పుష్కర విధులు ప్రాణం తీశాయి! | driver hanumanta rao died at pushkara service | Sakshi
Sakshi News home page

పుష్కర విధులు ప్రాణం తీశాయి!

Jul 18 2015 9:16 PM | Updated on Sep 29 2018 5:26 PM

గోదావరి పుష్కరాలు ఓ బస్సు డ్రైవర్ కుటుంబంలో విషాదాన్ని నింపాయి.

కొవ్వూరు: గోదావరి పుష్కరాలు ఓ బస్సు డ్రైవర్ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. పుష్కరాలు ఆరంభమైన నాటి నుంచి విశ్రాంతి లేకుండా విధులు నిర్వర్తిస్తున్నరాజా హనమంతరావు అనే బస్సు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు.  ఈ సంఘటన శనివారం కొవ్వూరులో చోటు చేసుకుంది.

 

ఉచిత బస్సు సేవల్లో భాగంగా వరుసగా ఐదు రోజుల పాటు బస్సు డ్రైవర్ గా విధుల్లో ఉన్న హనుమంతరావు ఉన్నట్టుండి ఈ రోజు  సాయంత్రం సొమ్ముసిల్లి పడిపోయాడు. అనంతరం అతన్ని ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. హనుమంతరావుది పశ్చిమగోదావరి జిల్లాలోని విస్సాకోడేరు గ్రామం.

Advertisement
 
Advertisement
Advertisement