ప్రాణం తీసిన రూ.20 | one killed, friends quarreled for only Rs 20 at Nalgonda district | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన రూ.20

Nov 25 2014 6:52 AM | Updated on Aug 29 2018 7:09 PM

ప్రాణం తీసిన రూ.20 - Sakshi

ప్రాణం తీసిన రూ.20

నల్లగొండ జిల్లా కోదాడ మండలం చిమిర్యాల పరిధి మంగలితండాలో సోమవారం రూ. 20 కోసం జరిగిన వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.

కోదాడ: నల్లగొండ జిల్లా కోదాడ మండలం చిమిర్యాల పరిధి మంగలితండాలో  సోమవారం రూ. 20 కోసం జరిగిన వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది. తండాకు చెం దిన ధరావత్ జింత్తు అలియాస్ బాబు (28) వ్యవసాయ కూలీ. ఇదే గ్రామాని కి చెందిన ధరావత్ నాగేశ్వరరావు లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. స్నేహితులైన వీరు ఉదయం గ్రామచావడిలో కూర్చున్నారు.

ఈ క్రమంలో జింత్తు.. నాగేశ్వరరావు జేబులో నుంచి రూ.20 తీసుకున్నాడు. తనవద్ద తీసుకున్న రూ.20 ఇవ్వమని అడుగుతున్నా పట్టించుకోకుండా జింతూ వెళ్తుండడంతో నాగేశ్వరరావు పక్కనే ఉన్న కర్రను తీసుకుని జింత్తు తలపై వెనుక నుంచి బలంగా కొట్టగా, తలకు తీవ్రగాయమైన జింత్తు అక్కడికక్కడే మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement