబిన్ సిబ్బందిలోని ఒక విభాగానికి చెందిన ఉద్యోగులు చివరి నిమిషంలో ఏకకాలంలో అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. ఈ మేరకు మూకుమ్మడిగా ‘సిక్‌లీవ్’ దరఖాస్తులు అందాయి. దాంతో మంగళవారం రాత్రి నుంచి కొన్నివిమాన సర్వీసులు ఆలస్యం అయ్యాయి. మరికొన్నింటిని రద్దు చేశాం. ఈ సంఘటనకు గల కారణాలను అర్థం చేసుకోవడానికి మేము సిబ్బందితో మాట్లాడుతున్నాం. ఊహించని పరిణామం వల్ల ప్రయాణికులకు అంతరాయం కలిగిస్తే క్షమాపణలు కోరుతున్నాం. ఇకపై చేసే ప్రయాణాలకు సంబంధించి సదరు సర్వీసు అందుబాటులో ఉందో లేదో సరిచూసుకోవాలి కోరుతున్నాం’ అని తెలిపింది.ఇదీ చదవండి: ట్రేడింగ్ వేళల పెంపునకు నో చెప్పిన సెబీరద్దు అయిన విమానసర్వీసుల టికెట్ డబ్బులు వాపసు చేస్తామని.. లేదంటే మరోతేదీకి రీషెడ్యుల్ చేసుకునే వీలుందని కంపెనీ పేర్కొంది. More than 70 international and domestic flights of Air India Express from Tuesday night till Wednesday morning have been cancelled after the senior crew member of the airline went on mass 'sick leave'. Civil Aviation authorities are looking into the issue: Aviation Sources— ANI (@ANI) May 8, 2024
నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయి 22,249కు చేరింది. సెన్సెక్స్ 213 పాయింట్లు తగ్గి 73,301 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.4 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 82.98 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.45 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.13 శాతం లాభపడింది. నాస్డాక్ 0.1 శాతం నష్టపోయింది.ప్రాథమిక సైట్లో ఏమైనా లోపాలు లేదా అంతరాయాలు తలెత్తితే ఎదుర్కొనే సన్నద్ధతను పరీక్షించేందుకు శనివారం(మే 18న) ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్ విభాగాల్లో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహిస్తున్నట్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు తెలిపాయి. ఉదయం 9.15 గంటల నుంచి 10 గంటల వరకు తొలి సెషన్ ప్రధాన ప్రాథమిక సైట్లో.., ఉదయం 11.30 నుంచి 12.30 మధ్య మరో సెషన్ డిజార్టర్ రికవరీ సైట్లో ట్రేడింగ్ జరగనుంది. అన్ని సెక్యూరిటీస్, డెరివేటివ్ ఉత్పత్తులను ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయి. గరిష్ట పరిమితిని 5 శాతంగా నిర్ణయించాయి. ఎక్స్ఛేంజీలు ఈ తరహా ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను ఈ మార్చి 2న నిర్వహించాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఎన్ఎస్ఈ ప్రతిపాదనను తోసిపుచ్చిన సెబీ..
ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ వేళల పెంపు ప్రతిపాదనను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తిరస్కరించింది. స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ చేసిన ప్రతిపాదనకు సెబీ తాజాగా నో చెప్పింది. ఈ అంశంపై స్టాక్ బ్రోకర్ల నుంచి ఎలాంటి స్పందన లభించకపోవడంతో సెబీ తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్‌కుమార్ చౌహాన్ పేర్కొన్నారు.దశలవారీగా ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో లావాదేవీలు చేపట్టే వేళలను పెంచలంటూ ఎన్ఎస్ఈ.. సెబీకి దరఖాస్తు చేసింది. అయితే ఇందుకు స్టాక్ బ్రోకర్ల అభిప్రాయాలను కోరినప్పటికీ స్పందన లభించకపోవడంతో సెబీ దరఖాస్తును తిప్పిపంపినట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. ఫలితంగా ప్రస్తుతానికి ట్రేడింగ్ వేళల పెంపు ప్రతిపాదన వీగిపోయినట్లేనని తెలియజేసింది.ఇదీ చదవండి: ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్!ప్రపంచ మార్కెట్ల నిరంతర సమాచారం కారణంగా తలెత్తే ఓవర్‌నైట్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు వీలుగా ఎన్ఎస్ఈ ట్రేడింగ్ వేళల పెంపు ప్రతిపాదనకు తెరతీసింది. రోజువారీ(ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 3.30వరకూ) సెషన్ ముగిశాక కమోడిటీ డెరివేటివ్స్ తీరులో సాయంత్రం 6–9 గంటల మధ్య ట్రేడింగ్‌కు గతేడాది సెప్టెంబర్‌లో ప్రతిపాదించినట్లు ఎన్ఎస్ఈ బిజినెస్ డెవలప్మెంట్ చీఫ్ శ్రీరామ్ కృష్ణన్ పేర్కొన్నారు. తదుపరి స్టాక్ బ్రోకర్ల స్పందననుబట్టి క్రమంగా రాత్రి 11.55 వరకూ పొడిగించేందుకు యోచించినట్లు తెలియజేశారు.
వీడియోలు
దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్
అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!
ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు
చిరు పై పోసాని సంచలన కామెంట్స్
కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
నర్రెడ్డి నాటకాలు చాలు
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
ఫ్యామిలీ
మిస్టర్ బీస్ట్ బర్త్‌డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
అమెరికన్ యూట్యూబర్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ తన ఫాలోయర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. మిస్టర్ బీస్ట్‌గా పాపులర్ అయిన జిమ్మీ డొనాల్డ్సన్ తన 26వ పుట్టినరోజు (మే 7) సందర్భంగా 26 టెస్లా కార్లను బహుమతిగా ఇవ్వబోతున్నట్టు ప్రకటించాడు. ఇందులో ఒక సైబర్ ట్రక్ కూడా ఉందని ప్రకటించడం విశేషం. కండిషన్స్ అప్లయ్ అంటూ కొన్ని నిబంధనలు కూడా పెట్టాడు. దీంతో ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్ కంటెంట్ విచిత్రమైన సవాళ్లతో తనకు తానే సాటి అని నిరూపించుకనే మిస్టర్ బీస్ట్ తాజాగా దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ అధికారిక ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే ఇందులో ఒక మతలబు ఉంది. తన పోస్ట్ కింద కామెంట్ చేసి, ఇద్దరు ఫ్రెండ్స్‌ను ట్యాగ్ చేసిన 26 మందిని ఎంపిక చేసి, 26 కార్లను బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. డ్రా తీసిన అనంతరం విజేతలకు డైరెక్ట్‌గా మెసేజ్ చేస్తానని, వారం రోజుల్లో (మే 11న) ఎంపికైన వారి వివరాలను ప్రకటిస్తానని తెలిపాడు. అంతేకాదు రకరకాల పేర్లు, లేదా రీపోస్ట్‌లు లాంటి జిమ్మిక్కులు పనిచేయవని కూడా వెల్లడించాడు. View this post on Instagram A post shared by MrBeast (@mrbeast) 254 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లతో యూట్యూబ్‌లో అత్యధిక ఫాలోవర్లున్న వ్యక్తిగా కొనసాగుతున్న మిస్టర్ బీస్ట్ నికర విలువ రూ.4,175 కోట్లు (500 మిలియన్ల డాలర్లు)గా తెలుస్తోంది. 2012 ప్రారంభంలో 13 ఏళ్ల వయస్సులో 6000 పేరిట తొలుత ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాడు. ఆ తర్వాత బీస్ట్ రియాక్ట్స్, మిస్టర్ బీస్ట్ గేమింగ్, మిస్టర్ బీస్ట్ 2, అలాగే ఒక దాతృత్వ ఛానెల్ బీస్ట్ ఫిలాంత్రరోపీని నడుపుతున్నాడు. దీని ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలను విరాళాలిస్తుంటాడు.
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
వెస్ట్ నైలు వైరస్‌ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
ఇటీవల కేరళలోని వివిధ జిల్లాల్లో వెస్ట్ నైల్ ఫీవర్ కేసులు విజృంభిస్తున్నాయి. దాదాపు పదిమందికి పైగా ఈ వైరస్ సోకింది. ఈ వైరస్ దోమ కాటు వల్ల వ్యాపిస్తుందట. అందువల్ల సురక్షితంగా ఉండేలా జాగ్రలు తీసుకోవటం ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్కడ పలు చోట్ల ఇలాంటి కేసులు నమోదవ్వడంతో కేరళ హైఅలర్ట్‌లో ఉంది. అసలేంటీ వెస్ట్ నైలు జ్వరం..? ఎందువల్ల వస్తుందంటే..?వెస్ట్ నైలు జ్వరం అంటే..వెస్ట్ నైలు జ్వరం అనేది వెస్ట్ నైల్ వైరస్ (WNV) వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ ఉన్న దోమల కాటు వల్ల వస్తుంది. ముఖ్యంగా క్యూలెక్స్ జాతికి చెందిన జాతులు. ఈ వైరస్ మొట్టమొదట 1937లో ఉగాండాలో గుర్తించారు. ఆ తర్వాత భారతదేశంలో అలప్పుజా జిల్లాలో ఇలాంటి తొలికేసు నమోయ్యింది.లక్షణాలు..కడుపు నొప్పి జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పిఆకలి లేకపోవడంకండరాల నొప్పులువికారం, వాంతులు, అతిసారం, దద్దుర్లువాచిన శోషరస గ్రంథులుఈ లక్షణాలు సాధారణంగా 3 నుంచి 6 రోజుల వరకు లేదా ఒక నెల పాటు ఉండవచ్చు. వ్యాధి తీవ్రమైతే వెస్ట్ నైల్ ఎన్సెఫాలిటిస్ లేదా వెస్ట్ నైల్ మెనింజైటిస్ లక్షణాలు కనిపిస్తాయి. అవి ఎలా ఉంటాయంటే..స్పష్టంగా ఆలోచించే సామర్థ్యంలో గందరగోళం లేదా మార్పుస్పృహ కోల్పోవడం లేదా కోమాకండరాల బలహీనతగట్టి మెడఒక చేయి లేదా కాలు బలహీనతఎవరికి ప్రమాదమంటే..60 ఏళ్లు పైబడిన వ్యక్తులు: వెస్ట్ నైల్ వైరస్ సోకితే 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు తీవ్రమైన లక్షణాలు, సమస్యలు అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ: బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్నవారు లేదా క్యాన్సర్, మధుమేహం, మూత్రపిండాల సమస్యలు లేదా అవయవ మార్పిడి వంటి ఏదైనా వ్యాధితో బాధపడుతున్నవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నివారణ చర్యలుదోమల నియంత్రణ: దోమల వృద్ధి అరికట్టేలా నిలబడి ఉన్న నీటిని తొలగించడం. క్రిమిసంహారక మందులను ఉపయోగించడం వంటి చర్యలను అమలు చేయడం ద్వారా దోమల జనాభాను తగ్గుతుంది ఫలితంగా ఈ సమస్య తీవ్రత తగ్గుముఖం పడుతుంది.వ్యక్తిగత రక్షణ: పొడవాటి చేతుల చొక్కాలు, పొడవాటి ప్యాంటు ధరించడం. DEET లేదా నిమ్మకాయ యూకలిప్టస్ నూనెను కలిగి ఉన్న క్రిమి వికర్షకాలను పూయడం వల్ల దోమలు కుట్టకుండా నిరోధించవచ్చు.బహిరంగ కార్యకలాపాలను నివారించండి: దోమలు ఎక్కువగా ఉండే తెల్లవారుజాము, సంధ్యా సమయంలో బహిరంగ కార్యకలాపాలను తగ్గించడం ద్వారా దోమల కాటు ప్రమాదాన్ని తగ్గించొచ్చు.దోమల నివారిణిని పిచికారీ చేయండి: బయటకు వెళ్లే ముందు దోమల నివారణను పిచికారీ చేయండి లేదా ఓడోమోస్ను పూయండి.తలుపులు, కిటికీలు మూసి ఉంచండి: మీ ఇళ్లలోకి దోమలు రాకుండా తలుపులు, కిటికీలు మూసి ఉంచండి. రాత్రిపూట కుట్టకుండా ఉండటానికి దోమతెరలను ఉపయోగించండి.(చదవండి: మహిళ ముక్కులో వందలకొద్ది పురుగులు!కంగుతిన్న వైద్యులు)
ఇదే మరి మ్యాజిక్ అంటే.. 'జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్'
ఫోటోషాప్ జిమ్మిక్కులు మామూలుగా ఉండవు. టెక్నాలజీమీద పట్టు ఉంటే చాలు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సృష్టించవచ్చు. అలాంటి వారిలో జేమ్స్ అనే ఫోటోషాపర్ది అందె వేసిన చేయి. ఆయన కొంచెం చమత్కారి కూడా. మన ఆర్టిస్టు మోహన్‌లా...ఫోటోషాప్‌లో కనికట్టు చేయడంలో చాలా ఫేమస్.అందుకే జేమ్స్‌కు రోజూ కొన్ని రిక్వెస్ట్‌లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి. మా ఫోటో కొంచెం ఎడిట్ చేసి ఇవ్వొచ్చు కదా అని అడుగుతారు. జేమ్స్ ఇచ్చే ట్విస్ట్‌కి ఎలాంటి వారైనా ఫిదా కావాల్సిందే. ఒరిజనల్ ఫోటో చూసేదాకా అది ఎడిట్ చేసిన ఫోటో అని ఎవరూ గుర్తుపట్టలేనంత. ఆశ్చర్యంగా ఉంది కదా. అయితే మచ్చుకు కొన్ని మీరే చూడండి.Some Hilarious Photoshop Requests that will make your day😂😂A Thread 🧵😂 pic.twitter.com/DpZi3krCrH— ✨🤍 (@Phillipong3) May 7, 2024
న్యూస్ పాడ్‌కాస్ట్
నేడు వేములవాడకు నరేంద్ర మోదీ... రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రి... ఇంకా ఇతర అప్డేట్స్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
భూమి లాక్కున్నట్లు ఒక్క రైతయినా చెప్పాడా అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ సూటి ప్రశ్న.. ఇంకా ఇతర అప్డేట్స్
నాకు బిడ్డలు లేరు, ప్రజల బిడ్డల కోసమే నా తపన.. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం పట్ల ఎన్నికల సంఘం సీరియస్.. తక్షణం దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని సీఐడీకి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
అవ్వాతాతల పెన్షన్లపై చంద్రబాబు పాపిష్టి కళ్లు.. నరసాపురం, క్రోసూరు, కనిగిరి ప్రచార సభల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు పాకిస్తాన్ ఆరాటం.. గుజరాత్ ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది బోగస్ రిపోర్ట్.. జగన్‌ది ప్రోగ్రెస్ రిపోర్ట్... టంగుటూరు, మైదుకూరు, కలికిరి ఎన్నికల సభల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రతిపక్ష నేత చంద్రబాబును నమ్మితే అధోగతే.. చోడవరం, అంబాజీపేట, పొన్నూరు ప్రచార సభల్లో ప్రజలను అప్రమత్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది. ఈడీ కేసులో ఈ నెల 14వ తేదీ వరకు.. సీబీఐ కేసులో ఈ నెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుల్లో ఇంతకు ముందు విధించిన జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో.. అధికారులు కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కస్టడీ పొడిగించాలని ఈడీ తరఫు న్యాయవాది నవీన్‌కుమార్ మట్టా కోరారు.కుంభకోణంలో కవిత పాత్రపై ఒకట్రెండు రోజుల్లో చార్జిషీటు దాఖలు చేస్తామని కోర్టుకు వివరించారు. మరోవైపు సీబీఐ కేసులో న్యాయవాది పంకజ్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. కవితతో సంబంధాలు ఉన్న మరికొందరిని విచారించాల్సి ఉందని, దర్యాప్తు సజావుగా సాగాలంటే జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని కోరారు. ఇక ఈడీ కేసులో కవిత తరఫు న్యాయవాది నితీశ్‌రాణా వాదనలు వినిపిస్తూ.. కుటుంబ సభ్యులు కవితతో 15 నిమిషాలు మాట్లాడటానికి అనుమతించాలని కోరారు. కోర్టు లాకప్‌లో పిటిషనర్ భర్త తీసుకొచ్చిన ఆహారాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. జైలుకు పంపుతున్న ఇంటి భోజనాన్ని కూడా జైలు సూపరింటెండెంట్ ఒక్కరే తనిఖీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. కవితకు ఇంటి భోజనం నిలిపివేశాక కూడా మళ్లీ ఎందుకు అడుగుతున్నారని, దీనిపై జైలు సూపరింటెండెంట్ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తర్వాత కవిత జ్యుడీషి యల్ కస్టడీలను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కవితకు చదువుకోవ డానికి పది పుస్తకా లను అనుమతించాల ని జైలు అధికారులకు సూచించారు. ఈడీ, సీబీఐ కేసులలో ప్రత్యేక కోర్టుకు కవితకు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో.. ఆమె న్యాయవా దులు బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలిసింది.నా అరెస్టు అన్యాయం: కవితఅధికారులు ప్రత్యేక కోర్టు ప్రాంగణంలోకి కవితను తీసుకువచ్చినప్పుడు.. ‘జైతెలంగాణ.. జై భారత్’ అంటూ నినాదాలు చేశారు. కోర్టు హాల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో.. ప్రజ్వల్ రేవణ్ణ వంటి వాళ్లను దేశం దాటించి, తనలాంటి వారిని అరెస్టు చేయడం అన్యాయమని కవిత వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.
బిడ్డను చూడకుండానే కన్నుమూసిన తల్లి
మంచిర్యాలక్రైం: నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి కళ్లనిండా చూసుకోకుండానే కాటికి చేరుకున్న ఘటన సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం బెల్లంపల్లికి చెందిన బొల్లు వెంకటేశ్ భార్య రవళిక (26) సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని నందిని ఆస్పత్రిలో ప్రసవం నిమిత్తం చేరింది. ఆస్పత్రి వైద్యురాలు సాధారణ డెలివరీ చేయడంతో బాబుకు జన్మనిచ్చింది. సదరు మహిళకు అధిక రక్తస్రావం కావడంతో వైద్యురాలు అర్జంటుగా రక్తం కావాలని బాధిత కుటుంబ సభ్యులకు తెలిపింది. వెంకటేశ్ బ్లడ్ బ్యాంకుకు వెళ్లి రక్తం తీసుకు వచ్చే లోగానే వైద్యురాలు నందిని బాధిత కుటుంబ సభ్యులకు చెప్పకుండానే మహిళను సమీపంలోని మెడిలైఫ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవళిక మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యురాలు నందిని, మెడిలైఫ్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే రవళిక మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న సీఐ బన్సీలాల్ సిబ్బందితో కలిసి ఆసుపత్రి వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి నవజీత్ సంధుని పలుమార్లు కత్తితో పొడిచి చంపిన ఘటన విషాదాన్ని నింపింది. ఏడాదిన్నర క్రితం స్టడీ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ మెల్బోర్న్లో ఉంటున్నాడు. ఈ ఘటనపై మెల్బోర్న్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, హర్యానా, కర్నాల్‌లోని గగ్సినా గ్రామానికి చెందిన నవజీత్ స్టడీ వీసాపై ఎంటెక్ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు. కర్నాల్, బస్తాడా గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు కూడా మూడు నెలల క్రితం చదువుకోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. నవజీత్ స్నేహితుడు శ్రవణ్ మరో ఇద్దరితో కలిసి ఒకే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల, శ్రవణ్ అక్కడి నుండి వేరే ప్రాంతానికి మారాలని నిర్ణయించు కున్నాడు. ఈ విషయంలో స్నేహితుల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో నవజీత్ కారులో సామాన్లు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా నిందితులు మళ్లీ శ్రవణ్‌తో గొడవకు దిగారు. వారిని నివారించినందుకు గాను నవజీత్‌పై కత్తితో దాడిచేశారు. ఛాతీపై తీవ్రమైన కత్తిపోటు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో శ్రవణ్ కూడా గాయపడ్డాడు.అయితే గొడవ పడవద్దు అన్నందుకే నవజీత్‌పై దాడి చేశారని బాధితురాలి మేనమామ, ఆర్మీ అధికారి యశ్వీర్ తెలిపారు. నవజీత్ తెలివైన విద్యార్థి అనీ, సెలవుల కోసం జూలైలో ఇండియాకు రావాల్సి ఉందని తెలిపారు. రైతు అయిన అతని తండ్రి, నవజీత్ చదువుకోసం ఒకటిన్నర ఎకరాల భూమిని విక్రయించాడని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఆస్ట్రేలియా నుంచి తమ కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సహకరించాలని మృతుడి కుటుంబం భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.
Karachi Bakery:హోటల్స్, బేకరీల్లో తనిఖీ
హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు హోటల్స్, బేకరీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఎంజేమార్కెట్ చౌరస్తాలోని అంతర్జాతీయ గుర్తింపు పొందిన కరాచీ బేకరీలో గడువు తేదీ ముగిసిన పదార్థాలను గుర్తించారు. ఇందులో రూ.5200 వేల విలువైన బిస్కెట్లు, మిఠాయిలు, చాక్లెట్ కేకులు, రస్క్, బన్నులు ఉన్నాయి. అంతేగాకుండా పలు ఆహార పదార్థాలపై లేబుల్ లేని ఉత్పత్తులను గుర్తించారు. ఫుడ్‌సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో కరాచీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.