Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

Daryl Mitchell, Ruturaj Gaikwad power CSK to 212-3
రుతురాజ్‌ విధ్వంసం.. ఎస్‌ఆర్‌హెచ్‌ ముందు భారీ టార్గెట్‌

ఐపీఎల్‌-2024లో చెపాక్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.సీఎస్‌కే బ్యాటర్లలో కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మరోసారి అదరగొట్టాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని రుతురాజ్‌ కోల్పోయాడు. 54 బంతులు ఎదుర్కొన్న 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 98 పరుగులు చేశాడు. 19వ ఓవర్‌లో నటరాజన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి గైక్వాడ్‌ ఔటయ్యాడు.ఇక సీఎస్‌కే బ్యాటర్లలో గైక్వాడ్‌తో పాటు మిచెల్‌(52), శివమ్‌ దూబే(39 నాటౌట్‌) పరుగులతో రాణించారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లు అందరూ పూర్తిగా తేలిపోయారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, నటరాజన్‌, ఉనద్కట్‌ తలా వికెట్‌ సాధించారు. కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌,నటరాజన్‌ ఇద్దరి కలిసి ఏకంగా 92 పరుగులు సమర్పించుకున్నారు.

Sunita Kejriwal Second Day Delhi Road Show
భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్‌షోలో సునీతా కేజ్రీవాల్

ఢిల్లీ: ఆప్ పార్టీ తరపున ఏప్రిల్ 27 నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ప్రచారం ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఈ రోజు (ఆదివారం) పశ్చిమ ఢిల్లీ నియోజక వర్గంలో ఆప్ అభ్యర్థి మహాబల్ మిశ్రాకు మద్దతు కోరుతూ క్యాంపెయిన్ నిర్వహించారు.ఢిల్లీ రోడ్‌షోలో సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. భారతమాత కుమార్తెగా.. నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన భర్త సింహం అని, ఆయన్ను ఎవరూ పడగొట్టలేరని అన్నారు. కారు సన్‌రూఫ్‌లోంచి నిల్చుని ఓటర్లకు అభివాదం చేశారు.పాఠశాలలు కట్టడం, ఉచిత విద్యుత్‌ అందించడం, మొహల్లా క్లినిక్‌లు ప్రారంభించి ప్రజలకు మంచి పనులు చేసినందుకే జైలుకెళ్లారని సునీతా కేజ్రీవాల్ అన్నారు. ఆయన (కేజ్రీవాల్) భరతమాత పుత్రుడు, నియంతృత్వానికి వ్యతిరేఖంగా ఓటు వేసి ప్రజాస్వామ్యం కాపాడుకోవడం మీ బాధ్యత. దయచేసి దీని విలువ అర్థం చేసుకోండి అని ఆమె అన్నారు.లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్‌ చేసింది. ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 'ఆప్' తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, న్యూఢిల్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఇక ఈశాన్య ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, చాందినీ చౌక్ స్థానాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థులను నిలబెట్టింది.जनता के इस सैलाब के आगे,कोई तानाशाह टिक नहीं सकता 🔥अपने बेटे, अपने भाई केजरीवाल को आशीर्वाद देने सड़कों पर उमड़ी पश्चिमी दिल्ली की जनता 💯#KejriwalKoAshirwad pic.twitter.com/ZTPl8LrsaS— AAP (@AamAadmiParty) April 28, 2024

Odisha Is Being Run By Pan Says Rahul Gandhi
‘మీరు కావాల్సినంత పాన్‌ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్‌దే అధికారం

ఒడిశాను ‘పాన్’ (పాండియన్, అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ, నవీన్ పట్నాయక్) పరిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ, బిజూ జనతాదళ్ ఒకరినొకరు పెళ్లి చేసుకున్నాయి అని అన్నారు. ఒడిశాలోని కేంద్రపరా ప్రాంతంలో రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఒడిశాలో బీజేపీ-బీజేడీలు పెళ్లి చేసుకున్నాయి. వారు అందరికీ పాన్‌ ఇచ్చారు. పీఎం మోదీ 22-25 మంది కోసం ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అదే పద్ధతిలో నవీన్ పట్నాయక్ కూడా కొంతమంది ఎంపిక చేసిన వ్యక్తులకే అధికారం దక్కుతుంది. ఈ వ్యక్తులు మీ సంపదను దోచుకున్నారు. రైతుల భూములు లాక్కున్నారని ఆరోపించారు.  మీరు (ప్రజలు) తగినంత పాన్ తిన్నారు. ఇప్పుడు ఒడిశాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందని రాహుల్‌ గాంధీ జోస్యం చెప్పారు.  ఒడిశాలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి నాలుగు దశల్లో జరగనున్నాయి. మే 13న మొదటి దశ, మే 20న రెండో దశ, మే 25న మూడో దశ, జూన్ 1న చివరి దశ.  జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.  2019 లోక్‌సభ ఎన్నికల్లో, బిజూ జనతాదళ్ (బీజేడీ)కి అత్యధిక స్థానాలు (12), ఆ తర్వాతి స్థానాల్లో బీజేపీ (8), కాంగ్రెస్‌కు ఒక్కటే సీటుతో సరిపెట్టుకుంది. 

Cm Jagan Speech In Kandukur Public Meeting
చంద్రబాబుది అబద్ధాలు, మోసాల ఫ్యాక్టరీ: సీఎం జగన్‌

సాక్షి, నెల్లూరు జిల్లా: మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ముందుకొస్తున్నాడని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. కందుకూరు కేఎంసీ సర్కిల్‌లో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ‘‘ఈ ఎన్నికల్లో చంద్రబాబుది అబద్ధాలు, మోసాల ఫ్యాక్టరీ. మనది ఇంటింటికీ మంచి చేసి అభివృద్ధి చేసిన పార్టీ. చంద్రబాబు పార్టీలతో జతకడితే మీ బిడ్డ అందరికీ మంచిచేసి ప్రజలతోనే పొత్తు పెట్టుకున్నాడు’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.‘‘తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా సుమతి అన్నట్టుగా.. ఎన్నికలు వస్తుంటే మన రాష్ట్రానికి పొత్తుల నాయకులు వస్తున్నారు. చంద్రబాబు కానీ, దత్తపుత్రుడు కానీ, వదినమ్మ కానీ, ఈనాడు రామోజీరావు కానీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ, టీవీ5 నాయుడు కానీ ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్నారా?. ఎన్నికలు వచ్చాయి కాబట్టే చంద్రబాబు కూటమి ఆంధ్రరాష్ట్రానికి వచ్చారు. ఓడిన వెంటనే మళ్లీ హైదరాబాద్‌కి వెళ్లిపోతారు. చంద్రబాబు కూటమి అంటే నాన్ లోకల్ కిట్టీపార్టీ. నయా ఈస్టిండియా కంపెనీ చంద్రబాబు కూటమిలో ఏ ఒక్కరికీ రాష్ట్రంలో ప్రజలకు మంచి చేసిన చరిత్రే లేదు’’ అని సీఎం జగన్‌ ధ్వజమెత్తారు.‘‘ప్రతి పేద ఇంటికి మనం చేసిన మంచి ఇది అని గర్వంగా చెప్పుకుంటున్నాం. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా, సైనికులుగా నిలవండి అని కోరుతున్నాను. సెల్ఫోన్ నేనే కనిపెట్టా అంటూ బాబులా నేను బడాయిలు చెప్పడం లేదు. ఈ 58 నెలల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టు ప్రజల ముందు పెట్టి మార్కులు వేయమని అడుగుతున్నా. మీరు అధికారం ఇవ్వడం వల్లే ప్రతి పల్లె, పట్టణంలో కనీసం 6 వ్యవస్థలు ఏర్పాటు చేసాం. సచివాలయాలు, వాలంటీర్లు, నాడునేడుతో మారిన బడి, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్, మహిళా పోలీస్, డిజిటల్ లైబ్రరీ, ఫైబర్ గ్రిడ్ ప్రతి ఊరిలో కనిపిస్తాయి. ఇక మీదట కూడా ఈ పథకాలు కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కి మీ బిడ్డకు తోడుగా ఉండండి.’’ అని సీఎం విజ్ఞప్తి చేశారు.‘‘ఇంటికే వచ్చే మూడు వేల పెన్షన్, ఇంటి ముంగిటికే వచ్చే రేషన్... మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఈ సంప్రదాయం. పేదలకు మనం ఇస్తున్న ఈ మర్యాద కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ బిడ్డకు తోడుగా ఉండండి. చంద్రబాబు మార్కు రాజ్యం.. దోపిడీ సామ్రాజ్యం, గ్రామగ్రామాన లంచాలు, వివక్షలతో జన్మభూమి కమిటీలు. లంచాలు, వివక్ష లేకుండా, కులం, మతం, ప్రాంతం, వర్గం, ఎవరికి ఓటేసారు అనేది కూడా చూడకుండా అర్హులందరికీ ఇచ్చిన ఈ పథకాలన్నీ వచ్చే ఐదేళ్లు కూడా కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ బిడ్డకు తోడుగా ఉండండి. 130 బటన్లు నొక్కి రూ.2,70,000 కోట్లు డీబీటీగా అక్కచెల్లెమ్మల ఖాతాలకు నేరుగా అందించాం’’ అని సీఎం జగన్‌ చెప్పారు ‘‘మళ్లీ వచ్చే ఐదేళ్లూ ఇది కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కండి అని కోరుతున్నాను. ప్రతి పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదన్నా.. మీ గ్రామంలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్,  ఇంటికే అందిస్తున్న ఆరోగ్య సురక్ష సేవలు... విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా అందాలంటే మీ బిడ్డను ఆశీర్వదించండి’’ అని సీఎం జగన్‌ కోరారు.     

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu
ఎగ్గొట్టేందుకే చంద్రబాబు అడ్డగోలు హామీలు: సజ్జల

సాక్షి, తాడేపల్లి: తమ మేనిఫెస్టో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించేదిలా ఉండదని.. ప్రజలకు ఏం చేస్తామో అదే చెప్పామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తాయిళాలు ప్రకటించి ఓట్లు వేయించుకునే ఆలోచనలు తమకు ఉండవని.. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి రాష్ట్రాన్ని నాశనం చేశారని సజ్జల మండిపడ్డారు‘‘2014-19 మధ్య చంద్రబాబు తన విశ్వరూపం చూపించారు. చంద్రబాబువి సభ్యసమాజంలో ఉండగలిగే వ్యక్తి మాటలులాగా లేవు. రాళ్ల దాడి చేయమని గతంలో చంద్రబాబు అన్నాడు.. అన్నట్టుగానే రాళ్లతో దాడి చేయించాడు. మేనిఫెస్టో అంటే విశ్వసనీయత ఉండాలి. మీ కుటుంబంలో మంచి జరిగితేనే ఓటు వేయమని జగన్ అంటున్నారు. ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటేనే అలా అడగగలరు. అలా చంద్రబాబు ఎందుకు ఓటు అడగలేకపోతున్నారు. సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాల్లో మేలు జరిగింది. ఈ పథకాలతో రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారా? అని ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు అంతకంటే ఎక్కువ పథకాలు తెస్తానని ఎలా చెప్తున్నారు’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.‘‘అమలు చేసే వారెవరూ అడ్డగోలు హామీలు ఇవ్వరు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉన్న వారే చేయగలిగిన హామీలు ఇస్తారు. చంద్రబాబు వలన వాలంటీర్ల వ్యవస్థ ఆగిపోయింది. పెన్షన్ల పంపిణీకి ఆటంకం కలిగించారు. ఇప్పుడు మళ్లీ ఇంటింటికీ ఉద్యోగులను పంపించి పెన్షన్లు ఇవ్వమంటున్నారు. పేదలంతా తమ కాళ్ల మీద తాము నిలపడేలా చూడాలన్నది జగన్ ఇద్దేశం. 70 వేల కోట్లతో జగన్ తన సంక్షేమాన్ని అమలు చేస్తుంటే చంద్రబాబు మాత్రం ఏకంగా లక్షన్నర కోట్లు చేస్తానంటూ మాట్లాడుతున్నారు. రాష్ట్ర బడ్జెట్‌తో సంబంధం లేకుండా చంద్రబాబు అబద్ధాల హామీలు ఇస్తున్నారు’’ అని  సజ్జల మండిపడ్డారు.‘‘ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా జగన్ మేనిఫెస్టో ప్రకటించారు. చంద్రబాబు లాగా ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వమని కొంతమంది మాతో కూడా అన్నారు.కానీ జగన్ ఎప్పుడూ చేయలేని పని చెప్పరు. ఇచ్చిన హామీ నుంచి వెనక్కి పోరు. ఎగ్గొట్టాలనుకునే చంద్రబాబు అడ్డమైన హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఉన్న వ్యవస్థలన్నీ నాశనం అవుతాయి. జన్మభూమి కమిటీలు మళ్లీ వస్తాయి. చంద్రబాబుకు ఎవరైనా ఓటేస్తే తమ ఓటును తాము వృథా చేసుకున్నట్టే. చంద్రబాబు తన పాలనలో ఏం చేశారో ఇప్పటికీ ఎందుకు చెప్పలేకపోతున్నారు?’’ అంటూ సజ్జల నిలదీశారు.‘‘జగన్ పాలనలో ఏం జరిగిందో ఎవరైనా చెప్పగలరు. కుప్పంతో సహా ఎక్కడైనా చెక్ చేసేందుకు సిద్దమే. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఇరవై ఇళ్లకు వెళ్లి అడిగే ధైర్యం ఉందా?. పోలవరం పాపం చంద్రబాబుదే. లోకేష్ ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. ఎందుకు ప్రజలకు కనపడటం లేదు?. పవన్ కళ్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడు. చంద్రబాబు మాటలే పవన్ కూడా మాట్లాడతారు. సెక్రటేరియట్ ని కూడా తాకట్టు పెట్టామని కూడా పవన్ అన్నారు. రాజధానిలోని పొలాలను తాకట్టు పెట్టిందే చంద్రబాబు’’ అంటూ సజ్జల దుయ్యబట్టారు. 

Will Jacks smashes fifth fastest hundred during GT vs RCB match
విల్ జాక్స్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ.. 10 సిక్స్‌ల‌తో! వీడియో వైర‌ల్‌

ఐపీఎల్‌-2024లో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన‌ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆట‌గాడు విల్ జాక్స్ విధ్వంస‌క‌ర సెంచ‌రీతో చెల‌రేగాడు. 201 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌లో జాక్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌ను జాక్స్ ఊచ‌కోత కోశాడు. ఈ క్ర‌మంలో కేవ‌లం 41 బంతుల్లోనే జాక్స్ త‌న సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. జాక్స్‌కు ఇది తొలి ఐపీఎల్ సెంచ‌రీ కావ‌డం విశేషం. ఓవ‌రాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న జాక్స్‌.. 5 ఫోర్లు, 10 సిక్స్‌ల‌తో 100 ప‌రుగుల‌తో ఆజేయంగా నిలిచింది. జాక్స్ విధ్వంసం ఫ‌లితంగా 201 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆర్సీబీ  కేవ‌లం 16 ఓవ‌ర్ల‌లో ఊదిప‌డేసింది. ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో జాక్స్‌తో పాటు కోహ్లి(70 నాటౌట్‌) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. ఇక మ్యాచ్‌లో సెంచరీ మెరిసిన జాక్స్ ఓ అరుదైన ఘ‌న‌తను త‌న పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసిన నాలుగో ఆట‌గాడిగా జాక్స్ నిలిచాడు. ఈ జాబితాలో విండీస్ లెజెండ్ క్రిస్ గేల్ తొలి స్ధానంలో ఉన్నాడు. 2013 ఐపీఎల్ సీజ‌న్‌లో ఆర్సీబీ త‌ర‌పున గేల్.. పుణే వారియ‌ర్స్‌పై కేవ‌లం 30 బంతుల్లోనే గేల్ శ‌త‌కం సాధించాడు. ఆ త‌ర్వాతి స్ధానాల్లో యూస‌ఫ్ ప‌ఠాన్‌(37  బంతులు ), డేవిడ్ మిల్ల‌ర్‌(38  బంతులు ), ట్ర‌విస్ హెడ్‌(39  బంతులు ), విల్‌జాక్స్‌(41  బంతులు ) ఉన్నారు. అదే విధంగా ఆర్సీబీ త‌రపున ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసిన రెండో ఆట‌గాడిగా జాక్స్ రికార్డుల‌కెక్కాడు. 

Alakh Pandey Urges Indian Students At Harvard, Stanford
విద్యార్థుల్లారా.. రండి మాతృ దేశానికి సేవ చేయండి.. ఫిజిక్స్‌ వాలా పిలుపు

అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్ధుల్లారా.. మీరెక్కడున్నా దేశానికి తిరిగి వచ్చేయండి. దేశ సేవ చేయండి. దేశ అభివృద్దిలో పాలు పంచుకోండి అంటూ ప్రముఖ ఎడ్యుటెక్‌ ఫిజిక్స్‌ వాల వ్యవస్థాపకుడు, సీఈఓ అలఖ్ పాండే పిలుపునిచ్చారు.యూఎస్‌లో చదువుతున్న భారతీయ విద్యార్ధులు దేశ సేవ చేయాలని అలఖ్‌ పాండే కోరారు. తిరిగి రాలేని వారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దేశ పురోగతికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.అలఖ్‌ పాండే ఇటీవల హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీల్లో ప్రసంగించేందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ క్యాంపస్‌లలో భారతీయ విద్యార్ధులతో దిగిన ఫోటోల్ని, అనుభవాల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.  అవును, మన దేశంలో చాలా లోపాలు ఉన్నాయి. కానీ ఏ దేశం పరిపూర్ణంగా లేదు. కానీ  యువత దేశాన్ని మార్చుకునే అవకాశం ఉందని అన్నారు.      View this post on Instagram           A post shared by Physics Wallah (PW) (@physicswallah)

Cm Jagan Tweet On Chandrababu
అలా చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు?.. సీఎం జగన్‌ ట్వీట్‌

సాక్షి, తాడేపల్లి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మరోసారి చారిత్రక విజ­యంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మలివిడత ఎన్నికల ప్రచార భేరి మోగించారు.ఇక సిద్ధం సభలు గ్రాండ్‌ సక్సెస్‌ కావడం.. బస్సు యాత్ర చరిత్ర సృష్టించడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు, సానుభూతిపరులు రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కుతున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరు­పతి లోక్‌సభ స్థానం పరిధిలోని వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్‌, నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని కందుకూరు కేఎంసీ సర్కిల్‌లో ఆదివారం జరిగిన సభల్లో సీఎం జగన్‌ ప్రసంగించారు. మరోవైపు, ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా చంద్రబాబు మోసాలను సీఎం జగన్‌ ఎండగట్టారు.‘‘అయ్యా చంద్రబాబూ.. 2014-19 మధ్య నీ పాలనలో జన్మభూమి కమిటీలను పెట్టావు 2019లో మేము అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చాం మరి నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల మీద నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్లీ అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు...? వచ్చే ఎన్నికల్లో మన వైసీపి అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను’’ అంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.  అయ్యా చంద్రబాబు.. 2014-19 మధ్య నీ పాలనలో జన్మభూమి కమిటీలను పెట్టావు. 2019లో మేము అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చాం. మరి నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల మీద నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్లీ అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పే ధైర్యం నీకుందా… pic.twitter.com/lSAAuOO7zw— YS Jagan Mohan Reddy (@ysjagan) April 28, 2024

Harassment Case Filed Against Deve Gowda Grandson Prajwal Revanna
అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు

బెంగళూరు: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక జనతాదళ్‌ (సెక్యులర్‌) అగ్రనేత దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై మహిళా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ముందు ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రజ్వల్‌ రేవణ్ణపై హాసన్ జిల్లా హోలెనరసిపూర్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.ఆ ఎఫ్‌ఐఆర్‌లో 2019, 2022 మధ్య కాలంలో తాను అనేకసార్లు లైంగిక వేధింపులకు గురైనట్ల బాధితురాలు ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు సిట్‌ బృందానికి సమాచారం అందించారు. కాగా, మరింత మంది మహిళలు కేసులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.అయితే తనపై వస్తున్న ఆరోపణల్ని ప్రజ్వల్ రేవన్న ఖండించారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న అశ్లీల వీడియోలు మార్ఫింగ్‌ చేసినవి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యకర వీడియోల కేసు దుమారం రేగడంతో ప్రజ్వల్ రేవణ్ణ నిన్న ఉదయం జర్మనీ వెళ్లారు.ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై స్పందిస్తూ నిజానిజాలు తేల్చేందుకు సిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మహిళపై లైంగిక వేధింపుల కోణాన్ని కూడా దీనిలో దర్యాప్తు చేస్తామన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ హాసన్ లోక్‌సభ నియోజకవర్గంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) అభ్యర్థిగా ఉన్నారు. ఏప్రిల్ 26న రెండో దశలో ఓటింగ్ జరిగింది. 

IPL 2024: Will Jacks Slams Blasting Century, RCB Beat Gujarat By 9 Wickets
విల్‌ జాక్స్‌ సుడిగాలి శతకం.. గుజరాత్‌ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ మూడో విజయం సాధించింది. ప్లే ఆఫ్స్‌ అవకాశాలు గల్లంతయ్యాక కోలుకున్న ఆర్సీబీ గుజరాత్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 28) జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్‌ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. విల్‌ జాక్స్‌ (41 బంతుల్లో 100 నాటౌట్‌; 5 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 16 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జాక్స్‌ సునామీ ఇన్నింగ్స్‌ ముందు విరాట్‌ కోహ్లి (44 బంతుల్లో 79 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీ మరుగున పడింది. ఛేదనలో ఆర్సీబీకి డుప్లెసిస్‌ (12 బంతుల్లో 24; ఫోర్‌, 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. జాక్స్‌ తానెదుర్కొన్న చివరి 13 బంతుల్లో ఏకంగా 64 పిండుకున్నాడు. మోహిత్‌ వేసిన 15వ ఓవర్‌లో 29 పరుగులు, రషీద్‌ వేసిన ఆ తర్వాతి ఓవర్‌లో 29 పరుగులు రాబట్టాడు. జాక్స్‌ దెబ్బకు గుజరాత్‌ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. డుప్లెసిస్‌ వికెట్‌ సాయికిషోర్‌కు దక్కింది.అంతకుముందు టాస్‌ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. సాయి సుదర్శన్‌ (49 బంతుల్లో 84 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్‌ ఖాన్‌ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో వృద్దిమాన్‌ సాహా (5), శుభ​్‌మన్‌ గిల్‌ (16) నిరాశపర్చగా.. డేవిడ్‌ మిల్లర్‌ (19 బంతుల్లో 26; 2 ఫోర్లు, సిక్స్‌) పర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్‌, మ్యాక్స్‌వెల్‌, స్వప్నిల్‌ సింగ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.  

తప్పక చదవండి

Advertisement
Advertisement
Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all
Advertisement
Advertisement
Advertisement