breaking news
YS Jagan Mohan Reddy
-
సోషల్ మీడియాపై రణభేరి!
సామాజిక మాధ్యమాలు వచ్చాక ప్రపంచ పరిణామాలన్నీ వెంటవెంటనే అందరికీ చేరుతున్నాయి. అవి భావవ్యక్తీకరణ విస్తృతిని పెంచి కోట్లాదిమందికి గొంతునిస్తు న్నాయి. ఇన్నాళ్లూ మౌనంగా, నిస్సహాయంగా వీక్షించినవారంతా నిక్కచ్చిగా, నిర్మొహ మాటంగా తమ అభిప్రాయాలు వినిపిస్తున్నారు. కానీ మంచితోపాటే చెడు కూడా ఇందులో కలగలిసివుంది. వాటి కారణంగా అనవసర వదంతులు వ్యాపించి ఎందరో అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మన దేశం వరకే తీసుకుంటే దొంగ లుగా ముద్రపడి కొన్నిచోట్ల, గోవుల్ని తరలిస్తున్నారని ఆరోపణలొచ్చి మరికొన్నిచోట్ల ఉన్మాద గుంపులు దాడులు చేసి హతమార్చిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. టీనేజర్లు, పిల్లల మనసుల్లో ఈ వేదికల దుష్ప్రభావం కూడా నానాటికీ పెరుగుతోంది. మానసిక ఒత్తిళ్లకూ, రుగ్మతలకూ అవి కారణమవుతున్నాయి. అమెరికా అప్పీళ్ల కోర్టులో మెటా, ఆల్ఫాబెట్, స్నాప్‌చాట్, టిక్‌టాక్ తదితర సంస్థలపై సోమవారం 3,000కు పైగా పిటిషన్లు దాఖలు కావటాన్ని ఈ నేపథ్యంలో చూడాలి. ‘పబ్లిక్ న్యూసెన్స్’ కింద దాదాపు 40 రాష్ట్రాలతోపాటు మున్సిపాలిటీలు, పాఠశాలలు, వ్యక్తులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. వాస్తవానికి మొన్న మార్చిలోనే లాస్ ఏంజెలెస్‌కి చెందిన న్యాయస్థానం సామాజిక మాధ్యమ వేదికల్ని యువతకు హానికరమైన రీతిలో రూపొందించటాన్ని తప్పుబట్టింది. చిన్న వయసులో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లు తనను బానిసగా మార్చాయనీ, ఇందువల్ల తీవ్రంగా నష్టపోయాననీ ఆరోపిస్తూ కోర్టుకెక్కిన 20 యేళ్ల యువతికి 60 లక్షల డాలర్ల పరిహారం చెల్లించాలని ఆ న్యాయస్థానం తీర్పునిచ్చింది. న్యూమెక్సికోలో సైతం మెటాపై ఈ తరహా తీర్పే వెలువడింది. వేదికకు సంబంధించిన భద్రత విషయంలో వినియోగదారుల్ని అది తప్పుదోవ పట్టించిందని న్యాయస్థానం నిర్ధారించింది. 37.5 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించాలని సంస్థను ఆదేశించింది. చాన్నాళ్లక్రితమే టీనేజర్లపైనా, పిల్లలపైనా సామాజిక మాధ్యమాల దుష్ప్రభావం ఎలా ఉన్నదో ప్రభుత్వాలు గుర్తించాయి. ఆస్ట్రేలియా పదహారేళ్లలోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల ప్రవేశాన్ని నిషేధించింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకునే బాధ్యతను టెక్ సంస్థలపైనే పెట్టింది. దీన్ని పాటించనట్టయితే దాదాపు 5 కోట్ల ఆస్ట్రేలియా డాలర్లు జరిమానా చెల్లించాలని చట్టం నిర్దేశించింది. బ్రిటన్, ఫ్రాన్స్ సైతం ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. యూరోపియన్ యూనియన్(ఈయూ) హానికర మైన పోస్టుల్ని తొలగించటంలో జాప్యం జరిగితే గ్లోబల్ టర్నోవర్‌లో 6 శాతం మొత్తాన్ని జరిమానా విధించే చట్టం తీసుకొచ్చింది.తెలిసో తెలియకో ఏదైనా వీడియో చూస్తే ఆ వెనువెంటనే అటువంటివే కుప్పలు తెప్పలుగా వచ్చిపడేలా ఆ మాధ్యమాలు అల్గారిథమ్‌లు రూపొందిస్తున్నాయి. తెలిసీ తెలియని వయసులో ఉన్న పిల్లల్ని వ్యామోహాల బారిన పడేస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలొచ్చినప్పుడల్లా ఈ మాధ్యమాలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాము కేవలం ఒక వేదిక మాత్రమే కల్పిస్తున్నామనీ, అందులో వేరెవరో ఉంచే కంటెంట్‌కు తామెలా బాధ్యులమనీ ప్రశ్నిస్తున్నాయి. ఏటా వేలాదికోట్ల డాలర్ల లాభాలు ఆర్జించే ఉద్దేశంతోనే ఈ సంస్థలు జుగుప్సాకర, హింసాత్మక అంశాలున్న వీడియోల్ని చూసీ చూడనట్టు వదిలేస్తున్నాయి. సామాజిక మాధ్యమాలు భావప్రకటనా స్వేచ్ఛకు అనువైనవి. కానీ అవి దుర్వినియోగమైన పక్షంలో కఠినచర్యలుండాలి. మన దేశం ఈ విషయంలో వెనకబడే ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, పాలకుల్ని కించపరిచేవిధంగానో పోస్టులున్నప్పుడే తక్షణ స్పందన కనిపిస్తోంది. తెలంగాణలో ఆన్లైన్ చానెళ్లు నిర్వహిస్తున్న మహిళా పాత్రికేయులపై అత్యంత జుగుప్సాకరంగా పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు లేవు. ఆంధ్రప్రదేశ్‌లో పత్రికల్లో వచ్చిన కథనాలను పోస్టుచేసినందుకే వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల్ని అరెస్టుచేస్తున్న ప్రభుత్వం... ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డినీ, ఇతర నేతలనూ కించపరుస్తూ పోస్టులు పెట్టే టీడీపీ నేతలనూ, కార్యకర్తలనూ చూసీచూడనట్టు వదిలేస్తోంది. అందుకే అమెరికాలో మాదిరి మన దేశంలో కూడా మాధ్యమాల, ప్రభుత్వాల జవాబుదారీతనాన్ని పెంచే చట్టాన్ని తీసుకురావాలి. అప్పుడు మాత్రమే ఇటువంటి పెడధోరణులు ఆగుతాయి. -
YS జగన్ కర్నూల్ పర్యటన షెడ్యూల్ ఇదే... పోలీసులకు మా విజ్ఞప్తి ఏంటంటే..?
-
రేపు MLA,MLCలతో YS జగన్ కీలక భేటీ
-
రేపు వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ శాసనసభా పక్షం రేపు)బుధవారం) భేటీ కానుంది. ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తాజా రాజకీయ పరిణామాలు, డీఎస్సీలో జరిగిన అవతవకలు, అక్రమాలకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణతో పాటు ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. -
బాబుకు YS జగన్ సలహా
-
YSRCP నిరసన ర్యాలీల విజయవంతం పై YS జగన్ హర్షం
-
ఎస్ఐ ప్రవళ్లిక కేసు.. ఘటనా స్థలంలో లేని వ్యక్తిపై కేసు!
శ్రీకాకుళం క్రైమ్ : టీడీపీ నేతల ఒత్తిడితో వైఎస్ జగన్ జిల్లా పర్యటన నాడు ఘటనా స్థలిలో లేని వ్యక్తిపై హత్యాయత్నం, ఇతర నాన్‌బెయిల్‌బుల్ సెక్షన్లు ఆపాదించిన పోలీసులు.. ఇప్పుడు తూచ్ తూచ్ అంటున్నారు. మహిళా ఎస్ఐపై అనుచిత ప్రవర్తన కేసులో వైఎస్సార్సీపీ ఆమదాలవలస ఇన్చార్జి చింతాడ రవికుమార్‌తో పాటు మరో 20 మందిపై అక్రమ కేసులు కట్టి రిమాండ్‌కు పంపిన విషయం విదితమే. వీరిలో ఓ ప్రైవేటు ఉద్యోగి గురుగుబెల్లి తేజేశ్వరరావు పంజాబ్ యూనివర్సిటీలో అదే రోజు తన కుమార్తెతో ఉన్నట్లు ఆధారాలు నిర్ధారణ కావడంతో కేసు నుంచి ఆయనని తొలగిస్తున్నట్లు కోర్టుకు మెమో సమరి్పంచామని డీఎస్పీ వివేకానంద స్పష్టం చేయడం విశేషం. ఇప్పటికే ఈ అక్రమ కేసుకు సంబంధించి జిల్లా పీడీఎం కోర్టు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి హత్యాయత్నం, ఉద్దేశపూర్వకంగా నేరం చేయు సెక్షన్లైన 109, 111 సెక్షన్లు వర్తించవని ఆదివారం రిమాండ్ రిపోర్టులో రాసిన విషయం పాఠకులకు విదితమే. ప్రజల్లో అబాసుపాలు.. టీడీపీ అధిష్టానం, స్థానిక నాయకత్వం ఒత్తిడి మేరకు పోలీసు ఉన్నతాధికారులు తమ పోలీసులతో ఇలాంటి నాన్‌బెయిల్‌బుల్ సెక్షన్లు వేయించడం, అదనంగా కేసులో మరో ఏడుగురిని కేసులో చేర్చడం, రి మాండ్‌కు తరలించే సమయంలో చింతాడ రవిని రెండు చోట్ల హైకోర్టు నిబంధనలు కాలరాసి నడిపించుకుని తీసుకువెళ్లడం వంటి అంశాలతో ప్రజల్లో అబాసుపాలయ్యారు. ఈ కేసులో 14 మంది రిమాండ్‌కు వెళ్లడం తెలిసిందే. మరికొంతమంది మంగళవారం ఆమదాలవలస స్టేషన్లో లొంగిపోతున్నట్లు సమాచారం. మరోసారి అప్పలరాజును కస్టడీ కోరిన పోలీసులు.. అంపోలు జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కాశీబుగ్గ పోలీసులు మరోసారి కస్టడీ విచారణ కోరుతూ సోమవారం పలాస కోర్టులో పిటిషన్ వేసినట్లు సమాచారం. -
కొడుకును కాపాడుకోవడం కోసం చరిత్ర హీనులవుతారా?
సాక్షి, అమరావతి: ‘డీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి. ఈ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.9 వేల కోట్ల బకాయి.. వసతి దీవెన బకాయి వెంటనే చెల్లించాలి. ఇంటింటికీ బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి బకాయిలతో కలిపి చెల్లించాలి. ఇంత స్పష్టంగా విద్యార్థులు, యువత, ప్రజలు చంద్రబాబును డిమాండ్ చేస్తుంటే, వాటిని డైవర్ట్ చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేయడం ఎంత వరకు సమంజసం?’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం చంద్రబాబును నిలదీశారు. ప్రజలు అడుగుతున్న డిమాండ్లను అంగీకరిస్తారా? లేక కొడుకును కాపాడుకోవడం కోసం చరిత్ర హీనులుగా మిగిలిపోతారా? అని ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీల్లో లక్షలాదిగా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజలు పాల్గొన్నారని పేర్కొన్నారు. తప్పు చేసిన ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ, స్ఫూర్తిదాయకంగా నిలిచారని అభినందించారు. విద్యార్థులు, యువకుల కోసం, వారి భవిష్యత్తు కోసం గత రెండు నెలలుగా అన్ని వర్గాల మద్దతుతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన పోరాటాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. 10 కార్యక్రమాలకు విశేష మద్దతు‘చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ఉల్లంఘనకు పూనుకున్నారు. పోలీసు బలంతో అణచి వేయాలని చూశారు. నిర్బంధాలు, బెదిరింపులు, నోటీసులను ఖాతరు చేయకుండా, నియంతృత్వానికి ఎదురొడ్డి.. ప్రజలతో కలిసి, లక్షలాది సంఖ్యలో బయటకు వచ్చి గట్టిగా పోరాటం చేశారు. నిర్బంధాలన్నింటినీ ఎదుర్కొంటూ, ప్రతి అడ్డంకినీ అధిగవిుస్తూ శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాం. గడిచిన 74 రోజుల్లో రాష్ట్ర గవర్నర్‌ను కలవడం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్వహించిన 10 కార్యక్రమాలు.. అశేష ప్రజానీకం మద్దతుతో అత్యంత విజయవంతం అయ్యాయి’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.మే 29 – రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విభాగం నిరసనలు⇒ జూన్ 1 – జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనలు, వినతి పత్రాలు⇒ జూన్ 8, 9 – నియోజకవర్గ స్థాయి టౌన్ హాల్ సమావేశాలు⇒ జూన్ 12 – 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు⇒ జూన్ 18 – రాష్ట్ర గవర్నర్‌ను కలిసి డీఎస్సీపై విచారణ కోరుతూ వినతిపత్రం⇒ జులై 28 – రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజనుల నిరసన ర్యాలీలు⇒ జులై 31 – జిల్లా కలెక్టర్లు జేసీలకు వినతులు⇒ ఆగస్టు 3, 4 – రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్, టౌన్‌హాల్ సమావేశాలు⇒ ఆగస్టు 6, 8 – నియోజకవర్గాల స్థాయిలో రిలే నిరాహార దీక్షలు⇒ ఆగస్టు 10 – రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలుఇంత మంది అడుగుతున్నా నోరు విప్పరా?ఇన్ని కార్యక్రమాల ద్వారా లక్షల మంది ప్రశ్నించినా చంద్రబాబు నోరు మెదపడం లేదని, లోకేశ్ సమాధానం చెప్పడం లేదని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డీఎస్సీ పేపర్ లీకేజీ, అక్రమాలు, ఫీజు రీయింబర్స్మెంట్ (విద్యా దీవెన), వసతి దీవెన కింద దాదాపుగా రూ.9 వేల కోట్ల బకాయిల చెల్లింపు, ఎన్నికల సమయంలో బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టోలో పెట్టి, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరిట హామీలు, నెలా నెలా రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి.. ఇవేవీ లేవు. నిరుద్యోగ భృతి కింద ఏడాదికి రూ.36 వేల చొప్పున మూడేళ్లకు రూ.1.08 లక్షలు ప్రతి నిరుద్యోగికీ బాకీ పడ్డారు. ఈ బాకీ సహా ఏ డిమాండ్‌పైనా ఇప్పటి వరకు చంద్రబాబు నోరు తెరవలేదు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ కూడా ప్రజలు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. విద్యార్థులు, నిరుద్యోగులు, లక్షలాది కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై సీఎంగా చంద్రబాబు, సంబంధిత మంత్రిగా ఆయన కుమారుడు నోరు విప్పక పోవడం దౌర్భాగ్యం. సమాధానాలు చెప్పకుండా ప్రశ్నించే గొంతులను పోలీసులతో అణచి వేయడం పరిష్కారం కాదు. ఇది అధికార జులుంతో తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నమే అవుతుంది. ఉద్యోగం కోసం సంవత్సరాలుగా చదివిన అభ్యర్థులు.. తమ పిల్లల చదువుల కోసం అప్పులు చేసిన కుటుంబాలు, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు.. వీళ్లంతా చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన బాండ్లను చూపిస్తూ నిరుద్యోగ భృతి హామీ కోసం యువత నిలదీస్తోంది. చంద్రబాబు స్పందించకపోతే విద్యార్థులు, నిరుద్యోగులు, విడిచి పెట్టరు. జెన్–జీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పితీరాలి. అంత వరకు పోరాటాలు ఆగవు’ అని వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. -
జానకి రెడ్డి మృతి పట్ల వైఎస్ జగన్ తీవ్ర సంతాపం
సాక్షి,తాడేపల్లి: ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకి రెడ్డి మృతి పట్ల పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.జానకి రెడ్డి హఠాన్మరణం చెందడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆమె కుమార్తె అజితా రెడ్డితో వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. ఈ కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని ఆమెను ఓదార్చారు. జానకి రెడ్డి మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి ఆమె అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. వైఎస్సార్సీపీ కుటుంబం ఎల్లప్పుడూ జానకి రెడ్డి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీల సక్సెస్‌పై వైఎస్ జగన్ హర్షం
తాడేపల్లి : డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన ర్యాలీలు విజయవంతం కావడంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగుల మద్దతుతో ర్యాలీలు సక్సెస్ అయ్యాయని, అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని ప్రశంసించారు. ఇంత జరుగుతున్నా నోరు మెదపని చంద్రబాబు సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్వీట్ చేశారు వైఎస్ జగన్.‘విద్యార్థులు, యువకులు కోసం, వారి భవిష్యత్తుకోసం గడచిన 2 నెలలుగా అన్నివర్గాల మద్దతుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన పోరాటాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. చంద్రబాబూ.. మీరు అధికార దుర్వినియోగం చేస్తూ, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉల్లంఘిస్తూ, పోలీసు బలంతో అణచివేయాలని చూసినా నిర్బంధాలు, బెదిరింపులను లెక్క చేయకుండా, నోటీసులను ఖాతరు చేయకుండా, నియంతృత్వానికి ఎదురొడ్డి, ప్రజలతో కలిసి, లక్షలాది సంఖ్యలో బయటకు వచ్చి గట్టిగా పోరాటం చేశారు.నిర్బంధాలన్నింటినీ ఎదుర్కొంటూ, ప్రతి అడ్డంకినీ అధిగమిస్తూ శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అందుకే ఈ 74 రోజుల్లో గవర్నర్‌ను కలవడం దగ్గరనుంచి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నిర్వహించిన 10 కార్యక్రమాలు అశేష ప్రజానీకం మద్దతుతో అత్యంత విజయవంతగా జరిగాయి’ అని పేర్కొన్నారు.డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ ఏ తేదీల్లో ఏం నిరసన కార్యక్రమ జాబితాను కూడా వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. మే 29, 2026 - రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి విభాగం నిరసనలుజూన్ 1, 2026 - జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనలు, వినతిపత్రాలుజూన్ 8-9, 2026 - నియోజకవర్గ స్థాయి టౌన్ హాల్ సమావేశాలు.జూన్ 12, 2026 - 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలుజూన్ 18, 2026 - రాష్ట్ర గవర్నర్‌ను కలిసి డీఎస్సీపై విచారణ కోరుతూ వినతిపత్రంజులై 28, 2026 - రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, యువజనుల నిరసన ర్యాలీలుజులై 31, 2026 - జిల్లా కలెక్టర్లు/జాయింట్ కలెక్టర్లకు వినతిపత్రాలుఆగస్టు 3-4, 2026 - రాష్ట్రవ్యాప్తంగా రౌండ్‌టేబుల్, టౌన్‌హాల్ సమావేశాలుఆగస్టు 6-8, 2026 - నియోజకవర్గాల స్థాయిలో రిలే నిరాహార దీక్షలుఆగస్టు 10, 2026 - రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలుఇన్ని కార్యక్రమాల ద్వారా లక్షల మంది ప్రశ్నించినా చంద్రబాబు మీరు నోరుమెదపడంలేదు. డీఎస్సీ లీకేజీ, అక్రమాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ ( విద్యాదీవెన), వసతిదీవెన కింద దాదాపుగా రూ.9వేల కోట్లు బకాయిలు, పైగా ఎన్నికల సమయంలో బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టోలో పెట్టి, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరిట నిరుద్యోగ భృతికింద నెలా నెలా రూ.3వేల చొప్పున ఇస్తానన్న సొమ్ము చూస్తే ఈమూడేళ్లకు రూ.36,000X3సంవత్సరాలు = రూ.1,08,000లు చొప్పున ప్రతి నిరుద్యోగికీ పడ్డ బాకీ సహా ఏ డిమాండ్‌పైనా ఇప్పటివరకూ నోరు తెరవలేదు.మీ కుమారుడు లోకేష్‌కూడా ప్రజలు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలేదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. విద్యార్థులు, నిరుద్యోగులు, లక్షలాది కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రిగా మీరు, సంబంధిత మంత్రి అయిన మీ కుమారుడు నోరువిప్పకపోవడం దౌర్భాగ్యకరంగా ఉంది. సమాధానాలు చెప్పకుండా ప్రశ్నించే గొంతులను పోలీసులతో అణచివేయడం పరిష్కారం కాదు చంద్రబాబూ ఇది మీ తప్పులను మీ అధికార జులంతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడమే. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజల డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయి.’ అని పేర్కొన్నారు.ఆ డిమాండ్ల జాబితా ఇదే..1.డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై సీబీఐ విచారణ2.దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా3.రూ.9వేల కోట్ల బకాయి పడ్డ ఫీజురీయింబర్స్‌మెంట్, వసతి దీవెనల చెల్లింపు4.ఇంటింటికీ బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి, బకాయిలతో కలిపి, ఈ మూడేళ్లకాలానికి చెల్లించాలి.ఇంత స్పష్టంగా డిమాండ్లు ఉన్నా, డైవర్ట్ చేస్తూ మీరు తప్పించుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం?, చంద్రబాబూ.. ప్రజలు అడుగుతున్న ఈ డిమాండ్లకు అంగీకరిస్తారా?, లేక కొడుకును కాపాడుకోవడం కోసం చరిత్ర హీనులుగా మిగిలిపోతారా?, ఉద్యోగం కోసం సంవత్సరాలుగా చదివిన అభ్యర్థులు,. తమ పిల్లల చదువుల కోసం అప్పులు చేసిన కుటుంబాలు, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు వీళ్లంతా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన బాండ్లను చూపిస్తూ నిరుద్యోగ భృతి హామీ కోసం యువత ప్రశ్నిస్తోంది. చంద్రబాబూ.. మీరు స్పందించకపోతే విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు మిమ్మల్ని విడిచిపెట్టరు.Gen-Z ప్రశ్నలకు మీరు తప్పక సమాధానాలు చెప్పాలి. అంతవరకూ ఈ పోరాటాలు ఆగవు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.విద్యార్థులు, యువకులు, నిరుద్యోగుల మద్దతుతో రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ వర్గాల్లో ఇవాళ వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీల్లో లక్షలాదిగా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజలు పాల్గొని తప్పుచేసిన ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ, స్ఫూర్తిదాయకంగా నిలిచారు.… pic.twitter.com/7SSXeSc9zO— YS Jagan Mohan Reddy (@ysjagan) August 10, 2026 -
మృతి చెందిన రైతు కుటుంబానికి వైఎస్ జగన్ ఆర్థిక సాయం
ఏలూరు: గుండె పోటుతో మృతిచెందిన పొగాకు రైతు కుటుంబానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్థిక సాయం అందించారు. గత నెలలో బుట్టాయిగూడెం మండలం ముప్పినవారిగూడెంలో పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో మనస్థాపం చెంది గుండెపోటుకు గురై పాల వెంకటేశ్వర్లు అనే రైతు మృతి చెందారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పర్యటనలో మృతి చెందిన రైతు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించి భరోసా ఇచ్చారు. దీనిలో భాగంగా రైతు కుటుంబానికి ఆర్థిక సాయం కింద రూ.2 లక్షల చేక్కును పంపించారు వైఎస్ జగన్. ఈ చెక్కును పోలవరం నియోజవర్గం వైఎస్సార్సీపీ ఇంచార్జ్ తెల్లం బాలరాజు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాధరావుల చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. -
జగన్ హయాంలోనే ఆరోగ్యభాగ్యం ప్రపంచ బ్యాంకు ప్రశంసలు
-
శంకరంబాడి సుందరాచారికి వైఎస్ జగన్ నివాళి
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక గీతమైన "మా తెలుగు తల్లికి మల్లెపూదండ" రచించిన మహాకవి శంకరంబాడి సుందరాచారి జయంతి సందర్బంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతంతో తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటిన రచయిత, మహాకవి అంటూ వైఎస్ జగన్ ప్రశంసించారు. తెలుగు సంస్కృతి వైభవాన్ని అక్షరాల్లో అజరామరం చేసిన మహాకవి శంకరబాడి సుందరాచారి అని, తెలుగు నేల గొప్పతనాన్ని, తెలుగు తల్లి కీర్తిని తన కలంతో తరతరాలకు చాటి చెప్పారన్నారు. శంకరంబాడి సుందరాచారి సాహితీ సేవలు చిరస్మరణీయమన్నారు. ``మా తెలుగు తల్లికి మల్లెపూదండ`` గీతంతో తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, సంస్కృతి వైభవాన్ని అక్షరాల్లో అజరామరం చేసిన మహాకవి శంకరంబాడి సుందరాచారి గారు. తెలుగు నేల గొప్పతనాన్ని, తెలుగు తల్లి కీర్తిని తన కలంతో తరతరాలకు చాటిచెప్పిన ఆయన సాహితీ సేవలు చిరస్మరణీయం. శంకరంబాడి సుందరాచారి గారి… pic.twitter.com/zKzBsJneq6— YS Jagan Mohan Reddy (@ysjagan) August 10, 2026 -
రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతిపై వైఎస్ జగన్ స్ట్రాంగ్ రియాక్షన్
-
ఈనెల 13న కర్నూలుకు మాజీ సీఎం వైఎస్ జగన్
కర్నూలు (టౌన్): మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 13వ తేదీన కర్నూలుకు రానున్నట్లు ఎమ్మెల్సీ, పార్టీ ప్రోగ్రామ్ కో–ఆర్డీనేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. ఆదివారం కర్నూలులో తలశిల మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం తాడేపల్లి నుంచి కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారని పేర్కొన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సబ్‌జైలుకు వెళ్లి విరూపాక్షిని పరామర్శిస్తారని వెల్లడించారు. -
ప్రపంచ బ్యాంకు తేల్చిన నిజం.. వైఎస్ జగన్ హయాంలోనే 'ఆరోగ్య భాగ్యం'
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రాథమిక స్థాయి నుంచి సమూలంగా సంస్కరించారని ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రశంసించింది. విలేజ్ క్లినిక్స్, పట్టణ క్లినిక్స్‌తో పాటు తొలిసారిగా వినూత్న రీతిలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేయడం గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు ఎంతో మేలు చేసిందని విశ్లేషించింది. టెలి మెడిసిన్ ద్వారా గత ప్రభుత్వంలో ప్రజలకు భారీ ఎత్తున సేవలు అందాయని తెలిపింది. ఇక వైద్య ఆరోగ్య వ్యవస్థలో జీరో వేకెన్సీ విధానాన్ని అమలు చేస్తూ రెండేళ్లలోనే సుమారు 50,000 మంది వైద్య సిబ్బందిని నియమించారని పేర్కొంది. రాష్ట్ర ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలందించడంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ది ప్రభుత్వ రంగం బాట అయితే సీఎం చంద్రబాబుది ప్రైవేట్ రంగం బాట అని ప్రపంచ బ్యాంకు నివేదిక కుండబద్దలు కొట్టింది. వైద్య కళాశాలలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లాంటి వాటిని నడపడం కోసం చంద్రబాబు సర్కారు ప్రైవేట్ రంగం, అవుట్ సోర్సింగ్‌పై ఆధారపడటం ప్రారంభించిందని ప్రపంచ బ్యాంకు నివేదికలో స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ బలోపేతం ప్రాజెక్టును అమలు చేసింది. ఆ ప్రాజెక్టు అమలు ఫలితాల నివేదికను ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసింది. వైద్య ఆరోగ్య రంగంలో సేవలపై వైఎస్ జగన్ విధానాలు, చంద్రబాబు సర్కారు పోకడలపై ఈ నివేదికలో ప్రపంచ బ్యాంకు పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించింది. ఆ వివరాలివీ...⇒ ప్రపంచ బ్యాంకు నుంచి ప్రాజెక్టు ఆమోదం పొందిన వెంటనే వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రైవేట్ రంగ కాంట్రాక్టులపై ఆధారపడకుండా ప్రభుత్వ రంగంలో వైద్య సేవల నాణ్యత మెరుగుదల, ఆరోగ్య సేవలను విస్తరించడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ప్రాజెక్టు లక్ష్యాలను సాధించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం నిబద్ధత, అంకిత భావంతో పనిచేసింది. ముఖ్యమంత్రి క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించడంతో పాటు అగ్ర రాజకీయ నాయకత్వం ప్రాజెక్టుకు స్పష్టమైన ప్రాధాన్యత ఇచ్చింది. నిరంతర పర్యవేక్షణ, క్రమం తప్పకుండా సమీక్షలు ఫలితాల సాధనకు దోహదం చేశాయి. తద్వారా ప్రభుత్వ రంగంలోనే మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యాన్ని సాధించింది.⇒ వైద్య ఆరోగ్య రంగంలో దీర్ఘకాలంగా అనుసరిస్తున్న మూస విధానాలను పక్కనపెట్టి మాజీ సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఉదాహరణకు మెరుగైన ఆరోగ్య సేవలు, నాణ్యత అనే లక్ష్యాలను సాకారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ‘సున్నా ఖాళీల విధానం’ (జీరో వేకెన్సీ) పాలసీని అమలు చేశారు. సిబ్బంది నియామకాలను హేతుబద్ధీకరించారు. అడ్డంకులను తొలగించి భారీ నియామక కార్యక్రమాన్ని చేపట్టారు. వైద్య ఆరోగ్య సిబ్బందికి ప్రోత్సాహకాలు, పదోన్నతులు కల్పించారు. మారుమూల ప్రాంతాలలో పని చేసినందుకు అదనపు వేతనాన్ని అందచేశారు. అరుదైన నైపుణ్యాలు కలిగిన వైద్య నిపుణులను ఆకర్షించేందుకు సాధారణం కంటే ఎక్కువ వేతనాలు ప్రకటించి ప్రజారోగ్యం పట్ల నిబద్ధత చాటుకున్నారు.⇒ ‘జీరో వేకెన్సీ’ విధానంలో భాగంగా వేగంగా నియామకాలు చేపట్టేందుకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేశారు. జీతభత్యాలు, ప్రోత్సాహకాలను సవరించారు. పీజీ వైద్య విద్యార్థులందరికీ తప్పనిసరి గ్రామీణ సేవను ప్రవేశపెట్టారు. అన్ని పీహెచ్‌సీలు, వీహెచ్సీ (విలేజ్ హెల్త్ క్లినిక్)లలో తగినంత మంది సిబ్బందిని నియమించారు. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు, 12 మంది పారామెడికల్ సిబ్బంది... ప్రతి వీహెచ్సీలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంతో పాటు ఆశాలు సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు. రెండేళ్లలోనే సుమారు 50,000 మంది వైద్య ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించారు.⇒ ప్రజలు దూర ప్రాంతాల నుంచి వైద్య నిపుణులను సంప్రదించేందుకు టెలిమెడిసిన్ వేదికను ప్రారంభించారు. ఇది ముఖ్యంగా గ్రామీణ, గిరిజన జనాభాకు ప్రయోజనం చేకూర్చింది. రోజూ 75,000కిపైగా టెలికన్సల్టేషన్లు, ప్రిస్క్రిప్షన్లు అందచేశారు. దేశవ్యాప్తంగా జాతీయ టెలికన్సల్టేషన్లలో దాదాపు మూడింట ఒక వంతు ఆంధ్రప్రదేశ్‌లోనే నమోదయ్యాయి.⇒ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచి ఆరోగ్య రంగం మౌలిక సదుపాయాల బలోపేతం, పునర్నిర్మాణం చేపట్టింది. ప్రతి పీహెచ్‌సీని 12–13 వీహెచ్సీలకు మ్యాప్ చేశారు. ప్రతి వీహెచ్సీ పరిధిలో 2,500–4,500 మంది జనాభాకు సేవలందాయి (గిరిజన ప్రాంతాలలో స్థానిక అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేశారు). 4,345 కొత్త వీహెచ్సీలు, 88 కొత్త పీహెచ్‌సీలు ఏర్పాటు చేశారు. 977 గ్రామీణ, 184 పట్టణ పీహెచ్‌సీలను పునరుద్ధరించారు. హెల్త్ వెల్నెస్ సెంటర్లు రెట్టింపు చేయడం ద్వారా 10,086కు చేరాయి. అధిక రక్తపోటు, మధుమేహం, సాధారణ క్యాన్సర్ల కోసం స్క్రీనింగ్, తల్లి, శిశు ఆరోగ్య సంరక్షణ, కుటుంబ నియంత్రణ, నోటి ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, అత్యవసర ప్రసూతి సంరక్షణతో కూడిన విస్తరించిన సేవలను అందించడానికి అవసరమైన పరికరాలు, సిబ్బందిని సమకూర్చారు.⇒ 2022–23లో నిర్వహించిన ఎన్సీడీ–2 సర్వే ద్వారా రాష్ట్ర జనాభాలో సుమారు 80 శాతం మందికి స్క్రీనింగ్ నిర్వహించి ప్రత్యేకంగా ఆరోగ్య గుర్తింపు కార్డు కేటాయించారు. ⇒ అత్యవసర మందుల జాబితాలోని 105 ఔషధాలు, 14 ప్రాథమిక రోగ నిర్ధారణ పరీక్షల సామర్థ్యంతో మొబైల్ మెడికల్ యూనిట్లను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించారు. ప్రతి జిల్లాలో ఒక రిజర్వ్ మొబైల్ మెడికల్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. అవసరమైనప్పుడు విధులు నిర్వర్తించడానికి నలుగురు అదనపు వైద్యులను కేటాయించారు. వైద్యుడితో పాటు ప్రతి యూనిట్లో డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉండేలా చర్యలు తీసుకున్నారు.⇒ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్‌ను అధికారికంగా 2023 ఏప్రిల్‌లో ప్రారంభించారు (2022 అక్టోబర్‌లో పైలట్ దశ తర్వాత). ఈ కార్యక్రమం కింద మొబైల్ మెడికల్ యూనిట్‌తో సహా డాక్టర్ ప్రతి నెలా రెండు సార్లు విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను సందర్శించారు. క్రమబద్ధమైన షెడ్యూల్‌తో వైద్యులను ఇంటి వద్దకే పంపించారు. ⇒ అన్ని ఆరోగ్య కేంద్రాలలో టెలికమ్యూనికేషన్ కనెక్టివిటీ, డిజిటల్ పరికరాలు ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది అందరికీ కొత్త డిజిటల్, వైద్య సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంలో శిక్షణ ఇచ్చారు. సెంట్రల్ డిజిటల్ క్వాలిటీ డాష్‌బోర్డ్ ద్వారా ఎప్పటికప్పుడు పనితీరు సూచికలను విశ్లేషించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు.కోవిడ్‌లో కాపాడారు..!⇒ కోవిడ్ సమయంలో 10,000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, ఇన్ఫెక్షన్ నివారణ సామగ్రితో సహా కీలకమైన వైద్య సామగ్రిని అందుబాటులో ఉంచారు. జిల్లా, బోధనాస్పత్రులలో ప్రత్యేకంగా కోవిడ్ వార్డులు, ఆక్సిజన్‌తో కూడిన పడకలు, క్రిటికల్ కేర్ యూనిట్లను సిద్ధం చేశారు. 100కు పైగా ప్రయోగశాలలకు కోవిడ్ పరీక్షా సామర్థ్యాన్ని కల్పించారు. మారుమూల ప్రాంతాలకు మొబైల్ పరీక్షా యూనిట్లను పంపించారు. గ్రామీణ, అణగారిన వర్గాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని చికిత్స, వ్యాక్సినేషన్ సకాలంలో అందించి ప్రజల ప్రాణాలను కాపాడారు. -
వ్యవస్థలు నిర్వీర్యం.. ప్రియాంక కేసే నిదర్శనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం ఏ స్థాయిలో నిర్వీర్యమైపోయాయో రాజమండ్రిలో మెడికల్ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి ఘటన మరోసారి రుజువు చేసిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ ఘటనపై ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. ఆగస్టు 3వ తేదీ రాత్రి ఓ షాపింగ్‌మాల్ గేటు బయట ఘటన జరిగినా, నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసినా పోలీసులు వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించి, ఘటన తీవ్రతకు అనుగుణంగా కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించారని జగన్ పేర్కొన్నారు. కానీ, ఘటనను సాధారణ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి, నిందితులను కూడా వదిలేసి చేతులు దులుపుకోవడం అత్యంత దారుణమన్నారు. నిందితులు డాక్టర్ ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటర్‌ను కారుతో ఢీకొట్టడమే కాకుండా, ఆ తర్వాత కూడా అమానవీయంగా ప్రవర్తించారని జగన్ ఆరోపించారు. బాధితురాలి మీదుగా కారు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పోలీసు యంత్రాంగం ఎందుకు ఇంత అలసత్వంగా వ్యవహరించిందో తేల్చేందుకు పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.సామాన్యుల కేసుల్లో చట్టం ఎందుకు పనిచేయదు?ప్రతిపక్ష నేతలపైనా, ప్రశ్నించేవారిపైనా, ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపేవారిపైనా ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రభుత్వం.. సామాన్యులకు సంబంధించిన కేసుల్లో మాత్రం చట్టప్రకారం వ్యవహరించడంలో ఘోరంగా విఫలమవుతోందని జగన్ విమర్శించారు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపిస్తూ తప్పుడు కేసులు పెట్టడం, రాజకీయ వేధింపులు, కక్షసాధింపుల కోసం పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోవడం కూడా రాష్ట్రంలో వ్యవస్థల పతనానికి కారణమని ఆరోపించారు.తల్లిదండ్రుల ఆవేదనకు ప్రభుత్వం సమాధానం చెప్పాలిఎన్నో త్యాగాలు, కష్టాలను ఎదుర్కొని కుమార్తెను డాక్టర్‌గా తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు.. ఆమె ఎండీ చదువులు పూర్తి చేసి పదిమందికి వైద్య సేవలందించే స్థాయికి ఎదుగుతున్న సమయంలోనే తీవ్ర విషాదం ఎదురుకావడం అత్యంత బాధాకరమని జగన్ పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో భగవంతుడు ప్రియాంక కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాక్టర్ ప్రియాంక తండ్రి ఆవేదనకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తప్పకుండా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పౌరులందరినీ సమానంగా చూడాల్సిన వ్యవస్థల్లో రాజకీయ కక్షసాధింపులు, పక్షపాతం, ‘మీది ఏ పార్టీ?’ అనే ధోరణులను తీసుకురావడం వల్లే వ్యవస్థల పునాదులు కదిలిపోయే పరిస్థితి ఏర్పడిందని జగన్ విమర్శించారు. ఈ విషయాన్ని చంద్రబాబు ఇప్పటికైనా గుర్తించాలని అన్నారు. మద్యం, గంజాయికి బ్రాండ్ అంబాసిడర్‌గా చంద్రబాబు తీరు..వీధికి రెండు బెల్టుషాపులు, ప్రతి కిలోమీటర్‌కు మద్యం దుకాణాలు, ప్రతి వీధి చివర బార్ అండ్ రెస్టారెంట్లతో మద్యం, గంజాయికి బ్రాండ్ అంబాసిడర్‌గా చంద్రబాబు తీరు ఉందని జగన్ మండిపడ్డారు. గుడి, బడి, బీచ్ అనే తేడా లేకుండా మద్యం అందుబాటును పెంచడం వల్లే ఇలాంటి ఘటనలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోందని విమర్శించారు. డాక్టర్ ప్రియాంక కేసులో వ్యవస్థల వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా, వాటికి సమాధానం చెప్పలేక ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం నిమిషాల వ్యవధిలో ఆ కంటెంట్‌ను తొలగిస్తోందని జగన్ ఆరోపించారు. -
ప్రజల తరపున పోరాడుతుంటే ఎందుకు ఈ నిర్లక్ష్యం..?
-
గిరిజనులకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
-
ఆదివాసీలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ఆదివాసీలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రకృతిని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తూ.. తరతరాలుగా తమ విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలను వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్న నా గిరిజన సోదర సోదరీమణులందరికీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ప్రకృతిని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తూ, తరతరాలుగా తమ విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలను వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్న నా గిరిజన సోదర సోదరీమణులందరికీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) August 9, 2026 -
నీ కంటే అడుక్కున్నవాడు నయం..! బాబు,లోకేష్ ని ఏకిపారేసిన లక్ష్మీ పార్వతి
-
TDP ఫేక్ ట్రోల్స్ పై జగన్ ఫ్యాన్ మాస్ కౌంటర్
-
జగనన్న అంటే పిచ్చి అందుకే ఆ రోజు కారు ఎక్కి
-
మీ కుమారుడిని కాపాడుకోవడానికి హింసను ప్రేరేపిస్తారా?... ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
బాబుకు బిగ్ షాక్.. స్టేట్ మొత్తం జగన్ వైపే.. 2029 దద్దరిల్లిపోద్ది
-
హెరిటేజ్ కోసం ‘విజయ’కు ఎసరు!
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బరితెగింపు పరాకాష్టకు చేరింది. ప్రభుత్వ పెద్దల కన్ను పడితే చాలు ఎందాకైనా సై అంటూ రెచ్చిపోతున్న తీరు హద్దులు దాటింది. తమ స్వార్థం కోసం రూ.1200 కోట్ల టర్నోవర్, వందల కోట్ల ఆస్తులున్న విజయ డెయిరీ (కృష్ణా మిల్క్ యూనియన్)ని నిర్వీర్యం చేసే కుతంత్రానికి తెర లేపింది. ఈ క్రమంలో టీడీపీకే చెందిన విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు ను తీవ్రంగా బెదిరించి.. ఆస్పత్రి పాలయ్యేలా చేసి.. ఆస్పత్రి బెడ్‌పై చికిత్స పొందుతుండగానే ఆయనతో బలవంతంగా రాజీనామా లేఖ రాయించుకుని తీసుకెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో, టీడీపీ శ్రేణుల్లోనూ కలకలం రేపింది. చలసాని డెయిరీ చైర్మన్ పదవికి నామినేషన్ వేయకూడదంటూ కొద్ది రోజులుగా ప్రభుత్వ పెద్దలు మంత్రుల ద్వారా ఆయనపై ఒత్తిడి తెచ్చారు. అయితే అత్యధిక శాతం డైరెక్టర్లు చలసానికి మద్దతు ఇవ్వడంతో గురువారం చలసాని ఆంజనేయులు మరోసారి విజయ డెయిరీ (కృష్ణా మిల్క్ యూనియన్) చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారనే విషయం తెలుసుకుని ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారధి చలసాని వద్దకు వెళ్లారు. విజయ డెయిరీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే కేబినెట్ నుంచి అక్కడికి చేరుకుని మంత్రాంగం నడిపారు. ఆయన్ను నామినేషన్ వేయనీయకుండా అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే మెజార్టీ డైరెక్టర్లు ఆయన్ను చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో చంద్రబాబు, లోకేశ్ సూచనల మేరకు పక్కకు తప్పుకోవాలని మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి చిట్టి నగర్‌లోని డెయిరీ యూనిట్‌కు వెళ్లి మరీ ఆయన్ను బెదిరించారు. ఒకరోజు సమయం ఇస్తే అధిష్టానం చెప్పినట్లు చేస్తానని చెప్పినా, మంత్రులు ఒప్పుకోకుండా రాజీనామా చేయాల్సిందేనని పట్టుపట్టారు. తెల్ల పేపర్ ఆయన ఎదుట పెట్టి.. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాసి సంతకం చేయాలని తీవ్రంగా ఒత్తిడి చేశారు. దీంతో చలసాని అస్వస్థతకు గురవ్వగా కుటుంబ సభ్యులు ఆయన్ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యం కొనసాగుతున్నా రాజీనామాకు పట్టువైద్యం కొనసాగుతున్నప్పటికీ సదరు అమాత్యులు ఆయన్ను వదల్లేదు. వీరిద్దరూ కాకుండా.. గట్టిగా నోరేసుకుని విరుచుకుపడే మరో అమాత్యుడు ఏకంగా ఆ ఆస్పత్రి యాజమాన్యానికే ఫోన్ చేసి.. చలసానిని వెంటనే డిశ్చార్జ్ చేయాలని ఆదేశించినట్లు చర్చ జరుగుతోంది. అయితే మానవతా దృక్పథంతో ఆ ఆస్పత్రి వైద్యం కొనసాగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రి పార్థసారధి శుక్రవారం ఆ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రి బెడ్‌పై స్టెంట్ వేయించుకోవాల్సిన స్థితిలో ఉన్నా, మానవత్వాన్ని కూడా మరిచి రాజీనామా లేఖపై సంతకం చేయించి బలవంతంగా తీసుకున్నారు. ఆ లేఖ తీసుకుంటున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కాగా, ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. మంత్రి కొల్లు ఇంట్లో డైరెక్టర్ల నిర్బంధం మరోవైపు శుక్రవారం విజయ డెయిరీ డైరెక్టర్లందరినీ మంత్రి కొల్లు రవీంద్ర చర్చల కోసం తన ఇంటికి పిలిపించి నిర్బంధించారు. చలసానికి వారు మద్దతు పలుకుతుండడంతో రాత్రి వరకు అక్కడే ఉంచారు. తాము ఏకగ్రీవంగా ఎన్నుకున్న వ్యక్తిపై అవిశ్వాసం ఎలా పెడతామని డైరెక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈలోపు చలసాని ఆంజనేయుల్ని బెదిరించారు. డెయిరీ వ్యవహారాలపై విచారణ జరిపించి కేసులు పెడతామని, రాజకీయ భవితవ్యం లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా వదలకుండా రాజీనామాకు ఒప్పించాలని ఒత్తిడి చేశారు. ఆయన కుమార్తెను ఇబ్బంది పెట్టినట్లు తెలిసింది. మరోవైపు అమెరికాలో ఉన్న ఆయన కుమారుడికి ఫోన్ చేసి రాజీనామా చేయకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయని మంత్రులు హెచ్చరించారు. అధిష్టానం ఆదేశించిందట..ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా అధిష్టానం ఆదేశించింది రాజీనామా చేయాలని చలసానిపై ఒత్తిడి తేవడం ఎంతవరకు సమంజసం? బోర్డు మొత్తం చలసాని ఆంజనేయుల్ని ఎన్నుకుంది. మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్ధసారధి బోర్డు సభ్యులను పిలిచి ఆంజనేయుల్ని రాజీనామా చేయాలని ఒత్తిడి చేయాలని చెప్పారు. లేనిపక్షంలో అవిశ్వాసం పెట్టండని అడిగారు. నిబంధనలకు అనుగుణంగా ఎన్నికైన వారిని అదే రోజు రాజీనామా చేయమనడం, అనారోగ్యంతో ఉన్నా వేధించడం మంచి పద్దతి కాదు. – వేమూరి సాయి, డైరెక్టర్హెరిటేజ్ కోసమే!» విజయ డెయిరీ (కృష్ణా మిల్క్ యూనియన్) 1.50 లక్షల కుటుంబాల సంస్థ. ఒక్క విజయవాడలోనే 2.60 లక్షల లీటర్లు, రాష్ట్రమంతా కలిసి 4.60 లక్షల లీటర్ల పాలను ప్రతి రోజూ వినియోగదారులకు అందిస్తోంది. » పాలు, నెయ్యి, పెరుగుతో పాటు దాదాపు 84 రకాల పాల ఉత్పత్తులను తయారు చేస్తోంది. » బాపులపాడు మండలం వీరవల్లిలో ఇటీవల తన రెండవ యూనిట్‌ను ప్రారంభించింది. ఈ కొత్త యూనిట్ ప్రతిరోజూ సుమారు 3 లక్షల లీటర్ల పాలు, లక్ష లీటర్ల పెరుగు ఉత్పత్తి చేస్తోంది. రైతుల నుంచి ప్రతి రోజూ 10 లక్షల లీటర్ల పాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.» ఇది సాకారమైతే విజయవాడ, కృష్ణా జిల్లాల్లో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డైయిరీకి ఆదరణ పూర్తిగా తగ్గిపోతుంది. మరోవైపు మ్యాక్స్ చట్టంలోకి మారిన విజయ డైయిరీ విస్తరణ దిశగా ముందుకు పోతుంది. ఇది జరగకూడదనే చలసానిని బలవంతంగా చైర్మన్ పదవి నుంచి తప్పించారని స్పష్టమవుతోంది. » ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు తన హెరిటేజ్ డెయిరీ ప్రయోజనాల కోసం చంద్రబాబు చిత్తూరు డెయిరీని పక్కా ప్రణాళికతో నిర్వీర్యం చేసిన చరిత్ర గుర్తుకు తెస్తోందని రైతులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. » దీంతో పాటు విజయ డెయిరీకి ఉన్న రూ.వందల కోట్ల ఆస్తులతో పాటు.. గన్నవరం వద్ద ఉన్న 24 ఎకరాల భూమిపై పెద్దల కన్ను పడిందని తెలుస్తోంది. » ప్రభుత్వం తీరు సరికాదని విజయ డైరెక్టర్లు విమర్శిస్తున్నారు. బుడమేరు వరద సమయంలో ఏమాత్రం పట్టించుకోలేదని, అసలు సహకార రంగంలో ఉన్న డైయిరీ విషయంలో ఈ బెదిరింపులు ఏమిటని వారు నిలదీస్తున్నారు. » ఆరు దశాబ్దాలుగా లక్షలాది మంది రైతుల భాగస్వామ్యంతో అభివృద్ధి చెందిన విజయ (కృష్ణా మిల్క్ యూనియన్) డెయిరీని హెరిటేజ్ కోసం బలిచేసే లక్ష్యంతో ప్రభుత్వ పెద్దలే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఏపీ రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వీ.కృష్ణయ్య, కే.ప్రభాకర రెడ్డిలు తప్పుపట్టారు. -
రాజకీయ ఈర్ష్యతో ‘దిశ’ రద్దు దురదృష్టకరం
సాక్షి, అమరావతి: మహిళల భద్రతలో దేశానికే దిశా నిర్దేశం చేసిన ‘దిశ’ను ఉపసంహరించుకుంటూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు ఒక చీకటి రోజుగా అభివర్ణించారు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర్ష్య తో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు. మంత్రివర్గం తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ‘దిశ’ను నిర్వీర్యం చేయడం కాదు.. మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వానికి హితవు పలుకుతూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శుక్రవారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మహిళలు, చిన్నారులకు రక్షణ వ్యవస్థగా నిలిచిన ‘దిశ’‘దిశ’ను ఉపసంహరించుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, చిన్నారులకు ఒక చీకటి రోజు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర‡్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరం. మహిళలు, చిన్నారులపై నేరాలు, దర్యాప్తులో జాప్యం, న్యాయ ప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలకు పరిష్కారంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘దిశ’ను తీసుకొచ్చింది.నేరం జరగకుండా నిరోధించడం నుంచి, నేరం జరిగితే వెంటనే స్పందించడం, బాధితులకు రక్షణ, వేగంగా దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, చార్జిషీటు, ప్రత్యేక కోర్టుల ద్వారా సత్వర న్యాయం వరకు ఒక సమగ్ర వ్యవస్థను నిర్మించాం. మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు ఫోన్లో ఎస్‌వోఎస్ బటన్ నొక్కినా, ఫోన్‌ను ఐదు సార్లు షేక్ చేసినా నిమిషాల వ్యవధిలో పోలీసులు స్పందించే వ్యవస్థ తీసుకొచ్చాం. 1.51 కోట్ల మంది ‘దిశ’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ‘దిశ’ ద్వారా వచ్చిన 31,607 అత్యవసర కాల్స్‌ను అప్పట్లో మా ప్రభుత్వంలో పోలీసులు పరిష్కరించారు. 18 ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసును అందుబాటులోకి తీసుకొచ్చి 13,500 మందితో క్షేత్ర స్థాయి భద్రత, రిపోర్టింగ్ వ్యవస్థను నిర్మించాం. 900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలతో ప్రత్యేక పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం. నేరస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే అవకాశం లేకుండా ఈ కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలకు ప్రాధాన్యం ఇస్తూ ఆరు నగరాల్లో ఫోరెన్సిక్ వ్యవస్థను బలోపేతం చేశాం. సత్వర విచారణ కోసం 13 ప్రత్యేక పోక్సో కోర్టులు, 12 మహిళా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశాం. 2,17,467 మంది లైంగిక నేరస్తుల వివరాలతో ప్రత్యేక డేటా బేస్‌ను రూపొందించాం. అందుకనే ‘దిశ’ విజయవంతంగా మహిళలకు, చిన్నారులకు గొప్ప భద్రతా సేవలను అందించింది. నిందితుడికి శిక్షపడే వరకూ రక్షణ నెట్వర్క్ 2017లో మహిళలపై నేరాల దర్యాప్తుకు సగటున 156 రోజులు పట్టగా, 2022 నాటికి అది 28 రోజులకు తగ్గించగలిగారు. 164 అత్యాచారం కేసులు, 378 లైంగిక నేరాల కేసుల్లో కేవలం 7 రోజుల్లోనే ఛార్జిషీట్లు దాఖలు చేశారు. తీవ్రమైన కేసుల్లో 51 శాతానికిపైగా నిందితులను 48 గంటల్లోపు అరెస్టు చేశారు. గతంలో డీఎన్ఏ నివేదికలకు నెలలు పట్టేది. ‘దిశ’ ఫోరెన్సిక్ వ్యవస్థతో వాటిని రోజుల్లోనే అందించే పరిస్థితి తీసుకొచ్చాం. 214 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. మే 2024 నాటికి మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయి. వార్షిక సగటు కేసులు 14,338 నుంచి 10,426కు తగ్గాయి. ఇదీ ‘దిశ’ ఇచ్చిన భరోసా.. ఇవీ ‘దిశ’ సాధించిన ఫలితాలు. అందుకే 19 జాతీయ అవార్డులను మా ప్రభుత్వ హయాంలో ‘దిశ’ గెలుచుకుంది. ‘దిశ’ అనేది కాగితాల మీదున్న పేరు కాదు. ప్రమాదంలో ఉన్న మహిళ ఎస్‌వోఎస్ నొక్కిన క్షణం నుంచి, నిందితుడికి శిక్ష పడే వరకు ఆమెకు అండగా ఉండే సజీవమైన మహిళా రక్షణ నెట్వర్క్.నేరస్తుల్లో చట్టంపై భయం తగ్గిస్తోంది ‘దిశ’ను ఉపసంహరించుకోవడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం నేరస్తుల్లో చట్టంపై ఉన్న భయాన్ని తగ్గిస్తోంది. బాధిత మహిళల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బ తీస్తోంది. మహిళలు తమ రక్షణ కవచంగా భావించిన వ్యవస్థను లేకుండా చేస్తోంది. మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ‘దిశ’ను రద్దు చేయడం కాదు– రక్షించాలి. ‘దిశ’ను నిర్వీర్యం చేయడం కాదు–మరింత బలోపేతం చేయాలి.న్యాయం అనే లక్ష్యానికి బీఎన్ఎస్ ఎలా ప్రత్యామ్నాయం?ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ‘బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) చాలు, దిశ అవసరం లేదు’ అంటోంది. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎస్‌వోఎస్ వ్యవస్థ, ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు, గ్రామ స్థాయి నుంచే మహిళా పోలీసులు, ప్రత్యేక పెట్రోలింగ్, లైంగిక నేరస్తుల డేటా బేస్, వేగవంతమైన ఫోరెన్సిక్ వ్యవస్థ, ప్రత్యేక ప్రాసిక్యూషన్, ప్రత్యేక కోర్టులు, నిర్ణీత సమయంలో దర్యాప్తుతో కూడిన న్యాయం అనే లక్ష్యానికి బీఎన్ఎస్ ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది? మహిళలు, చిన్నారులపై తీవ్రమైన దారుణాలు జరిగినప్పుడు ఏడు పని రోజుల్లో పోలీసు దర్యాప్తు, ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత 14 పని రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేసేలా ‘దిశ’ ద్వారా తీసుకొచ్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. 21 రోజుల్లోగా బాధితులకు న్యాయం అందించాలన్న అలాంటి లక్ష్యాన్ని కూడా ఈ ప్రభుత్వం విమర్శించడం మరింత బాధాకరం. ఆ లక్ష్యం వెనుక ఉద్దేశం ఒక్కటే. దర్యాప్తులో జాప్యం ఉండకూడదు.. విచారణలో ఆలస్యం ఉండకూడదు.. మహిళలు, చిన్నారులపై నేరాలను అత్యంత ప్రాధాన్యతతో వేగంగా విచారించాలి.. నేరం చేస్తే చట్టం వేగంగా, కఠినంగా స్పందిస్తుందనే భయం నేరస్తుల్లో ఉండాలి. అలాంటి వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సింది పోయి, వేగంగా న్యాయం అందించాలనే లక్ష్యాన్నే తప్పు పట్టడం మహిళలకు ఏ సందేశం పంపుతోంది? మహిళలు, చిన్నారులకు సకాలంలో న్యాయం జరగాలని కోరుకోవడమే ఈ ప్రభుత్వానికి అభ్యంతరమా?1.51 కోట్ల మంది ‘దిశ’ యాప్ డౌన్లోడ్31,607 అత్యవసర కాల్స్ పరిష్కారం18 ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు.. గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసులు13,500 మందితో క్షేత్ర స్థాయి భద్రత, రిపోర్టింగ్ వ్యవస్థ900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలతో ప్రత్యేక పెట్రోలింగ్ఆరు నగరాల్లో ఫోరెన్సిక్ వ్యవస్థ బలోపేతం, 13 ప్రత్యేక పోక్సో కోర్టులు, 12 మహిళా ప్రత్యేక కోర్టులు2,17,467 మంది లైంగిక నేరస్తుల వివరాలతో ప్రత్యేక డేటా బేస్ అందువల్లే ‘దిశ’తో గొప్పగా భద్రతా సేవలు.. 19 జాతీయ అవార్డులు -
జగన్ పర్యటనతో పుంజుకున్న పొగాకు ధర
దేవరపల్లి: పొగాకు మార్కెట్లో ధరలో పెరుగుదల కనిపించింది. కిలోకు ఒక్కసారిగా రూ.15లు ఎగబాకింది. ఇదంతా వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమేనని రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ తమ సమస్యలను ప్రస్తావించడంతోనే ప్రభుత్వం ధర పెంచిందని పేర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ఈ నెల 5వ తేదీన పర్యటించి పొగాకు రైతులకు బాసటగా నిలిచారు. పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించడంతోపాటు రైతులు కష్టాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పంటకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నట్టు రైతులు వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా పోరాటం చేయాలని రైతులు కోరారు. అనంతరం వైఎస్ జగన్ మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పొగాకు మార్కెట్లో ధరల పెరుగుదల... జగన్ పర్యటన అనంతరం రెండు రోజులకే పొగాకు మార్కెట్లో ధరలు పెరిగాయి. కిలోకు రూ.15లు పెరుగుదలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీన కిలో గరిష్ట ధర రూ.275 ఉండగా, శుక్రవారం రూ.290 పలికింది. జగనన్న పర్యటన ప్రకటన వెలువడిన మరుసటి రోజు కిలోకు రూ.10 ధర పెరిగిందని, అప్పటి వరకు కిలో గరిష్ట ధర రూ.265 ఉండగా రూ.275కు పెరిగిందని తెలిపారు. పర్యటన అనంతరం కిలోకు రూ.15 పెరిగినట్టు చెబుతూ రైతులు సంతోషం వ్యక్తం చేశారు. జగనన్న పర్యటన వల్ల కిలోకు మొత్తంగా రూ.25లు అదనపు ధర లభించినట్టయిందని తెలిపారు. పొగాకు రైతుల హర్షాతిరేకాలు పొగాకు ధర పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వల్లభనేని సత్యనారాయణ, మండల అధ్యక్షుడు కూచిపూడి సతీష్, పొగాకు రైతులు సుంకర గంగరాజు, బాలం చంద్రశేఖర్, కవల సత్తిబాబు, పైడికొండల సత్యనారాయణ, కవల శ్రీనివాస్, తేతల బ్రహ్మరెడ్డి, సత్తి శ్రీనివాసరెడ్డి, తేతల వీరకాశీరెడ్డి, పప్పు ఆంజనేయరెడ్డి పాల్గొన్నారు. -
ఎయిడెడ్ జూనియర్ కళాశాలలపార్ట్టైమ్ లెక్చరర్లకు అండగా ఉంటాం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న పార్ట్‌టైమ్, అన్ ఎయిడెడ్ లెక్చరర్లు, బోధనేతర సిబ్బందికి న్యాయం జరిగే వరకు వారికి వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, అవసరమైన అన్ని వేదికలపై వారి సమస్యలను ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు. ఏపీ ఎయిడెడ్ జూనియర్ కాలేజెస్, పార్ట్‌టైమ్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో వైఎస్ జగన్‌ను కలిసి తమ దీర్ఘకాలిక సమస్యలను వివరించారు.అసోసియేషన్ ప్రెసిడెంట్ అరిగ జోషిరావు తదితరులు వైఎస్ జగన్‌కు వినతిపత్రం అందజేసి, తమ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలోని ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో 15 నుంచి 25 సంవత్సరాలుగా అన్ ఎయిడెడ్ పోస్టుల్లో పని చేస్తున్న పార్ట్‌టైమ్ లెక్చరర్లు, బోధనేతర సిబ్బందికి ఇప్పటికీ సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమ ప్రయోజనాలు కల్పించడం లేదని వాపోయారు. ప్రభుత్వం 10+2 విధానంలో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ చేపట్టే సమయంలో సుదీర్ఘ అనుభవం కలిగిన పార్ట్ టైమ్, అన్ ఎయిడెడ్ లెక్చరర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వారి సర్వీస్, అర్హతలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన వెయిటేజీ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మినిమమ్ టైమ్ స్కేల్‌తో పాటు సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేయాలని కోరారు. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న ఉద్యోగుల సర్వీస్, విద్యార్హతలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని వారి రెగ్యులరైజేషన్‌కు ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు.అసోసియేషన్ ప్రతినిధుల సమస్యలు, డిమాండ్లను సావధానంగా విన్న జగన్.. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పార్ట్‌టైమ్ లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు. -
దగా డీఎస్సీపై ఉద్యమం ఉధృతం
సాక్షి, అమరావతి : ‘‘కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాం.. కానీ ఏం లాభం..? మాకు పేకాట రాదు.. బ్రిడ్జి గేమ్ సర్టిఫికెట్ లేదు.. చంద్రబాబు సర్కారు కొత్త కొత్త జీవోలు ప్రవేశపెట్టి తమ అనుయాయులు, పేకాట రాయుళ్లకు ఉపాధ్యాయ ఉద్యోగాలను కట్టబెట్టింది..! పేకాట తెలియకపోవడమే మా అనర్హతకు కారణమవుతుందని తెలిస్తే ఏదో విధంగా నేర్చుకునే వాళ్లం..! డీఎస్సీలో జాబ్ రావాలంటే కష్టపడటం ఒక్కటే చాలదు.. ఓ స్పోర్ట్స్ సర్టిఫికెట్, రూ.15 లక్షల డబ్బులు కూడా కావాలని అర్థమైంది..! అక్రమ పద్ధతిలో టీచర్ పోస్టులు భర్తీ చేసి మాకు కనీసం నిరుద్యోగ భృతైనా ఇవ్వరా..!’’ ఇదీ మెగా డీఎస్సీ స్కామ్‌పై రెండో రోజు దీక్షా శిబిరాల వద్ద బాధిత అభ్యర్థుల ఆవేదన!! మెగా డీఎస్సీ 2025 స్కామ్‌పై పోరులో భాగంగా రిలే దీక్షలతో వైఎస్సార్సీపీ చేపట్టిన శాంతియుత ఉద్యమం రెండో రోజూ నిరసనలతో హోరెత్తగా.. ప్రజాస్వామ్య హక్కులను పాశవికంగా కాలరాస్తూ చంద్రబాబు సర్కారు తన నియంతృత్వ పోకడలను కొనసాగించింది. టీడీపీ మూకల దాడులు, పోలీసుల ఆంక్షలు రెండో రోజు కూడా యథావిధిగా కొనసాగాయి. మెగా డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాల్సిందేనని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని బాధిత అభ్యర్థులు, నిరుద్యోగులు, జెన్‌జీ యువత నినదించింది. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి సహా ఎన్నికల హామీలన్నీ చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమానికి జెన్‌జీ మద్దతు రోజురోజుకూ పెరగడం ప్రభుత్వ పెద్దలను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. దీంతో రెండో రోజు కూడా ఒకవైపు పోలీసులతో ఆటంకాలు కల్పిస్తూ.. మరోవైపు దీక్షలను భగ్నం చేసేందుకు టీడీపీ గూండాలను బరిలోకి దించారు. అనంతపురంలో రిలే దీక్షలో పాల్గొన్న యువతీయువకులకు మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి సంఘీభావం బొండాగిరీ బాటలోనే బుద్ధా..! బెజవాడలో తొలిరోజు వైఎస్సార్ సీపీ శ్రేణుల దీక్షా శిబిరం వద్ద విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఆయన అనుచరులు దాడులకు తెగబడి అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. బ్రాహ్మణనేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దీక్షా శిబిరం టెంట్‌ను తొలగించి కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లు రువ్వి పచ్చమూకలు కవ్వింపు చర్యలకు దిగాయి. ఇక అమానవీయ చర్యలకు పరాకాష్టగా మరింత దిగజారిపోయి బాటిల్లో మూత్రం పట్టుకొచ్చి నిరసనకారులపై చల్లారు. దీనికి కొనసాగింపుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గ్యాంగ్ వైఎస్సార్సీపీ దీక్షా శిబిరం వద్ద శుక్రవారం హల్చల్ చేసింది. శాంతియుతంగా నిర్వహిస్తున్న నిరసనను భగ్నం చేసేందుకు రెచ్చగొట్టే నినాదాలు చేశారు. పచ్చమూకలు గొడవలు సృష్టించేందుకు యత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. విజయవాడలో దీక్ష చేస్తున్న యువత, విద్యార్థులకు మద్దతు పలుకుతున్న దేవినేని అవినాశ్ కడపలో రిలే దీక్షలో పాల్గొన్న యువకులు రోడ్డుపైనే బైఠాయించిన అబ్బయ్య చౌదరి దెందులూరు నియోజకవర్గం మాదేపల్లిలో వైఎస్సార్సీపీ చేపట్టిన దీక్షకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అంటూ వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద రోడ్డుపైనే అబ్బయ్య చౌదరి బైఠాయించారు. మాదేపల్లిలో దీక్షా శిబిరాన్ని తొలగించిన పోలీసులు వైఎస్సార్సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దెందులూరులో రోడ్డుపై అబ్బయ్యచౌదరి బైఠాయింపు బెజవాడలో దీక్షాశిబిరం వద్ద టీడీపీ గూండాగిరీ..తొండంగిలో టెంట్లు తొలగింపు.. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగిలో పోలీసుల తీరుతో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ సీపీ రిలే దీక్షలు చేపట్టిన రెండు టెంట్లను పోలీసులు తొలగించారు. గురువారం రాత్రి తొండంగి కార్పొరేషన్ బ్యాంక్ సమీపంలో ఏర్పాటు చేసిన టెంట్‌ను తొలగించగా శుక్రవారం ఉదయం జియో కార్యాలయం వద్ద టెంట్‌ను తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతల డైరెక్షన్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. మండుటెండను లెక్క చేయక రోడ్డుపై బైఠాయించి వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. దీక్షలకు పెరుగుతున్న జెన్ జీ మద్దతు.. మెగా డీఎస్సీ 2025 నియామకాల్లో అక్రమాలపై కేంద్ర సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దీక్షలకు జెన్ జీ యువత భారీగా మద్దతు పలుకుతోంది. తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు.. అనంతపురం నుంచి కోనసీమ దాకా దాదాపు అన్ని జిల్లాల్లో యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు భారీగా పాల్గొని కూటమి సర్కారు నిర్వాకాలపై మండిపడ్డారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాతోపాటు మొత్తం నియామక ప్రక్రియపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపి, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.నేడు కొనసాగనున్న రిలే దీక్షలు.. 10న భారీ ర్యాలీలు.. వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలు ఈ నెల 8న కూడా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో కొనసాగుతాయని పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నారు. ర్యాలీలు ముగిసిన తర్వాత ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెంచేలా మలిదశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నట్లు వైఎస్సార్సీపీ వెల్లడించింది.స్పోర్ట్స్ కోటాలో ’పేకాట’.. డీఎస్సీలో లూడో! దగా డీఎస్సీపై పార్వతీపురంలో వైఎస్సార్ సీపీ స్కిట్ పార్వతీపురం రూరల్: మెగా డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులను దొడ్డిదారిలో కట్టబెట్టి.. పేకాట, లూడో లాంటి వాటిని ప్రభుత్వం క్రీడా కోటా జాబితాలో చేర్చిందంటూ పార్వతీపురంలో వైఎస్సార్సీపీ శ్రేణులు శుక్రవారం వినూత్న రీతిలో నిరసన చేపట్టాయి. పట్టణంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు నేతృత్వంలో రెండో రోజు రిలే నిరాహార దీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా కూటమి నేతల్లా నటిస్తూ.. పేకాట, లూడో ఆడుతూ గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కష్టపడి చదివిన అభ్యర్థులను, ప్రతిభావంతులైన క్రీడాకారులను పక్కనపెట్టి.. స్పోర్ట్స్ కోటా పేరుతో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారని మండిపడ్డారు. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని, సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 4వ ర్యాంక్ సాధించినా నిరాశే..! పులివెందులలో డీఎస్సీ బాధిత అభ్యర్థి జిలాని పులివెందుల: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే టీచర్ పోస్టుపై ఎంతో మక్కువతో మెగా డీఎస్సీకి రెండేళ్ల పాటు సిద్ధమైనట్లు డీఎస్సీ బాధిత అభ్యర్థి జిలాని పేర్కొన్నాడు. ఇంటికి దూరంగా ఉంటూ కడప, ప్రొద్దుటూరులో డీఎస్సీకి ప్రిపేరైనట్లు చెప్పాడు. శుక్రవారం పులివెందులలోని ఆర్డీవో కార్యాలయం వద్ద తొండూరు మండల ఇన్చార్జీ వైఎస్ మధురెడ్డి డీఎస్సీ రిలే దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిలాని మాట్లాడుతూ బీఈడీలో 75 శాతంతో ఉత్తీర్ణత సాధించానన్నారు. డీఎస్సీ రాసిన తర్వాత వందకు 71 మార్కులు, టీచింగ్‌లో 69.60 మార్కులు వచ్చాయన్నారు. దీని ప్రకారం తాను నాలుగో ర్యాంకులో ఉన్నట్లు చెప్పాడు. కానీ డీఎస్సీలో జాబ్ రావాలంటే కష్టపడటం ఒక్కటే కాదు.. ఒక స్పోర్ట్స్ సర్టిఫికెట్, రూ.15 లక్షల డబ్బులూ కావాలని అర్థమైందన్నారు. టీజీటీలో ఆరు పోస్టులు ఉండగా.. బీసీలకు నాలుగు పోస్టులు ఉండాలని, కానీ 1, 2, 3వ ర్యాంకర్లకు పోస్టులు ఇచ్చాక జిల్లాలో 4వ ర్యాంకర్, టీజీటీలో 276వ ర్యాంకర్‌ను తీసేసి 2,217వ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి పోస్టు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు. డీఎస్సీలో అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, అలాంటి సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ నేనున్నానని చెప్పడంతో ధైర్యం వచ్చిందన్నారు. నాకు పేకాట రాదు.. అందుకే ఉద్యోగం రాలేదు! నెల్లూరు (వేదాయపాళెం): మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పేరుతో అనేక అక్రమ నియామకాలు జరిగాయని బాధిత అభ్యర్థి షేక్ కరీంబాషా వాపోయాడు. శుక్రవారం నెల్లూరులోని కరెంటాఫీసు సెంటర్లో వైఎస్సార్ సీపీ రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దకు స్వచ్ఛందంగా వచ్చిన కరీంబాషా మైకు ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తాడు. కొత్త కొత్త జీవోలు ప్రవేశపెట్టి పేకాటను బ్రిడ్జి గేమ్ పేరుతో ఒక క్రీడగాపరిగణించి ప్రభుత్వం తమ అనుయాయులు, పేకాట రాయుళ్లకు ఉపాధ్యాయ ఉద్యోగాలను కట్టబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు పేకాట రాదని, తన వద్ద బ్రిడ్జి గేమ్ సర్టిఫికెట్ లేదని, కానీ తాను కష్టపడి చదివి మంచి మార్కులు సాధించానన్నారు. పేకాట తెలియకపోవడమే తన అనర్హతకు కారణమవుతుందని తెలిసి ఉంటే ఏదో విధంగా పేకాట నేర్చుకునే వాడినన్నాడు. ప్రభుత్వ ఉద్యోగానికి ఈ ఏడాదితో వయో పరిమితి దాటి పోయిందని కన్నీటి పర్యంతమయ్యాడు. అక్రమ పద్ధతిలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన చంద్రబాబు సర్కారు తనకు కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. -
మీ ప్రభుత్వం ఇంకా ఎంతగా దిగజారుతుంది?
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 ప్రశ్నాపత్రం లీకేజీ, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేపట్టిన శాంతియుత రిలే నిరాహార దీక్షలపై తమ అనుచరులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యేలు దాడులు చేయడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంతగా దిగజారుతుంది? అంటూ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగిన నిరుద్యోగ యువతకు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా? అంటూ నిలదీశారు.నారా లోకేశ్‌ను బాధ్యత నుంచి తప్పించకుండా మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. డీఎస్సీ–2025 ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని మీరు చెబుతున్నప్పుడు, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? అంటూ చంద్రబాబును వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘మీరు దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చు.. మీ పోలీసులను, పార్టీ శ్రేణులను ప్రయోగించవచ్చు.. నిరసనకారులను అరెస్టు చేయవచ్చు.. కానీ డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై ఆధారాలను మాత్రం చెరిపేయలేరు.నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచి వేయలేరు. ఆంధ్రప్రదేశ్ జెన్–జెడ్ గొంతును మూయలేరు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు’ అని స్పష్టం చేశారు. రిలే నిరాహార దీక్ష శిబిరాలపై టీడీపీ ఎమ్మెల్యేలు అనుచరులతో కలిసి చేసిన దాడుల వీడియోలను ట్యాగ్ చేస్తూ శుక్రవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వైఎస్ జగన్ పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తారా? ‘‘చంద్రబాబు గారూ.. మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంతగా దిగజారుతుంది? నిరుద్యోగ యువతకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారు అడిగితే... దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా? డీఎస్సీ–2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షపై మీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి, దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారు. పోలీసుల కళ్ల ముందే, వారి సమక్షంలోనే టెంట్లు లాగి పడేశారు. మా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. మహిళలపై దాడులకు తెగబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా శిబిరాలపై నిర్బంధకాండను కొనసాగించారు. చిలకలూరిపేట, కనిగిరి, యాడికి, తాడిపత్రి, పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, బాపట్లలో నిరసన శిబిరాలపై దాడులు చేశారు. నాయకులను నిర్బంధించారు. శాంతియుతంగా దీక్షలు చేస్తూ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కూడా నిరుద్యోగ యువతకు లేకుండా చేశారు. సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? నారా లోకేశ్‌ను బాధ్యత నుంచి తప్పించకుండా మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు? డీఎస్సీ–2025 ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని మీరు చెబుతున్నప్పుడు, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి చదివిన యువతకు న్యాయం జరగాలి. నియామకాల్లో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ప్రస్తుతం రూ.9,000 కోట్లకు చేరిన విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్మెంట్), వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. మీ ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని, గత రెండేళ్ల బకాయిలతో సహా వెంటనే చెల్లించాలి. న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదు చంద్రబాబు గారూ.. మీరు దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చు.. మీ పోలీసులను, పార్టీ శ్రేణులను ప్రయోగించవచ్చు.. నిరసనకారులను అరెస్టు చేయవచ్చు.. కానీ డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై ఆధారాలను మాత్రం చెరిపేయలేరు. నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచి వేయలేరు. ఆంధ్రప్రదేశ్ జెన్ జెడ్ గొంతు నొక్కలేరు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. చేనేత కార్మికుల ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచాంజాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు ఐదేళ్లలో రూ.3,706.16 కోట్ల సాయం అందించాం ఆర్థికంగా, సామాజికంగా మద్దతుగా నిలిచాం చేనేత వ్రస్తాలకు దేశ, విదేశాల్లో మార్కెట్.. ఈ కామర్స్ సంస్థలతో ఒప్పందాలు ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేశాం ఎన్నికల హామీలను విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం సాక్షి, అమరావతి: చేనేత అనేది కేవలం ఒక వృత్తి కాదని.. మన సంస్కృతికి, సంప్రదాయానికి, తెలుగువారి కళా నైపుణ్యానికి నిలువెత్తు ప్రతీక అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నేతన్నలు, చేనేత కళాకారులు, వారి కుటుంబ సభ్యులందరికీ శుక్రవారం ఆయన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 2019–24 మధ్య తమ ప్రభుత్వంలో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని ప్రతి అడుగులోనూ అండగా నిలిచామని చెప్పారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేల చొప్పున ఐదేళ్లలో రూ.1.20 లక్షలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. ఈ ఒక్క పథకం ద్వారానే రూ.969.77 కోట్లు అందించామని, నేతన్నల పింఛన్ల కోసం రూ.1,396.45 కోట్లు, ఆప్కో పాత బకాయిల చెల్లింపునకు రూ.468.84 కోట్లు వెచ్చించామని చెప్పారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా మొత్తంగా రూ.3,706.16 కోట్ల సాయం అందించి నేతన్నలకు ఆర్థికంగా, సామాజికంగా మద్దతుగా నిలిచామన్నారు. చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్, పవర్‌లూమ్స్‌కు రాయితీ విద్యుత్ అందించామని తెలిపారు. నేతన్నలు తయారు చేసే వస్త్రాలకు దేశ, విదేశాల్లో మార్కెట్ కల్పించేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని, వారి ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేశామని చెప్పారు. ఎన్నికల హామీలకు చంద్రబాబు తూట్లు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండేళ్లుగా నేతన్న నేస్తం పథకాన్ని నిలిపి వేసిందని వైఎస్ జగన్ ఆరోపించారు. ఏడాదికి రూ.25 వేలు అందిస్తామన్న ఎన్నికల హామీని అమలు చేయలేదని విమర్శించారు. హ్యాండ్లూమ్స్కు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి, ఆ హామీలను కూడా అమలు చేయలేదన్నారు. 1,03,534 కుటుంబాలకు పథకం వర్తింప జేస్తామని ప్రకటించి, నేడు కేవలం 71,536 కుటుంబాలకు ఇస్తున్నట్లు ప్రకటిస్తున్నారన్నారు. ఆచరణకు వచ్చేసరికి వారిలో ఎంత మందికి ఆ సాయం అందుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. జీఎస్టీ రీయింబర్స్మెంట్ హామీని కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. నేతన్నల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం, చేనేత రంగ పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
ఏపీలో మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
సాక్షి, తాడేపల్లి: ‘‘దిశ”ను ఉపసంహరించుకోవటంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను.. రాజకీయ ఈర్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు.‘‘మహిళలు, చిన్నారులపై నేరాలు, దర్యాప్తులో జాప్యం, న్యాయ ప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలకు పరిష్కారంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం “దిశ”ను తీసుకొచ్చింది. నేరం జరగకుండా నిరోధించడం నుంచి, నేరం జరిగితే వెంటనే స్పందించడం, బాధితులకు రక్షణ, వేగంగా దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, చార్జిషీటు, ప్రత్యేక కోర్టుల ద్వారా సత్వర న్యాయం వరకు ఒక సమగ్ర వ్యవస్థను నిర్మించాం...దిశలో భాగంగా మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు SOS బటన్ నొక్కినా, ఫోన్‌ను 5 సార్లు షేక్ చేసినా నిమిషాల వ్యవధిలో పోలీసులు స్పందించే వ్యవస్థ తీసుకొచ్చాం. 1.51 కోట్ల మంది దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ ద్వారా వచ్చిన 31,607 అత్యవసర కాల్స్‌ను అప్పట్లో మా ప్రభుత్వంలో పోలీసులు పరిష్కరించారు. 18 ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసును అందుబాటులోకి తీసుకొచ్చి 13,500 మందితో క్షేత్రస్థాయి భద్రత, రిపోర్టింగ్ వ్యవస్థను నిర్మించాం...900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలతో ప్రత్యేక పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం. నేరస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే అవకాశం లేకుండా ఈ కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలకు ప్రాధాన్యం ఇస్తూ ఆరు నగరాల్లో ఫోరెన్సిక్ వ్యవస్థను బలోపేతం చేశాం. సత్వర విచారణ కోసం 13 ప్రత్యేక POCSO కోర్టులు, 12 మహిళా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశాం. 2,17,467 మంది లైంగిక నేరస్తుల వివరాలతో ప్రత్యేక డేటాబేస్‌ను రూపొందించాం. అందుకనే దిశ విజయవంతగా మహిళలకు, చిన్నారులకు గొప్ప భద్రతా సేవలను అదించింది’’ అని వైఎస్ జగన్ వివరించారు.‘‘2017లో మహిళలపై నేరాల దర్యాప్తుకు సగటున 156 రోజులు పట్టగా, 2022 నాటికి అది 28 రోజులకు తగ్గించగలిగారు. 164 అత్యాచారం కేసులు, 378 లైంగిక నేరాల కేసుల్లో కేవలం 7 రోజుల్లోనే ఛార్జిషీట్లు దాఖలు చేశారు. తీవ్రమైన కేసుల్లో 51 శాతానికిపైగా నిందితులను 48 గంటల్లోపు అరెస్టు చేశారు. గతంలో డీఎన్ఏ నివేదికలకు నెలలు పట్టేది. దిశ ఫోరెన్సిక్ వ్యవస్థతో వాటిని రోజుల్లోనే అందించే పరిస్థితి తీసుకొచ్చాం. 214 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. మే 2024 నాటికి మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయి. వార్షిక సగటు కేసులు 14,338 నుంచి 10,426కు తగ్గాయి...ఇదీ దిశ ఇచ్చిన భరోసా. ఇవీ దిశ సాధించిన ఫలితాలు. అందుకే 19జాతీయ అవార్డులను మా ప్రభుత్వ హయాంలో “దిశ’’ గెలుచుకుంది. “దిశ” అనేది కాగితాల మీదున్న పేరు కాదు. ప్రమాదంలో ఉన్న మహిళ SOS నొక్కిన క్షణం నుంచి, నిందితుడికి శిక్ష పడే వరకు ఆమెకు అండగా ఉండే సజీవమైన మహిళా రక్షణ నెట్వర్క్. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం “BNS (భారతీయ న్యాయ సంహిత) చాలు, దిశ అవసరం లేదు” అంటోంది. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన SOS వ్యవస్థ, ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు, గ్రామ స్థాయి నుంచే మహిళా పోలీసులు, ప్రత్యేక పెట్రోలింగ్, లైంగిక నేరస్తుల డేటాబేస్, వేగవంతమైన ఫోరెన్సిక్ వ్యవస్థ, ప్రత్యేక ప్రాసిక్యూషన్, ప్రత్యేక కోర్టులు, నిర్ణీత సమయంలో దర్యాప్తు! న్యాయం అనే లక్ష్యానికి BNS ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది?“దిశ”ను ఉపసంహరించుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, చిన్నారులకు ఒక చీకటి రోజు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరం.మహిళలు, చిన్నారులపై నేరాలు, దర్యాప్తులో జాప్యం,… pic.twitter.com/cF3dc8uSpT— YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2026..మహిళలు, చిన్నారులపై తీవ్రమైన దారుణాలు జరిగినప్పుడు 7 పని రోజుల్లో పోలీసు దర్యాప్తు, ఛార్జ్‌షీట్ దాఖలైన తర్వాత 14 పని రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేసేలా దిశ ద్వారా తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా వైయస్సార్సీపీదే. 21 రోజుల్లోగా బాధితులకు న్యాయం అందించాలన్న అలాంటి లక్ష్యాన్ని కూడా ఈ ప్రభుత్వం విమర్శించడం మరింత బాధాకరం. ఆ లక్ష్యం వెనుక ఉద్దేశం ఒక్కటే, దర్యాప్తులో జాప్యం ఉండకూడదు. విచారణలో ఆలస్యం ఉండకూడదు. మహిళలు, చిన్నారులపై నేరాలను అత్యంత ప్రాధాన్యతతో వేగంగా విచారించాలి. నేరం చేస్తే చట్టం వేగంగా, కఠినంగా స్పందిస్తుందనే భయం నేరస్తుల్లో ఉండాలి. అలాంటి వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సింది పోయి.. వేగంగా న్యాయం అందించాలనే లక్ష్యాన్నే తప్పుపట్టడం మహిళలకు ఏ సందేశం పంపుతోంది?..మహిళలు, చిన్నారులకు సకాలంలో న్యాయం జరగాలని కోరుకోవడమే ఈ ప్రభుత్వానికి అభ్యంతరమా?. “దిశ”ను ఉపసంహరించుకోవడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం నేరస్తుల్లో చట్టంపై ఉన్న భయాన్ని తగ్గిస్తోంది. బాధిత మహిళల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. మహిళలు తమ రక్షణ కవచంగా భావించిన వ్యవస్థను లేకుండా చేస్తోంది. మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. దిశను రద్దు చేయడం కాదు.. రక్షించాలి. దిశను నిర్వీర్యం చేయడం కాదు.. మరింత బలోపేతం చేయాలి’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
జగన్ పర్యటనతో మాకు ఏ నష్టం జరగలేదు.. బయటపెట్టిన హోటల్ ఓనర్ లక్ష్మి
-
YSRCP దీక్షా శిబిరాలపై దాడులు.. AP Gen Z గొంతు మూయలేరు
-
వైఎస్సార్సీపీ దీక్షా శిబిరాలపై దాడులు.. వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ దీక్షా శిబిరాల మీద దాడుల పట్ల ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. దాడుల వీడియోను ఎక్స్‌లో పోస్టు చేసిన వైఎస్ జగన్.. చంద్రబాబూ మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంత దిగజారుతుంది? అంటూ నిలదీశారు. నిరుద్యోగ యువతకు, వారికి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే… దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా? అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘డీఎస్సీ-2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షపై మీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి, దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారు. పోలీసుల కళ్లముందే, వారి సమక్షంలోనే టెంట్లు లాగిపడేశారు. మా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. మహిళలపై దాడులకు తెగబడ్డారు...రాష్ట్రవ్యాప్తంగా దీక్షా శిబిరాలపై నిర్బంధకాండను కొనసాగించారు. చిలకలూరిపేట, కనిగిరి, యాడికి, తాడిపత్రి నుంచి పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, బాపట్ల వరకు నిరసన శిబిరాలపై దాడులు చేశారు. నాయకులను నిర్బంధించారు. శాంతియుతంగా దీక్షలు చేస్తూ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కూడా నిరుద్యోగ యువతకు లేకుండా చేశారు. నారా లోకేష్‌ను బాధ్యత నుంచి తప్పించడానికి మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు?’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘డీఎస్సీ –2025 ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని మీరు చెబుతున్నప్పుడు, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి చదివిన యువతకు న్యాయం జరగాలి. నియామకాల్లో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ప్రస్తుతం రూ.9,000 కోట్లకు చేరిన పెండింగ్ విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్మెంట్), వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. మీ ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని, గత రెండేళ్ల బకాయిలతో సహా వెంటనే చెల్లించాలి...చంద్రబాబూ.. మీరు దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చు. మీ పోలీసులను, పార్టీ శ్రేణులను ప్రయోగించవచ్చు. నిరసనకారులను అరెస్టు చేయవచ్చు. కానీ డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై ఆధారాలను చెరిపేయలేరు. నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచివేయలేరు. ఆంధ్రప్రదేశ్ జెన్ జీ గొంతును మూయలేరు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.@ncbn గారూ, మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంత దిగజారుతుంది? నిరుద్యోగ యువతకు, వారికి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే… దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా?#DSC2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ… pic.twitter.com/SbndqNaPsD— YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2026 -
గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద YS జగన్
-
నేతన్నకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: నేడు జాతీయ చేనేత దినోత్సవం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని నేతన్నలు, చేనేత కళాకారులు, వారి కుటుంబ సభ్యులందరికీ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చేనేత అనేది కేవలం ఒక వృత్తి కాదు. మన సంస్కృతికి, సంప్రదాయానికి, తెలుగు వారి కళా నైపుణ్యానికి నిలువెత్తు ప్రతీక వ్యాఖ్యానించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘చేనేత అనేది కేవలం ఒక వృత్తి కాదు. మన సంస్కృతికి, సంప్రదాయానికి, తెలుగు వారి కళా నైపుణ్యానికి నిలువెత్తు ప్రతీక. అందుకే 2019-24 మధ్య మా ప్రభుత్వంలో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని ప్రతి అడుగులోనూ వారికి అండగా నిలిచాం.వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేల చొప్పున ఐదేళ్లలో రూ.1.20 లక్షలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశాం. ఈ ఒక్క పథకం ద్వారానే రూ.969.77 కోట్లు అందించాం. నేతన్నల పింఛన్ల కోసం రూ.1,396.45 కోట్లు, ఆప్కో పాత బకాయిల చెల్లింపునకు రూ.468.84 కోట్లు వెచ్చించాం. వివిధ సంక్షేమ పథకాల ద్వారా మొత్తంగా రూ.3,706.16 కోట్ల సాయం అందించి నేతన్నలకు ఆర్థికంగా, సామాజికంగా మద్దతుగా నిలిచాం.జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నేతన్నలు, చేనేత కళాకారులు, వారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.చేనేత అనేది కేవలం ఒక వృత్తి కాదు. మన సంస్కృతికి, సంప్రదాయానికి, తెలుగు వారి కళా నైపుణ్యానికి నిలువెత్తు ప్రతీక. అందుకే 2019-24 మధ్య మా ప్రభుత్వంలో నేతన్నల…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2026చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్, పవర్‌లూమ్స్‌కు రాయితీ విద్యుత్ అందించాం. నేతన్నలు తయారుచేసే వస్త్రాలకు దేశ, విదేశాల్లో మార్కెట్ కల్పించేందుకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని, వారి ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేశాం.కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు నేతన్న నేస్తాన్ని నిలిపివేసింది. ఏడాదికి రూ.25 వేలు అందిస్తామన్న ఎన్నికల హామీని గాలికొదిలేసింది.హ్యాండ్లూమ్స్కు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి వాటినీ గాలికి వదిలేసింది. 1,03,534 కుటుంబాలకు పథకం వర్తింపజేస్తామని ప్రకటించి, ఇప్పుడు కేవలం 71,536 కుటుంబాలకు ఇస్తున్నట్లుగా ప్రకటనలు చేస్తోంది. చివరికి వారిలో ఎంతమందికి అందుతుందో చూడాలి. జీఎస్టీ రీయింబర్స్మెంట్ హామీని కూడా అమలు చేయడం లేదు. నేతన్నల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం, చేనేత రంగ పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని మాట ఇస్తూ మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు’ అని పోస్టు చేశారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన జూనియర్ కాలేజీల లెక్చరర్లు
సాక్షి, కృష్ణా: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఎయిడెడ్ జూనియర్ కాలేజీల పార్ట్‌టైమ్ లెక్చరర్లు గన్నవరం ఎయిర్‌పోర్టులో కలిశారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని వైఎస్ జగన్‌కు వారంతా విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం తమను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.ఈ సందర్భంగా ఏపీ ఎయిడెడ్ జూనియర్ కాలేజీల పార్ట్‌టైమ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరిగ జోషి మాట్లాడుతూ.. ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ లెక్చరర్లను శాశ్వత ఉద్యోగులుగా (పర్మినెంట్) చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. తమ సమస్యలను వైఎస్ జగన్‌కు వివరించామని, తమ తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.పార్ట్‌టైమ్ లెక్చరర్లకు మినిమమ్ టైమ్ స్కేల్ వర్తింపజేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ జూనియర్ కాలేజీల పార్ట్‌టైమ్ లెక్చరర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న తమకు న్యాయం చేయాలని అసోసియేషన్ నాయకులు కోరారు. -
కావాలనే వైఎస్ జగన్‌కు భద్రత కల్పించడం లేదు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌కు భద్రతా లోపంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్టు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వైఎస్ జగన్‌కు భద్రత కల్పించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ జగన్ పర్యటనకు కనీస భద్రత కూడా కల్పించడం లేదు. ఈ విషయమై అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భద్రత ఇవ్వడం లేదు. దీని వల్ల ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోంది. రాష్ట్రంలో లాకప్ డెత్ లు కొనసాగుతున్నాయిభారతి సిమెంట్స్ కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీని వల్ల కార్మికుల ఉపాధికి దెబ్బ తగులుతుంది. పరిశ్రమలకు ఇబ్బందులు సృష్టించి ఏం సందేశం పంపుతున్నారు?. డీఎస్సీ పేపర్ లీక్ అంశంపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు చేయాలని కోరాం. బిల్లులపై కేంద్రంతో ఎలాంటి చర్చలు జరగలేదు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై జగన్ పోరాటం కొనసాగుతుందని అన్నారు. -
పోలవరం రిజర్వాయర్ కాదు బ్యారేజే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం మరోసారి బట్టబయలైంది. ఈ ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తే ఎత్తు 45.72 మీటర్లు కాదు.. 41.15 మీటర్లేనని కేంద్రం పునరుద్ఘాటించింది. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయడానికి 2023 ధరల ప్రకారం అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లుగా ఆమోదించామని, మిగిలిన పనులు పూర్తి చేయడానికి రూ.12,157.53 కోట్లు మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించామని స్పష్టం చేసింది. అందులో 2024–25లో రూ.5,512.40 కోట్లు, 2025–26లో రూ.2,810.22 కోట్లు వెరసి రూ.8,322.62 కోట్లు విడుదల చేశామని తెలిపింది. ఈ మేరకు లోక్‌సభలో వైఎస్సార్సీపీ పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 41.15 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వ చేసేలా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యాం గాŠయ్ప్–1, గ్యాప్–2లతోపాటు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని నిర్దేశించినట్లు తెలిపారు. గరిష్ఠ నీటి మట్టం 45.72 మీటర్ల ఎత్తు వరకూ స్పిల్ వే, ఈసీఆర్ఎఫ్ డ్యాం వంటి సివిల్ పనులు పూర్తి చేసేందుకు అయ్యే వ్యయంతోపాటు.. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేయడానికి అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడం.. కుడి, ఎడమ కాలువలను పూర్తి చేయడానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని స్పష్టం చేశారు. ప్రాజెక్టులో అంతర్భాగమైన జల విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణానికి అయ్యే ఖర్చును పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరించాలని తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పిస్తున్న నిధుల వినియోగ ధ్రువీకరణ పత్రాలు (యూసీలు), సాంకేతిక పత్రాలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కేంద్ర జల్ శక్తి శాఖ పరిశీలించాకే నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. 7.20 లక్షల ఎకరాలకు కాదు 1.98 లక్షల ఎకరాలకే పోలవరం ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 45.72 మీటర్లు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలు. కనీస నీటిమట్టం 41.15 మీటర్లు, కనీస నీటి నిల్వ 119.4 టీఎంసీలు. పోలవరం నీటి మట్టాన్ని కనీస స్థాయికే పరిమితం చేస్తే.. కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కేవలం 1.98 లక్షల ఎకరాలకు.. అదీ గోదావరికి వరద వచ్చిన రోజుల్లో మాత్రమే నీళ్లందించే అవకాశం ఉంటుందని అధికారులే స్పష్టంగా చెబుతున్నారు. ఇక కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల మళ్లింపు, గోదావరి డెల్టా ఆయకట్టు స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీళ్లందించే అవకాశమే ఉండదని తేల్చి చెబుతున్నారు. ఎడమ గట్టుపై 960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రంలోనూ గోదావరికి వరద వచ్చే రోజుల్లో మాత్రమే అరకొరగా విద్యుత్తు ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. అంటే.. పోలవరం రిజర్వాయర్‌ను బ్యారేజ్‌గా మార్చేశారన్నది స్పష్టమవుతోంది. పోలవరానికి ఉరేసిన చంద్రబాబు సర్కారుజలయజ్ఞంలో భాగంగా 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ బృహత్తర ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చిన మేరకు సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం), అటవీ, పర్యావరణం సహా అన్ని అనుమతులు సాధించి.. 45.72 మీటర్ల గరిష్ఠ నీటి మట్టం, 194.6 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు మళ్లించి 13.08 లక్షల ఎకరాలను స్థిరీకరించడం, గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాలకు రెండో పంటకూ సమృద్ధిగా నీళ్లందించి స్థిరీకరించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా దీని నిర్మాణం చేపట్టారు. 2014–19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు స్వలాభం కోసం కేంద్రం నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకొని, అనేక అవకతవకలు, అరకొర పనులతో ప్రాజెక్టును నీరుగార్చారు. 2019లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును దారిలోకి తెచ్చి , నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021 జూన్ 11 నాటికే 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేసేలా పోలవరం స్పిల్ వేను పూర్తి చేశారు. వైఎస్ జగన్ వినతిమేరకు 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు 2020 మార్చి 17న కేంద్రం అంగీకరించింది. 2024లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడంతోనే పోలవరం ప్రాజెక్టుకు ఉరేశారని సాగు నీటి రంగ నిపుణులు అంటున్నారు. 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్లో పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ.. ఆ మేరకు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.12,157.53 కోట్లు మాత్రమే ఇచ్చేలా తీర్మానాన్ని ఆమోదించగా.. అదే కేబినెట్లో సభ్యునిగా ఉన్న టీడీపీ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. -
కీచక పాలనలో కీలక బిల్లు డ్రాప్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళల భద్రత తమకు ఏమాత్రం పట్టదని చంద్రబాబు ప్రభుత్వం నిరూపించుకుంది. మహిళల భద్రత కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన చరిత్రాత్మకమైన ‘దిశ’ బిల్లును ఉపసంహరించుకోవడం ద్వారా చంద్రబాబు సర్కారు తన నైజాన్ని బయటపెట్టుకుంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు, వేధింపులు పెచ్చుమీరిపోయాయి.చంద్రబాబు కూటమిలో చిన్న కార్యకర్త నుంచి పెద్ద నేతల వరకు అనేక మంది మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారు. నిత్యం అనేక మంది కూటమి కీచకుల బారిన పడుతున్నా ప్రభుత్వానికి పట్టడంలేదు. చివరకు ఓ ఎన్నారై మహిళను చంద్రబాబు కేబినెట్లోని మంత్రే వేధించారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల భద్రత కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన దిశ బిల్లును చట్టంగా మార్పించాల్సింది పోయి.. చంద్రబాబు ప్రభుత్వం దానిని ఉపసంహరించుకోవడంపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు. మహిళల భద్రత కోసం వైఎస్ జగన్ విప్లవాత్మక చర్యలు రాష్ట్రంలోని మహిళల భద్రత కోసం దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చేయని రీతిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా ‘ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు’ను తెచ్చారు. మహిళలకు ఇది ప్రత్యేక రక్షణ కవచంలా నిలిచింది. ఇందులో భాగంగా ఆపదలో ఉన్న మహిళలు, బాలికల రక్షణ కోసం దిశ యాప్‌ను రూపొందించారు. ఫోన్లో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ప్రమాదంలో ఉన్నప్పుడు ఫోన్‌ను అటూ ఇటూ ఊపితే చాలు.. ఎస్‌వోఎస్ ద్వారా పోలీస్ స్టేషన్‌కు సమాచారం వెళ్లి 15 నుంచి 20 నిమిషాల్లోగా పోలీసులు బాధిత మహిళ ఉన్న ప్రదేశానికి వెళ్లి ఆమెను రక్షించే వారు. దిశ యాప్‌ను 1.5 కోట్ల మంది వారి ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ యాప్, ఎస్ఓఎస్ కాల్స్ ఆధారంగా భారీగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మహిళలపై వేధింపులు, గృహ హింస, అత్యాచారం, పోక్సో, కిడ్నాప్, ఈవ్‌టీజింగ్, హత్యాయత్నం వంటి కేసులు ఇందులో ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నుంచి నేరస్తుడి అరెస్టు, ఫోరెన్సిక్ నివేదిక, చార్జిïÙట్ నుంచి ప్రత్యేక కోర్టులో శిక్ష వరకు నిరంతర పర్యవేక్షణ వ్యవస్థతో నిరి్మంచిన సమగ్ర మహిళా భద్రతా వ్యవస్థ దిశ బిల్లు. మహిళలకు ప్రమాదకరంగా గుర్తించిన ప్రాంతాల్లో 24 గంటలూ పెట్రోలింగ్ కోసం 900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలను అందించారు. 19 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించారు. 12 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. పోక్సో కేసుల కోసం మరో 13 ప్రత్యేక కోర్టులను గుర్తించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లను నియమించారు. ఈ చర్యలతో మహిళలపై నేరాల దర్యాప్తు సమయం కూడా 156 రోజుల నుంచి 28 రోజులకు తగ్గించారు. 2017లో మహిళలపై నేరాల దర్యాప్తు పూర్తి చేయడానికి సగటున 156 రోజులు పట్టేది. 2021 నాటికి ఇది 67 రోజులకు, 2022లో 28 రోజులకు తగ్గింది. అత్యాచారం, పోక్సో కేసుల్లో 60 రోజుల్లో పూర్తి చేసిన దర్యాప్తులు 2019లో 14.15 శాతం కాగా, ఇది 2020లో 41.7 శాతం, 2021లో 92.21 శాతం, 2022లో 95.18 శాతానికి పెరిగాయి. లైంగిక నేరాల దర్యాప్తులో దేశ సగటు 40 శాతం కాగా ఏపీ 92.21 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. 2019–2022 మధ్య నమోదైన అత్యాచారం – హత్య కేసుల్లో 60 శాతం నిందితులను 48 గంటల్లోనే అరెస్టు చేశారు. గతంలో ఇలాంటి కేసుల్లో అరెస్టుకు సగటున 43 రోజులు పట్టగా, దిశ కాలంలో 8 రోజులకు తగ్గింది. త్వరగా అరెస్టు చేయడం ద్వారా నిందితులు తప్పించుకునే అవకాశాన్ని తగ్గించారు. దేశానికే దిశా నిర్దేశం చేసేలా జగన్ తెచ్చిన ఈ విప్లవాత్మక బిల్లుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. 19 అవార్డులు కూడా లభించాయి. 2024లో చంద్రబాబు సర్కారు రాగానే మహిళల భద్రతను ప్రశ్నార్ధకం చేసింది. దిశ బిలు్లకు కేంద్రం ఆమోదం రాలేదనే సాకుతో దిశ యాప్, పోలీస్ స్టేషన్లు, హెల్ప్‌డెస్‌్క, ఫోరెన్సిక్ వ్యవస్థ, ప్రత్యేక కోర్టులు, పెట్రోలింగ్, దర్యాప్తు పర్యవేక్షణ వంటి మొత్తం వ్యవస్థకు పాతరేసింది. రమ్య హత్య కేసులో మరణ శిక్ష దిశ వ్యవస్థ ఎంత వేగంగా పనిచేస్తుందో గుంటూరులో జరిగిన రమ్య హత్య కేసు ఓ ఉదాహరణ. ఈ కేసులో నిందితుడిని 48 గంటల్లో అరెస్టు చేసి, 7 రోజుల్లో చార్జిïÙట్ దాఖలు చేశారు. విచారణను వేగంగా పూర్తి చేయడంతో నిందితుడికి మరణశిక్ష పడింది. 2019 డిసెంబర్ నుంచి 2022 ఏప్రిల్ వరకు 214 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. వీటిలో ముగ్గురికి మరణించే వరకు జీవిత ఖైదు, 19 మందికి జీవిత ఖైదు, పలువురికి 20 ఏళ్లు, 10 ఏళ్లు తదితర శిక్షలు విధించారు. ‘దిశ’ ఉపసంహరణతో మహిళల భద్రత ప్రశ్నార్థకంమాజీ మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఆర్కే రోజా సాక్షి, అమరావతి: ‘దిశ’ ఉపసంహరణ మహిళా భద్రతకు బ్లాక్ డే అని, వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం దిశను రద్దు చేయడంతో మహిళల భద్రత ప్రశ్న్రా్థకంగా మారిందని మాజీ మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఆర్కే రోజాలు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు గురువారం వారు వేర్వేరు ప్రకటనల్లో చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ తప్పుడు నిర్ణయంతో మహిళలపై దారుణాలకు ప్రభుత్వమే వత్తాసు పలికినట్లయిందన్నారు. కేవలం జగన్ చేసిన మంచి పని మిగిలి ఉండకూడదనే దురుద్దేశంతోనే దిశను రద్దు చేసిందన్నారు. వెంటనే వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రులు డిమాండ్ చేశారు. మహిళల భద్రతను సమాధి చేసే చీకటి నిర్ణయం ‘దిశ’ను తొలగించడం అంటే కేవలం ఒక బిల్లును ఉపసంహరించడం కాదు చంద్రబాబు గారూ.. మీరు ఇచ్చిన మహిళలకు భద్రత, చిన్నారులకు రక్షణ, బాధితులకు త్వరిత న్యాయం అనే హామీని వెనక్కి తీసుకున్నట్టే. మహిళల భద్రతను సమాధి చేసే ఈ చీకటి నిర్ణయమిది. తక్షణమే మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. – పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఉపముఖ్యమంత్రి దిశ వ్యవస్థ వల్ల మహిళలకు జరిగిన నష్టం ఏమిటో చంద్రబాబు చెప్పాలి దిశ వ్యవస్థ వల్ల మహిళలకు జరిగిన నష్టం ఏమిటో ఒక్క ఉదాహరణ అయినా చెప్పగలరా చంద్రబాబూ? నష్టం లేకపోతే మహిళలకు అదనపు రక్షణ కల్పించే వ్యవస్థను ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు? మహిళలు, చిన్నారులపై అత్యంత తీవ్రమైన నేరాల్లో 21 రోజుల్లో దర్యాప్తు ప్రక్రియ పూర్తిచేయాలన్న లక్ష్యం తప్పా? మహిళ చేతిలోని భద్రత ఆయుధాన్ని నిరీ్వర్యం చేస్తున్న మీరు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. – మాజీ మంత్రి విడదల రజినిమహిళల భద్రతకు పెను విఘాతమే మహిళలు, చిన్నారులకు దిశ రూపంలో ఉన్న రక్షణ కవచాన్ని చంద్రబాబు ప్రభుత్వం తొలగించడం దుర్మార్గం. కేబినెట్ తీసుకున్న ఈ చీకటి నిర్ణయం మహిళల భద్రతకు పెను విఘాతమే. – జి. తనూజా రాణి, ఎంపీ చంద్రబాబు క్షమాపణ చెప్పాలి ఒక మహిళా హోం మంత్రిగా అనిత దిశ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సింది పోయి, దాన్ని తొలగించే నిర్ణయాన్ని సమర్థించడం దురదృష్టకరం. మహిళల నమ్మకాన్ని దెబ్బ తీసిన హోం మంత్రి అనిత వెంటనే రాజీనామా చేయాలి. మహిళల భద్రతను రాజకీయాలకు బలి చేసినందుకు చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. – కాకాణి పూజిత, వైఎస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రక్షణ కవచాన్ని తొలగించడం దుర్మార్గంమహిళలకు రక్షణ కల్పించాల్సిన కేబినెట్ వారి రక్షణ కవచాన్ని తొలగించడం దుర్మార్గం. మహిళల భద్రత కోసం దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచిన ‘దిశ‘ మోడల్‌ను ఏపీ ప్రభుత్వమే తొలగించడం సిగ్గుచేటు. – చింతా అనూరాధ, మాజీ ఎంపీ మహిళల విశ్వాసానికి పాతర వైఎస్ జగన్ మహిళల రక్షణ కోసం దిశ వ్యవస్థను నిర్మించారు. ఆ వ్యవస్థనే వెనక్కి తీసుకెళ్లడం చంద్రబాబుకు మహిళల భద్ర పట్టదనడానికి నిదర్శనం. మహిళల విశ్వాసాన్ని కేబినెట్ నిర్ణయంతో తుడిచి పెట్టేస్తున్న చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. – వరదు కల్యాణి, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు -
వైఎస్ జగన్‌ను ఎలా అడ్డుకుందాం?
సాక్షి, అమరావతి : మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలకు ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనపై గురువారం రాష్ట్ర మంత్రివర్గంలో విస్తృత చర్చ జరిగింది. అజెండా అంశాలు ముగిసిన తర్వాత మంత్రులతో ప్రత్యేక సమావేశంలో జగన్ పర్యటనలు, డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ చేస్తున్న ఆందోళనలపై చంద్రబాబు చాలాసేపు మాట్లాడారు. వైఎస్ జగన్ క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న స్పందనపై చంద్రబాబు చర్చించారు. ఆ పర్యటనలను తప్పుబడుతూ మాట్లాడాలని, అక్కడ జరిగిన విషయాలను ప్రజలకు వ్యతిరేకంగా చూపాలని ఆదేశించినట్లు తెలిసింది. ఉద్యమంపై బురద చల్లండి..! తాజాగా తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో వైఎస్ జగన్ పర్యటన అంచనాలకు అందని రీతిలో విజయవంతం కావడం, జనవాహిని పోటెత్తడంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఆ పర్యటలను నీరుగార్చేలా ప్రచారాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇక మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా డిమాండ్‌తో వైఎస్సార్సీపీ చేస్తున్న ఉద్యమంపై మంత్రులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది.ఇది ఇంకా తీవ్రమైతే ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుందని పేర్కొన్నట్లు తెలిసింది. యువతలో దీనిపై చర్చ జరుగుతోందని, ఇది జెన్‌జీని తీవ్ర స్థాయిలో ప్రభావితం చేస్తుందని మంత్రులు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఆ ఉద్యమంపై బురద జల్లాలని చంద్రబాబు మంత్రులకు సూచించనట్లు తెలిసింది. ఆ ఉద్యమంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు ఉన్నాయని ప్రచారం చేయాలని చెప్పినట్లు సమాచారం. వైఎస్సార్సీపీ నేతలకు రిజర్వేషన్ల గురించి తెలియదని చెప్పాలని ఆదేశించినట్లు తెలిసింది. మరోసారి పవన్ డుమ్మామంత్రివర్గ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి డుమ్మా కొట్టారు. గత మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. వరుసగా రెండు మంత్రివర్గ సమావేశాలకు ఆయన హాజరు కాకపోవడం కూటమిలో చర్చనీయాంశంగా మారింది. భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో ఆయన సమావేశంలో పాల్గొనలేదని టీడీపీ సర్దిచెప్పుకుంటున్నా పవన్ కావాలనే రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రివర్గ సమావేశాలకు దూరంగా ఉంటూ తన శాఖకు సంబంధించిన అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్షలు నిర్వహిస్తుండడం విశేషం. -
వైఎస్ జగన్‌ను కలిసిన వైఎస్సార్సీపీ గిరిజన నేతలు
సాక్షి, తాడేపల్లి: గిరిజన చట్టాలు, ఆదివాసీల హక్కుల పరిరక్షణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని.. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. గిరిజనుల హక్కులకు భంగం కలిగించే ప్రభుత్వ చర్యలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఆదివాసీల తరఫున బలమైన ప్రజాగొంతుకగా నిలవాలని పార్టీ ఎస్టీ సెల్ నాయకులకు సూచించారు.వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, డాక్టర్ తమర్బ నర్సింగరావు దంపతులు గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారితోపాటు పార్టీ మైదాన ప్రాంత ఎస్టీ సెల్ అధ్యక్షుడు సురేంద్ర, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్ కూడా వైఎస్ జగన్‌ను కలిశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి జ్ఞాపికను బహూకరించారు.ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ చట్టాల పరిరక్షణ, జీవో నంబర్–3 పునరుద్ధరణ, 1/70 చట్టంపై గిరిజనేతరులు దాఖలు చేసిన కేసులు, బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు, హైడ్రో పవర్ ప్రాజెక్టులపై గిరిజనుల్లో నెలకొన్న ఆందోళన తదితర అంశాలను వారు వైఎస్ జగన్‌కు వివరించారు. ఆయా అంశాలపై వారితో విపులంగా చర్చించిన వైఎస్ జగన్.. ఆదివాసీల ప్రయోజనాలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్–97ను రద్దు చేసి ఆదివాసీల హక్కులకు రక్షణగా నిలిచిన విషయాన్ని ప్రజలకు గుర్తుచేయాలని వైఎస్ జగన్ సూచించారు. గిరిజనుల చట్టాలు, హక్కులకు భంగం కలిగించే ఏ చర్యనూ ఉపేక్షించబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించాలన్నారు.కూటమి ప్రభుత్వ పాలనలో గిరిజన చట్టాలు, హక్కుల భద్రతపై ఆదివాసీల్లో తీవ్ర ఆందోళన నెలకొందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇటీవల యువత చేపట్టిన ఉద్యమానికి లభించిన స్పందనే గిరిజనుల్లో నెలకొన్న ఆందోళనకు నిదర్శనమన్నారు. ఆదివాసీల హక్కులను కాపాడేందుకు వైఎస్సార్సీపీ తరఫున నిరంతరం పోరాటం చేయాలని, ప్రభుత్వంపై పోరాడే విషయంలో ఎక్కడా రాజీపడవద్దని కొట్టగుళ్లి భాగ్యలక్ష్మితో పాటు ఎస్టీ సెల్ నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. -
వైఎస్ జగన్ భద్రతపై కేంద్ర హోంమంత్రికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఢిల్లీ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైఎస్సార్సీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రత కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనల్లో వరుసగా భద్రతా వైఫల్యాలు చోటుచేసుకుంటున్నాయని అమిత్ షాకు వివరించారు.ఇటీవల దేవరపల్లి పర్యటనకు భారీగా హాజరైనా సరిపడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదని ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ ఎంపీలు.. గత రెండేళ్లుగా వైఎస్ జగన్ రాష్ట్ర పర్యటనలన్నింటిలో ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. వైఎస్ జగన్ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందన్న వైఎస్సార్సీపీ ఎంపీలు.. ఆయనకు పటిష్టమైన భద్రత కల్పించేలా తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీల ఫిర్యాదుపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు. వైఎస్ జగన్ భద్రత అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఏపీలో క్షీణించిన శాంతిభద్రతలపై ఫిర్యాదుఅమిత్ షాను కలిసిన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని ఎంపీల బృందం.. వైఎస్ జగన్ భద్రతతో పాటు డీఎస్సీ అక్రమాలు, రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలపై ఫిర్యాదు చేశారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, అవినీతి జరిగిందని అమిత్ షా దృష్టికి ఎంపీలు తీసుకెళ్లారు.డీఎస్సీ అక్రమాలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో నిష్పాక్షిక విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నారని ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ ఎంపీలు.. మాజీ మంత్రి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టులను అమిత్ షాకు వివరించారు. గత రెండు నెలల్లో రాష్ట్రంలో నాలుగు లాకప్ మరణాలు సంభవించాయని ఆందోళన వ్యక్తం చేశారు.భారతి సిమెంట్స్‌ను అధికార పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని కార్యకలాపాలకు ఆటంకాలు కల్పిస్తున్నారని ఎంపీలు ఫిర్యాదు చేశారు. రాజకీయ కక్షసాధింపు చర్యలు రాష్ట్రంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించిన ఎంపీలు.. ప్రజాస్వామ్య హక్కులు, న్యాయపాలన, ప్రజల భద్రతను కాపాడేందుకు కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
YS జగన్ ను కలిసిన విద్యార్థి,నిరుద్యోగ JAC నేతలు
-
మా హోటల్ ని ఎవరూ పాడు చేయలేదు.. అసలు ఏమి జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పిన నిర్వాహకులు
-
వైఎస్ జగన్‌ను కలిసిన నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భరోసా ఇచ్చారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను విద్యార్థి, నిరుద్యోగ, యువజన జేఏసీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వారు వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణ, ఫలితాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆయనకు విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో కనీసం 10 వేల పోస్టులను నోటిఫికేషన్లో చేర్చేలా చూడాలని కోరారు. పోలీస్ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 35 ఏళ్లకు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మాజీ సీఎంకు విన్నవించారు.జేఏసీ ప్రతినిధుల విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. నిరుద్యోగుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ పోరాడుతుందని పునరుద్ఘాటించారు. నిరుద్యోగులకు ఎలాంటి అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. -
మీ ప్రభుత్వం చేసే కంపును ఎన్ని రోజులు ఇసుకేసి ఆపుతారు పేర్ని నాని ఫైర్
-
మా హోటల్లో ఏదో జరిగిందంటూ చెప్పమన్నారు: లక్ష్మీ
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతలు తమపై ఒత్తిడి చేశారని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి హోటల్ నిర్వాహకులు లక్ష్మీ అన్నారు. ‘‘మా హోటల్లో ఏదో జరిగిందంటూ చెప్పమన్నారు. తర్వాత తహశీల్దారు మా దగ్గరకు వచ్చి కలెక్టర్ దగ్గరకు రమ్మన్నారని చెప్పారు. కారు పంపిస్తామనీ అందులో రావాలనీ చెప్పారు. మాకు భయం వేసింది. వైఎస్ జగన్ హయాంలో మాకు ఇంటి స్థలాలు వచ్చాయి. ఆయన హయాంలో మాకు చాలా మేలు జరిగింది’’ అని ఆమె మీడియాకు వివరించారు.ఇవాళ.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని దేవరపల్లి హోటల్ నిర్వాహకులు కలిశారు. వైఎస్ జగన్ దేవరపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రం పర్యటనలో జనం రద్దీ వల్లే తోపులాట జరిగిందని.. అంతేకానీ వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని వైఎస్ జగన్‌కు హోటల్ నిర్వాహకులు చందన వరలక్ష్మి, చందన దివ్య వివరించారు.వైఎస్సార్సీపీ కార్యకర్తలు తమ హోటల్ ధ్వంసం చేశారన్న ప్రచారంలో వాస్తవం లేదన్న నిర్వాహకులు.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో తమ కుటుంబం లబ్ధిపొందినట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. -
సిగ్గుండాలి లోకేష్..! జగన్ తో నీకు పోలికేంటి
-
వైఎస్ జగన్ దేవరపల్లి టూర్ హైలైట్స్
-
వైఎస్ జగన్ భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసింది: పేర్నినాని
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. వైఎస్ జగన్ పర్యటనలో ఒక్క పోలీస్ కూడా కనిపించలేదని తెలిపారు. భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అని అన్నారు. జగన్ పర్యటనకు జనం రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. జనం రాకుండా పెద్ద ఎత్తున బారికేడ్లు పెట్టారు. పోలీసులను చంద్రబాబు ప్రైవేట్ సైన్యంగా వాడుకుంటున్నారు. గతంలో మేడరమెట్ల, రాప్తాడు, సత్తెనపల్లి పర్యటనల్లోనూ భద్రతా లోపాలు బయటపడ్డాయని తెలిపారు. జెడ్ ప్లస్ కేటగిరి భద్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే భద్రత ఇదేనా?ఇంజిన్ లేకుండా నడుపుతున్నారు!పొగాకు రైతులు గతంలో ఎప్పుడూ చూడని కష్టాలు చూస్తున్నారని పేర్ని నాని అన్నారు. ‘‘అసలు కొనే నాథుడే లేకుండా పోయారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని ప్రగల్భాలు పలుకుతున్నారు. అసలు ఇంజిన్ లేకుండా నడుపుతున్నారు. గత ఏడాది పరిస్థితులు చూసైనా ఈ ఏడు అయినా జాగ్రత్తలు తీసుకోలేదు. ఈ ఏడాది కూడా పొగాకు రైతుల గురించి పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. జగన్ పొగాకు రైతుల ఇబ్బందులపై ప్రశ్నించేందుకు వెళ్లారు. జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న జగన్ భద్రతను హోంశాఖ నిర్లక్ష్యం వహించింది. కానీ ఆయన సభలకు జనం రాకుండా అంచెలంచెలుగా ప్రజలను అడ్డుకుంటారు. ఈ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరూ అన్ని దారుల్లో వస్తున్నారు. దేవరపల్లి చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో జనాన్ని లోపలకి రానీయకుండా బారికేడ్లు పెట్టడానికి వందల మంది పోలీసులు ఉంటారు.చంద్రబాబు పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకోవటం దారుణం. డీజీపీ అయినా పోలీసులను మందలించలేదు. ఈ రెండేళ్లలో భద్రతా లోపాలు అనేకసార్లు కేంద్రానికి పంపాం. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా డీజీపీ స్పందించలేదు. అనంతపురం జిల్లా లో హెలికాఫ్టర్ దగ్గర భద్రత లేక విండ్ షీల్డ్ పగిలితే పైలెట్లను వేధించారు.గతంలో ఇలాగే చేసి ఉంటే మీరు తిరగ గలిగేవారా? ఏపీలో పోలీస్ వ్యవస్థ దిగజారిందని జనం మాట్లాడుకుంటున్నారు. జగన్ చేస్తుంది రాజకీయ పర్యటనలు కాదు. ప్రజల కష్టాలు చూడటానికే ఆయన వెళ్తున్నారు. సిగ్గులేకుండా బాధ్యత లేకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారు. జగన్ పర్యటనల్లో తొక్కిసలాటలు జరగాలి అని చూస్తున్నారు. జగన్ పర్యటనపై లోకేశ్ ట్వీట్ పెట్టి అక్కసు వెళ్లగక్కారు. వైసీపీ శ్రేణులు ఒక దుకాణం పగులగొట్టి హిందూ దేవుడి ఫొటో పగులగొట్టారని ట్వీట్ చేశారు.మరి సింహాచలం, తిరుపతి, శ్రీకాకుళం ఘటనల్లో పలువురు మృతి చెందారు.. మిమ్మల్ని ఎవరు క్షమిస్తారు? మీ ఆత్రమే తప్ప.. ఈ ప్రభుత్వం బతికేది లేదు. మీ ప్రభుత్వం పోవాలని టీడీపీ కార్యకర్తలే పూజలు చేస్తున్నారు. మీ ప్రభుత్వంలో కమ్మలు, కాపులు కూడా ఏడుస్తున్నారు. ఏపీలో అవినీతి చేయటానికి దేన్నీ వదలటం లేదు. దుకాణదారురాలు లక్ష్మీ వైసీపీ అభిమాని కాబట్టి మీ పప్పులు ఉడకలేదు’’ అని తెలిపారు.విజయ్‌కు జనాన్ని దూరం చేయగలిగారా? తమిళనాడులో విజయ్ సభలో ఏదో చేద్దామని ఆయన ప్రత్యర్థులు చూశారని అక్కడ ఏం సాధించారని పేర్ని నాని ప్రశ్నించారు. ‘‘విజయ్‌కు జనాన్ని దూరం చేయగలిగారా? సీఎం కాకుండా ఆపారా ? మీకు కూడా అదే గతి రాదా? సత్తెనపల్లి జగన్ పర్యటనలో కూడా ఇదే తరహాలో చేశారు. రెండేళ్లలో ఓటు వేసిన ప్రభుత్వాన్ని కూల్చే అధికారం లేదు కాబట్టి ప్రజలు మిన్నకుండిపోయారు. పోలీసులను జగన్ భద్రతకు వహించాలని డిమాండ్ చేస్తున్నాం. జగన్ మావిగన్ దెబ్బకి అమరావతిలో విజయవాడ, గుంటూరులు కలిపి ఉంచుతాం అంటున్నారు’’ అని తెలిపారు. -
వైఎస్ జగన్‌ని కలిసిన దేవరపల్లి హోటల్ నిర్వాహకులు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి హోటల్ నిర్వాహకులు ఇవాళ(గురువారం) కలిశారు. తమ హోటల్ని పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారంటూ టీడీపీ నేతలు చేస్తున్న విష ప్రచారాన్ని హోటల్ నిర్వాహకురాలు లక్ష్మీ ఖండించారు. వైఎస్ జగన్ పర్యటనలో జనం రద్దీ వల్లే తోపులాట జరిగిందన్న లక్ష్మీ.. అంతేకానీ వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే తమ కుటుంబం లబ్ధిపొందిందని హోటల్ నిర్వాహకులు అన్నారు.టీడీపీ నేతలు మాపై ఒత్తిడి చేశారు. మా షాపులో ఏదో జరిగిందంటూ చెప్పమన్నారు. తర్వాత తహశీల్దారు మా దగ్గరకు వచ్చి కలెక్టర్ దగ్గరకు రమ్మన్నారని చెప్పారు. కారు పంపిస్తామనీ అందులో రావాలనీ చెప్పారు. మాకు భయం వేసింది. జగన్ హయాంలో మాకు ఇంటి స్థలాలు వచ్చాయి. ఆయన హయాంలో మాకు చాలా మేలు జరిగింది. ఇవాళ వైఎస్ జగన్‌ని కలిసినందుకు ఆనందంగా ఉందని నిర్వాహకులు అన్నారు. -
సరిహద్దులు దాటిన క్రేజ్
కాకినాడ: రాష్ట్రాలకు సరిహద్దులున్నా.. ప్రజాదరణ ముందు అవన్నీ తల వంచాల్సిందేనని ఖమ్మం యువకులు నిరూపించారు. వైఎస్ జగన్ దేవరపల్లి పర్యటనలో ఖమ్మం నుంచి ప్రత్యేకంగా వచ్చిన యువకులు దాసరి మధు, రాజేష్ అరుణ్, రఘు సందడి చేశారు. వైఎస్ జగన్, కేటీఆర్, తమిళనాడు సీఎం దళపతి విజయ్ ఫొటోలతో.. ‘జన నాయకులు’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ, దేవరపల్లిలో జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల ప్రజల దశాబ్దాల కలను నిజం చేస్తూ.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి జగన్ ఘనతే కారణమని చెప్పారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడే భూసేకరణ చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ఈ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకువెళ్లారని, అందువల్లనే ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ అభిమాన నేతకు కృతజ్ఞతలు చెప్పేందుకే ఇక్కడకు వచ్చామంటూ ఆ యువకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. -
జక్కంపూడి సేవలు చిరస్మరణీయం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి, సీనియర్ నేత జక్కంపూడి రామ్మోహన్‌రావుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జక్కంపూడి చిత్రపటానికి పూలమాల వేసి ఆయన స్మరించుకున్నారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. జక్కంపూడి రామ్మోహన్రావు ప్రజల కోసం ఎన్నో సేవలు అందించిన నాయకుడని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన ఎంతో చొరవ చూపారని గుర్తు చేశారు. వైఎస్సార్ కుటుంబంతో జక్కంపూడి రామ్మోహన్‌రావుకు సుదీర్ఘ అనుబంధం ఉందని జగన్ పేర్కొన్నారు.ప్రజలతో మమేకమై పనిచేసిన నేతగా, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ప్రజల పట్ల జక్కంపూడి చూపిన అంకితభావం, చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని వైఎస్ జగన్ అన్నారు. -
జగన్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు.. అసహనమా? భయమా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ సమావేశాలలో ఏమని చెబుతుంటారో కాని, ఎల్లో మీడియాలో మాత్రం వచ్చే కధనాలు చూస్తే మాత్రం ఆయన ఇలా మాట్లాడడమేమిటా అనిపిస్తుంది. సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా , ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రిని ఇంతలా కించపరిచేలా ప్రసంగాలు చేస్తున్నారంటే అది ఆయనలోని భయం తెలియచేస్తుంది తప్ప మరొకటి కాదన్న అభిప్రాయం కలుగుతుంది. కొద్ది రోజుల క్రితం పార్టీ యూనిట్ ఇన్జార్జీల శిక్షణ తరగతులలో ఆయన స్పీచ్ ఇచ్చిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఆయనకు కూడా తగులుతాయన్న సంగతి మర్చిపోతున్నట్లుగా ఉంది. జనం ఛీకొట్టినా జగన్ ఇంతే అంటూ చంద్రబాబు మాట్లాడారని ఎల్లో మీడియాకు చెందిన ఒక పత్రిక హెడింగ్ పెట్టింది. ప్రజల మనోభావాలు గొడ్డలి పార్టీకి పట్టవు అని చంద్రబాబు అన్నట్లు మరో ఎల్లో మీడియా రాసింది. రాజకీయాలలో జనం ఛీకొట్టడం ఏమిటి? గెలుపుఓటములు అన్నవి సహజంగానే ఉంటాయి కదా!అంత మాత్రాన రాజకీయ పార్టీలు తమ కార్యకలాపాలను మానివేస్తాయా?ప్రజలలోకి వెళ్లకుండా ఉంటాయా?జగన్ శ్రీకాకుళం టూర్‌పై ఆయన తన అసహనం వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి ప్రధాని వస్తుంటే, జగన్ రెండు రోజుల ముందు ఈ టూర్ పెట్టుకోవడమని ఆయన ప్రశ్నించారట. అదేమిటి? ఈ కార్యక్రమానికి, జగన్ యాత్రకు సంబంధం ఏమిటి?అసలు సమస్య జగన్ కు జనం విపరీతంగా రావడం అన్నమాట. తమ సభలకు జనాన్ని బస్ లలో తరలించాల్సి వస్తుంటే జగన్ కు స్వచ్చందంగా ప్రజలు వస్తుండడం ఏమిటని ఆయనకు అనిపించవచ్చు. భోగాపురం సభకు జనాన్ని తీసుకురావడానికి వందల బస్సులు పెట్టడాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. జగన్‌కు జనంలో అంత విలువ,ఆదరణ ఉందేమిటన్నదే ఆయన కంగారుగా ఉంది. అది ఆయన బాధ. జగన్ యాత్రకు జనం రాకపోయి ఉంటే, ఇదే చంద్రబాబు ఏమనేవారు!ప్రజలు ఎవరూపట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించేవారా?కాదా? 2024లో ఎన్నికలలో ఏ కారణంతో అయితేనేమి.. వైఎస్సార్సీపీ ఓడిపోయిన మాట నిజమే కావచ్చు. కాని కూటమి అదికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ఎందుకు వ్యతిరేకత తెచ్చుకుంది. ఈ రెండేళ్లకాలంలో జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు పోటెత్తుతున్నారే?దీనిపై ఆలోచించకుండా జగన్ ను తిడితే ఏమి ప్రయోజనం వస్తుంది. చంద్రబాబు చెబుతున్న దాని ప్రకారం ఏదైనా పార్టీ ఓడిపోతే జనంలోకి వెళ్లకూడదా!మరి తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయింది కదా! అయినా అవకాశం ఉన్నా,లేకపోయినా, కావాలని కల్పించుకుని టూర్లు పెట్టుకుని ఎన్నిచోట్ల చంద్రబాబు అలజడులు సృష్టించారో తెలియదా!ఆయన చేస్తే అది ప్రజాస్వామ్యం.. ఎదుటివారు వెళితే అది ఇంకొకటి అవుతుందా!తెలుగుదేశం పార్టీ1983లో ఆవిర్భావం తర్వాత ఎన్నిసార్లు ఓటమికి గురైందో గుర్తు లేదా! ఉమ్మడి ఏపీలో 1989లో టీడీపీ అదికారం కోల్పోయింది. స్వయంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు కల్వకుర్తిలో పరాజయం చెందారు. ఆయన నుంచి పార్టీని గుంజుకున్న తర్వాత 2004లో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ఓడిపోయిందే!2009లో ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసి టిఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నా మళ్లీ ఎందుకు ఓడిపోయింది? రాష్ట్ర విభజన తర్వాత 2019లో ఓడిపోయింది కనుక చంద్రబాబు ప్రజలలోకి వెళ్లకుండా లేరే! పార్టీ క్యాడర్‌ను ఆయా సందర్భాలలో ఎలా రెచ్చగొట్టారో తెలియదా!మరో మాట చెప్పాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం పులివెందుల నుంచి 1978 నుంచి గెలుస్తూనే వస్తోంది. జగన్ ఒకసారి ఎంపీగా రాజీనామా చేసి తరిగి పోటీచేస్తే 5.45 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. చంద్రబాబు 1978లో చంద్రగిరి నుంచి గెలిచినా, 1983లో ఓడిపోయారు. ఆ తర్వాత అక్కడ నుంచి కుప్పం ను తన స్థావరంగా మార్చుకున్నారు. ఎందుకు సొంత నియోజకవర్గం వదలిపెట్టారో ఎప్పుడైనా చెప్పారా!అందువల్ల చంద్రబాబు తను చేసే విమర్శలు తనకే తగులుతాయన్న సంగతి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది కదా! ఇక ఈ మధ్య టీడీపీ ఎమ్మెల్యేలు కొందరిపై వస్తున్న ఆరోపణలు ఒక ఎత్తు అయితే, కూటమి ప్రభుత్వంపై ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులురెడ్డి చేసిన తీవ్ర ఆరోపణలు సంచనలంగా ఉన్నాయి. ప్రభుత్వంలో పెరిగిపోయిన అవినీతిని ఆయన ఎండగట్టారు.బహుశా ఆయనను దృష్టిలో ఉంచుకునేనేమో , పార్టీ టిక్కెట్ ఇచ్చింది కాబట్టే హీరోలు, లేకుంటే జీరోలే అని హెచ్చరించినట్లు అనిపించింది. పార్టీకి నష్టం కలిగించేవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. వరదరాజులరెడ్డి సీనియర్ నేత. ప్రొద్దుటూరు నుంచి పలుమార్లు గెలిచారు. ఆయన పార్టీకి నష్టం చేసేలా మాట్లాడారా? లేక ప్రభుత్వంలోని అవినీతిని ఎత్తి చూపారా?ముద్రగడ పద్మనాభం సంతాప సభలకు కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు,నేతలు వెళ్లడంపై కూడా ఆయన అసహనంగా ఉన్నారన్నది తెలిసందే. వారందరి గురించి పరోక్షంగా ఆయన మాట్లాడినట్లు ఉంది. అయితే చంద్రబాబు వ్యాఖ్యలను ఆ ఎమ్మెల్యేలు కూడా అంత సీరియస్ గా తీసుకుంటారా?లేదా?అన్నది చర్చనీయాంశమే. ఎందుకంటే పార్టీలో, ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో వారికి కూడా బాగానే తెలుస్తుంది కదా!నిత్యం వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అని సంభోధించి ఆత్మానందం చెందుతున్నారేమో తెలియదు. దానికి ప్రతిగా కొందరు వైఎస్సార్సీపీ నేతలు టీడీపీని బూడిద పార్టీ అని, వెన్నుపోటు పార్టీ అని అడ్రస్ చేస్తున్నారు జగన్ పైన, వైఎస్సార్సీపీ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చంద్రబాబు అలవాటుగా మార్చుకు్న్నారు. అయినా జగన్ పర్యటనలకు . జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారంటే తన వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని చంద్రబాబు అర్ధం చేసుకుంటే మంచిది కదా.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబు పాలన రైతులకు హానికరం... చంద్రబాబు పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ... వైఎస్ జగన్ ఆగ్రహం
-
ఉప్పెనలా తరలొచ్చిన జనం.. జగన్‌పై చెక్కుచెదరని అభిమానం (ఫొటోలు)
-
రాసిపెట్టుకోండి.. ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కడే రారాజు
-
జగన్ పర్యటన గ్రాండ్ సక్సెస్.. బాబు, లోకేష్ గుండెల్లో వణుకు
-
చంద్రబాబు ప్రభుత్వంలో కూడు దొరకడం లేదు
సాక్షి, రాజమహేంద్రవరం: ‘మీ పాలనలో కడుపు నిండా అన్నం తిన్నాం సార్.. చంద్రబాబు ప్రభుత్వంలో కూడు దొరకడం లేదు.. గిట్టుబాటు ధరా దక్కడం లేదు.. ఆత్మహత్యలే శరణ్యం సార్..’ అంటూ పొగాకు రైతులు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్వాకం కారణంగా మద్దతు ధర దక్కక ఆర్థికంగా చితికిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకుకు కనీస గిట్టుబాటు ధర దక్కక ఇక్కట్లు పడుతున్న రైతులతో నేరుగా మాట్లాడి ధైర్యం చెప్పడానికి బుధవారం వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలోని పొగాకు కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా రైతులు తమ అభిమాన నేత వైఎస్ జగన్‌ను చూడగానే కష్టాలు ఏకరువు పెట్టారు. ‘ఈ పాలన ఏం బాగోలేదన్నా.. మీరొస్తేనే రైతు రాజ్యం వస్తుందన్నా.. మీ హయాం అన్నదాతలకు స్వర్ణ యుగం అన్నా..’ అంటూ తమ ఆవేదన చెప్పుకున్నారు. ఈ సందర్భంగా అన్నదాతల ఆవేదన వారి మాటల్లోనే..మీరొస్తున్నారని రూ.10 పెంచారుపొగాకు రైతులు మిమ్మల్ని అమరావతిలో కలిశాక.. మీరు దేవరపల్లి వస్తున్నారని తెలుసుకుని చంద్రబాబు ప్రభుత్వం కిలోకు రూ.10 మద్దతు ధర పెంచింది. అయితే గ్రేడింగ్ పేరిట వ్యాపారులు ఆ మేరకు అంటే రూ.10 తగ్గించేశారు. ఈ ప్రభుత్వ మాయాజాలం ఇలా ఉంటోంది. ప్రస్తుతం కిలో రూ.170 నుంచి రూ.260 మధ్య కొనుగోలు చేస్తున్నారు. యావరేజ్ ధర రూ.230 కూడా రావడం లేదు. ఎకరాకు రూ.3 లక్షలపైనే ఖర్చవుతోంది. వ్యాపారులు సిండికేట్‌గా మారి నాణ్యమైన పొగాకును సైతం కిలో రూ.230కే తీసుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో సిండికేట్ వ్యాపారులకే మేలు జరుగుతోంది. సామాన్య రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. – జక్కుల భద్రం, కౌలు రైతు, దేవరపల్లిమన ప్రభుత్వంలో యావరేజ్ రూ.365 అన్నా.. మన ప్రభుత్వంలో దేవరపల్లి బోర్డు పరిధిలో కిలో పొగాకుకు గరిష్టంగా రూ.385 దక్కింది. యావరేజ్‌గా రూ.365 దక్కేది. ఇప్పుడా పరిస్థితి లేనే లేదు. గ్రేడింగ్ పేరుతో వ్యాపారులు సిండికేట్‌గా మారి దోచేసుకుంటున్నారు. కిలోకు ఒక్కోసారి రూ.170 కూడా దక్కడం లేదు. గరిష్టంగా రూ.260 దాటడం లేదు. 20 ఎకరాల్లో పంట సాగు చేశాను. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయాను. – సుంకవిల్లి వెంకట శ్రీనివాసరావు, సంగాయి గూడెం, దేవరపల్లి‘వడ్డీ లేని రుణం’ పథకం తీసేశారుమీరు దేవరపల్లి పర్యటనకు వస్తున్నారని చంద్రబాబు హడావిడిగా రూ.50 వేలు రుణం వడ్డీ లేకుండా ఇస్తానని ప్రకటించాడు. ఆ రూ.50 వేలు మూడేళ్లలో ఇస్తారంట. మన ప్రభుత్వంలో ఏడాదికి రూ.లక్ష వడ్డీ లేకుండా రుణాలిచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆ పథకాన్ని పూర్తిగా ఎత్తేసింది. రైతులు వ్యవసాయం మానేసేలా చేస్తోంది. – వల్లభనేని సత్యనారాయణ, పొగాకు రైతు, గోపాలపురంమీరొస్తేనే మంచి రోజులుకేజీ పొగాకు సాగు చేసేందుకు రూ.300 ఖర్చవుతుంటే... ఇక్కడ యావరేజ్‌గా రూ.230కే కొంటున్నారు. లో గ్రేడ్ పేరుతో వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను దోచుకుంటున్నారు. వచ్చే ఏడాది నుంచి సాగు విస్తీర్ణం తగ్గించేయమంటున్నారు. టొబాకో బోర్డు గతంలో ఒక్కో రైతు నుంచి 40 క్వింటాళ్లు కొంటామని చెప్పి.. ప్రస్తుతం 20 క్వింటాళ్లే కొంటామంటోంది. వచ్చే ఏడాది పది క్వింటాళ్లే కొంటామంటున్నారు. రైతులు ఇంత అన్యాయానికి గురవుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నా సరే మా కోసం వచ్చారు. మళ్లీ మీరు అధికారంలోకి వస్తేనే మాకు మంచి రోజులొస్తాయి. – వైఎస్ జగన్‌తో పలువురు రైతులు -
జెన్‌జీ.. ప్రభంజనం దేవరపల్లిలో జన జాతర
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మాజీ సీఎం వైఎస్ జగన్ దేవరపల్లి పర్యటనకు ప్రజలు, యువత బ్రహ్మరథం పట్టారు. దేవరపల్లి వీధులన్నీ జనసంద్రంగా మారాయి. వైఎస్ జగన్ బుధవారం ఉదయం 10.29 గంటలకు దేవరపల్లి గ్రామంలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి పొగాకు వేలం కేంద్రానికి కేవలం 2.6 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ మాత్రం దూరానికి 2 గంటలకు పైగా సమయం పట్టిందంటే ఏ స్థాయిలో ప్రజలు ఆయనకు స్వాగతం పలికారో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్ హెలికాఫ్టర్ దిగిన వెంటనే పెద్ద ఎత్తున యువత, ప్రజలు, అభిమానులు హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. పర్యటన సాగిన మార్గమంతా యువత, అభిమానులు, కార్యకర్తల సందడితో కోలాహలంగా మారింది. రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఎటు చూసినా జన సంద్రమే కనిపించింది. దారిపొడవునా జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చారు. జగన్ పర్యటనకు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని పలు గ్రామాలు, పట్టణాల నుంచి కార్యకర్తలు, అభిమానులు, రైతులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావడంతో దేవరపల్లిలో భారీ జనసందోహం కనిపించింది. ఉరకలేసిన జెన్ జీ వైఎస్ జగన్ రాక సందర్భంగా దేవరపల్లిలో యువత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా జెన్‌జీ యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి జగన్‌కు స్వాగతం పలికారు. యువకులు, విద్యార్థులు రోడ్ల వెంట నిలబడి జెండాలు, ప్లకార్డులతో స్వాగతం పలికారు. జగన్ వాహనం కనిపించగానే ‘జై జగన్.. సీఎం.. సీఎం’ అంటూ పెద్ద పెట్టున నినాదాలతో హోరెత్తించారు. పలుచోట్ల పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. మిద్దెలు, చెట్లెక్కిన అభిమానం వైఎస్ జగన్‌ను చూసేందుకు యువత, అభిమానులు చెట్లెక్కారు. మహిళలు మిద్దెలెక్కి మరీ జననేతను చూశారు. అడుగో.. జగన్.. అంటూ పిల్లలకు చూపించారు. జగన్ వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కోనసీమ పార్లమెంట్ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, సత్తి సూర్యనారాయణరెడ్డి, జి.శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ దేవరపల్లి పర్యటన గోదావరి జిల్లాల్లో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. -
తొక్కిసలాట జరగాలి.. జగన్‌పైకి తోయాలి
సాక్షి, రాజమహేంద్రవరం/సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పర్యటనను విఫలం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించింది. హెలిప్యాడ్ వద్ద, పొగాకు వేలం కేంద్రంలో పోలీసుల వైఫల్యం కళ్లకు కట్టింది. మాజీ ముఖ్యమంత్రి పర్యటనలో ఉద్దేశ పూర్వకంగానే సెక్యూరిటీని తగ్గించి.. తద్వారా గందరగోళం సృష్టించి.. తొక్కిసలాట జరిగితే జగన్ పైకి అపవాదు నెట్టేయాలన్నది ప్రభుత్వ పెద్దల కుతంత్రం అని స్పష్టమవుతోంది. అయితే వైఎస్సార్సీపీ నేతల పర్యవేక్షణతో ప్రభుత్వ పన్నాగం బెడిసికొట్టింది. వైఎస్ జగన్ బుధవారం ఉదయం 10.27 గంటలకు దేవరపల్లి సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అభిమాన నాయకుడికి స్వాగతం పలికేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, శ్రేణులు అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్నారు. అయినప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు నామమాత్రంగా సిబ్బందిని కేటాయించారు. వారు దూరంగా ఉండటంతో ఒక్కసారిగా జనం బారికేడ్లను తోసుకుని హెలీప్యాడ్ వద్దకు దూసుకుపోయారు. అప్పుడు అక్కడ కనీసం ఒక్క కానిస్టేబుల్ కూడా లేడు. దీంతో అతి కష్టం మీద వైఎస్ జగన్ కారు వద్దకు చేరుకుని.. ఎక్కారు. అప్పటికే చాలా మంది ఆ వాహనం చుట్టూ చేరిపోయారు. ఇటీవల మరణించిన పొగాకు రైతు పాల వెంకటేశ్వరరావు భార్య సీతారత్నం, కుమారుడు శ్రీనివాస్, కుమార్తె వెంకటరత్నం తమ సమస్యలు విన్నవించుకోగా.. నేనున్నానని భరోసా ఇస్తున్న వైఎస్ జగన్ ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు నేతలు, కార్యకర్తలు కింద పడిపోయారు. వెంటనే పలువురు నేతలు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అక్కడి నుంచి ర్యాలీగా పొగాకు వేలం కేంద్రంలో రైతులతో మాట్లాడేందుకు వైఎస్ జగన్ చేరుకోగానే, అక్కడా భారీగా జనం దూసుకొచ్చారు. వారిని నియంత్రించేందుకు లోపల పోలీసులు లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే పోలీసు ఉన్నతాధికారులు ఇలా ఇబ్బందికర, ప్రమాదకర పరిస్థితిని సృష్టించారని తెలుస్తోంది. ఇది ముమ్మాటికీ కుట్రే ‘వారం రోజులుగా తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు హెలిప్యాడ్, ఇతర పరి్మషన్లు, సెక్యూరిటీ గురించి కలెక్టర్‌కు, ఎస్పీకి లేఖల ద్వారా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. 400 మంది పోలీసులతో బందోబస్తు ఇస్తామని చెప్పి, అర్ధరాత్రి హుటాహుటిన ఆ సంఖ్యను సగం కంటే ఎక్కువగా తగ్గించారు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం, సామాన్య ప్రజలకు ఇంకేమి రక్షణ కల్పిస్తుంది? జగన్‌కు ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేక, ప్రభుత్వం పెద్దలే కుట్రపూరితమైన ఆలోచనతో సెక్యూరిటీని తగ్గించారు. ఇది ముమ్మాటికీ కుట్రే. ఈ విషయమై అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి, న్యాయ పోరాటం చేస్తాం’ అని వైఎస్సార్సీపీ పేర్కొంది.జన సందోహం వల్లేతోపులాటదీనితో వైఎస్సార్సీపీకి సంబంధం లేదుస్పష్టం చేసిన హోటల్ నిర్వాహకులుఓ ఛానల్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడిదేవరపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసం ప్రజలు విశేష సంఖ్యలో రావడం, వారిలో చాలా మంది తమ హోటల్‌కు రావడం వల్ల రద్దీ ఏర్పడి, స్వల్ప నష్టం జరిగిందని, ఈ ఘటనకు వైఎస్సార్సీపీకి సంబంధం లేదని తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలోని హోటల్ నిర్వాహకులు చందన వరలక్ష్మి, చందన దివ్య తెలిపారు. తమ కుటుంబం వైఎస్ జగన్ అభిమానులమని, ఆయన వల్ల ఎంతో లబ్ధి పొందామని వరలక్ష్మి చెప్పారు. తమ హోటల్ పొగాకు వేలం కేంద్రం గేటు పక్కన ఉండడం, పలువురు హోటల్లోకి రావడం వల్ల స్పల్ప తోపులాట జరిగి, కొంత నష్టం జరిగిందన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు హోటల్‌ను ధ్వంసం చేసినట్టు ఓ టీవీ ఛానల్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. హోటల్లో వీడియో తీయవద్దని, తమకు నష్ట పరిహారం వద్దని చెప్పామని, అయినా ఆ ఛానల్ ప్రతినిధి వీడియో తీసి తప్పుగా ప్రచారం చేశాడని మండిపడ్డారు. తాము ఎప్పటికీ జగన్ అభిమానులమేనని వరలక్ష్మి స్పష్టం చేశారు. -
బాబు పాలన 'రైతులకు హానికరం'
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 232 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి కాగా ఇప్పటివరకు కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్ కిలోలు మాత్రమే. మొత్తం ఉత్పత్తిలో సుమారు 21 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన పరిస్థితి ఇది. ఈ పరిస్థితికి బాధ్యత ఎవరిది? రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా.– వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు నాయుడు పరిపాలన రైతులకు హానికరం.. వ్యవసాయానికి ప్రమాదకరం.. ప్రస్తుతం రాష్ట్రంలో ఇలాంటి దుర్భర పరిస్థితులే నెలకొన్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో గతంలో కిలో పొగాకు ధర సగటున రూ.289 ఉంటే ఇప్పుడు రూ.214 మాత్రమే పలుకుతోందని.. ప్రతి కిలోపై రైతు రూ.75 చొప్పున నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. 2023–24లో రాష్ట్రవ్యాప్తంగా పొగాకు అత్యధిక ధర కిలో రూ.411 పలికితే.. ఇప్పుడు కేవలం రూ.214 మాత్రమే ఉందని, ఇవి కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘పీఐబీ’ అధికారికంగా విడుదల చేసిన గణాంకాలని తెలిపారు. ఒకవైపు ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు, పెట్టుబడి వ్యయం అన్నీ పెరుగుతుంటే.. మరోవైపు రెండేళ్ల క్రితం వచ్చిన ధరలు కూడా ఇప్పుడు రైతుకు రావడం లేదన్నారు. పొగాకు కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని.. ఎక్కడ చూసినా 30 నుంచి 40 శాతం రిజెక్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దగా సర్కారు తీరుతో నష్టపోతున్న పొగాకు రైతులతో స్వయంగా మాట్లాడేందుకు బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో వైఎస్ జగన్ పర్యటించారు. దేవరపల్లిలోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు. పొగాకు సాగు, కొనుగోళ్ల పరిస్థితి, రైతులకు అందుతున్న ధర, ఎదుర్కొంటున్న సమస్యలను వారిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పొగాకు రైతుల ఇక్కట్లు, ఇబ్బందులపై వారితో నేరుగా చర్చించారు. అనంతరం పొగాకు వేలం కేంద్రం బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే...అన్నింటా విధ్వంసం.. ప్రశ్నిస్తే అరెస్టులు చంద్రబాబు నాయుడు 26 నెలల పాలనలో అన్ని వర్గాలూ నష్టపోయిన పరిస్థితులు కనిపిస్తాయి. ఈరోజు చంద్రబాబు పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు.. మహిళా సాధికారత.. సుపరిపాలన.. అన్నింటిలోనూ విధ్వంసమే కనిపిస్తోంది. బాబు పాలనలో పొద్దున లేచినప్పటి నుంచి మనకు కనిపించేది ఏమిటి అంటే.. ఎవరైనా అన్యాయానికి గురైన పరిస్థితుల్లో ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు. ఇవి మాత్రమే కనిపిస్తాయి. రోడ్డెక్కుతున్న రైతులు.. చంద్రబాబు నాయుడు పార్టీ అంటే.. వెన్నుపోటు పార్టీ. ఈ వెన్నుపోటు పార్టీ వల్ల రాష్ట్రానికి, ప్రజలకు బాధ తప్ప ఇంకేమైనా మిగిలిందా..? అని అడుగుతున్నా. రాష్ట్రంలో ఇవాళ వ్యవసాయ రంగాన్ని తీసుకోండి. 67 శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో 26 నెలలుగా ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధరలు వచ్చాయా..? వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి, మినుములు, పెసర్లు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమాటా, కోకో, చీనీ.. చివరకు ఆక్వా రైతులకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఈ రోజు నేను దేవరపల్లికి వచ్చి పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడి ఉన్నా. పొగాకు పంటను తీసుకున్నా.. ఇవాళ కనిపిస్తున్నది సంక్షోభమే. రైతులు ఇవాళ రోడ్డున పడి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఆత్మహత్య చేసుకున్నా కనీసం పరామర్శ లేదు జంగారెడ్డిగూడెం సమీపంలోని బుట్టాయగూడెం మండలానికి చెందిన వెంకటేశ్వరరావు అన్న కుటుంబం నా కళ్ల ఎదుటే నిలబడి ఉంది. ఆ అన్నకు రెండు బ్యారెన్లు ఉన్నాయి. పది ఎకరాల్లో పంట సాగు చేసి.. గిట్టుబాటు ధర రాక, పంటను అమ్ముకునే పరిస్థితి లేక ఆ రైతు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఆ అన్న భార్య ఈ రోజు నా ఎదుట నిలబడి ఉంది. ఆ అమ్మ ఆక్రందన వినేందుకు, పరామర్శించేందుకు ఒక్క ఎంపీ, ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క మంత్రి కానీ వెళ్లలేదు. రేట్లు అన్యాయంగా పడిపోతున్నా.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నా కనీసం పరామర్శ కూడా చేయని ప్రభుత్వం ఇది. నాడు పొగాకుకు అత్యధికంగా రూ.411.. ఇప్పుడు కేవలం రూ.214 మాత్రమే ఒక్కసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పరిస్థితిని గుర్తు చేసుకుందాం. 2023–24లో రాష్ట్రవ్యాప్తంగా ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాలు కలిపి పొగాకు సగటు ధర కిలోకు రూ.289 చొప్పున లభించింది. అత్యధిక ధర కిలో రూ.411 చొప్పున కొనుగోలు జరిగింది. ఇవి నేను చెబుతున్న లెక్కలు కాదు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) 2025 జనవరి 1న అధికారికంగా విడుదల చేసిన గణాంకాలు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా విడుదల చేసిన గణాంకాలివీ. ఇవాళ పరిస్థితి చూస్తే.. ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాలు కలిపి రాష్ట్రంలో కిలో పొగాకు సగటు ధర కేవలం రూ.214 మాత్రమే. ఎక్కడ రూ.289?.. ఎక్కడ రూ.214? అంటే.. ఒకప్పుడు రూ.289 వచ్చిన చోట ఇప్పుడు రూ.214 మాత్రమే వస్తోంది. ప్రతి కిలోపై రైతు సుమారు రూ.75 నష్టపోతున్నాడు. ఇదే ఉత్తరాది ప్రాంతంలో, ఇదే దేవరపల్లి ప్రాంతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2023–24లో పొగాకు కిలో సగటు ధర రూ.326 పలికింది. ఇప్పుడు అదే ప్రాంతంలో ఆ సగటు ధర కేవలం రూ.236కి పడిపోయింది. ఖర్చులు పెరిగాయి.. ధరలు పతనం ఒకవైపు ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు, పెట్టుబడి వ్యయం అన్నీ పెరుగుతున్నాయి. మరోవైపు రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ధరలు కూడా ఇప్పుడు రైతుకు రావడం లేదు. పండించిన పంటను కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఉత్తరాదిలో 12 శాతమే కొనుగోలు.. ఈ ఉత్తరాది ప్రాంతంలో సుమారు 83 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి జరిగింది. 105 రోజుల వేలం ముగిసే సమయానికి కొనుగోలు చేసింది కేవలం 10 మిలియన్ కిలోలు మాత్రమే. అంటే పండించిన పంటలో సుమారు 12 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. టొబాకో బోర్డు రైతులకు గ్యారెంటీ ఇస్తూ లిఖితపూర్వకంగా హామీ కూడా ఇచ్చింది. పంట వేయండి, మేం కచ్చితంగా కొనుగోలు చేస్తామని చెప్పింది. 49.70 మిలియన్ కిలోలు టార్గెట్‌గా నిర్థారించి కొనుగోలు చేస్తామని చెప్పింది. వాళ్లు కొంటామని చెప్పిన తరువాతే రైతులు పంటలు వేశారు. ఆ హామీని నమ్మి సాగు చేశారు. ఇప్పుడు హామీ ఇచ్చిన మేరకు కొనుగోలు జరగడం లేదు. దేవరపల్లి వై జంక్షన్ వద్ద వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పట్టిన అశేష జనవాహినిలో ఓ భాగం పొగాకు రైతులకు దుర్భర పరిస్థితి.. రాష్ట్రంలో రైతులు నమ్మి పంట వేస్తే.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? టొబాకో బోర్డు లిఖితపూర్వకంగా రాష్ట్రంలో 142 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని నమ్మి రైతులు పంట వేశారు. కానీ చివరకు కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్ కిలోలు మాత్రమే. అంటే హామీ ఇచ్చిన పరిమాణంలో కేవలం 33 శాతం మాత్రమే కొనుగోలు చేసింది. 105 రోజుల వేలం ప్రక్రియ ముగిసిపోయినా రైతుల వద్ద ఇంకా పెద్ద మొత్తంలో పొగాకు నిల్వలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం రైతులకు ఎంతటి దుర్భర పరిస్థితిని తీసుకొచ్చిందో అర్థం చేసుకోవచ్చు. నా పర్యటన ప్రకటనతో రూ.10 పెంపు నేను దేవరపల్లి వస్తున్నానని ప్రకటించిన తర్వాత గత వారం, పది రోజులుగా కిలోకు సుమారు రూ.10 ధర పెరిగింది. లేదంటే ఆ పెంపు కూడా ఉండేది కాదు. సిండికేట్ పరిస్థితుల మధ్య ఈరోజు ఇక్కడ అత్యధిక ధర రూ.260 నుంచి రూ.262 వరకు మాత్రమే ఉంది. సగటు ధర రూ.174 వరకు పడిపోయింది. ఈ ధరలతో రైతు ఎలా బతుకుతాడు? ఎలా అప్పులు తీర్చుకుంటాడు? ఎలా మళ్లీ పంట వేస్తాడు? దళారులు సిండికేట్ అయినా నో యాక్షన్.. పొగాకు పంట కొనుగోలు సక్రమంగా జరగడం లేదు. ఎక్కడ చూసినా 30 నుంచి 40 శాతం వరకు పొగాకును రిజెక్ట్ చేస్తున్నారు. ‘నో బిడ్స్‘ పేరుతో వేలంలో కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దళారీ వ్యవస్థ పేట్రేగిపోయి అంతా సిండికేట్‌గా మారినా చంద్రబాబు ప్రభుత్వం ఒక్క కొనుగోలుదారుడిని కూడా బ్లాక్‌లిస్ట్ చేయలేదు. ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. రైతులకు భరోసా ఇచ్చే కార్యక్రమాలు ఒక్కటి కూడా చేయలేదు. చంద్రబాబు కంటితుడుపు మాటలు.. మరో తమాషా ఏమిటంటే.. పొగాకు రైతులు కష్టాల్లో ఉన్నారని చంద్రబాబు ఇప్పుడు గమనించారట! రూ.50 వేల వరకు వడ్డీలేని రుణాలు మూడేళ్ల పాటు ఇస్తామని చెబుతున్నారు. అయ్యా చంద్రబాబునాయుడూ మా ప్రభుత్వ హయాంలో రూ.లక్ష వరకు సున్నా వడ్డీ పంట రుణాలు పథకం ఉండేది. రైతులు సకాలంలో రుణాలు చెల్లిస్తే రూ.లక్ష వరకు సున్నా వడ్డీకే అందించాం. 84.66 లక్షల మంది రైతులకు రూ.2,050 కోట్ల మేర సున్నా వడ్డీ కింద ఇచ్చి ఆదుకున్న చరిత్ర వైఎస్సార్సీపీ ప్రభుత్వానిది. మరి మీరు ఏం చేశారు? సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. రైతులకే కాదు, మహిళలకూ సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. అందరినీ రోడ్డు మీద పడేసి.. కొత్త పథకాన్ని తీసుకొచ్చినట్లుగా, రూ.50 వేల వరకు ఇస్తామని, ఇక పండుగ చేసుకోమని డ్రామాలు ఆడుతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? అని చంద్రబాబును నిలదీస్తున్నా. ఆదుకుంటాం.. రెట్టింపు సాయం చేస్తాంవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా ఒత్తిడి తెస్తుంది. రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తుంది. ఈ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్న వెంకట్రావు అన్న లాంటి కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అండగా ఉంటాం. ఇది ప్రభుత్వ తప్పిదం కాబట్టి.. ప్రభుత్వం స్పందించాల్సిన సమయంలో స్పందించడం లేదు కాబట్టి.. ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా రూ.7 లక్షలు ఇవ్వడం లేదు కాబట్టి.. ఇవ్వని కారణంగా, ఆ రూ.7 లక్షలను డబుల్ చేసి, ఈ తల్లికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి చేస్తాం. మన ప్రభుత్వంలో ఏం చేశామంటే..అదే మన ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మార్క్‌ఫెడ్‌ను వెంటనే రంగంలోకి దింపాం. మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు ప్రారంభించగానే ప్రతి గ్రేడ్‌కు కనీస ప్రారంభ ధర నిర్ణయించాం. దీంతో కంపెనీల మధ్య పోటీ పెరిగింది. రైతులకు మంచి ధర వచ్చింది. రిజెక్ట్‌లు, ‘నో బిడ్స్‘ పరిస్థితి తగ్గింది. ఇదీ గతంలో జరిగింది! అంతే కాదు.. నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. ఐదేళ్లలో రూ.7,800 కోట్ల విలువైన పంటలను కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది. రైతన్నలు ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారీ ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుని ఆదుకుంది.దేవరపల్లిలో హెలిప్యాడ్ సమీపాన వైఎస్ జగన్‌ను చూడటానికి భారీగా తరలివచ్చిన జనసందోహంలో ఓ భాగం ఇప్పుడు చేతులెత్తేసిన సర్కారు...ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తోంది ఏమిటంటే.. దళారులతో రాజీ పడింది. నాకింత.. నీకింత అని కంపెనీలతో సర్దుబాట్లు చేసుకుంది. చేసుకుంది కాబట్టే.. మార్క్‌ఫెడ్‌ను పోటీ కొనుగోలుదారుగా మార్కెట్లోకి తీసుకురాలేదు. రైతును పూర్తిగా దళారుల దయాదాక్షిణ్యాలకే వదిలేసింది. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న మరో అన్యాయం ఏమిటంటే.. రాష్ట్రంలో 232 మిలియన్ కిలోల పొగాకు పండితే, ప్రభుత్వం కేవలం 94 మిలియన్ కిలోలకు మాత్రమే మద్దతు ఇస్తామని చెబుతోంది. అంటే.. మిగతా పంటను కొనుగోలు చేయబోమని చెప్పకనే చెబుతోంది. కంపెనీలకు కిలోకు రూ.20 సబ్సిడీ ఇస్తామని ప్రకటిస్తోంది. అంటే కంపెనీలు.. ఇప్పుడున్న ధర కంటే రైతులకు మరో రూ.20 తగ్గించి ఇచ్చేందుకు దారులు తెరిచింది. దీనివల్ల రైతులు పూర్తిగా నష్టపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైతుల ప్రయోజనాల కోసం పనిచేయాల్సింది పోయి.. రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం పనిచేయాల్సింది పోయి, కంపెనీల ప్రయోజనాల కోసం విధానాలు రూపొందిస్తోంది. అందుకే నేను స్పష్టంగా చెబుతున్నా. వెంటనే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపాలి. ప్రతి గ్రేడ్‌కు కనీస మద్దతు ధర ప్రకటించాలి. మార్కెట్లో పోటీ వాతావరణం తీసుకురావాలి. అప్పుడు మాత్రమే రైతుకు గిట్టుబాటు ధర లభిస్తుంది. మా ప్రభుత్వం హయాంలో ఇదే విధానాన్ని అమలు చేసి పొగాకు రైతులను ఆదుకున్నాం. ఇప్పుడు అదే మార్గం మాత్రమే రైతును కాపాడగలదు.రెండేళ్లుగా రైతులకు దగా..రైతులను రెండేళ్లుగా అన్ని విధాలా చంద్రబాబు అన్యాయం చేశారు. ఎన్నికల సమయంలో పీఎం కిసాన్‌కు అదనంగా ప్రతి రైతు కుటుంబానికీ ఏడాదికి రూ.20 వేల చొప్పున ‘అన్నదాత సుఖీభవ‘ పేరుతో ఇస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. మూడేళ్లకు కలిపి చంద్రబాబు ప్రతి రైతుకు రూ.60 వేలు ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం రూ.19 వేలు మాత్రమే. అంటే ఒక్కో రైతుకు రావాల్సిన రూ.41 వేలు ఇవ్వకుండా ఎగరగొట్టారు. పైగా సుమారు 7 లక్షల మంది రైతులను ఈ పథకం జాబితా నుంచే తొలగించారు. కౌలు రైతులను తీసేశారు. అటవీ హక్కుల చట్టం కింద భూములు సాగు చేస్తున్న గిరిజన రైతులను కూడా పథకం నుంచి తప్పించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని సైతం చంద్రబాబు రద్దు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ సీజన్లో పంట నష్టం జరిగినా, అదే సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేవాళ్లం. ఈ ప్రభుత్వం ఏం చేసింది? మొంథా తుపాను వచ్చి దాదాపు 10 నెలలు గడుస్తున్నా బాధిత రైతులకు ఇప్పటికీ ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ అందలేదు. రైతులకు గతంలో అందిన సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. ఉద్దేశపూర్వకంగా ఈ–క్రాప్, రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. వ్యవసాయ పరీక్షా ల్యాబ్‌లను బలహీనపర్చారు. రైతులకు అవసరమైన ఎరువుల ధరలు రెండేళ్లలో విపరీతంగా పెంచేశారు. మరోవైపు బ్లాక్‌లో దళారీల వద్ద రైతన్నలు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఈరోజు వ్యవసాయ రంగంలో ఉంది. ఆ ఒక్క పంటకే గిట్టుబాటు ధర.. సాగు చేస్తోంది వెన్నుపోటు పార్టీ వారే.. చంద్రబాబు హయాంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర రాలేదు. గిట్టుబాటు ధరలు వచ్చింది కేవలం ఒకే ఒక్క పంటకు. ఆ రైతులు కూడా చంద్రబాబు గారి వెన్నుపోటు పార్టీకి సంబంధించిన మనుషులే. అది ఏ పంటో తెలుసా..? అది గంజాయి!బాబు వింత మాటలు.. అంతా ఢమాల్ చంద్రబాబునాయుడు అంటాడు.. బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందంట. కాబట్టి వరికి గిట్టుబాటు ధరలు రాకుండా ఢమాల్ చేసే కార్యక్రమం చేశాడు. మిర్చి తింటే ఎసిడిటీ వస్తుందట! కాబట్టి మిర్చి పంటకు గిట్టుబాటు ధరలు రాకుండా ఢమాల్ చేశాడు. మామిడి తింటే షుగర్ వస్తుందట! అందుకే మామిడి పంటను ఢమాల్ చేశాడు. గిట్టుబాటు ధరలు లేకుండా రైతులను రోడ్డు మీదకి తెచ్చారు. ఇక పొగాకు పరిస్థితి చూస్తే హెల్త్ దెబ్బ తింటుందట! పొగాకుకు మంచి రేటు వస్తే బాగుండదని చెప్పి, పొగాకు రైతులను కూడా ఢమాల్ చేశాడు. కాబట్టి చంద్రబాబు పరిపాలన రైతులకు హానికరం.. వ్యవసాయానికి ప్రమాదకరం అన్నట్లుగా ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులున్నాయి. -
జగన్ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం
-
రాసిపెట్టుకోండి.. ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కడే రారాజు
-
రెండేళ్లలో మీ వల్ల జరిగింది ఇదే.. ! PIB రిపోర్ట్ చదివి వినిపించిన YS జగన్
-
దేవరపల్లిలో ఉప్పొంగిన జనగోదావరి
-
నీ 50 వేల రుణంతో పండగ చేసుకోవాలా? చంద్రబాబు ఏందయ్యా ఈ డ్రామాలు
-
దేవరపల్లిలో జగన్‌కు రైతుల ఘన స్వాగతం.. చెప్పిన సమస్యలివే!
-
మిర్చి తింటే అసిడిటీ.. మ్యాంగో తింటే షుగర్ బాబుపై జగన్ సెటైర్లు అదుర్స్
-
రైతుల జోలికి వచ్చావో.. వెళ్తూ వెళ్తూ జగన్ లాస్ట్ పంచ్ అదుర్స్
-
వైఎస్ జగన్ దేవరపల్లి పర్యటన.. ప్రజలు బ్రహ్మరథం (ఫొటోలు)
-
రైతు భుజం మీద చేయి వేసి జగన్ హామీ
-
రైతుల కోసం నేను నిలబడతా గిట్టుబాటు ధర ఎలా రాదో చూస్తా!
-
Watch Live: దేవరపల్లిలో YS జగన్ ప్రెస్ మీట్
-
LIVE: జగన్ ప్రెస్ మీట్ @ దేవరపల్లి
-
మీరు వస్తున్నారని 10 రూపాయలు పెంచారు.. పొగాకు రైతులతో జగన్
-
సీఎం.. సీఎం నినాదాలతో హోరెత్తిన దేవరపల్లి
-
ప్రేమతో జగన్ కి వాటర్ బాటిల్.. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే వీడియో
-
మావిగన్ దెబ్బకి.. ఆవిగన్.. జగన్ ఐడియాకు బాబు జై..!
-
భారీ గజమాలతో జగన్ కు ఘన స్వాగతం
-
దేవరపల్లిలో జగన్ క్రేజ్ ఈ వీడియో చూస్తే లోకేష్ నిద్రపోడు
-
జెన్‌జీ సైతం వైఎస్ జగన్ వెంటే..
సాక్షి, తూర్పు గోదావరి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవరపల్లి పర్యటనకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ముఖ్యంగా జెన్‌జీ (Gen Z) యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి జగన్‌కు స్వాగతం పలికారు. బుధవారం ఉదయం పర్యటన సాగిన మార్గమంతా అభిమానులు, కార్యకర్తల సందడితో కోలాహలంగా మారింది.వైఎస్ జగన్ రాక సందర్భంగా దేవరపల్లిలో యువత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెద్ద సంఖ్యలో యువకులు, విద్యార్థులు రోడ్ల వెంట నిలబడి జెండాలు, ప్లకార్డులతో తమ అభిమాన నేతకు స్వాగతం పలికారు. జగన్ వాహనం కనిపించగానే నినాదాలతో హోరెత్తించారు. పలుచోట్ల పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.జగన్ పర్యటనకు గ్రామాలు, పట్టణాల నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంతో దేవరపల్లిలో భారీ జనసందోహం కనిపించింది. యువత ఉత్సాహం, కార్యకర్తల నినాదాలతో పర్యటనకు ప్రత్యేక వాతావరణం ఏర్పడింది. సాధారణంగా.. జగన్ పర్యటనలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటుంటారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో యువత మద్దతు కీలకంగా మారుతున్న నేపథ్యంలో జెన్‌జీ యువత భారీగా పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.కొత్త తరం ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్న వేళ.. జగన్ పర్యటనలో యువత భాగస్వామ్యం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తన పర్యటనకు వచ్చిన ప్రజలు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు. దేవరపల్లి పర్యటన వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. -
దేవరపల్లి దద్దరిల్లేలా వైఎస్ జగన్ కాన్వాయ్
-
అమరావతి కాదు.. 'మావిగన్' వైపే అడుగులా?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఓటు వేయక తప్పలేదు. నిజమే!మీరు చదువుతున్నది కరెక్టే!. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి.. జగన్ కొన్నాళ్ల క్రితం ఏమన్నారు?. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు(మావిగన్) లను కలిపి రాజధాని కారిడార్‌గా అభివృద్ది చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల లక్షల కోట్ల ప్రజాధనం వెచ్చించవలసిన అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో మావిగన్ కు ఆమోదం తెలిపేవారు వైఎస్సార్సీపీకి, అమరావతికి అంగీకారం తెలియచేసేవారు కూటమికి ఓటు వేయవచ్చని, ఇది ఎన్నికల అంశంగా తీసుకుంటామని ఆయన సవాల్ చేశారు. జగన్ ఈ ప్రతిపాదన చేసినప్పుడు చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు పెద్ద ఎత్తున అవహేళన చేశారు. మతిస్థిమితం లేకుండా జగన్ మాట్లాడుతున్నారని, అలాంటి వ్యక్తులతో రాజకీయం చేయాల్సి వస్తోందని చంద్రబాబు విమర్శించారు. కానీ, ప్రజలు కూడా అటువైపే మొగ్గు చూపుతున్నారన్న సంగతి గ్రహించారేమో తెలియదు కాని, చంద్రబాబు కూడా యూటర్న్ తీసుకుని అమరావతి అంటే 29 గ్రామాలే కాదని, విజయవాడ, గుంటూరు, మంగళగిరి కూడా కలుపుకుని మౌలిక సదుపాయాలు అభివృద్ది చేయాలని అధికారులను ఆదేశించారట. ఆయన చెప్పినవాటిలో ఒక్క మచిలీపట్నం మాత్రం లేదు. బహుశా తర్వాత రోజుల్లో మచిలీపట్నాన్ని కూడా కలపవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.దీనిని బట్టి అర్ధం అయిందేమిటంటే వచ్చే ఎన్నికలలో జరిగే రిఫరెండమ్ వరకు ఆగకుండా చంద్రబాబే స్వయంగా జగన్ చేసిన మావిగన్ ను దాదాపు ఆమోదించినట్లే అవుతుంది. జగన్ ది మతిలేని ప్రతిపాదన అయితే ఇప్పుడు చంద్రబాబే ఎందుకు జై కొడుతున్నారో వివరణ ఇవ్వాలి కదా! ఈ రకంగా జగన్ కు చంద్రబాబే ఓటు వేసినట్లయిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అమరావతిలో విజయవాడ, గుంటూరులు కలిస్తున్నాయని చెబుతున్నప్పుడు ఇంకా లక్షన్నర ఎకరాల భూమిని ఎందుకు సమీకరించాలని ప్రయత్నిస్తున్నారన్న ప్రశ్న వస్తోంది. భూ సేకరణపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ వంటివారు ఆ ప్రాంతాన్ని సందర్శించి బలవంతపు భూ సేకరణ పద్దతి కాదని ప్రభుత్వానికి హితవు చెప్పారు. అయినా వినే పరిస్థితి లేదు. ప్రభుత్వం రెండో దశ పూలింగ్ అనగానే అమరావతిలో భూముల ధరలు సగానికి సగం పడిపోయాయని, అయినా కొనేవారు రావడం లేదని, అంతా అయోమయంగా మారిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వారు ఈ విషయాలను సోషల్ మీడియాలో కూడా చెబుతున్నారు. విజయవాడ,గుంటూరు ప్రాంత ప్రజలలో వస్తున్న అసంతృప్తిని గమనించి బహుశా తన వైఖరి మార్చుకుని ఉండవచ్చు. ఆయన చెబుతున్నట్లు అధికారులు ఆ ప్రాంతంలో పనులు చేపట్టదలిస్తే అందుకు నిధులు కేటాయించాలి కదా!అవేమీ లేకుండా మీడియాలో ప్రచారానికి మాత్రమే చెబితే ఏమి ఉపయోగం అన్న భావన వ్యక్తం అవుతోంది. గత ఏడాది డిసెంబర్ లో పార్లమెంటులో అమరావతికి చట్టబద్దత తీసుకువచ్చిన సందర్భంలో కూడా అమరావతి అంటే 29 గ్రామాల పరిధినే ఎందుకు పెట్టారు? విజయవాడ, గుంటూరు కూడా ఇందులో ఉంటాయని ఎందుకు ప్రకటించలేదు?కొద్ది రోజుల క్రితం సిఆర్డిఎ విడుదల చేసిన ఒక ప్రకటనలో 29 గ్రామాలలోనే రాజధాని నిర్మాణం నిమిత్తం భూములు సమీకరించినట్లు తెలిపింది.ప్రస్తుతం ఈ గ్రామాల పరిధిలోనే సుమారు 50వేల కోట్ల వ్యయం అయ్యే పనులు చేపట్టారు. రోడ్లు నిర్మాణం, తదితర సదుపాయాలు కల్పించడానికి ,భవనాల నిర్మాణానికి వ్యయం చేస్తున్నారు. వీటిలో అత్యధిక భాగం డూప్లికసీ తప్ప మరొకటి కాదనిపిస్తుంది.ఇప్పటికే ఒక అసెంబ్లీ భవనం ఉంది అయినా మరొకటి నిర్మిస్తున్నారు. సచివాలయ భవనాలు ఉన్నాయి. అయినా మళ్లీ కడుతున్నారు. పైగా ఏభై అంతస్తుల నిర్మాణాలు చేస్తున్నారట. ఎంతమంది ఉద్యోగులు ఉంటారు? ఎంత స్పేస్ అవసరం అన్నదానితో నిమిత్తం లేకుండా ఈ భవనాలు చేపట్టారన్న విమర్శలు ఉన్నాయి. ఒక భవనంలో హైకోర్టు ఉంది. మళ్లీ కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు.ఇవేకాదు. విజయవాడలో పెద్ద రైల్వే జంక్షన్ ఉంది. జాతీయ రహదారిని ఆనుకుని విమానాశ్రయం ఉంది. గుంటూరులో రైల్వే స్టేషన్ ఉంది. అయినా ఇవన్ని మళ్లీ కడతారట. అది కూడా అమరావతిలో మారుమూల ప్రాంతాలలో అట. ఇందుకోసం రైతులను పీడించి మరీ భూములు తీసుకోవడానికి యత్నిస్తున్నారు. ఇవికాక రైతుల నుంచి తీసుకునే పొలాలకు బదులు వారికి అభివృద్ది చేసిన ప్లాట్లు ఇవ్వాలి. అవి ఇప్పటికీ గ్రాఫిక్స్ లోనే ఉన్నాయి. ఈ ప్లాట్ల అభివృద్దికి ఎన్నివేల కోట్లు అవుతాయో తెలియదు. వరద సంగతి సరేసరి. వేల కోట్ల వ్యయం చేసి రిజర్వాయిర్లు, లిఫ్ట్ లు ఏర్పాటు చేయవలసి ఉంది. ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఐదెకరాల స్థలం తీసుకుని ఇల్లు కట్టుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం చదరపు అడుగుకు ఐదారువేల రూపాయల వ్యయం చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏకంగా 15వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు చేయడం అందరిని నివ్వెరపరుస్తోంది. అవకాశం వచ్చినప్పుడల్లా అమరావతి స్వయం సమృద్ది(సెల్ఫ్ ఫైనాన్స్ ) నగరం అని ప్రచారం చేస్తూ వచ్చారు. అమరావతికి ప్రజల సొమ్ము రూపాయి అవసరం లేదని, అమరావతి భూముల నుంచే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని వాదించేవారు. తీరా చూస్తే ఇప్పుడు అప్పులే,అప్పులు. అంతేకాక బడ్జెట్ లో కూడా సుమారు ఆరువేల కోట్లు కేటాయించారు. అంటే ఇదంతా రాష్ట్ర ప్రజలందరికి సంబంధించినదే. తాజాగా అప్పులు ఇచ్చిన సంస్థలకు రుణ చెల్లింపులకు ప్రభుత్వం 231 కోట్లు విడుదల చేసింది. అంటే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ నగరం కాదని, ప్రజలపై భారం వేసే సిటీ అని ఒప్పుకున్నట్లయింది. అయితే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాత్రం అమరావతి పూర్తి అయితే ఏటా 12వేల కోట్ల ఆదాయం వస్తుందని కొత్త ప్రచారం ఆరంభించారు. అది ఎలా సాధ్యమో తెలియదు. గతంలో అయితే ప్రభుత్వం ఇక్కడ తనకు వచ్చే వాటా భూములను అమ్ముతుందని , తద్వారా నిర్మాణాలు చేస్తుందని అనేవారు.కాని ఆ తర్వాత కాలంలో మాట మార్చి, 33వేల ఎకరాలు చాలదని, మరో ఏభైవేల ఎకరాలు తీసుకుంటామంటూ గాత్రం అందుకున్నారు. అక్కడితో ఆగడం లేదు. ఏకంగా 1.75 లక్షల ఎకరాలకు పూలింగ్ విస్తరించనున్నారు. అంటే ఈ రాజధాని నిర్మాణం ఎప్పటికి పూర్తి అవుతుందో,ఎప్పటి నుంచి ఆదాయం వస్తుందో ఎవరూ చెప్పలేరన్నమాట. మరోవైపు పూలింగ్ కు ఇవ్వని రైతుల నుంచి బలవంతంగా భూ సేకరణ చేస్తున్నారు. పోనీ వారికి మార్కెట్ రేటు ప్రకారం ధర ఇస్తున్నారా అంటేఅదేమీ లేదు.ఉండవల్లి ప్రాంతంలో ఎకరా ధర ఎప్పటి నుంచో ఐదు కోట్ల నుంచి పదికోట్లు ఉంటే ప్రభుత్వం కేవలం 73 లక్షలు చొప్పునే లెక్క కడుతోందట. రాష్ట్రం అంతటా భూముల విలువలను ప్రభుత్వం పెంచినా అమరావతి ప్రాంతంలో పెంచకపోవడానికి కారణమిదేనట. వరల్డ్ బ్యాంక్ వంటి వాటికి గజం నలభై ఐదువేల రూపాయల వరకు ఉందని చెబుతున్న ప్రభుత్వం రైతుల వద్దకు వచ్చేసరికి ధరను తగ్గించి వేసిందని అంటున్నారు. అమరావతిలో అభివృద్ది మాటేమోకాని, ఎల్లో మీడియాలో మాత్రం ఏదేదో జరిగిపోతున్నట్లుగా ఊదరగొట్టి ప్రజలను మభ్యపెట్టాలని విశ్వయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు ఈనాడులో ఈ మధ్య వచ్చిన వార్తలు చూడండి. అమరావతిలో మినీ అమెజాన్ అట. ఐదెకరాలలో అమెజాన్ వచ్చేస్తుందట. అతిశయోక్తులతో స్టోరీ వండి వార్చారు. ఎమ్యూజ్ మెంట్ పార్కు, ఎకో టూరిజం రిసార్ట్, స్నో వరల్డ్, లండన్ ఐ మాదిరి అమరావతి ..ఇలా ఒకటేమిటి? వాటిలో కొన్ని వస్తే రావచ్చు.లేకపోతే లేదు.కాని ఎల్లో మీడియా పత్రికలలో చూస్తే మాత్రం అంతా జరిగిపోయినట్లే ఉంటుంది. ప్రజలను మభ్యపెట్టడంలో ఎల్లో మీడియా తన వంతు పాత్ర పోషిస్తోంది. అమరావతికి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 500 మీటర్ల రింగ్ రోడ్డు వేస్తారట. డల్లాస్ వంటి నగరానికే 250 మీటర్ల రోడ్డు ఉంది.హైదరాబాద్ లో 150 మీటర్లే ఉంది.ఇంకా అభివృద్ది మొదలుకాని అమరావతికి మాత్రం అరకిలోమీటర్ రింగ్ర్ రోడ్డేమిటని అంతా బిత్తరపోతున్నారు.ఇప్పటికే ఉన్న వెస్ట్ బైపాస్ రోడ్డు జగన్ టైమ్ లోనే దాదాపు పూర్తి అయింది.అది చాలదట. చివరిగా ఒక మాట. మావిగన్ అంటూ జగన్ ప్రస్తావించగానే, ఎల్లో మీడియాగా పేరొందిన ఆంద్రజ్యోతి వైసిపి నేతలను అసభ్య పదాలతో దూషిస్తూ ఒక వ్యాఖ్య చేసింది. మరి ఇప్పుడు చంద్రబాబు కూడా మావిగన్ లో మూడువంతుల భాగానికి ఓటు వేశారు.అంటే ఎల్లో మీడియా ఇంతకు ముందు తప్పుడు కూతలు కూశానని ఒప్పుకుంటుందా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వైఎస్ జగన్ రాకతో పోటెత్తిన దేవరపల్లి
-
దేవరపల్లిలో అడుగుపెట్టిన జగన్... హెలికాప్టర్ దిగగానే..
-
రాసిపెట్టుకోండి.. ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కడే రారాజు
ఒక నాయకుడి అసలైన బలం.. జనం. అందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ పర్యటనకు వెళ్లినా ప్రజా స్పందనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంటుంది. జగన్ పర్యటనలను నియంత్రించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ముందుంచి ఆంక్షలు విధిస్తోంది. అయితే, ప్రతిసారీ ప్రజల నుంచి వస్తున్న స్పందన ఆ ప్రయత్నాలకు భిన్నమైన చిత్రాన్ని చూపిస్తోంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి పర్యటన మరోసారి ఇదే చర్చకు వేదికైంది. గత రెండేళ్లుగా.. కూటమి ప్రభుత్వంలో పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారంటూ వారి సమస్యలను తెలుసుకునేందుకు జగన్ దేవరపల్లి పర్యటన చేపట్టారు. రైతులను పరామర్శించడంతో పాటు పొగాకు యార్డ్‌ను పరిశీలించారు. అయితే ఈ పర్యటనకు పోలీసులు పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. జనసందోహం మాత్రం తగ్గలేదు.బారికేడ్లు, భద్రతా ఏర్పాట్లు, నియంత్రణ చర్యలు ఉన్నప్పటికీ జగన్‌ను చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రోడ్ల వెంట, పర్యటన మార్గాల్లో జనం బారులు తీరడం కనిపించింది. ఈ క్రమంలో.. ఓ మహిళ ప్రదర్శించిన ఫొటో అందరి దృష్టిని ఆకర్షించింది. “ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కడే రారాజు” అంటూ జగన్ చిత్రాన్ని చూపించడం సోషల్ మీడియాలోనూ చర్చకు దారితీసింది. చుట్టుపక్కల మహిళలు, కార్యకర్తలు ఆ ఫొటోను పైకి ఎత్తి పట్టుకోగా.. పలువరు ఆ ఫొటోతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అదే సమయంలో.. రాసిపెట్టుకోండి 2029లో జగనే సీఎం, వైఎస్ జగన్ మా దేవుడు అంటూ కొందరు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. తమ నాయకుడిపై ఉన్న ఆదరణకు ఇదే నిదర్శనమంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.జగన్ పర్యటనలపై ప్రభుత్వం గత రెండేళ్లుగా ఆంక్షలు విధిస్తోంది. కేసులు పెడతామని నేతలను, ఆ వైపు వెళ్లనీయకుండా సాధారణ ప్రజలను ఇబ్బండి పెడుతోంది. అదేసమయంలో సరైన భద్రత కల్పించకుండా.. డ్రామాలు ఆడుతోంది. అయితే బారికేడ్లు, ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేసినా ప్రజల అభిమానం మాత్రం తగ్గడం లేదు. రాజకీయంగా చూస్తే.. ప్రతి పర్యటనలోనూ కనిపిస్తున్న జన స్పందన వైఎస్సార్సీపీకి బలాన్ని చేకూరుస్తోంది. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. నాయకుడిపై అభిమానం ఉంటే జనాలు స్వచ్ఛందంగా తరలివస్తారనే వాదనకు జగన్ పర్యటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. -
జగన్ టూర్ తో బాబుకు టెన్షన్.. దెబ్బకు పొగాకు రేట్లు పెంపు
-
Watch Live: వైఎస్ జగన్ దేవరాపల్లి పర్యటన
-
బాబూ.. రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా?: వైఎస్ జగన్
సాక్షి, దేవరపల్లి: ఏపీలో చంద్రబాబు పాలనలో విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో విధ్వంసం కనిపిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులకు పాల్పడుతున్నారని విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. గిట్టుబాటు ధర లేక పొగాకు రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు.వైఎస్ జగన్ బుధవారం తూర్పు గోదావరి జిల్లాలోని దేవరపల్లిలో పర్యటించారు. ఈ సందర్బంగా పొగాకు యార్డులో రైతులను పరామర్శించి.. కొనుగోలు కేంద్రం వారితో ముఖాముఖి అయ్యారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ’చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలు నష్టపోతున్నాయి. విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో విధ్వంసం కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు. చంద్రబాబుది వెన్నుపోటు పార్టీ. చంద్రబాబు వల్ల ప్రజలకు బాధే మిగిలింది. 27 నెలల బాబు పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో రైతులు రోడ్డునపడ్డారు. రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వానికి కనబడటం లేదా?. బాధిత రైతు కుటుంబాలను కనీసం పరామర్శించలేదు.చంద్రబాబు పాలనలో రైతులు నష్టపోయారు. పొగాకుతో పాటు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. పొగాకు రైతులు ఆందోళనలో ఉన్నారు. గిట్టుబాటు ధర రాక వెంకటేశ్వరరావు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పెద్దలు పరామర్శించలేదు. వైఎస్సార్సీపీ హయాంలో పొగాకు ధర రూ.289గా ఉంది. కానీ, ఇప్పుడు కేజీ పొగాకు ధర రూ.236 మాత్రమే పలుకుతోంది. కూటమి ఉత్తరాది ప్రాంతంలో టొబాకో బోర్డు 49.70 మిలియన్ కేజీల పొగాకును కొనుగోలు చేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినప్పటికీ 10 మిలియన్ కేజీలు (20% కంటే తక్కువ) మాత్రమే కొనుగోలు చేశారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం 232 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి కాగా. ఇప్పటివరకు కేవలం 47.3 మిలియన్ కేజీలు (సుమారు 21%) మాత్రమే కొనుగోలు జరిగింది. వేలం కేంద్రాలలో 30% నుండి 40% వరకు పొగాకును రిజెక్ట్ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి ప్రతి గ్రేడ్‌కు ప్రారంభ ధరను నిర్ణయించడం వల్ల కంపెనీల మధ్య పోటీ పెరిగి రైతులకు మంచి ధర లభించింది. రూ. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఐదేళ్లలో రూ. 7,800 కోట్ల మేర కొనుగోళ్లు చేపట్టాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు రూ. 1 లక్ష వరకు సున్నా వడ్డీ రుణాలు ఇచ్చాం. 84.66 లక్షల మంది రైతులకు రూ. 2,050 కోట్లు అందించాం. చంద్రబాబు వచ్చాక సున్నా వడ్డీ పథకం రద్దు చేశారు. రైతు భరోసా సాయంలో కూడా కోతలు పెట్టారు. చంద్రబాబు పాలన రైతులకు హానికరం. కూటమి ప్రభుత్వం దళారీతో రాజీ పడింది. దళారులు సిండికేటుగా మారి రైతుల పొట్టగొడుతున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆదుకుంటాం’ అని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్‌తో ఆవేదన చెప్పుకున్న రైతులు..అంతకుముందు.. వైఎస్ జగన్‌తో దేవరపల్లి పొగాకు రైతులు తమ ఆవేదనను చెప్పుకున్నారు. గిట్టుబాటు ధర లేదని వాపోయిన పొగాకు రైతులు. కూటమి ప్రభుత్వం వచ్చాక నష్టపోయామని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఎమ్మెల్యే, ఎంపీగానీ ఇక్కడికి రాలేదన్న రైతులు. 98 శాతం పొగాకును రూ.170కే కొంటున్నారు. మీరు వస్తున్నారని రూ.10 పెంచారు.వైఎస్సార్సీపీ హయాంలో లక్ష వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో రుణానికి వడ్డీ వసూలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందన్నారు. కేజీ పొగాకుకు రూ.70 నష్టపోతున్నాం. పొగాకు కొనే దాని కంటే రిజక్ట్ చేసేదే ఎక్కువ. ఎకరానికి రూ.3 లక్షల పెట్టుబడి.. గిట్టుబాటు రావడం లేదు. వైఎస్సార్సీపీ హయాంలో లోగ్రేడ్ పొగాకు కూడా కొనేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వంతో మేము నష్టపోతున్నాం అని అన్నారు. -
సర్కారు వారి పగాకు
ప్రపంచంలో ప్రతి ఉత్పత్తికీ ధర నిర్ణయించుకునే హక్కు ఉత్పత్తిదారుకు ఉంటుంది. కానీ, రైతు పరిస్థితి మాత్రం దీనికి భిన్నం. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని, భారీగా పెట్టుబడి పెట్టి.. చంటిబిడ్డలా పంటను సాకి.. దండిగా దిగుబడులు సాధించినా.. దానికి ధర నిర్ణయించుకునే హక్కు మాత్రం అతడి చేతిలో లేకుండా పోతోంది. దళారులు, మార్కెట్ శక్తులు పంట ధరలను శాసిస్తూ రైతన్న బతుకుతో చెలగాటమాడుతున్నాయి. కళ్ల ముందే ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు చిత్తవుతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: పొగాకుకు కంపెనీలు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు.. రకరకాల సాకుల తో అంతంత మాత్రంగానే కొనుగోళ్లు చేస్తున్నాయి.. వేలం కేంద్రానికి తీసుకెళ్తున్న బేళ్లను తిరస్కరి స్తున్నాయి.. రైతుల వద్ద భారీగా నిల్వలు పేరుకుపో తున్నాయి.. వాతావరణ మార్పులతో ఆకు నాణ్యత దెబ్బ తింటోంది.. ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు.. గతంలో ఎన్నడూ లేనివిధంగా పొగాకు రైతులు పుట్టెడు కష్టాల్లో చిక్కుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు.ఏటా ఆగస్టు నెలాఖరుకే పొగాకు కొనుగోళ్లు పూర్తవుతూండగా.. ఈ ఏడాది ఆగస్టు మొదటి వారం వచ్చినా అంతంతమాత్రంగానే ఉన్నాయి. మరోవైపు రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంటితుడుపు చర్యలతోనే సరిపెడుతున్నాయి తప్ప, రైతుకు లాభసాటి ధర దక్కేలా ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఉత్తర తేలిక నేలల్లో (ఎన్ఎల్ఎస్) 2025–26 పంటకాలంలో 12,938 మంది రైతులు 30,145 హెక్టార్లలో పొగాకు సాగు చేస్తున్నారు. రీజియన్‌లోని జంగారెడ్డిగూడెం–1, 2, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లిల్లోని వేలం కేంద్రాల్లో మార్చి 25న పొగాకు కొనుగోళ్లు ప్రారంభించారు. ఇప్పటి వరకూ 96 రోజులు వేలం నిర్వహించగా 11 శాతం మాత్రమే పొగాకు విక్రయాలు జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ప్రస్తుతం కిలో సగటు ధర రూ.237 మాత్రమే పలుకుతోంది. ఈ ధర రూ.350 పలికితే కనీసం పెట్టుబడి అయినా దక్కుతుందని రైతులు ఆశ పడుతున్నారు. కానీ, ఆ సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. రైతుల వద్ద భారీగా నిల్వ ఈ పరిస్థితుల్లో ఒక్కో రైతు వద్ద ఉన్న రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ పొగాకు నిల్వ ఉండిపోవడంతో సర్వత్రా తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు ఎగుమతి ఆర్డర్లు ఇప్పటి వరకూ ఖరారు కాలేదని ట్రేడర్లు చెబుతున్నారు. ప్రధాన ఎగుమతి సంస్థలు పొగాకు శాంపిల్స్ తీసి, వివిధ దేశాల్లోని సిగరెట్ల తయారీ సంస్థలకు పంపించినప్పటికీ ఆర్డర్లు ఖరారు కాలేదు. దీంతో, కొనుగోళ్ల ప్రక్రియ వచ్చే జనవరి వరకూ నిర్వహించనున్నట్లు సమాచారం. కొనుగోళ్ల ప్రక్రియ నెలల తరబడి సాగితే పొగాకు నాణ్యత మరింత దెబ్బ తిని, నష్టాల్లో కూరుకుపోతామని గగ్గోలు పెడుతున్నారు. మార్కె ట్లో సంక్షోభం నెలకొని, రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. వెంటనే గిట్టుబాటు ధరకు మొత్తం పొగాకు కొనుగోళ్లు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఎకరాకు రూ.3 లక్షల పెట్టుబడి ఎకరం విస్తీర్ణంలో పొగాకు సాగుకు అన్ని ఖర్చులూ కలిపి రూ.2.70 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ రైతులు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం మార్కెట్లో అంతంత మాత్రంగానే ధర లభిస్తూండటంతో ఎకరాకు రూ.1.60 లక్షల వరకూ నష్టం వస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు. రైతులు వేలానికి తెచ్చిన బేళ్లను కూడా ట్రేడర్లు పూర్తిగా కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో, సాగుకు తెచ్చి న అప్పులకు నెలల తరబడి వడ్డీలు చెల్లించలేక రైతు లు సతమతమవుతున్నారు. కౌలు రైతులైతే మరింత కుదేలయ్యారు. ఎకరం కౌలు రూ.70 వేలు కాగా, బ్యారన్ అద్దె రూ.2.50 లక్షలు, పెట్టుబడి రూ.1.50 లక్షలు కలిపి వారికి రూ.4.70 లక్షలు ఖర్చవుతోంది.అండగా నిలిచిన తండ్రీతనయులు2004లో పాదయాత్ర చేపట్టిన అప్పటి ప్రతిపక్ష నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి, రైతుల ఇబ్బందులు తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గిట్టుబాటు ధర కలి్పంచి, ఆదుకుంటానని హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం 2005–06 పంట కాలంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా గిట్టుబాటు ధరకు పొగాకు కొనుగోలు చేయించారు. వైఎస్సార్ తనయుడు, 2014లో నాటి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే గుంటూరులోని బోర్డు కార్యాలయం వద్ద ధర్నా చేస్తానని ప్రకటించారు. అనంతరం కిలోకు రూ.10 నుంచి రూ.17 వరకూ ధర పెరగడంతో రైతులకు మేలు జరిగింది. పొగాకు రైతులకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గతంలో 2021 పంట కాలంలో పొగాకు మార్కెట్ సంక్షోభంలో పడి, రైతుల వద్ద లో గ్రేడ్ పొగాకు కొనుగోలుకు ట్రేడర్లు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. నాడు పొగాకు రైతుల ఇబ్బందులను గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్క్‌ఫెడ్‌కు ఏకంగా రూ.500 కోట్లు మంజూరు చేసి, సుమారు 16 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేయించారు.నేడు దేవరపల్లిలో జగన్ పర్యటన పొగాకు రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో బుధవారం పర్యటించనున్నారు. అక్కడి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి, కొనుగోళ్ల తీరును పరిశీలిస్తారు. పొగాకు సాగు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, తదితర సమస్యలపై రైతులతో నేరుగా మాట్లాడతారు. జగన్ తాడేపల్లిలో ఉదయం 9.30 గంటలకు బయలుదేరి, 10.30 గంటలకు దేవరపల్లి చేరుకుంటారు. పురుగులు పడుతున్నాయి నెలల తరబడి పొగాకు ఇంటి వద్ద నిల్వ ఉండిపోవడంతో నాణ్యత దెబ్బ తిని, బేలు మధ్య బూజు పట్టి పురుగులు పడుతున్నాయి. 50 ఎకరాల్లో పొగాకు సాగు చేశాను. 10 శాతం అమ్మగా, ఇంకా 90 శాతం ఇంటి వద్దనే ఉంది. 20 శాతం లో గ్రేడ్, 40 శాతం మీడియం, 40 శాతం బ్రైట్ గ్రేడ్ పొగాకు పండుతుంది. లో, మీడియం గ్రేడ్ పొగాకు అమ్ముడు పోవడం లేదు. – పరిమి రాంబాబు, పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు, జంగారెడ్డిగూడెం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయి. 80 ఎకరాల్లో పొగాకు పంట వేశాను. గిట్టుబాటు ధర లేదు. ఎక్కడి పొగాకు అక్కడే ఉంది. కిలో సగటు ధర రూ.350 ఇస్తే కనీసం ఖర్చులు వస్తాయి. – వల్లభనేని సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు, వెదుళ్లకుంట, గోపాలపురం మండలం -
నేడు దేవరపల్లికి వైఎస్ జగన్
-
నేడు తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్, తాడేపల్లి: వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దేవరపల్లిలోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించనున్నారు.ముఖ్యంగా పొగాకు ధరలు, వేలం ప్రక్రియ ఎలా జరుగుతోందనే అంశాలపై ఆయన ఆరా తీయనున్నారు. ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పొగాకు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గత నెల 22న వైఎస్ జగన్‌ను కలిసి తమ సమస్యలను వివరించిన రైతులు, కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న పరిస్థితులను స్వయంగా వచ్చి పరిశీలించాలని కోరారు.రైతుల విజ్ఞప్తి మేరకు ఈరోజు దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శించనున్నారు. అనంతరం రైతులు, రైతు ప్రతినిధులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు, డిమాండ్లపై చర్చించనున్నారు. -
అందరి నోటా.. ఒకే మాట
సాక్షి, అమరావతి/తాటిచెట్లపాలెం (విశాఖ)/ రాజమహేంద్రవరం: డీఎస్సీ–2025 నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఒకే డిమాండ్ వినిపించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు మంగళవారం అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన రౌండ్‌టేబుల్, టౌన్‌హాల్ సమావేశాల్లో పార్టీ నేతలు, డీఎస్సీ బాధిత అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో నిష్పాక్షిక విచారణ జరిపించి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడంతో పాటు ఎన్నికల హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలివైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దీనికి కాంగ్రెస్, సీపీఐ, ఇతర రాజకీయ పక్షాలు, మేధావులు, న్యాయవాదులు, డాక్టర్లు, వర్తక, వ్యాపార ప్రముఖులు తరలివచ్చారు. మార్గాని భరత్ మాట్లాడుతూ..డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరిపిస్తే తప్ప డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు పూర్తిస్థాయిలో వెల్లడయ్యేందుకు అవకాశం లేదన్నారు. అక్రమాల వల్లే ఉద్యోగం రాలేదు డీఎస్సీలో జరిగిన అవకతవకల వల్ల తనకు రావాల్సిన ఉద్యోగం కోల్పోయానని విశాఖ జిల్లా సింహాచలం ప్రాంతానికి చెందిన బాధిత అభ్యర్థి సంతోష్ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ అవకతవకలపై వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో కైలాసపురంలోని పి.కన్వెన్షన్‌లో ఏపీ జెన్–జెడ్ వార్ టౌన్‌హాల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘డీఎస్సీ–2025లో పీజీటీ ఇంగ్లిష్ పరీక్ష రాసి మంచి మార్కులు సాధించాను. జోన్–1లో 92వ ర్యాంకు వచ్చింది.సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచినా సెప్టెంబర్ 15న విడుదల చేసిన ఎంపిక జాబితాలో నా పేరు లేదు. కారణం తెలుసుకోవడానికి డీఈవో, ఆర్జేడీ కార్యాలయాలకు వెళ్లినా జీవో–77 ప్రకారం జరిగిందని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. పీజీటీ ఇంగ్లిష్ ట్రైబల్ వెల్ఫేర్ పోస్టుల్లో ఈడబ్ల్యూఎస్ వరి్టకల్ రిజర్వేషన్‌ను తప్పుగా అమలు చేసి.. 852వ ర్యాంకు వచి్చన అభ్యరి్థని ఎంపిక చేశారు. విచారణ చేస్తే అతనికి ఎలాంటి లో–విజన్ లేదని తెలిసింది. అతనే తప్పుడు సరి్టఫికెట్ తెచ్చుకున్నానని, మీకు కూడా అవకాశముంటే అలాంటి సరి్టఫికెట్ తెచ్చుకోమని చెప్పాడు. సెలక్షన్ లిస్ట్ విడుదలైన తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 80 మంది డీఎస్సీ బాధిత అభ్యర్థులతో కలిసి విద్యాశాఖ మంత్రి లోకేశ్ నివాసానికి వెళ్లాం. లోకేశ్‌ను కలిసి మా సమస్య వివరించుకుంటాం. మాలో ఇద్దరు లేదా ముగ్గురికి మాత్రమే అవకాశం ఇవ్వండని పోలీసులను వేడుకున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసినా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పటికైనా డీఎస్సీ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని సంతోష్ పార్వతి విజ్ఞప్తి చేశారు. – డీఎస్సీ బాధిత అభ్యర్థి సంతోష్ పార్వతిడీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలినిరుద్యోగ, యువజన జేఏసీ డిమాండ్మంగళగిరి రూరల్: డీఎస్సీ నియామకాల్లో అనేక అక్రమాలు జరిగాయని.. వాటిపై సీబీఐతో విచారణ జరిపించాలని నిరుద్యోగ, యువజన జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం గుంటూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని విద్యాభవ¯న్లో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. స్పోర్ట్స్ కోటా పేరుతో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు. పైగా సబ్జెక్టు టీచర్ పోస్టులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కోటాలో సబ్జెక్టు టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. దేశంలో ఎక్కడైనా పరీక్షలు నిర్వహించకుండా ఉద్యోగాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటాలో నకిలీ సర్టిఫికెట్లు ఉన్నట్లు ఆధారాలతో సహా తాము నిరూపిస్తామని సవాల్ చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని.. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ రామచంద్ర, వి.వెంకటేశ్, సీహెచ్.అర్జున్, జి.రోసిబాబు తదితరులు పాల్గొన్నారు. -
బీసీ నేతలపై ఆగని అక్రమ కేసులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం పర్యటన విజయవంతం కావడంతో తట్టుకోలేని చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోంది. వైఎస్సార్సీపీ నాయకులపై నిత్యం కేసులు బనాయిస్తోంది. పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని క్షుద్ర రాజకీయాలు చేస్తోంది. దీనివెనుక పోలీసులే ఫిర్యాదుదారులు కావడం, వారే చర్యలు తీసుకోవడం గమనార్హం. దీనికంతటికీ టీడీపీ పెద్దలే స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అందిస్తున్నారు. వారిచ్చే జాబితాల మేరకు పోలీసు అధికారులు కేసులు నమోదు చేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. తొలుత చింతాడ రవికుమార్ తదితరులపై కేసులు నమోదు చేయగా, మొన్న గొర్లె కిరణ్‌కుమార్ తదితరులపై కేసులు నమోదు చేశారు. తాజాగా ధర్మాన కృష్ణదాస్, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ తదితరులపై అక్రమ కేసులు పెట్టారు. రోడ్డు ప్రమాదాన్ని హత్యా నేరంగా చూపిస్తూ పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జూలై 30న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం వచ్చారు. దీంతో అభిమాన నేతను చూసేందుకు దారి పొడవునా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పోటెత్తారు. ఆ రోజు వచ్చిన జనప్రభంజనాన్ని చూసి తట్టుకోలేని చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెరతీసింది. పోలీసులను వాడుకుని వరుస కేసులు పెడుతోంది. తొలుత ఆమదాలవలస పోలీసు స్టేషన్ పరిధిలో చింతాడ రవికుమార్‌తో పాటు మరో 20 మందిపై అక్రమ కేసు బనాయించింది. ఆ తర్వాత జేఆర్‌పురం పోలీసు స్టేషన్ పరిధిలో ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌తో పాటు మరో 22మందిపై అక్రమ కేసులు నమోదు చేశారు. తాజాగా శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరి«ధిలో ధర్మాన కృష్ణదాస్, పేరాడ తిలక్ తదితరులపై అక్రమ కేసులు బనాయించారు. జూలై 30న జరిగిన ఘటన అని చెప్పి ఆగస్టు రెండో తేదీన శ్రీకాకుళం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వి.రామారావు ఫిర్యాదు చేసిన మేరకు వైఎస్సార్సీపీ నేతలుధర్మాన కృష్ణదాస్, పేరాడ తిలక్, గేదెల పురుషోత్తం, రౌతు శంకరరావు, అంబటి శ్రీనివాస్, గొండు రఘురాం, సాయి, తదితరులపై కేసులు నమోదు చేశారు. -
బాబు ‘భోగా’స్ మాటలు
సాక్షి, న్యూఢిల్లీ: భోగాపురం ఎయిర్‌పోర్టుకు కర్త, కర్మ, క్రియా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అయితే.. ఆ క్రెడిట్ అంతా తనదేనని సీఎం చంద్రబాబు బోగస్ మాటలు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ఎంపీలు మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు, లోక్‌సభ ఎంపీలు డాక్టర్ మద్దిల గురుమూర్తి, డాక్టర్ గుమ్మా తనూజారాణి మీడియాతో మాట్లాడారు. తాను చేయని దానిని చేసినట్లుగా చెప్పుకుంటూ ‘క్రెడిట్ చోరీ చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరని ధ్వజమెత్తారు. భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ కోసం చంద్రబాబు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పడరాని పాట్లు పడుతున్నారని వ్యంగ్యా్రస్తాలు సంధించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంపై పార్లమెంట్లో చర్చించేందుకు తాము సిద్ధమని, దమ్ముంటే చర్చకు రావాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీలు సవాల్ విసిరారు. అభివృద్ధిపై చర్చించేందుకు తమ అధినేత వైఎస్ జగన్ అక్కర్లేదని, తాము సరిపోతామని స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయం విజయం నాలుగు గ్రామాల రైతుల త్యాగం, స్థానిక ప్రజల సహకారం, జగన్ ప్రభుత్వ కృషి ఫలితమేనని తేల్చిచెప్పారు. ప్రభుత్వ రికార్డులను వక్రీకరించి క్రెడిట్ చోరీ చేయాలన్న యత్నాలను ప్రజలు నమ్మరని, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. పెమ్మసానివి అసత్య వ్యాఖ్యలు భోగాపురం విమానాశ్రయం విషయంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యాలని ఎంపీ గొల్ల బాబూరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భూసేకరణ, పునరావాసం (ఆర్అండ్ఆర్), రైతులకు పరిహారం చెల్లింపు వంటి కీలక ప్రక్రియలన్నీ వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయని గుర్తు చేశారు. 2019 నాటికే 2,200 ఎకరాల భూమిని టీడీపీ ప్రభుత్వం సేకరించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చెప్పడం అవాస్తవమని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ఖండించారు. జీఎంఆర్ సంస్థతో ఒప్పందం 2023 జూన్‌లో కుదిరిందని, అదే ఏడాది అక్టోబర్‌లో భూమిని సంస్థకు అప్పగించామని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ నేతలే కోర్టుల్లో కేసులు వేశారన్న పెమ్మసాని వ్యాఖ్యలను గురుమూర్తి తప్పుబట్టారు. బాబు భూ దాహంతో భూములు కోల్పోతామన్న ఆందోళనతో రైతులు, మత్స్యకారులు, గ్రామస్తులే కోర్టులను ఆశ్రయించారని స్పష్టం చేశారు. మేనేజ్మెంట్ కోటాలో కేంద్ర మంత్రి పదవి పొందిన వారికి అమిత ప్రజాదరణ గల వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లేదని పెమ్మసానిని ఉద్దేశించి ఎంపీ తనూజారాణి వ్యాఖ్యానించారు. స్వయనా కేంద్ర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడే వైఎస్ జగన్ హయాంలో 86శాతం భోగాపురం విమానశ్రయ పనులు పూర్తయ్యాయని చెప్పారు కదా అని గుర్తుచేశారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంబోత్సవానికి 13 వేల మంది గిరిజన చిన్నారులతో ధింసా నృత్యం నిర్వహించి రూ.30 కోట్లు ఖర్చు చేశారని, దీనివల్ల గిరిజన ప్రాంతాలకు ఒరిగిన ప్రయోజనం ఏమిటో చంద్రబాబు ప్రభుత్వం చెప్పాలని తనూజారాణి ప్రశి్నంచారు. -
వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు
సాక్షి,తాడేపల్లి: గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత గూడపాటి శ్రీనివాసరావు మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు.గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రధాన అనుచరుడు, ప్రముఖ కాపు నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు తన అనుచరులతో సహా, వైఎస్సార్సీపీలో చేరారు. వందలాది మంది అభిమానులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన శ్రీనివాసరావు, వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్లోసీపీలో చేరారు. ఆయనకు స్వయంగా కండువా కప్పిన వైఎస్ జగన్ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, జీఎస్ (గూడపాటి శ్రీనివాసరావు) అన్నతో పాటు, చేరిన ఆయన అనుచరులందరికీ సాదరంగా వైఎస్సార్సీపీ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాను. అదే విధంగా జీఎస్ అన్నను కూడా గుండెల్లో పెట్టుకుంటాను. మీరందరూ రావడం సంతోషం. నియోజకవర్గంలో మోహన్ (పీటా నాగమోహనకృష్ణ)ను తమ్ముడిగానే భావించి, రాబోయే ఎన్నికల్లో గెలిపించే దిశగా మీరంతా కూడా అడుగులు వేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జీఎస్ అన్న రాకతో, రేపల్లెలో.. మరీ ముఖ్యంగా పట్టణంలో పార్టీ మరింతగా బలపడుతుందని ఆశిస్తున్నానని వైఎస్ జగన్ అన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, రేపల్లె నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్ పీటా నాగమోహనకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు, పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, రేపల్లె నియోజకవర్గంలో మంచి పట్టున్న గూడపాటి పార్టీని వీడటం టీడీపీకి పెద్ద లోటుగా మారగా, వైఎస్సార్సీపీకి అక్కడ రాజకీయంగా మరింత బలం చేకూరినట్లయింది. -
దేవరపల్లికి జగనన్న వస్తున్నారు
-
వైఎస్ జగన్ విజువల్స్ @గన్నవరం
-
ఆనాడు భోగాపురం ఎయిర్ పోర్టు ఫౌండేషన్ కార్యక్రమంలో గ్రంథి మల్లికార్జున రావు స్పీచ్
-
రేపు దేవరపల్లికి YS జగన్
-
బాబు కుట్రలన్నీ విఫలం.. జగన్ శ్రీకాకుళం టూర్ గ్రాండ్ సక్సెస్..
-
ఆయన కచ్చితంగా వైఎస్ జగన్‌ను పొగుడుతారు!
భోగాపురం విమానాశ్రయం పనులు ఎవరు ప్రారంభించారు.. ఎవరు మొదలెట్టారు.. ఎవరి హయాంలో ఎక్కువ పనులు అయ్యాయనేది లోకవిదితం. చంద్రబాబు ఆ ప్రాజెక్టును కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే వాడుకోవడం, ఎలాంటి పాలనాపరమైన అనుమతులు, పర్యావరణ, కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండానే 2019 ఎన్నికల ముందు కేవలం ఓట్లకోసమే శంకుస్థాపన చేసేసిన ఘటన అందరికీ తెలిసిందే.ఆ తరువాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును జెట్ వేగంతో పరుగులెత్తించి కోవిడ్ వంటి విపత్తు సమయంలో సైతం పనులు వేగవంతంగా పూర్తిచేసిన విషయం అందరికీ గుర్తున్నదే. అయితే, విమానాశ్రయం ప్రారంభ కార్యక్రమంలో ఆ శాఖకు సంబంధం లేని పవన్‌కల్యాణ్, లోకేశ్ వంటివారు వేదికమీద ప్రసంగించారు. కానీ... దాదాపు రూ.5వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్న సంస్థ ప్రమోటర్ గ్రంథి మల్లికార్జునరావు (జీఎమ్మార్)కు మాత్రం మైక్ ఇవ్వలేదు. ఆయనతో పాటు సంస్థకు చెందిన ఇద్దరు సీనియర్ ఆఫీసర్లు వేదికమీద ఉన్నారే తప్ప ప్రాజెక్టును పూర్తి చేయడానికి తాము ఎలాంటి శ్రమపడ్డారు.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందింది వంటి కొన్ని పాయింట్లు అయినా వారు చెప్పేందుకు అవకాశం ఇవ్వలేదు. ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సజ్జన్ జిందాల్ ఏమన్నారో గుర్తొచ్చిందా? వాస్తవానికి భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన సందర్భంగా జరిగిన సభలో జీఎమ్మార్ మాట్లాడుతూ.. గతంలో తాము వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించామని, నేడు భోగాపురం ప్రాజెక్టు చేపట్టామని, తండ్రీకొడుకుల సారథ్యంలో పనిచేయడం తమకు గర్వకారణమని చెప్పారు. దాంతో బాటు ఈ ప్రాజెక్టుకు బాగా సహకారం అందించి, కోర్టు కేసులు క్లియర్ చేసి, పలు పాలనాపరమైన అనుమతులు తెచ్చి పనులకు ఒక రూపు ఇచ్చింది కూడా వైఎస్ జగన్ ప్రభుత్వ అనేది అందరికి తెలిసిందే. ఇదే విషయాన్ని మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఒప్పుకున్నారు. దాదాపు 86 శాతం పనులు అప్పటికే పూర్తయ్యాయని చెప్పారు. అంటే కూటమి ప్రభుత్వం పాత్ర ఇందులో కొద్దిగానే ఉందన్నది అందరూ బయటకు చెప్పకపోయినా లోలోన అంగీకరిస్తున్న అంశం అన్నమాట. ఇక కడప జిందాల్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా నాటి వైఎస్ జగన్ సర్కారు భూసేకరణ, పలు అనుమతులు తీసుకొచ్చి సజ్జన్ జిందాల్, వైఎస్ జగన్ కలిపి దానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మారిపోగానే చంద్రబాబు ఆ ప్రాజెక్టును వివాదాస్పదం చేశారు. అయితే, మళ్లీ తామే ఆ సంస్థను ఉద్దరిస్తున్నట్లు రెండోసారి శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా సజ్జన్ జిందాల్ ట్విట్టర్లో పెట్టిన పోస్టు సంచలనం అయ్యింది. మీరిచ్చిన సహకారం, ప్రోత్సాహంతోనే కడప స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు మొదలైంది అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెబుతూ అయన ట్విట్టర్లో చేసిన పోస్టు అందరూ చూసి ఓహో.. ఇదంతా వైఎస్ జగన్ కాలంలోనే ఒక రూపు వచ్చిన ప్రాజెక్టా.. దానికి మళ్లీ చంద్రబాబు ఇప్పుడు బాకా ఊదుకుంటున్నారా అని అర్థం చేసుకున్నారు. పరువు పోతుందని... కడప స్టీల్ ప్లాంట్ సందర్భాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు... ఇప్పుడు మళ్లీ జీఎమ్మార్ కూడా విమానాశ్రయ వేదికపై వైఎస్ జగన్‌ను పొగిడితే, అయన కాలంలోనే పనులన్నీ పూర్తయ్యాయని ప్రధాని సమక్షంలో వేదిక మీద చెబితే తమ పరువు దేశవ్యాప్తంగా పోతుందేమోఅని భయపడి ఏకంగా జీఎమ్మార్‌ను మాట్లాడకుండా, మైక్ ఇవ్వకుండా అడ్డుకున్నారని అంటున్నారు. లేకుంటే సంస్థ ప్రమోటర్ కనీసం రెండు ముక్కలైనా మాట్లాడకుండా ఎలా?.. కేవలం తానుచేయని పనులకు.. తన పాత్ర తక్కువే అయినా ప్రచారం ఎక్కువ చేసుకుంటున్న చంద్రబాబు తన పరువు పోకుండా ఉండేందుకే జీఎమ్మార్‌కు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ప్రజలు అంటున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: -
డీఎస్సీ అక్రమాలపై ఉద్యమం ఉధృతం
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలపై వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రౌండ్ టేబుల్, టౌన్‌హాల్ సమావేశాలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జరిగిన ఈ సమావేశాల్లో పార్టీ నేతలు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు, డీఎస్సీ బాధిత అభ్యర్థులు, ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డీఎస్సీలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అర్హులకు న్యాయం చేయాలని, ఇటువంటి దారుణాలు మరోసారి జరగకుండా చూడాలని నాయకులు డిమాండ్ చేశారు. పలువురు డీఎస్సీ బాధిత అభ్యర్థులు మాట్లాడుతూ నియామక ప్రక్రియలో అక్రమాలకు పాల్పడటం వల్ల తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆధారాలతో సహా వివరించారు. సీబీఐ విచారణ ద్వారానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. అన్ని అర్హతలు ఉన్నా నష్టపోయిన బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటంకొనసాగిస్తామని వైఎస్సార్సీపీ నాయకులు పునరుద్ఘాటించారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు. -
రేపు దేవరపల్లిలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 5న తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోళ్ల తీరును పరిశీలించడంతోపాటు ఆ రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. పర్యటనలో భాగంగా బుధవారం ఉ.9.30 గంటలకు వైఎస్ జగన్ తాడేపల్లిలో బయల్దేరి, ఉ.10.30కు దేవరపల్లి చేరుకుంటారు. అక్కడి పొగాకు కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న కొనుగోళ్లను పరిశీలిస్తారు. అనంతరం.. పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించి, పంట సాగు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, సమస్యలు తదితర అంశాలను నేరుగా వారిని అడిగి తెలుసుకుంటారు. -
ఎల్లుండి తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బుధవారం (ఆగస్టు5) తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోళ్ల తీరును పరిశీలించడంతోపాటు పొగాకు రైతులతో నేరుగా మాట్లాడనున్నారు.పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం 9.30 గంటలకు వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, ఉదయం 10.30 గంటలకు దేవరపల్లి చేరుకుంటారు. అక్కడి పొగాకు కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న కొనుగోళ్లను పరిశీలిస్తారు. అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించి, పంట సాగు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలను అడిగి తెలుసుకుంటారు. రైతుల సమస్యలు, ఇబ్బందులపై వారితో నేరుగా చర్చిస్తారు. -
ఆ ఏముందిలే జగనే కదా అనుకున్నారు.. జగన్ పర్యటన సక్సెస్ పై ధర్మాన..
-
ఉత్తరాంధ్రలో జగన్ వెంటే జనం.. కూటమిలో కలవరం?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవలి కాలంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అశేష జనం తరలివచ్చి ఆయనకు స్వాగతం చెబుతున్న తీరు సహజంగానే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు ఆందోళన కలిగిస్తుంది. శ్రీకాకుళం వద్ద అంపోలు జైలులో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పరామర్శించడానికి వెళ్లారు. ఈ టూర్‌ను రెండు రకాలుగా చూడాల్సి ఉంటుంది. ఒకటి ఉత్తరాంధ్రలో ప్రజల అభిమానం చూరగొనడం ఒక ఎత్తు అయితే, అప్పలరాజు కుటుంబాన్ని, అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జగన్ వివరించిన వైనం మరో ఎత్తుగా ఉంది. విశాఖ వరకు విమానంలో వెళ్లి, అక్కడ నుంచి రోడ్డు మార్గాన వాహనంలో ప్రయాణం చేశారు. ఆ క్రమంలో వివిధ ప్రాంతాలలో ,రోడ్డు పక్కన జనం తండోపతండాలుగా గుమికూడడం, ఆయనతో కరచాలనం చేయాలని తహతహడలాడడం, పోలీసులు అడ్డుకుంటున్నా,పొలాలనుంచి వాగులు,వంకలు దాటుకుంటూ జగన్ కలుసుకోవడం గమనించిన వారెవరికైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో ఓడిపోయిందంటే నమ్మబుద్ది కాదు. ప్రముఖ మేధావి పరకాల ప్రభాకర్ చెప్పినట్లు గత ఎన్నికలలో ఏభై లక్షల ఓట్ల గోల్ మాల్ తతంగం ఏదో జరిగి ఉండాలని చాలామంది విశ్వసిస్తున్నారు. జగన్ ప్రభుత్వం జనానికి మేలు చేయకపోతే, ఈ స్థాయిలో వివిధ వర్గాలవారు ముఖ్యంగా,పేద,మద్య తరగతి ప్రజలు తరలిరారు. అంతేకాక కూటమి ప్రభుత్వం తన వాగ్దానాలను అరకొరగా మాత్రమే అమలు చేసి, అనేక హామీలను ఎగవేసిన వైనం, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగా క్షీణించడం, రెడ్ బుక్ పేరుతో అరాచక పాలన సాగిస్తుండడం వంటివి బాగా ప్రభావం చూపుతున్నట్లు అనిపిస్తుంది. అందుకే జగన్ కోసం జనం అంత పెద్ద ఎత్తున వచ్చారనుకోవాలి. విశాఖ ఎయిర్ పోర్టు మొదలు ఆయా చోట్ల ఆయనను నిలిపి తమ సమస్యలను విన్నవించారు. ప్రజలు పెద్ద ఎత్తున వస్తుండడంతో ఆయన వాహనం దిగి వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. భోగాపురం విమానాశ్రయం వద్ద ధాంక్యూ జగన్ సర్ అంటూ కొంతమంది ప్లకార్డులు ప్రదర్శించారు.భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి జగన్ చేసిన కృషిని వారు గుర్తు చేసుకున్నారు. కొన్ని చోట్ల దివ్యాంగులు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. జగన్ టూర్లో జనం లేకుండా చేయాలని పోలీసులు విశ్వయత్నం చేయకపోలేదు.అనేక చోట్ల రోడ్లపైకి రానివ్వకుండా, ఆయనను కలుసుకునే అవకాశం ఇవ్వకుండా తాడుతో వెనక్కి నెట్టేయడం వంటివి చేశారు. అయినా అభిమానులు వాటన్నిటిని తోసుకుంటూ జగన్ వెంట పరుగులు తీశారంటే అతిశయోక్తి కాదు. కూటమి ప్రభుత్వంపై ప్రజలలో కలిగిన విరక్తికి ఇది దర్పణం పడుతోందన్న విశ్లేషణలు వస్తున్నాయి.జనం ఒత్తిడితో నిర్ణీత టైమ్ కన్నా జగన్ ఆలస్యంగా జైలు వద్దకు చేరుకోవడంతో అప్పలరాజును కలుసుకోలేకపోయారు. కాని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి జగన్ ధైర్యం చెప్పి వచ్చారు. వారితో కలిసి మీడియాతో మాట్లాడారు.మరో కోణం చూస్తే అప్పలరాజు మాజీ మంత్రి. ఆయన మత్సకార వర్గానికి చెందినవారు. ఆయా అంశాలపై చక్కని క్లారిటీతో మాట్లాడుతుంటారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారు. ఎవరైతే సమర్దంగా వైఎస్సార్సీపీ పక్షాన పనిచేస్తుంటారో వారి గొంతు నొక్కడానికి కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా రకరకాల కుట్రలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఏ చిన్న అవకాశం వచ్చినా వైఎస్సార్సీపీ మద్దతుదారులను జైళ్లలోకి పంపిస్తున్నారు.అయినా వారు వెనక్కి తగ్గకపోవడం కూటమి ప్రభుత్వానికి ఆందోళనగా మారింది. అప్పలరాజు కుమారుడు ఆరవ్ బైక్ నడుపుతున్నప్పుడు ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. దాని కారణంగా గొర్రెల కాపరి ఒకరు మరణించారు. అది దురదృష్టకర ఘటన. ఇంతవరకు కేసు పెట్టడాన్ని జగన్ తప్పుపట్టలేదు. కాని ఆ ఆరవ్ పై హత్యకేసు బనాయించడంపై జగన్ బాధపడ్డారు. ఆయన కొద్ది రోజుల క్రితం విశాఖ వచ్చినప్పుడు కూడా తప్పుపట్టారు.ఇక అప్పలరాజుపై సాక్ష్యాలు తారుమారు యత్నం చేశారంటూ కేసు పెట్టి జైలులో నిర్భంధించారు. ఆరవ్ కు బెయిల్ వచ్చింది కాని, అప్పలరాజు ఇంకా జైలులోనే ఉన్నారు.ఈ సందర్భంగా బాదిత కుటుంబాన్ని ఆదుకోవడానికి అప్పలరాజు చేసిన ప్రయత్నాలను కూడా జగన్ వివరించారు.ఈ కేసును కుల వివాదంగా చంద్రబాబు ప్రభుత్వం మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని జగన్ తీవ్రంగా ఖండించారు. ఇదంతా చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనకు ప్రతిబింబమని ఆయన మండిపడ్డారు. మరణించిన వ్యక్తి యాదవ వర్గానికి చెందినవారు కనుక, మంత్రి పార్ధసారధిని పలాస పంపించిన వైనాన్ని, ఆ సామాజికవర్గానికి చెందిన కొందరితో ర్యాలీలు చేయించడాన్ని జగన్ ఆక్షేపించారు.పోనీ యాదవుల పట్ల ప్రభుత్వం ఏమైనా సానుకూలంగా ఉందా అంటే ప్రకాశం జిల్లాలో ఒక ఘటనలో ఫిర్యాదు చేసిన యాదవులపైనే కూటమి ప్రభుత్వం ఎదురు కేసు పెట్టిన వైనాన్ని ఉదహరించారు.అంతేకాక విశాఖలో వైఎస్సార్సీపీ యాదవ మహిళకు మేయర్ పదవి ఇస్తే ,ఆమెను పదవినుంచి దించేశారని జగన్ విమర్శించారు. రోడ్డు ప్రమాద ఘటనలన్నిటిలోను ఒకే రకంగా వ్యవహరిస్తున్నారా?అని జగన్ వేసినప్రశ్న సమంజసంగానే ఉంది. చాలా కేసులు అసలు పోలీస్ స్టేషన్ వరకు రావు. కొన్ని కేసులలో అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిన సందర్భాలు ఉన్నాయి. అధికార పార్టీకి చెందినవారెవరైనా ఇలాంటి ప్రమాద ఘటనలలో ఉన్నా,వారిపై కేసులే పెట్టరు.అందుకు కొన్ని ఉదాహరణలను కూడా జగన్ పేర్కొన్నారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే కారులో ఉండగానే ప్రమాదం జరిగిందని, అలాగే పాతపట్నం ఎమ్మెల్యే కుమారుడు కారు నడుతుండగా యాక్సిడెంట్ అయిందని, ఆ ఘటనలలో ఎవరిపైన కేసులు పెట్టారని జగన్ వేసిన ప్రశ్నకు సమాధానం లేదు. ఒక్కొక్కరికి ఒక న్యాయం అమలు చేయడం అంటే విషపు విత్తనాలు నాటడమేనని జగన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు హింసాత్మక సంఘటనలు జరిగినా, వాటిలో టీడీపీవారు నిందితులుగా ఉంటే తూతూ మంత్రంగా కేసులు పెట్టడం చేస్తున్నారు.లేదా అసలు కేసులే పెట్టడం లేదు. జనసేనకు చెందినవారు పోలీస్ స్టేషన్ లపై వరసగా నాలుగురోజుల పాటు దాడులు చేసినా కేసులు లేకపోవడాన్ని ప్రజలంతా గమనించారు. అప్పలరాజును పరామర్శించడానికి జగన్ వెళ్లడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. చిత్రమేమిటంటే తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆయా కేసులలో నిందితులను పరామర్శించడానికి వెళ్లారు.ఆయనే కాదు.ఇతర టీడీపీ నేతలు కూడా అలా చేసిన ఉదాహరణలు ఉన్నాయి.అదేమీ తప్పుకాదు.కాని వైఎస్సార్‌సీపీవారు చేస్తే మాత్రం టీడీపీ విమర్శలు చేస్తుంటుంది. ఇక తనపై ఉన్న కేసుల్లో సాక్ష్యులను మేనేజ్ చేసి వారితోనే కేసులను ఉపసంహరించేలా చంద్రబాబు చేస్తున్నారని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ పేరుతో ఆయా కేసులను చంద్రబాబు ఎత్తివేయించుకుంటున్న తీరును వైఎస్సార్సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఒక ఫ్యాక్షన్ హత్య జరిగితే,దానికి రాజకీయ రంగు పులిమి స్వయంగా చంద్రబాబే వెళ్లి ఆ హతుడి పాడె మోశారు.పుంగనూరు వద్ద టీడీపీ కార్యకర్తలు పోలీసులపై దాడి చేశారు. ఆ సందర్భంలో పోలీస్ వాహనాన్ని కూడా దగ్ధం చేశారు. రాళ్లదాడిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్ను కూడా పోయింది. ఆ కేసు నిందితులను చంద్రబాబు పరామర్శించారా? లేదా? అవన్ని ఎందుకు చంద్రబాబుపైనే రెండు హత్యాయత్నం కేసులు నమోదు అయి ఉన్నాయే!అవి కాకుండా మరికొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎంతసేపు ఎదుటివారిపై ఆరోపణలు చేసి చంద్రబాబు వాటి గురించి ఎందుకు మాట్లాడరు? గతంలో గౌరు వెంకటరెడ్డి అనే నేత కాంగ్రెస్ లో ఉండేవారు. ఆయనకు ఒక కేసులో శిక్షపడి జైలులో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి పరామర్శకు వెళితే, అప్పుడు కూడా చంద్రబాబు విమర్శలు చేశారు.ఆ తర్వాత కాలంలో గౌరు వెంకటరెడ్డి, చరిత దంపతులను టీడీపీలో చేర్చుకుని చరితకు టీడీపీ టిక్కెట్ కూడా ఇచ్చారు. అలా ఉటుంది ఆయన రాజకీయం. చంద్రబాబు ఏమి చేసినా రైటు, ప్రత్యర్ధులు ఏమి చేసినా తప్పు అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఇదంతా ఏమిటంటే మీడియా మేనేజ్ మెంట్ తనకు తెలిసినంతగా మరెవ్వరికి తెలియదన్నదే ఆయన నమ్మకం కాబట్టి అనుకోవాలి. సమయం అయిపోయిందని జైలులో ఉన్న అప్పలరాజును కలుసుకునే అవకాశం అధికారులు జగన్‌కు ఇవ్వలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి స్వయంగా వెళితే, ప్రభుత్వం కొంత బ్రాడ్ మైండ్‌తో అప్పలరాజుతో ములాఖత్‌కు అవకాశం ఇచ్చి ఉంటే హుందాగా ఉండేది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న ప్రభుత్వం నుంచి అలాంటివి ఆశించడం అత్యాశే అవుతుందేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఇది ప్రజాస్వామ్యమేనా? లేక జంగిల్ రాజ్యమా? YS జగన్ ఆగ్రహం
-
ఆలూరు ఎమ్మెల్యే అరెస్టుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం
-
MLA విరూపాక్షి అరెస్ట్ పై జగన్ రియాక్షన్
-
నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం
సాక్షి, అమరావతి: ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, బీసీ సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షి ఇంటిపై అర్ధరాత్రి భారీ పోలీసు బలగాలతో దాడి చేసి.. ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేయడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. రాష్ట్రంలో నారాసుర పాలనలో అరాచకం పరాకాష్టకు చేరిందంటూ మండిపడ్డారు. దాడి చేసిన వారికి రక్షణ కల్పిస్తూ.. బాధితులపై అక్రమంగా కేసులు బనాయిస్తూ రాజకీయంగా కక్ష సాధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.శ్రీకాకుళం జిల్లాలో ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షతో హత్య కేసుగా మార్చి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేశారని.. ఆయనను పరామర్శించేందుకు తాను వెళ్లినప్పుడు లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలను చూసి ప్రభుత్వం భయపడి.. ఒక వీడియో క్లిప్‌ను వక్రీకరించి చింతాడ రవికుమార్‌పై తీవ్రమైన కేసులు పెట్టారంటూ ఎత్తిచూపారు. ఒక వ్యాపార వివాదంలో సంబంధిత వ్యక్తిని, లారీలను పోలీస్ స్టేషన్‌కు అప్పగించిన మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపైనే కిడ్నాప్ కేసు పెట్టడం ఎక్కడి న్యాయం? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు.‘‘డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు? వాటికి బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి లోకేశ్ ఎందుకు రాజీనామా చేయడం లేదు? విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.9,500 కోట్ల విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? నెలకు రూ.3 వేల చొప్పున 3 ఏళ్లకు ఒక్కో నిరుద్యోగికి బకాయిపడ్డ రూ.1.08 లక్షలు ఎప్పుడు ఇస్తారు?’’ అని జెన్–జెడ్ తరం ఇవ్వాళ గట్టిగా ప్రశ్నిస్తోందని గుర్తుచేశారు.ఈ ప్రశ్నలకు మీ దగ్గర, మీ తనయుడు లోకేశ్ దగ్గర సమాధానం లేదు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమ కేసులు పెడుతున్నారంటూ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అరెస్టులు చేయగలరేమో కానీ కార్యకర్తల గుండెల్లో ఉన్న ధైర్యాన్ని బద్దలుకొట్టలేరు.. ప్రజలు వేస్తున్న ప్రశ్నలనూ ఆపలేరు.. అన్యాయాన్ని నిలదీస్తాం.. అరాచక పాలనపై పోరాడతామని సీఎం చంద్రబాబును హెచ్చరిస్తూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ ఆదివారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..రాష్ట్రంలో అసలు రూల్ ఆఫ్ లా ఉందా?‘‘చంద్రబాబు గారూ.. రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతోంది? దాడి చేసినవారు అధికారపార్టీ వాళ్లయితే వారికి రక్షణ! దాడికి గురైనవారు వైఎస్సార్సీపీ వాళ్లయితే వారిపైనే కేసులు! బాధితులకు అండగా నిలబడితే ప్రజాప్రతినిధులపైనా కేసులు! ప్రశ్నిస్తే అరెస్టులు! నిలదీస్తే అర్ధరాత్రి తలుపులు బద్దలుకొట్టడం! ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా న్యాయం? ఇదేనా చట్టం? చంద్రబాబు గారూం నేను సూటిగా అడుగుతున్నాను. ఆలూరు బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే ఇంటిపై అర్ధరాత్రి 2.45 గంటలకు భారీ పోలీసు బలగాలతో దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంటి తలుపులు బద్దలుకొట్టి, ఎమ్మెల్యే విరూపాక్షిని, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసిన తీరు చూస్తే రాష్ట్రంలో అసలు రూల్ ఆఫ్ లా అనేది ఉందా? అని అనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు.. ప్రతిపక్షానికి మద్దతు పలికితే కేసులుశ్రీకాకుళం జిల్లాలోనూ ఇదేరకంగా అరాచకం చేస్తున్నారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షతో హత్య కేసుగా మార్చారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేశారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను వెళ్లినప్పుడు సంఘీభావంగా లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఆ ప్రజాస్పందనను చూసి మీ ప్రభుత్వం భయపడింది. ఆ భయంతోనే ఒక వీడియో క్లిప్‌ను వక్రీకరించారు. చింతాడ రవికుమార్‌పై తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. అనేకమంది నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారు. నాయకులు ప్రజల మధ్యకు వెళ్తే కేసులు. ప్రజలు నాయకులను కలిస్తే కేసులు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు. ప్రతిపక్షానికి మద్దతు పలికితే కేసులు. ఇది ప్రజాస్వామ్యమా? లేక మీ పోలీసు రాజ్యమా? లేక జంగిల్ రాజ్యమా? గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మొహ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడిపైనా ఇదే రాజకీయ కక్షసాధింపు కొనసాగుతోంది. ఒక వ్యాపార వివాదంలో సంబంధిత వ్యక్తిని, లారీలను పోలీస్ స్టేషన్‌కు అప్పగించినప్పటికీ తిరిగి ముస్తఫాపైనే కిడ్నాప్ కేసు పెట్టారు. పోలీసులకు అప్పగించిన వ్యక్తిని కిడ్నాప్ చేశారని కేసు పెట్టడం ఎక్కడి న్యాయం? కేవలం వైఎస్సార్సీపీ నాయకుడని కేసు పెడతారా?ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ కేసులురాష్ట్రంలోని జెన్–జెడ్ తరం ఇవాళ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ పోరాటాలు చేస్తోంది. డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు? అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఎందుకు రాజీనామా చేయడం లేదు? విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.9,500 కోట్ల విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎందుకు మోసం చేశారు? మూడేళ్లకు ఒక్కో నిరుద్యోగికి బకాయిపడ్డ రూ.1.08 లక్షలు ఎప్పుడు చెల్లిస్తారు? ఈ ప్రశ్నలకు మీ దగ్గర మీ తనయుడు లోకేశ్ దగ్గర సమాధానం లేదు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమ కేసులు పెడుతున్నారు. అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు. పోలీసు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.బాధిత కుటుంబానికి అండగా నిలబడటం తప్పా?చిప్పగిరి మండలం నేమకల్లులో వైఎస్సార్సీపీ కార్యకర్త ఇంటిపై టీడీపీవాళ్లు దాడిచేస్తే, తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, తన కుటుంబాన్ని కాపాడాలని ఆ కార్యకర్త ఎమ్మెల్యే విరూపాక్షికి కాల్ చేశాడు. ఒక కార్యకర్త ప్రాణభయంతో సహాయం కోరితే స్పందించడం ఎమ్మెల్యే చేసిన నేరమా? బాధిత కుటుంబానికి అండగా నిలబడటం తప్పా? చివరకు పరామర్శించేందుకు వెళ్లిన విరూపాక్షిపైనే టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. ఆ దాడిలో ఆయన సోదరుడు శ్రీరాములు గాయపడ్డారు. నిజంగా చట్టం పనిచేస్తే ఎవరిని అరెస్టు చేయాలి? దాడి చేసినవారిని అరెస్టు చేయాలా? దాడికి గురైన ఎమ్మెల్యేను అరెస్టు చేయాలా? కానీ ఈ ప్రభుత్వంలో దాడి చేసినవారికి రక్షణ లభిస్తోంది. దాడికి గురైన ఎమ్మెల్యేనే నిందితుడిగా మార్చి ఆయనపైన, కార్యకర్తలపైన హత్యాయత్నం కేసులు బనాయిస్తున్నారు. ఎమ్మెల్యే ఇంట్లోని సీసీటీవీ హార్డ్డిసు్క లను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? అర్ధరాత్రి పోలీసులు చేసిన దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలు బయటకు వస్తాయనే భయమా? తలుపులు ఎలా బద్దలుకొట్టారో కుటుంబ సభ్యులను ఎలా భయపెట్టారో ఎమ్మెల్యేను ఎలా అరెస్టు చేశారో ప్రజలకు తెలియకూడదనే హార్డ్డిసు్కలను తీసుకెళ్లారా? చంద్రబాబుగారూ సాక్ష్యాలను కాపాడాల్సిన పోలీసులతోనే సాక్ష్యాలను మాయం చేయించే ప్రయత్నం చేస్తున్నారా?అన్యాయాన్ని నిలదీస్తాం.. అరాచక పాలనపై పోరాడతాంచంద్రబాబు గారూ గుర్తుపెట్టుకోండి. అధికారం శాశ్వతం కాదు. పోలీసు బలం శాశ్వతం కాదు. అక్రమ కేసులు శాశ్వతం కాదు. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అర్ధరాత్రి అరెస్టులు చేసినా ఎన్ని తలుపులు బద్దలుకొట్టినా ఎన్ని పోలీసు బలగాలను దించినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదు. బాధితులకు అండగా నిలుస్తాం. అన్యాయాన్ని నిలదీస్తాం. అరాచక పాలనపై పోరాడుతాం. మీరు అరెస్టులు చేయగలరేమో కానీ కార్యకర్తల గుండెల్లో ఉన్న ధైర్యాన్ని బద్దలుకొట్టలేరు. ప్రజలు వేస్తున్న ప్రశ్నలనూ ఆపలేరు’’ అని జగన్ ఆ పోస్టులో పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి : కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం అంటూ ఆదివారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు. రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతోంది? దాడి చేసినవారు అధికారపార్టీ వాళ్లయితే వారికి రక్షణ! దాడికి గురైనవారు వైఎస్సార్సీపీ వాళ్లయితే వారిపైనే కేసులు ! బాధితులకు అండగా నిలబడితే ప్రజాప్రతినిధులపైనా కేసులు! ప్రశ్నిస్తే అరెస్టులు ! నిలదీస్తే అర్ధరాత్రి తలుపులు బద్దలుకొట్టడం! ఇదేనా ప్రజాస్వామ్యం?ఇదేనా న్యాయం? ఇదేనా చట్టం?చంద్రబాబు… నేను సూటిగా అడుగుతున్నాను. ఆలూరు బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే ఇంటిపై అర్ధరాత్రి 2.45 గంటలకు భారీ పోలీసు బలగాలతో దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంటి తలుపులు బద్దలుకొట్టి, ఎమ్మెల్యే విరూపాక్షిని, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసిన తీరు చూస్తే రాష్ట్రంలో అసలు రూల్ ఆఫ్ లా అనేది ఉందా? అని అనిపిస్తోంది. చిప్పగిరి మండలం నేమకళ్లులో వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిపై టీడీపీవాళ్లు దాడిచేస్తే, తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, తన కుటుంబాన్ని కాపాడాలని ఆ నాయకుడు ఎమ్మెల్యే విరూపాక్షికి కాల్చేశాడు. ఒక కార్యకర్త ప్రాణభయంతో సహాయం కోరితే స్పందించడం ఎమ్మెల్యే చేసిన నేరమా? బాధిత కుటుంబానికి అండగా నిలబడటం తప్పా? చివరకు పరామర్శించేందుకు వెళ్లిన విరూపాక్షిపైనే టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. ఆ దాడిలో ఆయన సోదరుడు శ్రీరాముడు గాయపడ్డారు. నిజంగా చట్టం పనిచేస్తే ఎవరిని అరెస్టు చేయాలి? దాడి చేసినవారిని అరెస్టు చేయాలా? దాడికి గురైన ఎమ్మెల్యేను అరెస్టు చేయాలా? కానీ ఈ ప్రభుత్వంలో దాడి చేసినవారికి రక్షణ లభిస్తోంది. దాడికి గురైన ఎమ్మెల్యేనే నిందితుడిగా మార్చి ఆయనపైన, కార్యకర్తలపైన హత్యాయత్నం కేసులు బనాయిస్తున్నారు.ఎమ్మెల్యే ఇంట్లోని సీసీటీవీ హార్డ్‌డిస్కులను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? అర్ధరాత్రి పోలీసులు చేసిన దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలు బయటకు వస్తాయనే భయమా? తలుపులు ఎలా బద్దలుకొట్టారో… కుటుంబ సభ్యులను ఎలా భయపెట్టారో… ఎమ్మెల్యేను ఎలా అరెస్టు చేశారో… ప్రజలకు తెలియకూడదనే హార్డ్‌డిస్కులను తీసుకెళ్లారా? చంద్రబాబు.. సాక్ష్యాలను కాపాడాల్సిన పోలీసులతోనే సాక్ష్యాలను మాయం చేయించే ప్రయత్నం చేస్తున్నారా?శ్రీకాకుళం జిల్లాలోనూ ఇదేరకంగా అరాచకం చేస్తున్నారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షతో హత్య కేసుగా మార్చారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేశారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను వెళ్లినప్పుడు సంఘీభావంగా లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఆ ప్రజాస్పందనను చూసి మీ ప్రభుత్వం భయపడింది. ఆ భయంతోనే ఒక వీడియో క్లిప్‌ను వక్రీకరించారు. చింతాడ రవికుమార్‌పై తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. అనేకమంది నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారు. నాయకులు ప్రజల మధ్యకు వెళ్తే కేసులు. ప్రజలు నాయకులను కలిస్తే కేసులు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు. ప్రతిపక్షానికి మద్దతు పలికితే కేసులు. ఇది ప్రజాస్వామ్యమా? లేక మీ పోలీసు రాజ్యమా? లేక జంగిల్ రాజ్యమా?గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మొహ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడిపైనా ఇదే రాజకీయ కక్షసాధింపు కొనసాగుతోంది. ఒక వ్యాపార వివాదంలో సంబంధిత వ్యక్తిని, లారీలను పోలీస్ స్టేషన్‌కు అప్పగించినప్పటికీ… తిరిగి ముస్తఫాపైనే కిడ్నాప్ కేసు పెట్టారు. పోలీసులకు అప్పగించిన వ్యక్తిని కిడ్నాప్ చేశారని కేసు పెట్టడం ఎక్కడి న్యాయం? కేవలం వైఎస్సార్సీపీ నాయకుడని కేసు పెడతారా?రాష్ట్రంలోని Gen-Z తరం ఇవాళ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ పోరాటాలు చేస్తోంది. డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు? అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు రాజీనామా చేయడం లేదు? విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.9,500 కోట్ల విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎందుకు మోసం చేశారు? మూడేళ్లకు ఒక్కో నిరుద్యోగికి బకాయిపడ్డ రూ.1.08 లక్షలు ఎప్పుడు చెల్లిస్తారు? అని. కాని, ఈ ప్రశ్నలకు మీ దగ్గర మీ తనయుడు లోకేష్ దగ్గర సమాధానం లేదు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమ కేసులు పెడుతున్నారు. అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు. పోలీసు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.చంద్రబాబు.. గుర్తుపెట్టుకోండి. అధికారం శాశ్వతం కాదు. పోలీసు బలం శాశ్వతం కాదు. అక్రమ కేసులు శాశ్వతం కాదు. ఎన్ని కేసులు పెట్టినా… ఎన్ని అర్ధరాత్రి అరెస్టులు చేసినా… ఎన్ని తలుపులు బద్దలుకొట్టినా… ఎన్ని పోలీసు బలగాలను దించినా… వైఎస్సార్సీపీ వెనక్కి తగ్గదు. బాధితులకు అండగా నిలుస్తాం. అన్యాయాన్ని నిలదీస్తాం. అరాచక పాలనపై పోరాడుతాం. మీరు అరెస్టులు చేయగలరేమో కానీ కార్యకర్తల గుండెల్లో ఉన్న ధైర్యాన్ని బద్దలుకొట్టలేరు. ప్రజల వేస్తున్న ప్రశ్నలనూ ఆపలేరు’ అని పునరుద్ఘాటించారు. నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం!దాడి చేసినవారికి రక్షణ… బాధితులపై కేసులతో రాజకీయ కక్ష!@ncbn గారూ.. రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతోంది? దాడి చేసినవారు అధికారపార్టీ వాళ్లయితే వారికి రక్షణ! దాడికి గురైనవారు వైయస్సార్సీపీ వాళ్లయితే వారిపైనే కేసులు ! బాధితులకు అండగా నిలబడితే…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 2, 2026 -
పింగళి వెంకయ్యకు వైఎస్ జగన్ నివాళి
-
‘భోగాపురం.. జీఎంఆర్‌తో ఎందుకు మాట్లాడించలేదు’
సాక్షి, విశాఖ: ఎన్నికలకు ముందు శంకుస్థాపనలు చేయడం చంద్రబాబుకు అలవాటే అంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. భోగాపురం ఎయిర్‌పోర్టుపై క్రెడిట్ చోరీ చేసిన చంద్రబాబు.. కుప్పం ఎయిర్‌పోర్టు ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకే అబద్దాలు చెప్తే ఇక ప్రజల పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవాలి. ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంలో జీఎంఆర్‌తో ఎందుకు మాట్లాడించలేదు అని ప్రశ్నించారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కావడం సంతోషం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్పోర్ట్ కీలకం. నిర్మాణం చేసిన జీఎంఆర్ సంస్థకు కూడా అభినందనలు. దేశ ప్రధాని ముందే సీఎం, డిప్యూటీ సీఎం.. వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడమేంటి?. ప్రధాని ముందే అబద్దాలు చెప్పారు. ప్రధానికే అబద్దాలు చెప్తే ఇక ప్రజల పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవాలి. భోగాపురం ఎయిర్పోర్ట్ కష్టం ఎవరిది అనేది అందరికీ తెలుసు. కొబ్బరికాయ కొట్టి.. గుమ్మడికాయ కట్టింది మాత్రమే బాబు.. ఎయిర్పోర్ట్ కట్టింది మాత్రం వైఎస్ జగన్.2019లో బాబు ఎయిర్‌పోర్టుకి శంకుస్థాపన చేసినప్పటికి కేవలం 270 ఎకరాలు మాత్రమే సేకరించారు. ఉమ్మడి ఏపీలో బాబు వేసిన శిలాఫలకాలు వందల్లో ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చాక 2020లో జీఎంఆర్‌తో ఎయిర్పోర్ట్ ఇన్ కార్పొరేషన్ అయ్యింది. వైఎస్సార్సీపీ హయాంలోనే భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు వేగంగా జరిగాయి. 150కి పైగా న్యాయ వివాదాలు పరిష్కరించి ఎయిర్‌పోర్టు నిర్మాణం చేశాం. వైఎస్సార్సీపీ హయాంలో భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం 2700 ఎకరాల భూసేకరణ చేశాం. అన్ని అనుమతులు వచ్చాకనే వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన రోజు 2026లో ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తామని వైఎస్ జగన్ చెప్పారు.ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంలో జీఎంఆర్‌తో ఎందుకు మాట్లాడించలేదు. ప్రారంభోత్సవంలో జీఎంఆర్ మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయని మాట్లాడించలేదు. భోగాపురం ఎయిర్‌పోర్టులో క్రెడిట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు.. కుప్పం ఎయిర్‌పోర్టు ఏమైందో చెప్పాలి. 2017లోనే చంద్రబాబు కుప్పం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశారు.. దాని సంగతేంటి?. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఏంటి?. ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. వైఎస్సార్సీపీ హయంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగింది. చంద్రబాబు ఓటు బ్యాంకుగా ఉత్తరాంధ్రను వాడుకున్నారు. అబద్దాలు చెప్పే నాయకుడి కోటాలో బాబుకి గిన్నిస్ బుక్ రికార్డ్ ఇవ్వాలి. రాష్ట్రంలో అయితే రెడ్ బుక్ లేకపోతే గిన్నిస్ బుక్ నడుస్తుంది. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ఈ ప్రభుత్వం వదిలేసింది. ఈ రెండున్నర సంవత్సరాల్లో రెడ్ బుక్, గిన్నిస్ బుక్, బాబు ఫేస్ బుక్ తప్ప ఏమీ లేదు. ఎవరికో పుట్టిన బిడ్డకి బాబు ఘనంగా బారసాల చేసినట్టు ఉంది. -
భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవంపై వైఎస్ జగన్ ఆసక్తికర పోస్ట్
-
పింగళి వెంకయ్యకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు పింగళి వెంకయ్య జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. పింగళి వెంకయ్యకు నివాళి అర్పించారు. వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘కుల, మత, ప్రాంతాలకు అతీతంగా భారతీయతను చాటి చెప్పే చిహ్నం మన త్రివర్ణ పతాకం. భారత జాతీయ జెండాకు రూపకల్పన చేసిన చిరస్మరణీయుడు, తెలుగు జాతికే గర్వకారణం పింగళి వెంకయ్య. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు’ అని పోస్టు చేశారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా భారతీయతను చాటి చెప్పే చిహ్నం మన త్రివర్ణ పతాకం. భారత జాతీయ జెండాకు రూపకల్పన చేసిన చిరస్మరణీయుడు, తెలుగు జాతికే గర్వకారణం పింగళి వెంకయ్య గారు. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/62kGr55Rqz— YS Jagan Mohan Reddy (@ysjagan) August 2, 2026 -
థ్యాంక్యూ జగన్ అన్నా
సాక్షి, అమరావతి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం సందర్భంగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టింది. రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని అందించిన నాయకుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డేనని పేర్కొంటూ... ‘థ్యాంక్యూ జగన్ అన్నా‘ అనే సందేశాన్ని శనివారంపోస్టు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్యాగ్ చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే భోగాపురం విమానాశ్రయం కోసం భూసేకరణ, నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం, అవసరమైన అన్ని అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక ప్రక్రియలు పూర్తయ్యాయని పార్టీ వెల్లడించింది. భూసేకరణ, పరిహారం, అనుబంధ మౌలిక వసతుల కోసం దాదాపు రూ.1,200 కోట్లు ఖర్చు చేశారని పేర్కొంది. విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన పునాది పనులన్నింటినీ వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి చేయగా, ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు కావాల్సిన అన్ని చర్యలను కూడా అదే ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేసింది. ఈ ప్రాజెక్టులో ప్రస్తుత సీఎం చంద్రబాబు పాత్ర ఏమీ లేకపోయినా, మొత్తం ఘనతను తన ఖాతాలో వేసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సాధ్యం చేసిన నాయకుడు ఎవరో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసని, అందుకే ‘థ్యాంక్యూ జగన్ అన్నా‘ అంటూ ప్రజలు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని వైఎస్సార్సీపీ ఆ పోస్టులో పేర్కొంది. -
భోగాపురం ఎయిర్ పోర్ట్ క్రెడిట్ జగన్ దే.. బాబు క్రెడిట్ చోరీని బయటపెట్టిన సజ్జల
-
భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవంపై వైఎస్ జగన్ ఆసక్తికర పోస్ట్
-
‘భోగాపురం’ ప్రారంభోత్సవంపై వైఎస్ జగన్ ఆసక్తికర పోస్ట్
సాక్షి, తాడేపల్లి: భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘‘భోగాపురం నుంచి 2026లో విమానాలు ఎగురుతాయి. ఈ విషయం 2023లో నేను శంకుస్థాపన చేసిన రోజే చెప్పాను’’ అంటూ పోస్టు చేశారు. అప్పటి వీడియోను కూడా ఎఫ్బీలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.కాగా, శంకుస్థాపన రోజే ప్రారంభ సమయాన్ని కూడా ప్రకటిస్తూ రూపుదిద్దుకున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా సాకారమైంది. వెనుకబడిన ప్రాంతం ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే కలల విమానాశ్రయానికి అన్ని అనుమతులు సాధించి, న్యాయ వివాదాలను పరిష్కరించి టెంకాయ కొట్టిన రోజే ప్రారంభమయ్యే సమయాన్ని కూడా కచ్చితంగా ప్రకటించడం మాజీ సీఎం వైఎస్ జగన్ దూరదృష్టి, నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది.2023 మే 3న భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ 2026 ఏడాది మధ్యలో విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తామని ముందే ప్రకటించారు. అదే ప్రకారం భోగాపురం ఎయిర్‌పోర్టు శనివారం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమవుతుండటం గమనార్హం. పలు కోర్టు వివాదాలు, భూ సేకరణ చిక్కుముడులు, పునరావాసం కల్పన, కేంద్రం నుంచి కీలక అనుమతులు రాబట్టడం....ఇలా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అన్నీ సాధించడంతోపాటు పనులు కూడా ప్రారంభించడంతో ముందుగా అనుకున్న సమయానికల్లా అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. దీంతో రాత్రి పూట అంతర్జాతీయ సర్వీసులు నడపడానికి అడ్డంకులు తొలగిపోయి వివిధ దేశాలకు నేరుగా కనెక్టివిటీతో ఉత్తరాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం లభించింది. -
భోగాపురం క్రెడిట్ జగన్ కే.. చంద్రబాబు పాత్ర ఏమీ లేదు YSRCP ట్వీట్ వైరల్
-
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ స్పీచ్
-
భోగాపురం సాక్షిగా చంద్రబాబు పరువు తీసిన కేంద్ర మంత్రి
-
ఇది కాదా తప్పు..?
శ్రీకాకుళం క్రైమ్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా కొత్తరోడ్డు వద్ద మహిళా ఎస్ఐ ఎం.ప్రవల్లికను జనంలోకి నెట్టివేసింది, ఆమె గుండెలపై చేయి వేసి తోసివేస్తోంది పోలీసులేనని ఓ ఫొటో రుజువు చేస్తోంది. కొత్తరోడ్డులో వైఎస్ జగన్ కాన్వాయ్ సమీపిస్తున్నప్పుడు కార్యకర్తలు ఎగబడుతున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఆమదాలవలస సీఐ సన్యాసినాయుడు ఎస్ఐ ప్రవల్లికను వెనక నుంచి వీపు మీదుగా భుజంపై చేయి వేయగా.. ముఖానికి స్కార్ప్, పోలీస్ క్యాప్ పెట్టుకున్న ఓ కానిస్టేబుల్ ఆమె గుండెలపై చేయి వేసి నెడుతుండడం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు బయటపడ్డాయి. వైఎస్సార్సీపీ శ్రేణులు, ఆమదాలవలస వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌పై పెట్టిన నాన్‌బెయిలబుల్ సెక్షన్లన్నీ ఇప్పుడు పోలీసులపై కూడా పెడతారా.. అని పలువురు ప్రశ్నిస్తుండటం విశేషం. -
భోగాపురం ఎయిర్ పోర్టుపై 130 కేసులుపై పోరాడి న్యాయం చేసాం!
-
పని YSRCP ది.. ప్రచారం చంద్రబాబు ది.. బాబుకు ఇచ్చిపడేసిన వైఎస్ జగన్
-
జగనే గెలుస్తాడని చంద్రబాబు వద్ద ఇంటెలిజెన్స్ రిపోర్ట్
-
‘భోగాపురం.. చంద్రబాబు పాత్ర ఏమీ లేదు’
సాక్షి, తాడేపల్లి: భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ప్రారంభంపై వైఎస్సార్సీపీ స్పందించింది. రాష్ట్రానికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అందించిన వైఎస్ జగన్ అన్నకు ధన్యవాదాలంటూ పోస్టు చేసింది. ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి జగన్ శ్రీకారం చుట్టారని.. ఈ ప్రాజెక్టులో చంద్రబాబు పాత్ర ఏమీ లేదని స్పష్టం చేసింది.వైఎస్సార్సీపీ ఎక్స్ వేదికగా..‘రాష్ట్రానికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అందించిన వైఎస్ జగన్ అన్నకు ధన్యవాదాలు. వైఎస్ జగన్ హయాంలో ఎయిర్‌పోర్టు భూసేకరణకు దాదాపు రూ.1,200 కోట్లు ఖర్చు చేశారు. నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించటంతోపాటు, అవసరమైన అన్ని అనుమతులు సాధించారు. ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి జగన్ శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టులో చంద్రబాబు పాత్ర ఏమీ లేదు. అయిన్పటికీ మొత్తం ఘనతను తనదేనని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ ఎయిర్‌పోర్టుకు పునాది వేసి, దాన్ని సాధ్యం చేసిన నాయకుడు ఎవరో ప్రజలకు బాగా తెలుసు. అందుకే వారంతా థ్యాంక్యూ జగన్ అన్నా అంటూ మనస్ఫూర్తిగా చెబుతున్నారు’ అని పోస్టు చేసింది. #BhogapuramAirportByJaganA Must Watch Video!🚨Thank you, @ysjagan Anna, for giving Andhra Pradesh an international airport.✈️During YS Jagan Garu's tenure, nearly ₹1,200 crore was spent on land acquisition for the Bhogapuram International Airport, securing all necessary… pic.twitter.com/AFyx2IhGO6— YSR Congress Party (@YSRCParty) August 1, 2026చంద్రబాబు వేసిన విత్తనం ఎలా ఉందో.. పక్కనే ఉన్నా శిలాఫలకం చూపిస్తున్న ఉత్తరాంధ్ర ప్రజలు. వైఎస్ జగన్ కృషితో నిర్మితమైన భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్‌ని చంద్రబాబుకి కట్టబెట్టేందుకు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. #CreditChorBabuచంద్రబాబు వేసిన విత్తనం ఎలా ఉందో.. పక్కనే ఉన్నా శిలాఫలకం చూపిస్తున్న ఉత్తరాంధ్ర ప్రజలు వైయస్ జగన్ గారి కృషితో నిర్మితమైన భోగాపురం ఎయిర్ పోర్టు క్రెడిట్ ని చంద్రబాబుకి కట్టబెట్టేందుకు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు… pic.twitter.com/yRFD3E75QV— YSR Congress Party (@YSRCParty) August 1, 2026 -
ఎయిర్ పోర్ట్ ఎవరు కట్టారో భోగాపురంలో అడగండి! ఎల్లో మీడియాలో వాగడం కాదు
-
భోగాపురం ఎయిర్ పోర్ట్ విషయంలో జగన్ చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేరు
-
జగన్ వల్లే ఎయిర్ పోర్ట్.. భోగాపురం ప్రజల రియాక్షన్
-
జగన్ దేవరపల్లి పర్యటన ముఖ్యంగా దాని కోసమే....
-
నాపై నమ్మకం ఉంచిన జగన్ గారికి ధన్యవాదాలు.. GMR గ్రంథి మల్లికార్జున రావు స్పీచ్
-
నాడు జగన్ శంకుస్థాపన.. నేడు ‘భోగాపురం’ అందాలు (ఫొటోలు)
-
మరో క్రెడిట్ చోరీకి బాబు యత్నం
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్ర ఊహలకు రెక్కలు తొడుగుతూ... శంకుస్థాపన రోజే ప్రారంభ సమయాన్ని కూడా ప్రకటిస్తూ రూపుదిద్దుకున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా సాకారమవుతోంది. వెనుకబడిన ప్రాంతం ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే కలల విమానాశ్రయానికి అన్ని అనుమతులు సాధించి, న్యాయ వివాదాలను పరిష్కరించి టెంకాయ కొట్టిన రోజే ప్రారంభమయ్యే సమయాన్ని కూడా కచ్చితంగా ప్రకటించడం మాజీ సీఎం వైఎస్ జగన్ దూరదృష్టి, నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. 2023 మే 3న భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ 2026 ఏడాది మధ్యలో విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తామని ముందే ప్రకటించారు. అదే ప్రకారం భోగాపురం ఎయిర్‌పోర్టు శనివారం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమవుతుండటం గమనార్హం. పలు కోర్టు వివాదాలు, భూ సేకరణ చిక్కుముడులు, పునరావాసం కల్పన, కేంద్రం నుంచి కీలక అనుమతులు రాబట్టడం.. ఇలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అన్నీ సాధించడంతోపాటు పనులు కూడా ప్రారంభించడంతో ముందుగా అనుకున్న సమయానికల్లా అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. దీంతో రాత్రి పూట అంతర్జాతీయ సర్వీసులు నడపడానికి అడ్డంకులు తొలగిపోయి వివిధ దేశాలకు నేరుగా కనెక్టివిటీతో ఉత్తరాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం లభించింది. మాజీ సీఎం వైఎస్ జగన్ వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి లక్ష్యంగా వేగంగా అడుగులు వేశారు. భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతోపాటు ప్రజారోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ పార్వతీపురం, విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, స్వచ్ఛమైన తాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించారు. మూలపేట పోర్టు, షిప్ ల్యాండింగ్ సెంటర్లతో తీరానికి ఆర్థిక పరిపుష్టి కల్పించి మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంపొందించేలా చర్యలు చేపట్టారు. బాబు పబ్లిసిటీ పీక్స్‌లో..!భూ సేకరణ చేయలేదు.. పునరావాసం ఊసు లేదు.. కోర్టు కేసులు తేల్చలేదు.. కేంద్రంలో కొనసాగి, పౌర విమానయాన శాఖ దక్కించుకుని కూడా కనీసం ఎన్వోసీలు తేలేదు..! అయినా సరే భోగాపురం ఎయిర్‌పోర్టును తామే కట్టేశామని ప్రచారం చేసుకుంటూ జబ్బలు చరుచుకోవడం ఒక్క చంద్రబాబు సర్కారుకే చెల్లుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014 – 19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు భోగాపురం విమానాశ్రయం నిర్మాణం విషయంలో తీవ్ర కాలయాపన చేశారు. నాడు టీడీపీ నుంచి గెలిచిన అశోక్ గజపతిరాజు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కనీసం భూ సేకరణ చేయలేకపోయారు. అనుమతులు సాధించలేకపోయారు. 2,703 ఎకరాలకు గాను కేవలం 377 ఎకరాలు మాత్రమే చంద్రబాబు హయాంలో సేకరించారు. భూసేకరణ, ఎన్వోసీలు, ఎటువంటి అనుమతులు లేకుండానే నాడు ఎన్నికల ముందు హడావుడిగా ఫిబ్రవరిలో టెంకాయ కొట్టి మమ అనిపించారు. ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా విశాఖ – భోగాపురం ఎయిర్‌పోర్టును అనుసంధానించే ఆరు లైన్ల రోడ్డు పనులను మొదలు పెట్టలేకపోయారు. రూ.1,200 కోట్లకు పైగా వ్యయం చేసిన వైఎస్ జగన్ సర్కారు2019లో వైఎస్ జగన్ అధికారం చేపట్టాక భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను పరుగులు పెట్టించారు. ఉత్తరాంధ్ర మణిహారంగా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2200 ఎకరాల్లో నిర్మించే విధంగా 2020 ఏప్రిల్‌లో జీఎంఆర్‌తో వైఎస్ జగన్ సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. ఆ వెంటనే భూమిని సేకరించడంతోపాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించడం, అనుమతులు పొందడం లాంటి కీలక ప్రక్రియను చకచకా పూర్తి చేశారు. హైకోర్టు, ఎన్జీటీల్లో దాఖలైన దాదాపు 130 కేసులను పరిష్కరించి ఎయిర్‌పోర్టు పనులు మొదలు పెట్టడానికి మార్గం సుగమం చేశారు. మూడు గ్రామాల్లో దాదాపు 400 కుటుంబాలను అధునాతనమైన కాలనీలకు తరలించి సరికొత్త ఇళ్లకు యజమానులను చేసింది. ఒక్కో ఇంటికి ఐదు సెంట్ల స్థలంతోపాటు రూ.8.5 లక్షల ఆర్థిక సాయం వెనువెంటనే అందించారు. భూ సేకరణ, పునరావాసం, విద్యుత్, నీరు, రహదారులు లాంటి కీలక మౌలిక వసతుల కల్పన కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.1,200 కోట్లకుపైనే వ్యయం చేసింది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కీలకమైన నిరభ్యంతర పత్రాన్ని (ఎన్వోసీ)ని కేంద్రం నవంబర్ 2022లో జారీ చేసింది. ఇలా అన్ని అనుమతులు సాధించి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ 2023 మే 3న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టులో 3,800 మీటర్లు పొడవైన రన్‌వే నిర్మించడంతో బోయింగ్ 777, బోయింగ్ 787, డ్రీమ్ లైనర్, ఎయిర్ బస్ ఏ–330, ఎయిర్ బస్ ఏ–340 లాంటి అత్యాధునిక భారీ విమానాలను ల్యాండ్ చేసేందుకు వీలుంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్‌పోర్టును ప్రారంభించనుండగా ఆగస్టు 17 నుంచి వాణిజ్యపరంగా కార్యకలాపాలు మొదలు కానున్నాయి.క్రెడిట్ తండ్రీ, తనయులదే..!‘‘మా ఫస్ట్ ఎయిర్‌పోర్టుకు హైదరాబాద్‌లో వైఎస్సార్ శంకుస్థాపన చేసి.. ఆయనే సీఎంగా ఉండగా నిర్మాణం కూడా పూర్తి చేసి ప్రారంభించారు. ఆ తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంలో కూడా వైఎస్సార్ పాల్గొన్నారు. ఇది భగవంతుడి నిర్ణయమో ఏమో తెలియదు.. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ సీఎంగా భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషం..’’ – 2023 మే 3న భోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపనలో జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రంధి మల్లికార్జునరావుఎయిర్పోర్టుకు అనుబంధంగా మరిన్ని...» 5,000 చ.మీ విస్తీర్ణంలో లాజిస్టిక్ ఎకో సిస్టం, కార్గో టెర్మినల్ నిర్మాణంతో సరకు రవాణాకు విస్తృత అవకాశాలు» ఎయిర్‌పోర్ట్‌కు అనుబంధంగా ఏవియేషన్ అకాడమీ, మెయింటెనెన్స్, రిపేరు, ఓవర్ హాలింగ్ వ్యవస్థల ఏర్పాటు» విమానాశ్రయ నిర్మాణం వల్ల ప్రత్యక్షంగా 10,000 మందికి, పరోక్షంగా మరో 10,000 మందికి ఉద్యోగాల కల్పన 2023 మే 3న భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన అనంతరం విమానాశ్రయం నమూనాను పరిశీలిస్తున్న నాటి సీఎం వైఎస్ జగన్ (ఫైల్) -
దేవరపల్లి పొగాకు బోర్డుకు 5న వైఎస్ జగన్ రాక
బుట్టాయగూడెం (జంగారెడ్డిగూడెం): పొగాకు రైతులకు మద్దతుగా ఆగస్టు 5న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవరపల్లి పొగాకు బోర్డుకు వస్తున్నారని.. ఆయన పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కో–ఆర్డినేటర్, మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ రాక నేపథ్యంలో శుక్రవారం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథరావు కార్యాలయం వద్ద శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. అమర్నాథ్ మాట్లాడుతూ.. రైతులు కేజీకి రూ.300 పెట్టుబడి పెట్టి పొగాకు పండిస్తే ఆ పంటలను నేడు రూ.170 నుంచి రూ.190 వరకూ అమ్ముకునే పరిస్థితి దాపురించిందన్నారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన సీఎం చంద్రబాబు.. వరికి యూరియా వేస్తే కేన్సర్ వస్తుందని, మామిడికాయ తింటే షుగర్ వస్తుందని, సిగరెట్లు తాగితే కేన్సర్ వస్తుందని, మిర్చి తింటే ఎసిడిటీ వస్తుందని చెబుతూ రైతులను నిరుత్సాహపరుస్తున్నారని ఆరోపించారు. ఏ పంట కూడా ఆరోగ్యకరం కాదంటే రైతులు ఎలా బతకాలని అమర్నాథ్ ప్రశ్నించారు. ఇటీవల ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన పొగాకు రైతుల గర్జన ఆగస్టు 5న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటానికి నాందిగా నిలిచిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి కళ్లు తెరిపించేలా రైతులు పెద్దఎత్తున పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల ఇన్చార్జిలు, పరిశీలకులు పాల్గొన్నారు. -
భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై జగన్ మాస్టర్ ప్లాన్
-
భోగాపురం.. భూములిచ్చిన రైతులు చెప్పింది ఇదే..
సాక్షి, విజయనగరం: భోగాపురం ఎయిర్పోర్ట్ ఘనత ముమ్మాటికీ వైఎస్ జగన్‌కే దక్కుతుందని.. ఎయిర్‌పోర్టుకు భూములు ఇచ్చిన రైతులు తేల్చి చెప్పారు. గురువారం.. వైఎస్ జగన్ విశాఖ మీదగా శ్రీకాకుళం వెళ్తున్న సందర్భంగా భోగాపురం ఎయిర్ పోర్ట్ వద్ద ‘థ్యాంక్యూ జగన్ సార్’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. భోగాపురం అభివృద్ధి ఏవిధంగా జరిగిందో తెలిపారు. అసలేం జరిగిందో భూములిచ్చిన తమకు తెలుసన్నారు. వైఎస్ జగన్ కృషితోనే ఇది జరిగిందన్నారు.భోగాపురం ఎయిర్పోర్ట్ వైఎస్ జగన్ కష్ట ఫలితం.. కానీ చంద్రబాబు మేం చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు అబద్ధాలను ప్రజలు నమ్మరన్నారు. ఆనాడు రైతులను మోసం చేయడానికి 15 వేల ఎకరాలు తీసుకుంటానని చంద్రబాబు చెప్పితే.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2500కి తగ్గించి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పునరావాసం కల్పించి.. అన్నివిధాలుగా ఆదుకున్నారన్నారు.‘‘సౌకర్యాలు కల్పించి రైతులకు వైఎస్ జగన్ అండగా నిలబడ్డారు. నేడు కూటమి ప్రభుత్వం వచ్చి ఆ క్రెడిట్ తమదేనని చెప్పుకోవడం దారుణం. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కారణం ఎవరో? ఏం జరిగిందో? భూములిచ్చిన రైతులకు తెలుసు’’ అని స్థానికులు పేర్కొన్నారు. -
ఇప్పుడు అర్థమైందా జగనన్న అంటే ఏంటో
-
YS జగన్ ఏలూరు పర్యటన.. YSRCP నేతలు ఏమన్నారంటే?
-
జగన్ విజన్‌తోనే భోగాపురం సిద్ధం...
-
ఆనాడు అసలు వైఎస్ జగన్ ఏమన్నారంటే..
భోగాపురం ఎయిర్ పోర్టును వైఎస్ జగన్ వ్యతిరేకించినట్లు పచ్చగుంపు అబద్దపు ప్రచారం చేస్తోంది. ఆయన ఏనాడూ ఎయిర్ పోర్ట్‌ను వ్యతిరేకించలేదు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు సొంత భాష్యాలు చెబుతూ.. ఎల్లో మీడియా చెలరేగిపోతోంది. అయితే, విమానాశ్రయానికి సీఎం హోదాలో వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారనే అసలు వాస్తవానికి మాత్రం ముసుగేసింది.ఆనాడు సీఎం హోదాలో వైఎస్ జగన్ కేవలం శంకుస్థాపనకే పరిమితం కాలేదు. భూ సేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న న్యాయపరమైన వివాదాలన్నిటినీ పరిష్కరించారు. కావాల్సిన అనుమతులన్నీ తెప్పించారు. అన్నీ చేసిన తరవాత... 30 నెలల్లో పూర్తి చేయాలని జీఎంఆర్ సంస్థకు లక్ష్యం విధించి మరీ కొబ్బరికాయ కొట్టారు. కానీ ఎల్లో మీడియా మాత్రం ఎయిర్ పోర్ట్‌ను వ్యతిరేకించారంటూ దుష్ప్రచారం చేస్తోంది.ఆనాడు అసలేం జరిగిందంటే..భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం చంద్రబాబు 2015లో రైతుల నుంచి 15,000 ఎకరాలను సేకరించాలని నిర్ణయం తీసుకోవడంపై స్థానిక రైతుల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. ఈ ఆందోళనతో వైఎస్ జగన్ కూడా ఏకీభవించారు. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు అన్ని ఎకరాల భూమి దేనికంటూ నిలదీశారు. 2,300 ఎకరాలు ఉంటే సరిపోతుందన్నారు. ‘‘చెన్నై ఎయిర్‌పోర్టు ఎన్ని ఎకరాల్లో ఉంది? ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఎన్ని ఎకరాల్లో ఉంది? అని ప్రశ్నిస్తూ వైఎస్ రైతులకు మద్దతుగా నిలిచారు.చివరకు చంద్రబాబు ప్రభుత్వం సేకరించాల్సిన భూమిని తొలుత 6,000 ఎకరాలకు.. ఆ తర్వాత 2,700 ఎకరాలకు కుదించుకుంటూ వచ్చింది. చివరకు 2017లో 2,700 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించడంతో పాటు.. ఇందుకోసం ఏర్పాటు చేసిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ కంపెనీ పేరుమీద రూ.1,500 కోట్ల అప్పును హడ్కో నుంచి తీసుకోవడానికి అనుమతిస్తూ జీవో ఇచ్చారు. అయితే బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఇవేమీ పట్టని ఎల్లో గ్యాంగ్.. నాడు భూసేకరణను వ్యతిరేకించి.. ఎయిర్‌పోర్ట్‌ను అడ్డుకున్నారంటూ అసత్యాలు ప్రచారాలు చేస్తోంది. -
YS ఆనంద్ రెడ్డికి YS జగన్, YS భారతి కన్నీటి నివాళి
-
భూమి ఇచ్చిన స్థానికులుగా చెప్తున్నాం భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం జగన్ కృషినే
-
KSR Full Show : బాబు-లోకేష్‌కు జగన్ భయమా..?
-
అడుగు బయటపెడితే చాలు.. నన్ను ఆపడం మీ తరం కాదు..
-
YS ఆనంద్ రెడ్డి కన్నుమూత పులివెందులకు వైఎస్ జగన్


