
ఎయిర్‌ఫోర్స్ విమానంలో కొండచిలువ
భారత సైనిక విభాగానికి చెందిన రవాణా యుద్ధ విమానంలో అనుకోని అతిధి దర్శనం ఇచ్చింది. అయితే, ఆ అతిధి వ్యక్తి కాదు.. పెద్ద కొండచిలువ.
ఆగ్రా: భారత సైనిక విభాగానికి చెందిన రవాణా యుద్ధ విమానంలో అనుకోని అతిధి దర్శనం ఇచ్చింది. అయితే, ఆ అతిధి వ్యక్తి కాదు.. పెద్ద కొండచిలువ. అవును.. ఎనిమిదడుగుల కొండచిలువ కనిపించడంతో సైనికులు ఖంగుతిన్నారు. దాదాపు ఐదుగంటలపాటు కష్టపడి వన్యప్రాణి సంరక్షణ సిబ్బంది దానిని సురక్షితంగా బయటకు తీశారు. ఎలాంటి దాడి చేయకుండా, తిరిగి దానికి ఎలాంటి హానీ జరగకుండా బయటకు తీయాల్సి రావడంతో చాలా సమయం పట్టింది.
వివరాల్లోకి వెళితే.. భారత సైనిక విభాగానికి చెందిన ఆగ్రా బేస్ క్యాంపు వద్ద యుద్ధ విమానం ఏఎన్-32లో కుడి భాగంలోని ఓ సీటు కింద పెద్ద కొండచిలువ కనిపించింది. ‘కొండ చిలువను బయటకు తీసేందుకు చాలా ఇబ్బంది అయింది. ఇరుకుగా ఉండటంతో గట్టిగా పట్టుకొని ఉన్న దానికి ఎలాంటి హానీ జరగకుండా బయటకు తీయడానికి చాలా కష్టమైంది. ఐదు గంటల కష్టపడి దాని పట్టు విడిపించి సురక్షితంగా బయటకు తీసి తరలించాం’ అని ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన ఉద్యోగి తెలిపారు. ఈ కొండచిలువను చంపేయకుండా తమకు సమాచారం ఇచ్చినందుకు భారత ఎయిర్‌ఫోర్స్ సిబ్బందికి ధన్యవాదాలని అన్నారు.