'కోమటిరెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళ్తాడనుకోను' | Komatireddy venkatreddy not join in trs party, says digvijaya singh | Sakshi
Sakshi News home page

'కోమటిరెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళ్తాడనుకోను'

Feb 19 2017 12:33 PM | Updated on Mar 18 2019 9:02 PM

'కోమటిరెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళ్తాడనుకోను' - Sakshi

'కోమటిరెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళ్తాడనుకోను'

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ శాఖలో ఇటీవల ఏర్పడిన అంతర్గత వివాదాలు త్వరలోనే సమసిపోతాయని తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు.

శంషాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ శాఖలో ఇటీవల ఏర్పడిన అంతర్గత వివాదాలు త్వరలోనే సమసిపోతాయని తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. ఏపీ, తెలంగాణల్లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జన ఆవేదన సమ్మేళన్‌ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన ఆదివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలను మరిచాయని విమర్శించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే జన ఆవేదన సమ్మేళన్‌ సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పార్టీలో ప్రతి ఒక్కరితో మాట్లాడతానని, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళ్తాడని తాను అనుకోవడంలేదని ఓ విలేకరి ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. కాగా, తమిళనాడు అసెంబ్లీలో శనివారం జరిగిన ఘటనలు దురదృష్టకరమని దిగ్విజయ్ సింగ్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement