ప్రభుత్వాన్ని కడిగిపారేసిన కోటంరెడ్డి | Kotamreddy Sridhar Reddy speech in assembly | Sakshi
Sakshi News home page

Aug 22 2014 12:47 PM | Updated on Mar 21 2024 8:10 PM

రాజకీయ హత్యలపై శుక్రవారం అసెంబ్లీలో వాడీ వేడీగా చర్చ జరిగింది. వ్యవసాయ బడ్జెట్ అనంతరం శాంతి భద్రతలపై చర్చకు స్పీకర్ కోడెల శివప్రసాద్ అనుమతి ఇచ్చారు. రాజకీయ హత్యలపై నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి... ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయన్నారు. పక్కా వ్యూహం ప్రకారం దాడులు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎక్కడికక్కడ హత్యలు జరుగుతూనే ఉన్నాయని.... రాజకీయ ప్రత్యర్థులను మట్టుబెడుతున్నారని కోటంరెడ్డి మండిపడ్డారు.పోలీస్ స్టేషన్లలోనే వైఎస్ఆర్ సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని కోటంరెడ్డి సభ దృష్టికి తీసుకు వచ్చారు. బాధితుల వివరాలతో సహా ఆయన ప్రస్తావించారు. కలెక్టర్పై దాడి చేసినా తూతూమంత్రంగా కేసులు పెట్టారని కోటంరెడ్డి తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యే ముస్తాఫాకి దిగారని, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై దాడికి పాల్పడ్డారని, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డికి కూడా ముప్పు ఉందని, చెవిరెడ్డికి ఏం జరిగినా అందుకు చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement