వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీనేతలు, కార్యకర్తలు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నివిధాలా పోరాటం చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆమె... ప్రజలకు వైఎస్ జగన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మరోనేత గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలది దొరల అహంకారమని విమర్శించారు. వారు వ్యవహరించిన తీరు దారుణమన్నారు.
Nov 1 2013 10:08 AM | Updated on Mar 28 2019 5:32 PM
Advertisement
Advertisement
Advertisement
