
మోదీకి థ్యాంక్స్ చెప్పిన ఇవాంక
భారత ప్రధాని నరేంద్రమోదీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు.
తన ఆహ్వానాన్ని ఇవాంక అంగీకరించిందనే తాను భావిస్తున్నట్లు కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఇవాంక ‘భారత్‌లో జరిగే గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్‌కు హాజరయ్యే అమెరికా పారిశ్రామిక వేత్తల బృందానికి నేతృత్వం వహించేందుకు నన్ను ఆహ్వానించిన ప్రధాని నరేంద్రమోదీకి నా కృతజ్ఞతలు’ ఇవాంక ట్వీట్ చేశారు. అధ్యక్షుడు ట్రంప్‌కు ఇవాంక, ఆమె భర్త జేర్డ్ కుష్నర్ అత్యంత సన్నిహిత సలహాదారులుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Thank you, Prime Minister Modi, for inviting me to lead the U.S. delegation to the Global Entrepreneurship Summit in India this fall. pic.twitter.com/ZNwmTTnGYD
— Ivanka Trump (@IvankaTrump) 27 June 2017