తెలంగాణలో టీడీపీకి షాక్, టీఆర్ఎస్ లోకి ఎమ్మెల్యేలు | trs operation akarsh attracts tdp leaders | Sakshi
Sakshi News home page

తెలంగాణలో టీడీపీకి షాక్, టీఆర్ఎస్ లోకి ఎమ్మెల్యేలు

Oct 9 2014 11:04 AM | Updated on Aug 15 2018 9:22 PM

తెలంగాణలో టీడీపీకి షాక్, టీఆర్ఎస్ లోకి ఎమ్మెల్యేలు - Sakshi

తెలంగాణలో టీడీపీకి షాక్, టీఆర్ఎస్ లోకి ఎమ్మెల్యేలు

తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు బుజ్జగింపులు పనిచేయలేదు. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ పని చేస్తోంది.

హైదరాబాద్: తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు బుజ్జగింపులు పనిచేయలేదు. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ పని చేస్తోంది. దాంతో తెలంగాణ తెలుగు తమ్ముళ్లు సైకిల్ దిగి కారు ఎక్కేందుకు క్యూ కడుతున్నారు. తెలంగాణలో ఎదురుగాలి వీస్తున్నందున సైకిల్ తొక్కడం కష్టం అవుతోందని, కారులో అయితే ఈ ఐదేళ్లు హాయిగా వెళ్లచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.  సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తో భేటీ అయ్యారు.

 

మరోవైపు వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ కూడా కేసీఆర్తో భేటీ అయినట్లు సమాచారం. వీరంతా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు ముహుర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసీఆర్ మరికొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

 

Advertisement
 
Advertisement
Advertisement