ఎన్కౌంటర్ కు నిరసనగా బస్సుపై బాంబుతో దాడి | blast attack in nellore distirict | Sakshi
Sakshi News home page

ఎన్కౌంటర్ కు నిరసనగా బస్సుపై బాంబుతో దాడి

Apr 7 2015 7:10 PM | Updated on Sep 3 2019 9:06 PM

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ పట్టణం సమీపంలోని పూడి వద్ద మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు.

తడ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ పట్టణం సమీపంలోని పూడి వద్ద మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. బైక్‌పై వెళ్తున్న దుండగులు బస్సుపై పెట్రోల్ బాంబు విసిరి వెళ్లిపోయారు. అయితే, అది బస్సు పక్కన పడటంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులోని ప్రయాణికులు దుండగులను అడ్డుకోగా వారు పరారయ్యారు. ఎన్ కౌంటర్ కు నిరసనగా నినాదాలు దుండగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా,  చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ దాడి జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. తమిళనాడు సరిహద్దులో ఈ గ్రామం ఉంది. అయితే, తాజా ఘటన నేపథ్యంలో ఏపీ ఆర్టీసీ అధికారులు ఆంధ్రా నుంచి తమిళనాడు వైపు వెళ్లే బస్సులను నిలిపివేశారు.

Advertisement
 
Advertisement
Advertisement