ఐఆర్‌సీటీసీ టికెట్ల మీద భారీ వరాలు | no more service tax on tickets booked in irctc, says arun jaitley | Sakshi
Sakshi News home page

ఐఆర్‌సీటీసీ టికెట్ల మీద భారీ వరాలు

Feb 1 2017 11:59 AM | Updated on Sep 5 2017 2:39 AM

ఐఆర్‌సీటీసీ టికెట్ల మీద భారీ వరాలు

ఐఆర్‌సీటీసీ టికెట్ల మీద భారీ వరాలు

ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసుకునే టికెట్ల మీద సర్వీసు టాక్స్ ఎత్తేశారు.

సుదీర్ఘ కాలం తర్వాత కేంద్ర బడ్జెట్‌లో కలిసిన రైల్వే బడ్జెట్‌లో  2017-18 సంవత్సరానికి గాను రూ. 1.31 లక్షల కోట్లను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కేటాయించారు. ఇందులో 58వేల కోట్లను ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసుకునే టికెట్ల మీద సర్వీసు టాక్స్ ఎత్తేశారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే..
 
''ప్రయాణికుల భద్రతకు రైల్ సంరక్షా కోశ్ నిధులను ఐదేళ్లలో 1 లక్షల కోట్లను కేటాయిస్తాం. 2020 నాటికి అన్ మ్యాన్డ్ రైల్వే గేట్లను పూర్తిగా తొలగిస్తాం. 5500 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు వేస్తాం. పర్యాటకం, పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రత్యేక రైళ్లు వేస్తాం. 25 స్టేషన్లకు 2017-18లో అవార్డులు ఇస్తాం. 500 స్టేషన్లలో వికలాంగుల కోసం లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటుచేస్తాం. 7000 స్టేషన్లలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు పెడతాం. పరిశుభ్రత కోసం క్లీన్ మై కోచ్ అనే ఎస్ఎంఎస్ సర్వీస్ చేశాం. కోచ్ సంబంధిత సేవలన్నింటి కోసం ఒకే సర్వీసు ఉంటుంది. బయో టాయిలెట్లు ఏర్పాటుచేయిస్తాం. 
 
రైల్వేలకు ఇతర ప్రయాణ మార్గాల నుంచి గట్టి పోటీ ఉంది. అందుకోసం రైల్వేలను ముందుకు తీసుకెళ్లాలంటే మార్పు తప్పనిసరి. ఎండ్ టు ఎండ్ సేవలు అందించడం, వ్యవసాయ ఉత్పత్తులకు ప్రత్యేక సేవలు అందించేలా చూస్తాం. కాంపిటీటివ్ టికెట్ బుకింగ్ సేవలు అందిస్తాం. ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసుకుకునే టికెట్ల మీద సర్వీసు టాక్స్ తీసేస్తున్నాం. మెట్రో రైలు విధానాన్ని ప్రత్యేకంగా తీసుకొస్తాం. ఇందుకోసం మెట్రోరైలు చట్టాన్ని తెచ్చి, అందులో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచుతాం'' అన్నారు. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement