ఏపీ కొత్త రాజధానికి కేంద్రం నిధుల ప్రకటన


న్యూఢిల్లీ: ఏపీ కొత్త రాజధాని నిర్మాణం కోసం  1500 కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నట్లు  కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నిధులు కేటాయించినట్లు కేంద్రం తెలిపింది. రాజధాని ప్రాంతంలో అత్యవసర మౌలిక సదుపాయాల కోసం ఈ నిధులు ఇస్తున్నట్లు పేర్కొంది.



రాజ్భవన్, సచివాలయం, శాసనసభ, హైకోర్టు, ఇతర అత్యవసర భవనాల నిర్మాణానికి ఈ నిధులు కేటాయించినట్లు కేంద్రం వివరించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top