తమ్ముడూ... విను..నేను చెప్పేది విను.. | chandrababu naidu cuts ysrcp mla Isaiah mike in Muchchumarri project programme | Sakshi
Sakshi News home page

తమ్ముడూ... విను..నేను చెప్పేది విను..

Jan 2 2017 6:03 PM | Updated on May 29 2018 2:28 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్షాత్తూ స్థానిక ఎమ్మెల్యే ప్రసంగించుకుండా అడ్డుకున్న వైనం కలకలం రేపుతోంది.

కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్షాత్తూ స్థానిక ఎమ్మెల్యే ప్రసంగించుకుండా అడ్డుకున్న వైనం కలకలం రేపుతోంది. ఈ ఘటన కర్నూలు జిల్లా ముచ్చుమర్రి ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవ సందర్భంగా చోటు చేసుకుంది.  సభలో వైఎస్‌ఆర్‌ సిపి ఎమ్మెల్యే ఐజయ్య పాల్గొనగా, అందుకు చంద్రబాబు  స్థానిక ఎమ్మెల్యే అయినప్పటికీ భాగస్వామ్యం లేదని, పట్టిసీమ ప్రాజెక్ట్‌ను వైఎస్‌ఆర్‌సీపీ వ్యతిరేకించిందన్నారు. అయితే ఇక్కడ తాను రాజకీయాలు మాట్లాడటానికి రాలేదని, ప్రజలకు వాస్తవాలు వివరించడానికి వచ్చానని చెప్పారు. కేవలం అభినందలు మాత్రమే చెప్పాలంటూ ఎమ్మెల్యేకు... చంద్రబాబు సూచించారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యే ఐజయ్య  ప్రాజెక్ట్ కోసం పునాది వేసింది వైఎస్‌ఆర్‌ అంటూ, పోలవరం ప్రాజెక్ట్‌కు పునాది వేసింది కూడా వైఎస్‌ఆర్‌ అని ప్రసంగిస్తున్న సమయంలో మధ్యలో చంద్రబాబు అడ్డుకున్నారు. అయినా వినకుండా ఐజయ్య ప్రసంగిస్తున్న సమయంలో ఆయన మైక్‌ను నిర్దాక్ష్యంగా కట్‌ చేయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఒకింత అసహనానికి గురయ్యారు. ‘తమ్ముడు... విను ...నేను చెప్పింది విను... అరే వినవయ్య...నేను చెప్పేది విను అంటూ పునాదులు వేసిన వాళ్లు కాదు...పునాదులు వేసి వెళ్లిపోయినవాళ్లు చాలామంది ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement