breaking news
Chandrababu Naidu
-
EVM ట్యాపరింగ్ జరిగిందో లేదో చంద్రబాబే చెప్పాలి..! ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్
-
'పవర్' ఫ్యాక్టర్ షాక్
సాక్షి, అమరావతి: వెన్నుపోటుకు ట్రేడ్ మార్క్ వంటి చంద్రబాబు ఆక్వా రెతులకు షాక్ ఇచ్చారు. రూ.1.50కే యూనిట్ విద్యుత్‌ను మరిన్ని ఫారాలకు విస్తరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2026 జూన్ 1 నుంచి ఈ రాయితీని వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ ఉత్తర్వుల్లోనూ పవర్ ఫ్యాక్టర్ (పీఎఫ్) పేరుతో కఠిన నిబంధన విధించారు. అంతేకాకుండా 2027 మార్చిలోగా పీఎఫ్ 0.90 నుంచి 0.95 మధ్య ఉండేలా చూసుకోకపోతే సబ్సిడీ వర్తించదని స్పష్టం చేశారు. ఆక్వా రైతులు ఆ మేరకు పీఎఫ్ ప్రమాణాలు పాటించాలంటే భారీగా డబ్బులు వెచ్చించక తప్పదు. దీంతో రాయితీని ఎగవేసేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఈ విధంగా మెలిక పెడుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫారాల వర్తింపులోనూ మోసమే ఇప్పటికే రాయితీని అందుకుంటున్న ఆక్వా విద్యుత్ సర్వీసులతోపాటు అదనంగా 12,500 ఫారాలకు ఈ రాయితీ వర్తిస్తుందని ఈ ఏడాది జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఆదేశాల్లో వెల్లడించింది. కానీ మంగళవారం ఇంధన శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో మాత్రం అప్సడా, సీఏఏ చట్టాల కింద రిజిస్టర్ అయిన సుమారు 6,500 ఆక్వా ఫారాలకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని వెల్లడించారు. కొత్తగా ప్రకటించిన ఆక్వా జోన్లలోని అర్హత ఉన్న ఫారాలు కూడా పరిధిలోకి వస్తాయని, భవిష్యత్తులో రిజి్రస్టేషన్ చేసుకునే ఫారాలకు రిజి్రస్టేషన్ తేదీ నుంచి రాయితీ ఇస్తామని చెప్పారు తప్ప ఆ సర్వీసులు సంఖ్యను ఉత్తర్వుల్లో పొందుపరచలేదు. దానికి తోడు కొత్తగా రాయితీ పొందేవారితో పాటు ఇప్పటికే పొందుతున్న వారికీ పీఎఫ్ షరతులు విధించారు. ఈ నిబంధన వేలాది చిన్న, మధ్య తరహా రైతులను రాయితీకి దూరం చేసే ప్రమాదం ఉందని ఆక్వా రంగ నిపుణులు చెబుతున్నారు. రైతులను హెచ్చరిస్తున్న డిస్కంలు రూ.1.50 యూనిట్ విద్యుత్ ప్రయోజనం పొందాలంటే ముందుగా ప్రభుత్వం పెట్టిన పవర్ ఫ్యాక్టర్ ప్రమాణాన్ని అందుకోవాల్సిందే. అది సాధించకపోతే సబ్సిడీ ఉండదని ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉంది. అంటే రాయితీ ఉన్నా.. షరతు దాటితే పూర్తి ప్రయోజనం దూరమయ్యే పరిస్థితి. మీ విద్యుత్ కనెక్షన్ పవర్ ఫ్యాక్టర్ (పీఎఫ్) ప్రస్తుతం తక్కువగా ఉంది. అధిక బిల్లులు రాకుండా ఉండాలంటే పవర్ ఫ్యాక్టర్‌ను 0.95 కంటే ఎక్కువగా ఉంచండి అంటూ ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్)లు ఆక్వా రైతుల సెల్ఫోన్లకు హెచ్చరిక సందేశాలు పంపిస్తున్నాయి. అంటే ప్రభుత్వం రాయితీకి కనీస అర్హతగా పీఎఫ్ తగ్గకూడదని పేర్కొనడమే ఓ కుట్ర అయితే, విద్యుత్ సంస్థలు మరో అడుగుముందుకు వేసి 0.95 కంటే ఎక్కువ పీఎఫ్ ఉండాలని చెబుతున్నాయి. ఎడాపెడా బాదుడే ఇప్పటికే ఫీడ్ ధరలు పెరగడం, డీజిల్ ఖర్చులు అధికమవడం, ఎగుమతి మార్కెట్లలో ధరల తగ్గుదల, రొయ్యలకు వ్యాధులు వంటి సమస్యలతో ఆక్వా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి విద్యుత్ రాయితీ కాస్త ఊరట అవుతుందనుకుంటే, ఇప్పుడు అదీ వచ్చేలా కనిపించడం లేదు. ఉదాహరణకు ఒక ఆక్వా ఫారం నెలకు 10 వేల యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే యూనిట్‌కు రూ.1.50 రాయితీ ప్రకారం నెలకు రూ.15 వేలు చొప్పున ఏడాదికి రూ.1.80 లక్షల వరకు ఆదా అవుతుంది. కానీ పీఎఫ్ నిబంధన కారణంగా అర్హత కోల్పోతే ఈ మొత్తం రైతు భరించాల్సి వస్తుంది. లేదా అదనంగా పీఎఫ్ సరిచేసేందుకు రూ.లక్ష వరకు ఖర్చు పెట్టాల్సి రావచ్చు. ప్రభుత్వం విద్యుత్ రాయితీతో పాటు పవర్ ఫ్యాక్టర్ మెరుగుపరిచే కెపాసిటర్ బ్యాంకులు, కంట్రోలర్ల కొనుగోలుపై సబ్సిడీ లేదా ప్రత్యేక సహాయం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పవర్ ఫ్యాక్టర్ షరతు కారణంగా వేలాది మంది ఆక్వా రైతులు రాయితీకి దూరమయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పవర్ ఫ్యాక్టర్‌తో భారీ భారం పవర్ ఫ్యాక్టర్ అనేది విద్యుత్‌ను ఎంత సమర్థవంతంగా వినియోగిస్తున్నామో తెలిపే సూచిక. ఇది 1.00కు దగ్గరగా ఉంటే మంచిది. కానీ ఆక్వా ఫారాల్లో నిరంతరం పనిచేసే ఏరేటర్లు, బ్లోయర్లు, వాటర్ పంపులు, మోటార్లు వంటి ఇండక్టివ్ లోడ్ల కారణంగా పీఎఫ్ తగ్గడం అనేది అత్యంత సహజం. ముఖ్యంగా చిన్న రైతుల వద్ద పవర్ ఫ్యాక్టర్ సరిచేసే కెపాసిటర్ బ్యాంకులు లేదా ఆటోమేటిక్ కంట్రోల్ పరికరాలు ఉండవు. ప్రభుత్వ నిబంధన ప్రకారం పీఎఫ్‌ను మెరుగుపరిచి, రాయితీ పొందాలంటే రైతులు అదనంగా ఖర్చులు భరించాల్సి వస్తుంది. నిపుణుల అంచనాల ప్రకారం చిన్న ఫారాలకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు, మధ్య తరహా ఫారాలకు రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు, పెద్ద ఫారాలకు అంతకంటే ఎక్కువ ఖర్చు కావచ్చు. రాయితీ కోసం ఈ అదనపు పెట్టుబడి పెట్టడం రైతులకు భారంగా మారుతుంది. -
మంగళవారం ఖాతాలో మరో రూ.3,800 కోట్లు
సాక్షి, అమరావతి: సంక్షేమం, ఎన్నికల హామీల ఊసు విస్మరించిన సీఎం చంద్రబాబు రాష్ట్రంపై అంతులేని అప్పుల భారం మోపుతున్నారు. బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట అనే తేడా లేకుండా దొరికిన చోటల్లా అప్పులు చేయడమే ధ్యేయంగా సాగుతున్నారు. ప్రజల ఆదాయాన్ని, రాష్ట్ర రాబడిని మాత్రం పెంచడం లేదు. 26 నెలల పాలనలో చంద్రబాబు సర్కారు రోజుకు దాదాపు రూ.472 కోట్లు, నెలకు సుమారు రూ.14,160 కోట్లు చొప్పున అప్పులు చేసింది. తాజాగా మంగళవారం మరో రూ.3,800 కోట్లు బడ్జెట్ అప్పు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ ఈ మొత్తాన్ని సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట, రాజధాని పేరుతో 26 నెలల్లోనే చంద్రబాబు సర్కారు చేసిన అప్పులు ఏకంగా రూ.3,68,126 కోట్లకు చేరాయి. చేబదుళ్లకు సైతం వడ్డీలు..! కాగ్, ఆర్బీఐ గణాంకాల మేరకు చంద్రబాబు సర్కారు బడ్జెట్ అప్పులే రూ.2,06,415 కోట్లకు చేరాయి. ఇక వివిధ ప్రభుత్వ రంగ సంస్ధల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు రూ.1,14,024 కోట్లకు చేరాయి. రాజధాని పేరుతో చేసిన అప్పులు రూ.47,687 కోట్లకు చేరాయి. ఇవి కాకుండా రోజూ ఆర్బీఐ నుంచి చేబదుళ్లు, ఓడీలతోనే చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. చేబదుళ్లకు కూడా వడ్డీలను చెల్లిస్తున్నట్లు ఇటీవల కాగ్ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. ఇంత అప్పు చేసినా అభివృద్ధి, సంక్షేమం మాటే లేదు. నిరుద్యోగులకు హామీ మేరకు భృతిగానీ ఉద్యోగాలుగానీ ఇవ్వలేదు. సూపర్ సిక్స్, సెవెన్ హామీలు గాలికి ఎగిరిపోయాయి. మరోపక్కఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఆస్తులను సైతం ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా పీపీపీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. -
మరోసారి భారీ అప్పు చేసిన కూటమి ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ఇదివరకే అప్పులలో రికార్డు సృష్టించిన చంద్రబాబు ప్రభుత్వం మరో భారీ అప్పు తెచ్చింది. ఈ రోజు (మంగళవారం) రూ. 3800 కోట్లు అప్పుగా తీసుకవచ్చింది. రిజర్వు బ్యాంకులో సెక్యూరిటీలు వేలం వేయడం ద్వారా ఈ అప్పుతెచ్చింది. చంద్రబాబు అధికారం చేపట్టిన 26 నెలల్లోనే రూ. 3 లక్షల 68 వేల కోట్లు అప్పు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశంలోనే అత్యధికంగా అప్పు తెచ్చిన ప్రభుత్వంగా చంద్రబాబు సర్కార్ రికార్డు సృష్టించింది. -
"ఏపీ ఫర్ సేల్" అనే పరిస్థితి వచ్చింది.. కన్నబాబు
సాక్షి, కాకినాడ: కూటమి ప్రభుత్వం ఆడిండే ఆట పాడిందే పాట అన్న చందాన ప్రభుత్వం సాగుతుందని మాజీమంత్రి కన్నబాబు అన్నారు. చంద్రబాబు పాలనలో "ఏపీ ఫర్ సేల్" అనే పరిస్ధితి వచ్చిందన్నారు. ప్రజల పక్షాన నిలబడి పని చేయ్యాల్సిన చంద్రబాబు కార్పోరేట్ల పక్షాన నిలబడ్డాడని ధ్వజమెత్తారు. ఈ రోజు (మంగళవారం) కాకినాడలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి తన సొంత మనుషుల కోసం.. కార్పొరేట్ సంస్ధల కోసమేనని తేటతెల్లమైందన్నారు.కన్నబాబు మాట్లాడుతూ..పీపీపీ ద్వారా రాష్ట్రాన్ని ఏం చేయ్యాలనుకుంటున్నారు. ప్రభుత్వమే గ్యాప్ ఫండింగ్ తో పాటుగా వడ్డీ లేని రుణాలను ప్రైవేటు సంస్ధలకు కట్టబెడుతుంది.ప్రభుత్వ ఆస్ధులు..వనరులను దోచి పెట్టి యూజర్ ఛార్జీల పేరుతో ప్రైవేటు సంస్ధలు దోచుకునేలా చేస్తున్నారు. పీపీపీకీ ఇవ్వకుండా ఇంకా ఏ రంగం మిగిలింది? వ్యవసాయం గిట్టుబాటు కాదని వదిలేసినట్లు ఉన్నారు. మీ ప్రభుత్వాన్ని కూడా పీపీపీ క్రింద నడపండి. ఇప్పటికే ఆర్టిసీ ఆస్ధులను ప్రైవేటు పరం చేస్తున్నారు. అన్ని రంగాలను ప్రైవేటు పరం చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు.కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏం చేయ్యాలనుకుంటుందని చంద్రబాబును భుజాన మోసే కార్యక్రమంలో పచ్చ మీడియా సంస్థలు అన్ని మరచిపోయాయని ధ్వజమెత్తారు. ఈనాడులో పీపీపీ మీద ఆహ ఓహో అంటూ రాస్తారా? ఇదే మీ రామోజీ ఫిల్మ్ సిటీ ఐతే ఒప్పుకుంటారా? పీపీపీ పాలసీ సిగ్గు చేటు...ప్రజలకు ప్రమాదకరమని ఒక్కసారి ప్రభుత్వ రంగ ఆస్ధులను కట్టబెడితే మళ్ళీ వెనక్కి తీసుకోలేరని అన్నారు. ఈ అధికారం మీకు ఎవ్వరూ ఇచ్చారని ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ ఆస్ధులను పప్పు బెల్లాల్లా పంచేస్తారా అని విమర్శించారు. నవ్విపోదురు గాక నాకేంటీ సిగ్గూ అని మీరు అనుకుంటే... ప్రజలు నవ్వే పరిస్థితి లో లేరని, పీపీపీ పాలసీని ఎండగట్టే పరిస్ధితి వచ్చిందన్నారు.పీపీపీ ద్వారా డబ్బులు, రుణాలు, భూమి, ఆస్ధులను ప్రభుత్వమే ఇస్తుందని ప్రైవేటు సంస్ధలు యూజర్ ఛార్జీలను వసూల్ చేస్తుందని దోపిడికి తెర తీసి తరతరాలకు నష్టం చేస్తామంటే ఒప్పుకోమన్నారు. ముక్కు పిండి జనాల దగ్గర సేవలకు ఛార్జీలు వసూలు చేస్తామని పీపీపీ పాలసీ ద్వారా చెబుతున్నారు. పారిశుద్ధ్యం చేయ్యాల్సిన మున్సిపాలిటీని.. పంచాయితీలను ప్రైవేటు పరం చేస్తే చెత్త మీద పన్ను వేసినట్లు కాదా? అని ప్రశ్నించారు.చంద్రబాబు ఎప్పుడూ అధికారంలోకి వచ్చినా వాళ్ళ సొంత మనుషులకు దోచి పెడతారు. వైజాగ్ లో ఆర్టీసీ స్ధలాన్ని ప్రైవేటు సంస్ధకు చంద్రబాబు ఇచ్చేశారు. అక్కడ నిర్మించిన సిఎంఆర్ మాల్ ఆర్టీసీ స్ధలం అని ఈ నాటీ యువతకు తెలియదు. జన్మభూమి నుండి నీరు చెట్టు వరకు అంతా దోపిడియే. ఆల్వీన్ మొదలు కొని కాకినాడ గోదావరి ఫెర్టిలైజర్ వరకు అన్ని ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మేశారు అని మాజీ మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు -
కూటమి సర్కార్‌కు జూనియర్ డాక్టర్ల వార్నింగ్
-
ప్రశ్నిస్తే చాలు దాడులు చేస్తున్నారు.. కూటమి నేతలకు బొత్స వార్నింగ్
-
బాబుకు YS జగన్ సలహా
-
చంద్రబాబు కాకి లెక్కలు.. ఆ భయంతోనేనా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గణాంకాలు చెప్పడంలో ఘనాపాటి అని ఒప్పుకోవాలి. కొందరు వాటిని కాకి లెక్కలు అనవచ్చు. మరికొందరు భలే లెక్కలు అనవచ్చు. కాని వాటిని విశ్లేషించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఏపీ ప్రజలు వాటిని ఎంతవరకు నమ్ముతారో తెలియదు. ఆయన మాత్రం ఏకధాటిగా మూడు గంటలపాటు ప్రజెంటేషన్ ఇచ్చి ఏదో జరిగిపోతోందన్న భ్రమ కల్పించడానికి యత్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం పేరుతో ఇచ్చిన ప్రజెంటేషన్ రెండు రకాలుగా కనిపిస్తుంది. ఒకటి ఏపీ ఆర్థికంగా ఇబ్బందులలో ఉందన్న భయం. మరోపక్క లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయన్న భ్రాంతి.. ఈ రెండు విషయాలు ఆయనే చెప్పగలరు. ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ప్రజలకు బాండ్ పత్రాలు ఇచ్చారు. అందులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిస్తే ఒక్కో కుటుంబానికి ఎంత మొత్తం లబ్ధి చేకూరుతుందో తెలిపారు. వీరిద్దరూ త్రికరణ శుద్దిగా ప్రమాణం చేసి బాండ్లు ఇస్తున్నామని అన్నారు. బాగానే ఉంది. త్రికరణ శుద్ది ఉంటే ఏమి చేసి ఉండాలి. నిజంగానే ఆయా కుటుంబాలకు ఈ రెండేళ్లలో ఎంతెంత ఇచ్చింది మళ్లీ లెక్కలు ఇవ్వాలి కదా! ఆ పని చేయకుండా ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నామని, అప్పులు చేసి సంక్షేమ స్కీములు అమలు చేస్తున్నామని చంద్రబాబు చెబుతున్నారు.గతంలో అప్పులు చేసేవారికి సంక్షేమ స్కీములు అమలు చేసే అర్హత ఉందా అని ఆయనే ప్రశ్నించేవారు. డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజన్ గ్రోత్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎల్లో మీడియా ప్రముఖంగా కథనాన్ని ఇచ్చింది. సీమాంధ్ర, కోస్తా, ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్దే లక్ష్యమని ఆయన చెప్పారు. బాగానే ఉంది. ఆ తర్వాత ఇచ్చిన లెక్కలు చూస్తే మతి పోవల్సిందే. ఈ మూడు ప్రాంతాలలో కలిపి ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టుల ద్వారా సుమారు 46 లక్షల ఉద్యోగాలు వస్తాయట. అందులో 2032 లోపు 30 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందట. బహుశా 1956 నుంచి ఉమ్మడి ఏపీలో కూడా ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయో, లేదో తెలియదు. కాని విభజిత ఏపీలో మాత్రం అన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబితే నమ్మగలమా? 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు అని ప్రచారం చేశారు. శ్వేతపత్రంలో వాటిని డబుల్ చేసేశారన్నమాట.ఒకవైపు ప్రపంచం అంతటా సంక్షోభం, ఎల్‌నినోలో ప్రభావం వంటివాటితో ఉపాధి సమస్యలు వస్తుంటే ఏపీలో మాత్రం ఈ రకంగా లక్షల ఉద్యోగాలు వస్తాయంటున్నారు. నిజంగా అలా చేయగలిగితే గొప్పపేరే వస్తుంది. దానిని అంతా స్వాగతిస్తారు. కాని కేవలం ప్రజలను మభ్య పెట్టేరీతిలో ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ప్రచారం చేస్తే మాత్రం ఏపీకి తీరని అన్యాయం చేసినట్లవుతుందని గ్రహించాలి. చంద్రబాబు చెబుతున్నదాని ప్రకారం అమరావతి ఆర్థిక రీజియన్‌ను టెక్నాలజీ, పరిశ్రమలు మౌలిక వసతులు, ఇంధనం విభిన్న ఆర్థిక వ్యవస్థలకు కేంద్రంగా తీర్చిదిద్దుతారట. ఇక్కడ మొత్తం 6-8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రాథమిక అంచనా అట. వీటి ద్వారా 2032 నాటికి పది లక్షల ఉద్యోగాలు వస్తాయని సీఎం చెబుతున్నారు. విశాఖ ఎకనమిక్ రీజియన్‌లో 49 ప్రాజెక్టులతో పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయట. ఈ పెట్టుబడుల ద్వారా 24 లక్షల మందికి ఉపాధి లబ్ధిస్తుందని ఆయన అంటున్నారు. 2032 నాటికి పది లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందట. ఇక తిరుపతి ఆర్థిక రీజియన్‌లో 11-12 లక్షల కోట్ల పెట్టటుబడులు ఆకర్షించడం ద్వారా 2032 నాటికి పది లక్షల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం అని ఆయన తెలిపారు. ఏపీ ఆదాయంలో 40 శాతం రాయలసీమ నుంచే వచ్చేలా తయారు చేస్తారట. లక్ష కోట్లతో ఉద్యానవన హబ్‌ను ఏర్పాటు చేస్తామని కూడా ఆయన వెల్లడించారు. ఒక పక్క మామిడి రైతులు తమకు గిట్టుబాటు ధరలు రావడం లేదని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో చీని తోటలు ఎండిపోతున్నాయని, టాంకర్లు తెచ్చి నీరు పెట్టుకోవల్సి వస్తోందని ఈ మధ్య ఎల్లో మీడియానే వార్తలు ఇచ్చింది. మరో వైపు చంద్రబాబు మాత్రం లక్ష కోట్ల ఉద్యానవన హబ్ అని ఊదరగొడుతున్నారు. ఇందులో కేంద్రం నలభైవేల కోట్లు ఇవ్వాలట. ఇవన్ని ఎప్పటికి జరిగేనో ఎవరు చెప్పగలరు? మరో విషయం ఏమిటంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా 2030 నాటికి రెండున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబుతున్నారు.విశేషం ఏమిటంటే విశాఖ, తిరుపతి రీజియన్లకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఎంత పెట్టుబడి పెడతారన్నది క్లారిటీ లేదు కాని, అమరావతిలో నిర్మాణాలు, మౌలిక వసతులకోసం ఇంతవరకు 40887 కోట్ల మొత్తాన్ని సమీకరించామని ఆయన తెలిపారు. ఇటీవల ఏపీలో ఒక అసంతృప్తి ఏర్పడింది. ప్రభుత్వం వేల కోట్ల అప్పు చేసి మొత్తం అంతా అమరావతిలోనే ఖర్చు చేస్తోందని మిగిలిన ప్రాంతాల ప్రజలు విమర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా విశాఖ, తిరుపతి రీజియన్లలో పెట్టుబడులు రాబోతున్నాయని, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని నమ్మబలకాలని ఆశిస్తున్నట్లుగా ఉంది. ఇవన్ని చదువుతుంటే ఒకప్పుడు చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా 2002 ప్రాంతంలో విజన్ 2020 అంటూ పెద్ద ఎత్తున హడావుడి చేశారు. అందులో కూడా ఏవేవో లెక్కలు రాస్తే అంతా చూసి నవ్వుకున్నారు. తదుపరి టీడీపీ 2004 ఎన్నికలలో ఓటమిపాలైంది. తిరిగి 2014లో విభజిత ఏపీలో టీడీపీ మళ్లీ పవర్లోకి వచ్చింది. ఆ టరమ్‌లో ఒక్కసారి కూడా విజన్ 2020 ఊసు ఎత్తినట్లు కనిపించలేదు. అప్పట్లో స్వర్ణాంధ్ర, 2029నాటికి దేశంలోనే నెంబర్ ఒన్ అంటూ కొత్త నినాదాలతో కాలం గడిచిపోయింది. 2019 ఎన్నికలలో టీడీపీ ఓడిపోయింది. తిరిగి ఈ టరమ్‌లో 2047 విజన్‌తో పాటు డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్ అని కొత్త పదాలు అందుకున్నారు. అంటే ఒక్కో టరమ్‌లో ఒక్కో నినాదంతో కథ నడిపేయడం, ప్రజలు వాటిని వినీ.. విని విసుగుచెంది ఓడించడం జరుగుతోందని అనుకోవాలా? మరి వచ్చే ఎన్నికలలో ఏమవుతుందో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి..!
-
నీకు దమ్ముంటే నీ కొడుకుని రాజీనామా చేయమని చెప్పు
-
మా జగనన్న సీఎం అయ్యాక.. ఫస్ట్ ఓపెన్ చేసేది DSCఫైలే.. పేర్ని కిట్టు వార్నింగ్
-
విచారణ అంటే బాబు వణికిపోతున్నాడు
-
దమ్ముంటే గుడివాడకు రా.. తొక్కి పెట్టాలని చూస్తే...
-
ధర్నా చేస్తే కొడతారా? ప్రతీ దెబ్బకి కౌంటర్ ఉంటది.. DSPకి ఇచ్చిపడేసిన మల్లాది విష్ణు
-
మెడికో ప్రియాంక ఘటనపై చంద్రబాబుపై RK రోజా ఫైర్
-
డీఎస్సీపై ప్రశ్నిస్తే దాడులా?.. ‘క్రిమినల్స్ అడ్డా’ ఎవరిది బాబు?
విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావు తన అనుచరులతో కలిసి గత గురువారం నాడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్ష శిబిరంపై దాడి చేశారు. టెంట్ పీకేశారు. అక్కడ కొందరు టీడీపీ గూండాలు వికృత చేష్టలకు పాల్పడ్డారు. సరిగ్గా అదే టైమ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో ఉన్నారు. బోండా ఉమ అరాచక ప్రవర్తనపై ఆయనకు సమాచారం అందే ఉండాలి. అయినా అలాంటివి చేయవద్దని చెప్పకపోగా, వైఎస్సార్‌సీపీవారిని ఉద్దేశించి గొడ్డలి పార్టీ, క్రిమినల్స్ తయారీ అడ్డా అంటూ చంద్రబాబు విమర్శించారట.కొన్నాళ్ల క్రితం బోండా ఉమ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పక్కన కూర్చుంటే చంద్రబాబుకు కోపం వచ్చింది. వెంటనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి పార్టీ కమిటీ వేసి మందలించే ఏర్పాటు చేశారు. తదుపరి తన కుమారులతో కలిసి బోండా ఉమ చంద్రబాబును కలిశారు. అక్కడ ఏమి మాట్లాడుకున్నారో తెలియదు కాని, మరుసటి రోజే ఉమా విజయవాడలో గూండాయిజానికి బరి తెగించారు. వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై ఆయన అనుచరులు దాడి చేశారు. విజిటేరియన్ అయిన విష్ణుపై కోడిగుడ్లు విసిరారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు, మంత్రి లోకేష్ రాజీనామా కోరుతూ వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. వారు తమ డిమాండ్‌తో ప్రశాంతంగా దీక్షలు చేస్తున్నారు. దీనిని భరించడం టీడీపీ నాయకత్వానికి కష్టంగా మారింది.నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌పై ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన ఫలితంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసి వచ్చింది. జార్ఖండ్‌లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆందోళనలు సాగుతున్నాయి. వాటికి ప్రభుత్వంలో భాగస్వామి అయిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా మద్దతు ఇస్తున్నారు. ఏపీలో కూడా డీఎస్సీ టీచర్ల ఎంపికలో అక్రమాలు జరిగాయని మాజీ సీఎం జగన్ ఆధార సహితంగా ఆరోపణలు చేశారు. ఆయన అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వ పక్షాన సరైన జవాబు ఇవ్వలేకపోతున్నారు. పలువురు డీఎస్సీ అభ్యర్ధులు తమకు అన్యాయం జరిగిందని సాక్ష్యాలు చూపుతున్నారు. అయినా ప్రభుత్వం డబాయించి తప్పించుకోవాలని చూస్తోంది.ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ వివిధ రూపాలలో ఆందోళనలు సాగిస్తోంది. డీఎస్సీ అక్రమాలపై జరుగుతున్న ప్రచారం ప్రజలలోకి వెళుతుండడంతో చంద్రబాబు, లోకేష్‌లు అసహనానికి గురవుతున్నారు. అందువల్లే ప్రభుత్వం అనుకుంటే రెండు నిమిషాలలో అణచివేయగలదని బెదిరించడం, ఆందోళన చేస్తున్న రైతులను, నిరుద్యోగ యువతను గంజాయి బాచ్ అని అనడం వంటివి చేశారనిపిస్తుంది. ఇవన్ని ముఖ్యమంత్రి స్థాయికి తగనివని ఆయనకు తెలిసినా ఏదో నిస్సహాయ స్థితిలో పడ్డారనిపిస్తుంది. ఎదురుదాడిలో భాగంగా కర్నూలులో కొందరితో ప్రదర్శన చేయించారు. వారు ఏ తరహా వారో తెలియదు. ఎల్లో మీడియా ప్రముఖంగా ఆ కథనాన్ని ఇచ్చింది. అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ర్యాలీ చేస్తే వారు పవిత్రులు, వ్యతిరేకంగా చేస్తే గంజాయి బాచ్లని ప్రచారం చేస్తారన్నమాట. తనవైపు వాదన సరిగా లేనప్పుడే ప్రభుత్వాలు ఇలాంటి చర్యలకు పాల్పడతాయన్న అబిప్రాయం ఉంది. దేవరపల్లిలో జగన్ టూర్లో ఒక చిన్న హోటల్లో జరిగిన ఉదంతాన్ని కూడా పెద్దదిగా ఫోకస్ చేయాలని యత్నించి చంద్రబాబు అండ్ కో భంగపడ్డారు. ఆ హోటల్ యజమానురాలు లక్ష్మి వచ్చి జగన్‌ను కలిశారు. వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలని ఒత్తిడి చేసినా ఆమె ఒప్పుకోకపోవడం గొప్ప విషయమే. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు, లోకేష్‌లను సంతృప్తిపరచడానికి బోండా ఉమా కాని, మరికొన్ని చోట్ల ఇతర టీడీపీ నేతలు కాని దాడులు చేస్తున్నట్లు వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. దానికి తగినట్లే ఉమా మాట్లాడుతూ లోకేష్‌ను విమర్శిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అనుమతి లేకుండా దీక్ష శిబిరాలు నిర్వహిస్తారా అని అంటున్నారు.నిజానికి విష్ణు పోలీసులకు చెప్పే దీక్ష శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. చిత్రంగా శిబిరానికి రక్షణ కల్పించవలసిన పోలీసులు దాడికి పాల్పడ్డ ఉమాను కాకుండా, శాంతియుతంగా కూర్చుని ఉన్న విష్ణును వాహనం ఎక్కించి తరలించారు. అదే టీడీపీ ఎక్కడైనా సభ పెడితే ఆ సమీపంలోకి అయినా విపక్షాలను రానిస్తారా? ఇప్పుడు చెప్పండి.. క్రిమినల్స్ తయారీ అడ్డాగా టీడీపీ ఉందా? వైఎస్సార్సీపీ ఉందా? ఈ దాడుల ద్వారా డీఎస్సీ అక్రమాల వ్యవహరం మరింతగా ప్రజలలోకి వెళుతుంది. ప్రభుత్వ తీరుపై మరిన్ని అనుమానాలు బలపడతాయి. మరికొన్ని ఉదాహరణలు గమనించండి.ఒక మంత్రి తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఒక ఎన్ఆర్ఐ మహిళ స్వయంగా లోకేష్‌కు ఫిర్యాదు చేశారట. అయినా ఆ మంత్రిపై చర్య తీసుకోలేదే? అంటే ఎవరు క్రిమినల్స్ అడ్డాలో ఉన్నట్లు అవుతుంది! ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై తప్పుడు ఆరోపణలు చేసి అరెస్టు చేశారే. ఒక టీడీపీ నేత తన భార్య నైటీని తానే చించి ఎమ్మెల్యేపై ఆరోపించిన విషయం వీడియో సహితంగా బయటపడి ఉండకపోతే, ఎమ్మెల్యేపై ఆరోపణలను నమ్మే పరిస్థితి వచ్చేది కదా? ఇలాంటివాటిని చేసేవారిని కదా క్రిమినల్స్ అనాల్సింది. అలాంటివారిని ఎంకరేజ్ చేసే పార్టీని కదా క్రిమినల్స్ తయారు చేసే అడ్డా అనాల్సింది అని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. దానిని కాదనగలరా?ఈ మధ్యనే గుంటూరులో ఒక మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసింది కూడా టీడీపీ నేతే కదా! అంతేకాదు. కొందరు కూటమి ఎమ్మెల్యేలు కొంతమంది మహిళలపై ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడింది ఫిర్యాదులు వచ్చాయే. ఏకంగా ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ నుంచే వీడియో కాల్ చేసిన ఘట్టం మరిచిపోయారా? ఆ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన యువతిని నడిరోడ్డులో పోలీసు లాఠీతో కొట్టింది జనసేన నేత కదా! ఆ ఎమ్మెల్యేపై కాని, దౌర్జన్యం చేసిన జనసేన నేతపై కాని ఏమైనా చర్య తీసుకున్నారా? పలు చోట్ల బాధితులపైనే కేసులు పెడుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది.గతంలో వైఎస్సార్సీపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు, లోకేష్‌లు ఇలాగే క్రిమినల్స్ అంటూ ఆరోపణలు చేసేవారు. ఎన్నికల సమయానికి వారిలో పలువురిని టీడీపీలో చేర్చుకున్నారు. అంటే టీడీపీ క్రిమినల్స్ అడ్డాగా మారిందని ఒప్పుకుంటున్నటా?కాదా? డీఎస్సీలో అక్రమాలు జరిగాయన్నది వైఎస్సార్సీపీ ఆరోపణ. దానికి సమాధానం ఉంటే చెప్పాలి. లేదా ధైర్యం ఉంటే సీబీఐ విచారణకు ఒప్పుకోవచ్చు.గతంలో చంద్రబాబు డిమాండ్ చేసిన వెంటనే తన కుమారుడు జగన్‌పై సీబీఐ విచారణకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఒప్పుకున్న ఘటనను పలువురు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు తన కుమారుడిపై డీఎస్సీ ఆరోపణలు వస్తే ఆ ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. గత రెండేళ్లుగా వైఎస్సార్సీపీ నేతలపైన, కార్యకర్తలపైన జరిగిన హత్యలు, హత్యాయత్నం ఘటనలు, టీడీపీ నేతల దౌర్జన్యాలు ఇవన్ని చూస్తుంటే 1983లో తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో ఎన్టీ రామారావు చెప్పిన ఆదర్శాలు ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి?ఒక వైపు క్రిమినల్స్‌ను ప్రోత్సహిస్తూ మరో వైపు వైఎస్సార్సీపీపై అదే విమర్శ చేయడం చంద్రబాబుకే చెల్లిందని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరు తప్పు చేసినా తప్పే అని, నిష్ఫక్షపాతంగా పనిచేయండని పోలీసులకు చెప్పవలసిన సీనియర్ నేత చంద్రబాబు ఈ వయసులో కూడా ఇలాంటి ప్రమాణరహిత రాజకీయాలు చేయడం వల్ల ఆయనకు అప్రతిష్ట అవుతుందా? కాదా? అన్నది ఆలోచించుకోవాలి. రెడ్‌బుక్ అరాచకాలకు స్వస్థి పలికి, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే నష్టం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?
కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: ‘నా కుమార్తెను కావాలని కారుతో మూడుసార్లు ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా తలపై నుంచి కారును పోనిచ్చారు. వాళ్లు మనుషుల రూపంలో ఉన్న మృగాలు. నా బిడ్డ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. అయ్యా చంద్రబాబూ.. నీకు జాలిలేదా? అమ్మా అనితమ్మా.. నీకు ఆడ పిల్లల్లేరా? పవన్‌కళ్యాణ్.. నీకు మనసు లేదా?’ అంటూ మెడికో పీజీ డాక్టర్ ప్రియాంక తండ్రి వెంకటేష్ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రియాంక కేసును రాజకీయ ఒత్తిళ్లతో తారుమారు చేస్తున్నారనే అనుమానంతో ఆదివారం రాజమహేంద్రవరంలోని ప్రకాశ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.ఘటన అనంతరం ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహకారం అందలేదని, ఆసుపత్రి ఖర్చుల విషయంలోనూ సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఒకసారి ‘మీకు మేమున్నాం.. బాధపడకండి’ అంటూ ఫోన్ చేశారని, ఆ తర్వాత ఎలాంటి స్పందన లేదన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి లోకేశ్ కనీసం స్పందించక పోవడంపై వెంకటేష్ ప్రశ్నలు సంధించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటనపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు. ప్రియాంకను హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామని, ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యంకు ఫోన్ చేసి అందుతున్న చికిత్సపై ఒక్కసారైనా ఫోన్ చేశారా? మెరుగైన సేవలు అందించండని ప్రభుత్వం నుంచి మెస్సేజైనా పెట్టారా? ప్రభుత్వం పని చేస్తుందో లేదో అర్థం కావడం లేదు. మూడు సార్లు కావాలనే కారుతో ఢీకొట్టి, ఆ తర్వాత తలపై నుంచి కారును పోనిచ్చారంటే చంపాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. నిందితులు ఘటన తర్వాత కూడా సాధారణంగానే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లారని ఆరోపించారు. చట్టాలపై ప్రజలకు నమ్మకం కలగాలంటే కఠినంగా అమలు చేయాలని, తమకు న్యాయం చేయాలని వెంకటేష్ వేడుకున్నారు. ‘ఇంత దారుణానికి పాల్పడిన మృగాలను కఠినంగా శిక్షించండి.. ఉరి తీయండి’ అంటూ కన్నీటితో విజ్ఞప్తి చేశారు.మా కడుపు కోతను అర్థం చేసుకోండి‘మా కుటుంబంలో మొదటి డాక్టర్ కాబోతోందని, ఎంతో మంచి పేరు వస్తుందని ఆశించాం. ఒకరు సక్సెస్ అయితే ఎంతో మందికి ఇన్స్ఫిరేషన్గా ఉంటుందని ఆశపడ్డాం. నాకు ముగ్గురూ అమ్మాయిలే. మీకు పెళ్లిళ్లు చేశాక మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారని మాట్లాడినప్పుడు మొత్తం కుటుంబాన్ని నేను చూసుకుంటానని హామీ ఇచ్చింది ప్రియాంక. అలాంటి మెడికల్ పీజీ విద్యార్థిని అందమైన జీవితాన్ని చిదిమేశారు. మా కలల సౌధం కూల్చేశారు. మా కడుపు కోతను అర్థం చేసుకోండి. ఈ ఘటన మా కుటుంబానికి తీరని లోటు. మద్యం మత్తులో ఆడపిల్లను హత్య చేసిన వారు హాయిగా తిరగొచ్చా? చట్టాలపై భరోసా రావాలంటే సమాజంలో భయం కలిగేట్లు చేయండి’ అని వెంకటేశ్ కన్నీటిపర్యంతమయ్యారు. కీలక ఆధారాలు సేకరించాంవైద్య విద్యార్థిని ప్రియాంక కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించి నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ తెలిపారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 3న రాత్రి స్వతంత్ర ఆసుపత్రి నుంచి సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లగా ప్రియాంక వెంటిలేటర్‌పై ఉన్నట్లు తెలిపారు. ఆమె స్నేహితుడు ఉమేష్ నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశామన్నారు. మరుసటి రోజు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా, ప్రియాంక ప్రయాణిస్తున్న బైక్‌ను కారుతో మూడుసార్లు ఢీకొట్టినట్లు గుర్తించామని చెప్పారు. దీంతో ఇది ప్రమాదం కాకుండా ఉద్దేశ పూర్వకంగా జరిగిన ఘటనగా కేసు నమోదు చేసి, ఈ నెల 6న నిందితులిద్దరినీ రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. నిందితుల నేర చరిత్రపైనా ఆరా తీశామన్నారు. కారు నంబర్ ప్లేట్లు తొలగించి డిక్కీలో పెట్టారని, మొదటి నిందితుడు దస్వంత్ కారులోనే నిద్రిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. దస్వంత్ చెన్నైలో బీటెక్ చేశాడని, విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని, రెండో నిందితుడు జోసెఫ్ ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్నాడని తెలిపారు. ప్రియాంక మృతి చెందితే కేసును హత్య కేసుగా మారుస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు : సీఎం చంద్రబాబురాజమండ్రిలో ఈ నెల 3వ తేదీన ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో పీజీ మెడికో ప్రియాంక ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఒక వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా అధికారులతో ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. ప్రియాంక మృతికి కారణమైన నిందితులు ఇప్పటికే అరెస్టై జైల్లో ఉన్నారని ఎస్పీ వివరించారు. నిర్లక్ష్యంతో నిండు ప్రాణం తీసిన వారిపై కఠిన సెక్షన్లతో శిక్షలు పడేలా చూడాలని, బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆరి్థక సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.వారం రోజులు మృత్యువుతో పోరాడి రాజమహేంద్రవరంలో ఈ నెల 3వ తేదీన కారుతో మూడు సార్లు ఢీకొట్టి.. తలపై నుంచి ఎక్కించడంతో తీవ్ర గాయాలపాలైన మెడికో పీజీ డాక్టర్ ప్రియాంక (28) ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మృతి చెందినట్లు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ప్రియాంక తల్లిదండ్రులు కర్నూలు నుంచి వెళ్లి జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంటున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రియాంక రాజానగరంలోని జీఎస్ఎం మెడికల్ కళాశాలలో డెర్మటాలజీ పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఘటన జరిగిన తర్వాత నుంచి ఆమెకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారు. -
డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో భారీగా అవకతవకలు, అక్రమాలు జరిగాయని ఏపీ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ కూటమి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో జేఏసీ కన్వీనర్ ఎంబేటి రామచంద్ర, నిరుద్యోగ జేఏసీ కో–కన్వినర్ రామ్ షా మాట్లాడారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. అర్హతలు, పరీక్షలు లేకుండానే కొంతమందికి సబ్జెక్ట్ టీచర్ పోస్టులు కల్పించేందుకు జీఓ నెం.4ను తీసుకురావడం.. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అవకతవకలు.. 1:1 సర్టిఫికెట్ వెరిఫికేషన్, స్పోర్ట్స్ సర్టిఫికెట్ల పరిశీలన అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. వారు ఇంకా ఏమన్నారంటే.. ఎందుకింత వివాదానికి తెరలేపారు? ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కేటాయింపులు, జీఓ నెం.4 తెచ్చిన మార్పులు, పేపర్ లీకేజీ అనుమానాలు లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా డీఎస్సీపై కోర్టులో 330 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో 60కి పైగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించినవే. ఇంత వివాదానికి ఎందుకు తెరలేపారు? ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ విచారణ జరిపించాలి. అసలు డీఎస్సీలో దాదాపు 32 వేల వినతిపత్రాలు, అభ్యంతరాలు ఎందుకొచ్చాయి? 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచారంటేనే ఉద్యోగం వస్తుందని అభ్యర్థులు ఆశపడతారు. కానీ, చివరికి స్పోర్ట్స్ కోటా పేరుతో వారిని బయటకు పంపడం ఎంతవరకు సమంజసం? డీఎస్సీకి సరిగ్గా ఒకరోజు ముందు (ఏప్రిల్ 19న) తీసుకొచ్చిన జీఓ.4 తీవ్ర వివాదాస్పదమైంది. ఎటువంటి పరీక్షలు, అర్హతలు లేకపోయినా సబ్జెక్ట్ టీచర్లుగా పోస్టులిచ్చేలా ఈ జీఓ తెచ్చారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఇలా ఎలా మినహాయింపులు ఇస్తారు? రహస్యంగా డీఎస్సీ ప్రక్రియ ముగింపు.. ఇక చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డీఎస్సీ మెరిట్ లిస్ట్, కటాఫ్ మార్కులు, సెలెక్షన్ లిస్టులను డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ హెడ్ క్వార్టర్లలో లేదా వెబ్సైట్లో బహిరంగంగా పెట్టలేదు. కేవలం వ్యక్తిగత లాగిన్స్, మొబైల్స్‌కు మాత్రమే సమాచారం పంపి గోప్యంగా ప్రక్రియ ముగించారు. ఒక కోచింగ్ సెంటర్ నిర్వహకుడి భార్యకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం వెనుక ఉన్న అంతర్గత లింకులు బయటకు రావాలి. ఈ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలి. ప్రభుత్వం స్పందించకపోతే ఐక్య కార్యాచరణ ద్వారా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతాం. -
డీఎస్సీ అక్రమాలపై ఉద్యమం మరింత ఉధృతం
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం సాగించిన అక్రమాలపై వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సోమవారం భారీ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ శ్రేణులు, యువత స్వచ్ఛందంగా ర్యాలీల్లో పాల్గొని సర్కారుకు తమ నిరసనను తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను అడ్డంపెట్టుకుని ర్యాలీలను అడ్డుకునేందుకు కుట్రలకు తెరతీసింది. దమనకాండను దాటుకుని రిలే దీక్షలు విజయవంతంమెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను దగా చేశారని... డీఎస్సీ స్కామ్‌కు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని.. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలపై చంద్రబాబు సర్కారు దమనకాండ సాగించింది. 175 నియోజకవర్గాల్లో గాంధేయ మార్గంలో రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే టెంట్లను తొలగించేందుకు కుట్ర చేసింది. కొన్నిచోట్ల టీడీపీ నేతలతో పాశవికంగా దాడులు చేయించడంతోపాటు పోలీసులతో అక్రమ అరెస్టులకు పాల్పడింది. చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినీని ఈడ్చుకెళ్లడం, జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి, ఆయన సతీమణిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం, విజయవాడలో దీక్షా శిబిరంపై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా దాడి చేయడం, ఆ పార్టీ నాయకుడు బుద్దా వెంకన్న వర్గం బెదిరింపులకు దిగడం రాష్ట్ర ప్రజలంతా చూశారు. అయినప్పటికీ ఈ దీక్షలు విజయవంతం కావడం, జెన్–జీ(యువత) కదం తొక్కడంతో రోజురోజుకూ ఉద్యమం రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. అంతేకాకుండా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతితోపాటు ఎన్నికల్లో యువతకు ఇచ్చిన అన్ని హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలనే డిమాండ్లు దీక్షా శిబిరాల్లో పెద్ద ఎత్తున వినిపించాయి. యువతను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని జెన్–జీ మండిపడింది. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు లోకేశ్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించింది. ధర్మేంద్ర ప్రధాన్ తరహాలో లోకేశ్ రాజీనామా చేయాల్సిందే... నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, అదే తరహాలో డీఎస్సీలో అక్రమాలకు పక్కా ఆధారాలు ఉన్నాయని బాధిత అభ్యర్థులు వెల్లడిస్తున్నందువల్ల నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో లోకేశ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ జెన్–జీ, రాష్ట్ర ప్రజల నుంచి బలంగా వినిపిస్తోంది. దీంతో తన తనయుడు లోకేశ్ రాజకీయ భవిష్యత్‌పై చంద్రబాబులో తీవ్ర ఆందోళన నెలకొంది. డీఎస్సీ అక్రమాలపై జెన్–జీ, ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను డైవర్ట్ చేసేందుకు ఆయన కొత్త పన్నాగాలు పన్నుతున్నారు. దీక్షా శిబిరాల్లో ఉన్నవారిని రౌడీలు, బ్లేడ్ బ్యాచ్‌లు, గంజాయి బ్యాచ్‌లుగా చంద్రబాబు చిత్రీకరించారు. అయినా యువత ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ‘పోలీసులతో అడ్డుకున్నా... మాపై అక్రమ కేసులు పెట్టినా మా పోరాటం ఆగదు. రిలే దీక్షలు ముగిసినా సోమవారం 175 నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యవాదులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తాం’ అని విద్యార్థులు, యువత, నిరుద్యోగులు స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. మలిదశ ఉద్యమంలో భాగంగా ఆందోళన కార్యక్రమాలను సోమవారం వైఎస్సార్సీపీ ప్రకటించనుంది. శాంతియుత ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసుల నోటీసులుఇదిలా ఉండగా, వైఎస్సార్సీపీ ర్యాలీలకు అనుమతి లేదంటూ ఆయా నియోజకవర్గ నేతలకు పోలీసులు నోటీసులిచ్చారు. 175 నియోజకవర్గ కేంద్రాల్లో శాంతియుతంగా చేపట్టే ర్యాలీలకు అనుమతి ఇవ్వాలని చట్టబద్ధంగా పోలీసులను వైఎస్సార్సీపీ నేతలు కోరారు. -
నా కూతురు చావు బ్రతుకుల మధ్య ఉంది..! చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై ప్రియాంక తండ్రి ఫైర్
-
చంద్రబాబు శ్వేతపత్రంపై కాకర్ల ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు శ్వేతపత్రంపై ఏపీజీఈఎఫ్ మాజీ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులను చంద్రబాబు మోసం చేస్తున్న తీరును ఆయన వివరించారు. శ్వేత పత్రం పేరుతో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలేనని.. రూ.30 వేల కోట్ల బకాయిలు చెల్లించినట్లు చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారని.. డీఏ, పీఆర్సీ, ఐఆర్ వంటివి ఇక లేనట్టేనని ఎల్లోమీడియా రాస్తోందన్నారు.‘‘హిమాచల్ ప్రదేశ్‌లో ఉద్యోగులకు జీతాలు తగ్గించినట్టు ఎల్లో మీడియా రాసింది. అదే విధంగా ఏపీలో కూడా తగ్గించాలన్నట్టుగా రాశారు. ఇక మీదట జీతాలు ఇస్తే చాలన్నట్టుగా ఉద్యోగులను మానసికంగా సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు రూ.55 వేల కోట్లు బకాయి పడింది. ఇప్పటికే ఐదు డీఏలు పెండింగ్ పెట్టారు. రెండేళ్లుగా ఐఆర్ లేదు’’ అని వెంకట్రామిరెడ్డి దుయ్యబట్టారు.‘‘వైఎస్ జగన్ హయాంలో ఉద్యోగులకు ఎక్కువ ఖర్చు చేశారని చంద్రబాబే అంగీకరించారు. మూడున్నర లక్షల మంది ఉద్యోగులను రోడ్డున పడేసిన చరిత్ర చంద్రబాబుది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో ఉద్యోగుల జీతాలు ఖర్చు 45 శాతం మాత్రమే. కానీ చంద్రబాబు మాత్రం వచ్చే ఆదాయమంతా ఉద్యోగులకే సరిపోతుందనటం పచ్చి అబద్ధం కాదా?. అమరావతి ఆవకాయ, యోగా కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అద్దాల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.ఇక సీఎం, మంత్రుల విలాసాల కోసం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ ఉద్యోగుల మీద ప్రజలకు చెడు అభిప్రాయం తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమని మాత్రమే కోరుతున్నాం. కొన్ని శాఖల్లో రెండు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదు. ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగారు. ఆంధ్రా యునివర్సిటీ వీసీ రిటైర్మెంట్కు గంట ముందు సస్పెండ్ చేశారు. ఐదేళ్ల క్రితం సెలవు పెట్టారని ప్రతాప్ రెడ్డికి ఛార్జిమెమో ఇవ్వటం దుర్మార్గం’’ అంటూ వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. -
నా బిడ్డ గురించి సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం
-
‘చంద్రబాబు, పవన్ కల్యాణ్ కనీసం స్పందించరా?’
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు సర్కార్‌పై మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్ల అన్యాయమైపోతే మహిళా హోంమంత్రి మనసు కరగలేదా? అంటూ ప్రియాంక తండ్రి మండిపడ్డారు. రెక్కలు ముక్కలు చేసుకుని మా పాపను చదివించుకున్నాం. మా పాపను బతికించుకోవాలనే తపనలో ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన లేదు. మా కడుపుకోత లోకేష్‌కు అర్థం కావడం లేదా?’’ అంటూ ప్రియాంక తండ్రి నిలదీశారు.‘‘ఆడపిల్లను చంపేసి హాయిగా తిరగొచ్చా.. మీ చట్టాలు సరిగా పనిచేస్తున్నాయా?. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కనీసం స్పందించలేదు. విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా పట్టించుకోలేదు. ప్రతినెల హైదరాబాద్ వస్తారు కదా.. మా బిడ్డ పరిస్థితి తెలుసుకోరా?. కనీసం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నా బిడ్డ పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. రాష్ట్ర హోం మంత్రి గాని, జిల్లా అధికారులు గానీ ఇప్పటివరకు ఈ ఘటన గురించి మాట్లాడలేదు. నా బిడ్డ అవయవదానం చేసే ఆలోచన లేదు. బతికించుకునే ప్రయత్నమే చేస్తున్నాం’’ అని ప్రియాంక తండ్రి పేర్కొన్నారు.కాగా, రాజమండ్రిలో కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కర్నూలుకు చెందిన ప్రియాంక తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది.ఈ నెల 3న రాజమండ్రిలో తోటి విద్యార్థినితో కలిసి సినిమా థియేటర్ నుంచి వస్తుండగా మద్యం మత్తులో ఉన్న దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్‌లు కారును వేగంగా నడుపుతూ వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. మరోసారి బలంగా ఢీకొట్టి ప్రియాంక మీద నుంచి కారు వెళ్లడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, గ్లాస్గో కోమా స్కేల్ (జీసీఎస్) తక్కువగా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. -
గ్రామవార్డు సచివాలయ వ్యవస్థపై సీఎం చంద్రబాబు కుట్ర
-
అధః పాతాళానికి తొక్కకపోతే... జెన్ -జీ పై బాబు వ్యాఖ్యలకు వెంకట్ రెడ్డి మాస్ కౌంటర్
-
జెన్ జీ దెబ్బ.. లోకేశ్ లీలలు.. బాబు గొడ్డలి పూజ
-
డీఎస్సీ అక్రమాలపై డైవర్షన్ ర్యాలీ
కర్నూలు(సెంట్రల్): డీఎస్సీ–2025 ఉపాధ్యాయుల ఆత్మగౌరవ ర్యాలీ ‘ఒక పక్కా స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్’ అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది చంద్రబాబు ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకత నుంచి... అర్హులకు న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ నేతృత్వంలో జెన్–జెడ్ చేస్తున్న ఆందోళనలకు వస్తున్న అనూహ్య స్పందన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేపట్టిన ‘సర్కారు స్పాన్సర్డ్ డైవర్షన్ ర్యాలీ’ అని స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే... ఈ ర్యాలీకి హాజరైన ఉపాధ్యాయులే ఆశ్చర్యపోయేలా వారికి తెలియకుండా చేసిన ఏర్పాట్లే ఇందుకు నిదర్శనం. పశ్చిమ రాయలసీమ పరిధిలోని ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాలకు సంబంధించిన డీఎస్సీ–2025 ఉపాధ్యాయులు కర్నూలులో శనివారం ర్యాలీ, సభ నిర్వహించారు. ఈ ర్యాలీకి తెరవెనుక నుంచి టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఆయా జిల్లాల నుంచి వచ్చే ఉపాధ్యాయుల కోసం సకల సౌకర్యాలతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. వారు బస్సు ఎక్కినప్పటి నుంచి కూల్‌డ్రింక్‌లు, స్నాక్స్, మధ్యాహ్నం భోజనం, దూర ప్రాంతాల వారికి రాత్రి భోజనాలను కూడా అందించారు. సభ జరిగిన ప్రదేశంలో సైతం విందు భోజనాలు వడ్డించారు. అంతటితో ఆగకుండా ర్యాలీలో రాజకీయ పార్టీలు నిర్వహించే 140 డెసిబుల్స్ సౌండ్ వచ్చే డీజే వాహనం, ఉపాధ్యాయులపై పాటల ఆడియోలు కూడా అందుబాటులోకి తెచ్చారు. చివరికి మొబైల్ టాయిలెట్లను సైతం ర్యాలీ వెంట తీసుకురావడం ఈ కార్యక్రమానికే హైలెట్. ఇవన్నీ పరిశీలిస్తే ఈ కార్యక్రమం ఎంత పక్కా స్క్రిప్టో అర్థమవుతోంది. మరోవైపు ఉపాధ్యాయులు ‘థ్యాంక్యూ సీఎం సర్’ అంటూ ప్రదర్శించిన ప్లకార్డులు కూడా పసుపు రంగులో ఉండడం రాజకీయ విమర్శలకు దారి తీస్తోంది. కర్నూలులో తిష్టవేసిన టీడీపీ ఎమ్మెల్సీలు ఉపాధ్యాయుల ర్యాలీని ఎలాగైనా విజయవంతం చేయాలని టీడీపీ ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామ్‌గోపాల్ కర్నూలులోనే తిష్టవేశారు. శుక్రవారమే వారు కర్నూలు చేరుకుని కడప ఆర్జేడీ శామ్యూల్‌ను పిలిపించుకుని డీఎస్సీ–2025లో ఎంపికైన ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీకి హాజరయ్యేలా చేయాలని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. దీంతో ఆయన అనధికారికంగా డీఈవోలు, ఎంఈవోలతో మాట్లాడి డీఎస్సీ–2025లో ఎంపికైన ప్రతి ఒక్కరూ హాజరయ్యేలా చూడాలని చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు ఎంఈవోలు తమ పరిధిలో కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులందరూ కచ్చితంగా కర్నూలులో ర్యాలీకి హాజరవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.అంతేకాకుండా స్థానికంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల బస్సులను కొన్నిచోట్ల ఎంఈవోలే ఏర్పాటు చేశారని సమాచారం. మరికొన్ని చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు ప్రైవేట్ ట్రావెల్స్, ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. చివరికి కొన్నిచోట్ల ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చే ఉపాధ్యాయుల హాజరు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఆరోగ్యం బాగోలేదన్నా కూడా కచ్చితంగా రావాల్సిందేనని చెప్పడంతో విధిలేని పరిస్థితిలో వచ్చిన ట్లు టీచర్లు చెబుతున్నారు. ఈ ర్యాలీకి టీడీపీ అనుబంధ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం మద్దతు ఇవ్వడంతో డీఎస్సీ–2025కు సంబంధంలేని టీచర్లు కూడా అనేక మంది హాజరయ్యారు. వీరికి తోడు యువగళం పాదయాత్ర బృందాలు కూడా ర్యాలీలో హల్చల్ చేశాయి. 100 మంది వరకు టీడీపీ అనుకూల యూ ట్యూబర్లు సైతం ర్యాలీని కవర్ చేస్తూ హడావుడి చేశారు. చంద్రబాబు, లోకేశ్ రాజకీయ వ్యూహాల్లో పావులుగా కొత్త టీచర్లు డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతోంది. ఈ ఉద్యమానికి జెన్–జీ (యువత) పెద్ద ఎత్తున కదలివస్తోండగా నిరుద్యోగులు జేఏసీగా ఏర్పడి పోరుబాట పట్టా రు. అన్ని వైపుల నుంచి డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో చంద్రబాబు, లోకేశ్ కొత్తగా ఎంపికైన టీచర్లను పావులుగా చేసుకుని డీఎస్సీలో అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ ర్యాలీకి వ్యూహం రచించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
బాబు సర్కారుపై ‘మహా’గ్రహం
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారుపై గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు నిప్పులుచెరిగారు. విజయవాడ వేదికగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం నాలుగు గంటలపాటు మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన ఉద్యోగులు కదంతొక్కడంతో బెజవాడ ధర్నా చౌక్ దద్దరిల్లింది. సర్కారు వ్యతిరేక నినాదాలతో మిన్నంటింది. బాబు సర్కారు పనిభారం తీవ్రంగా పెంచేసిందని ఉద్యోగ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన లేకుండా పగలూరాత్రీ వెట్టిచాకిరీ చేయిస్తున్నారని మండిపడ్డారు. చిరునవ్వుతో ప్రజల ఇంటి గడప వద్దకు వెళ్లి ప్రభుత్వ సేవలందించే గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల జీవితాల్లో ప్రభుత్వం చిరునవ్వే లేకుండా చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని, న్యాయమైన 22 డిమాండ్లు పరిష్కరించకుంటే అక్టోబర్ 2న మహోద్యమానికి శ్రీకారంచుడతామని సర్కారుకు అల్టిమేటం జారీ చేశారు. తమ గోడు ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పుకున్నా సర్కారులో చలనం లేకపోవడంతో తప్పక చివరకు ఆత్మగౌరవం కోసం రోడ్డెక్కి ఆందోళన చేయాల్సి వచ్చిందంటూ పేర్కొన్నారు. జాబ్‌చార్ట్‌ను అమలు చేయడం లేదని, పండగపబ్బం లేకుండా సెలవు రోజుల్లోనూ ఏదోపని అప్పగిస్తూ చిత్రహింసలు పెడుతున్నారని ఆవేదన చెందారు. ప్రభుత్వం నుంచి సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన ఆటోమెటిక్ అడ్వాన్స్ స్కీం(ఏఏఎస్), నోçషనల్ ఇంక్రిమెంట్లు ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు. సచివాలయ ఉద్యోగులకు పని లేదు అనే వాళ్లు ఓ మూడు రోజులు మా ఉద్యోగులందరికీ మాస్ లీవ్‌కి అనుమతిస్తే అప్పుడు పరిస్థితి ఏమిటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖ పేరును స్వర్ణ శాఖగా మార్చి, ఉద్యోగుల జీవితాల్లో మాత్రం స్వర్ణమే లేకుండా చేసిందంటూ తూర్పారబట్టారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలో పారదర్శకత అన్నదే లేకుండా ఎమ్మెల్యే సిఫార్సులు ఉంటే బదిలీ అన్నట్టు మార్చేసిందని దుయ్యబట్టారు. మహిళా ఉద్యోగులకూ సాయంత్రం ఆరు తర్వాత పనులుగ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులలో 63 శాతం మంది మహిళలే ఉన్నారని, వీరిపైనా ప్రభుత్వం కనికరం చూపడం లేదని, సాయంత్రం ఆరు తర్వాత కూడా పనులు అప్పగిస్తోందని ఉద్యోగులు ధ్వజమెత్తారు. ఇళ్లకు కరపత్రాలు అంటించే బాధ్యతా అప్పగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేలపై సర్వేలతో విసుగుతెప్పిస్తోందని, వివరాల కోసం పదేపదే ఇళ్లకు వెళ్లి ఓటీపీలు అడుగుతుంటే ప్రజల నుంచి ఈసడింపులు ఎదుర్కోవాల్సి వస్తోందని గోడువెళ్లబోసుకున్నారు. ప్రజలు తమను దొంగల్లా చూస్తున్నారని పేర్కొన్నారు. రేషనలైజేషన్ పేరిట ఒక్కో గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదించి మిగులు ఉద్యోగులను ఇతర శాఖలకు డిప్యూటేషన్‌పై పంపి పనిభారం తీవ్రంగా పెంచేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 22 డిమాండ్లు తేలకుంటే భారీస్థాయిలో ఆత్మగౌరవ పోరాటంగ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నిర్ణీత జాబ్‌చార్ట్ అమలు చేయాలని, ఉద్యోగులకు సముచిత స్థాయి పదోన్నతులు కల్పించాలని, పని ఒత్తిడి తగ్గించాలని, ఉద్యోగులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నోషనల్ ఇంక్రిమెంటు, ఆటోమెటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీం అమలు, ఉద్యోగుల బదిలీలలో పారదర్శకత తదితర 22 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచామని, వాటిని పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు కార్యరూపం దాల్చకుంటే అక్టోబరు 2న సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో భారీస్థాయిలో ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధపడతామని హెచ్చరించారు. ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహాధర్నాకు ప్రతినిధులు వెస్లీ, ప్రభాకర్, ప్రగతి, సుప్రియ తదితరులు నేతృత్వం వహించారు. సీపీఎస్ ఉద్యోగుల సంఘ ప్రతినిధులతోపాటు ఏఐటీయూసీ నేతలు మద్దతు తెలిపారు. -
అప్పులు పెంచడమే మీ ప్రోగ్రెస్?
సాక్షి, అమరావతి: వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ పచ్చి అబద్ధాల పుట్ట అని.. వైట్ పేపర్లు, ప్రోగ్రెస్ రిపోర్టుల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారని ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. అప్పులు పెంచడమే మీ ప్రోగ్రెస్ అని ఎద్దేవా చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు అండ్ కో చేస్తున్న అసత్య ప్రచారాలను ఆయన ఆధారాలతో తిప్పికొట్టారు. శనివారం బుగ్గన హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్పుకోవడానికి చంద్రబాబుకు సిగ్గుండాలన్నారు. ‘పంటలకు మద్దతు ధర లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఉచిత పంటల బీమా బంద్ చేశారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెలా రూ.1500 ఎవరికిచ్చారు? అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఎవరికైనా ఇచ్చారా? ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి ఏమైంది? మీ పాలనలో ప్రోగ్రెస్ తెలుసుకోవాలంటే ఒక సామాన్యుడిని అడిగితే చాలు. ఆరోగ్యశ్రీలో పేదలకు వైద్యం అందడం కూడా ఇబ్బందిగా మారింది. రైతులు, యువత, మహిళల జీవితంలో మార్పు కనిపించకుండా ప్రోగ్రెస్ ఎలా వచ్చింది?’ అని బుగ్గన నిలదీశారు. మామిడి, పొగాకు రైతులు, మత్స్యకారుల సమస్యలు తెలుసుకోవడానికి మాజీ సీఎం వైఎస్ జగన్ వెళితే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కి పడుతోందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బుగ్గన ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్సీపీ హయాంలోనే సంక్షేమాభివృద్ధి వైఎస్సార్సీపీ హయాంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశాం. 1.35 లక్షల యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. 10,032 విలేజ్ క్లినిక్స్ నిర్మించాం. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చడానికి రూ.17 వేల కోట్లు ఖర్చు చేశాం. ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు చేపట్టి, ఐదు పూర్తి చేశాం. రైతుల కోసం 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. ఉచిత పంటల బీమా కింద 54.5 లక్షల మంది రైతులకు రూ.8 వేల కోట్లు చెల్లించాం. నాడు–నేడు కింద మొదటి దశలో 15,715 స్కూళ్లు, రెండో దశలో 22,344 ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాం. రూ.25 వేల కోట్ల ఖర్చుతో 4 నూతన పోర్టులు, 6 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాం. అమ్మ ఒడి ద్వారా రూ.26 వేల కోట్లు, వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.25,500 కోట్లు, చేయూత ద్వారా రూ.20 వేల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా జమ చేశాం.మీది బూటక ప్రచారం కాదా?అప్పుల విషయంలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు. మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన లెక్కలు, కాగ్ లెక్కల ప్రకారమే 2024 నాటికి రాష్ట్ర ప్రత్యక్ష అప్పు రూ.4.92 లక్షల కోట్లు, గ్యారెంటీలతో కలిపితే రూ.6.47 లక్షల కోట్లు, విద్యుత్ రంగ బకాయిలను కలిపితే సుమారు రూ.7.22 లక్షల కోట్లుగా ఉంది. ద్రవ్య లోటు కూడా మా హయాంలో ఏటా రూ.39,500 కోట్ల నుంచి రూ.62,500 కోట్ల వరకు ఉంటే.. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024–25లో అది రూ.81 వేల కోట్లకు చేరింది. మా హయాంలో స్థూల ఉత్పత్తి వృద్ధి ఎక్కువ. పెట్టుబడులు, ఉద్యోగాలపై కూడా తప్పుడు ప్రచారమే. పార్లమెంట్లో కేంద్రం ఇచ్చిన సమాధానమే మీ బూటకపు ప్రచారాన్ని వెల్లడిస్తోంది. అమరావతిలో మీ రియల్ ఎస్టేట్ వ్యాపారంపై సమాధానం చెప్పాలి’ అని బుగ్గన మండిపడ్డారు. -
15 వరకే డెడ్‌లైన్
సాక్షి, అమరావతి: ‘‘ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే మేం కోరుతున్నాం. గొంతెమ్మ కోర్కెలేమీ కోరడం లేదు. హామీల అమలుపై స్పందించకుండా.. మేం ఉద్యమానికి సిద్ధమవుతుంటే బూటకపు లెక్కలతో ప్రజల్లో మాపై తప్పుడు సంకేతాలిస్తారా? గతనెల 22న మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపినా నేటికీ నిర్ణయాలు ప్రకటించనే లేదు. ఆగస్టు 15 వరకే ప్రభుత్వానికి డెడ్‌లైన్. ఆలోపు సానుకూల నిర్ణయాలు ప్రకటించకపోతే ఏ క్షణమైనా ఉద్యమంలోకి వెళ్తాం.’’ అని చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీ అమరావతి జేఏసీ అల్టిమే టం జారీ చేసింది. ఏటా ఉద్యోగుల జీతాల ఖర్చు తగ్గుతుంటే మా కోసమే రాష్ట్ర ఆదాయమంతా సరిపోతోందని సీఎం ఆర్థిక శ్వేతపత్రంలో తప్పుడు లెక్కలు వల్లె వేశారని జేఏసీ నాయకులు నిప్పులు చెరిగారు. శనివారం విజయవాడలోని రెవెన్యూ భవన్లో ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వ వైఖరిపై ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ కమిటీ సమావేశమైంది. అనంతరం చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర రావు, ఉద్యమ కమిటీ చైర్మన్ ఫణి పేర్రాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. జీతాల ఖర్చు తగ్గుతోంది.. కొత్త నియామకాల్లేవ్.. ఈ నెల నాలుగో తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక శ్వేత పత్రంలో ఉద్యోగులకు సంబంధించిన అంశాలు పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నాయని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారని, గొంతెమ్మ కోర్కెలేమీ కోరడం లేదన్నారు. ఉద్యోగులకే అంతా ఖర్చయిపోతోందని ఎలా ప్రకటిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. 2025–26లో ప్రభుత్వం రూ.2.26 లక్షల కోట్లు ఖర్చు చేస్తే అందులో ఉద్యోగులు, పెన్షనర్ల కోసం చేసిన ఖర్చు 37.41 శాతం మాత్రమేనని తెలిపారు. ప్రభుత్వానికి వస్తున్న పన్నుల రాబడిలో ఉద్యోగుల కోసం చేస్తున్న ఖర్చు 59 శాతం ఉందన్నారు. పన్నులతో పాటు, ఇతర రాబడి మొత్తంలో తమ ఖర్చు 47 శాతమే అన్నారు. అయితే ఉద్యోగులు, పెన్షనర్ల కోసం 94 శాతం నుంచి 98 శాతం ఖర్చు చేస్తున్నట్టు శ్వేత పత్రంలో ఎలా ప్రకటించారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రానున్న రోజుల్లో ఉద్యోగులు, పెన్షనర్లపై ఖర్చులు భారీగా తగ్గనున్నాయని తెలిపారు. 2024 నుంచి 2026లో ఇప్పటికే 41,321 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారన్నారు. వచ్చే ఐదేళ్లలో 1,51,755 మంది రిటైర్మెంట్కు సిద్ధంగా ఉన్నారన్నారు. రిటైర్ అవుతున్న ఉద్యోగుల స్థానంలో అవసరాలకు తగ్గట్టుగా కొత్త నియామకాలు లేవన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల జీతాల ఖర్చు సగానికిపైగా తగ్గిపోతోందన్నారు. అయితే ఉద్యోగులపై చేస్తున్న ఖర్చు పెరిగిపోతోందని సీఎం ఎలా అంటారని నిలదీశారు. ప్రభుత్వం శ్వేత పత్రంలో ప్రకటించిన ఉద్యోగులు, పెన్షనర్ల ఖర్చుల లెక్కలన్నీ బూటకమేనన్నారు. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెల్లిస్తోందో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు.15వ తేదీ తర్వాత ఉద్యమ కార్యాచరణ ఐఏఎస్‌లు, ప్రజాప్రతినిధుల వైద్య సేవలకు ఒక్క రూపాయి ఖర్చయినా సరే ఆగమేఘాల మీద రీయింబర్స్మెంట్ వచ్చేస్తోందని బొప్పరాజు అన్నారు. అదే ఉద్యోగులు, పెన్షనర్లు వైద్యం కోసం రూ. లక్షల్లో ఖర్చు చేసుకున్నా రీయింబర్స్మెంట్ రాదన్నారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) సమస్యలను పట్టించుకోరని మండిపడ్డారు. ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల ఇంత వివక్ష ఎందుకని నిలదీశారు. పీఆర్సీ, డీఏ, ఐఆర్‌లపై ఉలుకు పలుకు లేదన్నారు. సీపీఎస్, జీపీఎస్‌ను పునఃసమీక్ష చేసి ఆమోద యోగ్యమైన విధానం తెస్తామన్నారని గుర్తు చేశారు.అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు ఇస్తామన్నారని, వీటి గురించి పట్టించుకోవడం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో గత నెల 22న మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాలతో సుదీర్ఘ చర్చలు జరిపిందన్నారు. అయితే ఇప్పటి వరకూ ఒక్క నిర్ణయాన్ని కూడా ప్రకటించలేదన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రానిపక్షంలో ఇప్పటికే ప్రకటించిన విధంగా ఆగస్టు 15వ తేదీ తదుపరి ఐక్య కార్యాచరణతో ఏ క్షణమైనా ఉద్యమానికి దిగుతామన్నారు. సంపద సృష్టిస్తామని హామీలిచ్చి.. ఇప్పుడు ఖర్చు తగ్గిస్తామంటారా?ఉద్యోగుల ఇబ్బందులు రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయని బొప్పరాజు పేర్కొన్నారు. వీటిని పరిష్కరించాలని మేం కోరుతుంటే ఉద్యోగ సంఘాలు తప్పు చేస్తున్నట్టుగా ప్రభుత్వం చిత్రీకరిస్తోందని పలిశెట్టి దామోదర్ పేర్కొన్నారు. సంపద సృష్టిస్తామని హామీలిచ్చి ఇప్పుడేమో ఉద్యోగుల కోసం చేసే ఖర్చును తగ్గిస్తామంటారా? అని నిలదీశారు. గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.50 లక్షల ఉద్యోగులను నియమించిందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినట్టు గుర్తు చేశారు. వైద్య రంగంలో వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన, జాబ్ క్యాలెండర్ హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం చేసిందేంటని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చాక 40 వేల మందికిపైగా రిటైర్ అయ్యారన్నారు. ఇప్పుడు సీఎం చెబుతున్న మాటలు వింటుంటే ప్రభుత్వం భవిష్యత్‌లో శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేయబోదనే సంకేతాలు వెలువడుతున్నాయన్నారు. ఉద్యోగుల కోసం చేస్తున్న ఖర్చులపై పూర్తిగా తప్పుడు లెక్కలు వల్లె వేస్తున్నారన్నారు. ఉద్యమ కమిటీ చైర్మన్ ఫణి పేర్రాజు, మహిళా విభాగం చైర్పర్సన్ లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం మీన మేషాలు లెక్కపెట్టకుండా ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చలపై సానుకూల నిర్ణయాలు ప్రకటించాలని సూచించారు. -
నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు
-
DSCలో అంధుడిని మోసం చేసిన లోకేష్
-
దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన
-
నీ కంటే అడుక్కున్నవాడు నయం..! బాబు,లోకేష్ ని ఏకిపారేసిన లక్ష్మీ పార్వతి
-
నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోము.. చంద్రబాబుకు పురుషోత్తం రెడ్డి వార్నింగ్
-
రోజులన్నీ ఒకేలా ఉండవు రెడ్ బుక్ సంగతి తేలుస్తాం
-
నాపైనా, నా భర్త పైన కక్ష సాధింపు... కూటమిపై విరుచుకుపడ్డ MLC కల్పలత
-
చంద్రబాబుపై బొప్పరాజు ఫైర్
-
ఏపీ విద్యాశాఖలో రెడ్‌బుక్ అరాచకం
సాక్షి, విజయవాడ: విద్యాశాఖలో రెడ్ బుక్ అరాచకం నడుస్తోంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. కల్పలత భర్త ప్రతాప్ రెడ్డిపై చర్యలకు ఛార్జ్ మెమో జారీ చేసింది. ఐదేళ్ల కిందట సెలవు పెట్టినందుకు ఇప్పుడు ఛార్జ్ మెమో ఇచ్చింది.ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌గా పనిచేసిన ప్రతాప్ రెడ్డి.. ప్రస్తుతం వయోజన విద్య జేడీగా ఉన్నారు. ఉద్యోగుల సమస్యలు లేవనెత్తినందుకు కల్పలత కుటుంబంపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు తెరతీసింది. ప్రభుత్వం కక్ష సాధింపుపై ఎమ్మెల్సీ కల్పలతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘నా గొంతు నొక్కడానికి కక్ష సాధిస్తున్నారు. మొట్టమొదటి మహిళా టీచర్ ఎమ్మెల్సీపై కక్ష సాధిస్తారా..?’’ అంటూ ఆమె మండిపడ్డారు.‘‘టీచర్లు, ఉద్యోగుల సమస్యలపై మాట్లాడుతున్నందుకు కక్ష కట్టారు. నా భర్త సెలవు పెడితే ఎన్నికల్లో ఎలా ప్రభావితం చేస్తారు..?. ఎంఈవోలు అసలు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ పరిధిలో ఉంటారా?. ఐదేళ్లలో ఒక్క సమావేశంకూడా పెట్టలేదు. నేను ఉద్యోగుల కోసం మాట్లాడితే ఇంకో ఛార్జ్ మెమో ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. నా పైనా, నా భర్త పైన జరుగుతున్న కక్ష సాధింపుపై పోరాడతాను. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి పోరాడతాను...మీరు ఎంత టార్గెట్ చేసిన ఉద్యోగుల సమస్యలపై మాట్లాడతాను. ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసింది. ఉద్యోగులకు ఐదు డీఏల బకాయిలు చెల్లించాలి. పోలీసులు, సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. మీరు ఎంత టార్గెట్ చేస్తే అంత గట్టిగా పోరాడతాను’’ అంటూ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి స్పష్టం చేశారు. -
DSC స్కామ్ పై అదిరిపోయే స్కిట్.. లోకేష్, పవన్ ఫోటోతో మాస్ ర్యాగింగ్
-
మన్యం బంద్‌తో ఏపీలో హైటెన్షన్!
-
చెప్పడానికి నాకే అసహ్యంగా ఉంది.. మీరు చేసిన నీచమైన పని.. సంచలన వ్యాఖ్యలు..
-
కొంచమైనా సిగ్గుండాలి జగన్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబుకు సెక్యూరిటీ ఎలా ఉండేదంటే..
-
‘డీఎస్సీపై సీబీఐ విచారణ చేపట్టే వరకు నిరసనలు ఆగవు’
సాక్షి, చిత్తూరు జిల్లా: ఏపీ డీఎస్సీలో అవకతవకలపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చారని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర పిలుపు మేరకు మెగా డీఎస్సీ అక్రమాలపై నగరిలో మూడో రోజు రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు జరుగుతున్నాయి. నగరి రిలే నిరాహారదీక్షకు తిరుపతి, చిత్తూరు జిల్లాలు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ..‘మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. ప్రధాని మోదీ ఏపీలో జరుగుతున్న పరిణామాలపై వెంటనే దృష్టి పెట్టాలి, చర్యలు తీసుకోవాలి. మెగా డీఎస్సీని దగా చేశారు. మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఆనర్హులకు ఉద్యోగం ఇచ్చారు. వైఎస్సార్సీపీ దీక్షా శిబిరాలపై వెన్నుపోటు పార్టీ నేతలు దాడులు చేస్తున్నారు. బూతులు తిడుతూ, కోడి గుడ్లతో దాడులు చేస్తున్నారు. లంచాలు దండుకుని ఇష్టం వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వకుండా పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. యువతకు అండగా నిలబడి వైఎస్సార్సీపీ పోరాడుతుంది’ అని తెలిపారు.అనంతరం, భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతిలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపడుతాం. సీబీఐ విచారణ చేపట్టే వరకూ నిరసనలు ఆగవు అని వ్యాఖ్యానించారు. -
పాలన ఎలా ఉందో వాళ్లనే అడుగు: బాబుపై బుగ్గన ఫైర్
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలు వాస్తవాలను ప్రతిబింబించేవి కావని.. అవి కేవలం రాజకీయ జిమ్మిక్కులేనని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అంటున్నారు. చంద్రబాబు మాటలకు, చేతలకు ఎలాంటి సంబంధం ఉండదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో బుగ్గన, కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించేలా చంద్రబాబు హామీలు ఇస్తారని, కానీ ఆచరణలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయన్నారు. ప్రొగ్రెస్ కార్డు అనే కాన్సెప్ట్ తెచ్చిన చంద్రబాబు.. అది తనకు తానే ఇచ్చుకుంటున్నాడని, కానీ అది ఇవ్వాల్సింది ప్రజలని బుగ్గన గుర్తు చేశారు. చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించే మీడియా కూడా అదే తరహాలో ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ‘హైదరాబాద్‌ను కడితే.. కుతుబ్ షా ఏం చేసినట్లు?’చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధి గురించి చెప్పుకునే తీరుపై బుగ్గన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్‌ను తానే నిర్మించానన్నట్లుగా చెప్పుకోవడం సరికాదన్నారు. “చంద్రబాబు హైదరాబాద్‌ను కడితే.. కుతుబ్ షా ఏం చేసినట్లు? చంద్రబాబు బిర్యానీ కనిపెడితే.. ఇరానీయులు ఏం చేసినట్లు?. అందరినీ అమెరికాకు తానే పంపానని అంటారు.. ఇతర రాష్ట్రాల వాళ్లను కూడా ఆయనే పంపారా?” అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రకటనలు, రాజకీయ వ్యాఖ్యలు చూస్తే ఇతర దేశాల్లో అయితే ఆయనను పబ్లిక్ లైఫ్ నుంచి వెల్లగొట్టేవారని బుగ్గన అన్నారు.వాళ్లను అడిగితే సరిపోదా?.. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని బుగ్గన సూచించారు. చంద్రబాబు పాలన ఎలా ఉందో మహిళలను అడిగితే చెబుతారని, నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులను అడిగినా వాస్తవ పరిస్థితి తెలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో రైతులు సమస్యలతో రోడ్డెక్కుతున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని విమర్శించారు. ఆయన సభలకు వచ్చిన ప్రజలు మధ్యలోనే వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించారు.ఆరోగ్యశ్రీపై విమర్శలురాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం సరిగా అమలు కావడం లేదని బుగ్గన ఆరోపించారు. ప్రజా సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని అన్నారు. రైతులు, విద్యార్థులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.జగన్ జనాదరణపై వ్యాఖ్యలుచంద్రబాబు మీటింగ్ పెడితే జనం మధ్యలో వెళ్లిపోతున్నారన్న బుగ్గన.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయటకు వస్తే లక్షలాది మంది ప్రజలు తరలివస్తున్నారని అంటున్నారు. అది చూసి చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బంది పడుతోందని అన్నారు. ప్రజల్లో తమ పార్టీకి ఇంకా ఆదరణ ఉందని పేర్కొన్నారు. -
హెరిటేజ్ కోసం ‘విజయ’కు ఎసరు!
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బరితెగింపు పరాకాష్టకు చేరింది. ప్రభుత్వ పెద్దల కన్ను పడితే చాలు ఎందాకైనా సై అంటూ రెచ్చిపోతున్న తీరు హద్దులు దాటింది. తమ స్వార్థం కోసం రూ.1200 కోట్ల టర్నోవర్, వందల కోట్ల ఆస్తులున్న విజయ డెయిరీ (కృష్ణా మిల్క్ యూనియన్)ని నిర్వీర్యం చేసే కుతంత్రానికి తెర లేపింది. ఈ క్రమంలో టీడీపీకే చెందిన విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు ను తీవ్రంగా బెదిరించి.. ఆస్పత్రి పాలయ్యేలా చేసి.. ఆస్పత్రి బెడ్‌పై చికిత్స పొందుతుండగానే ఆయనతో బలవంతంగా రాజీనామా లేఖ రాయించుకుని తీసుకెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో, టీడీపీ శ్రేణుల్లోనూ కలకలం రేపింది. చలసాని డెయిరీ చైర్మన్ పదవికి నామినేషన్ వేయకూడదంటూ కొద్ది రోజులుగా ప్రభుత్వ పెద్దలు మంత్రుల ద్వారా ఆయనపై ఒత్తిడి తెచ్చారు. అయితే అత్యధిక శాతం డైరెక్టర్లు చలసానికి మద్దతు ఇవ్వడంతో గురువారం చలసాని ఆంజనేయులు మరోసారి విజయ డెయిరీ (కృష్ణా మిల్క్ యూనియన్) చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారనే విషయం తెలుసుకుని ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారధి చలసాని వద్దకు వెళ్లారు. విజయ డెయిరీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే కేబినెట్ నుంచి అక్కడికి చేరుకుని మంత్రాంగం నడిపారు. ఆయన్ను నామినేషన్ వేయనీయకుండా అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే మెజార్టీ డైరెక్టర్లు ఆయన్ను చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో చంద్రబాబు, లోకేశ్ సూచనల మేరకు పక్కకు తప్పుకోవాలని మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి చిట్టి నగర్‌లోని డెయిరీ యూనిట్‌కు వెళ్లి మరీ ఆయన్ను బెదిరించారు. ఒకరోజు సమయం ఇస్తే అధిష్టానం చెప్పినట్లు చేస్తానని చెప్పినా, మంత్రులు ఒప్పుకోకుండా రాజీనామా చేయాల్సిందేనని పట్టుపట్టారు. తెల్ల పేపర్ ఆయన ఎదుట పెట్టి.. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాసి సంతకం చేయాలని తీవ్రంగా ఒత్తిడి చేశారు. దీంతో చలసాని అస్వస్థతకు గురవ్వగా కుటుంబ సభ్యులు ఆయన్ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యం కొనసాగుతున్నా రాజీనామాకు పట్టువైద్యం కొనసాగుతున్నప్పటికీ సదరు అమాత్యులు ఆయన్ను వదల్లేదు. వీరిద్దరూ కాకుండా.. గట్టిగా నోరేసుకుని విరుచుకుపడే మరో అమాత్యుడు ఏకంగా ఆ ఆస్పత్రి యాజమాన్యానికే ఫోన్ చేసి.. చలసానిని వెంటనే డిశ్చార్జ్ చేయాలని ఆదేశించినట్లు చర్చ జరుగుతోంది. అయితే మానవతా దృక్పథంతో ఆ ఆస్పత్రి వైద్యం కొనసాగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రి పార్థసారధి శుక్రవారం ఆ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రి బెడ్‌పై స్టెంట్ వేయించుకోవాల్సిన స్థితిలో ఉన్నా, మానవత్వాన్ని కూడా మరిచి రాజీనామా లేఖపై సంతకం చేయించి బలవంతంగా తీసుకున్నారు. ఆ లేఖ తీసుకుంటున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కాగా, ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. మంత్రి కొల్లు ఇంట్లో డైరెక్టర్ల నిర్బంధం మరోవైపు శుక్రవారం విజయ డెయిరీ డైరెక్టర్లందరినీ మంత్రి కొల్లు రవీంద్ర చర్చల కోసం తన ఇంటికి పిలిపించి నిర్బంధించారు. చలసానికి వారు మద్దతు పలుకుతుండడంతో రాత్రి వరకు అక్కడే ఉంచారు. తాము ఏకగ్రీవంగా ఎన్నుకున్న వ్యక్తిపై అవిశ్వాసం ఎలా పెడతామని డైరెక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈలోపు చలసాని ఆంజనేయుల్ని బెదిరించారు. డెయిరీ వ్యవహారాలపై విచారణ జరిపించి కేసులు పెడతామని, రాజకీయ భవితవ్యం లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా వదలకుండా రాజీనామాకు ఒప్పించాలని ఒత్తిడి చేశారు. ఆయన కుమార్తెను ఇబ్బంది పెట్టినట్లు తెలిసింది. మరోవైపు అమెరికాలో ఉన్న ఆయన కుమారుడికి ఫోన్ చేసి రాజీనామా చేయకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయని మంత్రులు హెచ్చరించారు. అధిష్టానం ఆదేశించిందట..ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా అధిష్టానం ఆదేశించింది రాజీనామా చేయాలని చలసానిపై ఒత్తిడి తేవడం ఎంతవరకు సమంజసం? బోర్డు మొత్తం చలసాని ఆంజనేయుల్ని ఎన్నుకుంది. మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్ధసారధి బోర్డు సభ్యులను పిలిచి ఆంజనేయుల్ని రాజీనామా చేయాలని ఒత్తిడి చేయాలని చెప్పారు. లేనిపక్షంలో అవిశ్వాసం పెట్టండని అడిగారు. నిబంధనలకు అనుగుణంగా ఎన్నికైన వారిని అదే రోజు రాజీనామా చేయమనడం, అనారోగ్యంతో ఉన్నా వేధించడం మంచి పద్దతి కాదు. – వేమూరి సాయి, డైరెక్టర్హెరిటేజ్ కోసమే!» విజయ డెయిరీ (కృష్ణా మిల్క్ యూనియన్) 1.50 లక్షల కుటుంబాల సంస్థ. ఒక్క విజయవాడలోనే 2.60 లక్షల లీటర్లు, రాష్ట్రమంతా కలిసి 4.60 లక్షల లీటర్ల పాలను ప్రతి రోజూ వినియోగదారులకు అందిస్తోంది. » పాలు, నెయ్యి, పెరుగుతో పాటు దాదాపు 84 రకాల పాల ఉత్పత్తులను తయారు చేస్తోంది. » బాపులపాడు మండలం వీరవల్లిలో ఇటీవల తన రెండవ యూనిట్‌ను ప్రారంభించింది. ఈ కొత్త యూనిట్ ప్రతిరోజూ సుమారు 3 లక్షల లీటర్ల పాలు, లక్ష లీటర్ల పెరుగు ఉత్పత్తి చేస్తోంది. రైతుల నుంచి ప్రతి రోజూ 10 లక్షల లీటర్ల పాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.» ఇది సాకారమైతే విజయవాడ, కృష్ణా జిల్లాల్లో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డైయిరీకి ఆదరణ పూర్తిగా తగ్గిపోతుంది. మరోవైపు మ్యాక్స్ చట్టంలోకి మారిన విజయ డైయిరీ విస్తరణ దిశగా ముందుకు పోతుంది. ఇది జరగకూడదనే చలసానిని బలవంతంగా చైర్మన్ పదవి నుంచి తప్పించారని స్పష్టమవుతోంది. » ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు తన హెరిటేజ్ డెయిరీ ప్రయోజనాల కోసం చంద్రబాబు చిత్తూరు డెయిరీని పక్కా ప్రణాళికతో నిర్వీర్యం చేసిన చరిత్ర గుర్తుకు తెస్తోందని రైతులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. » దీంతో పాటు విజయ డెయిరీకి ఉన్న రూ.వందల కోట్ల ఆస్తులతో పాటు.. గన్నవరం వద్ద ఉన్న 24 ఎకరాల భూమిపై పెద్దల కన్ను పడిందని తెలుస్తోంది. » ప్రభుత్వం తీరు సరికాదని విజయ డైరెక్టర్లు విమర్శిస్తున్నారు. బుడమేరు వరద సమయంలో ఏమాత్రం పట్టించుకోలేదని, అసలు సహకార రంగంలో ఉన్న డైయిరీ విషయంలో ఈ బెదిరింపులు ఏమిటని వారు నిలదీస్తున్నారు. » ఆరు దశాబ్దాలుగా లక్షలాది మంది రైతుల భాగస్వామ్యంతో అభివృద్ధి చెందిన విజయ (కృష్ణా మిల్క్ యూనియన్) డెయిరీని హెరిటేజ్ కోసం బలిచేసే లక్ష్యంతో ప్రభుత్వ పెద్దలే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఏపీ రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వీ.కృష్ణయ్య, కే.ప్రభాకర రెడ్డిలు తప్పుపట్టారు. -
రాజకీయ ఈర్ష్యతో ‘దిశ’ రద్దు దురదృష్టకరం
సాక్షి, అమరావతి: మహిళల భద్రతలో దేశానికే దిశా నిర్దేశం చేసిన ‘దిశ’ను ఉపసంహరించుకుంటూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు ఒక చీకటి రోజుగా అభివర్ణించారు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర్ష్య తో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు. మంత్రివర్గం తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ‘దిశ’ను నిర్వీర్యం చేయడం కాదు.. మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వానికి హితవు పలుకుతూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శుక్రవారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మహిళలు, చిన్నారులకు రక్షణ వ్యవస్థగా నిలిచిన ‘దిశ’‘దిశ’ను ఉపసంహరించుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, చిన్నారులకు ఒక చీకటి రోజు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర‡్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరం. మహిళలు, చిన్నారులపై నేరాలు, దర్యాప్తులో జాప్యం, న్యాయ ప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలకు పరిష్కారంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘దిశ’ను తీసుకొచ్చింది.నేరం జరగకుండా నిరోధించడం నుంచి, నేరం జరిగితే వెంటనే స్పందించడం, బాధితులకు రక్షణ, వేగంగా దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, చార్జిషీటు, ప్రత్యేక కోర్టుల ద్వారా సత్వర న్యాయం వరకు ఒక సమగ్ర వ్యవస్థను నిర్మించాం. మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు ఫోన్లో ఎస్‌వోఎస్ బటన్ నొక్కినా, ఫోన్‌ను ఐదు సార్లు షేక్ చేసినా నిమిషాల వ్యవధిలో పోలీసులు స్పందించే వ్యవస్థ తీసుకొచ్చాం. 1.51 కోట్ల మంది ‘దిశ’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ‘దిశ’ ద్వారా వచ్చిన 31,607 అత్యవసర కాల్స్‌ను అప్పట్లో మా ప్రభుత్వంలో పోలీసులు పరిష్కరించారు. 18 ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసును అందుబాటులోకి తీసుకొచ్చి 13,500 మందితో క్షేత్ర స్థాయి భద్రత, రిపోర్టింగ్ వ్యవస్థను నిర్మించాం. 900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలతో ప్రత్యేక పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం. నేరస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే అవకాశం లేకుండా ఈ కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలకు ప్రాధాన్యం ఇస్తూ ఆరు నగరాల్లో ఫోరెన్సిక్ వ్యవస్థను బలోపేతం చేశాం. సత్వర విచారణ కోసం 13 ప్రత్యేక పోక్సో కోర్టులు, 12 మహిళా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశాం. 2,17,467 మంది లైంగిక నేరస్తుల వివరాలతో ప్రత్యేక డేటా బేస్‌ను రూపొందించాం. అందుకనే ‘దిశ’ విజయవంతంగా మహిళలకు, చిన్నారులకు గొప్ప భద్రతా సేవలను అందించింది. నిందితుడికి శిక్షపడే వరకూ రక్షణ నెట్వర్క్ 2017లో మహిళలపై నేరాల దర్యాప్తుకు సగటున 156 రోజులు పట్టగా, 2022 నాటికి అది 28 రోజులకు తగ్గించగలిగారు. 164 అత్యాచారం కేసులు, 378 లైంగిక నేరాల కేసుల్లో కేవలం 7 రోజుల్లోనే ఛార్జిషీట్లు దాఖలు చేశారు. తీవ్రమైన కేసుల్లో 51 శాతానికిపైగా నిందితులను 48 గంటల్లోపు అరెస్టు చేశారు. గతంలో డీఎన్ఏ నివేదికలకు నెలలు పట్టేది. ‘దిశ’ ఫోరెన్సిక్ వ్యవస్థతో వాటిని రోజుల్లోనే అందించే పరిస్థితి తీసుకొచ్చాం. 214 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. మే 2024 నాటికి మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయి. వార్షిక సగటు కేసులు 14,338 నుంచి 10,426కు తగ్గాయి. ఇదీ ‘దిశ’ ఇచ్చిన భరోసా.. ఇవీ ‘దిశ’ సాధించిన ఫలితాలు. అందుకే 19 జాతీయ అవార్డులను మా ప్రభుత్వ హయాంలో ‘దిశ’ గెలుచుకుంది. ‘దిశ’ అనేది కాగితాల మీదున్న పేరు కాదు. ప్రమాదంలో ఉన్న మహిళ ఎస్‌వోఎస్ నొక్కిన క్షణం నుంచి, నిందితుడికి శిక్ష పడే వరకు ఆమెకు అండగా ఉండే సజీవమైన మహిళా రక్షణ నెట్వర్క్.నేరస్తుల్లో చట్టంపై భయం తగ్గిస్తోంది ‘దిశ’ను ఉపసంహరించుకోవడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం నేరస్తుల్లో చట్టంపై ఉన్న భయాన్ని తగ్గిస్తోంది. బాధిత మహిళల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బ తీస్తోంది. మహిళలు తమ రక్షణ కవచంగా భావించిన వ్యవస్థను లేకుండా చేస్తోంది. మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ‘దిశ’ను రద్దు చేయడం కాదు– రక్షించాలి. ‘దిశ’ను నిర్వీర్యం చేయడం కాదు–మరింత బలోపేతం చేయాలి.న్యాయం అనే లక్ష్యానికి బీఎన్ఎస్ ఎలా ప్రత్యామ్నాయం?ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ‘బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) చాలు, దిశ అవసరం లేదు’ అంటోంది. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎస్‌వోఎస్ వ్యవస్థ, ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు, గ్రామ స్థాయి నుంచే మహిళా పోలీసులు, ప్రత్యేక పెట్రోలింగ్, లైంగిక నేరస్తుల డేటా బేస్, వేగవంతమైన ఫోరెన్సిక్ వ్యవస్థ, ప్రత్యేక ప్రాసిక్యూషన్, ప్రత్యేక కోర్టులు, నిర్ణీత సమయంలో దర్యాప్తుతో కూడిన న్యాయం అనే లక్ష్యానికి బీఎన్ఎస్ ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది? మహిళలు, చిన్నారులపై తీవ్రమైన దారుణాలు జరిగినప్పుడు ఏడు పని రోజుల్లో పోలీసు దర్యాప్తు, ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత 14 పని రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేసేలా ‘దిశ’ ద్వారా తీసుకొచ్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. 21 రోజుల్లోగా బాధితులకు న్యాయం అందించాలన్న అలాంటి లక్ష్యాన్ని కూడా ఈ ప్రభుత్వం విమర్శించడం మరింత బాధాకరం. ఆ లక్ష్యం వెనుక ఉద్దేశం ఒక్కటే. దర్యాప్తులో జాప్యం ఉండకూడదు.. విచారణలో ఆలస్యం ఉండకూడదు.. మహిళలు, చిన్నారులపై నేరాలను అత్యంత ప్రాధాన్యతతో వేగంగా విచారించాలి.. నేరం చేస్తే చట్టం వేగంగా, కఠినంగా స్పందిస్తుందనే భయం నేరస్తుల్లో ఉండాలి. అలాంటి వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సింది పోయి, వేగంగా న్యాయం అందించాలనే లక్ష్యాన్నే తప్పు పట్టడం మహిళలకు ఏ సందేశం పంపుతోంది? మహిళలు, చిన్నారులకు సకాలంలో న్యాయం జరగాలని కోరుకోవడమే ఈ ప్రభుత్వానికి అభ్యంతరమా?1.51 కోట్ల మంది ‘దిశ’ యాప్ డౌన్లోడ్31,607 అత్యవసర కాల్స్ పరిష్కారం18 ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు.. గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసులు13,500 మందితో క్షేత్ర స్థాయి భద్రత, రిపోర్టింగ్ వ్యవస్థ900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలతో ప్రత్యేక పెట్రోలింగ్ఆరు నగరాల్లో ఫోరెన్సిక్ వ్యవస్థ బలోపేతం, 13 ప్రత్యేక పోక్సో కోర్టులు, 12 మహిళా ప్రత్యేక కోర్టులు2,17,467 మంది లైంగిక నేరస్తుల వివరాలతో ప్రత్యేక డేటా బేస్ అందువల్లే ‘దిశ’తో గొప్పగా భద్రతా సేవలు.. 19 జాతీయ అవార్డులు -
బాబు సర్కారు వి‘శ్వాస’ ఘాతుకం
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడే నిరుపేద రోగులకు ప్రాణాధారమైన వెంటిలేటర్ల కొనుగోళ్లలోనూ ప్రభుత్వ పెద్దలు అవినీతికి పాల్పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.22 లక్షల నుంచి రూ.26 లక్షల పలికే నియోనాటల్(నవజాత శిశువు)వెంటిలేటర్‌ను ఏకంగా రూ.30.24 లక్షలకు కొనుగోలు చేసేలా శుక్రవారం వైద్య శాఖ బిడ్ ఫైనలైజేషన్ కమిటీ(బీఎఫ్సీ) ఆమోదం తెలిపింది. అధిక ధరలకు వెంటిలేటర్ల కొనుగోళ్ల వ్యవహారంలో రూ.మూడు కోట్లకుపైనే నేతలు కమీషన్ల రూపంలో బొక్కేయనున్నారని విమర్శలు వస్తున్నాయి.వైద్య పరికరాల కొనుగోళ్లపై కీలక ప్రజాప్రతినిధి 10 శాతం అంతకంటే పైనే కమీషన్లు డిమాండ్ చేస్తున్నట్టు గత కొద్ది రోజులుగా వైద్య శాఖలో చర్చ నడుస్తోంది. దీనికి తోడు వైద్య సేవల కల్పన అభివృద్ధి సంస్థ (ఎంఎస్ఐడీసీ)లోని కొందరు అధికారులు కాంట్రాక్ట్ ఖరారు, పర్చేజింగ్ ఆర్డర్(పీవో) జారీ, బిల్లులు మంజూరు ఇలా వివిధ దశల్లో కాంట్రాక్టర్లను కమీషన్ల కోసం తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్లు అందరూ సిండికేటై ఇతర రాష్ట్రాలు, కేంద్ర వైద్య శాఖలకు సరఫరా చేస్తున్న దాని కంటే అత్యధిక ధరలకు ఏపీలో టెండర్లు వేస్తున్నారు. ఏపీలో దోపిడీకి తమిళనాడు ధరలే సాక్ష్యం అధిక మొత్తంలో కమీషన్లు ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్న సంస్థలకే వెంటిలేటర్ల కాంట్రాక్ట్ కట్టబెట్టడం కోసం సుమారు రెండేళ్లుగా ఎంఎస్‌ఐడీసీలో టెండర్లను సాగదీశారు. ఎట్టకేలకు శుక్రవారం ఆ టెండర్లు ఖరారు అయ్యాయి. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని ఆస్పత్రులకు 38 నియోనాటల్ వెంటిలేటర్ల కొనుగోలుకు కాంట్రాక్టర్‌ను ఎంపిక చేశారు. ఎల్–1 సంస్థ వియాన్ ఫాబియాన్ హెచ్‌ఎఫ్‌ఓ వెంటిలేటర్‌ను రూ.30.24 లక్షలతో సరఫరా చేసేలా టెండర్ వేసింది. అయితే ఇదే మేక్, మోడల్ వెంటిలేటర్లు బహిరంగ మార్కెట్లో రూ.22 లక్షల నుంచి రూ.26 లక్షలు మాత్రమే పలుకుతున్నాయి. ఈ లెక్కన పరిశీలిస్తే ఒక్కో వెంటిలేటర్‌పై రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షలకుపైనే అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం 38, రెండేళ్ల రేట్ కాంట్రాక్ట్‌తో మరిన్ని వెంటిలేటర్లను ఇదే కాంట్రాక్టర్ ద్వారా సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బల్క్ ఆర్డర్ మీద బహిరంగ మార్కెట్లో రేట్లు తగ్గకుండా ఏపీలో మాత్రం రేట్లు అమాంతం పెరుగుతుండటం గమనార్హం. నియోనాటల్ వెంటిలేటర్‌ను రూ.25.50 లక్షలతో కొనుగోలుకు తమిళనాడు మెడికల్ కార్పొరేషన్ రేట్ కాంట్రాక్ట్ ఇదే టెండర్లో డ్రాగర్ బేబీలాగ్ వీఎన్ 600 మోడల్ వెంటిలేటర్‌ను రూ.30.93 లక్షలకు సరఫరా చేసేలా టెండర్ వేసిన మరో సంస్థ ఎల్–2గా నిలిచింది. ఇదే మోడల్ పరికరాన్ని తమిళనాడు మెడికల్ కార్పొరేషన్ రూ.25.50 లక్షలకే కొంటోంది. 2028 జూలై వరకూ ఈ రేట్ కాంట్రాక్ట్ ఉంది. ఇదిలా ఉండగా ఒకే రకం పరికరాన్ని ఏపీలో ఏకంగా రూ.5.50 లక్షల అధిక ధరకు సరఫరా చేసేలా కాంట్రాక్టర్ టెండర్ వేశారు. దీన్ని బట్టి పరిశీలిస్తే నేతలకు కమీషన్లు ఇవ్వడం కోసం కాంట్రాక్టర్లు పరికరాల ధరలు అమాంతం ఎలా పెంచేస్తున్నారో తేటతెల్లం అవుతోంది. నీకు సగం.. నాకు సగం.. పరికరాల కొనుగోళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సౌకర్యం అనే సాకు చూపి దోపిడీ జరుగుతోందని చర్చ నడుస్తోంది. టీబీ కార్యక్రమంలో భాగంగా 100 పోర్టబుల్ ఎక్స్‌రే పరికరాలను వైద్య శాఖ కొనుగోలు చేస్తోంది. కీలక ప్రజాప్రతినిధికి కమీషన్లు ముట్టజెప్పేలా రెండు సంస్థలు టెండర్‌కు ముందే డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఆ రెండు సంస్థలు పరికరాల సరఫరాను చెరి సగం పంచుకునేలా ఒప్పందం కుదుర్చుకోగా.. ఆ మేరకు కాంట్రాక్ట్ ఖరారుకు ఈ ఏడాది ఏప్రిల్‌లో, తాజాగా శుక్రవారం జరిగిన బీఎఫ్సీలోనూ చర్చ నడిచినట్టు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి జాతీయ టీబీ కార్యక్రమం కింద కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు రూ.15 లక్షలతో కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేసింది. ఇదే పోర్టబుల్ పరికరాల్లో ఏఐ జనరేటెడ్ రిపోర్టింగ్ సౌకర్యం సాకు చూపి దాదాపు రూ.7 లక్షల మేర అధిక ధరలతో ఓ సంస్థ టెండర్ వేసింది. ఈ లెక్కన వంద పరికరాల కొనుగోళ్లలో ఏకంగా రూ. ఏడు కోట్ల మేర ప్రజాధనం లూటీ అవుతోందని విమర్శలు వస్తున్నాయి. -
దగా డీఎస్సీపై ఉద్యమం ఉధృతం
సాక్షి, అమరావతి : ‘‘కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాం.. కానీ ఏం లాభం..? మాకు పేకాట రాదు.. బ్రిడ్జి గేమ్ సర్టిఫికెట్ లేదు.. చంద్రబాబు సర్కారు కొత్త కొత్త జీవోలు ప్రవేశపెట్టి తమ అనుయాయులు, పేకాట రాయుళ్లకు ఉపాధ్యాయ ఉద్యోగాలను కట్టబెట్టింది..! పేకాట తెలియకపోవడమే మా అనర్హతకు కారణమవుతుందని తెలిస్తే ఏదో విధంగా నేర్చుకునే వాళ్లం..! డీఎస్సీలో జాబ్ రావాలంటే కష్టపడటం ఒక్కటే చాలదు.. ఓ స్పోర్ట్స్ సర్టిఫికెట్, రూ.15 లక్షల డబ్బులు కూడా కావాలని అర్థమైంది..! అక్రమ పద్ధతిలో టీచర్ పోస్టులు భర్తీ చేసి మాకు కనీసం నిరుద్యోగ భృతైనా ఇవ్వరా..!’’ ఇదీ మెగా డీఎస్సీ స్కామ్‌పై రెండో రోజు దీక్షా శిబిరాల వద్ద బాధిత అభ్యర్థుల ఆవేదన!! మెగా డీఎస్సీ 2025 స్కామ్‌పై పోరులో భాగంగా రిలే దీక్షలతో వైఎస్సార్సీపీ చేపట్టిన శాంతియుత ఉద్యమం రెండో రోజూ నిరసనలతో హోరెత్తగా.. ప్రజాస్వామ్య హక్కులను పాశవికంగా కాలరాస్తూ చంద్రబాబు సర్కారు తన నియంతృత్వ పోకడలను కొనసాగించింది. టీడీపీ మూకల దాడులు, పోలీసుల ఆంక్షలు రెండో రోజు కూడా యథావిధిగా కొనసాగాయి. మెగా డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాల్సిందేనని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని బాధిత అభ్యర్థులు, నిరుద్యోగులు, జెన్‌జీ యువత నినదించింది. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి సహా ఎన్నికల హామీలన్నీ చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమానికి జెన్‌జీ మద్దతు రోజురోజుకూ పెరగడం ప్రభుత్వ పెద్దలను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. దీంతో రెండో రోజు కూడా ఒకవైపు పోలీసులతో ఆటంకాలు కల్పిస్తూ.. మరోవైపు దీక్షలను భగ్నం చేసేందుకు టీడీపీ గూండాలను బరిలోకి దించారు. అనంతపురంలో రిలే దీక్షలో పాల్గొన్న యువతీయువకులకు మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి సంఘీభావం బొండాగిరీ బాటలోనే బుద్ధా..! బెజవాడలో తొలిరోజు వైఎస్సార్ సీపీ శ్రేణుల దీక్షా శిబిరం వద్ద విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఆయన అనుచరులు దాడులకు తెగబడి అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. బ్రాహ్మణనేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దీక్షా శిబిరం టెంట్‌ను తొలగించి కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లు రువ్వి పచ్చమూకలు కవ్వింపు చర్యలకు దిగాయి. ఇక అమానవీయ చర్యలకు పరాకాష్టగా మరింత దిగజారిపోయి బాటిల్లో మూత్రం పట్టుకొచ్చి నిరసనకారులపై చల్లారు. దీనికి కొనసాగింపుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గ్యాంగ్ వైఎస్సార్సీపీ దీక్షా శిబిరం వద్ద శుక్రవారం హల్చల్ చేసింది. శాంతియుతంగా నిర్వహిస్తున్న నిరసనను భగ్నం చేసేందుకు రెచ్చగొట్టే నినాదాలు చేశారు. పచ్చమూకలు గొడవలు సృష్టించేందుకు యత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. విజయవాడలో దీక్ష చేస్తున్న యువత, విద్యార్థులకు మద్దతు పలుకుతున్న దేవినేని అవినాశ్ కడపలో రిలే దీక్షలో పాల్గొన్న యువకులు రోడ్డుపైనే బైఠాయించిన అబ్బయ్య చౌదరి దెందులూరు నియోజకవర్గం మాదేపల్లిలో వైఎస్సార్సీపీ చేపట్టిన దీక్షకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అంటూ వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద రోడ్డుపైనే అబ్బయ్య చౌదరి బైఠాయించారు. మాదేపల్లిలో దీక్షా శిబిరాన్ని తొలగించిన పోలీసులు వైఎస్సార్సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దెందులూరులో రోడ్డుపై అబ్బయ్యచౌదరి బైఠాయింపు బెజవాడలో దీక్షాశిబిరం వద్ద టీడీపీ గూండాగిరీ..తొండంగిలో టెంట్లు తొలగింపు.. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగిలో పోలీసుల తీరుతో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ సీపీ రిలే దీక్షలు చేపట్టిన రెండు టెంట్లను పోలీసులు తొలగించారు. గురువారం రాత్రి తొండంగి కార్పొరేషన్ బ్యాంక్ సమీపంలో ఏర్పాటు చేసిన టెంట్‌ను తొలగించగా శుక్రవారం ఉదయం జియో కార్యాలయం వద్ద టెంట్‌ను తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతల డైరెక్షన్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. మండుటెండను లెక్క చేయక రోడ్డుపై బైఠాయించి వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. దీక్షలకు పెరుగుతున్న జెన్ జీ మద్దతు.. మెగా డీఎస్సీ 2025 నియామకాల్లో అక్రమాలపై కేంద్ర సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దీక్షలకు జెన్ జీ యువత భారీగా మద్దతు పలుకుతోంది. తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు.. అనంతపురం నుంచి కోనసీమ దాకా దాదాపు అన్ని జిల్లాల్లో యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు భారీగా పాల్గొని కూటమి సర్కారు నిర్వాకాలపై మండిపడ్డారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాతోపాటు మొత్తం నియామక ప్రక్రియపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపి, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.నేడు కొనసాగనున్న రిలే దీక్షలు.. 10న భారీ ర్యాలీలు.. వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలు ఈ నెల 8న కూడా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో కొనసాగుతాయని పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నారు. ర్యాలీలు ముగిసిన తర్వాత ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెంచేలా మలిదశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నట్లు వైఎస్సార్సీపీ వెల్లడించింది.స్పోర్ట్స్ కోటాలో ’పేకాట’.. డీఎస్సీలో లూడో! దగా డీఎస్సీపై పార్వతీపురంలో వైఎస్సార్ సీపీ స్కిట్ పార్వతీపురం రూరల్: మెగా డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులను దొడ్డిదారిలో కట్టబెట్టి.. పేకాట, లూడో లాంటి వాటిని ప్రభుత్వం క్రీడా కోటా జాబితాలో చేర్చిందంటూ పార్వతీపురంలో వైఎస్సార్సీపీ శ్రేణులు శుక్రవారం వినూత్న రీతిలో నిరసన చేపట్టాయి. పట్టణంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు నేతృత్వంలో రెండో రోజు రిలే నిరాహార దీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా కూటమి నేతల్లా నటిస్తూ.. పేకాట, లూడో ఆడుతూ గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కష్టపడి చదివిన అభ్యర్థులను, ప్రతిభావంతులైన క్రీడాకారులను పక్కనపెట్టి.. స్పోర్ట్స్ కోటా పేరుతో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారని మండిపడ్డారు. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని, సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 4వ ర్యాంక్ సాధించినా నిరాశే..! పులివెందులలో డీఎస్సీ బాధిత అభ్యర్థి జిలాని పులివెందుల: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే టీచర్ పోస్టుపై ఎంతో మక్కువతో మెగా డీఎస్సీకి రెండేళ్ల పాటు సిద్ధమైనట్లు డీఎస్సీ బాధిత అభ్యర్థి జిలాని పేర్కొన్నాడు. ఇంటికి దూరంగా ఉంటూ కడప, ప్రొద్దుటూరులో డీఎస్సీకి ప్రిపేరైనట్లు చెప్పాడు. శుక్రవారం పులివెందులలోని ఆర్డీవో కార్యాలయం వద్ద తొండూరు మండల ఇన్చార్జీ వైఎస్ మధురెడ్డి డీఎస్సీ రిలే దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిలాని మాట్లాడుతూ బీఈడీలో 75 శాతంతో ఉత్తీర్ణత సాధించానన్నారు. డీఎస్సీ రాసిన తర్వాత వందకు 71 మార్కులు, టీచింగ్‌లో 69.60 మార్కులు వచ్చాయన్నారు. దీని ప్రకారం తాను నాలుగో ర్యాంకులో ఉన్నట్లు చెప్పాడు. కానీ డీఎస్సీలో జాబ్ రావాలంటే కష్టపడటం ఒక్కటే కాదు.. ఒక స్పోర్ట్స్ సర్టిఫికెట్, రూ.15 లక్షల డబ్బులూ కావాలని అర్థమైందన్నారు. టీజీటీలో ఆరు పోస్టులు ఉండగా.. బీసీలకు నాలుగు పోస్టులు ఉండాలని, కానీ 1, 2, 3వ ర్యాంకర్లకు పోస్టులు ఇచ్చాక జిల్లాలో 4వ ర్యాంకర్, టీజీటీలో 276వ ర్యాంకర్‌ను తీసేసి 2,217వ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి పోస్టు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు. డీఎస్సీలో అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, అలాంటి సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ నేనున్నానని చెప్పడంతో ధైర్యం వచ్చిందన్నారు. నాకు పేకాట రాదు.. అందుకే ఉద్యోగం రాలేదు! నెల్లూరు (వేదాయపాళెం): మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పేరుతో అనేక అక్రమ నియామకాలు జరిగాయని బాధిత అభ్యర్థి షేక్ కరీంబాషా వాపోయాడు. శుక్రవారం నెల్లూరులోని కరెంటాఫీసు సెంటర్లో వైఎస్సార్ సీపీ రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దకు స్వచ్ఛందంగా వచ్చిన కరీంబాషా మైకు ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తాడు. కొత్త కొత్త జీవోలు ప్రవేశపెట్టి పేకాటను బ్రిడ్జి గేమ్ పేరుతో ఒక క్రీడగాపరిగణించి ప్రభుత్వం తమ అనుయాయులు, పేకాట రాయుళ్లకు ఉపాధ్యాయ ఉద్యోగాలను కట్టబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు పేకాట రాదని, తన వద్ద బ్రిడ్జి గేమ్ సర్టిఫికెట్ లేదని, కానీ తాను కష్టపడి చదివి మంచి మార్కులు సాధించానన్నారు. పేకాట తెలియకపోవడమే తన అనర్హతకు కారణమవుతుందని తెలిసి ఉంటే ఏదో విధంగా పేకాట నేర్చుకునే వాడినన్నాడు. ప్రభుత్వ ఉద్యోగానికి ఈ ఏడాదితో వయో పరిమితి దాటి పోయిందని కన్నీటి పర్యంతమయ్యాడు. అక్రమ పద్ధతిలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన చంద్రబాబు సర్కారు తనకు కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. -
మీ ప్రభుత్వం ఇంకా ఎంతగా దిగజారుతుంది?
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 ప్రశ్నాపత్రం లీకేజీ, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేపట్టిన శాంతియుత రిలే నిరాహార దీక్షలపై తమ అనుచరులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యేలు దాడులు చేయడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంతగా దిగజారుతుంది? అంటూ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగిన నిరుద్యోగ యువతకు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా? అంటూ నిలదీశారు.నారా లోకేశ్‌ను బాధ్యత నుంచి తప్పించకుండా మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. డీఎస్సీ–2025 ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని మీరు చెబుతున్నప్పుడు, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? అంటూ చంద్రబాబును వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘మీరు దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చు.. మీ పోలీసులను, పార్టీ శ్రేణులను ప్రయోగించవచ్చు.. నిరసనకారులను అరెస్టు చేయవచ్చు.. కానీ డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై ఆధారాలను మాత్రం చెరిపేయలేరు.నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచి వేయలేరు. ఆంధ్రప్రదేశ్ జెన్–జెడ్ గొంతును మూయలేరు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు’ అని స్పష్టం చేశారు. రిలే నిరాహార దీక్ష శిబిరాలపై టీడీపీ ఎమ్మెల్యేలు అనుచరులతో కలిసి చేసిన దాడుల వీడియోలను ట్యాగ్ చేస్తూ శుక్రవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వైఎస్ జగన్ పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తారా? ‘‘చంద్రబాబు గారూ.. మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంతగా దిగజారుతుంది? నిరుద్యోగ యువతకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారు అడిగితే... దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా? డీఎస్సీ–2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షపై మీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి, దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారు. పోలీసుల కళ్ల ముందే, వారి సమక్షంలోనే టెంట్లు లాగి పడేశారు. మా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. మహిళలపై దాడులకు తెగబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా శిబిరాలపై నిర్బంధకాండను కొనసాగించారు. చిలకలూరిపేట, కనిగిరి, యాడికి, తాడిపత్రి, పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, బాపట్లలో నిరసన శిబిరాలపై దాడులు చేశారు. నాయకులను నిర్బంధించారు. శాంతియుతంగా దీక్షలు చేస్తూ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కూడా నిరుద్యోగ యువతకు లేకుండా చేశారు. సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? నారా లోకేశ్‌ను బాధ్యత నుంచి తప్పించకుండా మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు? డీఎస్సీ–2025 ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని మీరు చెబుతున్నప్పుడు, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి చదివిన యువతకు న్యాయం జరగాలి. నియామకాల్లో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ప్రస్తుతం రూ.9,000 కోట్లకు చేరిన విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్మెంట్), వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. మీ ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని, గత రెండేళ్ల బకాయిలతో సహా వెంటనే చెల్లించాలి. న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదు చంద్రబాబు గారూ.. మీరు దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చు.. మీ పోలీసులను, పార్టీ శ్రేణులను ప్రయోగించవచ్చు.. నిరసనకారులను అరెస్టు చేయవచ్చు.. కానీ డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై ఆధారాలను మాత్రం చెరిపేయలేరు. నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచి వేయలేరు. ఆంధ్రప్రదేశ్ జెన్ జెడ్ గొంతు నొక్కలేరు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. చేనేత కార్మికుల ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచాంజాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు ఐదేళ్లలో రూ.3,706.16 కోట్ల సాయం అందించాం ఆర్థికంగా, సామాజికంగా మద్దతుగా నిలిచాం చేనేత వ్రస్తాలకు దేశ, విదేశాల్లో మార్కెట్.. ఈ కామర్స్ సంస్థలతో ఒప్పందాలు ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేశాం ఎన్నికల హామీలను విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం సాక్షి, అమరావతి: చేనేత అనేది కేవలం ఒక వృత్తి కాదని.. మన సంస్కృతికి, సంప్రదాయానికి, తెలుగువారి కళా నైపుణ్యానికి నిలువెత్తు ప్రతీక అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నేతన్నలు, చేనేత కళాకారులు, వారి కుటుంబ సభ్యులందరికీ శుక్రవారం ఆయన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 2019–24 మధ్య తమ ప్రభుత్వంలో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని ప్రతి అడుగులోనూ అండగా నిలిచామని చెప్పారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేల చొప్పున ఐదేళ్లలో రూ.1.20 లక్షలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. ఈ ఒక్క పథకం ద్వారానే రూ.969.77 కోట్లు అందించామని, నేతన్నల పింఛన్ల కోసం రూ.1,396.45 కోట్లు, ఆప్కో పాత బకాయిల చెల్లింపునకు రూ.468.84 కోట్లు వెచ్చించామని చెప్పారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా మొత్తంగా రూ.3,706.16 కోట్ల సాయం అందించి నేతన్నలకు ఆర్థికంగా, సామాజికంగా మద్దతుగా నిలిచామన్నారు. చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్, పవర్‌లూమ్స్‌కు రాయితీ విద్యుత్ అందించామని తెలిపారు. నేతన్నలు తయారు చేసే వస్త్రాలకు దేశ, విదేశాల్లో మార్కెట్ కల్పించేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని, వారి ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేశామని చెప్పారు. ఎన్నికల హామీలకు చంద్రబాబు తూట్లు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండేళ్లుగా నేతన్న నేస్తం పథకాన్ని నిలిపి వేసిందని వైఎస్ జగన్ ఆరోపించారు. ఏడాదికి రూ.25 వేలు అందిస్తామన్న ఎన్నికల హామీని అమలు చేయలేదని విమర్శించారు. హ్యాండ్లూమ్స్కు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి, ఆ హామీలను కూడా అమలు చేయలేదన్నారు. 1,03,534 కుటుంబాలకు పథకం వర్తింప జేస్తామని ప్రకటించి, నేడు కేవలం 71,536 కుటుంబాలకు ఇస్తున్నట్లు ప్రకటిస్తున్నారన్నారు. ఆచరణకు వచ్చేసరికి వారిలో ఎంత మందికి ఆ సాయం అందుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. జీఎస్టీ రీయింబర్స్మెంట్ హామీని కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. నేతన్నల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం, చేనేత రంగ పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
ఏపీలో మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
సాక్షి, తాడేపల్లి: ‘‘దిశ”ను ఉపసంహరించుకోవటంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను.. రాజకీయ ఈర్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు.‘‘మహిళలు, చిన్నారులపై నేరాలు, దర్యాప్తులో జాప్యం, న్యాయ ప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలకు పరిష్కారంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం “దిశ”ను తీసుకొచ్చింది. నేరం జరగకుండా నిరోధించడం నుంచి, నేరం జరిగితే వెంటనే స్పందించడం, బాధితులకు రక్షణ, వేగంగా దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, చార్జిషీటు, ప్రత్యేక కోర్టుల ద్వారా సత్వర న్యాయం వరకు ఒక సమగ్ర వ్యవస్థను నిర్మించాం...దిశలో భాగంగా మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు SOS బటన్ నొక్కినా, ఫోన్‌ను 5 సార్లు షేక్ చేసినా నిమిషాల వ్యవధిలో పోలీసులు స్పందించే వ్యవస్థ తీసుకొచ్చాం. 1.51 కోట్ల మంది దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ ద్వారా వచ్చిన 31,607 అత్యవసర కాల్స్‌ను అప్పట్లో మా ప్రభుత్వంలో పోలీసులు పరిష్కరించారు. 18 ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసును అందుబాటులోకి తీసుకొచ్చి 13,500 మందితో క్షేత్రస్థాయి భద్రత, రిపోర్టింగ్ వ్యవస్థను నిర్మించాం...900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలతో ప్రత్యేక పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం. నేరస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే అవకాశం లేకుండా ఈ కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలకు ప్రాధాన్యం ఇస్తూ ఆరు నగరాల్లో ఫోరెన్సిక్ వ్యవస్థను బలోపేతం చేశాం. సత్వర విచారణ కోసం 13 ప్రత్యేక POCSO కోర్టులు, 12 మహిళా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశాం. 2,17,467 మంది లైంగిక నేరస్తుల వివరాలతో ప్రత్యేక డేటాబేస్‌ను రూపొందించాం. అందుకనే దిశ విజయవంతగా మహిళలకు, చిన్నారులకు గొప్ప భద్రతా సేవలను అదించింది’’ అని వైఎస్ జగన్ వివరించారు.‘‘2017లో మహిళలపై నేరాల దర్యాప్తుకు సగటున 156 రోజులు పట్టగా, 2022 నాటికి అది 28 రోజులకు తగ్గించగలిగారు. 164 అత్యాచారం కేసులు, 378 లైంగిక నేరాల కేసుల్లో కేవలం 7 రోజుల్లోనే ఛార్జిషీట్లు దాఖలు చేశారు. తీవ్రమైన కేసుల్లో 51 శాతానికిపైగా నిందితులను 48 గంటల్లోపు అరెస్టు చేశారు. గతంలో డీఎన్ఏ నివేదికలకు నెలలు పట్టేది. దిశ ఫోరెన్సిక్ వ్యవస్థతో వాటిని రోజుల్లోనే అందించే పరిస్థితి తీసుకొచ్చాం. 214 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. మే 2024 నాటికి మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయి. వార్షిక సగటు కేసులు 14,338 నుంచి 10,426కు తగ్గాయి...ఇదీ దిశ ఇచ్చిన భరోసా. ఇవీ దిశ సాధించిన ఫలితాలు. అందుకే 19జాతీయ అవార్డులను మా ప్రభుత్వ హయాంలో “దిశ’’ గెలుచుకుంది. “దిశ” అనేది కాగితాల మీదున్న పేరు కాదు. ప్రమాదంలో ఉన్న మహిళ SOS నొక్కిన క్షణం నుంచి, నిందితుడికి శిక్ష పడే వరకు ఆమెకు అండగా ఉండే సజీవమైన మహిళా రక్షణ నెట్వర్క్. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం “BNS (భారతీయ న్యాయ సంహిత) చాలు, దిశ అవసరం లేదు” అంటోంది. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన SOS వ్యవస్థ, ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు, గ్రామ స్థాయి నుంచే మహిళా పోలీసులు, ప్రత్యేక పెట్రోలింగ్, లైంగిక నేరస్తుల డేటాబేస్, వేగవంతమైన ఫోరెన్సిక్ వ్యవస్థ, ప్రత్యేక ప్రాసిక్యూషన్, ప్రత్యేక కోర్టులు, నిర్ణీత సమయంలో దర్యాప్తు! న్యాయం అనే లక్ష్యానికి BNS ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది?“దిశ”ను ఉపసంహరించుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, చిన్నారులకు ఒక చీకటి రోజు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరం.మహిళలు, చిన్నారులపై నేరాలు, దర్యాప్తులో జాప్యం,… pic.twitter.com/cF3dc8uSpT— YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2026..మహిళలు, చిన్నారులపై తీవ్రమైన దారుణాలు జరిగినప్పుడు 7 పని రోజుల్లో పోలీసు దర్యాప్తు, ఛార్జ్‌షీట్ దాఖలైన తర్వాత 14 పని రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేసేలా దిశ ద్వారా తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా వైయస్సార్సీపీదే. 21 రోజుల్లోగా బాధితులకు న్యాయం అందించాలన్న అలాంటి లక్ష్యాన్ని కూడా ఈ ప్రభుత్వం విమర్శించడం మరింత బాధాకరం. ఆ లక్ష్యం వెనుక ఉద్దేశం ఒక్కటే, దర్యాప్తులో జాప్యం ఉండకూడదు. విచారణలో ఆలస్యం ఉండకూడదు. మహిళలు, చిన్నారులపై నేరాలను అత్యంత ప్రాధాన్యతతో వేగంగా విచారించాలి. నేరం చేస్తే చట్టం వేగంగా, కఠినంగా స్పందిస్తుందనే భయం నేరస్తుల్లో ఉండాలి. అలాంటి వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సింది పోయి.. వేగంగా న్యాయం అందించాలనే లక్ష్యాన్నే తప్పుపట్టడం మహిళలకు ఏ సందేశం పంపుతోంది?..మహిళలు, చిన్నారులకు సకాలంలో న్యాయం జరగాలని కోరుకోవడమే ఈ ప్రభుత్వానికి అభ్యంతరమా?. “దిశ”ను ఉపసంహరించుకోవడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం నేరస్తుల్లో చట్టంపై ఉన్న భయాన్ని తగ్గిస్తోంది. బాధిత మహిళల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. మహిళలు తమ రక్షణ కవచంగా భావించిన వ్యవస్థను లేకుండా చేస్తోంది. మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. దిశను రద్దు చేయడం కాదు.. రక్షించాలి. దిశను నిర్వీర్యం చేయడం కాదు.. మరింత బలోపేతం చేయాలి’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
‘అరాచక బ్యాచ్‌లన్నీ చంద్రబాబు చెంతనే ఉన్నాయి’
తాడేపల్లి : చంద్రబాబు పాలనలో ఏపీ సర్వం భ్రష్టు పట్టిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. అన్ని రకాల అరాచక బ్యాచ్‌లన్నీ చంద్రబాబు చెంతనే ఉన్నాయని, అలాంటి చంద్రబాబు తమపై విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈరోజు(శుక్రవారం, ఆగస్టు 7వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడని కారుమూరి.. చేనేతలకు వైఎస్ జగన్ ఐదేళ్ల పాటు రూ. 24వేలు చొప్పున ఇస్తే.. చంద్రబాబు రెండేళ్లుగా ఎగ్గొట్టి ఇప్పుడు డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. ‘మొత్తం రూ.75 వేలు చొప్పున చేనేతలకు చంద్రబాబు బకాయి పడ్డారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశామని చెప్పటం సిగ్గుచేటు. కుప్పం వెళ్లి ఎవర్ని అడిగినా సూపర్ సిక్స్ అమలయ్యాయో లేదో చెప్తారు. లేదా మంగళగిరి వెళ్లి అడగినా జనమే సరైన సమాధానం చెప్తారు. రోడ్లన్నీ అద్దాల్లాగ మార్చేశామని పచ్చి అబద్దాలు చెప్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో రోడ్లు ఎలా ఉన్నాయో చూస్తే వాస్తవం తెలుస్తుంది. చంద్రబాబు అరాచకం తట్టుకోలేక పరిశ్రమలు పారిపోతున్నాయి. రూ.6వేల కోట్ల పెట్టబడి వస్తే రూ.23 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చిందంటూ నిస్సిగ్గుగా చెప్తున్నారు. గోదావరి పుష్కరాలు వస్తున్నాయంటే జనం భయపడి పోతున్నారు. విశాఖలో మత్స్యకారులు చనిపోతే చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదు?, డీఎస్సీలో ఉద్యోగాలు అమ్ముకున్నారు. జెన్ జీ ని గొడ్డలి బ్యాచ్ అని, గంజాయి బ్యాచ్ అంటూ కించపరచటం దుర్మార్గం. చంద్రబాబు అహంకారపు మాటలను జెన్ జీ గ్రహిస్తూనే ఉంది. టీడీపీలో మట్టిబ్యాచ్, నకిలీ మద్యం బ్యాచ్, వెన్నుపోటు బ్యాచ్, భార్యల చీరలు చించే గలీజు బ్యాచ్, చికెన్ షాపులో కమీషన్లు కొట్టేసే బ్యాచ్.. ఇలాంటి బ్యాచులన్నీ ఉన్నాయి. ఆ బ్యాచ్లన్నిటికీ చంద్రబాబే హెడ్. డ్రగ్స్ తీసుకుని పార్లమెంటుకి వెళ్లే బ్యాచ్ కూడా చంద్రబాబు దగ్గరే ఉంది.చంద్రబాబు పేరుకే ముఖ్యమంత్రి. కానీ ఏ ఒక్క సమస్య నూ పరిష్కారం చేయటం లేదు. అందుకే జనం జగన్ దగ్గరకు వస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు, లోకేష్ రాష్ట్రం వదిలి వెళ్లకుండా ఉండాలి. హోంమంత్రి అనిత డమ్మీ మంత్రి. ఒక్క కానిస్టేబుల్‌ను కూడా ట్రాన్సఫర్ చేయించుకోలేని హోంమంత్రి ఆమె. అలాంటి హోంమంత్రి మాటలకు విలువ లేదు. పవన్ కళ్యాణ్‌కు క్యాబినెట్ అంటే లెక్క లేదు. అందుకే పదేపదే క్యాబినెట్ సమావేశాలకు ఎగ్గొడుతున్నారు. ఎన్ఆర్ఐ మహిళను వేధించిన మంత్రిపై ఏం చర్యలు తీసుకున్నారు?’ అని నిలదీశారు. -
‘డీఎస్సీ అక్రమాలపై లోకేష్ మౌనం ఎందుకు?’
తాడేపల్లి : ఏపీలో రాచరిక పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. క్యాబినెట్ మీటింగ్ కంటే ముందే లోకేష్ మంత్రులతో మీటింగ్ పెడుతున్నారని, దీన్ని బట్టి రాష్ట్రంలో పాలన ఎవరి చేతుల్లో ఉందని అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియా సమావేశంలో మాట్లాడిన కురసాల.. ‘ క్యాబినెట్ మీటింగ్ కంటే ముందే లోకేష్ మంత్రులతో మీటింగ్ పెడుతున్నారు. క్యాబినెట్లో చంద్రబాబు అధ్యక్షత వహిస్తే, బయట లోకేష్ అధ్యక్షత వహిస్తున్నారు. అసలు క్యాబినెట్ సమావేశాలు ప్రజల కోసమా? వారి వ్యక్తిగత ఎజెండా కోసమా?, క్యాబినెట్ మీటింగ్‌లకు పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లటం లేదు?, చంద్రబాబు మాటలు వెంటుంటే ఆయన ప్రస్టేషన్ లో ఉన్నట్టు అనిపిస్తోంది. జగన్ పర్యటనలకు వస్తున్న జనాన్ని చూసి చంద్రబాబుకు ప్రెస్టేషన్ పెరుగుతోంది. జగన్ పర్యటనపై ఎల్లోమీడియా కాకమ్మ కబుర్లు చూసి జనం నవ్వుకుంటున్నారు. మాజీ సీఎం దేవరపల్లి వస్తే ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలేదు?, ఏదైనా తొక్కిసలాట జరిగితే జగన్‌పై బురద జల్లటానికి ప్రయత్నించారు. జెన్ జీని బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అనటం సరికాదు. చంద్రబాబు ప్రస్టేషన్‌తో ఒక తరాన్నే అవమానిస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై విచారణ జరపకుండా ఉత్తుత్తి సవాల్ చేయటమెందుకు?, డీఎస్సీ అక్రమాలపై లోకేష్ ఎందుకు మాట్లాడటం లేదు?, చంద్రబాబు అబద్దాల ఫ్యాక్టరీ నుండి రోజూ ఫేక్ న్యూస్ వదులుతున్నారు. చంద్రబాబు క్రిమినల్ ఫ్యాక్టరీని నడుపుతున్నారుపనికి ఆహారం పథకం కింద వచ్చిన బియ్యాన్ని పందికొక్కుల్లా తిన్నది టీడీపీ బ్యాచ్. జగన్ మహిళలు, రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తే, చంద్రబాబు కార్పొరేట్లకు, పారిశ్రామిక వేత్తలకు ఇస్తారట. ఇది చాలదా.. జగన్, చంద్రబాబు మధ్య తేడా తెలుసుకోవటానికి?, పోలీసు స్టేషనులో చంపి బూడిద కూడా ఇవ్వని పాలన చంద్రబాబుది. అలాంటి వారు దిశా చట్టాన్ని రద్దు చేయటంలో ఆశ్చర్యం లేదు. చంద్రబాబు కందుకూరు, గుంటూరు పర్యనల్లో జనం చనిపోయారు. గోదావరి పుష్కరాల్లోనూ 29 మందిని చంపేశారు. అలాంటి చంద్రబాబు ప్రతిరోజూ ప్రవచనాలు చెప్పటం సిగ్గుచేటు. పోలవరం ప్రాజెక్టును చివరికి బ్యారేజీగా మార్చేశారు. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రకటన చేసింది. మొత్తం 30 లక్షల ఎకరాలకు నీరు అందాల్సిన పోలవరం చంద్రబాబు వలన లక్షా 89 వేలకే పరిమితం అయింది. ఇంతటి గొప్ప ప్రాజెక్టును తగ్గించటంపై క్యాబినెట్లో ఎందుకు చర్చించలేదు?’ అని ప్రశ్నించారు. -
YSRCP దీక్షా శిబిరాలపై దాడులు.. AP Gen Z గొంతు మూయలేరు
-
Gen Z పై చంద్రబాబు సంచలన కామెంట్స్ ఇక మీకు చుక్కలే...
-
ఎన్ని దాడులు చేస్తారో చేసుకోండి... మీకు ఈ రెండేళ్లే టైం...
-
వైఎస్సార్సీపీ దీక్షా శిబిరాలపై దాడులు.. వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ దీక్షా శిబిరాల మీద దాడుల పట్ల ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. దాడుల వీడియోను ఎక్స్‌లో పోస్టు చేసిన వైఎస్ జగన్.. చంద్రబాబూ మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంత దిగజారుతుంది? అంటూ నిలదీశారు. నిరుద్యోగ యువతకు, వారికి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే… దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా? అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘డీఎస్సీ-2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షపై మీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి, దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారు. పోలీసుల కళ్లముందే, వారి సమక్షంలోనే టెంట్లు లాగిపడేశారు. మా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. మహిళలపై దాడులకు తెగబడ్డారు...రాష్ట్రవ్యాప్తంగా దీక్షా శిబిరాలపై నిర్బంధకాండను కొనసాగించారు. చిలకలూరిపేట, కనిగిరి, యాడికి, తాడిపత్రి నుంచి పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, బాపట్ల వరకు నిరసన శిబిరాలపై దాడులు చేశారు. నాయకులను నిర్బంధించారు. శాంతియుతంగా దీక్షలు చేస్తూ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కూడా నిరుద్యోగ యువతకు లేకుండా చేశారు. నారా లోకేష్‌ను బాధ్యత నుంచి తప్పించడానికి మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు?’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘డీఎస్సీ –2025 ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని మీరు చెబుతున్నప్పుడు, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి చదివిన యువతకు న్యాయం జరగాలి. నియామకాల్లో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ప్రస్తుతం రూ.9,000 కోట్లకు చేరిన పెండింగ్ విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్మెంట్), వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. మీ ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని, గత రెండేళ్ల బకాయిలతో సహా వెంటనే చెల్లించాలి...చంద్రబాబూ.. మీరు దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చు. మీ పోలీసులను, పార్టీ శ్రేణులను ప్రయోగించవచ్చు. నిరసనకారులను అరెస్టు చేయవచ్చు. కానీ డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై ఆధారాలను చెరిపేయలేరు. నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచివేయలేరు. ఆంధ్రప్రదేశ్ జెన్ జీ గొంతును మూయలేరు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.@ncbn గారూ, మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంత దిగజారుతుంది? నిరుద్యోగ యువతకు, వారికి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే… దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా?#DSC2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ… pic.twitter.com/SbndqNaPsD— YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2026 -
ఇంతకంటే దారుణం ఉంటుందా?: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: డిఎస్పీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని.. యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని వైఎస్సార్సీపీ రెండో రోజు రిలే నిరహార దీక్ష చేపట్టింది. ఆటోనగర్‌లో రిలే నిరాహార దీక్ష చేసిన వైఎస్సార్సీపీ నేతలు.. నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. మోసపోయిన డిఎస్పీ అభ్యర్థులకు న్యాయం కోసం పోరాటం చేస్తున్నామన్నారు.‘‘యువతను కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పోలీసుల పర్మిషన్ తీసుకుని శాంతియుత కార్యక్రమం చేస్తున్నాం. రెండు రోజుల ముందు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. ఈ రోజు ఉదయం 100 మంది పోలీసులు వచ్చి మా టెంట్ పీకేశారు.. గీత గీసి ముందుకు రాకూడదని ఏసీపీ అంటున్నారు. భారతదేశంలో ఉన్నామా? ఏ కాలంలో ఉన్నాం. భారత రాజ్యాంగం ఏపీలో నడవడం లేదు. చంద్రబాబు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది’’ అంటూ దేవినేని అవినాష్ మండిపడ్డారు...మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై కోడి గుడ్లతో దాడి చేశారు. టమోటాలతో దాడి చేశారు. టీడీపీ కార్యకర్తలు బాటిల్లో యూరిన్ పోసి దాడి చేశారు. ఇంతకంటే దారుణం ఉంటుందా?. దమ్ముంటే సీబీఐ ఎంక్వయిరీ వేయండి. నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పందించండి. రాత్రి అయిన తరువాత పగలు వస్తుంది.. మరో మూడేళ్లు మాత్రమే టీడీపీ అధికారంలో ఉండేది. నిరుద్యోగ యువత, విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు చేస్తాం’’ అని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. -
రాష్ట్రమంతటా రౌడీ రాజ్యంపై YSRCP రిలే నిరాహార దీక్షలు
-
వెకిలి నవ్వు నవ్వడానికి సిగ్గులేదా.. అనితపై వరుడు కళ్యాణి ఫైర్
-
శ్వేతపత్రం గేమ్ ఇందుకేనా చంద్రబాబు ?
సాక్షి, అమరావతి: ఏపీ ప్రజలను ఎలా గందరగోళ పరచాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుంది. రెండేళ్ల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్దిక పరిస్థితిపై శ్వేతపత్రం ఇవ్వవలసిన అవసరం ఏమి వచ్చింది? రానున్న రోజుల్లో ప్రజల నడ్డి విరిచే విధంగా అదనపు భారం పడే అవకాశం ఉంటుందా? లేక తను ఇచ్చిన వాగ్దానాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం సాధ్యం కాదని సంకేతం ఇవ్వడమా? టీడీపీ, జనసేన కలిసి బాండ్ల రూపంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేసినట్లు భ్రమ పడాలనా? ఉద్యోగులు ఇకపై తమ డిమాండ్లను అడగకుండా బెదిరించడమా? 2024 ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన రీతిలో ఈ రెండేళ్లలో ఎంత సంపద సృష్టించారో ఎందుకు చెప్పలేకపోతున్నారు? పైగా అప్పులు చేయకపోతే సంక్షేమ స్కీములు ఇవ్వలేమన్న సందేశం ఎందుకు ఇవ్వవలసి వచ్చింది. జగన్ టైమ్ లో రెండేళ్ల కరోనా ఉన్నా,ఎన్నడైనా ఆర్ధిక పరిస్థితిపై ప్రజలను బేజారెత్తించేలా మాట్లాడారా? ఆయన టైమ్ లో ఓడరేవులు, మెడికల్ కాలేజీలు,ఊరూరా సచివాలయ భవనాలు వంటి ఎన్నిటినో నిర్మించి సంపద సృష్టిస్తే, కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్లలో చేసిన ప్రగతి ఏమిటి?ప్రైవేటువారు తప్ప, ప్రభుత్వం ఏమి చేయలేదన్నట్లుగా చంద్రబాబు మాట్లాడడం బలహీనతగా కనిపించదా?అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కూడా గత ప్రభుత్వంపైన విమర్శలు చేసి తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారా?లేదా?ఏతావాతా చూస్తే ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఏభై ఏళ్లకే ఎస్సి,ఎస్టి,బిసి లకు పెన్షన్, ఉద్యోగులకు పిఆర్సి వంటివి ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఈ శ్వేతపత్రం కధను నడిపారా?అన్న ప్రశ్న వస్తోంది.అయితే ఆ విషయం మనసులో పెట్టుకుని పైకి మాత్రం సంక్షేమ కార్యక్రమాలు ఆపబోమని చెబుతున్నా,ఏదో జరగబోతోందన్న అనుమానం కలుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎపిలో ఎక్కడకు వెళ్లినా జన ప్రభంజనం కనిపిస్తుండడంతో, చంద్రబాబు తన మానిఫెస్టోలోని కొన్నిటిని అయినా, కొంతమేర అయినా అమలు చేశారనిపిస్తుంది. గతంలో ఆయన ఉమ్మడి ఎపి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాని, విభజిత ఎపికి 2014 టరమ్ లో సి.ఎమ్.గా పనిచేసినప్పుడు కాని ఎలా వ్యవహరించారో గుర్తు చేసుకోండి.2014 ఎన్నికలకు ముందు రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చాక కొద్ది మొత్తం చేసి ఆశకు హద్దు ఉండాలని వ్యాఖ్యానించారు. పలుహామీలను ఎగవేశారన్న విమర్శను ఎదుర్కున్నారు. 1995 లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్.టి.రామారావును కుర్చీ నుంచి దించేసి తాను సి.ఎఎమ్ అయ్యాక చేసిన డబుల్ గేమ్ ఒక ఉదాహరణ అవుతుంది. అప్పట్లో కిలో సబ్సిడి బియ్యం ధర రెండు రూపాయలు ఉండేది. ఎన్.టి.ఆర్. మద్య పాన నిషేధం అమలు చేశారు.ఇలాంటివి మరికొన్ని కూడా ఉన్నాయి. ఎన్.టి.ఆర్. 1996 జనవరిలో మరణించారు. అదే సంవత్సరం లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల ప్రచారంలో తాము గెలిస్తేనే ఈ స్కీములన్నీ కొనసాగించగలగుతామని చెప్పేవారు.మద్య నిషేధం మరింత గట్టిగా అమలు చేస్తానంటూ హెల్త్ పర్మిట్లను కూడా రద్దు చేశారు. ఎన్నికలు పూర్తి అయ్యాక రాష్ట్ర ఆర్దిక పరిస్థితి బాగోలేదంటూ జనానికి చెప్పడం ఆరంభించారు. ప్రజాభిప్రాయ సేకరణ అంటూ సమావేశాలు పెట్టించారు.ఆయన కూడా స్వయంగా కొన్నిటిలో పాల్గొనేవారు. ఉదాహరణకు ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులతో జరిగిన మీటింగ్ లో మద్య నిషేధంపై అభిప్రాయం అడిగారు.మద్య నిషేధాన్ని సరిగా అమలు చేయలేకపోతున్నామని, అక్రమ మద్యం రాష్ట్రంలోకి వస్తోందని చెప్పేవారు. 1994 ఎన్నికలకు ముందు ప్రజలను , వివిధ వర్గాలవారిని అడిగి వాగ్దానాలు ఇవ్వలేదు .ఎన్.టి.రామారావు వాటిని అమలు చేసిన నేపధ్యంలో తనపై వ్యతిరేకత రాకుండా ఉండడానికి చంద్రబాబు ఈ వ్యూహం అమలు చేసేవారు.తదుపరి కిలో రేషన్ బియ్యాన్ని 5.50 రూపాయలకు పెంచారు. మద్య నిషేధాన్ని ఎత్తివేశారు. ఇలా పలు నిర్ణయాలను తిరగదోడారు. అయితే ఇదంతా ప్రజల ఆమోదంతోనే జరిగిందన్న భావన కల్పించడానికి యత్నించారు. సరిగ్గా అదే పంధాలో ప్రస్తుతం కూడా ఆయన వెళ్లే యత్నం చేస్తున్నారా అన్న సందేహం వస్తుంది.అప్పటి రాజకీయ పరిస్థితులు, సమాచార వ్యవస్థ, ఇప్పుడున్న పరిస్థితి, సోషల్ మీడియా వేరు.అందువల్ల కొంత జంకుతున్నట్లు అనిపిస్తుంది. 2024 ఎన్నికలకు ముందు కూడా ఆకాశమే హద్దుగా వరాలు ప్రకటించారు.అదేమంటే సంపద సృష్టించడం తెలుసునని అన్నారు. తీరా చూస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. జగన్ టైమ్ లో రెండేళ్ల కరోనా ఉన్నప్పటికీ మొత్తం ఐదేళ్లలో సుమారు 35వేల కోట్ల అదనపు ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూర్చగలిగితే ,ఈ రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం కేవలం 600 కోట్ల అదనపు ఆదాయమేనని వైసిపి నేతలు లెక్కలు చెబుతున్నారు. అయినా గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని, దాని ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోందన్న ప్రచారం చేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారు. ఆ విధ్వంసం ఏమిటో ఎంతకీ చెప్పకపోవడం విశేషం.చంద్రబాబు ఈసారి ఒక సంగతి చెప్పారు. రెండు హామీలు తప్ప మిగిలినవి అమలు చేశామని అన్నారు.ఇంతకుముందు అన్ని చేసేశామని, ఎవరైనా ఇంకేమైనా అడిగితే వారి నాలుక మందమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మాత్రం రెండు హామీలు అమలు చేయలేదని అంగీకరించడం విశేషం. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు.దానికి ప్రత్యామ్నాయంగా పి-4 అమలు చేస్తున్నామని కొన్నాళ్లు చెప్పినా ప్రజలు విశ్వసించడం లేదన్న సంగతి అర్దం అయి ఉండాలి. అలాగే 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని, 23 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని అన్నా,కేంద్రం వాటిలో ఉన్న సత్యం ఏమిటో చెప్పేసింది. కేవలం ఏడువేల కోట్ల లోపే పెట్టుబడులు వచ్చాయని, వాటివల్ల 22 వేల ఉద్యోగాలు వస్తాయని ఒక జవాబులో వెల్లడించింది. చంద్రబాబు అప్పట్లో ఇచ్చిన హామీల ప్రకారం ఏడాదికి సుమారు లక్షన్నర కోట్లు సంక్షేమ స్కీములకు వెచ్చించాలని అంచనా.కాని రెండేళ్లకు కలిపి అంత చేశానని ఆయన తెలిపిన లెక్కలను బట్టి అర్ధం అవుతుంది. మొదటి సంవత్సరం ఒక్క పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడం తప్ప మరే స్కీమ్ అమలు చేయలేదు. ఆ తర్వాత అమలు చేస్తున్నా,అనేక పరిమితులు, కోతలు పెడుతున్నారన్న విమర్శ ఉంది. ఇక ఉద్యోగ సంఘాలు తమకు చేసిన వాగ్దానాల గురించి అడుగుతుంటే,ఇప్పటికే మొత్తం రాష్ట్ర ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలకే పోతున్నదని ప్రకటిస్తున్నారు. అంటే ఇది ఒకరకంగా వారిని బెదిరించడమే అవుతుంది కదా అని అంటున్నారు.ఆయన ఎన్నికల మానిఫెస్టోని దగ్గర పెట్టుకుని ఎందుకు మాట్లాడరో ప్రజలు అర్ధం చేసుకోలేరా? అప్పుల గురించి నేరుగా వివరణ ఇచ్చినట్లు కనిపించలేదు. కాగా ద్రవ్యలోటు అన్నది మిద్య అని,కాకి లెక్కలు అని చంద్రబాబు వ్యాఖ్యానించడం విన్నవారికి మతిపోయినంత పని అయింది. అంటే బడ్జెట్ మిద్య, సంపద సృష్టి అన్నది మిద్య అని అనుకోవాలా? ఇంతకీ ఈ శ్వేత్రపత్రం విడుదలలో అసలు లక్ష్యం ఏమిటో తెలియడానికి మరికొంత సమయం పడుతుందేమో చూడాలి.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఊడిగమంతా హుష్‘ఖాకీ’ పోలీస్ నెత్తిపైనా ‘సర్దుబాటు’ పిడుగు..
‘‘డీఏ బకాయిలు చెల్లించలేదు.. ఐఆర్ ప్రకటించలేదు.. పీఆర్సీ ఇవ్వలేదు.. వీటన్నింటితోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ఊసేలేదు.. వెరసి చంద్రబాబు ప్రభుత్వంపై రెండేళ్లకే ఉద్యోగ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకింది. ఉద్యోగులు ఉద్యమ బాట పడుతుండటంతో వారిని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు హడావుడిగా రాçష్టపతి ఉత్తర్వుల (ప్రెసిడెన్షియల్ ఆర్డర్) అమలును తెరమీదకు తెచ్చింది.’’ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు రెడ్‌బుక్ అమలు భారాన్ని భుజానికి ఎత్తుకుని ఊడిగం చేస్తున్న పోలీసులకే కీలెరిగి వాత పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రపన్నింది. రక్షక భటుల నెత్తిన సర్దుబాటు పిడుగువేసింది. హామీల అమలు, వేతనాల పెంపు, డీఏ బకాయిలు, పీఆర్సీ వంటి అనేక కీలక అంశాలపై తోటివారితో కలిసి ఖాకీలు నోరెత్తకుండా ఉండేందుకే చంద్రబాబు సర్కారు ఆగమేఘాలపై ఉద్యోగుల విభజన ప్రక్రియ కిటుకును వాడుకుంటోంది. ప్రభుత్వ తీరు వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఇప్పటికే ఏపీ పోలీస్, అగ్నిమాపక శాఖలకు చెందిన సుమారు 300 మంది పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. సమయం, సందర్భం లేకుండా సరైన మార్గదర్శకాలు లేకుండా చేపట్టిన ఉద్యోగుల విభజన ప్రక్రియపై రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులూ తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఉపాధ్యాయులతోపాటు పలు శాఖలకు చెందిన ఉద్యోగులు సైతం న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. 27 నెలలు గడువున్నా.. ఇప్పుడెందుకు హడావుడి.. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజన(సర్దుబాటు) ప్రక్రియకు రాష్ట్రపతి ఉత్తర్వులు(ప్రెసిడెన్షియల్ ఆర్డర్)–2025 అమలుకు కేంద్ర ప్రభుత్వం 27 నెలల గడువు ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ నెలాఖరులోపు ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేయాలని మెడమీద కత్తిపెట్టి మరీ ఉద్యోగులను మానసిక వత్తిడికి గురిచేస్తోంది. తగిన సమయం ఇవ్వకుండా, సరైన ప్రణాళిక లేకుండా చేపట్టిన ఉద్యోగుల విభజన తీవ్ర గందరగోళంగా మారింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371–డి, 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల(ప్రెసిడెన్షియల్ ఆర్డర్–1975) ముఖ్య ఉద్దేశం ‘స్థానిక అభ్యర్థుల సొంత ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను, ఉద్యోగ రక్షణను కల్పించడం’. ఆర్టికల్ 371–డీ కింద ఇచ్చే రాష్ట్రపతి ఉత్తర్వులకు రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది. ఉద్యోగుల విభజన పేరుతో అన్యాయం.. వాస్తవానికి రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకు సంబంధించి పదోన్నతులను పూర్తిగా నిలిపివేయాలని ఎక్కడా నిబంధనలేదు. అయినప్పటికీ ఉద్యోగుల విభజన సాకుతో జూలై 13 నుంచి సాధారణ బదిలీలు, పదోన్నతులను, జాబ్ క్యాలెండర్‌ను నిలిపివేయడం చట్ట విరుద్ధం. అనేక శాఖల్లో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు, కేడర్, సీనియారిటీ వంటి సమస్యలు పరిష్కారం కాకుండానే ఉద్యోగుల విభజన ప్రక్రియను వేగవంతం చేయడం వల్ల ఉద్యోగుల సేవా హక్కులు దెబ్బతింటాయి. ఉద్యోగ నియామకాలపై బ్యాన్ పేరుతో కారుణ్య నియామకాలనూ నిలిపివేయడం బాధాకరం. కారుణ్య నియామకం అనేది మరణించిన ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమ చర్య అనే బాధ్యతను విస్మరించడం దారుణం. ఉద్యోగుల విభజనలో డిమాండ్లు ఇవి.. ప్రభుత్వం హడావుడిగా చేపట్టిన ఉద్యోగుల విభజనపై ఉద్యోగ వర్గాల నుంచి పలు డిమాండ్లు వస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి ఇలా ఉన్నాయి. ఉద్యోగుల అభిప్రాయాలను ముందుగా సేకరించాలి. పారదర్శక కేటాయింపు విధానాన్ని అమలు చేయాలి. సీనియారిటీని పూర్తిగా రక్షించాలి. కుటుంబ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలి. తగిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాతే పూర్తి స్థాయిలో కార్యాలయాలను ప్రారంభించాలి. ఉద్యోగులకు బదిలీ భత్యం, గృహ వసతి సహాయం అందించాలి. ఉద్యోగుల సంఘాలతో నిరంతరం చర్చలు జరపాలి. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిపాలనను సులభతరం చేయాలి. హడావుడిగా సర్దుబాటుతో ఉద్యోగుల హక్కులకు భంగం..ప్రభుత్వం రాష్ట్రాన్ని రెండు మల్టీజోన్లు, జోన్లు, జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపును హడావుడిగా చేపట్టడంతో తమ హక్కులకు భంగం కలుగుతోందని ఉద్యోగులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల పేరుతో హడావిడిగా ప్రభుత్వం ముందుకు వెళితే వేలాది మంది ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదంతోపాటు న్యాయపరమైన సమస్యలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. బలవంతపు బదిలీలు, సీనియారిటీ, పదోన్నతులపై ప్రభావం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి, కార్యాలయ మౌలిక సదుపాయాల కొరత, పరిపాలనా అయోమయం, సిబ్బంది కొరత, న్యాయపరమైన వివాదాలు, స్థానికత సమస్య, మహిళా ఉద్యోగుల ఇబ్బందులు, వైద్యం, విద్య సౌకర్యాల ఇబ్బందులు వంటి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. రాష్ట్రంలోని రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్, ఫైర్, మున్సిపల్, విద్య శాఖల్లో ఉద్యోగుల విభజన చిక్కులు ఎక్కువగా ఉన్నాయి. ఎక్సైజ్ శాఖలో సీనియర్లలో పురుషులు, జూనియర్లలో మహిళలు అధికంగా ఉన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వారిని విభజిస్తే కొత్త జిల్లాలకు అత్యధికంగా మహిళా కానిస్టేబుళ్లను కేటాయించడం వల్ల క్షేత్రస్థాయిలో నేరాలను అదుపు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఉద్యోగుల హక్కులను కాపాడుతూ.. పరిపాలనా సామర్థ్యాన్ని పెంచే విధంగా వారి విభజన చేపట్టాల్సిన అవసరం ఉంది. -
పోలవరం రిజర్వాయర్ కాదు బ్యారేజే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం మరోసారి బట్టబయలైంది. ఈ ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తే ఎత్తు 45.72 మీటర్లు కాదు.. 41.15 మీటర్లేనని కేంద్రం పునరుద్ఘాటించింది. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయడానికి 2023 ధరల ప్రకారం అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లుగా ఆమోదించామని, మిగిలిన పనులు పూర్తి చేయడానికి రూ.12,157.53 కోట్లు మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించామని స్పష్టం చేసింది. అందులో 2024–25లో రూ.5,512.40 కోట్లు, 2025–26లో రూ.2,810.22 కోట్లు వెరసి రూ.8,322.62 కోట్లు విడుదల చేశామని తెలిపింది. ఈ మేరకు లోక్‌సభలో వైఎస్సార్సీపీ పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 41.15 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వ చేసేలా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యాం గాŠయ్ప్–1, గ్యాప్–2లతోపాటు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని నిర్దేశించినట్లు తెలిపారు. గరిష్ఠ నీటి మట్టం 45.72 మీటర్ల ఎత్తు వరకూ స్పిల్ వే, ఈసీఆర్ఎఫ్ డ్యాం వంటి సివిల్ పనులు పూర్తి చేసేందుకు అయ్యే వ్యయంతోపాటు.. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేయడానికి అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడం.. కుడి, ఎడమ కాలువలను పూర్తి చేయడానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని స్పష్టం చేశారు. ప్రాజెక్టులో అంతర్భాగమైన జల విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణానికి అయ్యే ఖర్చును పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరించాలని తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పిస్తున్న నిధుల వినియోగ ధ్రువీకరణ పత్రాలు (యూసీలు), సాంకేతిక పత్రాలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కేంద్ర జల్ శక్తి శాఖ పరిశీలించాకే నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. 7.20 లక్షల ఎకరాలకు కాదు 1.98 లక్షల ఎకరాలకే పోలవరం ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 45.72 మీటర్లు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలు. కనీస నీటిమట్టం 41.15 మీటర్లు, కనీస నీటి నిల్వ 119.4 టీఎంసీలు. పోలవరం నీటి మట్టాన్ని కనీస స్థాయికే పరిమితం చేస్తే.. కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కేవలం 1.98 లక్షల ఎకరాలకు.. అదీ గోదావరికి వరద వచ్చిన రోజుల్లో మాత్రమే నీళ్లందించే అవకాశం ఉంటుందని అధికారులే స్పష్టంగా చెబుతున్నారు. ఇక కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల మళ్లింపు, గోదావరి డెల్టా ఆయకట్టు స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీళ్లందించే అవకాశమే ఉండదని తేల్చి చెబుతున్నారు. ఎడమ గట్టుపై 960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రంలోనూ గోదావరికి వరద వచ్చే రోజుల్లో మాత్రమే అరకొరగా విద్యుత్తు ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. అంటే.. పోలవరం రిజర్వాయర్‌ను బ్యారేజ్‌గా మార్చేశారన్నది స్పష్టమవుతోంది. పోలవరానికి ఉరేసిన చంద్రబాబు సర్కారుజలయజ్ఞంలో భాగంగా 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ బృహత్తర ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చిన మేరకు సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం), అటవీ, పర్యావరణం సహా అన్ని అనుమతులు సాధించి.. 45.72 మీటర్ల గరిష్ఠ నీటి మట్టం, 194.6 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు మళ్లించి 13.08 లక్షల ఎకరాలను స్థిరీకరించడం, గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాలకు రెండో పంటకూ సమృద్ధిగా నీళ్లందించి స్థిరీకరించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా దీని నిర్మాణం చేపట్టారు. 2014–19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు స్వలాభం కోసం కేంద్రం నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకొని, అనేక అవకతవకలు, అరకొర పనులతో ప్రాజెక్టును నీరుగార్చారు. 2019లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును దారిలోకి తెచ్చి , నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021 జూన్ 11 నాటికే 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేసేలా పోలవరం స్పిల్ వేను పూర్తి చేశారు. వైఎస్ జగన్ వినతిమేరకు 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు 2020 మార్చి 17న కేంద్రం అంగీకరించింది. 2024లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడంతోనే పోలవరం ప్రాజెక్టుకు ఉరేశారని సాగు నీటి రంగ నిపుణులు అంటున్నారు. 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్లో పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ.. ఆ మేరకు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.12,157.53 కోట్లు మాత్రమే ఇచ్చేలా తీర్మానాన్ని ఆమోదించగా.. అదే కేబినెట్లో సభ్యునిగా ఉన్న టీడీపీ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. -
కీచక పాలనలో కీలక బిల్లు డ్రాప్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళల భద్రత తమకు ఏమాత్రం పట్టదని చంద్రబాబు ప్రభుత్వం నిరూపించుకుంది. మహిళల భద్రత కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన చరిత్రాత్మకమైన ‘దిశ’ బిల్లును ఉపసంహరించుకోవడం ద్వారా చంద్రబాబు సర్కారు తన నైజాన్ని బయటపెట్టుకుంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు, వేధింపులు పెచ్చుమీరిపోయాయి.చంద్రబాబు కూటమిలో చిన్న కార్యకర్త నుంచి పెద్ద నేతల వరకు అనేక మంది మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారు. నిత్యం అనేక మంది కూటమి కీచకుల బారిన పడుతున్నా ప్రభుత్వానికి పట్టడంలేదు. చివరకు ఓ ఎన్నారై మహిళను చంద్రబాబు కేబినెట్లోని మంత్రే వేధించారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల భద్రత కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన దిశ బిల్లును చట్టంగా మార్పించాల్సింది పోయి.. చంద్రబాబు ప్రభుత్వం దానిని ఉపసంహరించుకోవడంపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు. మహిళల భద్రత కోసం వైఎస్ జగన్ విప్లవాత్మక చర్యలు రాష్ట్రంలోని మహిళల భద్రత కోసం దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చేయని రీతిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా ‘ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు’ను తెచ్చారు. మహిళలకు ఇది ప్రత్యేక రక్షణ కవచంలా నిలిచింది. ఇందులో భాగంగా ఆపదలో ఉన్న మహిళలు, బాలికల రక్షణ కోసం దిశ యాప్‌ను రూపొందించారు. ఫోన్లో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ప్రమాదంలో ఉన్నప్పుడు ఫోన్‌ను అటూ ఇటూ ఊపితే చాలు.. ఎస్‌వోఎస్ ద్వారా పోలీస్ స్టేషన్‌కు సమాచారం వెళ్లి 15 నుంచి 20 నిమిషాల్లోగా పోలీసులు బాధిత మహిళ ఉన్న ప్రదేశానికి వెళ్లి ఆమెను రక్షించే వారు. దిశ యాప్‌ను 1.5 కోట్ల మంది వారి ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ యాప్, ఎస్ఓఎస్ కాల్స్ ఆధారంగా భారీగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మహిళలపై వేధింపులు, గృహ హింస, అత్యాచారం, పోక్సో, కిడ్నాప్, ఈవ్‌టీజింగ్, హత్యాయత్నం వంటి కేసులు ఇందులో ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నుంచి నేరస్తుడి అరెస్టు, ఫోరెన్సిక్ నివేదిక, చార్జిïÙట్ నుంచి ప్రత్యేక కోర్టులో శిక్ష వరకు నిరంతర పర్యవేక్షణ వ్యవస్థతో నిరి్మంచిన సమగ్ర మహిళా భద్రతా వ్యవస్థ దిశ బిల్లు. మహిళలకు ప్రమాదకరంగా గుర్తించిన ప్రాంతాల్లో 24 గంటలూ పెట్రోలింగ్ కోసం 900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలను అందించారు. 19 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించారు. 12 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. పోక్సో కేసుల కోసం మరో 13 ప్రత్యేక కోర్టులను గుర్తించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లను నియమించారు. ఈ చర్యలతో మహిళలపై నేరాల దర్యాప్తు సమయం కూడా 156 రోజుల నుంచి 28 రోజులకు తగ్గించారు. 2017లో మహిళలపై నేరాల దర్యాప్తు పూర్తి చేయడానికి సగటున 156 రోజులు పట్టేది. 2021 నాటికి ఇది 67 రోజులకు, 2022లో 28 రోజులకు తగ్గింది. అత్యాచారం, పోక్సో కేసుల్లో 60 రోజుల్లో పూర్తి చేసిన దర్యాప్తులు 2019లో 14.15 శాతం కాగా, ఇది 2020లో 41.7 శాతం, 2021లో 92.21 శాతం, 2022లో 95.18 శాతానికి పెరిగాయి. లైంగిక నేరాల దర్యాప్తులో దేశ సగటు 40 శాతం కాగా ఏపీ 92.21 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. 2019–2022 మధ్య నమోదైన అత్యాచారం – హత్య కేసుల్లో 60 శాతం నిందితులను 48 గంటల్లోనే అరెస్టు చేశారు. గతంలో ఇలాంటి కేసుల్లో అరెస్టుకు సగటున 43 రోజులు పట్టగా, దిశ కాలంలో 8 రోజులకు తగ్గింది. త్వరగా అరెస్టు చేయడం ద్వారా నిందితులు తప్పించుకునే అవకాశాన్ని తగ్గించారు. దేశానికే దిశా నిర్దేశం చేసేలా జగన్ తెచ్చిన ఈ విప్లవాత్మక బిల్లుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. 19 అవార్డులు కూడా లభించాయి. 2024లో చంద్రబాబు సర్కారు రాగానే మహిళల భద్రతను ప్రశ్నార్ధకం చేసింది. దిశ బిలు్లకు కేంద్రం ఆమోదం రాలేదనే సాకుతో దిశ యాప్, పోలీస్ స్టేషన్లు, హెల్ప్‌డెస్‌్క, ఫోరెన్సిక్ వ్యవస్థ, ప్రత్యేక కోర్టులు, పెట్రోలింగ్, దర్యాప్తు పర్యవేక్షణ వంటి మొత్తం వ్యవస్థకు పాతరేసింది. రమ్య హత్య కేసులో మరణ శిక్ష దిశ వ్యవస్థ ఎంత వేగంగా పనిచేస్తుందో గుంటూరులో జరిగిన రమ్య హత్య కేసు ఓ ఉదాహరణ. ఈ కేసులో నిందితుడిని 48 గంటల్లో అరెస్టు చేసి, 7 రోజుల్లో చార్జిïÙట్ దాఖలు చేశారు. విచారణను వేగంగా పూర్తి చేయడంతో నిందితుడికి మరణశిక్ష పడింది. 2019 డిసెంబర్ నుంచి 2022 ఏప్రిల్ వరకు 214 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. వీటిలో ముగ్గురికి మరణించే వరకు జీవిత ఖైదు, 19 మందికి జీవిత ఖైదు, పలువురికి 20 ఏళ్లు, 10 ఏళ్లు తదితర శిక్షలు విధించారు. ‘దిశ’ ఉపసంహరణతో మహిళల భద్రత ప్రశ్నార్థకంమాజీ మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఆర్కే రోజా సాక్షి, అమరావతి: ‘దిశ’ ఉపసంహరణ మహిళా భద్రతకు బ్లాక్ డే అని, వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం దిశను రద్దు చేయడంతో మహిళల భద్రత ప్రశ్న్రా్థకంగా మారిందని మాజీ మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఆర్కే రోజాలు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు గురువారం వారు వేర్వేరు ప్రకటనల్లో చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ తప్పుడు నిర్ణయంతో మహిళలపై దారుణాలకు ప్రభుత్వమే వత్తాసు పలికినట్లయిందన్నారు. కేవలం జగన్ చేసిన మంచి పని మిగిలి ఉండకూడదనే దురుద్దేశంతోనే దిశను రద్దు చేసిందన్నారు. వెంటనే వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రులు డిమాండ్ చేశారు. మహిళల భద్రతను సమాధి చేసే చీకటి నిర్ణయం ‘దిశ’ను తొలగించడం అంటే కేవలం ఒక బిల్లును ఉపసంహరించడం కాదు చంద్రబాబు గారూ.. మీరు ఇచ్చిన మహిళలకు భద్రత, చిన్నారులకు రక్షణ, బాధితులకు త్వరిత న్యాయం అనే హామీని వెనక్కి తీసుకున్నట్టే. మహిళల భద్రతను సమాధి చేసే ఈ చీకటి నిర్ణయమిది. తక్షణమే మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. – పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఉపముఖ్యమంత్రి దిశ వ్యవస్థ వల్ల మహిళలకు జరిగిన నష్టం ఏమిటో చంద్రబాబు చెప్పాలి దిశ వ్యవస్థ వల్ల మహిళలకు జరిగిన నష్టం ఏమిటో ఒక్క ఉదాహరణ అయినా చెప్పగలరా చంద్రబాబూ? నష్టం లేకపోతే మహిళలకు అదనపు రక్షణ కల్పించే వ్యవస్థను ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు? మహిళలు, చిన్నారులపై అత్యంత తీవ్రమైన నేరాల్లో 21 రోజుల్లో దర్యాప్తు ప్రక్రియ పూర్తిచేయాలన్న లక్ష్యం తప్పా? మహిళ చేతిలోని భద్రత ఆయుధాన్ని నిరీ్వర్యం చేస్తున్న మీరు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. – మాజీ మంత్రి విడదల రజినిమహిళల భద్రతకు పెను విఘాతమే మహిళలు, చిన్నారులకు దిశ రూపంలో ఉన్న రక్షణ కవచాన్ని చంద్రబాబు ప్రభుత్వం తొలగించడం దుర్మార్గం. కేబినెట్ తీసుకున్న ఈ చీకటి నిర్ణయం మహిళల భద్రతకు పెను విఘాతమే. – జి. తనూజా రాణి, ఎంపీ చంద్రబాబు క్షమాపణ చెప్పాలి ఒక మహిళా హోం మంత్రిగా అనిత దిశ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సింది పోయి, దాన్ని తొలగించే నిర్ణయాన్ని సమర్థించడం దురదృష్టకరం. మహిళల నమ్మకాన్ని దెబ్బ తీసిన హోం మంత్రి అనిత వెంటనే రాజీనామా చేయాలి. మహిళల భద్రతను రాజకీయాలకు బలి చేసినందుకు చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. – కాకాణి పూజిత, వైఎస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రక్షణ కవచాన్ని తొలగించడం దుర్మార్గంమహిళలకు రక్షణ కల్పించాల్సిన కేబినెట్ వారి రక్షణ కవచాన్ని తొలగించడం దుర్మార్గం. మహిళల భద్రత కోసం దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచిన ‘దిశ‘ మోడల్‌ను ఏపీ ప్రభుత్వమే తొలగించడం సిగ్గుచేటు. – చింతా అనూరాధ, మాజీ ఎంపీ మహిళల విశ్వాసానికి పాతర వైఎస్ జగన్ మహిళల రక్షణ కోసం దిశ వ్యవస్థను నిర్మించారు. ఆ వ్యవస్థనే వెనక్కి తీసుకెళ్లడం చంద్రబాబుకు మహిళల భద్ర పట్టదనడానికి నిదర్శనం. మహిళల విశ్వాసాన్ని కేబినెట్ నిర్ణయంతో తుడిచి పెట్టేస్తున్న చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. – వరదు కల్యాణి, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు -
వైఎస్ జగన్‌ను ఎలా అడ్డుకుందాం?
సాక్షి, అమరావతి : మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలకు ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనపై గురువారం రాష్ట్ర మంత్రివర్గంలో విస్తృత చర్చ జరిగింది. అజెండా అంశాలు ముగిసిన తర్వాత మంత్రులతో ప్రత్యేక సమావేశంలో జగన్ పర్యటనలు, డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ చేస్తున్న ఆందోళనలపై చంద్రబాబు చాలాసేపు మాట్లాడారు. వైఎస్ జగన్ క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న స్పందనపై చంద్రబాబు చర్చించారు. ఆ పర్యటనలను తప్పుబడుతూ మాట్లాడాలని, అక్కడ జరిగిన విషయాలను ప్రజలకు వ్యతిరేకంగా చూపాలని ఆదేశించినట్లు తెలిసింది. ఉద్యమంపై బురద చల్లండి..! తాజాగా తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో వైఎస్ జగన్ పర్యటన అంచనాలకు అందని రీతిలో విజయవంతం కావడం, జనవాహిని పోటెత్తడంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఆ పర్యటలను నీరుగార్చేలా ప్రచారాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇక మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా డిమాండ్‌తో వైఎస్సార్సీపీ చేస్తున్న ఉద్యమంపై మంత్రులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది.ఇది ఇంకా తీవ్రమైతే ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుందని పేర్కొన్నట్లు తెలిసింది. యువతలో దీనిపై చర్చ జరుగుతోందని, ఇది జెన్‌జీని తీవ్ర స్థాయిలో ప్రభావితం చేస్తుందని మంత్రులు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఆ ఉద్యమంపై బురద జల్లాలని చంద్రబాబు మంత్రులకు సూచించనట్లు తెలిసింది. ఆ ఉద్యమంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు ఉన్నాయని ప్రచారం చేయాలని చెప్పినట్లు సమాచారం. వైఎస్సార్సీపీ నేతలకు రిజర్వేషన్ల గురించి తెలియదని చెప్పాలని ఆదేశించినట్లు తెలిసింది. మరోసారి పవన్ డుమ్మామంత్రివర్గ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి డుమ్మా కొట్టారు. గత మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. వరుసగా రెండు మంత్రివర్గ సమావేశాలకు ఆయన హాజరు కాకపోవడం కూటమిలో చర్చనీయాంశంగా మారింది. భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో ఆయన సమావేశంలో పాల్గొనలేదని టీడీపీ సర్దిచెప్పుకుంటున్నా పవన్ కావాలనే రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రివర్గ సమావేశాలకు దూరంగా ఉంటూ తన శాఖకు సంబంధించిన అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్షలు నిర్వహిస్తుండడం విశేషం. -
విద్య, వైద్యం ఇక ప్రైవేట్‌కే
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు విద్య, వైద్యం అందించాల్సిన సామాజిక బాధ్యత నుంచి తప్పుకొని ప్రైవేట్‌కు అప్పగిస్తోంది. ఇందుకోసం ఏకంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానం చట్టం తేవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం పీపీపీ విధానం – 2026 ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గం నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి అనంతరం మీడియాకు వెల్లడించారు. రవాణా, లాజిస్టిక్స్, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక వసతులు, వైద్యం, విద్య, పారిశ్రామికాభివృద్ధి, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం తదితర రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ నూతన పాలసీని తీసుకొస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.1.23 లక్షల కోట్ల విలువైన పీపీపీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పైప్‌లైన్‌లో ఉండగా ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆకర్షించి వేగంగా పట్టాలెక్కించేందుకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్)పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.1,500 కోట్లను కేటాయించిందని తెలిపారు. కేబినెట్లో తీసుకున్న ఇతర నిర్ణయాలు ఇలా.. » మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలపై వేగవంతమైన దర్యాప్తు, విచారణ నిమిత్తం గతంలో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు క్రిమినల్ లా (ఆంధ్రప్రదేశ్ సవరణ) బిల్లు, 2019 ఉపసంహరణకు ఆమోదం. » శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం కప్పలబండలో, అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం వలసపల్లెలో 2 ఎకరాల భూమి చొప్పున తెలుగుదేశం పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం ఏడాదికి రూ.1,000 లీజు చొప్పున 99 ఏళ్లు అప్పగించేందుకు ఆమోదం. » శాసనసభ, హైకోర్టు భవనాల కోసం కన్సల్టెన్సీ ఫీజుల కింద రూ.206.59 కోట్లు చెల్లించేందుకు సవరించిన పాలనా అనుమతికి ఆమోదం. » 2026–27లో రైతులకు యాన్యుటీల చెల్లింపు కోసం ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రూ.300 కోట్ల రుణాన్ని పొందేందుకు సీఆర్డీఏ కమిషనర్‌కు ఆమోదం. » రాజధానిలో ‘అమరావతి ఐ’ అభివృద్ధి టెండర్ తిరిగి పిలిచేందుకు అనుమతి. » రెండో దశ భూ సమీకరణ కింద పల్నాడు జిల్లా వైకుంఠపురంలో దేవదాయ ఈనాం భూముల వివాదాలను పరిష్కరించేందుకు రూ.122.20 కోట్ల పరిహారం చెల్లించేందుకు ఆమోదం. » 2027 గోదావరి పుష్కరాల్లో 238 స్నాన ఘట్టాల పనుల కోసం రూ.210.06 కోట్లతో పరిపాలనా అనుమతికి ఆమోదం. » గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడకలో 2,344.12 ఎకరాల భూమిలో, ఎర్రుపాలెం – నంబూరు మధ్య కొత్త బ్రాడ్ గేజ్ రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్ కోసం గ్రామసభ తీర్మానానికి అనుగుణంగా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ చేపట్టేందుకు సీఆర్డీఏ కమిషనర్‌కు అనుమతి. » శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో హంద్రీనీవా సుజల స్రవంతి రెండో దశ కింద 400.500 కి.మీ నుండి 485.300 కి.మీ వరకు ప్రధాన కాలువకు సంబంధించి మిగిలిపోయిన ఐదు పనులకు రూ. 600.48 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతి మంజూరు. » అమరావతి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్‌లోని క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌కు ఇరువైపులా ట్విన్ ఆఫీస్ టవర్స్ నిర్మాణాన్ని ఎల్–1 బిడ్డర్‌కు ఇచ్చేందుకు ఆమోదం. » ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్.. హడ్కో మంజూరు చేసిన రూ.680.21 కోట్లు టర్మ్ రుణం పొందేందుకు ఆమోదం. » రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, వాణిజ్య కార్యకలాపాల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఆమ్నిబస్ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) చట్టం, 2026 రూపకల్పనకు ఆమోదం. » ఆక్వా కల్చర్ ఫామ్‌లకు యూనిట్ రూ.1.50 చొప్పున విద్యుత్ రాయితీ 01.06.2026 నుంచి పొడిగించేందుకు ఆమోదం. » నూతన జిల్లాల పరిధికి అనుగుణంగా పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థలను పునర్వ్యవస్థీకరించేందుకు ఆమోదం. దీంతో పట్టణాభివృద్ది సంస్ధలు 21 నుంచి 23కు పెరగనున్నాయి. » నూతన జిల్లాలకు అనుగుణంగా 15 జిల్లా విద్యాశాఖాధికారి పోస్టులను సృష్టించడానికి ఆమోదం. -
ఆ శ్వేతపత్రం అబద్ధాల పుట్ట
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం అంతా తప్పుల తడక అని, ఒక అబద్ధాల పుట్ట అని కనీసం ఆ లెక్కలకు ఆధారాలు కూడా చూపించలేకపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు దువ్వూరి కృష్ణ ఆక్షేపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని దాచిపెట్టి చంద్రబాబు మరోసారి అంకెల గారడీ చేశారని ఆయన దుయ్యబట్టారు. గత వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందంటూ మరోసారి పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. కాగ్, ఇతర ఆర్థిక సంస్థల లెక్కలు చూస్తే ఎవరి పాలనలో విధ్వంసం జరిగిందో ఇట్టే అర్థం అవుతోందని చెప్పారు. శ్వేతపత్రం పేరుతో సీఎం చంద్రబాబు విషంకక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే.. అన్నీ కాకిలెక్కలే.. ‘‘రెండేళ్లలో సూపర్ సిక్స్ పథకాల ఖర్చు రూ.31,483 కోట్లే. వాస్తవంగా ఖర్చు చేయాల్సింది రూ.2,39,628 కోట్లు. అంటే మొత్తం హామీల అమలు ఖర్చులో అది 13 శాతమే. తల్లికి వందనంలో రూ.15 వేలకు బదులు రూ.13 వేలు అంటూ.. రూ.8 – 9 వేలే ఇచ్చారు. డ్వాక్రా రుణ పరిమితి పెరగలేదు. సున్నా వడ్డీకి నిధులివ్వరు. రాష్ట్ర అప్పులపై చంద్రబాబు ఇంకా దు్రష్పచారం చేస్తున్నారు. రూ.14 లక్షల కోట్లు అన్నారు. పుస్తకాల గణాంకాల్లో చూస్తే రూ.6.46 లక్షల కోట్ల అప్పు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పు చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లలోనే దాటేశారు. వైఎస్సార్సీపీ పాలనలో ఆర్థిక సంఘం నిధులు ఎక్కువగా వాడేసినట్లు అబద్ధాలు చెబుతున్నారు. వ్యవసాయ రంగం ఆదాయంపైన, తలసరి ఆదాయంపైనా చంద్రబాబు కాకి లెక్కలు చెబుతున్నారు. కూటమి పాలనలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా అస్తవ్యస్తమైంది. జీఎస్డీపీ వృద్ధి నాడు వైఎస్సార్సీపీ హయాంలో అగ్రస్థానంలో రాష్ట్రం ఉండేది. అయినా విధ్వంసం అంటూ చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడానికే చంద్రబాబు కుట్ర. అందుకే జీతభత్యాలపై అసత్యాలు, తప్పుడు లెక్కలు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆస్తుల్ని తాకట్టు పెట్టిందని అబద్ధాలు చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఇదే వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం రూ.9 వేల కోట్ల రుణం కోసం ఏకంగా రూ.1.91 లక్షల కోట్ల ఖనిజ సంపదను తాకట్టు పెట్టింది. కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం ఏపీకి రూ.1.78 లక్షల కోట్లు పీపీపీ విధానంలో వచ్చాయి. ఇందులో 41 శాతం పెట్టుబడులు ఇప్పటికే ఉపసంహరించుకున్నారు. 30 శాతం ప్రీ డీపీఆర్ స్థాయిలో ఉన్నాయి. కేటాయించినవి ఐదు ప్రాజెక్టులు మాత్రమే. మరో రూ.14 వేల కోట్లు రెడీగా ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో 8 ప్రభుత్వ ఆస్పత్రులు, రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టులు మాత్రమే. ఇవి ఏ రకంగా మీ ఘనతో చెప్పాలి’’ అని దువ్వూరి పేర్కొన్నారు. ఆర్బీఐ బాండ్ల వడ్డీ రేటు కంటే చంద్రబాబు ప్రభుత్వమే ఎక్కువ వడ్డీకి రుణాలు తెస్తోందన్నారు. అబద్ధాల శ్వేతపత్రం పేరుతో డ్రామా చేశారని ఆయన వివరించారు. -
APలో దిశా బిల్లు రద్దు.. హోంమంత్రి ప్రకటన
-
‘ఎన్ఆర్ఐ మహిళను వేధించిన ఆ మంత్రిపై చర్యలేవీ?’
సాక్షి, తాడేపల్లి: అమెరికాలోని డల్లాస్‌లో రాష్ట్ర మంత్రి ఒకరు తనను వేధించారంటూ ‘ప్యూర్’ (పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్) సంస్థ వ్యవస్థాపకురాలు, ఎన్ఆర్ఐ డాక్టర్ శైలా తాళ్లూరి మంత్రి నారా లోకేష్‌కు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేసినా, ఇప్పటి వరకు వెన్నుపోటు పార్టీ కానీ, ఈ ప్రభుత్వం కానీ స్పందించలేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగ మల్లీశ్వరి ఆక్షేపించారు.ఎన్ఆర్ఐ అయిన తెలుగు మహిళను వేధించిన ఆ మంత్రిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు, ఆయనపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మహిళల భద్రతను పూర్తిగా గాలికొదిలేసిందని, వారు అధికారంలోకి వచ్చిన 26 నెలలుగా మహిళలపై వేధింపులు, దాడులు, అవమానాలు పెరిగిపోయాయని చెప్పారు. మహిళలను రక్షించాల్సిన ప్రజాప్రతినిధులే నిత్యం వేధింపులకు పాల్పడుతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాగ మల్లీశ్వరి గుర్తు చేశారు. ఆమె ఇంకా ఏం మాట్లాడారంటే..అమెరికాలోని డల్లాస్‌లో వెన్నుపోటు పార్టీకి చెందిన ఓ మంత్రి తనను వేధించారంటూ ఎన్ఆర్ఐ తెలుగు మహిళ సోషల్ మీడియాలో తీవ్రమైన ఆరోపణలు చేసినా, ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే మహిళల రక్షణకు ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు అద్దం పడుతోంది. ఆ మహిళను ఒంటరిగా కాఫీకి రావాలని పిలవడం, ఫొటోలు పంపి ఇబ్బంది పెట్టడం వంటి ఆరోపణలను సైతం వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం చాలా తేలిగ్గా తీసుకోవడం అత్యంత హేయం.ఇంత జరిగినా వెన్నుపోటు పార్టీ తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తోంది. బాధిత మహిళ సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, హోం మంత్రి అనిత తదితరులని ట్యాగ్ చేస్తూ న్యాయం కోసం అభ్యర్థించినా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం స్పందించక పోవడం హేయం.రాష్ట్రంలో మహిళలపై అన్యాయం జరిగిన ప్రతిసారీ తిరిగి బాధితుల పైనే కేసులు పెట్టే పరిస్థితిని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. మహిళా కమిషన్, హోం శాఖ, మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థలు ప్రజల కోసం కాకుండా అధికార వెన్నుపోటు పార్టీ నాయకుల కోసం మాత్రమే పని చేస్తున్నాయనే భావన కలుగుతోంది.వెన్నుపోటు పార్టీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. ఇప్పుడు అవి సరిహద్దులు కూడా దాటాయి. చివరకు అమెరికాలో సైతం ఏకంగా రాష్ట్ర మంత్రి, ఒక ఎన్ఆర్ఐ మహిళను వేధించడం వెన్నుపోటు పార్టీ, ఈ ప్రభుత్వ ఉన్మాదానికి పరాకాష్ట. వెన్నుపోటు పార్టీ ప్రభుత్వానికి ఏ మాత్రమైనా నైతికత ఉంటే, తక్షణమే ఆ మంత్రిని బర్తరఫ్ చేసి, కేసు పెట్టి విచారణ చేయాలని నాగ మల్లీశ్వరి డిమాండ్ చేశారు. -
అది పచ్చి అబద్ధం.. చిరంజీవి టీమ్ క్లారిటీ
-
మా హోటల్ ని ఎవరూ పాడు చేయలేదు.. అసలు ఏమి జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పిన నిర్వాహకులు
-
N (NARA) ట్యాక్స్ దెబ్బకు భారీ పరిశ్రమలన్నీ పారిపోతున్నాయి
-
మీ ప్రభుత్వం చేసే కంపును ఎన్ని రోజులు ఇసుకేసి ఆపుతారు పేర్ని నాని ఫైర్
-
దిశా చట్టం రద్దు.. చంద్రబాబు కేబినెట్ నిర్ణయం
సాక్షి, అమరావతి: దిశా చట్టాన్ని రద్దు చేయాలని చంద్రబాబు కేబినెట్ నిర్ణయించింది. దిశా చట్టం ప్రత్యేకంగా అవసరం లేదని రద్దుచేస్తున్నట్టు హోంమంత్రి ప్రకటించారు. దిశ చట్టం లేకుండానే దిశ వ్యవస్థను ఆచరణలో పెట్టినట్టు వెల్లడించారు. బిఎన్ఎస్ చట్టాలు చాలు కాబట్టి దిశ చట్టం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మహిళలను వేధించే వారికి త్వరగా శిక్షపడేలా గత ప్రభుత్వం దిశా బిల్లు తీసుకొచ్చింది. అయితే, 21 రోజుల్లో శిక్ష పడేలా తీసుకొచ్చిన మార్పును హోంమంత్రి అనిత తప్పుపట్టారు.అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్కాగా, అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్‌కి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2,433 ఎకరాల భూ సమీకరణ చేపట్టాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మోతడక గ్రామంలో భూ సమీకరణ చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హైస్పీడ్ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ పేరుతో భూ సమీకరణకు నిర్ణయించింది. హైకోర్టు భవనాన్ని మళ్లీ రీ డిజైన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 206 కోట్లతో అదనపు కన్సల్టెంట్‌ను నియమించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. -
చంద్రబాబు శ్వేతపత్రం అబద్ధాల పుట్ట.. ఆథారాలతో బయటపెట్టిన దువ్వూరి కృష్ణ
-
దమ్ముంటే ఆ మంత్రిని తొలగించు.. బాబుకు వరుదు కళ్యాణి సవాల్
-
గుర్తుపెట్టుకో ఇదే పోలీసులతో నీకు... బొండా ఉమా కు YSRCP స్ట్రాంగ్ వార్నింగ్
-
TDP దాడుల వెనుక కారణం ఇదే .. లోకేష్ రాజీనామా తప్పదా TDPలో ఏం జరుగుతోంది?
-
మరోసారి కేబినెట్ భేటీకి పవన్ గైర్హాజరు
సాక్షి, విజయవాడ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై మరోసారి రాజకీయ దుమారం రేగుతోంది. చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి పవన్ కళ్యాణ్ మరోసారి గైర్హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరుకాకపోవడం ఇది వరుసగా మూడోసారి. గతంలో జరిగిన రెండు మంత్రివర్గ సమావేశాలకు కూడా ఆయన రాలేదు.గతంలో రెండు సార్లు కేబినెట్ సమావేశాలు జరుగుతుండగానే పవన్ కళ్యాణ్ మధ్యలోనే వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి నుంచి చంద్రబాబు నిర్వహించే ప్రభుత్వ సమీక్షలు, కేబినెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు.ఇటీవల ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. సీఎం చంద్రబాబు సమీక్షలు, కేబినెట్ సమావేశాలకు ఆయన వరుసగా గైర్హాజరవుతుండటం కూటమి సర్కార్‌లో అసలేం జరుగుతోంది?. అంతర్గత విభేదాలు ఏమైనా ఉన్నాయా? అనే అనుమానాలకు తావిస్తోంది. వరుసగా మూడు కేబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం డుమ్మా కొట్టడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. -
టీడీపీ అంటే తెలుగు దుశ్శాసన పార్టీ: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖ: టీడీపీ అంటే తెలుగు దుశ్శాసన పార్టీ అని మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. ఒక మహిళను టీడీపీ మంత్రి వేధించడం దారుణం. కూటమిది మంత్రి వర్గమా లేక వేధింపుల వర్గమా అనే అనుమానం కలుగుతోంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆ మంత్రిని వెంటనే భర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి స్థానంలో ఉన్న ఓ వ్యక్తి.. ఎన్ఆర్ఐ మహిళను వేధించడమేంటి?. తన సేవల కోసం వివరించడానికి ఒక మహిళ తన టీమ్‌తో వస్తానంటే ఆమెను మాత్రమే సదరు ఒంటరిగా రమ్మని చెప్పారంట. వెంటనే ఆ మంత్రిని బర్తరఫ్ చేయాలి. టీడీపీ అంటే తెలుగు దుశ్శాసన పార్టీ. ఆ మంత్రిపై కేసు పెట్టి విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కూటమి నేతలు మన రాష్ట్ర పరువును విదేశాల్లో కూడా తీస్తున్నారు. మహిళల గౌరవం విషయంలో ఇంత జరిగినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?.చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే ఆ మంత్రిని వెంటనే భర్తరఫ్ చేయాలి. ఇంత పెద్ద తప్పు చేసిన మంత్రిని రోడ్డుపై నడిపిస్తారా?. మేక, కోడిని కోస్తే మా పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి రోడ్డుపై నడిపించారు. ఇప్పుడు ఈ మంత్రి విషయంలో ఏం చేస్తారు?. కేబినెట్లో ఉన్న ముగ్గురు మహిళా మంత్రులు ఆ వేధింపుల మంత్రిని మెడ పట్టుకొని బయటకు గెంటేసే దమ్ముందా?. మహిళలపై ఈగ వాలితే నేనుంటా అన్న పవన్ కళ్యాణ్ ఏమయ్యారు?. ఈ విషయంలో ఎందుకు స్పందించలేదు.ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకపోగా వేరే దేశంలో ఉన్న తెలుగు మహిళలను మంత్రులు వేధిస్తున్నారు. కూటమి పాలనలో అడుగుకొక కీచకుడు ఉన్నాడు. మా ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు పెట్టడం కోసం టీడీపీ నేత తన భార్య బట్టలు చింపేసాడు. అరవ శ్రీధర్ విషయంలో కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా చర్యలు ఉండవని అంతా అనుకుంటున్నారు. ఆ మంత్రి పేరు బయటపెట్టాలి.. కేసు పెట్టాలి.. మంత్రివర్గం నుంచి ఆయన్ను భర్తరఫ్ చేయాలి. ఒక ఎన్ఆర్ఐ మహిళ తన ఆవేదన చెప్పుకుంటుంటే టీడీపీ సైకోలు పోస్టులు పెట్టి ఆమెను వేధిస్తున్నారు అంటూ మండిపడ్డారు. -
జగన్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు.. అసహనమా? భయమా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ సమావేశాలలో ఏమని చెబుతుంటారో కాని, ఎల్లో మీడియాలో మాత్రం వచ్చే కధనాలు చూస్తే మాత్రం ఆయన ఇలా మాట్లాడడమేమిటా అనిపిస్తుంది. సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా , ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రిని ఇంతలా కించపరిచేలా ప్రసంగాలు చేస్తున్నారంటే అది ఆయనలోని భయం తెలియచేస్తుంది తప్ప మరొకటి కాదన్న అభిప్రాయం కలుగుతుంది. కొద్ది రోజుల క్రితం పార్టీ యూనిట్ ఇన్జార్జీల శిక్షణ తరగతులలో ఆయన స్పీచ్ ఇచ్చిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఆయనకు కూడా తగులుతాయన్న సంగతి మర్చిపోతున్నట్లుగా ఉంది. జనం ఛీకొట్టినా జగన్ ఇంతే అంటూ చంద్రబాబు మాట్లాడారని ఎల్లో మీడియాకు చెందిన ఒక పత్రిక హెడింగ్ పెట్టింది. ప్రజల మనోభావాలు గొడ్డలి పార్టీకి పట్టవు అని చంద్రబాబు అన్నట్లు మరో ఎల్లో మీడియా రాసింది. రాజకీయాలలో జనం ఛీకొట్టడం ఏమిటి? గెలుపుఓటములు అన్నవి సహజంగానే ఉంటాయి కదా!అంత మాత్రాన రాజకీయ పార్టీలు తమ కార్యకలాపాలను మానివేస్తాయా?ప్రజలలోకి వెళ్లకుండా ఉంటాయా?జగన్ శ్రీకాకుళం టూర్‌పై ఆయన తన అసహనం వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి ప్రధాని వస్తుంటే, జగన్ రెండు రోజుల ముందు ఈ టూర్ పెట్టుకోవడమని ఆయన ప్రశ్నించారట. అదేమిటి? ఈ కార్యక్రమానికి, జగన్ యాత్రకు సంబంధం ఏమిటి?అసలు సమస్య జగన్ కు జనం విపరీతంగా రావడం అన్నమాట. తమ సభలకు జనాన్ని బస్ లలో తరలించాల్సి వస్తుంటే జగన్ కు స్వచ్చందంగా ప్రజలు వస్తుండడం ఏమిటని ఆయనకు అనిపించవచ్చు. భోగాపురం సభకు జనాన్ని తీసుకురావడానికి వందల బస్సులు పెట్టడాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. జగన్‌కు జనంలో అంత విలువ,ఆదరణ ఉందేమిటన్నదే ఆయన కంగారుగా ఉంది. అది ఆయన బాధ. జగన్ యాత్రకు జనం రాకపోయి ఉంటే, ఇదే చంద్రబాబు ఏమనేవారు!ప్రజలు ఎవరూపట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించేవారా?కాదా? 2024లో ఎన్నికలలో ఏ కారణంతో అయితేనేమి.. వైఎస్సార్సీపీ ఓడిపోయిన మాట నిజమే కావచ్చు. కాని కూటమి అదికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ఎందుకు వ్యతిరేకత తెచ్చుకుంది. ఈ రెండేళ్లకాలంలో జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు పోటెత్తుతున్నారే?దీనిపై ఆలోచించకుండా జగన్ ను తిడితే ఏమి ప్రయోజనం వస్తుంది. చంద్రబాబు చెబుతున్న దాని ప్రకారం ఏదైనా పార్టీ ఓడిపోతే జనంలోకి వెళ్లకూడదా!మరి తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయింది కదా! అయినా అవకాశం ఉన్నా,లేకపోయినా, కావాలని కల్పించుకుని టూర్లు పెట్టుకుని ఎన్నిచోట్ల చంద్రబాబు అలజడులు సృష్టించారో తెలియదా!ఆయన చేస్తే అది ప్రజాస్వామ్యం.. ఎదుటివారు వెళితే అది ఇంకొకటి అవుతుందా!తెలుగుదేశం పార్టీ1983లో ఆవిర్భావం తర్వాత ఎన్నిసార్లు ఓటమికి గురైందో గుర్తు లేదా! ఉమ్మడి ఏపీలో 1989లో టీడీపీ అదికారం కోల్పోయింది. స్వయంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు కల్వకుర్తిలో పరాజయం చెందారు. ఆయన నుంచి పార్టీని గుంజుకున్న తర్వాత 2004లో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ఓడిపోయిందే!2009లో ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసి టిఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నా మళ్లీ ఎందుకు ఓడిపోయింది? రాష్ట్ర విభజన తర్వాత 2019లో ఓడిపోయింది కనుక చంద్రబాబు ప్రజలలోకి వెళ్లకుండా లేరే! పార్టీ క్యాడర్‌ను ఆయా సందర్భాలలో ఎలా రెచ్చగొట్టారో తెలియదా!మరో మాట చెప్పాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం పులివెందుల నుంచి 1978 నుంచి గెలుస్తూనే వస్తోంది. జగన్ ఒకసారి ఎంపీగా రాజీనామా చేసి తరిగి పోటీచేస్తే 5.45 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. చంద్రబాబు 1978లో చంద్రగిరి నుంచి గెలిచినా, 1983లో ఓడిపోయారు. ఆ తర్వాత అక్కడ నుంచి కుప్పం ను తన స్థావరంగా మార్చుకున్నారు. ఎందుకు సొంత నియోజకవర్గం వదలిపెట్టారో ఎప్పుడైనా చెప్పారా!అందువల్ల చంద్రబాబు తను చేసే విమర్శలు తనకే తగులుతాయన్న సంగతి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది కదా! ఇక ఈ మధ్య టీడీపీ ఎమ్మెల్యేలు కొందరిపై వస్తున్న ఆరోపణలు ఒక ఎత్తు అయితే, కూటమి ప్రభుత్వంపై ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులురెడ్డి చేసిన తీవ్ర ఆరోపణలు సంచనలంగా ఉన్నాయి. ప్రభుత్వంలో పెరిగిపోయిన అవినీతిని ఆయన ఎండగట్టారు.బహుశా ఆయనను దృష్టిలో ఉంచుకునేనేమో , పార్టీ టిక్కెట్ ఇచ్చింది కాబట్టే హీరోలు, లేకుంటే జీరోలే అని హెచ్చరించినట్లు అనిపించింది. పార్టీకి నష్టం కలిగించేవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. వరదరాజులరెడ్డి సీనియర్ నేత. ప్రొద్దుటూరు నుంచి పలుమార్లు గెలిచారు. ఆయన పార్టీకి నష్టం చేసేలా మాట్లాడారా? లేక ప్రభుత్వంలోని అవినీతిని ఎత్తి చూపారా?ముద్రగడ పద్మనాభం సంతాప సభలకు కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు,నేతలు వెళ్లడంపై కూడా ఆయన అసహనంగా ఉన్నారన్నది తెలిసందే. వారందరి గురించి పరోక్షంగా ఆయన మాట్లాడినట్లు ఉంది. అయితే చంద్రబాబు వ్యాఖ్యలను ఆ ఎమ్మెల్యేలు కూడా అంత సీరియస్ గా తీసుకుంటారా?లేదా?అన్నది చర్చనీయాంశమే. ఎందుకంటే పార్టీలో, ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో వారికి కూడా బాగానే తెలుస్తుంది కదా!నిత్యం వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అని సంభోధించి ఆత్మానందం చెందుతున్నారేమో తెలియదు. దానికి ప్రతిగా కొందరు వైఎస్సార్సీపీ నేతలు టీడీపీని బూడిద పార్టీ అని, వెన్నుపోటు పార్టీ అని అడ్రస్ చేస్తున్నారు జగన్ పైన, వైఎస్సార్సీపీ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చంద్రబాబు అలవాటుగా మార్చుకు్న్నారు. అయినా జగన్ పర్యటనలకు . జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారంటే తన వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని చంద్రబాబు అర్ధం చేసుకుంటే మంచిది కదా.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబు ప్రభుత్వంలో కూడు దొరకడం లేదు
సాక్షి, రాజమహేంద్రవరం: ‘మీ పాలనలో కడుపు నిండా అన్నం తిన్నాం సార్.. చంద్రబాబు ప్రభుత్వంలో కూడు దొరకడం లేదు.. గిట్టుబాటు ధరా దక్కడం లేదు.. ఆత్మహత్యలే శరణ్యం సార్..’ అంటూ పొగాకు రైతులు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్వాకం కారణంగా మద్దతు ధర దక్కక ఆర్థికంగా చితికిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకుకు కనీస గిట్టుబాటు ధర దక్కక ఇక్కట్లు పడుతున్న రైతులతో నేరుగా మాట్లాడి ధైర్యం చెప్పడానికి బుధవారం వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలోని పొగాకు కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా రైతులు తమ అభిమాన నేత వైఎస్ జగన్‌ను చూడగానే కష్టాలు ఏకరువు పెట్టారు. ‘ఈ పాలన ఏం బాగోలేదన్నా.. మీరొస్తేనే రైతు రాజ్యం వస్తుందన్నా.. మీ హయాం అన్నదాతలకు స్వర్ణ యుగం అన్నా..’ అంటూ తమ ఆవేదన చెప్పుకున్నారు. ఈ సందర్భంగా అన్నదాతల ఆవేదన వారి మాటల్లోనే..మీరొస్తున్నారని రూ.10 పెంచారుపొగాకు రైతులు మిమ్మల్ని అమరావతిలో కలిశాక.. మీరు దేవరపల్లి వస్తున్నారని తెలుసుకుని చంద్రబాబు ప్రభుత్వం కిలోకు రూ.10 మద్దతు ధర పెంచింది. అయితే గ్రేడింగ్ పేరిట వ్యాపారులు ఆ మేరకు అంటే రూ.10 తగ్గించేశారు. ఈ ప్రభుత్వ మాయాజాలం ఇలా ఉంటోంది. ప్రస్తుతం కిలో రూ.170 నుంచి రూ.260 మధ్య కొనుగోలు చేస్తున్నారు. యావరేజ్ ధర రూ.230 కూడా రావడం లేదు. ఎకరాకు రూ.3 లక్షలపైనే ఖర్చవుతోంది. వ్యాపారులు సిండికేట్‌గా మారి నాణ్యమైన పొగాకును సైతం కిలో రూ.230కే తీసుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో సిండికేట్ వ్యాపారులకే మేలు జరుగుతోంది. సామాన్య రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. – జక్కుల భద్రం, కౌలు రైతు, దేవరపల్లిమన ప్రభుత్వంలో యావరేజ్ రూ.365 అన్నా.. మన ప్రభుత్వంలో దేవరపల్లి బోర్డు పరిధిలో కిలో పొగాకుకు గరిష్టంగా రూ.385 దక్కింది. యావరేజ్‌గా రూ.365 దక్కేది. ఇప్పుడా పరిస్థితి లేనే లేదు. గ్రేడింగ్ పేరుతో వ్యాపారులు సిండికేట్‌గా మారి దోచేసుకుంటున్నారు. కిలోకు ఒక్కోసారి రూ.170 కూడా దక్కడం లేదు. గరిష్టంగా రూ.260 దాటడం లేదు. 20 ఎకరాల్లో పంట సాగు చేశాను. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయాను. – సుంకవిల్లి వెంకట శ్రీనివాసరావు, సంగాయి గూడెం, దేవరపల్లి‘వడ్డీ లేని రుణం’ పథకం తీసేశారుమీరు దేవరపల్లి పర్యటనకు వస్తున్నారని చంద్రబాబు హడావిడిగా రూ.50 వేలు రుణం వడ్డీ లేకుండా ఇస్తానని ప్రకటించాడు. ఆ రూ.50 వేలు మూడేళ్లలో ఇస్తారంట. మన ప్రభుత్వంలో ఏడాదికి రూ.లక్ష వడ్డీ లేకుండా రుణాలిచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆ పథకాన్ని పూర్తిగా ఎత్తేసింది. రైతులు వ్యవసాయం మానేసేలా చేస్తోంది. – వల్లభనేని సత్యనారాయణ, పొగాకు రైతు, గోపాలపురంమీరొస్తేనే మంచి రోజులుకేజీ పొగాకు సాగు చేసేందుకు రూ.300 ఖర్చవుతుంటే... ఇక్కడ యావరేజ్‌గా రూ.230కే కొంటున్నారు. లో గ్రేడ్ పేరుతో వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను దోచుకుంటున్నారు. వచ్చే ఏడాది నుంచి సాగు విస్తీర్ణం తగ్గించేయమంటున్నారు. టొబాకో బోర్డు గతంలో ఒక్కో రైతు నుంచి 40 క్వింటాళ్లు కొంటామని చెప్పి.. ప్రస్తుతం 20 క్వింటాళ్లే కొంటామంటోంది. వచ్చే ఏడాది పది క్వింటాళ్లే కొంటామంటున్నారు. రైతులు ఇంత అన్యాయానికి గురవుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నా సరే మా కోసం వచ్చారు. మళ్లీ మీరు అధికారంలోకి వస్తేనే మాకు మంచి రోజులొస్తాయి. – వైఎస్ జగన్‌తో పలువురు రైతులు -
మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు
ఆంధ్రప్రదేశ్: గుంటూరు తూర్పు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, ఆయన తనయుడు బషీర్‌పై నూజివీడు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం గుజరాత్లో ఉన్న ముస్తఫాను పోలీసులు అదుపులోకి తీసుకుని నూజివీడుకు తీసుకొచ్చారు.అనంతరం ఆయనను నూజివీడు కోర్టులో హాజరుపరచగా, కేసును విచారించిన న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ముస్తఫాను నెల్లూరు జైలుకు తరలించారు. కాగా, ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ న్యాయస్థానంలో కొనసాగనుంది. -
వృద్ధురాలి ప్రాణం తీసిన రీసర్వే
కర్నూలు(సెంట్రల్): చంద్రబాబు ప్రభుత్వం అడ్డదిడ్డంగా చేపడుతోన్న రీసర్వే ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్లకు చెందిన చాకలి ఈరమ్మ (80) భర్త పెద్ద మల్లన్నకు 2.50 ఎకరాల భూమి ఉంది. 1962లో కటకం లక్ష్మయ్య, కటకం నరసింహులు నుంచి పెద్దమల్లన్న 26 సెంట్ల భూమిని కొనుగోలు చేశాడు. అయితే 1970లో కటకం నరసింహులు ఆ భూమిని గొల్ల సంజన్నకి కూడా రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇటీవల గ్రామంలో రీసర్వే జరగ్గా..ఈ 26 సెంట్ల భూమిని గొల్ల సంజన్న కుమారులు నారాయణ, రంగస్వామి, రామాంజనేయుల పేరిట చూపించింది. దీంతో ఈరమ్మ, గొల్ల సంజన్న కుమారుల మధ్య వివాదం తలెత్తింది. 60 ఏళ్ల నుంచి తన ఆధీనంలోనే ఉన్న పొలాన్ని వారికి ఎలా ఇవ్వాలని తహశీల్దార్, వీఆర్వోకు ఈరమ్మ మొరపెట్టుకుంది. ఆమె విన్నపాన్ని పట్టించుకోకపోవడంతో ఈరమ్మ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో గొల్ల సంజన్న కుమారులు స్థానిక టీడీపీ నేతలు కావడంతో వారి పేరిట భూమి మార్పిడి చేయాలని తహశీల్దార్‌పై ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఒత్తిడి చేశారు. దీంతో అధికారులు ఈరమ్మ పేరిట ఉన్న భూమిని గొల్ల సంజన్న కుమారులకు మార్పు చేసి పాసు పుస్తకం ఇచ్చేశారు. ఆ భూమిని జూలై 30న ఆక్రమించుకోవడానికి వెళ్లి అక్కడున్న ఈరమ్మను దుర్భాషలాడి..అవమానించి.. పురుగుల మందు ఇచ్చి చావాలని ఎగతాళి చేశారు. దీంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురై వారిచ్చిన పురుగుల మందు తాగేసింది. దీంతో ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతదేహానికి పంచనామా చేయడంలో తాత్సారం జరుగుతుండటంతో ఈరమ్మ కుటుంబ సభ్యులు బుధవారం ధర్నాకు దిగారు. దీంతో వైద్యులు పోస్టుమార్టం చేశారు. అనంతరం అక్కడి నుంచి రజకులు, ప్రజా సంఘాల నేతలు ఆమె మృతదేహంతో కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈరమ్మ చావుకు కారణమైన గొల్ల సంజన్న కుమారులు, గోనెగండ్ల తహశీల్దార్, వీఆర్వో, షాడో ఎమ్మెల్యేగా పిలవబడే ఆప్నా బజార్ శేఖర్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఆర్వో వెంకటనారాయణమ్మ అక్కడికి వచ్చి ఈ ఘటనపై ఆదోని ఆర్డీవోతో విచారణ చేయిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
తమాషాలు చేస్తున్నారా? పోలీసులపై అమర్నాథ్ ఫైర్!
-
రాసిపెట్టుకోండి.. ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కడే రారాజు
-
రెండేళ్లలో మీ వల్ల జరిగింది ఇదే.. ! PIB రిపోర్ట్ చదివి వినిపించిన YS జగన్
-
జైల్లో పెడితే భయపడిపోతామా..?" ఏం పీక్కుంటారో పీక్కోండి.. మాస్ వార్నింగ్
-
కాస్కో చంద్రబాబు Gen-Zరెడీ.. ఇక యుద్ధమే
-
మిర్చి తింటే అసిడిటీ.. మ్యాంగో తింటే షుగర్ బాబుపై జగన్ సెటైర్లు అదుర్స్
-
కత్తులు దూస్తున్న స్థానిక కురుక్షేత్రం!
సాక్షి, మదనపల్లె : స్థానిక సంస్థల ఎన్నికల ముచ్చట తెరపైకి రాగానే ఉమ్మడి జిల్లాలోని ఆశావాహుల్లో ఒక్కసారిగా ఉత్సాహం నెలకొంది. టికెట్ ఆశిస్తున్న నేతలు అప్పుడే ముఖ్య నాయకులను, ముఖ్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా మారిపోయారు. క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలు చేస్తూ.. గ్రామస్థాయిలోని చోటా లీడర్లను ఎలాగైనా తమ వైపు తిప్పుకునేందుకు సామ దాన బేధ దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అప్పుడే శక్తికి మించిన హామీలు గుప్పిస్తున్నారు. వీలైనన్ని చోట్ల బెదిరింపులతోనో, ప్రలోభాలతోనో ఏకగ్రీవాలు చేసుకోవాలని ఇప్పటి నుంచే తెరవెనుక పావులు కదుపుతుండటం గమనార్హం. నోటిఫికేషన్ రాకముందే క్షేత్రస్థాయిలో ఈ రేంజ్ పొలిటికల్ హీట్ ఉంటే, ఇక నోటిఫికేషన్ వెలువడ్డాక ఇంకెంత సందడి నెలకొంటుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. కోర్టు మొట్టికాయలతోనే ‘స్థానిక’ చలనంరాష్ట్రంలో అక్టోబరులో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన హఠాత్ ప్రకటన వెనుక అసలు గుట్టు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిబంధనల ప్రకారం.. స్థానిక సంస్థల పాలకవర్గాలు రద్దు కాగానే నిర్దిష్ట గడువులోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలకు వెళితే ఘోరమైన ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే ఊహించి, రకరకాల కుంటిసాకులతో ఎన్నికలను ఇన్నాళ్లూ వాయిదా వేయిస్తూ వచ్చింది. అయితే, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) తీవ్రంగా జోక్యం చేసుకుని గడువు విధించడంతో.. ఇప్పుడు కూటమి సర్కారుకు ఎన్నికలకు వెళ్లక తప్పని సరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.అసలు అక్టోబర్‌లో ఎన్నికలు సాధ్యమేనా?స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ఓవైపు చెబుతున్నప్పటికీ.. ఆచరణలో అది ఇప్పట్లో సాధ్యం కాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు నిర్వహించాలంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారు కావాల్సి ఉంది. దీనికి తోడు ఓటర్ల జాబితాకు ఇంకా తుది రూపమే రాలేదు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా ముసాయిదా జాబితాను గత నెల 31న విడుదల చేశారు. ఈ ప్రక్రియ ప్రకారం రాబోయే అక్టోబరు 3 న మాత్రమే ఓటర్ల తుది జాబితా వెలు వడనుంది. ఆ తర్వాతే పంచాయతీల వారీగా ఓటర్ల సంఖ్యను విడదీసి తేల్చాల్సి ఉంటుంది. అంతవరకు అసలు నోటిఫికేషన్ ఇచ్చేందుకే వీలుపడదు.సాంకేతిక అవరోధాల నడుమ చంద్రబాబు ‘స్థానిక’ రాజకీయంరాష్ట్రంలో అక్టోబరులో స్థానిక సంస్థల ఎన్నికలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్న మాటలు ఆచరణలో సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు తేలి్చచెబుతున్నారు. ఎన్నికల నిర్వహణకు ముందు పూర్తి కావాల్సిన మున్సిపల్ చైర్మన్లు, వార్డుల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ఇంకా ఎక్కడికక్కడే నిలిచిపోయింది. మరోవైపు వచ్చే సెప్టెంబరులో మండల పరిషత్‌ల పదవీ కాలం ముగియనుంది. ఆ తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల పరిషత్ అధ్యక్ష పదవులకు రిజర్వేషన్లు తేల్చాల్సి ఉంది. ఇవన్నీ కాకుండా ఓట్ల సవరణ (సర్) ప్రక్రియ కూడా ఇంకా పూర్తి కాలేదు. పంచాయతీల కాలపరిమితి ఎప్పుడో ముగిసినప్పటికీ, ఓట్ల జాబితా తేలకుండా ఎన్నికల సంఘం అనుమతితో ప్రక్రియ చేపట్టడం కూడా అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో, అక్టోబరులో ఎన్నికలు జరగడం అసాధ్యమనే స్పష్టత వస్తోంది.ఇదంతా కేవలం ‘క్యాడర్’ కోసమే?చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎప్పుడూ స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించిన దాఖలాలు లేవని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇన్ని సాంకేతిక, న్యాయపరమైన అవరోధాలు అడ్డుగా ఉన్నాయని తెలిసి కూడా.. ‘అక్టోబరులో ఎన్నికలు’ అంటూ ఆయన పదేపదే హడావుడి చేయడం వెనుక అసలు రహస్యం వేరే ఉందనే చర్చ తమ్ముళ్లలోనే నడుస్తోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తీవ్ర అసంతృప్తితో ఉన్న తమ పార్టీ క్యాడర్లో ఎలాగైనా పొలిటికల్ జోష్ నింపేందుకే బాబుగారు ఈ ఎన్నికల పల్లవి అందుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ప్రాథమిక కసరత్తు కూడా మొదలు పెట్టకుండా, కేవలం బహిరంగ ప్రకటనల ద్వారా పార్టీ శ్రేణులను మభ్యపెట్టేందుకే కూటమి సర్కార్ ఈ సరికొత్త రాజకీయ డ్రామాకు తెరలేపిందని రాజకీయ వర్గాలు నిప్పులు చెరుగుతున్నాయి.కరువు కోరల్లో సీమ.. తుఫాన్ల ముప్పు..ప్రస్తుతం ఎన్నికలకు వెళితే అధికార తెలుగుదేశం కూటమికి తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల జిల్లావ్యాప్తంగా తాగునీటికి కటకటలాడాల్సిన దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్‌లో ఎక్కడా పంటలు సాగు కాక రైతాంగం అల్లాడుతోంది. శ్రీశైలంలో సరిపడా నీరు ఉన్నప్పటికీ సీమ తాగునీటి అవసరాలకు సైతం విడుదల చేయని దుస్థితి నెలకొంది. పాలకుల నిర్లక్ష్యంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తుతోంది. మరోవైపు అక్టోబరు నెలలో ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి అంటున్నా.. ఆ సమయంలో రాష్ట్రంలో తుఫాన్ల ప్రభావం అత్యంత అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ సాంకేతిక, ప్రకృతి అవరోధాల నేపథ్యంలో ఈ ఏడాదిలో స్థానిక ఎన్నికలు జరగడం అసాధ్యమని, ఇవన్నీ జనాన్ని నమ్మించడానికి ఆడుతున్న డ్రామాలేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.జిల్లా స్థానిక సంస్థల వివరాలుమదనపల్లె (సెలక్షన్ గ్రేడ్), రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీలు, బి.కొత్తకోట నగర పంచాయతీ ఉన్నాయి.వీటిలో బి.కొత్తకోట నగర పంచాయతీ పై హైకోర్టులో కేసు నడుస్తోంది. ఇది క్లియర్ అయితే గాని ఎన్నిక జరగదు. మిగతా మున్సిపాలిటీలకు సంబంధించి కొత్తగా వార్డుల సంఖ్య పెంపు, తిరిగి కొత్తగా వార్డుల ఏర్పాటు జరిగింది. దీనికి ప్రభుత్వం నుంచి ఇంకా ఆమోదం లభించలేదు. జిల్లాలో 25 మండలాలు ఉండగా, 25 మంది జెడ్పీటీసీలు ఉన్నారు. 25 మంది ఎంపీపీలు ఉన్నా రు. వీరి పదవీకాలం సెపె్టంబర్ లో ముగుస్తుంది.జిల్లాలో 411 గ్రామపంచాయతీలు, వాటిలో 4,230 వార్డులు ఉన్నాయి. (వీరి పదవి కాలం ముగిసింది, పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి)ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ మరియు గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించాలని ఎన్నికల కమిషన్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 6వ తేదీన (గురువారం) రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో జరగబోయే కీలక సమావేశంలో దీనిపై స్పష్టత రానుంది. -
మావిగన్ దెబ్బకి.. ఆవిగన్.. జగన్ ఐడియాకు బాబు జై..!
-
అమరావతి కాదు.. 'మావిగన్' వైపే అడుగులా?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఓటు వేయక తప్పలేదు. నిజమే!మీరు చదువుతున్నది కరెక్టే!. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి.. జగన్ కొన్నాళ్ల క్రితం ఏమన్నారు?. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు(మావిగన్) లను కలిపి రాజధాని కారిడార్‌గా అభివృద్ది చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల లక్షల కోట్ల ప్రజాధనం వెచ్చించవలసిన అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో మావిగన్ కు ఆమోదం తెలిపేవారు వైఎస్సార్సీపీకి, అమరావతికి అంగీకారం తెలియచేసేవారు కూటమికి ఓటు వేయవచ్చని, ఇది ఎన్నికల అంశంగా తీసుకుంటామని ఆయన సవాల్ చేశారు. జగన్ ఈ ప్రతిపాదన చేసినప్పుడు చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు పెద్ద ఎత్తున అవహేళన చేశారు. మతిస్థిమితం లేకుండా జగన్ మాట్లాడుతున్నారని, అలాంటి వ్యక్తులతో రాజకీయం చేయాల్సి వస్తోందని చంద్రబాబు విమర్శించారు. కానీ, ప్రజలు కూడా అటువైపే మొగ్గు చూపుతున్నారన్న సంగతి గ్రహించారేమో తెలియదు కాని, చంద్రబాబు కూడా యూటర్న్ తీసుకుని అమరావతి అంటే 29 గ్రామాలే కాదని, విజయవాడ, గుంటూరు, మంగళగిరి కూడా కలుపుకుని మౌలిక సదుపాయాలు అభివృద్ది చేయాలని అధికారులను ఆదేశించారట. ఆయన చెప్పినవాటిలో ఒక్క మచిలీపట్నం మాత్రం లేదు. బహుశా తర్వాత రోజుల్లో మచిలీపట్నాన్ని కూడా కలపవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.దీనిని బట్టి అర్ధం అయిందేమిటంటే వచ్చే ఎన్నికలలో జరిగే రిఫరెండమ్ వరకు ఆగకుండా చంద్రబాబే స్వయంగా జగన్ చేసిన మావిగన్ ను దాదాపు ఆమోదించినట్లే అవుతుంది. జగన్ ది మతిలేని ప్రతిపాదన అయితే ఇప్పుడు చంద్రబాబే ఎందుకు జై కొడుతున్నారో వివరణ ఇవ్వాలి కదా! ఈ రకంగా జగన్ కు చంద్రబాబే ఓటు వేసినట్లయిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అమరావతిలో విజయవాడ, గుంటూరులు కలిస్తున్నాయని చెబుతున్నప్పుడు ఇంకా లక్షన్నర ఎకరాల భూమిని ఎందుకు సమీకరించాలని ప్రయత్నిస్తున్నారన్న ప్రశ్న వస్తోంది. భూ సేకరణపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ వంటివారు ఆ ప్రాంతాన్ని సందర్శించి బలవంతపు భూ సేకరణ పద్దతి కాదని ప్రభుత్వానికి హితవు చెప్పారు. అయినా వినే పరిస్థితి లేదు. ప్రభుత్వం రెండో దశ పూలింగ్ అనగానే అమరావతిలో భూముల ధరలు సగానికి సగం పడిపోయాయని, అయినా కొనేవారు రావడం లేదని, అంతా అయోమయంగా మారిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వారు ఈ విషయాలను సోషల్ మీడియాలో కూడా చెబుతున్నారు. విజయవాడ,గుంటూరు ప్రాంత ప్రజలలో వస్తున్న అసంతృప్తిని గమనించి బహుశా తన వైఖరి మార్చుకుని ఉండవచ్చు. ఆయన చెబుతున్నట్లు అధికారులు ఆ ప్రాంతంలో పనులు చేపట్టదలిస్తే అందుకు నిధులు కేటాయించాలి కదా!అవేమీ లేకుండా మీడియాలో ప్రచారానికి మాత్రమే చెబితే ఏమి ఉపయోగం అన్న భావన వ్యక్తం అవుతోంది. గత ఏడాది డిసెంబర్ లో పార్లమెంటులో అమరావతికి చట్టబద్దత తీసుకువచ్చిన సందర్భంలో కూడా అమరావతి అంటే 29 గ్రామాల పరిధినే ఎందుకు పెట్టారు? విజయవాడ, గుంటూరు కూడా ఇందులో ఉంటాయని ఎందుకు ప్రకటించలేదు?కొద్ది రోజుల క్రితం సిఆర్డిఎ విడుదల చేసిన ఒక ప్రకటనలో 29 గ్రామాలలోనే రాజధాని నిర్మాణం నిమిత్తం భూములు సమీకరించినట్లు తెలిపింది.ప్రస్తుతం ఈ గ్రామాల పరిధిలోనే సుమారు 50వేల కోట్ల వ్యయం అయ్యే పనులు చేపట్టారు. రోడ్లు నిర్మాణం, తదితర సదుపాయాలు కల్పించడానికి ,భవనాల నిర్మాణానికి వ్యయం చేస్తున్నారు. వీటిలో అత్యధిక భాగం డూప్లికసీ తప్ప మరొకటి కాదనిపిస్తుంది.ఇప్పటికే ఒక అసెంబ్లీ భవనం ఉంది అయినా మరొకటి నిర్మిస్తున్నారు. సచివాలయ భవనాలు ఉన్నాయి. అయినా మళ్లీ కడుతున్నారు. పైగా ఏభై అంతస్తుల నిర్మాణాలు చేస్తున్నారట. ఎంతమంది ఉద్యోగులు ఉంటారు? ఎంత స్పేస్ అవసరం అన్నదానితో నిమిత్తం లేకుండా ఈ భవనాలు చేపట్టారన్న విమర్శలు ఉన్నాయి. ఒక భవనంలో హైకోర్టు ఉంది. మళ్లీ కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు.ఇవేకాదు. విజయవాడలో పెద్ద రైల్వే జంక్షన్ ఉంది. జాతీయ రహదారిని ఆనుకుని విమానాశ్రయం ఉంది. గుంటూరులో రైల్వే స్టేషన్ ఉంది. అయినా ఇవన్ని మళ్లీ కడతారట. అది కూడా అమరావతిలో మారుమూల ప్రాంతాలలో అట. ఇందుకోసం రైతులను పీడించి మరీ భూములు తీసుకోవడానికి యత్నిస్తున్నారు. ఇవికాక రైతుల నుంచి తీసుకునే పొలాలకు బదులు వారికి అభివృద్ది చేసిన ప్లాట్లు ఇవ్వాలి. అవి ఇప్పటికీ గ్రాఫిక్స్ లోనే ఉన్నాయి. ఈ ప్లాట్ల అభివృద్దికి ఎన్నివేల కోట్లు అవుతాయో తెలియదు. వరద సంగతి సరేసరి. వేల కోట్ల వ్యయం చేసి రిజర్వాయిర్లు, లిఫ్ట్ లు ఏర్పాటు చేయవలసి ఉంది. ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఐదెకరాల స్థలం తీసుకుని ఇల్లు కట్టుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం చదరపు అడుగుకు ఐదారువేల రూపాయల వ్యయం చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏకంగా 15వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు చేయడం అందరిని నివ్వెరపరుస్తోంది. అవకాశం వచ్చినప్పుడల్లా అమరావతి స్వయం సమృద్ది(సెల్ఫ్ ఫైనాన్స్ ) నగరం అని ప్రచారం చేస్తూ వచ్చారు. అమరావతికి ప్రజల సొమ్ము రూపాయి అవసరం లేదని, అమరావతి భూముల నుంచే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని వాదించేవారు. తీరా చూస్తే ఇప్పుడు అప్పులే,అప్పులు. అంతేకాక బడ్జెట్ లో కూడా సుమారు ఆరువేల కోట్లు కేటాయించారు. అంటే ఇదంతా రాష్ట్ర ప్రజలందరికి సంబంధించినదే. తాజాగా అప్పులు ఇచ్చిన సంస్థలకు రుణ చెల్లింపులకు ప్రభుత్వం 231 కోట్లు విడుదల చేసింది. అంటే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ నగరం కాదని, ప్రజలపై భారం వేసే సిటీ అని ఒప్పుకున్నట్లయింది. అయితే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాత్రం అమరావతి పూర్తి అయితే ఏటా 12వేల కోట్ల ఆదాయం వస్తుందని కొత్త ప్రచారం ఆరంభించారు. అది ఎలా సాధ్యమో తెలియదు. గతంలో అయితే ప్రభుత్వం ఇక్కడ తనకు వచ్చే వాటా భూములను అమ్ముతుందని , తద్వారా నిర్మాణాలు చేస్తుందని అనేవారు.కాని ఆ తర్వాత కాలంలో మాట మార్చి, 33వేల ఎకరాలు చాలదని, మరో ఏభైవేల ఎకరాలు తీసుకుంటామంటూ గాత్రం అందుకున్నారు. అక్కడితో ఆగడం లేదు. ఏకంగా 1.75 లక్షల ఎకరాలకు పూలింగ్ విస్తరించనున్నారు. అంటే ఈ రాజధాని నిర్మాణం ఎప్పటికి పూర్తి అవుతుందో,ఎప్పటి నుంచి ఆదాయం వస్తుందో ఎవరూ చెప్పలేరన్నమాట. మరోవైపు పూలింగ్ కు ఇవ్వని రైతుల నుంచి బలవంతంగా భూ సేకరణ చేస్తున్నారు. పోనీ వారికి మార్కెట్ రేటు ప్రకారం ధర ఇస్తున్నారా అంటేఅదేమీ లేదు.ఉండవల్లి ప్రాంతంలో ఎకరా ధర ఎప్పటి నుంచో ఐదు కోట్ల నుంచి పదికోట్లు ఉంటే ప్రభుత్వం కేవలం 73 లక్షలు చొప్పునే లెక్క కడుతోందట. రాష్ట్రం అంతటా భూముల విలువలను ప్రభుత్వం పెంచినా అమరావతి ప్రాంతంలో పెంచకపోవడానికి కారణమిదేనట. వరల్డ్ బ్యాంక్ వంటి వాటికి గజం నలభై ఐదువేల రూపాయల వరకు ఉందని చెబుతున్న ప్రభుత్వం రైతుల వద్దకు వచ్చేసరికి ధరను తగ్గించి వేసిందని అంటున్నారు. అమరావతిలో అభివృద్ది మాటేమోకాని, ఎల్లో మీడియాలో మాత్రం ఏదేదో జరిగిపోతున్నట్లుగా ఊదరగొట్టి ప్రజలను మభ్యపెట్టాలని విశ్వయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు ఈనాడులో ఈ మధ్య వచ్చిన వార్తలు చూడండి. అమరావతిలో మినీ అమెజాన్ అట. ఐదెకరాలలో అమెజాన్ వచ్చేస్తుందట. అతిశయోక్తులతో స్టోరీ వండి వార్చారు. ఎమ్యూజ్ మెంట్ పార్కు, ఎకో టూరిజం రిసార్ట్, స్నో వరల్డ్, లండన్ ఐ మాదిరి అమరావతి ..ఇలా ఒకటేమిటి? వాటిలో కొన్ని వస్తే రావచ్చు.లేకపోతే లేదు.కాని ఎల్లో మీడియా పత్రికలలో చూస్తే మాత్రం అంతా జరిగిపోయినట్లే ఉంటుంది. ప్రజలను మభ్యపెట్టడంలో ఎల్లో మీడియా తన వంతు పాత్ర పోషిస్తోంది. అమరావతికి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 500 మీటర్ల రింగ్ రోడ్డు వేస్తారట. డల్లాస్ వంటి నగరానికే 250 మీటర్ల రోడ్డు ఉంది.హైదరాబాద్ లో 150 మీటర్లే ఉంది.ఇంకా అభివృద్ది మొదలుకాని అమరావతికి మాత్రం అరకిలోమీటర్ రింగ్ర్ రోడ్డేమిటని అంతా బిత్తరపోతున్నారు.ఇప్పటికే ఉన్న వెస్ట్ బైపాస్ రోడ్డు జగన్ టైమ్ లోనే దాదాపు పూర్తి అయింది.అది చాలదట. చివరిగా ఒక మాట. మావిగన్ అంటూ జగన్ ప్రస్తావించగానే, ఎల్లో మీడియాగా పేరొందిన ఆంద్రజ్యోతి వైసిపి నేతలను అసభ్య పదాలతో దూషిస్తూ ఒక వ్యాఖ్య చేసింది. మరి ఇప్పుడు చంద్రబాబు కూడా మావిగన్ లో మూడువంతుల భాగానికి ఓటు వేశారు.అంటే ఎల్లో మీడియా ఇంతకు ముందు తప్పుడు కూతలు కూశానని ఒప్పుకుంటుందా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఎవరు అడవి పందులో నేను చెప్తా.. ఒకే ఒక్క డైలాగ్.. లోకేష్, బాబుపై నాగ మల్లీశ్వరి సెటైర్లు
-
నేను చెప్పకూడదు కానీ TDPలో జరిగేది అదే.. అందుకే రాజీనామా చేశా..
-
రెండు తప్ప అన్నీ చేశా..
సాక్షి, అమరావతి: రెండు హామీలు తప్ప ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేశానని ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధమాడేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ అమలు చేయలేదని చంద్రబాబు అంగీకరించారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చానని, కానీ అమలు చేయలేదని చంద్రబాబు చెప్పారు. రెండేళ్ల పాలన–ఆర్థిక పరిస్థితిపై ప్రొగ్రెస్ రిపోర్ట్‌ను సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో మీడియాకు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నిరుద్యోగ భృతి అమలు చేయకపోయినా ఉద్యోగాల కల్పనకు పరిశ్రమలకు సబ్సిడీలు ఇస్తున్నామన్నారు. రెండు హామీలు తప్ప అని చెప్పినా రెండో హామీ ఆడబిడ్డ నిధి ఇవ్వలేకపోయా అని ప్రస్తావించలేదు. దానితో పాటు మిగతా హామీల గురించి కూడా చంద్రబాబు మాట్లాడలేదు. ఎప్పటిలాగే రాష్ట్ర విభజన ద్వారా రాష్ట్రానికి జరిగిన నష్టాలను వివరిస్తూ మరో పక్క గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తూ చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. సంక్షేమం ఇవ్వండి.. అభివృద్ధి మీ బాధ్యత అనే ధోరణి ప్రజల్లో మారాలన్నారు. ‘‘రోడ్లు వేయండి అంటారు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే మీ బాధ్యత అంటారు.. ఇది కరెక్ట్ కాదు’’ అని చంద్రబాబు అన్నారు.పీపీపీలో మనమే నెంబర్ 1రాష్ట్ర ఆదాయం జీతాలకే సరిపోతోందని, కేంద్రం ఇచ్చే నిధులు అప్పులు, వడ్డీలకు పోతోందని, సంక్షేమానికి అప్పులు చేస్తున్నామని సీఎం చెప్పారు. అందుకే పీపీపీ అంటున్నామన్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో 390 ప్రాజెక్టులను రూ.1.78 లక్షల కోట్లతో చేపడతామన్నారు. ఇందులో మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయని, వీటికి వయబులిటీ గ్యాప్ ఫండింగ్ వస్తుందన్నారు. పీపీపీ ప్రాజెక్టుల్లో ఏపీ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు. ఇక్కడ పీపీపీ వద్దంటారు. భోగాపురం మాదే అంటారు. అర్ధం చేసుకోకుండా మాట్లాడతారన్నారు. పీపీపీ ప్రాజెక్టుల వల్ల లబ్దిపొందిన వారు కూడా ఆ లబ్దిగురించి మాట్లాడకుండా విమర్శలు చేస్తున్నారని, దేశంలో ఇదే పెద్ద సమస్య అని చంద్రబాబు అన్నారు. ఎకనమిక్ స్టూడెంట్‌ని.. ద్రవ్యలోటంటే కాకిలెక్కలే...ద్రవ్యలోటు పెరిగిందని విలేకరి అడిగిన ప్రశ్నపై సీఎం స్పందిస్తూ నేను ఎకనమిక్ స్టూడెంట్‌నే, ప్రైమరీ, సెకండరీ డెఫిషిట్ అంటే ఒక మిధ్య ఇవన్నీ మనం అంచనాకు తప్ప కాకిలెక్కలే.. ఎవ్వరికీ అర్ధం కాదన్నారు. అమరావతికే ఎక్కువ వ్యయం చేస్తున్నారనే విమర్శలపై సీఎం స్పందిస్తూ ప్రజల్లో చైతన్యం తేవడానికి ప్రయత్నిస్తున్నామని, అయినా ప్రజలు నెగిటివ్‌గా ఆలోచించి భవిష్యత్ నాశనం చేసుకుంటే ఏమీ చేయలేం అన్నారు. అమరావతి తొలి దశ పనులకు రూ.51,687 కోట్ల పనులకు టెండర్లు పిలిచామని, ఇప్పటికే రూ.40,887 కోట్లు టైఅప్ చేశామని, ఇది రూ.70 వేల కోట్లకు పోతుందన్నారు.రాజధాని తొలి దశ పనులను పూర్తి చేసి 2028లో ప్రధాని చేత ప్రారంభింప చేస్తామన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, భూములు అమ్ముతామని, తద్వారా డబ్బులు వస్తాయన్నారు. గత రెండేళ్లలో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహిస్తే కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారన్నారు. పీ–4 ద్వారా పేదరిక నిర్మూలనకు ధనవంతులను భాగస్వామ్యం చేస్తున్నామని, 21 లక్షల మంది పేదలను గుర్తించామని, దాతలు ఇప్పటి వరకు 2.40 లక్షల మందిని దత్తత తీసుకున్నారన్నారు. పేద కుటుంబాలను పైకి తెచ్చేలా ఆదేశాలు ఇస్తున్నామన్నారు. మూడుప్రాంతాల్లో అభివృద్ధికి ప్లాన్ చేశా..రాష్ట్రంలో మూడు రీజియన్స్‌ను భారీ పెట్టుబడులతో అభివృద్ధి చేయడం ద్వారా భారీగా ఉద్యోగాల కల్పనకు ప్లాన్ చేసినట్లు కాగితాలపై గ్రాఫిక్స్‌ను చంద్రబాబు ప్రదర్శించారు. పోలవరంతో పాటు మిగతా ప్రాజెక్టుల పూర్తికి ప్లాన్ చేశామన్నారు. ఏటా 15 శాతం వృద్ధి సాధించడం ద్వారా రాష్ట్ర జీఎస్డీపీని తలసరి ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.ఉద్యోగుల జీతభత్యాలను గత ప్రభుత్వం 110 శాతం పెంచేసిందిగత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాల వ్యయాన్ని రాష్ట్ర సొంత పన్నురాబడిలో సగటున 110 శాతానికి పెంచేసిందని చంద్రబాబు తప్పుపట్టారు. అంతకు ముందు 2014–19 మధ్య తన పాలనలో ఉద్యోగుల జీతభత్యాల వ్యయం సొంత పన్ను రాబడిలో సగటున 87 శాతమే ఉందన్నారు. ఇప్పుడు 2024–25, 2025–26లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయంలో జీతభత్యాల వ్యయాన్ని 96 శాతానికి తగ్గించామన్నారు. ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తానన్నారు. బాధ్యత లేని గత ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాల వ్యయాన్ని భారీగా పెంచేసిందన్నారు. ఆదాయాలను పెంచుకోవడం ద్వారా ఉద్యోగుల జీతాల వ్యయాన్ని తగ్గిస్తున్నామన్నారు. అన్నీ ప్రభుత్వ ఉద్యోగాలంటే ఇవ్వలేమన్నారు. -
బాబు సర్కారు ‘స్టెత్’గోపం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య విద్యను అభ్యసించాలని ఆశలు పెట్టుకున్న విద్యార్థుల పాలిట చంద్రబాబు పాలన పెనుశాపంగా మారింది. ప్రభుత్వ రంగంలో వైద్య విద్యపై ఆయన చూపుతున్న నిర్లక్ష్యంతో మన విద్యార్థుల అవకాశాలకు గండిపడుతోంది. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) పిడుగురాళ్ల వైద్య కళాశాలకు 100 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేసిందని ఇటీవల ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు చేసింది. అయితే వాస్తవానికి ఈ కళాశాలకు కేవలం 50 సీట్లనే ఎన్ఎంసీ మంజూరు చేసింది. 100 ఎంబీబీఎస్ సీట్లకు సరిపడా మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవ్వడంతో 50 సీట్లనే ఎన్ఎంసీ మంజూరు చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటులో భాగంగా వైఎస్ జగన్ హయాంలోనే పిడుగురాళ్ల కళాశాల నిర్మాణం ప్రారంభించారు. పిడుగురాళ్ల మండలం కామేపల్లిలో రూ.500 కోట్లతో అధునాతన వసతులతో కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణాన్ని ప్రారంభించి సార్వత్రిక ఎన్నికల నాటికి దాదాపు రూ.300 కోట్ల విలువైన మెజార్టీ పనులు పూర్తి చేశారు. అయితే చంద్రబాబు గద్దెనెక్కాక పీపీపీలో ప్రైవేట్‌కు కొత్త వైద్య కళాశాలలు కట్టబెట్టే క్రమంలో ఏడాదిన్నరపాటు ఈ కళాశాల నిర్మాణ పనులను నిలిపివేశారు. విద్యార్థిలోకంతోపాటు ప్రజల నుంచి వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో 100 సీట్లతో 2026–27 విద్యా సంవత్సరంలో కళాశాల ప్రారంభించడానికి దరఖాస్తు చేశారు. మొక్కుబడి దరఖాస్తుతో సరి మొక్కుబడిగా వైద్య కళాశాల ప్రారంభానికి దరఖాస్తు చేసి బాబు సర్కారు చేతులెత్తేసింది. వైద్య కళాశాలను పూర్తిగా అభివృద్ధి చేయకుండా నరసరావుపేట ప్రభుత్వాస్పత్రిని బోధనాస్పత్రిగా చూపి తొలుత దరఖాస్తు చేసింది. దీంతో పరిశీలన దశలోనే ఎన్ఎంసీ దరఖాస్తును పక్కన పడేసింది. ఈ క్రమంలో వైద్య శాఖ అప్పీల్‌కు వెళ్లడంతో దరఖాస్తును ఎన్ఎంసీ అనుమతించింది. ఇదిలా ఉండగా ఎన్ఎంసీ బృందం తనిఖీలకు వచ్చే సమయానికి ప్రభుత్వం పిడుగురాళ్ల బోధనాస్పత్రి, వైద్య కళాశాల, హాస్టళ్లు, ఇతర సదుపాయాలను 100 సీట్లకు సరిపడా చూపించలేకపోయింది. తనిఖీల అనంతరం 100 సీట్లు మంజూరు చేసినట్టు ఎన్ఎంసీ నుంచి లెటర్ ఆఫ్ పర్మిషన్(ఎల్ఓపీ) వచ్చిందని వైద్య శాఖ ప్రకటించింది. అయితే గత నెలలో విడుదల చేసిన 2026–27 సీట్‌మ్యాట్రిక్స్‌లో పిడుగురాళ్ల వైద్యశాలకు కేవలం 50 సీట్లనే ఎన్ఎంసీ చూపింది. వంద సీట్లు చూపకపోవడంపై ఎన్ఎంసీని వైద్య శాఖ సంప్రదించగా 50 సీట్లే మంజూరు చేశామని ఎన్ఎంసీ తేల్చి చెప్పినట్టు వెల్లడైంది.కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వమున్నా జనాభా, స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం ఇలా అనేక అంశాల్లో ఏపీ కంటే ఎంతో చిన్నదైన ఛత్తీస్‌గఢ్ ఈ విద్యా సంవత్సరం ఏకంగా ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభిస్తోంది. ఇటు రాష్ట్రం, అటు కేంద్రం రెండు చోట్లా ఎన్డీఏ ప్రభుత్వాలున్నప్పటికీ దరఖాస్తు చేసిన వంద శాతం ఎంబీబీఎస్ సీట్లను రాబట్టుకోలేని దుస్థితి ఆంధ్రరాష్ట్రానికి దాపురించింది. అదే విధంగా ఏపీ కంటే ఎంతో చిన్న రాష్ట్రాలు సైతం ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తూ ప్రజలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్యం, విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు మాత్రం మన విద్యార్థుల వైద్య విద్య కలను ఛిద్రం చేస్తూ ఏకంగా 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుకు కట్టబెట్టేస్తున్నారు. ఇందులో భాగంగా గతంలోనూ ఎన్ఎంసీకి లేఖ రాసి మంజూరైన మెడిసిన్ సీట్లను సైతం రద్దు చేయించి విద్యార్థులకు వెన్నుపోటు పొడిచారు. ఈ తరహా కుట్రపూరిత విధానాలతో బాబు అధికారం చేపట్టాక రెండేళ్లలో రాష్ట్ర విద్యార్థులు ఏకంగా 2,450 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయి తీవ్రంగా నష్టపోయారు. -
పొగాకు రైతులపై సర్కారు పగ.. నేడు కొనుగోలు కేంద్రానికి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: పొగాకు రైతులను చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం, దారుణ వైఫల్యంతో పొగాకు రైతులకు రెండు సీజన్లలో ఏకంగా రూ.3 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. పంట కోసం పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతులు ఉరికొయ్యల పాలవుతున్నారు. తీవ్ర నష్టాలు చవిచూస్తున్న రైతులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నారు. వారందరికీ వైఎస్సార్సీపీ అండగా నిలుస్తోంది. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఇప్పటికే అనేక పోరాటాలు చేసింది. అయినప్పటికీ చంద్రబాబు సర్కారులో ఏ మాత్రం చలనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పొగాకు రైతుల కష్టాలను తెలుసుకోవడానికి మరోమారు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి క్షేత్ర స్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోళ్ల తీరును వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. రైతులతో ముఖాముఖి నిర్వహించి సాగు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలను అడిగి తెలుసుకోనున్నారు. కిలోకు రూ.60 నుంచి రూ.70 చొప్పున నష్టం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో పంటల కొనుగోళ్లలో దళారులే రాజ్యమేలుతున్నారు. ఇందుకు గడచిన రెండేళ్లలో రికార్డు స్థాయిలో పతనమైన పొగాకు ధరలే నిదర్శనం. దళారీ వ్యవస్థ రెండేళ్లలో బలంగా వేళ్లూనుకుంది. ఈ సీజన్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాక జూన్ 18, జూలై 8న రెండుసార్లు సమీక్ష నిర్వహించిన సీఎం కేజీకి కనీస ధర రూ.200 కంటే తగ్గడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అయినా అన్ని ప్లాట్‌ఫామ్‌లలో సరాసరి ధర రూ.187కే పడిపోయింది. హై క్వాలిటీకి రూ.240, మీడియం రూ.190, లో–గ్రేడ్ రూ. 110 చొప్పున గత నెల 28న ధరలు ప్రకటించారు. 2023–24 సీజన్లో సరాసరి ధర రూ.288.65, 2024–25లో రూ.248.66 ఉండగా.. ఈ ఏడాది 105 వేలం రోజుల్లో 47.39 మిలియన్ కేజీలు అమ్మకం జరగ్గా సరాసరి ధర రూ.214.19. మాత్రమే ఉంది. ఈ లెక్కన రైతులు గత ఏడాది కంటే కిలోకి ఏకంగా రూ.60 నుంచి రూ.70 వరకూ నష్టపోతున్నారు. పదేళ్లుగా ప్రతిరోజూ వేలం ముగిశాక వచ్చిన బేళ్లు, రిజెక్ట్ అయినవి, సరాసరి ధరల వివరాలను రైతు గ్రూపుల్లో పెట్టేవారు. కానీ గత 10–12 రోజుల నుంచి ఈ నివేదికను రైతులకు అందుబాటులో లేకుండా తీసేశారు. నాడు భరోసారైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కకుండా నష్టాల పాలవడానికి వీల్లేకుండా గత వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఐదేళ్లలో రూ.7,800 కోట్లు ఖర్చు చేసింది. ప్రతి ఆర్బీకేను ఒక కొనుగోలు కేంద్రంగా ప్రకటించి, ప్రతి జిల్లాలోనూ జాయింట్ కలెక్టర్, మార్క్‌ఫెడ్ జాయింట్ ఎండీలను బాధ్యులను చేసింది. పంటల కనీస మద్దతు ధరల (ఎమ్మెస్పీ)ను ఆర్బీకేల్లో పొందుపరిచి, బోర్డును ప్రదర్శించింది. ఈ ధరలకన్నా ఏదైనా పంట ధరలు పడిపోతే, ఆర్బీకే పరిధిలో ఉన్న గ్రామ వ్యవసాయ సహాయకుడు (వీఏఏ) వెంటనే అప్రమత్తమయ్యేవాడు. సీఎం–యాప్ (కంటిన్యూస్ మోనిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్)ని అప్రమత్తం చేసేవారు. ఏ ఆర్బీకే పరిధిలో పంట ధర పడిపోయిందో అక్కడ జాయింట్ కలెక్టర్ రంగంలోకి దిగి వెంటనే పంట కొనుగోలు ప్రారంభించేవారు. అలా మార్కెట్లో పోటీ ఏర్పడేది. దీంతో ఏ రైతు నష్టపోయే పరిస్థితి లేకుండా చేశారు. ఇప్పుడీ వ్యవస్థ మొత్తం పూర్తిగా కనుమరుగైంది. ఈ క్రమంలో దళారులు సిండికేట్‌గా మారి రైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. -
వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అక్రమ అరెస్ట్
పట్నంబజారు(గుంటూరు): నిన్నటి వరకు ప్రతిపక్ష బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని రెడ్‌బుక్ పంజా విసిరిన చంద్రబాబు సర్కారు మాజీ మంత్రులు సీదిరి అప్పలరాజు, జోగి రమేష్ కుటుంబాలను వెంటాడి వేధించింది. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, వైఎస్సార్సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవి వంటి వారిపైనా అక్రమ కేసులతో అరాచకం సాగించింది. ఇప్పుడు మైనార్టీ నేతలపై కక్షసాధింపులకు దిగి తీవ్రంగా వేధిస్తోంది. తాజాగా గుంటూరు తూర్పు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫాను అక్రమంగా అరెస్టు చేసింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారం.. ఇప్పటికే ముస్తఫా, ఆయన తనయుడు బషీర్‌పై నూజివీడు పోలీసులు అక్రమ కిడ్నాప్ కేసు బనాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం గుజరాత్లో వీరిద్దరినీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. అక్కడితో ఆగకుండా గుంటూరు కాకాని రోడ్డులోని ముస్తఫా కుమార్తె, వైఎస్సార్సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా నివాసంలోనూ దౌర్జన్యంగా తనిఖీలు నిర్వహించారు. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు. -
గత ఐదేళ్ల కన్నా ఈ రెండేళ్లలోనే ఎక్కువ అప్పులు
సాక్షి, అమరావతి: గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కంటే తన రెండేళ్ల పాలనలోనే అప్పులు పెరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజెంటేషన్ వెల్లడించింది. గత రెండేళ్ల ప్రభుత్వ అప్పులకు సంబంధించి మంగళవారం ఆయన సచివాలయంలో ప్రోగ్రెస్ రిపోర్ట్‌పై మీడియాకు ప్రజెంటేషన్ ఇచ్చారు.గత రెండేళ్లలో బడ్జెట్లో ఎంత.. బడ్జెట్ బయట ఎంత అప్పు చేశారో చెప్పకుండా జీఎస్డీపీలో అప్పుల శాతాన్ని వివరిస్తూ ఆయన ప్రజెంటేషన్ సాగింది. దీని ప్రకారం చూసినా గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జీఎస్డీపీలో సగటు అప్పు కన్నా, తన రెండేళ్ల పాలన జీఎస్డీపీలోనే సగటు అప్పు 2.37 శాతం మేర పెరిగినట్లు స్పష్టం చేశారు. 2019–24 మధ్య జీఎస్డీపీలో సగటు అప్పు 33.83 శాతం ఉండగా.. 2024–25, 2025–26.. రెండేళ్లలోనే జీఎస్డీపీలో సగటు అప్పు 36.20 శాతానికి పెరిగింది. -
బీసీ నేతలపై ఆగని అక్రమ కేసులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం పర్యటన విజయవంతం కావడంతో తట్టుకోలేని చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోంది. వైఎస్సార్సీపీ నాయకులపై నిత్యం కేసులు బనాయిస్తోంది. పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని క్షుద్ర రాజకీయాలు చేస్తోంది. దీనివెనుక పోలీసులే ఫిర్యాదుదారులు కావడం, వారే చర్యలు తీసుకోవడం గమనార్హం. దీనికంతటికీ టీడీపీ పెద్దలే స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అందిస్తున్నారు. వారిచ్చే జాబితాల మేరకు పోలీసు అధికారులు కేసులు నమోదు చేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. తొలుత చింతాడ రవికుమార్ తదితరులపై కేసులు నమోదు చేయగా, మొన్న గొర్లె కిరణ్‌కుమార్ తదితరులపై కేసులు నమోదు చేశారు. తాజాగా ధర్మాన కృష్ణదాస్, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ తదితరులపై అక్రమ కేసులు పెట్టారు. రోడ్డు ప్రమాదాన్ని హత్యా నేరంగా చూపిస్తూ పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జూలై 30న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం వచ్చారు. దీంతో అభిమాన నేతను చూసేందుకు దారి పొడవునా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పోటెత్తారు. ఆ రోజు వచ్చిన జనప్రభంజనాన్ని చూసి తట్టుకోలేని చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెరతీసింది. పోలీసులను వాడుకుని వరుస కేసులు పెడుతోంది. తొలుత ఆమదాలవలస పోలీసు స్టేషన్ పరిధిలో చింతాడ రవికుమార్‌తో పాటు మరో 20 మందిపై అక్రమ కేసు బనాయించింది. ఆ తర్వాత జేఆర్‌పురం పోలీసు స్టేషన్ పరిధిలో ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌తో పాటు మరో 22మందిపై అక్రమ కేసులు నమోదు చేశారు. తాజాగా శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరి«ధిలో ధర్మాన కృష్ణదాస్, పేరాడ తిలక్ తదితరులపై అక్రమ కేసులు బనాయించారు. జూలై 30న జరిగిన ఘటన అని చెప్పి ఆగస్టు రెండో తేదీన శ్రీకాకుళం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వి.రామారావు ఫిర్యాదు చేసిన మేరకు వైఎస్సార్సీపీ నేతలుధర్మాన కృష్ణదాస్, పేరాడ తిలక్, గేదెల పురుషోత్తం, రౌతు శంకరరావు, అంబటి శ్రీనివాస్, గొండు రఘురాం, సాయి, తదితరులపై కేసులు నమోదు చేశారు. -
బాబు ‘భోగా’స్ మాటలు
సాక్షి, న్యూఢిల్లీ: భోగాపురం ఎయిర్‌పోర్టుకు కర్త, కర్మ, క్రియా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అయితే.. ఆ క్రెడిట్ అంతా తనదేనని సీఎం చంద్రబాబు బోగస్ మాటలు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ఎంపీలు మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు, లోక్‌సభ ఎంపీలు డాక్టర్ మద్దిల గురుమూర్తి, డాక్టర్ గుమ్మా తనూజారాణి మీడియాతో మాట్లాడారు. తాను చేయని దానిని చేసినట్లుగా చెప్పుకుంటూ ‘క్రెడిట్ చోరీ చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరని ధ్వజమెత్తారు. భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ కోసం చంద్రబాబు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పడరాని పాట్లు పడుతున్నారని వ్యంగ్యా్రస్తాలు సంధించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంపై పార్లమెంట్లో చర్చించేందుకు తాము సిద్ధమని, దమ్ముంటే చర్చకు రావాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీలు సవాల్ విసిరారు. అభివృద్ధిపై చర్చించేందుకు తమ అధినేత వైఎస్ జగన్ అక్కర్లేదని, తాము సరిపోతామని స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయం విజయం నాలుగు గ్రామాల రైతుల త్యాగం, స్థానిక ప్రజల సహకారం, జగన్ ప్రభుత్వ కృషి ఫలితమేనని తేల్చిచెప్పారు. ప్రభుత్వ రికార్డులను వక్రీకరించి క్రెడిట్ చోరీ చేయాలన్న యత్నాలను ప్రజలు నమ్మరని, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. పెమ్మసానివి అసత్య వ్యాఖ్యలు భోగాపురం విమానాశ్రయం విషయంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యాలని ఎంపీ గొల్ల బాబూరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భూసేకరణ, పునరావాసం (ఆర్అండ్ఆర్), రైతులకు పరిహారం చెల్లింపు వంటి కీలక ప్రక్రియలన్నీ వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయని గుర్తు చేశారు. 2019 నాటికే 2,200 ఎకరాల భూమిని టీడీపీ ప్రభుత్వం సేకరించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చెప్పడం అవాస్తవమని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ఖండించారు. జీఎంఆర్ సంస్థతో ఒప్పందం 2023 జూన్‌లో కుదిరిందని, అదే ఏడాది అక్టోబర్‌లో భూమిని సంస్థకు అప్పగించామని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ నేతలే కోర్టుల్లో కేసులు వేశారన్న పెమ్మసాని వ్యాఖ్యలను గురుమూర్తి తప్పుబట్టారు. బాబు భూ దాహంతో భూములు కోల్పోతామన్న ఆందోళనతో రైతులు, మత్స్యకారులు, గ్రామస్తులే కోర్టులను ఆశ్రయించారని స్పష్టం చేశారు. మేనేజ్మెంట్ కోటాలో కేంద్ర మంత్రి పదవి పొందిన వారికి అమిత ప్రజాదరణ గల వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లేదని పెమ్మసానిని ఉద్దేశించి ఎంపీ తనూజారాణి వ్యాఖ్యానించారు. స్వయనా కేంద్ర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడే వైఎస్ జగన్ హయాంలో 86శాతం భోగాపురం విమానశ్రయ పనులు పూర్తయ్యాయని చెప్పారు కదా అని గుర్తుచేశారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంబోత్సవానికి 13 వేల మంది గిరిజన చిన్నారులతో ధింసా నృత్యం నిర్వహించి రూ.30 కోట్లు ఖర్చు చేశారని, దీనివల్ల గిరిజన ప్రాంతాలకు ఒరిగిన ప్రయోజనం ఏమిటో చంద్రబాబు ప్రభుత్వం చెప్పాలని తనూజారాణి ప్రశి్నంచారు. -
చంద్రబాబుకు 7 ఏళ్లు జైలు శిక్ష..! DSC స్కాం కేసు చిన్నది కాదు..
ఆంధ్రప్రదేశ్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. డీఎస్సీ స్కాం కేసులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. స్పోర్ట్స్ కోటాలో అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని, పేకాట ఆడిన వారికి బ్రిడ్జి గేమ్ పేరుతో ఉద్యోగాలు కల్పించారని ఆయన అన్నారు. అయితే, ఈ కేసులో చంద్రబాబుకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.అలాగే, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంపై కొడాలి నాని విమర్శలు గుప్పించారు. ఎన్నికల నోటిఫికేషన్ రానున్న సమయంలోనే చంద్రబాబు శంకుస్థాపన చేశారంటూ, దీనికి సంబంధించి పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం తప్ప ఎలాంటి భూసేకరణ చేయలేదు. అలాగే, రూ.5,500 కోట్ల వ్యయంతో జీఎంఆర్ సంస్థ భోగాపురం ఎయిర్‌పోర్టును నిర్మించగా.. జీఎంఆర్‌కు చంద్రబాబు ప్రభుత్వం ఐదు పైసలు కూడా ఇవ్వలేదు. కానీ తానే కట్టానంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నాడు. అయితే, భూసేకరణ కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ హామీలపైనా కొడాలి నాని మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. అమలులో మాత్రం 'సూపర్ సున్నా'గా మిగిలిపోయిందని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.అలాగే, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో.. కేసులు పెట్టి జైలుకు పంపినా భయపడవద్దని, ఎక్కడా ఏకగ్రీవ ఎన్నికలు జరగకుండా అన్ని స్థానాల్లో పోటీ చేయాలని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ మోసాలు సాగకుండా ఉండేలా వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు కొడాలి నాని పిలుపునిచ్చారు. -
నేను చెప్పకూడదు కానీ TDPలో జరిగేది అదే.. అందుకే రాజీనామా చేశా..
-
బాబుకి దిమ్మ తిరిగే షాక్.. YSRCPలో చేరిన టీడీపీ కీలక నేత
-
బాబుకు 7 ఏళ్లు జైలు శిక్ష ...! కొడాలి నాని మాస్ వార్నింగ్
-
జగన్ ను అరచేతితో ఆపేద్దాం అనే.. సొంత భార్య దుస్తులు చించేసే పార్టీ
-
ఎక్కడా ఏకగ్రీవం కాకుండా పోటీలో ఉందాం: కొడాలి నాని
గుడివాడ: ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ హామీ.. సూపర్ సున్నా అయ్యిందని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేని ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు కొడాలి నాని. సాగునీరు, రైతాంగం సమస్యలు, వైఎస్సార్సీపీపై అక్రమ కేసులు తదితర అంశాలపై కొడాలి నాని స్పందించారు. ‘ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి.. ఎవరూ భయపడొద్దు. కేసులు పెట్టి జైలుకు పంపినా బెదరొద్దు. ఎక్కడా ఏకగ్రీవం కాకుండా పోటీలో ఉందాం. బాబు, పవన్, బీజేపీ మోసాలను ఎండగడదాం’ అని పేర్కొన్నారు. ‘రైతాంగం నీళ్లు లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ప్రాజెక్టుల్లో నీళ్లుంచుకుని కూడా రైతులకు నీరివ్వడం లేదు. పైనుంచి చెబితే తప్ప నీరివ్వలేమని అధికారులు చెబుతున్నారు. వచ్చే ఏడాది వరకూ తాగునీటికి నీరు కావాలి అందుకే ఇవ్వలేమంటున్నారు. పంటలన్నీ ఎండిపోయి అంతా నాశనమైపోయాక ..నీళ్లు సముద్రంలోకి వదులుతారా?, రైతాంగాన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఎరువుల కోసం రైతులకు ఓటీపీలు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఆక్వా రైతులు , సామాన్య ప్రజలు , రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులను ఇబ్బంది పెడుతున్నారు ’ అని పేర్కొన్నారు. -
వెళ్తూ వెళ్తూ బాబు బిల్డప్ పై కొండా రాజీవ్ గాంధీ మాస్ ర్యాగింగ్
-
మా నాన్న చేసిన తప్పేంటి నూరి ఫాతిమా ఫైర్
-
భార్య బట్టలు మీరే చింపుకొని... మా నాయకులపై కేసులు పెడతారా?
-
చిత్తం శివుని మీద.. భక్తి చెప్పుల మీద.. బాబు, పయ్యావుల కేశవ్ ని ఏకిపారేసిన గోరంట్ల మాధవ్
-
100 కోట్ల నుంచి 25 తగ్గించడం.. దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది
-
చంద్రబాబు, పవన్, లోకేష్.. మరీ ఇంతలా?
ఏమైంది.. అలనాటి తెలుగు ఆత్మగౌరవం.. ఏమైంది.. తెలుగు పౌరుషం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కీలక మంత్రి లోకేష్ లు వీటిని పక్కనబెట్టరా అన్న సందేహం ప్రజలలో ఎందుకు వస్తోంది?ఒకప్పుడు మోడీ దేశానికే పనికిరారని తీవ్రంగా పరుష వ్యాఖ్యలు చేశారే.. పర్వతం ఎవరికి తలవంచదన్నారే.. మేం భయపడతామా అని హూంకరించారే.. మరి ఇప్పుడు ఏమైంది. మరీ ఇంతగా లొంగిపోయినట్లు వీరు మాట్లాడడం ద్వారా తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారన్న విమర్శను ఎందుకు ఎదుర్కోవలసి వస్తోంది?మోడీ కన్నా తానే సీనియర్ని అని, ఆయనకన్నా టీడీపీ కార్యకర్త కూడా బెటరే అని అప్పట్లో ఘాటుగా మాట్లాడిన చంద్రబాబే ఇప్పుడు మోడీకి తాను జై కొట్టడమే కాకుండా, సభికులతో కూడా జేజేలు కొట్టించడమేమిటి అని అంతా విస్తుపోతున్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ఇలాంటి సన్నివేశాలు రాష్ట్ర ప్రజలందరికి కనిపించాయి. మోడీని ప్రశంసించడం తప్పుకాదు. కాని మరీ అతిగా భజన చేసిన తీరులో మోడీని ఈ ముగ్గురు నేతలు తమను తాము తగ్గించుకోవడమే కాకుండా తెలుగువారి ప్రతిష్టను కూడా తగ్గించారే అన్నదే చర్చగా ఉంది. దీనికి తోడు మా జీసీఎం జగన్ పై అసత్యాలు యధాప్రకారం వీరు సాగించారు. కొబ్బరికాయ మేమే కొట్టాం, గుమ్మడి కాయ మేమే కొట్టాం అని చంద్రబాబు అంటుంటే..అవును.. అది నిజమే.. మధ్యలో పనులన్నీ జగన్ నేతృత్వంలోనే జరిగాయని వైఎస్సార్సీపీ నేతలు బదులు చెబుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొక్కుబడిగా శంకుస్థాపన చేసి వదలివేస్తే, జగన్ ప్రభుత్వం కదా మొత్తం అనుమతులు తెచ్చి,భూ సేకరణ పూర్తి చేసి, శంకుస్థాపన చేసి దానిని ముందుకు తీసుకువెళ్లింది! ఈ విషయాన్ని ఎయిర్ పోర్టు నిర్మాణం చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంధి మల్లిఖార్జున రావు 2023లో జరిగిన సభలో బహిరంగంగానే చెప్పారు కదా! అందువల్లే ఈ ప్రారంభోత్సవ సభలో జీఎంఆర్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేశారా అని మాజీ మంత్రి అమరనాధ్ ప్రశ్నించారు. అది ఉత్తరాంధ్రకు అవమానం కాదా అని అంటున్నారు. జగన్ హయాంలో 80 శాతం నిర్మాణం జరిగిన భోగాపురం ఎయిర్ పోర్టు తన ఘనత అని చెప్పుకుంటున్న చంద్రబాబు, కుప్పం లో విమానాశ్రయం కట్టి అంతర్జాతీయ నగరాలకు అనుసంధానం చేస్తానన్నారుగా..అది ఎక్కడదాకా వచ్చిందని పలువురు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు.ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. భోగాపురం ఎయిర్ పోర్టుతోనే ఉత్తరాంధ్ర పరిస్తితి మారిపోతుందని చెప్పడం అతిశయోక్తి అవుతుంది. ప్రస్తుతం నగరంలో ఉన్న ఎయిర్ పోర్టు బదులు కొత్తది నిర్మించారు.అంతవరకు ఓకె. కాని దానితోనే అంతా అయిపోతుందా?ప్రస్తుతం విశాఖ నగరం నుంచి సాగుతున్న విమానయానం ఇకపై భోగాపురం నుంచి జరుగుతుంది. ట్రాఫిక్ పెరిగితే మరికొన్ని విమానాలు రావచ్చు. కాని ఇప్పటికిప్పుడు హైదరాబాద్ తదితర పెద్ద నగరాలతో పోల్చుకునే పరిస్థితి ఉండకపోవచ్చు.ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగిపోవడమే కాదు..రివర్స్ వలసలు జరుగుతాయని చంద్రబాబు వంటి సీనియర్ నేత చెబుతుంటే వినేవారి చెవిలో పూలు పెడుతున్నారన్న భావన కలగదా?అదే నిజమైతే ఆయనే కదా సుదీర్ఘకాలం ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నది. మరి ఇంతకాలం వలసలు జరుగుతున్నా ఆయన పట్టించుకోలేకపోయారా అని ఎవరైనా అడిగితే జవాబు దొరకదు.ప్రధాని మోడీని ప్రశంసించడాన్ని ఎవరూ ఆక్షేపించరు.కాని అది మరీ అతిగా ఉందని టీడీపీ మద్దతుదారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఒకప్పుడు మోడీని తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు ఎందుకు ఇంతలా మారిపోయారు?మోడీకంటే తానే సీనియర్ ని అని ఒకప్పుడు చంద్రబాబు ధైర్యంగా చెప్పుకున్నారు.అంతేకాదు..మోడీ పాలన ఘోరంగా సాగుతోందని అంటూ ఏడేళ్ల క్రితం చీల్చి చెండాడినట్లు ప్రసంగాలు చేసేవారు.అప్పుడేమో ఏపీకి ఏమీ చేయడం లేదన్నారు. అసలు దేశానికే నష్టం జరుగుతోంందని ..ఇంకా చాలాచాలా ఆరోపించారు. అదే చంద్రబాబు ప్రస్తుతం మోడీని అధ్బుతం, అమోఘం, అన్న చందంగా స్పీచ్ ఇవ్వడం విన్నవారంతా మరీ అతిగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా మాట్లాడడంలో ఆయన ఆంతర్యం ఏమిటి? గత అనుభవాల రీత్యా తన విధేయతను కనబరుచుకోవడానికి మాట్లాడారా? లేక ఇంకేదైనా ఇబ్బంది ఉందా అన్నది తెలియదు. ఇక పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి మోడీని ఎవరో దూషించారట. దానికి ఆయన గుండె కదలిపోయిందట.కన్నీళ్లు వచ్చాయట. ఇదంతా సినిమాటిక్ అనిపించడం లేదూ!మోడీపై అంత ప్రేమ ,విశ్వాసం ఉంటే 2019 ఎన్నికల సమయంలో ఎందుకు మోడీని వదలి కమ్యూనిస్టులతో కలిసి ప్రయాణం చేశారు. మోడీ కన్నా బిఎస్పి అధినేత్రి మాయావతి గొప్పవారన్నట్లుగా వ్యవహరించారే! అవన్ని ఎందుకు చంద్రబాబు అప్పట్లో మోడీని అనరాని మాటలు అంటున్నప్పుడు ఒక్కసారైనా అది తప్పు అని చెప్పలేదే!కొందరు మరో సంగతిని ప్రస్తావిస్తున్నారు. తన తల్లిని దూషించారు అంటూ ఎవరిపై పవన్ ఆరోపించారో, క్షమించబోనని హెచ్చరించారో, వారితోనే చెట్టపట్టాలు వేసుకు తిరుగుతున్నారే అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకే ..మోడీకి మద్దతు ఇవ్వవచ్చు.కాని కన్నీళ్లు పెట్టుకున్నానంతగా చెబితే వినే జనానికి ఎబ్బెట్టు అనిపించింది. ఇక లోకేష్ ఒక వ్యాఖ్య చేశారు. గుజరాత్ లో బిజెపినే గత పాతికేళ్లుగా అధికారంలో ఉంది కనుక అభివృద్ది జరుగుతోందట. అందువల్ల ఏపీలో కూడా ఎన్డీఏనే గెలిపించాలని ఆయన అంటున్నారు.ఇదే సూత్రం ఏ పార్టీకైనా వర్తిస్తుంది కదా!గత టరమ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ మళ్లీ అదికారంలోకి వచ్చి ఉంటే జగన్ ప్రారంభించిన ఓడరేవుల నిర్మాణం పూర్తి అయ్యేది కదా! పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వరంగంలోనే ఉండేవి కదా!పరిశ్రమల పేరుతో రూపాయికే ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు ,తమ అనుంగులకు టీడీపీ పెద్దలు ఇచ్చే పరిస్థితి ఉండేదికాదు కదా!అన్నిటికి మించి రెడ్ బుక్ పేరుతో అరాచాకాలకు అవకాశం ఉండేది కాదు కదా! మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు జరిగేవి కాదు కదా!మహిళను వివస్త్రను చేసిన ఘటనకు అవకాశం ఉండేది కాదు కదా!ఇలా అనుకోవచ్చు కదా అని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఇది ప్రజాస్వామ్యం అన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు గుజరాత్ కు అన్నీ తీసుకువెళతారా అని ప్రశ్నించారు .ఆంధ్ర అభివృద్ది చెందుంటే మోడీ అసూయ పడుతున్నారని ధ్వజమెత్తేవారు. ఇప్పుడేమో మోడీనే ఏపీకి అంతా చేస్తున్నారని అంటున్నారు.దేనిని నమ్మాలి. ఏది ఏమైనా అతి సర్వత్రా వర్జయేత్ అని అంటారు. ఈ నేపధ్యంలోనే సిబిఐ మాజీ డైరెక్టర్ ఎమ్. నాగేశ్వరరావు ఒక వ్యాఖ్య చేస్తూ చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకుని మోడీని పొగుడుతున్నారని,ఈ రకంగా పతనం మంచిది కాదని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దిగజార్చుతారా అని కామెంట్ చేశారు.సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ సూటిగానే చంద్రబాబు ప్రభృతులు మోడీని పొగిడిన తీరు తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లు ఉందని విమర్శించారు. భోగాపురం ఎయిర్ పోర్టు మంచిదే.ఎయిర్ బస్సు బాగానే ఉంటుంది.కాని ఎర్రబస్సు ఎక్కేవారు కూడా ఎయిర్ బస్ ఎక్కేలా చేయగలిగితే అభివృద్ది అవుతుంది తప్ప,కేవలం బడాబాబుల కోసమే ఎయిర్ పోర్టు కాకూడదన్నది నిష్టుర సత్యం. -
MLA పదవికి రాజీనామా చేస్తా.. బాబుకు బండారు బెదిరింపులు
-
చంద్రబాబుకి ప్రభుత్వ ఉద్యోగులు డెడ్ లైన్
-
బాబు కుట్రలన్నీ విఫలం.. జగన్ శ్రీకాకుళం టూర్ గ్రాండ్ సక్సెస్..
-
ఆ ముగ్గురిది ఓవరాక్షన్ అంటారేంటి.. అది ఆర్ట్.. ఆర్టిస్టులను అవమానిస్తారా ?
-
మోదీ ముందు యాక్టింగ్ అదుర్స్ కానీ.. జనాలు పిచ్చోళ్ళు కాదు బ్రో
-
ఆయన కచ్చితంగా వైఎస్ జగన్‌ను పొగుడుతారు!
భోగాపురం విమానాశ్రయం పనులు ఎవరు ప్రారంభించారు.. ఎవరు మొదలెట్టారు.. ఎవరి హయాంలో ఎక్కువ పనులు అయ్యాయనేది లోకవిదితం. చంద్రబాబు ఆ ప్రాజెక్టును కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే వాడుకోవడం, ఎలాంటి పాలనాపరమైన అనుమతులు, పర్యావరణ, కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండానే 2019 ఎన్నికల ముందు కేవలం ఓట్లకోసమే శంకుస్థాపన చేసేసిన ఘటన అందరికీ తెలిసిందే.ఆ తరువాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును జెట్ వేగంతో పరుగులెత్తించి కోవిడ్ వంటి విపత్తు సమయంలో సైతం పనులు వేగవంతంగా పూర్తిచేసిన విషయం అందరికీ గుర్తున్నదే. అయితే, విమానాశ్రయం ప్రారంభ కార్యక్రమంలో ఆ శాఖకు సంబంధం లేని పవన్‌కల్యాణ్, లోకేశ్ వంటివారు వేదికమీద ప్రసంగించారు. కానీ... దాదాపు రూ.5వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్న సంస్థ ప్రమోటర్ గ్రంథి మల్లికార్జునరావు (జీఎమ్మార్)కు మాత్రం మైక్ ఇవ్వలేదు. ఆయనతో పాటు సంస్థకు చెందిన ఇద్దరు సీనియర్ ఆఫీసర్లు వేదికమీద ఉన్నారే తప్ప ప్రాజెక్టును పూర్తి చేయడానికి తాము ఎలాంటి శ్రమపడ్డారు.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందింది వంటి కొన్ని పాయింట్లు అయినా వారు చెప్పేందుకు అవకాశం ఇవ్వలేదు. ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సజ్జన్ జిందాల్ ఏమన్నారో గుర్తొచ్చిందా? వాస్తవానికి భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన సందర్భంగా జరిగిన సభలో జీఎమ్మార్ మాట్లాడుతూ.. గతంలో తాము వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించామని, నేడు భోగాపురం ప్రాజెక్టు చేపట్టామని, తండ్రీకొడుకుల సారథ్యంలో పనిచేయడం తమకు గర్వకారణమని చెప్పారు. దాంతో బాటు ఈ ప్రాజెక్టుకు బాగా సహకారం అందించి, కోర్టు కేసులు క్లియర్ చేసి, పలు పాలనాపరమైన అనుమతులు తెచ్చి పనులకు ఒక రూపు ఇచ్చింది కూడా వైఎస్ జగన్ ప్రభుత్వ అనేది అందరికి తెలిసిందే. ఇదే విషయాన్ని మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఒప్పుకున్నారు. దాదాపు 86 శాతం పనులు అప్పటికే పూర్తయ్యాయని చెప్పారు. అంటే కూటమి ప్రభుత్వం పాత్ర ఇందులో కొద్దిగానే ఉందన్నది అందరూ బయటకు చెప్పకపోయినా లోలోన అంగీకరిస్తున్న అంశం అన్నమాట. ఇక కడప జిందాల్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా నాటి వైఎస్ జగన్ సర్కారు భూసేకరణ, పలు అనుమతులు తీసుకొచ్చి సజ్జన్ జిందాల్, వైఎస్ జగన్ కలిపి దానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మారిపోగానే చంద్రబాబు ఆ ప్రాజెక్టును వివాదాస్పదం చేశారు. అయితే, మళ్లీ తామే ఆ సంస్థను ఉద్దరిస్తున్నట్లు రెండోసారి శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా సజ్జన్ జిందాల్ ట్విట్టర్లో పెట్టిన పోస్టు సంచలనం అయ్యింది. మీరిచ్చిన సహకారం, ప్రోత్సాహంతోనే కడప స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు మొదలైంది అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెబుతూ అయన ట్విట్టర్లో చేసిన పోస్టు అందరూ చూసి ఓహో.. ఇదంతా వైఎస్ జగన్ కాలంలోనే ఒక రూపు వచ్చిన ప్రాజెక్టా.. దానికి మళ్లీ చంద్రబాబు ఇప్పుడు బాకా ఊదుకుంటున్నారా అని అర్థం చేసుకున్నారు. పరువు పోతుందని... కడప స్టీల్ ప్లాంట్ సందర్భాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు... ఇప్పుడు మళ్లీ జీఎమ్మార్ కూడా విమానాశ్రయ వేదికపై వైఎస్ జగన్‌ను పొగిడితే, అయన కాలంలోనే పనులన్నీ పూర్తయ్యాయని ప్రధాని సమక్షంలో వేదిక మీద చెబితే తమ పరువు దేశవ్యాప్తంగా పోతుందేమోఅని భయపడి ఏకంగా జీఎమ్మార్‌ను మాట్లాడకుండా, మైక్ ఇవ్వకుండా అడ్డుకున్నారని అంటున్నారు. లేకుంటే సంస్థ ప్రమోటర్ కనీసం రెండు ముక్కలైనా మాట్లాడకుండా ఎలా?.. కేవలం తానుచేయని పనులకు.. తన పాత్ర తక్కువే అయినా ప్రచారం ఎక్కువ చేసుకుంటున్న చంద్రబాబు తన పరువు పోకుండా ఉండేందుకే జీఎమ్మార్‌కు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ప్రజలు అంటున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: -
బీసీ నేతలపై రెడ్‌బుక్!. బాబు సర్కారు అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. అక్రమ అరెస్టులు
-
లోకేశ్ అవినీతి విలయతాండవం చేస్తోంది
తిరుపతి మంగళం: చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మంత్రి నారా లోకేశ్ రెడ్‌బుక్ పాలన సాగిస్తూ ఒక పక్క హింస, మరో పక్క అవినీతి విలయతాండవం చేస్తున్నాయని, ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక సంస్థ అయిన టీటీడీని కూడా వదలడంలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. టీటీడీ పాలక మండలి జూలై 14న ఆమోదించిన 134వ తీర్మానంపై స్వతంత్ర విచారణ జరపాలని, మందులు, వైద్య పరికరాల కొనుగోలులో అవినీతి కుట్రను బయట పెట్టాలని డిమాండ్ చేశారు.టీటీడీ పరిధిలోని ఆస్పత్రులకు అవసరమైన మందులు, ఇంజెక్షన్లు, శస్త్రచికిత్స పరికరాల కొనుగోళ్లలో అమలులో ఉన్న అర్హత నిబంధనలను నారా లోకేశ్ ఒత్తిడితో పాలక మండలి సడలించడం ద్వారా భారీ అవినీతికి తలుపులు తెరిచారని ధ్వజమెత్తారు. నాణ్యమైన మందులు, ఇంజెక్షన్లు, పరికరాలు, ఇతర వస్తువుల సరఫరాకు టెండర్లలో పాల్గొనాలంటే ఇప్పటివరకు కనీసం రూ.100 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలకే అర్హత ఉండేదని, దాన్ని ఇప్పుడు రూ.25 కోట్లకు తగ్గించారని, కొన్ని విభాగాల్లో రూ.15 కోట్ల టర్నోవర్ సరిపోతుందని నిర్ణయించడం వెనక భారీ అవినీతి కుట్ర దాగి ఉందని చెప్పారు.నాసిరకం మందులు, వైద్య సామగ్రి సరఫరా చేసే సంస్థలకు అవకాశం కల్పించి కమీషన్లు దండుకోవడమే ఈ నిర్ణయం వెనుక అసలు లక్ష్యమని తెలిపారు. రోగుల ప్రాణాలతో మంత్రి లోకేశ్ చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు.ఏమిటా అజ్ఞాత కమిటీ..? మందుల సరఫరా సంస్థల టర్నోవర్ నిబంధన సడలింపునకు ఒక అజ్ఞాత కమిటీ సిఫారసు చేసిందని టీటీడీ పెద్దలు కల్ల»ొల్లి కబుర్లు చెబుతున్నారని, బర్డ్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ నేతృత్వంలోని ఆ అజ్ఞాత కమిటీ సిఫారసుల వెనుక ఎవరి హస్తం ఉందని ప్రశ్నించారు. అదే డాక్టర్ జగదీ‹Ùకు స్విమ్స్, చిన్నపిల్లల ఆస్పత్రుల్లో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్ల పర్యవేక్షణ బాధ్యతలు కూడా అప్పగించడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోందన్నారు.టీటీడీ సభ్యురాలిగా ఉన్న ఒక ప్రముఖ ఔషధ తయారీ సంస్థ యాజమాన్య ప్రతినిధి ఈ అజ్ఞాత కమిటీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, లోకేశ్ ఆదేశాల పేరుతో తీర్మానాన్ని ఆమోదించారని చెప్పారు. ఈ తీర్మానంపై కూటమి ప్రభుత్వం స్వతంత్ర విచారణ జరిపి, అసలు కుట్రను బయటపెట్టాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కరుణా కర రెడ్డి డిమాండ్ చేశారు. -
చంద్రబాబు ఉత్తరాంధ్ర జపం అంతా ఉత్తదే
విశాఖ విద్య: ‘చంద్రబాబు నిత్యం ఉత్తరాంధ్ర పేరును జపించడం అంతా ఉత్తదే. వాస్తవానికి ఆయన ఆలోచలన్నీ అమరావతిని అభివృద్ధి చేయడంపైనే ఉన్నాయి. దక్షిణ కోస్తా జోన్‌కు సంబంధించిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును అమరావతిలో ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే మంత్రికి చంద్రబాబు లేఖ రాయడమే ఇందుకు నిదర్శనం’ అని విశాఖపట్నంలో సోమవారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు ధ్వజమెత్తారు. లోక్‌సత్తా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ రైల్వే జోన్ ఎక్కడ ఉంటే అక్కడే ఆర్ఆర్బీ ఉండాలని, అలాకాకుండా ఆర్ఆర్బీని అమరావతిలో ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి లేఖ రాయడం దుర్మార్గమని మండిపడ్డారు.కొందరికి మాత్రమే ఉపయోగపడే భోగాపురం విమానాశ్రయాన్ని చూపించి లక్షలాది మంది ఉత్తరాంధ్రకు చెందిన నిరుద్యోగులకు ఉపయోగపడే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును అమరావతికి ఎత్తుకుపోవడమేనా చంద్రబాబు తెలివితేటలు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో రైల్వే ఉద్యోగాల పరీక్షల కోసం ఒడిశాకు వెళ్లినప్పుడు ఎదురైన చేదు అనుభవాలు ఉత్తరాంధ్ర యువతకు తెలుసని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల పోరాటాల ఫలితంగానే రైల్వే జోన్ వచి్చందని, ఇప్పుడు ఆర్ఆర్బీ కోసం మరో ఉద్యమం అవసరమని స్పష్టంచేశారు.విశాఖలో ఆర్ఆర్బీ ఏర్పాటు కోసం సంతకాల సేకరణ చేపట్టాలని, ఉత్తరాంధ్రకు చెందిన అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఉద్యమ కార్యాచరణలో భాగస్వాములు అయ్యేలా కృషి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, సీపీఐ నాయకుడు జేవీ సత్యనారాయణమూర్తి, పలు స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, ఉత్తరాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. -
పవిత్ర నృత్యంతో ప్రచారార్భాటమా !
సాక్షి ప్రతినిధి, విజయనగరం/ సాక్షి, అమరావతి: ‘‘ఆంధ్రప్రదేశ్‌ను, ఆరుకోట్ల ప్రజలను... ముఖ్యంగా గిరిజన సమాజాన్ని అవమానించారు. మీరు తప్పనిసరిగా క్షమాపణలు చెప్పాలి’’ అంటూ మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఎక్స్‌లో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. గిరిజనులకు పవిత్రమైన థింసా నృత్యాన్ని చంద్రబాబు తన ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం వాడుకోవడంపై జాతీయ స్థాయిలో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవంలో 13 వేల మంది గిరిజన బిడ్డలతో థింసా నృత్యాన్ని ఒక మెగా ఈవెంట్‌గా ఏర్పాటు చేసి, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని, సంప్రదాయాలను అవమానించారంటూ చంద్రబాబు ప్రభుత్వంపై రాష్ట్ర, జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. థింసా నృత్యం..గిరిజన బిడ్డలు ప్రదర్శించే ప్రసిద్ధ జానపద నృత్యం..ఐక్యతకు సంస్కృతికి ప్రతీక. శతాబ్దాలుగా వారసత్వంగా వస్తోంది.సమయం, సందర్భం లేకుండా వీధుల్లో ప్రదర్శించేది కాదు. గిరిజనుల పండుగలు, ప్రత్యేక రోజుల్లో ప్రదర్శించే పవిత్ర కార్యక్రమం.అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా పేరు కోసం, భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ చోరీ కోసం చంద్రబాబు ప్రభుత్వం మొత్తానికి మెగా ఈవెంట్‌గా ఈ థింసా నృత్యాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయంలో జాతీయ స్థాయిలో అక్షింతలు ఎక్కువయ్యాయి. గిరిజనుల సంప్రదాయ నృత్యాన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం ఇలా ప్రదర్శించడంపై గిరిజన సంఘాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.బాబు తీరును దుయ్యబడుతున్న సోషల్ మీడియాజాతీయ మీడియా జర్నలిస్ట్ కదంబిని శర్మ, జాతీయ మీడియా కార్టూనిస్ట్ సతీష్ ఆచార్యతో సహా పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో నిలదీశారు. రూ.కోట్లు ఖర్చు చేసి ఇలాంటి కార్యక్రమాలు అవసరమా. ప్రజాధనాన్ని ఇలా వృథా చేస్తారా అంటూ ఇంకొందరు.. పాపం అడవి బిడ్డలను ఇబ్బంది పెడుతున్నారు అంటూ మరికొందరు, ప్రభుత్వ ప్రచార యావను నిలదీస్తూ పోస్టులు పెట్టారు. వేలాదిమంది బిడ్డలను గిరిజన ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వారికి సరైన వసతి సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందుల నడుమ రాత్రి పగలు శిక్షణ పేరుతో ఇబ్బంది పెట్టి చంద్రబాబు ప్రభుత్వం పబ్బం గడుపుకుందంటున్నారు. ఇదంతా కేవలం ప్రజాధనంతో చేపట్టిన ప్రచారం తప్ప దీనివల్ల గిరిజన సమాజానికి ఏం ప్రయోజనం అంటూ ఎక్స్‌లో పెడుతున్న పోస్టులకు ప్రభుత్వం నుంచి సమాధానం కరువైంది. -
పెమ్మసానిపై అంబటి రాంబాబు ఆగ్రహం
సాక్షి, గుంటూరు: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వైఖరిపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పే అభివృద్ధి ఏంటో ప్రజలు గమనించాలి. అర్ధరాత్రి వేళల్లో మహిళలు ఉన్న ఇళ్లలోకి చొరబడి, తలుపులు పగులగొట్టి పోలీసులు తనిఖీలు చేయడమేనా ఆయన తెచ్చే అభివృద్ధి? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.గుంటూరు జిల్లాలో హోం డిపార్ట్మెంట్ పూర్తిగా పెమ్మసాని జేబులోనే ఉందని, ఆయన కనుసన్నల్లోనే పోలీసు యంత్రాంగం నడుస్తోందని ఆరోపించారు.నా ఇంటిపై దాడి చేయించారు. గతంలో తన ఇంటిపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ అంబటి భావోద్వేగానికి గురయ్యారు. "నా ఇంటిపై దాడి చేసే సమయంలో 24 గంటల్లో సినిమా చూపిస్తా అని పెమ్మసాని ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయనకు తప్పు చేశాననే భావన ఉంది.. ఎందుకంటే ఆయన ఒక నేరస్థుడు అని మండిపడ్డారు.తాను నల్లపాడు పోలీస్ స్టేషన్ లాకప్‌లో ఉన్న సమయంలో జరిగిన ఒక అంతర్గత విషయాన్ని అంబటి బయటపెట్టారు. నేను నల్లపాడు స్టేషన్లో ఉన్నప్పుడు అక్కడి ఇద్దరు సీఐలకు పెమ్మసాని స్వయంగా ఫోన్ చేశారా లేదా? ఒకవేళ ఆయన పోలీసులకు ఫోన్ చేయలేదని నిరూపిస్తే, నేను ఆయన కాళ్లకు దండం పెడతా అంటూ సవాల్ విసిరారు. పెమ్మసాని మీద తనకు ఎలాంటి వ్యక్తిగత కోపం లేదని, కానీ తన ఇంటిపై దాడి చేయించి క్రూరత్వానికి పాల్పడినందుకే తాను తీవ్రమైన కడుపుమంటతో మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. నా ఇంటిపై దాడి చేసిన వారిలో ఇంతవరకు పోలీసులు ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? అని నిలదీశారు. -
ఒకడేమో క్యాన్సర్ అంటాడు.. ఇంకొకడేమో పంచ కట్టుకుని పోజులు ఇస్తాడు
-
‘డీఎస్సీ అక్రమాలను డైవర్షన్ చేయడానికే ఈ కుట్రలు’
తాడేపల్లి : తీవ్రవాదిని అరెస్టు చేసినట్లు ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్టు చేయడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు. తమ పార్టీకి చెందిన సీదిరి అప్పలరాజు, ముస్తఫాపై కూడా ఇలాగే దాడులు చేయించారని మండిపడ్డారు టీజేఆర్. ఈరోజు(సోమవారం, ఆగస్టు 3వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. బీసీ, ఎస్సీలపై చంద్రబాబు దురుద్దేశంతోనే దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ‘ నాగరాజు తన భార్య నైటీని చించి, మాపార్టీ నేతలపై ఆరోపణలు చేయటం సిగ్గుచేటు. పోలీసుల సమక్షంలోనే ఈ సంఘటన జరిగింది. మంత్రులు పార్థసారధి, సంధ్యారాణి సిగ్గు లేకుండా మాపై ఆరోపణలు చేశారు. అధికార మదం తలకెక్కిన మాటలను మంత్రులు మాట్లాడుతున్నారు. లోకేష్ చేసిన డీఎస్సీ అక్రమాలను డైవర్షన్ చేయటానికే ఈ కుట్రలకు తెర తీశారు. తన కొడుకు కనపడటం లేదని కోర్టుకు వెళ్లిన మాల గంగమ్మను పోలీసులు కొట్టి చంపారు. చివరికి పోలీసుల పహరాలోనే ఆమె శవాన్ని దహనం చేయించారు. మా నిజ నిర్ధారణ కమిటీ గ్రామానికి వెళ్తే మమ్మల్ని వారి ఇంటికి కూడా వెళ్లనీయలేదు. గంగమ్మ మృతికి కారణమైన పోలీసులపై కేసు పెట్టాలి. తప్పుడు కేసుల పెట్టి వేధిస్తున్న ఏ పోలీసులనూ వదలం. గుంటూరులో మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై పోలీసులు అరాచకం చేశారు. తనకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యాపారిపై ముస్తఫా ఫిర్యాదు చేస్తే ఆయనపైనే కేసు పెట్టారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు బెదిరింపులపై ఫిర్యాదు చేసిన మాదాలా శ్రీనివాస్ పైనే తిరిగి కేసు పెట్టారు. ఆముదాలవలస ఇంఛార్జి చింతాడ రవికుమార్ పై అక్రమ కేసులు పెట్టారు. ఎస్ఐ మీద అసభ్యకరంగా ప్రవర్తించింది పోలీసులే. ఆ పోలీసులను వదిలేసి, చింతాడ రవి మీద ఎలా కేసు పెడతారు?, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఒక మహిళా అధికారిని వేధిస్తే ఎందుకు కేసు పెట్టలేదు?, ఆ మహిళా అధికారి స్వయంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోరా?, మహిళా ఎస్ఐ కేసులో ధనేటి రమ్మోహనరావు, తేజేశ్వర్రావు ఇద్దరూ స్థానికంగా లేకపోయినా కేసు పెట్టారు. ఎన్.సురేష్ అనే డాక్యుమెంట్ రైటర్ పైన కూడా అలాగే కేసు పెట్టారు. ఇలాంటి అక్రమ కేసులతో రాష్ట్రం పరువు తీస్తున్నారునీట్ పేపర్ లీకైనందున కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే మరి లోకేష్ ఏం చేస్తున్నారు?, డీఎస్సీ అక్రమాలపై నైతిక బాధ్యత వహించరా?, ఎమ్మెల్యే విరూపాక్షిని బేషరతుగా విడుదల చేయాలి. సీసీ కెమెరా హార్డ్ డిస్కులను భద్రపరచాలి. చింతాడ రవికుమార్ కేసులో అక్కడ లేని వారిపై కేసులను ఉపసంహరించుకోవాలి. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
కాన్పులు.. కంటి ఆపరేషన్లు కట్..ఆరోగ్యశ్రీలో కీలక సేవలకు కోత
-
పోలీసులా..? రౌడీలా? అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేస్తారా..?
-
ఈనాడు ఫేక్ ప్రచారాలు.. భోగాపురం ఎయిర్ పోర్టు పై స్టేట్మెంట్
-
YSRCP నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్న పోలీసులు
-
విరుపాక్షి అన్నతో మాట్లాడినప్పుడు నాతో చెప్పిన మాట... YSRCP నేతలు ఫైర్
-
మా సమస్యలు తీర్చకపోతే ఉద్యమమే.. బాబు సర్కార్ కు బొప్పరాజు వార్నింగ్
-
ఉత్తరాంధ్రలో జగన్ వెంటే జనం.. కూటమిలో కలవరం?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవలి కాలంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అశేష జనం తరలివచ్చి ఆయనకు స్వాగతం చెబుతున్న తీరు సహజంగానే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు ఆందోళన కలిగిస్తుంది. శ్రీకాకుళం వద్ద అంపోలు జైలులో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పరామర్శించడానికి వెళ్లారు. ఈ టూర్‌ను రెండు రకాలుగా చూడాల్సి ఉంటుంది. ఒకటి ఉత్తరాంధ్రలో ప్రజల అభిమానం చూరగొనడం ఒక ఎత్తు అయితే, అప్పలరాజు కుటుంబాన్ని, అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జగన్ వివరించిన వైనం మరో ఎత్తుగా ఉంది. విశాఖ వరకు విమానంలో వెళ్లి, అక్కడ నుంచి రోడ్డు మార్గాన వాహనంలో ప్రయాణం చేశారు. ఆ క్రమంలో వివిధ ప్రాంతాలలో ,రోడ్డు పక్కన జనం తండోపతండాలుగా గుమికూడడం, ఆయనతో కరచాలనం చేయాలని తహతహడలాడడం, పోలీసులు అడ్డుకుంటున్నా,పొలాలనుంచి వాగులు,వంకలు దాటుకుంటూ జగన్ కలుసుకోవడం గమనించిన వారెవరికైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో ఓడిపోయిందంటే నమ్మబుద్ది కాదు. ప్రముఖ మేధావి పరకాల ప్రభాకర్ చెప్పినట్లు గత ఎన్నికలలో ఏభై లక్షల ఓట్ల గోల్ మాల్ తతంగం ఏదో జరిగి ఉండాలని చాలామంది విశ్వసిస్తున్నారు. జగన్ ప్రభుత్వం జనానికి మేలు చేయకపోతే, ఈ స్థాయిలో వివిధ వర్గాలవారు ముఖ్యంగా,పేద,మద్య తరగతి ప్రజలు తరలిరారు. అంతేకాక కూటమి ప్రభుత్వం తన వాగ్దానాలను అరకొరగా మాత్రమే అమలు చేసి, అనేక హామీలను ఎగవేసిన వైనం, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగా క్షీణించడం, రెడ్ బుక్ పేరుతో అరాచక పాలన సాగిస్తుండడం వంటివి బాగా ప్రభావం చూపుతున్నట్లు అనిపిస్తుంది. అందుకే జగన్ కోసం జనం అంత పెద్ద ఎత్తున వచ్చారనుకోవాలి. విశాఖ ఎయిర్ పోర్టు మొదలు ఆయా చోట్ల ఆయనను నిలిపి తమ సమస్యలను విన్నవించారు. ప్రజలు పెద్ద ఎత్తున వస్తుండడంతో ఆయన వాహనం దిగి వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. భోగాపురం విమానాశ్రయం వద్ద ధాంక్యూ జగన్ సర్ అంటూ కొంతమంది ప్లకార్డులు ప్రదర్శించారు.భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి జగన్ చేసిన కృషిని వారు గుర్తు చేసుకున్నారు. కొన్ని చోట్ల దివ్యాంగులు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. జగన్ టూర్లో జనం లేకుండా చేయాలని పోలీసులు విశ్వయత్నం చేయకపోలేదు.అనేక చోట్ల రోడ్లపైకి రానివ్వకుండా, ఆయనను కలుసుకునే అవకాశం ఇవ్వకుండా తాడుతో వెనక్కి నెట్టేయడం వంటివి చేశారు. అయినా అభిమానులు వాటన్నిటిని తోసుకుంటూ జగన్ వెంట పరుగులు తీశారంటే అతిశయోక్తి కాదు. కూటమి ప్రభుత్వంపై ప్రజలలో కలిగిన విరక్తికి ఇది దర్పణం పడుతోందన్న విశ్లేషణలు వస్తున్నాయి.జనం ఒత్తిడితో నిర్ణీత టైమ్ కన్నా జగన్ ఆలస్యంగా జైలు వద్దకు చేరుకోవడంతో అప్పలరాజును కలుసుకోలేకపోయారు. కాని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి జగన్ ధైర్యం చెప్పి వచ్చారు. వారితో కలిసి మీడియాతో మాట్లాడారు.మరో కోణం చూస్తే అప్పలరాజు మాజీ మంత్రి. ఆయన మత్సకార వర్గానికి చెందినవారు. ఆయా అంశాలపై చక్కని క్లారిటీతో మాట్లాడుతుంటారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారు. ఎవరైతే సమర్దంగా వైఎస్సార్సీపీ పక్షాన పనిచేస్తుంటారో వారి గొంతు నొక్కడానికి కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా రకరకాల కుట్రలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఏ చిన్న అవకాశం వచ్చినా వైఎస్సార్సీపీ మద్దతుదారులను జైళ్లలోకి పంపిస్తున్నారు.అయినా వారు వెనక్కి తగ్గకపోవడం కూటమి ప్రభుత్వానికి ఆందోళనగా మారింది. అప్పలరాజు కుమారుడు ఆరవ్ బైక్ నడుపుతున్నప్పుడు ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. దాని కారణంగా గొర్రెల కాపరి ఒకరు మరణించారు. అది దురదృష్టకర ఘటన. ఇంతవరకు కేసు పెట్టడాన్ని జగన్ తప్పుపట్టలేదు. కాని ఆ ఆరవ్ పై హత్యకేసు బనాయించడంపై జగన్ బాధపడ్డారు. ఆయన కొద్ది రోజుల క్రితం విశాఖ వచ్చినప్పుడు కూడా తప్పుపట్టారు.ఇక అప్పలరాజుపై సాక్ష్యాలు తారుమారు యత్నం చేశారంటూ కేసు పెట్టి జైలులో నిర్భంధించారు. ఆరవ్ కు బెయిల్ వచ్చింది కాని, అప్పలరాజు ఇంకా జైలులోనే ఉన్నారు.ఈ సందర్భంగా బాదిత కుటుంబాన్ని ఆదుకోవడానికి అప్పలరాజు చేసిన ప్రయత్నాలను కూడా జగన్ వివరించారు.ఈ కేసును కుల వివాదంగా చంద్రబాబు ప్రభుత్వం మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని జగన్ తీవ్రంగా ఖండించారు. ఇదంతా చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనకు ప్రతిబింబమని ఆయన మండిపడ్డారు. మరణించిన వ్యక్తి యాదవ వర్గానికి చెందినవారు కనుక, మంత్రి పార్ధసారధిని పలాస పంపించిన వైనాన్ని, ఆ సామాజికవర్గానికి చెందిన కొందరితో ర్యాలీలు చేయించడాన్ని జగన్ ఆక్షేపించారు.పోనీ యాదవుల పట్ల ప్రభుత్వం ఏమైనా సానుకూలంగా ఉందా అంటే ప్రకాశం జిల్లాలో ఒక ఘటనలో ఫిర్యాదు చేసిన యాదవులపైనే కూటమి ప్రభుత్వం ఎదురు కేసు పెట్టిన వైనాన్ని ఉదహరించారు.అంతేకాక విశాఖలో వైఎస్సార్సీపీ యాదవ మహిళకు మేయర్ పదవి ఇస్తే ,ఆమెను పదవినుంచి దించేశారని జగన్ విమర్శించారు. రోడ్డు ప్రమాద ఘటనలన్నిటిలోను ఒకే రకంగా వ్యవహరిస్తున్నారా?అని జగన్ వేసినప్రశ్న సమంజసంగానే ఉంది. చాలా కేసులు అసలు పోలీస్ స్టేషన్ వరకు రావు. కొన్ని కేసులలో అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిన సందర్భాలు ఉన్నాయి. అధికార పార్టీకి చెందినవారెవరైనా ఇలాంటి ప్రమాద ఘటనలలో ఉన్నా,వారిపై కేసులే పెట్టరు.అందుకు కొన్ని ఉదాహరణలను కూడా జగన్ పేర్కొన్నారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే కారులో ఉండగానే ప్రమాదం జరిగిందని, అలాగే పాతపట్నం ఎమ్మెల్యే కుమారుడు కారు నడుతుండగా యాక్సిడెంట్ అయిందని, ఆ ఘటనలలో ఎవరిపైన కేసులు పెట్టారని జగన్ వేసిన ప్రశ్నకు సమాధానం లేదు. ఒక్కొక్కరికి ఒక న్యాయం అమలు చేయడం అంటే విషపు విత్తనాలు నాటడమేనని జగన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు హింసాత్మక సంఘటనలు జరిగినా, వాటిలో టీడీపీవారు నిందితులుగా ఉంటే తూతూ మంత్రంగా కేసులు పెట్టడం చేస్తున్నారు.లేదా అసలు కేసులే పెట్టడం లేదు. జనసేనకు చెందినవారు పోలీస్ స్టేషన్ లపై వరసగా నాలుగురోజుల పాటు దాడులు చేసినా కేసులు లేకపోవడాన్ని ప్రజలంతా గమనించారు. అప్పలరాజును పరామర్శించడానికి జగన్ వెళ్లడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. చిత్రమేమిటంటే తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆయా కేసులలో నిందితులను పరామర్శించడానికి వెళ్లారు.ఆయనే కాదు.ఇతర టీడీపీ నేతలు కూడా అలా చేసిన ఉదాహరణలు ఉన్నాయి.అదేమీ తప్పుకాదు.కాని వైఎస్సార్‌సీపీవారు చేస్తే మాత్రం టీడీపీ విమర్శలు చేస్తుంటుంది. ఇక తనపై ఉన్న కేసుల్లో సాక్ష్యులను మేనేజ్ చేసి వారితోనే కేసులను ఉపసంహరించేలా చంద్రబాబు చేస్తున్నారని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ పేరుతో ఆయా కేసులను చంద్రబాబు ఎత్తివేయించుకుంటున్న తీరును వైఎస్సార్సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఒక ఫ్యాక్షన్ హత్య జరిగితే,దానికి రాజకీయ రంగు పులిమి స్వయంగా చంద్రబాబే వెళ్లి ఆ హతుడి పాడె మోశారు.పుంగనూరు వద్ద టీడీపీ కార్యకర్తలు పోలీసులపై దాడి చేశారు. ఆ సందర్భంలో పోలీస్ వాహనాన్ని కూడా దగ్ధం చేశారు. రాళ్లదాడిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్ను కూడా పోయింది. ఆ కేసు నిందితులను చంద్రబాబు పరామర్శించారా? లేదా? అవన్ని ఎందుకు చంద్రబాబుపైనే రెండు హత్యాయత్నం కేసులు నమోదు అయి ఉన్నాయే!అవి కాకుండా మరికొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎంతసేపు ఎదుటివారిపై ఆరోపణలు చేసి చంద్రబాబు వాటి గురించి ఎందుకు మాట్లాడరు? గతంలో గౌరు వెంకటరెడ్డి అనే నేత కాంగ్రెస్ లో ఉండేవారు. ఆయనకు ఒక కేసులో శిక్షపడి జైలులో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి పరామర్శకు వెళితే, అప్పుడు కూడా చంద్రబాబు విమర్శలు చేశారు.ఆ తర్వాత కాలంలో గౌరు వెంకటరెడ్డి, చరిత దంపతులను టీడీపీలో చేర్చుకుని చరితకు టీడీపీ టిక్కెట్ కూడా ఇచ్చారు. అలా ఉటుంది ఆయన రాజకీయం. చంద్రబాబు ఏమి చేసినా రైటు, ప్రత్యర్ధులు ఏమి చేసినా తప్పు అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఇదంతా ఏమిటంటే మీడియా మేనేజ్ మెంట్ తనకు తెలిసినంతగా మరెవ్వరికి తెలియదన్నదే ఆయన నమ్మకం కాబట్టి అనుకోవాలి. సమయం అయిపోయిందని జైలులో ఉన్న అప్పలరాజును కలుసుకునే అవకాశం అధికారులు జగన్‌కు ఇవ్వలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి స్వయంగా వెళితే, ప్రభుత్వం కొంత బ్రాడ్ మైండ్‌తో అప్పలరాజుతో ములాఖత్‌కు అవకాశం ఇచ్చి ఉంటే హుందాగా ఉండేది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న ప్రభుత్వం నుంచి అలాంటివి ఆశించడం అత్యాశే అవుతుందేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఇది ప్రజాస్వామ్యమేనా? లేక జంగిల్ రాజ్యమా? YS జగన్ ఆగ్రహం
-
బాబు, పవన్ తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు
-
జంగిల్ రాజ్.. తలుపులు పగులగొట్టి అర్ధరాత్రి అరెస్టులా?: భరత్ ఫైర్
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో జంగిల్ రాజ్ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. అర్ధరాత్రి తలుపులు పగులగొట్టి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎల్లప్పుడూ చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండరు.. పోలీసులు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.మాజీ ఎంపీ మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి నేతలు వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. అర్ధరాత్రి అరెస్టులు ఎందుకు?. కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు?. ఎల్లప్పుడూ చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండరు.. మీరు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే సోదరుడి చేయి విరగొట్టారు. చంద్రబాబు డైరెక్షన్లో కేవలం బీసీ నేతలపైనే దాడులు జరుగుతున్నాయికారుమూరి సునీల్, విరూపాక్షి, సీదిరి అప్పలరాజు.. ఇలా బీసీ నేతలందరినీ అరెస్టు చేస్తున్నారు. బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఈ అరెస్టులు జరుగుతున్నాయి. అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు... కచ్చితంగా పోలీసులు కూడా మూల్యం చెల్లించుకుంటారు. చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న పోలీసులను న్యాయస్థానం ముందు నిలబెడతాం. పొగాకు రైతులకు అండగా ఉండేందుకు ఈనెల ఐదో తేదీన వైఎస్ జగన్ దేవరపల్లి టొబాకో బోర్డుకి వస్తారు.డబల్ ఇంజిన్ సర్కార్ అని చెబుతున్న కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది?. భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి కూటమి నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా 2019లో శిలాఫలకం టీడీపీ ప్రభుత్వం వేసేసింది. 2900 ఎకరాలు వైఎస్సార్సీపీ హయాంలో భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఇచ్చారు. -
నువ్వు దీనికే పనికొస్తావ్.. చంద్రబాబును ఏకిపారేసిన అమర్నాథ్..
-
అల భోగాపురంలో ఇలా భజన పరులు చిడతలు.. వెంకట్ రెడ్డి సెటైర్లు
-
పవన్, బాబు మోడీ భజన.. ఒకపక్క చిడతల అప్పారావు.. ఇంకోపక్క చిడతల పాపారావు
-
అమరావతిని గ్రేటర్ కమ్యూనిటీగా మార్చేస్తున్నారు.. ఆ రోజు జగన్ ను నేను కలిసినప్పుడు నాతో అన్న మాట
-
రాజకీయ డ్రామా కోసం 40 కోట్లు
-
గ్రామాల్లో ఇంటిపన్ను.. బాదుడే.. బాదుడు!
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ప్రజలపై పన్నుల మోత మోగుతున్నా, సమస్యల వెత మాత్రం తీరడం లేదు. గత రెండేళ్లలో ఇంటి పన్నులు 40 శాతానికి పైగా పెంచి వసూళ్ల లక్ష్యాన్ని 40 శాతానికిపైగా పెంచిన చంద్రబాబు ప్రభుత్వం, అదే స్థాయిలో గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వసూలు చేసిన నిధుల వినియోగంపై ఆంక్షలు విధించడంతో పంచాయతీలు నిధుల కొరతను ఎదుర్కొంటుండగా, పారిశుధ్య నిర్వహణ క్షీణించి అంటువ్యాధులు పెరుగుతున్న పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఆందోళన కలిగిస్తోంది. మోయలేని పన్ను భారాలు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి ఆర్థిక సంవత్సరం 2023–24లో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పన్ను (బకాయిలు కాకుండా ఆ ఏడాది కొత్తగా నిర్ధారించిన) వసూలు లక్ష్యం రూ. 563.40 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆ మొత్తం ప్రతిపాదన రూ.797.03కు పెరిగింది. పెరిగిన ప్రతిపాదన పన్నులే రూ.233.63 కోట్లు. పాత ఇంటిపన్ను బకాయిలతో పాటుగ్రామాల్లో టాప్ కనెక్షన్లు, వ్యాపార షాపుల వసూలు చేసే ఇతర పన్నులు అన్నీ ఈ ఏడాది కొత్త ఇంటి పన్నులతో కలిపి ఏప్రిల్ ఒకటి నుంచి మొదలైన ప్రస్తుత 2026–27 ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీల ద్వారా మొత్తం పన్ను వసూలు లక్ష్యం రూ.1,233.99 కోట్లుగా పంచాయతీరాజ్ శాఖ నిర్ధారించింది. మురుగుకాల్వల నిర్వహణ శూన్యం గ్రామాల్లో మురుగుకాల్వల పన్నును కూడా ప్రభుత్వం ఇంటి పన్నులోనే కలిపి వసూలు చేస్తోంది. గత 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ. 141.90 కోట్ల పాత బకాయిలతో కలిపి గ్రామ పంచాయతీల ద్వారా మొత్తం 799.22 కోట్లు ఇంటి పన్నులుగా వసూలు చేస్తే, అందులో 36.87 కోట్లు మురుగునీటి పన్ను పేరు చెప్పి ఇళ్ల యజమానుల నుంచి వసూలు చేసినవే. ప్రస్తుత 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఈ మురుగు కాల్వ పన్ను రూ. 44.41 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విభాగంలో పన్ను వసూళ్లు భారీగా పెరుగుతున్నా మురుగు కాల్వల నిర్వహణ విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. దీనివల్ల గ్రామాల్లో దోమలు ప్రబలుతున్నాయి. ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. టార్గెట్లతో వసూళ్లు... వ్యయాలపై సవాలక్ష ఆంక్షలు గత 2025–26 ఆర్థిక సంవత్సరం గ్రామాల్లో ఇంటి పన్నులు వంద శాతం వసూలు చేయాల్సిందేనంటూ ప్రభుత్వం టార్గెట్లు విధించింది. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులకు రోజువారీ టార్గెట్లు పెట్టి బకాయిలతో కలిపి ఇంటి పన్ను పేరిట మొత్తం 799.22 కోట్లు, ఇతర పన్నుల రూపంలో మరో రూ. 173.41 కోట్లు కలిపి మొత్తం రూ. 1,015 కోట్లు వసూలు చేసింది. కానీ, ఇంటి పన్నులుగా వసూలు చేసిన నిధులను ఆయా గ్రామ పంచాయతీలు తమ గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టుకోవడానికి మాత్రం ప్రభుత్వం సవాలక్ష ఆంక్షలను అమలు చేస్తోంది. దీంతో చేసిన పనులకు బిల్లుల పెట్టడానికి సైతం అధికారులు భయపడుతున్నారు. ఇంటి పన్నులుగా వసూలు చేసిన నిధులు దాదాపు రూ. 800 కోట్ల జనరల్ ఫండ్ నిధులు ఆయా పంచాయతీల సీఎఫ్ఎంఎస్ ఖాతాల్లో మూలుగుతున్నా అభివృద్ధి పనులు మాత్రం చేపట్టడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై నెలాఖరు వరకు నాలుగు నెలల కాలంలో మొత్తం 13,351 గ్రామ పంచాయతీలకు గాను కేవలం 951 గ్రామ పంచాయతీల్లో దాదాపు రూ. 54 కోట్ల పనులు మాత్రమే జరిగినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. బాదుడు పెరుగుతుందన్న ప్రభుత్వ సంకేతాలు! పంచాయతీరాజ్ శాఖకు మంత్రిగా కొనసాగుతున్న ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఈ జూన్ 1న గ్రామాల్లో ఇంటి పన్నులపై నిర్వహించిన ఒక సమీక్ష సమావేశంలో గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను, తదితర పన్నులను సరిగ్గా వసూలు చేస్తే రూ. 5,496 కోట్ల ఆదాయం వస్తుందంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. పంచాయతీల్లో సొంత ఆదాయ వనరులు పెరగాలని, గ్రామ పంచాయతీల స్థాయిని బట్టి గ్రామాల్లో వివిధ ఇంటి పన్ను స్లాబ్స్లతో ట్యాక్సులు నిర్ధారించాలని ఆ సమావేశంలో పవన్‌కల్యాణ్ అధికారులకు సూచించారు. దీని ద్వారా రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలపై పన్ను భారం మరింత పెరగనున్నట్టు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చిందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇవ్వాల్సిందిపోయి.. గుంజుకుంటున్న సర్కార్ సాధారణంగా గ్రామ పంచాయతీలు ఇంటి పన్ను, ఇతర పన్నుల రూపంలో వసూలు చేసే నిధులను ఆయా పంచాయతీలు స్థానిక అవసరాలకు అనుగుణంగా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం గ్రామ పంచాయతీలు పన్ను రూపంలో వసూలు చేసే డబ్బులను వివిధ అవసరాలకు ప్రభుత్వానికి జమ చేయాలని ఆదేశాలిచ్చింది. గ్రామ పంచాయతీల్లో ఇళ్ల పన్నుగా వసూలు చేసిన మొత్తంలో ఒక శాతం ప్రభుత్వానికి విరాళం (కంట్రిబ్యూషన్)గా చెల్లించాలని జూలై 8న చంద్రబాబు ప్రభుత్వం జీవో జారీ చేయడం గమనార్హం. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ఖజానా నుంచి నిధులు మంజూరు చేయాల్సింది పోయి వాటి నుంచే డబ్బు లాక్కోవడం ఏమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
మీ హద్దులు చూసుకోండి బాబూ!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల భవన్ స్థలానికి ఇంతవరకు సర్వే పూర్తి కాలేదు. రెండు రాష్ట్రాలకు చెందిన స్థలం ఎవరిది ఎక్కడనేదీ ఇప్పటి వరకు తేలనేలేదు. ప్రతిరోజూ ఈ స్థల సర్వే విషయంలో రెండు రాష్ట్రాల అధికారులు తర్జనభర్జన పడుతూనే ఉన్నారు. వీటన్నింటినీ పక్కన పెడుతూ భవన్లో ఉన్న నర్సింగ్ హాస్టల్‌ను కూల్చి, అక్కడ కొత్త బిల్డింగ్ కట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సర్వత్రా విమర్శలకు గురవుతున్నాయి. తొందరపాటు చర్యలుసీఎం చంద్రబాబు రెండు నెలల క్రితం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్‌ను నిర్మిస్తున్నట్లు ప్రకటించేశారు. ఇందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది, దీని నిర్మాణం కోసం రూ.123 కోట్లు కూడా కేటాయింపులు చేశారు. సరిగ్గా, ఇక్కడే కేంద్రం అక్షింతలు వేసింది, అసలు భవన్‌కు సంబంధించి సర్వే పూర్తి చేయకుండా, తగిన రిజిస్ట్రేషన్లు జరక్కుండా ఏరకంగా మీరు భవన్‌ను నిర్మిస్తారంటూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇక్కడి రాష్ట్ర అధికారులను నిలదీసింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భవన్ పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్ హౌస్ ఆక్రమణల పర్వం!2024, జనవరి నెలలో అప్పటి సీఎం వైఎస్ జగన్ సర్కార్‌లో ఢిల్లీలోని భవన్‌కు స్థలం కేటాయింపులు జరిగాయి. 60–40 నిష్పత్తిలో ఈ భవన్ స్థలాన్ని విభజించారు. 60 శాతం భూ మిని ఆంధ్రప్రదేశ్‌కు, 40 శాతం భూమిని తెలంగాణకు ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆ తర్వాత అప్పటి నుంచి నేటి వరకూ ఇక్కడ సర్వే అనేది జరగనేలేదు. పైగా, ఆంధ్రప్రదేశ్ భవన్‌ను ఆనుకుని ఉన్న హైదరాబాద్ హౌస్... కొద్దికొద్దిగా భవన్‌కు సంబంధించిన భూమి ని కబ్జా చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. అయినా, ఇక్కడి రెండు రాష్ట్రాల అధికారులకు మాత్రం చీమకుట్టినట్లు లేదు. క్షేత్రస్థాయిలో చేదు అనుభవంఆంధ్రప్రదేశ్ భవన్‌ను రూ.123 కోట్లతో నిర్మిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది, ఇందుకు సంబంధించిన పనులను కేంద్ర సంస్థ అయిన ‘ఎన్బీసీసీ’కి అప్పగించింది. కేబినెట్ ఆమోదముద్ర వేసి, నిధులు కేటాయించిన తరువాత క్షేత్రస్థాయిలోకి వచ్చిన ‘ఎన్బీసీసీ’కి చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వద్దకు వెళ్లి అనుమతులు అడిగిన నేపథ్యంలో.. ఇటు ఎన్బీసీసీకి, అటు రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు పడ్డాయి. ‘2024లో రెండు భవన్లను పునర్విభజిస్తూ, పంపకాలు జరిగాయి. అయినా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు సర్వే పూర్తి చేయలేదు. ఈ సర్వే, సంబంధిత రిజిస్ట్రేషన్లు పూర్తి కాకుండా మీరు ఆంధ్రప్రదేశ్ భవన్‌ను ఎలా నిర్మిస్తారు?’అంటూ పట్టణాభివృద్ధిశాఖ నిలదీసింది. దీంతో ఇటు ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులకు, అటు ఎన్బీసీసీ అధికారులకు నోట మాటరాలేదు. దీంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక అధికారులు అయోమయానికి గురవుతున్నారు. అంతా గొప్పలు కోసమేఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఏదైనా కట్టడం నిర్మించాలంటే ప్రధానమంత్రి కార్యాలయంతో సహా 18 శాఖల నుంచి అధికారిక అనుమతులు రావాలి. ఈ విషయం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఢిల్లీలో పనిచేసే ఆయా భవన్లకు చెందిన అధికారులకు తెలిసిందే. ఈనేపథ్యంలో పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులు పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ‘అసలు సర్వేనే కాకుండా, అనుమతులు ఎలా వస్తాయి?, తగిన అధికారిక బదలాయింపు ప్రక్రియ పూర్తి కాకుండా కొత్త భవన్ నిర్మాణానికి ఏపీ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం, ని«ధులు కేటాయించడం ఏమిటి? అనుమతులు లేకుండా నిర్మాణం చేయడం కష్టమనే విషయం ఎన్బీసీసీకి తెలియదా? వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేవలం చంద్రబాబు తన గొప్పల కోసమే ఇటువంటి బిల్డప్పులు ఇస్తున్నారనే విమర్శలు హస్తిన వేదికగా వ్యాపిస్తున్నాయి. కన్సల్టెంట్ల నియామకంలోనూ అక్రమాలే ఆంధ్రప్రదేశ్ భవన్లో ప్రస్తుతం నలుగురు కన్సల్టెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణకు సంబంధించి పనిచేసే కన్సల్టెంట్లకు రూ.70 వేల వేతనం మాత్రమే ఆ ప్రభుత్వం ఇస్తుండగా, ఆంధ్రప్రదేశ్ కన్సల్టెంట్లకు మాత్రం ఒక్కొక్కరికీ రూ.1 లక్ష జీతాన్ని ప్రభుత్వం ఇస్తోంది. ఈ నలుగురి కన్సల్టెంట్ల నియామకంలోనూ భారీ అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అసలు ఏ అర్హత లేని ఓ మహిళా ఉద్యోగికి రూ.1 లక్ష ఇచ్చి పనిచేయిస్తున్న వైనంపై విమర్శలు వ్యాపిస్తున్నాయి. ఇక కన్సల్టెంట్ల పాత్రపైనా చర్చ జరుగుతోంది.కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేయడం, అనుమతులు తీసుకురావడం, ని«ధులు రాబట్టడం వంటి విషయాల్లో వీరు ముందుండాలి. అయితే లక్షల రూపాయల వేతనం తీసుకుంటున్న వీరు ఏమి చేస్తున్నారు? ప్రభుత్వానికి సరైన సలహాలు ఎందుకు ఇవ్వడం లేదు? ఒకవేళ ఇస్తే సర్వేనే పూర్తి కాకుండా భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.123 కోట్లు కేటాయింపులు ఎలా చేసింది? ఇప్పుడు కేంద్రం ముందు నవ్వులు పాలవడం ఏమిటి? వంటి ప్రశ్నలు హస్తిన వేదికగా గుప్పుమంటున్నాయి. -
ఆర్టీసీ పరిరక్షణ కోసం తగ్గేదేలే..
సాక్షి, అమరావతి: విద్యుత్ బస్సుల సాకుతో ఆర్టీసీని ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు ప్రభుత్వ ప్రయత్నాలపై పోరాడుతున్న ఆర్టీసీ ఉద్యోగులు నేటి (సోమవారం) నుంచి మూడోదశ ఉద్యమానికి సిద్ధమయ్యారు. జూన్ 12, జూలై 1 తేదీల్లో రెండుదశల్లో ఉద్యమం చేపట్టినప్పటికీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంతో.. ఆర్టీసీ పరిరక్షణ కోసం తగ్గేదేలేదంటూ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు మూడోదశ ఆందోళన చేపడుతున్నారు. గ్రీవెన్స్ డే (పీజీఆర్ఎస్)ని పురష్కరించుకుని సోమవారం అన్ని జిల్లాల్లో ముఖ్యమంత్రికి పంపమని కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో అన్ని సంఘాలు, రిటైర్డ్, అవుట్ సోర్సింగ్, కార్మిక, విద్యార్థి, యువజన, ప్రభుత్వ ఉద్యోగసంఘాల జేఏసీ నాయకులను కలిసి మద్దతు కోరనున్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో అన్ని డిపోలు, యూనిట్లలో నల్లబ్యాడ్జీలు ధరించి భారీస్థాయిలో సామూహిక రిలే నిరాహారదీక్షలు చేపడతారు. 28న అన్ని జిల్లాల్లో ప్రజారవాణా అధికారి (డీపీటీవో) కార్యాలయాల వద్ద నల్లబ్యాడ్జీలతో మహాధర్నాలు నిర్వహిస్తారు. సంస్థ పరిరక్షణ, ప్రజారవాణా వ్యవస్థ బలోపేతం, పీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకపోతే సెపె్టంబర్ 3వ తేదీ నుంచి నాలుగోదశ ఉద్యమ కార్యాచరణను తీవ్రం చేస్తామని జేఏసీ కన్వినర్లు పలిశెట్టి దామోదరరావు, వై.శ్రీనివాసరావు ఇప్పటికే ప్రకటించారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఇవే..» విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేట్ ఆపరేటర్లకు అవకాశం కల్పిస్తూ రూ.వేలకోట్ల విలువైన ఆర్టీసీ డిపో స్థలాలను లీజు పేరుతో కట్టబెట్టి దశలవారీగా ప్రైవేట్‌పరం చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. » విద్యుత్ బస్సులను ఆర్టీసీ సంస్థ ద్వారా కొనుగోలు చేసి నిర్వహించాలి. » విజయవాడలోని విద్యాధరపురం, గుంటూరు–2, నెల్లూరు–2, మంగళం బస్సు డిపోలను వెంటనే పునఃప్రారంభించాలి. » స్త్రీశక్తి స్కీం అమలుతో మహిళా ప్రయాణికుల కోసం బస్సులు పెంచాలి. » ఆర్టీసీలో ఉద్యోగుల ఖాళీలు భర్తీచేయాలి. » ప్రతి నెల 7వ తేదీలోపు ఆర్టీసీ ఉద్యోగులకు నేరుగా జీతాలు చెల్లించాలి. » ఏపీపీటీడీ ఆర్టీసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్, డ్రైవర్లకు మినిమమ్ టైం స్కేల్ ఇవ్వాలి. » ఆర్టీసీ ఉద్యోగులకు వీక్లీ ఆఫ్‌లు, లేబర్ హాలీడేస్, ఫ్యామిలీ హెల్త్‌కార్డులు ఇవ్వాలి. » పదేళ్ల సర్వీస్ దాటినవారిని రెగ్యులర్ చేయాలి. -
‘ఆత్మ’ సాక్షిగా.. క్రెడిట్ చోరీ కుట్రలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/పూసపాటిరేగ: : నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక.. అంటూ నమ్మబలికే ఈనాడు తన నిజ స్వరూపాన్ని మరోసారి బయట పెట్టుకుంది! చంద్రబాబు సర్కారుకు భజంత్రీలు వాయించడం, తప్పుడు కథనాలను ప్రచురించడం, పాఠకుల కళ్లకు గంతలు కట్టడం, తిమ్మిని బమ్మి చేయడంలో తనకు సాటి లేదని మరోసారి రుజువు చేసుకుంది! భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్‌ను చంద్రబాబు ఖాతాలో వేసేందుకు తహతహలాడుతూ ‘ఆత్మ’సాక్షిగా దొరికిపోవడం దీనికి పరాకాష్ట! మూడేళ్ల క్రితం మరణించిన ఓ వ్యక్తి భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంబోత్సవాన్ని చూసి ఉప్పొంగిపోతున్నారంటూ ఈనాడు ప్రధాన సంచికలో ఆదివారం ప్రచురించిన కథనం సర్వత్రా కలకలం రేపుతోంది. చేపల కంచేరు గ్రామానికి చెందిన మైలపల్లి యల్లాజీ అనే రైతు ఎయిర్‌పోర్టుకు భూమి ఇచ్చారని, నేడు ప్రారంబోత్సవాన్ని చూసి ఉప్పొంగిపోతున్నారని ఈనాడు మైక్ ముందుకొచ్చి చెప్పినట్లు కథనాన్ని అచ్చోసింది. నిజం ఏమిటంటే.. మైలపల్లి యల్లాజీ 2023 జూలైలో దారుణ హత్యకు గురయ్యారు. ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే, జనసేన నాయకురాలు లోకం మాధవి స్వయంగా యల్లాజీ పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై నివాళులర్పించారు. అదే విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలోనూ పోస్ట్ చేశారు. మూడేళ్ల క్రితం కన్నుమూసిన వ్యక్తి.. మళ్లీ తిరిగి వచ్చి ఈనాడు ప్రతినిధితో మాట్లాడారని తప్పుడు కథనాలు రాయడం పాఠకులను, రాష్ట్ర ప్రజలను తీవ్రంగా వంచించడమేనని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఈనాడు వండి వార్చే అబద్ధాలకు ఇదో మచ్చు తునక అని సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈనాడు బరి తెగింపు సర్వత్రా చర్చనీయాంశం కావడంతో నాలుక కరుచుకుని ఆదివారం అర్ధరాత్రి హడావుడిగా నెట్ ఎడిషన్‌లో ఆ ఫోటో మాత్రమే తొలగించి మరో ఫోటోను చేర్చడం కొసమెరుపు. పట్టాభిని కొట్టారంటూ పాత ఫోటోలు ప్రచురించి ఇక వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడైతే ఈనాడు నిత్యం విషం చిమ్మడమే లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేస్తున్నారు. నాడు టీడీపీ నేత పట్టాభిని కస్టడీలో పోలీసులు కొట్టారంటూ, థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ పాత ఫోటోలను ప్రచురించి ఈనాడు నమ్మించే యత్నం చేసింది. పట్టాభిని కొట్టారంటూ 2023 ఫిబ్రవరి 22న ఈనాడు ఒక బ్యానర్ కథనాన్ని ప్రచురించింది. అయితే అందులో 2021 నాటి ఘటన ఫోటోలను ఈనాడు ప్రచురించింది. ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ, అవి పాత ఫొటోలని స్పష్టం చేస్తూ గత ప్రభుత్వం ఆధారాలను బయటపెట్టడంతో ఈనాడు దుర్భుద్ధి బహిర్గతమైంది. దీంతో గత్యంతరం లేక తన తప్పిదాన్ని ఒప్పుకుంటూ, చింతిస్తున్నట్లు ఈనాడు ఒక ప్రకటన జారీ చేయాల్సి వచ్చింది. పట్టాభిని కొట్టారంటూ తొలుత ఈనాడు కథనం వెలువరించగానే కనీసం నిర్ధారించుకోకుండానే వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ఆ వార్తను ట్వీట్ చేయడం గమనార్హం. పట్టాభిని కొట్టారంటూ కోర్టులో న్యాయమూర్తులకు కూడా ఆ ఫోటోలు చూపించారు. అనంతరం వైద్యులు పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించి ఎటువంటి గాయాలు లేవని, పూర్తిగా ఫిట్‌గా ఉన్నారని ధృవీకరించారు. దీంతో ఈనాడు అసలు బండారం బయటపడింది. ఇప్పుడు కూడా అదే రీతిలో బురద చల్లేందుకు యత్నించి మరోసారి దొరికిపోయింది. -
ఆరోగ్యశ్రీకి కత్తెర!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్య పరిరక్షణ తమ బాధ్యత కాదని చంద్రబాబు సర్కారు చేతులెత్తేస్తోంది. 1.40 కోట్లకు పైగా కుటుంబాలకు ఆపద్భాందవి అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పటికే వెంటిలేటర్ ఎక్కించడమే కాక క్రమంగా కనుమరుగు చేసే కుట్రలు పన్నుతోంది. నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.వేల కోట్ల బకాయిలు పెట్టి.. ఇప్పటికే పేద ప్రజలకు ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని అందని ద్రాక్షగా మార్చేసింది. మరోవైపు ఈ పథకం కింద చికిత్సలను ఎత్తేసే ప్రక్రియకు పూనుకుంది. ఇందులో భాగంగా ఈ పథకం కింద ఎక్కువ మంది వినియోగించుకునే ప్రొసీజర్లను ఎత్తేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఈ పరంపరలో సాధారణ, సిజేరియన్ ప్రసవాలు, కంటి సమస్యలకు సంబంధించిన మూడు ప్రొసీజర్లను ఎత్తేసి.. పేద, మధ్య తరగతి ప్రజలపై ఏటా రూ.500 కోట్లకుపైగా భారాన్ని మోపడానికి రంగం చేస్తోందని తెలుస్తోంది.ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు2019–24 మధ్య పేద ప్రజల ఆరోగ్యానికి పూర్తి స్థాయి భరోసానిస్తూ అన్ని రకాల క్యాన్సర్లు, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, మెదడు సంబంధిత పెద్ద జబ్బులకు ఉచిత చికిత్సలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ జగన్ సర్కార్ బలోపేతం చేసింది. అంతకు ముందు చంద్రబాబు పాలనలో 1059 ప్రొసీజర్లు ఉండగా, 2019 తర్వాత ఏకంగా 3,257కు ప్రొసీజర్ల సంఖ్యను పెంచింది. దీంతో కేంద్రం, దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల్లో లేనన్ని ప్రొసీజర్లు ఒక్క ఏపీలోనే అందుబాటులోకి వచ్చాయి. ఇదిలా ఉండగా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసే క్రమంలో ప్రొసీజర్లను కుదించాలని కొద్ది నెలలుగా చంద్రబాబు సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా సాధారణ, సిజేరియన్ ప్రసవాలతో పాటు మూడు ఆప్తమాలజీ ప్రొసీజర్లను ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఎత్తేయడం కోసం వైద్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 2019–24 మధ్య రాష్ట్రంలో ఏటా 3 లక్షల మేర ప్రసవాలు ఆరోగ్యశ్రీ పథకం కింద నమోదయ్యాయి. వైఎస్సార్ కంటి వెలుగు పథకం కింద దాదాపు 2.50 లక్షల మంది వృద్ధులకు కేటరాక్ట్ ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించారు. ఇప్పుడీ ప్రొసీజర్లను ప్రైవేట్‌లో పూర్తిగా ఎత్తేయడం ద్వారా ప్రభుత్వంపై ఏటా రూ.500 కోట్లకు పైగా భారాన్ని తగ్గించుకోవాలని చంద్రబాబు సర్కారు ప్రయత్నిస్తోంది.ఆసరా ఎత్తేసి ఇప్పటికే వెన్నుపోటుఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ సహా ఎన్నో హామీలిచ్చి, వాటిని అమలు చేయకుండా సీఎం చంద్రబాబు మహిళలను దగా చేశారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కింద ప్రసవానంతరం బాలింతలకు అందించిన రూ.5 వేల ఆరోగ్య ఆసరా సాయాన్ని ఇప్పటికే ఎత్తేశారు. తద్వారా మహిళలకు మరో వెన్నుపోటు పొడిచారు. ఒక్క ఆసరా రూపంలో గత రెండేళ్లలో పేద, మధ్య తరగతి మహిళలు రూ.300 కోట్ల మేర నష్టపోయారు. ఇక్కడితో ఆగకుండా గర్భం దాల్చిన మహిళలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత కాన్పు సేవలు లేకుండా బాబు సర్కార్ అడుగులు వేస్తుండటం వైద్య, ఆరోగ్య శాఖలో చర్చనీయాంశమైంది. దేశంలో ఎక్కడా లేని విధంగా 3,257 ప్రొసీజర్లు ఏపీలోని ఆరోగ్యశ్రీ పథకంలోనే ఉన్నాయని, ఇన్ని అవసరం లేదని ఇటీవలే వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ తేల్చి పడేశారు. ఈ క్రమంలో వీటి సంఖ్యను కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ–పీఎం జేఏవై)లోని 1,949కి కుదించాలని 2024లోనే వైద్య శాఖ కమిటీలు వేసి కసరత్తు చేసింది. దీనిపై అప్పట్లో వైఎస్సార్సీపీ ప్రతిఘటించడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఇప్పుడు మరో రూపంలో ప్రొసీజర్లను తగ్గించే ప్రక్రియను గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తోంది.ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ను అప్పుల ఊబిలోకిస్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లలో తిరుగుళ్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆటపాటలు, యోగా డే వంటి ఈవెంట్స్, విలాసాలకు ప్రత్యేక బడ్జెట్లు కేటాయించి మరి చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని దుబారా చేస్తోంది. ఇదిలా ఉండగా కోట్ల మంది పేద, మధ్యతరగతి ప్రజలకు ఆధారమైన ఆరోగ్యశ్రీ బిల్లు చెల్లింపులకు నిధుల్లేమి సాకుతో బాబు సర్కార్ అప్పుల బాట పట్టింది. రాష్ట్ర చరిత్రలో గతమెన్నడూ లేనట్టుగా నెట్వర్క్ ఆస్పత్రులకు పెండింగ్ బిల్లులు చెల్లించడం కోసం ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ. వెయ్యి కోట్లు అప్పు తెచ్చి ఇటీవల అరకొరగా బిల్లులు విడుదల చేసింది. ఈ అప్పునకు అయ్యే వడ్డీ కూడా ఆస్పత్రులె చెల్లించాలని బిల్లుల్లో 8 శాతం మేర కోత పెట్టడంతో యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. నాడు సంస్కరణలతో ఊపిరి2014–19 మధ్య చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ పథకం అంపశయ్య ఎక్కింది. నాటి టీడీపీ ప్రభుత్వం రూ.700 కోట్లకు పైగా బకాయిలు పెట్టి దిగిపోయింది. ఈ బకాయిలు చెల్లిస్తూ, కోవిడ్ వంటి ప్రపంచ విపత్తును అధిగమిస్తూనే వైఎస్ జగన్ సర్కార్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసింది. రూ. ఐదు లక్షల వరకు వార్షికాదాయం ఉన్న మధ్య తరగతి కుటుంబాలను పథకం పరిధిలోకి తెస్తూ 2019 డిసెంబర్ 19న ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని 1.40 కోట్లకుపైగా కుటుంబాలు ఈ పథకం పరిధిలోకి వచ్చాయి. రూ.వెయ్యి ఖర్చు దాటే చికిత్సలను పథకం పరిధిలోకి తెచ్చే లక్ష్యంతో వెయ్యి కొత్త ప్రొసీజర్లతో 2020 జనవరి నెలలో పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్ ప్రారంభించారు. దీంతో ఏడాది తిరగకుండానే 1,059 ప్రొసీజర్లను 2059కి పెంచారు. ఇలా 2019–24 మధ్య 3,257కు తీసుకొచ్చారు. 2014–19 మధ్య బాలు పాలనలో రూ.5,177 కోట్లు పథకం కోసం ఖర్చు చేయగా, 2019–24 మధ్య ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో ఏకంగా రూ.13 వేల కోట్లపైనే వెచ్చించారు. మారుతున్న వాతావరణం, ఆహార అలవాట్లతో కొత్త జబ్బులు అనేకం పుట్టుకొస్తున్న క్రమంలో ఇంకా ఈ పథకం కిందకు రాని జబ్బులుంటే వాటిని గుర్తించి పథకంలో చేర్చాల్సిందిపోయి.. చంద్రబాబు సర్కార్ ఏకంగా ఉన్న ప్రొసీజర్లనే ఎత్తేస్తూ పేదల ఆరోగ్య భరోసాకు గండికొట్టే ప్రయత్నం చేస్తుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. -
ప్రమాదంలో ప్రజారోగ్యం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటికొకరు జ్వరాల బారిన పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే, వ్యాధుల కట్టడికి, బాధితులకు తక్షణ వైద్యం అందించడంలో బాబు సర్కార్ పూర్తిగా విఫలం అవుతోంది. ప్రభుత్వాస్పత్రుల్లో డెంగీ ప్రాథమిక నిర్ధారణకు అవసరమైన ర్యాపిడ్ టెస్ట్ కిట్లు లేవు. గత కొన్ని నెలలుగా ఆస్పత్రులకు కిట్ల సరఫరా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. కనిపించని వ్యాధి నిర్ధారణ కిట్లు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో గ్రామాల్లోని విలేజ్ క్లినిక్స్‌లో డెంగీ, కోవిడ్‌తో పాటు ఇతర వ్యాధుల నిర్ధారణకు అవసరమైన కిట్స్ అందుబాటులో ఉంచారు. జలుబు, దగ్గు, జ్వరం, ఇతర లక్షణాలు ఉన్న బాధితులకు గ్రామాల్లోనే వ్యాధి నిర్ధారణ ప్రాథమికంగా జరిగేది. ఇప్పుడా పరిస్థితులు లేవు. విలేజ్ క్లినిక్స్‌లోనే కాదు, పీహెచ్సీ, యూపీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లోను డెంగీ కిట్లు లేని దుస్థితి నెలకొంది. కొన్ని చోట్ల డెంగీ అనుమానిత లక్షణాలతో వచ్చిన రోగులకు కంప్లీట్ బ్లడ్ కౌంట్ (సీబీసీ) పరీక్ష చేసి ఆ ఫలితం ఆధారంగా వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఇక చాలా చోట్ల కిట్లు లేవని, ప్రైవేట్ ల్యాబ్‌ల్లో పరీక్షలు చేయించుకోవాలని సలహాలు ఇస్తున్నారు. దీంతో ప్రైవేట్ ల్యాబ్‌ల నిర్వాహాకులు డెంగీ ర్యాపిడ్ టెస్ట్‌కు రూ.500 నుంచి రూ.700 వరకు వసూలు చేస్తున్నారు. పెరుగుతున్న డెంగీ జ్వర బాధితులు.. వైద్య శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో డెంగీ జ్వరాల విజృంభణ గత ఏడాది కంటే ఈ ఏడాది అధికంగా ఉంది. గత ఏడాది జనవరి నుంచి తొలి 25 వారాల్లో 835 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 932కు పెరిగింది. విశాఖ, కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో డెంగీ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. వైఎస్సార్ జిల్లాలో గత ఏడాది 94 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటికే 85 కేసులు రికార్డు అయ్యాయి. చిత్తూరు జిల్లాలో గత ఏడాది తొలి 25 వారాల్లో 43 కేసులు వెలుగు చూడగా, ఈ ఏడాది అదే కాలానికి 65 కేసులు బయటపడ్డాయి. ఇక వైద్య శాఖ లెక్కల్లోకి రాని కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉంటున్నాయి. సీజనల్ వ్యాధులను సున్నాకు తగ్గించాలని సీఎం చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలను వైద్య శాఖ తగ్గిస్తోందని ఆ శాఖ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఏడుగురు మృతి.... గిరిజన, మైదాన ప్రాంతాల్లోను మలేరియా జ్వరాల విజృంభణ అధికంగా ఉంటోంది. ఇప్పటికే మలేరియా బారినపడి సరైన వైద్య సేవలు అందక అనకాపల్లి, విజయనగరం, ఏలూరు, పాడేరులలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. గత ఏడాది తొలి 25 వారాల్లో ఇద్దరు మరణించగా, ఈ ఏడాది అదే సమయానికి ఏడుగురు మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా మలేరియా కేసులు తగ్గినట్టు వైద్య శాఖ లెక్కలు చూపుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. ఏఎస్ఆర్, పోలవరం, మన్యం వంటి గిరిజన జిల్లాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. ప్రతి ఇంట్లో మంచం పట్టిన జ్వర బాధితులు ఉంటూనే ఉన్నారు. -
నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం
సాక్షి, అమరావతి: ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, బీసీ సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షి ఇంటిపై అర్ధరాత్రి భారీ పోలీసు బలగాలతో దాడి చేసి.. ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేయడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. రాష్ట్రంలో నారాసుర పాలనలో అరాచకం పరాకాష్టకు చేరిందంటూ మండిపడ్డారు. దాడి చేసిన వారికి రక్షణ కల్పిస్తూ.. బాధితులపై అక్రమంగా కేసులు బనాయిస్తూ రాజకీయంగా కక్ష సాధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.శ్రీకాకుళం జిల్లాలో ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షతో హత్య కేసుగా మార్చి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేశారని.. ఆయనను పరామర్శించేందుకు తాను వెళ్లినప్పుడు లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలను చూసి ప్రభుత్వం భయపడి.. ఒక వీడియో క్లిప్‌ను వక్రీకరించి చింతాడ రవికుమార్‌పై తీవ్రమైన కేసులు పెట్టారంటూ ఎత్తిచూపారు. ఒక వ్యాపార వివాదంలో సంబంధిత వ్యక్తిని, లారీలను పోలీస్ స్టేషన్‌కు అప్పగించిన మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపైనే కిడ్నాప్ కేసు పెట్టడం ఎక్కడి న్యాయం? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు.‘‘డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు? వాటికి బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి లోకేశ్ ఎందుకు రాజీనామా చేయడం లేదు? విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.9,500 కోట్ల విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? నెలకు రూ.3 వేల చొప్పున 3 ఏళ్లకు ఒక్కో నిరుద్యోగికి బకాయిపడ్డ రూ.1.08 లక్షలు ఎప్పుడు ఇస్తారు?’’ అని జెన్–జెడ్ తరం ఇవ్వాళ గట్టిగా ప్రశ్నిస్తోందని గుర్తుచేశారు.ఈ ప్రశ్నలకు మీ దగ్గర, మీ తనయుడు లోకేశ్ దగ్గర సమాధానం లేదు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమ కేసులు పెడుతున్నారంటూ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అరెస్టులు చేయగలరేమో కానీ కార్యకర్తల గుండెల్లో ఉన్న ధైర్యాన్ని బద్దలుకొట్టలేరు.. ప్రజలు వేస్తున్న ప్రశ్నలనూ ఆపలేరు.. అన్యాయాన్ని నిలదీస్తాం.. అరాచక పాలనపై పోరాడతామని సీఎం చంద్రబాబును హెచ్చరిస్తూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ ఆదివారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..రాష్ట్రంలో అసలు రూల్ ఆఫ్ లా ఉందా?‘‘చంద్రబాబు గారూ.. రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతోంది? దాడి చేసినవారు అధికారపార్టీ వాళ్లయితే వారికి రక్షణ! దాడికి గురైనవారు వైఎస్సార్సీపీ వాళ్లయితే వారిపైనే కేసులు! బాధితులకు అండగా నిలబడితే ప్రజాప్రతినిధులపైనా కేసులు! ప్రశ్నిస్తే అరెస్టులు! నిలదీస్తే అర్ధరాత్రి తలుపులు బద్దలుకొట్టడం! ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా న్యాయం? ఇదేనా చట్టం? చంద్రబాబు గారూం నేను సూటిగా అడుగుతున్నాను. ఆలూరు బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే ఇంటిపై అర్ధరాత్రి 2.45 గంటలకు భారీ పోలీసు బలగాలతో దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంటి తలుపులు బద్దలుకొట్టి, ఎమ్మెల్యే విరూపాక్షిని, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసిన తీరు చూస్తే రాష్ట్రంలో అసలు రూల్ ఆఫ్ లా అనేది ఉందా? అని అనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు.. ప్రతిపక్షానికి మద్దతు పలికితే కేసులుశ్రీకాకుళం జిల్లాలోనూ ఇదేరకంగా అరాచకం చేస్తున్నారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షతో హత్య కేసుగా మార్చారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేశారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను వెళ్లినప్పుడు సంఘీభావంగా లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఆ ప్రజాస్పందనను చూసి మీ ప్రభుత్వం భయపడింది. ఆ భయంతోనే ఒక వీడియో క్లిప్‌ను వక్రీకరించారు. చింతాడ రవికుమార్‌పై తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. అనేకమంది నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారు. నాయకులు ప్రజల మధ్యకు వెళ్తే కేసులు. ప్రజలు నాయకులను కలిస్తే కేసులు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు. ప్రతిపక్షానికి మద్దతు పలికితే కేసులు. ఇది ప్రజాస్వామ్యమా? లేక మీ పోలీసు రాజ్యమా? లేక జంగిల్ రాజ్యమా? గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మొహ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడిపైనా ఇదే రాజకీయ కక్షసాధింపు కొనసాగుతోంది. ఒక వ్యాపార వివాదంలో సంబంధిత వ్యక్తిని, లారీలను పోలీస్ స్టేషన్‌కు అప్పగించినప్పటికీ తిరిగి ముస్తఫాపైనే కిడ్నాప్ కేసు పెట్టారు. పోలీసులకు అప్పగించిన వ్యక్తిని కిడ్నాప్ చేశారని కేసు పెట్టడం ఎక్కడి న్యాయం? కేవలం వైఎస్సార్సీపీ నాయకుడని కేసు పెడతారా?ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ కేసులురాష్ట్రంలోని జెన్–జెడ్ తరం ఇవాళ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ పోరాటాలు చేస్తోంది. డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు? అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఎందుకు రాజీనామా చేయడం లేదు? విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.9,500 కోట్ల విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎందుకు మోసం చేశారు? మూడేళ్లకు ఒక్కో నిరుద్యోగికి బకాయిపడ్డ రూ.1.08 లక్షలు ఎప్పుడు చెల్లిస్తారు? ఈ ప్రశ్నలకు మీ దగ్గర మీ తనయుడు లోకేశ్ దగ్గర సమాధానం లేదు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమ కేసులు పెడుతున్నారు. అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు. పోలీసు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.బాధిత కుటుంబానికి అండగా నిలబడటం తప్పా?చిప్పగిరి మండలం నేమకల్లులో వైఎస్సార్సీపీ కార్యకర్త ఇంటిపై టీడీపీవాళ్లు దాడిచేస్తే, తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, తన కుటుంబాన్ని కాపాడాలని ఆ కార్యకర్త ఎమ్మెల్యే విరూపాక్షికి కాల్ చేశాడు. ఒక కార్యకర్త ప్రాణభయంతో సహాయం కోరితే స్పందించడం ఎమ్మెల్యే చేసిన నేరమా? బాధిత కుటుంబానికి అండగా నిలబడటం తప్పా? చివరకు పరామర్శించేందుకు వెళ్లిన విరూపాక్షిపైనే టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. ఆ దాడిలో ఆయన సోదరుడు శ్రీరాములు గాయపడ్డారు. నిజంగా చట్టం పనిచేస్తే ఎవరిని అరెస్టు చేయాలి? దాడి చేసినవారిని అరెస్టు చేయాలా? దాడికి గురైన ఎమ్మెల్యేను అరెస్టు చేయాలా? కానీ ఈ ప్రభుత్వంలో దాడి చేసినవారికి రక్షణ లభిస్తోంది. దాడికి గురైన ఎమ్మెల్యేనే నిందితుడిగా మార్చి ఆయనపైన, కార్యకర్తలపైన హత్యాయత్నం కేసులు బనాయిస్తున్నారు. ఎమ్మెల్యే ఇంట్లోని సీసీటీవీ హార్డ్డిసు్క లను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? అర్ధరాత్రి పోలీసులు చేసిన దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలు బయటకు వస్తాయనే భయమా? తలుపులు ఎలా బద్దలుకొట్టారో కుటుంబ సభ్యులను ఎలా భయపెట్టారో ఎమ్మెల్యేను ఎలా అరెస్టు చేశారో ప్రజలకు తెలియకూడదనే హార్డ్డిసు్కలను తీసుకెళ్లారా? చంద్రబాబుగారూ సాక్ష్యాలను కాపాడాల్సిన పోలీసులతోనే సాక్ష్యాలను మాయం చేయించే ప్రయత్నం చేస్తున్నారా?అన్యాయాన్ని నిలదీస్తాం.. అరాచక పాలనపై పోరాడతాంచంద్రబాబు గారూ గుర్తుపెట్టుకోండి. అధికారం శాశ్వతం కాదు. పోలీసు బలం శాశ్వతం కాదు. అక్రమ కేసులు శాశ్వతం కాదు. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అర్ధరాత్రి అరెస్టులు చేసినా ఎన్ని తలుపులు బద్దలుకొట్టినా ఎన్ని పోలీసు బలగాలను దించినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదు. బాధితులకు అండగా నిలుస్తాం. అన్యాయాన్ని నిలదీస్తాం. అరాచక పాలనపై పోరాడుతాం. మీరు అరెస్టులు చేయగలరేమో కానీ కార్యకర్తల గుండెల్లో ఉన్న ధైర్యాన్ని బద్దలుకొట్టలేరు. ప్రజలు వేస్తున్న ప్రశ్నలనూ ఆపలేరు’’ అని జగన్ ఆ పోస్టులో పేర్కొన్నారు.


