ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమలనాథులు తెల్లబోయారు.
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమలనాథులు తెల్లబోయారు. సర్వేల్లో కనీసం 25 సీట్లకు పైగా వస్తాయని ఆశించినా.. వాస్తవ ఫలితాల్లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయింది. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ పార్టీయే గెలిచింది.
ఢిల్లీ ఎన్నికల్లో కూడా అటువంటి ఫలితమే వస్తుందని బీజేపీ అనుకున్నా...ఢిల్లీ వాసులు మాత్రం నరేంద్ర మోదీ స్వచ్చ్ భారత్ ను చీపురుతో ఊడ్చేశారు. తాము సామాన్యుడి వెంటే ఉంటామంటూ కేజ్రీవాల్ కు పట్టం కట్టారు. దాంతో బీజేపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. పదిశాతం సీట్లు అంటే 7 సీట్లు వచ్చిన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కేది. అయితే బీజేపీ ప్రస్తుతం నాలుగు స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది.


