ధోనికి 'ఏ' గ్రేడ్‌ ఎందుకు? | Ramiz Raja Questions MS Dhoni Getting Grade 'A' Contract | Sakshi
Sakshi News home page

ధోనికి 'ఏ' గ్రేడ్‌ ఎందుకు?

Jul 5 2017 3:16 PM | Updated on Sep 5 2017 3:17 PM

ధోనికి 'ఏ' గ్రేడ్‌ ఎందుకు?

ధోనికి 'ఏ' గ్రేడ్‌ ఎందుకు?

భారత్‌ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి 'ఏ' గ్రేడ్‌ ఎలా కేటాయించారని బీసీసీఐని పాక్‌ మాజీ ఆటగాడు రమీజ్‌ రాజా ప్రశ్నించాడు.

లాహోర్‌: భారత్‌ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి 'ఏ' గ్రేడ్‌ ఎలా కేటాయించారని బీసీసీఐని పాక్‌ మాజీ ఆటగాడు రమీజ్‌ రాజా ప్రశ్నించాడు. ధోని లాంగెస్ట్‌ ఫార్మట్‌ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించనపుడు ఏ గ్రేడ్‌ లో ఉంచడం సరికాదని అభిప్రాయ పడ్డాడు. పాక్ బోర్డు సైతం షాహిద్ ఆఫ్రిదీకి ఏ గ్రేడ్ ను కట్టబెట్టిందని ఇది టెస్టు ఫార్మట్ కే ముప్పు అన్నాడు. ఆసియా క్రికెట్ బోర్డులు టెస్టు ఫార్మట్ ప్లేయర్లకు గౌరవం ఇవ్వాలని రమీజ్ రాజా సూచించాడు. టీ20లనుంచి టెస్టు ఫార్మట్ ను కాపాడాలన్నాడు.

టెస్టుల నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ ఇద్దరి మాజీ కెప్టెన్లకు ఏ గ్రేడ్ ఇవ్వడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని వాపోయాడు. ఆసియా బోర్డులు టెస్టు మ్యాచ్ లు నిర్వహించేలా చోరవ తీసుకోవాలన్నాడు. బోర్డులపై ఒత్తిడి ఉండటం సహజమే కానీ టెస్టు చాంపియన్ షిప్ నిర్వహించాలని సూచించాడు. క్యాష్ రిచ్ టీ20 లీగ్ లతో టెస్టులకు ముప్పు వాటిల్లిందని రాజా ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక మాజీ సీవోఏ అభ్యర్ది రామచంద్ర గుహా సైతం ధోనికి ఏ గ్రేడ్ కేటాయించడాన్ని తప్పు బట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement