breaking news
Pakistan
-
బౌలర్లతో పోటీపడుతున్న బాబర్ ఆజం
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్‌గా చెప్పుకొనే బాబర్ ఆజం ఇటీవలికాలంలో ఘోరంగా విఫలమవుతున్నాడు. టెస్ట్ క్రికెట్ అతడి ప్రదర్శన మరీ తీసికట్టుగా మారింది. ఈ ఫార్మాట్లో అతడు సెంచరీ చేసి ఏకంగా 36 ఇన్నింగ్స్‌లు అవుతుందంటే, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్దమవుతుంది.ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ మరోసారి ఘోరంగా విఫలమయ్యాడు. కేవలం 8 పరుగులే చేసి జోష్ టంగ్ బౌలింగ్‌లో జోర్డన్ కాక్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.ఈ చెత్త ప్రదర్శన తర్వాత బాబర్ పేరు హైలైట్‌గా మారింది. టెస్ట్ సెంచరీ లేకుండా అత్యధిక ఇన్నింగ్స్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో అతడు బౌలర్లతో పోటీపడుతున్నాడు. 2023 తర్వాత టెస్ట్ సెంచరీ లేకుండా అత్యధిక ఇన్నింగ్స్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో మిచెల్ స్టార్క్ (50), పాట్ కమిన్స్ (47), మహ్మద్ సిరాజ్ (44), నాథన్ లియోన్ (41) లాంటి బౌలర్లే బాబర్ కంటే ముందున్నారు. ఈ జాబితా టాప్-13లో బాబర్ మినహా ఒక్క స్పెషలిస్ట్ బ్యాటర్ కూడా లేడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ భారీ ఆధిక్యంలో కొనసాగుతుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి, మొత్తం 357 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 290 పరుగులకు ఆలౌట్ కాగా.. పాక్ 110 పరుగులకే కుప్పకూలింది. మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్ట్ నెగ్గిన ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. చదవండి: ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం.. పాక్‌కు ఓటమి తప్పదా? -
పాకిస్తాన్ జట్టుపై వాన్ తీవ్ర విమర్శలు
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, వివాదాస్పద వ్యాఖ్యాత మైఖేల్ ఆథర్టన్ పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై తీవ్ర విమర్శలు చేశాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాక్ బ్యాటింగ్ వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ.. 'సెకండ్ డివిజన్ కౌంటీ జట్టు' అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. పాక్ ఆటగాళ్ల బ్యాటింగ్ ప్రమాణాలు టెస్టు స్థాయికి తగ్గట్టుగా లేవని ధ్వజమెత్తాడు.పాక్ బ్యాటర్లు ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించాడు. పాక్ బ్యాటర్లలో ప్రత్యర్ది బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టే సామర్థ్యం కనిపించడం లేదని, అందుకే ఇంగ్లండ్ బౌలర్లు వికెట్లు తీయడానికి పోటీ పడుతున్నారని అన్నాడు.ఇదే సమయంలో అతడు ఇంగ్లండ్ పేసర్లను ప్రశంసలతో ముంచెత్తాడు. ఇదే ఫామ్‌ను వారు కొనసాగిస్తే భవిష్యత్తులో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి బలమైన బ్యాటింగ్ జట్లను ఇబ్బంది పెట్టగలరని అభిప్రాయపడ్డాడు.కాగా, ఆగస్టు 27న ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 261 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులు చేసిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను 81-3 స్కోర్ వద్ద కొనసాగిస్తుంది. దీనికి ముందు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 110 పరుగులకే ఆలౌటైంది. ఓలీ రాబిన్సన్ (4-11), ఆర్చర్ (3-26), టంగ్ (2-27) పాక్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. పాక్జ జట్టులో అజాన్ అవైస్ 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, సౌద్ షకీల్ 16 పరుగులు చేశాడు. వీరు మినహా జట్టులో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. చదవండి: పాఠాలు నేర్వని పాక్.. ఇంగ్లండ్ దెబ్బకు 110 రన్స్‌కే ఆలౌట్ -
పాక్ డ్రోన్ల చొరబాటు యత్నం.. తరిమికొట్టిన భారత సైన్యం
రాజౌరీ: జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంట పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్ల కదలికలను భారత సైన్యం విజయవంతంగా అడ్డుకుంది. నౌషేరా సెక్టార్‌లోని రుమ్లీధార ప్రాంతంలో భారత వాయుసీమలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన మూడు డ్రోన్లను భద్రతా దళాలు వెనక్కి తరిమికొట్టాయి. అనంతరం ఆ ప్రాంతంలో సైన్యం విస్తృత గాలింపు చర్యలు చేపట్టింది. సైనిక వర్గాల సమాచారం ప్రకారం.. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం వేళల్లో అనుమానాస్పద డ్రోన్లు సరిహద్దు దాటేందుకు యత్నించాయి.రుమ్లీధార వద్ద వీటిని గుర్తించిన 22వ జమ్మూ అండ్ కశ్మీర్ రైఫిల్స్ బలగాలు తక్షణమే అప్రమత్తమయ్యాయి. వెంటనే కౌంటర్-డ్రోన్ వ్యవస్థలను క్రియాశీలం చేయడంతో, ఆ మూడు డ్రోన్లు సరిహద్దు దాటి తిరిగి పాకిస్థాన్ వైపు వెళ్లిపోయాయి. ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. భారత దళాల కదలికలను పసిగట్టేందుకు, ఉగ్రవాదుల చొరబాట్లకు సహకరించేందుకు పాక్ దళాలు డ్రోన్లను ఉపయోగిస్తున్నాయని, అయితే ఇలాంటి ప్రయత్నాలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతోందని అధికారులు తెలిపారు.ఇటీవల కథువా జిల్లాలోని హీరానగర్ సెక్టార్ పరిధిలోని బోబియాన్ ప్రాంతంలో కూడా ఒక డ్రోన్ చక్కర్లు కొట్టి వెనక్కి వెళ్లింది. ఆయుధాలు లేదా మాదకద్రవ్యాలను జారవిడిచారా అనే అనుమానంతో అప్పట్లో గాలింపు జరపగా ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. మరోవైపు సరిహద్దుల్లో సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉందని నార్తర్న్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ స్పష్టం చేశారు. గురువారం ఆయన దక్షిణ కశ్మీర్లో పర్యటించి భద్రతా ఏర్పాట్లను, కార్యాచరణ సంసిద్ధతను సమీక్షించారు. సైనికుల నిబద్ధతను, మనోధైర్యాన్ని ప్రశంసిస్తూ, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.ఇది కూడా చదవండి: నేటి నుంచి ప్రధాని మోదీ ఉజ్బెకిస్థాన్, కిర్గిజిస్థాన్ పర్యటన -
పాకిస్థాన్‌కు సిమ్ కార్డులు పంపిన దంపతులు అరెస్ట్!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ గూఢచార సంస్థ (ఐఎస్ఐ)తో సంబంధాలు కొనసాగిస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో ఢిల్లీకి చెందిన యువ దంపతులను పోలీసుల ప్రత్యేక విభాగం (స్పెషల్ సెల్) అరెస్టు చేసింది. నిందితులను సరాయ్ కాలే ఖాన్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ సాహిల్, అతని భార్య సమీరాగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దంపతులు 2024 నుంచి సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.వీరు భారత సిమ్ కార్డులను సేకరించి, దుబాయ్ మీదుగా పాకిస్థాన్‌కు చేరవేసే లాజిస్టికల్ మద్దతును అందించారు. 2024–2025 మధ్య కాలంలో 8 భారతీయ సిమ్ కార్డులను పాకిస్థాన్‌కు పంపినందుకు గాను వీరు సుమారు రూ.30,000 నగదును పారితోషికంగా అందుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సిమ్ కార్డులతో పాక్ ఏజెంట్లు భారత్‌లోని వాట్సాప్ గ్రూపుల్లో చేరి, రక్షణ రంగానికి సంబంధించిన కీలక, సున్నితమైన సమాచారాన్ని సేకరించడానికి వినియోగించినట్లు దర్యాప్తులో తేలింది. The Northern Range of the Delhi Police Special Cell busts an alleged ISI-backed, Pakistan-based espionage network and arrests a Delhi-based couple accused of working for Pakistani Intelligence Operatives (PIOs) through social media since 2024.According to Delhi police, the… pic.twitter.com/6qFbGdQ9j8— All India Radio News (@airnewsalerts) August 28, 2026సాహిల్‌ను అదుపులోకి తీసుకుని మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపగా పాక్ ఏజెంట్లతో జరిపిన సంభాషణలు వెలుగుచూశాయి. 2024లో సమీరా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో పాక్ ఏజెంట్‌తో పరిచయం ఏర్పడిందని, అనంతరం మరింత మంది ఏజెంట్లతో సంబంధాలు కుదిర్చి ఆర్థిక ఎర చూపినట్లు సాహిల్ విచారణలో అంగీకరించాడు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఆర్మీ కంటోన్మెంట్ల వద్ద రెక్కీ నిర్వహించే వారిని వెతకడం, సైనిక న్యాయస్థానాల్లో కోర్టు మార్షల్ విచారణలు ఎదుర్కొంటున్న ఆర్మీ సిబ్బంది వివరాలను సేకరించడం వంటి బాధ్యతలను కూడా సాహిల్‌కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం సమీరాను కూడా అరెస్టు చేసి, వీరి వద్ద నుంచి కుట్రకు ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. భారత్‌లోని స్థానిక ఏజెంట్లు, ఓవర్‌గ్రౌండ్ వర్కర్లు, స్లీపర్ సెల్స్‌తో ఈ నెట్‌వర్క్‌కు ఉన్న సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: ఈ సీజన్లో తొలి స్వైన్ ఫ్లూ మృతి నమోదు -
వెస్టిండీస్ గడ్డపై పాక్ ఓపెనర్ విధ్వంసం.. 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2026లో జమైకా కింగ్స్‌మెన్ తిరిగి గెలుపు బాట పట్టింది. గురువారం వార్నర్ పార్క్ వేదికగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో జమైకా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జమైకా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ సాధించింది.జమైకా ఇన్నింగ్స్‌లో పాక్ స్టార్ ఓపెనర్ సైమ్ అయూబ్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. మిగితా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోపోయినప్పటికి అయూబ్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. 58 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సెయింట్ కిట్స్ బౌలర్లలో నసీం షా, హసరంగా, మెకాయ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం లక్ష్య చేధనలో సెయింట్ కిట్స్ 6 వికెట్ల నష్టానికి 171 పరుగులకే పరిమితమైంది. అండ్రీ ఫ్లెచర్(55) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జాసన్ హోల్డర్(34), దసన్ శనక(35) ఆఖరిలో మెరుపులు మెరిపించారు. అయినప్పటికి మిగితా ప్లేయర్ల నుంచి పెద్దగా సహకరం లేకపోవడంతో పేట్రియాట్స్ ఓటమి చవిచూసింది.చదవండి: భారత జట్టులో వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్.. కారణమిదే? -
ఎస్–400ల కోసం పాక్ వేగుల్ని నియమించింది!
సాక్షి, న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన ఎస్–400 రక్షణ వ్యవస్థల కోసం పాకిస్థాన్ తెగ ప్రయత్నం చేసిందని, ఆఖరికి ప్రత్యేక గూడచారులు, స్లీపర్ సెల్ల సాయంతో వాటిని గుర్తించే ప్రయత్నం జరిగిందని విశ్రాంత ఎయిర్‌మార్షల్ జితేంద్ర మిశ్రా వెల్లడించారు. ఎస్–400ల కారణంగానే పాకి స్థాన్ ఫైటర్జెట్లు సరిహద్దుకు 200 కిలోమీట్ల దగ్గరకు కూడా రాలేకపోయాయని ఆయన ఏఎన్ఐకి ఇచి్చన ఇంటర్వ్యూలో తెలిపారు. అత్యాధునిక ఎస్–400లు ఆపరేషన్ సింధూర్‌లో అత్యంత సమర్థంగా పనిచేశాయని, పాకిస్థాన్‌లోని సర్గోదా నుంచి నింగికి ఎగిరిన అవాక్ రాడార్ విమానాన్ని 314 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించి కూల్చేసిందని ఆయన తెలిపారు. అంత దూరంలోని విమానాన్ని కూల్చేయడం సైనిక చరిత్రలో ఒక రికార్డు అని చెప్పారు. భారత వాయుసేన మొదట పాకిస్తాన్ గ్రౌండ్ రాడార్లు, కమాండ్–అండ్–కంట్రోల్ కేంద్రాలను ధ్వంసం చేసిందని, దాంతో పాక్ సేనలకు ఏమీ కనిపించని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. దీంతో పాక్ రాడార్ విమానాలపై ఆధారపడ్డాయని, ఎస్–400లు వాటిని కూడా కూల్చేయడంతో విజయం సులభమైందని వివరించారు. ఈ ఆపరేషన్‌లో మహిళా ఫైటర్ పైలట్లు ఒకటి కంటే ఎక్కువ మిషన్లు నిర్వహించారని, మురిద్కేలోని లష్కరే తోయిబా ప్రధాన కేంద్రం, వైమానిక స్థావరాలు, కమాండ్–అండ్–కంట్రోల్ కేంద్రాలను నాశ నం చేయడంలో కీలకపాత్ర పోషించారని మిశ్రా తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ గత ఏడది మేలో ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. భారత్ నూర్ ఖాన్, భోలారి వంటి కీలక స్థావరాలు సహా 11 మిలిటరీ స్టేషన్లను ధ్వంసం చేసిన తరువాత పాకిస్తాన్ కాల్పుల విరమణకు అభ్యర్థించిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సందర్భంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురు కాలేదని జితేంద్ర మిశ్రా స్పష్టం చేశారు. పౌర నష్టాలు నివారించాలని, ఉగ్రవాదులు, హ్యాండ్లర్లనే లక్ష్యంగా చేసుకోవాలన్న సూచనలు మాత్రం వచ్చాయన్నారు. 2018లో భారత్–రష్యాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా మనకు ఎస్–400 వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. -
పాకిస్థాన్ వెంటనే చర్యలు తీసుకోవాలి: అమెరికా చట్టసభ సభ్యులు
వాషింగ్టన్: పాకిస్థాన్‌కు చెందిన క్రైస్తవ మహిళను అపహరించి, ఇస్లాంలోకి మార్చినట్లు ఆరోపణలు రావడంతో ఆమె ప్రాథమిక హక్కులను కాపాడాలని 11 మంది అమెరికా చట్టసభ సభ్యులతో కూడిన ద్వైపాక్షిక బృందం ఇస్లామాబాద్‌ను కోరింది. 18 ఏళ్ల పాకిస్థానీ క్రైస్తవ మహిళ నెహా ఫకీర్‌ను మార్చిలో అపహరించినట్లు, ఆ తర్వాత ఆమెను ఇస్లాంలోకి మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. టామ్ లాంటోస్ మానవ హక్కుల కమిషన్ సహాధ్యక్షుడు, కాంగ్రెస్ సభ్యుడు క్రిస్ స్మిత్.. ఫకీర్ భద్రత, ప్రాథమిక హక్కులను పాకిస్థాన్ ప్రభుత్వం కాపాడాలని కోరారు.“నెహా ఫకీర్ అదృశ్యం కావడం, ఆ తర్వాత ఆమె మతం మార్చుకోవడం వెనుక ఉన్న పరిస్థితులు ఆమె భద్రత, మత స్వేచ్ఛ, బలవంతం లేదా బెదిరింపులు లేకుండా తన హక్కులను వినియోగించుకునే సామర్థ్యంపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి” అని స్మిత్ అన్నారు.కేసు ఎలా వెలుగులోకి వచ్చింది?క్రైస్తవ సాలిడారిటీ ఇంటర్నేషనల్ జూన్ 10న ఫకీర్ కేసుపై ఆందోళన వ్యక్తం చేయడంతో అమెరికా స్పందన వచ్చింది. మార్చి 24న ఓ శిక్షణ తరగతికి హాజరైన తర్వాత ఆమె కనిపించకుండా పోయినట్లు ఆ సంస్థ తెలిపింది. ఆ తర్వాత ఫకీర్ లాహోర్‌లోని ఒక మదర్సాలో కనిపించారు. అక్కడ ఆమెను ఇస్లాంలోకి మార్చినట్లు తెలిసింది. అయితే, ఆమెను తిరిగి తమ వద్దకు పంపించాలని కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్‌ను పాకిస్థాన్ కోర్టు తిరస్కరించింది.అమెరికా చట్టసభ సభ్యులు లేఖలో ఏమన్నారు?స్మిత్‌తో పాటు అమెరికా కాంగ్రెస్‌కు చెందిన మరో 10 మంది సభ్యులు ఆగస్టు 20న పాకిస్థాన్ ఫెడరల్ న్యాయ, న్యాయవ్యవహారాల మంత్రి ఆజమ్ నజీర్ తారర్కు లేఖ రాశారు. ఫకీర్ కేసుపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ విషయంలో పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు. స్మిత్‌తో పాటు ప్రతినిధులు జేమ్స్ పి. మెక్‌గవర్న్, ఫ్రెంచ్ హిల్, గస్ బిలిరాకిస్, ఆండీ హారిస్, మారియా ఎల్విరా సలాజర్, రిలే మూర్, రాండీ వెబర్, మైఖేల్ క్లౌడ్, బ్రాడ్ షెర్మన్, బ్లేక్ మూర్ లేఖపై సంతకాలు చేశారు.ఫకీర్ శారీరక భద్రత, ఆరోగ్యాన్ని నిర్ధారించేందుకు పాకిస్థాన్ అధికారులు తమ న్యాయ వ్యవస్థ పరిధిలో అవసరమైన చర్యలు తీసుకోవాలని, స్వతంత్ర న్యాయవాదిని గోప్యంగా సంప్రదించే అవకాశం ఆమెకు కల్పించాలని చట్టసభ సభ్యులు కోరారు.ఫకీర్ తన కుటుంబ సభ్యులతో స్వేచ్ఛగా, వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం కల్పించాలని కూడా వారు కోరారు. భవిష్యత్తులో జరిగే ఏదైనా న్యాయపరమైన విచారణలో ఆమె తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసేలా, బెదిరింపులు లేదా అనుచిత ప్రభావానికి గురికాకుండా పరిస్థితులు ఉండేలా పాకిస్థాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.పాకిస్థాన్ రాజ్యాంగం కల్పిస్తున్న రక్షణలను కూడా సభ్యులు ప్రస్తావించారు. ఇందులో మతాన్ని స్వీకరించే, ఆచరించే, ప్రచారం చేసే స్వేచ్ఛకు హామీ ఇచ్చే ఆర్టికల్ 20, చట్టం ముందు సమానత్వానికి హామీ ఇచ్చే ఆర్టికల్ 25 ఉన్నాయి.“పాకిస్థాన్ రాజ్యాంగం మత స్వేచ్ఛ, చట్టం ముందు సమానత్వానికి రక్షణ కల్పిస్తోంది. అయితే ఒక యువతి తన విశ్వాసాలను సురక్షితంగా, స్వేచ్ఛగా వ్యక్తం చేయలేకపోతే దీనికి అర్థం ఉండదు” అని స్మిత్ అన్నారు. పాకిస్థాన్‌లోని మతపరమైన మైనారిటీలకు ఈ కేసు ఎంతో ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు. “ఈ కేసు పాకిస్థాన్‌లోని మతపరమైన మైనారిటీలకు ప్రత్యేకంగా ముఖ్యమైనది. వారు అపహరణ, బలవంతపు మతమార్పిడి, బలవంతపు వివాహాలకు గురవుతున్నారు” అని స్మిత్ అన్నారు.మత స్వేచ్ఛకు సంబంధించిన అంశాల్లో ప్రముఖంగా పనిచేస్తున్న స్మిత్.. మతపరమైన మైనారిటీ మహిళలు, బాలికలను అపహరించడం, బలవంతంగా మతం మార్చడం, అలాగే నిందితులను బాధ్యులుగా చేయడంలో అధికారులు విఫలమవుతున్న అంశాలపై చాలాకాలంగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: పంచదార్ల కొండపై వైఎస్సార్సీపీ పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం -
పాక్‌లో ఘోరం.. 15 మంది నవజాత శిశువులు సజీవదహనం
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఘోరం జరిగింది. ప్రభుత్వాసుపత్రిలో ఈ తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో అప్పుడే పుట్టిన బిడ్డలు 15 మంది సజీవ దహనం అయ్యారు. ఒకరిని సురక్షితంగా బయటకు తీసుకురాగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో మిలాద్ ఉన్ నబీ పూట నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఇస్లామాబాద్ పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS)లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. గైనకాలజీ వార్డులోని నర్సరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో నర్సరీలో 16 మంది శిశువులు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. వారిలో ఒక్కరిని మాత్రమే సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. మిగిలిన 15 మంది మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.కారణం ఏంటంటే.. ప్రాథమిక సమాచారం ప్రకారం.. పిల్లల వార్డులోని ఎయిర్ కండిషనర్(AC) కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం కంప్రెసర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అయితే అధికారులు మాత్రం ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు వెల్లడించలేదు. తొలుత మృతుల సంఖ్యపైనా స్పష్టత రాలేదు. కాసేపటికే 15 మంది నవజాత శిశువులు చనిపోయినట్లు స్థానిక జియో టీవీ కథనం ఇచ్చింది.తెల్లవారుజామునే విషాదంసమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఆస్పత్రికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాయి. నాలుగు ఫైరింజన్లు, ఆరు ఆంబులన్స్లు రెస్క్యూలో పాల్గొన్నాయి. అయితే బుధవారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో మంటలు ప్రారంభమైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. కొంతసేపటి పాటు ‘కూలింగ్ ఆపరేషన్స్’ కొనసాగినట్లు తెలుస్తోంది. అధికారులు ఈ ప్రమాదంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కన్నవాళ్ల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణమంతా శోకసంద్రంలో నిండిపోయింది. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు స్థానిక అధికారి ఒకరు వెల్లడించారు.🚨 TRAGIC: Fire at PIMS Hospital in Islamabad Kills 15 NewbornsAC compressor explosion in the gynecology ward sparks deadly blaze.#PIMS #Islamabad #Pakistan #BreakingNews@MarioNawfal pic.twitter.com/Z2exHnPX3J— DR ADNAN ALI (@DrMalko) August 26, 2026 ఇదీ చదవండి: భారత్‌లో ఆ మరణాలు.. షాకిచ్చిన నివేదిక -
కిరణా హిల్స్‌పై డ్రోన్ దాడి?! ఆపరేషన్ సిందూర్ మిస్టరీకి తెర
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని కీలక సైనిక ప్రాంతం కిరణా హిల్స్‌పై భారత డ్రోన్ దాడి చేసిందా?. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా జరిగిన ఈ పరిణామం గురించి ఇన్నాళ్లుగా సందేహాలు కొనసాగుతూ వచ్చాయి. అయితే దానికి మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తాజాగా చెక్ పెట్టారు. అది అనుకోకుండా జరిగిందంటూ ఆయన వివరణ ఇచ్చారు.కిరణా హిల్స్‌ను భారత్ ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోలేదని జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన జనరల్ చౌహాన్.. ఆ ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు.ఆపరేషన్ సిందూర్ సమయంలో సర్గోధా చుట్టుపక్కల రాడార్లను గుర్తించేందుకు లాయిటరింగ్ మ్యూనిషన్లను మోహరించినట్లు చౌహాన్ వెల్లడించారు. సర్గోధాకు సుమారు 10 కిలోమీటర్ల ఉత్తరాన కిరణా హిల్స్ ఉన్నాయి. ఈ ప్రాంతం పాకిస్థాన్ సైనిక, అణు మౌలిక సదుపాయాలతో సంబంధం ఉన్న కీలక ప్రాంతంగా చాలాకాలంగా ప్రచారంలో ఉంది. సర్గోధా పరిసరాల్లోని రాడార్లను గుర్తించి దాడి చేయడమే ఆ డ్రోన్ల లక్ష్యం. ఇలాంటి లాయిటరింగ్ మ్యూనిషన్లు కొంతసేపు గాల్లో తిరుగుతూ లక్ష్యాన్ని వెతుకుతాయని, సాధారణంగా దాదాపు రెండు గంటల వరకు గాలింపును కొనసాగించగలవని వివరించారు. నిర్ణీత సమయంలో లక్ష్యం దొరకకపోతే అవి తిరిగి వచ్చి ఎక్కడో ఒకచోట కూలిపోయే అవకాశం ఉంటుందని చెప్పారు.‘‘మేము కిరణా హిల్స్‌ను లక్ష్యంగా చేసుకోలేదు. రాడార్ల కోసం పంపిన లాయిటరింగ్ మ్యూనిషన్ లక్ష్యాన్ని గుర్తించలేకపోవడంతో చివరకు ఆ కొండల్లో ఒకదాన్ని ఢీకొని ఉండొచ్చు’’ అని చౌహాన్ వివరించారు. ఆ సమయంలో కిరణా హిల్స్ నుంచి పొగలు వస్తున్న దృశ్యాలు పాకిస్థాన్ మీడియా ద్వారా బయటకు రావడం కూడా ఈ ప్రాంతంపై అనేక అనుమానాలకు దారితీసింది. అయితే అది అక్కడి అణు స్థావరంపై ఉద్దేశపూర్వక దాడికి సంబంధించిన ఆధారం కాదని చౌహాన్ వ్యాఖ్యలు స్పష్టం చేశాయి.లోయర్ ఎయిర్‌స్పేస్.. భారత్ వ్యూహంఆపరేషన్ సిందూర్‌లో భారత్ అనుసరించిన వ్యూహంపై కూడా మాజీ సీడీఎస్ కీలక విషయాలు వెల్లడించారు. గతంలో ఉరీ ఘటన తర్వాత చేపట్టిన భూదాడులు, పుల్వామా అనంతరం నిర్వహించిన భారీ వైమానిక దాడులకు భిన్నంగా ఈసారి తక్కువ ఎత్తులోని గగనతలాన్ని వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. డ్రోన్లు, లాయిటరింగ్ మ్యూనిషన్లు, అటాక్ హెలికాప్టర్లు వంటి ఆయుధ వ్యవస్థలకు ఈ లోయర్ ఎయిర్‌స్పేస్ అనుకూలంగా ఉంటుందని చెప్పారు. తద్వారా కంట్రోల్లో ఉంటూనే.. అనూహ్య దాడులతో లక్ష్యాలను ఛేదించే అవకాశం లభించిందని వివరించారు.పాక్ చర్చలకు వచ్చినా.. సర్గోధాపై దాడికి ఓకేఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ చర్చలకు ముందుకొచ్చినప్పటికీ, సర్గోధాపై దాడికి భారత్ అనుమతించినట్లు చౌహాన్ వెల్లడించారు. పాకిస్థాన్ నుంచి చర్చల కోసం ఫోన్ వచ్చిన సమయంలోనే వైమానిక దళాధిపతి సర్గోధాపై దాడి చేయాలా అని తనను అడిగారని తెలిపారు. తాను ‘‘వెళ్లండి.. దాడి చేయండి’’ అని సూచించినట్లు చెప్పారు. అంతేకాకుండా మరో రెండు లక్ష్యాలను గుర్తించాలని ఆదేశించినట్లు వెల్లడించారు.అందులో ఒకటిగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని స్కార్దూను గుర్తించారు. దాడికి అనుమతి లభించినప్పటికీ అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ లక్ష్యాన్ని మార్చాల్సి వచ్చిందని చెప్పారు. చివరకు భోలారి వైమానిక స్థావరంలోని హ్యాంగర్‌పై భారత వైమానిక దళం దాడి చేసిందని చెప్పారు.భోలారి దాడి.. భారీ నష్టంమే 10న జరిగిన భారత వైమానిక దాడుల్లో భోలారి ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడి కీలకంగా నిలిచింది. అక్కడి ఓ హ్యాంగర్ పైకప్పులో భారీ రంధ్రం ఏర్పడినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. దాడి తీవ్రతకు నిదర్శనంగా హ్యాంగర్ చుట్టూ శకలాలు కనిపించాయి.ఇక పాక్ తాను జరిపిన దాడులపై ఎలాంటి స్పష్టత లేకుండా ఉండిపోయిందని అనిల్ చౌహాన్ అన్నారు. అమెరికా, చైనా సంస్థలకు చెందిన వాణిజ్య ఉపగ్రహ చిత్రాల ద్వారా సమాచారం పొందేందుకు ప్రయత్నించినప్పటికీ ఆశించిన ఆధారాలు లభించలేదని ఆయన పేర్కొన్నారు.సమన్వయమే మన బలంఆపరేషన్ సిందూర్‌లో భారత్ పైచేయి సాధించడానికి మెరుగైన పరిస్థితుల అవగాహన, యుద్ధభూమిపై పారదర్శకత, మూడు దళాల మధ్య సమన్వయం కీలకంగా పనిచేశాయని చౌహాన్ అన్నారు. సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలకు ఒకే ఆపరేషనల్ చిత్రంపై అవగాహన ఉండటం వల్ల వేగంగా నిర్ణయాలు తీసుకోగలిగామని వివరించారు. అదే సమయంలో రాజకీయ నాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడం, సైన్యానికి ఆపరేషనల్ స్వేచ్ఛ లభించడం కూడా విజయానికి కారణమైందని చెప్పారు.2025 ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిగా భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు దాడులు నిర్వహించాయి. తదనంతరం పాకిస్థాన్ సైనిక చర్యలకు దిగడంతో భారత్ తన దాడులను విస్తరించి పాక్ వైమానిక స్థావరాలు, రాడార్ కేంద్రాలు, ఇతర సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది. మే 10న ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) మధ్య సంప్రదింపుల అనంతరం కాల్పుల విరమణ అమల్లోకి వచ్చి ఉద్రిక్తతలు ఆగిపోయాయి.ఇదీ చదవండి: అమెరికా ఆశలు తగ్గుముఖం! -
యుద్ధం ముగింపు, హార్మూజ్ తెరవడంలో ‘అద్భుత పురోగతి’!
ఇస్లామాబాద్: అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు ప్రారంభమయ్యేలా చేసేందుకు పాకిస్థాన్ నేతలు టెహ్రాన్‌లో చర్చలు జరిపారు. యుద్ధాన్ని ఆపేందుకు శాంతి దిశగా మార్గంపై జరిగిన చర్చల్లో పాకిస్థాన్, ఇరాన్ అద్భుతమైన రీతిలో పురోగతి సాధించాయని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మంగళవారం తెలిపారు. ఆయన టెహ్రాన్ పర్యటన ముగిసింది.మరింత ఉద్రిక్తత పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఘర్షణను వేగంగా ముగించే అంశాలపై ఇరు దేశాలు చర్చించాయని పాకిస్థాన్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, ఇరాన్ నేతల మధ్య జరిగిన సమావేశం గురించి ఈ ప్రకటన వెలువడింది. ప్రాంతీయ శాంతి, వివాదానికి చర్చల ద్వారా పరిష్కారం కనుగొనే మార్గంపై కూడా ఇరు పక్షాలు అభిప్రాయాలను పంచుకున్నాయని ప్రకటనలో పేర్కొన్నారు.“ఇరాన్ అధ్యక్షుడు తమ ప్రభుత్వ దృక్కోణాన్ని స్పష్టంగా వివరించారు. చర్చించిన అంశాలపై మేము ఎంతో నిర్మాణాత్మకంగా అభిప్రాయాలను పంచుకున్నాం” అని మునీర్‌తో కలిసి టెహ్రాన్ వెళ్లిన అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఎక్స్‌లో పోస్టు చేశారు.దీనిపై వైట్ హౌస్, విదేశాంగ శాఖ స్పందించలేదు. టెహ్రాన్ పర్యటనకు ముందు మునీర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడారని రాయిటర్స్ సోమవారం తెలిపింది. ఇరాన్‌ను ఒంటరి చేయాలని ప్రయత్నిస్తున్న ట్రంప్, ఇరాన్‌కు “ఏ విధమైన సహాయ మార్గాన్నైనా” అందించే ఏ దేశమైనా ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని గత వారం హెచ్చరించారు. దీనికి ప్రతిగా ఇరాన్ గల్ఫ్ నుంచి చమురు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని హామీ ఇచ్చింది. -
ఇమ్రాన్ ఉనికే లేకుండా చేయాలని చూశారు: ఇంగ్లండ్ దిగ్గజం
పాకిస్తాన్ ప్రభుత్వం గురించి ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ ఆథర్టన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇమ్రాన్ ఖాన్ ఉనికే లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని.. అయితే, సోషల్ మీడియా కాలంలో ఇలాంటివి సాధ్యం కావని తెలిసి మిన్నకుండిపోయిందన్నాడు.అవినీతి ఆరోపణలతో..కాగా పాకిస్తాన్‌కు మొట్టమొదటి వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించిన ఇమ్రాన్.. ఏకంగా ప్రధాని స్థాయికి ఎదిగాడు. కానీ అనతికాలంలోనే అతడి ప్రతిష్ట మసకబారింది. అవినీతి ఆరోపణలతో అరెస్టైన ఇమ్రాన్ ఖాన్.. 2023 నుంచి జైలులోనే ఉన్నాడు.ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం గురించి ఆందోళనలు తలెత్తుతున్నాయి. అతడికి సరైన చికిత్స అందించకుండా ప్రభుత్వం వేధిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. ఇమ్రాన్‌ను ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.కోర్టు ఆదేశాల మేరకు...నిజానికి నిబంధనల ప్రకారం ఖైదీలకు జైలులోనే వైద్య చికిత్స అందిస్తామని.. అవసరమైతేనే ప్రభుత్వ ఆస్పత్రికి మాత్రమే తరలిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తారిఖ్ ఫజల్ ఇదివరకు వెల్లడించారు. అయితే, కోర్టు ఆదేశాలతో ఇమ్రాన్‌ను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లినప్పటికీ.. పరీక్షల అనంతరం మళ్లీ అడియాలా జైలుకు తరలించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు అల్ షిపా ఆస్పత్రి వైద్యుల పరీక్షలో తేలిందని ప్రభుత్వం ప్రకటించింది.21 మంది లేఖఈ పరిణామాల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ విషయంలో మానవతా దృక్పథంతో స్పందించాలని పలువురు మాజీ కెప్టెన్లు ప్రభుత్వాన్ని కోరారు. తొమ్మిది దేశాలకు చెందిన 21 మంది పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్‌నకు మరోసారి లేఖ రాశారు. ఇందులో టీమిండియా మాజీ కెప్టెన్లు సునిల్ గావస్కర్, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా ఉన్నారు.ఇమ్రాన్ ఖాన్ ఉనికే లేకుండా చేయాలని చూశారుఈ విషయం గురించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ ఆథర్టన్ తాజాగా స్పందించాడు. ‘‘మానవతా దృక్పథంతో స్పందించి ఇమ్రాన్ ఖాన్‌కు సరైన రీతిలో చికిత్స అందేలా చూడాలని 21 మంది మాజీ కెప్టెన్లు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇందులో నేను, నాసిర్ హుసేన్ కూడా ఉన్నాము.నాకైతే.. రాజ్యం (ప్రభుత్వం) ఇమ్రాన్ ఆనవాళ్లు, ఉనికి లేకుండా చేయడానికి ప్రయత్నిస్తోందనే అనిపించింది. అయితే, సోషల్ మీడియా యుగంలో ఇలాంటివి సాధ్యం కానేకావు’’ అని ఆథర్టన్ స్కై స్పోర్ట్స్ క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నాడు. కాగా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటి వరకు పాక్ మాజీ క్రికెటర్లు ఎవరూ కూడా స్పందించలేదు. అయితే, వాళ్లు ప్రస్తుతం దేశంలో ఉన్నందున ఆ ధైర్యం చేయలేకపోవచ్చని కపిల్ దేవ్ ఇటీవల పేర్కొన్నాడు.చదవండి: ఐపీఎల్ ఆల్‌టైమ్ జట్టు.. రోహిత్‌ను నో ప్లేస్! -
కజియా లిజ్ మెజో గెలుపుపై పాకిస్తాన్ మిస్ యూనివర్స్ రియాక్షన్ ఇదే..!
ఇటీవల మిస్ యూనివర్స్ ఆయా దేశాలు తమ ప్రతినిధ్యులుగా అందగత్తెలను ఎంపిక చేశాయి. ఇటీవలే మిస్ యూనివర్స్ పాకిస్థాన్‌గా మిస్బా అర్షద్ విజయం సాదించడం చూశాం. ఆ తదనంతరమే భారత్,థాయిలాండ్‌లు కూడా మిస్ యూనివర్స్ 2026కి తమ ప్రతినిధులను ఎంపిక చేశాయి. నవంబర్ 24, 2026న ప్యూర్టో రికోలోని శాన్ జువాన్‌లో ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ పోటీలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయా దేశాలు తమ దేశానికి ప్రాతినిధ్యం వహించే అందగత్తెలను ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే భారత్ మిస్ యూనివర్స ఇండియాగా కిరీటం గెలుచుకున్న కేరళ అమ్మాయి కజియా లిజ్ మెజో గెలుపై పాకిస్థాన్ మిస్ యూనివర్స్ మిస్బా అర్షద్ ఇలా స్పందించింది. ఆమె ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో మిస్ యూనివర్స్ ఇండియా 2026గా కజియా లిజ్ మెజో ఫోటోను షేర్ చేస్తూ. ‘చాలా అందంగా ఉన్నారు, మీకు అభినందనలు. దీనికి పూర్తిగా అర్హులు మీరు. త్వరలోనే ప్యూర్టో రికోలో కలుద్దాం!’ అని రాసుకొచ్చింది. అలాగే మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ 2026గా కిరీటం గెలుచుకున్న తరీనా బోటెస్ను కూడా అభినందిస్తూ..ఇది ఒక అమూల్యమైన క్షణం అని రాశారు పోస్ట్‌లో. అంతేగాదు 'పాకిస్తానీ పేజెంట్స్' అనే ఇన్స్టాగ్రామ్ పేజీ, తరీనా బోట్స్, మిస్బా అర్షద్, కజియా లిజ్ మెజోల కొలాజ్ల ఫోటోలను పంచుతూ "టీమ్ ఆసియా: బలపడుతోంది" అని రాసి ఉంది. అంతేగాదు గతవారమే ముగ్గురు అందమైన రాణులు కిరీటధారణ చేయడం చూశాం. ఇది టీమ్ ఆసియాను మరింత బలంగా, సొగసైనదిగా చేసింది అని క్యాప్షన్ జోడించి మరిపోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌నే రీ షేర్చేస్తూ మిస్బా అర్షద్ హార్ట్-ఐస్ ఎమోజీతో ఇలా స్పందించిందామె.(చదవండి: Miss Universe India 2026: సుస్మితా సేన్‌పై వెల్లువెత్తుతున్న విమర్శలు..! ఊర్వశి రౌతేలా అలా కనిపించడానికి రీజన్) -
'బాబర్ ఆజం 250 రన్స్ చేయాలి'.. పాక్ జట్టును ఎగతాళి చేసిన బ్రాడ్
పాకిస్తాన్ జట్టును ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ మరోసారి ఎగతాళి చేశాడు. లార్డ్స్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో పాక్ గెలవాలంటే ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం కనీసం 250కు పైగా పరుగులు చేయాలని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. కాగా హెడ్డింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌కు బాబర్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. దీంతో హెడ్డింగ్లీ టెస్టులో పాక్ జట్టు పూర్తిగా తేలిపోయింది. పర్యాటక పాక్ జట్టు ఏకంగా ఇన్నింగ్స్ 103 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. అయితే బాబర్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో లార్డ్స్ టెస్టుకు అందుబాటులో ఉండనున్నాడు. ఈ నేపథ్యంలోనే స్టువర్ట్ బ్రాడ్ 'ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్' పోడ్కాస్ట్లో మాట్లాడుతూ పాక్ జట్టుపై వ్యంగ్యాస్త్రాలు విసిరాడు.రెండో టెస్టులో ఇంగ్లండ్‌కు పోటీ ఇవ్వాలంటే పాకిస్తాన్‌కు అదృష్టం చాలా అవసరం. లార్డ్స్‌లో పాక్ గెలవాలంటే బాబర్ ఆజం కనీసం 250 పరుగులైనా చేయాల్సి ఉంటుంది. పాక్ జట్టులో సరైన ప్లేయర్లు లేరు. కాబట్టి టీమ్ మేనెజ్మెంట్ ఇలాంటి అద్భుతాలు జరగాలని ఆశించాలని బ్రాడ్ పేర్కొన్నాడు.కాగా బాబర్ ఆజం గత కొంత కాలంగా టెస్టు క్రికెట్లో తన స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నాడు. వెస్టిండీస్ పర్యటనలో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచినప్పటికి.. గత నాలుగేళ్ల నుంచి మూడంకెల మార్క్‌ను అందుకోలేకపోతున్నాడు. అతడు చివరగా 2022లో టెస్టు సెంచరీ సాధించాడు. ఇలాంటి పరిస్థితుల్లో బాబర్ డబుల్ సెంచరీ సాధించడం ఆసాధ్యం.చదవండి: Asia Cup 2026: పాకిస్తాన్‌కు భారీ షాక్ -
ఆసియా కప్ కోసం పాకిస్తాన్ మాస్టర్ ప్లాన్
ఆసియా కప్ 2026 కోసం పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు మాస్టర్ ప్లాన్ వేసింది. సాధారణంగా కనిపించని విధంగా పురుషుల జట్టుతో టీ20 మ్యాచ్‌లు ఆడి కీలక టోర్నీకి సన్నద్ధమైంది. ఆగస్టు 28 నుంచి మహిళల ఆసియా కప్ జరగనున్న నేపథ్యంలో, పాక్ క్రికెట్ బోర్డు ఈ ప్రత్యేక ప్రాక్టీస్‌కు ఏర్పాట్లు చేసింది.ఫాతిమా సనా నాయకత్వంలోని పాకిస్తాన్ మహిళల జట్టు లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన శిక్షణ శిబిరంలో భాగంగా అబ్దుల్ ఖాదిర్ క్రికెట్ అకాడమీ పురుషుల జట్టుతో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఈ జట్టులో యువ ఆటగాళ్లతో పాటు సీనియర్ క్రికెటర్లు కూడా ఉన్నారు.పూర్తి స్థాయి టీ20 మ్యాచ్లుఇవి కేవలం నెట్స్‌లో నిర్వహించే సిమ్యులేషన్ మ్యాచ్‌లు కావు. పూర్తి స్థాయి టీ20 నిబంధనలతోనే ఈ రెండు మ్యాచ్‌లు నిర్వహించారు. పురుషుల జట్టుతో ఆడటం ద్వారా మహిళల ఆటగాళ్లకు మరింత వేగం, ఒత్తిడి, పోటీ వాతావరణం ఎదురైంది.ముఖ్యంగా కీలక సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడం, ఒత్తిడిని ఎదుర్కోవడం, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలను అమలు చేయడం వంటి అంశాలపై ఈ మ్యాచ్‌లు ఉపయోగపడ్డాయని జట్టు భావిస్తోంది.పురుషుల జట్టుతో ఎందుకు ఆడారు..?ఆసియా కప్‌కు ముందు తమ జట్టును ఒత్తిడిలో పరీక్షించడమే ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌ల ప్రధాన ఉద్దేశమని కెప్టెన్ ఫాతిమా సనా వెల్లడించింది. పెద్ద టోర్నీల్లో కీలక సమయాల్లో ఆటగాళ్లు ఒత్తిడికి గురై తప్పులు చేయకుండా ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పింది.ఆసియా కప్‌లో పాక్‌కు అంతగా కలిసిరాని రికార్డుపాకిస్తాన్ మహిళల జట్టు ఇప్పటివరకు ఆసియా కప్‌ను ఒక్కసారి కూడా గెలవలేదు. 2012, 2016లో ఫైనల్‌కు చేరినప్పటికీ రెండు సార్లూ భారత్ చేతిలో ఓడిపోయింది. గత ఎడిషన్‌లో మాత్రం సెమీఫైనల్లో శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది.గ్రూప్-Aలో భారత్‌తో పాక్ఆసియా కప్ 2026లో పాకిస్తాన్ గ్రూప్-Aలో భారత్‌తో పాటు ఉంది. సెప్టెంబర్ 1న థాయ్‌లాండ్‌తో మ్యాచ్ ద్వారా పాక్ తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.ఆ తర్వాత సెప్టెంబర్ 5న భారత్‌తో కీలక మ్యాచ్ ఆడనుంది. గతంలో ఫైనల్లో భారత్ చేతిలో ఎదురైన పరాజయాల నేపథ్యంలో ఈసారి ఎలాగైనా మెరుగైన ప్రదర్శన చేసి టైటిల్ పోరులో ముందుకు వెళ్లాలని పాక్ భావిస్తోంది.చదవండి: Asia Cup 2026: పాకిస్తాన్‌కు భారీ షాక్ -
భారత్‌కు 150 మంది పాక్ వధువులు
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, వాఘా-అటారీ సరిహద్దు మూసివేత తదితర పరిణామాల తర్వాత నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా వివాహాలు వాయిదా పడిన 150 మందికి పైగా పాకిస్థానీ సింధీ వధువులు ఎట్టకేలకు తమ పెళ్లిళ్ల కోసం భారత్ చేరుకున్నారు. భారత యువకులతో నిశ్చితార్థం చేసుకున్న వీరు, నేరుగా కాకుండా ఇతర దేశాల మీదుగా విమాన మార్గంలో దేశంలోకి అడుగుపెట్టారు.సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా చిక్కుకుపోయిన వీరికి, వారి బంధువులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక షరతులతో కూడిన వీసాలు జారీ చేసిందని కమ్యూనిటీ నేత రాజేష్ ఝంబియా ఆదివారం తెలిపారు. ‘వారి సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. వధువులు, దాదాపు 450 మంది బంధువులు మస్కట్, దుబాయ్, శ్రీలంక తదితర దేశాల మీదుగా కనెక్టింగ్ విమానాల ద్వారా మాత్రమే భారత్ చేరుకోవాలని కేంద్రం నిబంధన విధించింది’ అని ఆయన పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించారు.గతంలో వాఘా-అటారీ సరిహద్దు గుండా వీసా ప్రక్రియ, ప్రయాణాలు సులభంగా ఉండటంతో పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన కుటుంబాలు భారతీయులతో వివాహ సంబంధాలు కుదుర్చుకునేవి. అయితే జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన భారీ ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించడంతో పరిస్థితి మారిపోయింది. దీనికి ప్రతిస్పందనగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించి, వాఘా-అటారీ సరిహద్దును మూసివేసింది. దీంతో నాగ్‌పూర్, రాయ్‌పూర్, జోధ్‌పూర్, పుణె తదితర నగరాల్లో జరగాల్సిన సుమారు 150 వివాహాలు నిలిచిపోయాయని ఝంబియా వివరించారు.ఈ విపత్కర పరిస్థితుల్లో ఆయా కుటుంబాలు పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్ ఘోట్కిలోని ప్రసిద్ధ హిందూ మత క్షేత్రమైన షాదానీ దర్బార్ అధిపతి సంత్ యుధిష్ఠిర్‌లాల్ షాదానీని ఆశ్రయించాయి. ఆలయ యాజమాన్యం కేంద్ర హోం మంత్రిత్వ శాఖను (ఎంహెచ్ఏ) అభ్యర్థించడంతో, ప్రత్యేక విమాన ప్రయాణ షరతులతో కూడిన వీసాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఫలితంగా, ఈ ఏడాది ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు 150 మంది వధువులు భారత్ చేరుకున్నారని, ఇందులో 15 మంది నాగ్‌పూర్‌లో వివాహం చేసుకోనున్నారని ఝంబియా పేర్కొన్నారు. ప్రస్తుతం మరో 300 మంది పాకిస్థానీ సింధీ మహిళలు సైతం వీసాల కోసం దరఖాస్తు చేసుకుని నిరీక్షిస్తున్నారని ఆయన వెల్లడించారు.ఇది కూడా చదవండి: గినియాలో విషాదం: చెత్త కుప్ప కూలి 30 మంది మృతి -
ఇమ్రాన్ ఖాన్ కోసం మాజీ కెప్టెన్లు
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 1992 ప్రపంచకప్ విజేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ పలుదేశాలకు చెందిన 21 మంది మాజీ అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లు పాకిస్తాన్ ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు వారు లేఖ రాశారు. ఆరు నెలల వ్యవధిలో మాజీ క్రికెటర్లు ఇలాంటి విజ్ఞప్తి చేయడం ఇది రెండోసారి.భారత్‌కు చెందిన మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్‌సర్కార్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు గ్రెగ్ చాపెల్, అలన్ బోర్డర్, ఇయాన్ చాపెల్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు మైక్ గాటింగ్, ఆండ్రూ స్ట్రాస్, అలిస్టర్ కుక్, శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ, వెస్టిండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ తదితరులు ఈ లేఖపై సంతకాలు చేశారు.పాకిస్తాన్లో ఈ వారంలో ఇమ్రాన్ ఖాన్‌కు జరిగిన స్వల్పకాలిక వైద్య పరీక్ష అనంతరం ఈ విజ్ఞప్తి వెలువడింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయనకు పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించలేదని మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేశారు.సుప్రీంకోర్టు ఆదేశాల అమలుపై ప్రశ్నలుఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక వైద్య బోర్డును ఏర్పాటు చేయాలని, అందులో ఆయన సొంత వైద్యులు, సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్‌ను కూడా చేర్చాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశించినట్లు లేఖలో పేర్కొన్నారు. అలాగే కుటుంబ సభ్యులతో వారానికి ఒకసారి భేటీ అయ్యే అవకాశాన్ని పునరుద్ధరించాలని కూడా ఆదేశాలు ఉన్నాయని మాజీ క్రికెటర్లు గుర్తుచేశారు.అయితే ఇమ్రాన్‌ను ఆసుపత్రికి తరలించినప్పటికీ, అక్కడ కొన్ని గంటలు మాత్రమే ఉంచి తిరిగి జైలుకు తరలించారని వారు పేర్కొన్నారు. కోర్టు ఆదేశించిన వైద్య బోర్డు పూర్తి స్థాయిలో తన పరీక్షను నిర్వహించకముందే ఈ ప్రక్రియ ముగిసిందని ఇమ్రాన్ కుటుంబ సభ్యులు, న్యాయ బృందం ఆరోపిస్తోంది.ఇమ్రాన్‌ను కోర్టు సూచించిన బోర్డు కాకుండా ప్రభుత్వం నియమించిన వైద్య బృందం పరీక్షించిందని, అనంతరం ఆయనను ‘వైద్యపరంగా ఆరోగ్యంగా ఉన్నారు’ అని ప్రకటించి అడియాలా జైలుకు తిరిగి పంపించారని లేఖలో పేర్కొన్నారు.మూడు ప్రధాన డిమాండ్లుమాజీ క్రికెటర్లు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మూడు ప్రధాన అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.* కోర్టు ఆదేశించిన వైద్య బోర్డు స్వతంత్రంగా ఇమ్రాన్ ఖాన్‌ను పరీక్షించే అవకాశం కల్పించాలి.* కుటుంబ సభ్యులతో వారానికి ఒకసారి జరిగే భేటీలను పునరుద్ధరించాలి.* వైద్య పరీక్షల అనంతరం అవసరమని సూచించే చికిత్సను ఎలాంటి ఆలస్యం లేకుండా అందించాలి.ఈ విజ్ఞప్తి పాకిస్తాన్ అంతర్గత రాజకీయ లేదా న్యాయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కాదని మాజీ క్రికెటర్లు స్పష్టం చేశారు. తాము రాజకీయ నాయకులుగా కాకుండా క్రికెట్ మైదానంలో ఇమ్రాన్‌తో కలిసి ఆడిన లేదా ప్రత్యర్థులుగా తలపడిన మాజీ ఆటగాళ్లుగా ఈ విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.‘అసాధారణమైన డిమాండ్ ఏమీ కాదు’ఈ లేఖను ప్రారంభించిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ మాట్లాడుతూ, పాకిస్తాన్‌ను తాము అసాధారణమైనదేమీ కోరడం లేదని అన్నారు.“చాలా దేశాల్లో సహజంగా అమలు చేసే కోర్టు ఆదేశాన్ని పాకిస్తాన్లో కూడా అమలు చేయాలని మాత్రమే మేము కోరుతున్నాం” అని చాపెల్ పేర్కొన్నారు.ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు. ఆయన ఆరోగ్యం, జైలు పరిస్థితులు, కుటుంబ సభ్యులతో భేటీలపై గతంలోనూ ఆందోళనలు వ్యక్తమయ్యాయి. తాజా లేఖతో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి మరోసారి అంతర్జాతీయ క్రికెట్ వర్గాల దృష్టిని ఆకర్షించింది.ఈ లేఖపై మైఖేల్ అథర్టన్, అలెక్స్ బ్లాక్వెల్, అలన్ బోర్డర్, మైఖేల్ బ్రీర్లీ, గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, బెలిండా క్లార్క్, అలిస్టర్ కుక్, మైక్ గాటింగ్, సునీల్ గవాస్కర్, లీ జెర్మన్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, డేవిడ్ గోవర్, కిమ్ హ్యూస్, నాసర్ హుస్సేన్, క్లైవ్ లాయిడ్, కపిల్ దేవ్, అర్జున రణతుంగ, ఆండ్రూ స్ట్రాస్, దిలీప్ వెంగ్‌సర్కార్, స్టీఫెన్ వా, జాన్ రైట్ తదితరులు సంతకాలు చేశారు.చదవండి: పోలీసుల అదుపులో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ -
జైషే ప్రధాన కార్యాలయం పునర్నిర్మాణం
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం గత ఏడాది మే నెలలో ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాద స్థావరాలను, శిక్షణ కేంద్రాలను నేలమట్టం చేసింది. ముష్కరులకు భారీగా నష్టం వాటిల్లింది. పలువురు అంతమయ్యారు. పాక్ పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్పూర్లో నిషేధిత జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మర్కజ్ సుభాన్ అల్లా ప్రధాన కార్యాలయం తీవ్రస్థాయిలో ధ్వంసమైంది. ఈ కార్యాలయాన్ని జైషే మొహమ్మద్ పునర్నిర్మించుకుంది. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కొత్త పాలరాయి, రంగులు హంగులతో పునరుద్ధరించారు. భారత సైన్యం దాడుల్లో దెబ్బతిన్న గోపురాలను పునర్నిర్మించారు. గోతులను పూడ్చేశారు. నిర్మాణాన్ని యథాతథ స్థితికి తీసుకొచ్చారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం మర్కజ్ సుభాన్ ప్రధాన కార్యాలయం పునరుద్ధరణ కోసం పాకిస్తాన్ ప్రభుత్వం జైషే మొహమ్మద్‌కు ఏకంగా రూ.25 కోట్లు వాయిదాల రూపంలో అందజేసింది. ఇందులో సుమారు రూ.11 కోట్లను ప్రత్యేకంగా సెంట్రల్ హాల్ పునర్నిర్మాణం కోసం ఖర్చు చేశారు. మదర్సా అల్–సబీర్, జైషే మొహమ్మద్ కమాండర్లు ఉపయోగించే నివాస గృహాలతో సహా ప్రధాన సముదాయానికి ఆనుకుని ఉన్న దెబ్బతిన్న నిర్మాణాలను తొలగించి, ఆ స్థలంలో కొత్త నిర్మాణాలు చేపట్టారు. ఆపరేషన్ సింధూర్ జరిగిన 15 నెలల తర్వాత ఈ పునర్నిర్మాణం పూర్తయింది. అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్కజ్ సుభాన్ అల్లా హెడ్ క్వార్టర్‌ను జైషే మొహమ్మద్ తమ కార్యకర్తల నియామకం, శిక్షణ, సిద్ధాంతాల బోధన కోసం ఉపయోగిస్తోంది. ఈ 18 ఎకరాల ‘ఉస్మాన్–ఓ–అలీ క్యాంపస్’ ప్రాంగణంలో ఒక మసీదు, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. వాస్తవానికి జైషే మొహమ్మద్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం కేవలం అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో 2002లో∙నిషేధించినప్పటికీ ఆ సంస్థ పాక్ నుంచే తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తోంది. -
మరోసారి పాక్ బుద్ధి బట్టబయిలు.. కోట్ల కరెన్సీతో జైషే స్థావరం
ఇస్లామాబాద్: గతేడాది పాక్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో వైమానిక దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడులలో జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ప్రధాన స్థావరం పూర్తిగా ధ్వంసమైంది.కాగా ఇప్పుడు తాజాగా ఆ స్థావరాన్ని పునర్నిర్మించినట్లు వార్తకథనాలు వస్తున్నాయి. అంతేకాకుండా దానిని మరింత హంగులతో నిర్మించేందుకు పాకిస్తాన్ భారీగానే నిధులు కేటాయించిందని సమాచారం.2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ దాడి చేసింది. బహవల్పూర్లోని జామియా మస్జిద్ సుభాన్ అల్లాహ్‌పై జరిగిన దాడిలో మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 10 మందితో పాటు, మరో నలుగురు సన్నిహిత సహచరులు మరణించారు. ఈ వివరాలు స్వయంగా మసూద్ అజర్ వెల్లడించారు. తాజాగా ఆస్థావరాన్ని పునర్నిర్మించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇండియా టుడే కథనం ప్రకారం.. దాడుల్లో దెబ్బతిన్న జైష్ స్థావరం ఇప్పుడు కొత్త మార్బుల్, తాజా పెయింట్, కొత్త ప్లాస్టర్‌తో తిరిగి పునరుద్ధరించబడింది. దాడుల వల్ల ఏర్పడిన నష్టం బయటకు కనిపించకుండా భవనాలను పూర్తిగా మరమ్మతులు చేసినట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. ప్రధాన సముదాయానికి ఆనుకుని దెబ్బతిన్న నిర్మాణాలను కూడా తొలగించి, వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది.పునర్నిర్మాణానికి 25 కోట్ల పాకిస్థానీ కరెన్సీ?కాగా ఈ స్థావరం పునర్నిర్మానం కోసం 25 కోట్ల పాకిస్థానీ రూపాయలను నగదు వాయిదాల రూపంలో అందించినట్లు భారత ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందుతోంది. దాడుల సమయంలో ఏర్పడిన ప్రధాన హాల్లోని గుంతలను పూడ్చివేసి, దెబ్బతిన్న గోపురాలను తిరిగి నిర్మించినట్లు నివేదిక పేర్కొంది. దీనికోసమే సుమారు 11 కోట్ల పాకిస్థానీ రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం.ఉగ్ర శిక్షణకు కేంద్రంగా స్థావరంఈ సముదాయం గతంలో ఉగ్రవాద భావజాల బోధన, శిక్షణకు కీలక కేంద్రంగా పనిచేసినట్లు నివేదిక తెలిపింది. ఇక్కడ ఉగ్రవాద నియామకులకు క్రమం తప్పకుండా ఆయుధాల వినియోగ శిక్షణ, శారీరక వ్యాయామాలు, మతపరమైన బోధనలు నిర్వహించేవారని పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత జైష్-ఎ-మొహమ్మద్‌తో పాటు ఇతర ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాల కేంద్రాలను పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్‌కు తరలించినట్లు అప్పట్లో నివేదికలు వెలువడ్డాయి. -
పాకిస్తాన్ లో భారత్ పై ఇంత క్రేజా...!
-
బంగ్లా నిర్ణయంపై హైటెన్షన్.. భారత్‌కు డేంజర్ బెల్!
ఒకవైపు పాకిస్తాన్.. మరోవైపు టర్కీ.. మధ్యలో సౌదీ అరేబియా. ఇప్పుడు ఈ సమీకరణంలోకి బంగ్లాదేశ్ కూడా అడుగుపెడుతుందా? అదే జరిగితే భారత్‌కు ఏంటి పరిస్థితి? ఢిల్లీకి ఇది కేవలం మరో దేశం తీసుకునే విదేశాంగ నిర్ణయమా? లేక భారత్ చుట్టూ మారుతున్న వ్యూహాత్మక సమీకరణాలకు ఇది సంకేతమా? ఈ ప్రశ్నలే ఇప్పుడు ఆసియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ తొలిసారి సౌదీ–పాక్–టర్కీ రక్షణ వ్యవస్థలో చేరే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయకుండా.. ‘ముందు బంగ్లాదేశ్ ప్రయోజనాలే’ అంటూ తలుపులు తెరిచి ఉంచింది. దీంతో, కొత్త సమీకరణాలు భారత్ ముందుకు వస్తున్నాయి.ఆగస్టు 7న మక్కాలో సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే.. మిగిలిన రెండు దేశాలపై కూడా దాడిగా పరిగణించేలా పరస్పర రక్షణ సహకారానికి రూపకల్పన చేశారు. ఇప్పుడు ఇదే వ్యవస్థలోకి బంగ్లాదేశ్ వస్తే.. దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో మరో కొత్త సమీకరణం తెరపైకి రావడం ఖాయం.బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత బలం చేకూర్చాయి. సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీతో కూడిన ఆర్థిక లేదా రక్షణ వ్యవస్థలో చేరే అవకాశంపై బంగ్లాదేశ్ సానుకూల దృక్పథంతో ఉందని ఆయన చెప్పారు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా.. అది బంగ్లాదేశ్, అక్కడి ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. మరో సహాయ మంత్రి షామా ఒబైద్ ఇస్లాం కూడా ఇదే మాట చెప్పారు. ఏ కూటమిలో చేరాలన్నా జాతీయ ప్రయోజనాలే ప్రాతిపదికగా ఉంటాయని తెలిపారు.భారత్‌కు అసలు ప్రశ్న..ఇక్కడే భారత్‌కు అసలు ప్రశ్న మొదలవుతోంది. బంగ్లాదేశ్ ఈ కూటమిలో చేరితే వెంటనే భారత్‌కు సైనిక ముప్పు ఏర్పడుతుందా? ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి అంచనాకు తావు లేదు. ఈ రక్షణ ఒప్పందం భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఏర్పడినదని ఎక్కడా ప్రకటించలేదు. కాబట్టి బంగ్లాదేశ్ చేరినంత మాత్రాన భారత్‌పై యుద్ధ ముప్పు పెరుగుతుందని చెప్పడం తొందరపాటు అవుతుంది. కానీ సమస్య అంతకంటే లోతైనది. ఇది నేరుగా సైనిక ముప్పు కంటే.. దౌత్యం, వ్యూహాత్మక ప్రభావం, ప్రాంతీయ సమీకరణాలకు సంబంధించిన అంశం.ఎందుకంటే భారత్‌కు బంగ్లాదేశ్ సాధారణ పొరుగు దేశం కాదు. ఈశాన్య భారతదేశానికి భౌగోళికంగా అత్యంత కీలకమైన దేశం. సరిహద్దు భద్రత నుంచి వాణిజ్యం వరకు, రవాణా మార్గాల నుంచి ప్రాంతీయ కనెక్టివిటీ వరకు ఢాకాతో న్యూఢిల్లీకి ఉన్న సంబంధాలు వ్యూహాత్మకంగా ఎంతో కీలకం. గత కొన్నేళ్లుగా భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు కూడా ఈ ప్రాధాన్యత చుట్టూనే బలపడ్డాయి. అలాంటి దేశం ఇప్పుడు పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియాలతో కూడిన రక్షణ వ్యవస్థకు దగ్గరవుతే.. ఢిల్లీకి మాత్రం అది సాధారణ పరిణామం కాదు. అందులోనూ పాకిస్తాన్ పేరు ఉండటం మరింత ఆసక్తికరం. భారత్-పాకిస్తాన్ సంబంధాలు ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలతో నిండిన నేపథ్యంలో.. ఢాకా ఇస్లామాబాద్‌తో రక్షణ, వ్యూహాత్మక సంబంధాలను పెంచుకుంటే పాక్‌కు దౌత్యపరంగా అదనపు బలం లభించే అవకాశం ఉంటుంది. దక్షిణాసియాలో భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ తన ప్రభావాన్ని విస్తరించేందుకు కొత్త వేదిక లభించినట్టవుతుంది.టర్నీతో సవాల్..టర్కీ కూడా ఈ సమీకరణంలో కీలక పాత్ర పోషిస్తోంది. పాక్‌తో టర్కీకి ఇప్పటికే సన్నిహిత రక్షణ సంబంధాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌తోనూ టర్కీ రక్షణ సహకారాన్ని విస్తరిస్తోంది. మరోవైపు సౌదీ అరేబియా ఆర్థిక, వ్యూహాత్మకంగా అత్యంత ప్రభావశీలమైన దేశం. ఈ మూడు దేశాలతో బంగ్లాదేశ్ ఒకే రక్షణ వ్యవస్థలోకి వస్తే.. పాకిస్తాన్‌కు పశ్చిమాసియా నుంచి దక్షిణాసియా వరకు విస్తరించే కొత్త దౌత్య నెట్వర్క్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే బంగ్లాదేశ్ వెంటనే ఆ కూటమిలో చేరబోతోందని చెప్పడానికి ఇప్పటివరకు ఆధారాలు లేవు. ఢాకా చెబుతున్న “బంగ్లాదేశ్ ఫస్ట్” విధానమే ఇక్కడ కీలకం. ఆర్థికంగా, వాణిజ్యపరంగా లేదా భద్రతాపరంగా తమకు ప్రయోజనం ఉంటేనే అడుగు ముందుకు వేస్తామని బంగ్లాదేశ్ స్పష్టం చేస్తోంది. అంటే ఇది భారత్‌కు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం అని ఇప్పుడే తేల్చేయలేం.ఇది కూడా చదవండి: రిజర్వేషన్లపై కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు.. అయినా ఢిల్లీకి ఇది ఒక కీలక హెచ్చరిక మాత్రం కావచ్చు. బంగ్లాదేశ్ తన విదేశాంగ విధానాన్ని కొత్తగా సమతుల్యం చేసుకుంటోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత్‌తో సంబంధాలు కొనసాగిస్తూనే.. పాక్, టర్కీ, సౌదీ అరేబియా వంటి దేశాలతో కూడా వ్యూహాత్మక సంబంధాలను పెంచుకోవాలని ఢాకా చూస్తే.. దక్షిణాసియాలో భారత్ ఆధిపత్యానికి కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అంటే.. బంగ్లాదేశ్ ఈ కూటమిలో చేరితే భారత్ సరిహద్దుల్లో వెంటనే సైనిక ముప్పు వచ్చేది కాదు. కానీ భారత్ చుట్టూ వ్యూహాత్మకంగా మారుతున్న సమీకరణాల్లో మరో కీలక మలుపు మాత్రం అవుతుంది. ఇవన్నీ కలిస్తే ఢిల్లీ తన ‘నెయిబర్‌హుడ్ ఫస్ట్’ వ్యూహాన్ని మరింత చురుగ్గా అమలు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. -
పహల్గామ్ అటాక్.. హఫీజ్ సయీద్‌కు సమన్లు
ఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడికి కీలక సూత్రదారి లష్కర్-ఎ-తోయిబా (LeT) వ్యవస్థాపకుడు, ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు కోర్టు సమన్లు జారీ చేసే దిశగా భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ద్వారా ఈ సమన్లను పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు అందజేయనున్నట్లు సమాచారం అందుతుంది.2025లో పహల్గామ్లోయలో ఉగ్ర దాడి జరిగింది. ఇందులో 26 మంది పైగా అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) హఫీజ్ సయీద్‌ను నిందితుడిగా పేర్కొంది. ఈ కేసులో అతడిపై ఇప్పటికే జమ్మూలోని ప్రత్యేక NIA కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.సమన్లు ఎందుకు కీలకం?హఫీజ్ సయీద్ పాకిస్థాన్‌లో ఉన్నందున భారత దర్యాప్తు సంస్థలు నేరుగా అతడికి కోర్టు నోటీసులు అందజేయడం సాధ్యం కాదు. అందుకే పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక వ్యవస్థ ద్వారా కోర్టు సమన్లు అందించే ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. ఒక నిందితుడికి కోర్టులో హాజరై తన వాదన వినిపించే అవకాశం ఇచ్చినట్లు చట్టపరమైన రికార్డులో నమోదు చేయడం ఈ చర్యలో ముఖ్యమైన అంశం.సమన్లు అందించిన తర్వాత సైతం హఫీజ్ సయీద్ కోర్టుకు హాజరుకాకపోతే, తదుపరి దశగా అతడిని "ప్రొక్లెయిమ్డ్ అఫెండర్" గా ప్రకటించే ప్రక్రియకు మార్గం సుగమం అవుతుంది. భారత చట్టం ప్రకారం, అటువంటి వ్యక్తి పరారీలో ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల్లో అతడి గైర్హాజరీలో దర్యాప్తు, విచారణ లేదా తీర్పు ప్రక్రియను కొనసాగించే అవకాశం ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి కుట్ర కేసులో హఫీజ్ సయీద్ పాత్రను NIA ప్రత్యేకంగా ప్రస్తావించింది. అతడు లష్కర్-ఎ-తయిబా నాయకుడిగా ఉండటంతో పాటు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) అనే మరో ఉగ్రవాద సంస్థతోనూ సంబంధం ఉన్నట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది.పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన హఫీజ్ సయీద్ ప్రస్తుతం 76 ఏళ్ల వయసులో ఉన్నాడు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసుల్లో అతడికి శిక్ష పడిన తర్వాత పాకిస్థాన్ అధికారుల అదుపులోనే ఉన్నాడని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అయితే, హఫీజ్ సయీద్ వంటి ఉగ్రవాదులను అంతర్జాతీయ చర్యల నుంచి కాపాడేందుకు పాకిస్థాన్ భద్రతా వ్యవస్థలోని కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని భారత దర్యాప్తు సంస్థలు చాలాకాలంగా ఆరోపిస్తున్నాయి.పాకిస్థాన్‌కు అప్పగించే ఒప్పందం ఉందా?భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ప్రత్యేకంగా అమల్లో ఉన్న ద్వైపాక్షిక నేరస్తుల అప్పగింత (extradition) ఒప్పందం లేదు. అందువల్ల హఫీజ్ సయీద్‌ను నేరుగా భారత్‌కు అప్పగించే ప్రక్రియ సులభం కాదు.అయితే భారత్ ఇప్పటికే హఫీజ్ సయీద్‌ను ఉగ్రవాద నిరోధక చట్టాల కింద వ్యక్తిగత ఉగ్రవాదిగా గుర్తించింది. అమెరికా కూడా అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా చాలా సంవత్సరాల క్రితమే గుర్తించింది. అంతేకాకుండా అతడిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు సైతం జారీ అయింది. -
భారత్‌తో పోలిస్తే పాక్‌లో గూగుల్ ప్లాన్ ఎలా ఉంది?
పాకిస్థాన్ టెక్నాలజీ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ అధికారికంగా పాకిస్థాన్‌లో తన మొట్టమొదటి కార్యాలయాన్ని ప్రారంభించింది. స్వయంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ కొత్త ఆఫీసును ప్రారంభించడంతో పాటు గూగుల్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో చర్చలు జరిపారు. దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు, స్థానిక యువతకు అత్యాధునిక టెక్నాలజీ నైపుణ్యాలు అందించేందుకు ఈ కార్యాలయం ఒక గేమ్ చేంజర్‌గా మారనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తున్నది.పాకిస్థాన్‌లో సరికొత్త అధ్యాయం: గూగుల్ తొలి కార్యాలయంపాకిస్థాన్లో గూగుల్ తన కార్యకలాపాలను విస్తరిస్తూ తొలి కార్యాలయాన్ని ప్రారంభించింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమక్షంలో జరిగిన ఈ ప్రారంభోత్సవంలో గూగుల్ ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. దేశంలో సాంకేతికత, డిజిటల్ రంగాలను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ఈ ముందడుగు పడింది. ముఖ్యంగా ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)విభాగాలలో స్థానిక యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వం దీనిని దేశ డిజిటల్ ఎకానమీ అభివృద్ధిలో ఒక చారిత్రక మైలురాయిగా భావిస్తోంది.కార్యాలయం లోపల లుక్ ఎలా ఉంది?ఈ సరికొత్త గూగుల్ ఆఫీస్ సాధారణ ప్రభుత్వ కార్యాలయాల మాదిరిగా కాకుండా, అత్యంత ఆధునిక శైలిలో రూపుదిద్దుకుంది. గూగుల్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఓపెన్ వర్క్‌స్పేస్, టీమ్ కొలాబరేషన్ ఏరియాలు, హైటెక్ మీటింగ్ రూమ్‌లతో ఈ కార్యాలయాన్ని సిద్ధం చేశారు. లోపలి పూర్తి దృశ్యాలు ఇంకా అధికారికంగా విడుదల కానప్పటికీ, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోల ఆధారంగా ఇది చాలా స్టైలిష్, ప్రీమియం టెక్ లుక్‌తో కనిపిస్తోంది.యువత డిజిటల్ నైపుణ్యాలే లక్ష్యంపాకిస్థాన్ వేగంగా డిజిటల్ పరివర్తన వైపు అడుగులు వేస్తోందని ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. ప్రభుత్వ సేవలు, ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్ చేయడంలో భాగంగా స్థానిక యువతకు కృత్రిమ మేధ (ఏఐ), ఐటీ నైపుణ్యాలను నేర్పించే కార్యక్రమాలను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. గూగుల్ స్థానిక కార్యాలయం ఈ దిశగా ప్రభుత్వానికి సహకారాన్ని అందించనుంది. కంపెనీ భాగస్వామ్యంతో యువతకు కొత్త కెరీర్ అవకాశాలు, ఆధునిక సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు విస్తృతం కానున్నాయి.బలపడుతున్న గూగుల్.. పాక్ వ్యూహాత్మక భాగస్వామ్యంఈ కార్యాలయ ఏర్పాటును పాక్ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానించింది. గూగుల్, పాకిస్థాన్ మధ్య బంధం మరింత బలపడటానికి ఇది పునాది వేస్తుందని షెహబాజ్ షరీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గూగుల్ నేరుగా రంగంలోకి దిగడంతో దేశంలో భారీ స్థాయి డిజిటల్ ప్రాజెక్టులు వేగవంతం కానున్నాయి. ఫలితంగా ఆన్లైన్ సేవలు, డిజిటల్ బిజినెస్‌లకు ఊతం లభించడమే కాకుండా, ప్రభుత్వ ‘డిజిటల్ నేషన్ పాకిస్థాన్’ విజన్‌కు గొప్ప బలం చేకూరనుంది.క్రోమ్‌బుక్ అసెంబ్లీ లైన్: ఎగుమతులపై గూగుల్ దృష్టిగూగుల్ ప్రతినిధి విల్సన్ వైట్ పాకిస్థాన్‌లో తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రధానికి వివరించారు. స్థానిక భాగస్వామ్యంతో ఇప్పటికే ఏర్పాటు చేసిన ‘క్రోమ్‌బుక్ అసెంబ్లీ లైన్’ ప్రాజెక్టును ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాకిస్థాన్‌లో క్రోమ్‌బుక్ తయారీ మొదలైతే, ఇక్కడ ఉత్పత్తి అయ్యే ల్యాప్‌టాప్‌లను పొరుగు దేశాలకు ఎగుమతి చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని గూగుల్ అంచనా వేస్తోంది. ఇది పాకిస్థాన్‌లో హైటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాన్ని మరింత ఉత్తేజితం చేస్తుంది.భారత్‌తో పోలిస్తే పాక్ కార్యాలయం ఎంత భిన్నం?భారతదేశంలో గూగుల్ ప్రస్థానం ఎన్నో ఏళ్ల క్రితమే మొదలైంది. దేశవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాల్లో భారీ క్యాంపస్‌లు, విస్తారమైన పరిశోధన-అభివృద్ధి (ఆర్ అండ డీ) కేంద్రాలతో భారత్ ప్రపంచ టెక్ హబ్‌గా నిలిచింది. దీనితో పోల్చితే పాకిస్థాన్‌లో గూగుల్ ఉనికి ఇప్పుడే ప్రారంభమైంది. అందువల్ల ఈ రెండు దేశాల కార్యకలాపాలను నేరుగా పోల్చలేం. భారత్‌లో కార్యకలాపాలు అత్యున్నత స్థాయిలో ఉండగా, పాకిస్థాన్‌లో ప్రస్తుతానికి స్థానిక భాగస్వామ్యాలు, ఏఐ శిక్షణ, క్రోమ్‌బుక్ అసెంబ్లీ వంటి ప్రాథమిక ప్రాజెక్టులపైనే ప్రధాన దృష్టి కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: ఇరాన్ యుద్ధం తెచ్చిన విద్యా సంక్షోభం -
ప్లీజ్ భారత్ మా చక్కెర కొనవా?: పాకిస్థాన్
సాక్షి,న్యూఢిల్లీ: పండగల సీజన్లో అమాంతం పెరుగుతున్న చక్కెర ధరల్ని నియంత్రించేందుకు సరఫరాను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ప్రకటన ప్రకారం.. అక్టోబర్ 31, 2026 వరకు ఎలాంటి సుంకం లేకుండా 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను దిగుమతి చేసుకునేందుకు వీలుగా విధానాన్ని సవరించింది. గత ఏడాదితో పోలిస్తే రిటైల్ ధరలు సుమారు 13 శాతం పెరగడం, మిల్లుల వద్ద ఎక్స్-మిల్ ధరలు రికార్డు స్థాయికి చేరడం దీనికి ప్రధాన కారణం. ఇప్పుడు ఇదే అంశంపై పాక్.. భారత్‌ను అర్రులు చాస్తోంది. తమ వద్ద ఉన్న షుగర్ కొనులు చేసి ఆర్థికంగా తమని ఆదుకోవాలనే ప్రతిపాదనలు చేసే యోచనలో ఉందంటూ ఆదేశ మీడియా సంస్థలు పలు కథనాల్ని ప్రచురించాయి. .భారత్ దిగుమతికి మార్గం సుగమం చేయడంతో పాకిస్థాన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ దీనిని ఒక అవకాశంగా మలచుకోవాలని భావిస్తోంది. ఈక్రమంలో హుంజా షుగర్ మిల్స్ ప్రతినిధి పీఎస్ఎంఏ సీనియర్ సభ్యుడు చౌదరి ముహమ్మద్ వహీద్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లో ప్రస్తుతం 12 లక్షల టన్నులకు పైగా మిగులు నిల్వలు ఉన్నాయి. వచ్చే చెరుకు పంట చేతికొచ్చే సమయానికి ఈ నిల్వలను విక్రయించకపోతే కొత్త పంట కొనుగోలు చేయడానికి మిల్లులకు ఇబ్బందులు ఎదురవుతాయి.భారత్‌కు సమీపంలో ఉండటం వల్ల రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు, ఎగుమతుల ద్వారా విదేశీ మారకద్రవ్యం లభిస్తుందని. మిల్లుల ద్రవ్యత మెరుగుపడి రైతులకు సకాలంలో బకాయిలు చెల్లించడానికి వీలవుతుందని పాకిస్థాన్ వర్గాలు భావిస్తున్నాయి.వాణిజ్య సంబంధాల సవాళ్లుఇరు దేశాల మధ్య గతంలోనే రాజకీయ, భద్రతా ఉద్రిక్తతల కారణంగా వాణిజ్య మార్గాలు (అటారీ-వాఘా సరిహద్దు, విమాన మార్గాలు) మూతపడ్డాయి. ప్రస్తుతం ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల ప్రకారం పాకిస్థాన్ నేరుగా భారత్‌కు చక్కెర ఎగుమతి చేయడం లేదు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మిల్లులు తమ ప్రభుత్వాన్ని ప్రత్యేక అనుమతులు కోరుతున్నాయి. అందువల్ల భారత్ తీసుకున్న దిగుమతి నిర్ణయం తక్షణ వాణిజ్య ఒప్పందంగా కాకుండా, కేవలం ఒక ఆరంభంగానే చూడాల్సి ఉంది.ఇథనాల్ ప్రభావం..ప్రభుత్వ వాదనభారత్లో చక్కెర ధరల పెరుగుదలకు కేవలం ఇథనాల్ వైపు చెరకు మళ్లింపు మాత్రమే కారణం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెట్రోల్‌లో 20శాతం ఇథనాల్ కలపాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్, బయోఫ్యూయల్ రంగాన్ని బలోపేతం చేయడానికి గత కొన్ని సీజన్లలో లక్షలాది టన్నుల చక్కెరను ఇథనాల్ వైపు మళ్లించింది. అయితే ప్రస్తుత ధరల అస్థిరతకు మార్కెట్లో కొంతమంది చేసే అసాధారణ నిల్వలు, ఊహాజనిత లావాదేవీలే కారణమని ఆహార, ప్రజా పంపిణీ శాఖ పేర్కొంది. -
మిస్ యూనివర్స్ పాకిస్థాన్‌గా సైకాలజీ స్టూడెంట్..!
సైకాలజీ విద్యార్థి మిస్బా అర్షద్ ఇటీవలే మిస్ యూనివర్స్ పాకిస్థాన్‌గా కిరీటాన్ని గెలుచుకున్నారు. ఈ విషయాన్ని మిస్ యూనివర్స్ పాకిస్థాన్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా పంచుకుంది. తమకొత్త మిస్ యూనివర్స్ పాకిస్థాన్ 2026 మిస్బా అర్షద్ హుందాతనం, అందం, ఆత్మవిశ్వాసం, లక్ష్యంతో ప్రపంచ వేదికపై పాకిస్థాన్‌కు ప్రాతినిథ్యం వహించే గౌరవాన్ని అందుకుందని పేర్కొంది. 75వ మిస్ యూనివర్స్ పోటీ ఈ ఏడాది నవంబర్ 24న ప్యూర్టోరికోలని శాన్జువాన్లో జరగనుంది. ఈ పోటీలో ఆమె అధికారికంగా పాకిస్థాన్‌కు ప్రాతినిథ్యం వహించనుందని ఆ దేశ అందాల పోటీ సంస్థ పేర్కొంది. ఈమేరకు టైటిల్ గెలుచుకున్న మిస్బా అర్షద్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. ఈ గెలుపుతో తన మిస్ యూనివర్స్ పోటీ జర్నీ అధికారికంగా ప్రారంభమైందని పేర్కొంది. ఇన్నేళ్లలో తాను నేర్చుకున్న విషయం ఓటమి మనం విజేతనా కాదా అని నిర్ణయించదని తెలుసుకున్నానన్నారు. ఎల్లప్పుడు ఆశను సజీవంగా ఉంచుకోవడం, కృషి చేయడం, ప్రతి అడుగులో మెరుగవ్వడం ఇవే మనల్ని విజేతగా నిలుపుతాయని రాసుకొచ్చారామె. అలాగే అందాల పోటీల ఫైనల్లో తాన ధరించిన కాస్ట్యూమ్ గురించి కూడా ఇలా రాశారామె. తన తెల్లటి గౌను ఆశకు ప్రతిక అని, ఇది ఎల్లప్పుడు మన కలలను నమ్మడం మానేయకూడదని గుర్తుచేస్తుందని పేర్కొంది. అలాగే దానిలోని రాయల్ బ్లూరంగు స్పటికాలు, మనం నేర్చుకుంటూ మెరుగుపడే విద్యకు ప్రతికని అన్నారు. ఇక మిస్బా ధరించిన కాస్ట్యూమ్ని వియత్నామీస్ డిజైనర్ గుయెన్ టియెన్ ట్రూయెన్ డిజైన్ చేశారు. ఆయన ఈ గౌనుని సాంప్రదాయ పాకిస్థానీ మూలాంశాలతో డిజైన్ చేయడం విశేషం.ఎవరీ మిస్బా అర్షద్ మిస్బా అర్షద్ ఒక సైకాలజీ విద్యార్థిని. విద్య ద్వారానే బాలికలకు సాధికారత కల్పించగలమని నమ్ముతానని, ఇది పాకిస్తాన్ కోసం సంస్థలకు ఉన్న దార్శనికత గురించి తెలుసుకోవడం వల్ల ఈ విషయం అర్థమైందని అన్నారు. మన భవిష్యత్తు కోసం మనం పెట్టగలిగే అత్యంత శక్తిమంతమైన పెట్టుబడులలో విద్య ఒకటిగా పేర్కొంది. ఆమె సైకాలజీ స్టూడెంట్ మాత్రమే కాదు మోడలింగ్ కూడా చేస్తుందామె. అలాగే ఫ్యాషన్, బ్యూటీరంగాలలో కంటెంట్‌ను సృష్టిస్తారామె. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫోటోలను బట్టి చూస్తే..ఆమె కొత్త సంస్కృతులను అన్వేషించడం, స్థానిక వంటకాలను రుచి చూడటం, ప్రకృతిలో గడపడాన్ని బట్టి.. ఆమెను ఒక ప్రపంచ యాత్రికురాలిగా పేర్కొనవచ్చు. కాగా, ఆమె జపాన్‌లో జరిగిన మిస్ ఇంటర్నేషనల్ 2023తో సహా అనేక అందాల పోటీల్లో అంతర్జాతీయంగా పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించారామె. (చదవండి: Sonam Kapoor: ట్రెడిషనల్ అనార్కలీ డ్రెస్‌లో సోనమ్ అత్యద్భుతమైన లుక్..!) -
హాస్పిటల్లో ట్విస్ట్.. ఖాన్ సాబ్‌కు ఇదేం శిక్ష?
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనారోగ్య కారణాలతో.. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. చికిత్స కోసం ఆయన్ని ఇస్లామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది తెలిసిందే. అయితే ఈ ఉదయం మళ్లీ ఆయన్ని అడియాలా జైలుకు తరలించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పీటీఐ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం జైల్లో అందిస్తున్న సదుపాయాలు.. చికిత్సపై అనుమానాలు వ్యక్తం చేశాయి. దీంతో ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలు వెలువడ్డ రెండ్రోజుల తర్వాతే ఆయన్ని.. గత అర్ధరాత్రి రావల్పిండి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఇస్లామాబాద్‌లో ఉన్న షిఫా ఆస్పత్రికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ తరలించారు. ఈ పరిణామంపై పీటీఐ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. అదే సమయంలో ఆయన్ని నిజంగానే తరలించారా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆస్పత్రి వర్గాలు ఆయన చేరికను ధృవీకరించాయి. కోర్టు ఆదేశాల ప్రకారం.. తదుపరి విచారణ జరిగే సెప్టెంబర్ 16వ తేదీ దాకా ఆయన్ని ఆస్పత్రిలోనే ఉంచుతారని అంతా భావించారు. కానీ.. ఈలోపే ట్విస్ట్ చోటు చేసుకుంది.శుక్రవారం ఉదయం.. షిఫా ఆస్పత్రిలో ఆరుగురు నిపుణుల వైద్యుల బృందం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించింది. ఆస్పత్రిలో చేర్పించాల్సిన అవసరం లేదని వైద్యులు సూచించారు. దీంతో ఆయన జైల్లో ఉండడమే సురక్షితమని భావించి అధికారులు.. తిరిగి అడియాలాకు తీసుకొచ్చారు. కంటి సమస్య.. అంతా ఓకే అంటున్న ప్రభుత్వంఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై కొంతకాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆయనకు కుడి కంటి సంబంధిత సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. రక్తనాళాల్లో సమస్య (సెంట్రల్ రెటినల్ వీన్ ఆక్లూజన్) కారణంగా ఆయనకు చికిత్స అవసరమని కుటుంబ సభ్యులు, పీటీఐ నేతలు చెబుతున్నారు. జైలులో సరైన వైద్యం అందడం లేదని ఇమ్రాన్ కుటుంబం ఆరోపిస్తుండగా.. అవసరమైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని పాక్ ప్రభుత్వం చెబుతోంది.రివ్యూ పిటిషన్.. ప్రభుత్వానికి ఎదురుదెబ్బఇమ్రాన్ను ఆస్పత్రికి తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కోర్టు రిజిస్ట్రార్ కార్యాలయం అభ్యంతరాలతో తిరిగి పంపింది. అభ్యంతరాలను సరిచేసి మళ్లీ దాఖలు చేసే అవకాశం ఉంది.జైలు నుంచే రాజకీయ పోరాటం2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ జైలులోనే ఉన్నారు. తనపై నమోదైన కేసులు రాజకీయ కక్షతో పెట్టినవేనని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. 2018లో పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్.. 2022లో అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయారు. ఆ తర్వాత ఆయనకు, పాక్ సైన్యానికి మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ప్రస్తుతం జైలు నుంచే తన విడుదల కోసం ఇమ్రాన్, తమ అధినేత కోసం పీటీఐ నేతలు పోరాడుతున్నారు. మెరుగైన వైద్యం, కేసుల వేగవంతమైన విచారణ, విడుదల కోసం పీటీఐ దేశవ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమవుతోంది. -
పాక్‌తో ఎప్పుడూ ముప్పే.. చైనాతోనే అసలు సవాల్.. మాజీ ఆర్మీ చీఫ్ వార్నింగ్
ఒక వైపు దాయాది దేశం పాకిస్తాన్ నుంచి ఉగ్ర ముప్పు.. మరోవైపు చైనా నుంచి పెరుగుతున్న వ్యూహాత్మక సవాలు! భారత్ భద్రతకు ముందు ముందు అసలు పరీక్ష ఎక్కడ? పశ్చిమ సరిహద్దుల్లోనా.. తూర్పు సరిహద్దుల్లోనా?.. దీనిపై మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాయి. పాకిస్తాన్ ప్రస్తుతం తక్షణ ముప్పే అయినా.. రాబోయే సంవత్సరాల్లో భారత్‌కు ప్రధాన పోటీదారు మాత్రం చైనానే అని ఆయన తేల్చి చెప్పారు.చైనా, పాకిస్తాన్ రెండింటినీ ఒకే విధంగా చూడలేమని నరవణే స్పష్టం చేశారు. రెండు దేశాలతోనూ భారత్ యుద్ధాలు చేసిందని, ఇరువురితోనూ సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. అయితే పాకిస్తాన్ నుంచి కొనసాగుతున్న ఉగ్రవాద ముప్పు కారణంగా ప్రస్తుతం భారత దృష్టి పశ్చిమ సరిహద్దులపైనే ఉందన్నారు. కానీ దీర్ఘకాలిక, వ్యూహాత్మక లెక్కల్లో చైనానే ప్రధాన ప్రత్యర్థిగా ఎదుగుతుందని నరవణే అన్నారు. అంతేకాదు.. చైనాను శత్రువుగా కాకుండా ప్రధాన పోటీదారుగా చూడాలని ఆయన చెప్పడం కీలకంగా మారింది.చైనాతో పోటీ కేవలం సరిహద్దుల్లోనే ఉండదని నరవణే పేర్కొన్నారు. రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, సైనిక రంగం.. ఇలా అన్ని రంగాల్లోనూ భారత్-చైనా పోటీ పెరుగుతుందని అన్నారు. పోటీ ఉన్న చోట కొంత ఘర్షణ సహజమే అయినా.. ప్రతి విభేదం యుద్ధంగా మారాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చైనాతో సమస్యలను చర్చలు, దౌత్యం, సంభాషణల ద్వారా పరిష్కరించుకోవడమే భారత్ తొలి ప్రాధాన్యత కావాలని ఆయన సూచించారు. బలప్రయోగం చివరి మార్గంగా మాత్రమే ఉండాలని అన్నారు. అయితే దౌత్యం పనిచేయని పరిస్థితి వస్తే.. భారత్ వెనక్కి తగ్గకుండా ఉండేందుకు బలమైన సైనిక నిరోధక శక్తి తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: పార్టీలో నాకు మద్దతు ఏదీ.. ఖర్గే ఆవేదన?అంటే నరవణే సందేశం క్లియర్‌గా చర్చలకు సిద్ధంగా ఉండాలి.. కానీ బలహీనంగా కాదు. శాంతిని కోరుకోవాలి.. కానీ అవసరమైతే సమాధానం చెప్పే శక్తి కూడా ఉండాలి అని. ఇదే సమయంలో భారత్ భద్రత కేవలం పాక్, చైనాతోనే పరిమితం కాదని నరవణే గుర్తుచేశారు. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ వంటి పొరుగుదేశాల్లో స్థిరత్వం కూడా భారత ప్రయోజనాలకు కీలకమన్నారు. పొరుగుదేశాల్లో అస్థిరత ఏర్పడితే శరణార్థులు, స్మగ్లింగ్, డ్రగ్స్, అక్రమ ఆయుధాల రవాణా వంటి సమస్యలు నేరుగా భారత్‌పై ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు. మయన్మార్‌ను ఉదాహరణగా తీసుకున్న నరవణే.. పొరుగుదేశం తగలబడుతుంటే మనం సంతోషంగా ఉండలేమనే భావనను వ్యక్తం చేశారు. అందుకే పొరుగు దేశాల్లో స్థిరత్వం కోసం భారత్ తన వంతు పాత్ర పోషించాలని సూచించారు. -
పాక్ సైన్యంలో భారీ మార్పులు.. మునీర్‌కు విస్త్రృత అధికారాలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రభుత్వం కీలక చట్టానికి ఆమోదం తెలిపింది. సైనిక వ్యవస్థను పూర్తిగా పునర్వ్యవస్థీకరించే దిశగా "డిఫెన్స్ ఫోర్స్ ఆఫ్ పాకిస్థాన్ యాక్ట్" 2026తో పాటు నేషనల్ కమాండ్ అథారిటీ యాక్ట్ 2010కు పలు కీలక సవరణలు చేసింది. దీంతో కొత్త విధానంలో పాకిస్థాన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ను ఒకే సమన్వయ వ్యవస్థ కిందకు తీసుకవచ్చింది. ఈ వ్యవస్థకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF) జనరల్ అసిమ్ మునీర్ నాయకత్వం వహించనున్నారు.కొత్త చట్టం ప్రకారం చీఫ్ డిఫెన్స్ స్టాప్‌కు (CDF)కు మూడు దళాల ఆపరేషనల్ కమాండ్, కంట్రోల్, సమన్వయం, మల్టీ-డొమైన్ ఇంటిగ్రేషన్, వ్యూహాత్మక అంశాల పర్యవేక్షణ వంటి విస్తృత బాధ్యతలు ఉంటాయి. ముఖ్యంగా సైనిక సిబ్బంది విషయంలోనూ మునీర్‌కు గణనీయమైన అధికారాలు కల్పించారు. చట్టంలోని నిబంధనల ప్రకారం సిబ్బందిని రిటైర్ చేయడం, సర్వీసు నుంచి విడుదల చేయడం లేదా తొలగించడం, రాజీనామాను అంగీకరించడం లేదా తిరస్కరించడం, సర్వీసులో కొనసాగించడం వంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. అవసరమైతే నిర్దేశిత పదవీ విరమణ వయస్సు లేదా సర్వీసు పరిమితిని కూడా సడలించే అధికారం ఉంటుంది. అయితే చట్టంలో పేర్కొన్న కొన్ని మినహాయింపులు దీనికి వర్తిస్తాయి.ప్రధానికి ప్రధాన సైనిక సలహాదారుగా CDFడిఫెన్స్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ నేరుగా CDF ఆధ్వర్యంలో పనిచేస్తుంది. జాతీయ భద్రత, రక్షణ, సాయుధ దళాలకు సంబంధించిన అంశాల్లో అసిమ్ మునీర్ పాకిస్థాన్ ప్రధానమంత్రికి “ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్”గా వ్యవహరించనున్నారు. కమాండ్, కంట్రోల్‌కు సంబంధించిన అంశాల్లో CDF ఫెడరల్ ప్రభుత్వానికి బాధ్యత వహిస్తారు. అదే సమయంలో ప్రభుత్వం CDFకు చట్టంలో పేర్కొన్న వాటికి అదనంగా ఇతర బాధ్యతలు, అధికారాలను కూడా అప్పగించే అవకాశం ఉంది. కొత్త వ్యవస్థ అమలులో ఏవైనా ఇబ్బందులు లేదా నిబంధనల మధ్య విభేదాలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు పాకిస్థాన్ అధ్యక్షుడికి ఆదేశాలు జారీ చేసే అధికారం సైతం కల్పించారు.అదే విధంగా గత ఏడాది 27వ రాజ్యాంగ సవరణలో భాగంగా కమాండర్ ఆఫ్ ది నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ (CNSC) అనే హోదాను ఏర్పాటు చేశారు. పాకిస్థాన్ వ్యూహాత్మక దళాల ఆపరేషనల్ సమన్వయానికి ఈ అధికారి బాధ్యత వహిస్తారు. గత నెల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి నుంచి పదోన్నతి పొందిన జనరల్ సయ్యద్ ఆమిర్ రజాను తొలి CNSCగా నియమించారు. -
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట?
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను ఎట్టకేలకు ఊరట లభించిందా?. మూడేళ్ల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారా?. గురువారం అర్ధరాత్రి దాటాక రావల్పిండి జైలు నుంచి ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి తరలించినట్లు ప్రచారం జరుగుతున్నాయి. ఈ విషయాన్ని పీటీఐ వర్గాలు ధృవీకరించగా.. ఆయన అభిమానులు మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.వివిధ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్.. మూడేళ్లుగా అడియాలా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు.. ప్రత్యేక చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఆయన చికిత్స విషయంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని కోర్టుకు తెలిపారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఆయన్ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించింది.Imran Khan has been freed from Adiala Jail and taken to Shifa Hospital tonight.He is a political prisoner because he wanted to bring democracy to Pakistan, something America does not want, they need control of the Nucs.CAN HE BECOME THE “NELSON MANDALA” OF PAKISTAN⁉️…— Earth Hippy 🌎🕊️💚 (@hippyygoat) August 20, 2026అయితే రివ్యూ పిటిషన్ పేరిట రెండ్రోజులు పాక్ ప్రభుత్వం హైడ్రామా నడిపింది. చివరకు.. కోర్టు ఆదేశాల మేరకు ఆస్పత్రికి తరలిచింది. ఆయన చూపు క్షీణించిందని.. కుడి కన్ను శాశ్వతంగా కనిపించడం లేదని ఆయన తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. అలాగే 73 ఏళ్ల ఇమ్రాన్‌కు భారీగా బరువు తగ్గి బక్కచిక్కిపోయారని చెప్పారు. మరోవైపు ఇమ్రాన్‌కు తక్షణ ఆస్పత్రి చికిత్స అవసరమయ్యే పరిస్థితి లేదని వైద్య నివేదికలు సూచిస్తున్నాయని పాకిస్థాన్ ప్రభుత్వం చెబుతోంది.Imran khan was never taken to the hospital today.The dictatorship in Pakistan trying to fool everyone. Snakes in his party who are work for the army have been exposed. https://t.co/b1ZGEsNuh4 pic.twitter.com/9vghKQ9TTs— Ali (@MerruX) August 21, 2026అయితే ఆయన తరలింపు సమయంలో నడిచిన హైడ్రామాపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే ఆయన్ని తరలించారా?.. ఫొటోలు రిలీజ్ చేయాలంటూ.. కోరుతున్నారు. పాక్‌లో నియంతృత్వ ప్రభుత్వం నడుస్తోందని.. ఇమ్రాన్ ఖాన్‌ను చంపే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఇటు కోర్టు ఆదేశాల మేరకు.. ఆయనకు వ్యక్తిగత వైద్యుడితో కూడిన వైద్య బృందం పరీక్షలు నిర్వహించేందుకు షిఫా ఆస్పత్రి సిద్ధమైంది. తదుపరి విచారణ జరిగే సెప్టెంబర్ 16 వరకు ఆయన ఆస్పత్రిలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.ఇమ్రాన్ ఖాన్‌కు గత జనవరిలో కుడి కంటికి సెంట్రల్ రెటినల్ వీన్ అక్లూజన్ అనే సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయింది. అప్పటి నుంచి చికిత్స కోసం ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS)కు పలుమార్లు తరలించారు. అయితే ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తోందని కుటుంబ సభ్యులు, పీటీఐ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వ ఆస్పత్రికి బదులుగా ప్రైవేట్ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. జైలులో వైద్య సేవలు, కుటుంబ సభ్యులు, న్యాయవాదులతో భేటీలపై ఆంక్షలు ఉన్నాయని కూడా వారు ఆరోపించారు.పీటీఐలో కొత్త ఆశలుసుప్రీంకోర్టు ఆదేశాలతో ఇమ్రాన్‌ను ఆస్పత్రికి తరలించడాన్ని ఆయన పార్టీ స్వాగతించింది. కోర్టు నిర్ణయం తమకు ‘కొత్త ఆశాకిరణం’ అని పార్టీ ప్రతినిధి జుల్ఫికర్ బుఖారీ పేర్కొన్నారు. అయితే ఇమ్రాన్‌కు మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళనలకు పార్టీ సిద్ధమవుతోందని తెలిపారు. సెప్టెంబర్ 27న దేశవ్యాప్త మార్చ్‌కు పిలుపునిచ్చిన PTI.. ఇమ్రాన్‌కు మద్దతుదారులను కలిసే అవకాశం కల్పించడం, ఆయనపై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయడం, చివరకు ఆయనను విడుదల చేయడం వంటి డిమాండ్లను ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది.2023 నుంచి జైల్లోనే..మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ 2018లో పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2022లో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆయన పదవి కోల్పోయారు. అనంతరం ఆయనకు, PTIకి, పాకిస్థాన్ సైనిక వ్యవస్థకు మధ్య తీవ్ర విభేదాలు కొనసాగాయి. 2023 మే 9న ఇమ్రాన్ అరెస్టు దేశవ్యాప్తంగా భారీ నిరసనలు, హింసకు దారితీసింది. ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టు 5న తోషాఖానా కేసుతో సహా అవినీతి ఆరోపణల కేసుల్లో ఆయనను మరోసారి అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.తనపై నమోదైన కేసులన్నీ రాజకీయ కక్షతో పెట్టినవేనని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. అయితే పాకిస్థాన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. కిందటి ఏడాది అక్టోబర్-నవంబర్ నుంచి ఆయన నుంచి సోషల్ మీడియా ఖాతాలోనూ ఎలాంటి అప్డేట్ లేకుండా పోయింది. దీంతో ఆయన ప్రాణాలతోనే ఉన్నారా? అనే అనుమానాలు సైతం వ్యక్తం అయ్యాయి. ప్రస్తుతం ఆయనపై పలు కేసులు, న్యాయపరమైన సవాళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో.. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆస్పత్రికి తరలింపు పాకిస్థాన్ రాజకీయాల్లో మరో కీలక పరిణామంగా మారింది.ఇదీ చదవండి: పాక్‌లో మరింత పవర్‌ఫుల్‌గా మునీర్! -
భారత్ విజేతగా నిలిస్తే!
న్యూఢిల్లీ: వచ్చే వారం ప్రారంభం కానున్న మహిళల ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు విజేతగా నిలిస్తే మరోసారి... ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్, పాకిస్తాన్ హోం మంత్రి మొహసిన్ నక్వీ ఉదంతం తెరపైకి రానుంది. ఈ నెల 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు టి20 ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నీకి దుబాయ్ ఆతిథ్యమివ్వనుంది. కాగా... గతేడాది దుబాయ్‌లోనే జరిగిన పురుషుల ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో భారత జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో దాయాది పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచి చాంపియన్‌గా అవతరించింది. ఈ టోర్నమెంట్లో చిరకాల ప్రత్యర్థి పాక్‌తో ఎదురుపడ్డ మూడుసార్లు టీమిండియాదే పైచేయి అయింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఏసీసీ అధ్యక్షుడైన పాకిస్తాన్ మంత్రి మొహసిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు భారత జట్టు అంగీకరించలేదు. దీంతో ఇతర అధికారులతో ఇప్పించేందుకు బదులు నక్వీ ట్రోఫీని తన కార్యాలయానికి తీసుకెళ్లాడు. ఇప్పటి వరకు ఆ ట్రోఫీని భారత జట్టుకు అప్పగించలేదు. టోర్నమెంట్ అనంతరం కూడా నక్వీ పట్టువీడలేదు. టీమిండియా తన చేతుల మీదుగానే ట్రోఫీ తీసుకోవాలని భీషి్మంచుకున్నాడు. ఐసీసీ సమావేశం సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ సమస్యను ముగించేందుకు ప్రయత్నించాడు. ఇరు వర్గాల మధ్య సమస్య తొలగినట్లే అని సైతం వెల్లడించాడు. అయినప్పటికీ మొహసిన్ నక్వీ మాత్రం ఇప్పటి వరకు ట్రోఫీ అంశంపై స్పష్టతనివ్వలేదు. ఇప్పుడు కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ హోదాలో నక్వీనే ఏసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతుండగా... మహిళల ఆసియా కప్‌లో సెప్టెంబర్ 5న పాకిస్తాన్‌తో భారత జట్టు తలపడనుంది. టీమిండియా విజేతగా నిలిస్తే బహుమతి ప్రదానోత్సవం అంశం మరోసారి చర్చనీయాంశం కానుంది. గతేడాది సూర్యకుమార్ యాదవ్ మాదిరిగానే... ఈసారి హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా నక్వీ చేతుల మీదుగా కప్ అందుకునేందుకు నిరాకరిస్తుందా చూడాలి. ఇరు జట్ల మధ్య ‘షేక్ హ్యాండ్’లు, ఆత్మీయ పలకరింపులు ఉండబోవని బోర్డు స్పష్టం చేసింది. -
‘భారతీయులే గొప్ప.. పాకిస్తానీలకు దిక్కులేదా?’ అవమానంపై పాక్ ఎంపీ ఆవేదన!
విమానం రద్దు కావడంతో హోటల్ ముందు ప్రయాణికుల క్యూ.. కానీ ఒక్క ప్రకటనతో పాకిస్తానీలకు షాక్!. ‘ఇండియా, అమెరికా పాస్‌పోర్ట్ ఉన్నవారికే వసతి’ అంటూ ప్రకటన. దీంతో, పాకిస్తాన్ మాజీ స్పీకర్ అసద్ ఖైసర్ సంచలన ఆరోపణలు చేశారు. తాను కూడా ఈ పరిస్థితిని స్వయంగా ఎదుర్కొన్నానని పార్లమెంట్లో చెప్పడంతో ఈ వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది. యూఏఈని ‘సోదర దేశం’గా చెప్పుకునే పాకిస్తాన్‌కు.. అక్కడే ఇలాంటి అనుభవం ఎదురైందంటూ ఎంపీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.వివరాల మేరకు.. విమానం రద్దు కావడంతో తాను సహా పలువురు ప్రయాణికులు హోటల్లో ఉండేందుకు ప్రయత్నించారని ఖైసర్ తెలిపారు. అయితే పాకిస్తాన్ పాస్‌పోర్ట్ ఉన్న ప్రయాణికుల పట్ల హోటల్ సిబ్బంది తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండియా, అమెరికా పాస్‌పోర్ట్ ఉన్నవారికి మాత్రమే వసతి కల్పిస్తామని ప్రకటన చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పాకిస్తాన్ ప్రభుత్వం వెంటనే దౌత్యపరంగా స్పందించాలని ఖైసర్ డిమాండ్ చేశారు. యూఏఈతో పాకిస్తాన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆ దేశాన్ని తాము సోదర ఇస్లామిక్ దేశంగా భావిస్తామని చెప్పారు. ఇలాంటి ఘటనలు ఇరు దేశాల సంబంధాలను ప్రభావితం చేయకుండా పాక్ విదేశాంగ శాఖ, విదేశాంగ మంత్రి యూఏఈ అధికారులతో ఈ విషయాన్ని లేవనెత్తాలని కోరారు.అంతేకాదు.. యూఏఈ అభివృద్ధిలో పాకిస్తానీల పాత్ర ఎంతో ఉందని ఖైసర్ గుర్తుచేశారు. యూఏఈలో 15 లక్షలకు పైగా పాకిస్తానీలు నివసిస్తున్నారని, ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని కోరుకుంటున్నామని చెప్పారు. కాగా, ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ‘సానుకూల పాత్ర’ పోషించిందని చెప్పుకున్న సమయంలోనే ఈ ఘటన జరిగిందని ఖైసర్ ప్రస్తావించారు. దీంతో అసలు యూఏఈలో ఏం జరిగింది? పాకిస్తాన్ ప్రయాణికులకే ఎందుకు వసతి నిరాకరించారన్న ఆరోపణలు వచ్చాయి? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. యూఏఈలో 15 లక్షలకు పైగా పాకిస్తానీలు నివసిస్తున్నారని తాజా నివేదిక పేర్కొంటోంది. అందువల్ల ఇలాంటి ఆరోపణలు పాకిస్తాన్‌కు రాజకీయంగానే కాకుండా ప్రవాసుల భద్రత, ప్రయాణాల విషయంలోనూ ప్రాధాన్యం కలిగిస్తాయి. అయితే, గతంలో కూడా యూఏఈలో పాకిస్తాన్, భారత్ సహా వివిధ దేశాల ప్రయాణికులు ప్రవేశ నిబంధనల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ సందర్భాల్లో యూఏఈ అధికారులు నిబంధనలు జాతీయత ఆధారంగా కాకుండా, హోటల్ బుకింగ్, రిటర్న్ టికెట్, ఆర్థిక సామర్థ్యం వంటి ప్రవేశ నిబంధనల ఆధారంగా వర్తిస్తాయని స్పష్టం చేశారు. -
పాక్ మిస్సైల్ టెస్ట్.. కశ్మీర్‌పై అమెరికా ప్రకటన.. సీన్ మారుతోందా?
ఇస్లామాబాద్ ఒక్కసారిగా కదిలింది. 750 కిలోమీటర్ల మేర గగనతలంపై ఆంక్షలు.. పైలట్లకు నోటామ్ నోటీసులు.. దీంతో పాకిస్తాన్ ఏం చేయబోతోందన్న ఉత్కంఠ మొదలైంది. ఆగస్టు 19-20 తేదీల్లో పాక్ జారీ చేసిన గగనతల ఆంక్షలు ఫతాహ్ సిరీస్ మిస్సైల్ పరీక్షకు సంకేతాలా? అన్న చర్చ రక్షణ వర్గాల్లో మొదలైంది. అయితే నోటామ్లో మిస్సైల్ పరీక్షను స్పష్టంగా పేర్కొనలేదని కూడా నివేదికలు చెబుతున్నాయి.సుదూర లక్ష్యాలను ఛేదించేందుకు పాకిస్తాన్ అభివృద్ధి చేస్తున్న ఫతాహ్ శ్రేణి రాకెట్ వ్యవస్థల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ‘ఫతాహ్-3 పరీక్షే’ అన్నది ప్రస్తుతం రక్షణ పరిశీలకుల అంచనా మాత్రమే. అధికారికంగా పాకిస్తాన్ ధృవీకరించిన సమాచారం కాదు. ఇదే సమయంలో కశ్మీర్‌పై అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్‌కు మరింత అసౌకర్యాన్ని కలిగించాయి. శ్రీనగర్ పర్యటనలో గోర్ జమ్మూకశ్మీర్ “భారత్‌లో ముఖ్యమైన భాగం” అని పేర్కొన్నారు. దీనిపై పాకిస్తాన్ అమెరికా దౌత్య ప్రతినిధిని పిలిచి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.ఒకవైపు మిస్సైల్ పరీక్షపై ఊహాగానాలు.. మరోవైపు కశ్మీర్‌పై అమెరికా స్పష్టమైన వ్యాఖ్యలు.. ఈ రెండు పరిణామాలు ఒకేసారి తెరపైకి రావడంతో దక్షిణాసియా భద్రతా సమీకరణాలపై ఆసక్తి పెరిగింది. పాక్ గగనతల ఆంక్షల వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? నిజంగానే కొత్త మిస్సైల్ పరీక్షకు రంగం సిద్ధమైందా? అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్న.ఫతాహ్లో పాకిస్తాన్ ఇప్పటికే పలు రకాల దీర్ఘశ్రేణి ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేసింది. ముఖ్యంగా ఫతాహ్-4కు 750 కిలోమీటర్ల వరకు పరిధి ఉన్నట్లు రక్షణ వర్గాల సమాచారం ఉంది. ఈ ఏడాది మేలో పాక్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ ఫతాహ్-4కు సంబంధించిన శిక్షణ ప్రయోగాన్ని నిర్వహించినట్లు రక్షణ విశ్లేషణ సంస్థలు పేర్కొన్నాయి. ఫతాహ్ శ్రేణి ఆయుధాల అభివృద్ధి పాక్ దీర్ఘశ్రేణి సంప్రదాయ దాడి సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాల్లో భాగంగా కనిపిస్తోంది. 2025 తర్వాత భారత్-పాక్ మధ్య క్షిపణి, డ్రోన్, రాకెట్ సామర్థ్యాల పోటీ మరింత చర్చకు వచ్చింది. పాకిస్తాన్ కూడా కొత్త తరం ఆయుధ వ్యవస్థలను ప్రదర్శిస్తూ వస్తోంది.అయితే, ఈ తాజా నోటామ్‌ను నేరుగా భారత్‌కు వ్యతిరేకమైన చర్యగా లేదా కశ్మీర్ పరిణామాలకు ప్రతిస్పందనగా నిర్ధారించడం తొందరపాటు అవుతుంది. క్షిపణి పరీక్ష కోసం గగనతలాన్ని ఖాళీ చేయడం సైనిక భద్రతా ప్రక్రియలో భాగం కావచ్చు. అసలు ఏ క్షిపణిని పరీక్షించబోతున్నారు? దాని పరిధి ఎంత? ప్రయోగం ఎక్కడి నుంచి ఎక్కడికి జరగనుంది? అనే వివరాలపై అధికారిక సమాచారం వెలువడితేనే పూర్తి స్పష్టత వస్తుంది. -
‘బయటకు రా’ అంటూ పిలుపు.. ఒక్క కాల్‌తో ముగిసిన టిక్‌టాక్ స్టార్ కథ!
సోషల్ మీడియాలో ఆమె ఓ స్టార్.. లక్షలాది మంది ఆమెను ఫాలో అయ్యారు.. కోట్లాది లైక్స్ ఆమె సొంతం. కానీ ఓ ఫోన్ కాల్ ఆమె జీవితానికి చివరి కాల్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. “బయటకు రా” అంటూ వచ్చిన పిలుపుతో ఇంటి నుంచి బయలుదేరిన 28 ఏళ్ల పాకిస్థాన్ టిక్‌టాక్ క్రియేటర్ షమ్సో బీబీ.. కొద్ది సేపటికే రక్తపు మడుగులో విగతజీవిగా మారారు. ఇస్లామాబాద్ సమీపంలోని టాక్సిలాలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె కారును అడ్డగించి తుపాకీతో కాల్పులు జరిపారు. ఒక్క బుల్లెట్ ఆమె మెడలోకి దూసుకెళ్లింది.. కారు అదుపుతప్పి డంపర్‌ను ఢీకొట్టింది.. 13 లక్షల మంది ఫాలో అయ్యే ఆ సోషల్ మీడియా స్టార్ కథ అక్కడే ముగిసిపోయింది.ఆన్లైన్లో అయేషా గిలమానా పేరుతో గుర్తింపు పొందిన షమ్సో బీబీ గత మూడు, నాలుగేళ్లుగా టిక్‌టాక్ వీడియోలు చేస్తూ భారీ క్రేజ్ సంపాదించారు. ఆమె ఖాతాకు 1.3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు, కోట్లాది లైక్స్ ఉన్నాయి. అయితే ఆగస్టు 14న జరిగిన ఈ దాడితో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనకు ముందు కాశిఫ్ అనే వ్యక్తి షమ్సోకు ఫోన్ చేసి ఇంటి బయటకు రావాలని చెప్పినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆమె తన సోదరి, సోదరుడితో కలిసి కారులో బయలుదేరారు. మార్కెట్ సమీపానికి చేరుకోగానే బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారును అడ్డుకున్నారు. వారిలో ఒకరు తుపాకీ తీసి సమీపం నుంచి కాల్పులు జరిపాడు. బుల్లెట్ షమ్సో మెడలోకి దూసుకెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు డంపర్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె సోదరి కూడా తీవ్రంగా గాయపడ్డారు.🚨 Pakistani TikTok Star Shot Dead🇵🇰 TikTok creator Shamsu Bibi, aka Ayesha Gilamana (28), was shot dead in Taxila, Punjab, on Pakistan Independence DayTwo bikers allegedly opened fire near a petrol station#Taxila #ShamsuBibi #بی_ایل_اے_کی_پھٹ_گئی #felizdiadelniño pic.twitter.com/64vjc06gW9— Daily Briefs (@Daily_Briefs_) August 17, 2026ఈ దాడికి సంబంధించిన CCTV దృశ్యాలు బయటకు వచ్చినట్లు సమాచారం. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారును ఆపడం, ఒకరు తుపాకీ తీసి కాల్పులు జరపడం అందులో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇది యాదృచ్ఛిక దాడి కాదని.. పక్కా ప్లాన్‌తోనే షమ్సోను టార్గెట్ చేశారా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే.. షమ్సోకు ఇప్పటికే ప్రాణహాని బెదిరింపులు వచ్చినట్లు ఆమె తండ్రి చెబుతున్నారు. ఇద్దరు వ్యక్తులు డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమెను బెదిరించారని ఆరోపించారు. వారిలో ఒకరే హత్య వెనుక ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.ముందే హెచ్చరికలు.. ఈ కేసులో పోలీసులు నలుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. వారిలో షూటర్‌కు పారిపోవడానికి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కూడా ఉన్నారు. అయితే షమ్సోను చంపాలని ఆదేశించింది ఎవరు? ఆమెను ఇంటి నుంచి బయటకు రప్పించిన ఫోన్ కాల్ వెనుక ఎవరు ఉన్నారు? డబ్బుల వివాదమే కారణమా? అన్నది ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది.నిన్నటి వరకు ఆమె వీడియోలతో సందడి చేసిన టిక్‌టాక్ ఖాతా ఇప్పుడు లేదు. కుటుంబం ఆమె ఖాతాను తొలగించింది. యూట్యూబ్ పేజీ కూడా కనిపించడం లేదని సమాచారం. లక్షలాది మంది ఫాలోవర్లు.. కోట్లాది లైక్స్.. ఒక్క ఫోన్ కాల్‌తో మొదలైన ప్రయాణం.. బైక్‌పై వచ్చిన రెండు తుపాకీ గుళ్లతో విషాదాంతం. షమ్సో బీబీ హత్య వెనుక అసలు కథేంటన్నదే ఇప్పుడు పాకిస్థాన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. -
పాక్ 171 ఆలౌట్
లీడ్స్: బ్యాటర్లు విఫలమవడంతో ఇంగ్లండ్ పర్యటనను పాకిస్తాన్ జట్టు పేలవంగా ప్రారంభించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ మైదానంలో జరుగుతున్న మొదటి టెస్టులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 48.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ బాబర్ ఆజమ్ జట్టుకు దూరం కాగా... సల్మాన్ ఆఘా పాకిస్తాన్ టీమ్‌ను నడిపించాడు. భారీ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో అబ్దుల్లా షఫీఖ్ (104 బంతుల్లో 61; 8 ఫోర్లు) అర్ధశతకం సాధించగా... ఇమాముల్ హక్ (42; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 91 పరుగులు జోడించారు. పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఇంగ్లండ్ బౌలింగ్ ధాటిని ఎదుర్కోవడంలో పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా తడబడింది. అజాన్ అవైస్ (0), షాన్ మసూద్ (5), సౌద్ షకీల్ (5), సల్మాన్ ఆఘా (21), మొహమ్మద్ రిజ్వాన్ (12), అలీ ఉస్మాన్ (0) పెవిలియన్‌కు క్యూకట్టారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్ 51 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... జోష్ టంగ్ 46 పరుగులు ఇచ్చి 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన రాబిన్సన్ నిప్పులు చెరిగే బంతులతో టాపార్డర్‌ను కకావికలం చేయగా... టంగ్ లోయర్ ఆర్డర్ పని పట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు... బుధవారం ఆట ముగిసే సమయానికి 25 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఓపెనర్లు బెన్ డకెట్ (15), ఎమిలియో గే (33; 7 ఫోర్లు) అవుట్ కాగా... జోర్డాన్కాక్స్ (38 బంతుల్లో 23 బ్యాటింగ్; 4 ఫోర్లు), కెప్టెన్ జో రూట్ (53 బంతుల్లో 37 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్, మొహమ్మద్ అలీ చెరో వికెట్ పడగొట్టారు. చేతిలో 8 వికెట్లు ఉన్న ఇంగ్లండ్... తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 59 పరుగుల దూరంలో ఉంది. -
'జమ్మూకశ్మీర్, భారత్‌లో ముఖ్య భాగం'.. స్పందించిన పాక్
జమ్మూకశ్మీర్ అనేది భారతదేశంలోని ముఖ్య భాగమని అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలని పాకిస్థాన్ ఖండించింది. ఈ వ్యవహారంలో స్థానిక అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. ఆయనని విదేశాంగశాఖ కార్యాలయానికి పిలిపించి, ఈ అంశంపై తీవ్ర నిరసన తెలిపినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. అమెరికా రాయబారి సెర్గియో గోర్ బుధవారం జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అమెరికా రాయబారి పర్యటించడం ఇదే తొలిసారి.భారత్‌లో జమ్మూకశ్మీర్ ముఖ్యమైన భాగం. అద్భుతమైన ప్రకృతి అందాలతో ఎంతో అందంగా ఉంది. ఇక్కడికి రావడం, ఈ ప్రాంతాన్ని కళ్లారా చూడటం సంతోషంగా ఉంది అని గోర్ అన్నారు. జమ్మూకశ్మీర్ విషయంలో అమెరికా జారీ చేసిన 'లెవల్-4' ట్రావెల్ అడ్వైజరీని పునః పరిశీలిస్తామని చెప్పారు.జమ్మూకశ్మీర్‌పై సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలపై పాక్ అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్‌లోని అమెరికా రాయబారి బాధ్యతారాహిత్య ప్రకటన చేశారు. ఈ ప్రాంతం విషయంలో అమెరికా చాలా ఏళ్లుగా పాటిస్తున్న వైఖరికి విరుద్ధంగా ఉంది. జమ్మూకశ్మీర్ ఓ వివాదాస్పద భూభాగం. ఐరాస భద్రతా మండలి తీర్మానాలు, కశ్మీరీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తుది పరిష్కారం కోసం ఎదురుచూస్తోంది. ఈ వ్యవహారంలో అమెరికా ప్రకటనలు తదనుగుణంగా ఉండాలని దౌత్యవేత్తను కోరాం అని పాక్ తెలిపింది. -
పాకిస్తాన్ పర్యటనకు శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు.. షెడ్యూల్ విడుదల
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సొంత గడ్డపై వరుస సిరీస్‌లను నిర్వహించేందుకు సిద్ధమైంది. శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు ఈ ఏడాది అక్టోబర్‌లో పాక్ పర్యటనకు రానున్నాయి. ఆతిథ్య పాకిస్తాన్ శ్రీలంక, ఇంగ్లండ్‌లతో టీ20, వన్డే త్రైపాక్షిక సిరీస్‌లలో తలపడనుంది. అంతేకాకుండా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగమైన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కూడా పాక్-శ్రీలంక మధ్య జరగనుంది.ఈ హోమ్ సీజన్ షెడ్యూల్లో భాగంగా తొలుత అక్టోబర్ 9 నుంచి 13వరకు పాక్-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను నిర్వహించనున్నారు. ఈ సిరీస్ మొత్తానికి రావల్పిండి క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. టీ20 సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్ గడ్డపై అడుగుపెడుతోంది.శ్రీలంక-పాక్-ఇంగ్లండ్ మధ్య వన్డే ట్రై-సిరీస్ అక్టోబర్ 18 నుండి 31 వరకు రావల్పిండి , లాహోర్ వేదికల్లో జరగనుంది. లీగ్ దశలో ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. ఇక ట్రై-సిరీస్ ముగిసిన తర్వాత శ్రీలంక జట్టు పాకిస్తాన్‌లోనే ఉండి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది.ఈ సిరీస్ నవంబర్ 9న రావల్పిండి వేదికగా ప్రారంభం కానుంది. దాదాపు నెలన్నర రోజుల పాటు జరగనున్న ఈ మ్యాచ్‌లతో పాక్ క్రికెట్ అభిమానులు పండగ చేసుకోన్నారు. పాక్ జట్టు ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది.పాక్ హోమ్ సీజన్ షెడ్యూల్ ఇదేశ్రీలంకతో టీ20 సిరీస్అక్టోబర్ 9: మొదటి టీ20 (రావల్పిండి )అక్టోబర్ 11: రెండవ టీ20 ( రావల్పిండి )అక్టోబర్ 13: మూడవ టీ20 ( రావల్పిండి )అక్టోబర్ 18: పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక (రావల్పిండి క్రికెట్ స్టేడియం)అక్టోబర్ 20: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ (రావల్పిండి క్రికెట్ స్టేడియం)అక్టోబర్ 22: శ్రీలంక వర్సెస్ ఇంగ్లండ్ (రావల్పిండి క్రికెట్ స్టేడియం)అక్టోబర్ 25: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ (గడ్డాఫీ స్టేడియం, లాహోర్)అక్టోబర్ 27: పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక (గడ్డాఫీ స్టేడియం, లాహోర్)అక్టోబర్ 29: శ్రీలంక వర్సెస్ ఇంగ్లండ్ (గడ్డాఫీ స్టేడియం, లాహోర్)ఫైనల్ మ్యాచ్:అక్టోబర్ 31: ట్రై-సిరీస్ ఫైనల్ (గడ్డాఫీ స్టేడియం, లాహోర్)పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక టెస్టు సిరీస్ నవంబర్ 4 - 6: 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ (ఇస్లామాబాద్)నవంబర్ 9 - 13: మొదటి టెస్టు (రావల్పిండి)నవంబర్ 17 - 21: రెండవ టెస్టు (లాహోర్) -
భారత్ తన కొడుకు ప్రాణాలు కాపాడటంతో పాకిస్థానీ తల్లి భావోద్వేగ సందేశం
-
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనలు.. జైలులో కలిసిన భార్య
ఇస్లామాబాద్: ఇటీవల పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యవిషయం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన జైలులోనే మృతిచెందారంటూ ఆ దేశానికి చెందిన ఓ జర్నలిస్టు వ్యాఖ్యలు చేయడంతో పీటీఐ పెద్ద ఎత్తున నిరసనలు చేసింది. ఆయన ఆరోగ్యంపై స్పష్టతనివ్వాలంటూ ఆందోళనలు చేపట్టింది. ఆ నేపథ్యంలో ఈ రోజు ఇమ్రాన్ ఖాన్‌ను జైలులో ఆయన ఇమ్రాన్ ఖాన్ సుమారు తొమ్మిది నెలల తర్వాత తన భార్య బుష్రా బీబీ, సోదరి నూరీన్ నియాజీని అదియాలా జైలులో కలిశారు.ఇటీవల సుప్రీంకోర్టు ఇమ్రాన్ ఖాన్ అంశంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ఆరోగ్యం, వైద్య సదుపాయాలపై ఆందోళనల నేపథ్యంలో జైలు అధికారులు ఇకపై వారానికి ఒకసారి కుటుంబ సభ్యులను కలిసేందుకు, కుమారులతో ఫోన్లో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో జైలులో ఆయనను వారి సోదరిణిలు కలిశారు. పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఇమ్రాన్‌ను ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించిన కొన్ని గంటల్లోనే ఈ భేటీ జరిగింది.ఆ దేశ మీడియా కథనాల ప్రకారం.. . నూరీన్ ఇమ్రాన్‌ను సుమారు 15 నిమిషాల పాటు కలిశారు. సుప్రీంకోర్టు ఆయనను షిఫా ఆస్పత్రికి తరలించాలంటూ ఇచ్చిన ఆదేశాలను ఆమె ఇమ్రాన్‌కు వివరించడంతో పాటు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొన్ని న్యాయపరమైన అంశాలపైనా చర్చించారు. అనంతరం బుష్రా బీబీతో ఇమ్రాన్ సుమారు 30-35 నిమిషాల పాటు సమావేశమయ్యారు." అని కథనాలు ప్రచురించాయి.అధిక భద్రత కలిగిన రావల్పిండి జైలు నుంచి తనను ఆస్పత్రికి తరలించాలని, తనకు నచ్చిన వ్యక్తిగత వైద్యులను కలిసేందుకు అనుమతించాలని ఇమ్రాన్ ఖాన్ కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి, వైద్య సేవలకు ప్రాప్యత రాజ్యాంగం కల్పించిన హక్కులకు సంబంధించిన అంశాలని ఇమ్రాన్ తరఫు న్యాయవాది సల్మాన్ అక్రమ్ రాజా తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రానున్న రోజుల్లో ఇమ్రాన్‌ను షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి తరలించి, నిపుణులతో కూడిన వైద్య బృందం పరీక్షలు నిర్వహించనుంది.ఈ బోర్డులో ఆయన వ్యక్తిగత వైద్యుడు ఫైసల్ సుల్తాన్ కూడా ఉంటారు. ఈ ఏడాది ప్రారంభంలో కంటి సమస్యకు చికిత్స కోసం ఇమ్రాన్‌ను పలుమార్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జనవరి చివర్లో ఆయన కుడి కంటికి సుమారు 85 శాతం చూపు కోల్పోయారని కుటుంబ సభ్యులు చెప్పగా, ప్రభుత్వం ఆ వాదనను ఖండించింది. అనంతరం ఆయనకు సుమారు 70 శాతం చూపు తిరిగి వచ్చిందని, పరిస్థితి మెరుగుపడుతోందని అధికారులు తెలిపారు. ఇమ్రాన్‌ను ఆస్పత్రికి తరలించే సమయంలో ఆయన మద్దతుదారులు అక్కడికి భారీగా చేరి ఇతర రోగులకు ఇబ్బంది కలిగించవద్దని న్యాయవాది రాజా కోరారు.ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టు తీర్పును ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ స్వాగతించింది. ఆయన ఆరోగ్యం, వైద్య సేవలకు ప్రాప్యతపై చాలాకాలంగా ఉన్న ఆందోళనలకు ఈ తీర్పు పరిష్కారం చూపుతుందని పేర్కొంది. అయితే ఇమ్రాన్ వైద్య చికిత్సకు సంబంధించిన కోర్టు ఆదేశాలపై ప్రభుత్వం సమీక్ష పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నట్లు న్యాయశాఖ మంత్రి అజమ్ నజీర్ తరార్ తెలిపారు. -
హ్యాట్రిక్‌తో చెలరేగిన అఫ్రిది
పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టాడు. హ్యాట్రిక్ సహా ఏకంగా 7 వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ గోల్డ్ జట్టుకు National Champions Cup 2026-27 టైటిల్ అందించాడు. మంగళవారం జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ గోల్డ్.. పాకిస్తాన్ గ్రీన్స్‌పై 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గోల్డ్ నిర్ణీత 50 ఓవర్లలో 340 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు షమైల్ హుస్సేన్ (111), సాద్ ఖాన్ (112) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ 103 బంతుల్లో 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారీ స్కోరుకు పునాది వేశారు. మహ్మద్ అఖ్లాక్ 31 పరుగులు చేయగా, అబ్దుల్ సమద్, ముబాషిర్ ఖాన్ కూడా కీలక పరుగులు జోడించారు.341 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ గ్రీన్స్‌కు మంచి ఆరంభమే లభించింది. 20.4 ఓవర్లలో 143/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. సాద్ బేగ్ 51 బంతుల్లో 67 పరుగులు చేయగా, ఒమైర్ బిన్ యూసుఫ్ 50 బంతుల్లో 44 పరుగులు చేశాడు. వీరిద్దరూ 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.అయితే ఆ తర్వాత షాహీన్ అఫ్రిది మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశాడు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ గ్రీన్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఫహీమ్ అష్రఫ్.. నసీమ్ షా కలిసి 61 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసినా షాహీన్ ఆ భాగస్వామ్యాన్ని కూడా విడదీశాడు.Shaheen Shah Afridi picked up 7/36, including a hat-trick in the Champions Cup One-Day Final. 🔥pic.twitter.com/ADdCI7S1hO— CricketGully (@thecricketgully) August 19, 2026హ్యాట్రిక్‌తో ముగింపు38వ ఓవర్లో షాహీన్ అఫ్రిది హ్యాట్రిక్ నమోదు చేశాడు. మొదటి బంతికి మెహ్రాన్ ముంతాజ్‌ను ఇన్‌స్వింగర్‌తో ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన అతడు.. ఆతర్వాతి బంతికి సల్మాన్ మిర్జాను, మూడో బంతికి మొహమ్మద్ హస్నైన్ను క్లీన్ బౌల్డ్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేశాడు.దీంతో గ్రీన్స్ 37.3 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటైంది. అఫ్రిది 8.3 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.ఇది షాహీన్ అఫ్రిది List A క్రికెట్ కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. అంతకుముందు అతని అత్యుత్తమ గణాంకాలు 6/35గా ఉండేవి. 2019లో లార్డ్స్‌లో బంగ్లాదేశ్‌పై ఆ ప్రదర్శన చేశాడు. -
జైలు నుంచి హాస్పిటల్.. ఇమ్రాన్ ఖాన్ కు బిగ్ రిలీఫ్
-
ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ షాక్!
జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను జైలు నుంచి ఆసుపత్రికి తరలించాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ.. పాకిస్థాన్ ప్రభుత్వం చివరి నిమిషంలో హైడ్రామాకు దిగింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లే అంశంపై మరోసారి అనిశ్చితి నెలకొంది.మంగళవారం మూడు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఇమ్రాన్ ఖాన్‌ను రావల్పిండిలోని అడియాలా జైలు నుంచి ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది. రెండు రోజుల్లోగా ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందించాలని జైలు అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా.. సెప్టెంబర్ 16న కేసు తదుపరి విచారణ జరిగే వరకు ఇమ్రాన్ ఖాన్‌ను ఆసుపత్రిలోనే ఉంచేందుకు ధర్మాసనం అనుమతించింది.తొలుత ‘అమలు చేస్తాం’ అన్న ప్రభుత్వంఅయితే సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే పాకిస్థాన్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి తారిఖ్ ఫజల్ చౌదరీ భిన్నంగా స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ‘అక్షరాలా, స్ఫూర్తితో అమలు చేస్తాం’ అని ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్‌కు ఆయన పార్టీ నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాకపోయినా.. జైలులోనే సాధ్యమైనంత ఉత్తమ వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. అయితే.. సుప్రీం ఆదేశాలపై ప్రభుత్వ సమీక్షకొద్ది గంటల్లోనే సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గింది. కోర్టు ఉత్తర్వులను పూర్తిగా అమలు చేయడం కాకుండా.. వాటిలో తగిన మార్పులు చేయాలని కోరుతూ సమీక్ష పిటిషన్ దాఖలు చేయనున్నట్లు న్యాయశాఖ మంత్రి ఆజమ్ నజీర్ తరార్ ప్రకటించారు. సంబంధిత చట్టాన్ని పరిశీలించిన తర్వాత.. సుప్రీంకోర్టును సమీక్ష పిటిషన్ ద్వారా ఆశ్రయించి ఉత్తర్వుల్లో తగిన మార్పులు కోరాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. దీంతో ఇమ్రాన్ ఖాన్‌ను ఆసుపత్రికి తరలించాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల అమలుపై ఉత్కంఠ నెలకొంది.‘జైల్లో నరకం చూపిస్తున్నారు’.. ఇదిలా ఉండగా.. ఇమ్రాన్ ఖాన్ జైలు పరిస్థితులపై ఆయన కుటుంబ సభ్యులు మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు చేశారు. జైల్లో ఆయనను ఒంటరిగా ఒక సెల్లో బంధించారని, ఎవరితో మాట్లాడనీయడం వలేదని, తాగేందుకు మురికి నీరు ఇస్తున్నారని అన్నారు. అంతేకాకుండా హెపటైటిస్‌తో బాధపడుతున్న ఖైదీల మధ్య ఆయనను ఉంచారని పేర్కొన్నారు. ఆయనను ‘డెత్ సెల్’లో ఉంచినట్లుగా ఉందని పీటీఐ అంటోంది. జైల్లో ఇమ్రాన్‌తో ఎవరూ మాట్లాడకూడదనే ఆంక్షలు ఉన్నాయని, చివరకు జైలు గార్డులు సైతం ఆయనను పలకరించేందుకు అనుమతి లేదని ఆరోపిస్తోంది. మరోవైపు.. పాకిస్థాన్ ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ విషయంలో ‘సైకాలజికల్ టార్చర్ స్ట్రాటజీ’ని అనుసరిస్తోందని ములాఖత్ అయిన సోదరి ఆరోపించారు. పరిస్థితి రోజురోజుకూ మరింత కఠినంగా మారుతోందని.. తమ సోదరుడిపై ఆశను నిలుపుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. లండన్‌లో ఉన్న కొడుకులైతే.. ఆయన్ని మళ్లీ చూస్తామో లేదో అనే ఆందోళన సైతం వ్యక్తం చేశారు. అయితే షెహబాజ్ ప్రభుత్వం మాత్రం అవన్నీ ఆరోపణలనేనని.. జైలులో ఆయనకు సాధ్యమైనంత మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తున్నామని చెబుతోంది.సోదరి పిటిషన్‌తో విచారణఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆయనకు కంటి చూపు మందగించడంతో పాటు పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని పేర్కొంటూ ఆయన సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్, పార్టీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇమ్రాన్‌కు తక్షణమే వైద్య చికిత్స అందించాలని వారు పిటిషన్లలో కోరారు. ఈ పిటిషన్లను విచారించిన ధర్మాసనం.. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా అంచనా వేసేందుకు ప్రత్యేక వైద్య బోర్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే ఆయనకు అవసరమైన వైద్య చికిత్స అందించాలని, కుటుంబ సభ్యులను కలిసేందుకు అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది.మూడేళ్లుగా జైలులోనే..73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు. పలు కేసుల్లో ఆయనకు శిక్షలు పడటంతో అడియాలా జైలులో నిర్బంధంలో కొనసాగుతున్నారు. అయితే తనపై నమోదైన కేసులన్నీ రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఇమ్రాన్ ఖాన్, ఆయన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఆరోపిస్తున్నాయి.ఇమ్రాన్ ఖాన్ 2018లో పాకిస్థాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2022 ఏప్రిల్‌లో పార్లమెంటులో జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఆయన ప్రభుత్వం ఓడిపోయింది. దీంతో తన పదవీకాలం పూర్తికాకముందే ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయనపై అవినీతి సహా పలు అంశాలకు సంబంధించి అనేక కేసులు నమోదయ్యాయి. వీటిలో కొన్ని కేసుల్లో ఆయనకు విధించిన శిక్షలు నిలిపివేయబడ్డాయి లేదా రద్దయ్యాయి. మరికొన్ని కేసుల్లో అప్పీళ్లు ఇంకా ఉన్నత న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయి.నెలల తర్వాత సోదరితో ముఖాముఖిసుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ మరో సోదరి నోరీన్ నియాజీ ఆయనను జైలులో కలిశారు. చాలా నెలల తర్వాత ఇమ్రాన్‌తో ఆమె ముఖాముఖిగా మాట్లాడటం ఇదే తొలిసారి. కుటుంబ సభ్యులతో ఇమ్రాన్ ఖాన్ భేటీకి కూడా సుప్రీంకోర్టు అనుమతించడంతో ఈ సమావేశం జరిగింది.చికిత్స విషయంలో మళ్లీ ఉత్కంఠసుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం వాటిపై సమీక్ష కోరాలని నిర్ణయించడం ఇమ్రాన్ ఖాన్ వైద్య చికిత్స అంశాన్ని మరోసారి రాజకీయ, న్యాయ వివాదంగా మార్చింది. ఒకవైపు మాజీ ప్రధాని ఆరోగ్యం క్షీణిస్తోందని కుటుంబ సభ్యులు, పీటీఐ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం జైలులోనే ఆయనకు సాధ్యమైనంత మెరుగైన వైద్య సదుపాయాలు అందుతున్నాయని చెబుతోంది.ఇప్పుడు ప్రభుత్వం దాఖలు చేయనున్న సమీక్ష పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్నదే కీలకంగా మారింది. సెప్టెంబర్ 16న జరగనున్న తదుపరి విచారణకు ముందు ఇమ్రాన్ ఖాన్‌ను ఆసుపత్రికి తరలిస్తారా? లేదంటే ప్రభుత్వ అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో మార్పులు చేస్తుందా? అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. -
బాబర్ ఆజం ఔట్.. కెప్టెన్‌గా సల్మాన్ ఆఘా
ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు ముందు పాకిస్తాన్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ బాబర్ ఆజం గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇటీవల ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడిన బాబర్.. ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో తొలి టెస్టులో ఆడటం లేదని జట్టు కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించాడు. బాబర్ స్థానంలో సల్మాన్ ఆఘా తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపాడు.తొలి టెస్ట్ ఆగస్టు 19న లీడ్స్‌లో ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. రెండో టెస్ట్ లండన్ వేదికగా ఆగస్ట్ 27న, మూడో టెస్ట్ సెప్టెంబర్ 9న బర్మింగ్హమ్ వేదికగా ప్రారంభమవుతాయి.టెస్ట్ కెప్టెన్‌గా తొలి అవకాశంఇప్పటికే పాకిస్తాన్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున సల్మాన్ ఆఘాకు టెస్టు జట్టును నడిపించడం ఇదే తొలిసారి. కీలకమైన ఇంగ్లండ్ పర్యటనలో అతడికి ఇది పెద్ద బాధ్యతగా మారింది.ఇంగ్లండ్ గడ్డపై పాక్‌కు గతంలో పెద్ద అనుకూల ఫలితాలు లేవు. దీనికి తోడు బాబర్ వంటి కీలక బ్యాటర్ తొలి టెస్టుకు దూరం కావడం ఆ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ. కొత్త కెప్టెన్ సల్మాన్ ఆఘా ఏ మేరకు వ్యక్తిగతంగా రాణించి, జట్టును ముందుకు నడిపిస్తాడో చూడాలి. -
పాక్ సుప్రీంకోర్టు కీలక ఆదేశం.. ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే ఆస్పత్రికి తరలించండి
-
బిచ్చగాళ్ల దేశమనుకుంటున్నారు.. పరువు తీయొద్దు!: పాక్
విదేశాల్లో పాకిస్థానీయుల భిక్షాటన, అక్రమ వలసల వ్యవహారం ఆ దేశ ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా సహా గల్ఫ్ దేశాల్లో పాక్ పౌరులపై భిక్షాటన, వీసా నిబంధనల ఉల్లంఘన, అక్రమ నివాసం వంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇస్లామాబాద్ అప్రమత్తమైంది. తాజాగా హజ్, ఉమ్రా యాత్రల పేరిట సౌదీ అరేబియాకు వెళ్లే తమ పౌరులు.. భిక్షాటనకు పాల్పడొద్దంటూ బతిమాలినంత పని చేస్తోంది.పాకిస్థాన్ ఎంబసీ సౌదీ అరేబియాలోని తమ పౌరులను ఉద్దేశించి ఈ సూచనలు చేసింది. హజ్, ఉమ్రా యాత్రికులతో పాటు సౌదీలో పనిచేస్తున్న పాకిస్థానీయులు కూడా స్థానిక చట్టాలను, తమ వీసా నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరింది. ముఖ్యంగా మక్కా, మదీనా పవిత్ర ప్రాంతాల పరిసరాల్లో భిక్షాటన, అనధికారికంగా విరాళాలు లేదా డబ్బులు సేకరించడంపై సౌదీ అధికారులు ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమలు చేస్తున్నారని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టు, నిర్బంధం, డిపోర్టేషన్ వంటి కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.ఏఐ వీడియోతో..తమ హెచ్చరికను మరింత బలంగా తెలియజేసేందుకు పాకిస్థాన్ ఎంబసీ సోషల్ మీడియాలో ఓ ఏఐ రూపొందించిన వీడియోను కూడా విడుదల చేసింది. అందులో ఓ వ్యక్తిని సౌదీ అధికారులు అరెస్టు చేసి జైలుకు తరలిస్తున్నట్లు చూపించారు. స్థానిక చట్టాలను ఉల్లంఘిస్తే ఎదురయ్యే పరిణామాలను ఈ వీడియో ద్వారా యాత్రికులకు వివరించారు. అనుమతి లేని సేవలను వినియోగించుకోవద్దని, చట్టబద్ధమైన మార్గాల్లోనే ఆర్థిక సహాయం, విరాళాల సేకరణ చేపట్టాలని సూచించారు.దేశ పరువు దెబ్బతినేలా వ్యవహరించవద్దని పరోక్షంగా గట్టి సందేశం ఇచ్చింది.پاکستان سے انے والے تمام عمرہ زائرین اور ورکرز کے نام اہم پیغام pic.twitter.com/BzOScR3lFP— Pakistan Embassy Saudi Arabia (@PakinSaudiArab) August 16, 2026సౌదీ నుంచే వేలాది మంది వెనక్కి..విదేశాల్లో పాక్ పౌరుల భిక్షాటన వ్యవహారం కొత్తది కాదు. పాక్ అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2025లో సౌదీ అరేబియా నుంచి సుమారు 24 వేల మంది పాకిస్థానీయులను భిక్షాటనకు సంబంధించిన ఆరోపణలపై వెనక్కి పంపినట్లు సమాచారం. యూఏఈ నుంచి దాదాపు 6 వేల మంది, అజర్బైజాన్ నుంచి సుమారు 2,500 మంది పాక్ పౌరులను కూడా వెనక్కి పంపినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇందులో భిక్షాటన సంబంధిత కేసులే కాదు.. వీసా నిబంధనల ఉల్లంఘన, అక్రమ నివాసం, ఇతర ఇమ్మిగ్రేషన్ ఉల్లంఘనలు, నేరాలకు సంబంధించిన కేసులు కూడా డిపోర్టేషన్లకు కారణాలుగా ఉన్నాయి.38 వేలకుపైగా డిపోర్ట్పాక్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2025లో సౌదీ అరేబియా సహా గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాల నుంచి వివిధ కారణాలతో 38,616 మంది పాకిస్థానీయులు డిపోర్ట్ అయ్యారు. వీరిలో సౌదీ అరేబియా నుంచి 27,692 మంది, యూఏఈ నుంచి 6,794 మంది, ఒమన్ నుంచి 2,537 మంది ఉన్నారు. అయితే వీరంతా భిక్షాటన కేసుల్లోనే వెనక్కి పంపినవారు కాదని పాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది.విమానాశ్రయాల్లోనే అడ్డుకట్టవిదేశాల్లో సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో పాక్ ప్రభుత్వం దేశంలోనే చర్యలు ప్రారంభించింది. 2025లో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన 66,154 మందిని పాక్ విమానాశ్రయాల్లోనే ‘ఆఫ్‌లోడ్’ చేసినట్లు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) వెల్లడించింది. సరైన పత్రాలు లేకపోవడం, ప్రయాణ ఉద్దేశంపై అనుమానాలు, ఇతర ఇమ్మిగ్రేషన్ సమస్యల కారణంగా పలువురిని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.ఈ వ్యవహారంలో ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ నెట్‌వర్క్‌లు, అక్రమ వలసలకు సహకరిస్తున్న ఏజెంట్లపై కూడా FIA దృష్టి పెట్టింది. కొందరు ఉమ్రా వీసాలను ఉపయోగించుకుని సౌదీకి వెళ్లి అక్కడ భిక్షాటనకు పాల్పడుతున్నట్లు, మరికొందరు అక్కడి నుంచి ఇతర దేశాలకు అక్రమంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు పాక్ అధికారులు గుర్తించిన సందర్భాలు ఉన్నాయి.2024లోనే సౌదీ హెచ్చరికభిక్షాటన వ్యవహారంపై సౌదీ అరేబియా 2024లోనే పాకిస్థాన్‌ను హెచ్చరించింది. ఉమ్రా వీసాలను భిక్షాటన కోసం దుర్వినియోగం చేయొద్దని పాక్ ప్రభుత్వం తమ పౌరులకు స్పష్టంగా చెప్పాలని సూచించింది. మక్కా, మదీనా వంటి పవిత్ర ప్రాంతాల్లో భిక్షాటనపై సౌదీ కఠిన వైఖరి అవలంబిస్తోంది. అయినప్పటికీ సమస్య కొనసాగుతుండటంతో తాజాగా మరోసారి పాక్ తన పౌరులను అప్రమత్తం చేసింది.విదేశాల్లో భిక్షాటన, అక్రమ వలస నెట్‌వర్క్‌లు పాకిస్థాన్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని ఆ దేశ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాక్ సెనేట్ కమిటీకి సమర్పించిన వివరాల ప్రకారం.. 2019 నుంచి 2025 మధ్య వివిధ దేశాల నుంచి 7,873 మంది పాకిస్థానీయులు డిపోర్ట్ కాగా.. వారిలో 1,064 మంది భిక్షాటన కారణంగా వెనక్కి పంపబడ్డారు. ఈ నేపథ్యంలో హజ్, ఉమ్రా యాత్రికులకు పాక్ తాజా హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది. విదేశాల్లో భిక్షాటనకు పాల్పడి దేశ ప్రతిష్ఠను దెబ్బతీయొద్దని, సౌదీ చట్టాలను కచ్చితంగా పాటించాలని ఇస్లామాబాద్ స్పష్టం చేస్తోంది. హజ్–ఉమ్రా యాత్రల సమయంలో జరిగే ఒక్కో ఘటన మొత్తం పాకిస్థాన్ పౌరులపై ప్రతికూల ప్రభావం చూపకుండా ముందుగానే నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. -
పాక్ మాజీ క్రికెటర్‌కు తీవ్ర గుండెపోటు
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ(55) తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను కుటంబ సభ్యులు కరాచీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాసిత్ అలీకి వైద్యులు యాంజియోప్లాస్టీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. బాసిత్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, క్రికెట్ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి. బాసిత్ అలీ 1993-96 మధ్య కాలంలో పాక్ తరపున 19 టెస్టులు, 50 వన్డేలు ఆడారు. మొత్తంగా 69 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆయన 2,123 పరుగులు చేశారు. అలీ ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నారు.చదవండి: బాధపడొద్దు జడ్డూ.. ఇంకా చాలా టైమ్ ఉంది: సర్ఫరాజ్ -
ఇంత తక్కువ ధరకే ఎలక్ట్రిక్ బైక్? యూరప్‌లో హాట్ కేకుల్లా అమ్మకాలు!
-
సౌదీతో పాక్ దోస్తీ ఎఫెక్ట్.. గల్ఫ్‌లో కొత్త చిచ్చు!
పశ్చిమాసియాలో ఇప్పటికే ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. మరో కొత్త సమీకరణం తెరపైకి వచ్చింది. సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ కలిసి కుదుర్చుకున్న మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం ఇప్పుడు గల్ఫ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒప్పందంపై సంతకాలు జరిగి కొన్ని రోజులే అవుతున్నా.. అప్పుడే దాని ప్రభావం మరో వైపు కనిపిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా-యూఏఈ మధ్య దూరం మరింత పెరుగుతోందా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.అసలు ఏం జరిగింది?ఆగస్టు 7న పవిత్ర మక్కా నగరంలో సౌదీ యువరాజు, ప్రధాని మహ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందంలోని ప్రధాన సూత్రం ఒక్కటే.. ముగ్గురిలో ఏదో ఒక దేశంపై దాడి జరిగితే.. మిగిలిన రెండు దేశాలపై దాడిగా పరిగణించడం. అంటే.. చమురు సంపదతో బలమైన సౌదీ, అణ్వాయుధ సామర్థ్యం ఉన్న పాకిస్తాన్, నాటోలో రెండో అతిపెద్ద సైనిక బలగం ఉన్న టర్కీ ఒకే రక్షణ గొడుగు కిందకు వచ్చినట్లే అయ్యింది. ఇదే కారణంగా కొందరు నిపుణులు దీనిని ఇప్పటికే ‘ఇస్లామిక్ నాటో’గా పిలవడం మొదలుపెట్టారు.కూటమి ఇంతటితో ఆగదా?మక్కా ఒప్పందం ముగ్గురు దేశాలకే పరిమితం కాదనే సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఈజిప్ట్, ఖతార్, కువైట్, జోర్డాన్, అజర్బైజాన్, సిరియా వంటి దేశాలను భవిష్యత్‌లో కూటమిలోకి తీసుకురావచ్చనే ప్రచారం జరుగుతోంది. అంటే.. పశ్చిమాసియాలో కొత్త భద్రతా బ్లాక్ రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది.‘GCC ఉండగా కొత్త కూటమి ఎందుకు?’సౌదీ నిర్ణయంపై యూఏఈకి చెందిన ప్రముఖ స్వరాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. సౌదీ, యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్ సభ్యులుగా ఉన్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) ఇప్పటికే ఉంది. అంతేకాదు.. సభ్య దేశాలపై దాడిని మొత్తం కూటమిపై దాడిగా పరిగణించే సంయుక్త రక్షణ వ్యవస్థ కూడా ఉంది. అలాంటప్పుడు.. గల్ఫ్ వెలుపల ఉన్న టర్కీ, పాకిస్తాన్లతో కలిసి సౌదీ కొత్త రక్షణ కూటమిని ఎందుకు ఏర్పాటు చేసిందన్నది యూఏఈ వర్గాల ప్రశ్న. యూఏఈ రాజకీయ విశ్లేషకుడు, ఆ దేశ అధ్యక్షుడి మాజీ సలహాదారు అబ్దుల్ఖలీఖ్ అబ్దుల్లా కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. గల్ఫ్ దేశాల మధ్య ఐక్యతను బలోపేతం చేయడమే ముఖ్యమని వ్యాఖ్యానించారు.సౌదీ కూడా తగ్గలేదు!యూఏఈ నుంచి విమర్శలు రావడంతో సౌదీ వర్గాలు కూడా వెంటనే కౌంటర్ ఇచ్చాయి. ప్రతి దేశానికీ తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకునే హక్కు ఉంది అంటూ సౌదీ యువరాజు అబ్దుల్రహ్మాన్ బిన్ ముసైద్ ప్రశ్నించారు. అంతేకాదు.. సౌదీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్న యూఏఈ తన భద్రతా భాగస్వామ్యాలను ఒకసారి చూసుకోవాలని సౌదీ వ్యాఖ్యాతలు సూచించారు.భారత్, ఇజ్రాయెల్ పేర్లు ఎందుకొచ్చాయి?ఇక్కడే ఈ వివాదం మరో ఆసక్తికర మలుపు తిరిగింది. సౌదీ వ్యాఖ్యాతలు.. యూఏఈ-భారత్ రక్షణ సహకారం, యూఏఈ-ఇజ్రాయెల్ భద్రతా సంబంధాలను ప్రస్తావించారు. యూఏఈ ఇతర దేశాలతో భద్రతా భాగస్వామ్యాలు పెట్టుకోవచ్చు.. కానీ సౌదీ టర్కీ, పాకిస్తాన్‌తో ఒప్పందం చేసుకుంటే మాత్రం ఎందుకు అభ్యంతరం ఎందుకు? అన్నది వారి వాదన. అయితే ఇక్కడ ఒక కీలక విషయం ఉంది. భారత్, యూఏఈ మధ్య సంయుక్త రక్షణ ఒప్పందం లేదు. కానీ ఇరు దేశాల మధ్య చాలాకాలంగా రక్షణ సహకారం కొనసాగుతోంది. 2026 జనవరిలో ఈ సహకారాన్ని మరింత విస్తరించేలా వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యానికి కూడా ఇరు దేశాలు రూపకల్పన చేశాయి. ఇజ్రాయెల్‌తో మాత్రం యూఏఈ 2020లో అబ్రహామ్ ఒప్పందాల ద్వారా సంబంధాలను సాధారణీకరించింది.యెమెన్లోనే అసలు విభేదాల బీజాలు!సౌదీ-యూఏఈ మధ్య విభేదాలు ఇప్పుడే మొదలైనవి కావు. యెమెన్ విషయంలోనే ఇరు దేశాల వ్యూహాలు చాలా కాలంగా వేర్వేరు మార్గాల్లో సాగుతున్నాయి. సౌదీ అరేబియా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుండగా.. యూఏఈ దక్షిణాది వేర్పాటువాద శక్తులకు మద్దతుగా నిలిచింది. అంటే.. బయటకు మిత్రదేశాలుగానే కనిపిస్తున్నా, కీలకమైన ప్రాంతీయ అంశాల్లో ఇరు దేశాల ప్రయోజనాలు వేర్వేరుగా మారుతున్నాయి.ముందు ఏం జరగబోతోంది?మక్కా ఒప్పందం మరిన్ని దేశాలకు విస్తరిస్తే.. మధ్యప్రాచ్యంలో కొత్త శక్తి సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది. ఒకవైపు సౌదీ-టర్కీ-పాకిస్థాన్ అక్షం బలపడుతుంటే.. మరోవైపు యూఏఈ తన భారత్, ఇజ్రాయెల్ సహా ఇతర వ్యూహాత్మక భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే.. మక్కాలో పుట్టిన ఈ కొత్త రక్షణ కూటమి.. ఇస్లామిక్ ప్రపంచానికి భద్రతా కవచమా? లేక గల్ఫ్‌లోనే కొత్త విభేదాలకు కారణమా?. రాబోయే రోజుల్లో ఈ సమీకరణం ఎటువైపు మలుపు తిరుగుతుందో చూడాలి. -
పనిమంతులే.. పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్
FIH పురుషుల హాకీ ప్రపంచకప్ 2026ను పాకిస్తాన్ ఘోర పరాజయంతో ప్రారంభించింది. ఇంగ్లండ్‌తో జరిగిన పూల్-డీ మ్యాచ్‌లో 1-4 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ విచిత్ర ఘటనతో మిగిలిన కాస్త పరువును కూడా పోగొట్టుకుంది.ఇంగ్లండ్‌కు 17వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ లభించిన సమయంలో పాక్ ఆటగాళ్ల వద్ద ఉండాల్సిన పెనాల్టీ కార్నర్ రక్షణ పరికరాలు (పెనాల్టీ కార్నర్ కిట్) అందుబాటులో లేవు. దీంతో ఓ ఆటగాడు మైదానం నుంచి బయటకు వెళ్లి పరికరాలతో కూడిన బ్యాగ్‌ను తీసుకురావాల్సి వచ్చింది. ఈ కారణంగా మ్యాచ్‌కు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.ఈ ఆలస్యంపై అంపైర్లు చర్యలు తీసుకున్నారు. పాక్ కెప్టెన్ అబూ బకర్కు గ్రీన్ కార్డ్ చూపించి రెండు నిమిషాల పాటు మైదానం నుంచి బయటకు పంపారు.ఈ ఘటనపై పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ అక్బర్ తీవ్రంగా స్పందించారు. ప్రపంచకప్ వంటి అత్యున్నత అంతర్జాతీయ వేదికపై పెనాల్టీ కార్నర్‌కు అవసరమైన ప్రాథమిక రక్షణ పరికరాలను మర్చిపోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు.“ప్రపంచకప్ అత్యున్నత స్థాయి ప్రొఫెషనలిజాన్ని కోరుకుంటుంది. ఇలాంటి ఘటనలు జట్టు ఎంతవరకు సిద్ధంగా ఉందనే ప్రశ్నలను లేవనెత్తుతాయి” అని సల్మాన్ అక్బర్ విమర్శించారు.అక్బర్ విమర్శలను అటుంచితే, పెనాల్టీ కిట్ లేకుండా ప్రపంచకప్ మ్యాచ్ బరిలోకి దిగిన పాక్ జట్టుపై సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గొప్ప పనిమంతులే అంటూ స్వదేశ అభిమానులే వారిని విమర్శిస్తున్నారు. ఇంత అ.జాగ్రత్తగా ఎలా ఉంటారని అంటున్నారు. మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ తొలి అర్ధభాగంలోనే ఆధిపత్యం ప్రదర్శించింది. పాక్ ఒక్క గోల్ మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ చివరకు 4-1తో ఘన విజయం సాధించి బోణీ కొట్టింది.పాక్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆగస్టు 17న వేల్స్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఆగస్టు 19న భారత్‌తో కీలక పోరు జరగనుంది. తొలి మ్యాచ్‌లోనే భారీ ఓటమి ఎదురుకావడంతో పాక్‌కు తదుపరి రెండు మ్యాచ్‌లు కీలకంగా మారాయి. -
పాక్ స్వాతంత్ర్య వేడుకల్లో భారత దేశభక్తి పాట.. రఫ్ఫాడిస్తున్న నెటిజన్లు!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆ దేశ నటీమణులు చేసిన ఒక పొరపాటు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆగస్టు 14న పాకిస్థాన్ యౌమ్-ఏ-ఆజాదీ (స్వాతంత్ర్య దినోత్సవం) వేడుకలను పురస్కరించుకుని కొందరు పాకిస్థానీ ప్రముఖులు, నటీమణులు ఒక వీడియోను షేర్ చేశారు. అయితే, ఆ వీడియోలో వారు తమ దేశ జెండాలతో సంబరాలు చేసుకుంటూ, బ్యాక్‌గ్రౌండ్‌లో భారతీయ దేశభక్తి గీతాన్ని ఉపయోగించడం చర్చనీయాంశమైంది.బాలీవుడ్ నటి ఆలియా భట్ నటించిన ‘రాజీ’ చిత్రంలోని దేశభక్తి గీతం ‘ఏ వతన్... వతన్ మేరే... ఆబాద్ రహే తూ...’ పాటను ఈ వేడుకల కోసం ఎంచుకోవడం విశేషం. పాకిస్థాన్ స్వాతంత్ర వేడుకల్లో భారత దేశానికి చెందిన పాటను ప్లే చేయడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సెలబ్రిటీలుగా ఉండి ఇలాంటి బాధ్యతారహిత్యమైన పని చేయడంపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. ఈ ఘటనపై పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ డ్రేజ్ వారిస్ స్పందించారు. ఆ నటీమణుల తీరును తప్పుపడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు.‘పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున మన దేశ జెండాను పట్టుకుని, ఒక భారతీయ దేశభక్తి పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో వాడుతూ వేడుకలు చేసుకోవడం ఎంతవరకు సమంజసం? ఇది బాలీవుడ్ సంగీతానికి వ్యతిరేకం కానప్పటికీ, జాతీయ ప్రాధాన్యాన్ని, స్పూర్తిని ప్రతిబింబించే విషయంలో ప్రముఖులు మరింత బాధ్యతగా వ్యవహరించాలి’ అని ఆమె పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, భారతీయ వ్లాగర్స్, నెటిజన్లు సైతం పాకిస్థాన్ సెలబ్రిటీల అజ్ఞానాన్ని ఎత్తిచూపుతూ ట్రోల్ చేస్తున్నారు. జాతీయ పర్వదినాల్లో కనీస ప్రాథమిక విషయాలపై అవగాహన లేకుండా ప్రముఖులే ఇలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. View this post on Instagram A post shared by D R E J A Z W A R I S (@drejazwaris)ఇది కూడా చదవండి: బలూచ్‌లో రక్తపాతం: 8 రోజుల్లో 26 మంది పాక్ సైనికులు హతం! -
ఏంటి బ్రో.. కాస్త వెనక ముందు చూసుకోవాలి కాదా?
పాకిస్తాన్ దేశవాళీ టోర్నీ నేషనల్ ఛాంపియన్స్ కప్-2026 రసవత్తరంగా సాగుతోంది. వన్డే ప్రపంచకప్-2027 పటిష్టమైన జట్టును తాయారు చేసేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ టోర్నీని తొలిసారి నిర్వహిస్తోంది. షాహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఖుష్దిల్ షా వంటి జాతీయ జట్టు ఆటగాళ్లు ఈ నేషనల్ ఛాంపియన్స్ కప్‌లో ఆడుతున్నారు. అయితే ఈ టోర్నీలో పాకిస్తాన్ వైట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఖుష్దిల్.. ఆదివారం పాకిస్తాన్ గోల్డ్‌తో జరిగిన మ్యాచ్‌లో విచిత్రమైన రీతిలో ఔటయ్యాడు. చిన్న తప్పిదం వల్ల తన వికెట్‌ను ప్రత్యర్ధి జట్టుక సమర్పించుకున్నాడు.ఏమి జరిగిందంటే?ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ వైట్స్ 22 ఓవర్లలో కేవలం 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయం క్రీజులో వచ్చిన ఖుష్దిల్ షా.. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోవాల్సినపోయి నిర్లక్ష్యంగా వ్యవహరించి తన వికెట్‌ను కోల్పోయాడు. పాకిస్తాన్ గోల్డ్ స్పిన్నర్ ఫైసల్ అక్రమ్ ఓ వేసిన ఓ బంతిని ఖుష్దిల్ ఆఫ్ సైడ్ దిశగా కట్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ కింద భాగంలో తగిలి, వికెట్ల పక్కగా వికెట్ కీపర్ వైపు వెళ్లింది. అయితే బంతి ఎటు వెళ్లిందో గమనించని ఖుష్దిల్.. సింగిల్ కోసం క్రీజ్‌ను వదిలి కాస్త ముందుకే వచ్చాడు. కానీ బంతి మాత్రం కీపర్ పక్కన ఉంది. ఖుష్దిల్ క్రీజును వదిలి బయటకు వెళ్లడం గమనించిన వికెట్ కీపర్ వెంటనే స్టంప్స్‌ను గిరాటేశాడు. దీంతో ఊహించని విధంగా అతడు రనౌటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు ఏంటి బ్రో.. కాస్త వెనక ముందు చూసుకోవాలి కాదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
ఆసియా కప్‌కు పాక్ జట్టు ప్రకటన.. కెప్టెన్ రీఎంట్రీ
మహిళల ఆసియా కప్ 2026, ఆతర్వాత జరిగే ఆసియా క్రీడల కోసం రెండు వేర్వేరు పాకిస్తాన్ జట్లను ఇవాళ ప్రకటించారు. ఈ జట్లకు కెప్టెన్‌గా ఫాతిమా సనా ఎంపికయ్యారు. ఇటీవల శ్రీలంక పర్యటనలో జరిగిన టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న ఫాతిమా సనా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఫాతిమాతో పాటు సదియా ఇక్బాల్, గుల్ ఫెరోజా కూడా ఆసియా కప్ జట్టులోకి తిరిగి వచ్చారు.ఆసియా కప్ ఆగస్టు 28 నుంచి దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి.ఆసియా కప్‌కు పాకిస్తాన్ జట్టుఫాతిమా సనా (కెప్టెన్), అయేషా జాఫర్, ఇమాన్ నసీర్, ఐమన్ ఫాతిమా, గుల్ ఫెరోజా, మొమినా రియాసత్, మునీబా అలీ సిద్ధిఖీ (వికెట్ కీపర్), నజీహా అల్వీ, నష్రా సంధు, సదియా ఇక్బాల్, సైరా జబీన్, షవాల్ జుల్ఫికార్, తూబా హసన్, ఉమ్-ఎ-హానీ, వహీదా అక్తర్.రిజర్వ్‌లు: తస్మియా రుబాబ్, హుమ్నా బిలాల్, మహమ్ అనీస్, సదఫ్ షమాస్.ఆసియా క్రీడలకు మరో జట్టుసెప్టెంబర్లో జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడలకు వేరే జట్టును ఎంపిక చేశారు. ఆసియా కప్ జట్టుతో పోలిస్తే ఈ జట్టులో కొన్ని మార్పులు ఉన్నాయి.ఆసియా కప్ జట్టులో ఉన్న సదియా ఇక్బాల్, వహీదా అక్తర్, నజీహా అల్వీకు ఆసియా క్రీడల జట్టులో చోటు దక్కలేదు. వారి స్థానంలో అలియా రియాజ్, తస్మియా రుబాబ్, హుమ్నా బిలాల్‌ను ఎంపిక చేశారు.అనుభవజ్ఞురాలైన పేసర్ డయానా బేగ్‌కు ఆసియా కప్, ఆసియా క్రీడల జట్లలో చోటు దక్కలేదు. ఆమెను రిజర్వ్‌లలో కూడా ఎంపిక చేయలేదు.ఆసియా క్రీడలు 2026 కోసం పాక్ జట్టుఫాతిమా సనా (కెప్టెన్), అలియా రియాజ్, అయేషా జాఫర్, ఎమాన్ నసీర్, ఈమాన్ ఫాతిమా, గుల్ ఫిరోజా, హుమ్నా బిలాల్, మోమినా రియాసత్, మునీబా అలీ సిద్ధిఖీ (వికెట్‌కీపర్), నష్రా సుంధు, షవాల్, రుబా జ్బీన్, షవాల్ జబీన్, షవాల్ జబీన్, హసన్ మరియు ఉమ్-ఎ-హని.రిజర్వ్‌లు: నటాలియా పర్వైజ్, వహీదా అక్తర్, సాదియా ఇక్బాల్, సయ్యదా అరూబ్ షా, రమీన్ షమీమ్ -
భారత్, పాక్ రికార్డులు బద్దలు కొట్టిన బంగ్లాదేశ్
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. డార్విన్‌లో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో ఓడించి.. ఆ దేశంలో తమ తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో బంగ్లాదేశ్ మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. ఆస్ట్రేలియాలో అత్యంత వేగంగా టెస్ట్ విజయం సాధించిన ఆసియా జట్టుగా నిలిచింది. ఈ విషయంలో ఇప్పటివరకు పాకిస్తాన్ పేరిట ఉన్న రికార్డును బంగ్లాదేశ్ అధిగమించింది.మూడు టెస్టుల్లోనే తొలి విజయంబంగ్లాదేశ్ ఆస్ట్రేలియాలో తమ మూడో టెస్టులోనే తొలి విజయాన్ని అందుకుంది. దీంతో పాకిస్తాన్, భారత్ కంటే వేగంగా ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ గెలిచిన ఆసియా జట్టుగా నిలిచింది.బంగ్లాదేశ్- డార్విన్, 2026 (3వ టెస్ట్)పాకిస్తాన్ - సిడ్నీ, 1977 (7వ టెస్ట్)భారత్ - మెల్బోర్న్, 1978 (12వ టెస్ట్)శ్రీలంక - ఇంకా విజయం లేదు (15 టెస్టులు)ఆఫ్ఘనిస్తాన్ - ఇంకా ఆడలేదు (ఇంకా టెస్ట్ మ్యాచ్ ఆడలేదు)భారత్ తొలిసారిగా 1947లో ఆస్ట్రేలియాలో టెస్ట్ ఆడింది. తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. ఆ తర్వాత కూడా ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు విజయాలు దక్కలేదు. చివరకు 1978లో మెల్బోర్న్లో ఆస్ట్రేలియాపై తొలి టెస్ట్ విజయాన్ని సాధించింది.పాకిస్తాన్ మాత్రం 1964లో ఆస్ట్రేలియాలో తమ తొలి టెస్ట్ ఆడగా, 1977లో సిడ్నీలో ఏడో ప్రయత్నంలోనే తొలి విజయాన్ని అందుకుంది.2003లో ఘోర ఓటములు.. ఇప్పుడు చారిత్రక విజయంబంగ్లాదేశ్కు ఆస్ట్రేలియా పర్యటన కొత్తేమీ కాదు. 2003లో ఆ జట్టు తొలిసారి ఆస్ట్రేలియాలో టెస్టులు ఆడింది. అయితే ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది.అయితే 23 ఏళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బంగ్లాదేశ్ గణనీయంగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా పేస్ బౌలింగ్‌లో హసన్ మహ్మూద్ నేతృత్వంలోని బంగ్లా బౌలింగ్ విభాగం ఆస్ట్రేలియా స్టార్ పేసర్లైన జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్‌ల కంటే మెరుగైన ప్రభావాన్ని చూపింది.మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్ వంటి అనుభవజ్ఞులతో పాటు నజ్ముల్ హొస్సేన్ శాంటో, తంజిద్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్, ఎబాడత్, హసన్ మహ్మూద్ వంటి ఆటగాళ్లు బంగ్లాదేశ్‌ను టెస్టుల్లో మరింత పోటీ జట్టుగా మార్చారు.సిరీస్ గెలిచే సువర్ణావకాశండార్విన్ టెస్టు విజయంతో బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలవడం బంగ్లాదేశ్‌కు ఇప్పటివరకు సాధ్యం కాలేదు.మెక్‌కేలో జరగనున్న రెండో టెస్టులో ఓటమిని తప్పించుకున్నా, బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాలో తొలి టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఒకవేళ రెండో టెస్టులోనూ విజయం సాధిస్తే 2-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తుంది. -
ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు ముందు పాక్‌కు భారీ షాక్
ఇంగ్లండ్‌తో కీలకమైన టెస్ట్ సిరీస్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. దీంతో ఆగస్టు 19న ప్రారంభమయ్యే తొలి టెస్టులో అతను ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి.ప్రస్తుతం పాక్ Professional County Club Select XIతో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో మానీ లమ్స్‌డెన్ వేసిన బంతి బాబర్ కింది చేతికి బలంగా తగిలింది. నొప్పితో ఇబ్బంది పడిన బాబర్ ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగలేదు.బాబర్ గాయం తీవ్రతపై పాక్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. జట్టు వైద్యుడు పరీక్షించిన అనంతరం ముందు జాగ్రత్త చర్యగా మిగిలిన వార్మప్ మ్యాచ్‌కు బాబర్‌ను దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపింది.బాబర్ దూరమైతే..?2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ రేసులో నిలవాలంటే ఇంగ్లండ్‌పై మంచి ఫలితాలు సాధించడం పాకిస్తాన్‌కు కీలకం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాక్ అట్టడుగు స్థానంలో ఉంది. బాబర్ పాక్‌కు అత్యంత కీలకమైన బ్యాటర్లలో ఒకడు. అతను తొలి టెస్టుకు పూర్తిగా ఫిట్‌గా లేకపోతే, జట్టు అతని విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకపోవచ్చు.ఈ పరిస్థితిలో షాన్ మసూద్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టుకు గాయం కారణంగా దూరమైన మసూద్, బాబర్ స్థానంలో బ్యాటింగ్ ఆర్డర్‌లోకి రావచ్చు.టాప్-10లోకి బాబర్తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన బాబర్, రెండేళ్ల తర్వాత ఐసీసీ టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి వచ్చాడు. బాబర్ ఇంగ్లండ్ సిరీస్‌లోనూ ఫామ్‌ను కొనసాగించాలని పాక్ భావిస్తోంది. ఇలాంటి తరుణంలో అతడు గాయపడటంతో ఆ జట్టుకు ఇబ్బందవుతోంది. -
భారత్, పాక్ ప్రజల మధ్య విశ్వాస లేమి
వాషింగ్టన్: భారతీయ, పాకిస్థానీ ప్రజలు ఒకరినొకరు అతిపెద్ద ప్రమాదంగా పరిగణిస్తారని, ఇరు దేశాల ప్రజల మధ్య లోతైన అపనమ్మకం గూడుకట్టుకుని ఉందని అమెరికా థింక్‌ట్యాంక్ ప్యూ రీసెర్చ్ చేసి సర్వే స్పష్టం చేసింది. భారత్‌లో సర్వే చేసిన వారిలో 54% మంది పాకిస్థాన్‌ను పెద్ద శత్రువుగా భావిస్తూంటే.. చైనా అతిపెద్ద శత్రువని అనుకుంటున్న వారు 21% మంది ఉన్నారు. పాకిస్థాన్ విషయానికి వస్తే...ఇక్కడ సర్వే చేసిన వారిలో 43 % మంది మాత్రమే భారత్‌తో తమకు ముప్పు అన్న భావనతో ఉన్నారు ఇజ్రాయెల్, చైనాలతో ప్రమాదం అనే వారు చెరో 24% మంది ఉండటం గమనార్హం. అదే సమయంలో చైనా తమకు అత్యంత ముఖ్యమైన దేశంగా భావిస్తున్నా పాకిస్థానీలు 75% వరకూ ఉండగా, సౌదీ అరేబియా 12% రెండో స్థానంలో ఉంది. మిత్రదేశాల విషయంలో భారత్ ఇప్పటికీ రష్యాపై విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అధ్యయనంలో పాల్గొన్న వారిలో 36% మంది రష్యాను టాప్ మిత్రదేశంగా పరిగణిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాను ‘ఫ్రెండ్’గా భావిస్తున్నది 16% మంది మాత్రమే. మడొంతుల మంది భారత్‌కు అతిపెద్ద మిత్రదేశం ఏదన్న ప్రశ్నకు సమాధానమే ఇవ్వకపోవడం విశేషం. ట్రంప్‌పై పాక్‌లో నమ్మకం తక్కువే... అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్‌ల మధ్య స్నేహ సంబంధాలు బాగానే ఉన్నా పాకిస్తానీలలో కేవలం 15% మంది మాత్రమే అమెరికా పట్ల సదభిప్రాయం కలిగి ఉన్నట్లు ఈ సర్వే తెలిపింది. తొంభై శాతం ఆమోదంతో చైనా మొదటి స్థానంలో ఉంది. అంతర్జాతీయ వ్యవహారాల్లో ట్రంప్ సరైన పని చేస్తారని 88% మంది పాకిస్థానీలు నమ్మడం లేదు. అదే సమయంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అనుకూలంగా 83% మంది మాట్లాడారు. భారతీయుల్లో రష్యా హవా... భారతీయులు రష్యా (58%), అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (51%)పై ఎక్కువ నమ్మకం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌తో పోలిస్తే చాలా ఎక్కువ మంది రష్యాకు అనుకూలంగా ఉన్నట్లు తెలిసింది. ఇక భారత్‌లో చైనాకు అనుకూలంగా ఉన్న వారు 23% మంది మాత్రమే కాగా.. 25% మంది షీ జిన్‌పింగ్ ప్రపంచ నాయకత్వంపై నమ్మకం ఉంచారు. భారతీయుల్లో అమెరికాపై విశ్వాసం ఉన్న వారు 45% కాగా.. ట్రంప్‌పై నమ్మకం వ్యక్తం చేసినవారు 39% మంది మాత్రమే. దక్షిణాసియాలోని నాలుగు దేశాల్లో సర్వే: వైవిధ్యమైన ఫలితాలు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలలో నిర్వహించిన ఈ సర్వే వైవిధ్యమైన ఫలితాలిచి్చంది. శ్రీలంకలో 79% మంది భారత్‌పై సానుకూల అభిప్రాయం ఉండగా బంగ్లాదేశ్‌లో ఈ సంఖ్య 42%, పాకిస్తాన్లో ఏడు% మాత్రమే. లంకేయుల్లో 63% మంది భారత్‌ను తమ మిత్రదేశంగా చెప్పుకుంటే బంగ్లాదేశ్, పాకిస్తానీల్లో అధికులు భారత్‌తో తమకు ప్రమాదం అన్న భావనను వ్యక్తం చేశారు. అమెరికాలో ఏమంటున్నారు? అమెరికాలో 45% మంది మన దేశంపై సానుకూల అభిప్రాయం కలిగి ఉన్నట్లు ప్యూ రీసెర్చ్ నిర్వహించిన ఈ సర్వే ద్వారా స్పష్టమైంది. అయితే సుమారు 50% మంది వ్యతిరేక అభిప్రాయంతో ఉండటం గమనార్హం. డెమోక్రాట్ల మద్దతుదారులు, సానుభూతిపరుల్లో సగం మంది భారత్‌పై సదభిప్రాయం ఉంది. రిపబ్లికన్ల విషయానికి వస్తే ఈ సంఖ్య 42% మాత్రమే. అంతర్జాతీయంగా భారత్ ప్రభావం కొన్నేళ్లుగా ఒకేస్థాయిలో ఉందని 54% మంది అమెరికన్లు చెబితే 30% మంది పెరుగుతోందని, 13% మంది తగ్గుతోందని చెప్పారు. -
భారత్ పై పాక్ అణుబాంబు వాడితే.. ప్రొఫెసర్ జియాంగ్ సంచలనం
-
‘ప్రతీ నీటి బొట్టూ మా రెడ్‌లైన్’.. భారత్‌కు పాక్ హెచ్చరిక!
ఇస్లామాబాద్: భారత్-పాకిస్తాన్ మధ్య నీటి వివాదం మరోసారి రాజకీయ వేడిని పెంచుతోంది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన నేపథ్యంలో.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ‘పాకిస్తాన్ నీటిలో ప్రతి ఒక్క చుక్కా మా రెడ్‌లైన్’ అంటూ భారత్‌ను ఆయన హెచ్చరించారు. భారత్ తన వైఖరిని మార్చుకోకపోతే నేరుగా స్పందిస్తామని వ్యాఖ్యానించారు.శాంతి గురించి మాట్లాడుతూనే.. భారత్‌కు హెచ్చరికలు జారీ చేయడం పాకిస్థాన్ రాజకీయాల్లోని ద్వంద్వ వైఖరిపై మరోసారి చర్చకు దారితీసింది. ఓవైపు శాంతిని కోరుకుంటున్నామని చెబుతూనే.. మరోవైపు నీటి విషయంలో ఎలాంటి చర్యనైనా సహించేది లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.అసలు వివాదం?1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. సింధు నదీ వ్యవస్థలోని నీటిని రెండు దేశాలు ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ఈ ఒప్పందం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సింధు, జీలం, చీనాబ్ నదులను ప్రధానంగా పాకిస్తాన్‌కు, రావి, బియాస్, సట్లెజ్ నదులను భారత్‌కు కేటాయించింది. అయితే ఇరు దేశాలకు కొన్ని పరిమిత వినియోగ హక్కులను కూడా ఒప్పందం కల్పించింది. అయితే 2025 ఏప్రిల్‌లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ దాడికి పాక్ మద్దతున్న ఉగ్రవాదులే కారణమని భారత్ ఆరోపించింది. ఆ తర్వాత పాకిస్తాన్‌పై తీసుకున్న కీలక చర్యల్లో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ‘అబేయన్స్’లో ఉంచింది. ఇక్కడే అసలు రాజకీయ ట్విస్ట్ మొదలైంది.భారత్ ట్విస్ట్.. ఒప్పందం అమలులో ఉన్న సమయంలో భారత్ నుంచి పాకిస్తాన్‌కు నదుల నీటి మట్టాలపై కీలక సమాచార మార్పిడి జరిగేది. ముఖ్యంగా వర్షాకాలంలో నదుల్లో నీటి ప్రవాహం పెరిగితే ముందస్తు హెచ్చరికలు పాకిస్తాన్‌కు ఉపయోగపడేవి. ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత ఈ సమాచారాన్ని పంచుకోవడం కూడా భారత్ ఆపేసింది. దీంతో నీటి అంశం కేవలం రెండు దేశాల మధ్య జల వివాదంగా కాకుండా.. భద్రత, ఉగ్రవాదం, దౌత్యం, రాజకీయ ఒత్తిడి అన్నీ కలిసిన పెద్ద అంశంగా మారింది. ఇప్పుడు షెహ్బాజ్ షరీఫ్ వ్యాఖ్యలు కూడా అదే రాజకీయ నేపథ్యంలో చూడాల్సి ఉంది. “మేము శాంతిని కోరుకుంటున్నాం.. కానీ మా శాంతిని బలహీనతగా భావించొద్దు” అంటూ ఆయన ఒకవైపు చెబుతూనే.. భారత్ తమ నీటి హక్కులను ప్రభావితం చేసే చర్యలు తీసుకుంటే గట్టిగా స్పందిస్తామని హెచ్చరించారు. అంటే.. శాంతి సందేశమా? లేక రాజకీయ హెచ్చరికా? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.పాక్ మాత్రం సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా నిలిపివేసిందని ఆరోపిస్తోంది. తమకు ఒప్పందం ఇప్పటికీ చట్టబద్ధంగానే ఉందని వాదిస్తూ అంతర్జాతీయ వేదికలపై కూడా ఈ అంశాన్ని పదేపదే లేవనెత్తుతోంది. కానీ, భారత్ మాత్రం ఉగ్రవాదాన్ని ఒకవైపు, నీటి సహకారాన్ని మరోవైపు విడదీసి చూడాలనే పాక్ వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూనే నీటి విషయంలో పాత ఒప్పందం ప్రకారం హక్కులు కావాలనుకోవడం ఎలా? అన్నది భారత రాజకీయ వాదనలో కీలక అంశంగా మారింది. ఇదే ఇప్పుడు పాకిస్తాన్‌కు పెద్ద సవాలుగా మారుతోంది. ఎందుకంటే నీటి అంశాన్ని అంతర్జాతీయ ఒత్తిడి కోసం ఉపయోగించాలనుకుంటున్న ఇస్లామాబాద్‌కు.. భారత్ మాత్రం దీనిని తన భద్రతా ప్రయోజనాలతో ముడిపెడుతోంది. -
అంతరిక్ష రేసులో కొత్త మలుపు.. జిన్నా-1తో పాకిస్థాన్ రెడీ
ఇస్లామాబాద్: పాకిస్థాన్ తొలి లూనార్ రోవర్‌కు అధికారికంగా పేరును ప్రకటించింది స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ కమిషన్ (సుపార్కో). దానికి “జిన్నా-1” అని నామకరణం చేసింది. సుపార్కో తెలిపిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్త పోటీలో వచ్చిన సూచనల నుంచి ఈ పేరు ఎంపికైంది. దేశం నలుమూలల నుంచి 4,000 కుపైగా ప్రతిపాదనలు వచ్చాయి. “జిన్నా-1” పేరును ఏడుగురు ప్రతిపాదించారు.విజేతను డ్రా ద్వారా ఎంపిక చేశారని అధికారులు తెలిపారు. బహావల్‌నగర్‌కు చెందిన తయ్యబ్ కరీమ్ (17) విజేతగా నిలిచాడు. సుపార్కో ఛైర్మన్ మాట్లాడుతూ.. “జిన్నా-1” పేరు పాకిస్థాన్ వ్యవస్థాపకుడు ఖైద్-ఎ-ఆజమ్ మహ్మద్ అలీ జిన్నాకు నివాళి అని చెప్పారు. ఈ పేరు అంతరిక్ష అన్వేషణలో పాకిస్థాన్ సంకల్పం, పురోగతి, కొత్త దిశలకు ప్రతీక అని చెప్పుకొచ్చారు.సుపార్కో తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్ తొలి లూనార్ రోవర్‌ను 2029లో చైనా చాంగ్ఈ-8 మిషన్ ద్వారా చంద్రుడిపైకి పంపనున్నారు. “జిన్నా-1” చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో శాస్త్రీయ పరిశోధనలు చేపడుతుంది.పాకిస్థాన్ నిర్మించిన ఈ చంద్ర రోవర్ ప్లాస్మా, రేడియేషన్, చంద్ర ఉపరితల భౌగోళిక స్వరూపాన్ని అధ్యయనం చేస్తుంది. భవిష్యత్ చంద్ర పరిశోధనలు, చంద్రుడిపై మానవ ఉనికికి సంబంధించిన కీలక ప్రయోగాల్లో కూడా పాత్ర పోషిస్తుంది. “జిన్నా-1” పాకిస్థాన్ అంతరిక్ష అన్వేషణ ప్రయాణంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని సుపార్కో తెలిపింది. దేశ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కొత్త అవకాశాలకు మార్గం చూపుతుందని పేర్కొంది. -
బర్మింగ్‌హామ్ యువతకు కనిపించిన వాతావరణపు అసలు ముఖం!
బర్మింగ్‌హామ్‌కు చెందిన 18 నుంచి 25 ఏళ్ల యువ వాలంటీర్ల బృందం పాకిస్థాన్‌లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతాన్ని సందర్శించి వాతావరణ మార్పుల ప్రభావాన్ని కళ్లారా చూసింది. వాతావరణ మార్పులపై పుస్తకాలు, ఆన్లైన్ కథనాల ద్వారా అవగాహన ఉన్నప్పటికీ.. పర్వతాలపై ఉండే భారీ మంచు నదుల(హిమనీనదాలు) మధ్య జీవిస్తున్న ప్రజలను కలిసిన తర్వాత ఆ సమస్య తీవ్రత వారికి మరింత స్పష్టమైంది. సుమారు 50 వేల పౌండ్లు నిధులు సమీకరించిన ఈ బృందం ఘిజర్ జిల్లాలోని తాలి దాస్ గ్రామంలో స్థానిక కుటుంబాలతో కలిసి కొన్ని రోజులు గడిపింది. అక్కడి ప్రజలతో మాట్లాడి, వాతావరణ మార్పులు వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకున్నట్టుగా ఈ బృందం తెలిపింది.ఈ ప్రాంతంలో వాతావరణ మార్పుల ప్రభావం కేవలం ఉష్ణోగ్రతలు పెరగడం వరకే పరిమితం కాలేదు. హిమానీనదాలు వేగంగా కరుగుతుండటంతో వాటి నుంచి ఏర్పడే సరస్సుల స్థానాలు మారుతున్నాయని, ఈ సరస్సులు ఒక్కసారిగా పొంగిపొర్లితే భారీ వరదలు సంభవించే ప్రమాదం ఉందని, తాలి దాస్ గ్రామ ప్రజలు ఇప్పటికే ఇలాంటి విపత్తును ఎదుర్కొన్నట్లుగా వాలంటీర్లు గుర్తించామన్నారు. అయితే, హిమానీనద సరస్సు నుంచి వచ్చిన వరద వారి ఇళ్లను, జీవనాధారాలను తీవ్రంగా దెబ్బతీయడంతో వారు తమ పాత నివాసాలను వదిలి కొత్తగా జీవితాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. అయినప్పటికీ గ్రామస్థులు నిరాశ చెందకుండా సమష్టిగా తమ సమాజాన్ని పునర్నిర్మించుకోవడం ఈ బృంద వాలంటీర్లను ఎంతగానో ప్రభావితం చేసింది.అయితే, స్థానిక ప్రజలకు తక్షణ సహాయం అందించడంతోపాటు భవిష్యత్తులో విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడంపై యువత దృష్టి పెట్టింది. వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే పరికరాలు, శిక్షణ అందుబాటులో ఉండేలా క్లైమేట్ డిజాస్టర్ రెస్క్యూ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. మారుమూల ప్రాంతం కావడంతో అత్యవసర సేవలు అక్కడికి చేరుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో.. స్థానికులే ప్రారంభ దశలో స్పందించగలిగేలా ఈ కేంద్రం ఉపయోగపడనున్నట్లగా ఈ యువ వాలంటీర్లు తెలిపారు. అలాగే, చెట్లు నాటడంతో పాటు స్థానిక పాఠశాల పునరుద్ధరణ పనుల్లోనూ పాల్గొన్నారు.ఉత్తర పాకిస్థాన్‌లో 7,000కుపైగా హిమానీనదాలు ఉన్నట్టుగా, ధ్రువ ప్రాంతాలను కాకుండా ప్రపంచంలోనే అత్యధిక మంచునదులు ఉన్న ప్రాంతాల్లో ఇది ఒకటిగా పర్యావరణ శాఖ గుర్తించింది. ఇవి కేవలం మంచు నిల్వలు మాత్రమే కాదు.. పర్వత ప్రాంతాల్లోని ప్రజలకు నీటి వనరులు, వ్యవసాయం, పర్యావరణ వ్యవస్థలకు కీలక ఆధారంగా ఉపయోగపడుతున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలతో ఇవి తరచూ కరగడంతో ఒకవైపు ఆకస్మిక వరదల ముప్పు పెరుగుతుండగా, మరోవైపు భవిష్యత్తులో నీటి లభ్యతపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అంటే వాతావరణ మార్పు అక్కడి ప్రజల ఇళ్లు, వ్యవసాయం, నీటి వనరులు, జీవన భద్రత అన్నింటినీ ఒకేసారి ప్రభావితం చేస్తోంది.అయితే, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం కేవలం ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థల బాధ్యత మాత్రమే కాదు.. స్థానిక సమాజాల భాగస్వామ్యం కూడా అత్యంత కీలకం. ఒక విపత్తు జరిగిన తర్వాత సహాయం అందించడం కంటే, ముందుగానే స్థానిక ప్రజలకు శిక్షణ ఇవ్వడం, అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచడం, పర్యావరణాన్ని పరిరక్షించడం మరింత ప్రభావవంతమైన మార్గం అని ఈ పర్యటన.. యువ వాలంటీర్లు తెలియజేశారు. అలాగే, పాకిస్థాన్‌లోని ఈ పర్వత గ్రామం యువతకు వాతావరణ మార్పులపై అవగాహనతోపాటు సంక్షోభంలోనూ ప్రజలు ఎలా ఐక్యంగా నిలబడి తమ జీవితాలను పునర్నిర్మించుకోవాలో ఈ బృందం తెలియజేసింది. 'మాకు వాతావరణ మార్పు దూరంగా ఉన్న పర్యావరణ సమస్య కాదు.. ప్రజల భవిష్యత్తును నేరుగా నిర్ణయించే అత్యవసర అంశం' అని బర్మింగ్‌హామ్‌కు తిరిగి వచ్చిన ఈ వాలంటీర్ బృందం యువత పేర్కొంది. -
పాత ఒప్పందానికి పాతర
అనిశ్చిత ప్రపంచంలో మరో కొత్త రక్షణ ఒప్పందం ఉనికిలోకొచ్చింది. తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్తాన్‌లు గత శుక్రవారం ‘మక్కా రక్షణ ఒప్పందం’ పేరిట ఒక ఒడంబడిక కుదుర్చుకున్నాయి. పూర్తి పాఠాన్ని బయటపెట్టలేదు గనుక దీని లోతుపాతులు తెలియవు. కానీ పాకిస్తాన్ విదేశాంగ శాఖ ‘ఈ మూడు దేశాల్లో ఏ ఒక్కరిపై దాడి జరిగినా అది అందరిపైనా జరిగిన దాడిగా పరిగణించాల’ని నిర్ణయించుకున్నట్టు ఒక ప్రకటన విడుదల చేసింది. తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయీప్ ఎర్డోగాన్ మాత్రం ‘ఈ ఒప్పందం కింద ఉమ్మడిగా రక్షణ పరిశ్రమ ప్రాజెక్టులు చేపట్టడం, ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో పాలుపంచుకోవటం ఉంటాయ’ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఒప్పందం విషయంలో అమెరికాకు ఆగ్రహం కలుగుతుందని సౌదీ భావించినట్టుంది. అందుకే ‘ఈ మూడు దేశా లకూ ఇప్పటికే ఉన్న ఇతర రక్షణ ఒప్పందాలు దీనికి అడ్డురాబోవ’ని సౌదీ ఉపమంత్రి రేయాద్ క్రిమ్లీ వివరణనిచ్చారు. ఒప్పందంపై కొద్ది నెలలుగా సాగిన చర్చల్లో పాల్గొన్న ఈజిప్టు చివరన ముఖం చాటేసింది. ఇంతకూ ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ (ఓఐసీ) సదస్సులో గతంలో కుదిరిన ‘మక్కా ఒప్పందం’ ఏమైంది?ఈ మూడు దేశాలకూ ఇరుగుపొరుగుతో వాటి వాటి సొంత ఘర్షణలున్నాయి. తమలో తమకున్న పొరపొచ్చాలు వీటికి అదనం. నాటోలో భాగస్వామిగా ఉన్న తుర్కియేకు ఎజియన్ సముద్రంలో మరో సభ్య దేశం గ్రీస్‌తో సరిహద్దు లడాయి వుంది. ఇజ్రాయెల్‌తో వైరం సరేసరి. పాకిస్తాన్ అయితే ఇటు మన దేశంతోపాటు అఫ్గానిస్తాన్‌తో కూడా కలహిస్తోంది. ఇరాన్‌పై అమెరికా దాడుల్ని సమర్థించటమేకాక... దాని అభీష్టం మేరకు ఇజ్రాయెల్‌తో అవగాహన కుదుర్చుకున్న చరిత్ర సౌదీది. పర్యవసానంగా ఇరాన్ నుంచీ, ఎర్ర సముద్రంలో ఇరాన్ మద్దతుదార్లయిన హౌతీలనుంచీ సమస్యలు ఎదుర్కొంటోంది. ఇక 2018లో తుర్కియే గడ్డపై జర్నలిస్టు ఖషోగ్గిని కిరాయి హంతకులతో సౌదీ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ హత్య చేయించారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయంలో రెండు దేశాల సంబంధాలూ దెబ్బతిన్నాయి. అమెరికా ప్రాపకంతో తెరవెనక సర్దుబాట్లు కుదిరినా తుర్కియే ఆగ్రహం చల్లారలేదు.ఇలా ఎవరికి వారు సక్రమంగా లేకుండా, ఎవరిపై దాడి జరిగినా అందరం ఏకమవు తామనటంలోని సహేతుకత ఏమిటో అర్థంకాదు. దేశంలో అమెరికా స్థావరాలుంటే భద్రతకు తిరుగులేదని ఇతర గల్ఫ్ దేశాలతోపాటు సౌదీ కూడా అమాయకంగా అనుకున్నది. అమెరికా వేరేవారిపై దాడి చేస్తే దాని అధునాతన రక్షణ వ్యవస్థవల్ల ఒక్క క్షిపణి కూడా తమ గడ్డపై పడబోదని నమ్మింది. అదంతా ఉత్త భ్రమగా తేలింది. ఇరాన్ వల్లకాడు కావటానికి తోడ్పడుతూ తమ జోలికి మాత్రం అది రాకూడదని కోరుకోవటం అత్యాశ అని అర్థమైంది. అందుకే రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుని అందరినీ హడలెత్తించాలని ఆ దేశం నిర్ణయించుకున్నట్టు కనబడుతోంది. నిరుడు పాక్‌తో కుదిరిన రక్షణ ఒప్పందం తాజా యుద్ధంలో కొరగాకుండా పోయింది. ఇరాన్‌తో అంటకాగిన పాక్... కనీసం సౌదీపై అది చేసిన దాడుల్ని ఖండించటానికి కూడా సిద్ధపడలేదు. తీరు మారకపోతే ఈ త్రైపాక్షిక ఒప్పందానికీ అదే గతి పడుతుంది. ఇస్లామిక్ దేశాలు 2005లో ‘మక్కా ఒప్పందం’ కుదుర్చుకున్నాయి. ఆ సంగతి ముగ్గురిలో ఎవరికైనా గుర్తుందా? పదేళ్లపాటు కొనసాగాల్సిన ఆ ఒప్పందాన్ని మరో పదేళ్లు పొడిగించారు కూడా. దాని అతీగతీ తెలియదు. 21వ శతాబ్దంలో ఇస్లాంకు ఎదురవుతున్న సవాళ్లపై జరిపిన సదస్సులో ఈ ఒప్పందం కుదిరింది. ఇస్లామిక్ ప్రపంచంలో సంయమనం, సౌభ్రాతృత్వం, మానవ హక్కులు, సుపరిపాలన, ఆర్థిక సహకారం, ఘర్షణల నివారణ, పేదరిక నిర్మూలన, ఉన్నత విద్య, శాస్త్ర సాంకేతికతలు, మహిళల హక్కులు దాని ప్రధానాంశాలు. ఇందులో పాలస్తీనా కూడా ఉంది. వినడానికి భేషుగ్గా ఉంది. కానీ ఆచరణ? తాజా ఒప్పందంతో వాటన్నిటినీ పర్షియన్ గల్ఫ్‌లో నిండా ముంచినట్టేనా? ఇతరుల్ని ఇబ్బందుల్లోకి నెడుతూ, వారినుంచి తమకేమీ కాకూడదని ఆశించటం వ్యర్థ ప్రయత్నమని ఈ దేశాలు గుర్తించాలి. ఇందుకు బదులు 2005 నాటి ఒప్పందం అమలుకు చిత్తశుద్ధితో కృషిచేయాలి. అప్పుడు మాత్రమే వాటికి కోరుకున్న శాంతి లభిస్తుంది. -
ఇమ్రాన్ ఖాన్ మరణించారా?
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని, PTI అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం విషయంలో ఈ దేశ జర్నలిస్టు చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు ఆ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇమ్రాన్ జైలులోనే మరణించి ఉండొచ్చంటూ జర్నలిస్ట్ వజాహత్ సయీద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. రావల్పిండిలోని ఆర్మీ జనరల్ హెడ్‌క్వార్టర్స్ లో ఉన్న ముగ్గురు సీనియర్ సైనికాధికారులు ఇమ్రాన్ ఖాన్ ఇక బతికి లేరని భావిస్తున్నారని ఆయన తెలిపారు. అయితే ఈ సమాచారం ధ్రువీకరించబడలేదని, ఆ అధికారులు కూడా ఇమ్రాన్ మరణాన్ని ప్రత్యక్షంగా చూడలేదని జర్నలిస్ట్ స్పష్టం చేశారు.2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనను కలిసేందుకు పలుమార్లు ప్రయత్నించినా అనుమతి లభించడం లేదని ఆరోపిస్తోన్నారు. ఇమ్రాన్‌కు స్వతంత్ర వైద్య పరీక్షలు నిర్వహించాలని పార్టీ డిమాండ్ చేస్తోంది. గత ఏడాది కూడా ఆయన జైలులో మరణించారంటూ పుకార్లు వచ్చాయి. అయితే డిసెంబర్ 2న ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్ అడియాలా జైలులో ఇమ్రాన్‌ను కలసి, ఆయన శారీరకంగా ఆరోగ్యంగానే ఉన్నారని, అయితే ఏకాంత నిర్బంధంలో ఉంచుతున్నారని తెలిపారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.మరోవైపు ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వకపోతే భారీగా ఆందోళనలు చేపడతామని PTI హెచ్చరించింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి, PTI నేత సొహైల్ అఫ్రిది మాట్లాడుతూ.. తమ పార్టీకి చెందిన 20 లక్షల మందికి పైగా ప్రజలు రోడ్డెక్కేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. యువతలో తీవ్ర ఆగ్రహం ఉందని, దాన్ని నియంత్రించడం అధికారులకు సాధ్యం కాదని హెచ్చరించారు. సెప్టెంబర్ 27న ఇస్లామాబాద్ వైపు భారీ లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు PTI ప్రకటించింది. అంతకుముందే ఇమ్రాన్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వకపోతే సుప్రీంకోర్టు, ఆ తర్వాత అడియాలా జైలు ఎదుట నిరసనలు చేపట్టి, దేశవ్యాప్తంగా ఆందోళనలు విస్తరిస్తామని అఫ్రిది వెల్లడించారు.ఇమ్రాన్ ఖాన్ నిర్బంధ పరిస్థితులపై అంతర్జాతీయ స్థాయిలోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 13 మంది అమెరికా కాంగ్రెస్ సభ్యులు విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఈ విషయమై లేఖ రాశారు. ఇమ్రాన్, ఆయన భార్య బుష్రా బీబీ నిర్బంధ పరిస్థితులపై పాకిస్థాన్‌తో చర్చించాలని కోరారు. ఇమ్రాన్‌ను రోజుకు 23 గంటల వరకు ఏకాంత నిర్బంధంలో ఉంచుతున్నారన్న ఆరోపణలు, ఆయన కుడి కంటికి తీవ్ర నష్టం జరిగిందన్న నివేదికలు, 85 శాతం చూపు కోల్పోయినట్లు న్యాయవాది చేసిన ఆరోపణలను లేఖలో ప్రస్తావించారు. అయితే ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు ఇప్పటివరకు ఎలాంటి ధ్రువీకరించిన ఆధారం లేదు.ఆయనను కలిసేందుకు ఆంక్షలు, ఆరోగ్యంపై ఆందోళనలు, సైనిక వర్గాల పేరుతో వచ్చిన ధ్రువీకరించని సమాచారం, PTI భారీ నిరసనలకు పిలుపు నేపథ్యంలో పాకిస్థాన్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. -
పాక్.. సౌదీ.. టర్కీ ఒప్పందం ఒక్కటైన మూడు ముస్లిం దేశాలు..
-
భారీ జంప్ కొట్టిన బాబర్ ఆజం.. రెండేళ్ల తర్వాత టాప్-10లోకి ఎంట్రీ
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం టెస్ట్ క్రికెట్లో మళ్లీ తన పాత స్థానాన్ని అందుకున్నాడు. తాజాగా విడుదలైన ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో బాబర్ టాప్-10లోకి తిరిగి వచ్చాడు.దాదాపు రెండేళ్ల తర్వాత అతడు టాప్-10లో చోటు సంపాదించడం విశేషం. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో కీలక ఇన్నింగ్స్ ఆడటంతో బాబర్ ర్యాంకింగ్ మెరుగుపడింది.ఐదు స్థానాలు ఎగబాకి..వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. విదేశీ గడ్డపై టెస్ట్ విజయం కోసం పాక్ మూడేళ్లకు పైగా ఎదురుచూసింది. ఈ విజయంతో సిరీస్‌లోనూ పాక్‌కు కీలక ఫలితం దక్కింది.ఈ మ్యాచ్‌లో బాబర్ తొలి ఇన్నింగ్స్‌లో 88 పరుగులు చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ ప్రదర్శనతో బాబర్ ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి 10వ స్థానానికి చేరుకున్నాడు.సెప్టెంబర్ 2024 తర్వాత ఇదే తొలిసారిబాబర్ ఆజం చివరిసారిగా 2024 సెప్టెంబర్ ప్రారంభంలో ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ఉన్నాడు. ఆ తర్వాత ఫామ్‌లో ఒడిదుడుకులతో ర్యాంకింగ్స్‌లో క్రమంగా కిందికి పడిపోయాడు. ఇప్పుడు వెస్టిండీస్‌పై కీలక ఇన్నింగ్స్‌తో మరోసారి టాప్-10లోకి ప్రవేశించాడు.బాబర్‌తో పాటు మరో ఇద్దరికీ లాభంతాజా ర్యాంకింగ్స్‌లో బాబర్‌తో పాటు మరో ఇద్దరు పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా మెరుగైన స్థానాలను అందుకున్నారు. చాలా కాలం తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన బ్యాటర్ అబ్దుల్లా షఫీక్ వెస్టిండీస్ సిరీస్‌లో ఆకట్టుకున్నాడు. అతని ప్రదర్శనకు ర్యాంకింగ్స్‌లో మంచి ఫలితం దక్కింది. అతడు ఏకంగా 25 స్థానాలు ఎగబాకి 32వ స్థానానికి చేరాడు.బాబర్ మినహా టాప్-10 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పులు లేవు. ట్రవిస్ హెడ్, హ్యారీ బ్రూక్, జో రూట్ టాప్-3 బ్యాటర్లుగా కొనసాగుతున్నారు. భారత్ తరఫున శుభ్‌మన్ గిల్‌దే (7) టాప్ ర్యాంక్. యశస్వి జైస్వాల్ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకున్నాడు. కుల్దీప్ యాదవ్, సిరాజ్, జడేజా వరుసగా 14 నుంచి 16 స్థానాల్లో నిలిచారు. పాక్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ విండీస్‌తో రెండో టెస్ట్‌లో రాణించడంతో 5 స్థానాలు మెరుగుపర్చుకొని 30వ స్థానానికి చేరాడు. -
సంకేతమే అయినా మున్ముందు సవాలే!
సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కియే ఆగస్ట్ 7న ‘మక్కా రక్షణ ఒడంబడిక’పై రియాద్‌లో సంతకాలు చేశాయి. దీనికి సైనికపరంగాకన్నా ఇతరత్రా ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఇది పశ్చిమాసియాలో నీరుగారుతున్న అమెరికా ప్రాభవాన్ని వెల్లడిస్తోంది. భద్రతా ప్రాధాన్యాల రీత్యా ఈ మూడు దేశాల మధ్యనున్న సారూప్యత బహు స్వల్పం. అమెరికా– ఇరాన్ మధ్య యుద్ధ పర్యవసానాలు సౌదీకి తలనొప్పిగా పరిణమించాయి. ఇరాన్‌తో దాని వైరం 1979 నుంచి సాగుతోంది. పాక్ దృష్టంతా భారత్‌పైనే. ‘నాటో’ కూటమిలో ఒకటిగా ఉన్న తుర్కియే అటు పశ్చిమాసియాలోనూ, ఇటు ఉత్తరాఫ్రికాలోనూ తన పలుకుబడిని పెంచుకోవాలని చూస్తోంది. ఆ ప్రాంతంలో నమ్మదగిన రక్షణ సామగ్రి ఎగుమతి దారుగా అవతరించాలని కోరుకుంటోంది. ఇలా వైరుధ్యాలున్నా రక్షణ కోసం ఈ మూడు దేశాలు ఒక వర్గంగా ఏర్పడటం ప్రతీకాత్మకంగా గణనీయమైనదే. ఇది మూడు భారీ మార్పులను ప్రతిబింబిస్తోంది: భిన్నమైన వ్యూహాత్మక, భద్రతా ప్రాధాన్యతలు; నూతన భద్రతా భాగస్వామ్యాల కోసం అన్వేషణ; అమెరికాపై ఇన్నాళ్ళూ ఉన్న నమ్మకం సడలిపోవడం.అమెరికాపై పోతున్న ఆశలుపశ్చిమాసియా, దానిని అనుకుని ఉన్న ప్రాంతాలు ఒక భద్రతా చట్రాన్ని కల్పించుకోవడంలో కొన్ని దశాబ్దాలుగా వాషింగ్టన్‌పైనే ఆధారపడుతూ వచ్చాయి. అమెరికా నుంచి ఆయుధాలు కొని సౌదీ అరేబియా దాని నుంచి భద్రతాపరమైన పూచీకత్తులు సంపాదించింది. తుర్కియే ఎలాగూ ‘నాటో’లో సభ్యురాలు. పాకిస్తాన్ ‘‘నాటో’యేతర ప్రధాన మిత్రపక్షం’.ఆరామ్‌కోపై జరిగిన ఇటీవలి దాడులపైనా, హౌతీలను కట్టడి చేయడంపైనా అమెరికా స్పందన పేలవంగా ఉందని సౌదీ భావిస్తోంది. సిరియా విషయంలో ‘నాటో’తో తుర్కియే చాలా ఏళ్లుగా ఘర్షణపడుతోంది. ఎఫ్–35 యుద్ధ విమానాల విక్రయాలు, కుర్దుల అంశం కూడా దాన్ని చిరాకుపరుస్తున్నాయి. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనలు వైదొలగడం, 2009 తర్వాత అమెరికా క్రమంగా భారత్ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపించడంతో వ్యూహాత్మకంగా ఏకాకినవుతున్నానని పాక్ భావిస్తూ ఉండవచ్చు. రియాద్, అంకారా, ఇస్లామాబాద్ ఒకదానికొకటి రక్షణగా నిల వాలని నిర్ణయించుకోవడం గణనీయమైన పరిణామమే. ఈ ఒడంబడిక ప్రస్తుతానికి పస లేనిదిగా కనిపించవచ్చుకానీ, ఇక్కడ సంకే తానికే ఎక్కువ ప్రాధాన్యం. మూడు ప్రధాన ముస్లిం మెజారిటీ సైనిక శక్తులు చేతులు కలుపుతున్నాయి. పాకిస్తాన్ అమ్ములపొదిలో అణ్వస్త్రం ఉంది. తుర్కియేలో ప్రధాన రక్షణ సామగ్రి పరిశ్రమలు న్నాయి. సౌదీ అరేబియాకు చమురు నిల్వలు పుష్కలం.ఇజ్రాయెల్‌కు సంకటమే!ఈ మూడు దేశాల్లో ఏ దేశంపైన దాడి జరిగినా మిగిలిన రెండు దేశాలపైన కూడా దాడి జరిగినట్లుగానే భావించాలని పేర్కొంటున్న క్లాజు మక్కా ఒప్పందానికి ప్రాముఖ్యతను సంతరిస్తోంది. కాకపోతే, భాష అస్పష్టంగా ఉంది. ‘నాటో’ ఆర్టికల్ 5 తరహాలో, ఆటోమే టిక్‌గా యుద్ధానికి దిగుతామనే నిర్దుష్టమైన పదజాలాన్ని చేర్చలేదు. సమైక్య కమాండ్ల ప్రస్తావన లేదు. సంయుక్తంగా స్థావరాలు నిర్వహిస్తామని ఎక్కడా ప్రకటించలేదు. ఈ ఒడంబడిక తక్షణ సైనిక ప్రభావం పరిమితం కావచ్చు. కానీ, అస్పష్టతకు కూడా భౌగోళిక రాజకీయాల్లో ప్రాధాన్యం ఉంటుంది. ఇది శత్రు దేశాల్లో అయోమయాన్ని సృష్టిస్తుంది. వాటి రక్షణ సన్నద్ధత ఖర్చును పెంచుతుంది. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు సంబంధించిన భద్రతా చర్చల్లో తల దూర్చాలని తుర్కియే చాలా కాలంగా అభిలషిస్తోంది. కానీ, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, అమెరికా దాన్ని దూరంపెడుతూ వచ్చాయి. ఇపుడు మక్కా ఒడంబడికతో తుర్కియే ఆ రకమైన చర్చల్లో పాల్గొనేందుకు ప్రవేశార్హత సంపాదించుకున్నట్లు అయింది. ఇది ఇజ్రాయెల్‌కు కంటక ప్రాయంగా మారడం ఖాయం. గాజాలో ఇజ్రాయెల్ చర్యలను తుర్కియే బాహాటంగా విమర్శిస్తోంది. మక్కా రక్షణ ఒడంబడికతో అటు తుర్కియే, ఇటు అణ్వస్త్ర సహిత పాకిస్తాన్ పశ్చిమాసియా భద్రతకు సంబంధించిన అధికారిక చర్చల్లో మొదటిసారిగా పాల్గొనేందుకు ప్రయత్నించవచ్చు. ఇంత కాలం అమెరికా నేతృత్వంలోని అబ్రహాం ఒప్పందాల గొడుగు నీడన ఇజ్రాయెల్ పనులు చక్కబెట్టుకుంటూ వస్తోంది. గల్ఫ్ కౌన్సి ల్తో సన్నిహిత సంబంధాలు నెరపుతోంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా భద్రతాపరమైన సహకారాన్ని గుట్టుచప్పుడు కాకుండా అందిస్తోంది. తద్వారా, పాక్‌ను ఆమడదూరంలో ఉంచుతూ వస్తోంది. తాజా ఒడంబడిక ఈ సూత్రీకరణలన్నింటినీ అస్తవ్యస్తం చేస్తోంది. ఇజ్రాయెల్‌ను గుర్తించని పాక్‌కు గల్ఫ్ భద్రతా చర్చల బల్ల వద్ద కుర్చీ కల్పిస్తోంది. పాలస్తీనియన్ల తరఫున వకాల్తా పుచ్చుకున్నదిగా తనను చాటుకునే తుర్కియేకు సంస్థాపరమైన పరపతిని తెచ్చిపెడుతోంది. భారత్ ఎందుకు జాగ్రత్తపడాలి?ఈ ఒడంబడికతో న్యూఢిల్లీకి సంబంధం లేదని అనడానికి లేదు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సిసలైన కాపలాదారుగా భారత్ తనను తాను చాటుకుంటూ వస్తోంది. సాగర జలాలకు సంబంధించినంతవరకు భద్రతకు నికరంగా భారత్ పైనే ఆధారపడ టానికి ప్రాధాన్యం ఇస్తారనే భావనపైనే ప్రధాని నరేంద్ర మోదీ తన ‘సాగర్’, ‘మహాసాగర్’ విధానాలను నిర్మించుకుంటూ వచ్చారు. సౌదీ అరేబియా 14 దేశాలతో కలసి జూలై 30న ఒక మారిటైమ్ సెక్యూరిటీ క్లస్టర్‌ను ప్రారంభించింది. కానీ ఈ గ్రూపులో భారత్ భాగంగా లేదు. భారతదేశానికి బదులుగా పాక్, తుర్కియేలతో రక్షణ అవగాహన కల్పించుకునేందుకు సౌదీ మొగ్గు చూపడాన్నే ఒక భౌగోళిక రాజకీయ సంకేతంగా తీసుకోవాలి. భారత్‌తో ఆర్థిక సంబంధాలు, ఇంధన వర్తకం వృద్ధి చెందుతున్నా, సంక్షోభం ముంచుకొస్తే, భారతదేశాన్ని ఒక ముఖ్యమైన భద్రతా భాగ స్వామిగా రియాద్ చూడదని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. పాకిస్తాన్ పరపతి పెరుగుతూండటం రెండవ అంశం. రెండు పవిత్ర మసీదులకు రక్షణదారుగా ఉన్న దేశంతోనూ, ఒక ‘నాటో’ సైనిక శక్తితోనూ రక్షణ ఒడంబడిక కుదుర్చుకోవడం ఇస్లామాబాద్‌కు దౌత్యపరమైన విలువ తెచ్చిపెడుతోంది. అంతర్జాతీయంగా పాక్ ఏకాకి అయిందనే కథనానికి ఇది గండికొడుతోంది. బలాబలాల మధ్య సమతూకాన్ని మక్కా రక్షణ ఒడంబడిక రాత్రికి రాత్రి మార్చేయకపోవచ్చు. సంయుక్త సున్నీ సైనిక శక్తి రేపటికి రేపే అవతరించకపోవచ్చు. కానీ, ఈ ఒడంబడిక రెండు చేదు వాస్తవాలను వెల్లడిస్తోంది. ఒకటి– కీలకమైన మధ్యవర్గ శక్తులు కేవలం అమెరికాపై ఆధారపడే ధోరణి నుంచి దూరం జరుగుతున్నాయి. రెండు– ఈ వైవిధ్యీకరణలో సిద్ధాంతాన్ని పక్కనపెట్టి, తక్షణ ఆచరణాత్మక దృక్పథంతో నూతన కూటములు ఏర్పడుతున్నాయి. ఢిల్లీ ఎదుట సునిశితమైన సవాల్ ఉంది. గల్ఫ్ నుంచి ఆగ్నేయాసియా వరకు భద్రతను కల్పించగల శక్తిగా అవతరించాలని కోరుకుంటున్న భారత్ తన ‘సాగర్’, ‘మహాసాగర్’ విధానాలను సౌదీ అరేబియా వంటి దేశాలు అక్కున చేర్చుకోగలిగినవిగా మలచాలి. సి. ఉదయ్ భాస్కర్వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్, న్యూఢిల్లీ -
కాల్పుల తర్వాత కౌగిలింతలా? పీవోకేలో పొలిటికల్ గేమ్!
పీవోకేలో ఆందోళనలు, భద్రతా చర్యల తర్వాత పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వరం మార్చారు. నెలలుగా కొనసాగుతున్న నిరసనలపై కఠిన వైఖరి ప్రదర్శించిన ప్రభుత్వం.. ఇప్పుడు చర్చల ప్రతిపాదనతో ముందుకొచ్చింది. సమస్యలకు పరిష్కారం బలప్రయోగంలో లేదని, చర్చల ద్వారానే మార్గం కనుగొనాలని షెహబాజ్ పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటనపై నిరసనకారుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పీవోకేలో జరిగిన తీవ్ర నిరసనలు, భద్రతా చర్యల నేపథ్యంలో షెహబాజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ద్రవ్యోల్బణం, భారీ విద్యుత్ ఛార్జీలు, ఆర్థిక నిర్లక్ష్యం, ఎన్నికల ప్రక్రియపై ఆరోపణలు వంటి అంశాలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగి ఆందోళనలు ఉధృతమయ్యాయి. అయితే “సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి’’ అని షెహబాజ్ పేర్కొన్నారు. రాబోయే ప్రభుత్వం కూడా నిరసనకారులతో చర్చల ప్రక్రియను కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.క్రాక్‌డౌన్ తర్వాత మారిన స్వరంపీవోకేలో రెండు నెలలకు పైగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. విద్యుత్ ధరల తగ్గింపు, ఆర్థిక సమస్యల పరిష్కారం, రాజకీయ సంస్కరణలు వంటి డిమాండ్లతో వారు ఆందోళనలు చేస్తున్నారు. నిరసనల్లో విద్యార్థులు, వ్యాపారులు, రవాణా కార్మికులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC)పై గతంలో కఠిన చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు అదే వర్గాలతో చర్చలకు సిద్ధమని ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. నిరసనకారులు మాత్రం ఇది సమస్యల పరిష్కారానికి నిజమైన ప్రయత్నమా? లేదంటే ఆందోళనల తీవ్రతను తగ్గించేందుకు చేస్తున్న వ్యూహమా? అని ప్రశ్నిస్తున్నారు.‘అల్లర్లకు ప్రయత్నిస్తే సహించం’చర్చలకు సిద్ధమని చెబుతూనే షెహబాజ్ హెచ్చరికలు కూడా చేశారు. శాంతియుతంగా తమ సమస్యలను చెప్పేవారితో చర్చిస్తామని, అయితే ప్రాంతంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం గతంలో కొందరు నిరసనకారులకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని ఆరోపించింది. ఈ ఆరోపణల ఆధారంగానే భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.ఎన్నికల వేళ రగిలిన అసంతృప్తిపీవోకేలో ఎన్నికల ప్రక్రియ కూడా వివాదాలకు కారణమైంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఓట్ల ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నాయని JAAC ఆరోపించింది. ఘర్షణలు, భద్రతా బలగాల చర్యల మధ్య ఎన్నికల వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మూడు దశల్లో జరగాల్సిన ఎన్నికల్లో పాకిస్థాన్ ముస్లిం లీగ్–నవాజ్ (PML-N) ఆధిపత్యం సాధించినట్లు సమాచారం. 45 ఎన్నికైన స్థానాల్లో మెజారిటీ స్థానాలను ఆ పార్టీ గెలుచుకున్నట్లు తెలుస్తోంది.మృతుల సంఖ్యపై భిన్న వాదనలుజూన్లో ప్రారంభమైన ఘర్షణల్లో కనీసం 11 మంది మరణించినట్లు అధికారిక పలు వార్తా కథనాల నివేదికలు చెబుతుండగా.. నిరసనకారుల వర్గాలు మాత్రం మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉందని ఆరోపిస్తున్నాయి. అయితే ఈ గణాంకాలను పాకిస్థాన్ ప్రభుత్వం ఖండిస్తోంది.‘దేశభక్తులే’ అంటున్న పీఎంఎల్–ఎన్షెహబాజ్ సన్నిహితుడు, పీఎంఎల్–ఎన్ నేత రానా సనావుల్లా కూడా నిరసనకారులపై స్వరం మార్చారు. JAACలో ఉన్న వారిలో 99 శాతం మంది దేశభక్తులేనని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారితో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.చర్చల వెనుక రాజకీయ లెక్కలు?అణచివేతతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పుడు చర్చల ప్రతిపాదన చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా అసంతృప్తిని తగ్గించడం, ప్రాంతంలో శాంతి నెలకొల్పడం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. అణచివేత తర్వాత చర్చల మాట ఎత్తిన షెహబాజ్ ప్రభుత్వం.. నిజంగా సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తుందా? లేదంటే ఇది కేవలం రాజకీయ వ్యూహమా? అన్నది ఇప్పుడు పీవోకేలో ప్రధాన చర్చగా మారింది.నెలల తరబడి నిరసనలను ఎదుర్కొనేందుకు కఠిన వైఖరి అవలంబించిన ప్రభుత్వం.. ఇప్పుడు శాంతి, చర్చల భాష మాట్లాడటం పీవోకేలో కొత్త చర్చకు దారితీసింది. విమర్శకులు దీనిని “ముందు అణచివేత.. తర్వాత సామరస్య పాఠాలు” అంటూ వ్యంగ్యంగా అభివర్ణిస్తున్నారు. -
ముంబై 26/11 ఉగ్రవాది మిస్టరీ డెత్.. పాక్‌లో హైటెన్షన్!
దాయాది దేశం పాకిస్తాన్లో లష్కరే తోయిబా (LeT) కీలక ఆపరేటివ్ ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం సంచలనంగా మారింది. ఓ గుర్తు తెలియని ప్రాంతంలో భోజనం చేసిన అనంతరం మసీదుకు వెళ్లిన అబ్దుల్ అజీజ్.. అక్కడి ప్రవేశద్వారం వద్ద ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, అతడి మరణానికి అసలు కారణమేంటన్నది ఇప్పటికీ అధికారికంగా తేలలేదు. భోజనం చేసిన తర్వాతే కుప్పకూలడంతో విష ప్రయోగం జరిగిందా? లేక సహజ కారణాలతోనే మరణించాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.దురంధర్‌లో చూపించినట్టేనా?ఇటీవల ఉగ్రవాదం, ఇంటెలిజెన్స్ ఆపరేషన్ల నేపథ్యంలో చర్చకు వచ్చిన ‘దురంధర్’ కోణంతో ఈ ఘటనను కొందరు సోషల్ మీడియాలో పోల్చుతున్నారు. ముఖ్యంగా ఒక కీలక ఉగ్రవాది అకస్మాత్తుగా.. ఎలాంటి కాల్పులు, పేలుళ్లు లేకుండా.. భోజనం తర్వాత మృతి చెందడం పలు ఊహాగానాలకు కారణమవుతోంది. అయితే “దురంధర్ తరహాలో భారత ఏజెన్సీల ఆపరేషన్ జరిగిందా?” అనేది ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఆధారం లేని ప్రశ్న మాత్రమే.ఎందుకింత ప్రాధాన్యం?అబ్దుల్ అజీజ్ సాధారణ వ్యక్తి కాదని నివేదికలు చెబుతున్నాయి. అతడు లష్కరే తోయిబాలో కీలక స్థాయిలో పనిచేసిన ఆపరేటివ్‌గా, 2008 ముంబై 26/11 ఉగ్రదాడులతో సంబంధం ఉన్న వ్యక్తి. లష్కరే తోయిబా వ్యవస్థలో అతడికి కీలక బాధ్యతలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లలో మరణించిన లష్కరే ఉగ్రవాదుల కుటుంబాలకు సంబంధించిన వ్యవహారాలను చూసే విభాగంతో అతడికి సంబంధం ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అందుకే ఇలాంటి వ్యక్తి ఎలాంటి కాల్పులు లేదా దాడి ఆనవాళ్లు లేకుండా ఆకస్మికంగా మృతి చెందడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.కాగా, అబ్దుల్ అజీజ్ మసీదుకు వెళ్లే ముందు ఓ తెలియని ప్రదేశంలో భోజనం చేసినట్లు సమాచారం. ఆ తర్వాత మసీదు వద్దకు చేరుకుని కుప్పకూలిపోయాడు. ఈ క్రమం కారణంగానే ఆహారంలో విషపదార్థం కలిపారా? అనే అనుమానం తెరపైకి వచ్చింది. అయితే విషప్రయోగం జరిగిందని ఇప్పటివరకు ఫోరెన్సిక్ లేదా అధికారిక నివేదిక ధృవీకరించలేదు.పాక్‌లో మిస్టరీ మరణాలుఅబ్దుల్ అజీజ్ మరణం వెలుగులోకి రావడంతో పాకిస్తాన్లో కీలక ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తుల అనుమానాస్పద మరణాలపై మరోసారి చర్చ మొదలైంది. అబ్దుల్ అజీజ్ మృతికి కారణం తెలుసుకోవాలంటే పోస్ట్‌మార్టం, టాక్సికాలజీ/ఫోరెన్సిక్ పరీక్షలు, అతడు భోజనం చేసిన ప్రదేశానికి సంబంధించిన దర్యాప్తు, సీసీటీవీ ఫుటేజీ వంటి వివరాలు కీలకం కానున్నాయి. అవి బయటకు వస్తేనే ఇది సాధారణ వైద్య కారణాలతో జరిగిన మరణమా.. విషప్రయోగమా.. లేక నిజంగానే పక్కా టార్గెట్ ఆపరేషనా? అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
‘నో మ్యాన్స్ ల్యాండ్’.. ఈ భూమిపై ఎవరికీ హక్కు లేదా?
రెండు దేశాల సరిహద్దుల మధ్య ఎవరికీ చెందని భూమిగా పిలిచే ‘నో మ్యాన్స్ ల్యాండ్’ (No Man's Land), ‘జీరో లైన్’ (Zero Line) గురించి తరచూ చర్చలు జరుగుతుంటాయి. దేశాల మధ్య వివాదాలు, సరిహద్దు భద్రత మధ్య ఈ ప్రత్యేక ప్రాంతంపై ఎవరికి అధికారాలు ఉంటాయనే వివరాలు తెలుసుకుందాం.సరిహద్దుల్లో ‘నో మ్యాన్స్ ల్యాండ్’ అంటే ఏమిటి?ప్రపంచంలోని పలు దేశాలు తమ పొరుగు దేశాలతో సరిహద్దులను పంచుకుంటున్నాయి. ఇలా రెండు దేశాల సరిహద్దుల మధ్య వదిలివేసిన ఖాళీ భూమిని ‘నో మ్యాన్స్ ల్యాండ్’ అని పిలుస్తారు. దీనిని కొన్నిసార్లు ‘జీరో లైన్’ అని కూడా వ్యవహరిస్తారు. ప్రత్యేకించి భారత్-పాకిస్తాన్ సరిహద్దుల సందర్భంలో ఈ పదం ఎక్కువగా వాడుకలో వినిపిస్తుంటుంది. ఈ ప్రత్యేక ప్రాంతంపై ఏ ఒక్క దేశానికీ ప్రత్యేకమైన యాజమాన్య హక్కులు ఉండవు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం ఎవరికీ చెందని భూమి మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ఏర్పాటు చేసిన ఒక ‘బఫర్ జోన్ ’ మాదిరిగా పనిచేస్తుంది.‘జీరో లైన్’ ఎక్కడ ఉంటుంది?.. ప్రత్యేకత ఏమిటి?రెండు దేశాల సరిహద్దులు ముఖాముఖిగా కలిసే వాస్తవిక రేఖను ‘జీరో లైన్’ అని అంటారు. భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని పలు ప్రాంతాలలో ఈ జీరో లైన్ స్పష్టంగా హైలైట్ చేసి ఉంటుంది. అదే సమయంలో జమ్ము కశ్మీర్ లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)వద్ద దీని పరిస్థితి మరింత సున్నితంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో రెండు దేశాల సైనిక చౌకీలు ఎదురుగా మోహరించి ఉంటాయి. సరిహద్దుల్లో జరిగే ప్రతీ చిన్న కదలికను ఇరు దేశాల భద్రతా బలగాలు అత్యంత నిశితంగా గమనిస్తూ ఉంటాయి.నిజంగా ఎవరికీ హక్కులు ఉండవా?జీరో లైన్ చుట్టుపక్కల ఉండే భూభాగాన్ని సాధారణంగా ‘నో మ్యాన్స్ ల్యాండ్’ అంటారు. ఇది ఏ దేశపు పౌరులు కూడా వినియోగించడానికి వీలు లేని ప్రాంతం. సాధారణ పరిస్థితుల్లో ఇక్కడ ఏ దేశపు ప్రత్యక్ష పౌర నియంత్రణ ఉండదు. భద్రతాపరమైన కఠిన నిబంధనల కారణంగా సామాన్య ప్రజల ప్రవేశంపై ఇక్కడ నిషేధం కొనసాగుతుంది. కొన్నిసార్లు ఇదే వివాదాస్పద ప్రాంతం ఇరు దేశాల మధ్య జరిగే ఘర్షణలు, కాల్పులు, సైనిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారుతుంది.రక్షణ వలయంగా మారిన సరిహద్దు భద్రతజీరో లైన్ పరిసర ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లు అత్యంత కఠినంగా, పటిష్టంగా ఉంటాయి. భారతదేశం వైపు నుంచి సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) పాకిస్తాన్ వైపు నుంచి పాకిస్తాన్ రేంజర్స్ నిరంతరం గస్తీ కాస్తుంటాయి. పలు అత్యంత సున్నితమైన ప్రాంతాలలో మందుపాతరలు, అత్యాధునిక స్పై గ్యాజెట్లు, భారీ సైనిక శిబిరాలు ఏర్పాటై ఉంటాయి. ఈ కారణాల వల్ల ఎలాంటి అనుమతి లేకుండా ఈ ప్రాంతంలోకి ప్రవేశించడం చట్టపరమైన నేరం మాత్రమే కాకుండా, ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతుంది.చారిత్రక వివాదాలు.. సరిహద్దు ఉద్రిక్తతలుప్రపంచ చరిత్రలో ఇలాంటి భూమిని చేజిక్కించుకోవాలనే దురాశతో పలు దేశాల మధ్య భీకర యుద్ధాలు కూడా జరిగాయి. నేటికీ భారత్-పాకిస్తాన్ మధ్య సరిహద్దు వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న జమ్ముకశ్మీర్ లోని ప్రాంతాలు ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉన్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ సున్నితమైన సరిహద్దుల వల్లే ‘నో మ్యాన్స్ ల్యాండ్’ ప్రాముఖ్యత మరింత పెరిగింది.ఒక చిన్న పొరపాటు తెచ్చే మృత్యువు‘నో మ్యాన్స్ ల్యాండ్’, ‘జీరో లైన్’ ప్రాంతాలలో నిఘా వ్యవస్థ అత్యంత పటిష్ఠంగా ఉంటుంది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా ఈ ప్రాంతంలోకి కాలుపెట్టాలని చూస్తే, క్షణాల్లో ప్రణాలు పోయే అవకాశం ఉంటుంది. అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు, నిఘా నేత్రాల మధ్య ఉండే ఈ భూభాగంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది పెను ముప్పుకు దారి తీస్తుంది. అందుకే సరిహద్దు ప్రాంతాలలో నివసించే ప్రజలు అనునిత్యం అప్రమత్తంగా మెలుగుతారు.సరిహద్దుల నిర్వహణ - ఒక నిరంతర సవాలురెండు దేశాల మధ్య శాంతి భద్రతలను కాపాడటంలో ‘జీరో లైన్’, ‘నో మ్యాన్స్ ల్యాండ్’ కీలక పాత్ర పోషిస్తాయి. సరిహద్దు ఉల్లంఘనలను అరికట్టడానికి, అసాంఘిక శక్తుల చొరబాట్లను నివారించడానికి ఇరు దేశాల రక్షణ దళాలు నిత్యం సిద్ధంగా ఉంటాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, ఈ సున్నితమైన సరిహద్దులను భద్రంగా ఉంచేందుకు ప్రభుత్వాలు నిరంతరం కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.ఇది కూడా చదవండి: జపాన్ పర్యటనకు ఐఆర్సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ! -
కశ్మీరీలకు పాకిస్తాన్‌పై ప్రేమేం లేదు!
కశ్మీర్ ప్రజలకు పాకిస్తాన్‌పై ప్రేమ లేదు. ఈ మాట అంటున్నది అధీన రేఖకు రెండు వైపులా కశ్మీరీల గురించి కూడా. ప్రస్తుతం రేఖకు ఆవలివైపున గత రెండు నెలలుగా మరోమారు ఆందోళనలు జరగడాన్ని చూస్తున్నాం. అదే సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఇటు వైపున గలవారికి కూడా ఎటువంటి ప్రేమ లేదు. వాస్తవం ఇది కాగా... ఇటువారంతా కేవలం మత దృష్టితో పాకిస్తాన్‌పై ప్రేమతో భారత వ్యతిరేక ఆందోళనలు చేస్తున్నారనే ప్రచారాలను రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారు.ఇండియానే ఎందుకు కోరుకున్నారు?పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి చర్చించేముందు, సందర్భం వచ్చింది గనక మన కశ్మీర్ విషయాన్ని అర్థం చేసుకోవడం అవసరం. వలస పాలన ముగుస్తుండిన 1947లో బ్రిటిష్‌వారు ఇక్కడి సంస్థానాలకు భారత యూనియన్‌లో లేదా పాకిస్తాన్లో విలీన మయ్యే స్వేచ్ఛను ఇచ్చారు. అపుడు కశ్మీర్ పాలకుడు హిందువు కాగా, ప్రజలు మెజారిటీ సంఖ్యలో ముస్లింలు. రాజు హరిసింగ్ గానీ, ప్రజలు గానీ పాకిస్తాన్లో చేరేందుకు ఇష్టపడలేదు. అప్పటి ప్రధాన రాజకీయ పక్షం నాయకుడు షేక్ అబ్దుల్లా పూర్తిగా ఇండియా పక్షం వహించాడు. కోరుకుంటే పాకిస్తాన్లో చేరగల అవకాశం దేశ విభజన చట్ట ప్రకారం ఉండి కూడా, భారతదేశంలో విలీనాన్ని ఎందుకు కోరుకున్నారు? నేను కశ్మీర్‌లోని మొత్తం 22 జిల్లాల్లోనూ మూడుసార్లు విస్తారంగా పర్యటించినపుడు, ఇతర విషయాలను అట్లుంచి ప్రత్యేకంగా ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు ప్రయత్నించాను. నేను వెళ్లిన జిల్లాలలో ముస్లిం మెజారిటీ ప్రాంతమైన కశ్మీర్ లోయతో పాటు పాకిస్తాన్ సరిహద్దుల వెట ఉండి ఆ ప్రభావాలు గణనీయంగా గల కుప్వారా, బారాముల్లా, పూంఛ్, రాజౌరీ జిల్లాలు కూడా ఉన్నాయి. రెండుసార్లు వెళ్లినపుడైతే మిలిటెంట్ చర్యలు ఉధృతంగా సాగుతున్నాయి. మిలిటెంట్లకు పాకిస్తాన్ సహాయాలు అందు తూనే ఉన్నాయి. అయిన్పటికీ ఏ దశలోనూ ఒక చిన్న వర్గం తప్ప పాకిస్తాన్‌ను కోరుకోకపోవడం గమనార్హం. ఇద్దరికీ సరిపడనిదే!మొట్టమొదటి వేర్పాటువాద ఆజాద్ కశ్మీర్ ప్లెబిసైట్ సంస్థ ఆ తర్వాత జమ్మూ–కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్‌గా మారినప్పుడు వారి లక్ష్యం రెండు వైపులా గల కశ్మీరీలను వేరుపరిచి స్వతంత్ర దేశాన్ని నెలకొల్పడం. ఆ సంస్థను ఇండియా, పాకిస్తాన్ రెండూ అణచి వేశాయి. ఆ సంస్థ ముగిసిన తర్వాత కొంత కాలానికి 26 పార్టీలు, సంస్థలతో ఆల్ పార్టీ హుర్రియత్ కాన్ఫరెన్స్ ఏర్పడింది. నేను ఆ సంస్థ ముఖ్య నాయకులు కొందరితో మాట్లాడాను. విషయం ఏమంటే... లిబరేషన్ ఫ్రంట్ రెండు దేశాలను వ్యతిరేకించే కశ్మీరీ జాతీయవాద సంస్థ కాగా, హుర్రియత్లో కొద్దిమంది మాత్రమే పాకిస్తాన్ అనుకూలురు. సామాన్య ప్రజానీకంలో అత్యధికులు పాకి స్తాన్‌కు ఎంతమాత్రం అనుకూలురు కాదు. అదే సమయంలో వారందరికీ ఇండియాపై తీవ్రమైన ఫిర్యాదులున్నాయి. ఈ ద్వంద్వ స్థితిని అర్థం చేసుకోవాలంటే ముందు చరిత్రలోకి వెళ్లి, తర్వాత స్వాతంత్య్రానంతర వర్తమానంలోకి రావాలి. మొదటి నుంచి హిందూమతం ఉండిన కశ్మీర్లోకి క్రీస్తు పూర్వమే బౌద్ధం బలంగా ప్రవేశించింది. అశోకుడు (శ్రీనగర్‌ను స్థాపించింది ఆయనే), కుషాణులు బాగా వ్యాపింప చేశారు. మధ్య ఆసియా వర్తకుల ద్వారా ఇస్లాం వచ్చిన తర్వాత 14వ శతాబ్దంలో సూఫీ యిజం విస్తరించింది. ఈ విధమైన బౌద్ధం, సూఫీయిజం కలగలిసిన ప్రభావాలు కశ్మీరీల విశ్వాసాలు, ఆలోచనలు, సంస్కృతులపై వేసిన బలమైన ముద్రలు నేటికీ ఉన్నాయి. అందువల్లనే వారు జనసంఖ్య రీత్యా మెజారిటీ సున్నీలే అయినా పాకిస్తాన్‌లోని జనాభాతో, అక్కడి పాలకులతో ఏకీభావం లేదు. 1947లో లేదు. ఇప్పటికీ లేదు. అయితే, రెండు వైపులగల జాతి అనే భావన మాత్రం ఉంది. అందుకే కశ్మీర్ మొత్తంగా స్వతంత్రం కావాలని ప్రయత్నించిన రోజులలో లిబరేషన్ ఫ్రంట్‌కు విస్తారమైన సానుభూతి లభించింది. ఈ భావనలు తెలిసినందువల్లనే కశ్మీర్ ప్రతిపత్తిపై ప్లెబిసైట్ జర పాలన్న ప్రతిపాదన కొందరు చేయగా, ఇండియాతో పాటు పాక్ కూడా వ్యతిరేకించింది. స్వతంత్ర కశ్మీర్ వారికి కూడా సరిపడనిదే!మారని మౌలిక దృష్టిఇదంతా చరిత్రతో పాటు, 1947 అనంతరపు తొలినాళ్ల పరిస్థి తులు. ఆ తర్వాతకు వచ్చి, మూడు విషయాలను చూస్తే చిత్రం పూర్తవుతుంది. ఒకటి, పాకిస్తాన్‌పట్ల ఆ తర్వాత కూడా, చివరకు మిలిటెన్సీ కాలంలోనూ జనబాహుళ్యంలో ప్రేమ కలగకపోవడం. రెండు, ఇండియాపైన కూడా ప్రేమ ఏర్పడకపోవడం. అయినప్పటికీ పాకిస్తాన్‌తో పోల్చినప్పుడు ఇండియా మెరుగనుకోవడం. మూడవది భవిష్యత్ గురించి వారి ఆలోచనలు. ప్రత్యేక దేశంగా ఏర్పడినాక పాకిస్తాన్లో ఉంటూ వచ్చిన పరి స్థితులు ఇటువైపు కశ్మీరీలకు నచ్చలేదు. అభివృద్ధి, ప్రజల జీవి తాలు, శాంతి భద్రతలు, అప్రజాస్వామికతలు, సైనిక కుట్రలతో పాటు, అటువైపు గల తమ కశ్మీర్ సోదరులు, బంధుమిత్రుల పరి స్థితి, హక్కుల లేమి, అణిచివేతలు అందుకు తోడయ్యాయి. అటు చేరినా తాము బాగుపడేది ఏమున్నది కనుక అనే ప్రశ్నను నేను అన్నివైపుల నుంచీ విన్నాను. తమ మిలిటెంట్ యువకులకు అక్కడి నుంచి సహాయం అందటం వరకు కొంత సానుకూలతను కల్పించినా, మౌలికమైన దృష్టి మాత్రం మారలేదు. ఇండియా స్వతంత్రమైన తర్వాత 40 సంవత్సరాల వరకు కశ్మీర్లో మిలెటెన్సీ లేదు. నిజానికి ఆ కాలమంతా నేషనల్ కాన్ఫ రెన్స్, కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశంలో ఎక్కడా లేనంత విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డాయి. అభివృద్ధి మృగ్యమై తీవ్ర అసంతృప్తి ఏర్ప డింది. అయినా కేంద్ర ప్రభుత్వాలు చేసింది శూన్యం. అది చాలద న్నట్లు ప్రజాస్వామిక విధి విధానాలతో నిమిత్తం లేకుండా రాజ కీయ క్రీడలు యథేచ్ఛగా సాగించాయి. కశ్మీర్ ఒక సున్నిత స్థితిలో గల సరిహద్దు రాష్ట్రం, పాకిస్తాన్ అవకాశం కోసం పొంచి ఉన్నదనే స్పృహ సైతం లేకుండా పోయింది.అటువంటి పరిస్థితులతో ఇక ఓపిక నశించిన ప్రజలు 1987 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ రెండింటినీ ఓడిస్తు న్నట్లు ఓట్ల లెక్కింపులో స్పష్టమవుతుండగా... కనీవిని రీతిలో రిగ్గింగ్ జరిపి తామే గెలిచారు. పట్టరాని ఆగ్రహానికి గురై మిలిటెన్సీ మార్గం పట్టింది. పాకిస్తాన్ ఆ అవకాశాన్ని అందుకుంది. అప్పటి నుంచి 35 సంవత్సరాలుగా మిలిటెన్సీనైతే గణనీయంగా అణిచి వేశారు గానీ ప్రజలు విశ్వాసాన్ని సంపాదించలేక పోయారు. మధ్యలో ఆ ప్రయత్నాలు జరిగింది వీపీ సింగ్, పీవీ నరసింహా రావుల కాలంలో మాత్రమే. ప్రజలు కూడా వారిని విశ్వసించారు. బీజేపీ రాకతో పరిస్థితి తిరిగి క్షీణమార్గం పట్టింది. టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
మిసైల్ సక్సెస్.. ఒక్కసారి పేల్చితే పాకిస్తాన్ మొత్తం బూడిద
-
అమెరికానే కాపాడలేకపోయింది.. ఇంక పాక్-టర్కీ ఏం చేస్తాయి?
పశ్చిమాసియాలో మారుతున్న భద్రతా సమీకరణాలకు సంకేతంగా పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ మూడు దేశాలు కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో కుదిరిన ఈ ఒప్పందం ప్రాంతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఒక దేశంపై దాడిని మిగిలిన రెండు దేశాలపై దాడిగా పరిగణించేలా రూపొందించిన ఈ రక్షణ కూటమి.. సౌదీ భద్రతా వ్యూహంలో కీలక మార్పుగా మారింది. అయితే ఈ ఒప్పందంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది.టర్కీ, పాకిస్థాన్‌తో చేసుకున్న రక్షణ ఒప్పందాలు సౌదీ అరేబియాకు శాశ్వత భద్రతను అందించలేవని ఇరాన్ విమర్శించింది. అమెరికానే కాపాడలేకపోతోంది.. ఇంక పాక్ టర్కీలు వచ్చి ఏం చేస్తాయి?.. ఏం సాధిస్తాయి? అంటూ డీల్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాల కమిషన్ సభ్యుడు ఎబ్రహీం రెజాయీ ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘కాగితపు ఒప్పందాలతో భద్రత రాదు’సోషల్ మీడియా వేదికగా స్పందించిన రెజాయీ.. “టర్కీ, పాకిస్థాన్‌తో కుదుర్చుకున్న కాగితపు ఒప్పందాలు సౌదీకి భద్రతను తీసుకురావు. అమెరికాతో ఎన్నో ఏళ్లుగా కొనసాగించిన సంబంధాలు కూడా సౌదీకి భద్రత ఇవ్వలేదు” అని వ్యాఖ్యానించారు. సౌదీ తన విధానాలను మార్చుకుంటే ఇతర దేశాల నుంచి భద్రత కోసం ఆధారపడాల్సిన అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు. గతంలో సౌదీ భద్రత కోసం అమెరికాపై ఆధారపడిన తీరును ప్రస్తావిస్తూ ఇరాన్ ఈ విమర్శలు చేసింది.మక్కా వేదికగా మూడు దేశాల డిఫెన్స్ డీల్అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ మధ్య ఈ రక్షణ ఒప్పందం కుదిరింది. ఇస్లాం పవిత్ర నగరమైన మక్కాలో జరిగిన సమావేశంలో మూడు దేశాల నేతలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ సందర్భంగా ఈ ఒప్పందం ఖరారైంది. మూడు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ఉమ్మడి భద్రతా వ్యూహాలను రూపొందించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు.ఒకరిపై దాడి.. ముగ్గురిపై దాడిగానే!ఈ రక్షణ ఒప్పందంలోని కీలక అంశం పరస్పర భద్రత. మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై అయినా సాయుధ దాడి జరిగితే.. దాన్ని మిగిలిన రెండు దేశాలపై జరిగిన దాడిగా పరిగణించేలా నిబంధనలు రూపొందించారు. దాడి జరిగిన సమయంలో పరస్పర సహకారం, రక్షణ రంగంలో సమన్వయం పెంచుకోవడం ఈ ఒప్పందం లక్ష్యమని పాకిస్థాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. మూడు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, ఉమ్మడి వ్యూహాత్మక ప్రయోజనాల ఆధారంగా ఈ ఒప్పందం కుదిరినట్లు తెలిపింది.సౌదీ ఎందుకు కొత్త రక్షణ భాగస్వామ్యాల వైపు?ఇరాన్‌తో పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియా తన రక్షణ భాగస్వామ్యాలను విస్తరిస్తోంది. గతంలో సౌదీ చమురు కేంద్రాలు, కీలక మౌలిక వసతులపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిగాయి. ఈ దాడుల వెనుక ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాక్‌లోని మిలీషియా గ్రూపులు ఉన్నాయని సౌదీ ఆరోపించింది. దీంతో భద్రత విషయంలో కేవలం ఒకే దేశంపై ఆధారపడకుండా కొత్త భాగస్వామ్యాలను పెంచుకోవాలని రియాద్ భావిస్తోంది.ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం, గల్ఫ్ ప్రాంతంలో నౌకాయానం ప్రభావితమవడం వంటి పరిణామాలు కూడా ఈ రక్షణ ఒప్పందానికి కారణాలుగా మారాయి.భారత్-పాక్ కోణంలోనూ చర్చఈ ఒప్పందం మరో కోణంలోనూ చర్చకు దారితీస్తోంది. ఒకవేళ భవిష్యత్‌లో పాకిస్థాన్‌పై భారత్ సైనిక చర్య చేపడితే ఈ రక్షణ ఒప్పందం ఎలా ప్రభావితం చేస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒప్పందంలోని పరస్పర రక్షణ నిబంధన ప్రకారం.. పాకిస్థాన్‌పై జరిగే దాడిని మిగిలిన దేశాలు ఎలా పరిగణిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇలాంటి రక్షణ ఒప్పందాల్లో ప్రతిస్పందన విధానం, సైనిక సహాయం, దౌత్య మద్దతు వంటి అంశాలు ఆయా దేశాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. ఆ లెక్కన.. ఈ ఒప్పందం ఉన్నంత మాత్రాన సౌదీ అరేబియా, టర్కీ వెంటనే ఏదైనా ఘర్షణలోకి దిగాల్సిందేనని స్పష్టమైన హామీ లేదు.మారుతున్న సమీకరణాలుపాక్, సౌదీ, టర్కీ రక్షణ ఒప్పందం మధ్యప్రాచ్య రాజకీయాల్లో కొత్త మార్పులకు సంకేతంగా మారింది. ఒకవైపు ఇరాన్ తన ప్రాంతీయ ప్రభావాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుండగా.. మరోవైపు సౌదీ తన భద్రతా వ్యవస్థను విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో మూడు దేశాల కొత్త రక్షణ కూటమి భవిష్యత్‌లో పశ్చిమాసియా శక్తి సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. -
పాకిస్థాన్, సౌదీ, తుర్కియే కీలక ఒప్పందం
పశ్చిమాసియా యుద్ధ వాతావరణం నేపథ్యంలో పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే కీలక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ (Mecca Joint Defence Agreement) పేరుతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్న ఆ దేశాలు.. ఏ దేశంపై దాడి జరిగినా మూడింటిపై జరిగిన దాడిగానే పరిగణించనున్నాయి. ఈ కీలక రక్షణ ఒప్పందంపై ఆ దేశాలు సంతకాలు చేశాయి. పెరుగుతున్న భద్రతా ఆందోళనల వేళ ఈ ఒప్పందం మూడు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం.. మూడు దేశాలలో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా.. అది మిగతా అన్ని దేశాలపై జరిగిన దాడిగానే పరిగణనలోకి తీసుకోనున్నాయి. మూడు దేశాలలో ఏ ఒక్క దానిపై సాయుధ దాడి జరిగినా.. అది మూడింటిపై జరిగిన దాడిగానే భావిస్తారు. అలాగే మూడు దేశాల మధ్య రక్షణ సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను మరింత పెంపొందించడానికి ఇది తోడ్పడుతుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.సౌదీ అరేబియాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ల మధ్య జరిగిన సమావేశంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సైనిక దళాల అధిపతి (ఆర్మీ చీఫ్) ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌తో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో కలిసి షరీఫ్ గురువారం మూడు రోజుల పర్యటన నిమిత్తం అక్కడకు చేరుకున్నారు.ఇరాన్ యుద్ధంలో భాగంగా పలుమార్లు దాడులను ఎదుర్కొన్న సౌదీ అరేబియా, తన రక్షణ భాగస్వామ్యాలను విస్తరించుకోవాలని భావిస్తోంది. తుర్కియేకి చెందిన 'హేబర్ టర్క్' మీడియా కథనం ప్రకారం.. ఈ ఒప్పందం ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణ, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, నిఘా సమాచారాన్ని పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. గాజా, ఇరాన్, లెబనాన్లలో జరుగుతున్న ఇతర ప్రాంతీయ పోరాటాల విషయంలో టర్కీ, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో కూడా ఈ ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది.అమెరికా ఈ ప్రాంతంలో తన స్వంత ప్రయోజనాలతో పాటు ఇజ్రాయెల్ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో.. మారుతున్న ప్రాంతీయ పరిస్థితులు, ఘర్షణల ప్రభావం వలన కొత్త మిత్రులను, శత్రువులను గుర్తించడానికి దేశాలు కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సెప్టెంబరులో కూడా పాకిస్తాన్, సౌదీ అరేబియాలు ఒక వ్యూహాత్మక రక్షణ ఒప్పందంపై సంతకం చేయడం గమనార్హం. ఆ సమయంలో ఒక దేశంపై దాడి జరిగితే రెండింటిపై జరిగిన దాడిగా పరిగణిస్తామని తెలిపాయి. ఇస్లామాబాద్ దశాబ్దాలుగా సౌదీ అరేబియాతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. సుమారు 25 లక్షలకు పైగా పాకిస్తానీయులు ఈ దేశంలో పనిచేస్తున్నారని అంచనా. పాకిస్తాన్ క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి సౌదీ అరేబియా ఆర్థిక సాయాన్ని అందిస్తూ వస్తోంది. -
పతకాలు తెచ్చాను.. నాపై ఇంత విద్వేషమా?
పాకిస్తాన్ స్టార్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ తనపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. ఒక ఈవెంట్లో విఫలమైనంత మాత్రాన తనను దూషించడం సరికాదన్నాడు. తాను దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చానని.. అయినప్పటికీ తనను అనరాని మాటలు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.ఒలింపిక్స్‌లో స్వర్ణంకాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో అర్షద్ నదీమ్ అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ఈటెను రికార్డు స్థాయిలో 92.7 మీటర్ల దూరం విసిరి స్వర్ణం గెలిచాడు. తద్వారా విశ్వ క్రీడల్లో పాకిస్తాన్‌కు తొలి వ్యక్తిగత పసిడి పతకం అందించిన అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు.సీన్ రివర్స్ఈ నేపథ్యంలో అర్షద్ నదీమ్‌పై ఇంటా.. బయట ప్రశంసల వర్షం కురిసింది. సన్మానాలు, సత్కారాలతో అతడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. కానీ ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. చివరగా టోక్యోలో జరిగిన వరల్డ్‌కప్ చాంపియన్షిప్స్ల మెడల్ ఈవెంట్లో అత్యుత్తమంగా 82.75 మీటర్ల దూరం ఈటెను విసిరిన అర్షద్.. ఆ తర్వాత ఒక్కసారి కూడా కనీసం 80 మీటర్ల మార్కు కూడా దాటలేకపోయాడు.తాజాగా గ్లాస్కో వేదికగా కామన్వెల్త్ గేమ్స్-2026లోనూ అర్షద్ నదీమ్ వైఫల్యాలు కొనసాగాయి. కామన్వెల్త్ గేమ్స్-2022లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం గెలిచిన అతడు.. ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగాడు. దారుణ వైఫల్యంతో..అయితే, తొలి ప్రయత్నంలోనే బ్యాలెన్స్ చేసుకోలేక ఫౌల్ కావడంతో ఫైనల్ రౌండ్లో అతడికి చేదు అనుభవమే మిగిలింది. ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లోనూ విఫలమైన అర్షద్ నదీమ్ టాప్-8కు చేరలేక ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఈసారి కనీసం కాంస్యం కాదు కదా.. ఫైనల్లో మరో మూడు ప్రయత్నాలు చేసే అవకాశం లేకుండానే నిష్క్రమించాడు. దీంతో పాకిస్తాన్ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అర్షద్ నదీమ్‌పై ఘాటు విమర్శలు చేశారు. అభ్యంతరకర పదజాలంతో అతడిని తిట్టారు.నేనూ పాకిస్తాన్ గడ్డ మీద పుట్టినవాడినేఈ నేపథ్యంలో అర్షద్ నదీమ్ తాజాగా స్పందించాడు. ‘‘కామన్వెల్త్ గేమ్స్‌లో నా వైఫల్యానికి సంబంధించి నేను ఎలాంటి సాకులు చెప్పాలనుకోవడం లేదు. అయితే, నేనూ పాకిస్తాన్ గడ్డ మీద పుట్టినవాడినే.పతకాలు అందించానుగతంలో దేశానికి ఎన్నో పతకాలు అందించాను. కానీ నా పట్ల అమర్యాదపూర్వకంగా, మనసు గాయపడే విధంగా మాట్లాడుతున్నారు. నేనూ మీలో ఒకడిననే గుర్తించండి. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మర్చిపోవద్దని చెబుతూ నా తల్లిదండ్రులు నాకు చెప్పారు.నేను లాగే ఉన్నాను. డబ్బు, పేరు ప్రఖ్యాతుల వల్ల నేనేమీ పొగరుబోతులా తయారుకాలేదు. చలి ఎక్కువగా ఉన్న చోట జావెలిన్ త్రోయర్ల కండరాలు పట్టేయడం సహజం. రిథమ్ కూడా కోల్పోవడం జరుగుతుంది. నేను ప్రాక్టీస్ చేసిన పరిస్థితులు.. క్రీడా వేదిక పరిస్థితులు వేరు.ఏదేమైనా గ్లాస్గోలో నేను మెరుగ్గా రాణించాల్సింది. కానీ గెలవలేకపోయాను. ఎల్లప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు వంద శాతం కృషి చేస్తాను. కఠిన శ్రమనే నమ్ముకున్న నాకు ఆ దేవుడే మార్గం చూపిస్తాడు. ఆయన నిర్ణయం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది’’ అని అర్షద్ నదీమ్ ఆవేదన వ్యక్తం చేశాడు.అందుకే ఫెయిల్ అయ్యాడా?కాగా అర్షద్ నదీమ్ తన కోచ్‌గా సల్మాన్ బట్‌ను కొనసాగించడంతో.. పాకిస్తాన్ అమెచూర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్తో విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ చేసేందుకు అతడికి ఫెడరేషన్ నుంచి ఎలాంటి సహకారం అందలేదనే వార్తలు వచ్చాయి. లాహోర్‌లో ఎర్రటి ఎండలో అర్షద్ ప్రాక్టీస్ చేయగా.. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో అందుకు విరుద్ధంగా పూర్తి చలి వాతావరణం ఉండటం అతడి ప్రదర్శనపై ప్రభావం చూపినట్లు సమాచారం.చదవండి: టీమిండియాతో మ్యాచ్.. వన్డే తరహాలో లంక బ్యాటర్ల విధ్వంసం -
రూట్ సారథ్యంలో...
లండన్: రెండేళ్ల విరామం అనంతరం డాన్ లారెన్స్ ఇంగ్లండ్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ నెల 19 నుంచి పాకిస్తాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ గురువారం 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం తిరిగి జో రూట్ సారథిగా ఎంపిక కాగా... గాయం కారణంగా జాకబ్ బెథెల్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. 2024లో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన లారెన్స్... బ్యాటింగ్ ఆర్డర్లో స్టోక్స్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. ఆఫ్‌స్పిన్ వేయగలగడం లారెన్స్‌కు అదనపు బలం.బ్రెండన్ మెకల్లమ్ స్థానంలో ఇటీవల ఇంగ్లండ్ హెడ్‌కోచ్‌గా ఎంపికైన స్టీఫెన్ ఫ్లెమింగ్ గైర్హాజరీలో ట్రెస్కోథిక్ జట్టుకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించనున్నాడు. గత తొమ్మిది టెస్టుల్లో ఏడింట ఓడిన ఇంగ్లండ్... 2024 డిసెంబర్ తర్వాత టెస్టు సిరీస్ గెలవలేదు. ఇంగ్లండ్ జట్టు: రూట్ (కెప్టెన్), ఆర్చర్, అట్కిన్సన్, బషీర్, బ్రూక్, కార్స్, సామ్ కుక్, కాక్స్, డకెట్, ఫిషెర్, ఎమిలియో, లారెన్స్, పోప్, రాబిన్సన్, జేమీ స్మిత్, టంగ్. -
రెండో టెస్టులో పాకిస్తాన్ విజయం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (ట్రినిడాడ్): బ్యాటర్ల పట్టుదలకు బౌలర్ల క్రమశిక్షణ తోడవడంతో వెస్టిండీస్‌తో రెండో టెస్టులో పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమంగా ముగించింది. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ గెలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 103/6తో బుధవారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ చివరకు 46.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. కవెమ్ హెడ్జ్ (71 బంతుల్లో 34; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... తేజ్‌నారాయన్ చందర్‌పాల్ (17), అమిర్ జంగూ (13), కెప్టెన్ రోస్టన్ చేజ్ (17), షై హోప్ (15), సీల్స్ (0), గ్రీవ్స్ (3) విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో అలీ ఉస్మాన్, సాజిద్ ఖాన్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం 75 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ 23.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసి గెలుపొందింది. అజాన్ అవైస్ (18), ఇమాముల్ హక్ (9) ఎక్కువసేపు నిలవలేకపోగా... తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో అబ్దుల్లా షఫీఖ్ (24 నాటౌట్), కెప్టెన్ బాబర్ ఆజమ్ (24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టును విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులు చేయగా... పాకిస్తాన్ జట్టు 387 పరుగులు చేసింది. 2023 తర్వాత విదేశాల్లో పాకిస్తాన్‌కిదే తొలి టెస్టు విజయం కావడం గమనార్హం. -
పాక్‌తో రెండో టెస్ట్.. విండీస్‌కు భారీ ఎదురుదెబ్బ
పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు బ్యాటర్ బ్రాండన్ కింగ్ గాయం కారణంగా మ్యాచ్‌లో మిగిలిన భాగానికి దూరమయ్యాడు. ఆగస్టు 4న మూడో రోజు ఆట సందర్భంగా అతడికి తీవ్ర లోయర్ బ్యాక్ మసిల్ స్పాసమ్స్ వచ్చాయి.పాక్ ఇన్నింగ్స్‌లో 75వ ఓవర్ సందర్భంగా బాబర్ ఆజమ్ రనౌట్‌లో కింగ్ కీలక పాత్ర పోషించాడు. బాబర్ సింగిల్ కోసం ప్రయత్నించగా, తిరిగి క్రీజులోకి రావాల్సి వచ్చింది. ఆ సమయంలో కవర్ ప్రాంతం నుంచి కింగ్ విసిరిన బంతి నేరుగా వికెట్లను తాకడంతో బాబర్ రనౌట్ అయ్యాడు.అయితే ఈ అద్భుతమైన ఫీల్డింగ్ ప్రయత్నం కింగ్‌కు తీవ్ర గాయాన్ని మిగిల్చింది. బంతిని అందుకుని డైరెక్ట్ త్రో వేసే సమయంలో అతడు ఇబ్బందికరంగా ల్యాండ్ కావడంతో వెన్ను కండరాల్లో తీవ్ర నొప్పి వచ్చింది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అతడిని స్ట్రెచర్‌పై మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు.క్రికెట్ వెస్టిండీస్ వైద్య బృందం ప్రాథమిక పరీక్షల అనంతరం కింగ్‌కు లోయర్ బ్యాక్ మసిల్ స్పాసమ్స్ ఉన్నట్లు నిర్ధారించింది. వైద్య బృందం అతడిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. గాయం మరింత తీవ్రం కాకూడదనే ఉద్దేశంతో మిగిలిన మ్యాచ్‌కు అతడిని దూరంగా ఉంచారు.కింగ్ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేశాడు. అతడి గైర్హాజరీ వెస్టిండీస్ బ్యాటింగ్ కూర్పుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో అతడు బ్యాటింగ్‌కు రాలేడు.కింగ్ లేని లోటు ఈ మ్యాచ్‌లో విండీస్ గెలుపోటములను శాశించే స్థితిలో ఉంది. ఆట నాలుగో రోజు విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఘోరంగా పతనమైంది. తొలి సెషన్ సమయానికి ఆ జట్టు 7 వికెట్లు కోల్పోయి 115 పరుగులు మాత్రమే చేసింది. జస్టిన్ గ్రీవ్స్ (3), షమార్ జోసఫ్ (9) క్రీజ్‌లో ఉన్నారు. మరో రెండు వికెట్లు పడితే విండీస్ ఇన్నింగ్స్ ముగుస్తుంది. సాజిద్ ఖాన్ (4 వికెట్లు), అలీ ఉస్మాన్ (3 వికెట్లు) విండీస్‌ను ఘెరంగా దెబ్బతీశారు. ప్రస్తుతం విండీస్ కేవలం 72 పరుగుల లీడ్‌లో ఉంది. ఈ మ్యాచ్‌లో విండీస్ ఓటమి తప్పించుకోవాలంటే ఏదైనా మహాద్భుతమే జరగాలి. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ గెలవడంతో విండీస్ 1-0 ఆధిక్యంలో ఉంది. -
దొంగదారిలో భారత్‌లోకి పాకిస్తాన్ ఖర్జూరాలు..
భారత్ విధించిన నిషేధాన్ని తప్పించుకుని మూడో దేశం ద్వారా భారత్‌లోకి పాకిస్తానీ ఖర్జూరాల దిగుమతికి చేసిన ప్రయత్నాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అడ్డుకుంది. గుజరాత్‌లోని కాండ్లా పోర్టులో పాకిస్తాన్ మూలానికి చెందిన 364 మెట్రిక్ టన్నుల డ్రై ఖర్జూరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.3 కోట్లుగా అధికారులు వెల్లడించారు.నిర్దిష్ట సమాచారంతో రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు కాండ్లా పోర్టులో వచ్చిన 13 కంటైనర్లను తనిఖీ చేశారు. పత్రాల్లో ఈ సరుకును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి వచ్చినవిగా పేర్కొన్నప్పటికీ, దర్యాప్తులో అసలు మూల దేశం పాకిస్తాన్ అని తేలింది. పాకిస్తాన్ నుంచి సరుకును తొలుత దుబాయ్‌కు తరలించి, అక్కడ మరో కంటైనర్లలోకి మార్చిన అనంతరం భారత్‌కు ఎగుమతి చేసినట్లు విచారణలో గుర్తించారు.గుగ్గుల్ రెసిన్ కేసులోనూ ఇదే తరహా మోసంకాండ్లా ఘటనకు కొద్దిరోజుల ముందే తమిళనాడులోని ట్యుటికోరిన్ పోర్టులోనూ ఇలాంటి వ్యవహారాన్ని డీఆర్ఐ గుర్తించింది. సుమారు 14 మెట్రిక్ టన్నుల పాకిస్తాన్ మూలానికి చెందిన గుగ్గుల్ రెసిన్ దాదాపు రూ.1.4 కోట్ల విలువైన సరుకును అధికారులు అడ్డుకున్నారు. ఈ సరుకును సోమాలియా మూలానికి చెందిన సహజ రెసిన్గా పత్రాల్లో చూపించి, దుబాయ్ మీదుగా భారత్‌కు తరలించినట్లు దర్యాప్తులో తేలింది. నకిలీ పత్రాలను ఉపయోగించినట్లు గుర్తించిన అధికారులు ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు.పాకిస్తాన్ వస్తువులపై ఎందుకు నిషేధం?పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మూలానికి చెందిన వస్తువుల దిగుమతులపై కఠిన ఆంక్షలు విధించింది. ప్రత్యక్షంగానే కాకుండా మూడో దేశాల ద్వారా పరోక్షంగా దిగుమతి చేసుకోవడం లేదా రవాణా చేయడం కూడా నిషేధం. దీంతో పాకిస్తాన్ నుంచి సరుకులను దుబాయ్ వంటి మూడో దేశాలకు తరలించి, అక్కడి నుంచి భారతదేశానికి పంపే మార్గాలను అక్రమంగా ఉపయోగించే ప్రయత్నాలపై డీఆర్ఐ నిఘా పెంచింది.ఇదీ చదవండి: ఉచితంగా 20 వేల విమాన టికెట్లు.. ఫ్రీ ఆఫర్! -
జంతర్ మంతర్‌లో పెట్రోల్ బాంబులతో దాడికి ప్లాన్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన నిరసన ప్రదర్శనను లక్ష్యంగా చేసుకుని పెట్రోల్ బాంబు దాడికి పన్నాగం పన్నిన పాకిస్థాన్ గూఢచార సంస్థ ‘ఐఎస్ఐ’ మద్దతుగల ఉగ్రవాద మాడ్యూల్‌ను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. ఈ ఉదంతానికి సంబంధించి ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ ఉగ్రదళానికి చెందిన సభ్యులు నిరసన సమయంలో జంతర్ మంతర్‌ను సందర్శించి, రవాణా సాయం అందుకోవడంతో పాటు పెట్రోల్ బాంబులను కూడా సమకూర్చుకున్నారు. భద్రతా సిబ్బంది, పోలీసులను, ఇతర యూనిఫాం ధరించిన అధికారులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని పాకిస్థాన్ హ్యాండ్లర్లు నిందితులకు శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.అయితే ఈ దాడిని అమలు చేయడం సాధ్యపడకపోవడంతో, అనుమానితులు పంజాబ్‌కు తిరిగి వెళ్లిన తర్వాత నిఘా వర్గాల ఆధారంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలను పోలీసులు గుర్తించారు. అమృత్‌సర్‌లో ఐఎస్ఐ మద్దతుగల రెండు సరిహద్దు ఉగ్రవాద మాడ్యూళ్లను పోలీసులు ఛేదించారు. నలుగురు మైనర్లతో సహా మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో మూడు అక్రమ పిస్టల్స్, నాలుగు పెట్రోల్ బాటిల్ బాంబులు, తొమ్మిది తూటాలను స్వాధీనం చేసుకున్నారు.విదేశీ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు స్థానిక యువకులను ఉగ్ర కార్యకలాపాల కోసం నియమించుకోవడం, భద్రతా స్థావరాలపై నిఘా పెట్టడం, అక్రమ ఆయుధాలను సమకూర్చడం వంటి పనులకు ఈ ముఠా పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. రైల్వే ట్రాక్‌ల వద్ద నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి, ఆ ఫుటేజ్‌ను విదేశాల్లోని హ్యాండ్లర్లకు పంపినట్లు దర్యాప్తులో తేలింది. అమృత్‌సర్‌లోని మోకంపుర, ఎయిర్పోర్ట్, సి-డివిజన్ పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, ఈ నెట్‌వర్క్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఇతర అనుసంధానాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఇది కూడా చదవండి: దుబాయ్‌లో భారీ పేలుళ్లు: జెబెల్ అలీని కమ్మేసిన దట్టమైన పొగ! -
కామన్వెల్త్ గేమ్స్ ముగింపులో ట్విస్ట్.. విమానం ఎక్కకుండా పరారైన అథ్లెట్లు
గ్లాస్గో వేదికగా జరిగిన 11 రోజుల పాటు జరిగిన కామన్వెల్త్ గేమ్స్-2026కు ఆదివారం ఎండ్‌కార్డ్ పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రతిష్టాత్మక క్రీడలు ఘనంగా ముగిసినప్పటికి పలువురు విదేశీ అథ్లెట్లు కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. యుగాండా బాక్సింగ్ బృందంలోని నలుగురు బాక్సర్లు (నూహు బట్టే, ఏంజెల్ కటుషాబే, ఇబ్రహీం కెమిస్, ఎమిలీ నకలేమా) మంగళవారం జట్టుతో తిరుగు ప్రయాణం కావాల్సిన విమానాన్ని ఎక్కలేదు. ఎన్బీఎస్ స్పోర్ట్స్ కథనం ప్రకారం.. సదరు బాక్సర్లు మెరుగైన శిక్షణ సదుపాయాలు, అవకాశాలు కోసం స్కాట్లాండ్లోనే ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. అదృశ్యమైన క్రీడాకారుల ఆచూకీ కోసం స్కాట్లాండ్ పోలీసులు వెతకడం ప్రారంభించారు.పాక్ బాక్సర్ మిస్సింగ్..మరోవైపు ఈ కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న పాకిస్తాన్ బాక్సర్ ఖుద్రతుల్లా కూడా అదృశ్యమయ్యాడు. దీంతో పాకిస్తాన్ బాక్సింగ్ ఫెడరేషన్ మరోసారి విమర్శల పాలైంది. గతంలో పలు దేశాల్లో జరిగిన అంతర్జాతీయ పోటీల సందర్భంగానూ పాకిస్తాన్ బాక్సర్లు అదృశ్యమైన ఉదంతాలు నమోదు కాగా... ఇప్పుడు తాజగా ఖుద్రతుల్లా వ్యవహారం వెలుగు చూసింది.‘పోటీల అనంతరం ఖుద్రతుల్లా కనిపించకుండా పోయాడు. అతడి పాస్‌పోర్ట్ టీమ్ మేనేజర్ వద్దే ఉన్నప్పటికీ అతడు మాత్రం అదృశ్యమయ్యాడు’ అని పాకిస్తాన్ ఒలింపిక్ సంఘం సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. 2022 బర్హింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల సందర్భంగానూ పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు బాక్సర్లు సులేమాన్ బలోచ్, నజీరుల్లా ఖాన్ ఇలాగే అదృశ్యమయ్యారు. 2024లో ఇటలీలో జరిగిన ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో... ఆసియా పసిడి పతక విజేత జోహైబ్ రషీద్ అతడి రూమ్మెట్ విదేశీ కరెన్సీని దొంగలించి కనిపించకుండా పోయాడు. కాగా ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో పాకిస్తాన్ ఏకైక కాంస్య పతకం సాధించింది. మొత్తం 36 మంది బృందం ఈ పోటీల్లో పాల్గొనగా... అందులో మహిళా బాక్సర్ ఫాతిమా జెహ్రా మాత్రమే మెడల్ గెలిచింది. -
కేంద్ర ప్రభుత్వంలో మిత్రులు.. పీవోకేలో శత్రువులు..
పాకిస్తాన్లో ఒకే ప్రభుత్వంలో భాగస్వాములు.. కానీ, పీవోకేలోని ముజఫరాబాద్‌లో మాత్రం ప్రత్యర్థులు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) ఎన్నికలు పాక్ అధికార కూటమిలోని రెండు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర రాజకీయ పోరుకు వేదికగా మారాయి. ఒకవైపు ప్రజా ఆందోళనలు, కాల్పులు, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. మరోవైపు ఎన్నికల ఫలితాలపై అధికార కూటమిలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP), పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.కాగా, పాకిస్తాన్‌లోని కేంద్ర ప్రభుత్వంలో మిత్రపక్షాలుగా ఉన్న ఈ రెండు పార్టీలు.. పీవోకేలో మాత్రం ఆధిపత్యం కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. ఒకే కూటమిలో కొనసాగుతున్నా.. ఎన్నికల రంగంలో మాత్రం ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేస్తూ రాజకీయ యుద్ధం సాగిస్తున్నాయి. పీవోకేలో ఎన్నికల తొలి రెండు దశల్లో PML-N ఆధిక్యం సాధించడంతో PPP తీవ్రంగా స్పందించింది. PPP అధినేత బిలావల్ భుట్టో జర్దారీ ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, తమ పార్టీకి చెందిన ఓట్లను ప్రభావితం చేశారని ఆరోపించారు. కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలను ఆక్రమించారని, తమ పోలింగ్ ఏజెంట్లను బయటకు పంపించారని, బ్యాలెట్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని PPP నేతలు ఆరోపించారు.ప్రజలు నిజంగా తిరస్కరించిన చోట ఓటమిని అంగీకరిస్తామని, కానీ దొంగిలించిన ఫలితాలను మాత్రం అంగీకరించబోమని బిలావల్ భుట్టో స్పష్టం చేశారు. PML-Nను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఆ పార్టీ విజయాలు ప్రజా మద్దతుతో కాకుండా అక్రమాల ఆధారంగా సాధిస్తున్నాయని విమర్శించారు. అయితే PML-N ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. ప్రజలే ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని, ఓటమిని అంగీకరించలేని వారు ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి మరియమ్ నవాజ్ కూడా ఎన్నికల ఫలితాలను ప్రజల విజయంగా అభివర్ణించారు.ఇమ్రాన్ కోసం కూటమి.. ఇక, 2022లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని తొలగించే సమయంలో PPP, PML-N సహా పలు పార్టీలు ఒకే వేదికపైకి వచ్చాయి. రాజకీయ అవసరాల నేపథ్యంలో ఏర్పడిన ఈ కూటమి ప్రస్తుతం POK ఎన్నికల కారణంగా అంతర్గత విభేదాలను బయటపెడుతోంది. ఇస్లామాబాద్‌లో కలిసి పాలన సాగిస్తున్న పార్టీలు.. ముజఫరాబాద్‌లో మాత్రం పరస్పర ప్రత్యర్థులుగా మారాయి. ఈ రాజకీయ పోరుకు మరోవైపు POKలో ప్రజా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆర్థిక సమస్యలు, ధరల పెరుగుదల, పరిపాలనా విధానాలు, పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యానికి వ్యతిరేకంగా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆధ్వర్యంలో నిరసనలు ఉధృతమయ్యాయి. నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అయితే, పాక్ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ, నిరసనల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందని ఆరోపించింది. మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవల నిలిపివేత, అరెస్టులు, భారీగా భద్రతా బలగాల మోహరింపుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇదిలా ఉండగా.. పీవోకే ఎన్నికల తొలి దశలో మొత్తం 13 స్థానాలకు జరిగిన పోలింగ్‌లో PML-N తొమ్మిది స్థానాలు గెలుచుకోగా, PPP నాలుగు స్థానాలు సాధించింది. రెండో దశలో కూడా PML-N ఆధిక్యం కొనసాగించింది. మూడో, చివరి దశ ఎన్నికలు ఆగస్టు 10న జరగనున్నాయి. ప్రస్తుతం POK ఎన్నికలు సాధారణ రాజకీయ పోటీని దాటి.. పాకిస్తాన్ అధికార కూటమిలోని రెండు ప్రధాన పార్టీల మధ్య ఆధిపత్య పోరుగా మారాయి. ప్రజలు తమ సమస్యలపై నిరసనలు చేస్తున్న వేళ.. రాజకీయ పార్టీలు మాత్రం అధికారం, స్థానాల కోసం పోరాడుతున్నాయి. -
ఉగ్ర శిబిరాలను వణికిస్తున్న ‘అజ్ఞాత దాడులు’
పాకిస్థాన్ గడ్డపై గత కొద్ది సంవత్సరాలుగా ఓ రహస్య పరిణామం తీవ్ర కలకలం రేపుతోంది. అక్కడి ఉగ్రవాద నెట్‌వర్క్‌లను, రక్షణ రంగ నిపుణులను నివ్వెరపరుస్తున్న ఈ ఉదంతంలో లష్కర్ ఎ తోయిబా, జైష్ ఏ మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలకు చెందిన పలువురు కీలక ఉగ్రవాదులు వరుసగా నేలకూలుతున్నారు. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా జరుగుతున్న ఈ మరణాలు ఉగ్రవాద శిబిరాల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి.అజ్ఞాత హంతకుల అటాక్..పాకిస్థాన్‌లోని పంజాబ్, కరాచీ, ఖైబర్ పఖ్తుంఖ్వా, పీవోకే ప్రాంతాల్లో గత కొద్ది కాలంగా భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాలపై వచ్చే అజ్ఞాత వ్యక్తులు అత్యంత సమీపంలోకి వచ్చి కాల్పులు జరిపి నిమిషాల వ్యవధిలో మాయమవుతున్నారు. ఈ మిస్టరీ హత్యలు పాక్ నిఘా వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.లష్కర్ సీనియర్ నేత సంచలన ప్రకటనసరిహద్దు అవతల నుంచి పనిచేసే లష్కర్ ఏ తోయిబా సీనియర్ సభ్యుడు రిజ్వాన్ హనీఫ్ ఇటీవల సంచలన వాస్తవాన్ని బయటపెట్టాడు. 2020 నుంచి ఇప్పటివరకు తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా సభ్యులు పాకిస్థాన్‌లో హతమయ్యారని బహిరంగంగా అంగీకరించారు. ఒక ఉగ్రవాద సంస్థ ఈ స్థాయిలో నష్టాన్ని అంగీకరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల వరుస హతంఈ మిస్టరీ దాడుల్లో భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఎంతో మంది కీలక టెర్రరిస్టులు అంతమొందారు. 2016 పఠాన్‌కోట్ దాడి సూత్రధారి మౌలానా షాహిద్ లతీఫ్, 1999 ఐసీ-814 విమాన హైజాక్ నిందితుడు జహూర్ మిస్త్రీ, హిజ్బుల్ కమాండర్ బషీర్ అహ్మద్ పీర్ వంటి ప్రముఖులు వేర్వేరు సందర్భాల్లో విగతజీవులుగా మారారు.అంతర్జాతీయంగా చర్చనీయాంశంపాక్లో జరుగుతున్న ఈ లక్షిత హత్యలను అంతర్జాతీయ మీడియా సంస్థలు మిస్టరీ కిల్లింగ్స్‌గా అభివర్ణించాయి. ఈ ఘటనల వెనుక విదేశీ ఏజెన్సీల హస్తం ఉందని పాకిస్థాన్ అధికారులు అప్పుడప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ, వాటికి తగిన ఆధారాలు చూపలేకపోయాయి. మరోవైప పాక్ భూభాగంలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలను అణచివేయాలని భారత్ అంతర్జాతీయ వేదికలపై పదే పదే స్పష్టం చేస్తూ వస్తోంది.అందుబాటులో లేని అధికారిక జాబితాలష్కర్ సీనియర్ నేత 30 మందికి పైగా హతమైనట్లు ప్రకటన చేసినప్పటికీ, ఆ మృతుల పూర్తి అధికారిక జాబితాను ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ లేదా పాక్ ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. కేవలం పబ్లిక్ డొమైన్లో లభిస్తున్న విశ్వసనీయ సమాచారం, ప్రాథమిక రికార్డుల ఆధారంగానే కొన్ని ప్రధాన పేర్లు వెలుగులోకి వచ్చాయి.మిస్టరీ వీడని హత్యలు.. ఉగ్రశిబిరాల్లో దడఅబూ ఖతాల్ సింధి, ఖాలిద్ రజా, సలీమ్ రెహమానీ వంటి కీలక ఉగ్రవాదుల హత్యల కేసుల దర్యాప్తు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. నిందితుల ఆచూకీ లభించకపోవడం, వరుస హత్యల పరంపర కొనసాగుతుండటంతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శ్రేణుల్లో కంటి మీద కునుకు లేకుండా పోతోంది.ఇది కూడా చదవండి: ‘బంగ్లా’ రాజకీయాల్లో సునామీకి షేఖ్ హసీనా సిద్ధం! -
అంత తొందరెందుకు బాబర్..!
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు మరోసారి టెస్టు సెంచరీ అందని ద్రాక్షగానే మిగిలింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక రెండో టెస్టులో అతడు 88 పరుగుల వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు. సెంచరీకి చేరువలో ఉండగా రనౌట్ కావడంతో బాబర్ తీవ్ర అసహనానికి గురయ్యాడు.మూడో రోజు తొలి ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే వారికన్ సంధించిన బంతిని ఆఫ్‌సైడ్ వైపు ఆడిన బాబర్ సింగిల్ కోసం పరుగు ప్రారంభించాడు. పిచ్ మధ్యలోకి వచ్చిన తర్వాత నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న అబ్దుల్లా షఫీక్ నుంచి తిరిగి వెళ్లాలన్న సంకేతం రావడంతో వెనక్కి మళ్లాడు. అప్పటికే ఆలస్యమైంది.బ్రాండన్ కింగ్ అద్భుతమైన డైరెక్ట్ హిట్‌తో బాబర్‌ను రనౌట్ చేశాడు. దీంతో 147 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 88 పరుగులు చేసిన అతడు పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. రనౌట్ తర్వాత బాబర్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడు. పెవిలియన్‌కు వెళ్లే సమయంలో చాలా కోపంగా ఉన్నట్లు కనిపించింది.మూడున్నరేళ్లుగా ఎదురుచూపులుబాబర్ చివరిసారిగా 2022 డిసెంబర్లో టెస్టు సెంచరీ చేశాడు. న్యూజిలాండ్‌తో కరాచీలో జరిగిన టెస్టులో అతడు అద్భుతంగా ఆడి 161 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు సెంచరీ చేసుంటే 10వ టెస్ట్ సెంచరీ అయ్యేది.మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు బాబర్ ఔటయ్యాక పాక్ స్వల్ప వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. రెండో రోజే సెంచరీ పూర్తి చేసిన అబ్దుల్లా షఫీక్ (130), సాజిద్ ఖాన్ (8) క్రీజ్‌లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు స్కోర్ 323-6గా ఉంది. విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 21 పరుగులు వెనుకపడి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 344 పరుగులకు ఆలౌటైంది. జస్టిన్ గ్రీవ్స్ (73), రోస్టన్ ఛేజ్ (70) అర్ద సెంచరీలతో రాణించారు. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ గెలిచిన విండీస్ 1-0 ఆధిక్యంలో ఉంది. -
CWG 2026: పాకిస్థాన్ బాక్సర్ మిస్సింగ్
కామన్వెల్త్ గేమ్స్ 2026 తర్వాత పాకిస్థాన్ బాక్సర్ కుద్రతుల్లా (Qudratullah) మిస్ అయినట్లు తెలుస్తోంది. పోటీలు ముగిసిన అనంతరం టీమ్ హోటల్ నుంచి వెళ్లిన అతడు అదృశ్యమైనట్లు సమాచారం. అతని పాస్‌పోర్ట్ కూడా టీమ్ మేనేజర్ వద్దే ఉన్నట్లు తెలుస్తోంది.ఇదే తొలిసారి కాదుఅంతర్జాతీయ టోర్నీల సమయంలో పాకిస్థాన్ బాక్సర్లు అదృశ్యమైన ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. 2022 కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా సులేమాన్ బలోచ్, నజీరుల్లా ఖాన్ బర్మింగ్‌హామ్‌లో అదృశ్యమయ్యారు. అప్పట్లోనూ వారి పాస్‌పోర్టులు మేనేజర్ వద్దే ఉన్నట్లు సమాచారం.2024లో ఇటలీలో జరిగిన వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్ సందర్భంగా ఆసియా గోల్డ్ మెడలిస్ట్ బాక్సర్ జోహైబ్ రషీద్ (పాక్) తన రూమ్మేట్కు చెందిన విదేశీ కరెన్సీ, విలువైన వస్తువులను తీసుకుని బస్టో అర్సిజియో పట్టణంలో అదృశ్యమైనట్లు ఆరోపణలు వచ్చాయి.ఒక్క పతకంతో సరిపెట్టుకున్న పాక్కామన్వెల్త్ గేమ్స్ 2026లో పాక్‌కు ఒకే ఒక పతకం లభించింది. ఈ పోటీల్లో మొత్తం 36 మంది సభ్యులు పాల్గొనగా..మహిళల బాక్సింగ్‌లో ఫాతిమా జెహ్రా కాంస్య పతకాన్ని సాధించింది. -
పొలిటికల్ బాంబు పేల్చిన నఖ్వీ
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ అతి పెద్ద పొలిటికల్ బాంబు పేల్చాడు. పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి కూడా అయిన.. దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణాన్ని గుర్తించామని ప్రకటించారు. ఈ వ్యవహారంలో న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులు, బ్యాంకర్లు కూడా ఉన్నారని ఆరోపించారు."21 ఏళ్లుగా లంచాలు ఇచ్చారు, తీసుకున్నారు. బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటాం" అని వ్యాఖ్యానించారు. అయితే కుంభకోణానికి పాల్పడ్డ వ్యక్తుల పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు.నఖ్వీ కొద్ది రోజుల కిందటే మరో సంచలన ఆరోపణ చేశారు. పాకిస్థాన్ పాలనా వ్యవస్థ కుప్పకూలిపోయిందని వ్యాఖ్యానించారు. నఖ్వీ వరుసగా చేస్తున్న సంచలన ఆరోపణలు పాక్ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి. అతడికి దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు పొసగడం లేదని ప్రచారం జరుగుతోంది. ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆదేశాలతోనే నఖ్వీ ప్రభుత్వంపై ఆరోపణుల చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. నఖ్వీ-మునీర్ చాలాకాలంగా ప్రధానిపై గుర్రుగా ఉన్నారని సమాచారం. ఈ కారణంగానే వారు ఇలాంటి ఆరోపణులు చేస్తున్నారని తెలుస్తోంది.ఇదిలా ఉంటే, నఖ్వీ పీసీబీ అధ్యక్షుడిగా, పాక్ అంతర్గత మంత్రిగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. తాజాగా అతడు మహిళల ఆసియా కప్‌కు సంబంధించిన షెడ్యూల్ డిస్కషన్లో పాల్గొన్నాడు. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ప్రకటన త్వరలోనే వెలువడాల్సి ఉంది. -
భారత్ కంటే ముందే పాక్ తరపున ఆడిన సచిన్..?
సచిన్ టెండూల్కర్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో చెరగని సంతకం. మాస్టర్ బ్లాస్టర్ తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మైలురాళ్లు, అరుదైన రికార్డులను సాధించాడు. ఎంతో మంది యువ ఆటగాళ్లకు అతడే రోల్‌మోడల్. అయితే క్రికెట్ గాడ్‌గా పేరు గాంచిన సచిన్ కెరీర్లో ఎవరికీ తెలియని ఒక రహస్యముంది.భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడానికి రెండేళ్ల ముందే... సచిన్ పాకిస్తాన్ జట్టు తరఫున మైదానంలోకి దిగాడు. అవును మీరు విన్నది నిజమే. 1987లో బ్రబోర్న్ స్టేడియంలో పాక్ తరపున సబ్‌స్ట్యూట్‌గా సచిన్ ఫీల్డింగ్ చేశాడు.అసలేమి జరిగిదంటే?1987 ఏడాది ఆరంభంలో పాకిస్తాన్ ఐదు టెస్టులు, ఆరు వన్డేల సిరీస్‌లో తలపడేందుకు భారత పర్యటనకు వచ్చింది. ఈ సిరీస్‌లు ఆరంభానికి ముందు క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా భారత్-పాకిస్తాన్ మధ్య 40 ఓవర్ల ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్‌కు ముంబైలోని చార్రిత్మక బ్రబోర్న్ స్టేడియం వేదికైంది. ఈ మ్యాచ్‌కు సచిన్ బాల్ బాయ్‌గా ఉన్నాడు. అప్పటికి టెండూల్కర్ వయస్సు వయసు కేవలం 13 ఏళ్లు మాత్రమే. అయితే లంచ్ బ్రేక్ సమయంలో పాక్ ఆటగాళ్లు జావేద్ మియాందాద్, అబ్దుల్ ఖాదిర్ విశ్రాంతి కోసం హోటల్‌కు తిరిగి వెళ్లిపోయారు.దీంతో మైదానంలో ఫీల్డింగ్ చేయడానికి ఇద్దరు సబ్‌స్ట్యూట్స్ అవసరమయ్యారు. వెంటనే అప్పటి పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్.. అక్కడి క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ ఇన్ఛార్జ్ దగ్గరకు వెళ్లి ఇద్దరు లోకల్ కుర్రాళ్లను సబ్‌స్ట్యూట్‌గా ఫీల్డింగ్ పంపంచండి అని అడిగాడు. హేమంత్ ఎవరిని పంపాలా అని ఆలోచిస్తుండగా 13 ఏళ్ల సచిన్ నేను వెళ్తా అని ముందుకొచ్చాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పాకిస్తాన్ గ్రీన్ జెర్సీ ధరించి మైదానంలో అడుగుపెట్టాడు. మైదానంలోకి వెళ్లిన సచిన్‌ను బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేయమన్నారు. నాటి భారత కెప్టెన్ కపిల్ దేవ్ ఒక భారీ షాట్ కొట్టగా... బంతి గాల్లోకి లేచింది. సచిన్ చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటూ బంతిని ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ కపిల్ కొట్టిన బంతి బౌండరీ అవతల పడింది. మాస్టర్ బ్లాస్టర్ ప్రత్యామ్నాయ ఫీల్డర్‌గా సుమారు 25 నిమిషాల పాటు మైదానంలోనే ఉన్నాడు. సచిన్ తన ఆటోబయోగ్రఫీ 'ప్లేయింగ్ ఇట్ మై వే'లో కూడా ఈ సంఘటన గురించి ప్రస్తావించాడు.ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు పాకిస్తాన్ జట్టు తరపున ఓసారి ఫీల్డింగ్ కూడా చేశాను. ఆ విషయం ఆయనకు గుర్తుందో లేదో అని సచిన్ రాసుకొచ్చారు. ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అక్కడికి సరిగ్గా మూడేళ్ల తర్వాత టెండూల్కర్.. ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్ వంటి స్టార్లు ఉన్న పాక్ జట్టుపైనే తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.చదవండి: టీమిండియాను కాపాడిన వరుణుడు.. లేదంటే? -
పాక్ పైశాచికం: ‘పీఓకే’ చూపించారని ‘అల్ జజీరా’ బంద్!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో జరుగుతున్న నిరసనల కవరేజ్ నేపథ్యంలో, పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాలలో ‘అల్ జజీరా ఇంగ్లీష్’తో సహా పలు వార్తా వెబ్సైట్లను నిలిపివేశారు. పీఓకేలో జరుగుతున్న ఆందోళనలు, భద్రతా బలగాల అణచివేతపై విస్తృతమైన వార్తా కథనాలు వెలువడుతున్న తరుణంలో ఈ డిజిటల్ సెన్సార్షిప్ అమలైనట్లు సమాచారం.పీఓకేలో ఎన్నికల ప్రక్రియ, నిరసనలపై అల్ జజీరా ‘ఎంపిక చేసిన వార్తాకథనాలు’ (సెలెక్టివ్ రిపోర్టింగ్) ప్రసారం చేస్తోందని పాకిస్థాన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణల ప్రామాణికతను ఏబీపీ న్యూస్ స్వతంత్రంగా ధృవీకరించలేదు. ముజఫరాబాద్‌లో ఓటింగ్‌కు ఎవరూ ముందుకు రాని విధంగా వాతావరణం ఉందని, గత 50 రోజులుగా కొనసాగుతున్న ఇంటర్నెట్ నిలిపివేత కారణంగా అక్కడి పరిస్థితులను నివేదించడం కష్టతరమైందని అల్ జజీరా పేర్కొంది.ముజఫరాబాద్‌లో మార్కెట్లు, బ్యాంకులు, పెట్రోలు బంకులు మూతపడ్డాయని, ప్రజా రవాణా నిలిచిపోయిందని తెలిపింది. ఆగస్టు 10 వరకు దశలవారీగా పీఓకేలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ నుంచి ఇప్పటివరకు జరిగిన హింసాత్మక ఘటనల్లో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇస్లామాబాద్, రావల్పిండి ప్రాంతాలలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు, జూన్ 2న పాకిస్థాన్ నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇచ్చిన నివేదిక ఆధారంగా, పలు యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించేందుకు ఇస్లామాబాద్ కోర్టు గతంలో ప్రయత్నించింది.ఇది కూడా చదవండి: ‘చాందీపురా’ కలకలం: 22 మంది మృతి.. 35 మందికి పాజిటివ్ -
మా వాళ్లు 30 మంది ఖతమయ్యారు.. భారత్ పనే ఇది!
పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT)కు చెందిన ఓ ఆపరేటివ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గత మూడు, నాలుగేళ్లలో తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా సభ్యులు పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో హతమైనట్లు ఆ సంస్థ ప్రతినిధి రిజ్వాన్ హనీఫ్ పేర్కొన్నాడు. అయితే ఈ హత్యల వెనుక భారత నిఘా సంస్థలు ఉన్నాయని అతడు ఆరోపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోలో రిజ్వాన్ హనీఫ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో లష్కరే తోయిబా సభ్యులు లక్ష్యంగా దాడులకు గురయ్యారని పేర్కొన్నాడు. పెషావర్, కరాచీ, రావల్పిండి, ముజఫరాబాద్, రావలకోట్ వంటి ప్రాంతాల్లో తమకు చెందిన వ్యక్తులు మరణించారని చెప్పాడు.“గత మూడు నుంచి నాలుగేళ్లలో 30 మందికి పైగా మా సభ్యులు భారత నిఘా ఏజెంట్ల చేతిలో హతమయ్యారు” అని అతడు వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ ఘటనలను అతడు “తెలియని గన్‌మెన్ మోడల్”unknown gunman modelగా అభివర్ణించాడు.Lashkar-E-Taiba's First Ever Explosive Admission 🔥🔥🔥Lashkar-e-Taiba/JKUM terrorist Rizwan Hanif openly admits that more than 30 members of the outfit were eliminated by unknown gunmen (Indian agents), across Peshawar, Karachi, Rawalpindi, Rawalakot and Muzaffarabad over the… pic.twitter.com/gXr0jIeYmH— OsintTV 📺 (@OsintTV) August 3, 2026అయితే ఈ ఆరోపణలకు సంబంధించి భారత ప్రభుత్వంగానీ, ఇటు భద్రతా సంస్థలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పాకిస్థాన్ తరచూ ఈ దాడులకు భారత్‌ను కారణంగా చూపుతుండగా.. న్యూఢిల్లీ వర్గాలు మాత్రం ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తున్నాయి.తొలిసారి.. ఒప్పుకోలులష్కరే తోయిబా అనుబంధ వ్యక్తి ఒకరు తమ సంస్థకు చెందిన ఇంతమంది సభ్యులు వరుసగా హతమైనట్లు బహిరంగంగా మాట్లాడటం ఇదే తొలిసారి అని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్‌లో పలువురు ఉగ్రవాదులు గుర్తు తెలియని వ్యక్తుల దాడుల్లో మరణించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనల వెనుక ఎవరు ఉన్నారనే దానిపై మాత్రం స్పష్టత లేదు. ఎలా పుట్టింది లష్కరే తోయిబా?లష్కరే తోయిబా పాకిస్థాన్‌లో ఏర్పాటైన ఉగ్రవాద సంస్థ. 1980ల చివర్లో హఫీజ్ మహ్మద్ సయీద్, జఫర్ ఇక్బాల్, అబ్దుల్లా అజామ్‌లు ఈ సంస్థను స్థాపించారు. తొలినాళ్లలో ఇది మర్కజ్-ఉద్-దవా-వల్-ఇర్షాద్ అనే సంస్థకు అనుబంధంగా పనిచేసింది. సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధం సమయంలో ఏర్పాటైన ఈ సంస్థ.. ఆ తర్వాత తన కార్యకలాపాలను జమ్మూ కశ్మీర్‌పై కేంద్రీకరించింది. కశ్మీర్లో సాయుధ పోరాటం పేరుతో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చిందని భారత్ ఆరోపిస్తోంది.ముంబై దాడులతో ప్రపంచ దృష్టిలోకిలష్కరే తోయిబా పేరు 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా చర్చకు వచ్చింది. ముంబైలోని తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ టెర్మినస్, నరిమన్ హౌస్ సహా పలు ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల వెనుక లష్కరే తోయిబా హస్తం ఉందని భారత్ ఆరోపించింది. అనంతరం ఐక్యరాజ్యసమితి, అమెరికా సహా పలు దేశాలు ఈ సంస్థను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చాయి.భారత్, పాశ్చాత్య దేశాలు లష్కరే తోయిబాకు పాకిస్థాన్‌లోని కొన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందని గతంలో ఆరోపించాయి. అయితే పాకిస్థాన్ ఈ ఆరోపణలను ఖండిస్తూ వచ్చింది.విద్వేష వ్యాఖ్యలపై వివాదంతాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కనిపించిన రిజ్వాన్ హనీఫ్.. గతంలోనూ ఇతర మతాలపై అభ్యంతరకర, విద్వేషపూరిత వ్యాఖ్యలు కూడా ఉన్నట్లు సమాచారం. ఉగ్రవాద సంస్థలు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తాయని భద్రతా నిపుణులు చెబుతున్నారు.అసలు ఎవరి హస్తం?లష్కరే తోయిబా సభ్యులుగా చెప్పబడుతున్న వ్యక్తుల హత్యల వెనుక ఎవరు ఉన్నారనే అంశంపై ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ లేదు. అయితే రిజ్వాన్ హనీఫ్ వ్యాఖ్యలు పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు, వాటిపై జరుగుతున్న దాడులపై మరోసారి చర్చకు తెరలేపాయి. భారత్ షరామామూలుగానే ఈ ఆరోపణలను ఖండించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. -
47 ఏళ్ల రికార్డును సమం చేసిన పాక్ బౌలర్
వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు ముందు పాకిస్తాన్ జట్టులో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తొలి టెస్ట్‌లో 8 వికెట్లతో (రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన) సత్తా చాటినప్పటికీ, రైట్ ఆర్మ్ మీడియం పేసర్ మహ్మద్ అబ్బాస్‌ను ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి తప్పించారు. ఈ ఆశ్చర్యకర పరిణామం ద్వారా అబ్బాస్ ఓ పాకిస్తాన్ రికార్డును సమం చేశాడు.ముందు మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసినా, ఆ తర్వాతి మ్యాచ్‌లో జట్టులో చోటు దక్కని రెండో పాకిస్తానీ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.47 ఏళ్ల ముందు (1979-80) భారత పర్యటనలో ఎహ్తెషాముద్దీన్ నాలుగో టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శనతో (5/47) సత్తా చాటాడు. కానీ ఆ తర్వాతి టెస్టులో అప్పటి కెప్టెన్ అసిఫ్ ఇక్బాల్ అతడిని తప్పించి ఇమ్రాన్ ఖాన్‌ను జట్టులోకి తీసుకున్నాడు. తాజాగా అబ్బాస్ కూడా ముందు టెస్టులో 5 వికెట్లు తీసినప్పటికీ, తదుపరి టెస్టులో ప్లేయింగ్ XIకి దూరమయ్యాడు.అబ్బాస్ స్థానంలో నసీమ్ షా తమ్ముడు ఉబైద్ షా జట్టులోకి వచ్చాడు. అతడికి ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (రెండో టెస్ట్‌కు వేదిక) పరిస్థితులకు సరిపోడనే కారణంతో అబ్బాస్‌ను బెంచ్‌కు పరిమితం చేసినట్లు పాక్ కెప్టెన్ బాబర్ ఆజం తెలిపాడు.అయితే అబ్బాస్‌ను తప్పించడం సరైన నిర్ణయం కాదని మ్యాచ్ తొలి రోజే తేలిపోయింది. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన ఉబైద్ 9 ఓవర్లలో 56 పరుగులిచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు. దీంతో వెస్టిండీస్ 239/5తో తొలి రోజు ఆట ముగించింది.తొలి టెస్ట్‌లో బంతితో సత్తా చాటిన జస్టిన్ గ్రీవ్స్ ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో రాణించి (64 నాటౌట్) విండీస్ జట్టును ఆదుకున్నాడు. అతడికి జతగా కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (36 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో వెస్టిండీస్ 1-0 ఆధిక్యంలో ఉంది. -
భారత అధికారికి పాక్ రేంజర్ సెల్యూట్.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: అటారీ-వాఘా సరిహద్దులో పాకిస్థాన్ రేంజర్ భారత సైనిక ఉన్నతాధికారికి సెల్యూట్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. బీటింగ్ రిట్రీట్ వేడుక సందర్భంగా ఓ పాకిస్థాన్ రేంజర్ భారత సైన్యానికి చెందిన సీనియర్ అధికారికి సెల్యూట్ చేయడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి ప్రతిగా భారతీయ అధికారి కూడా ఆ సైనిక అభివాదనాన్ని స్వీకరించారు.కెమెరాకు చిక్కిన ఈ దృశ్యం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ఇది సైనిక వృత్తిపరమైన సంప్రదాయాలకు, దుస్తుల (యూనిఫాం) గౌరవానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. సరిహద్దుల్లో జరిగే అధికారిక వేడుకలు, ఫ్లాగ్ మీటింగ్‌లు ఇతర సైనిక సదస్సుల సమయంలో ఇరు దేశాల సైన్యాలు అంతర్జాతీయ సైనిక నిబంధనలు, ప్రోటోకాల్‌ను పాటిస్తాయని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో వ్యక్తిగత లేదా రాజకీయ విభేదాలకు అతీతంగా హోదా, యూనిఫాంకు సముచిత గౌరవం ఇస్తారని తెలిపారు.ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ‘ఇది భారత్ లేదా పాకిస్థాన్‌కు సంబంధించినది కాదు, యూనిఫాం ధరించిన సైనికుల మధ్య సీనియర్ అధికారికి దక్కే గౌరవం’ అని ఒక యూజర్ రాసుకొచ్చారు. మరొకరు స్పందిస్తూ ‘ఇది కేవలం సైనిక సంప్రదాయానికి ప్రతీక’ అని పేర్కొన్నారు. మరో వ్యాఖ్యలో ‘ఇలాంటి సమయాల్లో రాజకీయం కంటే సైనిక ప్రోటోకాల్దే పైచేయి అవుతుంది’ అని రాశారు. సైనిక నిబంధనల ప్రకారం ఎదుటి అధికారి ఉన్నత హోదాలో ఉంటే సెల్యూట్ చేయడం ఆనవాయితీ అని, సీనియర్ అధికారులు దాన్ని మర్యాదపూర్వకంగా స్వీకరిస్తారని కొందరు స్పష్టం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నప్పటికీ, ఇది ఏ నాటిదనే దానిపై ఎలాంటి ధృవీకరణ లభించలేదు. దీంతో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. View this post on Instagram A post shared by Comedycrest.in™ (@comedycrest.in)ఇది కూడా చదవండి: నా కల సొంతూరికి సర్పంచ్: అభిజీత్ దీప్కే -
బాంబర్ బీభత్సం.. షాకింగ్ విజువల్స్ వైరల్!
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ మరోసారి ఉగ్రదాడితో వణికిపోయింది. శాంతి కోసం నిర్వహించిన ఓ నిరసన ర్యాలీనే లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి బాంబర్ దాడికి పాల్పడ్డాడు. స్వాత్ జిల్లాలోని కబాల్ పట్టణంలో పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఈ పేలుడులో కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. అయితే దాడి దృశ్యాలు.. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ దాడి జరిగిన సమయంలో అక్కడ ప్రజలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నారు. "మిలిటెన్సీని అంతం చేయాలి.. ప్రజలకు భద్రత కల్పించాలి" అంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఓ ఆత్మాహుతి బాంబర్ పోలీస్ స్టేషన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించి, భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో గేటు వద్దే పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు.పోలీసులే టార్గెట్.. శాంతి ర్యాలీపై పంజాస్వాత్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ప్రకారం ఈ దాడిలో పలువురు పోలీసు సిబ్బంది కూడా మృతి చెందారు. దాడి జరిగిన ప్రాంతం కిక్కిరిసి ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. పేలుడు శబ్దం వినిపించగానే ప్రజలు భయంతో పరుగులు తీశారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించేందుకు స్థానికులు సహకరించారు.ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు. అయితే ఖైబర్ పఖ్తున్ఖ్వాలో చురుకుగా ఉన్న తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP)పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అసలు ఇక్కడే ఎందుకు దాడులు?పాకిస్థాన్‌లో ఉగ్రవాద సమస్యకు అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో ఖైబర్ పఖ్తున్ఖ్వా ఒకటి. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉండటం, కొండ ప్రాంతాలు, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు కారణంగా ఈ ప్రాంతం చాలా కాలంగా ఉగ్రవాద గ్రూపులకు స్థావరంగా మారింది. గతంలో ఈ ప్రాంతం పాకిస్థాన్ తాలిబాన్ వంటి మిలిటెంట్ గ్రూపుల ప్రభావంలో ఉండేది. పాకిస్థాన్ సైన్యం చేపట్టిన ఆపరేషన్లతో కొంతకాలం దాడులు తగ్గినా.. ఇటీవలి సంవత్సరాల్లో మళ్లీ ఉగ్ర కార్యకలాపాలు పెరుగుతున్నాయి.TTP మళ్లీ పుంజుకుంటోందా?తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) లక్ష్యం పాకిస్థాన్‌లో తమకు అనుకూలమైన కఠిన ఇస్లామిక్ పాలన ఏర్పాటు చేయడం. ఈ సంస్థ భద్రతా బలగాలు, ప్రభుత్వ సంస్థలు, తమకు వ్యతిరేకంగా మాట్లాడే పౌరులను లక్ష్యంగా చేసుకుంటుంది. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్‌లోని కొన్ని మిలిటెంట్ గ్రూపులకు ధైర్యం పెరిగిందని భద్రతా నిపుణులు చెబుతున్నారు. అయితే ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం తమ భూభాగం నుంచి పాకిస్థాన్‌పై దాడులు జరగడం లేదని చెబుతోంది.శాంతి కోరుతున్న ప్రజలే ఎందుకు బలవుతున్నారు?ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని సాధారణ ప్రజలు ఏళ్లుగా ఉగ్రవాదం, సైనిక చర్యల మధ్య నలిగిపోతున్నారు. ఒకప్పుడు పర్యాటక ప్రాంతంగా పేరున్న స్వాత్ లోయ కూడా ఉగ్రవాద ప్రభావాన్ని ఎదుర్కొంది. ఇప్పుడు అక్కడి ప్రజలు మళ్లీ అలాంటి పరిస్థితులు రావద్దని కోరుతున్నారు. అయితే శాంతి కోసం గొంతెత్తుతున్న వారినే లక్ష్యంగా చేసుకోవడం ఉగ్రవాదుల వ్యూహంలో భాగమని నిపుణులు అంటున్నారు. ప్రజల్లో భయాన్ని పెంచడం, ప్రభుత్వంపై నమ్మకాన్ని దెబ్బతీయడం, భద్రతా వ్యవస్థను సవాలు చేయడమే ఇలాంటి దాడుల ప్రధాన ఉద్దేశమని విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: ఎవడ్రా సామి నువ్వు.. పాక్‌ను ఇంతలా వణికిస్తున్నావ్?పాక్‌కు పెరుగుతున్న భద్రతా సవాల్ఒకవైపు సరిహద్దు ఉద్రిక్తతలు, మరోవైపు అంతర్గత ఉగ్రవాదం పాకిస్థాన్‌కు పెద్ద సవాల్‌గా మారాయి. కేవలం సైనిక చర్యలతోనే ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేయడం సాధ్యం కాదని.. స్థానిక ప్రజల విశ్వాసం, అభివృద్ధి, సరిహద్దు నియంత్రణ వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.శాంతి కోసం జరిగిన ర్యాలీపై జరిగిన ఈ దాడి.. ఖైబర్ పఖ్తున్ఖ్వాలో ఉగ్రవాద సమస్య ఇంకా ఎంత తీవ్రంగా ఉందో మరోసారి బయటపెట్టింది. ప్రజలు భయంతో జీవించే పరిస్థితికి ముగింపు పలకడం పాకిస్థాన్ ముందున్న అతిపెద్ద సవాల్‌గా మారింది.BREAKING: A suicide blast struck Kabal Police Station in Swat district, Khyber Pakhtunkhwa, Pakistan, during a nearby peace rally. Reports indicate at least 16 people, including 10 police officers, were killed, with many others injured.#BreakingNews #Pakistan #Swat…— WorldNewsRank (@WNewsRankX) August 3, 2026 -
నాడు సన్మానాలు, సత్కారాలు.. తర్వాత తొక్కిపడేశారు!
ఒలింపిక్స్‌లో పాకిస్తాన్‌కు మొట్టమొదటి వ్యక్తిగత స్వర్ణ పతకం అందించిన అథ్లెట్ అర్షద్ నదీమ్. పారిస్ ఒలింపిక్స్-2024లో అనూహ్య రీతిలో ఈ జావెలిన్ త్రోయర్ ఈటెను 92.97 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. తద్వారా విశ్వక్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన జావెలిన్ త్రోయర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు.ఈ క్రమంలో పాకిస్తాన్లో అర్షద్ నదీమ్‌పై ప్రశంసల వర్షం కురిసింది. అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అతడు సన్మానాలు, సత్కారాలతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. అతడి ప్రదర్శన రోజురోజుకీ దిగజారిపోయింది.చేదు అనుభవంతాజాగా కామన్వెల్త్ గేమ్స్-2026లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అర్షద్ నదీమ్.. కనీసం కాంస్యం కూడా గెలవలేకపోయాడు. తొలి ప్రయత్నంలోనే ఫౌల్ కావడంతో అతడికి ఫైనల్ రౌండ్లో చేదు అనుభవం ఎదురైంది. టాప్-8కు చేరలేక అతడు ఎలిమినేట్ అయ్యాడు. గత ఎడిషన్‌లో పసిడితో మెరిసిన అతడు ఈసారి కనీసం కాంస్యం కూడా లేకుండానే వెనుదిరిగాడు.చెప్పినట్లు వినలేదని...అయితే, ఇందుకు పాకిస్తాన్ అమెచూర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ (PAAF)తో అతడికి ఉన్న విభేదాలే కారణం అని తెలుస్తోంది. PAAF అభీష్టానికి వ్యతిరేకంగా అర్షద్.. సల్మాన్ బట్‌ను తన కోచ్‌గా ఎంచుకున్నట్లు సమాచారం. నిజానికి సల్మాన్‌పై PAAF 2025 అక్టోబరులో జీవితకాల నిషేధం విధించింది. ఆ తర్వాత నెల రోజుల వ్యవధిలోనే నిషేధం ఎత్తివేసింది.దీంతో అర్షద్ సల్మాన్ మార్గదర్శనంలో ప్రాక్టీస్ చేశాడు. అయితే, ఇందుకు PAAF ఏమాత్రం సహకరించలేదని సమాచారం. పాకిస్తాన్ క్రీడా బోర్డు సైతం అర్షద్ నదీమ్ సన్నాహకాలకు కావాల్సిన నిధులు విడుదల చేయలేదని అతడి సన్నిహిత వర్గాలు గతంలో స్థానిక మీడియాకు తెలిపాయి.ఈ నేపథ్యంలో విదేశాల్లో ప్రాక్టీస్ చేయడం వీలుకాక.. లాహోర్‌లో ఎర్రటి ఎండల్లో అర్షద్ ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం. కామన్వెల్త్ క్రీడల వేదికైన గ్లాస్గో (స్కాట్లాండ్)లో ఇందుకు పూర్తి వ్యతిరేకమైన వాతావరణం ఉండటం అతడి ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.అతడికి ఎంతటి దుస్థితిఈ పరిణామాల నేపథ్యంలో అర్షద్ నదీమ్ ఈసారిక పతకం లేకుండానే వెనుదిరిగినట్లు అతడి సన్నిహితవర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, పాక్ మాజీ బాక్సర్ హుసేన్ షా ఈ విషయం గురించి మాట్లాడుతూ..‘‘సరైన ఆదాయం లేని.. నిరుపేద కుటుంబం, చిన్న గ్రామం నుంచి వచ్చి దేశాన్ని తలెత్తుకునేలా చేసిన అథ్లెట్ అతడు. ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్‌లో దేశానికి పసిడి పతకాలు అందించాడు. కానీ ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ కోసం సన్నద్ధమయ్యే వాతావరణం కూడా మా క్రీడా సంస్థ కల్పించలేకపోయింది.పాక్ క్రీడా వ్యవస్థలోని లోపానికి ఇది నిలువెత్తు నిదర్శనం’’ అని హుసేన్ షా మండిపడ్డాడు. కాగా అంతకుముందు సల్మాన్‌తో పాటు సౌతాఫ్రికా కోచ్ టెర్సస్ లీబెన్బెర్గ్తో అర్షద్ ప్రాక్టీస్ చేసి అత్యుత్తమ ఫలితాలు అందుకున్నాడు.సరైన సదుపాయాలు ఉంటే స్వర్ణం గెలిచేదాన్నిమరోవైపు.. పాకిస్తాన్‌కు ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో ఏకైక పతకం అందించిన బాక్సర్ ఫాతిమా జెహ్రా సైతం పాక్ క్రీడా బోర్డు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తనకు సరైన సదుపాయాలు కల్పించి ఉంటే కచ్చితంగా మెరుగైన పతకం అందించేదానినని పేర్కొంది. కాగా ఫాతిమా కాంస్య పతకం గెలిచింది. ఇక పాకిస్తాన్ నుంచి ఈసారి మొత్తంగా 36 మంది సభ్యుల బృందం గ్లాస్గోకు వెళ్లగా.. కేవలం ఒకే ఒక్క పతకం దక్కింది.చదవండి: గిల్, అభిషేక్ శర్మ కీలక నిర్ణయం -
పాక్‌లో భీకర ఆత్మాహుతి దాడి
పెషావర్: పాకిస్తాన్‌లోని కల్లోలిత ఖైబర్ ప్రావిన్స్‌లో ఆదివారం భీకర ఆత్మాహుతి దాడి జరిగింది. స్వాత్ జిల్లాలోని కబాల్ పట్టణంలో చేపట్టిన శాంతి ర్యాలీ సమయంలో ఘటన చోటుచేసుకుంది. ర్యాలీ పోలీస్‌స్టేషన్ సమీపానికి రాగానే ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. పేలుడు తీవ్రతకు ఐదుగురు పోలీసులు, ఒక చిన్నారి సహా 14 మంది చనిపోయారు. గాయాలపాలైన మరో 15 మందిని ఆస్పత్రులకు తరలించారు. ఈ దాడికి తమదే బాధ్యతంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. స్థానిక గిరిజన కౌన్సిల్ స్వాత్ అమన్ జిర్గా సారథ్యంలోని జరిగిన ఈ ర్యాలీలో పాల్గొన్న వారు శాంతి నెలకొనాలంటూ ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. కాగా, కబాల్ పోలీస్ స్టేషన్లోకి చొరబడేందుకు యత్నించిన దుండగుడిని ప్రధాన గేట్ వద్ద పోలీసులు అడ్డుకోగా, అతడు అక్కడికక్కడే పేల్చేసుకున్నాడని అధికారులు తెలిపారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో పెనుముప్పు తప్పిందన్నారు. -
పాక్‌ను మరోసారి చిత్తు చేసిన శ్రీలంక.. మరో సిరీస్ కైవసం
శ్రీలంక పర్యటనలో పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టుకు వరుస పరాభవాలు ఎదురవుతున్నాయి. తొలుత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కోల్పోయిన (1-2తో) ఈ జట్టు.. తాజాగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2 తేడాతో కోల్పోయింది.డంబుల్లా వేదికగా ఇవాళ జరిగిన రెండో టీ20లో ఆతిథ్య జట్టు పాక్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. శ్రీలంక మరో 14 బంతులు (17.4 ఓవర్లు) మిగిలుండగానే కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ చమారీ ఆటపట్టు (40), సంజనా కవిండి (46) మెరుపు ఇన్నింగ్స్ ఆడి లంక విజయంలో కీలకపాత్ర పోషించారు. విష్మి గుణరత్నే (31), హర్షిత సమరవిక్రమ (37 నాటౌట్) కూడా ఉపయోగకరమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆఖర్లో కవిష దిల్హరి (14 నాటౌట్) కూడా బ్యాట్ ఝులిపించింది. పాక్ బౌలర్లలో హనీ 2, వహీదా, అయేషా జాఫర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు పాక్ తరఫున ఓపెనర్లు మునీబా అలీ (45), షావాల్ జుల్ఫికర్ (48) రాణించారు. ఆఖర్లో ఫాతిమా (30 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. మిగతా ప్లేయర్లలో ఎమాన్ నసీర్ 21, అయేషా జాఫర్ 8, సైరా జబీన్ 16, హనీ 2 (నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లలో ప్రబోధ 2, సుగంధక కుమారి, చమారీ ఆటపట్టు, కవిష దిల్హరి తలో వికెట్ తీశారు. ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో టీ20 ఆగస్ట్ 4న జరుగనుంది. -
మేరీ కోమ్ స్ఫూర్తి.. కామన్వెల్త్లో పాకిస్తాన్‌కు తొలి పతకం
భారత దిగ్గజ మహిళా బాక్సర్ మేరీ కోమ్ ఘనత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మేరీ కోమ్ ఇచ్చిన స్ఫూర్తి భారత్‌లో ఎంతోమంది మహిళా బాక్సర్లను పుట్టేలా చేసింది. అయితే తాజాగా ఆమె ఇచ్చిన స్ఫూర్తి దేశ సరిహద్దులను కూడా దాటి పాకిస్తాన్‌ను కూడా తాకింది. విషయంలోకి వెళితే పాకిస్తాన్ బాక్సర్ అయిన 22 ఏళ్ల ఫాతిమా జహ్రా కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 60 కేజీల విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది.తద్వారా కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించిన తొలి పాకిస్తాన్ బాక్సర్‌గా ఫాతిమా నిలిచింది. అంతేకాదు ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో ఫాతిమా సాధించిన పతకమే వారికి మొదటిది కావడం గమనార్హం. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న సర్ఘోడాలో పెరిగిన ఫాతిమా భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్‌ను ఆదర్శంగా తీసుకుంది. మేరీ కోమ్ జీవితం ఆధారంగా 2014లో బాలీవుడ్లో తెరకెక్కిన బయోపిక్ అప్పటికి 10 ఏళ్ల వయసు ఉన్న ఫాతిమాపై చెరగని ముద్ర వేసింది. ఆ సినిమాలో మేరీ కోమ్ జీవితంలో ఎన్నో కష్టాలను దాటుకొని దిగ్గజ బాక్సర్‌గా పేరు పొందడం ఫాతిమాను బాగా ఆకట్టుకుంది. ఆ క్షణంలోనే తాను కూడా బాక్సర్ కావాలని కలలు కన్నది. అయితే ఫాతిమా బాక్సర్ అయ్యే క్రమంలో సొంత దేశంలో ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొంది. ఫాతిమా కుటుంబం బాక్సింగ్‌కు వ్యతిరేకంగా ఉండేది. ఆమెను శిక్షణకు వెళ్లనిచ్చేవారు కాదు. కానీ సంవత్సరాల తరబడి ఫాతిమా చేసిన పోరాటం ఆమెపై వ్యతిరేకతను పోగొట్టి మద్దతు పెరిగింది. అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇవాళ వాళ్ల దేశానికి కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం తీసుకొచ్చి అందరి చేత శెభాష్ అనిపించుకుంది. కాగా పతకం సాధించిన అనంతరం ఫాతిమా మాట్లాడుతూ.. భారతదేశానికి చెందిన మేరీ కోమ్ నాకు స్ఫూర్తి. ఆమె జీవితంపై తీసిన సినిమాను నేను అప్పట్లో ప్రతీరోజు చూసేదాన్ని. నేను బాక్సింగ్ మొదలుపెట్టినప్పుడు ఆ సినిమా చూస్తూ శిక్షణ తీసుకునేదాన్ని. ఆమె అంటే నాకు చాలా గౌరవం. దేవుడి దయవల్ల ఇవాళ ఆమె లాగే మా దేశానికి ఒక పతకం తీసుకొచ్చాను. ఏదో ఒకరోజు ఆమెలానే మా దేశానికి నేను కూడా పేరు ప్రఖ్యతలు తీసుకొస్తానని ఆశిస్తున్నా* అని తెలిపింది.ఇక మేరీకోమ్ ఘనతల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమెచ్యూర్ బాక్సింగ్‌లో ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్ దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాప్తి చేసింది. మేరీకోమ్ తన కెరీర్లో ఆరు ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిళ్లు, ఒలింపిక్స్‌లో కాంస్య పతకం, ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాలు, ఐదు ఆసియా ఛాంపియన్షిప్లను గెలిచి అత్యున్నత శిఖరాన్ని అందుకుంది. More history has been made at the 2026 Commonwealth Games as Fatima Zahra becomes the first women from Pakistan to medal in boxing. 🇵🇰Zahra lost in the semi finals against Marie-Bathoul Al-Ahmadieh, who will go on to face Priya Priya of India in the final. #TimeForWorldBoxing pic.twitter.com/SpSuDpBhVB— World Boxing (@RealWorldBoxing) July 31, 2026చదవండి: సెంట్రల్ జోన్ కెప్టెన్‌గా పటీదార్.. అందరి కళ్లు అతడిపైనే! -
‘ధురంధర్’ ల్యారీ మళ్లీ వార్తల్లో! ఈసారి..
సినిమాల్లో చూపించిన చీకటి ప్రపంచం.. నిజ జీవితంలోనూ అంతే భయానకంగా ఉంటుందా? పాకిస్థాన్‌లోని కరాచీ గ్యాంగ్‌వార్ ప్లేస్ ‘ల్యారీ’ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ‘ధురంధర్’లో చూపించిన ఈ ప్రాంతంలో గ్యాంగ్ కల్చర్, అండర్‌వల్డ్ ఆధిపత్య పోరు వాస్తవమనే విషయం మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ఒకప్పుడు ల్యారీని తన గుప్పిట్లో ఉంచుకున్న గ్యాంగ్‌స్టర్ ఉజైర్ బలోచ్ సోదరుడు జుబైర్ బలోచ్‌పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.కరాచీలోని ల్యారీ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట కూర్చుని ఉన్న జుబైర్ బలోచ్‌పై బైక్‌పై వచ్చిన సాయుధులు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ దాడిలో అతడికి ఛాతీ, పొత్తికడుపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు సాధారణ పౌరులు కూడా గాయపడ్డారు. పోలీసుల ప్రకారం.. చాకీవారా రోడ్డులోని సింగూ లేన్ ప్రాంతంలో జుబైర్‌పై దాడి జరిగింది. అతడిని వెంటనే కరాచీ సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఏంటన్నది కూడా తెలియాల్సి ఉంది. ఈ దాడి వెనుక ఉంది ఎవరు? అనేదానిపై ఇప్పటికీ ఓ స్పష్టత రాలేదు. గ్యాంగ్ వార్, వ్యక్తిగత కక్షలు, పాత నేర సంబంధాలు.. ఇలా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని అక్కడి అధికారులు ప్రకటించారు. ల్యారీ అంటేనే గ్యాంగ్‌ల గడ్డకరాచీ నగరంలోని ల్యారీ ప్రాంతానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఒకప్పుడు రాజకీయ ప్రభావం, గ్యాంగ్‌ల ఆధిపత్యం, ఆయుధ సంస్కృతికి ఈ ప్రాంతం కేంద్రంగా ఉండేది. చిన్న వీధుల్లో పెరిగిన గ్యాంగ్‌లు క్రమంగా భారీ నెట్‌వర్క్‌లుగా మారి.. ప్రాంతీయ రాజకీయాలు, స్థానిక వ్యాపారాలపై ప్రభావం చూపిన సందర్భాలు ఉన్నాయి. ఇదే నేపథ్యంతో.. నిజజీవిత ఘటనల స్ఫూర్తితో మాంచి మసాలా స్పై డ్రామాగా ‘ధురంధర్’ సినిమాను మలిచాడు దర్శకుడు ఆదిత్య ధార్.ఎవరీ ఉజైర్ బలోచ్?ఇప్పుడు కాల్పులకు గురైన జుబైర్ బలోచ్.. ఉజైర్ బలోచ్ సొంత తమ్ముడు. ఉజైర్ బెలూచ్ కరాచీలోని ల్యారీ ప్రాంతంలో రెహమాన్ డకాయిట్ వారసుడిగా ఎదిగాడు. రెహమాన్ మరణం తర్వాత అతడి కజిన్ అయిన ఉజైర్ చేతికి ల్యారీ గ్యాంగ్ పగ్గాలు వెళ్లాయి. అయితే సినిమాలో సొంత సోదర బంధంగా చూపించారు. ఆ తర్వాత.. కరాచీ అండర్వల్డ్లో ఉజైర్ పేరు మరింత ప్రభావవంతంగా మారింది. అతడిపై హత్యలు, పోలీసులపై దాడులు, ఆయుధ కేసులు సహా అనేక ఆరోపణలు ఉన్నాయి. 2012లో భద్రతా బలగాలతో జరిగిన ఘర్షణలకు సంబంధించిన కేసుల్లోనూ అతడి పేరు వచ్చింది. ఆఖరికి 2020లో పాకిస్థాన్ సైనిక న్యాయస్థానం గూఢచర్యం కేసులో అతడిని దోషిగా తేల్చి 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది(సినిమాలో రణ్వీర్ హమ్జా పాత్ర ఉజైర్ను పక్కా స్కెచ్‌తో ఇరికించినట్లు చూపించాడు). వాస్తవంగా.. ఇప్పటికీ అతడిపై పలు కేసులు కొనసాగుతున్నాయి.ఒకప్పుడు తుపాకుల మోత, గ్యాంగ్‌ల ఆధిపత్యానికి పేరున్న ల్యారీ.. ఇప్పుడు మరోసారి వార్తల్లోకి రావడంతో కరాచీ భద్రతపై చర్చ మొదలైంది. ఉజైర్ బలోచ్ కుటుంబంపై జరిగిన ఈ దాడి వెనుక అసలు కథ ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.పాక్‌లో వాళ్ల అంతం.. ఎప్పుడూ మిస్టరీనే?పాకిస్థాన్‌లో గ్యాంగ్స్టర్లు, అండర్‌వల్డ్ డాన్లు, ఉగ్ర సంబంధం ఉన్న నేతల జీవితాలు తరచూ అనూహ్య మలుపులు తిరుగుతుంటాయి. ఆధిపత్య పోరులు, రాజకీయ విభేదాలు, ప్రత్యర్థి వర్గాల దాడులు.. ఇలా పలువురు కీలక వ్యక్తులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. ఆ సమయాల్లో భారత్‌పైనా పాక్ ఆరోపణలు గుప్పించిన సందర్భాలు లేకపోలేదు. అయితే కొన్ని ఘటనల్లో దాడి వెనుక అసలు కారణాలు, కుట్రదారులు ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. -
పాక్ హోంమంత్రి హెచ్చరిక.. మునీర్‌కు ముప్పు సంకేతమా?
పాకిస్తాన్లో పెరుగుతున్న అసంతృప్తి, యువతలో ఆగ్రహం, కుప్పకూలుతున్న పాలనా వ్యవస్థపై ఆ దేశ హోంమంత్రి మొహ్సిన్ నక్వీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. సాధారణంగా ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంటాయి. కానీ ఇక్కడ ఏకంగా అంతర్గత వ్యవహారాల మంత్రే.. నిరాశకు గురైన యువత ఒక్కటైతే దేశాన్ని మార్చగల శక్తి వారికి ఉందని హెచ్చరించడం ఆసక్తికర పరిణామంగా మారింది.ఇస్లామాబాద్‌లో జరిగిన పాకిస్తాన్ ఎకనామిక్ సమ్మిట్‌లో పాల్గొన్న మొహ్సిన్ నక్వీ, దేశంలోని పాలనా వ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న విధానాలతో సమస్యలకు పరిష్కారం లభించదని, పరిపాలనా వ్యవస్థలో మూలస్థాయి మార్పులు అవసరమని అన్నారు. ‘ఇప్పుడు మనం జీవిస్తున్న వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఈ విధానంతో సమస్యలను పరిష్కరించలేం. నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టకపోతే పదేళ్ల తర్వాత కూడా ఇవే సమస్యలపై చర్చించాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించారు.బొద్దింకలైనా సరే.. ఏకమైతే శక్తే!దేశ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించిన నక్వీ.. వారికి ఆర్థిక సాయం కంటే ఉద్యోగాలు, ప్రతిభకు గుర్తింపు, న్యాయం ముఖ్యమని అన్నారు. ‘ప్రజలకు కావాల్సింది న్యాయం, ప్రతిభకు విలువ, ఉద్యోగ అవకాశాలు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చేసిన ఓ వ్యాఖ్య మాత్రం సంచలనంగా మారింది. ‘ఆ యువకుడిని యువత అనండి... బొద్దింక అనండి... ఇంకేదైనా అనండి. కానీ ఆ బొద్దింకలన్నీ ఒక్కటైతే అన్నింటినీ తలకిందులు చేయగలవు’ అని అన్నారు. నక్వీ నేరుగా ఏ నిరసనను ప్రస్తావించకపోయినా, ఇటీవల భారత్‌లో జరిగిన సీజేఐ (CJP) ఉద్యమం, దాని రాజకీయ ప్రభావాల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాకిస్తాన్‌లోనూ యువతలో పెరుగుతున్న నిరాశ, నిరుద్యోగం, అవకాశాల కొరత ఒక పెద్ద ఉద్యమానికి దారితీయవచ్చన్న ఆందోళన ఈ వ్యాఖ్యల్లో కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదే సమయంలో పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆసిమ్ మునీర్ పాత్రపై కూడా నక్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. మునీర్ చేస్తున్న ప్రయత్నాలు ఒక్కటే దేశ సమస్యలను పరిష్కరించలేవని, రాజకీయ నాయకులు కలిసి పాలనా వ్యవస్థను మార్చకపోతే శాశ్వత ఫలితాలు రావని అన్నారు. ‘రాజకీయ నాయకులు దేశ వ్యవస్థను సరిచేయకపోతే ఫీల్డ్ మార్షల్ చేస్తున్న కృషికి ప్రయోజనం ఉండదు’ అని స్పష్టం చేశారు. మునీర్ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీయనని పలుమార్లు చెప్పారని గుర్తుచేసిన నక్వీ, అన్ని రాజకీయ పార్టీలు కలిసి దేశ పరిపాలనను మెరుగుపర్చేందుకు పనిచేయాలని సూచించారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ రోజుకు 12 నుంచి 14 గంటలు పనిచేస్తున్నప్పటికీ, వ్యవస్థలో మార్పులు లేకపోతే అది కేవలం సమస్యలపై తాత్కాలిక చర్యలకే పరిమితమవుతుందని అభిప్రాయపడ్డారు.భారీ అప్పులు, బలహీన పాలన, నెమ్మదించిన అధికార యంత్రాంగం, నిరుద్యోగం, ప్రతిభ ఆధారిత అవకాశాల కొరత వంటి సమస్యలు పాకిస్తాన్‌ను వెంటాడుతున్నాయని నక్వీ పేర్కొన్నారు. వీటికి తాత్కాలిక పరిష్కారాలు కాకుండా వ్యవస్థాగత సంస్కరణలే అవసరమని అన్నారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఆర్థిక కష్టాలు, రాజకీయ విభేదాల మధ్య దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రజల అసంతృప్తి ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో పాలక వర్గాల్లోనే చర్చకు వస్తుండటం పాకిస్తాన్ భవిష్యత్ రాజకీయాలపై ఆసక్తిని పెంచుతోంది. -
బ్రాడ్‌పీక్‌పై హిమపాతం
ఇస్లామాబాద్/కఠ్మాండు: పాకిస్తాన్‌లోని బ్రాడ్ పీక్‌పై సంభవించిన హిమపాతంతో పదిమందితో కూడిన పర్వతారోహకుల బృందం గల్లంతైంది. కారకోరమ్ పర్వతశ్రేణిలోని 8,051 మీ టర్ల ఎత్తయిన బ్రాడ్‌పీక్‌ను బ్రిటిష్ స్పెషల్ ఫో ర్సెస్ మాజీ సభ్యుడు, నేపాలీ ప్రఖ్యాత పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా(43) సారథ్యంలోని 10 మంది పర్వతారోహకుల బృందం అధిరోహించేందుకు ప్రయతి్నంచింది. ఈ క్రమంలో గురువారం ఉదయం 9 గంటల సమయంలో బ్రాడ్ పీక్‌పై 7 వేల మీటర్ల ఎత్తులో ఉండగా సంభవించిన హిమపాతంలో చిక్కుకుని ఈ బృందంలోని వారంతా గల్లంతయ్యారు. ఇందులో ఆరుగురు నేపాలీలు కాగా, పాక్, ఒమన్, అమెరికా, చైనాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం వరకు నలుగురు మృతదేహాలను వెలికి తీశామని ఆలై్పన్ క్లబ్ ఆఫ్ పాకిస్తాన్ (ఏసీపీ) ప్రెసిడెంట్ మేజర్ జనరల్ ఇర్ఫాన్ అర్షద్ తెలిపారు. ఈ నలుగురిలో ఒకరు నేపాల్ వాసి గురుంగ్ కాగా, మరొకరు ఒమన్ దేశస్తురాలు నదీరా అహ్మద్ అని చెప్పారు. మిగతా ఇద్దరినీ గుర్తించాల్సి ఉందన్నారు. అన్వేషణలో రెండు పాక్ మిలటరీ హెలికాప్టర్లు పాల్గొంటున్నాయని, అయితే వాతావరణం పూర్తిగా ప్రతికూలంగా ఉందని పేర్కొన్నారు. కాగా, ట్రాకింగ్ డేటా ప్రకారం పూర్ణా ఇంకా కదులుతూ ఉండవచ్చని పూర్జా వ్యాపార భాగస్వామి అయిన మింగ్మా డేవిడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రాడ్ పీక్‌పై హిమపాతం సంభవించినప్పటి నుంచి పూర్జా ట్రాకింగ్ పరికరం లొకేషన్ మారుతూనే ఉందన్నారు. చైనా సరిహద్దుకు సమీపంలో గిల్గిట్–బాల్టిస్తాన్ ప్రాంతంలో ఉన్న బ్రాడ్ పీక్ అధిరోహకులకు అత్యంత సవాళ్లతో కూడిన పర్వతాల్లో ఒకటి. ఎవరీ నిర్మల్ పూర్జా? పూర్జా ప్రపంచంలోని ప్రసిద్ధ పర్వతారోహకుల్లో ఒకరు. 2019లో కేవలం 6 నెలల వ్యవధిలోనే 8వేల మీటర్లకు మించి ఎత్తున్న 14 శిఖరాలను అధిరోహించి వెలుగులోకి వచ్చారు. పూర్జాకంటే ముందు ఈ రికార్డును దక్షిణ కొరియాకు చెందిన కిమ్ చాంగ్–హో నెలకొల్పారు. అయితే, ఆయన ఈ ఘనతను సాధించడానికి ఏడేళ్లు పట్టింది. పూర్జా సాధించిన ఘనతను ‘14 పీక్స్: నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్’పేరుతో నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చేశారు. పూర్జా 9 మంది నేపాలీ పర్వతారోహకులతో కలిసి ప్రపంచంలో రెండో అత్యంత ఎత్తైన కే2 పర్వతాన్ని శీతాకాలంలో అధిరోహించి రికార్డు సృష్టించారు. అంతకుముందు పూర్జా బ్రిటిష్ సైన్యంలో 16 ఏళ్లు సేవలందించారు. 2018లో మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ పురస్కారం అందుకున్నారు. -
భారత్‌తో పోలుస్తావా?.. పాక్‌లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖానుమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆందోళనల విషయంలో భారత ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ.. ఆ దేశ అధికార వ్యవస్థపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘మోదీ సర్కార్‌ను చూసి నేర్చుకోండి’’ అంటూ పాకిస్థాన్ పాలకులకు హితవు పలికారు. ప్రజల గొంతును అణచివేయడం కాకుండా.. వారి సమస్యలను వినే సంస్కృతి అలవర్చుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పాకిస్థాన్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.పాకిస్థాన్‌లో ఇటీవల విద్యార్థులు, రాజకీయ కార్యకర్తలు చేపట్టిన నిరసనలపై భద్రతా బలగాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో భారత్‌లో విద్యార్థుల నిరసనలకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో సంస్కరణలు, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు వంటి నిర్ణయాలు తీసుకుందని అలీమా ఖానుమ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆవేదనను వినడం ప్రభుత్వ బాధ్యత అని, ఆ విషయంలో భారత్‌ను చూసి పాకిస్థాన్ ప్రభుత్వం నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు.‘‘భారత్‌లో విద్యార్థులు రోడ్డెక్కితే ప్రభుత్వం స్పందిస్తుంది. కానీ పాకిస్థాన్‌లో ప్రజలు ప్రశ్నిస్తే అరెస్టులు, కేసులు, బెదిరింపులే ఎదురవుతున్నాయి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల గొంతును అణచివేయడం కాదు’’ అంటూ ఆమె మండిపడ్డారు. అధికార యంత్రాంగం ప్రజల హక్కులను గౌరవించకుండా వ్యవహరిస్తోందని, ఇది దేశ భవిష్యత్తుకు మంచిది కాదని అలీమా హెచ్చరించారు.అలీమా ఖానుమ్ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే పాకిస్థాన్ రాజకీయ వర్గాల్లో తీవ్ర స్పందన వ్యక్తమైంది. అధికార పక్షానికి చెందిన నేతలు ఆమె వ్యాఖ్యలను తప్పుబడగా, పాకిస్థాన్‌ను భారత్‌తో పోల్చడం సరికాదని పేర్కొన్నారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ నేతలు మాత్రం ఆమె వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే విమర్శలను అంగీకరించే సంస్కృతి అవసరమని వారు అభిప్రాయపడ్డారు.ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉండగా, ఆయన కుటుంబ సభ్యులు తరచూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. దేశంలో రాజకీయ ప్రత్యర్థులను అణచివేస్తున్నారని, న్యాయవ్యవస్థపై కూడా ఒత్తిళ్లు పెరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలీమా ఖానుమ్ చేసిన "మోదీ సర్కార్‌ను చూసి నేర్చుకోండి" వ్యాఖ్యలు భారత్-పాకిస్థాన్ పోలికలకే కాకుండా, పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్య పరిస్థితులపై కూడా మరోసారి చర్చను రేకెత్తించాయి.ప్రస్తుతం ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశమైంది. కొందరు అలీమా ఖానుమ్ వ్యాఖ్యలను సమర్థిస్తుండగా, మరికొందరు భారత్‌ను ఉదాహరణగా చూపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనా, ఆమె చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ రాజకీయాల్లో మరో కొత్త దుమారానికి తెరలేపాయి.నీట్ యూజీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలు, గ్రేస్ మార్కుల వివాదంపై విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ సహా పలు ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించి.. పరీక్ష రద్దు చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివాదం తీవ్రం కావడంతో కేంద్రం విచారణలు, సంస్కరణలపై చర్యలు చేపట్టింది. విద్యార్థుల ఆందోళనలు కొనసాగిన నేపథ్యంలో ప్రభుత్వం–నిరసనకారుల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో విద్యార్థులు తమ నిరసనలను విరమించినట్లు ప్రకటించారు. -
వాళ్లంతా భారత్‌లాగే మాకు శత్రువులు
ఇస్లామాబాద్: మెరుగైన జీవనం, పాలన, అవకాశాలు కోరుతూ ఉద్యమిస్తున్న పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని ఉద్యమకారులపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ఇస్లామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పాక్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వాళ్లంతా భారత్‌లాగే మాకు బద్ద శత్రువులు. ఉద్యమకారులతో చర్చలకు కూర్చునే ప్రసక్తే లేదు.వాళ్లంతా పాకిస్తాన్‌కు విరోధులే’’అని అన్నారు. గత రెండ్రోజుల్లో పాక్ భద్రతా బలగాలు ఏకంగా 37 మంది ఉద్యమకారులను పొట్టనబెట్టుకున్నాయని ఉద్యమసంఘాల కూటమి ‘జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ(జేఏఏసీ)’బుధవారం ప్రకటించిన వేళ ఆసిఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఓవైపు జేఏఏసీ బృందం తమతో చర్చలు జరిపిందని, 38 డిమాండ్లను తమ ఎదుట ఉంచిందని ప్రధానమంత్రి సలహాదారు రాణా సనావుల్లా ప్రకటించగా అందుకు భిన్నంగా రక్షణమంత్రి మాట్లాడటం గమనార్హం. పీఓకే శాసనసభ తొలి దశ ఎన్నికలు జరిగిన సోమవారం రోజు రావలకోట్ నుంచి ముజఫరాబాద్‌కు శాంతియుత ర్యాలీ చేస్తున్న తమపై పోలీసులు కాల్పులు జరిపి చిన్నారులు, మహిళలు సహా 37 మందిని చంపేశారని జేఏఏసీ తెలిపింది. ‘‘ఉద్రిక్తతకు దారి తీసిన ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదు. గతంలో ప్రభుత్వం నుంచి సాయుధ శిక్షణ పొందిన పీఓకే వాసులు ఇప్పుడు ప్రభుత్వం మీదకు తుపాకీ గురిపెట్టారు’’అని ప్రధానమంత్రి సలహాదారు రాణా సనావుల్లా వ్యాఖ్యానించారు. -
ఓవరాక్షన్ చేసిన పాక్ ఆటగాళ్లకు శిక్ష
వెస్టిండీస్‌తో తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్లు ఖుర్రమ్ షెహ్జాద్, మహ్మద్ అబ్బాస్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.ఇద్దరూ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు (వికెట్లు తీసిన అనంతరం ప్రత్యర్థి బ్యాటర్లను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు) తేలడంతో తలో డీమెరిట్ పాయింట్ కేటాయించింది. అలాగే అబ్బాస్‌కు అధికారిక హెచ్చరికతో పాటు ఖుర్రమ్ షెహ్జాద్కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించింది. మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో ప్రతిపాదించిన శిక్షను ఇద్దరూ అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండా పోయింది.ఈ మ్యాచ్‌లో అబ్బాస్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. షెహ్జాద్ కూడా రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండేసి వికెట్లు తీశాడు. వీరిద్దరూ అద్భుతంగా రాణించినా పాక్‌కు ఓటమి తప్పలేదు. 211 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 120 పరుగులకే కుప్పకూలి 90 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రెండో టెస్ట్ ఆగస్టు 2 నుంచి క్వీన్స్ పార్క్‌లో జరగనుంది. -
పీవోకేలో మంటలు: పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో కొనసాగుతున్న ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులపై భద్రతా బలగాల కాల్పుల్లో 14 మంది మృతి చెందిన ఘటనపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని కూడా భారత్‌తో సమానంగా శత్రువులుగా చూస్తానని ఆయన పేర్కొన్నారు.స్థానిక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ వ్యతిరేకంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని వ్యాఖ్యానించారు. ‘‘నేను నిరసనకారులను కూడా భారత్ మాదిరిగానే శత్రువులుగా పరిగణిస్తాను’’ అని ఆయన చెప్పడం వివాదాస్పదమైంది. ఆందోళనకారులతో చర్చలకు అవకాశం లేదని, వారు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.పీవోకేలో కాల్పులు.. 14 మంది మృతిపీవోకేలోని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. రావల్కోట్ నుంచి ముజఫరాబాద్ వరకు సాగిన భారీ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో కనీసం 14 మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయినట్లు నిరసనకారులు వెల్లడించారు. పలువురు గాయపడ్డారు.పీవోకే అసెంబ్లీలో కశ్మీరీ శరణార్థులకు కేటాయించిన 12 స్థానాలను రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రిజర్వ్ సీట్ల విధానం వల్ల స్థానిక ప్రజల రాజకీయ హక్కులు ప్రభావితం అవుతున్నాయని JAAC ఆరోపిస్తోంది. ఇస్లామాబాద్‌కు చెందిన రాజకీయ పార్టీలు పీవోకే రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతోందని వారు విమర్శిస్తున్నారు.అయితే పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. నిరసనకారుల వద్ద ఆధునిక ఆయుధాలు ఉన్నాయని, వారు భద్రతా సిబ్బందిపై దాడి చేయడంతోనే బలగాలు స్పందించాయని అధికారులు చెబుతున్నారు. ఇరువర్గాల వాదనలను స్వతంత్రంగా నిర్ధారించడం సాధ్యం కాలేదు.కారణాలు ఉన్నాయిపీవోకేలో ప్రస్తుత ఆందోళనలు ఒక్కసారిగా మొదలైనవి కావు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరల పెరుగుదల, విద్యుత్ కొరత, నిరుద్యోగం, పాలనా వైఫల్యాలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. చౌక ధరలకు విద్యుత్, గోధుమ పిండి సరఫరా, స్థానిక ప్రజలకు మెరుగైన పాలన, ఎక్కువ రాజకీయ హక్కులు కల్పించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా కొనసాగుతున్న నిరసనలు ఇప్పుడు ఇస్లామాబాద్ పాలనపై పెద్ద ఎత్తున వ్యతిరేకతగా మారాయి.భారత్ స్పందన ఇదే..పీవోకేలో జరుగుతున్న పరిణామాలపై ఇటు భారత్ కూడా స్పందించింది. అక్కడ చేపడుతున్న ఎన్నికల ప్రక్రియను కేవలం పాకిస్థాన్ ఆక్రమణను సమర్థించుకునే ప్రయత్నంగా భారత్ అభివర్ణించింది. పీవోకేలో ప్రజల అసంతృప్తికి కారణం ఆర్థిక దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, పాలనా వైఫల్యాలేనని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.ఇదిలా ఉండగా.. పీవోకే నిరసనకారులను భారత్‌తో పోల్చుతూ ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన సమయంలో మరింత కఠిన వైఖరి ప్రదర్శించడం ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
మరోసారి పాక్ చిత్తు.. సిరీస్ శ్రీలంక వశం
శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పర్యాటక పాకిస్తాన్ జట్టు 1-2 తేడాతో కోల్పోయింది. హంబన్‌తోట వేదికగా ఇవాళ (జులై 28) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌ను కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 40 ఓవర్లలో 187 పరుగులకే చాపచుట్టేయగా.. శ్రీలంక 37.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సిరీస్ తొలి మ్యాచ్ పాక్ గెలవగా.. రెండు, మూడు మ్యాచ్‌లను గెలిచిన శ్రీలంక సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య జులై 31, ఆగస్ట్ 2, 4 తేదీల్లో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది.చెలరేగిన లంక బౌలర్లుటాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన శ్రీలంక పాక్‌ను స్వల్ప స్కోర్‌కే మట్టికరిపించింది. చేతన విముక్తి (3-36), కెప్టెన్ చమారీ (3-27), కవిష దిల్హరి (3-27) చెలరేగి బౌలింగ్ చేశారు. పాక ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేసిన ఫాతిమా సనా టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగతా ప్లేయర్లలో గుల్ ఫెరోజా (40), మునీబా అలీ (34), నజిహా అల్వి (30) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లు కూడా సత్తా చాటారు. చమారీ ఆటపట్టు (52), హాసిని పెరీరా (50 నాటౌట్), హర్షిత సమరవిక్రమ (71 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి, తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరి ఇన్నింగ్స్‌లో విష్మి గౌతమ్ (12) మాత్రమే తక్కువ స్కోర్‌కు ఔటైంది. -
పాక్ ప్లేయర్ చారిత్రక శతకం
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ తాజా మాజీ కెప్టెన్ షాన్ మసూద్ అద్భుత శతకంతో సత్తా చాటాడు. మూడో రోజు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మసూద్ 163 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ఈ శతకం అతని టెస్ట్ కెరీర్లో 7వది. వెస్టిండీస్‌పై తొలి టెస్ట్ సెంచరీ.చారిత్రక శతకంటరౌబాలోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇది. ఈ వేదికపై టెస్ట్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా షాన్ మసూద్ చరిత్ర సృష్టించాడు. 2025 జనవరిలో దక్షిణాఫ్రికాపై శతకం తర్వాత దాదాపు 18 నెలల విరామం అనంతరం మసూద్ చేసిన సెంచరీ ఇది.బ్యాట్‌తో సమాధానంఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) షాన్ మసూద్‌ను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పించి, ఆ స్థానంలో బాబర్ ఆజంను మళ్లీ కెప్టెన్‌గా నియమించింది. కెప్టెన్సీ కోల్పోయిన వెంటనే మసూద్ బ్యాట్‌తో తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు.కెప్టెన్సీ ఎందుకు తొలగించారంటే..?2023లో టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మసూద్ నాయకత్వంలో పాకిస్తాన్ జట్టు ఆశించిన ఫలితాలు సాధించలేదు.* ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ ఓటమి* దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ ఓటమి* బంగ్లాదేశ్ చేతిలో స్వదేశంలో, వారి దేశంలో టెస్ట్ సిరీస్ పరాజయాలుఈ ఫలితాల నేపథ్యంలో నాయకత్వంలో మార్పు అవసరమని భావించిన PCB, మసూద్‌ను తప్పించి బాబర్ ఆజంను మళ్లీ టెస్ట్ కెప్టెన్‌గా నియమించింది.మ్యాచ్ విషయానికొస్తే.. హోరాహోరీగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేయగా.. జస్టిన్ గ్రీవ్స్ (11-6-27-5) దెబ్బకు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులకే చాపచుట్టేసింది. మసూద్ (109) సెంచరీ చేయడంతో పాక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్, పాక్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 126 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 155 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు విండీస్‌లో పర్యటిస్తుంది. -
బాబర్ ఆజం వరల్డ్ రికార్డు
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం టెస్ట్ కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసిన అతడు.. అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలోనూ 4500కిపైగా పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఘనతను ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్లో మరే ఆటగాడు సాధించలేదు.బాబర్ మూడు ఫార్మాట్లలో పరుగులు* టెస్టులు: 4504 పరుగులు* వన్డేలు: 6626 పరుగులు* టీ20 అంతర్జాతీయాలు: 4596 పరుగులుఅంతర్జాతీయ కెరీర్ గణాంకాలు2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బాబర్, అప్పటి నుంచి అన్ని ఫార్మాట్లలో కలిపి 15726 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతని కంటే ఎక్కువ పరుగులు చేసిన వారు కేవలం ఇద్దరే.* జో రూట్: 18575 పరుగులు* విరాట్ కోహ్లీ: 18303 పరుగులు* బాబర్ ఆజం: 15726 పరుగులుఇటీవలి ఫామ్ ఆందోళనకరంవ్యక్తిగత రికార్డు సాధించినప్పటికీ, బాబర్ ఇటీవలి కాలంలో టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు.2023 ప్రారంభం నుంచి టెస్టుల్లో: * 32 ఇన్నింగ్స్ * 859 పరుగులు * సగటు: 26.84 * ఒక్క సెంచరీ కూడా లేదు.వన్డేలు, టీ20ల్లో కూడా పరుగులు చేసినప్పటికీ, అతని స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు వస్తున్నాయి.విండీస్-పాక్ తొలి టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేయగా.. జస్టిన్ గ్రీవ్స్ (11-6-27-5) దెబ్బకు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులకే చాపచుట్టేసింది. తాజా మాజీ కెప్టెన్ షాన్ మసూద్ (109) సెంచరీ చేయడంతో పాక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్, పాక్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 126 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 155 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు విండీస్‌లో పర్యటిస్తుంది. -
పీవోకేలో ఎన్నికలు రక్తసిక్తం.. ఆందోళనకారులపై కాల్పులు
ఇస్లామాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరిగిన మెుదటి విడత ఎన్నికలు రక్తసిక్తంగా మారాయి. ఎన్నికల వేళ ఆందోళనకారులపై జరిపిన పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 19 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. పీవోకేలో గత కొద్ది రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ అక్కడి ప్రభుత్వం శాసనసభకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మెుదటి దశ ఎన్నికల్లో మారణహోమం జరిగింది.పీవోకేలో గత కొంతకాలంగా నిరసనలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. పీవోకే శాసనసభలో పాకిస్థాన్‌లో నివసించే శరణార్థుల కోసం కేటాయించిన 12 రిజర్వ్డ్ సీట్లను రద్దుతో పాటు భారీగా పెరిగిన విద్యుత్ ధరలు, ద్రవ్యోల్బణంతో పాటు అక్కడి ఆర్మీ అరాచకాలగకు విసిగిపోయిన ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు.దశాబ్దాలుగా పాకిస్థాన్ తమ ప్రాంతాన్ని అభివృద్ధి విషయంలో పూర్తిగా విస్మరిస్తోందని, స్థానిక వనరులను దోచుకుంటూ ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.ఈ నేపథ్యంలోనే జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. అయితే ఈ ఆందోళనలను ఏమాత్రం పట్టించుకోని అక్కడి ప్రభుత్వం అక్కడి అసెంబ్లీ స్థానాలకు ముడు దశలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తొలిదశ ఎన్నికలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఎన్నికలు వద్దంటూ నిరసన చేస్తున్న ఆందోళనకారులపై పాకిస్తాన్ రేంజర్లు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 19 మంది మరణించారు. అలాగే పదుల సంఖ్యలో జనాలు గాయపడ్డారు. అయితే గాయపడ్డవారిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.కాగా నిరనలు తారాస్థాయికి చేరినప్పటికీ పోలింగ్ సిబ్బందిని బంధీలుగా ఉంచి... ఆయుధాల బెదిరింపులతో బోగస్ ఓటింగ్, రిగ్గింగ్‌కు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి సమాహ్ని ప్రాంతంలో ఒక పోలింగ్ బూత్ నుండి సాయుధ వ్యక్తులు బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది.జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JKJAAC) పిలుపు మేరకు ముజఫరాబాద్‌కు ర్యాలీ నిర్వహిస్తుండగా... రావాలాకోట్‌లో నిరసనకారులపై పాకిస్థాన్ బలగాలు కాల్పులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ముజఫరాబాద్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో నిరసనకారులు సిద్ధమవుతుండగా, రావాలాకోట్‌లో భద్రతా దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయని స్థానికులు ఆరోపించారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అకీల్ భాయ్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను, అక్కడి పరిస్థితులు, జరిగిన పరిణామాలను వివరించారు. #PoJK This is a military-dominated state where civilian governance is merely a facade and real power lies with the army. Calling this system “constitutional” is misleading.An entire establishment, intoxicated by power, has trampled upon law, constitution, and ethics… pic.twitter.com/R4LhZyZnq6— KashmirFact (@Kashmir_Fact) July 28, 2026 -
‘మాకే లేదు ఇంకేం ఇస్తాం’: పాక్ క్రియేటర్
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనలపై పాకిస్థాన్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ బిలాల్ హసన్ చేసిన భావోద్వేగ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియోలో బిలాల్ హసన్ మాట్లాడుతూ.. ‘మా మధ్య ద్వేషం పెరిగిందని నాకు తెలుసు, కానీ నిరసనల్లోని ప్రతి గుర్తును, పోస్టర్‌ను, అంతర్గత జోక్‌ను మేం (పాకిస్థానీయులు) అర్థం చేసుకోగలం. మేం మా పోలికలను దాంట్లో చూసుకుంటాం. ఏదేమైనా మేం విడిపోయిన తల్లిదండ్రుల సంతానం’ అని పేర్కొన్నారు.భారతదేశంలో విద్యార్థుల నిరసనకు మద్దతు తెలుపుతూ.. ‘వీరు పిల్లలు. ఎంతో ధైర్యవంతులు. తమ దేశం మెరుగైన భవిష్యత్తును సాధించడం కోసమే వారు నిరసన తెలుపుతున్నారు. అందులో ఏదో ఒక అందం ఉంది’ అని అన్నారు. ఈ నిరసనలకు పాక్ నిధులు సమకూర్చిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను హసన్ ఖండించారు. ‘పాకిస్థాన్ నిరసనలకు నిధులు ఇచ్చిందని అంటున్నారు. మా దేశాన్ని నడుపుకోవడానికే మా వద్ద సరిపడా డబ్బు లేదు. ఇక మేం వాటికి ఎలా నిధులు సమకూర్చగలం?" అని హసన్ ప్రశ్నించారు. ‘ఫ్రమ్ పాకిస్థాన్ టు ఇండియా’ అనే శీర్షికతో ఈ వీడియోను పోస్ట్ చేశారు.భారత్, పాకిస్థాన్లలో నిరసనకారుల పట్ల అనుసరిస్తున్న తీరును కూడా ఆయన పోల్చారు. పాకిస్థాన్‌లో విద్యార్థులు తీవ్రమైన ప్రభుత్వ చర్యలను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. చివరగా భారతీ విద్యార్థులకు సందేశమిస్తూ ‘మిమ్మల్ని ఎంతో ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి ఆలోచించి రిస్క్ తీసుకోండి. ఐక్యంగా ఉండండి. అమ్ముడుపోకండి’ అని హసన్ సూచించారు. ఈ వీడియోకు ఆన్లైన్లో విపరీతమైన స్పందన వస్తోంది. భారత్, పాకిస్థాన్ వినియోగదారులు హసన్ పరిశీలనా శక్తిని ప్రశంసిస్తున్నారు. -
పాక్‌లో వైద్య సంక్షోభం.. ప్రాణాలొదులుతున్న బాధితులు!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (ఐసీయూ)పూర్తిగా నిండిపోవడంతో తీవ్రమైన వైద్య ఆరోగ్య సంక్షోభం తలెత్తింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు తక్షణ వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. ఈ దుస్థితి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది.జనాభా భారీగా పెరిగినా.. మౌలిక వసతులు శూన్యంఇస్లామాబాద్లోని ప్రముఖ పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీఐఎంఎస్) ఆస్పత్రిని కేవలం 5 లక్షల మంది జనాభా కోసం ప్రారంభించారు. కానీ నేడు సుమారు 50 లక్షల మందికి పైగా ప్రజల వైద్య అవసరాలను ఈ ఒక్క ఆసుపత్రే తీర్చాల్సివస్తోంది. జనాభా పెరుగుతున్నప్పటికీ, దానికి తగినట్లుగా ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు, నిపుణులైన వైద్య సిబ్బంది సంఖ్య మాత్రం పెరగలేదు. దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రులపై తీవ్రమైన భారం పడుతోంది.సీనియర్ జర్నలిస్ట్ మరణంతో..పాక్‌కు చెందిన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అబిద్ రజా కజ్మీకి పక్షవాతం రావడంతో వైద్యులు వెంటనే వెంటిలేటర్‌పై ఉంచాలని సూచించారు. కానీ పిమ్స్ ఆసుపత్రిలోని 12 ఐసీయూ వెంటిలేటర్లు అప్పటికే పూర్తిగా నిండిపోయాయి. కుటుంబ సభ్యులు ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గం మధ్యలోనే ఆయన మరణించారు. ఈ విషాద ఘటన పాకిస్థాన్‌లో నెలకొన్న ఆరోగ్య సంక్షోభం అసలు స్వరూపాన్ని దేశం ముందుంచింది.అందని ద్రాక్షలా వెంటిలేటర్లుపిమ్స్ ఆస్పత్రిలో సుమారు 90కి పైగా వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, కొత్తగా వచ్చే తీవ్రమైన రోగులకు అవి వెంటనే దొరకడం లేదు. న్యూరాలజీ, పల్మోనాలజీ విభాగాల్లో చేరిన రోగులు కొన్నిసార్లు 15 నుంచి 20 రోజుల పాటు వెంటిలేటర్‌పైనే ఉండాల్సి వస్తోంది. దీంతో ఈ ప్రాణరక్షక పరికరాలు నిరంతరం వినియోగంలో ఉండి, అత్యవసర సమయాల్లో ఖాళీగా ఉండటం లేదు.‘నో రిఫ్యూజల్' విధానంతో..ఎలాంటి తీవ్రమైన రోగితోనైనా సరే చికిత్సను తిరస్కరించకూడదనే కఠినమైన నిబంధన పిమ్స్ ఆస్పత్రిలో అమలవుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులను కూడా ఈ విధానం వల్ల వెనక్కి పంపకుండా చేర్చుకుంటున్నారు. పడకలు ఖాళీ లేకపోయినా స్ట్రెచర్లపైనే చికిత్స అందించాల్సి వస్తోంది. ఇది మానవతా దృక్పథంతో మంచిదే అయినప్పటికీ, పరిమిత వనరుల మధ్య ఆసుపత్రిపై అంతులేని ఒత్తిడిని పెంచుతోంది.కేవలం కొత్త యంత్రాలు కొంటే సరిపోతుందా?ప్రభుత్వం కేవలం పెద్ద సంఖ్యలో కొత్త వెంటిలేటర్లను కొనుగోలు చేయడం వల్ల మాత్రమే ఈ సంక్షోభం సమసిపోదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి వెంటిలేటర్‌ను సరిగ్గా ఆపరేట్ చేయడానికి శిక్షణ పొందిన ఎనస్థీషియస్టులు, క్రిటికల్ కేర్ నిపుణులు, నర్సులు, టెక్నీషియన్లు అత్యవసరం. కానీ పాకిస్థాన్ ప్రభుత్వ ఆసుపత్రులలో ఇటువంటి నిపుణులైన మానవ వనరుల కొరత చాలా తీవ్రంగా ఉంది.గగనంగా మారిన ప్రైవేట్ వైద్యం.. పాకిస్థాన్‌లో ప్రైవేట్ ఆసుపత్రులలో ఐసీయూ వైద్యం సామాన్యులకు అందనంత ఖరీదైనదిగా మారింది. ఒక్కో రోగికి రోజువారీగా సుమారు 3 లక్షల పాకిస్థానీ రూపాయల వరకు ప్రైవేట్ యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. అంత భారీ మొత్తాన్ని భరించే ఆర్థిక స్థోమత లేకపోవడం కారణంగా మధ్యతరగతి, పేద ప్రజలు పూర్తిగా ప్రభుత్వ ఆస్పత్రులపైనే ఆధారపడవలసి వస్తోంది.ప్రాథమిక వైద్య రంగం విఫలందేశంలోని జిల్లా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సరైన సేవలు అందించడంలో పూర్తిగా విఫలమవుతున్నాయి. స్థానిక స్థాయిలోనే నయం కావాల్సిన చిన్నపాటి రోగాలతో కూడిన రోగులు కూడా నేరుగా పెద్ద ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా పెద్ద ఆస్పత్రులపై అనవసరమైన భారం పడి, నిజమైన అత్యవసర రోగులకు వైద్యం దక్కని పరిస్థితి ఏర్పడుతున్నది.ఇది కూడా చదవండి: నెతన్యాహుకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్! -
పాక్‌తో తొలి టెస్ట్.. హోప్ సెంచరీ మిస్
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో వెస్టిండీస్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకే ఆలౌటైంది. స్టార్ ప్లేయర్ షాయ్ హోప్ (92) తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. మరో బ్యాటర్ కవెమ్ హాడ్జ్ (84) కూడా సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. వీరిద్దరు రాణించడంతో విండీస్ ఈ స్కోరైనా చేయగలిగింది.మిగతా ప్లేయర్లలో తేజ్‌నరైన్ చంద్రపాల్ 21, బ్రాండన్ కింగ్ 12, ఆమిర్ జాంగూ 21, జస్టిన్ గ్రీవ్స్ 15, కెప్టెన్ రోస్టన్ ఛేజ్ 10, కీమర్ రోచ్ 3, షమార్ జోసఫ్ 23, జేడన్ సీల్స్ డకౌట్, జోమెల్ వార్రికన్ 1 (నాటౌట్) చేశారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అలీ 4 వికెట్లతో సత్తా చాటగా.. మొహమ్మద్ అబ్బాస్ 3, ఖుర్రమ్ షెహజాద్ 2, ఆమిర్ జమాల్ ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్, తాజా మాజీ కెప్టెన్ షాన్ మసూద్ అజేయ అర్ద సెంచరీతో (88) సత్తా చాటగా.. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (63) అర్ద సెంచరీతో రాణించాడు. కెప్టెన్ బాబర్ ఆజం 23 పరుగులకు ఔట్ కాగా.. మరో ఓపెనర్ అజాన్ అవైస్ డకౌటయ్యాడు. షాన్ మసూద్‌తో పాటు సల్మాన్ అఘా (0) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు పాక్ ఇంకా 112 పరుగులు వెనుకపడి ఉంది. విండీస్ బౌలర్లలో రోచ్, సీల్స్, షమార్ తలో వికెట్ తీశారు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. -
పాక్ బాక్సర్‌ను చిత్తు చేసి పతకం రేసులో జాదుమణి
కామన్వెల్త్ గేమ్స్ 2026లో బాక్సింగ్ విభాగంలో భారత బాక్సర్ జాదుమణి పతకం ఆశలు రేపుతున్నాడు. క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన జాదుమణి పతకానికి అడుగుదూరంలో నిలిచాడు. పురుషుల బాక్సింగ్‌లో భారత బాక్సర్ జాదుమణి సింగ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో జాదుమణి 5-0తో పాకిస్తాన్ బాక్సర్ సుమామా రెహమాన్‌ను మట్టికరిపించాడు. మ్యాచ్ గెలిచిన అనంతరం జాదుమణి ఈ విజయాన్ని కార్గిల్ వీరులకు అంకితమిస్తున్నట్లు తెలిపాడు. "నా విజయాన్ని కార్గిల్ వీరులకు అంకితం చేస్తున్నాను. పాకిస్థాన్‌పై గెలవడం చాలా గొప్పగా అనిపించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో మరింత మెరుగ్గా రాణించి భారత్‌కు స్వర్ణం సాధించిపెడతాను''అని జాదుమణి పేర్కొన్నాడు. తొలి రౌండ్లో బై లభించిన జాదుమణి రెండో రౌండ్లో స్కాట్లాండ్కు చెందిన ఆరోన్ కల్లెన్పై 5-0తో అజేయ విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రిక్వార్టర్స్‌లో పాకిస్తానీ బాక్సర్‌పై విరుచుకుపడిన జాదుమణి 5-0తో ఏకగ్రీవ విజయాన్ని సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇక జాదుమణి మంగళవారం క్వార్టర్స్ ఫైట్‌లో తలపడనున్నాడు. క్వార్టర్ ఫైనల్లో గెలిచి సెమీస్‌లోకి ప్రవేశిస్తే అతనికి కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. ఎందుకంటే కామన్వెల్త్ గేమ్స్ బాక్సింగ్‌లో సెమీఫైనల్లో ఓడిపోయిన ఇద్దరికీ కాంస్య పతకాలు లభిస్తాయి.ఇక మహిళల బాక్సింగ్ 54 కేజీల విభాగంలో భారత బాక్సర్ ప్రీతి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రీతి పంచ్‌ల ధాటికి ఆమె ప్రత్యర్థి దెబోరా మావ్ (కెన్యా) రెండో రౌండ్లోనే చేతులెత్తేసింది. ఇక స్విమ్మింగ్‌లో భారత ఫ్రీస్టయిల్ రిలే జట్టు ఫైనల్‌కు చేరింది. 4X200 ఫ్రీస్టయిల్ రిలే హీట్‌లో దక్షణ్, అనీశ్ గౌడ, ఆర్యన్ నెహ్రా, శ్రీహరి నటరాజ్లతో కూడిన భారత జట్టు 7ని:39.48 సెకన్లలో లక్ష్యానికి చేరి మూడో స్థానంలో నిలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల జిమ్నాస్టిక్స్ ఆల్ అరౌండ్ ఫైనల్లో భారత ప్లేయర్ తపన్ మొహంతి 70.100 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచాడు. లాన్ బౌల్స్‌లో మహిళల పెయిర్ ఈవెంట్లో రూపా రాణి–పింకీ సింగ్ (భారత్) జోడీ, పురుషుల సింగిల్స్‌లో పుతుల్ సోనోవాల్ (భారత్) పరాజయాలు చవిచూసి ముందంజ వేయడంలో విఫలమయ్యారు. 🚨 INDIA’S JADUMANI SINGH THRASHED PAKISTANI BOXER 5-0 AT COMMONWEALTH GAMES 2026 🇮🇳🔥Jadumani Singh Mandengbam said - "I dedicate my win to the Kargil heroes. I felt great winning against Pakistan."Another day, Another humiliation for Pakistan 😅pic.twitter.com/1REqzhnEoe— Ajay Jadeja (@AjayJadeja171) July 27, 2026 -
భారత జెన్-జీకి పాక్, శ్రీలంక, నేపాల్ సెల్యూట్.. రియాక్షన్లు ఇవే..
భారత జెన్-జీని తరచూ మొబైల్లో ఎక్కువ సమయం గడిపే తరం, ప్రతి విషయాన్నీ మీమ్స్‌గా మార్చే తరం, తీవ్రమైన అంశాలపై ఎక్కువసేపు దృష్టి పెట్టని తరంగా భావించేవారు. కానీ గత నెల రోజులుగా అదే బలహీనతలు వారి అతిపెద్ద బలంగా మారాయి. వరుసగా సాగిన విద్యార్థి ఉద్యమాలు కేంద్ర ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గేలా చేశాయి. పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఉద్యమంలో సంప్రదాయ రాజకీయ ప్రకటనల స్థానంలో మీమ్స్ వచ్చాయి. ఇన్‌స్టా రీల్స్ ప్రజలను సమీకరించే సాధనంగా మారాయి.ఈ ఉద్యమం ఇప్పుడు భారత్‌కే పరిమితం కాలేదు. పొరుగు దేశాల్లో కూడా దీని గురించి చర్చ సాగుతోంది. జెన్-జీ దృష్టి త్వరగా మళ్లిపోతుందని సాధారణంగా చెబుతుంటారు. కానీ భారత్‌లో జరిగిన ఈ ఉద్యమం శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్ యువత దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ దేశాల్లో గతంలో కూడా యువజన ఉద్యమాలు జరిగాయి. అందువల్ల భారత్‌లోని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమంపై అక్కడ ప్రత్యేక ఆసక్తి కనిపించింది.దీనిపై పాకిస్థాన్ యువతి ఒకరు మాట్లాడుతూ.. "ఇలా చేస్తుంటే ప్రేమలో పడిపోతానేమో... మీరు ఇంత బాగా చేస్తుంటే నేను మిమ్మల్ని ఎలా ద్వేషిస్తాను?" అని అన్నారు. భారత జెన్-జీ చూపించిన ధైర్యం, ఐక్యత ఎవరినైనా ఆకట్టుకుంటాయి. సరిహద్దులు వేరు కావచ్చు. కానీ ఈ తరం ఆలోచనలు, ఉత్సాహం ఒక్కటేనని చెప్పారు. పాకిస్థాన్‌కు చెందిన పలువురు యువకులు అవకాశం వస్తే తామూ భారత విద్యార్థుల్లాగే వీధుల్లోకి వచ్చేవాళ్లమని అన్నారు. ఓ యువకుడు మాట్లాడుతూ.. "కాక్రోచ్ జనతా పార్టీ చాలా కూల్‌గా ఉంది. వారు అవసరానికి మించి సీరియస్‌గా ఉండరు. అదే నాకు నచ్చింది. జెన్-జీకి సాటి ఎవరూ లేరు" అని చెప్పాడు.ఒక ప్లేట్ బిర్యానీకే అమ్ముడుపోయేవాళ్లం ముంబైలో వైరల్ అయిన ఓ వీడియోను కూడా అతను ప్రస్తావించాడు. అందులో పోలీసులు విద్యార్థులను వాహనంలో తీసుకెళ్తుండగా, వెనుక నుంచి ఎవరో నిశ్శబ్దంగా తాళం తీసేయడంతో విద్యార్థులు బయటకు వచ్చి పరుగులు తీశారు. మరో పాకిస్థాన్ యువకుడు మాట్లాడుతూ.. భారత విద్యార్థులు మతం, కులానికి అతీతంగా ఐక్యంగా నిలిచారని, కానీ పాకిస్థాన్‌లో ప్రజలు పంజాబీ-పష్తూన్, సున్నీ-షియా వంటి విభజనల్లో ఉన్నారని అన్నాడు."అదే భారత్ జెన్-జెడ్ అతిపెద్ద బలం. పాకిస్థాన్ జెన్-జీ అంత సులభంగా ఒక్కటవుతుందని నాకు అనిపించడం లేదు." భారత్ ఉద్యమానికి పాకిస్థాన్ నుంచి నిధులు వస్తున్నాయన్న ఆరోపణలపై పాకిస్థాన్ కంటెంట్ క్రియేటర్ బిలాల్ హసన్ వ్యంగ్యంగా మాట్లాడుతూ.. "మా దేశాన్ని నడపడానికే మా దేశం వద్ద డబ్బు లేదు. భారత ఉద్యమానికి ఎలా నిధులు ఇస్తాం?" అని అన్నాడు.బిలాల్ హసన్ అనే యువకుడు మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో విద్యార్థులపై లాఠీచార్జ్ జరగొచ్చు. కానీ పాకిస్థాన్‌లో చాలా సందర్భాల్లో ప్రజలను నేరుగా తీసుకెళ్లి అదృశ్యం చేస్తారు’’ అని చెప్పారు. పాకిస్థాన్‌లో చాలామందిని "ఒక ప్లేట్ బిర్యానీ"కే కొనుగోలు చేయవచ్చని వ్యాఖ్యానించారు.శ్రీలంక యువతపై ప్రభావంభారత విద్యార్థి ఉద్యమం శ్రీలంక యువతపై కూడా ప్రభావం చూపింది. 2022లో శ్రీలంక యువత ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఆ తర్వాత రాజపక్స ప్రభుత్వం అధికారాన్ని వీడింది. ఇప్పుడు శ్రీలంకలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంపై కార్టూన్లు, ఇన్స్టాగ్రామ్ పోస్టులు కూడా వచ్చాయి. ప్రముఖ కార్టూనిస్ట్ అవంతా ఆర్టిగాలా పంచుకున్న వ్యంగ్య చిత్రంలో ప్రభుత్వం "బొద్దింకలను" అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా, భారత్ ఇళ్లలో వాడే "లక్ష్మణ రేఖ" కూడా వాటిని ఆపలేకపోయినట్టు చూపించారు.భారత్ ఉద్యమంలో ఎక్కువగా చర్చకు వచ్చిన చిత్రం ముంబైకి చెందిన రియా అహీర్ పోలీసు వాహనం ముందు చేతులు చాపి నిలిచిన ఫొటో. చాలామంది దీన్ని 1989 తియానన్మెన్ స్క్వేర్‌లోని ప్రసిద్ధ "ట్యాంక్ మ్యాన్" చిత్రంతో పోల్చారు. శ్రీలంక లా కాలేజీ విద్యార్థిని స్వస్థిక అరులింగం ఫేస్బుక్లో ఈ చిత్రాన్ని పంచుకుంటూ "వైబింగ్ ఎట్ అనదర్ లెవల్" అని రాశారు. 2022 శ్రీలంక ఉద్యమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త బువాంకా పెరేరా ఇన్‌స్టాగ్రామ్‌లో భారత యువతకు సందేశం పంపారు."శ్రీలంక నుంచి ప్రారంభమై ఆసియా అంతటా వ్యాపించిన యువజన ఉద్యమాల జ్వాల భారత్‌ను చాలాకాలం తాకలేదనిపించింది. కానీ ఇప్పుడు రాజ్యాంగం, దేశ వ్యవస్థాపకులు కలలు కన్న భారత్ కోసం భారత యువత పోరాడుతుండటం చూసి ఆనందంతో కళ్లలో నీళ్లు వస్తున్నాయి" అని ఆయన అన్నారు. నేపాల్ యువత మద్దతునేపాల్లో కూడా భారత్ జెన్-జీ ఉద్యమంపై సానుకూల స్పందనలు వచ్చాయి. కాఠ్మాండూ కంటెంట్ క్రియేటర్ అవినాశ్ మిశ్రా మాట్లాడుతూ.. భారత విద్యార్థుల ఆగ్రహం పూర్తిగా సమంజసమని, దాన్ని అతిగా స్పందించారని చెప్పలేమన్నారు. "వీధుల్లో విద్యార్థులను చూసినప్పుడు నా మనసు అప్పుడూ బాధపడింది. ఇప్పుడూ బాధపడుతోంది" అని చెప్పారు. 2025లో నేపాల్ జెన్-జీ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, అది కూడా యువత శక్తికి ఉదాహరణగా నిలిచి చివరకు కేపీ ఓలీ ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేసిందని అన్నారు.జెన్-జీ నుంచి ప్రపంచం నేర్చుకుంటోంది..ఢిల్లీ జంతర్ మంతర్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం క్రమంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచం తొలిసారి భారత్ జెన్-జీ మీమ్స్, నినాదాలు, వైరల్ వీడియోలను చూసి నవ్వడమే కాదు, వాటి నుంచి నేర్చుకోవడం కూడా ప్రారంభించింది. పొరుగు దేశాల నుంచి వచ్చిన స్పందనలు చూస్తే, భారత్ విద్యార్థి ఉద్యమం సరిహద్దులు దాటి యువతకు స్ఫూర్తిగా మారిందని తెలుస్తోంది. శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్‌కు చెందిన పలువురు యువకులు భారత విద్యార్థుల ఐక్యత, ధైర్యం, సృజనాత్మక నిరసనను ప్రజాస్వామ్య ఉద్యమానికి కొత్త ఆదర్శంగా అభివర్ణించారు. -
పాక్‌తో తొలి టెస్ట్.. హాడ్జ్ అజేయ అర్ధశతకం
టరౌబాలోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ ఓ మోస్తరు ప్రదర్శన చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. తేజ్‌నరైన్ చంద్రపాల్ (21), బ్రాండన్ కింగ్ (12), ఆమిర్ జాంగూ (21) ఔట్ కాగా.. కవెమ్ హాడ్జ్ (83) అజేయ అర్ద శతకంతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అతడికి జతగా షాయ్ హోప్ (39) క్రీజ్‌లో ఉన్నాడు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ 2, ఆమిర్ జమాల్ ఓ వికెట్ తీశారు.వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగడంతో తొలి రోజు కేవలం 67 ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. హాడ్జ్ అజేయ అర్ధశతకంతో జట్టును బలమైన స్థితిలో నిలిపాడు.ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పాక్ పేసర్లు మొహమ్మద్ అబ్బాస్, ఖుర్రం షెహ్జాద్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. 13 పరుగుల వద్ద బ్రాండన్ కింగ్ వికెట్‌ను అబ్బాస్ పడగొట్టాడు.అనంతరం వర్షం కారణంగా దాదాపు రెండు గంటల ఆట నిలిచిపోయింది. ఆట పునఃప్రారంభమైన తర్వాత హాడ్జ్ ఓపికగా ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఈ దశలో తేజ్‌నరైన్ చందర్‌పాల్‌ను ఆమిర్ జమాల్ ఔట్ చేశాడు. కొద్ది సేపటికి ఆమిర్ జాంగూను అబ్బాస్ పెవిలియన్‌కు పంపాడు.అనంతరం షాయ్ హోప్‌తో కలిసి హాడ్జ్ నాలుగో వికెట్‌కు అజేయంగా 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. రెండో రోజు కూడా వర్షం ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో వెస్టిండీస్ ఏ విధమైన బ్యాటింగ్ వ్యూహాన్ని అనుసరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. రెండో టెస్ట్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఆగస్ట్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ముందు పాక్ వెస్టిండీస్ సెలెక్ట్ ఎలెవెన్‌తో ఓ నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ పాక్‌కు మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇచ్చింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాటర్లు అజాన్ అవైస్, బాబర్ ఆజం సెంచరీలు చేశారు. -
సెంచరీలతో కదంతొక్కిన లంక ప్లేయర్లు.. చిత్తుగా ఓడిన పాక్
3 మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు తొలి ఓటమి చవిచూసింది. వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.హంబన్‌తోట వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. సిద్రా అమీన్ (100) అజేయ శతకంతో సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఏమాత్రం తడబడని శ్రీలంక విష్మి గుణరత్నే (123), హర్షిత సమరవిక్రమ (100 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో 46.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.పాక్ ఇన్నింగ్స్‌లో సిద్రా సెంచరీతో సత్తా చాటగా.. మునీబా అలీ (45), అయేషా జాఫర్ (49), కెప్టెన్ ఫాతిమా సనా (25) విలువైన ఇన్నింగ్స్‌లు ఆడారు. శ్రీలంక తరఫున విష్మి గుణరేత్న ఔటయ్యాక.. హర్షితకు కవిష దిల్హరి (40 నాటౌట్) సహకరించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలవడంతో సిరీస్ 1-1 వద్ద కొనసాగుతోంది. తొలి వన్డేలో శ్రీలంకపై పాక్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్‌లోని నిర్ణయాత్మక మూడో వన్డే ఇదే హంబన్‌తోట వేదికగా జులై 28న జరుగనుంది. -
పాక్‌తో సిరీస్‌కు ఎంపిక.. ఆడేందుకు విండీస్ ప్లేయర్ నిరాకరణ!
పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు శుక్రవారం జట్టును ప్రకటించింది. అయితే వ్యక్తిగత కారణాల రీత్యా విండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ పాక్‌తో సిరీస్‌కు దూరమైనట్లు విండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఒకటి ఉంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడడం తనకు ఇష్టం లేదన్న కారణంగానే, జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ అల్జారీ జోసెఫ్ ఆడేందుకు నిరాకరించాడని విండీస్ కోచ్ డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అల్జారీ వ్యక్తిగత కారణాలతో సిరీస్ నుంచి తప్పుకోలేదని, పాక్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు అతడు నిరాకరించడంతో జట్టు నుంచి తప్పించాల్సి వచ్చిందని సామీ పేర్కొన్నాడు. జోసెఫ్ లేకపోవడం విండీస్‌కు పెద్ద లోటు అని, కానీ తమ జట్టు పాక్‌పై రాణిస్తుందని సామీ ధీమా వ్యక్తం చేశాడు. జట్టు ఎంపిక అనంతరం కోచ్ డారెన్ సామీ మీడియాతో మాట్లాడాడు. జోసెఫ్ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సామీ మాట్లాడుతూ.. ‘అల్జారీ జోసెఫ్ పాక్‌తో ఆడేందుకు నిరాకరించిన విషయం నా పరిధిలో లేదు. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్నఒక ఆటగాడు ఇలా జట్టు ఎంపికను తిరస్కరించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా లేదా పరిష్కారాలు కనుగొనాలన్నా అది బోర్డు డైరెక్టర్లకే వదిలేస్తున్నా’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. 29 ఏళ్ల అల్జారీ జోసెఫ్ ఇటీవలే గాయం నుంచి కోలుకున్నాడు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌లో ఆడాడు. రెండు మ్యాచులలో 6 వికెట్లు తీశాడు. ఇప్పటివరకు అల్జారీ జోసెఫ్ వెస్టిండీస్ తరఫున 42 టెస్టులు ఆడాడు. ఇందులో ఏకంగా 130 వికెట్లు పడగొట్టాడు. 87 వన్డేల్లో 141, 45 టీ20లలో 62 వికెట్లు తీశాడు. మూడు ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. వెస్టిండీస్, పాక్ మధ్య తొలి టెస్టు శనివారం ప్రారంభం కానుంది. రెండో టెస్టు ఆగస్టు 2 నుంచి జరుగుతుంది. -
పాకిస్తాన్‌కు కొత్త చిక్కులు.. 2015 నాటి పరిస్థితి మళ్లీ వస్తుందా?
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు పాకిస్తాన్‌ను మరోసారి క్లిష్ట పరిస్థితిలోకి నెడుతున్నాయి. ఇరాన్-అమెరికా ఘర్షణలు, హౌతీ తిరుగుబాటుదారుల కదలికలు, సౌదీ అరేబియా భద్రతపై ముప్పు నేపథ్యంలో పాకిస్తాన్‌పై సైనికంగా స్పందించాలనే ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2015లో యెమెన్ యుద్ధ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితినే పాకిస్తాన్ ఎదుర్కొంది. సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి హౌతీలపై యుద్ధం ప్రారంభించినప్పుడు, తమకు మద్దతుగా పాకిస్తాన్ సైన్యాన్ని పంపాలని రియాద్ కోరింది. అయితే పాకిస్థాన్ పార్లమెంట్ విస్తృత చర్చల అనంతరం యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకూడదని నిర్ణయించింది.అప్పట్లో పాకిస్తాన్‌కు రెండు వైపులా సవాళ్లు ఎదురయ్యాయి. ఒకవైపు సౌదీ అరేబియాతో దశాబ్దాలుగా కొనసాగుతున్న రక్షణ, ఆర్థిక సంబంధాలు ఉండగా, మరోవైపు ఇరాన్ పొరుగుదేశంగా ఉండటంతో ఆ దేశంతో సంబంధాలను దెబ్బతీయాలని ఇస్లామాబాద్ కోరుకోలేదు. తాజాగా మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మళ్లీ వేడెక్కుతున్నాయి. హౌతీలు సౌదీ లక్ష్యాలను టార్గెట్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలు, ఎర్ర సముద్రంలో నౌకాయాన భద్రతపై ఆందోళనలు ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతున్నాయి.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దౌత్యపరంగా సమతుల్య వైఖరిని కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవైపు సౌదీ అరేబియాకు మద్దతు ప్రకటిస్తూనే, మరోవైపు ఇరాన్‌తో సంబంధాలను కొనసాగించాలని చూస్తోంది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సౌదీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతూ, సౌదీ భద్రతకు మద్దతు ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే, యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చితే పాకిస్తాన్‌పై ప్రత్యక్షంగా రంగంలోకి దిగాలనే ఒత్తిడి పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2015లో యెమెన్ యుద్ధానికి దూరంగా నిలిచిన పాకిస్థాన్.. ఇప్పుడు మరోసారి అదే నిర్ణయాన్ని కొనసాగించగలదా? లేక మారిన పరిస్థితులు దాని విధానాన్ని మార్చేలా చేస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.పాకిస్తాన్‌కు మూడు ప్రధాన సవాళ్లు..సౌదీతో వ్యూహాత్మక సంబంధాలను కాపాడుకోవడంఇరాన్తో పొరుగుదేశ సంబంధాలను కొనసాగించడంప్రత్యక్ష యుద్ధంలో చిక్కుకోకుండా దేశ ఆర్థిక, భద్రతా ప్రయోజనాలను రక్షించడంఅయితే, పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతోంది. మరోవైపు, సైనికంగా ఏదైనా చర్య తీసుకుంటే అది దేశీయంగా, అంతర్జాతీయంగా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఇస్లామాబాద్ ప్రస్తుతం "దౌత్య సమతుల్యత" విధానాన్నే అనుసరిస్తోంది. యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా, అవసరమైతే మధ్యవర్తిత్వ పాత్ర పోషించాలని ప్రయత్నిస్తోంది. -
పాక్‌లో భీకర ఆత్మాహుతి దాడి.. 15 మంది దుర్మరణం
ఇస్లామాబాద్: వాయవ్య పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని భద్రతా తనిఖీ కేంద్రం పైకి దూసుకెళ్లారు. ఈ దుర్ఘటనలో 12 మంది సైనికులు, ఇద్దరు పోలీసులు,ఓ అటవీ శాఖ ప్రభుత్వ అధికారి సహా మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భీకర దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన పాక్ సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో 12 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.ఈ మేరకు శుక్రవారం పాకిస్థాన్ సైన్యం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న వాయవ్య ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లోని టాంక్ జిల్లాలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. ఉగ్రవాదులు భద్రతా వలయాన్ని ఛేదించి లోపలికి చొరబడటానికి ప్రయత్నించారని, అయితే సైనికులు వారిని అడ్డుకోవడంతో.. ఉగ్రవాదులు పేలుడు పదార్థాల వాహనాన్ని చెక్ పోస్ట్ వెలుపలి రక్షణ గోడకు బలంగా ఢీకొట్టారని ఆర్మీ తెలిపింది. ఈ భారీ పేలుడు దాటికి అక్కడి భద్రతా మౌలిక సదుపాయాలు,భవనం తీవ్రంగా దెబ్బతిన్నాయి. స్థానిక తాలిబాన్ ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది. ఈ ఆపరేషన్‌లో తమ సంస్థకు చెందిన నలుగురు ఆత్మాహుతి బాంబర్లు పాల్గొన్నట్లు వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో వాయవ్య పాకిస్థాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి. -
వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఎగిరి గంతేస్తున్న పాకిస్తాన్!
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు రోస్టన్ ఛేజ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, జోమెల్ వారియోకన్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ జోషువా బిషప్ తొలిసారిగా విండీస్ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 26 ఏళ్ల బిషప్ గడిచిన మూడు వెస్టిండీస్ ఛాంపియన్షిప్ సీజన్లలో ఏకంగా 91 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు.గడిచిన మూడు వెస్టిండీస్ ఛాంపియన్షిప్ సీజన్లలో ఈయన 91 వికెట్లు తీసి అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. డొమెస్టిక్ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేసిన లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ జోషువా బిషప్ తొలిసారిగా విండీస్ టెస్టు జట్టులోకి పిలుపు అందుకున్నాడు. అదేవిధంగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొడకండరాల గాయానికి గురైన ఓపెనర్ జాన్ కాంప్‌బెల్.. పాక్‌తో టెస్ట్‌లకు దూరమయ్యాడు.అతడి స్ధానంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కిర్క్ మెకెంజీకి సెలక్టర్లు అవకాశమిచ్చారు. మరోవైపు స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్ వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. ఇది నిజంగా కరేబియన్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. జోషఫ్ వంటి స్టార్ బౌలర్ జట్టులో లేకపోవడంతో విండీస్ గడ్డపై పాక్ బ్యాటర్లు పండగ చేసుకోనున్నారు.కాగా ఆల్‌రౌండర్ కిమో పాల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కేమర్ రోచ్, జేడెన్ సీల్స్, షమర్ జోసెఫ్‌లు ఫాస్ట్ బౌలర్లగా ఉన్నారు. ఈ సిరీస్‌లోని మొదటి టెస్టు మ్యాచ్ జూలై 25 నుంచి 29 వరకు టారోబాలోని 'బ్రియన్ లారా క్రికెట్ అకాడమీ' మైదానంలో జరగనుంది. ఈ వేదికపై అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ జరగనుండడం ఇదే తొలిసారి కావడం విశేషం. -
Asian Games: క్రికెట్ ‘డ్రా’ విడుదల.. భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
ప్రతిష్టాత్మక 2026 ఆసియా గేమ్స్‌కు సంబంధించి క్రికెట్ షెడ్యూల్ విడుదలైంది. ఏకకాలంలో పురుషుల, మహిళల క్రికెట్‌మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించారు. రెండు విభాగాల్లో టెస్టు సభ్యత్వం కలిగిన నాలుగు దేశాలు (భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్) నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. కాగా ఆసియా గేమ్స్ జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి.అయితే క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అటు పురుషుల.. ఇటు మహిళల క్రికెట్లో ఫైనల్ లేదా సెమీస్‌లోనే తలపడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మహిళల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో భారత్ తమ మ్యాచ్‌ను జపాన్‌తో ఆడనుంది. ఇక పురుషుల క్రికెట్లో మాత్రం టీమిండియా పాక్‌తో నేరుగా సెమీస్ లేదా ఫైనల్ పోరులో తలపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.పురుషుల క్రికెట్లో ఇలా..పురుషుల టోర్నీ విషయానికొస్తే టెస్టు సభ్యత్వం కలిగిన భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్ ఆడనున్నాయి. క్వార్టర్స్‌లో మిగిలిన నాలుగు స్థానాల కోసం ఆరుజట్ల మధ్య లీగ్ దశ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ లీగ్ దశలో గ్రూప్-ఏ నుంచి అఫ్గానిస్తాన్, జపాన్, నేపాల్ ఉండగా; గ్రూప్-బి నుంచి చైనా, మలేషియా, ఓమన్ ఉన్నాయి. లీగ్ దశలో రెండు గ్రూప్‌ల్లో నుంచి టాప్-2లో నిలిచిన జట్లు క్వార్టర్స్ చేరుకోనున్నాయి. క్వార్టర్స్‌లో గెలిచిన నాలుగు జట్లు సెమీస్‌లో తలపడనున్నాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు స్వర్ణం కోసం ఫైనల్ మ్యాచ్ ఆడనుండగా, ఓడిన జట్లు కాంస్య పతక పోరు కోసం తలపడనున్నాయి. టెస్టు సభ్యత్వం కలిగినప్పటికీ అఫ్గానిస్తాన్ ప్రిలిమినరీ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.గ్రూప్-ఏ: అఫ్గానిస్తాన్, జపాన్, నేపాల్గ్రూప్-బి నుంచి చైనా, మలేషియా, ఒమన్జపాన్తో హర్మన్ సేన అమీతుమీ..మహిళల విభాగంలోనూ ఇవే జట్లు పోటీలో ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం నేరుగా క్వార్టర్ ఫైనల్మ్యాచ్లే నిర్వహించనున్నారు. క్వార్టర్ ఫైనల్లో భారత్‌తో జపాన్, థాయ్‌లాండ్‌తో పాకిస్తాన్, చైనాతో బంగ్లాదేవ్, శ్రీలంకతో మలేషియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. క్వార్టర్స్‌లో గెలిచిన జట్లు సెమీస్‌లో అడుగుపెట్టనున్నాయి. సెమీస్‌లో గెలిచిన జట్ల మధ్య స్వర్ణ పతక పోరు జరగనుంది.మహిళల క్రికెట్లో క్వార్టర్స్ షెడ్యూల్భారత్ vs జపాన్బంగ్లాదేశ్ vs చైనాశ్రీలంక vs మలేషియాపాకిస్తాన్ vs థాయిలాండ్సెమీ-ఫైనల్స్భారత్/జపాన్ vs బంగ్లాదేశ్/చైనాశ్రీలంక/మలేషియా vs పాకిస్తాన్/థాయిలాండ్2022లో డబుల్ స్వర్ణాలు..2022 హాంగ్జౌ ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాయి. ఆనాడు టీమిండియా పురుషుల కెప్టెన్‌గా రుతురాజ్ వ్యవహరించాడు. వర్షంతో ఫలితం రాకపోవడంతో అత్యధిక విజయాలు సాధించిన భారత్‌కు గోల్డ్ మెడల్ ఇవ్వగా, అఫ్గానిస్తాన్ వెండిని గెలుచుకుంది. ఇక హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని మహిళల జట్టు ఫైనల్లో శ్రీలంకను ఓడించి బంగారు పతకాన్ని అందుకుంది. ఈ గేమ్స్‌లో పాకిస్తాన్ రెండు విభాగాల్లోనూ నాలుగో స్థానానికే పరిమితం కావడం గమనార్హం.Read: గోళీలాట మాదిరే లాన్ బౌల్స్.. కాని చిన్న ట్విస్ట్! -
సౌదీ ఆఫర్‌తో కొత్త పవర్ గేమ్... పాక్ ఎంట్రీతో బిగ్ ట్విస్ట్!
ప్రపంచ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, సౌదీ అరేబియా మధ్య కుదిరిన కొత్త పౌర అణు ఒప్పందం మధ్యప్రాచ్య శక్తి సమీకరణాలను మార్చే అంశంగా మారింది. బయటకు చూస్తే ఇది అణు విద్యుత్ అవసరాల కోసం కుదిరిన ఒప్పందంలా కనిపిస్తున్నా, దీని వెనుక ఉన్న వ్యూహాత్మక అవకాశాలే ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు కారణమవుతున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదించిన ఈ ఒప్పందం ద్వారా సౌదీ అరేబియాకు తన దేశంలోనే యురేనియం శుద్ధి చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. అణు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఈ సాంకేతికతను ఒక నిర్దిష్ట స్థాయికి మించి అభివృద్ధి చేస్తే, అణు ఆయుధాల తయారీకి అవసరమైన పదార్థాలను కూడా ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఒప్పందం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.ఈ పరిణామం ఇజ్రాయెల్‌లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఇప్పటికే ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ ఉద్రిక్తతలు, భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్, సౌదీ భవిష్యత్తులో అణు సామర్థ్యం సాధించే అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఒక దేశం అణు సాంకేతికతను అభివృద్ధి చేసిన తర్వాత దాని వినియోగం పూర్తిగా శాంతియుతంగానే ఉంటుందని ఎప్పటికీ హామీ ఇవ్వలేమన్నది ఇజ్రాయెల్ వాదన. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ గతంలో చేసిన ఒక వ్యాఖ్య కూడా ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది. ఇరాన్ అణు ఆయుధాన్ని అభివృద్ధి చేస్తే, సౌదీ కూడా అదే దిశలో అడుగులు వేయాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే సౌదీ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ అప్రమత్తంగా ఉంది.ఈ పరిణామంలో మరో దేశం పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అదే పాకిస్థాన్. సౌదీ అరేబియా, పాకిస్థాన్ మధ్య దశాబ్దాలుగా బలమైన వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. రక్షణ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రెండు దేశాలు సన్నిహితంగా వ్యవహరిస్తున్నాయి. పాకిస్థాన్ అణు కార్యక్రమానికి గతంలో సౌదీ మద్దతు ఇచ్చిందనే ఆరోపణలు అంతర్జాతీయ స్థాయిలో వినిపించినప్పటికీ, ఇరు దేశాలు వాటిని అధికారికంగా అంగీకరించలేదు. 1980లలో పాకిస్థాన్ అణు కార్యక్రమం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో సౌదీతో రహస్య అవగాహన ఉందనే వార్తలు వచ్చాయి. భవిష్యత్తులో ప్రాంతీయ సంక్షోభం ఏర్పడితే పాకిస్థాన్ నుంచి అణు సహకారం పొందే అవకాశం ఉందనే ఊహాగానాలు అప్పటి నుంచి కొనసాగుతున్నాయి. ఇప్పుడు సౌదీకి అణు సాంకేతికతపై మరింత సానుకూలత లభించే అవకాశం రావడంతో ఈ పాత చర్చలు మరోసారి తెరపైకి వచ్చాయి.అయితే ఒక దేశం అణు ఆయుధాన్ని తయారు చేయడం అంత సులభమైన ప్రక్రియ కాదు. యురేనియం శుద్ధి సామర్థ్యం ఒక భాగం మాత్రమే. దానికి తోడు అణు వార్‌హెడ్ రూపకల్పన, క్షిపణి వ్యవస్థల అభివృద్ధి, సాంకేతిక పరీక్షలు, భద్రతా వ్యవస్థలు వంటి అనేక అంశాలు అవసరం. అయినప్పటికీ, అణు సామర్థ్యానికి దారితీసే సాంకేతిక మార్గం తెరుచుకోవడం కూడా అంతర్జాతీయ భద్రతలో కీలక పరిణామంగానే పరిగణిస్తారు. అమెరికా దృష్టిలో ఈ ఒప్పందం కేవలం అణు విద్యుత్ ప్రాజెక్టు కాదు. మధ్యప్రాచ్యంలో తన ప్రభావాన్ని కొనసాగించడం, సౌదీతో సంబంధాలను మరింత బలోపేతం చేయడం, చైనా వంటి దేశాల ప్రభావాన్ని పరిమితం చేయడం వంటి వ్యూహాత్మక లక్ష్యాలు కూడా ఇందులో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇక ఇజ్రాయెల్ మాత్రం భద్రతా కోణంలో ఈ పరిణామాన్ని చూస్తోంది. భవిష్యత్తులో సౌదీ అణు సామర్థ్యం ప్రాంతీయ శక్తి సమతుల్యతను మార్చే అవకాశం ఉందని ఆ దేశంలోని పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఒప్పందం ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రావాల్సి ఉంది. అమెరికా కాంగ్రెస్ పరిశీలన, అంతర్జాతీయ పర్యవేక్షణ, భద్రతా నిబంధనలు వంటి అనేక దశలు ముందున్నాయి. అయినప్పటికీ, ఈ పరిణామం ఒక విషయం స్పష్టం చేస్తోంది. -
పాక్ ఆరోపణలను తోసిపుచ్చిన భారత్
న్యూయార్క్: ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా అనుసరిస్తున్న పాకిస్తాన్‌కు ఒప్పందాల సహకరాన్ని అందించడం సాధ్యంకాదని ఐక్యరాజ్య సమితి(యూఎన్ఓ)లో భారత్ స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్, సింధు జలాల ఒప్పందం అంశాలపై ఐక్యరాజ్యసమితిలో పాక్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. జమ్మూ కశ్మీర్ భారతదేశంలోనే అంతర్భాగంగా, విడదీయరాని భాగంగా ఉంది, ఉంటుందని స్పష్టం చేసింది. ‘సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసి, భారత్ జలాలను ఆయుధంగా వాడుకుంటోంది. చట్ట విరుద్ధంగా 24 కోట్ల మందికి పైగా పాకిస్తానీల జీవనోపాధికి ముప్పు గలిగిస్తోంది’అంటూ యూఎన్ఓలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ ఆరోపణల నేపథ్యంలో భారత్ తీవ్రంగా స్పందించింది. సహజ వనరులపై భద్రతా మండలిలో బుధవారం జరిగిన ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో యూఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ మాట్లాడారు. ‘సింధు జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా, స్థిరంగా ఉంది. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా ఉపయోగిస్తున్నప్పుడు, పరస్పర విశ్వాసం, సద్భావనల ఆధారంగా సహకారాన్ని ఆశించలేము’అని అన్నారు. ‘జమ్మూ కశ్మీర్ ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగంగా, విడదీయరాని భాగంగా ఉంది, ఉంటుంది. ఇది వాస్తవం, దీనిని పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోంది. భారత సార్వ¿ౌమ భూభాగంపై పాకిస్తాన్ చేస్తున్నది దురాక్రమణ మాత్రమే. భారత్‌ను వేలెత్తి చూపడానికి బదులుగా, పాకిస్తాన్ తన సొంత వ్యవహారాలను చక్కదిద్దుకుంటూ తన ప్రజలకు మేలు చేసుకుంటే మంచింది’అని ఆయన పేర్కొన్నారు. సింధు పరీవాహక ప్రాంతంలోని ఆరు నదుల జలాలను పంచుకోవడంపై ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్ల మధ్య 1960లో సంతకాలు చేసిన ఒప్పందం సింధు జలాల ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం, తూర్పు నదులను భారతదేశానికి, పశ్చిమ నదులను అధికభాగం పాకిస్తాన్‌కు కేటాయించారు. అయితే 2025 ఏప్రిల్ 22 నాటి పహల్గామ్ ఉగ్రదాడి తరువాత సరిహద్దు ఉగ్రవాదం నేపథ్యంలో ఒప్పందం కింద సహకారం కొనసాగించలేమని భారత్ ఆ సంధిని నిలిపివేసింది. -
ఈ వీడియోను మీరూ నమ్మారా? రాజ్‌నాథ్ సింగ్ అలా చెప్పలేదు..
న్యూఢిల్లీ: భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిరసనకారులను బెదిరించినట్టు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వీడియోను పాకిస్థాన్ ప్రచార నెట్వర్క్ తప్పుడు సమాచారంతో వ్యాప్తి చేసినట్టు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది.పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఆ ప్రచారాన్ని నకిలీగా తేల్చింది. వైరల్ వీడియోను కృత్రిమంగా రూపొందించారని, ప్రజలను తప్పుదారి పట్టించే తప్పుడు సమాచార ప్రచారంలో భాగంగా పాకిస్థాన్ ప్రచార అకౌంట్లు దాన్ని విస్తృతంగా షేర్ చేస్తున్నాయని తెలిపింది.ఆన్లైన్లో ప్రచారం అవుతున్న తప్పుడు వీడియోతో పాటు రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడిన ఎలాంటి మార్పులు చేయని వీడియోను కూడా ఫ్యాక్ట్ చెక్ విభాగం విడుదల చేసింది.ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలపై రక్షణ మంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయలేదని పీఐబీ స్పష్టం చేసింది. “ఈ వీడియో నకిలీ, కృత్రిమ మేధతో రూపొందించారు. ఢిల్లీ నిరసనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అలాంటి ప్రకటన చేయలేదు” అని ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది.ధ్రువీకరణ లేని సమాచారాన్ని షేర్ చేయవద్దని పీఐబీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. భారత ప్రభుత్వానికి సంబంధించిన అనుమానాస్పద పోస్టులను పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగానికి తెలియజేయాలని సూచించింది. నిజమైన సమాచారం కోసం అధికారిక సోర్సులనే నమ్మాలని కోరింది.రాజ్‌నాథ్ సింగ్ ఏమన్నారు?బుధవారం రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-యూజీ) 2026 ప్రశ్నపత్రం లీక్ వివాదంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పారు.విద్యార్థులను రాజకీయ సాధనంగా ఉపయోగించేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయని రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. ఎక్స్‌లో చేసిన పోస్టులో.. “ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తమ రాజకీయ ప్రయోజనాల కోసం మన దేశ విద్యార్థులను, యువతను రాజకీయ సాధనంగా ఉపయోగించేందుకు కొందరు ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరం” అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ⚠️ Fake Video Alert!🚨Pakistani propaganda accounts are circulating a video of Defence Minister Rajnath Singh claiming that he made threatening remarks about the protesting students. #PIBFactCheck:❌ The video is #Fake and AI-generated.✅ Defence Minister @rajnathsingh… pic.twitter.com/nmmaHTsarp— PIB Fact Check (@PIBFactCheck) July 23, 2026 -
భారత్‌లో అంత బాగా నిరసనలు.. మనమేమో చేతగానోళ్లలా..
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల నిరసనను గమనిస్తున్న పాకిస్థానీయుల్లో ఆసక్తితో పాటు అసూయ కనిపిస్తున్నాయి. "పాకిస్థాన్‌లో ఇలా నిరసనలు ఎందుకు జరగవు?" అని వాళ్లకు వాళ్లే ప్రశ్నించుకుంటున్నారు.నీట్ ప్రశ్నపత్రం లీకులపై జరుగుతున్న నిరసనలు దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాయి. యువత ముందుండి నడిపిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఈ ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. సరిహద్దు అవతల పాకిస్థానీయులు ఆశ్చర్యంతో వీటిని గమనిస్తున్నారు. పాటలు, నినాదాలు, ఉద్యమ లక్ష్యం అన్నింటినీ విశ్లేషిస్తున్నారు.క్రికెట్ కోసమైతే వస్తారు.. పాకిస్థాన్ యువత ఎందుకు వీధుల్లోకి రావడం లేదని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు ఆ దేశీయులు. ఇస్లామాబాద్‌లోని డీ-చౌక్ వద్ద లైవ్ క్రికెట్ మ్యాచ్‌లు చూసే జనం.. అక్కడ ఇతర కారణాలపై (సమస్యలపై) మాత్రం ఎందుకు గుమిగూడడం లేదని ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి సమాధానం ఏంటంటే "పాకిస్థాన్‌లో అసలు ప్రజాస్వామ్యమే లేదు" అని కంటెంట్ క్రియేటర్ మహ్మద్ వలీద్ చెప్పిన మాటతో చాలామంది ఏకీభవిస్తున్నారు.‘‘డాన్’’ పత్రిక మాజీ సంపాదకుడు సిరిల్ అల్మీడా జంతర్ మంతర్ నిరసనలను "రావల్పిండీకి హెచ్చరిక"గా అభివర్ణించారు. రావల్పిండి నగరంలోనే పాకిస్థాన్ సైన్య ప్రధాన కార్యాలయం ఉంది. తమ దేశంలో ఇలాంటి విప్లవం రావడం లేదని నిరాశ చెందుతున్నారు.పోలీసుల దౌర్జన్యానికి వస్తే రెండు దేశాల్లోనూ పరిస్థితి ఒకేలా ఉంటుందని అంటున్నారు. వలీద్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియోలో భారత యువత నుంచి పాకిస్థాన్ యువత నేర్చుకోవాల్సిన విషయాలను వివరించారు. నిరసన చేయాలంటే పెద్ద స్థాయిలో చేయాలని ఆయన అన్నారు. "పాకిస్థానీయులు తమ సంకల్పాన్ని ఎప్పుడూ చూపలేరు. 'నాకు ఏమాత్రం పట్టదు' అనే ధోరణితో ఉంటారు. డిగ్రీ తీసుకుని దేశం వదిలి వెళ్లడంపైనే మాట్లాడుతుంటారు. ఇది ఓడిపోయిన వారి ప్రవర్తన" అని చెప్పారు.బంగ్లా, భారత్‌లోనే నిరసనలు మరో పాకిస్థాన్ కంటెంట్ సృష్టికర్త నోమీ సయ్యద్ మాట్లాడుతూ.. "ఈ ఉపఖండంలో బంగ్లాదేశీయులు మార్పు తీసుకురాగలుగుతున్నారు. భారతీయులు నిరసన చేయగలుగుతున్నారు. పాకిస్థాన్‌లో మాత్రం అలాంటి వారు లేరు. మా దేశంలో ఇలాంటి విప్లవం ఎప్పుడూ రాదు" అని ఆయన అన్నారు.మరో ప్రముఖ ఇన్ఫ్లూయెన్సర్ మహ్వాష్ అజాజ్ మాట్లాడుతూ.. భారత్‌లోని నిరసనలకు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని చెప్పారు. "వందే మాతరం పాడుతూ దేశ అభివృద్ధి కోసం నిరసన చేస్తారు. కానీ, పాకిస్థానీయులను మాత్రం ఇక్కడ వేర్పాటువాదులుగా ముద్ర వేస్తారు" అని అన్నారు.అయితే అందరూ ఇదే అభిప్రాయంతో లేరు. మానవ హక్కుల పాత్రికేయురాలు అలిఫియా సోహైల్ మాట్లాడుతూ.. "పాకిస్థాన్ నిరసనల గురించి మీరు మాట్లాడే తీరు, భారత మీడియా భారత్‌లోని నిరసనల గురించి మాట్లాడే తీరులానే ఉంది" అని అన్నారు."భారత కంటెంట్ సృష్టికర్తలు, ఇన్ఫ్లూయెన్సర్లు తమ ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంటున్నారు. ఇక్కడ మాత్రం అణచివేతకు పాల్పడేవారి గొంతుకగా మారేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. వెన్నెముక లేని వర్గం" అని అబ్దుల్లా అనే ఎక్స్ యూజర్ పేర్కొన్నారు. -
పాక్‌కు ఉబర్ డ్రైవర్ ఫోన్.. వైరల్ చేసిన భారత మహిళ
న్యూఢిల్లీ: ఉబర్ క్యాబ్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళ.. డ్రైవర్ ఫోన్లో పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తితో మాట్లాడుతుండటాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఢిల్లీకి చెందిన స్వాతి గోయల్ శర్మ ఇటీవల ఉబర్ క్యాబ్‌లో ప్రయాణించారు. ఆ సమయంలో క్యాబ్ డ్రైవర్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుండగా ఆమె గమనించారు. ‘మీరు పాకిస్థాన్ నుంచా?’ అని డ్రైవర్ అంటుండటంతో ఆమె అప్రమత్తమయ్యారు. వెంటనే తన ఫోన్ తీసి ఆ సంభాషణను దాదాపు 51 సెకన్ల పాటు వీడియో రికార్డు చేశారు.రైడ్ ముగిసిన తర్వాత మహిళ ఆ డ్రైవర్‌ను నిలదీయగా.. తాను ‘ట్రూమీట్’ అనే మొబైల్ యాప్‌లోని ఓ గ్రూప్‌లో సభ్యుడిగా ఉన్నానని, అందులో చాలా మంది పాకిస్థానీలు కూడా ఉన్నారని డ్రైవర్ సమాధానమిచ్చాడు. ఆ యాప్‌లో భారతీయులను మతపరమైన చర్చల్లోకి లాగుతుంటారని, హిందూ ఆచారాలపై అనవసరమైన ప్రశ్నలు అడుగుతుంటారని డ్రైవర్ వివరించినట్లు స్వాతి తెలిపారు. In the Uber cab I took today, I overheard the driver saying - “aap pakistan se ho na…”I started recording after that. The driver started - aapki Mecca medina mein pehle shivling thi..” You can hear the rest of what he said in this video till my destination arrived Before… pic.twitter.com/c9GbBxwgGz— Swati Goel Sharma (@swati_gs) July 21, 2026ఈ తరహా చాటింగ్ యాప్‌ల ద్వారా ఉగ్రవాద సంస్థలు ప్రజలను ప్రభావితం చేసే అవకాశం ఉందని స్వాతి ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా ఏజెన్సీలు ఇలాంటి వాటిపై నిఘా వేయాలని, ఇలాంటి విదేశీ యాప్‌ల పట్ల యువత జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన స్క్రీన్షాట్లు, వివరాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఏఐతో భారీ సంక్షోభం: జర్నలిస్ట్ రాబర్ట్ పెస్టన్ భవిష్యవాణి! -
భారత్‌లో నిరసనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
భారత్‌లో జరుగుతున్న నిరసనలపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేపడుతున్న నిరసనలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియా వేదికగా ఇలా అన్నాడు.I am disturbed because every protest in India seems to have the same script.1. Abuse Lord Ram.2. Abuse Bharat Mata.3. Abuse PM Modi.4. Abuse PM Modi’s late mother.5. Abuse Brahmins.6. Abuse Hindutva.No discussion.No solutions.Only slogans, abuse, and chaos.The…— Danish Kaneria (@DanishKaneria61) July 22, 2026"భారత్‌లో జరిగే ప్రతి నిరసనకూ ఒకే రకమైన స్క్రిప్ట్ ఉండటం బాధాకరం. అనేక నిరసనల్లో సమస్యల పరిష్కారం కంటే రాముడిని తిట్టడం, భరతమాతను తిట్టడం, నరేంద్ర మోదీని, ఆయన తల్లిని తిట్టడం, హిందుత్వం, బ్రాహ్మణులపై విమర్శలు చేయడమే ఎక్కువగా కనిపిస్తుంది. చర్చలు లేవు, పరిష్కారాలు లేవు.. నినాదాలు, దూషణలు, గందరగోళమే కనిపిస్తుంది.అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఇంకా ఖరారు కాకముందే కొందరు రైతులు ఢిల్లీ ముట్టడికి సిద్ధమవుతున్నారు.ప్రతిపక్ష రాజకీయ వర్గాలు నేపాల్ తరహా పరిస్థితిని సృష్టించగలమనే భ్రమలో ఉన్నాయి. రోజురోజుకు పరిస్థితి మరీ సర్కస్‌లా మారుతుంది. వాస్తవాలను నిర్ధారించుకోకుండా నిరసన తెలపడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, దేశం ఎలా పురోగమించగలదు" అంటూ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు.దానిష్ కనేరియా చేసిన ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు అతడి అభిప్రాయాలకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు ప్రాముఖ్యతను గుర్తు చేస్తున్నారు.కాగా, పాక్ మాజీ లెగ్ స్పిన్నర్ అయిన కనేరియా గతంలోనూ భారత దేశానికి, ప్రధాని మోదీకి అనుకూలంగా మాట్లాడి వార్తల్లో నిలిచాడు. కనేరియా హిందువు కావడంతో పాక్ జట్టులో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని గతంలో చాలాసార్లు ప్రస్తావించాడు. -
పాక్‌కు భారత్ గట్టి కౌంటర్.. ఉగ్రవాదంపై నిలదీత!
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో సరిహద్దు ఉగ్రవాదాన్ని జాతీయ విధానంగా ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై భారత్ తీవ్రస్థాయిలో మండిపడింది. జమ్ము కశ్మీర్‌పై పాకిస్తాన్ అవాస్తవాలను ప్రచారం చేస్తూ, అంతర్జాతీయ వేదికను దుర్వినియోగం చేస్తోందని ఐరాసలో భారత్ శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీశ్ తీవ్రంగా తప్పుబట్టారు.సహజ వనరుల పాలన, శాంతి, భద్రత, సమృద్ధికి పునాది అనే అంశంపై జరిగిన ఐరాస భద్రతా మండలి ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో ఆయన మాట్లాడారు. జమ్ము కశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని, విడదీయరాని భాగమని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్న రాజ్యాంగ, చట్టపరమైన వాస్తవం ఇదేనని తేల్చిచెప్పారు.కశ్మీర్‌కు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఏకైక వివాదం భారత్ భూభాగాన్ని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకోవడమేనని హరీశ్ స్పష్టం చేశారు. సింధు జలాల ఒప్పందంపై మాట్లాడుతూ, ఈ విషయంలో భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. సరిహద్దు ఉగ్రవాదం కొనసాగుతున్న తరుణంలో పరస్పర విశ్వాసం, సద్భావనతో కూడిన సహకారం ఉండదని ఆయన తేల్చిచెప్పారు. భారత్‌పై నిందలు వేయడం మాని, పాకిస్తాన్ తన దేశంలోని అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.ఇది కూడా చదవండి: ఆన్లైన్లో సీజేపీ నిరసన: 8.4 లక్షలు దాటిన సంతకాలు! -
ఆక్రమిత కశ్మీర్‌కు ప్రధాని కావాలనేదే నా ఆశ: నవాజ్ షరీఫ్
లాహోర్: పాకిస్తాన్ ఆక్రమిత్ కశ్మీర్(పీవోకే)కు ప్రధాని మంత్రి కావాలనేదే తన కల అని మాజీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వెల్లడించారు. నవాజ్ ప్రస్తుతం పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్) పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. జూలై 27వ తేదీ నుంచి ఆగస్ట్ పదో తేదీ వరకు జరిగే పీవోకే ఎన్నికల్లో గెలిచి ప్రధాని అవ్వాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.ముజఫరాబాద్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో నవాజ్ మాట్లాడారు. ‘నా సొంత ప్రావిన్స్ పంజాబ్ కంటే పీవోకే అంటేనే నాకు ప్రేమ ఎక్కువ. ఇది నా రెండో సొంతిల్లు. మా పూర్వీకులు ఇక్కడి నుంచే వలస వచ్చారు. ఈసారి ఎన్నికల్లో మా పార్టీ గెలిస్తే ఈ ప్రాంతానికి ప్రధానిని చేయాలని దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ను కోరతా. ఇక్కడ ప్రధానిగా కొనసాగితే ఈ ప్రాంత అభివృద్ధిని స్వయంగా పర్యవేక్షించే భాగ్యం దక్కుతుంది’ అని నవాజ్ వ్యాఖ్యానించారు. పీఎంఎల్–ఎన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని నవాజ్ హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల విస్తరణ, రహదారులు, విద్య, వైద్య రంగాల అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.ఇదిలా ఉండగా, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ భారతదేశంలోని కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ–కాశ్మీర్లో అంతర్భాగమేనని భారత్ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తోంది. 1994లో భారత పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం ప్రకారం, పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న ఈ ప్రాంతం భారతదేశానికి చెందినదేనని, దానిపై భారతదేశానికే పూర్తి హక్కులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటిస్తోంది. భారత విదేశాంగ శాఖ కూడా పీవోకేపై పాకిస్తాన్ చేసే రాజకీయ వ్యాఖ్యలు లేదా ఎన్నికలను భారత సార్వభౌమాధికారాన్ని ప్రభావితం చేయలేవని పలుమార్లు స్పష్టం చేసింది. -
అమెరికాని రూ. 96 వేల కోట్లు అడిగిన పాకిస్థాన్!
ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్, తన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి అమెరికా సహాయాన్ని కోరింది. అమెరికా-ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించిన తర్వాత, పాకిస్థాన్ అమెరికా నుండి 10 బిలియన్ (రూ. 96,536 కోట్ల) డాలర్ల భారీ ఆర్థిక సహాయాన్ని కోరినట్లు రాయిటర్స్ కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణంలో పాకిస్థాన్ మధ్యవర్తిగా వ్యవహరించి, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించింది. ఆ దౌత్యపరమైన క్రెడిట్‌ను ఉపయోగించుకుని, ఇప్పుడు వాషింగ్టన్ నుండి ఈ భారీ ఆర్థిక ప్రయోజనాన్ని పొందాలని పాకిస్థాన్ ఆశిస్తోంది. ఒకవేళ అమెరికా గనుక ఈ 10 బిలియన్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపితే, అది పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు సంజీవనిలా మారుతుంది. దీనివల్ల పాకిస్థాన్ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి. యూఎస్ డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి విలువ పడిపోకుండా స్థిరపడుతుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలపై ఆధారపడే అవసరం తగ్గుతుంది. అయితే,ఈ విన్నపంపై అటు అమెరికా, ఇటు పాకిస్థాన్ ప్రభుత్వం గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.కానీ, పాక్ ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్‌తో భేటీ అయినప్పుడు.. ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల వల్ల తమ దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతలా దెబ్బతింటుందో వివరించినట్లు పాక్ విదేశాంగ శాఖ ధృవీకరించింది. పాకిస్థాన్ ప్రస్తుతం ఐఎంఎఫ్ నుండి పొందిన 7 బిలియన్ల ప్యాకేజీ కింద కొనసాగుతోంది. ఈ లోన్ పొందడం కోసం పాక్ ప్రభుత్వం ప్రజలపై భారీగా పన్నులు పెంచడం, ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకోవడం వంటి కఠినమైన సంస్కరణలను అమలు చేస్తోంది.2023లో ఒక దశలో పాకిస్థాన్ దేశం పూర్తిగా దివాళా తీసే పరిస్థితికి రాగా, అప్పట్లో ఐఎంఎఫ్ ఇచ్చిన మూడు బిలియన్ల అత్యవసర నిధులు కాపాడాయి. ఆ తర్వాత వాతావరణ మార్పుల తట్టుకునేందుకు మరో 1.3 బిలియన్ల లోన్ కూడా పొందింది. ఇవన్నీ ఉన్నప్పటికీ, చైనా, సౌదీ అరేబియాలు ఇచ్చే అప్పులపైనే పాకిస్థాన్ విదేశీ నిల్వలు ఆధారపడి ఉన్నాయి.అసలు ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ ఫెసిలిటీ అంటే ఏంటి?ఇది అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ తన ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ ఫండ్ ద్వారా అందించే చాలా అరుదైన ఆర్థిక ప్యాకేజీ. ఏదైనా మిత్రదేశం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు దాని కరెన్సీని కాపాడటానికి, డాలర్ ఫండింగ్ లేదా గ్యారెంటీల రూపంలో అమెరికా ఈ సహాయాన్ని అందిస్తుంది. గతంలో 2002లో ఉరుగ్వే దేశానికి, 2025లో అర్జెంటీనా దేశానికి అమెరికా ఇటువంటి ప్యాకేజీలను ప్రకటించింది. -
పాక్ క్రికెటర్లకు పీసీబీ వింత కండీషన్
పాకిస్తాన్ క్రికెటర్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు (PCB) వింత కండీషన్ పెట్టింది. లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో శిక్షణ పొందే ఆటగాళ్ల ఫిట్నెస్ మెరుగుపరిచేందుకు 'పాడెల్' ఆటను తప్పనిసరి చేసింది. ప్రతి రెండో రోజు 40 నిమిషాల పాటు ప్రతి ఆటగాడు పాడెల్ గేమ్‌ను ఆడాల్సిందేనని ప్రకటన జారీ చేసింది.పీసీబీ సీనియర్ సెలెక్టర్, డైరెక్టర్ ఆఫ్ హై పెర్ఫార్మెన్స్ ఆకిబ్ జావెద్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఆటగాళ్ల చురుకుదనం, రిఫ్లెక్సులు, కదలికలు, ఫీల్డింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడమే ఈ చర్య లక్ష్యమని ఆయన చెప్పారు.ఇప్పటికే పలువురు క్రికెటర్లు పాడెల్ ఆడుతున్నప్పటికీ, అందుకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆకిబ్ తెలిపారు. ఇప్పుడు ఎన్సీఏలోనే ప్రత్యేక పాడెల్ కోర్టును ఏర్పాటు చేయడంతో శిక్షణతో పాటు ఈ ఆటను కూడా ఆడే అవకాశం కల్పించినట్లు చెప్పారు.టెన్నిస్, స్క్వాష్ అంశాల కలయికతో ఆడే పాడెల్ చిన్న కోర్టులో జరిగినప్పటికీ, అధిక స్థాయి ఫిట్నెస్, వేగం, స్టామినా అవసరమయ్యే క్రీడగా గుర్తింపు పొందింది. అందుకే దీన్ని క్రికెటర్ల శిక్షణలో భాగం చేశామని ఆకిబ్ వెల్లడించారు.అంతేకాకుండా, భవిష్యత్తులో ఎన్సీఏలో బాస్కెట్‌బాల్ కోర్టులు, స్నూకర్‌తో పాటు ఇతర ఇండోర్ గేమ్స్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే అత్యాధునిక ఏఐ (AI) బౌలింగ్ మెషీన్‌ను అకాడమీలో అందుబాటులోకి తీసుకువచ్చామని, ఆటగాళ్ల నైపుణ్యాలను మరింత మెరుగుపరచడమే పీసీబీ లక్ష్యమని ఆకిబ్ పేర్కొన్నారు.ఇదిలా ఉంటే, పాకిస్తాన్ జట్టు వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. ఆ పర్యటనలో భాగంగా మూడు టెస్ట్‌లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం పాక్ జట్టును ఇదివరకే ప్రకటించారు. ఈ పర్యటనతో కెప్టెన్‌గా బాబర్ ఆజం శకం మళ్లీ మొదలవుతుంది. మాజీ కెప్టెన్ షాన్ మసూద్ వరుస వైఫల్యాల నేపథ్యంలో అతడిని తొలగించి బాబర్‌కు కెప్టెన్సీ పగ్గాలు మళ్లీ కట్టబెట్టారు. -
మధ్యవర్తిత్వం పేరుతో పాక్ స్కెచ్.. అమెరికాకు వల ?
ఇస్లామాబాద్: ఇరాన్- అమెరికా యుద్ధంలో మధ్యవర్తి పాత్ర పోషిస్తూ పాక్ ఇచ్చినా బిల్డప్ అంతా ఇంతా కాదు. ఇస్లామాబాద్ టాక్స్ పేరుతో పెద్ద హంగామానే చేసింది. ఇంత చేసి యుద్ధం ఆగడం మాట అటుంచితే అది మరింత ముదిరింది. అయితే ఈ మధ్యవర్తిత్వం పేరుతో అమెరికాకు మరింత దగ్గరైన పాక్ ఇప్పుడు ఆ దేశం నుంచి మెల్లగా ఆర్థిక సాయం పొందే ప్లాన్ వేస్తోంది.ఆర్థిక సంక్షోభంలో సతమతమవుతున్న పాక్, వాషింగ్టన్ నుండి $10 బిలియన్ల 'ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ ఫెసిలిటీ' ని కోరినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, దేశంలో పడిపోతున్న విదేశీ మారక నిల్వలను పునరుద్ధరించడానికి, పాకిస్తానీ రూపాయి విలువపై ఒత్తిడిని తగ్గించడానికి ఊరట లభించినట్లవుతుందని కథనాలు పేర్కొన్నాయి.పాకిస్తాన్ ప్రభుత్వం యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్కు పంపిన ప్రతిపాదనలో, ఐదేళ్ల కాలపరిమితి కలిగిన $10 బిలియన్ల ద్వైపాక్షిక ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఫెసిలిటీని ఏర్పాటు చేయాలని అమెరికాను కోరింది. ప్రస్తుతం పాకిస్తాన్ $7 బిలియన్ల IMF ప్రోగ్రామ్ కింద కఠినమైన ఆర్థిక నిబంధనలను అమలు చేస్తోంది. దీనివల్ల పన్నుల పెంపు, ప్రభుత్వ వ్యయం తగ్గించడం వంటి కొన్ని ప్రజాదరణ లేని నిర్ణయాలు తీసుకోవలసి వచ్చింది. యుఎస్ అందించే ఈ సదుపాయం లభిస్తే పాకిస్తాన్‌కు IMF నిధులపై మరియు ఆకస్మిక రుణాలపై ఆధారపడటం తగ్గుతుంది.'ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్' సదుపాయం ?యుఎస్ ట్రెజరీ నుండి లభించే ఈ సదుపాయాలు చాలా అరుదుగా ఇస్తారు. ఇవి సాధారణంగా "ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ ఫండ్" ద్వారా డాలర్లు, స్వ్యాప్లు (swaps) లేదా గ్యారెంటీల రూపంలో లభిస్తాయి. గతంలో 2025లో అర్జెంటీనాకు, 2002లో ఉరుగ్వేకు ఈ విధమైన ప్యాకేజీలు అందించారు. మెక్సికోకు కూడా 1940ల నాటి $9 బిలియన్ల స్వ్యాప్ లైన్ అందుబాటులో ఉంది.పాకిస్తాన్ ప్రస్తుత ఆర్థిక స్థితి2023లో $3 బిలియన్ల IMF స్టాండ్‌బై ఒప్పందంతో డిఫాల్ట్ కాకుండా బయటపడిన పాకిస్తాన్, ఆ తర్వాత $7 బిలియన్ల ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ మరియు వాతావరణ మార్పుల కోసం $1.3 బిలియన్ల రుణాన్ని పొందింది. అయినప్పటికీ, పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు ఇంకా చైనా మరియు సౌదీ అరేబియా రోల్ఓవర్లు, డిపాజిట్లపైనే ఆధారపడి ఉన్నాయి.ఏప్రిల్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి పాకిస్తాన్ $3.5 బిలియన్లు చెల్లించాల్సి రాగా, సౌదీ అరేబియా $3 బిలియన్ల కొత్త మద్దతును అందించింది. 2026 చివరి నాటికి తమ విదేశీ మారక నిల్వలు $20 బిలియన్లకు చేరుకుంటాయని పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ అంచనా వేసింది.ఫిచ్ రేటింగ్స్, హెచ్చరికలుIMF ప్రోగ్రామ్ వల్ల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కొంత స్థిరపడినప్పటికీ, పెరిగే ఇంధన ధరలు మరియు సరఫరా అంతరాయాలు విదేశీ మారక నిల్వలను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఫిచ్ రేటింగ్స్ హెచ్చరించింది. అలాగే క్రెడిట్ రేటింగ్ తక్కువగా ఉండటం వల్ల విదేశీ పెట్టుబడులు రావడం లేదు. -
అంతర్జాతీయ వేదికపై పాక్ పరువు పాయే!
న్యూఢిల్లీ: సింధు జలాల ఒప్పందం (ఐడబ్ల్యూటీ)పై కెనడా విదేశాంగ మంత్రితో పాకిస్తాన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఐడబ్ల్యూటీతో పాటు, కశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవాలని పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కెనడాను కోరారు. అయితే కెనడా విదేశాంగ మంత్రితో జరిగిన ఈ సమావేశం అనంతరం ఇరు దేశాల సంయుక్త ప్రకటనలో సింధు జలాల ఒప్పందం గానీ, కశ్మీర్ అంశం గానీ ఎక్కడా ప్రస్తావనకు రాలేదు.అంతర్జాతీయ వేదికలపై నిత్యం భారత్‌పై నిందలు మోపే పాకిస్తాన్ ప్రయత్నాలకు కెనడాలో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెనడా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఆ దేశ విదేశాంగ మంత్రి అనితా ఆనంద్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తోందని, దీనిపై అంతర్జాతీయంగా ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా కశ్మీర్ వివాదంలోనూ మధ్యవర్తిత్వం వహించాలని కోరినట్లు సమాచారం.అయితే, దౌత్య సంబంధాల పరంగా పాక్ అభ్యర్థనలను కెనడా పెద్దగా పట్టించుకోలేదని స్పష్టమైంది. భేటీ ముగిసిన తర్వాత విడుదల చేసిన అధికారిక సంయుక్త ప్రకటనలో కశ్మీర్, సింధు జలాల వివాదం గురించి కనీసం ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. దీంతో అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ మరోమారు పరువు తీసుకున్నట్లయ్యింది.ఇది కూడా చదవండి: అభిషేక్ బెనర్జీకి హైకోర్టు షాక్ .. కంటి చికిత్సకు సలహా! -
పాక్‌లో మరింత పేదరికం.. ప్రతి10 మందిలో ముగ్గురు..
ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్తాన్లో పేదరిక రేటు భారీగా పెరిగింది. ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒడిదుడుకులు, గ్రామీణ-పట్టణ వ్యత్యాసాల వల్ల దాదాపు ప్రతి 10 మందిలో ముగ్గురు (28.9 శాతం మంది) పేదరిక రేఖకు దిగువన జీవిస్తున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది.‘డాన్’ ప్రచురించిన విశ్లేషణ ప్రకారం.. పాకిస్తాన్ తాజా హౌస్‌హోల్డ్ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్ సర్వే (హెచ్ఐఈఎస్), పాకిస్తాన్ సోషల్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్ మెజర్మెంట్ (పీఎస్ఎల్ఎం) గణాంకాల ఆధారంగా 2024-25 నాటికి జాతీయ పేదరిక రేటు 28.9 శాతానికి చేరింది. 2018-19లో ఇది 21.8 శాతంగా ఉండేది. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత వెలువడిన ఈ సర్వే దేశవ్యాప్తంగా జీవన ప్రమాణాలు ఏ విధంగా దిగజారాయో స్పష్టం చేస్తోంది.గ్రామీణ ప్రాంతాలు ఈ ఆర్థిక సంక్షోభం ప్రభావానికి తీవ్రంగా గురయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం సుమారు ఎనిమిది శాతం మేర పెరగగా, పట్టణ ప్రాంతాల్లో ఆరు శాతం పెరిగింది. చెల్లింపుల సంక్షోభాలు, కొవిడ్-19 మహమ్మారి, నిరంతర ద్రవ్యోల్బణం, పెరిగిన వస్తువుల ధరలు, సుదీర్ఘ ఆర్థిక సర్దుబాటు చర్యల వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఇది కూడా చదవండి: సొరంగంలో విషాదం.. పలువురు కార్మికులు గల్లంతు! -
పాకిస్తాన్.. ఆ నిజాన్ని దాచేసింది!
ఢిల్లీ: భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' ముందు పాకిస్తాన్ సైన్యం ఘోరంగా విఫలమైందని.. ఆ పరాజయాన్ని కప్పిపుచ్చుకోవడానికే పాక్ మిలిటరీ విజయం సాధించామంటూ అబద్ధపు ప్రచారాన్ని సృష్టించిందని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి నోరీన్ నియాజీ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... 'ఆపరేషన్ సింధూర్'లో పాకిస్తాన్ సైనిక నాయకత్వం ప్రజలకు చెప్పినట్లుగా ఏమీ జరగలేదని స్పష్టం చేశారు. భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' అపార విజయం సాధించిందని.. తమ సైన్యం ఓటమిని అంగీకరించలేక నిజాలను తొక్కిపెట్టేందుకు ప్రయత్నిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.ఇజ్రాయెల్, పాకిస్థాన్ సంబంధాలపైనా ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. కొన్ని దేశాలు ఇప్పటికీ ఇజ్రాయెల్‌ను ఓ దేశంగా గుర్తించడం లేదన్నారు. ఆ లిస్ట్‌లో ఉన్న పాకిస్థాన్.. ఇటీవల ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తించే దిశగా అడుగులు వేస్తుండటం కూడా ఇరు దేశాల మధ్య ఘర్షణ తీవ్రతరం కాకపోవడానికి కారణమని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ 'అబ్రహం అక్కార్డ్స్’లో చేరి.. ఇజ్రాయెల్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించే దిశగా అడుగులు వేయించేందుకే అంటూ ఆమె ఆరోపణలు గుప్పించారు.ఈ యుద్ధం.. మరింత పెద్దది కాకుండా నిలిచిపోవడానికి కారణం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అని.. పాకిస్తాన్ నాయకత్వం తమ పరువు కాపాడుకోవడానికి ట్రంప్ స్వయంగా జోక్యం చేసుకుని సహాయం చేశారని తెలిపారు. కాగా, నోరీన్ నియాజీ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ సైనిక వర్గాల్లో కలకలం రేపాయి. ఈ ప్రకటనలు వెలువడిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NCCIA) ఆమెకు నోటీసులు జారీ చేసింది. -
బలూచ్ బిగ్ ట్విస్ట్‌తో చైనా-పాక్ ఫ్రెండ్షిప్ ఖతం!
పాకిస్థాన్ ఉనికినే ప్రశ్నిస్తూ, ఆ దేశపు అతిపెద్ద ప్రావిన్స్(రాష్ఠ్రం) ‘బలూచిస్తాన్’ నుండి ఒక సంచలన ప్రకటన వెలువడింది. బలూచ్ నేత మీర్ యార్ బలూచ్ సోషల్ మీడియాలో చేసిన ఒక వైరల్ ట్వీట్ అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపింది. బలూచిస్తాన్‌ను ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించడమే కాకుండా, ఆ ప్రాంతంలోని 85 శాతం భూభాగంపై తమ నియంత్రణ ఉందని ఆయన పేర్కొనడం పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సొంత జెండా, జాతీయ గీతం ‘బలూచీ ఫాలూస్’ పేరుతో కొత్త కరెన్సీని కూడా ప్రకటించడంతో, ఈ ప్రాంతం మళ్లీ ప్రపంచ రాజకీయాల్లో చర్చాంశంగా మారింది.బలూచిస్తాన్ ఎందుకు కీలకం?పాకిస్థాన్ మొత్తం వైశాల్యంలో అతిపెద్ద ప్రాంతమైన బలూచిస్తాన్, ఆ దేశానికి ప్రాణవాయువు వంటిది. ఇది కేవలం భౌగోళికంగానే కాకుండా, ఖనిజ సంపద పరంగానూ ఎంతో సమృద్ధిగా ఉంది. ఇక్కడ బంగారం, రాగి, సహజ వాయువు, బొగ్గు వంటి అరుదైన ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ ప్రావిన్స్ గనుక పాకిస్థాన్ నుంచి విడిపోతే, పాక్ ఆర్థిక స్థితిగతులు కుప్పకూలడం ఖాయం. అత్యంత వ్యూహాత్మకమైన ఈ ప్రాంతం, ఆసియా దేశాల మధ్య ఒక ప్రధాన ‘గేట్‌వే’గా పనిచేస్తోంది.దశాబ్దాల సుదీర్ఘ పోరాటం1947లో భారత్-పాకిస్థాన్ విభజన జరిగినప్పటి నుండే బలూచిస్తాన్‌లో నిరసనలు మొదలయ్యాయి. 1950, 60, 70 దశకాల నుంచి ఇప్పటి వరకు ఎన్నో సార్లు బలూచ్ ప్రజలు తిరుగుబాటు చేశారు. స్వయంప్రతిపత్తి కోసం, తమ సహజ వనరులపై తమకే హక్కు ఉండాలని, మానవ హక్కుల ఉల్లంఘన ఆపాలని కోరుతూ వీరు దశాబ్దాలుగా పాకిస్థాన్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు.కళాత్ సంస్థానం చరిత్రబలూచిస్తాన్ చరిత్ర 1947 నాటిది. విభజన సమయంలో కళాత్, మకరన్, లాస్ బేలా, ఖారన్ అనే నాలుగు స్వతంత్ర సంస్థానాలు ఉండేవి. అందులో కళాత్ అత్యంత శక్తివంతమైనది. 1947 ఆగస్టు 11న ఖాన్ ఆఫ్ కళాత్ మీర్ అహ్మద్ యార్ ఖాన్ దీన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించారు. కానీ 227 రోజుల తర్వాత, 1948 మార్చి 20న, బలవంతంగా పాకిస్థాన్‌లో విలీనం చేయబడింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పాక్ దమనకాండకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం రగిలిపోతూనే ఉంది.పేదరికంలో మగ్గుతున్న సంపన్న ప్రాంతంపాకిస్థాన్లోని ఇతర ప్రాంతాలకు గ్యాస్, విద్యుత్ అందిస్తున్న బలూచిస్తాన్, దురదృష్టవశాత్తూ పేదరికంలో కూరుకుపోయింది. ఇక్కడ 70 శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు. తమ వనరులను కేంద్రం దోచుకుంటోందని, తమకు దక్కాల్సిన అభివృద్ధి అందడం లేదని బలూచ్ జాతీయవాదులు ఆరోపిస్తున్నారు. ఈ వివక్షే ‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ’ వంటి సంస్థలు ఆయుధాలు పట్టేలా చేసింది.చైనాకు బలూచిస్తాన్ ఎందుకు ముఖ్యం?చైనా చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్’కు బలూచిస్తాన్ గుండెకాయలాంటిది. 65 బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రాజెక్ట్ ద్వారా చైనా, పశ్చిమ ప్రాంతాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానించాలని చూస్తోంది. ముఖ్యంగా గ్వాదర్ ఓడరేవు చైనాకు ఎంతో కీలకం. ఇది ప్రపంచ వాణిజ్య మార్గాలను శాసించడానికి, మలక్కా జలసంధిపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి చైనాకు ఉన్న ఏకైక మార్గం.ఆయుధ సంపత్తిపై పాక్ ఆందోళనబలూచ్ తిరుగుబాటుదారుల వద్ద ఇప్పుడు అత్యంత ఆధునిక ఆయుధాలు ఉన్నాయని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ స్వయంగా పార్లమెంట్లో అంగీకరించారు. పాక్ సైన్యం వద్ద ఉన్న ఆయుధాల కంటే శక్తివంతమైనవి విద్రోహుల వద్ద ఉన్నాయని ఆయన చెప్పడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఈ తిరుగుబాటును అణచివేయడం పాకిస్థాన్‌కు సవాలుగా మారింది.స్వతంత్ర దేశం అయ్యే అవకాశం ఉందా?ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయంగా గుర్తింపు రావడం కష్టమైనప్పటికీ, బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా మారాలనే ఆకాంక్ష ఏమాత్రం తగ్గలేదు. పాకిస్థాన్ తన సైనిక శక్తితో ఎంత అణచివేసినా, బలూచ్ ప్రజల స్వేచ్ఛాకాంక్ష రోజురోజుకూ బలపడుతోంది. అధికారిక గుర్తింపు లేకపోయినా, ఈ ప్రాంతం పాకిస్థాన్ అస్థిరతకు ప్రధాన కారణంగా నిలుస్తోంది.ఇది కూడా చదవండి: ప్రపంచం మెచ్చిన పాట.. సింగర్‌కు దక్కింది ఇంతేనా? -
రియల్ స్టోరీ చెప్పి.. గుండె గుభేల్మనిపించిన డాక్టర్
తెల్లని శాలువా కప్పుకున్న వృద్ధురాలు తమ దగ్గరకు వచ్చిందని, ఆమె మనిషి కాదని ఓ డాక్టర్ చెప్పారు. ఆయన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పాకిస్థాన్‌లోని ఓ ఆసుపత్రిలో తనకు ఎదురైన భయానక ఘటనను ఆ డాక్టర్ వివరించారు. ఆ ఘటన తనతో పాటు సిబ్బందినీ వణికించిందని తెలిపారు. అర్ధరాత్రి సమయంలో ఓ వృద్ధురాలు నర్సులతో కలిసి ఉన్న తన దగ్గరకు వచ్చిందని చెప్పారు. తనకు ఇటీవలే పుట్టిన మనవడిని పరీక్షించాలని ఆమె కోరినట్టు వివరించారు.తన మనవడికి జ్వరం వచ్చిందని వృద్ధురాలు చెప్పడంతో డాక్టర్ వెంటనే ఆ గదికి వెళ్లాడు. శిశువును పరీక్షించగా, అప్పటికే అతడు శ్వాస తీసుకోవడం ఆపేశాడని గుర్తించారు. వెంటనే చికిత్స అందించడంతో ఆ చిన్నారి గుండె స్పందన మళ్లీ వచ్చిందని తెలిపారు.ఆ ఘటన తర్వాత చిన్నారి తల్లిదండ్రులను డాక్టర్ పిలిచి, వారి బిడ్డ ప్రాణాలు కాపాడేలా చికిత్స కోసం తీసుకువచ్చిన అమ్మమ్మకు కృతజ్ఞతలు చెప్పాలని డాక్టర్ కోరారు. అప్పుడు ఆ అమ్మమ్మ ఎన్నో ఏళ్ల క్రితమే చనిపోయిందని వారు చెప్పడంతో డాక్టర్, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఆసుపత్రుల్లో సాధారణమేనని చాలామంది అన్నారు. మరికొందరు తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను పంచుకున్నారు."ఒంటరిగానే స్వర్గానికి ప్రయాణం పూర్తి చేయాలని అమ్మమ్మకి తెలుసు. తన కుటుంబంలో ఇంకెవరూ తనతో రావద్దని ఆమె అనుకుంది. అందుకే ఆ శిశువును కాపాడింది" అని ఓ యూజర్ పేర్కొన్నారు."32 ఏళ్లుగా నర్సుగా పని చేస్తున్నాను. నేను చెప్పగలిగే ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. ఆత్మలు నిజంగానే ఉంటాయి. ఆసుపత్రులు అలాంటి అనుభవాలతో నిండి ఉంటాయి" అని మరో వ్యక్తి రాశారు.ఆ డాక్టర్ అన్నీ అసత్యాలు చెబుతున్నారని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి The Gaming Doc (@gamingdocmbbs) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది -
పాక్ పవర్ సెంటర్లో ప్రకంపనలు.. మునీర్ సామ్రాజ్యానికి కొత్త సవాల్
పాకిస్తాన్ రాజకీయాల్లో మరోసారి అధికారం ఎవరి చేతుల్లో ఉంది? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. సైన్యం ప్రభావం, మతపరమైన రాజకీయాలు, ఆఫ్ఘనిస్థాన్‌తో సంబంధాలు.. ఈ మూడు అంశాలు ఒకే సమయంలో ఢీకొంటూ ఇస్లామాబాద్‌లో కొత్త ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ప్రముఖ మతపరమైన రాజకీయ నేత మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ‘రాజకీయాలు చేయాలనుకుంటే యూనిఫాం తీసేసి ఎన్నికల్లోకి రండి.. ప్రజల తీర్పును ఎదుర్కోండి’ అన్న ఫజ్లుర్ రెహ్మాన్ వ్యాఖ్యలు పాకిస్తాన్లో సైన్యం పాత్రపై మరోసారి చర్చను రేపాయి.ఫజ్లుర్ రెహ్మాన్ ఎవరు?మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సాధారణ రాజకీయ నాయకుడు కాదు. పాకిస్తాన్లో దశాబ్దాలుగా ప్రభావం చూపుతున్న మతపరమైన రాజకీయ నేతల్లో ఆయన ఒకరు. ఆయన నేతృత్వంలోని జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (JUI-F) పార్టీకి ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్థాన్ ప్రాంతాల్లో ప్రభావం ఉంది. అలాగే, పాకిస్థాన్ పార్లమెంట్లో పలుమార్లు సభ్యుడిగా ఉన్నారు. మతపరమైన చట్టాల అమలుకు మద్దతు ఇచ్చే రాజకీయ వర్గానికి ప్రతినిధిగా గుర్తింపు పొందారు. ఆఫ్ఘనిస్థాన్ తాలిబాన్‌తో చారిత్రక సంబంధాలు ఉన్న మత పెద్దగా కూడా ఆయనకు పేరు ఉంది.రెహ్మాన్ పేరు వినగానే ఆఫ్ఘనిస్థాన్ అంశం కూడా తెరపైకి వస్తుంది. కాగా, పాకిస్థాన్ సైన్యం ప్రస్తుతం తాలిబాన్ పాలిత ఆఫ్ఘనిస్థాన్‌తో సంక్లిష్ట సంబంధాలను ఎదుర్కొంటోంది. అయితే, ఆయన రాజకీయాలు ప్రధానంగా ఎన్నికలు, పార్లమెంటరీ మార్గాల ద్వారా సాగుతాయి. గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద నిరసనలకు నాయకత్వం వహించారు. రాజకీయ వ్యవస్థలో సైన్యం పాత్రపై విమర్శలు చేశారు. అందుకే ఆయన తాజా వ్యాఖ్యలు సాధారణ రాజకీయ విమర్శగా కాకుండా, సైన్యం ప్రభావంపై నేరుగా ప్రశ్నగా భావిస్తున్నారు.1990ల నుంచి..రెహ్మాన్ తాలిబాన్ భావజాలానికి దగ్గరగా ఉన్న మత వర్గాలతో సంబంధాలు కొనసాగించారు.పలువురు తాలిబాన్ నాయకులు పాకిస్థాన్‌లోని JUI అనుబంధ మదర్సాల్లో చదివినట్లు నివేదికలు ఉన్నాయి.2001లో అమెరికా ఆఫ్ఘనిస్థాన్‌పై దాడి చేసినప్పుడు ఆయన అమెరికా వ్యతిరేక ర్యాలీలు నిర్వహించారు.2021లో తాలిబాన్ మళ్లీ ఆఫ్ఘనిస్థాన్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలని పిలుపునిచ్చారు.కాబూల్‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని పాకిస్థాన్‌కు సూచించారు.అయితే ప్రస్తుతం పాకిస్థాన్–ఆఫ్ఘనిస్థాన్ సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి. అయినప్పటికీ ఫజ్లుర్ మాత్రం చర్చల ద్వారానే పరిష్కారం రావాలని చెబుతున్నారు.మునీర్‌తో విభేదాలు ఎందుకు?ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒకప్పుడు ఫజ్లుర్ రెహ్మాన్, ఆసిమ్ మునీర్ ఎదుగుదలకు పరోక్షంగా సహకరించిన రాజకీయ పరిణామాల్లో భాగమయ్యారు. 2018లో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2020లో ప్రతిపక్షాలు కలిసి పాకిస్థాన్ డెమొక్రటిక్ మూవ్మెంట్ (PDM) ఏర్పాటు చేశాయి. దీనికి ఫజ్లుర్ రెహ్మాన్ నాయకత్వం వహించారు. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం తెచ్చింది. 2022లో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. అదే సమయంలో ఆసిమ్ మునీర్ 2022లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయ్యారు. తర్వాత రాజకీయ పరిస్థితులు మారాయి.పాకిస్తాన్లో సైన్యం ఎప్పటి నుంచో అత్యంత శక్తివంతమైన సంస్థగా ఉంది. దేశ రాజకీయాల్లో సైన్యం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం చూపుతుందనే విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. ఆసిమ్ మునీర్ ప్రస్తుతం పాకిస్తాన్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరు. ఆర్మీ చీఫ్‌గా ఉన్నారు. భద్రతా విధానాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. పాక్ రక్షణ వ్యవస్థలో అత్యున్నత స్థాయిలో ఉన్నారు. అందుకే ఆయనపై వచ్చే విమర్శలు వ్యక్తిగత విమర్శలుగా కాకుండా సైన్యం పాత్రపై రాజకీయ చర్చగా మారుతాయి. సైన్యం రక్షణ వ్యవహారాలకు పరిమితం కావాలి.. రాజకీయ నిర్ణయాలు ప్రజలు ఎన్నుకున్న నాయకులు తీసుకోవాలి అని ఫజ్లుర్ డిమాండ్ చేశారు.సైన్యం చరిత్రాత్మక పాత్ర..పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి అక్కడి రాజకీయ వ్యవస్థలో సైన్యం ప్రత్యేక స్థానం కలిగి ఉంది. దేశంలో పలు మార్లు సైనిక పాలనలు వచ్చాయి. ప్రస్తుతం ప్రత్యక్ష సైనిక పాలన లేకపోయినా, విదేశాంగం, భద్రత, భారత్-ఆఫ్ఘనిస్థాన్ విధానాల్లో సైన్యం ప్రభావం కొనసాగుతుందని విమర్శకులు చెబుతారు.1958: జనరల్ అయూబ్ ఖాన్ తొలి సైనిక పాలన.1977: జనరల్ జియా ఉల్ హక్ అధికారం స్వాధీనం.1999: జనరల్ పర్వేజ్ ముషారఫ్ తిరుగుబాటు.పాక్ ముందున్న సవాల్ ఇదే..ఒకవైపు దేశ భద్రతను కాపాడే శక్తివంతమైన సైన్యం.. మరోవైపు ప్రజల ఓట్లతో వచ్చే రాజకీయ నాయకత్వం.. ఇంకోవైపు మత ప్రభావంతో ఎదిగిన రాజకీయ శక్తులు.. ఈ మూడు శక్తుల మధ్య సమతుల్యత ఎటు వెళ్తుందో రాబోయే రోజులు నిర్ణయించనున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్లో పోరు కేవలం ఇద్దరు నాయకుల మధ్య కాదు.. అది అధికారం ఎవరి చేతుల్లో ఉండాలనే దశాబ్దాల ప్రశ్నకు కొనసాగింపు. ఈ మూడు ఢీకొంటున్న వేళ ఇస్లామాబాద్‌లో కొత్త పవర్ గేమ్ మొదలైంది. -
పాక్ ఆల్‌రౌండర్‌పై నిషేధం.. గణాంకాలు రద్దు
పాకిస్థాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్ డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) శిక్ష విధించింది. 2026 టీ20 ప్రపంచకప్ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షలో నిషేధిత పదార్థం కార్బాక్సీ-టీఎచ్‌సీ (Carboxy-THC) ఉన్నట్లు తేలడంతో తొలుత మూడు నెలల నిషేధం విధించిన ఐసీసీ, అనంతరం దానిని ఒక నెలకు తగ్గించింది.పోటీకి వెలుపల తీసుకున్నట్లు అంగీకారంఫిబ్రవరి 7న కొలంబోలో నెదర్లాండ్స్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్ అనంతరం నిర్వహించిన పరీక్షలో నవాజ్ నమూనా పాజిటివ్‌గా వచ్చింది. ఈ పదార్థాన్ని పోటీ సమయంలో కాకుండా బయట వినియోగించినట్లు, ఇది ఆటలో ప్రదర్శన మెరుగుపరచడానికి కాదని నవాజ్ అంగీకరించినట్లు ఐసీసీ వెల్లడించింది.సస్పెన్షన్ ఎత్తివేతమే 1 నుంచి స్వచ్ఛందంగా తాత్కాలిక సస్పెన్షన్‌ను అంగీకరించిన నవాజ్ ఇప్పటికే రెండున్నర నెలలకుపైగా ఆటకు దూరంగా ఉన్నందున, ప్రస్తుతం అతనిపై ఉన్న నిషేధాన్ని ఐసీసీ ఎత్తివేసింది. అయితే ఐసీసీ ఆమోదించిన వ్యసన నివారణ (Substance Abuse) చికిత్స కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఆదేశించింది.గణాంకాలు రద్దునిబంధనల ప్రకారం, ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నవాజ్ ప్రదర్శనతో పాటు, మే 1న తాత్కాలిక సస్పెన్షన్ అమల్లోకి వచ్చే వరకు అతను ఆడిన మ్యాచ్‌ల వ్యక్తిగత గణాంకాలన్నింటినీ రద్దు చేసినట్లు ఐసీసీ ప్రకటించింది. -
టైం బాంబ్‌లు అమర్చి.. భారీ ఉగ్ర కుట్ర భగ్నం
దేశంలో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) భగ్నం చేసింది. పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ జైష్ ఏ మహ్మద్ (JeM)తో సంబంధాలు ఉన్న ఐదుగురిని అరెస్ట్ చేసింది. ఈ నెల ప్రారంభంలో ఇదే ఉగ్ర మాడ్యుల్‌కు చెందిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకోవడం గమనార్హం. అలాగే విచారణలో.. దేశంలోని పలు ప్రాంతాల్లో టైం బాంబ్ పేలుళ్లకు ఈ ముఠా కుట్ర పన్నినట్లు నిర్ధారించారు.పటాన్ జిల్లాలోని ఖడియాల్ గ్రామంలో గురువారం ఐదుగురు జేషై గ్రూప్ సభ్యుల్ని గుజరాత్ ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది. అరెస్టైన వారిలో బిలాల్ అబిద్‌భాయ్ షెరా, మహ్మద్ అయూబ్ కడివాలా, మహ్మద్ పలాన్పురి అలియాస్ ఖలీ అయూబ్ సున్సారా, షఫియా రైస్ ముక్తి, మహ్మద్ హసన్ కర్డియా ఉన్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన ఎనిమిది మంది అనుమానితుల విచారణలో ఈ ఐదుగురి పేర్లు బయటపడినట్లు అధికారులు తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరచగా.. జూలై 24 వరకు ఏటీఎస్ కస్టడీకి అప్పగించారు.దర్యాప్తులో భాగంగా ఓ నిందితుడు.. టైం బాంబ్ తయారు చేసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ముఠా టైం బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడాలని చూసిందని చెప్పారు. అయితే బాంబు తయారీకి సంబంధించిన సామగ్రి, జైష్ ఏ మహ్మద్‌కు సంబంధించిన ఉర్దూ సాహిత్యం ఇంకా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని చెప్పారు. ముఠా సభ్యులు తయారు చేసిన పేలుడు పదార్థాన్ని పరీక్షించేందుకు ప్రయత్నించారని, అయితే ఆ ప్రయోగం విఫలమైందని అధికారులు వెల్లడించారు. బాంబు తయారీ సామగ్రి ఎక్కడి నుంచి తెచ్చారు? ఎక్కడ దాచారు? ఉగ్ర సంస్థకు సంబంధించిన సాహిత్యం వారికి ఎలా చేరింది? అనే అంశాలపై ఏటీఎస్ దర్యాప్తు చేస్తోంది.ఈ కేసులో జూలై 3న గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో జైష్ ఏ మహ్మద్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న ఎనిమిది మందిని ఏటీఎస్ అరెస్ట్ చేసింది. గుజరాత్లో క్రియాశీల ఉగ్ర నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు అప్పట్లో పోలీసులు వెల్లడించారు. తాజా అరెస్టులతో జైష్ ఏ మహ్మద్ మాడ్యూల్ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో పెద్ద ఎత్తున పేలుళ్లకు జరిగిన కుట్రను ముందుగానే గుర్తించి అడ్డుకున్నట్లు ఏటీఎస్ అధికారులు చెబుతున్నారు. -
పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్ కొత్త ఎత్తుగడ!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర మలుపు తిరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా ఇరాన్ విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే.. ఎర్ర సముద్రానికి ప్రవేశ ద్వారమైన బాబ్ అల్-మందెబ్ జలసంధిని మూసివేసేందుకు సిద్ధంగా ఉండాలని యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ సూచించింది!. ఈ సమాచారం బయటకు రావడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లతో పాటు ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు పెరిగాయి.రాయిటర్స్ కథనం ప్రకారం.. ఇప్పటికే హౌతీలు క్షిపణులు, డ్రోన్లను బాబ్ అల్-మందెబ్ ప్రాంతానికి సమీపంలో మోహరించి, ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ఎర్ర సముద్ర మార్గం కూడా దెబ్బతింటే ప్రపంచ చమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.బాబ్ అల్-మందెబ్ జలసంధి(Bab al-Mandab Strait) ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. ఎర్ర సముద్రాన్ని ఏడెన్ గల్ఫ్‌తో అనుసంధానించే ఈ జలసంధి మీదుగానే ఆసియా-యూరప్ మధ్య పెద్దఎత్తున చమురు, సహజవాయువు, ఇతర వాణిజ్య సరకు రవాణా జరుగుతుంది. ఈ మార్గం మూసివేయబడితే నౌకలు ఆఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా సుదీర్ఘ మార్గంలో ప్రయాణించాల్సి వస్తుంది. దీంతో రవాణా ఖర్చులు, బీమా ప్రీమియాలు పెరిగి అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో హౌతీలను వ్యూహాత్మక ఒత్తిడి సాధనంగా ఉపయోగించేందుకు టెహ్రాన్ ప్రయత్నిస్తోందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇరాన్‌పై నేరుగా దాడులు జరిగితే సమాధానం కేవలం తన భూభాగానికే పరిమితం కాకుండా, ప్రాంతంలోని కీలక సముద్ర మార్గాలపై కూడా ప్రభావం చూపించేలా వ్యూహం అమలు చేసే అవకాశాన్ని ఈ పరిణామాలు సూచిస్తున్నాయని భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు... ఇదే సమయంలో ఈ పరిణామాలు పాకిస్థాన్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. హౌతీలు ఇటీవల సౌదీ అరేబియాపై మళ్లీ క్షిపణి దాడులు ప్రారంభించడంతో ఇస్లామాబాద్‌లో ఆందోళన పెరిగింది. ఒకవైపు ఇరాన్‌తో దౌత్య సంబంధాలు కొనసాగించాలని చూస్తున్న పాకిస్థాన్, మరోవైపు సౌదీ అరేబియాతో ఉన్న రక్షణ భాగస్వామ్యాన్ని కూడా కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.గత ఏడాది కుదిరిన రక్షణ ఒప్పందం ప్రకారం వేలాది మంది పాకిస్థాన్ సైనికులు ప్రస్తుతం సౌదీ అరేబియాలో విధులు నిర్వహిస్తున్నారు. యుద్ధం మరింత విస్తరించి సౌదీపై దాడులు తీవ్రతరమైతే.. పాకిస్థాన్ తటస్థంగా ఉండే అవకాశం చాలా తక్కువగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన ఓ ఉన్నతాధికారి "సౌదీపై దాడి అంటే పాకిస్థాన్‌పైనే దాడిగా పరిగణిస్తాం. అదే మా రెడ్‌లైన్" అని రాయిటర్స్‌కు చెప్పడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.మరోవైపు ఎర్ర సముద్రంలో హౌతీలు నౌకలపై దాడులు ప్రారంభిస్తే.. ప్రపంచ వాణిజ్యంతో పాటు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హర్ముజ్ జలసంధిలో అంతరాయాల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌కు.. ఎర్ర సముద్ర మార్గం కూడా దెబ్బతింటే ఇంధన దిగుమతులు, సరకు రవాణా మరింత సంక్షోభంలో పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం పరిస్థితి పూర్తిస్థాయి ఘర్షణకు దారితీయకపోయినా, ఇరాన్, హౌతీలు, అమెరికా, సౌదీ అరేబియా, పాకిస్థాన్‌ల ప్రయోజనాలు ఒకే వేదికపై ఢీకొనే పరిస్థితి ఏర్పడుతోంది. బాబ్ అల్-మందెబ్, హర్ముజ్ జలసంధుల భద్రతపై నెలకొన్న అనిశ్చితి ప్రపంచ ఇంధన సరఫరా, సముద్ర వాణిజ్యం, ప్రాంతీయ భద్రతపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశముండటంతో అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను అత్యంత నిశితంగా గమనిస్తోంది. -
సంక్షోభంతో పాకిస్తాన్ సతమతం
అంతర్గత భద్రతా సమస్యలు, ఘర్షణలు, నిరసనలు, హింస, టెర్రరిస్టు ఘటనలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవు తున్నది. బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్, ఖైబర్– పఖ్తూన్ఖ్వా ప్రాంతాలలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, హింస చెలరేగాయి. ఈ అంతర్గత భద్రతా సమస్యలకు తోడు సింధు జలాలను భారత్ ఆపివేస్తుందనే భయం, దిగజారి పోతున్న ఆర్థిక వ్యవస్థ, ఇరాన్–అమెరికా యుద్ధంలో దౌత్యం విఫలమవ్వటంతో పాక్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందాన తయారైంది. అంత్యంత కీలకమైన సీపెక్ (సీపీఈసీ; చైనా–పాకి స్తాన్ ఎకనమిక్ కారిడార్) పథకం అమలవుతున్న బలూచిస్తాన్, ఖైబర్–పఖ్తూన్ఖ్వా, పీఓకే, గిల్గిత్ ప్రాంతాలలో పౌరులు పాక్, చైనాలకు వ్యతిరేకంగా ఉద్యమించటాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తున్నది. ఈ పరిణామాలు సీపెక్ భవిష్యత్తుపైన, చైనా పాత్రపైన, కశ్మీర్ వివాదంపైన ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించవచ్చు. ఆజాద్ కశ్మీర్లో ఆజాద్ ఎంత?పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్లలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత రెండు నెలలుగా జరుగుతున్న నిరసనలు తార స్థాయికి చేరుకున్నాయి. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) ఆధ్వర్యంలో రావల్కోట్, మీర్పూర్, బాగ్‌లతో సహా పలు పట్టణాలలో 38 ప్రధాన డిమాండ్లతో భారీగా నిరసన ప్రదర్శ నలు జరుగుతున్నాయి. జూలై 15న రావల్కోట్లో సైన్యం కాల్పు లలో కనీసం పదిమంది పౌరులు చనిపోయినట్లు వార్తలొచ్చాయి. ముజఫరాబాద్‌కు తలపెట్టిన లాంగ్‌మార్చ్‌ను జూలై 21కి వాయిదా వేసినా, నిరసనలు ఆగలేదు. ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీలో శరణార్థులకు రిజర్వ్ చేసిన 12 సీట్ల తొలగింపు, కరెంటు ఛార్జీలు, గోధుమ పిండి ధరలతో ప్రారంభమైన నిరసనలు క్రమంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతపు స్వయంప్రతిపత్తిపై వేలెత్తి చూపుతున్నాయి. పాక్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఆజాద్ (స్వాతంత్ర) కశ్మీర్‌గా పేర్కొంటుంది. ఆక్రమిత కశ్మీర్ ప్రజలు భారత అధీనంలోని కశ్మీర్ ప్రాంత ప్రజలతో పోలిస్తే తమ ఆర్థిక స్థితిగతులు, రాజకీయ స్వాతంత్య్రం ఎంత దీనంగా ఉన్నాయో అర్థం చేసుకుంటున్నారు. రావల్కోట్లో జాక్ (జేఏఏసీ) నాయకుడు సర్దార్ అమన్‌ఖాన్ ప్రదర్శనకారులనుద్దేశించి ప్రసంగిస్తూ, ఆజాద్ కశ్మీర్‌ను ఆక్రమిత ప్రాంతంగా పేర్కొని పాకిస్తాన్‌ను ఈ ప్రాంతం నుండి వైదొలగాలని డిమాండ్ చేయటం కొసమెరుపు. అఫ్గానిస్తాన్‌తో అంతంతే!పాకిస్తాన్లో వైశాల్యం పరంగా 40 శాతం వాటా కల్గిన బలూచిస్తాన్ అతిపెద్ద రాష్ట్రం. ఇరాన్, అఫ్గానిస్తాన్, అరేబియా సముద్రంతో సరిహద్దులు కలిగిన ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా కీలకం. రాగి, సహజ వాయువు, బంగారం వంటి కీలకమైన వనరులు బలూచిస్తా న్లో సమృద్ధిగా లభిస్తున్నాయి. బలూచి జాతికి చెందిన ప్రజలు పాక్‌లోని బలూచిస్తాన్, ఇరాన్‌లోని సిస్తాన్ బలూచిస్తాన్, అఫ్గానిస్తాన్‌లలో నివసిస్తున్నారు. శతాబ్దాలుగా తమ ఉనికిని, స్వాతంత్య్రాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. 1947లో పాకిస్తాన్ ఏర్పడినప్పుడు బలూచిస్తాన్ కలాత్ సంస్థా నంగా ఉండేది. 1948లో పాక్‌లో బలూచిస్తాన్ విలీనం వివాదా స్పద పరిస్థితులలో జరిగింది. కలాత్ రాజును ఒత్తిడి చేసి విలీన పత్రంపై సంతకం పెట్టించారు. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1958–59, 1963–69, 1973–77 మధ్యకాలంలో బలూచిస్తాన్‌లో పెద్ద ఎత్తున తిరుగుబాట్లు జరిగాయి. 2004 నుండి మళ్లీ బలూచిస్తా న్లో తిరుగుబాటు తీవ్రమైంది. అభివృద్ధి ఫలాలు స్థానికులకు అందకపోవటం, స్థానిక ప్రజలపై సైన్యం దమనకాండ, రాజకీయ స్వయంప్రతిపత్తి లేకపోవడం స్థానిక ప్రజల వ్యతిరేకతకు కారణం. ముఖ్యంగా బలూచి లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ఇటీవల పాక్ సైన్యం, భద్రతా బలగాలపై కచ్చితత్వంతో ఒకేసారి పెక్కు పట్టణా లలో విరుచుకుపడింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును ఏకంగా హైజాక్ చేశారు. గత వారంలో బీఎల్ఏ దాడులలో 42 మంది పాక్ సైనిక సిబ్బంది చనిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. పాక్ సైన్యపు ‘ఆపరేషన్ షాబాన్’ సత్ఫలితాలను ఇస్తున్నట్టు లేదు.పాక్–అఫ్గానిస్తాన్ సరిహద్దులలోని ఖైబర్–ఫఖ్తూన్ఖ్వాప్రాంతంలోని తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) ఉగ్రవాదులు ఏకంగా పాక్ సైనిక చెక్పోస్టులుపై దాడులు చేస్తున్నారు. వీరికి అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం దన్నుగా నిలుస్తున్నదని పాక్ ఆరోపణ. దీనికి ప్రతిగా పాక్ సైన్యం అఫ్గానిస్తాన్పైన ఏకంగా వైమానిక దాడులను చేపట్టింది. అఫ్గాన్ తాలిబన్ ప్రభుత్వం ప్రతిచర్యగా పాక్‌పై డ్రోన్లతో దాడి చేసింది. పశ్తూన్ (పఠాన్) తెగకు చెందిన ప్రజలు నివసిస్తున్న ఈ ప్రాంత ప్రజలు సరిహద్దుకు ఆవల అఫ్గాన్‌లోని పశ్తూన్ ప్రాంతాలతో కలిపి గ్రేటర్ పశ్తూనిస్తాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పాక్– అఫ్గాన్లకు సరిహద్దుగా ఉన్న హిందూకుష్ పర్వతాలలోని డ్యూరాండ్ లైన్‌ను అఫ్గాన్ మొదటినుండీ అంగీకరించలేదు.తెలిసివచ్చిన తరుణం62 బిలియన్ డాలర్ల వ్యయంతో పాక్‌లో చైనా అమలు చేస్తున్న సీపెక్ పథకం కింద పాక్‌లోని ప్రస్తుత సంక్షుభిత ప్రాంతాలలో కీలకమైన రహదార్లు, విద్యుచ్ఛక్తి కేంద్రాలు, రేవు పట్టణాలు, పారి శ్రామిక కేంద్రాలు, ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల నిర్మాణం జరుగుతున్నది. సీపెక్ ద్వారా పాక్ గుండా అరేబియా సముద్రంలోనికి ప్రవేశించటం చైనా వ్యూహం. గిల్గిత్ బాల్టిస్తాన్ పాక్‌ను చైనాతో కలుపుతుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఈ పథకంలో భాగంగా జీలం, నీలం నదులపై కోహ్లా, కరాత్, ఆజాద్ పఠాన్లలో భారీ జలవిద్యుచ్ఛక్తి కేంద్రాలను చైనా నిర్మిస్తున్నది. కశ్మీర్లో భాగమైన ఈ ప్రాంతాలలో సీపెక్ పథ కాన్ని భారత్ వ్యతిరేకించింది. సీపెక్ రహదారికి గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రవేశ ద్వారమైతే, బలూచిస్తాన్‌లోని గ్వాదర్ రేవు పట్టణం నిష్క్రమణ స్థానం (ఎగ్జిట్ పాయింట్). గ్వాదర్‌లో భారీ డీప్ వాటర్ పోర్టు, అంతర్జాతీయ విమానాశ్రయం చైనా నిర్మిస్తున్నది. బలూచిస్తాన్‌లో సంక్షోభం సీపెక్ పథకానికి ప్రతికూలం. ఇది భారత్‌కు కలిసివచ్చే అంశం. పాక్ ఆక్రమిత కశ్మీర్లో సంక్షోభం భారత అధీనంలోని కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన, అణచి వేత జరుగుతున్నదనే పాక్ వాదనలో డొల్లతనాన్ని బయటపెడు తున్నది. పాక్ అధీనంలోని కశ్మీర్లో ఆదర్శప్రాయమైన పాలన జరు గుతున్నదనే ప్రచారానికి ఈ నిరసనలు చెక్ పెడుతున్నాయి. అమె రికా, ఐరోపాలలోని పాశ్చాత్య మీడియా సంస్థలు ఇప్పటివరకు కశ్మీర్‌పై కొనసాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి భారత్‌కు ఇది సువర్ణావకాశం. బలూచిస్తాన్, పీఓకే, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలలో సంక్షోభానికి భారత్ కారణమని పాక్ ఆరోపిస్తున్నది. ఈ పరిణా మాల నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉండాలి. అంతర్గతంగా సమస్యలను ఎదుర్కొన్నప్పుడల్లా పాక్ భారత్‌లో ఏదో ఒక ఉగ్ర చర్యకు పాల్పడి దృష్టిని మరల్చి ప్రజలను తమ వైపునకు తిప్పు కోవటానికి ప్రయత్నిస్తుంటుంది.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
యూనిఫాం తీసేసి రాజకీయాల్లోకి రండి.. అసిమ్ మునీర్‌కు రెహమాన్ సవాల్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌పై ఆ దేశ ప్రముఖ రాజకీయ నాయకుడు, జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (ఫజల్) అధినేత మౌలానా ఫజలుర్ రెహమాన్ తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో పాత్ర పోషించాలనుకుంటే సైన్యానికి రాజీనామా చేసి రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు.జూలై 12న జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన రెహమాన్.. రాజకీయ వ్యవహారాల్లో సైన్యం జోక్యం పెరుగుతోందని ఆరోపించారు. రక్షణ, భద్రతా అంశాలకు మాత్రమే పరిమితం కావాల్సిన సైన్యం, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని అన్నారు. రాజకీయాలు చేయాలనుకుంటే యూనిఫాం తీసేసి రాజకీయాల్లోకి రండి. ఎన్నికల్లో పోటీ చేయండి. అప్పుడు ప్రజలు యూనిఫాంలో ఉన్న వ్యక్తికి ఎన్ని ఓట్లు ఇస్తారో తెలుస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు.దేశంలో ఎవరు అధికారంలోకి రావాలి, ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి లేదా ఎవరు పదవి నుంచి దిగిపోవాలి అనేది నిర్ణయించడం సైన్యం పని కాదని రెహమాన్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అలాంటి నిర్ణయాలు ప్రజలే తీసుకోవాలని ఆయన అన్నారు.పాకిస్థాన్‌లో సైన్యం ప్రభావం క్రమంగా పెరుగుతోందని, ముఖ్యంగా అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కంటే ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన విమర్శించారు.దేశంలో జనాభా పెరుగుదల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీలో అసిమ్ మునీర్‌ను చేర్చిన ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా రెహమాన్ తప్పుబట్టారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సాధారణ పౌరులు మిలీషియాలను ఏర్పాటు చేసుకోవాలని లేదా ఆయుధాలు చేపట్టాలని వస్తున్న సూచనలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ భద్రతను కాపాడడం పూర్తిగా ప్రభుత్వం, సాయుధ దళాల బాధ్యతేనని, ఆ పని కోసమే వారికి వేతనాలు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు.దేశ రక్షణ కోసం సైనికులు విధులు నిర్వర్తిస్తారు. అందుకు వారికి జీతాలు ఇస్తున్నారు. ప్రజలను ఆయుధాలు పట్టమని చెప్పడం సరైన విధానం కాదు. నేను ఎలాంటి మిలీషియాను ఏర్పాటు చేయను’అని ఆయన స్పష్టం చేశారు. పౌరులకు ఆయుధాలు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో వ్యక్తిగత కక్షలు, హింస, రక్తపాతం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించిన రెహమాన్, అలాంటి చర్యలు దేశ భద్రతకు మరింత ముప్పు తెస్తాయని అన్నారు.ఈ సందర్భంగా బలూచిస్థాన్‌లోని భద్రతా పరిస్థితిపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బలూచ్ మెజారిటీ ప్రాంతాల్లో పాకిస్థాన్ ప్రభుత్వ నియంత్రణ బలహీనపడిందని, ఇప్పుడు హింస పష్తూన్ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోందని పేర్కొన్నారు. -
పాకిస్తాన్ గుండెల్లో గుబులు!.. పీవోకేలో పరిస్థితి అదుపు తప్పుతోందా?
పాక్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. స్థానిక సమస్యలు, రాజకీయ హక్కులు, పాలనా విధానాలపై అసంతృప్తితో జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. రావల్కోట్ నుంచి ముజఫరాబాద్ వరకు చేపట్టిన భారీ మార్చ్‌ను అడ్డుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది.ఈ సందర్భంగా ఆందోళనకారుల కదలికలను నియంత్రించేందుకు సుమారు నాలుగు వేల మంది పాకిస్తాన్ రేంజర్స్‌ను మోహరించినట్లు సమాచారం. ప్రధాన రహదారులపై భద్రతను పెంచడం, కొన్ని ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించడం, నిరసనలను అడ్డుకునేందుకు పోలీసు బలగాలను రంగంలోకి దించడం వంటి చర్యలు చేపట్టారు. అలాగే, మీడియాపై కూడా నిషేధం విధించారు. దీంతో, అక్కడే ఏం జరుగుతుందన్న ఆందోళన నెలకొంది.అయితే, ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న JAAC గత కొంతకాలంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజా సమస్యలను ప్రస్తావిస్తోంది. ముఖ్యంగా రాజకీయ ప్రాతినిధ్యం, పరిపాలనలో స్థానికులకు ఎక్కువ పాత్ర, ఆర్థిక సమస్యలు, ప్రభుత్వ విధానాల్లో మార్పులు వంటి అంశాలపై కమిటీ ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈ నిరసనల్లో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాల్లో ఒకటి పాక్ ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీలో పాకిస్తాన్లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థులకు కేటాయించిన 12 స్థానాలు. ఈ స్థానాలు స్థానిక ప్రజల రాజకీయ హక్కులను ప్రభావితం చేస్తున్నాయని JAAC ఆరోపిస్తోంది. ఈ రిజర్వు స్థానాల వ్యవస్థలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తోంది.అయితే ఆందోళనలు శాంతియుతంగా కొనసాగకముందే పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాళ్ల దాడులు, నిరసనలు, బలగాల ప్రతిస్పందనతో పరిస్థితి అదుపు తప్పినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ ఘర్షణల్లో ప్రాణనష్టం కూడా జరిగినట్లు సమాచారం. పాక్ ప్రభుత్వం మాత్రం శాంతిభద్రతల పరిరక్షణ కోసమే భద్రతను పెంచినట్లు చెబుతోంది. కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి, ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు ఆందోళనకారులు మాత్రం తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెబుతున్నారు.ముజఫరాబాద్ వైపు సాగుతున్న ఈ మార్చ్ ఇప్పుడు కేవలం స్థానిక నిరసనగా కాకుండా పాక్ ఆక్రమిత కశ్మీర్లో పెరుగుతున్న ప్రజా అసంతృప్తికి సంకేతంగా మారింది. ఇస్లామాబాద్ ప్రభుత్వం దీనిని ఎలా ఎదుర్కొంటుంది? నిరసనకారులతో చర్చలకు దిగుతుందా? లేక కఠిన చర్యలకే పరిమితం అవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక, పాక్ ఆక్రమిత కశ్మీర్లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు పాకిస్తాన్ అంతర్గత రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజా డిమాండ్లు, ప్రభుత్వ నియంత్రణ చర్యలు, భద్రతా బలగాల మోహరింపు మధ్య ఈ ప్రాంతంలో పరిస్థితులు మరింత సున్నితంగా మారాయి. -
POK.. ఆజాద్ కాదు.. ఆక్రమిత కశ్మీర్.. భగ్గుమన్న పాకిస్థాన్
ఇస్లామాబాద్: తాను తీసిన గొయ్యిలో తానే పడుతాడు అని సొమెత మన వాడుక భాషలో బాగ వాడుతుంటాం.. ఈ పదం ఇప్పుడు పాకిస్థాన్‌కు సరిగ్గా సరిపోతుంది. భారత్‌పై దురాక్రమణ చేసి భూమిని స్వాధీనం చేసుకొని దానిని ఆజాద్ కశ్మీర్ అంటూ తప్పుడు ప్రచారాలు చేసిన పాక్ ఇప్పుడు ఆప్రాంత ప్రజల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొవాల్సి వస్తోంది. పీవోకేలో జరుగుతున్న నిరసనలను నియంత్రించడం ఇప్పుడు ఆ దేశానికి తలకు మించిన పనిగా మారింది. దీంతో వారిని కంట్రోల్ చేయలేక ఆ దేశం తలపట్టుకుంటుంది."పాక్ ఆక్రమిత కశ్మీర్" ఈ పేరు వింటే చాలు ప్రతి భారతీయుని గుండె రగులుతుంది. మన దేశానికి ఏ విధంగా సరితూగని దాయాది పాకిస్థాన్... అక్రమణ జరిపి తన దేశ నియంత్రణలో ఉంచుకున్న ప్రాంతం ఇది.. ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం భారత్‌కు అంత కష్టమైన పని కాకపోయినా అంతర్జాతీయ ఒత్తిడి దృష్ట్యా మౌనంగా ఉండాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఆ ప్రాంతం ప్రజలే ఆ దేశానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు.పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఇటీవల జరిగిన నిరసనలు తీవ్ర ఆందోళనలను కలిగిస్తున్నాయి. అక్కడి ప్రభుత్వంపై వ్యతిరేకతతో నిరసనలు చేస్తున్న ప్రజలపై అధికారులు ఇష్టారీతిన కాల్పులు జరిపారు. ఈ ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలను కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల తిరుగుబాటును అణిచివేయడం ఇప్పుడు ఆ దేశానికి పెద్దసమస్యగా మారింది. గత 78 ఏళ్లుగా ఇది ఆజాద్ కశ్మీర్ అని పాకిస్థాన్ చెబుతోందని కానీ ఇది ఆజాద్ కశ్మీర్ కాదని ఆక్రమిత కశ్మీర్ అని అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.భారత చెప్పింది అదే..!PoKలో జరిగిన నిరసనలకు సంబంధించిన అనేక వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అందుకు సంబంధించిన ఒక వీడియోలో JAAC నాయకుడు మాట్లాడుతూ "గత 78 సంవత్సరాలుగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌ను 'ఆజాద్ కాశ్మీర్' అని పిలుస్తోంది. కానీ ఇప్పుడు 80,000 మందికి పైగా హాజరైన ఒక ర్యాలీలో PoK ప్రజలు ఈ వాదనను సవాలు చేశారు. కశ్మీర్ వివాదాస్పద భూభాగం కాదు. అది ఆక్రమిత భూభాగం. దానికి ఎన్నడూ స్వాతంత్ర్యం లేదు. గత 78 ఏళ్లుగా భారత్ ఇదే చెబుతుండగా, పాకిస్థాన్ దానిని ప్రచారం అని కొట్టిపారేస్తోంది. ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలే తమ ర్యాలీలలో అదే విషయాన్ని చెబుతున్నారు. అని వీడియోలో మాట్లాడుతున్నారు.ప్రస్తుతం జరుగుతున్న రావల్ కోట్ ర్యాలీలో 80 వేల మందికి పైగా పాల్గొన్నారు. మరి ఈ విషయంపై పాక్ ఏం చేస్తోంది. ఈ ఎనబై వేల మందిని సైతం భారత్ పంపిందని ప్రచారం చేస్తోందా అని అక్కడి నాయకులు నిలదీశారు. ఈ నిరసనలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. PoKలోని ప్రజల ఆగ్రహం ఆకస్మికంగా తలెత్తినది కాదని, ఇది పాకిస్తాన్ సంవత్సరాలుగా సాగిస్తున్న దోపిడీ, హక్కుల ఉల్లంఘనలు, అక్రమ ఆక్రమణల ఫలితమేనని తెలిపింది.Pakistan has spent 78 years calling PoJK "Azad Kashmir." 🇮🇳The people of PoJK just corrected that in front of 80,000 people.JAAC leader Sardar Aman Khan said it straight."Kashmir is not disputed territory. It is occupied territory. And it was never truly Azad."India has… pic.twitter.com/jb50aHVSQE— Aviator Anil Chopra (@Chopsyturvey) July 15, 2026 -
PoKలో రక్తపాతం.. పాక్ ఆర్మీ కాల్పులు
-
పీవోకేలో పాక్ ఆర్మీ కాల్పులు.. ఆరుగురు మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రావాలాకోట్లోని న్యూ బస్ టెర్మినల్ సమీపంలో సాధారణ ప్రజలపై అక్కడి భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. ఇస్లామాబాద్ (పాకిస్తాన్ ప్రభుత్వం)పై స్థానికుల్లో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత ఒక్కసారిగా పెరిగాయి. పీవోకే ప్రజలు పాక్‌కు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు చేపట్టారు.వైట్‌హౌస్ ఎదుట నిరసనకాగా ఇటీవలే అమెరికాలో ఉన్న పీవోకే ప్రజలు వాషింగ్టన్లో ఉన్న వైట్ హౌస్ వెలుపల నిరసన కార్యక్రమం చేపట్టారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో పెద్దఎత్తున హింసచేలరేగుతందని పాకిస్థాన్ ఆ ప్రాంతంలో మానవహక్కులని కాల రాస్తుందని ఆరోపించారు. అంతర్జాతీయ సమాజం పీవోకేలో జరుగుతున్న మానవతా సంక్షోభంపై దృష్టి పెట్టాలని వారు డిమాండ్ చేశారు. PoK లోని పౌర నివాస ప్రాంతాల నుండి పాకిస్తాన్ సైన్యాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, నిరాయుధులైన పౌరులపై ప్రాణాంతక బలగాలను ప్రయోగించడాన్ని అంతర్జాతీయ సమాజం అడ్డుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇంతలోనే మరోసారి ప్రాంతంలోకాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. భారత్ సహాయం చేయాలిదాదాపు 40 లక్షల మంది ప్రజలను బాహ్య ప్రపంచానికి దూరం చేస్తూ పాక్ ప్రభుత్వం అక్కడ సుదీర్ఘకాలంగా ఇంటర్నెట్ను నిలిపివేసిందని నిరసనకారులు ఆరోపించారు. స్థానిక ప్రజల ప్రాణాలను కాపాడటానికి, మానవతా సహాయాన్ని అందించడానికి భారతదేశం జోక్యం చేసుకోవాలని వారు ఒక అసాధారణ విజ్ఞప్తి చేశారు. బాధితులకు అవసరమైన సాయం అందేలా పూంచ్, డోడా సెక్టార్ల ద్వారా నియంత్రణ రేఖను తెరవాలని డిమాండ్ చేశారు.పేదరికంతో సతమతమవుతున్న ప్రజలుతాజా ఘర్షణల పక్కన పెడితే, అక్కడి ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు పలు నివేదికలు తెలిపాయి.'నేచర్'జర్నల్ 2025 నాటి అధ్యయనం ప్రకారం, ఇక్కడి జనాభాలో 66% మంది వ్యవసాయం, పశుపోషణపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయినప్పటికీ 57% కంటే ఎక్కువ కుటుంబాలు ఆహార భద్రత లేకుండా నివసిస్తున్నాయి. దాదాపు 29% మంది ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు (పాకిస్తాన్ జాతీయ సగటు 19.9% కంటే ఇది చాలా ఎక్కువ). పర్వత ప్రాంతాలలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది, అక్కడ 90% కుటుంబాలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి. -
అక్తర్, ఆసిఫ్ భారత్‌కు డ్రగ్స్ తెచ్చారు..!
పాకిస్తాన్ మాజీ పేసర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్‌పై భారత మాజీ కేంద్ర హోంశాఖ అధికారి ఆర్వీఎస్ మణి సంచలన ఆరోపణలు చేశారు. భారత్‌లో పర్యటించిన సమయంలో అక్తర్, ఆసిఫ్ మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ బాంబు పేల్చారు.ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. "భారత్‌లో క్రికెట్ ఆడేందుకు వచ్చిన ప్రతిసారి పాకిస్తాన్ బృందంలోని కొందరు డ్రగ్స్‌ను అక్రమంగా తీసుకొచ్చేవారు. షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్ భారత్‌కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పాకిస్తాన్ హైకమిషనర్ ఎదుట ఒప్పుకున్నారు. ఆ తర్వాత వారిని వెనక్కి పంపించారు" అని అన్నారు.మాజీ పాక్ కోచ్ బాబ్ వూల్మర్ మరణాన్ని కూడా ఈ వ్యవహారంతో ముడిపెట్టారు ఆర్వీఎస్ మణి. పాకిస్తాన్ జట్టులో జరుగుతున్న డ్రగ్ స్మగ్లింగ్ విషయాన్ని బయటపెట్టాలని వూల్మర్ ప్రయత్నించారని, అందుకే ఆయన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారని ఆరోపించారు.మణి చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం క్రికెట్ సర్క్సిల్స్లో దుమారం రేపుతున్నాయి. మణి 2006 నుంచి 2010 వరకు కేంద్ర హోంశాఖ అంతర్గత భద్రత విభాగంలో అండర్ సెక్రటరీగా పనిచేశారు. అనంతరం 2013లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌ల విషయానికొస్తే.. 2003-04 నుంచి 2007 వరకు ఇరు దేశాల మధ్య పరస్పర సిరీస్‌లు జరిగాయి. అయితే 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత ఈ సిరీస్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ జట్లు ఐసీసీ లేదా ఏసీసీ టోర్నమెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి. -
బంగ్లాదేశ్‌లో మాజీ దౌత్యవేత్తను వణికించిన భారత ఆడపులి
ఢాకా: దేశం కాని దేశంలో, విదేశీ దౌత్యవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధుల సమక్షంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా భారత్ ప్రతిష్ఠను నిలబెట్టిన భారతీయ దౌత్యవేత్త పూజా కుమారి ఝా ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. దక్షిణాసియా మ్యాప్‌లో జమ్మూ కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపించడాన్ని ఆమె వెంటనే తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ సరిదిద్దాలని కోరారు. ఆమె సమయస్ఫూర్తి, ధైర్యం సభలో ఉన్నవారి దృష్టిని ఆకర్షించింది.బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ‘సార్క్ పునరుద్ధరణ - ప్రాంతీయ సమగ్రత’ అనే అంశంపై ఉన్నత స్థాయి విదేశాంగ విధాన సెమినార్ నిర్వహించారు. ఢాకాలోని బంగ్లాదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ (BIISS) ఆడిటోరియంలో జరిగిన ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, నిపుణులు పాల్గొన్నారు.సదస్సులో బంగ్లాదేశ్ మాజీ దౌత్యవేత్త అహ్మద్ తారిఖ్ కరీం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుండగా, స్క్రీన్‌పై ప్రదర్శించిన దక్షిణాసియా మ్యాప్‌లో జమ్మూ కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపించారు. దీనిని గమనించిన భారత హైకమిషన్ సెకండ్ సెక్రటరీ పూజా కుమారి ఝా వెంటనే జోక్యం చేసుకుని, ఆ మ్యాప్ వాస్తవాలకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేశారు.దీనికి స్పందించిన తారిఖ్ కరీం.. మీరు భారత్ నుంచి వచ్చారా? అని ప్రశ్నించగా.. నేను పూజా కుమారి ఝా భారత హైకమిషన్‌లో సెకండ్ సెక్రటరీ అని ఆమె తనను పరిచయం చేసుకున్నారు. అనంతరం తారిఖ్ కరీం.. మీ అభ్యంతరాన్ని నమోదు చేసుకున్నాను’ అని పేర్కొంటూ తన ప్రజెంటేషన్‌ను కొనసాగించారు.ఎవరీ పూజా కుమారి ఝా?జాతీయ మీడియా కథనాల ప్రకారం.. పూజా కుమారి ఝా 2022 బ్యాచ్‌కు చెందిన భారత విదేశాంగ సేవ అధికారిణి. ప్రస్తుతం ఢాకాలోని భారత హైకమిషన్‌లో రాజకీయ, సమాచార విభాగంలో సెకండ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె 2021 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా 82వ ర్యాంకు సాధించారు. కేవలం 25 ఏళ్ల వయస్సులోనే ఈ ఘనత సాధించడం విశేషం.పూజా బీహార్ రాష్ట్రంలోని సీతామఢీ జిల్లా పురన్హియా గ్రామానికి చెందినవారు. అనంతరం ఆమె కుటుంబం ఢిల్లీకి వలస వెళ్లింది. ఆమె తండ్రి గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆఫీస్ హెల్పర్‌గా పనిచేస్తుండగా, తల్లి గృహిణి. పూజా కుటుంబంలో ఐదో కుమార్తె.ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రైవేట్ పాఠశాల నుంచి మున్సిపల్, ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆమె విద్యను కొనసాగించారు. ఆమె పెరిగిన సమాజంలో ఆడపిల్లల కంటే మగపిల్లలకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. అలాంటి పరిస్థితులను మార్చడానికి చదువే మార్గమని పూజా, ఆమె సోదరీమణులు నమ్మారు.ఒకప్పుడు ఆమె తండ్రి, నువ్వు ఐఏఎస్ అధికారిణి అవుతావు గానీ, బాలీవుడ్ నటి కాలేవు. పెద్ద కలలు కనకు అని చెప్పేవారని పూజా ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు. అయితే తన కృషి, పట్టుదలతో ఆమె ఆ మాటలను తప్పు అని నిరూపించారు.నేడు అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ, దేశ ప్రయోజనాలను ధైర్యంగా వినిపిస్తున్న పూజా కుమారి ఝా అనేక మంది యువతులకు, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. India’s Second Secretary at the Indian High Commission in Dhaka, Puja Jha, raised an immediate objection after a map shown during a foreign policy seminar in Bangladesh depicted Jammu & Kashmir as part of Pakistan.She stated that Jammu & Kashmir is an integral and inalienable… pic.twitter.com/a4b2IV8ZhA— Aditya Raj Kaul (@AdityaRajKaul) July 10, 2026 -
‘పాక్’తో లింకులు.. బిహార్ యువకుడి అరెస్ట్!
కతిహార్: బిహార్‌లోని కతిహార్ జిల్లాలో పాకిస్తాన్ ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో 22 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అహద్గా అధికారులు గుర్తించారు.కతిహార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) పరిచయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద ముఠాతో అహద్‌కు సంబంధాలు ఉన్నాయనే నిర్దిష్ట సమాచారం మేరకు భద్రతా సిబ్బంది సోమవారం అతడిని అదుపులోకి తీసుకుని, విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. నిందితుడి మొబైల్ ఫోన్, సోషల్ మీడియా ఖాతాలను సాంకేతికంగా విశ్లేషించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ షాజాద్ భట్టి ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధమున్న రాణా హసీన్ అనే వ్యక్తితో నిందితుడు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు విచారణలో తేలింది.దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన చాటింగ్‌లు చేయడం, ఆడియో కాల్స్ మాట్లాడటం, దేశంలోని సున్నితమైన ప్రాంతాల సమాచారాన్ని చేరవేయడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. అంతేకాకుండా, సోషల్ మీడియాలో భారతదేశానికి వ్యతిరేకంగా, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే కంటెంట్‌ను వ్యాప్తి చేస్తూ, పాకిస్తాన్ వాట్సాప్ ఛానళ్ల లింకులను ఇతరులకు షేర్ చేస్తూ దేశంలో ఉగ్ర నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఇతర కేంద్ర భద్రతా సంస్థల సహాయంతో విచారణ జరుపుతున్నారు. -
ఢిల్లీని కమ్మేసిన పాక్ ధూళి
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్‌తో పాటు అఫ్గానిస్తాన్, ఇరాన్ దేశాల్లో సంభవించిన ధూళి తుఫానుల ప్రభావం దేశ రాజధాని ఢిల్లీపై తీవ్రంగా పడింది. ధూళి తుపానుల వల్ల ఎగసిన ఖనిజ ధూళి కణాలు బలమైన గాలులతో సరిహద్దులు దాటి వాయువ్య భారతాన్ని, ముఖ్యంగా ఢిల్లీ ప్రాంతాన్ని కమ్మేశాయి. దాదాపు మూడేళ్ల తర్వాత మొదటిసారిగా అత్యంత స్వచ్ఛమైన గాలిని పీల్చుకున్నామన్న ఢిల్లీ ప్రజల సంతోషం మూడు రోజుల ముచ్చటే అయ్యింది. ఈనెల 9వ తేదీ నాటికి రికార్డు స్థాయిలో 48గా నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ఆదివారం నాటికి ఒక్కసారిగా 261కి పెరిగింది. గత 85 రోజుల్లో ఇంతటి కనిష్ట స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. గత వారంలో ఏక్యూఐ పరిశీలిస్తే గురువారం 48, శుక్రవారం 65, శనివారం 140గా నమోదైంది. ఆదివారం నాటికి ఒక్కసారిగా 261కి పెరిగిపోయింది. ఢిల్లీలోని కొన్ని ప్రత్యేక మానిటరింగ్ స్టేషన్లలో కాలుష్య స్థాయిలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఆనంద్ విహార్‌లో 449, జహంగీర్‌పురిలో 344 ఏక్యూఐ నమోదైంది. ఢిల్లీలో వాయు నాణ్యత అకస్మాత్తుగా పడిపోవడంపై కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఉపసంఘం ఆదివారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమై, కారణాలను సమీక్షించింది. క్షేత్రస్థాయిలో ధూళి నియంత్రణ చర్యలను మరింత ఉధృతం చేయాలని ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీని ఆదేశించింది. రాబోయే కొద్ది రోజుల్లో వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉన్నందున, గాలి వేగం పెరిగితే తప్ప ఈ కాలుష్య కణాలు అంత త్వరగా వీడిపోవని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. -
పాక్ కంపెనీలో జాబ్.. రూ.2 కోట్ల ప్యాకేజీ!
కరాచీకి చెందిన ఒక కంపెనీ నుంచి తనకు మంచి జీతంతో కూడిన జాబ్ ఆఫర్ వచ్చిందని పేర్కొంటూ 21 ఏళ్ల టెకీ ఆదిత్య పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఆన్లైన్లో చర్చనీయాంశమైంది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో కొంతమంది ఆసక్తిగా స్పందించగా, మరికొందరు ఇది కేవలం సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ కోసం చేసిన ప్రయత్నమా?.. అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు.ఆదిత్య షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం.. కరాచీ కేంద్రంగా పనిచేస్తున్న ఓ కంపెనీ తనకు సంవత్సరానికి 1.8 లక్షల నుంచి 2.2 లక్షల డాలర్ల వరకు బేస్ శాలరీ ఆఫర్ చేసిందని తెలిపాడు. భారత కరెన్సీలో ఈ వేతనం దాదాపు రూ.2 కోట్లు. కంపెనీ హెడ్ క్వార్టర్ కరాచీలో ఉన్నప్పటికీ, ఎక్కువ మంది ఉద్యోగులు యూకే టైమ్ జోన్ ప్రకారం పనిచేస్తారని ఆఫర్ వివరాల్లో ఉన్నట్లు వెల్లడించాడు.just received an onsite offer from a Karachi-based company.$180-220k base, visa sponsored, and the team operates in the UK timezone. should I go for it? pic.twitter.com/lCa8NdQVXF— aditya (@adxtyahq) July 12, 2026తనకు వచ్చిన ఈ ఆఫర్‌ను అంగీకరించి అక్కడికి వెళ్లాలా?, వద్దా? అని తన ఫాలోవర్లను అడుగుతూ ఆదిత్య తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు.ఈ పోస్ట్ అతి తక్కువ సమయంలోనే వైరల్ అయింది. ఈ పోస్టును చూసినవారిలో.. కొంతమంది నిజంగానే ఇది మంచి కెరీర్ అవకాశం కావచ్చని చెప్పారు. మరికొందరు మాత్రం ఆ ఆఫర్ నిజమా, కాదా? అనే సందేహాలు వ్యక్తం చేశారు. ఇంకొంతమంది ఇలాంటి పోస్టులు కేవలం ఎక్కువ లైక్‌లు, కామెంట్లు, వ్యూస్ కోసం చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇలాంటి అవకాశాలను అంగీకరించే ముందు కంపెనీ వివరాలు, ఉద్యోగ నిజమైనదా కాదా అనే విషయాలను పూర్తిగా పరిశీలించాలని సూచించారు. -
ఇషాన్ కిషన్ గొప్ప మనసు
భారత వికెట్‌కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తన మానవత్వాన్ని చాటుతూ పాకిస్థాన్‌కు చెందిన ప్రత్యేక అవసరాలున్న (శారీరక వైకల్యం) ఓ అభిమానికి మరపురాని అనుభూతిని అందించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో, చివరి టీ20 మ్యాచ్‌కు ముందు చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.VIDEO OF THE DAY.....!!!! ❤️ - Ishan Kishan specially came over to meet a Pakistan fan. A lovely gesture. 👏 pic.twitter.com/xwjPxiX3dz— Sheri. (@CallMeSheri1_) July 12, 2026మ్యాచ్‌కు ముందు వార్మప్‌కు వెళ్లే క్రమంలో స్టేడియంలో ఉన్న సదరు అభిమానిని గమనించిన ఇషాన్ కిషన్ స్వయంగా అతడి వద్దకు వెళ్లాడు. అతడితో చేతులు కలిపి, చిరునవ్వుతో పలకరిస్తూ కొద్దిసేపు ఆప్యాయంగా మాట్లాడాడు. ఈ అనూహ్యమైన ఆత్మీయతతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వీడియోకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. నెటిజన్లు ఇషాన్ మంచి మనసుకు ఫిదా అవుతున్నారు. దేశాల మధ్య విభేదాలను పక్కకు పెట్టి మంచి మనసు చాటుకున్నాడని అంటున్నారు.ఇదిలా ఉంటే, ఐదో టీ20లోనూ టీమిండియాకు ఇంగ్లండ్ చేతిలో భంగపాటే ఎదురైంది. ఈ ఓటమితో భారత జట్టు 0-4 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేయగా.. భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమై, 56 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇంగ్లండ్ తరఫున జోస్ బట్లర్ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ (56), తిలక్ వర్మ (53) అర్ద సెంచరీలతో రాణించారు. -
ఉగ్ర నెట్ వర్క్ పై ATS నిఘా
-
పాకిస్తాన్ సరికొత్త కామెడీ షో.. మాది హిందూ సంస్కృతి!
-
కార్గో విమానం అదృశ్యం : సముద్రంలో కూలిపోయిందనే ఆందోళన
షార్జా నుండి కరాచీ వెళ్తున్న కె2 ఎయిర్వేస్ (K2 Airways) కు చెందిన బోయింగ్ 737 కార్గో విమానం (KTA1732) అదృశ్యమైంది. అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తుండగా కరాచీ సమీపంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. ఈ విమానంలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. నావిగేషన్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ సమాచారం ఇచ్చిన కొద్ది నిమిషాలకే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది సముద్రంలో కూలిపోయి ఉండవచ్చని ఫ్లైట్రాడార్24 భావిస్తోంది. అయితే పాకిస్తాన్ అధికారులు దీనిని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ప్రస్తుతం పాకిస్తాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (PAA) తీర ప్రాంతంలో గాలింపు , రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేసింది.ఏమి జరిగింది?పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం పాకిస్తాన్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9:18 గంటలకు విమానంలోని నావిగేషన్ సిస్టమ్‌లో సమస్య ఉన్నట్లు పైలట్ నివేదించారు. ఆ తర్వాత రాత్రి 9:21 గంటల సమయంలో విమానం ఒక్కసారిగా ఎత్తు కోల్పోతూ, వేగంగా దిశ మార్చుకున్నట్లు రాడార్‌లో కనిపించింది. కరాచీకి పశ్చిమంగా 155 నాటికల్ మైళ్ల దూరంలో విమానంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.భయంకరమైన వేగంతో కిందకు పడిపోయింది.ఇదీ చదవండి: కేతన్ హత్యకు నాలుగు నెలలముందే.. సీక్రెట్ మ్యారేజ్ఫ్లైట్రాడార్24 (Flightradar24) డేటా ప్రకారం, విమానం నుండి చివరి సిగ్నల్ వచ్చేసరికి అది సముద్ర మట్టానికి కేవలం 1,100 అడుగుల ఎత్తులో ఉంది. అంతేకాదు, అది నిమిషానికి 22,400 అడుగుల అత్యంత వేగంతో కిందకు దూసుకుయింది. అదృశ్యమైన ఈ బోయింగ్ 737-400 విమానం 1999 నాటిది. మొదట ప్రయాణీకుల విమానంగా పనిచేసి, 2012లో కార్గో విమానంగా మారింది. 2024లోనే ఇది కె2 ఎయిర్వేస్ సంస్థలో చేరింది.ఇదీ చదవండి: 42 ఏళ్ల నాటి అమ్మ దుప్పట్టా : కొత్త పెళ్లికూతురు అన్షులా ఎమోషనల్ -
నీళ్లు ఇవ్వకపోతే..యుద్ధమే : రంకెలేస్తున్న పాకిస్థాన్
సింధూ నదీ జలాల ఒప్పందాన్ని (IWT) పక్కనబెట్టాలన్న భారతదేశం నిర్ణయం పాకిస్తాన్‌ను ఒక రేంజ్లో వణికిస్తోంది. ఈ నేపథ్యంలోనే సింధూ జలాలను ఆపితే యుద్ధమే అంటూ పాక్ కొత్త హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్ పౌర ప్రభుత్వంతో పాటు అక్కడి సైన్యం కూడా తమ దేశానికి దక్కాల్సిన నీటి వాటా కోసం అవసరమైన అన్ని తీసుకుంటామని ప్రకటించడం కలకలం రేపింది.పాక్ సైనిక దళాల అధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ అధ్యక్షతన 276వ కోర్ కమాండర్ల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో సింధూ జలాల వివాదంపై పాక్ సైన్యం కీలక నిర్ణయాలు ప్రకటించింది. సైనిక కమాండర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు ప్రకటించింది. 2025 ఏప్రిల్ 24 నాటి నేషనల్ సెక్యూరిటీ కమిటీ (NSC) ఆదేశాల ప్రకారం తాము నడుచుకుంటామని పునరుద్ఘాటించింది .అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం తమ దేశానికి రావాల్సిన సింధూ నదీ జలాల వాటాను దక్కించు కునేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆర్మీ స్పష్టం చేసింది. తమ ప్రభుత్వ ఆదేశాలు, దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సింధూ జలాల హక్కుల కోసం పోరాడుతామని సైన్యం వెల్లడించింది. గతేడాది 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతి చర్యగా 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని (Indus Water Treaty) భారతదేశం నిలిపివేసింది (Abeyance లో పెట్టింది). దీంతో పాకిస్తాన్ తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఈ నేపథ్యంలోనే పాక్ సైన్యం, మంత్రులు భారత్‌పై అక్కసు వెళ్లగక్కడంతోపాటు, వార్ వార్నింగ్‌లివ్వడం శోచనీయం.పాకిస్తాన్ NSC మార్గదర్శకాలు ఏమిటి?నీటిని ఆపడం లేదా మళ్లించడం వంటి ఏ చర్యకైనా పాల్పడితే దానిని "యుద్ధ చర్య" (Act of War)గా పరిగణించాలని పాకిస్తాన్ NSC గతంలోనే నిర్ణయించింది. ఆఫ్ఘన్ తాలిబాన్ పాలనలో ఉన్న భూభాగాన్ని ఉపయోగించుకుని పాకిస్తాన్‌పై దాడులు చేస్తున్న ఉగ్రవాద సంస్థలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, వారిపై 'ఆపరేషన్ గజబ్-లిల్-హక్' కింద పోరాడుతామని తెలిపింది. అలాగే కాశ్మీరీలకు తమ దౌత్య, రాజకీయ, నైతిక మద్దతు ఎప్పటికీ ఉంటుందని పేర్కొంది.బిలావల్ భుట్టో జర్దారీ హెచ్చరిక వైరల్పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ చేసిన సంచలన వ్యాఖ్యలపై ఒక వీడియో వైరల్ అవుతోంది. సింధు నదీ జలాల ఒప్పందంపై రాజీ పడే ప్రసక్తి లేదు. భారత్ ఈ జలాలను ఒక ఆయుధంగా వాడుకోవాలని చూస్తోంది. ఒకవేళ ఇందుకోసం భారతదేశంతో యుద్ధం చేయాల్సి వస్తే, అన్ని రంగాలలో పోరాడటానికి సిద్ధంగా ఉన్నాము."పాకిస్తాన్ శాశ్వతంగా సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపేంతవరకు ఈ సింధు జలాల ఒప్పందం నిలిపివేతలోనే ఉంటుందని భారతదేశ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.సరిహద్దుల్లో శత్రుత్వం కొనసాగుతు న్నప్పుడు ద్వైపాక్షిక ఒప్పందాలు మామూలుగా సాగవని, భూమిపై ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే ఒప్పందాలు నడుస్తాయని భారత్ స్పష్టం చేసింది.సింధు జలాలు- పాకిస్తాన్ 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, సట్లెజ్, బియాస్ జలాలు భారత్‌కు.. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ జలాలు పాకిస్తాన్‌కు దక్కాలి. అయితే సాధారణంగా వర్షాకాలంలో వరద హెచ్చరికల సమాచారాన్ని భారత్ పాకిస్తాన్‌తో పంచుకునేది. కానీ ఒప్పందం నిలిపివేయడంతో భారత్ ఆ సమాచారాన్ని పంచు కోవాల్సిన అవసరం ఉండదు.భారత్ ప్రాజెక్టులు: సింధు బేసిన్లో సావల్‌కోట్, రట్లే, బుర్సార్, పకాల్ దుల్, క్వార్, కిరు, కీర్తాయ్ వంటి పలు జలవిద్యుత్ ప్రాజెక్టులను భారత్ వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. పాక్ వ్యవసాయం అతలాకుతలం: పాకిస్తాన్ వ్యవసాయ రంగంలో దాదాపు 80-90 శాతం ఈ సింధు నదీ వ్యవస్థపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్‌లోని ప్రధాన జలాశయాలైన తర్బెలా, మంగ్లా డ్యామ్‌లలో నీటి నిల్వలు దాదాపు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి.దీంతో తమ అత్యంత బలహీనమైన పాయింట్‌ను భారత్ టార్గెట్ చేయడంతో పాకిస్తాన్ తీవ్ర భయాందోళనకు గురవుతోంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లడానికి పాక్ రాయబారులను పంపడం, ఐక్యరాజ్యసమితికి లేఖలు రాయడం, చట్టపరమైన చర్యలకు దిగడం వంటి ప్రయత్నాలు చేస్తోంది.ఇదీ చదవండి: కేతన్ హత్యకు నాలుగు నెలలముందే.. సీక్రెట్ మ్యారేజ్


