breaking news
Ambati Rambabu
-
గుంటూరు CI, మున్సిపల్ మిషనర్ కు అంబటి రాంబాబు వార్నింగ్
-
అమరావతికి అసలైన విలన్ చంద్రబాబే
-
పవన్ పర్యటనలో ఆగంతకుడు అంటూ జనసేన "క్యామెడీ" అంబటి రాంబాబు సెటైర్లే సెటైర్లు
-
Ambati: రాజధాని పేరిట భారీ కుట్ర మరో 20 వేల ఎకరాలు స్వాహా!
-
చంద్రబాబు డైరెక్షన్లో అమరావతి మెగా సీరియల్
సాక్షి, తాడేపల్లి: అమరావతిని అడ్డంపెట్టుకుని చంద్రబాబు దోచుకుంటున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతికి అసలైన విలన్ చంద్రబాబే. అడ్డగోలుగా భూదోపిడీ చేస్తూ వేల కోట్లు వెనుకేసుకుంటున్నారు. అమరావతి రైతులు పునరాలోచన చేసుకునే పరిస్థితిలో పడ్డారు. చంద్రబాబును నమ్మి పదేళ్ల క్రితమే భూములు ఇస్తే ఇంకా కావాలంట. ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తున్నామని అప్పట్లో చంద్రబాబు ప్రగల్భాలు పలికారు’’ అంటూ దుయ్యబట్టారు.‘‘ఇప్పటికే 54 వేల ఎకరాలను సేకరించారు. ఇప్పుడు రెండో విడతలో మరో 16,666 ఎకరాలను రైతుల నుండి సమీకరిస్తారట. మూడో విడతలో మరో 25 వేల ఎకరాలు తీసుకుంటారట. తొలి విడతలో తీసుకున్న భూములకే ఇప్పటికీ పూర్తిగా రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు. రైతులు అడిగితే అధికారులు అవమానపరుస్తున్నారు. భూములు తీసుకునేటప్పుడు త్యాగధనులు అన్నారు. ఇప్పుడేమో రైతులంటే పనికిమాలిన వాళ్లు అన్నట్టుగా చూస్తున్నారు..భూములు ఇచ్చిన రైతులు ఎంతో బాధపడుతున్నారు. అమరావతిని అడ్డంపెట్టుకుని చంద్రబాబు దోచుకుంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే భూముల ధరలు తగ్గాయి. 18 నెలల్లో రాజధాని ప్రాంతంలో తట్టెడు మట్టి ఎత్తలేదు. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు అప్పులు తీసుకొస్తున్నారు. అమరావతి కోసం ఇన్నీ తీసుకొచ్చి రూ.3 వేల కోట్లకే టెండర్లు పిలిచారు. చంద్రబాబు నిజ స్వరూపం రాష్ట్ర ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమౌతోంది’’ అని అంబటి పేర్కొన్నారు.‘‘రాజధానిని పూర్తి చేయకుండా సీరియల్ కథలా నడపాలన్నది చంద్రబాబు ప్లాన్. అమరావతిలో ఒక్క శాశ్వత భవనం లేదు. అమరావతిలో చంద్రబాబు నిర్మించిన భవనాలన్నీ తాత్కాలికమే. పార్లమెంట్‌కు రూ.970 కోట్లు ఖర్చు చేశారు. తెలంగాణ సచివాలయానికి రూ.500 కోట్లు ఖర్చు చేశారు. కానీ తాత్కాలిక అసెంబ్లీకే చంద్రబాబు రూ.700 కోట్లు ఖర్చు చేశారు’’ అంటూ అంబటి రాంబాబు నిలదీశారు.‘‘చంద్రబాబు అధికారంలోకి వస్తే భూముల ధరలు విపరీతంగా పెరుగుతాయని అప్పట్లో ప్రచారం చేశారు. ఇప్పుడు అత్యంత దారుణంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది. రాజధానిలో ఇప్పటికీ ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు. కానీ రూ.3 వేల కోట్ల అడ్వాన్సులు ఇచ్చారు. వాటిలో కమీషన్లు కొట్టేశారు. రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ స్కీం అని చంద్రబాబు జనాన్ని మోసం చేశారు. ఇప్పుడు ప్రపంచమంతా తిరిగి రాజధాని కోసం అప్పులు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రేట్లు పెంచి కాంట్రాక్టర్లకు అప్పగించారు..దాని వెనుక పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నట్టు రైతులు కూడా గుర్తించారు. అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలకే వేల కోట్లు ఖర్చు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కో అడుగుకు రూ.11 వేలు ఖర్చు చేశారు. దేశ పార్లమెంటు భవనానికి రూ.970 కోట్లు ఖర్చు చేస్తే, చంద్రబాబు తాత్కాలిక భవనాలకే రూ.750 కోట్లు ఖర్చు చేశారు. రాజధాని పల్లపు ప్రాంతంలో ఉండటం వలన ముంపునకు గురవుతోంది. రాజధాని నీరు నదిలోకి ఎత్తి పోయటం అమరావతిలోనే చూస్తున్నాం. రైతులకు న్యాయం చేయకుండా భూములు లాక్కోవటం సరికాదు’’ అని అంబటి రాంబాబు హితవు పలికారు.‘‘డిప్యూటీ సీఎంకి సరైన సెక్యూరిటీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అపరిచిత వ్యక్తి వచ్చాడంటూ ఫిర్యాదులు ఇవ్వటం సిగ్గుచేటు. పవన్ కళ్యాణ్ ప్రచారం కోసం కామెడీ చేస్తున్నారు. సీరియస్ రాజకీయాల్లో పవన్ వెరైటీ కామెడీ చేస్తున్నారు. తన అభిమాని తనకోసం వచ్చినా పవన్ భయపడుతున్నారు. ఒక డీఎస్పీని అవినీతి పరుడని పవన్ అంటే చంద్రబాబు ఆ డీఎస్పీకి అవార్డులు ఇచ్చారు. ఇదీ ప్రభుత్వంలో పవన్ పరిస్థితి’’ అంటూ అంబటి చురకలు అంటించారు. -
ట్రైనీ సీఎం.. నీతి ప్రవచనాలు లోకేష్ ను ఏకిపారేసిన అంబటి
-
‘సీఎం ట్రైనింగ్‌లో బిజీగా లోకేష్.. పవన్ జస్ట్ ఫొటోల డీసీఎం’
సాక్షి, తాడేపల్లి: ఆదాయం వచ్చే అన్ని శాఖల్లో వేలుపెడుతూ.. తనకు ఇచ్చిన శాఖను మాత్రం మంత్రి నారా లోకేష్ గాలికి వదిలేశారని వైఎస్సార్సీపీ గుంటూరు అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.. నారా లోకేష్ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారు. ప్రభుత్వ హస్టళ్లలో అన్నంలో పురుగులు వస్తున్నాయి. కలుషిత ఆహారం తిని విద్యార్థులు రోగాల పాలవుతున్నా పట్టించుకోవటం లేదు. కామెర్లతో పిల్లలు చనిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. నారా లోకేష్ విద్యా, ఐటీ శాఖలను గాలికి వదిలేశారు. సీఎంగా ట్రైనింగ్ అవుతున్నారు. ఆదాయం ఉన్న శాఖల్లో వేలుపెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పనిలో ఆయన ఉన్నారు. చిన్నవయసులోనే ప్రవచనాలు చెబుతూ కొత్త అవతారం ఎత్తారు. సోషల్ మీడియాలో జగన్ పై ఏఐ వీడియోలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఒకవైపు దారుణమైన పోస్టులు పెట్టిస్తూ మరోవైపు ట్వీట్ లో ప్రవచనాలు చెప్తున్నారు. రాజకీయాల్లో దుష్ట సంప్రదాయాలు తెచ్చిన వ్యక్తి చంద్రబాబు. మీడియాను అడ్డు పెట్టుకుని ప్రచారం పొందటమే పనిగా పెట్టుకున్నారు. పిల్లల ముందు చంద్రబాబు దారుణమైన అబద్దాలు చెప్పారు. తన వెన్నుపోటు రాజకీయాల గురించి వాస్తవాలు చెబితే బాగుండేది. చంద్రబాబు, లోకేష్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ యాంటీ హీరోలుగా తయారయ్యారు. హీరోలుగా నటిస్తూ విలన్ పనులు చేస్తున్నారు. వైఎస్ జగన్‌పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. అటు చంద్రబాబు కోసమూ పవన్ కల్యాణ్ వైఎస్సార్సీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాకే కొబ్బరి చెట్లు చనిపోతున్నాయని పవన్ కళ్యాణ్ అబద్దాలు చెప్పించే ప్రయత్నం చేశారు. కానీ నిజాలేంటో అక్కడి రైతులే చెప్పారు(ఈ సందర్భంగా రైతులు పవన్ ఎదుట మాట్లాడిన వీడియోను అంబటి ప్రదర్శించారు. ప్రశ్నించటానికే పుట్టిన పార్టీ అని చెప్పుకున్న పవన్ ఎదుటివారు ప్రశ్నిస్తే తట్టుకోలేక పోతున్నారు. కూటమికి సపోర్టు చేసిన విషయమ్మీద తన మనిషే ప్రశ్నించినా సమాధానం చెప్పలేక పోయిన పిరికి వ్యక్తి పవన్. అలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగానే కాదు.. మంత్రిగా కూడా పనికి రాడు. అసలు రాజకీయాలకే పనికి రాని వ్యక్తి పవన్’’ అని అంబటి మండిపడ్డారు.బూతులు మాట్లాడటంలో పవన్ కళ్యాణ్ ని మించినవారు లేరు. సోషల్ మీడియాలో లోకేష్ ఆర్గనైజ్డ్గా బూతులు మాట్లాడిస్తున్నారు. పవర్ లేని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన జస్ట్ ఫోటోల ఉప ముఖ్యమంత్రి. అసలైన ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తోంది మాత్రం లోకేష్. అమరావతి నిర్మాణంలో వందల కోట్ల అవినీతి జరుగుతోంది. లోకేష్, పవన్ కళ్యాణ్ దోచుకుని దాచుకుంటున్నారు. ప్రజలే సరైన సమయంలో సమాధానం చెప్తారు. అధికారం కోసం ఇతరుల కాళ్లు పట్టుకోవడం కాదు. మేము కూటమితో పోరాడి అధికారంలోకి వస్తాం అని అంబటి ఉద్ఘాటించారు. -
అది మీ ఖర్మ .. బాబు & కోని రఫ్ఫాడించిన అంబటి
-
చంద్రబాబు, లోకేష్ ఏడుపులు.. YS జగన్ కు దీవెనలు
-
జగన్ కోసం తండోపతండాలుగా జనాలు... ABN, TV5 థంబ్ నైల్స్ పై అంబటి మాస్ ర్యాగింగ్
-
‘జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి సహించలేకపోతున్నారు’
తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడకు వెళ్లినా జనం తండోపతండాలుగా వచ్చే విషయం మరోసారి నిరూపితమైందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. దీన్ని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ సహించలేకపోతున్నారన్నారు. వైఎస్ జగన్ హైదరాబాద్ పర్యటనతో చంద్రబాబుకు కడుపు మంట ప్రారంభమైందన్నారు అంబటి. చంద్రబాబు, లోకేష్ ఏడుపులే వైఎస్ జగన్‌కు దీవెనలన్నారు. జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి సహించలేకపోతుండటంతో ఎల్లో మీడియా సైతం దుష్ప్రచారం చేపట్టిందని మండిపడ్డారు. తెలంగాణలో తమ పార్టీ లేదని, అ యినా సరే జనం పెద్ద ఎత్తున తరలివచ్చారన్నారు. దీని మీద కూడా ఎల్లో మీడియా విష ప్రచారం చేసిందన్నారు. జగన్‌కు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందని, ఆ సెక్యూరిటీ ఉన్నవారు షెడ్యూల్ ఇవ్వడం అనేది సహజంగా జరుగుతుందని స్పష్టం చేశారు అంబటి.‘ఇదీ చదవండి:హైదరాబాద్‌కు వైఎస్ జగన్.. ఉప్పొంగిన అభిమానం -
Ambati: లోకేష్ బాబుకు, ఆయన బాబుకు ముందుంది ముసళ్ళ పండుగ
-
Ambati: కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు
-
విమర్శిస్తేనే దాడి చేస్తారా.. అసెంబ్లీలో తాగి మాట్లాడిన బాలయ్యను ఏం చెయ్యాలి
-
బాలకృష్ణ ఏం మాట్లాడారో మరిచిపోయారా?: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: టీడీపీ ఆఫీస్ దాడి కేసును రీఓపెన్ చేసి మరీ అక్రమ అరెస్టులు చేస్తున్న కూటమి ప్రభుత్వం.. వైఎస్సార్సీపీ కార్యాలయంపై జరిగిన విధ్వంసం విషయంలో చూసిచూడనట్లు వ్యవహరిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. హిందూపురం ఘటనకు నిరసనగా.. సోమవారం గుంటూరులో అంబటి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూపురం వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపైనా దాడి చేశారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే.. ఆ కేసును రీ ఓపెన్ చేసి మరీ అమాయకులను జైలుకు పంపించారు. కేవలం మీ ఆఫీసుపై దాడి జరిగిందని వేధింపులకు దిగారు. మరి ఇప్పుడు చేస్తోంది ఏంటి?.. దాడికి నిరసనగా ఆందోళన చేసేందుకు ప్రయత్నిస్తే వైఎస్సార్సీపీ నేతలను పోలీసులతో అరెస్ట్ చేయిస్తారా?.. పోలీసులు మరీ టీడీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. డీజీపీ కూడా మేం ఫోన్లు చేస్తే స్పందించరు.. ఎమ్మెల్యే బాలకృష్ణ మీద చేసింది రాజకీయ విమర్శలు. అంత మాత్రానికి దాడుల సంప్రదాయం సరికాదు. మరి గతంలో బాలకృష్ణ చేసింది ఏంటి?.. అసెంబ్లీలోనే మాజీ సీఎం జగన్‌ను ఆయన సైకో అనలేదా?.. నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని అవమానిస్తూ మాట్లాడలేదా?. అసెంబ్లీకి తప్పతాగొచ్చి బాలకృష్ణ మాట్లాడారు. కానీ, ఆ టైంలో ఆయన చేసింది తప్పని ఎవరూ చెప్పలేదు. ఇది న్యాయమా?.. ధర్మమా?.. బాలకృష్ణ ఎవరైనా సరే తాను చేసిన పనులకు క్షమాపణలు చెప్పాలి. అప్పటిదాకా వైఎస్సార్సీపీ ఆందోళన కొనసాగిస్తుంది. చంద్రబాబుదంతా డ్రామానేచంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కరించలేక కార్మికులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చంద్రబాబు విశాఖలో ఇదే తరహాలో సమ్మిట్ పెట్టారు. చంద్రబాబు చేసేదంతా నాటకం.. బూటకం అని అన్నారు. గుంటూరు లాడ్జ్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నియోజకవర్గ సమన్వయకర్తలు నూరి ఫాతిమా, దొంతి రెడ్డి వేమారెడ్డి ,అంబటి మురళి, వనమా బాల వజ్రపు బాబు తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: బాలయ్య కామెంట్స్: వైఎస్ జగన్ ఏమన్నారంటే.. -
ఫొటోలకే తప్ప పావలాకి కూడా పనికిరాని డిప్యూటీ సీఎం
-
Ambati: ధర్మారెడ్డి విచారణపై ABN, TV5 పిచ్చి వార్తలు...
-
అంబటి రాంబాబుపై దౌర్జన్యం చేసిన సీఐ వెంకటేశ్వర్లు
-
అంబటి రాంబాబుపై కూటమి సర్కార్ కక్ష సాధింపు
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా అంబటి రాంబాబు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పట్టాభిపురం సీఐ అడ్డుకున్నారు. దీంతో పట్టాభిపురం సిఐకి, అంబటి రాంబాబుకి మధ్య వాగ్వాదం జరిగింది.అంబటి రాంబాబుపై పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు దౌర్జన్యం చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పిలుపు మేరకు బుధవారం(నవంబర్ 12) భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.స్వామి థియేటర్ నుంచి ర్యాలీగా బయలుదేరిన పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలను కంకరగుంట ఫ్లైఓవర్ మీదకు రానీయకుండా పోలీసులు బారికేడ్లు పెట్టారు. దీంతో బారికేడ్లను నెట్టుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయతి్నంచిన నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు తీరుపై అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ, అంబటికి వేలు చూపిస్తూ బెదిరింపులకు దిగారు. పోలీసుల అవరోధాలను అధిగమించిన నాయకులు, కార్యకర్తలు బారికేడ్లు తోసుకుని ముందుకు వెళ్లారు. మంత్రి లోకేష్ ప్రోద్భలంతో సీఐ తనను టార్గెట్ చేశారని రాంబాబు మండిపడ్డారు. -
వేలు చూపిస్తూ సీఐ బూతులు ఇచ్చిపడేసిన అంబటి
-
YSRCP Praja Udyamam: అంబటి ఉగ్రరూపం..
-
గుంటూరులో ఉద్రికత్త.. అంబటితో సీఐ ఓవరాక్షన్
సాక్షి, గుంటూరు: ఏపీలో ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న ర్యాలీల్లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు కదిలారు. వైఎస్సార్సీపీ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు.. అడ్డంకులను సృష్టించారు. ఈ క్రమంలో గుంటూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పోలీసులు వాగ్వాదానికి దిగారు.వివరాల ప్రకారం.. మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులోని తన నివాసం నుంచి ర్యాలీగా ముందుకు సాగారు. వైఎస్సార్సీపీ ర్యాలీ.. స్వామి థియేటర్ వద్ద రాగానే పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. బారికేడ్లు పెట్టి ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, మాజీ మంత్రి అంబటి రాంబాబు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ఓవరాక్షన్‌కు దిగారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబుకు వేలు చూపిస్తూ సీఐ గంగా వెంకటేశ్వర్లు దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి దిగారు. దీంతో, సీఐపై అంబటి రాంబాబు మండిపడ్డారు. అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసుల వైఖరి నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఇక, గతంలోనూ అంబటి రాంబాబు పట్ల పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 175 నియోజకవర్గాలలో ర్యాలీలు నిర్వహించాం. రెవెన్యూ అధికారులకు మెమోరాండం అందించాం. 17మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టామని చెప్పాం. ఐదు కాలేజీల నిర్మాణం పూర్తయ్యింది. మిగతా కాలేజీలను పీపీపీ పద్దతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం మొదలుపెట్టారు. ప్రైవేటు కాలేజీలు భారీస్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. పేదలకు అన్యాయం చేసే పీపీపీ పద్దతిని వద్దని చంద్రబాబుకు సూచిస్తున్నాం. పీపీపీ పద్దతిపై కొన్ని రాష్ట్రాలలో ప్రజలు వ్యతిరేకించడంతో ప్రభుత్వాలు వెనక్కితగ్గాయి.గుంటూరు లో అంబటి రాంబాబు ఆధ్వర్యంలో YSRCP ప్రజా ఉద్యమం🔥🔥అడ్డుకుంటున్న పోలీసులు #OneCroreSignatures#StopPrivatization#SaveMedicalCollegesInAP#YSRCPForMedicalStudents pic.twitter.com/MtDOBCRkH0— Rahul (@2024YCP) November 12, 2025 పీపీపీ పద్దతి వద్దంటూ కోటి సంతకాలు సేకరించాం. చంద్రబాబు, కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను బడా బాబులకు అప్పగించి లోకేష్ జేబులు నింపుతున్నారని మేం ఆరోపిస్తున్నాం. మేం ర్యాలీ చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. బారికేడ్లు పెట్టి అడ్డుకోవాలని చూస్తున్నారు. మెమోరాండం ఇవ్వకుండా ఆపగలిగారా?. పోలీసులు పద్దతి మార్చుకోవాలని చెబుతున్నాం. లోకేష్ మెప్పుకోసం కొందరు పోలీసులు ప్రవర్తిస్తున్నారు. పోలీసుల భాష మాట్లాడుతున్నారు.. మాకు రాదా పోలీసు భాష. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకూ ఉద్యమం ఆగదు. పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు లోకేష్ బంధువు. ఎక్కడా ఆపని పోలీసులు ఇక్కడ ఎందుకు ఆపుతున్నారు. మేం తగ్గేది లేదు.. చిత్తశుద్దితో పనిచేస్తున్నాం. పోలీసులతో అణిచిపెట్టాలని చూస్తున్నారు.. లోపల వేయాలని చూస్తున్నారు. మేం దేనికైనా సిద్దం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
బారికేడ్లు బద్దలు కొడుతూ.. పోలీసులపై అంబటి ఉగ్రరూపం
-
Ambati: ఆ భగవంతుడు వదలడు
-
‘చంద్రబాబు మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు’
సాక్షి,అమరావతి: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నీచరాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలను , దైవాన్ని అడ్డుపెట్టుకుని ఘోరమైన తప్పిదాలు చేస్తున్న చంద్రబాబును ఆ దేవుడు కూడా క్షమించడని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.వైఎస్సార్సీపీ నేతలను వేధించడమే ఏకైక అజెండాతో చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది. ఏడాదిన్నర కాలంలో అనేక నిదర్శనాలున్నాయి. వైఎస్సార్సీపీపై నిందలు వేయడానికి తన ఎల్లో మీడియాను వాడుకుంటారు. వైఎస్సార్సీపీ నేతలపై కక్ష తీర్చుకునేందుకు ముందుగా కొన్ని కథనాలను రాయిస్తారు. ఏదో జరిగిపోతుందనే భావన ప్రజలకు కలిగేలా చేస్తారు. ఆ తర్వాత ఏదో పెద్ద నేరం చేసేశారని నమ్మించడానికి దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేస్తారు.చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే ఐపీఎస్ అధికారులతో సిట్ వేసి విచారణ చేయిస్తారు. ఎవరో ఒకరిని తీసుకొచ్చి బలవంతంగా వారితో వైఎస్సార్సీపీ నేతల పేర్లు చెప్పిస్తారు.బెదిరించి వైఎస్సార్సీపీ నేతల పేర్లు చెప్పిస్తారు.లేదంటే భౌతికంగా దాడి చేసి చెప్పిస్తారు. బలవంతంగా పేర్లు చెప్పించడం .. వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టడమే చంద్రబాబు ప్రభుత్వం పని. దేవుడిని సైతం తన స్వార్ధ రాజకీయాలకు వాడుకునే నీచమైన స్థితికి చంద్రబాబు దిగజారిపోయారు. చంద్రబాబు రాజకీయ కక్షలకు తిరుపతి వెంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు.టిటిడిని అడ్డు పెట్టుకుని వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్‌పై బురదజల్లుతున్నారు. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూని కల్తీ అయ్యిందని చంద్రబాబు దుర్మార్గంగా ప్రచారం చేశారు. జగన్‌పై బురద చల్లడానికే చంద్రబాబు ఇలాంటి తప్పుడు ప్రచారం చేశారు.పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అసత్య ప్రచారం చేశారు.సీబీఐ విచారణ జరిపించాలని మాజీ టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.కోర్టు సీబీఐ ఆధ్వర్యంలో సిట్ ద్వారా విచారణ చేయించాలని చెప్పింది.దేవుడిని సైతం రాజకీయాలకు వాడుకోవద్దని చంద్రబాబుకు చురకలు అంటించింది. కోర్టుకు వెళ్లినందుకు వైవీ సుబ్బారెడ్డిపై కక్ష తీర్చుకునేందుకు వరుస కథనాలు రాయించారు. చిన్న అప్పన్న అనే వ్యక్తిని జూన్ 6వ తేదీన సిట్ విచారించింది. వైఎస్సార్సీపీ నేతల పేర్లు చెప్పాలని చిన్న అప్పన్నపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. ఏపీలో ఏదైనా పెద్ద ఇష్యూ జరగగానే లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తెస్తారు.నెయ్యిలో కల్తీ ఉందని ఇంత వరకూ నిరూపించలేకపోయారు.లడ్డూ ప్రసాదాన్ని ఇప్పటి వరకూ ఎక్కడికీ టెస్టుకు పంపించనే లేదు.కానీ లడ్డూ కల్తీ అయిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చిన్న అప్పన్న 2018 వరకూ వైవి.సుబ్బారెడ్డి వద్ద పీఏగా పనిచేశారు. అంతకంటే ముందు వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వద్ద కూడా పనిచేశారు. చంద్రబాబు టార్గెట్ వైవీ సుబ్బారెడ్డి కాబట్టి వేరే నేతల పేర్లు బయటికి రావు. ఇప్పటి మంత్రి పార్థసారథి గతంలో టీటీడీ పర్చేజింగ్ కమిటీలో ఉన్నారు.వైవీ సుబ్బారెడ్డి వైఎస్సార్సీపీ నేత కాబట్టి ఆయన్ని టార్గెట్ చేశారు.2014-19 మధ్య చంద్రబాబు హయాంలో నెయ్యి ఖరీదు 276 రూపాయలు మాత్రమే. ఏదో ఒక విధంగా దైవాన్ని అడ్డు పెట్టుకుని వైఎస్సార్సీపీ, జగన్‌పై బురదజల్లడమే చంద్రబాబు పని. మా పార్టీ నుంచి ప్రజలను దూరం చేయాలన్నదే చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు,లోకేష్ చేస్తున్నది చాలా నీచమైన రాజకీయం. దేవాలయాలను, దైవాన్ని అడ్డుపెట్టుకుని ఘోరమైన తప్పిదాలు చేస్తున్న చంద్రబాబును దేవుడు కూడా క్షమించడు. ఎవరిపై కక్ష తీర్చుకుందాం..ఎవరిని లోపల వేద్దామనేదే చంద్రబాబు ఆలోచన .చంద్రబాబు,లోకేష్ వైఎస్సార్సీపీపై కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలి’అని హితువు పలికారు. -
Ambati: దేవుడితో రాజకీయాలు చేయడం టీడీపీకి అలవాటే
-
‘దేవుడితో రాజకీయాలు వాళ్లకు బాగా అలవాటే!’
సాక్షి, గుంటూరు: దేవుడితో రాజకీయాలు చేయడం చంద్రబాబు అండ్ కోకు చాలా సర్వసాధారణమైన విషయమని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. తిరుమల అన్నప్రసాదంపై తాను చేసిన కామెంట్లను ఎల్లో మీడియా ప్రచురించడంపై ఆయన తాజాగా స్పందించారు. గుంటూరు జిల్లా కోర్టు వద్ద కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ లను ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తిరుమలలో 1985 నుంచి ఉచిత భోజనం పెడుతున్నారు. ఉచిత భోజనం కోసం భక్తులు రూ. 27 వేల కోట్లు చందాలు ఇచ్చారు. కొండపైన దాదాపు 40 సంవత్సరాలు నుంచి భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదం అందిస్తున్నారు. నేను ఇప్పుడు వెళ్లి భోజనం చేశాను కాబట్టి భోజనం బాగుందని చెప్పాను. కానీ ఎల్లో మీడియా బీఆర్ నాయుడు ఏదో గొప్పగా పని చేశాడని వాళ్ళ ఛానల్ లో వేసుకుంటున్నారు.బీఆర్ నాయుడు ఏమన్నా భక్తుడా...?టీవీ5 బీఆర్ నాయుడు ఓ బ్రోకర్. దేవుడితో రాజకీయాలు చేయటం వాళ్లకు బాగా అలవాటు. అందుకే చంద్రబాబు నాయుడు లడ్డు ప్రసాదంతో రాజకీయం చేశాడు. ఇప్పుడు నా వ్యాఖ్యలతో బీఆర్ నాయుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు దేవుడితో రాజకీయాలు చేస్తాడు కాబట్టి ఒకసారి అలిపిరిలో ల్యాండ్ మైన్ పేలింది అని అంబటి అన్నారు... వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందించడంతో పాటు పేద విద్యార్థులు డాక్టర్లు కావాలని భావించారు. కానీ చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీ లతో వ్యాపారం చేయాలని భావిస్తున్నారు. మెడికల్ కాలేజీలు అమ్మేసి లోకేష్ జేబులు నింపాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
లోకేష్.. ఎంత మందిని జైలులో పెడతావు?: అంబటి
సాక్షి, తిరుపతి: మంత్రి నారా లోకేష్‌కు కక్ష సాధింపు చర్యలు తప్ప రాష్ట్ర అభివృద్ధి తెలియదని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అధికారం శాశ్వతం కాదు.. ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవాలి. మీ నాన్నను జైల్లో పెట్టారని నీకు కనిపించిన వాళ్లందరినీ జైల్లో పెడతావా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘మంత్రి నారా లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగానికి వైఎస్సార్సీపీలో ఏ ఒక్కరూ భయపడరు. మా పార్టీ నాయకులపైన అన్యాయంగా, అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. అధికారం ఉంది కదా అని తప్పుడు కేసులు పెడతామని చూస్తే దీని ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించక తప్పదు. అధికారం శాశ్వతం కాదు. అధికార మదంతో లోకేష్ ఉన్నాడు. తన తల్లిని అంబటి రాంబాబు అవమానించాడు అంటూ లోకేష్ అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు. విచారించుకోండి నేను ఏరోజు ఆయన తల్లిని అవమానించలేదు. మీ నాన్నను జైల్లో పెట్టారని నీకు కనిపించిన వాళ్లందరినీ జైల్లో పెడతావా?. ఎంత మందిని జైలులో పెడతారు?. జైల్లో పెడితే బయటకు రామా.. మీరు ఏమైనా చంపేస్తారా. జైల్లో నుంచి మీ నాన్న చంద్రబాబు బయటకు రాలేదా?. ఏడాదిన్నర కాలంలోనే కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత మొదలైంది. అన్నీ ప్రజలే చూస్తున్నారు. రాబోయే మూడేళ్లలో మేమంతా ఎలా బలపడతామో మీరే ఊహించుకోండి. కూటమి ప్రభుత్వానికి ఓట్లు ఎందుకు వేశామా అని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు. ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేయడం లేదని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వైఎస్ జగన్ పర్యటనకు లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఆయన్ను ఓడించాము అనే బాధతో ప్రజలు ఆయన పర్యటనకు తరలి వస్తున్నారు.మీ రెడ్‌బుక్ బంగాళాఖాతంలో మునగడం ఖాయం. పవన్ కళ్యాణ్.. మీరు 15 ఏళ్లు కాదు జీవితాంతం కలిసే ఉండండి మాకేం నష్టం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరిగింది మీరు కలిసి ఉంటేనే మాకు కలదు సుఖం. మేము బలపడతాం. అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ.. చిరంజీవిని అవమానిస్తే పవన్ కళ్యాణ్ నోరు మెదపలేదు. మీరు పోరాట యోధులు అన్నారు. అన్యాయం జరిగితే సహించరు అన్నారు ఇదేనా?. నువ్వు చెప్తే నమ్మి కాపులందరూ చంద్రబాబుకు ఓటు వేశారు. మీ పోరాట పటిమని గంగలో ముంచేయండి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
Ambati: వాళ్లకు భయపడి నేను పారిపోవాలా?
-
అమెరికాలో కూతురి పెళ్లి.. అంబటి రాంబాబు స్పందన
-
జోగి రమేష్ అరెస్ట్ అంబటి రాంబాబు రియాక్షన్
-
తిరుమల కల్తీ నెయ్యి కేసులో అంబటి షాకింగ్ నిజాలు
-
కల్తీ నెయ్యి కేసుతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ షురూ
సాక్షి,తాడేపల్లి: తుఫాన్లో నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం తిరుమల కల్తీ లడ్డు పేరుతో మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరలేపిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... దేవుడి పేరుతో టీడీపీ నేతలు చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఆ దేవుడు, ప్రజలు కూడా క్షమించరని హెచ్చరించారు. లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు ఆసత్య ఆరోపణలపై సమగ్రమైన విచారణ జరిపించాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దేశ సర్వోన్నత న్యాయస్ధాన్ని ఆశ్రయిస్తే... సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నలను ఇప్పటికీ చంద్రబాబు బదులివ్వలేదని అంబటి స్పష్టం చేశారు. కేవలం వైఎస్సార్ర్సీపీ నేతలపై కక్ష సాధింపు కోసం దేవుడిని కూడా వాడుకోవడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు.. పర్చేజింగ్ కమిటీలో ఉన్న కొలుసు పార్ధసారధి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలు సభ్యులుగా ఉన్నా.. ఎల్లో మీడియా వారి పేర్లు ఎందుకు ప్రస్తావించడం లేదని నిలదీశారు. దేవుడ్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న నీచమైన, కక్ష రాజకీయాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్..గడిచిన రెండు, మూడు రోజులుగా తుపాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిని రాష్ట్రంలో రైతులు తీవ్ర వేదనలో ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి, దానిలో కిక్ బ్యాగ్స్ ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించాలని తండ్రీకొడుకులు వేదన రాష్ట్రంలో ఉంటే... వీటిని ఏదో ఒక విధంగా చంద్రబాబు డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. అందులో భాగమే చిన్నప్పన్న అరెస్టు. ఈ అరెస్టు ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యులైన వైవీ సుబ్బారెడ్డి మీద బురజ జల్లే కార్యక్రమం ఉధృతం చేస్తున్నారు. సిట్‌ను నడిపిస్తున్న ఎల్లో మీడియాలో కధనాలు చూస్తే... సుబ్బారెడ్డి గారెపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోంది. చంద్రబాబు చేష్టల వల్ల ప్రపంచవ్యాప్తంగా హిందూవులు తీవ్రంగా బాధపడుతున్నారు.సుప్రీం ప్రశ్నలకూ బదులివ్వని చంద్రబాబు..చంద్రబాబు తిరుపతి లడ్డూలో పంది, పశు కొవ్వు కలిసిన నెయ్యితో తయారు చేశారన్న అసత్యమైన ఆరోపణ చేశారు. అది కోట్లాది మంది భక్తులు తిన్నారని కూడా చెప్పాడు. ఇది ఆధారాల్లేని అపవాదు. దీని మీద వైయస్సార్సీపీ పార్లమెంటరీ నాయకుడు వై వీ సుబ్బారెడ్డి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అనేకమైన కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధారాలు లేకుండా లడ్డూ ప్రసాదం కల్తీ అయిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా చెబుతారు అని అడిగింది. అంతే కాకుండా లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ అయిందా ? లేదా? తేల్చండి అని కూడా చెప్పింది. మరోవైపు అప్పటి ఈవో శ్యామలరావు మాట్లాడుతూ నెయ్యిని ఎన్ డీ బీ ల్యాబ్ కు పంపించాం. వారు వనస్పతిలాంటిది కలిసిందని సర్టిఫై చేస్తూ... కింద ఇది కొన్ని సందర్భాలలో అవాస్తవం కూడా కావచ్చు. పశువులు తినే మేత, టైమింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది.. అని రాసిన డిస్ క్లైమర్ కూడా మీడియాకు చదివి వినిపించారు. ఆ నెయ్యిని వాడలేదు, వెనక్కి తిరిగి పంపించామని చెప్పారు. చంద్రబాబు గారు మాత్రం కేవలం రాజకీయ దురద్దేశ్యంతో ఆ నెయ్యి వాడారని... కల్తీ జరిగిందని చెప్పారు. ఈవో ఒక మాట, చంద్రబాబు మరో మాట ఎలా చెబుతారు? ఎన్ డీ బీ ల్యాబ్ ఒక్కటే ఉందా? సెకెండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని కూడా సుప్రీం కోర్టు ప్రశ్నించింది. మొత్తంగా నెయ్యిలో కల్తీ కలిసిందా ? లేదా? అన్నది తేల్చండి అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కానీ చంద్రబాబు మాత్రం బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగానే సుబ్బారెడ్డి గారి దగ్గర 8 సంవత్సరాలు క్రితం పీఏ గా పనిచేసిన చిన్నప్పన్నను ఈ ఏడాది మే 31న విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చారు. జూన్ 6న సిట్ ఎదుట చిన్నప్ప హాజరైతే...విచారణ అనంతరం ఆయన ఒక వీడియో విడుదల చేసి.. విచారణ పేరుతో సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిల పేరు చెప్పమని సిట్ అధికారులు నన్ను బలవంతం చేశారు, నేను చెప్పలేదు స్పష్టం చేశారు. 8 సంవత్సరాల క్రితం పనిచేసిన చిన్నప్పన్నను ఆ రోజు అరెస్టు చేయకుండా 4 నెలల తర్వాత అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. సుబ్బారెడ్డి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాను.దేవుడి పేరుతో వైఎస్సార్సీపీ నేతలపై రాజకీయ కక్ష సాధింపునేను ఇవాళ చంద్రబాబు, సిట్ అధికారులు, ఎల్లో మీడియాను ప్రశ్నిస్తున్నాను. చిన్నప్పన్న కేవలం సుబ్బారెడ్డి గారి దగ్గర మాత్రమే పనిచేయలేదు.. ఆయన అధికార పార్టీ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి దగ్గర కూడా పీఏగా పనిచేశారు. వారి గురించి సిట్, ఎల్లో మీడియా ఎందుకు మాట్లాడ్డం లేదు. అంటే వాళ్లు ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీలో చేరి పదవుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ల గురించి రాయడం లేదా? అంటే మీ టార్గెట్ కేవలం వైయస్.జగన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులేనా? కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని అడ్డం పెట్టుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద రాజకీయ కక్ష సాధిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు టీటీడీ పర్చేజింగ్ కమిటీలో కొలుసు పార్ధసారధి, ప్రశాంత్ రెడ్డి ఇద్దరూ సభ్యులే. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లు వారి ప్రస్తావన ఎందుకు తేవడం లేదు? చిన్నప్పన్న వాళ్ల దగ్గర కూడా పనిచేసినా సుబ్బారెడ్డి పేరే వస్తుంది. సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు పర్చేజింగ్ కమిటీలో న్న వ్యక్తులు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు కాబట్టి... వారిని విచారణ కూడా చేయాల్సిన అవసరం లేదన్నట్టు దుర్మార్గమైన పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కిలో రూ.320కు ఆవునెయ్యి కొంటున్నారు. కల్తీ కాకపోతే అంత తక్కువ ధరకు వస్తుందా? స్వచ్చమైన నెయ్యి అయితే రూ.3వేలు అవుతుందని కూడా ప్రచారం చేశారు. ఈనాడు అయితే స్వచ్ఛమైన నెయ్యి కేజీ రూ.1000 నుంచి రూ.1600 ఖరీదు చేస్తుంది. రూ.320 కు కొన్నారంటే అది కల్తీ నెయ్యి తేల్చిపారేశారు. నేను టీటీడీ బోర్డును ప్రశ్నిస్తున్నాను.. ఇప్పుడు కేజీ నెయ్యి రూ.3వేలకు కొంటున్నారా? రూ.1600 కు కొంటున్నారా? కనీసం రూ.1000కు కొంటున్నారా? రూ.320 కంటే ఎక్కువ, రూ.1000 కన్నా తక్కువకు కొంటున్నారు. మీరు చెప్పిన వాదన ప్రకారం ఇది స్వచ్ఛమైన నెయ్యి అని నమ్మమంటారా? సమాధానం చెప్పాలి.మీ కక్ష రాజకీయాలను ఎదుర్కోవడానికి మేం సిద్ధం..2014-19 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ కేజీ నెయ్యి రూ.276లకే కొనుగోలు చేసింది. అది మాత్రం స్వచ్చమైన నెయ్యి. ఆయన దిగిపోగానే రూ.320 కి కేజీ నెయ్యి కొంటే అది కల్తీ నెయ్యి, అందులో జంతుకొవ్వు కలిసిందంటూ అపవిత్రమైన మాటలు మాట్లాడిన చంద్రబాబు భ్రష్టు పట్టించారు. సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. సుప్రీం కోర్టు అడిగిన స్పష్టమైన ప్రశ్నలకు చంద్రబాబు ఈ రోజు వరకూ సమాధానం చెప్పలేని స్ధితిలో ఉన్నారు. కేవలం శ్రీవేంకటేశ్వరస్వామిని అడ్డం పెట్టుకుని వైయస్సార్సీపీ మీద రాజకీయ కక్ష సాధించాలని చంద్రబాబునాయుడు దుర్మార్గమైన పాప కార్యం చేస్తున్నారు. పీఏ చిన్నప్పన్న దగ్గర ఒక్క రూపాయి పట్టుకున్నది లేదు. కానీ బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. దేవుడ్ని అడ్డం పెట్టుకుని మీరు చేసే నీచమైన, కక్ష రాజకీయాలను ఎదుర్కోవడానికి మేం ప్రతిక్షణం సిద్ధంగా ఉన్నాము.కల్తీ లిక్కర్ కేసులో నిందితులైన మీ పార్టీ నేతలు ఎక్కడ ?మా పార్టీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ మీద కక్ష సాధింపు మొదలుపెట్టారు. చాలా రకాలుగా అరెస్టు చేయాలని ప్రయత్నాలు చేసి .. కల్తీ మద్యం కేసులో అరెస్టు చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారెకి చెందిన ప్రైవేటు వ్యాపారులే కల్తీ లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. కల్తీమద్యం తయారీలో అతిపెద్ద నిందితుడు, ఆ పార్టీ తంబళ్లపల్లె నియోజకవర్గం సమన్వయకర్త జయచంద్రారెడ్డి మాత్రం పోలీసులుకు దొరకడు. ఆయన బావమరిది గిరిచంద్రారెడ్డి, పీఏ రాజేష్ లు కూడా దొరకరు. ఎందుకంటే వాళ్లు దొరికితే వాస్తవాలన్నీ బయటపడతాయి. దాన్ని కూడా వైయస్సార్సీపీ నేతల మీద కక్ష సాధింపు చర్యలకు వాడుకుంటున్నారు. గతంలో చంద్రబాబు ఇంటి వద్దకు ప్రశ్నించడానికి వెళ్లాడని జోగి రమేష్ పై కక్ష కట్టి.... బెయిల్ రాకుండా నెలల తరబడి జైల్లో పెట్టాలని చూస్తున్నారు.కేవలం వైఎస్సార్సీపీ నాయకులను వేధించడమే లక్ష్యంగా ప్రభుత్వం, వారి ఆధ్వర్యంలోని సిట్ పనిచేస్తోంది. మీ కక్ష సాధింపు చర్యలకు చివరకు దైవాన్ని కూడా అడ్డం పెట్టుకోవడం అత్యంత దుర్మార్గమని అంబటి ఆక్షేపించారు. ఇప్పటికైనా ఇలాంటి కార్యక్రమాలను ఆపకపోతే ఆ దేవ దేవుడి మిమ్మల్ని క్షమించడని, జరుగుతున్నదాన్ని గమనిస్తున్న ప్రజలు కూడా మిమ్నల్ని క్షమించరు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబును హెచ్చరించారు. -
YV సుబ్బారెడ్డి PAగా చేసిన అప్పన్న.. తిరుమల కల్తీ నెయ్యి కేసులో అంబటి షాకింగ్ నిజాలు
-
బాబుకు సోషల్ మీడియా భయం!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సోషల్ మీడియా పెద్ద సవాలే విసురుతోంది. ఆడిటర్లు, ఎడిటర్లు అవసరం లేని ఈ మీడియా ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెట్టి వ్యక్తిగత హననానికి పాల్పడుతోందని కూడా ఆయన హూంకరించారు. పాపం... ఈ క్రమంలో ఆయన తన గతాన్ని మరచినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇదే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రతిపక్షంలో ఉండగా సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని జగన్, ఆయన కుటుంబాన్ని ఎంతగా రచ్చకీడ్చే ప్రయత్నం చేసింది అందరికీ తెలుసు. మంత్రులగా ఉన్న రోజా, అంబటి రాంబాబులపై కూడా టీడీపీ సోషల్ మీడియా విభాగం విచ్చలవిడి వ్యాఖ్యలు... కథనాలు వండి వార్చిన విషయం మరీ అంత పాత సంగతైతే కాదు. విపక్షంలో ఉన్నప్పుడు కాని, ప్రస్తుతం అధికారం వచ్చాక కాని, తెలుగుదేశం పక్షాన ఎంత అరాచకంగా సోషల్ మీడియాను నడిపింది ఆయనకన్నా ఎవరికి బాగా తెలుసు? దానికి లోకేష్ బృందమే నాయకత్వం వహించిందని వైఎస్సార్సీపీ నేతలు చెబుతుంటారు. ప్రధాన మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి పచ్చి అబద్దాలు రాసి జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కంకణం కట్టుకుని పనిచేశాయి. ఆ సందర్భంలో ఎప్పుడైనా ప్రభుత్వం వైపు నుంచి రియాక్షన్ వచ్చి కేసులు పెట్టే యత్నం చేస్తే ఇంకేముంది ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని, మీడియా స్వేచ్చను అరికడతారా అంటూ నానా యాగీ చేసేవారు. ఏపీ రూ.14 లక్షల కోట్ల అప్పులతో నాశనమైపోయిందని నాసిరకం మద్యంలో 30 వేల మంది చనిపోయారని, జగన్ ప్రజల భూములన్నీ లాగేసుకుంటారని.. ఇలా అనేక అంశాలలో చంద్రబాబు ఆరోపణలు చేయడం తదుపరి ఎల్లో మీడియా, తన సోషల్ మీడియా ద్వారా విపరీతమైన విష ప్రచారం చేయించేవారు. అప్పుడు సోషల్ మీడియా అవసరం ఆయనకు కనిపించింది. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఈ ధోరణి మారలేదు సరికదా మరింత పెరిగిపోయింది. ఒకపక్క లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు, వైఎస్సార్సీపీ అనుకూల సోషల్ మీడియా వారిపై విచ్చలవిడిగా అక్రమ కేసులు బనాయిండం చూస్తూనే ఉన్నాం. ఎటూ అధికారం ఉంది కనుక తన అనుకూల సోషల్ మీడియా వైఎస్సార్సీపీ వారిపై ఎంత నీచంగా పోస్టులు పెట్టినా వారి జోలికి పోలీసులు వెళ్లరు. అదే వైఎస్సార్సీపీ సానుభూతి పరులెవరైనా వ్యతిరేక పోస్టులు పెడితే పోలీసులు వెంటనే కేసులు పెట్టేస్తున్నారు. దాదాపు 1200 మంది వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టారంటేనే చంద్రబాబు ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తోందో ఊహించుకోవచ్చు. కాబట్టి చంద్రబాబు గారు.. సోషల్ మీడియాను గాడిన పెట్టాలన్న చిత్తశుద్ధి మీకుంటే.. దాన్ని మీ పార్టీతోనే మొదలుపెట్టడం మేలవుతుంది. నలుగురికి ఆదర్శంగానూ ఉంటుంది. వైఎస్ జగన్, కుటుంబం, అంబటి రాంబాబు, రోజా వంటి వైఎస్సార్సీపీ నేతల కుటుంబాలపై నీచమైన పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఎంత మందిపై కేసులు పెట్టారు మీరు? ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్ష కట్టి తప్పుడు కేసులు పెట్టడం ఏపీ పోలీసులపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది కదా? మాజీ మంత్రి రోజాను ఉద్దేశించి అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణమూర్తికి టీడీపీ టిక్కెట్ ఎలా ఇచ్చారో చెప్పగలరా? అదే వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారట. కూటమి నేతల తీరుతెన్నులకు ఇవి నమూనాలు మాత్రమే. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఎవరైనా తప్పుగా వ్యవహరిస్తే వారిపై చర్య తీసుకోవచ్చు కాని వారి భావ ప్రకటన స్వేచ్ఛను నియంత్రించాలని, వేధించాలని ప్రయత్నాలు చేయడం శోచనీయం. ఎన్నికల హామీలను సజావుగా అమలు చేసి, ప్రజానుకూల విధానాలను ఆచరిస్తే ఎవరు ఏమీ పోస్టులు పెట్టుకున్నా ప్రభుత్వానికి ఏమీ కాదు. అయితే కూటమి ప్రభుత్వం అబద్ధాల పునాదులపై నిర్మించింది కనుకే ఇప్పుడీ సోషల్ మీడియా భయం చుట్టుకున్నట్లుంది. కొన్నిరోజుల క్రితం చంద్రబాబు నాయుడు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం అని అన్నారు. ఏమిటి దీనర్థం? ఆ స్వేచ్చ ప్రజలకు మేలు చేయడానికా? లేక ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజలలోకి తీసుకువెళుతున్న సోషల్ మీడియాని అణచి వేసేందుకా? ఇప్పటికే ఏపీలో పోలీసులు ఎక్కడా లేని విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలపై తప్పుడు కేసులు పెట్టడం, మరో వైపు అధికార కూటమి ముఖ్యంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు దాష్టికాలకు పాల్పడినా పట్టించుకోక పోవడం పెద్ద సమస్యగా ఉంది. ముఖ్యమంత్రి సైతం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధంగా తమది పొలిటికల్ గవర్నెన్స్ అని ప్రకటించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదం అయ్యాయో అందరికి తెలుసు. ముఖ్యంగా తిరుమల లడ్డూ లో జంతు కొవ్వు కలిసిందంటూ ఆధారం లేని ఆరోపణ చేసి వైఎస్సార్సీపీకి అంటగట్టే యత్నం చేశారు. చంద్రబాబుకు మద్దతుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతని వేషం కట్టి, అయోధ్యకు కల్తీ లడ్డూలు సరఫరా అయ్యాయని రెచ్చిపోయి మాట్లాడారు. వాటికి సంబంధించి ఏ ఒక్క ఆధారం చూపలేకపోయారు. ఇది ఫేక్ ప్రచారం అవుతుందా? లేక వాస్తవాల ప్రచారం అవుతుందా అన్నదానిపై ఈ ఏడాదికాలంలో ఎన్నడైనా వివరణ ఇచ్చారా? విపక్షంలో ఉన్నప్పుడు పోలీసులకు చంద్రబాబు, లోకేశ్‌లు ఎలాంటి వార్నింగ్ లైనా ఇవ్వవచ్చు. అధికారంలోకి రాగానే ప్రత్యర్ధి పార్టీవారు మాట్లాడితే అది రాజకీయ కుట్ర, శాంతియుత వాతావరణం చెడగొట్టడం అవుతుంది. ప్రతి ఉపన్యాసంలోను కొన్ని పాయింట్లు రాసుకుంటారు. వాటిని ఒక జాబితా ప్రకారం వల్లె వేస్తుంటారు. ఒక ఉదాహరణ చూడండి..'గుంటూరులో కారు కింద వ్యక్తి పడిపోతే పొదల్లో పారేసి వెళ్లిపోయారు.పోలీసులు అంబులెన్స్ లో తీసుకువెళ్లి రక్షించే యత్నం చేస్తే వారే చంపేశారని చెప్పించే పరిస్థితికి దిగజారారు.." అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలీసు శాఖకు సంబంధించిన కార్యక్రమంలోనే ఆయన ఇలా మాట్లాడితే అక్కడ ఉన్న పోలీసు అధికారులకు వాస్తవం తెలియదా! అయినా సరే! ప్రజలను తప్పుదారి పట్టించాలన్న ఉద్దేశంతో పవిత్రమైన కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్థాయి నేత ఇలా మాట్లాడితే ఏమి విలువ ఉంటుంది.ఇంతకుముందు టర్మ్‌లో ఆయన సీఎంగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారు. చంద్రబాబు కుటుంబం పుష్కర స్నానం ఘట్టం చిత్రీకరించేందుకు సాధారణ భక్తులను నిలిపివేసినందున అది జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు జరిగిన ఘటనపై సీసీటీవీ ఫుటేజి మాయమైందన్న ఆరోపణలు ఉన్నాయి. విపక్షంలో ఉండగా కందుకూరు సభలో, గుంటూరు సభలో తొక్కిసలాట జరిగి మరో 11 మంది మృతి చెందారు.అదంతా పోలీసుల వైఫల్యం అని వారిపై నెట్టేశారు. తన వైపు ఎంత తప్పు ఉన్నా కప్పిపుచ్చుకోవడంలో ఎంత నేర్పరితనం ఉందో, ఆయా సందర్భాలలో తన రాజకీయ ప్రత్యర్ధులపై తప్పుడు ఆరోపణలు చేయడంలో అంతకన్నా అధికంగా నేర్పరితనం చంద్రబాబుకు ఉందని ఎక్కువ మంది భావిస్తుంటారు. రాష్ట్రంలో ఎవరు చనిపోయినా కల్తీ మద్యం వల్లే అని ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు.నకిలీ మద్యం తయారీ ప్లాంట్లు, పలుచోట్ల నకిలీ మద్యం డంప్ లు దొరకలేదా? వేలాది బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్ లకు అనుమతి ఇచ్చాక, అక్కడ ఏ మద్యం సరఫరా అవుతోందో ఎవరైనా చెప్పగలుగుతున్నారా?ఎక్సైజ్ అధికారులే పలు చోట్ల ఇలాంటి మద్యాన్ని పట్టుకున్నారు కదా? అయినా నకిలీ మద్యం వల్ల ఎవరూ చనిపోలేదని, అనారోగ్యం పాలు కాలేదని ముఖ్యమంత్రి ఎలా చెప్పగలుగుతున్నారు? ఎంతమంది తాగుబోతులకు ప్రభుత్వం ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది? ఆయన చేసే వాదన సరైనదే అయితే, విపక్షంలో ఉన్నప్పుడు నాసిరకం మద్యం తాగి 30 వేల మంది చనిపోయారని ఏ ఆధారాలతో ఎలా చెప్పగలిగారు. 35 లక్షల మంది అనారోగ్యానికి గురయ్యారని ఎన్నికల ప్రణాళికలో ఎలా రాయగలిగారు.అది తప్పు కాదా?ఇప్పుడు ఆధార సహితంగా నకిలీ మద్యం దొరికినా ఎవరి ఆరోగ్యం చెడలేదని , ఎవరూ మరణించలేదని జనం నమ్మాలని,దీని గురించి ఎవరూ ప్రశ్నించకూడదన్నది ఆయన ఉద్దేశం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Ambati: తిరుగుబాటు మొదలైంది.. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే
-
Ambati: ప్రజా ఉద్యమంతో చంద్రబాబుకు బుద్ధి చెప్తాం
-
చికాగోలో వైస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మీట్ అండ్ గ్రీట్
వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం అమెరికాలోని చికాగోలో ఘనంగా జరిగింది. వైఎస్ జగన్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు.. అంబటి రాంబాబు కి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పరమ యరసాని, శరత్ యెట్టపు, నరసింహ రెడ్డి, కేకే రెడ్డి, KSN రెడ్డి, కందుల రాంభూపాల్ రెడ్డి, ఆర్వీ రెడ్డి , వెంకట్ రెడ్డి లింగారెడ్డి, హరినాథ్ పొట్టేటి , వినీల్ తోట తదితరులు పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ పరిపాలన గురించి ప్రస్థావించారు. సంక్షేమం, అభివృద్ధి, నిజాయితీ కలసిన ప్రజా పాలనను జగనన్న అందించారని కొనియాడారు. కాని ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పరిపాలన కొనిసాగుతుందని విమర్శించారు.ఇక ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరైన వైస్సార్సీపీ అభిమానులు, సానుభూతిపరులు.. వైఎస్ జగన్ పై, అంబటి రాంబాబు పై వారి అచంచలమైన అభిమానాన్ని చాటారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. చికాగోలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రవాసుల ప్రేమ చూస్తుంటే తనకు ముచ్చటేస్తుందన్నారు. దూర ప్రాంతాల నుంచి అమెరికాకు వచ్చినవారు వైఎస్ ఫ్యామిలీపై చూపిస్తున్న ప్రేమ మరువలేనిదన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయ్యిందన్నారు. ఈ ఏడాదిన్నర పాలనలోనే ప్రజల నుంచి ఇంత తీవ్రమైన వ్యతిరేకతను.. తన రాజకీయ జీవితంలోనే చూడలేదన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. పెద్ద పెద్ద ప్రకటనలు చేసి.. డప్పు కొట్టుకునే కార్యక్రమాలు చేశారు. సూపర్ సిక్స్ చేసేశాం అంటున్నారు. సూపర్ సిక్స్ లో ఏం అమలు చేశారో అర్దం కావటంలేదన్నారు అంబటి. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది వైఎస్సార్.. ఆ తర్వాత వైఎస్ జగనే అన్నారు. అమ్మ ఒడి పథకాన్ని దేశం మొత్తంలో మొదటగా ప్రవేశ పెట్టిన వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. కానీ చంద్రబాబు ఆ పథకాలను కాపీ చేసి మేమే వీటిని సృష్టించాం అని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ప్రవాసులు అడిగిన పలు ప్రశ్నలకు అంబటి ఎంతో ఒపికగా సమాధనం ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: AI వినియోగంపై హెచ్చరిక.. యూకేలో గరికపాటి ప్రవచనాలు) -
‘ఆ మరణానికి కల్తీ లిక్కరే కారణమని మా అనుమానం’
పల్నాడు జిల్లా: అచ్చంపేటలో ఓ వ్యక్తి మృతి చెందడం వెనుక కల్తీ మద్యం కారణం అయ్యి ఉండొచ్చని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. అచ్చంపేటలో మరణంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ అచ్చంపేట మరణం దురదృష్టకరం. బెల్ట్ షాపులో లిక్కర్ తాగిన తర్వాత వాందులు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు అవసరం. ఆ మరణానికి కల్తీ మద్యం సేవించడం కారణం కావొచ్చనేది మా అనమానం. వైద్య సిబ్బందిపై నెట్టేసి, మసిపూసి మారేడు కాయ చేయడం మంచిది కాదు. హాస్పిటల్స్ ఉండాల్సిన డాక్టర్లు లేకపోతే చర్యలు తీసుకోవడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మరణానికి అసలు కారణం దాచే ప్రయత్నం మంచిది కాదు’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. కాగా, పల్నాడు జిల్లాలోని అచ్చంపేట ముస్లిం కాలనీకి చెందిన షేక్ మాదిపాడు నాగులును అనారోగ్యం కారణంగా మృతిచెందాడు. అతన్ని అచ్చంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయింది. అయితే అక్కడ సరైన వైద్యం అందక నాగులు మృతిచెందాడని ఒకవైపు ఆందోళణ వ్యక్తమవుతున్న సమయంలోనే లిక్కర్ తాగిన తర్వాతే నాగులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యాడని స్థానికలు చెబుతున్నారు. -
Ambati: కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్ట్ బాబు తీసుకుంది కమీషన్ల కోసమే
-
OG సినిమాకు టికెట్ 1000 రూపాయలా? పవన్ కళ్యాణ్ పై అంబటి సెటైర్లే సెటైర్లు
-
పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే: అంబటి
సాక్షి, తాడేపల్లి: సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. నదుల అనుసంధానంపై కూడా అసత్యాలే మాట్లాడారంటూ దుయ్యబట్టారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు స్థాపనలు చేయడం తర్వాత మరిచిపోవడం చంద్రబాబుకు అలవాటు అంటూ చురకలు అంటించారు.‘‘పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే. తన పచ్చి అబద్దాల కోసం చనిపోయిన వాజపేయిని కూడా వాడుకున్నారు. చంద్రబాబు శిలా ఫలకాలు వేసిన చోట దివంగత మహానేత వైఎస్సార్ మొక్కలు కూడా నాటారు. చంద్రబాబు జీవితంలో శంకుస్థాపన చేసి పూర్తి చేసింది కేవలం పట్టిసీమ మాత్రమే. పోలవరానికి శంకుస్థాపన చేసింది వైఎస్సార్. కానీ తానే చేసినట్టు నిస్సిగ్గుగా చంద్రబాబు అబద్దాలు చెప్తున్నారు. నిజంగా పోలవరం మీద ప్రేమ ఉంటే ప్రాజెక్టు సందర్శనకు ఎందుకు వెళ్లటం లేదు?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.‘‘గతంలో కమీషన్ల కోసం ప్రతి సోమవారం పోలవరం వెళ్లారు. కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్ ఇలా ప్రతి దానికీ శంకుస్థాపన పేరుతో శిలా ఫలకాలు వేశారు. స్పిల్ వే పూర్తి చేయకుండానే గేటులు పెట్టునట్టు భజన చేయించుకున్నారు. చంద్రబాబు అసమర్థ నిర్ణయాల వలనే పోలవరం ఆలస్యం అవుతోంది. విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని కేంద్రమే కట్టాల్సి ఉంది. కానీ కమీషన్ల కోసమే చంద్రబాబు పోలవరాన్ని తీసుకున్నారు. పోలవరాన్ని పేటిఎంలాగా వాడుకుంటున్నారని ప్రధాని మోదీనే చెప్పారు’’ అని అంబటి గుర్తు చేశారు.‘‘స్పిల్ వే నిర్మాణం చేసి నదిని డైవర్ట్ చేసిన ఘనత జగన్‌ది. 41.15 మీటర్లకే నీటిని నిలిపేందుకు చంద్రబాబు అంగీకరించారు. దీని వలన ఉత్తరాంధ్రకు నీరు అందని పరిస్థితి ఏర్పడింది. పోలవరం నిర్మాణంలో తప్పులు జరిగాయని సాక్షాత్తు అంతర్జాతీయ నిపుణుల కమిటీనే తేల్చి చెప్పింది. డయాఫ్రం వాల్ నిర్మాణం కూడా చంద్రబాబు హయాంలోనే డ్యామేజీ అయిందని కమిటీ చెప్పింది. మా హయాంలో వచ్చిన వరదల సమయంలో అద్భుతంగా పని చేశామని అదే నిపుణుల కమిటీ మా ప్రభుత్వాన్ని మెచ్చుకుంది. పోలవరానికి కావాల్సిన అన్ని అనుమతులు తెచ్చిన ఘనత వైఎస్సార్‌ది. ఆయన కృషిని జగన్ కొనసాగిస్తూ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లారు..కరోనా సమయంలో సైతం పోలవరాన్ని వేగంగా నిర్మాణం చేయించారు. పోలవరాన్ని పూర్తి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదు. అది ఆయన కలలు కన్న ప్రాజెక్టు కాదు. అసెంబ్లీలో మాత్రమే పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటున్నారు. కనీసం కేబినెట్ మీటింగ్‌లకు కూడా హాజరు కావటం లేదు. దీని వెనుక మర్మం ఏంటో పవన్‌కే తెలియాలి. డిప్యూటీ సీఎం సినిమాలో నటిస్తే టికెట్ ధర వెయ్యి చేస్తారా?. అధికారం ఉందని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా?. ఈ దోపిడీ కరెక్టు కాదు. జనాన్ని పీక్కుతింటామంటే కుదరదు. ఎక్కువ మంది జనం చూస్తే డబ్బులు రావాలని కోరుకోవాలే గానీ ఇలా దోపిడీ చేయడం కరెక్టు కాదు. పరకామణిని వైఎస్సార్సీపీ వారు దోచుకున్నారంటూ లోకేష్ ట్వీట్ చేయటం అవివేకం. ప్రతిదానిలోనూ మేము ఉంటామని చెప్పటం లోకేష్‌కు అలవాటే. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంకా మూడేళ్లు కొనసాగిస్తారు. ఆ తర్వాత సంగతేంటో కూడా లోకేష్ గుర్తిస్తే మంచిది’’ అంటూ అంబటి వ్యాఖ్యానించారు. -
Ambati: ప్రభుత్వానికి చాలా థాంక్స్ ఈ కార్యక్రమాన్ని మీరే సక్సెస్ చేశారు
-
మెడికల్ కాలేజీలు పేదల కోసం.. బినామీలకు ఇస్తానంటే ఊరుకోము
-
వావిలాల గోపాలకృష్ణయ్యకి అంబటి నివాళి
-
లిక్కర్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు
-
లేని లిక్కర్ స్కాంలో సిట్ భేతాళ కథలు: అంబటి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు జ్ఞానం కోల్పోతున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆధారాలు లేని అభూత కల్పనలతో సిట్ దర్యాప్తు సాగుతుందని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. చంద్రబాబు మీద లిక్కర్ స్కామ్ కేసు ఉందని.. ఆ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్‌మీద ఉన్నారని గుర్తు చేశారు.వైఎస్సార్సీపీని అణచాలని చూడటం దుర్మార్గం. చెవిరెడ్డి మీద అక్రమ కేసు పెట్టి వెంటాడుతున్నారు. సిట్ దర్యాప్తును ప్రజలు నమ్మడం లేదు.. నవ్వుతున్నారు. లోకేష్, చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోవాలి’’ అని అంబటి హితవు పలికారు.‘‘లేని లిక్కర్ స్కాంలో సిట్ ఇంకా భేతాళ కథలే అల్లుతోంది. వైఎస్ జగన్ చుట్టూ ఉండే నేతలను అరెస్టు చేయటమే లక్ష్యంగా సిట్ పని చేస్తోంది. ఒక దురుద్దేశంతో నడుపుతున్న కథే లిక్కర్ స్కాం. కట్టుకథల ఛార్జిషీట్‌ను కోర్టు కూడా వెనక్కు పంపినా సిట్‌కు బుద్ధి రాలేదు. జగన్ వెంట ఉంటున్నాడని చెవిరెడ్డి, ఆయన కుమారుడిని వేధిస్తున్నారు. చెవిరెడ్డి కుటుంబం విపరీతమైన దైవభక్తి ఉన్న కుటుంబం. ప్రభుత్వానికి టాక్స్‌లు కడుతూ వ్యాపారాలు చేసినా సిట్ తప్పుపడుతోంది..భూములు కొన్నా, అమ్మినా కూడా స్కాం అని ఎల్లోమీడియా రాస్తోంది. ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలతోనే ఛార్జిషీట్ వేస్తున్నారు తప్ప కొత్తగా ఏమీ ఉండటం లేదు. రూ.11 కోట్ల విషయంలో కోర్టుకు సిట్ దొరికిపోయారు. తప్పుడు కథలు చెప్తే కోర్టు ప్రశ్నించింది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సిట్ నీళ్లు నమిలింది. ప్రభుత్వమే లిక్కర్ అమ్మినప్పుడు ఇక మధ్యవర్తుల పాత్ర ఎలా ఉంటుంది?. అసలైన లిక్కర్ స్కాం ఇప్పుడు జరుగుతోంది. వైఎస్సార్సీపీ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తట్టుకుంటాం..ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలపడతాం. ఎంత అణచివేయాలని చూస్తే అంతగా పైకి ఎదుగుతాం. సరైన ఆధారాలు చూపే శక్తి సిట్‌కు లేదు. అసలు స్కామే జరగనప్పుడు ఇక ఆధారాలు ఎలా ఉంటాయి?. ప్రజలను నమ్మించాలనుకుంటే అది జరగదు. చంద్రబాబు అనుకుంటున్న రాజధాని ఎప్పటికీ పూర్తి కాదు. పర్మినెంటు అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్‌ని ఈ మూడేళ్లలో కట్టగలరా?. రాజధాని కోసం లక్ష కోట్లు ఖర్చు పెడతారా?. మెడికల్ కాలేజీలను మాత్రం ప్రైవేటు వారికి అమ్మేస్తారా?. కులాల మధ్య చిచ్చు పెట్టటం జనసేనకే అలవాటు. ప్రజలకు ఉచితంగా ఇసుక అందటం లేదు. ప్రభుత్వానికి ఆదాయం రావటం లేదు. మరి ఇసుక, ఆదాయం ఎవరి చేతిలోకి వెళ్తోంది?’’ అంటూ అంబటి రాంబాబు నిలదీశారు. -
ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే సహించలేకపోతున్నారు: అంబటి రాంబాబు
-
‘చంద్రబాబు.. భయపెట్టాలని చూస్తే భయపడేవారు ఎవరూ లేరు’
సాక్షి,తాడేపల్లి: సాక్షి ఎడిటర్ మీద ఏడు కేసులు పెట్టారు. కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. విష జ్వరాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే సహించలేకపోతున్నారు. పరిపాలనలో కూటమి ప్రభుత్వం విఫలం కావడంతో డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభించారు. లిక్కర్ కేసు పుష్పక విమానం లాంటిది, కేసులు పెడుతూనే ఉంటారు.లిక్కర్ అక్రమ కేసుల్లో సిట్ భేతాళ కథలు అల్లుతూనే ఉంది. నేరారోపణలు చేస్తున్నారు కానీ.. ఆధారాలు చూపడంలో సిట్ విఫలం. సరైన ఆధారాలు సేకరించడంలో సిట్ పూర్తిగా విఫలమైంది. సిట్ ఇన్వెస్ట్‌గేషన్‌లో ఆంధ్రజ్యోతి,ఈనాడు ప్రధాన పాత్ర. చంద్రబాబు అల్లిన లిక్కర్ కథకు సిట్ అద్భుతమైన కథనాలు అల్లుతోంది.లిక్కర్ అక్రమ కేసు రూ.50వేల కోట్ల నుంచి రూ.11 కోట్లకు వచ్చింది..!!.భయపెట్టాలని చూస్తే భయపడేవారు ఎవరూ లేరు చంద్రబాబు అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. -
Guntur: దుమ్మురేపిన అంబటి ర్యాలీ
-
పోలీసులా లేక రౌడీలా.. అర్ధరాత్రి నా ఇంటికి వచ్చి
-
బాబు చెంప చెళ్లుమనిపించింది కోర్టు.. ఏకిపారేసిన అంబటి
-
చంద్రబాబుకు న్యాయస్థానాలంటే లెక్కలేదు: అంబటి
సాక్షి, విజయవాడ: చంద్రబాబుకు కోర్టులంటే లెక్కలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కోర్టు ఆర్డర్స్‌ను కూడా జైలు అధికారులు పట్టించుకోరా? అంటూ ప్రశ్నించారు. 1989 నుండి రాజకీయాల్లో ఉన్నానని.. ఇంత దారుణమైన ఘటన ఇప్పటివరకు చూడలేదన్నారు.‘‘రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు నిన్న(శనివారం) సాయంత్రం బెయిల్ వచ్చింది. వారిని నిన్ననే విడుదల చేయాలి. ఇవాళ(ఆదివారం) ఉదయం 6.30 గంటలకు విడుదల చేస్తామని చెప్పారు. జైలర్ మచిలీపట్నం నుంచి బస్‌లో బయల్దేరి దిగకుండా ఉండాలని చంద్రబాబు, లోకేష్ చెప్పారు. జైలు నుంచి బయటకి రాకుండా లంచ్ మోషన్ వేయాలని ఆలస్యం చేశారు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు‘‘వంశీ కేసులో కూడా బెయిల్ వచ్చినా పట్టించుకోలేదు. లిక్కర్ కేసు ఛార్జ్‌షీట్ అంతా తప్పుల తడక. చంద్రబాబు చెప్పినట్టు సిట్ అధికారులు నడుస్తున్నారు. లేని స్కామ్‌ను సృష్టించి వైఎస్సార్సీపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కక్ష సాధింపు ధోరణిని ప్రజలు గమనిస్తున్నారు’’ అని అంబటి పేర్కొన్నారు. -
నీ రెడ్ బుక్ కి నా కుక్క కూడా భయపడదు
-
బాబు ప్రభుత్వ నిర్లక్ష్యమే.. 30 మంది మరణానికి కారణం
-
‘మెడికల్ కాలేజీలు ప్రయివేటు పరం చేయడం దుర్మార్గం’
తాడేపల్లి : ఏపీలో పలు మెడికల్ కాలేజీలను ప్రయివేటు పరం చేస్తూ చంద్రబాబు కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీలను ప్రయివేటు పరం చేసి తన తాబేదారులుకు దోచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీ లను ప్రయివేటు పరం చేయటం దుర్మార్గమైన చర్య అంటూ విమర్శించారు.తాను అవినీతి చేసినట్లు ఎల్లో మీడియా వార్తలు రాసిందని, ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే బ్యాచ్ బీఆర్ నాయుడు, రాధాకృష్ణ, ఈనాడు కిరణ్ అని ఆరోపించారు. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్ 5వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. తన మీద విజిలెన్స్ అంటూ నానా హడావుడి చేస్తున్నారని, ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు అంబటి. ఒకవేళ అరెస్టు చేసినా భయపడేది లేదన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా విచారణ చేస్తున్నారని, తనపై మరో కేసు పెట్టడానికి రెడీ చేస్తున్నారన్నారు. ఏదైనా న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటానన్నారు. లోకేష్ బెదిరింపులకు భయపడే మనిషిని కాదని, యుద్ధానికి తాను సిద్ధమని అంబటి స్పష్టం చేశారు. తన కంఠం పెద్దదరి అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని, కిరణ్, బీఆర్ నాయుడు, రాధాకృష్ణ అవినీతి తిమింగళాలని విమర్శించారు. -
తురకపాలెంలో వరుస మరణాలు..! కూటమిని వణికించిన అంబటి
-
‘ప్రభుత్వ నిరక్ష్యంతోనే తురకపాలెంలో మరణమృదంగం’
తురకపాలెం: గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో గడిచిన రెండు నెలలుగా జ్వరాల బారిన పడి దాదాపు 40 మందికి పైగా చనిపోయిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆదేశాలతో మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీఅధ్యక్షులు అంబటి రాంబాబు నేతృత్వంలో వైయస్సార్సీపీకి చెందిన డాక్టర్లు, నాయకులతో కూడిన ప్రతినిధుల బృందం తురకపాలెం గ్రామాన్ని సందర్శించింది. గ్రామంలో మృతుల కుటుంబాలతో మాట్లాడి, మరణాలకు గల కారణాలపై వివరాలు సేకరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తాగునీరు కలుషితం అవ్వడం వల్లే గ్రామస్తులు అస్వస్తతకు గురై, మృత్యువాత పడుతున్నారని తమ ప్రాథమిక పరిశీలనలో తేలినట్లు వైఎస్సార్సీపీ వైద్య విభాగం ప్రతినిధులు తెలిపారు. నీరు కలుషితం అవుతోందని నెల రోజుల కిందటే వైఎస్సార్సీపీ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఏ మాత్రం పట్టించుకోలేదని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం గ్రామంలోని ప్రజలకు రక్తపరీక్షలు జరిపించాలని, అస్వస్తతకు గురైన వారికి గుంటూరు జీజీహెచ్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, నిపుణులైన వైద్యులతో చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఎవరెవరు ఏం మాట్లాడారంటే...స్పెషలిస్ట్ డాక్టర్లను రప్పించాలిమాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిగుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో రెండు నెలలుగా దాదాపు 40 మందికి పైగా జ్వరం బారిన పడి అకస్మాత్తుగా చనిపోతున్నారు. మృతుల్లో 27 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వారు కూడా ఉండటం కలవరపరుస్తోంది. వైఎస్సార్సీపీ తరఫున మృతుల కుటుంబాలను సందర్శించి వారితో మాట్లాడటం జరిగింది. వైయస్సార్సీపీ తరఫున గ్రామాన్ని సందర్శించి దీనికి గల కారణాలపై అన్వేషణ చేస్తే గ్రామానికి సరైన మంచినీటి సదుపాయం లేదని అర్థమైంది. క్వారీ గుంతల్లో నుంచి పైపులైన్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంకుకి నీటిని సరఫరా చేస్తున్నారు. ఆ నీరు తాగిన వారే రోగాల బారిన పడి చనిపోతున్నట్టు ప్రాథమిక అంచనాకు వచ్చాం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితి లేదు. గుంటూరు నగరానికి ఈ గ్రామం నుంచి రోజూ 45 లక్షల నీరు వెళ్తున్నా, వీరికి మాత్రం సురక్షితమైన మంచినీరు దొరకడం లేదు. మృతులకు చికిత్స చేసిన డాక్టర్లతో మాట్లాడితే మిలినియోసిస్ అనే కొత్త బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోందని రిపోర్టులు ద్వారా తెలుస్తోందని చెప్పారు. అపరిశుభ్ర పరిసరాలు, వాతావరణం, తాగునీటి కారణంగానే ఈ బ్యాక్టిరియా వ్యాప్తి చెంది మరణాలు సంభవిస్తున్నట్టు స్పష్టంగా అర్థమైపోతోంది. తక్షణమే ప్రభుత్వం ఓవర్‌హెడ్ ట్యాంక్ నీటి సరఫరాను ఆపేసి సురక్షిత మంచినీటి సరఫరా చేయాలని వైఎస్సార్సీపీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడున్న క్యాంపుల వల్ల గ్రామానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పీహెచ్ సీ డాక్టర్లతో ఏం ప్రయోజనం ఉండదు. మెడికల్ కాలేజీ నుంచి జనరల్ మెడిసిన్, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ల నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లు రావాలి. గుంటూరు జనరల్ ఆస్పత్రిలో ఈ గ్రామస్తుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయాలి. సాధారణ మందుల ద్వారా ఈ వ్యాధిని అరికట్టడం సాధ్యమయ్యే పనికాదు. బాధితులకు మంచి మందులు తెప్పించి అందించాలి. ఇన్ఫెక్షన్ రాకుండా గ్రామస్తులు కూడా కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. నీటిని మరిగించి తాగాలి. స్నానం చేసే నీటిలో కూడా డెటాల్ వేసుకోవాలి.మైనింగ్ గుంతల్లో నీరు సరఫరా చేయడం వల్లేసత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్రెడ్డిగత రెండు నెలలుగా తురకపాలెం గ్రామంలో జ్వరాల బారిన పడి దాదాపు 40 మందికి పైగా చనిపోయారు. జ్వరాల బారిన పడి వారం రోజుల్లోనే చనిపోతున్న ఘటనలు రెండు నెలలుగా జరుగుతున్నాదానికి కారణాలను ప్రభుత్వం ఇంతవరకు కనుక్కోలేకపోయింది. పీహెచ్సీ డాక్టర్లతో మాట్లాడితే శాంపిల్స్ పంపినా ఇంకా రిపోర్టులు రాలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీతరఫున గ్రామాన్ని సందర్శించి మృతుల కుటుంబాలను కలిసి వివరాలను సేకరించాం. వారు చెప్పిన దాని ప్రకారం జ్వరం రావడం, నాలుగైదు రోజుల తర్వాత తగ్గడం మళ్లీ రావడం, ఒళ్లు నొప్పులు, కండరాలు నొప్పులు వేధిస్తున్నాయని చెబుతున్నారు. ఆ తర్వాత తీవ్రమైన ఆయాసం, గుండెనొప్పి రావడంతో పాటు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో చనిపోతున్నట్టు తెలిసింది. ఏడెనిమిది మంది ప్రభుత్వ ఆస్పత్రిలో కొంతమంది ప్రైవేట్ ఆస్పత్రిలో చనిపోయారని గ్రామస్తులు చెబుతున్నారు. కొంతమంది జ్వరం తగ్గిందని ఇంటికొచ్చినా మళ్లీ సమస్య రావడంతో ఆస్పత్రికి వెళ్లేలోపే మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలోని కాలువలు, వీధులన్నీ అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. రెండు నెలలుగా గ్రామస్తులంతా అపరిశుభ్రమైన వాతావరణ పరిస్థితుల్లో జ్వరాల బారిన పడి చనిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ప్రభుత్వం తక్షణం స్పందించి రక్షణ చర్యలు తీసుకోకపోతే మరణాలు మరిన్ని సంభవించే ప్రమాదం కూడా లేకపోలేదు. గ్రామస్తులు కూడా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటినే తాగుతున్నామని చెబుతున్నారు. గ్రామం నుంచి రోజుకి 45 లక్షల లీటర్ల నీటిని బోర్ల ద్వారా తోడేసి అక్రమంగా సరఫరా చేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. మైనింగ్ గుంతల్లో నుంచి తోడిన నీటిని తాగడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీప్రభుత్వంలో మాదిరిగా విలేజ్ క్లీనిక్స్ అందుబాటులో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రభుత్వం తక్షణం గ్రామస్తుల నుంచి బ్లడ్, యూరిన్ శాంపిల్స్ తీసుకుని కల్చర్ టెస్టు చేయాలని వైఎస్సార్‌సీపీతరఫున డిమాండ్ చేస్తున్నాం.జ్వరంతో మొదలై మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో చనిపోతున్నారుడాక్టర్ అశోక్తురకపాలెంలో వరుస మరణాలకు గల కారణాలను అన్వేషించడానికి వైఎస్సార్‌సీపీతరఫున గ్రామాన్ని సందర్శించడం జరిగింది. చనిపోయిన ప్రతిఒక్కరూ జ్వరం, ఆయాసంతో బాధపడిన వారే. మృతులంతా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో వారం రోజుల్లోనే చనిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇక్కడ జరుగుతున్న మరణాల మీద ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. ఈ గ్రామంలోని బాధితుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషాలిటీ మెడికల్ వార్డును ఏర్పాటు చేసి చికిత్సలు అందించాలి. గ్రామస్తులకు అవగాహన కల్పించాలి. గ్రామంలో మట్టి, నీరు కలుషితం జరుగుతోందని గుర్తించాం. గ్రామస్తులకు సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాలి. పారిశుద్ధ్య పరిరక్షణ మీద కూడా ప్రభుత్వం దృష్టిపెట్టాలి.నెల క్రితమే కలెక్టర్‌కి వైఎస్సార్సీపీఫిర్యాదు చేసినా పట్టించుకోలేదుగుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుతురకపాలెంలో జరుగుతున్న మరణమృదంగంపై ప్రభుత్వం సీరియస్‌గా విచారణ చేసి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకే గ్రామంలో ఒకే రకమైన వ్యాధితో 40 మందికి పైగా చనిపోవడం మామూలు విషయం కాదు. వైఎస్సార్‌సీపీతరఫున మేము గ్రామానికి వస్తున్నామని తెలిశాకనే ప్రభుత్వం స్పందించింది. మాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామంలో బోర్ల ద్వారా తోడిన నీటిని ట్యాంకర్ల ద్వారా బయటకు సరఫరా చేస్తున్నారు. గ్రామస్తులకు మాత్రం (సంజీవయ్య గుంట) నుంచి క్వారీ గుంతల్లో నీటిని సరఫరా చేస్తున్నారని గుర్తించాం. ఈ గుంతల్లోకి నీరు కొండల్లో నుంచి వస్తుంది. ఆ నీటితోపాటు బ్లాస్టింగ్ మెటీరియల్ కూడా కలిసి నీరు కలుషితమవుతోంది. దీనిపై జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి దృష్టి పెట్టాలి. మేం గ్రామంల పర్యటిస్తే తప్ప ఆరోగ్యశాఖ మంత్రిలో కదలిక రాలేదు. అధికారుల మీద నిప్పులు చెరిగారని టీవీల్లో బ్రేకింగులు వేసుకుంటున్నారు. కలుషిత నీటి సరఫరా జరుగుతోందని నెల క్రితమే జిల్లా కలెక్టర్‌కి నెల రోజుల క్రితమే వైఎస్సార్‌సీపీతరఫున ఫిర్యాదు చేసినా స్పందించలేదు. తక్షణమే గ్రామానికి ఆరోగ్యశాఖ మంత్రిని పంపించాలి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించాలి. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాలి. బాధితులకు న్యాయం జరిగేదాకా వైఎస్సార్సీపీ పోరాడుతుంది.మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలిమాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డిమా పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాలతో నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి వైయస్సార్సీపీ బృందం గ్రామంలో పర్యటించింది. మేం వస్తున్నామని తెలిసి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పర్యవేక్షణలో హడావుడిగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదని వారికి కూడా తెలుసు. గుంటూరు పక్కనే కూతవేటు దూరంలో తురకపాలెం గ్రామంలో రెండు నెలలుగా అకాల మరణాలు సంభవిస్తున్నా పట్టించుకోని దుస్థితికి ప్రభుత్వం సిగ్గుపడాలి. మృతుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. బాధితులకు న్యాయం జరిగేదాకా వైఎస్సార్సీపీపోరాడుతుంది. తురకపాలెం గ్రామ పరిస్థితులపై ప్రభుత్వం రిపోర్టు ఇవ్వాలి. గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా సురక్షితమైన నీటిని సరఫరా చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
జూ ఎన్టీఆర్ అంటే లోకేష్ కి అందుకే భయం..!
-
లోకేష్ సంస్కార హీనంగా మాట్లాడుతున్నారు: అంబటి
-
‘జూనియర్ ఎన్టీఆర్ పోటీకి వస్తారని లోకేష్‌కు భయం’
సాక్షి,గుంటూరు: 9వ తేదీన రైతుల తరుఫున ఉద్యమిస్తాం. రాష్ట్రంలో అన్నీ ఆర్డీఓ కార్యాలయాల్లో రైతుల తరుఫున వైఎస్సార్సీపీ వినతి పత్రాలు సమర్పిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. బుధవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. లోకేష్ సంస్కార హీనంగా మాట్లాడుతున్నారు. టీడీపీ సోషల్ మీడియా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ. వైఎస్ జగన్ కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేయాలని చూస్తున్నారు. ఎడిట్ చేసిన వీడియో లోకేష్ పోస్టు చేసి ప్రేలాపనలు పేలుతున్నారు.లోకేష్.. మీ బాబాయిని సంకెళ్లతో కట్టేశారు. జూనియర్ ఎన్టీఆర్ పోటీకి వస్తారని లోకేష్ భయం. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఆయన తల్లిని కూడా తిట్టించాడు. వీకెండ్లో లోకేష్ మాయమై ఎక్కడ తేలుతాడు కూడా చెబుతా. ఏపీలో నాదే రాజ్యమని లోకేష్ అనుకుంటే చాలా పొరపాటు. దౌర్భాగ్యమైన పద్దతుల్లో చంద్రబాబు,లోకేష్‌లు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. రాష్ట్ర సమస్యల్ని పట్టించుకోకుండా వైఎస్ జగన్‌పై మీరు బురదజల్లే పనిలో ఉన్నారు. లోకేష్ మాటలు జాగ్రత్తగా మాట్లాడు.. అధికారం శాశ్వతం కాదు. వైఎస్ జగన్ మీద బురదజల్లడం మానుకోవాలి. దౌర్భాగ్యమైన పరిస్థితిలో చంద్రబాబు,లోకేష్‌లు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. -
సీఎం అయ్యి వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తాడు.. బాబుకు అంబటి దిమ్మతిరిగే కౌంటర్
-
‘సంక్షేమం అంటేనే వైఎస్సార్’
గుంటూరు: తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన మహా నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాజశేఖర రెడ్డి అంటే సంక్షేమం.. సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి అని కొనియాడాడు. ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 2వ తేదీ) గుంటూరు లోని వైఎస్సారసీపీ జిల్లా కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి అంబటి రాంబాబు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, వైఎస్సార్సీపీ సిటీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా పాల్గొన్నారు. దీనిలో భాగంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన మహా నాయకుడు వైఎస్సార్. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన గొప్ప వ్యక్తి వైఎస్సార్. ఆయన అమలు చేసిన పథకాలను దేశంలో ఎన్నో రాష్ట్రాలు అమలు చేశాయి. పోలవరాన్ని ప్రారంభించిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డిరాజశేఖర్ రెడ్డి భౌతికంగా ప్రజలకు దూరమైనా ప్రజల గుండెల్లో ఆయన కొలువై ఉన్నారు. కుప్పంకి నీళ్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిది’ అని అంబటి తెలిపారు. నూరి ఫాతిమా మాట్లాడుతూ.. ‘ పేదల కోసం ఆరోగ్యశ్రీ ,ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి వైఎస్సార్. సంక్షేమానికి సంతకం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన ప్రజలకు దూరమై 16 సంవత్సరాలు గడిచినా ప్రజల గుండెల్లో మాత్రం ఆయన కొలువై ఉన్నారు’ అని కొనియాడారు. చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ.. ‘దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదల పాలిట దేవుడు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి జల యజ్ఞాన్ని ప్రారంభించారు. ఉచిత విద్యుత్ సృష్టికర్త వైఎస్సార్’ అని అన్నారు. -
సుగాలి ప్రీతి కేసుపై పవన్ వ్యాఖ్యలకు అంబటి అదిరిపోయే కౌంటర్
-
Ambati: పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు, రామానాయుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు
-
క్రెడిట్ కొట్టేయగల సమర్థుడు చంద్రబాబు: అంబటి
కుప్పానికి, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబుకి ఏనాడూ రాలేదని.. ఆయన ఆడే నాటకాలు, మోసాలు జనాలకు బాగా తెలుసుని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం పనులు సరైన, సక్రమమైన పద్ధతుల్లో జరగడం లేదంటూ శనివారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు.సాక్షి, గుంటూరు: కుప్పానికి, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబుకి ఏనాడూ రాలేదని.. ఆయన ఆడే నాటకాలు, మోసాలు జనాలకు బాగా తెలుసుని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..సొమ్మొకడిది.. సోకొకడిది అన్నట్లు ఉంది చంద్రబాబు వ్యవహారం. పని చేసేది ఒకరు.. క్రెడిట్ పొందేది మరొకరు. క్రెడిట్‌ను దొంగిలించగలిగిన సమర్థుడు చంద్రబాబు ఆరితేరారు. కుప్పానికి మొన్న నీళ్లు ఇచ్చానని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, 1989 నుంచి ఆయనే అక్కడ పోటీ చేస్తున్నారు. కుప్పానికి 2024 ఫిబ్రవరి 26న జగన్ నీళ్లు ఇచ్చారు. కానీ, చంద్రబాబు లైనింగ్ పేరిట సీఎం రమేష్ కంపెనీకి అప్పనంగా డబ్బులు ఇచ్చారు.. .. ప్రపంచంలోనే పోలవరం చాలా క్లిష్టమైన ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టును చంద్రబాబు తన హయాంలో గాలికి వదిలేశారు. రెండు కాపర్డ్యామ్లను 2018లో ప్రారంభించారు. వాటి జీవిత కాలం మూడేళ్లు మాత్రమే. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి చంద్రబాబే కారకుడు. ఆయన చేసిన పనికి అంతర్జాతీయ నిపుణులే తలలు పట్టుకున్నారు. పోలవరం నాశనం చేసింది ముమ్మాటికీ చంద్రబాబే. చంద్రబాబు, రామానాయుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఆయన రామా నాయుడా? డ్రామా నాయుడా?. సరైన, సక్రమ పద్దతుల్లో పోలవరం నిర్మాణం జరగడం లేదు. డయాఫ్రం వాల్ 1.5 మీటర్ల వెడల్పు ఉండాలి. రాక్ తగిలే వరకు డయాఫ్రం వాల్ వేయాలి. కానీ, చంద్రబాబు నాయకత్వంలో 0.9 మీటర్లు మాత్రమే వేస్తున్నారు. కమీషన్ల కోసం చంద్రబాబు కక్కుర్తి పడుతున్నారు. పోలవరం ప్రాజెక్టుపై అనుమానాలకు ప్రధాన కారకుడు చంద్రబాబు. ఆయన అంతర్జాతీయ నిపుణుల సలహాలు కూడా వినడం లేదు. పోలవరం ప్రాజెక్టుపై మేం చర్చకు సిద్ధం.. ఇది సవాల్ కాదు చర్చకు రావాలని చంద్రబాబును రిక్వెస్ట్ చేస్తున్నా’’ అని అంబటి అన్నారు. -
Ambati Rambabu: నీ టైం అయిపొయింది అంబటి మాస్ వార్నింగ్
-
ఎమ్మెల్యే ఆంజనేయులు ప్రోద్భలంతోనే ప్రసాద్‌పై దాడి: వైఎస్సార్సీపీ
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ నేత భీమనాథం వెంకట ప్రసాద్ కుటుంబాన్ని ఆ పార్టీ నేతలు మంగళవారం పరామర్శించారు. ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. ‘‘టి.అన్నవరం తెలుగుదేశం పార్టీకి రిగ్గింగ్ గ్రామం. 2024 ఎన్నికల్లో వెంకట ప్రసాద్ వైఎస్సార్సీపీ బూత్ ఏజెంట్‌గా ఉన్నాడు...వెంకట ప్రసాద్ బ్రతికి ఉంటే రాజకీయంగా తమకు ఇబ్బంది అవుతుందని టీడీపీ నాయకులు భావించారు. కొన్నాళ్లుగా వెంకట ప్రసాద్‌ను చంపాలని కుట్ర పన్నారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రోద్బలంతోనే వెంకట ప్రసాద్‌పై దాడి జరిగింది. చావు బతుకుల మధ్య వెంకట ప్రసాద్ ఉంటే పోలీసులు ఆయనపైనే కేసు పెట్టారు. ఇదేం పోలీస్ వ్యవస్థ. వెంకటప్రసాద్‌పై పోలీసులు పెట్టిన కేసుపై న్యాయ పోరాటం చేస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో పోలీసులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని.. రషీద్‌ను చంపినట్టే వెంకట ప్రసాద్‌ను హత్య చేసేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నించారు’’ ఆయన మండిపడ్డారు. ‘‘చివరకు వెంకట ప్రసాద్ చనిపోయాడనుకుని వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు నేరస్తులతో కుమ్మక్కై బాధితుడు పైనే కేసు పెట్టారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయవలసిన పోలీసులు చిన్నపాటి కేసు పెట్టారు. ఈ కేసులో హత్యాయత్నం కేసుగా నమోదు చేయాలంటే ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠిను కలవాలి. ఆయన్ని కలవాలంటే చంద్రబాబు, లోకేష్‌ల వద్దకు వెళ్లాలి. అప్పుడు కానీ ఐజీ కలవరు. పోలీసులు.. నేరస్తులతో కుమ్మక్కవడం ఈ సమాజానికి ప్రమాదకరం’’ అని అంబటి చెప్పారు.మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో టీడీపీ నాయకులు బరితెగించారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన ఒక బీసీ నేతపై అత్యంత దారుణంగా కత్తితో దాడి చేశారు. బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం.’’ అని గోపిరెడ్డి పేర్కొన్నారు. -
Ambati Rambabu: అబద్ధాలు ఆడేందుకు చంద్రబాబు కొంచెం కూడా వెనుకడుగు వేయరు
-
వైఎస్ జగన్ అధికారంలోకి వస్తారనే భయం చంద్రబాబులో మొదలైంది
సాక్షి,రాజమండ్రి: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రాజమండ్రిలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ‘సూపర్ 6హామీలతో చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని? నెరవేర్చినవి ఎన్ని?వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు చేష్టలు,మాటలు చెబుతున్నాయి. 14 నెలలకే వైఎస్ జగన్ అధికారంలోకి వస్తున్నారని చంద్రబాబు భయపడుతున్నారు. చంద్రబాబు పెద్దాపురం స్పీచ్‌లో ఇదే కనిపించింది. చంద్రబాబులో భయం మొదలైంది. భూతవైద్యుడిని సంప్రదిస్తే ధైర్యం వస్తుంది. వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద జల్లడమే లక్ష్యంగా చంద్రబాబు జరిగిపోయిన కథలన్నీ వల్లే వేస్తున్నారు. చంద్రబాబులో అభద్రతాభావం పెరిగిపోయింది. తిరిగి ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఆయన మాటలే చెబుతున్నాయి. 2019లో చంద్రబాబు ఓటు షేరు 23 సీట్ల గాను 39.17 గా ఉంది.2024లో 11 సీట్లు సాధించిన వైఎస్సార్సీపీ ఓటు షేర్ 39.37గా ఉంది. 23 సీట్లు సీట్లు గెలుచుకున్న టీడీపీ కంటే వైఎస్సార్సీపీకి వచ్చిన 11 సీట్లకే అధికంగా ఓట్ షేర్ ఉంది.వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తున్నారన్న భావన చంద్రబాబులో భయం పెరుగుతోంది. వైఎస్ జగన్‌పై వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం జరుగుతోంది. సింగపూర్ వెళ్లిన దావోస్ వెళ్లిన పెట్టుబడులు రాలేదు. జగన్‌ను భూతంతో పోలుస్తున్న చంద్రబాబు రాజమండ్రిలో భూత వైద్యున్ని సంప్రదిస్తే మంచిది.జగన్ మళ్ళీ వస్తాడని చంద్రబాబు డయాస్ మీదే ఒప్పుకుంటున్నారు.పోలవరం దుస్థితికి చంద్రబాబు దుర్మార్గమే కారణం.పోలవరం విషయంలో చంద్రబాబు రామానాయుడు చర్చకి పిలిస్తే నేను సిద్ధం. కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టును తామే చేస్తామని చంద్రబాబు ఎందుకు ముందుకు వచ్చారో స్పష్టం చేయాలి. పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే, కాపర్ డ్యాములు పూర్తిగా కాకుండా రూ. 400 కోట్లతో డయాఫ్రం వాల్ ఎందుకు వేశారో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు తెలియదా.రూ.950 కోట్లతో కొత్త డయాఫ్రమ్ వాల్ వేయటానికి కారణం చంద్రబాబు దుర్బుద్ధే. ఓటమి ప్రభుత్వం 15 నెలలకే ప్రజలకు దూరమైందని స్పష్టమైపోతుంది.చంద్రబాబు గుండెల్లో గుబులు మొదలైంది. 14 నెలల్లో చంద్రబాబు కాన్ఫిడెన్స్ కోల్పోయారు’ అని వ్యాఖ్యానించారు. -
Ambati: బీఆర్ నాయుడు తిరుమల పవిత్రను దెబ్బతీస్తున్నారు
-
‘బీఆర్ నాయుడు మూల్యం చెల్లించుకోక తప్పదు’
టీటీడీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి భూమన కరుణాకర్‌రెడ్డి అని, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే హక్కు బీఆర్ నాయుడికి ఏమాత్రం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.సాక్షి, తాడేపల్లి: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీటీడీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి భూమన కరుణాకర్‌రెడ్డి అని, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే హక్కు బీఆర్ నాయుడికి లేదని అన్నారాయన.జుట్టు తెప్పిస్తామని, మోకాళ్ల నొప్పులు తగ్గిస్తామని మోసం చేశారు. టీఆర్‌రీ రేటింగ్స్ కోసం టీవీ5లో అశ్లీల ప్రోగ్రామ్‌లు వేయలేదా?.. అసలు శ్రీవారి టికెట్లు బ్లాక్‌లో అమ్ముతుంటే చర్యలేవీ? అని బీఆర్ నాయుడిని అంబటి రాంబాబు ప్రశ్నించారు.బీఆర్ నాయుడు చీటర్. బ్రోకర్ రాజకీయాలు చేసే వ్యక్తి. బాబు భజన చేసి టీటీడీ చైర్మన్ అయ్యాడు. కాలు పెట్టగానే తిరుమలలో ఆరుగురు భక్తులు చనిపోయారు. దైవాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ నాయుడు వ్యాపారం చేస్తున్నాడు. తిరుమల ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాడు. గోవింద నామస్మరణ మరిచి దూషణలు చేస్తున్నాడు. అందుకు తగిన మూల్యం త్వరలోనే చెల్లించుకుంటాడు అని అంబటి అన్నారు.టీడీపీ ఎమ్మెల్యేలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే రాజశేఖర్ ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేశారు. ఏం చర్యలు తీసుకున్నారు?. అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సిందే అని అంబటి డిమాండ్ చేశారు. హోంమంత్రి మైక్ ముందే మాట్లాడతారా? యాక్షన్ తీసుకుంటారా?. అమరావతి మునకపోతే హైవేకి గండి ఎందుకు కొట్టారు? అని చంద్రబాబు ప్రభుత్వాన్ని అంబటి నిలదీశారు. -
Ambati: అమరావతిలో కొన్ని వేల ఎకరాలు చెరువుల మారిపోయాయి..
-
‘ఆ వాగు ప్రవాహంతో అమరావతి మునిగిందనేది వాస్తవం’
తాడేపల్లి: భారీ వర్షాల కారణంగా కొండవీటి వాగు ప్రవాహంతో అమరావతి మునిగిందనేది వాస్తవమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఆ వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల అమరావతి మునిగిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై వార్తలు రాస్తే సాక్షి చానల్ సహా ఇతర చానల్స్‌పై కేసులు పెడుతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. ఇది పోలీస్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందనడానికి మరో ఉదాహరణ అంటూ ధ్వజమెత్తారు.ఈరోజు(సోమవారం, ఆగస్టు 18వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేత సాక్షి చానల్ మీద కేసు వేయించారు. సాక్షి చానల్, కొన్ని ప్రైవేట్ చాన్సల్స్ను బెదిరించాలనే ఉద్దేశంతో కేసులు పెట్టారు. కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల అమరావతి మునిగింనేది వాస్తవం కొండవీటి వాగు సహజ ప్రవాహానికి అడ్డుకట్టలు వేస్తే ఆగుతుందా?, అడ్డదిడ్డంగా తవ్వి కట్టలు వేయడం వల్ల కొండవీటి వాగు పొలాల మీద పడింది. హైకోర్టు దారిలో పంటపొలాలు పూర్తిగా నీట మునిగాయి. ఐకానిక్ టవర్స్ సహా అమరావతి కీలక ప్రాంతాలు జలమయం అయ్యాయి. అమరావతిలో ఐఏఎస్ క్వార్టర్స్ కూడా నీట మునిగాయి. ఈ వాస్తవాలతో వార్తలు రాస్తే కేసులు పెడుతున్నారు. అమరావతిపై మాకు అసూయ లేదు. అమరావతిపై రూ. 52 వేల కోట్లు అప్పు చేశారు. అమరావతి రైతులకు చంద్రబాబు ఏమైనా సహాయం చేశాడా?, చంద్రబాబు చెప్పే అబద్ధాలకు ఆయన మీదే కేసులు పెట్టాలి. రూ. 220 కోట్లతో కొండవీటి వాగుపై లిఫ్ట్ పెట్టారు.. అది నిరుపయోగం అయ్యింది’ అని మండిపడ్డారు. ఈ మేరకు అమరావతి నీట మునిగిన ఫోటోలను అంబటి ప్రదర్శించారుఇక మహిళా ప్రిన్సిపాల్‌ను వేధించిన ఎమ్మెల్యే కూన రవి కుమార్, జూనియర్ ఎన్టీఆర్‌పై తప్పుడు మాటలు మాట్లాడిన మరో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌లపై చర్యలేవని ప్రశ్నిచాచు. వారిపై ఎందుకు కేసులు పెట్టరు.. ఎందుకు సస్పెండ్ చేయరని అంబటి నిలదీశారు. -
ఇది చెరువు అనుకోకండి వర్షాలకు పొలాలలో వరద... చంద్రబాబు చేతకానితనం వల్ల
-
సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్.. చంద్రబాబు మోసాలు ఇవిగో..
సాక్షి, తాడేపల్లి: స్వాతంత్ర్య దినోత్సవం నాడు కూడా చంద్రబాబు తనకు అలవాటైనా అబద్ధాలనే ప్రజల ముందు మాట్లాడారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అంటూ ఆయన మాట్లాడింది చూస్తే... చంద్రబాబుది సూపర్ చీటింగ్ అంటూ ప్రజలు ఈసడించుకుంటున్నారన్నారు. చివరికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీం ప్రారంభంలోనూ ఆంక్షలు పెట్టి, నిస్సిగ్గుగా మహిళలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబేనని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..సీఎం చంద్రబాబు విజయవాడలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా చేసిన ప్రసంగంలోనూ తనను గురించి తాను గొప్పగా చెప్పుకోవడం, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అసత్యపు విమర్శలు చేశారు. కనీసం స్వాతంత్ర్య దినోత్సం నాడు అయినా కొన్ని నిజాలు మాట్లాడతారుని అనుకుంటే, తన సహజ నైజంను మళ్లీ బయటపెట్టుకున్నాడు. సూపర్‌సిక్స్ సూపర్ హిట్ అంటూ పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకున్నారు. అసలు సూపర్ సిక్స్... హిట్ ఎలా అయ్యిందో చెప్పాలి.తల్లికి వందనం గత ఏడాది ఎగ్గొట్టారు. 9.7.2024న జారీ చేసిన జీఓలో విద్యార్థుల తల్లులకు రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం కింద ఇస్తామని చాలా స్పష్టంగా రాశారు. ఈ జీఓను ఏడాది తరువాత అమలు చేస్తారా? ఇది మోసం కాదా చంద్రబాబూ? దీనిపై వైఎస్సార్సీపీ వెంటపడటం వల్ల ఈ ఏడాది ఇచ్చే ప్రయత్నం మొదలు పెట్టారు. కొందరికి రూ.8 వేలు, మరికొందరికి రూ.6 వేలు ఇలా అరకొరగానే తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితం అన్నారు. దీపం పథకం కింద రాష్ట్రంలో 1.59 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.వారికి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇవ్వాలంటే రూ.4 వేల కోట్లు కావాలి. కానీ తొలివిడతలో రూ.895 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక రెండో ఏడాది రూ.2600 కోట్లు కేటాయించారు. అంటే దీనిని ఏమంటారో చంద్రబాబే చెప్పాలి. అన్నదాత సుఖీభవ పథకంను గత ఏడాది ఎగ్గొట్టారు. కేంద్రం ఇచ్చే దానితో కలిసి రూ.26వేలు ఏడాదికి ఇస్తానని చెప్పి, రెండే ఏడాది రూ.7 వేలతో సరిపెట్టారు. నిరుద్యోగభృతి కింద నెలకు రూ.3 వేలు అన్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఒక్క పైసా ఇవ్వలేదు. స్త్రీశక్తి, ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఈ రోజు ప్రారంభించారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడూ అంటూ వైఎస్సార్సీపీ వెంటపడితే తప్ప ఈ పథకాన్ని అమలు చేయడానికి ముందుకు రాలేదు. ఉచిత బస్సు పథకంలోనూ మహిళలను మోసం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు పద్నాలుగు నెలల తరువాత పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ మెట్రో, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ కేటగిరిలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అంటూ అవకాశం ఇచ్చారు. పదహారు కేటగిరిల్లో కేవలం ఈ పరిమిత కేటగిరిల్లోనే ప్రయాణించాలని ఆంక్షలు పెట్టడం దారుణం కాదా?పోలవరాన్ని సర్వ నాశనం చేశారువైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్లే పోలవరం, అమరావతి ఆగిపోయింది అంటూ సిగ్గూ, ఎగ్గూ లేకుండా చంద్రబాబు అబద్ధాలు అడుతున్నారు. పోలవరాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు. టీడీపీ ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో సోమవారాన్ని పోలవరం అనేవాడు. ఇప్పుడు కనీసం అటు వైపు వెళ్ళే ధైర్యం చేయడం లేదు. డయాఫ్రంవాల్ మేం చెడగొట్టామని అబద్దాలు చెబుతున్నాడు. కాఫర్ డ్యాంలను నిర్మించకుండా డయాఫ్రం వాల్ నిర్మించి, దానిని నిర్వీర్యం చేశారని నిపుణుల కమిటీనే చంద్రబాబు నిర్వాకాన్ని ఎత్తి చూపింది.2027 నాటికి పోలవరం పూర్తి చేస్తానంటూ అబద్దాలు చెబుతున్నాడు. పోలవరం కాంట్రాక్ట్‌ల్లో కమీషన్ల కోసమే చంద్రబాబు దృష్టి పెట్టాడు. రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశామంటూ మా ప్రభుత్వంపై మాట్లాడారు. ఇదే చంద్రబాబు సీఎంగా అసెంబ్లీలో రూ.6 లక్షల కోట్లు అంటూ మాట్లాడిన మాటలు మరిచిపోయారా? ఈ పద్నాలుగు నెలల్లోనే దాదాపు రూ.2 లక్షల కోట్లు అప్పులు చేశాడు. దేని కోసం ఈ అప్పులు చేస్తున్నారు. వైయస్ జగన్ పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం.అవినీతి సొమ్ము కోసమే సింగపూర్ జపంటీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు సీఎంగా సింగపూర్ ప్రభుత్వం అమరావతిలో పెట్టుబడి పెడుతుందని అబద్ధం చెప్పాడు. సింగపూర్‌లోని కొన్ని ప్రైవేటు కంపెనీలతో అవినీతి ఒప్పందాలు చేసుకుని, జేబులు నింపుకున్నాడు. ఈ వ్యవహారంలో సహకరించిన ఆనాటి సింగపూర్ ప్రభుత్వంలోని మంత్రి ఈశ్వరన్ అవినీతి కేసుల్లో అరెస్ట్ అయి, జైలుకు వెళ్ళాడు. దీనితో చంద్రబాబు వేసుకున్న ప్లాన్లు అన్ని రివర్స్ అయ్యాయి. ఇప్పుడు సీఎంగా మళ్ళీ సింగపూర్ వెళ్ళి, తిరిగి తన దందాను కొనసాగించాలని చూస్తే, వారు తిరస్కరించారు. దీనికి వైఎస్సార్సీపీ కారణమంటూ మాపైన ఏడుస్తున్నాడు.రాజధానిని కూడా సర్వనాశనం చేసే పరిస్థితికి తీసుకువచ్చారు. 52 వేల ఎకరాలను పూర్తి చేయడంకుండా మరో 43 వేల ఎకరాలను సేకరించాలని చూస్తున్నాడు. ఇప్పటికే రాజధాని పనుల్లో కాంట్రాక్ట్‌లు ఇవ్వడం, దానికి గానూ ముందుగానే మెబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చి, అందులోంచి ఎనిమిది శాతం కమిషన్‌గా తీసుకోవడం చేస్తున్నాడు. వీటన్నింటినీ నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నాడు. సూట్ కేసులు సర్దడమే లోకేష్ పని.ఇంత దుర్మార్గమైన ఎన్నికను ఎప్పుడూ చూడలేదుపులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక అద్భుతంగా జరిగిందని, ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని పవన్ కళ్యాణ్, లోకేష్‌లు మాట్లాడుతున్నారు. దేశ చరిత్రలోనే ఇంత దుర్మార్గమైన ఎన్నిక మరెక్కడా జరిగి వుండదు. అక్కడి ఓటర్లను ఇళ్ళ నుంచి బయటకు రానివ్వకుండా, పక్క గ్రామాల నుంచి టీడీపీ కార్యకర్తలను తీసుకువచ్చి, పబ్లిక్‌గా పోలీసుల రక్షణలో రిగ్గింగ్ చేయించారు. ఆధారాలతో సహా బయటపెట్టాం. పదివేల మంది ఓటర్లు ఉన్న ఈ సెగ్మెంట్లోని గ్రామాల్లో తిరిగి చూస్తే, ఏ ఇంటిలోని ఓటరు వేలిమీద మీకు సిరా మార్క్ కనిపించదు.కారణమేంటంటే, వారి ఓటును కూడా టీడీపీ వారే వేసుకున్నారు. దానిలో స్లిప్‌లు దొరికాయని, ముప్పై ఏళ్లుగా ఓటు హక్కు వినియోగించుకోలేదని దానిలో రాసినట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ స్లిప్ వేసింది జిల్లా కలెక్టరా లేక డీఐజీ కోయ ప్రవీణా తేలాలి. మంత్రి నారా లోకేష్ తన ట్వీట్లో పెట్టిన ఫోటోలో ఓటు వేస్తున్న క్యూలైన్లో ఉన్న వ్యక్తి జమ్మలమడుగు లోని మార్కెట్ యార్డ్ చైర్మన్. ఆయన వేశాడేమో ఈ స్లిప్. ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం తమను తాము గొప్పగా చెప్పుకోవడం సిగ్గు చేటు.మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు స్పందిస్తూ..చంద్రబాబుకు కూడా సోదరీమణులు ఉన్నారు. వారెప్పుడైనా ఆయనకు రాఖీలు కట్టిన సందర్భం ఉందా? కనీసం అమరావతిలో కొత్త ఇంటి శంకుస్థాపనకు అయినా వారిని పిలిచి ఒక్క చీరె అయినా పెట్టారా? తన మేనత్తల గురించి కనీసం మాట్లాడలేని లోకేష్ దానిని మరిచిపోయి వైఎస్ జగన్ సోదరిమణుల గురించి మాట్లాడుతున్నారు. అసలు చంద్రబాబు తన సోదరుడిని ఎంత బాగా చూశాడో ప్రజలందరికీ తెలుసు. ముందు వాటి గురించి తెలుసుకుని లోకేష్ మాట్లాడితే బాగుంటుంది.ఎన్నికలు అయిపోయిన తరువాత కౌంటింగ్‌కు మధ్యలో 12.5 శాతం ఓట్లు ఎలా పెరిగాయో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పాలి. చంద్రబాబు, రేవంత్ రెడ్డి, రాహూల్ గాంధీ హాట్లైన్లో ఉన్నారన్న వైయస్ జగన్ మాటల్లో తప్పేముందీ? చంద్రబాబు గతంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్ళలేదా? రేవంత్ రెడ్డి.. చంద్రబాబు శిష్యుడు కాదా? ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌రెడ్డితో అవినీతి సొమ్ము పంపించలేదా? తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్‌తో, రాహూల్‌గాంధీతో కలిసి చంద్రబాబు పనిచేయలేదా? ఎవరినైనా సరే మోసం చేయగల వ్యక్తి చంద్రబాబు. బీజేపీని మోసం చేసి కాంగ్రెస్‌తోనూ, కాంగ్రెస్‌ను మోసం చేసి బీజేపీతోనూ కలిశాడు. ఆయనకు ఒక సిద్దాంతం అంటూ లేదు. -
నువ్వొక పోలీసువి గుర్తుందా.. DIG ప్రవీణ్ కుమార్ ఓవర్ యాక్షన్ కి అంబటి స్ట్రాంగ్ కౌంటర్..
-
డీఐజీ కోయ ప్రవీణ్‌కు అంబటి వార్నింగ్
సాక్షి,విజయవాడ: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు తీసుకువచ్చిన దొంగ ఓటర్లకు పోలీసులు పూర్తి రక్షణ కల్పిస్తున్నారని, పోలీసుల అండతోనే యథేచ్ఛగా వారు ఓటు వేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఒకవైపు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు సెగ్మెంట్లో తిరుగుతూ ఓటర్లను బెదిరిస్తుంటే, మరోవైపు కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డిని పార్టీ కార్యాలయం నుంచి బయటకు రానివ్వకుండా డీఐజీ కోయ ప్రవీణ్ కాపలా కాయడం దారుణమని అన్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయంకు వస్తున్న కార్యకర్తలను కాల్చేస్తానంటూ డీఎస్పీ బెదిరించడం ఈ ఎన్నికల్లో పోలీసులు అధికారపార్టీకి ఎంత తొత్తులుగా మారి పనిచేస్తున్నారనడానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే...2017 లో నంద్యాల ఉప ఎన్నికల కన్నా దారుణంగా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోంది. ఈ ఎన్నికల్లో పోలింగ్‌లో పాల్గొన్న వారు అక్కడి సెగ్మెంట్లకు చెందిన వారు కాదు. జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, రౌడీలను తీసుకువచ్చి పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేయించారు. దీనికి సంబంధించి మా పార్టీ నేత, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఫొటోలతో సహా బయటపెట్టారు. దొంగ ఓట్లు వేస్తున్న వ్యక్తుల పేర్లతో సహా వెల్లడించారు. ఇంతకన్నా సాక్ష్యాధారాలు ఏం కావాలి. పులివెందుల్లో ఉన్న 10,601 ఓట్లలో యాబై శాతంకు మించి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లతో వేయించారు. పులివెందుల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును వాడుకోలేకపోయారు. పోలీస్ యంత్రాంగం వైఎస్సార్సీపీ వారిని ఎవరినీ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. చివరికి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జెడ్పీటీసీ అభ్యర్థిని కూడా బయట తిరగనివ్వకుండా నిర్భందించారు.ఎంపీ అవినాష్‌రెడ్డిపై ఆంక్షలు:కడప పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డిని పోలీసులు ఉదయం అదుపులోకి తీసుకుని ఎక్కడికి తీసుకువెడుతున్నారో కూడా చెప్పకుండా గంటల తరబడి వాహనాల్లో తిప్పారు. దీనిని పార్టీ నేతలు ప్రశ్నించడంతో ఎర్రగుంట్లలో ఓ పార్టీ నాయకుడి ఇంటిలో కూర్చోబెట్టారు. ఇక్కడి నుంచి వైఎస్ అవినాష్‌రెడ్డి పులివెందుల పార్టీ కార్యాలయంకు వచ్చారు. ఈ సమాచారం తెలియగానే కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అక్కడికి వచ్చి నేను కూడా మీ పార్టీ కార్యాలయంలోనే కూర్చుంటాను అంటూ కూర్చున్నారు. ఒకవైపు రెండు సెగ్మెంట్లలోనూ టీడీపీ వారు విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేస్తుంటే, దానిని అడ్డుకోకుండా, వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎంపీ అవినాష్‌రెడ్డి బయటకు రాకుండా కాపలా కాస్తూ కూర్చుంటాను అని కోయ ప్రవీణ్ అనడం చూస్తుంటేనే వారి కుట్రలు అర్థమవుతున్నాయి. వైఎస్సార్సీపీ వారిని ఎవరినీ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళనివ్వవద్దని, టీడీపీ దొంగ ఓట్ల విషయంలో జోక్యం చేసుకోవద్దని ఆయన ఆదేశాలు ఇచ్చేశారు. ఆయన ఖాకీ చొక్కాకు బదులు పచ్చ చొక్కా వేసుకున్నట్లుగా, తెలుగుదేశం ఏజెంట్‌గా, కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఇంత కన్నా దిగాజరుడుతనం ఎక్కడైనా ఉంటుందా? టీడీపీని గెలిపించేందుకు ఐపీఎస్ అధికారి డీఐజీ కోయ ప్రవీణ్ దిగజారి వ్యవహరిస్తున్నారు. దీనిని ప్రజాస్వామికవాదులు మరిచిపోతారా? పోలీసులే దొంగ ఓటర్లను ప్రోత్సహిస్తున్నారు. ఒకవైపు తమ హక్కులను కాపాడాలని ఓటర్లు పోలీసులు కాళ్ళు పట్టుకుని ప్రాదేయపడుతున్నా వారు పట్టించుకోవడం లేదు.మా పార్టీ ఆఫీస్‌కే వచ్చి... మా కార్యకర్తలనే కాల్చేస్తామని వార్నింగ్:వైఎస్సార్సీపీ కార్యాలయానికే వచ్చి పార్టీ కార్యకర్తలను 'నా కొడకల్లారా.... కాల్చిపారేస్తాను' అంటూ పులివెందుల్లో డీఎస్పీ హెచ్చరించారు. పోలీస్ ఉద్యోగం ఇచ్చింది ప్రజలను కాల్చిపారేయడానికేనా? చంద్రబాబు, డీఐజీ ప్రవీణ్ అండగా ఉన్నారన్న అహంకారమా? వైఎస్సార్సీపీ కార్యాలయం వద్దకు వెళ్ళి, వారి కార్యాలయంలో ఒకవైపు ఎంపీ ఉండగానే, బయట ఉన్న కార్యకర్తలను కాల్చి పారేస్తాను అంటూ హెచ్చరించడం డిఎస్పీ అహంకారానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీని గెలిపించడానికే ఖాకీదుస్తులు వేసుకుంటున్నారా? దానికి బదులు పచ్చచొక్కాలు వేసుకుని తిరిగితే బాగుంటుంది. ఇటువంటి దుర్మార్గమైన విధానాలను ఎన్నికల్లో చూడలేదు. రెండు జెడ్పీటీసీల కోసం చంద్రబాబు ఇంత కక్కుర్తి పడాలా? వందేళ్ళ పాటు ప్రజాస్వామ్యాన్ని తీసుకువెళ్ళారు. చరిత్ర హీనుడుగా మిగిలిపోతున్నాడు. ఈ సంప్రదాయం చంద్రబాబు, ఆయన కుమారుడిని వెంటాడదా? ఈ పరిణామాలను చూస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తల గుండెలు మండిపోతున్నాయి.డీఐజీ కోయ ప్రవీణ్‌ను చూస్తుంటే సిగ్గేస్తోంది:వైఎస్ అవినాష్‌ను పోలీసులు వెంటాడుతున్నారు. ఏకంగా ఆయన ఉన్న పార్టీ ఆఫీస్‌లోనే కూర్చుని, ఆయనను గమనించేందుకు డీఐజీ తెగబడ్డారు. మరోవైపు ఇరవై కార్లతో జమ్మలమడుగు ఎమ్మెల్యే తిరుగుతున్నా, మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కాన్వాయితో తిరుగుతున్నా పోలీసులకు కనిపించదు. యధేచ్ఛగా దొంగ ఓట్లు వేయించుకుంటున్న వైనం వారికి కనిపించదు. డీఐజీ కోయ ప్రవీణ్ ఉద్యోగ ధర్మాన్ని పూర్తిగా విస్మరించారు. ఇటువంటి అధికారిని చూస్తుంటే సిగ్గేస్తుంది. అవినాష్‌రెడ్డి బయటకు వెళ్ళి, జరుగుతున్న తప్పులను పట్టుకుంటారేమోనని భయపడుతున్నారు. మహిళలు తమ హక్కును కాపాడాలని ధర్నాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. జమ్మలమడుగు టీడీపీకి చెందిన ఉపాధ్యక్షుడు పులివెందుల ఎన్నికల్లో ఓటు వేశాడంటేనే ఈ ఎన్నిక ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవాలి. దీనిని డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పడం ఆయన దివాలాకోరుతనంకు నిదర్శనం. -
YSRCP ఏజెంట్లను పోలింగ్ బూత్‌లోకి అనుమతించలేదు: అంబటి
-
పులివెందుల, ఒంటిమిట్టలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు: అంబటి
-
చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు: అంబటి
సాక్షి, విజయవాడ: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకం రాజ్యమేలుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లు, ఓటర్లు బూత్‌ల వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. టీడీపీ, పోలీసులు కలిసి వ్యూహాత్మకంగా పద్ధతి ప్రకారం కుట్ర చేశారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల, ఒంటిమిట్టలో టీడీపీ అరాచకాలపై ఎస్ఈసీకి వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.‘‘పోలీసుల సహాయంతో మా పోలింగ్ ఏజెంట్లను బయటికి నెట్టేశారు. ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది టీడీపీ గూండాలు వచ్చారు. వైఎస్సార్సీపీ నేత బలరాంరెడ్డి పోలింగ్ ఏజెంట్‌గా ఉన్నప్పటికీ ఆయన్ని వెళ్లనివ్వలేదు. వైఎస్సార్సీపీకి ఓటు వేసే వారిని గుర్తించి బయటికి పంపించేస్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆయన ఇంటిని ధ్వంసం చేశారు. సాయంత్రం వరకూ అవినాష్ రెడ్డిని తిప్పాలనుకున్నారు. ప్రజలు తిరగబడటంతో ఎర్రగుంట్లలో వదిలిపెట్టారు..ఎస్వీ సతీష్ రెడ్డిని ఇంటి నుంచి బయటికి రాకుండా అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్ధిని కూడా బయటికి రానివ్వలేదు. టీడీపీ అభ్యర్ది మాత్రం అన్ని చోట్లా తిరగనిస్తున్నారు. నల్లకుంట్ల పాడులో పోలీసుల కాళ్లు పట్టుకుని మరీ ఓటర్లు వేడుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజే కుట్ర మొదలైంది. పులివెందుల, ఒంటిమిట్టలో కుట్రలతో గెలవాలని ముందే ప్లాన్ చేశారు. కుట్రలతో గెలిచి వైఎస్ జగన్ పనైపోయిందని ప్రచారం చేయాలని చూస్తున్నారుటీడీపీ ఓటర్లు మాత్రమే ఓటేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఇది చాలా ప్రమాదకరం. నంద్యాలలో కూడా చంద్రబాబు ఇలానే చేశారు. చంద్రబాబు చర్యలతో వందేళ్లు వెనక్కిపోయాం. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు. ఇంత దుర్మార్గంగా ఎన్నడూ ఎన్నికలు జరగలేదు. కనంపల్లిలో వైఎస్సార్సీపీ సర్పంచ్‌ను తుపాకీతో బెదిరించారు. జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ టీడీపీ నేత నాగేశ్వరరెడ్డి పులివెందులలో ఓట్లు వేశారు. ఎన్నికల కమిషన్ తీరు చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు ఉంది. ఎన్నికల కమిషన్, టీడీపీ, పోలీసులు ఒక్కటైపోతే ఎన్నికలు ఏం జరుగుతాయి?బ్యాలట్ ఓటింగ్‌లోనే ఇంత అరాచకం చేస్తే.. ఇక ఈవీఎంలు అయితే మరింత దారుణంగా వ్యవహరించేవారు. పులివెందులలో గెలిచానని చెప్పుకోవడానికి చంద్రబాబు ఇలా చేస్తున్నాడు. పులివెందుల వైఎస్సార్సీపీ జడ్పీటిసి అభ్యర్థి గన్‌మెన్‌ను రాత్రికి రాత్రి మార్చేశారు. రాబోయే కాలంలో ప్రతిఫలం చంద్రబాబు అనుభవించక తప్పదు. చంద్రబాబు నీచమైన వ్యక్తి అని ఈ ఎన్నికల ద్వారా తేలిపోయింది.ఇంతకంటే దుర్మార్గం ఏముంది?: వెలంపల్లి శ్రీనివాస్పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల్లో దారుణంగా వ్యవహరించారు. తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకునేలా చేశారు. ఇంతకంటే దుర్మార్గం ఏముంది?. చంద్రబాబుకి శునకానంద తప్ప ఏమీ ఒరగదు. ఎప్పుడు ఎన్నిక వచ్చినా కూటమి పార్టీలకు డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయం. ఏం సాధించావని ఎన్నికల్లో ఇలా వ్యవహరిస్తున్నారు.దొంగ ఓట్లు వేయడానికి టీడీపీ నేతలు క్యూ కట్టారు: మల్లాది విష్ణుఎన్నికల కమిషన్ నియమనిబంధనల ప్రకారం నడుచుకోవడం లేదు. పులివెందుల, ఒంటిమిట్టలో రెవిన్యూ, పోలీసులను ఇష్టానుసారంగా వాడుకున్నారు. ఓటర్లను గ్రామ పొలిమేర్లలోనే అడ్డుకుంటున్నారు. రాష్ట్ర మంత్రులకు పులివెందుల, ఒంటిమిట్టలో ఏం పని?. దొంగ ఓట్లు వేయడానికి టీడీపీ నేతలు క్యూ కట్టారు. ఇది అసలు ఎన్నికే కాదు. ఈ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఓటమి భయంతో కుట్రపూరితంగా చంద్రబాబు వ్యవహరించారు. ఎలాగైనా పులివెందులలో గెలవాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నారు. ఈ ఎన్నిక ప్రజాస్వామ్య బద్ధంగా జరగలేదు -
SEC ఆఫీస్ ఎదుట YSRCP నేతల బైఠాయింపు
-
చంద్రబాబు, లోకేష్ కు అంబటి ప్రశ్నాస్త్రాలు
-
‘ఎన్నిక ఏదైనా అక్రమాలు చేయడం చంద్రబాబుకి అలవాటే’
ఎన్నిక ఏదైనా అక్రమాలు చేయడం చంద్రబాబుకి అలవాటేనని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పులివెందులలో టీడీపీ గూండాల అరాచకం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపైనా ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు. సాక్షి,తాడేపల్లి: పులివెందులలో టీడీపీ నేతల తీరును మాజీ మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. ‘‘పులివెందులలో టీడీపీ నేతలు నిసిగ్గుగా ప్రవర్తించారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక గెలవడం కోసం చంద్రబాబు అనేక కుట్రలు చేస్తున్నారు. కోండెపి జెడ్పీటీసీ గెలిచినట్లు టీడీపీ నేతలే ప్రకటించుకున్నారు. పైగా గాయపడినవారిపైనే పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు.డీఐజీ కోయ ప్రవీణ్ కామెంట్స్‌ను ఖండిస్తూ.. పోలీసులు టీడీపీ కార్యకర్తల మాదిరి ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే పని చేస్తున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ తప్పుడు మాటలు మాట్లాడడం సిగ్గు చేటు. ఖాకీ బట్టలు వేసుకుని కోయ ప్రవీణ్ చంద్రబాబు కాళ్ల పూజ చేస్తున్నాడు. ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్‌ను ప్రవీణ్ కాపాడాలి. చంద్రబాబు సింగపూర్ ప్రచారంపై.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు 58 సార్లు సింగపూర్ వెళ్లారు. మరి ఏం ాధించారో చెప్పాలి. తాజాగా చంద్రబాబు కుమార సమేతంగా సింగపూర్ పర్యటనకు వెళ్లారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడం లేదని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ, పెట్టుబడులు పెడుతోందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. ప్రజలను మభ్య పెడుతున్నారు. ఫ్రీ బస్సు స్కీమ్ మోసం.. ఎన్నికలకు ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ప్రకటించారు. ఇప్పుడేమో మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా అరకొరగా అమలు చేసేందుకు కుటరలు చేస్తున్నారు అని అంబటి విమర్శనాస్త్రాలు సంధించారు. -
నీవు ఎక్కడ కాలు పెడితే అక్కడ దరిద్రం.. బాబుపై అంబటి సెటైర్లు అదుర్స్
-
నాకు అశోక్ బాబు చెప్పిన ఒక్కటే మాట.. నేను ఫిదా అయిపోయా..
-
అన్నీ గుర్తు పెట్టుకుంటాం: అంబటి రాంబాబు
సాక్షి, బాపట్ల: రేపల్లె ఆసుపత్రిలో వైఎస్సార్సీపీ నేత వరికూటి అశోక్‌బాబు దీక్ష కొనసాగుతోంది. ఆయన్ను ఆదివారం.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ.. అశోక్ బాబు ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారిందన్నారు. ‘‘రైతుల సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరాహార దీక్ష విరమించనని అశోక్ బాబు అంటున్నారు. మూడు రోజుల నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా దీక్ష చేస్తున్నారు’’ అని అంబటి రాంబాబు చెప్పారు.‘‘వేమూరు నియోజకవర్గంలో రైతులంతా కలిసి కాలువలో గుర్రపు డెక్కతో తమ పడుతున్న ఇబ్బందిని అశోక్ బాబు దృష్టికి తీసుకువచ్చారు. ఆయన కాలువలో గుర్రపు డెక్క తొలగించాలంటూ రెండు రోజులు పాటు అక్కడే దీక్ష చేశారు. అధికారులు స్పందించట్లేదు. కనీసం కాలువల్లో గుర్రపు డెక్క కూడా తీయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. కాలువలో గుర్రపు డెక్క ప్రభుత్వం తొలగించాలి. ప్రభుత్వానికి చేతకాకపోతే గుర్రపు డెక్క తొలగించడానికి రైతులకు అవకాశం ఇవ్వాలి’’ అని అంబటి రాంబాబు అన్నారు.రేపల్లె టౌన్ సీఐ మల్లికార్జునరావు.. అశోక్‌బాబు పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అశోక్‌బాబు పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించాడు. అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడిన అధికారులను కచ్చితంగా మేము గుర్తుపెట్టుకుంటాం’’ అని అంబటి రాంబాబు హెచ్చరించారు. -
నీ గురించి మాట్లాడటం మొదలుపెడితే హోంమంత్రి అనితకు అంబటి వార్నింగ్
-
‘జగన్‌ని ఆపడం చంద్రబాబు, చిట్టినాయుడు తరం కాదు’
తాడేపల్లి : తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనకు వెళితే టీడీపీ నేతలు వణికిపోయారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రోడ్లు తవ్వి, ముళ్ల కంచెలు వేసి నానా హంగామా చేసినా జగన్ పర్యటన విజయవంతమైందన్నారు. అసలు ఒక పార్టీ అధినేత పర్యటనలకు వెళితే ఆంక్షలు ఎందుకు? అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. ఈరోజు(శుక్రవారం, ఆగస్టు 1వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. ‘ వైఎస్ జగన్ ప్రజా బలాన్ని చూసి ఇబ్బందులు పెడుతున్నారు. ఐపీఎస్ అధికారి సర్వశ్రేష్టి త్రిపాఠి నెల్లూరులోనే కూర్చొని జనం రాకుండా చేయాలని చూశారు. జగన్ కోసం జనం తండోపతండాలుగా వస్తున్నారు’ అని పేర్కొన్నారు.సింగపూర్‌కు వెళ్లి ఏమి సాధించారు?ఇప్పటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 55సార్లు సింగపూర్‌కు ఎళ్లారని, మరి రాష్ట్రానికి ఏమి పెట్టుబడులు తెచ్చారో ఇప్పటివరకూ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు అంబటి. తప్పుడు పనులు చేసి జైలుకు వెళ్లిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ని పరామర్శించటానికే వెళ్లారని ఎద్దేవా చేశారు. సింగపూర్‌కు వెళ్లి ఏమీ సాధించలేకపోవడంతో అది కూడా మా పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఏపీలో పెట్టుబడి పెట్టేది లేదని సింగపూర్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. దానికి కారణం వైఎస్సార్సీపీ నేతలంటూ ఆరోపణలు చేస్తున్నారు. మురళీకృష్ణచౌదరి అనే టీడీపీ వ్యక్తే సింగపూర్ ప్రభుత్వానికి ఈ-మెయిల్ చేశారని తేలింది. అతని ఆస్తులను వారి పార్టీ నేతలే కబ్జా చేశారన్న కారణంతో ఈ-మెయిల్ చేశారట. అలాంటి వ్యక్తిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషిగా ఎలా చిత్రీకరిస్తారు?, చంద్రబాబు ప్రభుత్వానికి శని పట్టింది. అందుకే పరిపాలనను వదిలేసి జగన్ పర్యటనను కట్టడి చేసే పనిలో పడ్డారు. ఏం చేసినా జగన్‌ని ఆపటం చంద్రబాబు, చిట్టినాయుడు తరం కాదు. హోంమంత్రి అనిత అదేపనిగా జగన్‌ని తిట్టటమే పనిగా పెట్టుకుంది. జగన్‌ని తిడితే మంత్రి పదవి ఉంటుందని ఆమె భావిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతూ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే కొందరు ఐపిఎస్ అధికారులు జాగ్రత్తగా ఉండాలి. లోకేష్ హైక్యాష్ గా మారిపోయారు. ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి మా నాయకుడు వెళ్తే టీడీపీకి ఇబ్బంది ఏంటి?, పెట్టుబడులపై చిట్టినాయుడు పిట్టకథలు చెప్తున్నారు. చంద్రబాబు తోకని చిట్టినాయుడు కట్ చేస్తున్నాడు.. చిట్టినాయుడు తోకని జనం కట్ చేస్తున్నారు. వ్యక్తిత్వ హననం చేయటమే చంద్రబాబు లక్ష్యం. కేసులు పెట్టటానికి ఇప్పుడు మళ్ళీ ఇసుక కేసు అంటున్నారు. చిట్టినాయుడు కథలు రాస్తుంటే పోలీసులు డ్రామా ప్లే చేస్తున్నారు. ఈ కేసులేవీ చట్టం ముందు నిలపడవు’ అని అంబటి పేర్కొన్నారు. -
Ambati: చంద్రబాబు సింగపూర్ వెళ్లి ఏం సాధించారు?
-
దేనికైనా రెడీ.. ఎన్ని కేసులైనా పెట్టుకోండి: అంబటి, రజిని
సాక్షి, పల్నాడు: ఏపీలో చంద్రబాబు దుష్టపాలన అంతానికి అంతా కలిసి కట్టుగా పని చేస్తామని, ఈ క్రమంలో ఎన్ని కేసులు పెట్టిన భయపడబోమని వైఎస్సార్సీపీ నేతలు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని అన్నారు. సోమవారం సత్తెనపల్లి గ్రామీణ పీఎస్‌లో విచారణకు హాజరైన అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్ గత నెల 18న రెంటపాళ్లలో పర్యటించారు. ఆ టైంలో జనసమీకరణ చేపట్టారంటూ పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులిచ్చారు. ఈ కేసులో విచారణ నిమిత్తం అంబటి, రజిని ఇవాళ పీఎస్‌కు వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని కష్టాలు ఎదురైనా జగన్ వెంటే నడుస్తామని, చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని ఉద్ఘాటించారు. జగన్ పార్టీ పెట్టిన దగ్గర నుండి అయన వెంటే నడుస్తున్నాం. గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఎన్నో మీటింగ్‌లు పెట్టారు.. ర్యాలీలు నిర్వహించారు. కానీ మేము ఇలాంటి కేసులు పెట్టలేదు. ఇప్పుడు మాపై కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలందరినీ జైలుకు పంపాలన్నది కూటమి ధ్యేయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అక్రమ కేసులో మిథున్ రెడ్డిని అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించారు.సత్తెనపల్లి శాసన సభ్యులుగా గెలిచింది. ఒకరు పెత్తనం చేస్తుంది మరొకరు. డీఎన్ఆర్ అనే వ్యక్తి సత్తెనపల్లిలో పెత్తనం చాలా ఇస్తూ రాజ్యాంగీతర శక్తిగా వ్యవహరిస్తున్నాడు. ఏపీలో కొనసాగుతోంది మిలిటరీ పాలన. చంద్రబాబు, లోకేష్‌లకు బుద్ది చెప్పి తీరుతాం. దుష్ట పాలన అంతానికి అందరం కలిసి పని చేస్తాం అని అన్నారు. మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. ‘‘రెంటపాళల్లో పోలీసులు, కూటమి నాయకుల వేధింపులు తట్టుకోలేక వైయస్సార్సీపీ నేత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. మేము జనాన్ని సమీకరించామని మాపైన కేసులు పెట్టారు. మా వాళ్లను పరామర్శించడానికి వెళ్తే.. మా మీదే కేసులు పెడుతున్నారు. జగన్ అంటేనే జనం. అలాంటి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు జనాన్ని ఎవరు తరలించాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా భరించడానికి సిద్ధంగా ఉన్నాం. కూటమి పెద్దలు ఒక కట్టు కథ అల్లడం.. దానికి స్కామ్ అని పేరు పెట్టి వైఎస్సార్సీపీ నేతల్ని జైలుకు పంపడం సాధారణంగా మారిపోయింది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ దారుణం. అక్రమ కేసు పెట్టి ఆయన్ని జైలుకు పంపారు. జగన్ మళ్లీ సీఎం అయ్యే దాకా.. ఈ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అని అన్నారామె. -
దేనికైనా రెడీ.. ఇక కాసుకో
-
మిథున్ రెడ్డి అరెస్ట్ పై అంబటి స్ట్రాంగ్ రియాక్షన్
-
‘అక్రమ కేసులతో వైఎస్సార్సీపీని అణచి వేయలేరు’
గుంటూరు: అక్రమ కేసులతో వైఎస్సార్సీపీని అణచి వేయలేరని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు మరోసారి స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్ కుట్రలకు కొందరు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, అలాంటి వారికి ప్రమోషన్లు ఇస్తున్నారని అంబటి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పిచ్చి చేష్టలను చూసి జనం విస్తుపోతున్నారని అంబటి ధ్వజమెత్తారు. ఈరోజు(ఆదివారం, జూలై 20) గుంటూరు నుంచి మాట్లాడిన అంబటి.. సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబును మించి క్రిమినల్ మైండ్‌సెట్ ఉన్న పొలిటీషియన్ రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ఎవరూ లేరని మండిపడ్డారు. ‘తడిగుడ్డతో గొంతులు కోయగల వ్యక్తి చంద్రబాబు. రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీలను కొనాలని చూశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కబుర్లు చెబుతున్నారు. చంద్రబాబు అంతటి దివాళాకోరు రాజకీయ నాయకుడు మరెవరూ లేరు. మద్యం కేసులో ఎంతమందిని అరెస్టు చేసినా లెక్క చేయం. అక్రమ కేసులతో వైఎస్సార్సీపీని అణచి వేయలేరు. రాష్ట్ర అభివృద్ధి, తమకు సంక్షేమ పథకాలను అందిస్తారని ప్రజలు కూటమిని గెలిపించారు. కానీ రాజకీయ కక్షసాధింపులు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను వేధించే పని చేస్తున్నారు. చివరికి జగన్ పర్యటనలకు వెళ్తే ఆయనపై కూడా కేసులు పెడుతున్నారు. మద్యం కేసు పేరుతో ఇష్టానుసారం కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక నూతన మద్యం పాలసీని తెచ్చింది. ప్రయివేటు వ్యక్తులకు ప్రమేయం లేకుండా చేశాం. దీని వలన ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఈ పాలసీలో తప్పులేదని కేంద్ర సంస్థ సీసీఐ కూడా చెప్పింది. కానీ ఆ సీసీఐని తీర్పును కూడా కాదని అక్రమ కేసులు పెడుతున్నారు. చంద్రబాబు హయాంలోనే మద్యం అక్రమాలు జరిగాయి. ఆ కేసులో చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు. స్కిల్ కేసులో అరెస్టయి జైల్లో కూడా ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై చంద్రబాబుకు ఎప్పటినుంచో కక్ష ఉంది. అందుకే మిథున్‌రెడ్డి మీద కేసు పెట్టి అరెస్టు చేశారు. చంద్రబాబు, లోకేష్ చెప్పినట్టు చేయటమే సిట్ అధికారుల పనిగా ఉంది. ఎవరిని కేసులో పెట్టమని చెబితే వారిని అరెస్టు చేస్తున్నారు. ఇలాంటి చర్యల వలన వైఎస్సార్సీపీని ఏమీ చేయలేరు. లేని స్కాంను ఉన్నట్లు చూపుతూ పుస్తకాలు, నవలలు రాస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ గంజాయి దొరుకుతోంది. వంద రోజుల్లో గంజాయి లేకుండా చేస్తామన్న హోంమంత్రి ఏం చేస్తున్నారు?, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. అవేమీ పట్టించుకోకుండా రాజకీయ వేధింపుల పనిలో ప్రభుత్వం ఉంది. చంద్రబాబు పెట్టే అక్రమ కేసులకు మేము భయపడం. అవసరమైతే కొన్నాళ్ళు జైల్లో ఉండానికైనా సిద్ధంఅసలు మద్యం కేసులో మిథున్‌రెడ్డికి ఏం సంబంధం?, ఎల్లోమీడియా రాసిందే పోలీసులు ఛార్జిషీట్, రిమాండ్ రిపోర్టుల్లో రాస్తున్నారు. చంద్రబాబు రాజకీయ పుట్టుకే స్కాంలో నుండి పుట్టాడు. డబ్బుతో ఏదైనా చేయగలని నిరూపించిన వ్యక్తి చంద్రబాబు. వ్యవస్థలను మేనేజ్ చేయటఙ, చీకట్లో కాళ్లు పట్టుకోవటంలో చంద్రబాబును మించిన వారు దేశంలోనే లేరు. రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీలను కొనాలని చూసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయ మలినాలను తొలగిస్తానంటూ కబుర్లు చెప్తున్నారు. చంద్రబాబు అనుమతి ఇచ్చిన డిస్టలరీ నుండే గత ప్రభుత్వం మద్యం కొనుగోలు చేసింది. అక్రమ కేసులతో మమ్మల్ని భయపెట్టలేరు. చంద్రబాబు పెట్టిస్తున్న ఏ ఒక్క కేసు కూడా నిలపడదు’ అని అంబటి స్పష్టం చేశారు. -
మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు: అంబటి రాంబాబు
-
Ambati: పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు 2027కి పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు
-
ఇది చంద్రబాబుకు సిగ్గుచేటు కాదా?: అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: ఎల్లో మీడియా, చంద్రబాబు.. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలవరం, బనకచర్ల మీదనే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశమంటూ ఎల్లో మీడియా చాలా రోజులుగా హడావుడి చేశాయి.. తీరా చూస్తే అసలు దీనిమీద చర్చే జరగలేదని అంబటి రాంబాబు అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎవరిని మోసం చేయాలని ఇలాంటి పనులు చేస్తున్నారు చంద్రబాబూ? అంటూ ప్రశ్నించారు.‘‘చంద్రబాబు శాలువాలు కప్పి బయటకు వచ్చారు. రెండు రాష్ట్రాలూ నాకు సమానమంటూ బడాయి మాటలు చెప్పి వచ్చేశారు. మంత్రి రామానాయుడు మాత్రం కమిటీ వేస్తున్నట్టు చెప్పి మళ్లీ మోసం చేయాలని చూశారు. విభజన సమస్యల పరిష్కారం కోసం అంటూ గతంలో ఇద్దరు సీఎంలు కలిశారు. ఆ రోజు కూడా తెగ బడాయి మాటలు చెప్పారు. తీరా చూస్తే ఏమీ జరగలేదు. కానీ వారి ఎల్లో మీడియా మాత్రం ఆహాఓహో అంటూ జాకీలు లేపింది..రాయలసీమకు నీరు అందించే ఆలోచనే చంద్రబాబు కు లేదు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతకాలంలో రాయలసీమ కోసం ఒక్క పనైనా ఎందుకు చేయలేదు?. పోలవరంలో 42 మీటర్ల ఎత్తు ఉంటేనే బనకచర్లకు నీరు తీసుకెళ్లటానికి వీలవుతుంది. కానీ పోలవరాన్ని 41 మీటర్ల ఎత్తుకే ఆపేస్తే ఇక బనకచర్ల ఎలా సాధ్యం?. 2027కు పోలవరాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ ఆ స్థాయిలో పనులు జరగటం లేదని ఎల్లో మీడియానే రాసింది..డయాఫ్రం వాల్ నిర్మాణం1.6 మీటర్ల వెడల్పుతో వేయాల్సి ఉండగా కేవలం 0.9 మీటర్లకే వేస్తున్నారు. ఇది పోలవరం ప్రాజెక్టుకే అత్యంత ప్రమాదకరం. ప్రాజెక్టు నిర్మాణ సంస్థతో కుమ్మక్కై చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారు. సీడబ్ల్యుసీ, పోలవరం అథారిటీ వారు బనకచర్లకు అనుమతులు లేవని తేల్చిచెప్పింది. ఇది చంద్రబాబుకు సిగ్గుచేటు కాదా?..హంద్రీనీవా ప్రాజెక్టుకు నీరు వదలటానికి చంద్రబాబు వెళ్లటం ఏంటి?. మంత్రులో, అధికారులే చేసే చేసే పనిని చంద్రబాబు చేయటం సిగ్గుచేటు. హంద్రీనీవా కొత్త ప్రాజెక్టు కాదు. పోలవరం, అమరావతి విషయాలలో చంద్రబాబు దుర్మార్గపు పనులు చేస్తున్నారు. రాయలసీమకు చంద్రబాబు ఏనాడూ ఏమీ చేయలేదు. తప్పు ఒప్పో చూడకుండా పోలీసులు ఎలా కేసు పెడతారు?.జర్నలిస్టు కొమ్మినేని మీద ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు ఎలా పెడతారు?. జగన్ మీద కేసు ఎలా పెట్టారు?. పిన్నెళ్లి సోదరుల మీద హత్య కేసులు ఎలా పెడతారు?. పోలీసు అధికారుల సంఘం ముందు సమాధానం చెప్పాలి. ఇష్టానుసారం కేసులు పెడతామంటే చూస్తూ ఊరుకోం. జగన్ సమావేశానికి రైతులు వెళ్తే రౌడీషీట్లు ఓపెన్ చేస్తారా?. సోషల్ మీడియా కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టు కోర్టులు కూడా గుర్తించాయి. టీడీపీ నేతలు చెప్పినట్టు చేస్తూ కొందరు పోలీసు అధికారులు మాఫియా డాన్ లాగా వ్యవహరిస్తున్నారు’’ అని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గుంటూరు ఎస్పీ ఆఫీస్ వద్ద YSRCP నేతల ధర్నా
-
‘డీజీపీ పచ్చచొక్కా వేసుకుని పనిచేస్తున్నారు’
గుంటూరు: కృష్ణాజిల్లా జెడ్పీ చైర్ పర్సన్, బీసీ నాయకురాలు ఉప్పాల హారికపై జరిగిన దాడి ఘటనకు హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్‌ల ప్రోత్సాహంతోనే టీడీపీ సైకోలు ఈ దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై కనీసం కేసు నమోదు చేసేందుకు కూడా పోలీసులు ముందుకు రావడం లేదన్నారు. రాష్ట్ర డీజీపీ పచ్చచొక్కా వేసుకుని ఏకపక్షంగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే...ఏడాది కాలంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన వైనంపై ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ 'బాబు ష్యురిటీ-మోసం గ్యారెంటీ' పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. చంద్రబాబు మోసాలను ప్రశ్నించాలని ప్రజలను చైతన్యవంతం చేసేందుకు అన్ని జిల్లాల్లోనూ మొదటి దశలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. ప్రస్తుతం రెండో దశలో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీనిలో భాగంగా నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య నేతల సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇదే క్రమంలో గుడివాడ నియోజకవర్గంలో ఈ కార్యక్రమంపై సమావేశాన్ని నిర్వహించాం. అయితే ఈ సమావేశానికి రానివ్వకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు చేసింది. కృష్ణాజిల్లా పార్టీ అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్యపై బందరు వదిలి రాకూడదంటూ నిర్బంధాలు అమలు చేశారు. బీసీ నాయకురాలు, కృష్ణాజిల్లా ప్రథమ పౌరురాలు ఉప్పాల హారిక గుడివాడకు చేరుకుంటే, ఆమె కారుపై తెలుగుదేశం, జనసేన గుండాలు రెచ్చిపోయి దాడులు చేశారు. కారు అద్దాలు పగులకొట్టారు, ఆమెపై దాడికి ప్రయత్నించారు. ఇది చూస్తుంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా, నియంతృత్వ పాలనలో ఉన్నామా అనే సందేహం కలుగుతోంది.పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారుఒక జిల్లా పరిషత్ చైర్మన్‌కే ఇటువంటి పరిస్థితి ఉంటే, ఇక సామాన్యులకు రక్షణ ఉంటుందా.? కర్రలు, రాళ్ళుతో టీడీపీ గూండాలు చేసిన దాడికి గంటసేపు అదే కారులో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఒక మహిళా నేత ఉండాల్సిన పరిస్థితికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. చివరికి ఆమె తెగించి, అక్కడే ప్రేక్షకపాత్ర పోషిస్తున్న పోలీసులను ఇదేనా మీరు చేస్తున్న శాంతిభద్రతల బాధ్యత అని ప్రశ్నిస్తే, దానికి సమాధానంగా పోలీసులు 'వారంతా తాగి వచ్చారు, అల్లరి చేస్తున్నారు, మేం మాత్రం ఏం చేస్తాం' అంటూ మాట్లాడటం చూస్తుంటే పోలీస్ వ్యవస్థ ఇంతగా పతనమైందా అనే అనుకోవాల్సి వస్తోంది. పోలీసులు ఏం మాట్లాడారో మొత్తం సోషల్ మీడియాలో ఉన్న వీడియోలు చూస్తే ఎవరికైనా ఇదే భావం కలుగుతుంది. అసాంఘిక శక్తులను అదుపు చేసే సామర్థ్యం పోలీసులకు లేదా? దాడి చేస్తున్న గుండాలను అరెస్ట్ చేయరా? మద్యం, గంజాయి మత్తులో దాడులు చేస్తే, మౌనంగా పోలీసులు నిలబడిపోయారు. ఒక బీసీ మహిళపై పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతుంటే, రక్షణ కల్పించలేని అసమర్థతతో వ్యవస్థను నడుపుతున్నారా.? వైఎస్సార్సీపీపై పోలీసులను ప్రయోగించడం, మా కార్యకర్తలపై లాఠీలు ఝుళిపించడానికే పోలీసులను పరిమితం చేశారా? పెడనలో జరిగిన 'బాబు ష్యురిటీ-మోసం గ్యారెంటీ' కార్యక్రమానికి కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడుగా పేర్ని నాని వెళ్ళకూడదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. ఒక కళ్యాణ మంటపంలో నాలుగు గోడల మధ్య నడిచే మీటింగ్‌లకు కూడా ఆంక్షలు పెడతారా.? చంద్రబాబు, లోకేష్, హోంమంత్రిల ప్రోత్సాహంతోనే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారు. నెల్లూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిమీద ఇలాగే దాడి చేశారు. ఇంత వరకు దోషులపై కేసు పెట్టలేదు. ఉప్పాల హారికపై దాడి చేసిన వారిపైనా ఇప్పటి వరకు కేసు పెట్టలేదు. వారిపై పోలీసులు కేసు పెడతామంటే మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనితలు అంగీకరించరు. డీజీపీ పచ్చ చొక్కా వేసుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై జరుగుతున్న ఇటువంటి దాడులపై కనీసం కేసులు కూడా పెట్టడం లేదు. ఏకపక్షంగా పనిచేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు అంబటి రాంబాబు. -
పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయమా?.. ఇక్కడుంది జగన్
చంద్రబాబు నాయుడు గ్యారెంటీకి పవన్ కల్యాణ్ ష్యూరిటీ అన్నారు. కానీ, చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే!. అందుకే ఆయన ఇంటిపేరు నారా కాదు.. మోసం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. సాక్షి, విజయవాడ: చంద్రబాబు మోసాలను ఎండగడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమం బుధవారం విజయవాడలో జరిగింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో జరిగిన ‘‘బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ’’ సమావేశంలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు పాల్గొని ప్రసంగించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి హయాంలో డీబీటీ ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోనే నగదు జమ అయ్యేది. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే ఫెయిల్యూర్ అయ్యింది. జగన్ పర్యటనలకు రాకుండా పోలీసులు అడ్డుపడినా ప్రజలు ఆగడం లేదు. కూటమి ప్రభుత్వం బుడమేరు ముంపు గ్రామాలకు న్యాయం చేయలేకపోయింది. మాజీమంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు అంటేనే మోసం.. ఆయన జీవితమే మోసం. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే. అందుకే ఆయన ఇంటిపేరు నారా కాదు.. మోసం. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఎప్పుడైనా అమ్మ ఒడి గురించి ఆలోచించారా?. చంద్రబాబుకు మాత్రం ఒక్కడే కొడుకు...కానీ ప్రజలను మాత్రం ఇద్దర్ని కనమంటాడు. చంద్రబాబు నాయుడు గ్యారెంటీకి పవన్ కళ్యాణ్ ష్యూరిటీ అన్నారు. ఇప్పుడేమైంది?. ఏపీలో పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. సత్తెనపల్లిలో 113 మంది పై కేసులు పెట్టారు. ఏపీలో ఐపీఎస్ , ఐఏఎస్ అధికారులను జైలుకు పంపిస్తున్నారు. కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే ఎవరూ భయపడరు .. పారిపోరు. ఎక్కడా తగ్గేదే లేదు సోనియాగాంధీ, చంద్రబాబులను ఎదిరించి జగన్ పార్టీ పెట్టారు. ఆయన చిరంజీవిలాగా పార్టీ పెట్టి పారిపోయిన వ్యక్తి కాదు. మీరు ఎంత తొక్కితే అంత పైకి వచ్చే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. వంగవీటి మోహనరంగా , వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితులు. రంగా అనుచరుడిగా ఉన్న మల్లాది విష్ణుకి వైఎస్సార్ ఎమ్మెల్యేగా సీటు ఇచ్చారు. మల్లాది విష్ణు మళ్లీ అసెంబ్లీలో తన కంఠాన్ని వినిపిస్తారు. విజయవాడ పార్లమెంట్ పరిశీలకులు, మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డిది అబద్దాలు చెప్పే మనస్తత్వం కాదు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలిచాడు... ప్రజలు ఓడిపోయారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని చూస్తే భారత రాజ్యాంగం గుర్తొస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూస్తే ఆరోగ్య శ్రీ గుర్తుకు వస్తుంది. ఎన్టీఆర్ ను చూస్తే రెండు రూపాయల కిలో బియ్యం గుర్తొస్తుంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు విగ్రహం పెట్టాలి...అప్పుడు మోసాలు దౌర్జన్యాలు గుర్తుకొస్తాయి. తెలుగుదేశం పార్టీ నేతలే ఇంత మెజార్టీని నమ్మలేకపోతున్నారు. అంబటి రాంబాబులాగా అందరూ ఉత్సాహంగా పనిచేయాలిడిప్యూటీ మేయర్ ,శైలజారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కరువు తాండవిస్తుంది. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు.చంద్రబాబు కుటంబానికి మాత్రమే న్యాయం జరిగింది. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ మళ్లీ నిరూపించుకున్నారు. బ్రిటిష్ కాలం నాటి పాలన మళ్లీ మొదలైంది. విజయవాడ ధర్నా చౌక్ లో ప్రతి రోజూ ప్రభుత్వం పై ధర్నాలు జరుగుతున్నాయి. మెడికల్ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. చంద్రబాబు కాన్వాయ్ వద్ద ప్రజలు ఎవరూ లేరు. జగన్ కాన్వాయ్ వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం దగ్గరపడింది. పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు మేక తోలు కప్పుకున్న పులి. పల్నాడులో వైఎస్సార్సీపీ కార్యకర్తలను చంద్రబాబు హత్య చేయించారు. నాలుగు లక్షల మంది వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ కి దక్కింది. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం దగ్గర పడింది అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు , నాయకులు , కార్యకర్తలు హాజరయ్యారు. -
లోకేష్ ఏం చెప్తే అది చేస్తారా?.. అన్నీ గుర్తుపెట్టుకోండి: అంబటి హెచ్చరిక
సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను పెంచుకుంటుంది. వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రజల ప్రవాహాన్ని, ఉప్పెనను మీరు ఆపలేరు అంటూ వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ ఏం చెప్తే అది పోలీసులు చేస్తారా అని ప్రశ్నించారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి రైతుల సమస్యలను తెలుసుకుంటున్నారు. అనేక మార్లు అనుమతి లేదని, చివరికి గత్యంతరం లేక అనుమతి ఇచ్చారు. బంగారుపాళ్యం హెలిప్యాడ్ వద్ద అనేక ఆంక్షలు పెట్టారు. పెట్రోల్ బంక్ లో పెట్రోలు కొట్టకుండా నిర్భంధిస్తున్నారు. జన సమీకరణ చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ మణికంఠ మాట్లాడడం బాధాకరం. నారా లోకేష్ ఏం చెప్తే అది చేస్తారా?.ఐపీఎస్ అధికారి అనే విషయాన్ని మరిచి నారా లోకేష్ కోసం చెంచాలు మాదిరిగా కొందరు పోలీసులు పని చేస్తున్నారు. మీ లాఠీతో జగన్ కు వస్తున్న ఆదరణను ఆపలేరు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత పెంచుకుంటుంది. వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్రజల ప్రవాహాన్ని, ఉప్పెనను మీరు ఆపలేరు. చిత్తూరు మామిడి పంటను ధర లేక రోడ్ల మీద పడవేసి రైతులు ఆందోళన చెందుతున్నారు. అనేక వాహనాలను తనిఖీ చేసి, కొన్ని వాహనాలకు నోటీసులు ఇచ్చారు. మామిడి రైతులను పరామర్శిస్తే తప్పు ఏంటి? మీకు ఎందుకు అంత భయం. ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు.. మేము ఎక్కడ జన సమీకరణ చేయటం లేదు. బుర్ర లేని నారా లోకేష్ మాటలు ఐపీఎస్ అధికారులు వినటం బాధాకరం. కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు ఒక్కొక్కటి వికటిస్తున్నాయి. ప్రజలకు మీరు మంచి చేస్తే భయం ఎందుకు. రాష్ట్ర డీజీపీ మాకు కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు.. అందుకే ఆయనకు మళ్లీ పోస్టింగ్ పొడిగిస్తున్నారు. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో 113మంది వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు నమోదు చేశారు.కూటమి మంత్రులు పేకాట క్లబ్‌లు నడుపుతున్నారు.రాష్ట్రంలో అక్రమ మద్యం ఏరులై పారుతుంది. గంజాయికి కేరాఫ్ అడ్రస్‌గా ఏపీని మార్చారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రజలకు మద్యాన్ని దూరం చేస్తే, కూటమి ప్రభుత్వం మద్యం ప్రజలకు చేరువ చేస్తుంది. అమరావతి రాజధాని కోసం ఇప్పటికే తీసుకున్న భూములకు న్యాయం చేయలేదు. భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరు. పవన్ కళ్యాణ్ కాదు మమల్ని రానివ్వాల్సింది.. ప్రజలు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైంది. కూటమి పెడుతున్న అక్రమ కేసుల కోసం బస్సులు వేసుకుని పిక్నిక్ కి వెళ్లినట్లు వెళ్లాల్సి వస్తుంది. కూటమికి ఏ కేసులో మెటీరియల్ లేదు. బోనులో పెట్టి మమల్ని సింహాలను చేస్తున్నారు. కూటమి మరో ఏడాది పాలన చూస్తే ప్రజలు ఛీ కొడతారు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
రౌడీ షీట్ పెడతావా..? ఎస్పీకి అంబటి మాస్ వార్నింగ్
-
Ambati Rambabu: ఏపీలో ఏం జరుగుతుందో తెలుసా పవన్?
-
పవన్ కళ్యాణ్ ను లెఫ్ట్ అండ్ రైట్ వాయించిన అంబటి రాంబాబు
-
Ambati Rambabu: ఏపీలో ఏడాదిగా శాంతి భద్రతలు క్షీణించిపోయాయి
-
‘ఈ ప్రభుత్వంలో అసలు పవన్‌కు భాగస్వామ్యం ఉందా?’
తాడేపల్లి : డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్‌కు హెలికాప్టర్లో సీటు, స్పెషల్ ఫ్లైట్ తప్ప ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు. జగన్‌ని అధికారంలోకి రానివ్వనని చెప్పడం కన్నా.. చంద్రబాబును మోస్తూ ఉంటానని చెప్తే మంచిదని అంబటి రాంబాబు చురకలంటిచారు. జగన మళ్లీ అధికారంలోకి వస్తాడని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు భయం పట్టుకుందని విమర్శించారు. ఈరోజు(శుక్రవారం, జూలై 4వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి రాంబాబు.. కూటమి నేతల తాటాకు చప్పుళ్లకు భయపడమని హెచ్చరించారు. ‘పుష్ప సినిమా అన్నా, ఆ సినిమాలోని హీరో అన్నా పవన్ కళ్యాణ్‌కు నచ్చదు. అందుకే ఆ సినిమాలోని డైలాగులు పోస్టర్ వేసిన యువకుడిపై కేసులు పెట్టి అరెస్టు చేయించారు. సినిమా షూటింగులు చేసుకుంటూ రాష్ట్రంలో ఏం జరుగుతుందో పవన్ తెలుసుకోలేక పోతున్నారు. చంద్రబాబు ఇచ్చిన డబ్బులు తీసుకొని, ఆయన ఇచ్చిన స్క్రిప్టులు చదవటమే పనిగా పెట్టుకున్నారు. పవన్‌కి ఇల్లు, ఆఫీసు కట్టిస్తున్నది చంద్రబాబు కాదా?, హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ పేరుతో దియేటర్ల యాజమాన్యాలను బెదిరించారు. నాగబాబుని మంత్రి పదవిలోకి తీసుకుంటానని చంద్రబాబు లెటర్ రాసిచ్చి మోసం చేశాడు. మరి పదవి ఇవ్వలేదని చంద్రబాబును ఎందుకు అడగటం లేదు?’ అని అంబటి ప్రశ్నించారు.మూడు దాడులు.. ఆరు కేసుల మాదిరి పరిపాలనఏపీలో చంద్రబాబు నేతృత్వంలో పరిపాలన మూడు దాడులు.. ఆరు కేసుల మాదిరిగా ఉందని అంబటి స్పష్టం చేశారు. ప్రతిరోజూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూనే ఉన్నారు. మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును చంపేందుకు ప్రయత్నించారు. పొన్నూరు ఎమ్మెల్యేకి తెలియకుండానే ఈ హత్యాయత్నం జరిగిందా?, ఆ నిందితులను ఎమ్మెల్యేనే రక్షించి ఊరు దాటించేశారు. రెడ్‌బుక్‌ని కొనసాగించేందుకు కొందరు అధికారులు, రిటైర్డ్ అయినవారు కలిసి అజ్ఞాతంగా పని చేస్తున్నారు. పోలీసులు ఈ దాడులను ఆపాలని చూడటం లేదు. ఆ అజ్ఞాత వ్యక్తులు మాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెప్తాం. పల్నాడులోని గుండ్లపాడులో టీడీపీలోని రెండు వర్గాలు గొడవ పడి చంపుకుంటే మా నేతలపై కేసులు పెట్టారు.సింగయ్యను ప్రయివేటు కారు ఢీకొట్టి చనిపోయాడని తొలుత ఎస్పీ చెప్పారు తర్వాత మాట మార్చారు. ఆ తర్వాత జగన్ కారే ఢీకొట్టిందంటూ ఆయన మీద కూడా కేసు పెట్టారు. సింగయ్యను ఆస్పత్రికి తరలించటానికి 40 నిమిషాలు ఎందుకు ఆలస్యం చేశారు?, అంబులెన్స్ లో ఎక్కకముందు చక్కగా మాట్లాడిన వ్యక్తి ఆ తర్వాత ఎలా చనిపోయారు?అని అంబటి నిలదీశారు. -
YSRCP సర్పంచ్ పై కర్రలతో టీడీపీ గుండాలు దాడి.. అంబటి రాంబాబు స్ట్రాంగ్ రియాక్షన్
-
చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది: అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: టీడీపీ ఎమ్మెల్యేలు దోపిడీ కార్యక్రమాల్లో మునిగిపోయారని నిన్నటి పొలిట్ బ్యూరో సమావేశానికి 56 మంది గైర్హాజరు అయ్యారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి 15 మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో విహరిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక దోపిడీ చేస్తూ, మద్యం కమిషన్లు దండుకుంటూ వారంతా బిజీగా ఉన్నారు. అబద్దాలను నిజం చేయటానికి ఎల్లోమీడియా ద్వారా విషం చిమ్ముతున్నారు’’ అంటూ అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.2014-2019 మధ్య జనాన్ని మోసం చేసినందునే 2019 ఎన్నికలలో చంద్రబాబు ఓటమి పాలయ్యారు. రైతు రుణమాఫీ సహా ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. అందుకే జనం ఓడించారు. 2024లో గెలిచాక కూడా మళ్ళీ జనాన్ని మోసం చేస్తున్నారు. జగన్ ఖజానాని ఖాళీ చేశారనీ అందుకే సంక్షేమాలను అమలు చేయలేదని అబద్దాలు మొదలు పెట్టారు. పెద్ద పెద్ద కాంట్రాక్టులన్నీ లోకేష్ కమీషన్లు తీసుకుని టెండర్లు పిలుస్తున్నారు. రెండు లక్షల కోట్లు అప్పు చేసి అమరావతి నిర్మాణం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. ఈ ఒక్క ఏడాదే దుర్మార్గపు పాలన చేశారు. రానున్న రోజుల్లో ఇంకా పరమ దుర్మార్గపు పాలన చేస్తారు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.‘‘గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది. మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. కుప్పంలోనే ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొడితే ఏం చేశారు?. డైలాగులు చెప్పినంత సీరియస్‌గా పరిపాలన చేయటం లేదు. లోకేష్ కు సిగ్గు ఉంటే టెన్త్ మూల్యాంకనం తప్పిదాలకు బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లోకేష్‌కు అలాంటి సిగ్గు లేదు. చంద్రబాబు చేతిలో పాలన లేదు.. అంతా లోకేషే. ఇన్నేసి దుర్మార్గాలు చేస్తూ సుపరిపాలన అని ఎలా చెప్తారు?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.‘‘జగన్ అంటే చంద్రబాబుకు విపరీతమైన ఈర్ష్య, భయం. కూటమి ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతోందని ఎల్లో మీడియానే చెప్తోంది. ఎమ్మెల్యేలేమో చంద్రబాబు గ్రాఫే పడిపోయిందని చెప్తున్నారు. ఒక్క సంవత్సరంలోనే ఈ స్థాయిలో గ్రాఫ్ పడిపోవటం ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడానికే పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారు. ఎండీయూ వాహనాలు, వాలంటీర్లను తొలగించి సామాన్యులను కూడా వేధిస్తున్నారు. చంద్రబాబు మాటలను ఆయన పార్టీ వారే వినిపించుకోవటం లేదు. చంద్రబాబుకు తెలియకుండా 15 మంది ఎమ్మెల్యేలు విదేశాలకి వెళ్లిపోయారంటే ఆయనకు పార్టీ మీద ఏమాత్రం పట్టు లేదని తేలిపోయింది..జగన్ నెల్లూరు వెళితే టీడీపీ వారికి ఏంటి ఇబ్బంది?. హెలికాఫ్టర్ కాకపోతే కారులోనో లేదంటే నడుచుకుంటూ అయినా వెళ్తారు. జగన్‌కు 40 నుండి 60 శాతం ఆదరణ పెరిగింది. ఇది టీడీపీ సర్వేలోనే తేలిందని చంద్రబాబు, లోకేష్, పవన్ మాటలు వింటుంటేనే అర్థం అయింది. అందుకే జగన్ పర్యటనలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకే ఊడిగం చేస్తానని పవన్ అంటున్నారు. వ్యతిరేకత పెరిగితే కూటమికైనా ఓటమి తప్పదు. జగన్‌ని కట్టడి చేయటానికే ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవటం నీచ సంస్కృతి’’ అంటూ అంబటి రాంబాబు దుయ్యబట్టారు. -
జగన్ కు కృతజ్ఞతలు.. గుంటూరు వెస్ట్ లో వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తాం
-
సింగయ్య మృతిపై తాము రాసిన నోట్ పై సంతకం చేయాలని పోలీసులు ఒత్తిడి చేశారు
-
సింగయ్య ఘటనపై ఎల్లో మీడియా క్షుద్ర రాజకీయాలు: అంబటి
సాక్షి, గుంటూరు: ఈ రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు సంస్థలు ప్రజలకు వాస్తవాలను చెప్పడానికి బదులు చంద్రబాబుకు దాసోహమై నిత్యం తన అబద్దపు రాతలతో వైఎస్ జగన్ వ్యక్తిత్వహననమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైయస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే అభిమాని చనిపోతే, ఆ మరణంపై ఏ మాత్రం మానవత్వం లేకుండా ఎల్లో మీడియా క్షుద్రరాతలతో వైఎస్సార్సీపీపై విషం చిమ్ముతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పర్యటనలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో వున్న కూటమి ప్రభుత్వ కుట్రలకు ఎల్లో మీడియా కూడా భాగస్వామిగా మారిందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన సందర్భంగా దురదృష్టవశాత్తు వెంగళాయపాలేనికి చెందిన సింగయ్య అనే వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోగా, సత్తెనపల్లిలో జయవర్ధన్‌రెడ్డి అనే యువకుడు వడదెబ్బ కారణంగా గుండెపోటుకు గురై మృతిచెందారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాహనం కానీ, ఆయన కాన్వాయ్ వాహనాలు కానీ సింగయ్యను ఢీకొట్టలేదని ఎస్పీ స్వయంగా వెల్లడించారు. కాన్వాయ్కి ముందు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో ఆయన ప్రమాదానికి గురైనట్టు ఎస్పీ ధ్రువీకరించారు. దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదాన్ని కూడా రాజకీయం చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. వైఎస్ జగన్ పర్యటన కోసం సింగయ్యతో పాటు మరో 40 మందిని మా పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్ కుమార్ తీసుకొచ్చినట్టుగా రాసిన స్టేట్మెంట్ మీద సంతకం పెట్టమని సింగయ్య మృతదేహానికి పోస్టుమార్టం సమయంలో ఆయన భార్యను పోలీసులు ఒత్తిడి చేశారు.పోలీసులు రాసి తీసుకొచ్చిన తప్పుడు స్టేట్మెంట్పై ఆ సమయంలో అక్కడే ఉన్న పార్టీ నాయకులమంతా అడ్డం తిరగడంతో పోలీసులు సింగయ్య భార్య, ఆమె బంధువులు ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డు చేసుకుని వెళ్లిపోయారు. లేదంటే దీన్ని హత్యకేసుగా చిత్రీకరించి ఎవరో ఒకర్ని ఇరికించాలన్న కుట్ర అప్పుడే జరిగింది.వైఎస్ జగన్‌ని ఇబ్బంది పెట్టాలన్నదే వారి లక్ష్యంరాష్ట్రంలో ఏ మూలన ఏ సంఘటన జరిగినా పోలీసుల కన్నా ముందే ఈనాడు, ఆంధ్రజ్యోతి దర్యాప్తు చేసి రిపోర్టును ప్రింట్ చేస్తున్నాయి. వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననమే ఎజెండాగా ఈ రెండు పత్రికలు ఏ చిన్న సంఘటన జరిగినా దానిని చిలువలు వలవులుగా చేసి మా నాయకునికి నేరాన్ని ఆపాదించే కుట్రలు చేస్తున్నారు. సింగయ్య మరణం ప్రమాదవశాత్తు జరిగిందని అందరికీ తెలిసిన సత్యం. చంద్రబాబు పర్యటనల్లోనూ చాలాసార్లు ఇలాంటి సంఘటనలు జరిగాయి. తొక్కిసలాటల్లో కూడా అమాయకులు బలయ్యారు. ఈ వాస్తవాలను పక్కనపెట్టి ఈనాడు, ఆంధ్రజ్యోతి వక్రీకరించి తప్పుడు కథనాలు రాస్తున్నారు.'జగన్ వాహనానికి సింగయ్య బలి', 'సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం' అంటూ ఈ రెండు పత్రికలు ప్రమాదాన్ని హత్యగా చూపించాలని క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు. తన వాహనమే కాదు, ఆయన కళ్లముందు ఏదైనా ప్రమాదం జరిగినా వారిని ఆస్పత్రి చేర్చేవరకు ఆయన ఊరుకోరు. అలాంటిది జగనే స్వయంగా కారేసుకెళ్లి సింగయ్యను గుద్ది చంపాడు అన్నంతలా దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరికో ప్రమాదం జరిగితేనే తట్టుకోలేని జగన్, మా కార్యకర్త సింగయ్య చనిపోతే ఎలా వదిలేస్తారనుకున్నారు? ఆయన కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. ఇప్పటికే వారి కుటుంబాన్ని పరామర్శించి రూ. 10 లక్షల చెక్కును పార్టీ తరఫున వారి కుటుంబానికి అందజేయడం కూడా జరిగింది.చనిపోయిన వ్యక్తుల గురించి నీచంగా రాస్తున్నారువైయస్ జగన్ పర్యటన విజయవంతం కావడంతో ఓర్వలేక క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్ జగన్ ఎప్పటికీ బయటకు రావొద్దనే లక్ష్యంతో ప్రభుత్వం తప్పుడు కథనాలు రాయించి, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సత్తెనపల్లి పర్యటన విజయవంతం కావడంతో దాని మీద ఇప్పటికే మా నాయకులు గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద కేసులు పెట్టారు. నాకు కూడా నిన్న రాత్రి నోటీసులు ఇచ్చి వెళ్లారు. చంద్రబాబుని జైల్లో పెట్టామనే కక్షతో ఇప్పుడు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులందర్నీ లోకేష్ జైళ్లకు పంపుతున్నాడు. ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. -
వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతి.. 10 లక్షల సాయం అందజేత
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా వెంగళాయపాలెనికి చెందిన పార్టీ కార్యకర్త సింగయ్య ప్రమాదం కారణంగా మృతిచెందారు. ఈ నేపథ్యంలో పార్టీ వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, బలసాని కిరణ్ కుమార్, నూరి ఫాతిమా వెంగళాయపాలెంలో సింగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం, పార్టీ తరఫున సింగయ్య కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కు అందజేశారు.ఈ సందర్బంగా మాజీ మంత్రి, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘సింగయ్య వైఎస్సార్సీపీ కార్యకర్త. వైఎస్ జగన్ అభిమాని. వైఎస్ జగన్ పర్యటనలో కారు ప్రమాదం కారణంగా సింగయ్య మృతిచెందాడు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. విషయం తెలుసుకోగానే వైఎస్ జగన్.. వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును సింగయ్య భార్యకు అందించాం. సింగయ్య మృతుని కూడా కూటమి ప్రభుత్వం రాజకీయం చేయాలని చూసింది.వైఎస్ జగన్ పర్యటనలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా ఎవరూ భయపడరు. వాటిపై న్యాయపోరాటం చేస్తాం. కానీ, వైఎస్సార్సీపీ నాయకుల్ని గాని కార్యకర్తలు గాని పోలీసులు అక్రమంగా నిర్బంధిస్తే చూస్తూ ఊరుకోం. వైఎస్ జగన్ పర్యటనకు ప్రజలు రానివ్వకుండా చేయాలని ప్రభుత్వం పోలీసులు ద్వారా కుట్ర పన్నింది. ఆ కుట్రను ఛేదించుకుంటూ వేలాది మంది జనం తరలివచ్చారు.మాజీ ఎంపీ మోదుగులు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..‘సింగయ్య వైఎస్సార్సీపీకి కరుడుగట్టిన కార్యకర్త. ప్రమాదంలో ఆయన చనిపోవడం బాధాకరం. ఈ విషయం తెలుసుకోగానే వైఎస్ జగన్ మమ్మల్ని అందరినీ సింగయ్య ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి అండగా ఉండమని ఆదేశించారు. వైఎస్ జగన్ పంపిన 10 లక్షలు ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఆ కుటుంబానికి అందించాం. సింగయ్య కుటుంబానికి పార్టీ అన్నివేళలా అండగా ఉంటుంది.పత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య యాక్సిడెంట్లో చనిపోవడం బాధాకరం. ఆయన కుటుంబానికి ఎప్పుడు పార్టీ అండగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. -
టార్గెట్ వైఎస్సార్సీపీ.. అంబటి సహా పలువురిపై కేసులు
సాక్షి, పల్నాడు: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెడుతూనే ఉంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా పార్టీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.పల్నాడులో అనుమతులకు విరుద్ధంగా నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ చేశారని, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించారంటూ వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, మాజీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొర్లకుంట వెంకటేశ్వర్లు తోపాటు మరికొంతమందిపై సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూడా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా కట్టెంపూడిలో బారికేడ్లు తొలగించి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించి వారి పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ అంబటిపై కేసు ఫైల్ చేశారు. -
Sattenapalli: పోలీసులపై అంబటి విశ్వరూపం
-
రేపు రెంటపాళ్లకి వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: కూటమి ప్రభుత్వం వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడిన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల ఉపసర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని ఈనెల 18న మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించనున్నట్లు మాజీ మంత్రి, ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు వెల్లడించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెంటపాళ్లలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని కూడా వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారని తెలిపారు.వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. శాంతిభద్రతల పేరుతో పోలీసుల ద్వారా వైఎస్ జగన్ పర్యటనపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వైఎస్ జగన్ చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నా కూడా ఈ ప్రభుత్వం జీరి్ణంచుకోలేకపోతోంది.అసలు వైఎస్ జగన్ ఇంటి గడప దాటి బయట కాలు పెడితేనే చంద్రబాబు, లోకేశ్‌కి వణుకు పుడుతోంది. నిద్ర పట్టడం లేదు. పొగాకు రైతులను పరామర్శించడానికి పొదిలి వెళితే అలజడి సృష్టించడానికి కొంతమంది మహిళలను అడ్డుపెట్టుకుని రాళ్ల దాడికి దిగారు. మా కార్యకర్తలు, అమాయక రైతుల మీద టీడీపీ గూండాలతో దాడులు చేయించారు. తిరిగి మా నాయకులపైనే అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేశారు’ అని చెప్పారు. పర్యటనను అడ్డుకోవాలని చూస్తే ఊరుకోం ‘ఇటీవలే వ్యాపారి గుత్తా లక్ష్మీనారాయణ పోలీసుల వేధింపులు భరించలేక విషం తాగి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక మా నాయకులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటే వారికి భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్ వెళ్తున్నారు. ఆయన వెళ్లి పరామర్శిస్తే కూటమి దుశ్చర్యలు ప్రపంచానికి తెలిసిపోతాయనే భయంతో వైఎస్ జగన్ పర్యటనలపై ఆంక్షలు విధించి అడ్డుకోవాలని చూస్తున్నారు.ఇది అప్రజాస్వామికం. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు చంద్రబాబు, లోకేశ్ కుట్రలు పన్నుతున్నారు. పర్యటనలను అడ్డుకోవాలని చూస్తే సహించబోం. ప్రతిపక్ష నేత పర్యటనలను అడ్డుకోవడం, అలజడి సృష్టించేందుకు యతి్నంచడం కూటమి ప్రభుత్వానికే మంచిది కాదు.’’ అని అంబటి హితవు పలికారు. -
పోలీసులతో మమల్ని అణచలేరు: అంబటి రాంబాబు
గుంటూరు: వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులతో అణచలేరని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదలైన తర్వాత అంబటి రాంబాబు మాట్లాడారు. ‘సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు బెయిల్ పై విడుదల కావడం జరిగింది..సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు అనంతరం ఆయనను విడుదల చేయాలని సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశించింది..కేసు నమోదు చేసిన తుళ్లూరు పోలీసుల పట్ల సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది..ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడాన్ని కోర్టు తప్పు పట్టింది. కేవలం చంద్రబాబుకు అనుకూలంగా వార్తలు రావటం లేదు అని కొమ్మినేని శ్రీనివాసరావు పై లక్ష్యకట్టి అరెస్ట్ చేశారు..చీమకి కూడా హాని చేయకుండా కలం కోసం పని చేస్తున్న జర్నలిస్ట్‌ను జైలులో పెట్టడం దుర్మార్గం. పోలీసుల అదుపులో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు పై అరమరావతి రాజధాని ప్రాంత ప్రజల ముసుగులో టీడీపీ గుండాలు దాడికి ప్రయత్నం చేశారు..రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత కేవలం మైక్ ముందే హోం మంత్రి.. ఇకపై డిబేట్లు పెట్టే అవకాశం లేదు అంటూ హోం మంత్రి అనిత మాట్లాడడం సిగ్గుచేటు. చీకటి పడిన తరువాత కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలని చంద్రబాబు, లోకేష్ జైలు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు..పోలీసులతో మమల్ని అణచలేరు’ అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. -
జగన్ గుంటూరు పర్యటనపై నారా లోకేష్ కుట్ర..
-
అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు: చంద్రబాబు బెదిరింపు రాజకీయాలకు ఇక భయపడేదని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ పర్యటనల విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హాట్ కామెంట్స్ చేశారాయన. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి మాట్లాడుతూ..వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నెల 18వ తేదీన రెంటపాళ్ల పర్యటనకు ఆటంకాలు కలిగిస్తోంది. జనాలను పంపి హింసకు ప్రేరేపించాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారు. ఈ క్రమంలోనే.. అనుమతి పేరిట విచిత్రమైన ఆంక్షలు పెడుతున్నారు. రెంటపాళ్లలో వైఎస్సార్సీపీ నేత నాగమల్లేశ్వరరావు పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. అతని కుటుంబ సభ్యుల పరామర్శకు జగన్ వెళ్తుంటే.. ప్రభుత్వం పిచ్చి చేష్టలకు దిగుతోంది. చనిపోయిన ఓ వ్యక్తి కుటుంబాన్ని పరార్శించడానికే జగన్ వెళ్తున్నారు. తమ కార్యకర్త చనిపోతే.. పార్టీ అధినేత పరామర్శించటం తప్పా?. మేమేమీ బహిరంగ సభలకు వెళ్లటం లేదు. కానీ పోలీసుల వ్యవహారశైలి చూస్తుంటే జగన్ అసలు బయటకు రావటానికి వీల్లేదన్నట్టుగా ఉంది. పొదిలిలో కూడా రైతుల మీద అక్రమంగా కేసులు పెట్టి రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత పోలీసులదే. అంతేకానీ జగన్‌ను పర్యటించొద్దని అనడం కరెక్టు కాదు. జగన్ పర్యటనలో హింస సృష్టించేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారు. అధికారం ఉందని అతిగా ప్రవర్తించద్దని ఆ తండ్రీకొడుకులకు చెప్తున్నాం. జనాన్ని పెట్టి కోడిగుడ్లు, టమోటాలు వేయించాలనుకోవటం దారుణం. జనాన్ని అణచి వేయాలనుకుంటే కుదరదు. చంద్రబాబు హెచ్చరికలు ఏపాటివో మా చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాం. ఆయన రాజకీయాలను చూసి మేము భయపడేది లేదు’’ అని అంబటి అన్నారు. -
తండ్రి, కొడుకులని ఏకిపారేసిన అంబటి రాంబాబు
-
చంద్రబాబు, లోకేష్ చెప్పేవన్నీ అబద్ధాలే: అంబటి
సాక్షి, గుంటూరు: ఏడాది కూటమి పాలనలో సూపర్ సిక్స్‌ను అమలు చేసేశాం అంటూ నిసిగ్గుగా సీఎం చంద్రబాబు ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరులోని క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, సూపర్‌సిక్స్‌తో పాటు 143 హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేని అసమర్థ పాలన చూస్తున్నామని ఆక్షేపించారు. అయినా ఎల్లో మీడియాలో అద్భుతమని పొగిడించుకోవడం, గొప్ప పాలకుడని డప్పు కొట్టించుకోవడం చూసి ప్రజలు ఏవగించుకుంటున్నారని గుర్తు చేశారు. చివరకు తల్లికి వందనం పథకంలోనూ ఏకంగా 30 లక్షల మందిని తగ్గించారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:నిస్సిగ్గుగా ఆత్మస్తుతి:కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా చంద్రబాబు పెద్దపెద్ద ప్రకటనలు ఇచ్చారు. జాతీయ మీడియాలో సక్సెస్ స్టోరీలు రాయించారు. హైదరాబాద్ నుంచి ఎల్లో మీడియా ఛానళ్లను పిలిపించుకుని, ప్రత్యేక ఇంటార్వ్యూలు ఇచ్చి భజన చేయించుకున్నారు. ఆ మూడు ఎల్లో మీడియా సంస్థల ప్రతినిధులు చంద్రబాబే సిగ్గుపడే స్థాయిలో ఆయనను ప్రశంసించారు. అద్భుతమైన పొగడ్తలతో డప్పు కొట్టే కార్యక్రమం చేశారు. అంత నిస్సిగ్గుగా చంద్రబాబు ఆత్మస్తుతి కొనసాగింది.తల్లికి వందనంలోనూ వంచన:సూపర్‌సిక్స్‌లో తల్లికి వందనం పథకాన్ని తొలి ఏడాది ఎగ్గొట్టేశారు. ఈ ఏడాది ఇస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, తాను అధికారంలోకి వస్తే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం చొప్పున ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. మా ప్రభుత్వంలో 84 లక్షల మంది పిల్లలకు అమ్మ ఒడి ఇచ్చాం. కానీ, ఈరోజు చంద్రబాబు కేవలం 58 లక్షల మందికే ఇస్తున్నారు. అంటే 30 లక్షల మంది పిల్లలకు ఎగ్గొట్టేశారు. వైఎస్ జగన్ రూ.15 వేలు ఇస్తూ, టాయిలెట్లు, స్కూల్స్ నిర్వహణ కోసం రూ.2 వేలు మినహాయించారు. దాన్ని ఆనాడు నారా లోకేష్ పెద్ద ఎత్తున విమర్శిస్తూ రెండు వేలు లాగేశారు. రూ.13 వేలు మాత్రమే ఇచ్చారని చెప్పరాని భాషలో తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.కానీ, ఇప్పుడు కూడా అవే రూ.13 వేలు ఇచ్చారు. స్కూళ్ల కోసం, విద్యా రంగం కోసం మిగిలిన మొత్తం వ్యయం చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అంటే మేం చేస్తే తప్పు, మీరు చేస్తే మాత్రం అది ఒప్పు అవుతుందా? ఇలా ఊరసవెల్లిలా మాట్లాడటానికి నారా లోకేష్‌కు సిగ్గుందా?. తల్లికి వందనంపై ఒకవైపు తండ్రి సీఎం చంద్రబాబు మొత్తం బడ్జెట్ రూ.10,091 కోట్లు అంటుంటే, మరోవైపు ఆయన కొడుకు మంత్రి నారా లోకేష్ మాత్రం రూ.8,745 కోట్లు అని చెబుతున్నారు. మరి ఇలా ఇద్దరు వేర్వేరుగా ఎందుకు తప్పుడు లెక్కలు చెబుతున్నారో అర్థం కావడం లేదు.సూపర్ సిక్స్‌కు రూ.81 వేల కోట్లు కావాలి:సూపర్ సిక్స్‌తో పాటు 143 హామీలను ఇచ్చి, వాటిని నెరవేరుస్తామని మాట ఇచ్చి, ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. తరువాత అన్ని హామీలను గాలికి వదిలేశారు. వాటికి కావాల్సిన నిధులను కూడా కేటాయించలేకపోతున్నారు. సూపర్ సిక్స్ అమలు చేయాలంటే రూ.81 వేల కోట్లు అవసరం. వాటి అమలు లేదు. మరోవైపు ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.1,58,604 కోట్లు వివిధ సంస్థల నుంచి రికార్డు బ్రేక్ చేస్తూ అప్పులు తెచ్చారు.ఈ సొమ్ము ఏం చేశారో తెలియదు. కూటమి పాలన ఇంత దౌర్భాగ్యంగా ఉంటే, తమ పాలన అద్భుతం అని ఎల్లో మీడియాలో చెప్పుకోవడానికి సిగ్గు పడాలి. తల్లికి వందనంలో దగా, మోసం. విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అమలు చేసిన అమ్మ ఒడి లెక్కలు తనకు అర్థం కావడం లేదంటూ అమాయకంగా మాట్లాడుతున్నాడు. ఆ మాత్రం అర్థం కాని మొద్దు అబ్బాయినని లోకేష్ అంగీకరిస్తున్నారా?.నాడు పథకాలకు రూ.4.58 లక్షల కోట్లు:వైఎస్సార్సీపీ కేవలం నాలుగు పేజీల మేనిఫేస్టోను విడుదల చేసి, వాటిలో ఏడాదిలోనే 90 శాతం అమలు చేసింది. తొలి ఏడాదిలోనే 3.58 కోట్ల మంది లబ్ధిదారులకు మేలు చేసింది. రూ.40,627 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశాం. అయిదేళ్ళలో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) కింద రూ.2,73,756.17 కోట్లు లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశాం. నాన్ డీబీటీ కింద రూ.1,84,604.32 కోట్లు ప్రయోజనం చేకూర్చాం. అలా మొత్తం రూ.4,58,360.43 కోట్లతో అయిదేళ్ళలో ప్రజలకు వివిధ పథకాల కింద ప్రయోజనం కలిగించాం.మహిళలకు ఇచ్చిన హామీల అమలు ఏదీ?:ఆడబిడ్డ నిధి ప్రకారం 18 ఏళ్లు నిండిన మహిళలు రాష్ట్రంలో 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ళ వారు 1.80 కోట్ల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.1500 చొప్పున ఇవ్వాల్సి వస్తే ఏడాదికి రూ.32,400 కోట్లు అవసరం. గత ఏడాది పూర్తిగా ఈ పథకం ఎగ్గొట్టారు. ఈ ఏడాది ఇస్తారో లేదో తెలియదు. దీపం పథకం కింద 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.ఒక్కో కుటుంబానికి మూడు సిలెండర్లు ఇవ్వాలంటే ఒక్కో సిలెండర్ రూ.850 చొప్పున మొత్తం ఏడాదికి రూ.4,083.48 ఖర్చు చేయాల్సి ఉంది. కానీ చంద్రబాబు కేవలం ఒక్క సిలెండర్ మాత్రమే ఉచితంగా ఇచ్చి, దానికి చేసిన వ్యయం రూ.865 కోట్లు మాత్రమే. దీపం పథకాన్ని అమలు చేసేశామని చెప్పుకున్నారు. ఈ పథకంలో మొత్తం రూ.3218.48 కోట్లు ఎగ్గొట్టారు. ఉచిత బస్సు అన్నారు. ఈ పథకం అమలు చేస్తే ఏడాదికి రూ.3500 కోట్లు అవసరం. గత ఏడాది పూర్తిగా దీనిని ఎగ్గొట్టేశారు.హామీల అమలుకు కేటాయింపులు ఏవీ?:యాబై ఏళ్ళకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ అన్నారు. రాష్ట్రంలో ఈ కేటగిరిలో మొత్తం 20 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.4000 చొప్పున పెన్షన్ ఇవ్వాలంటే ఏడాదికి రూ.9600 కోట్లు ఇవ్వాలి. గత ఏడాది ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3000 భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. అలా ఇవ్వాల్సి వస్తే రూ.7200 కోట్లు కేటాయించాల్సి ఉంది. కానీ, ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అలాగే రైతుభరోసా కింద కేంద్రంతో సంబంధం లేకుండా ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.1,716 కోట్లు ఇవ్వాల్సి ఉంటే, దానికీ పంగనామాలు పెట్టేశారు.సాక్షి కార్యాలయాలపై దాడులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి:కొమ్మినేని శ్రీనివాసరావు వంటి సీనియర్ జర్నలిస్ట్‌ను కక్ష సాధింపుతో అరెస్ట్ చేసిన ఘటనపై సుప్రీంకోర్డు మొట్టికాయలు వేసింది. అయినా గుంటూరులో తెలుగుదేశం పార్టీ మహిళలు వైయస్ భారతమ్మ క్షమాపణలు చెప్పాలని ధర్నా చేశారు. అంతకు ముందు టీడీపీ కార్యకర్తలు పలుచోట్ల సాక్షి మీడియాపై విషం చిమ్మారు. కార్యాలయాలపై దాడులు చేశారు. తక్షణం వీటికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.సభ్యత, సంస్కారంతో వ్యవహరించాలని చంద్రబాబు, లోకేష్‌ను హెచ్చరిస్తున్నాం. ప్రశ్నించే ప్రతి ఒక్కరిని తప్పుడు కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీని భూ స్థాపితం చేయాలని చంద్రబాబు కలలు కంటున్నారు. తెలుగుదేశం తప్ప ఈ రాష్ట్రంలో మరే రాజకీయ పార్టీ ఉండకూడదని ఆయన అనుకుంటున్నారు. కానీ, అది ఏ మాత్రం సాధ్యం కాదు. నిజానికి రాబోయే రోజుల్లో చంద్రబాబు మళ్లీ రాష్ట్రం వదిలి పారిపోయే పరిస్థితి వస్తుందని అంతా అంటున్నారని అంబటి రాంబాబు చెప్పారు. -
గుంటూరు జిల్లాలో YSRCP లీగల్ సెల్ మీటింగ్
-
Ambati Rambabu: నాకు అంత దమ్మూ లేదు.. డబ్బూ లేదు...
-
‘వైఎస్సార్సీపీ లీగల్ సెల్ పనితీరు అద్భుతం’
గుంటూరు: తమ పార్టీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం అక్రమంగా బనాయిస్తున్న కేసుల విషయంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తోందని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రశంసించారు.ఈరోజు(శుక్రవారం, జూన్ 13) గుంటూరులో జిల్లా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సదస్సు నిర్వహించారు. ఇందులో అంబటి రాంబాబు, పోతిన మహేష్, మాజీ ఎంపీ మాదుగుల వేణుగోపాల్‌రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, సుదర్శన్‌రెడ్డిలతో పాటు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు పాల్గొన్నారు. వీరితో పాటు ఏడు నియోజకవర్గాల నుంచి న్యాయవాదులు భారీ స్థాయిలో తరలివచ్చారు. దీనిలోభాగంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు నాయకులు పై తప్పుడు కేసులో బనాయిస్తోంది. ఒక్కొక్కరి పైన 10 కేసులు తక్కువ పెట్టడం లేదు. పార్టీ నాయకుల్ని కార్యకర్తలని వేధించాలన్న లక్ష్యంతోనే అక్రమ కేసులతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్రభుత్వం బనాయించే అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అద్భుతంగా న్యాయపోరాటం చేస్తుంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, నాయకులకు లీగల్ సెల్ అండగా ఉండి మేమున్నాము అనే భరోసా కల్పిస్తోంది. గుంటూరు జిల్లా లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తుంది వారికి అభినందనలు’ అని పేర్కొన్నారు.రాష్ట్రంలో హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది.. రాష్ట్రంలోని ప్రజల హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఆస్తులు ధ్వంసం చేశారు. ప్రభుత్వం పథకం ప్రకారమే అక్రమ కేసులు బనాయిస్తోంది. ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధుల న్యాయపోరాటం అద్భుతం’ అని కొనియాడారు.ఇవి పథకం ప్రకారం చేసే దాడులుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక పథకం ప్రకారం.. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేస్తోంది. యాక్టివ్‌గా ఉన్న కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తోంది. సోషల్ మీడియా వారి పైన కూడా ఒక్కొక్కరిపై 10కి తగ్గకుండా కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పారు. ప్రభుత్వమే వ్యవస్థీకృత నేరానికి పాల్పడుతోంది. ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ లీగల్ సెల్ వైఎస్ జగన్ ఆదేశాలతో న్యాయపోరాటం చేస్తుంది. పార్లీ నాయకుల్ని, కార్యకర్తల్ని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కాపాడుకుంటుంది. పార్టీకి కష్టకాలంలో పనిచేసిన వారందరినీ పార్టీ కచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది’ అని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే అరాచకం మొదలుపెట్టారుకూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అరాచకం మొదలుపెట్టిందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు సుదర్శన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేశారు. చాలామంది కార్యకర్తలు ఊర్లు వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడప్పుడు వాళ్లు తిరిగి ఫంక్షన్లకు వచ్చిన వాళ్లపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారు. లీగల్ సెల్ .. పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటుంది.. రక్షిస్తుంది. కూటమి నేతలు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయట్లేదు అని ప్రశ్నించినందుకు సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు నమోదు చేశారు. ఒక్కొక్కరిపై 15 నుంచి 20 కేసులు నమోదు చేసి రాష్ట్రమంతా తిప్పారు. కష్ట కాలంలో పనిచేసిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుంది’ అని ఆయన తెలిపారు. -
కొమ్మినేనిపై సుప్రీం తీర్పు.. అంబటి రియాక్షన్
-
Ambati: పోలీసుల వేధింపులు తట్టుకోలేక లక్ష్మీనారాయణ ఆత్మహత్యాయత్నం చేశారు
-
లోకేష్ పర్యవేక్షణలోనే పొదిలి ఘటన: అంబటి
సాక్షి, గుంటూరు: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొదిలి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్తతలపై వైఎస్సార్సీపీ స్పందించింది. ఇదంతా ఆర్గనైజ్డ్గా వ్యవహారమని, మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..జగన్ పొదిలి వెళ్లింది పొగాకు రైతులకు మద్దతు తెలిపేందుకు. గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడిపోతున్నారు. జగన్ రాక నేపథ్యంలో జనం భారీగా తరలి వచ్చారు. నలుగురైదుగురు మహిళలను పెట్టి నిరసన చేయించింది టీడీపీ నాయకులే. తెనాలి పర్యటన సమయంలోనూ ఇలాగే చేశారు. జగన్ పర్యటనల్లో నిరసనలు జరిగేలా మంత్రి నారా లోకేష్ చేస్తున్నారు. పొదిలి వ్యవహారాన్ని లోకేష్ దగ్గరుండి పర్యవేక్షించారు. నల్లబెలూన్లు ఎగరేయడం, చెప్పులు విసిరించడం ఆర్గనైజ్డ్ కాదా? జగన్ పర్యటనలు చేయకూడదా?. మీరు అధికారంలో శాశ్వతంగా ఉంటారా? అని అంబటి ప్రశ్నించారు. .. పోలీస్ వ్యవస్థ టీడీపీ నాయకులకు అండగా ఉంది. వైఎస్సార్సీపీ నేతలపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తోంది. ఇదంతా లోకేష్ ఆధ్వర్యంలోనే నడుస్తోంది ఆ వేధింపులు, బెదిరింపులు భరించలేక కొందరు బలవన్మరణానికి ప్రయత్నిస్తున్నారు. రాజుపాలెం మండలం పెదనెమలిపురికి చెందిన లక్ష్మీనారాయణ వైఎస్సార్సీపీ కార్యకర్త. ఆయన్ని గత కొన్ని రోజులుగా సివిల్ మ్యాటర్లో పోలీసులు వేధిస్తున్నారు. లక్ష్మీ నారాయణను సత్తెనపల్లి డీఎస్పీ బూతులు తిట్టారు. ఆ వేధింపులు భరించలేకనే ఆయన సెల్ఫీ వీడియో తీసి సూసైడ్‌కు ప్రయత్నించారు. ఆ వేధింపులు ఏస్థాయిలో ఉన్నాయో ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది.... ప్రస్తుతం లక్ష్మీ నారాయణ గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ రేపు(గురువారం, జూన్ 12) వస్తున్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంపై జనం తిరగబడతారు. తూటాలు ఉపయోగించే పరిస్థితి కూడా రావొచ్చు’’ అని అంబటి జోస్యం పలికారు. -
కిర్రాక్ ఆర్పీ, సీమ రాజాపై ఫిర్యాదు చేస్తే చర్యలు ఉండవు: అంబటి
-
కొమ్మినేని అరెస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం: అంబటి రాంబాబు
-
‘కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష గట్టారు.. సాక్షి ఆఫీస్‌పై ఉన్మాదపు చర్య’
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని.. కూటమి ప్రభుత్వం దానిని అసలే పట్టించుకోదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యత కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ నేపథ్యంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల్లో కొత్త సంప్రదాయానికి తెర లేపింది. కిర్రాక్ ఆర్పీ, సీమ రాజాలాంటిళ్లు దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్లపై ఫిర్యాదులు చేసినా చర్యలు ఉండవు. ఎల్లో చానెల్స్ దారుణంగా మాట్లాడుతున్నాయి. అయినా పట్టించుకోరు. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని అరెస్ట్ అప్రజాస్వామికం. చంద్రబాబు ఆయనపై కక్ష గట్టారు. కొమ్మినేనిని దారుణంగా తిడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. పోగేసుకొచ్చిన జనాలతో సాక్షి ఆఫీస్ మీద జరిపారు. మరి దీనిని ఏమనాలి?. ఇది ఉన్మాదపు చర్య కాదా?.. అని అంబటి ప్రశ్నించారు.కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్(Kommineni Srinivasa Rao Arrest) అక్రమం. డైవర్షన్ పాలిటిక్స్‌కు ఇదొక ఉదాహరణ. అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. లేని అంశాన్ని ఉన్నట్లుగా చూపేందుకు చంద్రబాబు,ఆయన అనుకూల మీడియా ప్రయత్నం చేస్తోంది. కొమ్మినేని శ్రీనివాసరావు ఎంతో సీనియర్ జర్నలిస్ట్. చంద్రబాబు తప్పుల్ని ఖండించే ప్రయత్నం చేసినందుకు ఎన్టీవీ పై ఒత్తిడి తెచ్చి కొమ్మినేని లైవ్ షో ఆపేశారు. కొమ్మినేనిని తీసేస్తేనే ఛానల్ ప్రసారాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఎన్టీవీలో తీసేస్తేనే కొమ్మినేని సాక్షిలో చేరారు. తన డిబేట్లలో కొమ్మినేని నిక్కచ్చిగా మాట్లాడతారు. మా సామాజికవర్గమై మమ్మల్నే విమర్శిస్తావా అని కొమ్మినేని పై చంద్రబాబు కక్ష కట్టాడు. టివి5,ఏబీఎన్ లో జరిగే డిబేట్లకు ఆ ఛానల్ యాజమాన్యాలు బాధ్యత వహిస్తాయా?. తోటి జర్నలిస్ట్ ఒకడు ‘ఒరేయ్’ అని సంభోదిస్తాడు. ఏ కుక్క బిస్కెట్లు తిని మాట్లాడుతున్నారు టీవీ5,ఏబీఎన్‌లో?. కృష్ణంరాజు వ్యక్తం చేసిన అభిప్రాయం తప్పు కావొచ్చు. దానికి ఛానల్‌కి, కొమ్మినేనికి ఏం సంబంధం?. చంద్రబాబు దేశంలోని అన్ని మీడియాలను మభ్యపెట్టినా... సాక్షిని మభ్యపెట్టలేకపోయాడు. అందుకే సాక్షి పై కక్ష కట్టి బురద జల్లుతున్నాడు. చంద్రబాబు ప్రేమ అమరావతి రైతుల మీద కాదు...అమరావతిలో తాను దోచుకునే భూముల మీద. జగన్ మోహన్ రెడ్డి, భారతిపై చాలా దారుణంగా పోస్టులు పెట్టిన వాళ్ల పై చర్యలు లేవు. నేనే స్వయంగా కిరాక్ ఆర్పీ,సీమ రాజా మీద ఫిర్యాదు చేశా.. కనీసం పట్టించుకోలేదు. కానీ కొమ్మినేని వంటి వారిని మాత్రం హైదరాబాద్ వెళ్లి అరెస్ట్ చేశారు. ఇదెక్కడి ధర్మం?. బెయిల్ రాకుండా చేసేందుకే కొమ్మినేని పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. సాక్షి ఛానల్‌ను ఆపాలని చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి కుట్రలు పన్నారు. కేసులుపెట్టి ఛానల్ ను ఆపాలని ప్రయత్నించారు...కానీ తట్టుకుని సాక్షి నిలబడింది. టీవీ ఛానల్స్ లో కొన్ని వందల డిబేట్లు నడుస్తాయి...దానికి ఆ ఛానల్ ను బాధ్యుల్ని చేస్తారా?. సాక్షి కార్యాలయాల పై దాడులు చేస్తారా. ఒక పథకం ప్రకారం మొదట టీడీపీ, తర్వాత లోకేష్, ఆ తర్వాత చంద్రబాబు, ఆ వెంటనే పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తారు. నేనూ అనేక డిబేట్లలో పాల్గొన్నా. డిబేట్లకు వచ్చిన వ్యక్తులు మాట్లాడితే ఆ ఛానల్స్ కు ఆపాదిస్తారా?. రాష్ట్రంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయ్. కానీ కొమ్మినేని అరెస్ట్ ఒక్కటే తమకు ముఖ్యమైన పనిలాగా చంద్రబాబు పనిచేస్తున్నారు. చంద్రబాబు చాలా దారుణమైన కార్యక్రమానికి పూనుకున్నారు.బాధ్యత కలిగిన టీడీపీ నాయకులు కూడా సాక్షి కార్యాలయం పైకి దాడులకు వెళతారు. సాక్షి కార్యాలయాలపై దాడులకు జనాన్ని పోగేసుకొచ్చారు. సందుదొరికింది కదా అని సాక్షి పైనో మరో కార్యాలయం పైనో దాడులు చేయడం కరెక్టేనా?. ఇలాగైతే సమాజం ఎటుపోతుంది. మాకూ వ్యతిరేకంగా ఉన్న మీడియాలకు కార్యాలయాలున్నాయ్ కదా!. అక్రమ కేసులుపెట్టి అరెస్ట్ చేస్తారు, జైల్లో వేస్తారు అంతకంటే ఏం చేయగలరు?. ఇప్పటికే చాలామందిని జైల్లో పెట్టారు కదా. పరిపాలన చేతకాని వారే ఇలా అరెస్టులతో కాలక్షేపం చేస్తారు. అరెస్టుల పైన పెట్టిన శ్రద్ధ ప్రజల సమస్యల పై పెడితే బాగుంటుంది అని అంబటి రాంబాబు చంద్రబాబుకి హితవు పలికారు. -
ఈ పతనం ఏ లోతుల్లోకి?
కమ్మ కులంలో పుట్టిన వ్యక్తి వైసీపీలో ఎలా ఉంటాడు? ఇది చట్ట విరుద్ధమైన చర్యగా కనిపించింది ఒక డీఎస్పీకి. ఇటువంటి సంఘ విద్రోహ చర్యలను అస్సలు క్షమించలేని సదరు డీఎస్పీ అటువంటి ఒక వ్యక్తికి తనదైన ట్రీట్మెంట్ ఇప్పించారు. పల్నాడు జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ అనే ఆ వ్యక్తి పోలీసు వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు.గుంటూరులో పని చేసే ఒక పోలీసు ఇన్స్పెక్టర్కు ప్రతిపక్ష రాజకీయ నేతల ముఖాల్లో శత్రుదేశం సైనికులు కనిపిస్తారట! ఆ నేత ఏ స్థాయి వాడైనా సరే! మొన్న ఏదో నిరసన కార్యక్రమంలో వైసీపీ నేత అంబటి రాంబాబు ఆ ఇన్స్పెక్టర్కు ఎదురుపడ్డారు. శత్రు సైనికుడిని చూసిన ఆగ్రహం ఆ పోలీసును ఆవహిం చింది. తక్షణమే పళ్ళు పటపట కొరుకుతూ, గుడ్లను గుర్రున ఉరుముతూ రాంబాబుపై ఆ పోలీసాయన లంఘిస్తున్న విజు వల్స్ టీవీల్లో కనిపించాయి.తెనాలి ఘటన తెలిసిందే! ఓ మఫ్టీ కానిస్టేబుల్‌కూ, ముగ్గురు యువకులకూ ఏదో ఒక చిన్న వివాదం జరిగింది. ఈ మఫ్టీ కానిస్టేబుల్ మీద ఆ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ జవాన్లందరికీ ప్రత్యేకమైన అభిమానం ఉంటుందట! ఈ మఫ్టీ బ్యాచ్ సివిల్ డ్రెస్‌లో ఉంటూనే, లా అండ్ ఆర్డర్‌ను చక్కబరుస్తూ, పోలీసు సహచరులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుంటారట! అటువంటి మఫ్టీ కానిస్టేబుల్‌ను అనామక యువకులు ప్రశ్నించ డమేమిటి? అందులో దళితులు! ఆ యువకులు కట్టు తప్పారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వాళ్లకు బుద్ధి చెప్పాలని నిర్ణయానికి వచ్చారు. భారత న్యాయ సంహితలోని తమకు తోచిన సెక్షన్లన్నింటితో కేసులు పెట్టారు. నడిరోడ్డు మీద వారిని పడుకోబెట్టి అరికాళ్ళపై బెత్తాలతో చావబాది ఆటవిక న్యాయాన్ని అమలు చేసిన తీరు నాగరిక సమాజాన్ని నివ్వెర పరిచింది.కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని ప్రైవేటు సైన్యంగా మార్చేసిన ఫలితం ఇది. స్వామికార్యంతో పాటు స్వకార్యం చక్కబెట్టుకోవచ్చు అనుకునే కొందరు పోలీసులకు ఈ విధానం బాగా నచ్చినట్టుంది. పొలిటికల్ బాసులను సంతృప్తి పరుస్తూనే సొంత పనులు చేసుకుంటున్నారు. పొలిటికల్ బాసులు ఏం చేసినా, ఏం చెప్పినా చిత్తం అనే స్థాయికి కొందరు దిగజారిపోయారు. అనంతపురం జిల్లాలో ఒక దళిత బాలికను బెదిరిస్తూ 14 మంది పాలక పార్టీ అనుయాయులు ఆరు మాసా లుగా అత్యాచారం చేస్తున్న పైశాచిక ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సాక్షి మీడియా ద్వారా ఈ దారుణం వెలుగు చూసేంత వరకు పోలీసులు కళ్ళు మూసుకుని కూర్చో వడం క్షమించరాని నేరం. ఇప్పుడు కూడా కేసును పలుచన చేసేటందుకు పొలిటికల్ బాసులు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ఈ కేసు పోలీసు యంత్రాంగానికి ఒక శీలపరీక్ష లాంటిదే! వైఎస్సార్ జిల్లాకు చెందిన ఓ మంత్రి సతీమణి పోలీసులను అడిగి మరి సెల్యూట్ కొట్టించుకుంటున్నదనే వార్తలు కూడా విన్నాము. పోలీసు యంత్రాంగం పట్ల కూటమి నేతల ప్రవర్తన అది.ఏడాది కూటమి పాలనలోని అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో! గల్లీగల్లీలో గంజాయి, చీప్ లిక్కర్ల కంపుతో అవినీతి పోటీపడుతున్నది. కడప జిల్లా టీడీపీ నాయకుడు ఒకరు బహిరంగ సమావేశంలో మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ఛోటామోటా అధికార పదవుల్లో ఉన్నవాళ్లు తమ ఖాళీ లెటర్ హెడ్‌పై సంతకం చేసి ఇచ్చినందుకు పాతిక, ముప్పై వేల నుంచి ఐదు లక్షల వరకు వసూలు చేస్తున్నారని ఆ నాయకుడు ఆరోపించారు. చిన్నచిన్న రికమండేషన్లకు కూడా వెలకట్టి వసూలు చేస్తున్న సంస్కృతిని రాష్ట్రమంతటా ప్రవేశ పెట్టారట! ఆ మధ్య ఓ యెల్లో పత్రికలోనే ఇటువంటి వార్త ఒకటి వచ్చింది. గోదావరి జిల్లాలోని ఒక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మార్వోకు తన లెటర్ హెడ్ పుస్తకాన్ని ఇచ్చి, దీని ద్వారా తిరుపతి దర్శనం రికమండేషన్లు అమ్మి తనకు నెలకో లక్ష రూపాయలు జమ కట్టాలని ఆర్డర్ వేశారని ఆ పత్రిక రాసింది. ప్రజా ప్రతినిధులు తమ ప్రాంతంలోని రెవెన్యూ, పోలీసు అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ నెల మామూళ్లు వసూలు చేసి ఇవ్వాలని వేధిస్తున్న ఒక విచిత్ర పరిణామం ఈ ఏడాదిలో ఏపీ అంతటా వ్యాపించింది. ప్రజలకు సేవకులుగా ఉండాల్సిన ప్రతినిధులు ప్రతి చిన్న పనికీ, ప్రతి చిన్న రికమండేషన్కూ కూడా వెలకట్టి వసూలు చేస్తున్న ప్రజాస్వామ్యం రాష్ట్రంలో అమలవుతున్నది.నాయకుని స్థాయిని బట్టి అవినీతిస్థాయి కూడా పెరుగు తుంది. ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ ఎక్కడ చూసినా కనిపిస్తున్నది. మద్యం మామూళ్లు ప్రజాప్రతినిధులకు హక్కు భుక్తంగా మారాయి. ఇవి చాలదన్నట్టు దర్జాగా భూకబ్జాలు అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్నాయి. విజయవాడ నగరం నడిబొడ్డున అర్ధ శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన శాతవాహన కాలేజీ స్థలం ఆక్రమణ కోసం జరుగుతున్న రౌడీయిజం తాజా ఉదాహరణ. సాక్షాత్తూ పాలక పార్టీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తనను కిడ్నాప్ చేశారని కళాశాల ప్రిన్సిపాల్ ఆరోపించారు. అయినా చట్టం స్పందించలేదు. అర్ధరాత్రి పూట బందిపోటు దొంగల మాదిరిగా కళాశాల షెడ్లను కూల్చివేశారు. లాఠీలు కదల్లేదు. ప్రతిపక్ష కార్యకర్తల మీద, సామాన్య ప్రజల మీద జులుం చూపిస్తున్న పోలీసు యంత్రాంగం, అధికార పార్టీ పెద్దలు బడిని మింగినా, గుడిని మింగినా చోద్యం చూడటానికే పరిమితమైపోతున్నారు. పోలీసు యంత్రాంగాన్ని ప్రైవేట్ సైన్యంగా దిగజార్చిన పర్యవసానం కనిపిస్తున్నది.ఇక అత్యున్నత స్థాయి ప్రభుత్వ పెద్దల అవినీతి వేలు లక్షల ఎకరాలు, వందల వేల కోట్ల టెండర్ల కొలమానంలో వెలిగి పోతున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమరావతి పేరుతో చేస్తున్న ఆర్భాటపు ప్రణాళికల వెనుక అంతులేని అవినీతి వ్యూహం తప్ప, వాస్తవికత ఇసుమంత కూడా లేదని వారు బల్లగుద్ది చెబుతున్నారు. రాజధాని కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న 55 వేల ఎకరాలకు తోడు మరో 45 వేల ఎకరాలను సేకరించాలన్న ప్రతిపాదనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులో ఐదు వేల ఎకరాలు సరికొత్తగా నిర్మించబోయే అంతర్జాతీయ విమానాశ్రయానికి కావాలట! ఇప్పుడు అందుబాటులో ఉన్న గన్నవరం విమానా శ్రయం సంగతి ఏమిటి? గన్నవరంలో 2024–25 సంవత్సరంలో 9,279 విమానాలు ల్యాండ్ అయ్యాయని రికార్డులు చెబుతున్నాయి. దాని వైశాల్యం 1,265 ఎకరాలు, కోల్‌కతా విమానాశ్రయం వైశాల్యం సుమారు 1,600 ఎకరాలు. ఇదే కాలంలో అక్కడ ల్యాండ్ అయిన విమానాల సంఖ్య ఒక లక్షా నలభై ఆరు వేల పైచిలుకు. గన్నవరం విమానాశ్రయం కోసం తలపెట్టిన అదనపు భూసేకరణను కూడా దృష్టిలో పెట్టుకుంటే ఎయిర్ ట్రాఫిక్ ఇరవై రెట్లు పెరిగినా గన్నవరం ఎయిర్పోర్ట్ నిక్షేపంగా సరిపోతుంది. అమరావతిలో ఇప్పటికే టెండర్లు పిలిచిన పరిపాలనా భవనాల ఆర్భాటపు అంచనాలు కూడా ఈ కోవలోనివే!ఎన్ని పాలనా భవనాలను నిర్మించినా, ఎన్ని సంస్థలను రప్పించినా అక్కడ నివసించవలసిన జనాభా ఏ విధంగా పెరుగుతుంది? ఎన్ని లక్షల మందికి ఉపాధిని, వసతిని అందు బాటులోకి తేగలరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని భవనాలను నిర్మించగానే జనం బిలబిలమంటూ వచ్చి నిండి పోరు కదా! ఇటువంటి ఆర్భాటాలతోనే అంచనా లేకుండా నిర్మించిన కొన్ని చైనా నగరాలు ఘోస్ట్ సిటీలుగా మిగిలిపోయిన ఉదంతాలను పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. వేలకోట్ల రూపా యల అప్పు తెచ్చి ఖర్చు చేస్తున్న అమరావతి మరో ఘోస్ట్ సిటీగా మిగిలిపోతే పెద్దలకు గిట్టుబాటు కావచ్చునేమో గాని కొన్ని తరాల వరకు ఆంధ్ర ప్రజలు దానికి మూల్యం చెల్లించ వలసి ఉంటుంది. వడ్డే శోభనాద్రీశ్వర రావు వంటి తొలితరం తెలుగుదేశం నాయకులు కూడా అమరావతి ఊహల పందిరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.విచ్చలవిడి అవినీతి, వ్యవస్థల విధ్వంసం, అమరావతి పేరుతో జరుగుతున్న ప్రమాదకర క్రీడలు ఒకపక్క సామాన్య ప్రజలను గడ్డిపోచల కింద జమ కట్టే పెత్తందారీ పోకడ మరోపక్క... ఈ పాలనా రథానికి మోహరించి దౌడు తీస్తున్నాయి. భారత రాజ్యాంగం ఈ దేశంలో పుట్టి పెరిగే పౌరులందరినీ జాతి సంపదకు సమాన వాటాదారులుగా పరిగ ణిస్తున్నది. కానీ ఆంధ్రప్రదేశ్ పాలకులు మాత్రం సామాన్య ప్రజలను బిచ్చగాళ్ళుగా భావిస్తున్నారు. విద్యా, వైద్య రంగాల్లో గత ప్రభుత్వం వారికి నాణ్యమైన అవకాశాలను ఉచితంగా కలుగజేస్తే, ప్రస్తుత ప్రభుత్వం వాటిని తొలగించింది. ‘ఫ్యామిలీ డాక్టర్’ వంటి వ్యవస్థలను ఎత్తేసింది. ప్రభుత్వ రంగంలో నిర్మించిన వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రు లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నది. పేద కుటుంబాల విద్యార్థులకు జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఆధు నిక బోధన పద్ధతులను రద్దు చేసింది.ఇప్పుడు తాజాగా కార్మికులు, కర్షకులు పనిచేయవలసిన సమయాన్ని ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలకు పెంచుతూ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసింది. 8 గంటల పని కోసం జరిగిన దశాబ్దాల పోరాటాలనూ, షికాగో వీధుల్లో చిందిన కార్మిక రుధిరాన్నీ అవహేళన చేసింది.ఇంత తక్కువ కాలంలో, ఇన్ని రకాలుగా పతనమవుతున్న ప్రభుత్వానికి ప్రజాదరణ తగ్గిపోవడంలో ఆశ్చర్యమేమున్నది! కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తవుతున్న వేళ కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు సర్వేలు చేస్తున్నాయట! ఈ సర్వేలన్నింటి సారాంశం ఈ ప్రభుత్వానికి ప్రజాదరణ తగ్గిందనే! ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 11 మంది మంత్రులు సహా 78 మంది కూటమి ఎమ్మెల్యేలు ఓడిపోతారని సగటు అంచనా వేశారు. వాస్తవ పరిస్థితి మాత్రం ఇంకా తీవ్రంగా ఉన్నది. ఇప్పటికే ప్రభుత్వ ప్రతిష్ఠ పాతాళానికి పడిపోయింది. దిగజార డానికి ఇంతకంటే లోతుల్లేకపోవచ్చు. కంటి తుడుపు కోసం ప్రభుత్వం కూడా ఐ.వి.ఆర్.ఎస్. ద్వారా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటున్నదట! నూటికి నూరు శాతం మంది ప్రభు త్వాన్ని భేష్ అంటున్నారని ఆ సర్వే వివరాలను ప్రభుత్వం కూడా ప్రకటించుకోవచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
‘48 గంటల తర్వాత కానీ పరిస్థితి చెప్పలేమన్నారు’
గుంటూరు: సత్తెనపల్లి పోలీసులు వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గుంటూరు రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి పరామర్శించారు. ఈ క్రమంలోనే లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు అడిగి తెలుసుకున్నాం. 48 గంటలు అబ్జర్వేషన్లో ఉంటే గాని పరిస్థితి ఏంటో చెప్పలేము అని డాక్టర్లు చెబుతున్నారు. లక్ష్మీనారాయణ పెద్ద నెమలిపురిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. పోలీసులు తనను ఎలా వేధించారో లక్ష్మీనారాయణ సెల్ఫీ వీడియో ద్వారా సూసైడ్ నోట్లో వివరంగా చెప్పాడు. ఒక సివిల్ మ్యాటర్ లో పోలీసులు జోకింగ్ చేసుకుని లక్ష్మీనారాయణ వేధించడం మంచి పద్ధతి కాదు. దీనికి కారకులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం’ అని అంబటి పేర్కొన్నారు.కాగా, పల్నాడు జిల్లాలో టీడీపీ నాయకులు, పోలీసుల వేధింపులు భరించలేక లక్ష్మీ నారాయణ అనే వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష్మీనారాయణకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.ఆత్మహత్యాయత్నం చమయంలో సెల్పీ వీడియో రిలీజ్ చేశాడు లక్ష్మీనారాయణ,. ఆ వీడియోలో టీడీపీ ప్రభుత్వం, పోలీసుల అరాచకాలపై మండిపడ్డారు. ఈ పోలీసుల అరాచకాలకు చెక్ పెట్టాలి. వైఎస్సార్సీపీ అంటేనే ప్రభుత్వం పెద్దల అండతో పోలీసులు టార్చర్ పెడుతున్నారు. నాలాగా మరొకరు బలి కాకూడదు’ అని పేర్కొని ఆత్మహత్యాయత్నం చేశాడు. -
Ambati Rambabu: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది
-
పోలీసుల ప్రవర్తనపై అంబటి రియాక్షన్..
-
Ambati: ఈనాడు CI కి సపోర్ట్, CI కి లోకేష్ సపోర్ట్
-
‘లోకేష్ బంధువని సీఐ పొగరు, తలబిరుసుతో మాట్లాడారు’
తాడేపల్లి: వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనం నుంచి అద్భుతమైన స్పందన లభించిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించినా, దాన్ని అధిగమించి ప్రజలు సక్సెస్ చేశారనే విషయం కూటమి ప్రభుత్వం గ్రహించాలన్నారు. ఈరోజు(గురువారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. ఇప్పటికైనా చంద్రబాబు పాలన గురించి ఆలోచించాలని హితవు పలికారు. ‘ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మోసపూరితంగా ఉందని వైసీపీ వెన్నుపోటు దినం నిర్వహించాం.వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనంనుంచి అద్బుతమైన స్పందన లభించింది.వెన్నుపోటు దినం కార్యక్రమం అడ్డుకునేందుకు పోలీసులతో ప్రయత్నించారు.ఏడాదిగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై వందలాది తప్పుడు కేసులుపెట్టి వేధించారు.సోషల్ మీడియా యాక్టివిస్టులను జైళ్లకు పంపించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పండగలా నిర్వహించాలని పిలుపునిస్తే పెద్దగా స్పందన రాలేదు.ఇప్పటికైనా కూటమి నేతలు బుద్ది తెచ్చుకోవాలి. దోచుకునే బ్యాచ్‌కే పండుగ. చంద్రబాబు ఇప్పుడైనా తన పాలన గురించి ఆలోచించాలి .రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండో ఏడాది పూర్తైన సమయంలో వెన్నుపోటు-2 సమయానికి జనం తిరగబడొచ్చు.వెన్నుపోటు దినం కార్యక్రమానికి వెళ్తున్న నన్ను పట్టాభిపురం సీఐ అడ్డుకున్నారు. సీఐకి మంత్రి లోకేష్ సపోర్ట్. బెదిరించి, భయపెట్టాలని చూశారు. అనివార్య పరిస్థితుల్లో ఎదురుతిరగాల్సి వచ్చింది. నేను చేసిన రెండు ఫిర్యాదుల గురించి అడిగితే సీఐ దురుసుగా మాట్లాడారు. లోకేష్ బంధువని సీఐ పొగరు, తలబిరుసుతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నాపై కేసు నమోదు చేశారు’ అని అంబటి స్పష్టం చేశారు. -
బాబు,పవన్ పై నిప్పులుచెరిగిన అంబటి
-
మాజీ మంత్రి అంబటిపై కేసు
-
పోలీసు జులుం.. మాజీ మంత్రి అంబటిపై కేసు
లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్): మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా అంబటి రాంబాబు సిద్ధార్థ్‌నగర్‌లోని తన నివాసం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీగా కలెక్టరేట్‌కు బయల్దేరగా పోలీసులు అడుగడుగునా అడ్డుకోబోయారు. ర్యాలీ స్థంబాలగరువు, పట్టాభిపురం మీదుగా మూసేసిన జూట్ మిల్లు వద్దనున్న సబ్ స్టేషన్‌కు చేరుకోగా.. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ, సిబ్బంది అడ్డుకునే యత్నం చేశారు. దీంతో అంబటి రాంబాబు స్పందించారు.ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెళ్తుంటే అడ్డుకోవడం సరికాదని చెప్పారు. అంతమాత్రానికే సీఐ వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబుతో దురుసుగా ప్రవర్తించారు. ర్యాలీగా వెళ్లడానికి వీల్లేదని, ర్యాలీగా నువ్ ఎలా వెళ్తావో చూస్తా అంటూ మీదమీదకు వెళ్లి గట్టిగా మాట్లాడడం ప్రారంభించారు. ‘మర్యాదగా మాట్లాడు’ అని అంబటి సూచించగా.. ‘నువ్వు పళ్లు కొరుకుతున్నావ్’ అంటూ అంబటికి వేలు చూపించారు. ఏకవచనంతో వాగ్వాదానికి దిగారు. దీంతో సిబ్బంది కలుగజేసుకుని అంబటి, సీఐకి సర్దిచెప్పి పంపించారు. అనంతరం రాంబాబు పార్టీ నాయకులతో కలిసి కంకరగుంట ఓవర్ బ్రిడ్జి మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుని వినతిపత్రం అందజేశారు. కాగా, మాజీ మంత్రి అంబటి పట్ల సీఐ వ్యవహరించిన తీరు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో స్పష్టంగా కనిపించింది. ఎల్లో మీడియాలో మాత్రం కలెక్టరేట్‌లోకి అనుమతించలేదని సీఐతో అంబటి దురుసుగా ప్రవర్తించారంటూ దుష్ప్రచారం చేశారు. ఘటన జరిగింది జూట్ మిల్లు వద్ద అయితే కలెక్టరేట్ ముందు అని బురదజల్లాలని చూశారు. చివరకు పోలీసు విధులకు ఆటంకం కలిగించారని, అనుమతి లేకుండా ర్యాలీ తీశారంటూ పలు సెక్షన్లతో అంబటిపై కేసు నమోదు చేయడం గమనార్హం. నిబంధనలను అతిక్రమించిన పోలీస్ అధికారిని వదిలేసి అంబటిపై కేసు పెట్టడాన్ని విశ్లేషకులు తప్పుపడుతున్నారు. -
గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబును అడ్డుకున్న పోలీసులు
-
Ambati: ఏడాదైనా ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలు చేయని చంద్రబాబు
-
దమ్ముంటే ఆపు .. అంబటి VS పోలీసులు
-
అంబటి రాంబాబుపై సీఐ జులుం
సాక్షి,గుంటూరు: వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు ఓవరాక్షన్ చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దగ్గర నుంచి కలెక్టరేట్‌కు వెళ్తుండగా టీజేపీఎస్ కాలేజీ వద్ద అంబటి రాంబాబును పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు. అయితే,తాము నిరసన కార్యక్రమానికి అనుమతి తిసుకున్నా ఎందుకు అడ్డుకున్నారని సీఐని అంబటి రాంబాబు ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన సీఐ.. అడ్డుకుంటాం అంటూ అంబటిపై దౌర్జన్యానికి దిగారు. అంబటి రాంబాబుకు వేలు చూపిస్తూ దురుసుగా ప్రవర్తించారు. అంబటి రాంబాబుని ఏంటి పళ్ళు కోరుకుతున్నావ్ అంటూ అంబటి రాంబాబుకు మీదకు వెళ్లారు. ప్రస్తుతం సీఐ వెంకటేశ్వర్లు దురుసు ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అయ్యా నారా వినపడుతుందా.. ఏకిపారేసిన అంబటి..
-
కాపు సామాజికవర్గంపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష ..?
-
కాపులపై చంద్రబాబుకు ఎందుకంత కోపం?: అంబటి
సాక్షి, తాడేపల్లి: కాపులపై చంద్రబాబుకు ఎందుకంత కోపం? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కోర్టు కొట్టేసిన కేసును మళ్లీ తిరగతోడితే కాపు సమాజం తరపున ఒక కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. కాపులను బీసీల్లోకి చేర్చుతానని 2014 ఎన్నికలకి ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేశారు. ఆయన పిలుపుతో అన్ని రాజకీయ పార్టీల్లోని కాపులు మద్దతు తెలిపారని అంబటి రాంబాబు వివరించారు.‘‘తుని సభ సమయంలో రైలు తగులపడితే కాపులే నిప్పు పెట్టారని కేసులు పెట్టారు. ముద్రగడ కుటుంబ సభ్యులు మీద దాడి చేసి, ఆయన్ని నిర్బంధించారు. అప్పుడు నేను, దాసరి నారాయణరావు, చిరంజీవి, రామచంద్రయ్య తదితరులంతా హైదరాబాదులో సమావేశం అయ్యాం. ముద్రగడ పద్మనాభం ఒంటిరి కాదు. ఆయన వెనుక మా కాపుజాతి అంతా ఉంది. కాపు ఉద్యమ కారుల మీద పెట్టిన కేసులను జగన్ తొలగించారు. కోర్టు సైతం కేసులను కొట్టేసింది. అలాంటి కేసులను తిరగదోడటం వెనుక చంద్రబాబుకు దురుద్దేశం ఉంది’’ అని అంబటి రాంబాబు మండిపడ్డారు.‘‘దీనిపై మేమంతా సమావేశం నిర్వహించి ఒక కార్యాచరణను రూపొందిస్తాం. చంద్రబాబు, హోంమంత్రికి తెలియకుండా జీవో వచ్చిందా?. అలా వచ్చి ఉంటే వారంత అసమర్థులు మరెవరు ఉండరు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు మోసం చేశారు. తనది డేగ కన్ను అని చెప్పుకున్న చంద్రబాబుకు తెలియకుండానే జీవో వచ్చిందా?. చంద్రబాబుది డేగ కన్ను కాదు, గుడ్డికన్ను. తన ప్రభుత్వంపై తానే విచారణ జరిపించుకోవటం చంద్రబాబుకు సిగ్గుచేటు. కాపు సమాజానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి’’ అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. -
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి సర్కార్ విస్మరిస్తోంది
-
‘బాబు మహానుబావుడు.. అధికారంలోకి వచ్చాడు లక్షల ఉద్యోగాలు పీకేశాడు’
సాక్షి,గుంటూరు: తాజాగా కోనసీమ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు తనది డేగకన్ను, తప్పు చేసిన వారు తన నుంచి తప్పించుకోలేరంటూ పిట్టలదోరలా మాట్లాడారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను అపహాస్యం చేస్తూ తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై పట్టపగలు ముగ్గురు దళిత, మైనార్టీ యువకులను హింసిస్తే చంద్రబాబు డేగ కన్నుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. వారిపై చర్య తీసుకుంటే తాను చట్టవిరుద్దంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వైయస్ఆర్సీపీ శ్రేణులపై పెట్టిస్తున్న తప్పుడు కేసులు, వేధింపులను పోలీసులు ప్రశ్నిస్తారనే భయంతోనే చంద్రబాబు నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. పోలీసుల హింసకు గురైన బాధితులను పరామర్శించేందుకు ఈనెల 3వ తేదీన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెనాలికి వెడుతున్నారని వెల్లడించారు.ఇంకా ఆయనేమన్నారంటే..తెనాలి అయితానగర్‌కు చెందిన జాన్ విక్టర్, దోమా రాజేష్,షేక్ బాబూలాల్ అనే యువకులు చిరంజీవి అనే కానిస్టేబుల్‌పై దాడి చేశారని వారిపై 307 కేసు పెట్టారు. చట్టప్రకారం వారిని అరెస్ట్ చేసి కోర్ట్‌కు పంపాల్సింది పోయి, వారిని పట్టుకుని నడిరోడ్డుపై లాఠీలతో చావబాదారు. వారంతా దళిత, మైనార్టీ వర్గాలకు చెందిన వారు. ఈ హింసను చూస్తుంటే అసలు ప్రజస్వామ్యం ఈ రాష్ట్రంలో ఉందా అనే అనుమానం కలుగుతోంది. దీనిని మానవ హక్కుల సంఘాలు ప్రశ్నిస్తే, వారిపై రౌడీషీట్లు ఉన్నాయని, రౌడీలకు సపోర్ట్ చేస్తారా అని ఎదురుదాడి చేస్తున్నారు. చట్టాన్ని పోలీసులే చేతుల్లోకి తీసుకుంటే ఇక కోర్ట్లు ఎందుకు? విచారణలు ఎందుకు? శిక్షలు ఎందుకు? ప్రజాస్వామిక వ్యవస్థలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు చట్టాలు ఉన్నాయి, కోర్ట్లు ఉన్నాయి. వాటికి అనుగుణంగా పోలీసుల పనిచేయాలే తప్ప, తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి వీలు లేదు. తనది డేగ కన్ను అని చెప్పుకునే సీఎం చంద్రబాబుకు ఈ దారుణం కనిపించలేదా? పోలీసులను మందలించడానికి ఎందకు భయపడుతున్నారు? ఇటువంటి ఘటనలు సమాజానికి తప్పుడు సంకేతాలను పంపుతాయి.ఏడాది తరువాత పాలనలో ఏ గేర్ మారుస్తారు?అవినీతిపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. నిత్యం లంచాల సొమ్మతో సూట్‌కేసులు మోయడమే ఆయన తనయుడు లోకేష్ చేస్తున్న పని. కోససీమ జిల్లా చేయ్యూరు ప్రజావేదికలో పాల్గొని పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలు నవ్వు తెప్పిస్తున్నాయి. ఈ నెల పన్నెండో తేదీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతుందని, ఇకపై పాలనలో గేర్ మారుస్తానని చంద్రబాబు అన్నారు. ఏం గేరు మారుస్తారో మాకు మాత్రం అర్థం కాలేదు. చంద్రబాబు అనే వ్యక్తి పచ్చి అబద్దాలను కూడా అవలీలగా చెబుతాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎటువంటి అబద్దాలనైనా సరే లైవ్ డిటెక్టర్‌కు కూడా దొరకకుండా చెప్పగల నేర్పరి. 'అవినీతి లేని వ్యవస్థకు శ్రీకారం, అధికారులు పేదల కోసం పనిచేయాల్సిందే, లంచాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోను, నాది డేగ కన్ను, ఎవరూ తప్పించుకోలేరు. ఎవరైనా తప్పు చేస్తే ఛండశానసనుడిని అవుతాను' ఇవీ చంద్రబాబు తాజాగా చెప్పిన సుభాషితాలు. అసలు అవినీతి సమాజానికి అంకురార్పణ చేసిందే చంద్రబాబు. ఈ ఏడాది పాలనలో రాష్ట్రంలో భయంకరమైన అవినీతి జరుగుతోంది. దానికి చంద్రబాబు కుమారుడు లోకేష్ ఈ అవినీతి సొమ్మును వసూలు చేసుకునే పనిలో ఉన్నారు. సీఐల బదిలీల నుంచి అన్ని పోస్టింగ్‌లకు ఒక రేటును పెట్టి, లంచాలు దండుకుంటున్నది నారా లోకేష్ అనేది సత్యం. అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ప్రజలను మోసం చేసిన వైనంను ప్రశ్నిస్తూ ఈనెల 4న రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంను నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పత్తి, మిర్చి, పొగాకు, ధాన్యం ఇలా ఏ పంట పండిచే రైతుల గురించి కూడా పట్టించుకోవడం లేదు. పబ్లిసిటీ స్టంట్ కోసం చేసే ప్రయత్నం తప్ప ప్రజలను నిజంగా మేలు చేయాలనే ఆలోచనే చంద్రబాబుకు లేదు. వైఎస్సార్సీపీ నిరసనలతో ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తాం.అవినీతిపై బెల్ట్ తీసే సీఎంకు బెల్ట్‌షాప్‌కు కనిపించవా?చంద్రబాబు తనది డేగ కన్ను అంటున్నాడు, బెల్ట్ షాప్‌లు పెడితే బెల్ట్ తీస్తాను అని కూడా హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాప్‌లు కనిపిస్తున్నాయి. ఆయనది డేగ కన్ను ఎలా అవుతుంది? ఆ షాప్‌లు ఎందుకు కనిపించడం లేదు? బడులు తెరవగానే అమ్మ ఒడి ఇస్తానని చెబుతున్నాడు. ఏడాది కిందట కూటమి పార్టీ ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు బడులే తెరవలేదా? ఈ ఏడాదే బడులు తెరుస్తున్నారా? ప్రతి విద్యార్ధికి రూ.పదిహేను వేలు అంటూ ఎన్నికల ముందు తెలుగుదేశం వారు చేసిన హామీలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఏవీ ఆ పదిహేను వేలు అంటూ తల్లులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఏ వర్గం సంతోషంగా ఉంది? విద్యార్ధులు, యువకులు, ఉద్యోగులు, వ్యవసాయదారులు, పారిశ్రామికవేత్తలు, కనీసం అమరావతి రైతులు సైతం సంతోషంగా లేరు. ఒక దుర్మార్గమైన పాలనను ఈ ఏడాది కాలంలో ప్రజలు చవిచూశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని అయిదేళ్లు, చంద్రబాబు ఏడాది పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలి. ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం మాది, ఉన్న ఉద్యోగాలను పీకేసే ప్రభుత్వం కూటమిది. అధికారంలోకి రాగానే వాలంటీర్లకు నెలకు పదివేలు ఇస్తానంటూ నమ్మించి దాదాపు 2.60 లక్షల మందిని రోడ్డుపాలు చేశారు. ఏపీ ఫైబర్‌నెట్, బేవరేజెస్, ఏపీఎండీసీల్లో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగాలను తొలగించారు.ఎండీయులతో 72 నెలల ఒప్పందాన్ని కొనసాగించాలిఈ రోజు రేషన్ వాహనాలపై ఆధారపడిన ఎండీయు ఆపరేటర్ల ఉద్యోగాలను కూడా తొలగించారు. 9260 మందికి ఎండీఓ వాహనాలను లోన్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చింది. వారితో పాటు ఒక హెల్పర్‌తో కలిపితే మొత్తం ఇరవై వేల మందికి ఉపాధి కల్పించాం. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే వారిని రోడ్డుపాలు చేశారు. ఇదే ఎండీయులతో గత ప్రభుత్వం 72 నెలల పాటు కొనసాగేలా అగ్రిమెంట్ ఉంది. అది పూర్తి కాకుండానే వారిని తొలగించారు. ఇది చట్ట విరుద్దం. వారిపై ఇంత కక్షసాధింపు ఎందుకు? బుడమేరు వరదల్లో వారు కష్టపడి పనిచేసిన కూడా వారిని నమ్మించి గొంతుకోశారు. చట్టవిరుద్దంగా తమను తొలగించారంటూ ఇప్పటికే కొందరు ఎండీయులు న్యాయస్థానాలకు కూడా వెళ్ళారు.మంత్రి నాదెండ్ల మనోహరే పీడీఎస్ బియ్యం స్మగ్లర్వారిని తొలగించే సమయంలో చంద్రబాబు ఎండీయులను గురించి చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణం. ఎండీయుల ద్వారా పనిచేసే వారంతా స్మగ్లర్లని, కాకినాడ పోర్ట్‌కు రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటున్నారని సంచలనమైన ఆరోపణలు చేశారు. వారంతా సంఘవిద్రోహశక్తులు అని మాట్లాడారు. చంద్రబాబు చుట్టూ ఉన్నవారు, ఆయన పార్టీలోని ఎమ్మెల్యేలు స్మగ్లర్లుగా మారారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా ద్వారా ఎమ్మెల్యేలకు వాటాలు అందుతున్నాయి. కాకినాడ నుంచి ఆఫ్రికాదేశాలకు వెళ్ళే బియ్యం అంతా స్థానిక ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే అక్రమ రవాణా జరుగుతోంది. మట్టి, ఇసుక, ఉద్యోగాల బదిలీలు, పీడీఎస్ బియ్యంను అడ్డం పెట్టుకుని అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నారు. ఎండీయుల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది. సివిల్ సప్లయిస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ అక్రమ పీడీఎస్ రవాణా వ్యవహారంలో మొదటి స్మగ్లర్. తరువాత మంత్రి నారా లోకేష్. మీరు అక్రమాలు చేస్తూ, ఎండీఓలపై ఆరోపణలు చేయడం దారుణం. -
జగన్, కేసీఆర్ పై నర్సిరెడ్డి కామెంట్స్.. ఏకిపారేసిన అంబటి రాంబాబు
-
ఆ ఆలోచన జనాల్లో మొదలైంది: అంబటి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీపై అక్కసుతోనే కడపలో మహానాడు నిర్వహించారని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో చెప్పలేకపోయారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మూడు రోజుల మహానాడులో బూతులు, భజనలు తప్ప మరేమీ లేదని.. కడపలో మహానాడు పెట్టటం ద్వారా తమకు బలం ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేశారని అంబటి అన్నారు.‘‘మహానాడులో చంద్రబాబు పూర్తిగా అభద్రతాభావంతో ఉన్నారు. మూడు రోజుల కార్యక్రమంలో తాము ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పలేకపోయారు. ఏ పథకాన్ని ఎప్పుడు అమలు చేసేదీ చెప్పలేదు. ఏ ఒక్క హామీని అమలు చేయని మీరు హీరోలా? వంద శాతం హామీలు అమలు చేసిన జగన్ గొప్పవాడా..?. జగన్‌ను దూరం చేసుకున్నామన్న ఆలోచన జనాల్లో మొదలైంది’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.‘‘రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి చంద్రబాబే. డబ్బుతో ఓట్లు కొనాలి అనే ఒక పద్ధతిని తీసుకువచ్చింది చంద్రబాబే. సింగిల్‌గా ఎన్నికల్లో పోటీ చేసి ఒక్కసారి కూడా చంద్రబాబు గెలవలేదు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన తర్వాత ఆయన చంద్రబాబు గురించి ఏం మాట్లాడారో అందరూ చూశారు. జామాతా దశమ గ్రహం అంటూ ఎన్టీఆర్ చంద్రబాబును పోల్చారు. నందమూరి వంశం నుంచి స్టేజ్ మీద ఒక్కరు కూడా లేరు. నందమూరి కుటుంబ మహానాడు కాస్తా నారావారి మహానాడులా మారిపోయింది...అధికారంలో లేనప్పుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి అంటారు. ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా ఉన్న మీరు ఇప్పుడు ఆ ప్రతిపాదన చేయొచ్చు కదా?. కడప మహానాడు తుస్సుమంది. ప్రజలను డైవర్ట్ చేయటానికి కామెడీ ఆర్టిస్ట్‌లను తీసుకువచ్చారు. మాట్లాడితే తల్లి, చెల్లి అంటారు. గృహ ప్రవేశానికి చంద్రబాబు తన చెల్లెళ్లను పిలిచారా..?. లోకేష్‌కి ముందుంది ముసళ్ల పండగ.. ఆయన అనుభవం లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు’’ అని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లు కొందరు పోలీసులు పని చేస్తున్నారు


