May 8th: ఏపీ ఎన్నికల సమాచారం | AP Assembly Elections 2024: Political News Updates In Telugu On May 8th, 2024 | Sakshi
Sakshi News home page

May 8th AP Election News Updates: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌.. ఎప్పటికప్పటి సమాచారం

Published Wed, May 8 2024 6:59 AM

AP Elections 2024: May 8th Politics Latest News Updates Telugu

AP Political And Elections News Updates In Telugu

8:18 PM, May 8th, 2024
షర్మిల, సునీతలకు కడప కోర్టు మరోసారి షాక్

  • ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించరాదన్న కడప కోర్టు జారీ చేసిన అర్డర్‌ను డిస్మిస్ చేయాలంటూ సునీత వేసిన పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు

  • ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సునీత

  • కడప కోర్టులోనే తేల్చుకొవాలన్న హైకోర్టు

  • హైకోర్టు అదేశాల మేరకు విచారణ చేపట్టిన కడప కోర్టు

  • ఇరువురి వాదనలు విన్న కడప కోర్టు

  • సునీత, షర్మిల దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన కడప కోర్టు

  • తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ సునీత, షర్మిలకు రూ.10 వేల జరిమానా

  • జరిమానానుజిల్లా లీగల్ సెల్ కు కట్టాలన్న కడప కోర్టు

2:30 PM, May 8th, 2024
కుప్పంలో బాబు ఓడిపోతున్నాడు: లక్ష్మి పార్వతి 

  • సంఘ విద్రోహులు చంద్రబాబు అండ్ కొ
  • ఎన్టీఆర్ వెన్నుపోటులో పురందేశ్వరి ప్రధాన పాత్ర పోషించింది
  • నేతి బీరకాయలో నెయ్యి లాంటిది పురందేశ్వరి మంచితనం
  • పురందేశ్వరి కూడా చంద్రబాబు లాంటి మనిషి
  • FIRలో వైఎస్సార్‌ పేరును చేర్చిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం ఏమిటి..?
  • వీరందరినీ చంద్రబాబు ఆడిస్తున్నారు
  • రాజకీయ నీచుడు చంద్రబాబు
  • బాబు కంటే సీఎం జగన్ అధిక పెట్టుబడులు తీసుకొచ్చారు
  • ఏపీ అభివృద్ధిలో విశాఖ కీలకం
  • ఏం మాట్లాడాలో అర్ధంకాక బాబు ఇచ్చిన స్క్రిప్ట్ మోడీ చదివాడు
  • సీఎం జగన్‌ను గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు
  • ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలి అంటే సీఎం జగన్ అధికారంలోకి రావాలి
  • నేను రాష్ట్రం మొత్తం తిరిగాను
  • గీతం మూర్తి ఎన్టీఆర్ వెన్నుపోటులో కీలక పాత్ర పోషించిన దుర్మార్గుడు
  • గీతం భరత్‌ను ఓడించాలి
  • గీతం అంటేనే భూ కబ్జాలు
  • ఏయూను నాశనం చెయ్యాలనే ఉద్దేశంతోనే గీతంను అభివృద్ధి చేశారు.

1:50 PM, May 8th, 2024
మోదీకి కుటుంబం లేదన్న వ్యక్తి చంద్రబాబు: జోగి రమేష్‌

  • జోగి రమేష్ కామెంట్స్
  • ఎన్డీఏ కూటమి కొత్త కూటమి ఏమి  కాదు .
  • 2014లో ఇదే కూటమి జతకట్టింది.
  • కలిసి పోటీ చేయడం ఎందుకు.. విడిపోవడం ఎందుకు..
  • పవన్ వలన మేము గెలవలేదని చంద్రబాబు అన్నాడు.
  • మోడీకి కుటుంబం లేదు అన్న వ్యక్తి బాబు.
  • మేనిఫెస్టోలో ఒక్క పథకం కూడా చంద్రబాబు అమలు చేయలేదు.
  • అందుకే గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు..
  • కుట్రలతో ఇప్పుడు కూటమి ఏర్పాటు చేశారు.
  • పొత్తులు ముక్కలవడం ఖాయం .
  • అన్నం పెట్టే జగన్న కు ప్రజలు మద్దతుగా ఉన్నారు
  • రెండు ఓట్లు ఫ్యాన్ కే వేస్తామని ప్రజలు అంటున్నారు.
  • మంచి చేశాడు కాబట్టే ప్రజల గుండెల్లో జగన్ ఉన్నారు

 

1:30 PM, May 8th, 2024
టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి: తానేటి వనిత

  • టీడీపీ నేతల రౌడీయిజంపై చర్యలు తీసుకోవాలి
  • టీడీపీ నేతల దాడులు నశించాలి
  • ప్రజాస్వామ్యం పరిరక్షించాలి
  • నేనున్న ఇంటిపై దాడి చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది?
  • ఎవరు ఎంత రెచ్చగొట్టినా కార్యకర్తలు రెచ్చిపోవద్దు
  • ప్రజల్లో మనం ఉన్నాము సర్వేలు బాగున్నాయి
  • ప్రజలంతా కూడా జగనన్న పరిపాలనకు ముక్తులై.. మనకే ఓటేయాలని ఎదురుచూస్తున్నారు
  • టీడీపీ కార్యకర్తలు రౌడీ రాజకీయాలు, గూండా రాజకీయాలు చేస్తున్నారు
  • భౌతికంగా దాడులు చేసి.. మనం చేసినట్టు లైవ్‌లు పెట్టారు.
  • గోపాలపురం నియోజకవర్గంలో ఒక రెడ్ బుక్ ఉందని అంటున్నారు.
  • ఒక్కసారి కూడా ఎన్నిక కాని వారు గూండా రాజకీయాలు చేస్తున్నారు
  • రాత్రి జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసాము
  • నేనేమీ వారికి ఛాలెంజ్‌లు కూడా చేయలేదు
  • మా నాయకుడు చేసిన మంచే మాట్లాడాను.
  • జగనన్న నాకు హోం మంత్రి పదవి ఇచ్చారు
  • జగనన్న నాకు రాజ్యాధికారం ఇచ్చారు
  • దళితలమైన నాపై దాడులు చేస్తూ కించపరిచేలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు
  • ఈరోజు నాపై దాడి చేశారు అధికారం లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?
  • నోటికి వచ్చిన వాగ్దానాలు ఇస్తున్నారు.
  • చట్టం ఎవరికీ చుట్టం కాదు.
  • ప్రతీ కార్యకర్త ఎలక్షన్‌పై దృష్టి పెట్టాలి.

 

12:30 PM, May 8th, 2024
చంద్రబాబుపై ఎమ్మెల్సీ రుహుల్లా ఫైర్‌

  • మైనార్టీల 4% రిజర్వేషన్ గురించి మోదీతో మాట్లాడే దమ్ము చంద్రబాబుకు ఉందా?.
  • విజయవాడ పర్యటనలో మోదీతో చంద్రబాబు మైనార్టీల గురించి మాట్లాడించాలి.
  • హజ్ యాత్రకు వెళ్లే మైనార్టీలను సీఎం జగన్ ఆర్థికంగా అందుకున్నారు.
  • గుంటూరులో దళితులపై దేశద్రోహి కేసులు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు.
  • రాష్ట్రంలో ఉన్న మైనారిటీలు అందరూ ఈ విషయంపై ఆలోచించాలి.
  • మైనారిటీలను ఓట్ల కోసం వాడుకుంది చంద్రబాబు నాయుడు
  • రాష్ట్రంలో మైనార్టీలు అంటే చంద్రబాబు, బీజేపీకి చిన్న చూపు.
  • సీఎం జగన్ మైనార్టీలకు అభివృద్ది చేశారు
  • మైనార్టీల ద్రోహి చంద్రబాబు నాయుడు
  • మైనార్టీలకు ద్రోహం చేయడానికి చంద్రబాబు మోదీతో జత కట్టారు

 

12:00 PM, May 8th, 2024
పవన్‌పై ముద్రగడ సంచలన కామెంట్స్‌

  • పవన్ కళ్యాణ్ నిఖార్సైన కాపో కాదో లోకానికి తెలియాలి
  • నేను నిఖార్సైన కాపు‌ని.. నా కుటుంబం కూడా స్వచ్చమైన కాపు కుటుంబం
  • పవన్ కుటుంబం స్వచ్చమైన కాపు ఐతే చరిత్ర బయట పెట్టమనండి.
  • మాటి మాటికీ కాపు ముసుగులో ఉండి కాపులకు సాయం చేయ్యరా అని అడుగుతున్నావ్.
  • మా వంగా గీతా కాపు  కాదా?
  • కొందరు దుష్టుల వల్ల నా కూతురు దూరమైపోయింది
  • మళ్ళీ వచ్చే జన్మలోనే కలుసుకుందాం
     

11:30 AM, May 8th, 2024
అభివృద్ధి అంటే జగనే: దేవినేని అవినాష్

  • ప్రతీ గడపలో జగన్  ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు
  • అభివృద్ధి లేదు అంటున్న టీడీపీ నేతలు మూడో డివిజన్‌లో పర్యటించాలి
  • ఐదేళల్లో జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయమని కోరుతున్నాం
  • ఈ డివిజన్ మొత్తం సీసీ రోడ్లు వేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది
  • టీడీపీ ఎమ్మెల్యేకు ఈ ప్రాంతం, నియోజకవర్గ అభివృద్ధిపై చిత్త శుద్ధి లేదు
  • అభివృద్ధి సంక్షేమం చూసి మీ బిడ్డగా ఒక్క అవకాశం ఇవ్వాలి
  • ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఆశీర్వదించండి

 

11:00 AM, May 8th, 2024
ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ కామెంట్స్

  • సీఎం జగన్ ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు.
  • జగనన్న పథకాలపై ఈసీకి ఫిర్యాదుకు చేసి వాటిని ఆపిన దుర్మార్గుడు చంద్రబాబు.
  • చంద్రబాబుకు పేద ప్రజల పట్ల అంత అసూయ ఎందుకు?.
  • ప్రజలను ఇబ్బంది పెట్టడం చంద్రబాబుకు అలవాటే.
  • గతంలో చంద్రబాబు పసుపు కుంకులకు ఎలక్షన్ సమయంలో పర్మిషన్ ఇచ్చారు.
  • ఎలక్షన్ కోడ్ రాకముందు అందించిన సంక్షేమ పథకాలను ఎందుకు ఆపారు.
  • ఎన్నికల కమిషనర్ ఈ విషయాన్ని పున: పరిశీలన చేయాలి.
  • విద్యాదీవెన ఆపిన కారకులు చంద్రబాబు, జనసేన, బీజేపీ
  • దుర్మార్గపు ఆలోచనలకు కేరాఫ్ అడ్రస్ వీరి ముగ్గురే.
  • పేద ప్రజలపై కక్ష సాధింపు చర్యలు వద్దు.
  • సీఎం జగన్ పేద ప్రజలకు కవచంలా అండగా ఉంటారు.

 

10:30 AM, May 8th, 2024
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: మంత్రి పెద్దిరెడ్డి

  • మంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్
  • కుప్పంలో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది
  • ఇందుకే పిచ్చి పట్టినట్లు బాబు మాట్లాడుతున్నారు
  • సీఎం జగన్‌తో పాటు నాపై చంద్రబాబు ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారు
  • వేల కోట్లు నేను సంపాదించానని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు
  • చంద్రబాబు ఆరోపణలకు రుజువులు ఉన్నాయా?.
  • ఈసారి కుప్పంలో చంద్రబాబును ప్రజలు రాజకీయంగా భూస్థాపితం చేయనున్నారు.

 

10:00 AM, May 8th, 2024
చంద్రబాబుపై మాట మార్చిన మోదీ..

  • నాడు చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎం మార్చుకున్నాడని మోదీ వ్యాఖ్యలు

  • నేడు చంద్రబాబుపై మోదీ ప్రశంసలు. 

  • వెన్నుపోటు, పార్టీలు మార్చడం, తిట్టినవారి చంకనెక్కడంలో బాబు నిపుణుడు.

  • మోదీ కూడా చంద్రబాబులాగే మాట్లాడుతున్నాడు. 

  • వచ్చే ఎన్నికల్లో మన ఫ్యాన్‌ గుర్తుకు ఓటువేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించండి. 

 

 

08:45 AM, May 8th, 2024

మోదీ, బాబుకు వడ్డే శోభనాద్ధీశ్వర రావు సవాల్

  • ప్రధాని మోదీ, చంద్రబాబుకి మాజీ మంత్రి వడ్డే శోభనాద్ధీశ్వర రావు సవాల్

  • ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌ని రద్దు చేయించగలరా?

  • ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్ సిఫార్సు చేసింది కేంద్ర ప్రభుత్వమే కదా?.

  • ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌కి అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ మద్దతు పలకలేదా?

  • టీడీపీ లోపల మద్దతు పలుకుతూ, పైకి మాటల గాంభీర్యం ప్రకటించడం కరెక్టేనా?

  • ఈటీవీ, అన్నదాతల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనుకూల కథనాలు ప్రసారం చేయడం వాస్తవం కాదా?

  • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు మోదీని ప్రశ్నించాలి, నిలదీయాలి.

  • మోదీ విజయవాడ పర్యటనలో ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్ రద్దు చేయించే హామీని ఇవ్వగలవా చంద్రబాబు?

     

07:35 AM, May 8th, 2024
టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు: తానేటి వనిత

  • హోంమంత్రి తానేటి వనిత కామెంట్స్‌.. 

  • టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. 

  • మహిళ అని చూడకుండా దాడికి ప్రయత్నించారు. 

  • హోంమంత్రి దాడి చేయడమంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. 

  • మాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు.

 

07:15 AM, May 8th, 2024
తానేటి వనితపై టీడీపీ నేతల దాడి యత్నం..

  • తూర్పుగోదావరిలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌
  • నల్లజర్లలో టీడీపీ కార్యకర్తల బీభత్సం
  • హోంమంత్రి తానేటి వనితపై దాడికి యత్నం. 
  • అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది. 
  • హోంమంత్రిని సురక్షితంగా గదిలో ఉంచిన సెక్యూరిటీ. 
  • వైఎస్సార్‌సీపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు. 
  • వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణుల మూకుమ్మడి దాడి.
  • టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్‌సీపీ నేతలకు తీవ్ర గాయాలు. 
  • టీడీపీ శ్రేణుల దాడిలో వాహనాలు, ఫర్నీచర్‌ ధ్వంసం
  • సీసీ కెమెరాలో రికార్డయిన టీడీపీ నేతల దాడి దృశ్యాలు. 
  • నల్లజర్లలో భారీగా పోలీసుల మోహరింపు. 
     

07:00 AM, May 8th, 2024
గాజువాక  రోడ్‌షోలో సీఎం జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

  • మరో ఆరు రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహా సంగ్రామం జగన్‌కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు, ఇదే చరిత్ర చెప్పే సత్యం

  • ప్రతి రంగంలోనూ అనూహ్యమైన మార్పులు తీసుకురాగలిగాం, బటన్‌ నొక్కుతూ నేరుగా లబ్ధి అందజేశాం

  • గతంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరిగింది
    13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చడమే కాక ప్రజలకు మరింత దగ్గరయిన ప్రభుత్వం మీ బిడ్డది

  • విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా చేయడమే కాక జూన్‌ 4 న మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, తర్వాత పాలన కొనసాగించేది విశాఖ నుంచే..

  • ఈ 59 నెలల్లో మీ బిడ్డ చేసిన అభివృద్ది గమనించండి అని చెబుతున్నా, 
    చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్పాడు మీ బిడ్డ

  • లంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, అన్ని పథకాలు, ఇది కాదా అభివృద్ది

  • ఉద్దానం సమస్యను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ ప్రతి ఏడాది మొదటి స్ధానమే, మీ బిడ్డ పాలనలో ఏకంగా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయి

  • సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ అంటే ఇది కాదా అని అడుగుతున్నా

  • రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కూటమిగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారు

  • నాడు నేడు ద్వారా స్కూల్స్, ఆసుపత్రులు రూపురేఖలు మారుతున్నాయి,

  • ప్రధాని విమర్శలు చూస్తుంటే నాకు ఒకటనిపించింది, మోదీ గారు ఇదే చంద్రబాబు గురించి ఎన్నికల ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి, వెన్నుపోట్లు, అత్యంత అవినీతిపరుడన్న నోటితోనే ఇవాళ
    వారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటమారుస్తున్నారు, రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా*

  • బాబు, దత్తపుత్రుడు, మోదీ గారు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏంటి, ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా, స్టీల్‌ ప్లాంట్‌ ప్రేవేట్‌ పరం చేయమని జట్టు కట్టారా అందరూ ఆలోచించండి

  • మీ జగన్‌ ఆమోదం లేదు కాబట్టే స్టీల్‌ ప్లాంట్‌ ప్రేవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది, జగన్‌ ఒప్పుకోలేదు కాబట్టే అది జరగలేదు, ఈ ఎన్నికల్లో స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్‌కు ఓటేసి దేశానికి ఒక గట్టి మెసేజ్‌ ఇక్కడి నుంచి పంపండి

 

06:50 AM, May 8th, 2024
నేడు ఏపీలో మోదీ ప్రచారం

  • నేడు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం

  • మధ్యాహ్నం ప్రత్యేక విమానం తిరుమలకు మోదీ

  • రాజంపేట లోక్‌సభ పరిధిలో కలికిరిలో ఎన్నికల ప్రచారం

  • సాయంత్రం విజయవాడలో రోడ్‌ షో

 

06:40 AM, May 8th, 2024
అప్పుడూ ఇప్పుడూ 'అంతే'

  • పేదల పొట్ట కొట్టడమే లక్ష్యంగా వికృతరూపం దాల్చిన బాబు పెత్తందారీ పోకడ

  • వారికి లబ్ధి జరిగేది ఏదైనా అడ్డుకోవడమే ఆయన లక్ష్యం

  • అప్పట్లో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంగ్లిష్‌ మీడియం చదువులు అడ్డుకునేందుకు ఎల్లోగ్యాంగ్‌ చేయని ప్రయత్నంలేదు.. 

  • ఇప్పుడు ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకుని ఎప్పటినుంచో కొనసాగుతున్న డీబీటీలకూ అడ్డంకులు

    తొలి నుంచీ పేదలకు మేలు జరగకుండా కోర్టులకు వెళ్లి మరీ అడ్డుకున్న బాబు బ్యాచ్‌

  • తాజాగా కోడ్‌ పేరుతో విద్యా దీవెన, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, మహిళలకు చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలను అడ్డుకున్న పచ్చముఠా.. 

  • ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలపైనా కుట్రలు

  • తెలంగాణలో ఇన్‌పుట్‌ సబ్సిడీకి ఓకే చెప్పిన ఈసీ.. ఏపీలో మాత్రం నో

 

06:30 AM, May 8th, 2024
మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనా

  • ప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదు

  • కొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది

  • పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగింపు

  • కొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగింది

  • ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఇవాళ, రేపు ఓటేసుకోవచ్చు

  • సెక్యూర్టీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల 9వ తేదీన కూడా అవకాశం

  • అలాగే సొంత సెగ్మెంట్లల్లోవి ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చు

  • వచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టం

  • ఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చాం

  • కొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు

  • కొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారు

  • ఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చాం

  • కొందరు వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారు

  • దీనిపై విచారణ చేపడుతున్నాం

  • తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం

  • పోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబులును సస్పెండ్ చేశాం

  • లీడర్లకు సెక్యూర్టీగా ఉన్న సిబ్బంది.. రేపటి ప్రధాని బందోబస్తులో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తున్నాం

  • పల్నాడులో హోలో గ్రామ్ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు

  • పల్నాడు ఎపిసోడ్ పై విచారణ చేపడుతున్నాం

Advertisement
Advertisement