ఎవరీ సైనైడ్ మల్లిక!

ఎవరీ సైనైడ్ మల్లిక!

వారం పది రోజుల క్రితం వరకు ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిని అవుతానని కలలు గన్నారు. గురువారం నాడు కొత్త ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి ప్రమాణస్వీకారం చేస్తుంటే ఆనందబాష్పాలతో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లోని టీవీలో లైవ్ షో చూశారు. అంతకుముందు తాను చిల్లర దొంగను కానని, అందువల్ల పోలీసు జీపు ఎక్కేది లేదని కూడా పోలీసులతో హుంకరించారు. కానీ.. తన పక్క సెల్‌లో ఎవరున్నారన్న విషయం ఆమెకు ఇంకా తెలుసో లేదో తెలియదు.



శశికళ పక్కనే ఉన్న సెల్‌లో ఉన్నది అలాంటి ఇలాంటి వాళ్లు కారు.. సైనైడ్ మల్లిక!! దేవాలయాలకు వచ్చిన మహిళలను సైనైడ్‌తో చంపేసి, వాళ్ల దగ్గర ఉన్న బంగారు నగలు తీసుకుని పారిపోయిన చరిత్ర ఆమెది. అలా ఒకరు, ఇద్దరు కారు.. ఏకంగా ఆరుగురిని ఆమె హతమార్చింది. ఈ కేసులో ఆమెకు కోర్టు ఉరిశిక్ష విధించగా.. అది ఇటీవలే జీవితఖైదుగా మారింది. ఒకరకంగా సైనైడ్ మల్లికతో పోలిస్తే శశికళ అంత పెద్ద నేరస్థురాలు ఏమీ కారు. 

 

ఖైదీ నెంబర్ 9234 అయిన శశికళ... ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవాలనుకున్నారు గానీ కుదరలేదు. సర్వసాధారణంగా అందరు ఖైదీలకు ఇచ్చే 10/8 సెల్‌లోనే మామూలు చాప, దిండు, దుప్పటితో ఆమె పడుకోవాల్సి వస్తోంది. చివరకు పరుపు కావాలని అడిగినా కూడా ఇవ్వలేదు. రెండు రొట్టెలు, ఒక రాగి ముద్ద, 200 గ్రాముల అన్నం, 150 గ్రాముల సాంబారుతో కూడిన సాధారణ భోజనమే ఆమెకు కూడా పెట్టారు. కొంచెం భోజనం చేస్తే తప్ప ఓపిక ఉండదని, అందువల్ల ఎలాగోలా సర్దుకుని తినాలని శశికళతో పాటే అదే సెల్‌లో ఉన్న మరదలు ఇళవరసి ఆమెకు నచ్చజెప్పినట్లు తెలిసింది.



మరిన్ని తమిళనాడు విశేషాలు..



భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు



పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్‌



మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్!



బలపరీక్షకు కరుణానిధి దూరం!



పళనిస్వామిని ఓడించండి: రాహుల్



అమ్మకు ఓటేయండి



నన్ను చూసి నవ్వొద్దు



‘మ్యాజిక్‌’ చేసేదెవరు?


 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top