breaking news
Narendra Modi
-
‘స్వదేశీ’ విప్లవం ప్రారంభిద్దాం
వారణాసి: స్వదేశీ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో మన దేశంలో తయారైన ఉత్పత్తులే ఉపయోగిద్దామని, స్వదేశీ విప్లవం ప్రారంభిద్దామని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తులు కొనుగోలు చేయడం, ప్రోత్సహించడం అసలైన దేశ సేవ అవుతుందని ఉద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఉత్పత్తులపై ఏకంగా 25 శాతం సుంకాలు విధించడంతో, భారత ఆర్థిక వ్యవస్థ మృతప్రాయంగా మారిందంటూ వ్యాఖ్యానించిన నేపథ్యంలో స్వదేశీ వస్తువుల ప్రాధాన్యతను ప్రధాని మోదీ ప్రత్యేకంగా చాటిచెప్పడం గమనార్హం. మోదీ శనివారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. రూ.2,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అలాగే పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి కింద 9.70 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20,500 కోట్లు జమ చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచమంతటా ఆర్థిక పరిస్థితులు, దేశాల వైఖరి ఎలా ఉందో అందరూ తెలుసుకోవాలని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశి్చతి, అస్థిరతను ఎదర్కొంటోందని అన్నారు. అందుకే విదేశాలు సొంత ప్రయోజనాలపైనే దృష్టి పెడుతున్నాయని తెలిపారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ క్రమంలో మన ఆర్థిక ప్రయోజనాలు, ప్రాధాన్యతల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... పౌరులకు బాధ్యతలుంటాయి ‘‘రైతులకు, చిన్న పరిశ్రమలకు మేలు చేయడానికి, యువతకు ఉపాధి కల్పించడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఈ విషయంలో చేయగలిగినదంతా చేస్తున్నాం. పౌరులుగా మనకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. స్వదేశీ ఉత్పత్తులకు మద్దతు ఇవ్వడాన్ని జాతీయ ఉద్యమంగా మార్చేద్దాం. మోదీ చెప్పారని కాదు. ఇది ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యత. మన దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలంటే ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి నాయకుడు స్వప్రయోజనాలు పక్కనపెట్టి దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలి. ప్రజల్లో స్వదేశీ స్ఫూర్తిని మేల్కొల్పాలి. ప్రజలు తెలివైన వినియోగదారులుగా మారాలి. మనం ఏది కొనుగోలు చేసినా అది మన దేశంలోనే తయారైందా? అని ప్రశ్నించుకోవాలి. తోటి పౌరుల స్వేదం, నైపుణ్యంతో తయారైన వస్తువులు వాడుకోవాలి. ఇకపై మన మంత్రం ‘వోకల్ ఫర్ లోకల్’. దుకాణాలు, మార్కెట్లలో స్వదేశీ వస్తువులే విక్రయిస్తామని వ్యాపారులు, దుకాణదారులు ప్రతిజ్ఞ చేయాలి. దేశానికి సేవ చేయాలనుకుంటే ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను ప్రోత్సహించండి. సిందూరాన్ని అవమానిస్తున్నారు మన శక్తి సామర్థ్యాలు ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి తెలిసొచ్చాయి. భారత్‌పై దాడికి దిగే ధైర్యం చేస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, పాతాళ లోకంలో దాక్కున్నా వెతికి మరీ అంతం చేస్తామని తెలియజెప్పాం. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదు. మహాశివుడి రుద్ర రూపమే ఆపరేషన్ సిందూర్. మన సైనిక దళాల సాహసాన్ని కాంగ్రెస్ పార్టీ పదేపదే కించపరుస్తోంది. ఆపరేషన్ సిందూర్‌ను తమాషా అంటూ హేళన చేస్తోంది. మన సోదరీమణులు ధరించే పవిత్ర సిందూరాన్ని అవమానిస్తోంది. పహల్గాం ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. నా మనసు ఆవేదనతో నిండిపోయింది. ముష్కరులపై ప్రతీకారం తీర్చుకుంటామని సిందూరం కోల్పోయిన మన బిడ్డలకు హామీ ఇచ్చా. మహాదేవుడి ఆశీస్సులతో అది నెరవేర్చా. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పరమశివుడి పాదాలకు అంకితం ఇస్తున్నా. 140 కోట్ల మంది భారతీయుల ఐక్యతే ఆపరేషన్ సిందూర్‌కు బలంగా మారింది. శివ అంటే అర్థం మంచి. కానీ, ఉగ్రవాదం, అన్యాయం తల ఎగరేసినప్పుడు శివుడు రుద్రరూపం దాలుస్తాడు.’ అని మోదీ అన్నారు. స్వదేశంలోనే పెళ్లి చేసుకోండి వివాహాల సీజన్ మొదలైంది. పండుగలు రాబోతున్నాయి. ప్రజలు కొత్తగా కొనే వస్తువులు, ఉత్పత్తులు మన దేశంలో తయారైనవే కావాలి. సంపన్నులు విదేశాల్లో వివాహాలు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వారు వివాహ వేదికను మన దేశానికి మార్చుకోవాలి. గతంలోనూ ఇలాంటి పిలుపు ఇచ్చా. ఎంతమంది స్పందించారో తెలియదు. మన ప్రతి అడుగులో స్వదేశీ అనే భావన ఉంటే అది మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. మహాత్మా గాందీకి మనం ఇచ్చే అసలైన నివాళి ఏమిటో తెలుసా?.. స్థానిక ఉత్పత్తులు వాడుకోవడమే. సమ్మిళిత ప్రయత్నం, కృషి ద్వారానే మన దేశాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసుకోగలం. పాక్ నష్టపోతే ప్రతిపక్షాలకు ఏడుపెందుకో? ‘ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ప్రజలు పండుగలా భావిస్తున్న సమయంలో మన దేశంలోనే కొందరు వ్యక్తులు అది తట్టుకోలేకపోయారు. కళ్లల్లో నిప్పులు పోసుకున్నారు. పాకిస్తాన్లో ఉగ్రవాదుల స్థావరాలను మన సైన్యం నేలమట్టం చేయడాన్ని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు జీరి్ణంచుకోలేపోయాయి. పాకిస్తాన్ భూభాగంలోని పలు వైమానిక స్థావరాలు ఇప్పటికీ ఐసీయూలో ఉన్నాయి. ఇండియా దాడుల్లో నష్టపోయినందుకు పాకిస్తాన్ ఏడుస్తోందంటే అర్థం చేసుకోవచ్చు. మరి మన దేశంలోని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలకు వచ్చిన బాధేమిటో అర్థం కావడం లేదు. పాకిస్తాన్‌కు నష్టం జరగడం చూసి ఆ పార్టీల నాయకులు భరించలేకపోతున్నారు. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను ఆపరేషన్ మహాదేవ్లో మట్టుబెట్టాం. ఈ ఆపరేషన్ ఇప్పుడే ఎందుకు చేపట్టారని సమాజ్‌వాదీ పార్టీ నేతలు ప్రశి్నస్తున్నారు. అంటే ఉగ్రవాదులు పారిపోయేదాకా ఆగాలా? మిమ్మల్ని ఇప్పుడు చంపాలా? లేక తర్వాత చంపాలా? అని ఉగ్రవాదులను అడగాలా? ఇదే సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదులకు క్లీన్చిట్ ఇచ్చారు. బాంబు పేలుళ్లకు పాల్పడిన వారిపై కేసులు ఎత్తేశారు. ఇప్పుడు ఉగ్రవాదులు హతమైపోతుండడం చూసి ఆ నాయకులకు నిద్రపట్టడం లేదు.’ అని మోదీ ఎద్దేవా చేశారు.మన క్షిపణులతో శత్రువుల్లో భయం ఇది నవ భారతం. మహా శివుడిని అరాధిస్తున్నాం. అదే శివుడు అవసరమైనప్పుడు శత్రువులను చీల్చి చెండాడడానికి కాలభైరవుడు అవుతాడు. మన స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకున్న క్షిపణులు, డ్రోన్లు, గగనతల రక్షణ వ్యవస్థల శక్తి ఏమిటో ఆపరేషన్ సిందూర్ ద్వారా నిరూపితమైంది. మన బ్రహ్మోస్ క్షిపణులు శత్రువుల్లో భయం పుట్టించాయి. పాకిస్తాన్‌లోని దుష్టులు వారి కలలోనూ ప్రశాంతంగా నిద్రపోలేరు. పాకిస్తాన్ కనుక మన దేశంపై మళ్లీ దాడికి దిగితే.. ఉత్తరప్రదేశ్‌లో తయారవుతున్న క్షిపణులతో పాక్ ఉగ్రవాదులను ఖతం చేస్తాం’’ అని ప్రధాని మోదీ ప్రతిన బూనారు. మోదీకి శివలింగం బహూకరణ ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించడం ఇది 51వ సారి కావడం విశేషం. పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రికి చేతితో తయారు చేసిన శివలింగాన్ని బహూకరించారు. 18 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పు ఉన్న ఈ శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముగ్గురు బనారస్ కళాకారులు తయారు చేశారు. మూడు భౌగోళిక సూచిక(జీఐ) సర్టీఫికెట్లు పొందిన మూడు హస్తకళల సమ్మేళనమే ఈ శివలింగం. మన స్వదేశీ హస్త కళాకృతులు, వ్రస్తాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కళాకారులకు, చేనేత కారి్మకులకు ప్రధాని మోదీ ఈ సందర్భంగా సూచించారు. ‘లోకల్ టు గ్లోబల్’ మన లక్ష్యం కావాలన్నారు. జీఐ గుర్తింపు లభించిన స్థానిక ఉత్పత్తులను పరిరక్షించుకోవాలని, వాటిని మరింత ప్రోత్సహించాలని కోరారు. -
ఇది ట్రంప్‌కు కౌంటరేనా?.. అదే మీ ప్రమాణం కావాలి: ప్రధాని మోదీ
వారణాసి: ఇప్పడు దేశమంతా ఒకటే చర్చ. భారత్ వస్తువులపై 25 శాతం సుంకాన్ని విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపైనే అంతటా చర్చ. ఈ సుంకం ప్రభావం అనేది భారత్ ఎగుమతి చేసే ఏయే వస్తువులపై అధికంగా ఉంటుందనేది ఇప్పుడు ప్రధానంగా చర్చించుకుంటున్నారు. ట్రంప్ నిర్ణయం.. భారత్ ఎకానమీపై ఎంత వరకూ ప్రభావం చూపుతుందనేదే ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపకపోతే భారత్‌పై సుంకాల భారం అధికంగా ఉంటుందని ట్రంప్ హెచ్చరించిన రోజుల వ్యవధిలోనే అన్నంత పని చేశారు. పైకి భారత్ ఫ్రెండ్ అని చెప్పుకుంటూనే సుంకాల భారాన్ని మోపారు. అదే సమయంలో పాకిస్తాన్ సుంకాల్లో సడలింపు ఇచ్చారు. ఇది భారత్‌పై ట్రంప్‌కు ఎంత ప్రేమో ఉందో అనేది అందరికి అర్ధమైపోయింది.ఇదిలా ఉంచితే, ట్రంప్ సుంకాల భారాన్ని మోపిన వేళ.. భారత ప్రధాని దేశ ప్రజలకు ఓ సందేశాన్ని ఇచ్చారు. గతంలో మోదీ ఎన్నో సందర్భాల్లో చెప్పిన ‘స్వదేశీ’( మేడ్ ఇన్ ఇండియా) అంశాన్ని మరొకసారి స్పష్టం చేశారు. ఈరోజు(శనివారం, ఆగస్టు 2వ తేదీ) ఆయన లోక్‌సభ స్థానం వారణాసిలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు మోదీ. ప్రధానంగా స్వదేశీ వస్తువులపైనే ప్రధాని మోదీ ఎక్కువగా ప్రస్తావించారు. ‘మనం ఏదైనా కొనాలని నిర్ణయించుకున్నప్పుడు మనకు ఒకే ఒక ప్రమాణం ఉండాలి. ఒక భారతీయుడు కష్టపడి తయారు చేసిన వాటినే కొనబోతున్నాం అనే ప్రమాణం మాత్రమే ఉండాలి’ అని మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి‘నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నా భిన్నంగా ఉంది. ఎన్నో ఆటు పోట్లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉంది. అనిశ్చితి వాతావరణంలో ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రతీ దేశం వారి స్వ ప్రయోజనాల కోసమే పని చేస్తుంది. మనం మూడో ఆర్థిక శక్తిగా ఎదగడానికి అతి దగ్గర్లో ఉన్నాం. అదే సమయంలో ఆర్థిక ప్రయోజనాల విషయంలో కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. మన రైతులు, మన పరిశ్రమలు, యువతకు ఉపాధి తదితర అంశాలు దేశ ప్రయోజనాల్లో కీలకం కావాలి. అవన్నీ మనకు చాలా ప్రధానమైన వనరులు. ప్రభుత్వం కూడా ఆ దిశగానే ముందుకు సాగుతోంది. బాధ్యత అనుకోవాలి.. అలవాటు చేసుకోవాలిఈ సమయంలో మనపైన కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఇది కేవలం మోదీకి మాత్రమే సంబంధించినది కాదు. ప్రతీ ఒక్కరూ భారత్ మూడో ఆర్థిక శక్తిగా ఎదగాలని కోరుకుంటున్నారు. ఇందులో సామాన్యుడి దగ్గర్నుంచీ ప్రతీ ఒక్కరూ భారత్‌ను ఉన్నతంగా చూడాలని అనుకుంటున్నారు. మన లక్ష్యం నెరవేరాలంటే మనం స్వదేశీ వస్తువులపైనే దృష్టి సారించాలి. మన భారతీయుడు తయారు చేసిన వస్తువునే కొనడానికి మనం ఒక ప్రమాణం స్ఫూర్తిగా కట్టుబడి ఉండాలి. అది మన బాద్యత అనుకోవాలి. దీన్ని అలవరుచుకోవాలి’ అని మోదీ స్పష్టం చేశారు. తాము విధించే సుంకాలతో భారత్ ఎకానమీ ఇక అతలాకుతలమే అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇది మోదీ ఇచ్చిన కౌంటర్‌గా పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమకు అన్నింటికంటే దేశ ప్రయోజనాల ముఖ్యమని మోదీ స్పష్టం చేయడతో పాటు స్వదేశీ వస్తువులపైనే భారతీయులు దృష్టి సారించాలని ఇచ్చిన పిలుపు కచ్చితంగా ట్రంప్‌కు బదులిచ్చినట్లుగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మోదీని గద్దెదించడం సంఘ్ పరివార్ వల్ల కాదు, కానీ..: రేవంత్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పీఠాన్ని వదులుకునేందుకు మోదీ సిద్ధంగా లేరని, ఆయన్ని గద్దె దించాలని సంఘ్ పరివార్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారాయన. శనివారం ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ న్యాయ సదస్సులో రేవంత్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో కుల గణన పూర్తి చేశాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. సామాజిక న్యాయంలో భాగంగా రిజర్వేషన్లు కల్పిస్తాం. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం కాంగ్రెస్ పార్టీది. 2004, 2009 లో ప్రధాని అయ్యే అవకాశం ఉన్న రాహుల్ గాంధీ తీసుకోలేదు. సీనియర్లకు ప్రధాని పదవి అప్పగించారు. కానీ.. ..2001 నుంచి నరేంద్ర మోదీ అధికార కుర్చీని వీడడం లేదు. ఆర్ఎస్ఎస్ ఆ కుర్చీని వదిలేయాలని చెప్పినా కూడా మోదీ వదలడం లేదు. 75 ఏళ్ల వయసు వచ్చిన వారు పదవి దిగిపోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్లకు వర్తించిన వయస్సు పరిమితి అంశం.. మోదీకి వర్తించదా?.. .. మోదీని గద్దె నుంచి దించేందుకు సంఘ్ పరివార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ ఆయన అందుకు సిద్ధంగా లేరు. మోదీని దించేయడం సంఘ్ పరివార్ వల్ల కాదు. మోదీని గద్దె దింపడం కేవలం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వల్లే అవుతుంది. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో మోడీని గద్దె దింపుతాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లకు మించి గెలవదు. మోదీ బారి నుంచి దేశాన్ని రక్షిస్తాం. దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు’’ అని రేవంత్ అన్నారు. -
ట్రంప్ ‘డెడ్ ఎకానమీ’ కామెంట్లకు ప్రధాని మోదీ కౌంటర్!
భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. భారత్, రష్యా బంధంపై విరుచుకుపడే క్రమంలో.. ఇరుదేశాలవీ ‘డెడ్ ఎకానమీ’ అంటూ వ్యాఖ్యానించారాయన. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ ‘డెడ్ ఎకానమీ’ వ్యాఖ్యలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ బలమైందని.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించే క్రమంలో ఉందని అన్నారాయన. శనివారం యూపీ వారణాసిలో జరిగిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బలంగా, నిలకడగా ఉంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎదిగేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక గందరగోళం నెలకొంది(పరోక్షంగా ట్రంప్ టారిఫ్‌ల నిర్ణయాన్ని ప్రస్తావించి). అన్ని దేశాలు తమ తమ ప్రయోజనాలపై దృష్టిసారించాయి. భారత్ ప్రయోజనాలకు అవసరమైన చర్యలను మా ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకుంటుంది. ఇందు కోసం విభేదాలను పక్కన పెట్టి.. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ముందుకు రావాలి. స్వదేశీ ఉత్పత్తులకు మద్దతివ్వడం ఇచ్చేలా తీర్మానం చేయాలి’’ అని పిలుపు ఇచ్చారాయన. ఇదిలా ఉంటే.. భారత్‌పై 25శాతం సుంకాలతోపాటు పెనాల్టీ విధిస్తూ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా-భారత్ మధ్య వాణిజ్య బంధాల్ని ప్రస్తావించిన ట్రంప్ తనకేం సంబంధం లేదంటూనే శాపనార్థాలు పెట్టారు. రెండు దేశాలవి డెడ్ ఎకానమీలని, కలిసి అవి ఆర్థిక వ్యవస్థలను మరింత దిగజార్చుకుంటాయని, కలిసి మునుగుతాయని వ్యాఖ్యానించారు. ‘మనకు భారత్ స్నేహితురాలే అయినా ఆ దేశంతో స్వల్ప లావాదేవీలే ఉన్నాయి. ఆ దేశం సుంకాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌లో దాడులు ఆపాలని ప్రపంచమంతా గొంతెత్తి అరుస్తుంటే.. భారత్ మాత్రం రష్యా నుంచి ఆయుధాలను, ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన ఇటు భారత్‌లోనూ రాజకీయ దుమారం రేపింది. మోదీ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ ఖతమైందని, దేశ ప్రధాని, ఆర్థిక మంత్రికి తప్ప ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. అయితే బీజేపీతో పాటు కాంగ్రెస్ ఎంపీలైన రాజీవ్ శుక్లా(రాజ్యసభ), లోక్‌సభ ఎంపీ శశిథరూర్‌లు రాహుల్ వ్యాఖ్యలతో విభేదించడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
Varanasi: మహాదేవుని ఆశీస్సులతో ‘పహల్గామ్’పై ప్రతీకారం: ప్రధాని మోదీ
వారణాసి: ‘ఆ మహాదేవుని ఆశీస్సులతో పహల్గామ్ దాడిపై ప్రతీకారం తీర్చుకున్నాం. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని మహాశివుని పాదాలకు అంకితమిస్తున్నాను’ అని ప్రధాని మోదీ వారణాసి పర్యటనలో పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యాటకం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక వారసత్వం తదితర కీలక రంగాల విస్తరణకు ఉద్దేశించిన ప్రాజెక్టులను యూపీలోని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.శనివారం ఉదయం 11 గంటలకు ప్రదాని మోదీ వారణాసిలో అడుగుపెట్టారు. అనంతరం దాదాపు రూ.2,200 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘ఆపరేషన్ సిందూర్ తర్వాత మొదటిసారి కాశీకి వచ్చాను. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్లో ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు దారుణంగా హత్యకు గురయ్యారు. బాధిత కుటుంబాల వేదన నా హృదయాన్ని ద్రవింపజేసింది. బాధిత కుటుంబాలకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని నేను కాశీ విశ్వనాథుణ్ణి ప్రార్థించాను’ అని అన్నారు. #WATCH | Varanasi, UP: Prime Minister Narendra Modi lays the foundation stone and inaugurates multiple development projects worth around Rs 2200 crores. Source: DD pic.twitter.com/m7fKAvi3g5— ANI (@ANI) August 2, 2025ఈ కార్యక్రమంలో ప్రధాని.. కిసాన్ సమ్మాన్ నిధి 20వ వాయిదాను 9.7 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు. దాదాపు రూ.2200 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అంతకు ముందు ఉత్తరప్రదేశ్ చేరుకున్న ప్రధాని మోదీని సీఎం యోగి ఆదిత్యనాథ్ సత్కరించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పదవిలో ఉంటూ వారణాసిని 51వ సారి సందర్శించారు. ఆయన నగరంలో దాదాపు మూడు గంటల పాటు ఉండనున్నారు. కిసాన్ నిధిని ప్రదాని మోదీ వారణాసి నుండి రైతులకు పంపిణీ చేయడం ఇది రెండవసారి. ఈరోజు ప్రధాని మోదీ రామ్‌కుండ్, మందాకిని, శంకుల్ధార, ఇతర ప్రాంతాలతో సహా వివిధ కుండ్లలో నీటి శుద్ధి, నిర్వహణ పనులకు పునాది రాయి వేయనున్నారు. జల్ జీవన్ మిషన్ కింద 47 గ్రామీణ తాగునీటి పథకాలను ప్రారంభించనున్నారు. ‘కాశీ సంసద్ ప్రతియోగిత’ కింద స్కెచింగ్ పోటీ, పెయింటింగ్ పోటీ, ఫోటోగ్రఫీ పోటీ పోటీల కోసం రూపొందించిన రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.పండిట్ మదన్ మోహన్ మాలవ్య క్యాన్సర్ సెంటర్, హోమి భాభా క్యాన్సర్ హాస్పిటల్లో రోబోటిక్ సర్జరీ సెంటర్లకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని మోదీ ఈ పర్యటనకు ముందు ట్విట్టర్లో ‘ఆగస్టు 2వ తేదీ కాశీలోని నా కుటుంబ సభ్యులకు చాలా ప్రత్యేకమైన రోజు. రేపు ఉదయం 11 గంటలకు, విద్య, ఆరోగ్యం, క్రీడలు, పర్యాటకం, కనెక్టివిటీకి సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నాను. అలాగే పీఎం పీఎం కిసాన్ పథకం 20వ విడత నిధులను విడుదల చేయనున్నాను’ అని పేర్కొన్నారు. -
రాజ్యాంగం మా రక్తం.. దాడి చేయడానికి మీరెవరు?: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగారు. లోక్‌సభ ఎన్నికలు రిగ్ అయ్యాయన్న.. ఎన్నికల సంఘం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ న్యాయ సదస్సులో రాహుల్ మాట్లాడుతూ.. ‘‘నిప్పుతో చెలగాటమాడుతున్నానని ప్రియాంక(రాహుల్ సోదరి) నాతో చెబుతోంది. అవును.. నేను నిప్పుతో చెలగాటమాడుతున్నాననే విషయం నాకు తెలుసని అన్నాను. ఆ ఆట ఆపనని కూడా చెప్పాను. నేను దేనికి భయపడను. పిరికి పందలను చూసి భయపడొద్దని నా కుటుంబం చెప్పింది. కాంగ్రెస్ తప్పును తప్పు అని చెబుతుంది. నిజం ఉన్న చోట దైర్యం ఉంటుంది. బీజేపీకి ధైర్యం లేదు.. నిజం చెప్పలేదు’’ అని రాహుల్ మండిపడ్డారు. 10-15 సీట్లతో మోదీ ప్రధాని అయ్యారు. ఆ పదిహేను సీట్లు లేకుంటే వాళ్లకు అధికారం దక్కేది కాదు.. మోదీ ప్రధాని అయ్యేవారు కాదు. దేశంలో ఈసీకి ఉనికి లేదు. ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయిందన్నది సత్యం. లోక్‌సభ ఎన్నికలు రిగ్ అయ్యాయి. లోక్ సభ ఎన్నికల్లో 100 సీట్ల వరకు రిగ్గింగ్ జరిగి ఉండొచ్చు. లోక్ సభ ఎన్నికలు రిగ్గింగ్ చేయొచ్చా...? రిగ్గింగ్ జరిగిందా అనేది నిరూపిస్తాం. మహారాష్ట్ర ఓటర్ లిస్ట్ లో తప్పిదాలున్నాయి.. దాన్ని నిరూపించాం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చీటింగ్ జరిగింది.. దానికి సంబంధించి ఆధారాలున్నాయి. ఈసీ స్కాన్ ప్రొటెక్ట్ ఓటర్ లిస్ట్ ఎందుకు కలిగి ఉంది?. ఆరున్నర లక్షల ఓటర్లలో లక్షన్నర ఓట్లు ఫేక్ ఓట్లు. ఈసీ అవకతవకలపై మా దగ్గర 100 శాతం ఆధారాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇవన్నీ బయటపెడతాం.ఎన్నికల కమిషన్ పారదర్శకంగా పనిచేయడం లేదు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది. రాజ్యాంగం మా రక్తంలాంటిది. మా రక్తంపై దాడి చేయడానికి మీరేవరు?. మేము రాజకీయంగా పోరాడుతున్నాం.. రాజ్యంగం కోసం న్యాయవాదులు కోర్టుల్లో పోరాడుతున్నారు. రాజ్యాంగాన్ని కాపాడుతోంది న్యాయవాదులే అని రాహుల్ అన్నారు. #WATCH | Delhi: At the Annual Legal Conclave- 2025, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "We are going to prove to you in the coming few days how a Lok Sabha election can be rigged and was rigged..."He also says, "The truth is that the election system in India is… pic.twitter.com/F9Vfsf5uH1— ANI (@ANI) August 2, 2025 -
ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్.. F-35 డీల్ కు భారత్ బ్రేకులు..
-
ట్రంప్ సుంకాలపై ఆచితూచి స్పందించిన భారత్
-
ట్రంప్ చెప్పింది నిజమే.. మన ఆర్థిక వ్యవస్థ ఖతం
న్యూఢిల్లీ: తాము విధించిన టారిఫ్‌ల దెబ్బకు భారత్ ఆర్థిక వ్యవస్థ ఖతమేనంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆయన నిజమే చెప్పారన్నారు. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మినహా దేశ ప్రజలందరికీ ఈ విషయం తెలుసు, మీకు తెలియదా అని ఆయన విలేకరులను ప్రశ్నించారు. రాహుల్ గురువారం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో మీడియాతో మాట్లాడారు. ట్రంప్ చెప్పినట్లుగానే మన దేశం అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటుందని, అమెరికా అధ్యక్షుడు ఏది చెబితే అదే ప్రధాని మోదీ అదే చేస్తారంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్థికంగా, రక్షణపరంగా, విదేశాంగ విధానాల విషయంలోనూ దేశాన్ని నాశనం చేసి, ఒక్క అదానీకి మాత్రమే సాయం చేస్తోందంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాల కారణంగా దేశంలోని అన్ని రకాల చిరు వ్యాపారాలు నాశనమై పోయాయని దుయ్యబట్టారు. ‘మనది అద్భుతమైన విదేశాంగ విధానం అంటూ విదేశాంగ మంత్రి అంటున్నారు. కానీ, ఒక వైపు అమెరికా బెదిరింపులకు పాల్పడుతోంది. మరోవైపు చైనా మన వెంటబడుతోంది. Yes, he is right. Everybody knows this except the Prime Minister and the Finance Minister. Everybody knows that the Indian economy is a dead economy. I am glad that President Trump has stated a fact.पूरी दुनिया जानती है- भारत की इकॉनमी 'Dead economy' है और BJP ने इकॉनमी को… pic.twitter.com/8VdjFN4uoV— Congress (@INCIndia) July 31, 2025 మన ప్రభుత్వం ప్రపంచ దేశాలకు దౌత్య ప్రతినిధులను పంపినా ఏ ఒక్క దేశం కూడా పాక్ చర్యలను ఖండించలేదు. వీరికి దేశాన్ని ఎలా నడపాలో తెలియదు. అంతటా గందరగోళమే’అని రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం లోక్‌సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై రాహుల్ స్పందిస్తూ, ప్రధానమంత్రి తన ప్రసంగంలో ట్రంప్ పేరును గానీ, చైనాను గురించి గానీ ఒక్కమాట కూడా మాట్లాడలేదని గుర్తు చేశారు. ‘పాకిస్తాన్ ఉగ్ర చర్యలను ఏ దేశమూ ఖండించలేదన్న విషయాన్ని మోదీ చెప్పలేదు. పహల్గాం దాడి వెనుక ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌కు ట్రంప్ వైట్‌హౌస్‌లో విందు ఇచ్చారు. ఘన విజయం సాధించామంటూ వారిద్దరూ ప్రకటించారు. ఏమిటా విజయం?’అని రాహుల్ ప్రశ్నించారు. ‘భారత్, పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ తన వల్లేనంటూ ట్రంప్ 30 సార్లు ప్రకటించుకున్నారు. #WATCH | Delhi | Congress MP Rajeev Shukla says, "... Trump saying that the economies of India and Russia are dead, is wrong. The Indian economy is not dead. Economic reforms were made when PV Narasimha Rao and Manmohan Singh were there. Atal Bihari Vajpayee took those reforms… pic.twitter.com/UZ0lLvRzZY— ANI (@ANI) July 31, 2025భారత్ ఐదు విమానాలు నష్టపోయిందని చెప్పిన ట్రంప్..భారత్‌పై ఇప్పుడు 25 శాతం టారిఫ్‌లను ప్రకటించారు. దీనికి మోదీ సమాధానం ఇవ్వలేకపోయారు. ఎందుకని మీరు అడిగారా? ఇందుకు కారణం ఏమిటి? మోదీ ఎవరి కంట్రోల్లో ఉన్నారు?’అని రాహుల్ వాగ్బాణాలు సంధించారు. ‘భారత్–అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న చర్చల్లో అంతా ట్రంప్ చెప్పినట్లుగా జరుగుతుంది’అని రాహుల్ పేర్కొన్నారు. అనంతరం రాహుల్ ‘ఎక్స్’లో..‘భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది. మోదీయే చంపేశారు. 1. అదానీ–మోదీ భాగస్వామ్యం. 2. నోట్ల రద్దు, లోపభూయిష్ట జీఎస్టీ. 3. విఫలమైన తయారీరంగం 4. నాశనమైన చిన్న పరిశ్రమలు 5. దోపీడీకి గురైన రైతులు. వీటన్నిటితోపాటు ఉద్యోగావకాశాలు కల్పించకుండా మోదీ దేశ యువత భవిష్యత్తును నాశనం చేశారు’అని రాహుల్ ఆరోపించారు. -
ఆగస్టు 2న పీఎం కిసాన్ నిధుల విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద అందిస్తున్న నిధులను ఆగస్టు రెండో తేదీన విడుదల చేయనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ నిధుల విడుదల కార్యక్రమం జరగనుంది. తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.7 కోట్ల రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.20,500 కోట్లకు పైగా నిధులను ప్రత్యక్ష బదిలీ విధానం ద్వారా జమ చేయనున్నారు. పీఎం కిసాన్ కింద ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల్లో రూ.6,000 ఆర్ధిక సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 19వ విడత నిధులను విడుదల చేశారు. 19వ విడతతో ఈ పథకం కింద ఇంతవరకు మొత్తంగా పంపిణీ చేసిన మొత్తం రూ.3.69 లక్షల కోట్లకు చేరగా 20వ విడత నిధులతో ఈ మొత్తం ఏకంగా రూ.3.89 లక్షల కోట్లను దాటనుంది. పంటల ఉత్పత్తిని పెంచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, ఉత్పత్తులకు న్యాయమైన ధరలను నిర్ధారించడం లక్ష్యంగా కేంద్రం ఈ నిధులను విడుదల చేస్తోంది. ఈ నిధుల విడుదల కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించే అంశమై వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ బుధవారం అధికారులతో ఉన్నతస్ధాయి సమావేశం నిర్వహించారు. నిధుల విడుదలపై విస్తృత కార్యక్రమాలను నిర్వహించాలని, కృషి విజ్ణాన కేంద్రాలతో పాటు కృషి సఖీలు, డ్రోన్ దీదీలు, బ్యాంక్ సఖీ, పశు సఖీ, బీమా సఖీ గ్రామ పంచాయతీ సర్పంచ్‌లను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఆదేశించారు. ఫసల్ బీమా కింద రూ. 5 వేల కోట్ల బకాయిలు దేశ వ్యాప్తంగా సకాలంలో పరిహారం అందేలా అనేక చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద బీమా సంస్థలు రైతులకు రూ.5,405 కోట్ల మొత్తాలను బకాయిపడ్డాయని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా చెప్పారు. బీమా కార్యక్రమంలో పాలుపంచుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు, బీమా సంస్థల మధ్య వివాదాలు, బ్యాంకుల తప్పులు, ఆలస్యమైన బీమా ప్రతిపాదనలు, రాష్ట్రాలు సబ్సిడీ వాటాను ఆలస్యంగా విడుదల చేయడం వంటి కారణాలతో బకాయిలు పేరుకుపోయాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. -
127 ఏళ్ల తర్వాత భారత్‌కు బుద్ధుని అవశేషాలు
న్యూఢిల్లీ: బ్రిటిష్ హయాంలో భారత్ నుంచి తరలిపోయిన బుద్ధుని పవిత్ర అవశేషాలను 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి తీసుకొచ్చారు. ఈ వివరాలు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తన సామాజికమాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో పంచుకున్నారు. శతాబ్దం తర్వాత బుద్ధుని అవశేషాలు భారత్‌కు తిరిగి రావడం నిజంగా దేశ సాంస్కృతిక వారసత్వానికి సంతోషకరమైన రోజు అని ప్రధాని మోదీ అభివర్ణించారు. 1898 సంవత్సరంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిప్రాహ్వా ప్రాంతంలో పురావస్తు తవ్వకాలు ముమ్మరంగా జరిగాయి. ఆ తవ్వకాల్లో బుద్ధుని పవిత్ర అవశేషాలు బయల్పడ్డాయి. అయితే నాటి బ్రిటన్‌పాలకులు భారత్ నుంచి ఈ అవశేషాలను యూకేకు తరలించారు. ‘‘ గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాలు ఏకంగా 127 సంవత్సరాల అనంతరం మళ్లీ స్వదేశమైన భారత్‌కు తీసుకురావడం దేశ ప్రజలందరికీ ఎంతో గర్వకా రణం. బుద్ధుడు, ఆయన బోధనలతో భారత దేశానికి ఉన్న అనుబంధాన్ని ఈ పవిత్ర అవశేషా లు మరోసారి చాటిచెబుతున్నాయి’’ అని ‘ఎక్స్’ లో ప్రధాని మోదీ పోస్ట్‌పెట్టారు. ‘‘ మహా ద్భుతమైన ఘన వారసత్వం, సంస్కృతిని పరిరక్షించడంలో మన నిబద్ధతను ఈ అవశేషాలు చాటుతున్నాయి’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఈ అవశేషాలు ఈ ఏడాది ప్రారంభంలో ఓ అంతర్జాతీయ సంస్థ చేపట్టిన వేలంపాటలో తొలి సారిగా ప్రత్యక్షమయ్యాయి. దీంతో వీటిని ఎలా గైనా తిరిగి భారత్‌కు రప్పించేందుకు మా ప్రభు త్వం నడుం బిగించింది. ఈ మేరకు కృషిచేసిన వా రందరికీ నా అభినందనలు’’ అని మోదీ అన్నారు.నాటి పేటికలో బంగారు రత్నాభరణాలు piprahwa. com వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం నేపాల్ సరిహద్దులోని పిప్రాహ్వా బౌద్దమతానికి సంబంధించిన పురాతన స్తూపం ఉంది. అక్కడ నాటి బ్రిటన్ పాలకులు తవ్వకాలు జరిపారు. దాంతో అక్కడ భూగర్భంలో పెద్ద రాతిపెట్టెలో కొన్ని అవశేషాలు బయల్పపడ్డాయి. ఇందులో బుద్ధునికి సంబంధించినవిగా భావిస్తున్న అస్థి అవశేషాలు, సున్నపురాయి పేటిక, బంగారు ఆభరణాలు, రత్నాల వంటివి ఉన్నాయి. బుద్ధుని నిర్యాణం తర్వాత బుద్దుని అవశేషాలను ఆనాటి రాజ్యాల రాజులకు పంపిణీ చేసేందుకు అవశేషాలను కొన్ని భాగాలుగా విభజించారు. అందులో కొంతభాగాన్ని నేడు థాయ్లాండ్గా పిలుస్తున్న సియామ్ ప్రాంతంలోని రాజుకు అందజేశారు. ఆనాడు తవ్వకాల్లో బయల్పడిన సున్నపురాయి మృతపేటిక ప్రస్తుతం కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ప్రస్తుతం ఈ పిప్రాహ్వా గ్రామం ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లా కేంద్రం సమీపంలో ఉంది. ఇది బుద్ధుడు జన్మించిన లుంబినీ వనానికి కేవలం 9 మైళ్ల దూరంలో ఉంది. -
కాల్పుల విరమణకు పాక్ అడుక్కుంది: జై శంకర్
కాల్పుల విరమణలో ఏ దేశం మధ్యవర్తిత్వం వహించలేదని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ పార్లమెంట్ వేదికగా మరోసారి స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్‌పై చర్చలో భాగంగా బుధవారం రాజ్యసభలో ఆయన ప్రసంగించారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని.. అందుకే పాక్‌తో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని వ్యాఖ్యానించారాయన. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రపంచానికి తెలియజేశాం. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ‘సిందూర్’ పేరిట చేపట్టిన ఆపరేషన్‌తో ధ్వంసం చేసింది. కాల్పుల విరమణకు పాకిస్థాన్ అడుక్కుంది. అంతేగానీ కాల్పుల విరమణలో ఏ దేశం మధ్యవర్తిత్వం వహించలేదు అని అన్నారాయన. ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఎలాంటి సంభాషణలు జరగలేదని జై శంకర్ వివరించారు. ఆ సమయంలో చాలా దేశాలు దౌత్యానికి ముందుకొచ్చాయి. కానీ, జోక్యం సరికాదని ఆయా దేశాలకు చెప్పాం అని జైశంకర్ అన్నారు. ‘‘వాళ్లకు(ప్రతిపక్షాలకు) ఒక్కటే చెప్పదల్చుకున్నా.. ఏప్రిల్ 22 నుంచి జూన్ 16 మధ్య ఆ ఇద్దరు నేతలకు ఒక్క ఫోన్ కాల్ సంభాషణ జరగలేదు’’ అని స్పష్టం చేశారాయన. మే 9వ తేదీన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. పాక్ నుంచి దాడులు జరగవచ్చని హెచ్చరించారాయన. అయితే అలాంటి పరిస్థితి వస్తే భారత్ నుంచి ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని మోదీ వాన్స్‌తో చెప్పారు. ఆర్థికల్ 370, సింధూ జలాల ఒప్పందం.. నెహ్రూ పాలనలో జరిగిన ఈ తప్పిదాలను మోదీ సర్కార్ ఇప్పుడు సరిదిద్దుతోంది. ఉగ్రవాదాన్ని గ్లోబల్ ఎజెండాలో చేర్చడం ప్రధాని మోదీ వల్లే సాధ్యమైంది అని జైశంకర్ అన్నారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని.. అందుకే పాక్‌తో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని, పాక్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టేదాకా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారారయన. -
'ఆపరేషన్ సిందూర్'పై మోదీ క్లారిటీ
-
సిందూర్ ఆపాలని ఏ దేశాధినేతా చెప్పలేదు
న్యూఢిల్లీ: నిఘా వైఫల్యం కారణంగా పహల్గాంలో అత్యంత పాశవిక దాడి జరిగిందని, ఆపరేషన్ సిందూర్‌తో భారత్ సాధించిన కీలక విజయాలేంటో చెప్పాలంటూ విపక్షాల డిమాండ్ల మధ్య లోక్‌సభలో ప్రధాని మోదీ సూటిగా సమాధానమిచ్చారు. ఆపరేషన్ సిందూర్‌పై 16 గంటల ప్రత్యేక చర్చకు సమాధానంగా ప్రధాని మోదీ వివరణ ఇస్తూనే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు, విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. భారత్, పాక్ పరస్పర సైనిక చర్యలు పరిసమాప్తం కావడానికి తానే ముఖ్యకారణమని ఇప్పటికే పాతికసార్లు ఢంకా భజాయించిన ట్రంప్ మాటల్లో రవ్వంతైనా నిజంలేదని స్పష్టంచేశారు. ఉగ్రవాదాన్ని కాళ్లకింద నలిపేసేటప్పుడు ప్రపంచంలో ఏ దేశం వారించినా ఊరుకునేది లేదని వ్యాఖ్యానించారు. సిందూర్ తక్షణం ఆపేయాలని ప్రపంచంలో ఏ దేశ నేతా తమకు చెప్పలేదని మోదీ స్పష్టం చేశారు. 102 నిమిషాల ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..విజయోత్సవంలో ప్రసంగిస్తున్నా..‘‘ఉగ్రవాదానికి కుంభస్థలం వంటి పాక్‌లోని ఉగ్రస్థావరాలను మనం నేలమట్టంచేసినందుకు ఈరోజు పార్లమెంట్లో విజయోత్సవం జరుపుకుంటున్నట్లు అనిపిస్తోంది. భారత వాణిని ప్రపంచానికి వినిపించేందుకు, భారత్ అంటే ఎంటో అందరికీ మరోసారి చాటిచెప్పేందుకే మాట్లాడుతున్నా. సిందూర్ వేళ నాపై నమ్మకం ఉంచిన ప్రజలందరికీ రుణపడిపోయా. ఉగ్రవాదానికి తల్లివేరు వంటి పాక్‌కు ఆపరేషన్ సిందూర్‌తో అసాధారణరీతిలో గుణపాఠం చెప్పాం. ఆ భీకర దాడుల నుంచి పాక్ ఇంకా కోలుకోలేదు. దాడులు మళ్లీ జరగొచ్చని వాళ్లు ఇప్పటికీ భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆపరేష్ సిందూర్ అమలుకోసం మేం సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. పహల్గాం దుశ్చర్యకు దీటుగా బదులిస్తూ పాక్ నడిబొడ్డున క్షిపణుల వర్షం కురిపించాం. కేవలం 22 నిమిషాల్లో భిన్న ప్రాంతాల్లోని కీలక ఉగ్రస్థావరాలను నేలమట్టంచేశాం. అణు బెదిరింపులు మన దగ్గర పనిచేయవని పాక్‌ను గట్టిగానే హెచ్చరించాం. మన దాడుల ధాటికి పాక్ వైమానిక స్థావరాలు సర్వనా శనమై ఇప్పటికీ అలాగే ఐసీయూలో ఉన్నాయి’’.ఆత్మనిర్భరతను ప్రపంచం కళ్లారా చూసింది‘‘ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ వంటి స్వదేశీ క్షిపణులుసహా సొంత డ్రోన్ల వినియోగంతో భారత్ సాధించిన స్వావలంభన, ఆత్మనిర్భరతను ప్రపంచం కళ్లారా చూసింది. అమాయకులను ఉగ్రదా డులతో బలితీసుకుంటే ఎలాంటి స్పందనా ఉండదని ఇన్నాళ్లూ ఉగ్రదాడుల సూత్రధారులు భావించారు. ఇకపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే భారత్ దండయాత్ర చేయగలదని ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులక బాగా తెలిసొచ్చింది. ఆపరేషన్ సిందూర్ నుంచి సింధు దాకా భారత్ భిన్నకోణాల్లో ప్రతీకార చర్యలు చేపట్టింది. భవిష్య త్తులో తోకజాడిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పాక్‌కు బోధపడింది. ఉగ్రపోషకులు, పాక్ పాలకులు ఒక్కరే అనే భావనతోనే భారత్ ముందుకెళ్తోంది. ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఆపరేషన్ సిందూర్ మొదలెడితే ప్రపంచంలో మూడు దేశాలు తప్ప ఏ దేశమూ భారత్‌కు అడ్డుచెప్పలేదు. పాక్‌కు ఆ మూడుదేశాలే మద్దతు పలికాయి. ఇలా ప్రపంచదేశాలన్నీ భార త్‌కు అండగా నిలిస్తే కాంగ్రెస్ మాత్రం మన సైనికుల వీరత్వానికి సలామ్ చేయలేదు. పాకిస్థా న్ను కాంగ్రెస్ వెనకేసుకురావడం దౌర్భా గ్యం. గతంలో సర్జికల్ దాడులు చేసినప్పుడూ కాంగ్రెస్ ఇదే పాట పాడింది’’.నిమిషాల్లో నాశనం చేశాం‘‘పాక్ నడిబొడ్డున, ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రస్థా వరాలపై మన బలగాలు మేలో మెరుపుదాడులు చేశాయి. నిమిషాల్లోనే మీ స్థావరాలను సమాధులుగా మార్చగలమని పాక్‌కు నిరూపించాం. తొలుత ఉగ్రస్థావరాలను మన బలగాలు ధ్వసంచేశాయి. ఉగ్రవాదులకు సాయంగా పాక్ బలగాలు ప్రతిదాడులకు సిద్ధపడడంతోనే వాళ్ల వైమానిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించి కోలుకోలేని దెబ్బతీశాం. దీంతో పాక్ కాళ్లబేరానికి వచ్చింది. పాక్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) నుంచి ఫోన్ వచ్చింది. ఇంతకుమించి దాడులు చేస్తే ఇప్పట్లో కోలుకోలేమని ప్రాధేయపడ్డారు. అందుకే సిందూర్‌కు ముగింపు పలికాం. ఆపరేషన్‌ను ఆపడానికి ఇదే ఏకైక కారణం. అంతేగానీ ప్రపంచంలో మరే దేశాధినేత కారణంగానో సిందూర్ ఆగలేదు. ఆపాలని ఎవరూ మాకు చెప్పలేదు. మే 9వ తేదీ రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పదేపదే నాకు ఫోన్ చేశారు. అప్పటికే త్రివిధ దళాధిపతులతో భేటీలో బిజీగా ఉన్నాను. భేటీ తర్వాత నేనే ఫోన్‌కాల్ చేసి మాట్లాడా. పాక్ దాడి చేయబోతోందని ఉప్పందించారు. ఎలాంటి దాడినైనా అడ్డుకోగలమని ఆయనకు స్పష్టంచేశా. దాడికి ప్రతిదాడి దారుణంగా ఉంటుందని చెప్పా. బుల్లెట్లకు బాంబులతో సమాధానం చెప్తామన్నా. ఎన్నో విషయల్లో భారత్ స్వావలంభన సాధిస్తోంది. కాంగ్రెస్ మాత్రం చాలా అంశాలను ఎత్తిచూపేందుకు పాక్ పేరును మధ్యలోకి లాక్కొస్తోంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పరోక్షంగా పాక్ అజెండాను ప్రకటించే అధికారిక ప్రతినిధులుగా తయార య్యా రు. గతంలో మేం సర్జికల్ దాడులుచేస్తే కాంగ్రెస్ వాళ్లు ఆధారాలు కావాలన్నారు. ఆనాడు పైలట్ అభి నందన్ పాక్ బలగాలకు దొరికిపోతే ఎలా విడిపించుకొస్తారో చూస్తామని మాట్లాడారు. తీరా మేం తీసుకొచ్చాక ఇదే కాంగ్రెస్ నేతలు నోరుమూశారు. ఉగ్రవాదులకు జరిగిన భారీ నష్టాన్ని చూసి అక్కడ పాక్ మాత్రమే కాదు ఇక్కడ భారత్‌లోనూ కొందరు ఏడుస్తున్నారు’’ అని మోదీ ఎద్దేవా చేశారు.విశ్వశాంతికి ఇది అవసరం‘‘విశ్వశాంతి సాధనలో ఆయుధ సంపత్తితో తులతూగడం కూడా ముఖ్యమే. అందుకే రక్షణరంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి ద్వారాలు తెరిచాం. ఇప్పడు వందకు పైగా అంకురసంస్థలు రక్షణరంగంలో కృషిచేస్తున్నాయి. కొన్ని సంస్తలను మహిళలు ముందుండి నడిపిస్తున్నారు. ఇలాంటి జాతీయ భద్రతా ముందుచూపు కాంగ్రెస్‌కు గతంలోలేదు. ఇకమీదట కూడా రాదు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను ఇప్పటికీ భారత్ ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయిందన్న ప్రశ్నకంటే ముందు అసలు అదెలా మన చేయిజారిందనే ప్రశ్న వేసుకోవాలి. విశాల కశ్మీరం చేజారడానికి కారకులెవరు? నెహ్రూ హయాం నుంచి మొదలుపెడితే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన ఘోర పరిపాలనా తప్పిదాల కారణంగానే భారత్ ఇప్పటికీ ఉగ్రదాడులు, ఇతర గాయాలతో బాధపడుతోంది’’ అని అన్నారు.వేయి క్షిపణులు ప్రయోగిస్తే అన్నింటినీ గాల్లోనే కూల్చేశాం‘‘భారత గగనతల రక్షణ వ్యవస్థల సత్తాను చూసి ప్రపంచదేశాలు నివ్వెరపోయాయి. సిందూర్‌కు ప్రతిగా పాక్ 1,000కిపైగా క్షిపణులను ప్రయోగిస్తే మన గగనతల రక్షణవ్యవస్థలు వాటన్నింటినీ గాల్లోనే పేల్చేశాయి. అదంపూర్ వైమానికస్థావరం నాశనమైందని పాక్ కారుకూతలు కూస్తే తెల్లారే అక్కడికెళ్లి అది నిక్షేపంగా ఉందని ప్రపంచానికి చాటిచెప్పా. భారత సైనిక సత్తాను దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ నమ్మకపోవడం దారుణం. మన రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి, హోం మంత్రులు చెప్పిన మాటలకూ కాంగ్రెస్ విలువ ఇవ్వట్లేదు. పాక్ రిమోట్ కంట్రోల్‌తో కాంగ్రెస్ పనిచేస్తుందేమో. కొందరు కాంగ్రెస్ యువనేత (రాహుల్)లు ఆపరేషన్ సిందూర్‌ను తమాషాగా కొట్టిపారేశారు. మన సైనికుల అద్భుత విజయాన్ని చూసి కాంగ్రెస్ నేతలు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. లోక్‌సభలో ప్రత్యేక చర్చ మొదలైన నాడే ఆపరేషన్ మహదేవ్లో పహల్గాం ముష్కరులు ఎలా చనిపోయారని ప్రశ్నిస్తున్నారు. జాడ కనిపెట్టి ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి వారాలు, తేదీలు చూడాలా?’’ అని మోదీ ఆగ్రహంవ్యక్తం చేశారు.సిందూ నదీజలాల ఒప్పందం నెహ్రూ పాపమే‘‘మన నదీజలాలపై ప్రపంచబ్యాంక్ అజమాÆ ‡ుుషీ చేసేలా నెహ్రూ ప్రభుత్వం ఘోర తప్పుడు నిర్ణయం తీసుకుంది. భారతనేలపై పారే సిందూ నదీజలాల్లో 80 శాతం వాటా పాక్‌కు ఆయనే ధారాదత్తంచేశారు. ఇంతటి జనాభా ఉన్నప్పటికీ మనకు 20 శాతం మాత్రమే హక్కులు దఖలుపడ్డాయి. మన భారతీయ రైతుల నీటికష్టాలు నెహ్రూకు పట్టలేదు. నీళ్లివ్వడంతోపాటు నెహ్రూ పాక్‌కు నిధులు కూడా ఇచ్చారు. సిందూ నదీజలాలపై డ్యామ్‌లు కట్టుకునేందుకు నెహ్రూ ప్రభుత్వం పాక్‌కు ఆర్థికసాయం చేసింది. సిందూ నదీజలాల ఒప్పందంలో నెహ్రూ చేసిన భారీ తప్పిదాలను తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలూ సరిచేయలేదు. మేం వచ్చాకే ఆ తప్పులను సవరించాం. ఉగ్రదాడులతో భారతీయుల రక్తం పారేలా చేస్తున్నారు. అందుకే సిందూ నదీజలాల ఒప్పందం నుంచి వైదొలిగాం. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించబోవని స్పష్టంచేశాం. ఆపరేషన్ సిందూర్ ముగిసిపోలేదు. పాక్ మళ్లీ కుయుక్తులతో పేట్రేగిపోతే సిందూర్ మళ్లీ మొదలవుతుంది’’ అని మోదీ స్పష్టం చేశారు. -
సమగ్ర శిక్ష నిధులను విడుదల చేయండి
చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.2,000 కోట్లకు పైగా విద్యా నిధులను వెంటనే విడుదల చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను అమలు చేయాలని కోరారు. ప్రధానమంత్రి రెండు రోజుల తమిళనాడు పర్యటన సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ద్వారా స్టాలిన్ ఈ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను, రాజేంద్ర చోళన్ గౌరవార్థం ఒక స్మారక నాణెంను ప్రధాని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్టాలిన్ మోదీకి లేఖ రాశారు. ‘2018 నుంచి తమిళనాడు ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోంది. దీని వల్ల విద్యా ఫలితాల్లో స్థిరమైన మెరుగుదలలు జరుగుతున్నాయి. తమిళనాడు పాఠశాల విద్యా వ్యవస్థ ప్రస్తుతం 43.90 లక్షల మంది విద్యార్థులు, 2.2 లక్షల మంది ఉపాధ్యాయులు మరియు 32,000 మందికి పైగా సహాయక సిబ్బందికి వసతి కల్పిస్తోంది. ఇంత కీలకమైన మరియు పెద్ద ఎత్తున పథకానికి నిధులను నిలిపివేయడం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కానీ నిధుల విడుదలకు కేంద్రం జాతీయ విద్యా విధానం అమలు చేయాలని ఒక ముందస్తు షరతు పెట్టింది. ఇందులో కొన్ని నిబంధనలకు, ముఖ్యంగా త్రిభాషా విధానాన్ని విధించడం, పాఠశాల విద్యను 5+3+3+4 ఫార్మాట్‌కు పునరి్నరి్మంచడం గురించి రాష్ట్రానికి చట్టపరమైన, విధాన ఆధారిత అభ్యంతరాలు ఉన్నాయి. కాబట్టి.. 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.2,149 కోట్లను వెంటనే విడుదల చేయాలి. 2025–26 సంవత్సరానికి మొదటి విడత చెల్లింపును వేగవంతం చేయాలి’అని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు. దశాబ్దం క్రితం మంజూరు చేసి, ఇంకా పెండింగ్‌లో ఉన్న బహుళ రైల్వే ప్రాజెక్టులను అమలు చేయాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. అనంతరం.. ‘‘తమిళనాడు విద్యార్థుల విద్యకు నిధులు, పేద, మధ్యతరగతి ప్రజల రవాణా కోసం రైల్వే ప్రాజెక్టులు, మత్స్యకారుల జీవనోపాధి, సేలం డిఫెన్స్ ఇండ్రస్టియల్ పార్క్ అభివృద్ధి గురించి గౌరవనీయ ప్రధాన మంత్రి మోదీకి మేం ఒక వినతిపత్రం సమరి్పంచాం. ప్రజల మనోభావాలకు, రాష్ట్ర అభివృద్ధికి విలువనిస్తూ ప్రధానమంత్రి తగిన పరిష్కారాలను అందిస్తారని విశ్వసిస్తున్నా’’అని స్టాలిన్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. -
ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేయడానికి ముహూర్తం కావాలా ఏంటి?: మోదీ
సాక్షి,న్యూఢిల్లీ: రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపుతో భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ ఇతర ఎంపీలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని మోదీ లోక్‌సభలో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్‌ను ఆపమని ఏ ప్రపంచాది నేతలు చెప్పలేదని స్పష్టం చేశారు. మంగళవారం లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై కొనసాగుతున్న చర్చలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో జరుగుతున్న చర్చపై మోదీ మాట్లాడుతూ.. ఈ వర్షాకాల సమావేశాలు భారత్ విజయోత్సవానికి నిదర్శనం. ఆపరేషన్ సిందూర్ విజయానికి ప్రతీకగా విజయ్ ఉత్సవ్. మన సైనికులు ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపారు. ఆపరేషన్ సిందూర్‌ను దేశం మొత్తం విజయోత్సవాలు చేసుకుంటోంది. ఉగ్రస్థావరాలను మనసైన్యం నేలమట్టం చేసింది.140కోట్ల మంది భారతీయులు నాపై నమ్మకం ఉంచారు. సైన్యం వెనుక దేశ ఉంది. మతం కోణంలో పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. శత్రువుకు ఊహకు అందని విధంగా శిక్ష విధించాం. సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం.పాక్ బిత్తర పోయింది ‘పహల్గాం ఉగ్రదాడికి ప్రతీ కారం తీర్చుకుంటామని చెప్పాం.. చేసి చూపించాం. పాక్‌లోకి చొచ్చుకెళ్లి ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేశాం. పాక్‌లోని ఉగ్రవాదుల హెడ్ క్వార్టర్స్‌ను కూల్చేశాం. కలుగులో దాక్కున్న ముష్కరులకు పొగపెట్టిమరీ మట్టిలో కలిపాం. పథకం ప్రకారం ఆపరేషన్ సిందూర్. భారత్ ప్రతీకార చర్యలను చూసి పాక్ బిత్తర పోయింది. ఆపరేషన్ సిందూర్ ముందు పాక్ తేలిపోయింది.ఆపరేషన్ సిందూర్ ముందుకు బ్లాక్ మెయిల్స్ పనిచేయవని చూపించాం’ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు హెడ్‌లైనే గతి56 ఇంచ్‌ల చెస్ట్ ప్రధాని ఎక్కడా అంటూ కాంగ్రెస్ నాపై విమర్శలు చేసింది. పహల్గాం ఉగ్రదాడి విషయంలో కాంగ్రెస్ రాజకీయాలు చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కాంగ్రెస్ నన్ను విమర్శించడమే పనిగా పెట్టుకుంది. ప్రపంచం మొత్తం కాంగ్రెస్‌ను కాదు.. దేశాన్ని సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ హెడ్‌లైన్స్‌లో ఉండొచ్చు కానీ.. ప్రజల హృదయాల్లో నిలవలేదు. మాస్టర్ మైండ్‌కు నిద్ర కరువైందిఉగ్రవాదానికి ఊతం ఇస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పాక్‌కు బదులిచ్చాం.మనం చేసిన దాడులనుంచి పాక్ ఎయిర్ బేస్‌లు ఇంకా కోలుకోలేదు. ఆపరేషన్ సిందూర్‌లో మన ఎయిర్‌ఫోర్స్ 100శాతం విజయం సాధించాయి. సిందూ నుంచి సిందూర్ వరకు పరాక్రమాన్ని ప్రదర్శించాం. ఆపరేషన్ సిందూర్ తర్వాత మాస్టర్ మైండ్‌కు నిద్ర కరువైంది. పాక్ ప్రాధేయపడిందిఉగ్రవాదులతో పాకిస్తాన్ బంధం బహిరంగ రహస్యమే. ఉగ్రవాదాన్ని అణిచి వేయడమే భారత్ లక్క్ష్యం. మన మిస్సైల్స్ పాక్ మూల మూలల్లోకి చొచ్చుకుని వెళ్లాయి. మనం ఆపరేషన్ సిందూర్‌తో స్పందిస్తామని పాక్ కలలో కూడా ఊహించలేదు. ఆపరేషన్ సిందూర్‌తో సైనికులు పాక్ ఉగ్రవాదుల్ని చీల్చి చెండాడారు. ఇక చాలు అంటూ డీజీఎంవో సమావేశంలో పాక్ ప్రాధేయపడింది. మన దాడులతో పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. దయచేసి ఇంక దాడులు ఆపండి అంటూ ప్రాధేయపడింది."प्रहाराय सन्निहिताः, जयाय प्रशिक्षिताः"Ready to Strike, Trained to Win.#IndianArmy pic.twitter.com/M9CA9dv1Xx— ADG PI - INDIAN ARMY (@adgpi) May 6, 2025 ఆపరేషన్ సిందూర్: ట్రంప్ ప్రమేయం లేదుఆపరేషన్ సిందూర్‌ను ఆపమని ఏ ప్రపంచాది నేతలు మాకు ఫోన్ చేయలేదు. మే9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాకు ఫోన్ చేశారు.నేను బిజీగా ఉన్నాను. వాన్స్ చాలాసార్లు నాకు ఫోన్ చేశారు. పాక్ భారత్‌పై భారీ ఎత్తున మిస్సైళ్లతో దాడి చేయబోతోందని వాన్స్ నాకు చెప్పాడు. పాక్ దాడి చేస్తే తిప్పి కొడతామని చెప్పాను. పాక్ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఆపరేషన్ సిందూర్ ఆన్‌లోనే ఉంది. పాక్ అజెండాను ఇంపోర్ట్ చేసుకునే పనిలో కాంగ్రెస్ ఉంది. ఆపరేషన్ సిందూర్ దాడి తాలూకా ఫొటోలు కావాలని కాంగ్రెస్ అడుగుతోంది. పాక్ మళ్లీ దుస్సహానికి పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మన దేశ సామర్ధ్యాలపై కాంగ్రెస్‌కు నమ్మకం లేదుఅధమ్ పూర్ బేస్‌పై దాడి అంటూ పాక్ అసత్య ప్రచారాలు చేసింది. ఆ మరుసటి రోజే నేను అక్కడి వెళ్లి మన సైనికుల్ని అభినందించారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ దేశాన్నిపాలించింది. కానీ మనదేశ సామర్ధ్యాలపై కాంగ్రెస్‌కు నమ్మకం లేదు. పాక్ తప్పుడు వార్తల్ని కాంగ్రెస్ నేతలు ఇక్కడ ప్రచారం చేశారు. ఒక్క పాక్ మిసైల్ కూడా భారత్‌ను టచ్ చేయలేదు. ముమూర్తం కావాలా ఏంటి?ఆపరేషన్ మహాదేవ్‌పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆపరేషన్‌లో భాగంగా భారత్ సైనికులు పహల్గాం ఉగ్రవాదుల్ని హతమార్చింది. నిన్న టెర్రరిస్టులను ఎందుకు చంపారని విపక్షాలు అడిగాయి. ఎన్నిగంటలు ఆపరేషన్ మహాదేవ్ చేపట్టారని అఖిలేష్ యాదవ్ అడిగారు. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడానికి ఏమైనా ముమూర్తం కావాలా?కాంగ్రెస్‌ను పీవోకేను కోల్పోయాంకాంగ్రెస్ విధానం వల్ల పీవోకే విషయంలో భారత్ మూల్యం చెల్లించుకుంటోంది. కాంగ్రెస్ హయాంలో భారత్ పీవోకేని కోల్పోయింది. కాంగ్రెస్ వల్లే పీవోకే మనకు కాకుండా పోయింది.నెహ్రూ చేసిన తప్పులకు భారత్ ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోంది.కాంగ్రెస్ వల్ల 33వేల చదరపు అడుగుల భూభాగాన్ని భారత్ కోల్పోయింది. కచ్చతీవును శ్రీలంకకు ఇందిర గిఫ్ట్‌గా ఇచ్చింది. పీవోకేను ఎప్పుడు వెనక్కి తెస్తారని అడుగుతున్నారు. పాక్‌కు నీళ్లు అప్పగించి భారత్‌లో సంకటస్థితి సృష్టించారు. సింధూ ఒప్పందం లేకుండా భారీ ప్రాజెక్ట్‌లు వచ్చేవి. నీళ్లు కాదు.. కాలువలు తవ్వేందుకు నెహ్రూ పాక్‌కు నిధులిచ్చారు. నెహ్రూ పాక్ అనుకూల విధానాలతో నిధి మనది.. నీళ్లు మనది పెత్తనం వాళ్లదా. నీళ్ల వివాదాల పరిష్కార బాధ్యతల్ని నెహ్రూ వరల్డ్ బ్యాంక్‌కు అప్పగించారు. -
మన సైనికుల్ని యుద్ధానికి పంపి.. వారి చేతులు కట్టేశారు: రాహుల్
న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్ అంశానికి సంబంధించి పార్లమెంట్లో వాడివేడి మాటల యుద్ధం జరుగుతోంది. ఆపరేషన్ సింధూర్ చర్చలో భాగంగా ఈరోజు(మంగళవారం, జూలై 29) కాంగ్రెస్ అటు రాజ్యసభ, ఇటు లోక్‌సభ వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలు తమ మాటలతో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడగా, ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ సైతం ఆపరేషన్ సిందూర్‌పై ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. మన సైనికుల్ని యుద్ధానికి పంపి వారి చేతుల్ని కేంద్ర ప్రభుత్వం కట్టేసిందని మండిపడ్డారు. అందుకే మన యుద్ధ విమానాలు కూలాయన్నారు. రాహుల్ ప్రసంగిస్తూ.. ‘ భారత్-పాక్‌ల యుద్ధాన్ని ఆపానని ట్రంప్ ఇప్పటికి 29 సార్లు చెప్పారు. ట్రంప్ అబద్ధాలు చెబుతున్నప్పుడు మోదీ తిరిగి ఎందుకు ప్రశ్నించడం లేదు?, ఇందిరాగాంధీ ప్రదర్శించిన ధైర్య సాహసాల్లో 50 శాతం కూడా మోదీ చూపించలేదు.భారత సైన్యం ఎటువంటి తప్పు చేయలేదు. తప్పంతా కేంద్ర ప్రభుత్వానిదే. పహల్గామ్ సూత్రధారి పాక్ ఆర్మీ చీఫ్ మునీర్. మరి ట్రంప్‌తో కలిసి మునీర్ లంచ్ చేస్తారు. ఆయన్ని ట్రంప్ ఆహ్వానిస్తారు. ట్రంప్-మునీర్‌ల లంచ్ విషయాన్ని మోదీ ఎందకు ఖండించలేదు?, జై శంకర్ విదేశాంగ విధానం ఫెయిల్ అయ్యింది’ అని రాహుల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇదీ చదవండి: ఆహ్వానం లేకుండా పాక్‌కు వెళ్లింది ఎవరు? సీజ్ ఫైర్ నిర్ణయం ఎవరిది? -
‘గాజా’పై సిగ్గుపడేంత మౌనం?.. ప్రధాని మోదీకి సోనియా సూటి ప్రశ్న
న్యూఢిల్లీ: గాజాలో జరుగుతున్న మారణహోమంపై ప్రధాని మోదీ పదిమందీ సిగ్గుపడేంత మౌనాన్ని ఎందుకు వహిస్తున్నారని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాని మోదీ భారతదేశ విలువలను నిలబెట్టుకోవాలని ఆమె సూచించారు.రాజ్యాంగ విలువలకు ద్రోహంగాజా విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి స్పష్టమైన వైఖరి లేకపోవడం అనేది మన రాజ్యాంగ విలువలకు ద్రోహం చేసినట్లే అవుతుందని సోనియా గాంధీ ప్రముఖ హిందీ వార్తాపత్రిక దైనిక్ జాగరణ్‌లో ప్రచురితమైన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న విధ్వంసకర దాడి విషయంలో ప్రధాని మోదీ మౌనం వహించడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆమె అన్నారు. గాజా ప్రజలకు అనుకూలంగా భారత్ స్పష్టమైన, ధైర్యమైన వైఖరిని ప్రకటించాలని సోనియా గాంధీ కోరారు. పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ సాగిస్తున్న సైనిక చర్యపై ప్రధాని మోదీ సిగ్గుపడే మౌనం అవలంభిస్తున్నారని ఆమె ఆరోపించారు.పాలస్తీనాను భారత్ గుర్తించిందిఇజ్రాయెల్ చర్యలను అనాగరికం, జాతిహత్యగా సోనియా అభివర్ణించారు. 1988లో పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తించిన మెదటి దేశాలలో భారతదేశం ఒకటని ఆమె పేర్కొన్నారు. 2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ జరిపిన దాడులను ఎవరూ సమర్దించలేదన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇజ్రాయెల్ రెండేళ్ల దాడుల కారణంగా ఇప్పటివరకూ 17 వేల మంది చిన్నారులతో సహా, 55 వేలమంది హతమయ్యారని సోనియా గాందీ ఆవేదన వ్యక్తం చేశారు.ట్రంప్ రియల్ ఎస్టేట్ కోసమే..ప్రస్తుతం ఇజ్రాయెల్ రక్షణ దళాలు గాజాపై సైనిక దిగ్బంధనను విధించాయని, ఉద్దేశపూర్వకంగా అక్కడి జనాభాకు మందులు, ఆహారం, ఇంధన సరఫరాను అడ్డుకున్నాయని సోనియా గాంధీ ఆ వ్యాసంలో రాశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు వారి కుటుంబ వ్యాపారమైన రియల్ ఎస్టేట్ కోసం గాజాలో కొత్త నగరాన్ని నిర్మించాలని యోచిస్తున్నారని సోనియా ఆరోపించారు. అయితే ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం ముందుకు తీసుకెళ్లడంలో దక్షిణాఫ్రికా ధైర్యమైన అడుగు వేసిందని సోనియా పేర్కొన్నారు. ఫ్రాన్స్.. పాలస్తీనా దేశాన్ని గుర్తించిందని, బ్రిటన్, కెనడా తదితర దేశాలు ఇజ్రాయెల్ నేతలపై ఆంక్షలు విధించాయని సోనియా పేర్కొన్నారు.జాతీయ మనస్సాక్షికి మాయని మచ్చభారతదేశం ప్రపంచ న్యాయానికి చిహ్నంగా నిలిచిందని, వలసవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ ఉద్యమాలకు ప్రేరణ కల్పించిందని, దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా అంతర్జాతీయ పోరాటానికి నాయకత్వం వహించిందని సోనియా గుర్తు చేశారు. అమాయక ప్రజలను క్రూరంగా వధిస్తున్న సమయంలో.. భారతదేశం తన విలువలను వదులుకోవడం మన జాతీయ మనస్సాక్షికి మాయని మచ్చ.. మన రాజ్యాంగ విలువలకు చేసే ద్రోహం అని సోనియా పేర్కొన్నారు. సోనియా కుమార్తె, లోక్‌సభ సభ్యురాలు ప్రియాంక గాంధీ గాజాలో శాంతికి గట్టిగా మద్దతు పలికారు. -
‘సిందూర్’తో సత్తా చాటాం
గంగైకొండ చోళపురం: భారతదేశ శక్తి సామర్థ్యాలు ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి తెలిసొచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదులకు, మన శత్రువులకు సురక్షిత స్థానం అంటూ ఎక్కడా లేదన్న నిజాన్ని నిరూపించామని చెప్పారు. మన సార్వభౌమత్వంపై దాడి జరిగితే ప్రతిస్పందన ఎంత భీకరంగా ఉంటుందో అందరికీ తెలిసిపోయిందని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ దేశ ప్రజలకు నూతన ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందని స్పష్టంచేశారు. ఆదివారం తమిళనాడులోని గంగైకొండ చోళపురంలో చొళరాజు రాజేంద్ర చోళ–1 జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ‘ఆది తిరువత్తిరై’ పేరిట నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగించారు. రాజరాజ చోళ, ఆయన కుమారుడు రాజేంద్ర చోళ–1 చక్రవర్తుల పేర్లు మన దేశ గుర్తింపునకు పర్యాయపదాలు అని కొనియాడారు. వారు మనందరికీ గర్వకారణమని చెప్పారు. తమిళనాడులో భారీ ఎత్తున వారి విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మన చరిత్రకు అవి దర్పణాలు అవుతాయని నరేంద్ర మోదీ అన్నారు. సాధారణంగా ప్రజాస్వామ్యం గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు యూకేలోని మాగ్నాకార్టా గురించి మాట్లాడుతుంటారని, నిజానికి వెయ్యి సంవత్సరాల క్రితమే చోళుల పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థ అమల్లో ఉందని గుర్తుచేశారు. బృహదీశ్వర ఆలయంలో పూజలు గంగైకొండ చోళపురంలో చోళ రాజులు నిర్మించిన బృహదీశ్వర ఆలయాన్ని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. ఆర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మోదీ సంప్రదాయ వస్త్రాలు ధరించి, పవిత్ర జలంలో కూడిన కలశం చేతబూని ఆలయంలోకి ప్రవేశించారు. గర్భాలయంలో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపారాధన చేశారు. అనంతరం భారత పురావస్తు సర్వే విభాగం నిర్వహించిన ప్రదర్శనను తిలకించారు. అంతకముందు గంగైకొండ చోళపురంలో ప్రధాని మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. రహదారికి ఇరువైపులా జనం బారులు తీరి ఆయనకు స్వాగతం పలికారు. 3 కిలోమీటర్ల మేర జరిగిన ఈ రోడ్ షోలో బీజేపీ, ఏఐఏడీఎంకే పార్టీల జెండాలు రెపరెపలాడాయి. ప్రధానితో పళని స్వామి భేటీ తమిళనాడు పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీతో శనివారం రాత్రి ఏఐఏడీఎంకే ప్రధా న కార్యదర్శి, తమిళనాడు మాజీ సీఎం పళని స్వామి సమావేశమయ్యారు. తిరుచిరాపల్లి ఎయిర్‌పోర్ట్‌లో ఈ భేటీ జరిగింది. తమిళనాడులో బీజేపీ, ఏఐఏడీఎంకే మధ్య పొత్తు కుదిరిన తర్వాత మోదీ, పళనిస్వామి కలుసుకోవడం ఇదే మొదటిసారి. రాబోయే అసెంబ్లీ ఎ న్నికలపై వారు చర్చించుకున్నట్లు సమాచారందివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గొప్ప దార్శనికుడిగా, శాస్త్రవేత్తగా, గురువుగా, దేశభక్తుడిగా కలాం చిరస్మరణీయులు అని మోదీ కొనియాడారు. దేశాన్ని అభివృద్ధి చేసుకొనే దిశగా కలాం ఆలోచనలు, ఆశయాలు యువతకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని స్పష్టంచేశారు. కలాంకు మోదీ నివాళులు -
అంతరిక్షంపై చిన్నారుల్లో అమితాసక్తి
సాక్షి, న్యూఢిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. అంతరిక్షంపై చిన్నారుల్లో ఆసక్తి నానాటికీ పెరుగుతోందని చెప్పారు. అంతరిక్ష రంగంలో 200కుపైగా స్టార్టప్ కంపెనీలు ఏర్పాటయ్యాయని తెలిపారు. ఆయన ఆదివారం 124వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘ఆత్మనిర్భర్ భారత్’కు అతిపెద్ద ఆధారం ‘వోకల్ ఫర్ లోకల్’ అని పునరుద్ఘాటించారు. ‘2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్’ అనే లక్ష్య సాధన కోసం కృషి చేస్తున్నామని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. గత కొన్ని వారాల్లో క్రీడలు, సైన్స్, సాంస్కృతికం తదితర రంగాల్లో ఎన్నో ఘనతలు నమోదయ్యాయని, అవి ప్రతి భారతీయుడికీ గర్వకారణమని చెప్పారు.శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్రతో దేశమంతా పులకించిపోయిందని, ఆయన క్షేమంగా తిరిగి వచ్చాక గర్వంతో ఉప్పొంగిపోయిందని, ప్రతి హృదయం సంతోషంతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు. 2023 ఆగస్టులో చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతమైనప్పుడు భారతీయులు ఎంతగానో గర్వించారని గుర్తుచేశారు. చిన్నారుల్లో సైన్స్, అంతరిక్షం పట్ల ఆసక్తి పెరిగిందని, చంద్రుడిపైకి చేరుకుంటామని చెబుతున్నారని వెల్లడించారు. స్పేస్ సైంటిస్ట్ కావాలన్న ఆలోచన వారిలో నాటు కుందని, ఇదొక శుభ పరిణామమని ఉద్ఘాటించారు. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... ఒలింపియాడ్‌లో మన విద్యార్థుల ఘనత ‘‘చిన్నారుల్లో నూతన ఆవిష్కరణ పట్ల ఉత్సాహం పెంచడానికి ఇన్‌సై్పర్–మానక్ అభియాన్ ప్రారంభించాం. ఒక్కో పాఠశాల నుంచి ఐదుగురిని ఎంపిక చేశాం. లక్షలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో చేరారు. చంద్రయాన్–3 తర్వాత వారి సంఖ్య రెట్టింపయ్యింది. స్పేస్ స్టార్టప్‌లు ఐదేళ్ల క్రితం కేవలం 50 ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 200 దాటేసింది. 21వ శతాబ్దంలో నూతన శక్తితో సైన్స్ పురోగమిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో మన విద్యార్థులు దేవేశ్ పంకజ్, సందీప్ కుచీ, దేవదత్ ప్రియదర్శి, ఉజ్వల్ కేసరి పతకాలు గెలుచుకున్నారు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ లో మన విద్యార్థులు ఆరు పతకాలు సాధించారు. విప్లవాల మాసం ఆగస్టు ఆగస్టు రాబోతోంది. ఆగస్టు అంటే విప్లవాల మాసం. 18 ఏళ్ల స్వాతంత్య్ర సమర యోధుడు ఖుదిరాం బోస్‌ను ఆగస్టులోనే బ్రిటిష్ పాలకులు ఉరి తీశారు. లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ఆగస్టు 1న మరణించారు. ఆగస్టు 8న గాంధీ నాయకత్వంలో క్విట్ఇండియా ఉద్యమం మొదలైంది. ఆగస్టు 15న మనకు స్వాతంత్య్రం వచ్చింది. దేశ విభజన కూడా ఇదే నెలలో జరిగింది. ప్రతిఏటా ఆగస్టు 14వ తేదీని ‘విభజన అకృత్యాల సంస్మరణ దినం’గా నిర్వహించుకుంటున్నాం. 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం ఆరంభమైంది. స్వదేశీ ఉత్పత్తులు వాడాలన్న పిలుపునకు అప్పటి ప్రజలు స్పందించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం నిర్వహిస్తున్నాం. In the 124th episode of Mann Ki Baat, Prime Minister Narendra Modi says, "In Mann Ki Baat, once again, we will talk about the successes of the country, the achievements of the countrymen. Recently, there was a lot of discussion in the country about the return of Shubhanshu Shukla… pic.twitter.com/WcVQa0fXOG— ANI (@ANI) July 27, 2025అదే మనందరి సంకల్పం మన దేశం మరింత అభివృద్ధి చెందాలంటే స్థానిక ఉత్పత్తులు విరివిగా ఉపయోగించాలి. మన దేశంలో తయారైన వస్తువులే విక్రయించాలి. అవే కొనుక్కోవాలి. అదే మనందరి సంకల్పం కావాలి. ఎందుకంటే వాటి తయారీ కోసం మనం స్వేదం చిందించాం. కొన్నిసార్లు కొన్ని విషయాలు కొందరికి అసాధ్యంగా కనిపిస్తాయి. కానీ, మనమంతా ఒక్కటై పని చేస్తే అసాధ్యాలే సుసాధ్యాలవుతాయి. అందుకు తగిన ఉదాహరణ స్వచ్ఛ భారత్ మిషన్. ఈ కార్యక్రమానికి 11 ఏళ్లు పూర్తి కాబోతున్నాయి. ఇదొక ప్రజా ఉద్యమంగా మారింది. స్వచ్ఛతను ప్రజలు తమ బాధ్యతగా భావిస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ అవసరం ఇప్పటికీ ఉంది. 4,500 పట్టణాలు, నగరాలు ఇందులో భాగమయ్యాయి. 15 కోట్ల మందికిపైగా జనం పాలుపంచుకున్నారు. ఇది సాధారణ విషయం కాదు. ఒడిశాలో మాజీ నక్సలైట్ల విజయాలు స్ఫూర్తిదాయకం జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో మాజీ నక్సలైట్లు చేపల పెంపకంలో అద్భుత విజయాలు సాధిస్తున్నారు. హింసను వీడి మత్స్య రంగంలో ప్రవేశించారు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ అభివృద్ధి దీపం వెలిగించవచ్చని నిరూపించారు. కొన్నిసార్లు దట్టమైన చీకటి నుంచే ప్రకాశవంతమైన వెలుగు ఉద్భవిస్తుంది. గతంలో తుపాకులు పట్టుకొన్న నక్సలైట్లు ఇప్పుడు వలలు చేతబూని చేపల వేట సాగిస్తున్నారు. చక్కటి ఆదాయం పొందుతూ బతుకులు మార్చుకుంటున్నారు. ఈ విజయ గాథలు అందరికీ స్ఫూర్తిదాయకం. -
మాల్దీవుల అభివృద్ధికి భారత్ సహకారం
మాలె: మాల్దీవులతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకొనేందుకు కట్టుబడి ఉన్నామని భారత ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు చేర్చడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. మాల్దీవుల సర్వతోముఖాభివృద్ధికి సహకారం కొనసాగిస్తామని ప్రకటించారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షల సాకారానికి తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందని హామీ ఇచ్చారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శనివారం మాల్దీవుల ఉపాధ్యక్షుడు ఉజ్ హుస్సేన్ మొహమ్మద్ లతీఫ్‌తోపాటు పలువురు ముఖ్య నాయకులను కలుసుకున్నారు. మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, ఇంధనం, వాతావరణ మార్పుల నియంత్రణ సహా పలు కీలక రంగాల్లో పరస్పర సహకారంపై అతీఫ్తో చర్చించారు. మాల్దీవుల స్వాతంత్య్ర దినోత్సవంలో మోదీ ప్రధాని మోదీ మాల్దీవుల 60వ స్వాతంత్య్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రిపబ్లిక్ స్క్వే ర్లో 50 నిమిషాలపాటు ఈ వేడుకలు జరిగాయి. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుతోపాటు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, విదేశాంగ మంత్రి విక్రమ్ మిస్రీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మిలటరీ పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. -
ఎఫ్టీఏతో బహుళ ప్రయోజనాలు
సాక్షి, చెన్నై: యునైటెడ్ కింగ్డమ్(యూకే)తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవడం చరిత్రాత్మకమని, దీనివల్ల మన దేశానికి బహుళ ప్రయోజనాలు ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్ పట్ల ప్రపంచదేశాలకు పెరుగుతున్న విశ్వాసానికి, గౌరవానికి ఈ ఒప్పందమే ఒక నిదర్శనమని వివరించారు. ఎఫ్టీఏతో వికసిత్ భారత్, వికసిత్ తమిళనాడుకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని వివరించారు. ప్రధాని మోదీ శనివారం తమిళనాడులోని తూత్తుకుడిలో పర్యటించారు. ఎయిర్పోర్ట్, రహదారులు, రైల్వే, విద్యుత్‌కు సంబంధించిన రూ.4,900 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం ఇచ్చారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. తమిళనాడు సంప్రదాయ వ్రస్తాలు ధరించి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రకారం మన దేశానికి సంబంధించిన 99 శాతం ఉత్పత్తులపై బ్రిటన్‌లో ఇక పన్నులు ఉండవని అన్నారు. ఇండియా ఉత్పత్తుల ధరలు తగ్గితే సహజంగానే డిమాండ్ పెరుగుతుందని, దానివల్ల మన దేశంలో వాటి ఉత్పత్తిని పెంచాల్సి వస్తుందని వెల్లడించారు. ఫలితంగా మన యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల లభిస్తాయని, రైతులు, మత్స్యకారులతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, స్టార్టప్‌లకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. విదేశీ పర్యటన ముగించుకొని నేరుగా తమిళనాడులో అడుగుపెట్టడం ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఏ రాష్ట్ర అభివృద్ధికైనా మౌలిక సదుపాయాలు, ఇంధనం చాలా ముఖ్యమని చెప్పారు. గత 11 ఏళ్లుగా ఈ రెండు అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని ఉద్ఘాటించారు. తమిళనాడు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. మన ఆయుధాలతో ఉగ్రవాదుల భరతం పట్టాం ‘మేక్ ఇన్ ఇండియా’ఆయుధాలు ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించాయని, శత్రు శిబిరాలను ధ్వంసం చేశాయని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. మన స్వదేశీ ఆయుధాలతో ఉగ్రవాదుల భరతం పట్టామని, వారికి నిద్రలేకుండా చేశామని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నో వంతెనలు, సొరంగాలు నిర్మించామని, దీనివల్ల వేలాది ఉద్యోగాల సృష్టి జరిగిందని, యువత లబ్ధి పొందారని స్పష్టంచేశారు. చెన్నైలోని ప్రఖ్యాత వళ్లువర్ కోట్టం రథం నమూనాను తమిళనాడు ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ప్రధాని మోదీకి బహూకరించారు. -
విశ్వసనీయ నేత మోదీ
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ, విశ్వసనీయత కలిగిన నాయకుడిగా మరోసారి ఘనత సాధించారు. అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’నిర్వహించిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాకర్ సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. మోదీకి ఏకంగా 75 శాతం అప్రూవల్ రేటింగ్ లభించడం విశేషం. అంటే సర్వేలో పాల్గొన్నవారిలో 75 శాతం మంది మోదీని ప్రజాస్వామ్య ప్రపంచ నేతగా ఆమోదించారు. 18 శాతం మంది మోదీ వైపు మొగ్గు చూపలేదు. మిగతా 7 శాతం మంది ఏదీ చెప్పలేకపోయారు. ఈ సర్వే వివరాలను ‘మార్నింగ్ కన్సల్ట్’ విడుదల చేసింది. అత్యంత విశ్వసనీయ ప్రపంచ నాయకుల్లో మోదీ మొదటి స్థానంలో ఉండగా, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ రెండో స్థానంలో, అర్జెంటీనా అధినేత జేవియర్ మిలీ మూడో స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేవలం 44 శాతం అప్రూవల్ రేటింగ్‌తో ఎనిమిదో స్థానానికి పరిమితం కావడం గమనార్హం. ఈ నెల 4 నుంచి 10వ తేదీ దాకా ఈ సర్వే నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో ప్రజాభిప్రాయం సేకరించారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగానే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ తగ్గుతున్నట్లు తెలుస్తోంది. -
మోదీ టూర్ల ఖర్చు రూ. 362 కోట్లు!
న్యూఢిల్లీ: ఐదేళ్లలో రూ.362 కోట్లు ఖర్చు అంటే.. ఇదేదో ప్రాజెక్టుకు అనుకునేరు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల ఖర్చు. 2021 నుంచి 2025 మధ్య ఆయన విదేశీ పర్యటనలకోసం అక్షరాలా రూ.362కోట్లు ఖర్చయ్యాయి. ఒక్క 2025లోనే ఆయన పర్యటనలకోసం రూ.67కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇందులో.. అమెరికా, ఫ్రాన్స్ ఉన్నతస్థాయి పర్యటనలు సహా ఐదు పర్యటనలు న్నాయి. రాజ్యసభలో తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ అడిగిన ప్రశ్నకు సమా« దానంగా విదేశాంగ శాఖ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఈ వివరాలను రాజ్యసభకు అందించారు. ఈ డేటా ప్రకారం, 2025లో ప్రధాని పర్యటనల్లో అత్యంత ఖరీదైనది ఫ్రాన్స్ పర్యటన. దీనికి రూ. 25 కోట్లకు పైగా.. ఆ తర్వాత అమెరికా పర్యటనకు రూ. 16 కోట్లకు పైగా ఖర్చయింది. మారిషస్, సైప్రస్, కెనడా దేశాల అదనపు సందర్శనల ఖర్చులు ఇంకా వీటికి కలపలేదు. ఇక 2024 లో రష్యా, ఉక్రెయిన్‌తో సహా 16 దేశాల్లో పర్యటించడానికి రూ.109 కోట్లు ఖర్చు చేశారు. 2023లో దాదాపు రూ.93 కోట్లు, 2022లో రూ.55.82 కోట్లు, 2021లో రూ.36 కోట్లు ఖర్చు చేశారు. 2021లో అమెరికా పర్యటనకే రూ.19 కోట్లకు పైగా ఖర్చయింది. ఇవి కేవలం పర్యటనలకే పరిమితం కాకుండా.. పర్యటనలకు సంబంధించిన ప్రకటనలు, ప్రసార ఖర్చుల వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. -
మాల్దీవులతో బలీయ బంధం
మాలె: భారత్, మాల్దీవ్స్ విశ్వసనీయమైన మిత్రదేశాలు అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మాల్దీవ్స్‌తో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకుంటామని, ద్వీప దేశానికి రూ.4,850 కోట్ల రుణం(లైన్ ఆఫ్ క్రెడిట్) ఇవ్వబోతున్నామని ప్రకటించారు. శుక్రవారం మాల్దీవ్స్ రాజధాని మాలెలో ప్రధాని మోదీ, మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, మౌలిక సదుపాయాలు తదితర రంగాల్లో పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు. అంతకుముందు రెండు రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్ నుంచి శుక్రవారం ఉదయం మాల్దీవులకు చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. ఎయిర్‌పోర్టులో మొహమ్మద్ ముయిజ్జుతోపాటు సీనియర్ మంత్రులు ఆయనకు స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం రిపబ్లిక్ స్క్వేర్‌లో మోదీకి సైనికులు గౌరవ వందనం సమర్పించారు. ఇండియా–మాల్దీవ్స్ మధ్య కొన్ని రోజుల క్రితం సంబంధాలు బలహీనపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. సైనిక సామర్థ్యం పెంపునకు సహకారం మాల్దీవులతో సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మోదీ స్పష్టంచేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక పెట్టుబడులు ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. భారత్ అమలు చేస్తున్న ‘పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం’, ‘మహాసాగర్’ విధానాల్లో మాల్దీవులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. రక్షణ రంగంలో పరస్పర సహకారం ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసానికి ఒక కొలమానం అని వివరించారు. మాల్దీవుల సైనిక సామర్థ్యం పెంపునకు భారత్ సహకరిస్తుందని హామీ ఇచ్చారు. అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి స్వా గతం పలకడం తన హృదయాన్ని హత్తుకుందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.రక్షణ శాఖ కార్యాలయం ప్రారంభం ఇండియా–మాల్దీవ్స్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక సంబంధాలు, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్మారక తపాళ బిళ్లను మోదీ, ముయిజ్జు ఆవిష్కరించారు. వేర్వేరు కీలక రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించి అవగాహనా ఒప్పందాలపై(ఎంఓయూ) ఇరు దేశాలు సంతకాలు చేశాయి. మాల్దీవ్స్‌లో భారత యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి మరో ఒప్పందం కుదిరింది. రూ.4,850 కోట్ల లైన్ ఆఫ్ క్రెడిట్‌పై రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. మాలె సిటీలో రక్షణ శాఖ కార్యాలయాన్ని మోదీ, ముయిజ్జు ప్రారంభించారు. -
అది నా తప్పే.. ఇప్పుడు సరిదిద్దుతున్నాం: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: తెలంగాణ కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ప్రశంసలు గుప్పించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయలేకపోయామని, అది ముమ్మాటికీ తన తప్పిదమేనని అన్నారాయన. శుక్రవారం ఢిల్లీ టాల్కటోరా ఇండోర్ స్టేడియంలో జరిగిన భాగిదారి న్యాయ సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. నేను 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నాను... ఇప్పుడు వెనక్కి చూసినప్పుడు, ఓ తప్పు చేశానని అర్థమవుతోంది. నేను ఓబీసీల హక్కులను రక్షించాల్సిన విధంగా రక్షించలేదు. అప్పట్లో మీ(ఓబీసీలనుద్దేశించి..) సమస్యలు లోతుగా అర్థం చేసుకోలేకపోయాను.... మీ చరిత్రను, మీ సమస్యలను కొంచెం అయినా ముందే తెలుసుకుని ఉండినట్లైతే, అప్పటికే కుల గణాంకాలు (Caste Census) నిర్వహించేవాడిని. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన ప్రభావం అర్థం చేసుకోలేకపోయాం. ఇది కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు.. ముమ్మాటికీ నా తప్పు. ఇప్పుడు ఆ తప్పును సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని అన్నారాయన. ఓబీసీల చరిత్ర గురించి ఎవరైనా రాశారా?. పెద్ద పెద్ద వ్యాపారవేత్తల పేర్లు బయటికి తీయండి. అందులో ఒక్కరైనా ఓబీసీ ఉన్నారా? అదానీ ఒబీసీనా?. ఇంగ్లీష్‌ను వ్యతిరేకించేవారు తమ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు? అని ప్రశ్నించారాయన. తెలంగాణ కులగణన దేశానికే రోల్ మోడల్ అని పేర్కొన్న రాహుల్.. దేశవ్యాప్తంగా కులగణన జరగాల్సిందేనని ఉద్ఘాటించారు.#WATCH | Delhi: At Congress' 'Bhagidari Nyay Sammelan', Lok Sabha LoP Rahul Gandhi says, "I have been in politics since 2004...When I look back, I can see that I made a mistake. I didn't protect the OBCs like I should have...It was because I could not understand your issues in… pic.twitter.com/uink9xyKFJ— ANI (@ANI) July 25, 2025మోదీపై రాహుల్ విసుర్లుఇదే వేదికగా.. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, దేశ ప్రధాని నరేంద్ర మోదీపై విసుర్లు గుప్పించారు. ‘‘మోదీకి అంత సీన్ లేదు. ఆయనదంతా బిల్డప్పు మాత్రమే. అంత శక్తేం ఆయనకు లేదు. అవసరంగా అంత ప్రాధాన్యం ఇస్తున్నారు అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మోదీతో రెండు,మూడుసార్లు భేటీ అయ్యాక.. ఆయనేం పెద్ద సమస్య కాదని అర్ధమైందని రాహుల్ అన్నారు. దేశంలో దళితులు, బీసీలు, గిరిజనులు, మైనారిటీలు 90 శాతం ఉన్నారు. కానీ,బడ్జెట్ హల్వా తయారీలో ఈ వర్గాలకు చెందిన ఎవరికీ ప్రాధాన్యం ఉండదు. ఆ హల్వా తయారీకి ఈ వర్గాలే కారణం. కానీ, తినడానికి మాత్రం వీళ్లు అర్హులు కారా?’’ అని కేంద్రాన్ని రాహుల్ ప్రశ్నించారు. -
ఎవరీ లండన్ చాయ్‌వాలా.. ఏంటి ప్రత్యేకత?
ఇండియన్ కల్చర్‌లో టీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇంటికి గెస్టులు ఎవరు వచ్చినా ముందుగా టీయిచ్చి మాటలు కలుపుతాం. మిత్రులు, సావాసగాళ్లతో చాయ్‌లు తాగుతూ చేసే చర్చలకు అంతే ఉండదు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత చాయ్ పే చర్చ చాలా ఫేమస్ అయింది. తనను తాను చాయ్‌వాలాగా ఆయన ఎన్నోసార్లు చెప్పుకున్నారు. పీఎం మోదీకి చాయ్ అందించి వైరల్ అయ్యాడో యువ చాయ్‌వాలా. అది కుడా లండన్‌లోని బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసంలో. ఇద్దరు ప్రధానులకు చాయ్ పోసిన కుర్రాడి పేరు అఖిల్ పటేల్.భారత్, బ్రిటన్ దేశాల మధ్య గురువారం చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరింది. ఈ సందర్భంగా లండన్‌లోని బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం అయిన చెకర్స్‌లో కీలక భేటీ జరిగింది. యూకే పీఎం కీర్ స్టార్మర్, ప్రధాని మోదీ కీలకాంశాలపై చర్చలు సాగించారు. పచ్చికలో ఏర్పాటు చేసిన ఒక టీ స్టాల్లో తాజాగా తయారు చేసిన భారతీయ మసాలా చాయ్‌ను ఇరువురు అగ్రనేతలు ఆస్వాదించారు. తర్వాత ఈ ఫొటోలను మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. "చెకర్స్‌లో ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో 'చాయ్ పే చర్చా'... భారత్-యూకే సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని రాశారు. View this post on Instagram A post shared by Amala Chai | Masala Chai (@amala_chai)మోదీ షేర్ చేసిన ఫొటోలో.. సాంప్రదాయ భారతీయ కుర్తాలో ఒక యువకుడు.. ఇద్దరు ప్రధానులకు చాయ్ సర్వ్ చేస్తునట్టు కనబడింది. ముఖ్యంగా టీస్టాల్ బ్యానర్‌పై రాసివున్న క్యాప్షన్ అందరినీ ఆకర్షించింది. "తాజాగా తయారుచేసిన మసాలా చాయ్. భారతదేశం నుంచి వచ్చించి, లండన్‌లో తయారైంది అని రాసుంది. ఇరువురు అగ్రనేతలకు చాయ్ అందించిన ఆ యువకుడి పేరు అఖిల్ పటేల్. అమలా చాయ్ పేరుతో యూకేలో ఆయన బిజినెస్ చేస్తున్నారు.‘Chai Pe Charcha’ with PM Keir Starmer at Chequers...brewing stronger India-UK ties! @Keir_Starmer pic.twitter.com/sY1OZFa6gL— Narendra Modi (@narendramodi) July 24, 2025 ఒక చాయ్‌వాలాకు మరో చాయ్‌వాలా..భారత్, బ్రిటన్ ప్రధానులకు చాయ్ అందించి అపరూప క్షణాలకు సంబంధించిన వీడియోను అఖిల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమలా చాయ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో రీల్‌ను షేర్ చేశారు. కీర్ స్టార్మర్తో కలిసి మోదీ.. టీస్టాల్ వద్దకు రావడం.. మీరు ఇండియా రుచులను ఆస్వాదిస్తారు అంటూ స్టార్మర్తో మోదీ చెప్పడం వంటివి వీడియోలో ఉన్నాయి. "ఇందులో ఏలకులు, జాజికాయ, నల్ల మిరియాలు ఉన్నాయి" అని కప్పుల్లో టీ పోస్తూ పటేల్ చెప్పాడు. ప్రధాని మోదీకి టీ గ్లాస్ అందిస్తూ.. ఒక చాయ్‌వాలాకు మరో చాయ్‌వాలా (Chaiwala) టీ అందిస్తున్నాడు అనగానే.. మోదీ గట్టిగా నవ్వేశారు. కీర్ స్టార్మర్ చాయ్ తాగుతూ చాలా బాగుందని కితాబిచ్చారు. ఎవరీ అఖిల్ పటేల్?భారత మూలాలు కలిగిన అఖిల్ పటేల్.. 2019లో తన అమ్మమ్మ ప్రేరణతో అమలా చాయ్‌ను ప్రారంభించాడు. అతడి అమ్మమ్మ 50 ఏళ్ల క్రితం లండన్‌కు వలసవచ్చి స్థిరపడ్డారు. పటేల్ లింక్డ్ఇన్ బయో ప్రకారం.. అతడు లండన్‌లోని హాంప్స్టెడ్లోని యూనివర్సిటీ కాలేజ్ స్కూల్లో చదువుకున్నాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (LSE) నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BSc), మేనేజ్మెంట్ చేశాడు. గ్రాడ్యుయేషన్ వివిధ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌లు పూర్తి చేశాడు.చదవండి: మీరు ఎలా చనిపోవాలనుకుంటున్నారు?చిన్నతనంలో తన అమ్మమ్మ పెట్టే మసాలా చాయ్ అంటే అఖిల్‌కు చాలా ఇష్టం. అయితే బయట తాగే చాయ్‌లలో ఇలాంటి రుచి లేదని గమనించాడు. తన అమ్మమ్మ ఫార్ములాతో బ్రిక్ లేన్ ప్రాంతంలో అమల చాయ్ పేరుతో టీస్టాల్ ప్రారంభించాడు. అస్సాం, కేరళ రైతుల నుంచి నేరుగా తేయాకులు, సుగంధ ద్రవ్యాలు తెప్పించుకుని వాటితోనే మాసాలా చాయ్ తయారు చేస్తాడు. అందుకే అమల చాయ్‌కు తక్కువ కాలంలోనే బాగా పేరొచ్చింది. తాజాగా ఇద్దరు ప్రధాన మంత్రులకు మసాలా చాయ్ అందించి ప్రపంచం దృష్టిలో పడ్డాడు అఖిల్ పటేల్. -
రికార్డు బద్ధలు కొట్టిన ప్రధాని మోదీ
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన ఘనత సాధించారు. వరుసగా అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన జాబితాలో ఇందిరా గాంధీ రికార్డును బద్ధలు కొట్టారు. భారత దేశంలో వరుసగా సుదీర్ఘకాలం ప్రధాని పదవిలో కొనసాగిన ఘనత.. జవహార్ లాల్ నెహ్రూది. ఆయన అత్యధిక కాలం (6,130 రోజులు) ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత రికార్డు ఇందిరా గాంధీ(4,077 రోజులు) పేరిట ఆ ఘనత ఉండేది. తాజాగా ఆ రికార్డును నరేంద్ర మోదీ బ్రేక్ చేశారు.శుక్రవారం(జులై 25)తో నరేంద్ర మోదీ భారత దేశ ప్రధానిగా 4,078 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో ఇందిరాగాంధీ రికార్డును అధిగమించినట్లైంది. అలాగే.. భారత్‌కు సుదీర్ఘకాలంగా ప్రధాని పదవిలో కొనసాగిన రెండో వ్యక్తి ఘనతకు సొంతం చేసుకున్నారు. అంతేకాదు..స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించిన వ్యక్తిగా, రెండు దఫాలు ప్రధాని పదవీ కాలం పూర్తి చేసుకున్న వ్యక్తి.. మోదీనే. అలాగే.. కాంగ్రెస్‌యేతర ప్రధానిగా, హిందీయేతర రాష్ట్ర వ్యక్తిగానూ మోదీ నిలిచారు. మోదీ 2014 మే 26న మొదటిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.2019లో రెండవసారి, 2024లో మూడవసారి పదవిలోకి వచ్చారు.నరేంద్ర మోదీ ఇప్పటివరకు (జూలై 25, 2025 వరకు) భారతదేశ ప్రధానమంత్రిగా 4,078 రోజులు పాలన అందించారు.ఇప్పటిదాకా మొత్తం కాలం 11 సంవత్సరాలు, 1 నెల, 29 రోజులుఫలితంగా వరుసగా భారత ప్రధానిగా చేసిన ఇందిరా గాంధీ రికార్డును అధిగమించి, భారతదేశంలో రెండవ అత్యధిక కాలం సేవలందించిన ప్రధానిగా మోదీ నిలిచారు.ఇందిరా గాంధీ భారతదేశ ప్రధానమంత్రిగా రెండు విడతలలో సేవలందించారు:మొదటిసారి పదవీకాలం.. 24 జనవరి 1966 నుండి 24 మార్చి 1977, 11 సంవత్సరాలు, 2 నెలలురెండోసారి పదవీకాలం14 జనవరి 1980 నుండి 31 అక్టోబర్ 1984 (ఆమె హత్యకు ముందు వరకు) 4 సంవత్సరాలు, 9 నెలలు, 17 రోజులుమొత్తం పదవీ కాలం15 సంవత్సరాలు, 11 నెలలు, 17 రోజులుదేశానికి స్వాతంత్య్రంచ్చినప్పటి నుంచి నెహ్రూ ఆ పదవిలో కొనసాగారు. జవహర్లాల్ నెహ్రూ భారతదేశపు మొదటి ప్రధానమంత్రిగా 15 ఆగస్టు 1947న పదవీ బాధ్యతలు స్వీకరించి, 27 మే 1964న ఆయన మరణించేవరకు పదవిలో కొనసాగారు. అంటే.. మొత్తం 16 సంవత్సరాల 286 రోజులు ఆ పదవిలో ఉన్నారన్నమాట. ఇది భారత ప్రధానమంత్రిగా ఇప్పటివరకు అత్యధిక కాలం సేవలందించిన రికార్డు నెహ్రూదే. -
ఇక స్వేచ్ఛా వాణిజ్యం
లండన్: భారత్, బ్రిటన్ సంబంధాల్లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. పరస్పర ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెండు రెట్లు పెంచుకోవాలని వ్యూహాత్మక భాగస్వామ్యపక్షాలైన భారత్, యూకే నిర్ణయించుకున్నాయి. అమెరికా వాణిజ్య విధానాల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని తీర్మానించాయి. భారత ప్రధాని మోదీ గురువారం లండన్‌లో యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ‘యూకే–ఇండియా విజన్ 2035’ రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించారు. అధికారికంగా సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ)గా పిలుస్తున్న డీల్‌పై మోదీ, కీర్ స్టార్మర్ సమక్షంలో భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, బ్రిటిష్ వాణిజ్య మంత్రి జోనాథన్ రేనాల్డ్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం వల్ల భారత్, యూకే మధ్య వాణిజ్యం ఏటా 34 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తు న్నారు. ఎఫ్‌టీఏపై సంతకాలు జరగడం పట్ల మోదీ హర్షం వ్యక్తంచేశారు. భారత్, యూకే సంబంధాల్లో ఇదొక చరిత్రాత్మక దినమని అభివరి్ణంచారు. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ తర్వాత ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయినట్లు తెలిపారు. కీర్ స్టార్మర్ స్పందిస్తూ.. యూరోపియన్ యూనియన్(ఈయూ) తా ము బయటకు వచి్చన అనంతరం కుదుర్చుకున్న అతిపెద్ద ఒప్పందం ఇదేనని స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై పోరులో ఐక్యంగానే.. కీర్ స్టార్మర్తో చర్చల అనంతరం ప్రధాని మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించినందుకు యూకే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, యూకే ఐక్యంగా పనిచేస్తున్నాయని చెప్పా రు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదన్నారు. భారత్‌కు ఎనలేని మేలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారత్‌కు ఎనలేని మేలు జరుగుతుందని ప్రధానమంత్రి వెల్లడించారు. భారత వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పరిశ్రమకు బ్రిటిష్ మార్కెట్లో నూతన అవకాశాలు లభిస్తాయన్నారు. భారతీయ యువత, రైతులు, మత్స్యకారులతోపాటు సూక్ష్మ, చిన్న, మ ధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) లబ్ధి చేకూరుతుందని స్పష్టంచేశారు. భారతీయ వ్రస్తాలు, పాదరక్షలు, వజ్రాలు, బంగారు ఆభరణాలు, సముద్ర ఆహారం, ఇంజనీరింగ్ వస్తువులకు యూకే మార్కెట్లోకి ప్రవేశం లభిస్తుందన్నారు. ‘విజన్–2030’ రోడ్‌మ్యాప్‌పై ఇండియా, యూకే అంకితభావంతో ముందుకెళ్తున్నాయని ఉద్ఘాటించారు.మోదీకి స్టార్మర్ విందు యూకే పర్యటన కోసం బుధవారం రాత్రి లండన్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. భారీ సంఖ్యలో తరలివచి్చన ప్రవాస భారతీయులు ఆయనకు స్వాగతం పలికారు. లండన్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని తన నివాసంలో గురువారం మోదీకి బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. భారత్, యూకే కలిసికట్టుగా పనిచేస్తాయని స్టార్మర్ అన్నారు. రెండు దేశాలు సహజ భాగస్వామ్య పక్షాలు అని మోదీ చెప్పారు. చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించుకుంటున్నాయని తెలిపారు. డబుల్ కంట్రిబ్యూషన్స్ కన్వెన్షన్(డీసీసీ)పై ఏకాభిప్రాయానికి వచ్చామని వెల్లడించారు. రెండు దేశాల్లో టెక్నాలజీ, ఫైనాన్స్‌తోపాటు సేవల రంగానికి మేలు జరుగుతుందన్నారు. సులభతర వాణిజ్యానికి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. భారత్–యూకే సంబంధాలపై మోదీ క్రికెట్ పరిభాషలో వివరణ ఇచ్చారు. కొన్నిసార్లు స్వింగ్ అండ్ మిస్ ఉండొచ్చని, అయినప్పటికీ ఎప్పటికీ స్ట్రెయిట్ బ్యాట్‌తో ఆడుతూనే ఉంటామన్నారు. హైస్కోరింగ్తోపాటు బలమైన భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నాయని స్పష్టంచేశారు. మోదీ, స్టార్మర్ ‘బకింగ్హమ్ స్ట్రీట్ క్రికెట్ క్లబ్’ క్రీడాకారులతో సంభాíÙంచారు. ఒప్పందంతో లాభమేంటి? వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడంతోపాటు పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా భారత్, యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. మూడేళ్ల చర్చల తర్వాత ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇది అమల్లోకి వస్తే జరిగేది ఏమిటంటే.. → బ్రిటిష్ ఉత్పత్తులపై ఇండియాలో సగటు సుంకాలు 15 శాతం నుంచి 3 శాతానికి తగ్గిపోతాయి. → బ్రిటన్ నుంచి విస్కీ, చాక్లెట్లు, సాఫ్ట్ డ్రింకులు, కాస్మెటిక్స్, కార్లు, వైద్య పరికరాలు భారత మార్కెట్లోకి విస్తృతంగా ప్రవేశిస్తాయి. → బ్రిటిష్ విస్కీపై ప్రస్తుతం విధిస్తున్న 150 శాతం సుంకాన్ని భారత ప్రభుత్వం 75 శాతానికి తగ్గిస్తుంది. రాబోయే పదేళ్లలో 40 శాతానికి తగిస్తుంది. అంటే బ్రిటిష్ విస్కీ ఇండియాలో చౌకగా లభిస్తుంది. → భారత్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులు, వస్తువులపై సుంకాలను యూకే సర్కార్ సగానికి తగ్గిస్తుంది. వ్రస్తాలు, పాదరక్షలు, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గిపోతాయి. → ప్రధానంగా భారతీయ రైతులకు భారీ లబ్ధి చేకూరుతుంది. వ్యవసాయ ఉత్పత్తులపై యూకేలో టారిఫ్‌లు దాదాపు 95 శాతం తగ్గుతాయి. జర్మనీ, నెదర్లాండ్స్‌తోపాటు ఈయూ రైతులతో సమానంగా, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువే భారతీయ రైతులు లాభపడతారు. ఇండియా నుంచి దిగుమతి అయ్యే తేయాకు, పండ్లు, కూరగాయలు, మసాలా పొడులు, తృణధాన్యాలు, పచ్చళ్లు, రెడీ–టు–ఈట్ ఆహారం, పండ్ల గుజ్జుతోపాటు శుద్ధి చేసిన ఆహారంపై టారిఫ్‌లు సున్నాకు పడిపోతాయి. → మత్స్య, సముద్ర ఉత్పత్తులపై సుంకాలను 99 శాతం తగ్గించబోతున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడులో చేపలు, రొయ్యల పెంపకం చేస్తున్న రైతులకు లాభమే. → ఇండియా నుంచి యూకేకు దిగుమతి అయ్యే స్మార్ట్ఫోన్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, ఇన్వర్టర్లపై ఎలాంటి టారిఫ్ ఉండదు. → దేశీయ మద్యం ఉత్పత్తులు, పానీయాలు యూకే మార్కెట్లోకి ప్రవేశించబోతున్నాయి. సంప్రదాయ గోవా ఫెనీ, నాసిక్ వైన్స్, కేరళ కల్లు ఇందులో ఉన్నాయి. → ఎఫ్టీఏతో రానున్న మూడేళ్లలో ఇండియా నుంచి యూకేకు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 20 శాతానికి పైగా పెరుగుతాయని అంచనా. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. → దేశీయ రైతులు, పరిశ్రమలను దృష్టిలో పెట్టుకొని పాడి ఉత్పత్తులు, వంట నూనెలు, యాపిల్స్‌ను ఎఫ్‌టీఏ నుంచి భారత ప్రభుత్వం మినహాయించింది. బ్రిటన్ నుంచి వచ్చే ఈ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు ఉండబోదు. మీరు ఆంగ్ల పదాలు వాడొచ్చు ఎఫ్‌టీఏపై సంతకాల తర్వాత మోదీ, స్టార్మర్ ఉమ్మడిగా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్టార్మర్ స్పీచ్‌ను హిందీలోకి అనువాదం చేస్తున్న దుబాసీ కొంత ఇబ్బందిపడ్డారు. ఆయనకు అప్పటికప్పుడు సరైన హిందీ పదాలు తగల్లేదు. అది గమనించిన మోదీ ‘‘ఇబ్బంది పడాల్సిన పనిలేదు. మీరు మధ్యలో ఆంగ్ల పదాలు వాడొచ్చు. దాని గురించి చింతించకండి’’ అని సూచించారు. దుబాసీ క్షమాపణ కోరగా, ఫర్వాలేదని మోదీ అన్నారు. ఇదంతా చూసిన స్టార్మర్ చిరునవ్వు చిందించారు. -
స్వేచ్ఛావాణిజ్యం కల సాకారం
దాదాపు నాలుగేళ్ల కాలం... పదహారు దఫాల చర్చలు... నలుగురు ప్రధానులు– ఎట్టకేలకు బ్రిటన్ అభీష్టం నెరవేరింది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌ల సమక్షంలో రెండు దేశాల వాణిజ్య మంత్రులు పీయూష్ గోయెల్, జొనాథన్ రేనాల్డ్స్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై లండన్‌లో సంతకాలు చేశారు. ఈ ద్వైపాక్షిక ఒప్పందాన్ని బ్రిటన్ పార్లమెంటు ధ్రువీకరించాల్సి వుంది. ఆ ప్రక్రియకు ఏడాది సమయం పడుతుందంటున్నారు. 2030 నాటికి ఇరు దేశాల వాణిజ్య పరిమాణం 12,000 కోట్ల డాలర్లకు చేరుకోవాలన్నది ఎఫ్‌టీఏ లక్ష్యం. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించబోతున్న భారత్‌తో ఎఫ్‌టీఏ సాకారం కావాలని ఆ దేశం ఎంతగానో ఎదురుచూసింది. అందుకు కారణముంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బయటికొచ్చాక సాగిస్తున్న ఒంటరి ప్రయాణం దాని ఆర్థిక వ్యవస్థను ఒడిదుడుకుల్లో పడేసింది. ఒకప్పుడు ప్రపంచంలో రవి అస్తమించని సామ్రాజ్యాన్నేలిన దేశం నేల చూపులు చూడటం మొదలైంది. అందుకే కన్సర్వేటివ్ పార్టీకి చెందిన బోరిస్ జాన్సన్ ప్రధానిగా వున్నప్పుడు 2022లో తొలిసారి ఎఫ్‌టీఏ కుదుర్చుకోవాలన్న ప్రతిపాదన వచ్చింది. ఆయన స్థానంలో అదే పార్టీకి చెందిన లిజ్ ట్రస్ వచ్చారు. ఆమె 49 రోజుల్లోనే పదవి పోగొట్టుకున్నారు. తదనంతరం భారత్ మూలాలున్న రిషి సునాక్ ప్రధాని అయ్యారు. ఆయన కూడా నిష్క్రమించి ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించి ప్రస్తుత ప్రధాని స్టార్మర్ బాధ్యతలు స్వీకరించారు. వీరిలో అందరూ భారత్‌తో ఎఫ్‌టీఏ కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చినవారే. మొన్నటి ఎన్నికల్లో లేబర్ పార్టీ ప్రధాన వాగ్దానాల్లో భారత్‌తో ఎఫ్‌టీఏ కుదుర్చుకుంటామన్నది ఒకటి. మొత్తానికి అనేక రకాల అడ్డంకులూ, అపోహలూ అధిగమించి ఒప్పందం సాకారమైంది. ఎఫ్‌టీఏ వల్ల బ్రిటన్‌లో ఏటా కొత్తగా 2,200 ఉద్యోగాలొస్తాయని, దేశ జీడీపీ 480 కోట్ల పౌండ్ల (రూ. 56,150 కోట్లు) మేర పెరుగుతుందని అంచనా. అయితే రెండు దేశాల్లోనూ ఎఫ్‌టీఏపై అసంతృప్తి తక్కువేమీ లేదు. ఈ ఒప్పందం వల్ల ప్రధానంగా లాభపడేది స్కాచ్ విస్కీ, జిన్ ఉత్పత్తిదార్లు, బ్రిటన్ కార్ల పరిశ్రమలు. జిన్, స్కాచ్ విస్కీలపై ప్రస్తుతం 150 శాతం దిగుమతి సుంకాలుండగా, అవి 75 శాతానికి పడిపోతాయి. వచ్చే పదేళ్ల కాలంలో 40 శాతానికొస్తాయి. అలాగే బ్రిటన్ కార్లపై ప్రస్తుతం 100 శాతం సుంకాలున్నాయి. అవి పది శాతానికి పడిపోతాయి. ఎగువ మధ్య తరగతి, సంపన్న వర్గాలకు ఇది ఊరటనిచ్చే కబురు. మన ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లకు కూడా గిరాకీ ఏర్పడుతుంది. ఈ రంగంలో టాటాలకు డబుల్ ధమాకా అని చెప్పాలి. బ్రిటన్‌లో ఆ సంస్థ ఉత్పత్తి చేసే జాగ్వార్ ల్యాండ్ రోవర్లకు మన దేశంలో... ఇక్కడ ఉత్పత్తయ్యే టాటా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లకు బ్రిటన్‌లో మార్కెట్ లభ్యత పెరుగుతుంది. మన దేశం నుంచి వెళ్లే 99 శాతం ఎగుమతులకు కూడా ఎఫ్‌టీఏ అమల్లోకొస్తే సుంకాల బెడద వుండదు. బ్రిటన్ నుంచి మనకొచ్చే దిగుమతులపై సుంకాలు 15 శాతం నుంచి ఒక్కసారిగా 3 శాతానికి పడిపోతాయి. చాలా సరుకులపై కస్టమ్స్ సుంకాలు తగ్గిపోతాయి. మన సాగు రంగానికి ఎఫ్‌టీఏ ఎంతగానో దోహదపడుతుందని వాణిజ్య నిపుణులంటున్నారు. ప్రస్తుతం బ్రిటన్‌కు మన వార్షిక సాగు ఎగుమతుల విలువ కేవలం 81 కోట్ల డాలర్లు. ఈ ఒప్పందం వల్ల మన నుంచి తేయాకు, మామిడిపళ్లు, ద్రాక్ష, సుగంధ ద్రవ్యాలు, చేపలు, రొయ్యలు, ఎండ్రకాయలు వగైరాల ఎగుమతులు అపారంగా పెరుగుతాయని అంచనా వుంది. సేవల రంగా నికి సంబంధించినంతవరకూ యోగా బోధకులు, సంగీతవేత్తలు, పాకశాస్త్ర ప్రవీణులకు డిమాండ్ పెరుగుతుంది. ఈ రంగాల్లో పనిచేసే వారికోసం ఏటా 1,800 వీసాలు జారీచేస్తారు. వాహన విడి భాగాలు, వస్త్రాలు, పాదరక్షలు, క్రీడోపకరణాలు, ఆటబొమ్మలు, బంగారం, వజ్రాభరణాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, సేంద్రీయ రసాయనాలు, ఇంజిన్లు వగైరాలపై దాదాపు 4 నుంచి 16 శాతం వరకూ సుంకాలు విధిస్తున్నారు. ఒప్పందం అమల్లోకొస్తే ఆ సుంకాలు కనుమరుగవుతాయి. కనుక ఎగుమతులు ఊపందుకుంటాయి. పర్యవసానంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.ఎఫ్‌టీఏపై రెండు దేశాల్లోనూ విమర్శలూ, ఆందోళనలూ వున్నాయి. ఇది అమల్లోకొస్తే స్వల్పకాలిక వీసాపై వచ్చే భారతీయ కార్మికులకూ, వారి యాజమాన్యాలకూ జాతీయ బీమా సంస్థ ఎన్ఐసీకి చేసే చెల్లింపుల నుంచి మూడేళ్ల మినహాయింపు ఇవ్వదల్చుకున్నారని, ఇందువల్ల దేశ ఖజానాకు ఏటా పది లక్షల పౌండ్ల నష్టంతోపాటు దేశీయ కార్మికుల ఉపాధికి గండిపడుతుందని కన్సర్వేటివ్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఆ మినహాయింపు ఏడాది కాలానికి మాత్రమే వుంది. వలస విధానం మారదని, ఇప్పటికన్నా భారతీయ కార్మికుల సంఖ్య పెరిగే అవకాశం లేదని ప్రభుత్వం చెబుతోంది. తమ రంగాన్ని ఎఫ్‌టీఏ విస్మరించిందని, మేధోహక్కుల పరిరక్షణ సంగతి పట్టించుకోలేదని బ్రిటన్ ఫార్మా రంగం ఆరోపణ. ఒకవేళ పట్టించుకుని ఉంటే మన దేశంలో జెనెరిక్ ఔషధ పరిశ్రమ దెబ్బతింటుంది. ఆటోమొబైల్ విడిభాగాల రంగంలో బ్రిటన్ ప్రవేశిస్తే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) రంగం నష్టపోతుంది. అందుకు ప్రతిగా మన ఎంఎస్ఎంఈలకు కూడా బ్రిటన్ చోటిస్తే వేరుగా వుండేది. ఇక 2027 నుంచి బ్రిటన్ అమలుచేయబోతున్న ‘కార్బన్ టాక్స్’ అంశాన్ని ఏం చేశారో వెంటనే తెలియలేదు. కార్బన్ టాక్స్ వల్ల మన ఇనుము, ఉక్కు, అల్యూమినియం, ఎరువులు, సిమెంట్ రంగాలు దెబ్బతినే అవకాశం వుంది. మొత్తానికి ఎఫ్‌టీఏ అమల్లోకొచ్చాకే దాని అసలు కథ ఏమిటన్నది తెలుస్తుంది. -
బ్రిటన్ కింగ్ ఛార్లెస్‌ను కలిసిన మోదీ
లండన్: బ్రిటన్‌లో పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అక్కడ బ్రిటన్ రాజు ఛార్లెస్‌ను కలిశారు. గురువారం రాజు అధికారిక నివాసాల్లో ఒకటైన నోర్ఫోక్ ప్రాంతంలోని సాండ్రింగ్‌హామ్ హౌస్‌కు విచ్చేసిన మోదీని ఛార్లెస్ సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరూ కొద్దిసేపు పలు అంశాలపై మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఛార్లెస్‌కు మోదీ తెల్లని పూరెమ్మలు ఉండే సోనోమా డేవిడియా ఇన్వాలుక్రాటా అనే వింతైన మొక్కను బహూకరించారు. ఈ చెట్టుకు పూసే పూలను దూరం నుంచి చూస్తే గాల్లో ఎగిరే తెల్లపావురాల్లా కనిపిస్తాయి. శ్వేతవర్ణ పూరెమ్మలు ఉండటంతో దీనిని హ్యాండ్కర్చీఫ్ చెట్టు అని కూడా అంటారు. అమ్మ పేరిట ఒక చెట్టు కార్యక్రమంలో భాగంగా ఛార్లెస్‌కు మోదీ ఈ మొక్కను బహుమతిగా అందించారు. తల్లిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం తెల్సిందే. సాధారణంగా డేవిడియా మొక్క నాటిన 20 ఏళ్ల తర్వాతే పూలు పూస్తుంది. కానీ సోనోమా రకం సంకరజాతి మొక్క కేవలం రెండు, మూడేళ్లలోనే విరగబూస్తుంది. -
ప్రధానిని సైతం నవ్వించిన మీమ్ ఆర్టిస్ట్ కృష్ణ ఇక లేరు : ఫ్యాన్స్ దిగ్భ్రాంతి
ఒడిషాకు చెందిన ప్రముఖ ఫోటోషాప్ కళాకారుడు, మీమ్స్ సృష్టికర్త కృష్ణ (Atheist krishna) ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న (జూలై 23)న కన్నుమూశారు. దీంతో పలవురు ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. చిన్న వయసులో అకాల మరణం అంటూ అభిమానులు నివాళులర్పించారు.కృష్ణ అసలు పేరు రాధాకృష్ణ పంగా. మీమ్స్ , ఫోటోషాప్ ఫోటోలతో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. కామెడీ ఫోటోలతో పాటు, పాత, దెబ్బతిన్న ఫోటోలను పునరుద్ధరించడంలో కూడా ప్రసిద్ధి చెందాడు. కృష్ణ నైపుణ్యం అనేకమంది సెలబ్రిటీల ప్రశంసలందుకుంది. ముఖ్యంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ దృష్టిని ఆకర్షించి, వారి ప్రశంసలను కూడా దక్కించుకున్నారు.Woke up to the terrible news of @Atheist_Krishna passing away. He was one of the kindest people I met on this platform. On 10th July, he told me he was unwell and needs to be operated. He caught pneumonia. At that time, he said “it would be a miracle if I survive this.” I… pic.twitter.com/Fmo6AJFZhW— tere naina (@nainaverse) July 23, 2025అనారోగ్యంతో బాధపడుతూ జూలై ప్రారంభంలో ఆస్పత్రిలో చేరాడు. అయితే ఊరిపితిత్తుల్లోకి నీరు చేరడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసినా ఫలితం లేకపోయింది. కానీ దురదృష్టవశాత్తు న్యుమోనియా సోకడంతో పరిస్థితి క్షీణించి కన్నుమూశాడు ఈ వార్త తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.చదవండి: Beauty Tips ముడతల్లేకుండా...అందంగా, యవ్వనంగా మెరిసిపోవాలంటే!కాగా 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేదికపై నృత్యం చేస్తున్న స్పూఫ్ వీడియోను క్రియేట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీనిపై స్వయంగా మోదీ స్పందించారు. మోదీ తన సోషల్ మీడియాలో ఖాతాలో ఈ ఆర్టిస్ట్ వీడియోను పోస్ట్ చేసి మరీ ప్రశంసించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: బాలీవుడ్ సాంగ్‌కు చిన్నారుల స్టెప్స్ అదుర్స్.. ఆ కెమెరా మేన్ ఉన్నాడే..! Like all of you, I also enjoyed seeing myself dance. 😀😀😀Such creativity in peak poll season is truly a delight! #PollHumour https://t.co/QNxB6KUQ3R— Narendra Modi (@narendramodi) May 6, 2024 -
విదేశీ పర్యటనకు మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ బుధ వారం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన నాలుగు రోజులపాటు యునైటెడ్ కింగ్డమ్(యూకే), మాల్దీవుల్లో పర్యటిస్తారు. తన పర్యటనతో ఆయా దేశాలతో మన దేశానికి సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విదేశీ పర్యటనకు వెళ్లే ముందు మోదీ ఈ మేరకు సందేశం విడుదల చేశారు. భారత్–యూకే మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని, ఇరుదేశాల మధ్య ఇటీవలి కాలంలో సంబంధాలు మెరుగయ్యాయని వెల్లడించారు. కీలక రంగాల్లో రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయని తెలిపారు. యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో భేటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఉద్ఘాటించారు. మోదీ యూకే పర్యటనలో కింగ్ చార్లెస్–3 సైతం కలుసుకుంటారు. యూకే అనంతరం ఆయన మాల్దీవులకు చేరుకుంటారు. మాల్దీవుల 60వ జాతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మోదీ విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లడానికి కంటే ముందు ఆయనతో మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. పార్లమెంట్‌లోని మోదీ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఎఫ్టీఏతో భారత్‌కు తీవ్ర నష్టంభారత్–యూకే మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)తో మన దేశానికి భారీ నష్టం వాటిల్లుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ బుధవారం ఆందోళన వ్యక్తంచేశారు. యూకే మేలు చేసేలా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఎఫ్‌టీఏపై దేశ ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎఫ్‌టీఏ కారణంగా భారత్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) తీవ్రంగా నష్టపోతాయని స్పష్టంచేశారు. ఆటోమొబైల్, ఫార్మా స్యూటికలు రంగాలు సైతం నష్టపోతాయన్నారు. యూకే నుంచి దిగుమతి అయ్యే పలు ఉత్పత్తులపై సుంకాలను 100 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడాన్ని జైరామ్ రమేశ్ తప్పుపట్టారు. -
ట్రంప్ వ్యాఖ్యలపై మౌనమెందుకు?
న్యూఢిల్లీ: భారత్–పాక్‌ల మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదేపదే చెప్పుకుంటున్నా, ప్రధాని నరేంద్ర మోదీ దానిపై ఎందుకు నోరు విప్పడం లేదని లోక్‌సభ ప్రతిపక్షనాయకుడు రాహుల్‌గాంధీ ప్రశ్నించారు.‘‘కాల్పుల విరమణ ఒప్పందం తానే కుదిర్చానని ట్రంప్ ఇప్పటికో 25 సార్లు చెప్పారు. అసలు మనదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చడానికి ట్రంప్ ఎవరు? అది ఆయన పని కాదు. అయినా.. ప్రధాని ఒక్కసారి కూడా సమాధానం ఇవ్వలేదు’’అని ఆయన మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్ పట్ల పరస్పర వైరుధ్య వ్యాఖ్యలు చేయడాన్ని రాహుల్ ఎత్తి చూపారు. ‘ఒకవైపు ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది అంటున్నారు, మరోవైపు, విజయం సాధించామంటున్నారు. అది కొనసాగుతోందా? లేదా ముగిసిందా? మరోవైపు ఆపరేషన్ సిందూర్‌ను తానే ఆపానని ట్రంప్ చెబుతున్నారు. కాబట్టి ‘కుచ్ తో దాల్ మే కాలా హై నా’(ఏదో తేడాగా ఉంది)’అని రాహుల్ అనుమానం వ్యక్తం చేశారు. బుధవారం న్యూయార్క్‌లో జరిగిన ఓ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, భారత్–పాక్‌ల మధ్య పెద్ద యుద్ధాన్ని తానే నిరోధించానని పునరుద్ఘాటించడాన్ని రాహుల్ ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత విదేశాంగ విధానం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రపంచ వేదికపై భారత్‌ను ఒంటరి చేస్తోందని ఆరోపించారు. ట్రంప్ వాదన కారణంగానే ప్రధాని మోదీ పార్లమెంటుకు దూరంగా ఉంటున్నారన్నారు. ఓటర్ల జాబితా సవరణ ఎన్నికల మోసం.. బీహార్‌లో పెద్ద ఎత్తున ఓటర్ల జాబితా సవరణను కూడా రాహుల్ తీవ్రంగా విమర్శించారు. ప్రక్రియను బీజేపీ ఎన్నికల మోసంగా ఆయన అభివరి్ణంచారు. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ ఓటర్ల జాబితాను తారుమారు చేసిందని గుర్తు చేశారు. ‘బిహార్‌లో 52 లక్షల మంది మాత్రమే కాదు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోసం చేశారు. ఓటర్ల జాబితాను చూపించమని ఈసీని అడిగితే నిరాకరించింది. వీడియోగ్రఫీ గురించి అడిగితే నియమాలను మార్చేసింది. మహారాష్ట్రలో 1 కోటి మంది కొత్త ఓటర్లను చేర్చారు. కర్ణాటకలో భారీ మోసాన్ని బయటపెట్టి.. ఎన్నికల కమిషన్ ముందుంచాం. తమ ఆటలు ఇక చెల్లవని తెలిసి ఓటర్లను తొలగించారు’అని ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ సమరి్థంచారు. కీలకమైన విషయాలపై చర్చించేందుకు మోదీ నిరాకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘ట్రంప్ తన కాల్పుల విరమణ ప్రకటనతో రజతోత్సవం జరుపుకుంటున్న సమయంలో, ప్రధానమంత్రి పూర్తిగా మౌనంగా ఉన్నారు. విదేశాలకు వెళ్లడానికి, స్వదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను అస్థిరపరచడానికి మాత్రమే సమయం వెతుక్కుంటున్నారు’అని ఆయన ఎక్స్‌లో ఎద్దేవా చేశారు. -
జగదీప్ ధన్ ఖడ్ వారసుడు ఎవరు..?
-
పార్లమెంట్లో విపక్షాల ఆందోళన.. ఉభయ సభలు వాయిదా
Parliament Monsoon Session Live Updates.. పార్లమెంట్లో వర్షాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభమమయ్యాయి. ఈరోజు కూడా విపక్ష సభ్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు..ఆపరేషన్ సిందూర్‌పై మోదీని నిలదీసిన రాహుల్యుద్ధంలో భారత్ గెలిచిందా?ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందా?.బీహార్ ఓటర్ జాబితా సవరణపై ఈసీ వివరణ ఇవ్వాలి.భారత్‌లో ఎన్నికలనే దొంగిలిస్తున్నారు.. ఇదే వాస్తవం.ఎలా ఓటింగ్ జరుగుతుందో.. ఎవరు ఓట్లే వేస్తున్నారో మేం గమనిస్తున్నాం.కర్ణాటక తరహాలోనే బీహార్‌లో కూడా ఓట్లను దొంగిలిస్తున్నారు. #WATCH | Delhi: On US President Trump's claims of brokering a ceasefire between India and Pakistan, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "You are saying that the Operation Sindoor is ongoing, and on one hand, you say that we have become victorious. On one side, Donald… pic.twitter.com/9GxHSESkp8— ANI (@ANI) July 23, 2025 ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు కేంద్రం సిద్ధం.మంగళవారం నుంచి ఉభయ సభల్లో చర్చకు కేంద్రం సిద్ధం.ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు 16 గంటలు రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదారాజ్యసభలో విపక్ష నేతల నిరసనల కారణంగా మరోసారి వాయిదాసభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదాRajya Sabha adjourned till 2 pm following sloganeering by Opposition MPs demanding discussion on Special Intensive Revision of electoral rolls in Bihar pic.twitter.com/zORXTafwQD— ANI (@ANI) July 23, 2025కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కామెంట్స్..ఇండియా బ్లాక్ 'హుల్లాద్' బ్లాక్‌గా మారింది.పార్లమెంట్ వెలుపల చర్చ జరగాలని వారు అంటున్నారుకానీ సభలో చర్చకు రాకుండా పారిపోతున్నారు.నిన్న చేతులు జోడించి చర్చ జరగనివ్వమని నేను ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశాను.కానీ వారు హంగామా చేస్తూనే ఉన్నారు.రైతుల సంక్షేమం, సంబంధిత పథకాలకు సంబంధించి సభలో చాలా ప్రశ్నలు జాబితా చేయబడ్డాయి.ఇండియా బ్లాక్ ద్వంద్వ ప్రమాణాలను చూడాలని నేను రైతులకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. #WATCH | Union Minister Shivraj Singh Chouhan says," INDIA bloc has become 'hullad' bloc...Outside the Parliament, they say, there should be discussion, but they are running away from debate in the House. Yesterday, with folded hands, I had appealed to the Opposition to let… pic.twitter.com/lrLCQNr7qA— ANI (@ANI) July 23, 2025లోక్‌సభ స్పీకర్‌తో బీజేపీ నేతల కీలక భేటీలోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో బీజేపీ నేతల కీలక భేటీ.స్పీకర్‌ను కలిసిన కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, కిరణ్ రిజుజు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కామెంట్స్..బీహార్‌లో ఓట్లను నిషేధించే పనిని ఎన్నికల సంఘం చేస్తోంది.ఇది ప్రధాని మోదీ, అమిత్ షా సమ్మతితో మాత్రమే జరుగుతోంది.ప్రధాని మోదీ చర్చల్లో పాల్గొనాలని మేము కోరుతున్నాం.ఆపరేషన్ సిందూర్, Special Intensive Revision (SIR) పై చర్చలు ఎప్పుడు జరుగుతాయో ఆయన మాకు తెలియజేయాలి.#WATCH | Delhi: Congress MP Gaurav Gogoi says, "Election Commission is doing the work of banning votes in Bihar. It can only be done with the consent of PM Modi and Union HM Amit Shah. We want PM Modi to participate in the discussions of SIR, and he should inform us when the… pic.twitter.com/DyqQRNDBZX— ANI (@ANI) July 23, 2025పార్లమెంటులో మూడో రోజూ ఆందోళనల పర్వంసభ సజావుగా సాగేలా సహకరించాలని ఎంపీలకు విజ్ఞప్తి చేసిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లావిపక్ష సభ్యుల నినాదాల మధ్యే కొనసాగిన ప్రశ్నోత్తరాలుమధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడిన ఉభయసభలు#WATCH | Lok Sabha adjourned till 12 noon amid sloganeering by the Opposition MPs.Speaker Om Birla says, "...This House is for discussion and dialogue, not for sloganeering. Maintain the decorum of the House..."(Source: Sansad TV) pic.twitter.com/HpaUPGknGb— ANI (@ANI) July 23, 2025పార్లమెంట్లో విపక్షాల ఆందోళనఉభయ సభలు వాయిదా.. మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్‌సభ వాయిదా. మూడో రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.పార్లమెంట్లో విపక్షాల ఆందోళనబీహార్ ఓటర్ ప్రత్యేక సవరణపై చర్చ జరపాలని కాంగ్రెస్, ఆర్జేడీ సహా విపక్షాల డిమాండ్పార్లమెంట్ బయట ఎంపీల నిరసనలునిరసనల్లో పాల్గొన్న రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్Lok Sabha session begins with Opposition MPs sloganeering Lok Sabha Speaker Om Birla urges the Opposition MPs to maintain decorum.House adjourned till 12 noon(Source: Sansad TV/ YouTube) pic.twitter.com/a0AwiBXZuw— ANI (@ANI) July 23, 2025 పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన.లోక్‌సభలో విపక్ష ఎంపీల నినాదాలు #WATCH | Delhi: Opposition MPs, including Lok Sabha LoP and Congress MP Rahul Gandhi, hold protest against ongoing Special Intensive Revision (SIR) of electoral rolls in Bihar, in Parliament. pic.twitter.com/Z4ZT2Z7jjY— ANI (@ANI) July 23, 2025 -
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఆమోదం.. యూకే పర్యటనలో ప్రధాని మోదీ సంతకం
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ తన లండన్ పర్యటనలో జూలై 24న సంతకం చేయనున్న భారత్- యూకేల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంగా ఇది నిలవనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారత్-యూకేల మధ్య ఈ వాణిజ్య ఒప్పందం కోసం జరిపిన చర్చలు ముగిసినట్లు ఇరు దేశాలు మే 6న ప్రకటించాయి.ప్రధాని మోదీ చేపట్టే యునైటెడ్ కింగ్డమ్, మాల్దీవుల నాలుగు రోజుల పర్యటన బుధవారం(జూలై 23)ప్రారంభంకానుంది. ఈ పర్యటనలో వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ ప్రధానమంత్రి వెంట ఉండనున్నారు. కాగా 2030 నాటికి ఈ రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యాన్ని 120 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేసేదిగా ఈ ఒప్పందం ఉంది. తోలు, పాదరక్షలు, దుస్తులు వంటి శ్రమతో కూడిన ఉత్పత్తుల ఎగుమతిపై పన్నులను తొలగించాలని, బ్రిటన్ నుండి విస్కీ, కార్ల దిగుమతులను చౌకగా మార్చాలని ఈ వాణిజ్య ఒప్పందం ప్రతిపాదించింది.భారత్-యూకేల ఈ ఒప్పందంలో వస్తువులు, సేవలు, ఆవిష్కరణ, మేధో సంపత్తి హక్కులు తదితర అంశాల ప్రస్తావన ఉంది. ఈ ఒప్పందంపై ఇరు దేశాల వాణిజ్య మంత్రులు సంతకం చేయనున్నారు. అనంతరం దీనిని అమలు చేసేందుకు బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. మరోవైపు సామాజిక భద్రతా ఒప్పందంపై రెండు దేశాలు చర్చలు జరిపాయి. కాగా ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (బిట్)పై చర్చలు కొనసాగుతున్నాయి. 2024-25లో యూకేకి భారతదేశ ఎగుమతులు 12.6 శాతం పెరిగాయి. దిగుమతులు 2.3 శాతం మేరకు పెరిగాయి. భారత్-యూకేల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2022-23లో20.36 యూఎస్ బిలియన్ డాలర్ల నుండి 2023-24లో 21.34 యూఎస్ బిలియన్ డాలర్లకు పెరిగింది. -
రాజీనామానే మంచిదనుకున్న ధన్‌ఖడ్!
జనతాదళ్, కాంగ్రెస్, బీజేపీలలో వివిధ పదవులు, బాధ్యలతో సుదీర్ఘ రాజకీయానుభవం సంపాదించుకున్న వ్యక్తి. పైగా ఓ రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేసిన వ్యక్తి. అనూహ్యంగా తెర మీదకు తెచ్చి.. ‘రైతుబిడ్డ’గా ప్రమోట్ చేస్తూ మరీ ఉపరాష్ట్రపతి రేసులో నిలబెట్టి గెలిపించుకుంది ఎన్డీయే కూటమి. అలాంటిది బలవంతంగా ఆయన్ని పదవి నుంచి దించేశారా? లేకుంటే నిజంగానే ఆయన అనారోగ్య కారణాలతో రాజీనామా చేశారా?.. ఇతర కారణాలు ఉన్నాయా?.. దేశంలో ఇప్పుడు జగ్దీప్ ధన్‌ఖడ్ రాజీనామాపై రాజకీయ రచ్చ నడుస్తోంది. అకస్మాత్తుగా ఆయన ఉపరాష్ట్రపతి పదవికి ఎందుకు రాజీనామా చేశారు? అనే ప్రశ్న తలెత్తింది. లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో నవ్వుతూ కనిపించిన ఆయన.. గంటల వ్యవధిలోనే ఎందుకు రాజీనామా ప్రకటించారు?.. దానికి అంతే వేగంగా ఆమోద ముద్ర ఎందుకు, ఎలా పడింది?. పైగా ఎలాంటి వీడ్కోలు లేకుండానే(కనీసం ఫేర్వెల్ స్పీచ్ కూడా లేకుండా) ఆయన్ని సాగనంపడం.. పలు అనుమానాలకు తావిస్తోంది. ఇందుకు గత ఆరు నెలల పరిణామాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.👉ధన్‌ఖడ్(74)కు ఈ ఏడాది మార్చిలో ఛాతీ సంబంధమైన సమస్యలు రావడంతో ఎయిమ్స్‌లో చేరి చికిత్స తీసుకున్నారు. ఈ నెల 17వ తేదీన ఓ గార్డెన్ విజిటింగ్‌కు వెళ్లిన ఆయన హఠాత్తుగా కుప్పకూలి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన సతీమణితో పాటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అక్కడే ఉన్నారు. దీంతో వైద్యుల సూచన మేరకే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని లేఖలో ధన్‌ఖడ్ తెలిపారు. అయితే.. ‘‘రాజీనామా వెనుక లోతైన కారణాలే ఉన్నాయి, ఆయన ఎందుకు రాజీనామా చేశారో ఆయనకే తెలుసు..’’ అంటూ కాంగ్రెస్ అగ్రనేతలు స్పందించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. 👉పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా జరిగిన బీఏసీ సమావేశానికి బీజేపీ కీలక నేతలు జేపీ నడ్డా, కిరెన్ రిజిజ్జు గైర్హాజరు కావడం, ఆ సమావేశంలో ఈ అంశంపై ధన్‌ఖడ్ సీరియస్ అయ్యారని, ఆ తర్వాతే ఏదో జరిగిందని కాంగ్రెస్ వాదన. కానీ, జేపీ నడ్డా మాత్రం ముందస్తు సమాచారం ఇచ్చామని, కాంగ్రెస్ అనవసర రాజకీయం చేస్తోందని మండిపడుతున్నారు. ఆయన(ధన్‌ఖడ్) వ్యక్తిగత నిర్ణయానికి గౌరవం ఇవ్వాలని బీజేపీ నేత ఒకరు కూడా వ్యాఖ్యానించారు. అయితే.. कल दोपहर 12:30 बजे श्री जगदीप धनखड़ ने राज्यसभा की कार्य मंत्रणा समिति (BAC) की अध्यक्षता की। इस बैठक में सदन के नेता जेपी नड्डा और संसदीय कार्य मंत्री किरेन रिजिजू समेत ज़्यादातर सदस्य मौजूद थे। थोड़ी देर की चर्चा के बाद तय हुआ कि समिति की अगली बैठक शाम 4:30 बजे फिर से होगी।…— Jairam Ramesh (@Jairam_Ramesh) July 22, 2025👉ధన్‌ఖడ్ పక్షపాత ధోరణితో.. ఏకపక్షంగా సభను(రాజ్యసభ) నడుపుతున్నారంటూ ఆయన్ని అభిశంసించేందుకు ప్రతిపక్ష ఎంపీలు గతేడాది డిసెంబర్లో నోటీసులు ఇచ్చారు(ఆ నోటీసు తిరస్కరణకు గురైంది). ఆ ఎంపీలే ఇప్పుడు ధన్‌ఖడ్‌కు సానుభూతిగా స్టేట్మెంట్లు ఇస్తుండడం కొసమెరుపు. మరోవైపు.. బీజేపీ మాత్రం ధన్‌ఖడ్ రాజీనామా వ్యవహారానికి కాస్త దూరంగానే ఉంటోంది.👉గత ఆరు నెలలుగా ప్రభుత్వానికి, ధన్‌ఖడ్‌కి మధ్య గ్యాప్ నడుస్తున్న విషయాన్ని కొందరు ఎంపీలు ఇవాళ్టి పార్లమెంట్ సెషన్ సందర్భంగా బహిరంగంగానే చర్చించుకోవడం గమనార్హం. అయితే ప్రభుత్వం, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ మధ్య మనస్పర్థలు నివురు గప్పిన నిప్పులా కొనసాగాయని.. గత కొంతకాలంగా అవి తారాస్థాయికి చేరాయన్నది ఆ ముచ్చట్ల సారాంశం. 👉అంతేకాదు.. ఈ ఆరు నెలల కాలంలో ఉపరాష్ట్రపతిగా ధన్‌ఖడ్ చేయాల్సిన విదేశీ పర్యటనలు రద్దవుతూ వచ్చాయి. పైగా ఉపరాష్ట్రపతి హోదాలో ధన్‌ఖడ్‌కు ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య భేటీ జరిగి నెలలు కావొస్తున్నాయి(కాకుంటే రాజీనామా తర్వాత ఆయన ఆరోగ్యం బాగుండాలంటూ మోదీ ఓ ట్వీట్ మాత్రం చేశారు). ఈ పరిణామాలన్నీ ఏదో జరిగిందనే సంకేతాలనే అందిస్తున్నాయి. వీటికి తోడు బీజేపీ శ్రేణుల నుంచే కొన్ని గుసగుసలు బయటకు వచ్చి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. Shri Jagdeep Dhankhar Ji has got many opportunities to serve our country in various capacities, including as the Vice President of India. Wishing him good health.श्री जगदीप धनखड़ जी को भारत के उपराष्ट्रपति सहित कई भूमिकाओं में देश की सेवा करने का अवसर मिला है। मैं उनके उत्तम…— Narendra Modi (@narendramodi) July 22, 2025ఈ మనస్పర్థల కారణంగానే ఆయన్ని పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు మొదలయ్యాయని, కొందరు బీజేపీ నేతలు ఈ విషయమై ధన్‌ఖడ్ అప్రమత్తం చేశారని చెప్పుకుంటున్నారు. అయితే అవమానకర రీతిలో పదవి కోల్పోవడం కంటే.. రాజీనామానే బెటర్ అనుకున్నారన్నది ఆ గుసగుసల సారాంశంగా పలు జాతీయ మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి. -
ధన్‌ఖడ్ ఆరోగ్యం బాగుండాలి: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి పదవికి జగ్దీప్ ధన్‌ఖడ్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదించారు. 74 ఏళ్ల ధన్‌ఖడ్ అనారోగ్య సమస్యల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యవసానం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.మరోవైపు.. ధన్‌ఖడ్ రాజీనామాపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. జగదీప్ ధన్‌ఖడ్ మన దేశానికి వివిధ పదవుల్లో సేవలందించే అరుదైన అవకాశాలు పొందారు. ముఖ్యంగా భారత ఉపరాష్ట్రపతి హోదాలో. ఆయన ఆరోగ్యం బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని మోదీ ట్వీట్ చేశారు. Shri Jagdeep Dhankhar Ji has got many opportunities to serve our country in various capacities, including as the Vice President of India. Wishing him good health.श्री जगदीप धनखड़ जी को भारत के उपराष्ट्रपति सहित कई भूमिकाओं में देश की सेवा करने का अवसर मिला है। मैं उनके उत्तम…— Narendra Modi (@narendramodi) July 22, 2025పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం(జులై 21)న ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలిరోజు సమావేశాల్లో భాగంగా.. రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ హుషారుగానే హాజరయ్యారు. పలువురు నేతలతో సాయంత్రం దాకా తన అధికారిక కార్యాలయంలో సమావేశం కూడా అయ్యారు. అయితే రాత్రి సమయంలో.. అదీ అనూహ్యంగా రాజీనామా ప్రకటన చేశారు.ఇదీ చదవండి: ధన్‌ఖడ్ రాజీనామా-బీజేపీ రియాక్షన్ ఇదే.. -
కేంద్రంపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
-
ఆపరేషన్ సిందూర్ తో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసింది: ప్రధాని మోదీ
-
ఈ పార్లమెంటు సమావేశాలు.. విజయోత్సవాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలను జాతికి విజయోత్సవాలుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ‘‘బాంబులు, తుపాకులు అవి పుట్టించే హింసపై ఎప్పటికీ రాజ్యాంగ స్ఫూర్తిదే పై చేయి. మా పాలనలో పదేపదే నిరూపితమవుతూ వస్తున్న వాస్తవమిది’’ అని మోదీ చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌తో సహా విపక్షాలు లేవనెత్తదలచిన అన్ని అంశాలపైనా చర్చకు ప్రభుత్వం సిద్ధమంటూ సంకేతాలిచ్చారు. సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో ప్రధాని మీడియాతో మాట్లాడారు. ‘‘ఇవి దేశానికి గర్వకారణంగా నిలవనున్న సమావేశాలు. విజయో త్సవాల వంటివి. మన సాయుధ బలగాల శక్తిసామర్థ్యాలను ప్రపంచమంతా అబ్బురపాటుతో వీక్షించింది. సైన్యం 100 శాతం కచ్చితత్వంతో లక్ష్యాలను సాధించి భారత పతాకను సమున్నతంగా ఎగురవేసింది’’ అని ఆపరేషన్ సిందూర్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ‘‘ఆ ఘనతను అఖిలపక్ష బృందాలు దేశదేశాల్లో చాటాయి. ఆ పార్టీలకు, ఎంపీలకు నా అభినందనలు’’అన్నారు. సిందూర్ వేళ మేడిన్ ఇండియా ఆయుధాలు అద్భుతంగా సత్తా చాటి ప్రపంచం దృష్టిని ఆకర్షించాయని గుర్తు చేశారు.May the Monsoon Session of Parliament be productive and filled with enriching discussions that strengthen our democracy. https://t.co/Sj33JPUyHr— Narendra Modi (@narendramodi) July 21, 2025‘‘పహల్గాం ఉగ్ర దాడి ప్రపంచాన్నే షాక్‌కు గురి చేసింది. ఉగ్రవాదంపై పోరులో దేశాలన్నీ మరోసారి ఒక్కతాటిపైకి వచ్చేలా చేసింది. అంతేకాదు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కూడా మన పతాక ఇటీవలే సగర్వంగా ఎగిరింది. దేశంలో నక్సలిజం ఆనవాలు లేకుండా పోతోంది. నక్సల్ హింసతో రెడ్ జోన్‌గా మారిన అనేకానేక ప్రాంతాలు కాస్తా అభివృద్ధికి నోచుకుని హరితవర్ణం పులుముకుంటున్నాయి. కొద్దిరోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో దేశ ఆర్థికానికి ఎనలేని ఊపు లభిస్తోంది. డ్యామ్‌లు మూడింతల జలకళతో పరవళ్లు తొక్కుతున్నాయి. గత పాలకుల హయాంలో రెండంకెల్లో కొనసాగిన ద్రవ్యోల్బణం మా పాలనలో దశాబ్దకాలంగా నేలకు దిగుతోంది. వృద్ధి చుక్కలు తాకుతోంది’’అంటూ తమ సర్కారు సాధించిన ప్రగతిని వివరించారు. ‘‘పార్టీలుగా ఎవరి అజెండా వారికి ఉండొచ్చు. కానీ ఆ విభేదాలకు అతీతంగా ఎంపీలంతా సభల్లో ఒకే గళం వినిపించడం ద్వారా పార్లమెంటు సమావేశాల స్ఫూర్తిని సాకారం చేస్తారని ఆశిస్తున్నా’’ అని విపక్షాలను ఉద్దేశించి పేర్కొన్నారు. -
సిందూర్‌పై చర్చకు సై
ఆపరేషన్ సిందూర్ సహా జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన కీలకాంశాలపై పార్లమెంట్లో చర్చకు వెనుకంజ వేసే ప్రసక్తే లేదు. విపక్షాల ప్రశ్నలన్నింటికీ మేం సమాధానం ఇస్తాం. అయితే పార్టీలకు, కూటములకు వేర్వేరు సిద్ధాంతాలు ఉన్నప్పటికీ పార్లమెంట్ కార్యకలాపాలకు సహకరించాల్సిన బాధ్యత అన్ని పక్షాలపైనా ఉంది. విదేశీ పర్యటనలో ఉన్న రోజుల్లో మినహా మిగతా సమయంలో ప్రధాని మోదీ పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారు. – కిరణ్ రిజిజు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి భారత్–పాక్ మధ్య యుద్ధం ఆపేశానంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యకు దారితీసిన భద్రతా లోపాలు, బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై ప్రధాని మోదీ స్పందించాలి. పొరుగు దేశాలతో విదేశాంగ విధానం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల కష్టాలు, దేశ ఆర్థిక వ్యవస్థ, మణిపూర్ అంశాలపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్చించాలి. – గౌరవ్ గొగోయ్, కాంగ్రెస్ ఎంపీ సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఉగ్రవాదుల భరతం పట్టేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సహా కీలక అంశాలపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 21వ తేదీ వరకు కొనసాగుతాయి. పహల్గాం ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్, బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ తర్వాత జరుగుతున్న ఈ సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్ లేవనెత్తాల్సిన కీలక అంశాలపై విపక్షాలు కసరత్తు పూర్తిచేశాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యాయి. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనపై వర్షాకాల సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. నిర్మాణాత్మక చర్చలకు సహకరించాలి వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు, ఉభయ సభల్లో నిర్మాణాత్మక చర్చలు జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అధ్యక్షతన ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, అర్జున్‌రామ్ మేఘ్వాల్, మురుగన్‌తోపాటు కాంగ్రెస్ ఆర్జేడీ, జేడీ(యూ), సమాజ్‌వాదీ పార్టీ, వైఎస్సార్సీపీ, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్, టీఎంసీ, బీఆర్ఎస్, శివసేన(షిండే), ఆమ్ ఆద్మీ తదితర పార్టీల సభ్యులు హాజరయ్యారు. విపక్షాలు తమ ఎజెండాను ప్రస్తావించాయి. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, పహల్గాం ఉగ్రవాద దాడి, భారత్–పాక్ ఘర్షణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను లేవనెత్తాయి. పొరుగు దేశాలతో విదేశాంగ విధానం, తాజా పరిస్థితులపై పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల కష్టాలు, దేశ ఆర్థిక వ్యవస్థ, మణిపూర్ అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించాలని కోరాయి. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చ చేపట్టాలని డీఎంకే అభ్యర్థించింది. అఖిలపక్ష భేటీ అనంతరం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మీడియాతో మాట్లాడారు. భారత్–పాక్ మధ్య యుద్ధం ఆపేశానంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యకు దారితీసిన భద్రతా లోపాలు, బిహార్‌లో ఓట్ల జాబితా సవరణపై ప్రధాని మోదీ మాట్లాడాలని కోరినట్లు తెలిపారు.అఖిలపక్ష భేటీ నుంచి వస్తున్న కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, ఎంపీలు జైరాం రమేశ్ తదితరులు కొత్త బిల్లులు వర్షాకాల సమావేశాల్లో కేంద్రం 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. మణిపూర్ వస్తువులు, సేవల పన్ను(సవరణ) బిల్లు, జన్ విశ్వాస్(నిబంధనల సవరణ) బిల్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(సవరణ) బిల్లు, పన్నుల చట్టాలు(సవరణ) బిల్లులతో పాటు జియోహెరిటేజ్ సైట్స్, జియో–రెలిక్స్(సంరక్షణ), జాతీయ క్రీడా పాలన బిల్లు, జాతీయ డోపింగ్ నిరోధక(సవరణ) బిల్లులను ప్రవేశపెట్టనుంది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను పొడిగించడానికి ప్రభుత్వం పార్లమెంట్ ఆమోదం కోరనుంది. వీటితోపాటు పెండింగ్‌లో ఉన్న సముద్ర వస్తువుల రవాణా బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, మర్చంట్ షిప్పింగ్ బిల్లు, ఓడరేవుల బిల్లులపై చర్చించి, ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. చర్చకు వెనుకాడం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆపరేషన్ సిందూర్ సహా జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన కీలక అంశాలపై పార్లమెంట్లో చర్చకు వెనుకంజ వేసే ప్రసక్తే లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇస్తామన్నారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు ఎలాంటి అంతరాయాలు లేకుండా సజావుగా కొనసాగేందుకు అధికార, విపక్ష సభ్యులు కలిసికట్టుగా పని చేయాలన్నారు. వర్షాకాల సమావేశాలు ఫలవంతం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పార్టీలకు, కూటములకు వేర్వేరు సిద్ధాంతాలు ఉన్నప్పటికీ పార్లమెంట్ కార్యకలాపాలకు సహకరించాల్సిన బాధ్యత అన్ని పక్షాలపైనా ఉందన్నారు. ఉభయ సభల్లో మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇవ్వాలని చిన్న పార్టీల ఎంపీలు కోరారని, అందుకోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. చిన్న ఎంపీలకు తగినంత సమయం ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు మినహా మిగతా సమయంలో ప్రధాని మోదీ పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారని కిరణ్ రిజిజు వెల్లడించారు. విపక్షాలు లేవనెత్తే అంశాలపై సంబంధిత కేబినెట్ మంత్రులు సమాధానం ఇస్తారని స్పష్టంచేశారు. 17 బిల్లులు ప్రవేశపెట్టబోతున్నామని, వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. -
23 నుంచి మోదీ విదేశీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 23 నుంచి 26వ తేదీ దాకా యునైటెడ్ కింగ్డమ్(యూకే), మాల్దీవ్స్ దేశాల్లో పర్యటించనున్నారు. రెండు దేశాలతో దౌత్య, వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. మోదీ తొలుత ఈ నెల 23, 24న యూకేలో పర్యటిస్తారు. అత్యంత కీలకమైన ఇండియా–యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై సంతకం చేస్తారు. రక్షణ రంగంలో పరస్పర సహకారంపై యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో చర్చలు జరుపుతారు. అలాగే ఈ నెల 25, 26న మాల్దీవ్స్‌లో మోదీ పర్యటన కొనసాగనుంది. మాల్దీవ్స్ 60వ జాతీయ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. -
మోదీ జీ.. ఇంతకీ నిజం ఏమిటి?: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ల మధ్య ఈ మే నెలలో జరిగిన యుద్ధంలో ఐదు యుద్ధ విమానాలు కూలిపోయాయనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను కార్నర్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ. ట్రంప్ చెప్పినదాంట్లో నిజం ఏమిటి? అని ప్రశ్నించారు రాహుల్. ఆపరేషన్ సింధూర్ అంశానికి సంబంధించి దేశ ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారని రాహుల్ ట్వీట్ చేశారు.मोदी जी, 5 जहाज़ों का सच क्या है?देश को जानने का हक है! pic.twitter.com/mQeaGCz4wp— Rahul Gandhi (@RahulGandhi) July 19, 2025 కాగా, ఇరు దేశాల యుద్ధంలో ఐదు యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని ట్రంప్ చెప్పినప్పటికీ, అవి ఏ దేశానికి చెందినవో చెప్పలేదు. ఇరు దేశాల యుద్ధ విమానాలు కలిపి ఐదా.. లేక పాకిస్తాన్‌వా.. భారత్‌కు చెందినవా? అనేదే క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు దీన్ని ప్రశ్నిస్తోంది ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత జై రాం రమేశ్ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి రెండు రోజులే సమయం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్.. ఆపరేషన్ సింధూర్ వ్యవహారాన్ని ఉభయ సభల్లో ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్లే కనబడుతోంది. ట్రంప్ తాజా వ్యాఖ్యలను ఉదహరిస్తూ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జై రాం రమేశ్.. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ‘ట్రంప్ మిసైల్ దూసుకుపోతోంది. ఇప్పటికి 24 సార్లు ఒకే సందేశాన్ని ట్రంప్.. పదే పదే చెబుతూ వస్తున్నారు. "2019, సెప్టెంబర్‌లో 'హౌడీ మోడీ', 2020, ఫిబ్రవరిలో 'నమస్తే ట్రంప్' వంటి కార్యక్రమాలతో అధ్యక్షుడు ట్రంప్‌తో సంవత్సరాల తరబడి స్నేహం కలిగి ఉన్న ప్రధాని మోదీ.. గత 70 రోజులుగా ట్రంప్ ఏమి చెబుతున్నారనే దానిపై పార్లమెంట్లో స్పష్టత ఇవ్వాలి. ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించి ట్రంప్ మాట్లాడుతున్న ప్రతీ దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది’ అని జై రాం రమేశ్ ముందుగానే తాము ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తనున్నామని విషయాన్ని స్పష్టం చేశారు. -
భారత్, పాక్‌పై ట్రంప్ పిచ్చి వ్యాఖ్యలు.. నెటిజన్ల ఆగ్రహం!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నోటి దురుసుతో భారత్‌పై వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు ట్రంప్ పాత పాటే పాడారు. ఈసారి మరో అడుగు ముందుకేసి.. ఐదు జెట్లు కూలినట్టు తనకు సమాచారం ఉందని ట్రంప్ చెప్పారు. అయితే, కాల్పులు విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని ప్రధాని మోదీ స్వయంగా ట్రంప్‌తోనే చెప్పినప్పటికీ అధ్యక్షుడి వైఖరిలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం.భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తామే ఆపామని ట్రంప్ తెలిపారు. యుద్ధ సమయంలో విమానాలు కూల్చేశారని వ్యాఖ్యానించారు. ఐదు జెట్లు కూలినట్టు తనకు సమాచారం ఉందన్నారు. రెండు దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేస్తూ ఉన్నాయి. ఇరు దేశాల మధ్య జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపామన్నారు. భారత్-పాక్ మధ్య పరిస్థితి తీవ్రమవుతుండగా.. ట్రేడ్ ద్వారా సమస్యను పరిష్కరించామని చెప్పారు. ట్రేడ్ డీల్ కావాలంటే యుద్ధం ఆపాలన్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి చర్చకు వచ్చాయి.Trump just reminded India who’s boss again. He said I stopped war b/w India , Pakistan but dropped a bonus 5 Indian jets shot down ⚡️. Sorry Don it’s 6-Nill 💀 pic.twitter.com/ookpeprp9K— Awais 🐺 (@awais4226) July 19, 2025భారత్-పాక్ మధ్య కాల్పులు ఆగితే, అందుకు క్రెడిట్ తీసుకుంటున్న ట్రంప్, తన బుద్ధి మార్చుకోవడం లేదు. గతంలోనే ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన భారత ప్రధాని మోదీ.. ఈ విషయంలో అమెరికా ప్రమేయమేదీ లేదని తేల్చిచెప్పారు. ఇది రెండు దేశాల సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని, మధ్యవర్తి ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకే ఫోన్లో చెప్పానని మోదీ స్పష్టం చేశారు. తమ వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించబోదని స్పష్టం చేశారు. ఆ సమయంలో తన జోక్యమేమీ లేదని.. భారత్-పాక్ దేశాలే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని చెప్పిన ట్రంప్.. మరోసారి మాట మార్చి వ్యాఖ్యలు చేశారు. దీంతో, ట్రంప్ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌నకు మతి మరుపు ఏమైనా వచ్చిందా? అని ప్రశ్నిస్తున్నారు. -
మృగాళ్లకు అండగా తృణమూల్
దుర్గాపూర్: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని, వారు నిత్యం భయంభయంగా బతకాల్సి వస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన మృగాళ్లను ఆ పార్టీ కాపాడుతోందని ఆరోపించారు. మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్వాకం వల్ల బెంగాల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న వసూళ్ల దందా చూసి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడం లేదని చెప్పారు. ప్రధాని మోదీ శుక్రవారం బెంగాల్లో పర్యటించారు. చమురు, గ్యాస్, విద్యుత్, రైలు, రహదారులకు సంబంధించిన రూ.5,400 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా దుర్గాపూర్‌లో బహిరంగ సభలో మాట్లాడారు. కోల్‌కతా ఆసుపత్రిలో యువ వైద్యురాలిపై ఘోరంగా అత్యాచారం జరిగిందని అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వారిని నిస్సిగ్గుగా వెనకేసుకొస్తోందని ధ్వజమెత్తారు. ఆ అత్యాచార ఘటన పట్ల దేశమంతా కలవరపాటుకు గురైందని, ఇప్పటికీ కోలుకోలేదని అన్నారు. ఆ ఘటన మర్చిపోకముందే మరో కాలేజీలో మహిళపై అత్యాచారం జరిగిందని ఆక్షేపించారు. ఈ కేసులో నిందితుడికి తృణమూల్ కాంగ్రెస్‌తో సంబంధాలు ఉన్నట్లు బయటపడిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గూండా ట్యాక్స్ ‘‘బెంగాల్లో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయి. ప్రజలకు రక్షణ కల్పించడంలో, న్యాయం చేకూర్చడంలో తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. ముర్షీదాబాద్‌లో అల్లర్లు జరిగితే పోలీసులు బాధితులనే వేధించారు. బాధ్యులను వదిలేశారు. రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరుగుతుందన్న ఆశలు అడుగంటాయి. వారి ప్రాణాలకే భద్రత లేకుండాపోయింది. ఇదంతా ప్రభుత్వ నిర్వాకం కాదా? తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డబ్బుల కోసం పారిశ్రామికవేత్తలను పీడిస్తోంది. రాష్ట్రంలో ఆర్థిక ప్రగతికి అడ్డు తగులుతోంది. గూండా ట్యాక్స్‌కు భయపడి పారిశ్రామికవేత్తలు బెంగాల్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పెట్టుబడులు రావడం, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడం తృణమూల్ కాంగ్రెస్‌కు ఎంతమాత్రం ఇష్టం లేదు. బెంగాల్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని మేము సంకల్పించాం. దేశ ప్రగతికి బెంగాల్‌ను చోదక శక్తిగా మారుస్తాం’’ అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈశాన్య భారత అభివృద్ధికి ‘వికసిత్ బిహార్’ మోతిహరీ: ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించాలన్న నిర్ణయం బిహార్ గడ్డపైనే తీసుకున్నానని, అది ఎలా విజయవంతమైందో ప్రపంచం చూసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈశాన్య భారతదేశ సమగ్రాభివృద్ధికి ‘వికసిత్ బిహార్’ అత్యంత కీలకమని స్పష్టంచేశారు. రాష్ట్ర బహుముఖ ప్రగతికి కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ శుక్రవారం బిహార్‌లో పర్యటించారు. తొలుతు తూర్పు చంపారన్ జిల్లాలో రూ.7,200 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మోతిహరీ జిల్లా కేంద్రంలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘బనాయేంగే నయా బిహార్, ఫిర్ ఏక్‌బార్ ఎన్డీయే సర్కార్’ అనే నూతన నినాదం ఇచ్చారు. దీవసూళ్ల దందానిపై జనం పెద్దఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. మళ్లీ ఎన్డీయే ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని, సరికొత్త బిహార్‌ను నిర్మించుకుందామని మోదీ ఇచ్చిన పిలుపును స్వాగతించారు. బిహార్‌లో విపక్ష కాంగ్రెస్–ఆర్జేడీ కూటమిపై ప్రధానమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ఆర్జేడీ ప్రభుత్వం పేదల భూములు బలవంతంగా లాక్కుందని, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు. పేదలు, అణగారినవర్గాల పేరిట కాంగ్రెస్–ఆర్జేడీ రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. బిహార్ వెనుకబాటుతనానికి ఆ రెండు పారీ్టలే కారణమని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా యువత సంక్షేమం, అభివృద్ధి కోసం ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని మోదీ వెల్లడించారు. ఇందుకోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు ప్రకటించారు. బిహార్ సర్వతోముఖాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, గత 45 రోజుల్లో 24,000 స్వయం సహాయక సంఘాలకు రూ.1,000 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. మోతిహరీని ముంబై తరహాలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మహాత్మా గాంధీ పోరాటానికి బిహార్‌లోని చంపారన్ నూతన దిశను నిర్దేశించిందని మోదీ గుర్తుచేశారు. -
రెండు ధ్రువాలతో సమతూకం ఎలా?
అమెరికాలో కొత్త ప్రభుత్వ సమర్థతను మదింపు చేసేందుకు సాధారణంగా, అధ్య క్షుడి మొదటి 100 రోజుల పాలనను లెక్క లోకి తీసుకుంటారు. కానీ, ట్రంప్ రెండవ విడత పాలన మొదలై 180 రోజులు గడు స్తున్నా వాణిజ్య వివాదాలకు పరిష్కారం ఒక కొలిక్కి రాలేదు. ఉక్రెయిన్, గాజాలలో సైనిక కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయి. వ్యూహాత్మక భాగస్వామి అమెరికా, ముఖ్య మైన ఆర్థిక పోషక దేశం చైనాలతో సంబంధాలలో సమతూకం పాటించేందుకు ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథొని ఆల్బనీస్ జూలై నెల మధ్యలో 6 రోజుల పర్యటనపై చైనా వెళ్ళారు. దౌత్యం, వాణిజ్యంతో వ్యవహరిస్తున్న భారత దౌత్యవేత్తలు కూడా అలాంటి సందేహ డోలనే ఎదుర్కొంటున్నారు. ‘బ్రిక్స్’ శిఖ రాగ్ర సభలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆ మధ్య బ్రెజిల్ వెళ్ళారు. ఆయన భారత్‌కు తిరిగి వచ్చే మార్గ మధ్యంలో ఉన్నప్పుడే బ్రెజిల్ అధ్యక్షుడు లూల డ సిల్వా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మధ్య వాగ్వాదం నెలకొంది. వారి మధ్య మాట మాట పెరగడానికి విదేశాంగ విధానంపై అభిప్రాయ భేదాలు కారణం కాదు.బ్రెజిల్ ఆంతరంగిక వ్యవహారాలలో ట్రంప్ బాహాటంగా జోక్యం చేసుకోవ డమే తగాదాకు దారితీసింది. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జాయిర్ బొసొనారొపై విచారణకు స్వస్తి పలకాలని ట్రంప్ డిమాండ్ చేశారు. దీనిపై అమెరికా జోక్యాన్ని లూల తిరస్కరించారు. అమెరికా దండి స్తున్నట్లుగా సుంకాలు విధిస్తే తామూ ప్రతీకార చర్యలకు దిగాల్సిఉంటుందని హెచ్చరించారు. చైనాతో సవ్యంగా లేకపోయినా...ఆ విధంగా, ప్రజానీకం నేడు రెండు ధ్రువాల ప్రపంచాన్ని ఎదు ర్కొంటోంది. ‘నాటో’ దేశాల మద్దతు ఎంతవరకు లభిస్తుందో తెలియకపోయినా, వాటిని తోడు చేసుకుని అమెరికా ఒక ధ్రువంగా ఉంది. చైనా–రష్యా ఇరుసు రెండవదిగా ఉంది. ప్రచ్ఛన్న యుద్ధం నాటి స్థితితో పోలిస్తే, ఒక్కటే తేడా కనిపిస్తోంది. చైనా–అమెరికా ప్రత్యర్థులే కావచ్చు కానీ, వాణిజ్యం, సాంకేతికతల విషయంలో అవి ప్రస్తుతం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి.ప్రచ్ఛన్న యుద్ధ ప్రత్యర్థులైన సోవియట్ యూనియన్, అమెరికా మధ్య అప్పట్లో అలాంటి సంబంధాలు ఉండేవి కావు. దాంతో, బ్రెజిల్, భారత్ లాంటి ప్రవర్ధమాన దేశాలకు ఈ రెండు ధ్రువాల మధ్య సమతౌల్యం పాటించడం కష్టంగా మారుతోంది. చైనాతో మనకు సరిహద్దు వివాదం ఉండటం, మనల్ని చైనా ఒక బలమైన ప్రత్యర్థిగా చూస్తూండటం వల్ల, మన పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. ఆగస్టు 1లోగా, ఏదో ఒక అంగీకారానికి రాకపోతే, ‘ప్రతిగా ఎదురు కాగల సుంకాలను’ తప్పించుకునేందుకు అమెరికాతో ఒక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడం భారత్‌కు తక్షణ సమస్యగా ఉంది. అధ్యక్షుడు ట్రంప్ సుంకాలపై తడవకో మాట మాట్లాడుతున్నారు. ఇదంతా అనిశ్చితిని పెంచుతోంది. ‘విముక్తి దినం’గా ప్రకటించిన ఏప్రిల్ 2 నుంచి రెండు డజన్లకు పైగా పర్యాయాలు సుంకాలపై తలకిందుల ధోరణిని చూశాం. సుంకాల పేరిట అమెరికా బెదిరింపులు పరిపాటిగా మారడంతో కాబోలు,అంతర్జాతీయ మార్కెట్లు కూడా వాటిని పెద్దగా లెక్కలోకి తీసు కోవడం మానేశాయి. ‘90 రోజులలో 90 ఒప్పందాలు’ అంటూట్రంప్ చేసిన వాగ్దానం నీటిమీద రాతగా మారింది. ఒక్క వియత్నాం, బ్రిటన్లతోనే వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. చైనాతో పాక్షికంగా మాత్రమే అవగాహన కుదిరింది. వాణిజ్య ఒప్పందం కొరవడిన నేపథ్యంలో, ఆగస్టు 1 తర్వాత, అమెరికా 30% సుంకాల బెదిరింపును అమలు జరిపితే తామువిధించగల ప్రతీకార సుంకాల జాబితా సిద్ధంగా ఉందని యూరోపి యన్ యూనియన్ వెల్లడించింది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొని ఆల్బనీస్ బాటనే భారత్ కూడా అనుసరించింది. షాంఘై సహకార సంస్థ సమావేశాలలో పాల్గొనేందుకు బీజింగ్ వెళ్ళిన భారతవిదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, భారత్–చైనా సంబంధాలను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. అయితే, వాస్తవాధీన రేఖ వద్ద సేనల ఉపసంహరణ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా, పాకిస్తాన్‌కు చైనా క్రియాశీల సహాయం అందించిన సంగతి తెలిసిందే. వీటికితోడు, దలైలామా 90వ పుట్టిన రోజు ఈ సమయంలోనే వచ్చింది. దలైలామాకు క్రియాశీల మద్దతు ఇవ్వడం ద్వారా, టిబెట్‌పై తమ పట్టును తగ్గించడంలో భారత్ తోడుదొంగగా వ్యవహరిస్తోందని చైనా భావిస్తోంది. అదే సమయంలో, ట్రంప్ కల్లోలిత ప్రపంచంలో, భారతీయ మార్కెట్ ప్రాధాన్యాన్ని చైనా గ్రహించింది. పాకిస్తాన్‌కు అమెరికా స్నేహహస్తంఅమెరికాతో తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసు కునేందుకు భారత్ కడపటి ప్రయత్నాలలో ఉంది. భారతీయదృక్కోణం నుంచి చూసినప్పుడు వ్యావసాయిక, పాడిపరిశ్రమ మార్కెట్లను సంరక్షించుకోవడం ప్రాధాన్యంగా ఉంది. ఎలాన్ మస్క్ సంస్థ ‘టెస్లా’ ముంబయిలో తన మొదటి షోరూమ్ తెరవడం, సాధారణ పరిస్థితులలోనైతే, సానుకూల సంకేతంగానేఉండేది. కానీ, ఆయనకు, అధ్యక్షుడు ట్రంప్‌కి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. భారత్–అమెరికా వాణిజ్య వివాదాన్ని పరిష్క రించడంలో మాట సాయం చేయగల స్థితిలో లేనని మస్క్ చేతులు ఎత్తేయవచ్చు. భారత్ దౌత్యపరంగా పెద్ద సవాల్నే ఎదుర్కొంటోంది. అమె రికాతో పెంచిపోషించుకుంటూ వచ్చిన సన్నిహిత సంబంధాలు ఏ మేరకు ప్రతిఫలాలు చూపగలవో తెలియడం లేదు. పాకిస్తాన్‌కు అమెరికా చాస్తున్న స్నేహ హస్తమే ఇందుకు నిదర్శనం. జైలులో ఉన్న పాకిస్తాన్ తెహ్రీక్–ఏ–ఇన్సాఫ్ నాయకుడు ఇమ్రాన్ ఖాన్‌తో సయోధ్య కుదుర్చుకోవలసిందిగా పాక్ సైన్యాన్ని అమెరికా ప్రభుత్వం ముందుకు తోస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అమెరికా నిర్దేశించిన 50 రోజుల గడువు లోగా ఉక్రెయిన్‌తో రష్యా కాల్పుల విరమణకు రాకపోతే, రష్యా నుంచి చమురు కొనే అన్ని దేశాలను అమెరికా లక్ష్యం చేసుకోగల కత్తి కూడా భారత్ మెడపై వేలాడుతోంది. చైనాకు దగ్గరయ్యేందుకు ఆస్ట్రేలియా ప్రధాని చేసిన ప్రయత్నం చూసిన అమెరికా, ఆస్ట్రేలియాతో (బ్రిటన్‌తో కలుపుకొని) ఉన్న వ్యూహాత్మక త్రైపాక్షిక పొత్తును సమీక్షిస్తామని సంకేతాలుపంపుతోంది. ఆ పొత్తు ప్రకారం ఆస్ట్రేలియాకు అణు జలాంత ర్గాములు అందవలసి ఉంది. తైవాన్ విషయంలో చైనాతో సైనిక ఘర్షణ తలెత్తితే, తమకు అండగా ఉంటామంటూ హామీ ఇవ్వాలని జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలను పెంటగాన్ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఒకపక్క వివిధ దేశాలపై ఏకపక్షంగా సుంకాలు విధించు కుంటూపోతున్న అమెరికా, ఒకవేళ చైనాతో ఏదైనా ఘర్షణ తలెత్తితే, వ్యూహాత్మక మిత్ర దేశాల నుంచి క్రియాశీల సైనిక మద్దతు ఆశించడం కష్టమన్న వాస్తవాన్ని మాత్రం విస్మరిస్తోంది. అయితే, ట్రంప్ తాను మొదలెట్టిన వాణిజ్య యుద్ధానికి తానే త్వరలో ఒక పరిష్కారం కనుగొనక తప్పని స్థితిలో పడవచ్చు.ఎందుకంటే, లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎప్‌స్టైన్‌కు సంబంధించిన పత్రాలు ప్రస్తుతం అమెరికా న్యాయ శాఖ వద్ద ఉన్నాయి. ఆ నేరాలతో మరికొందరు ప్రముఖుల పేర్లు కూడా ముడిపడి ఉన్నాయి. వాటిలో ట్రంప్ పేరు కూడా ఉందని మస్క్ వెల్లడించారు. ట్రంప్ ఆ రొంపి నుంచి బయటపడే హడావిడిలో కూడా ఉన్నారు. అమెరికా నుంచి చమురు కొనుగోళ్ళను భారత్ ఇప్పటికే పెంచింది. భారత్ తమ నుంచి రక్షణ సామగ్రిని ఎక్కువ కొనుగోలు చేయాలని అమెరికా కోరుకోవడం మరో సమస్యగా ఉంది. కానీ, సైనిక పరంగా అమెరికాపై మితిమీరి ఆధారపడటం వ్యూహాత్మకంగా పెద్ద పొరపాటు అవుతుంది. ప్రస్తుత ప్రపంచ రాజకీయ–ఆర్థిక స్థితిగతులు ‘ప్రతి ఒక్కరినీ ఊహాగానాలకు లోను చేస్తు న్నాయి’ అని ఎకనామిస్ట్ మ్యాగజైన్ ఇటీవల వ్యాఖ్యానించడంలో వింతేముంది?-వ్యాసకర్త విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)-కె.సి. సింగ్ -
బిహార్: రూ.7,200 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ
మోతిహరి: త్వరలో ఎన్నికలు జరగనున్న బిహార్‌లో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పర్యటించారు. రూ.7,200 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నాలుగు కొత్త అమృత్ భారత్ రైళ్లు ప్రారంభించారు. పట్నా, దర్భంగాల్లో ఏర్పాటు చేసిన సాఫ్ట్వేర్ పార్కులను ప్రధాని ప్రారంభించారు. మోతహరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. బలహీన వర్గాల పేరిట కాంగ్రెస్, ఆర్జేడీలు రాజకీయాలు చేస్తున్నాయంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.యుపీఏ ప్రభుత్వ హయాంలో బిహార్‌కి కేవలం రూ.2 లక్షల కోట్లకు మించి మంజూరు చేయలేదని.. తాను ప్రధాని అయిన తర్వాతే బిహార్ అభివృద్ధి పథంలో నడిచిందన్నారు. యూపీఏ పాలనలో బిహార్‌పై ప్రతీకార రాజకీయాలు తప్ప ఏమీ చేయలేదని ప్రధాని విమర్శలు గుప్పించారు. కాగా, “ఇవాళ బిహార్‌కు శక్తినిచ్చే.. యువతకు అవకాశాలు కల్పించే పథకాలను ప్రారంభించడం గర్వంగా ఉంది” అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.#WATCH | Bihar | PM Narendra Modi says, "... Congress and RJD have been doing politics in the name of backward classes, but they don't even respect people outside their family... We have to save Bihar from their illicit intentions... We were guided by leaders like Chandra Mohan… pic.twitter.com/mfJKy69KFM— ANI (@ANI) July 18, 2025 . -
జగనే రైటని నిరూపిస్తున్న బాబు సర్కారు!
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సూపర్ వ్యాఖ్య చేశారు. ‘‘ఏ ప్రభుత్వంలో అయినా పోలీసులు గట్టిగా పనిచేస్తే నేరాలు చేసేవారు రాష్ట్రం వదలివెళ్లిపోతారు..కానీ ఏపీలో పోలీస్ అధికారులు రాష్ట్రం విడిచిపోతున్నారు..’’ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అరాచక పరిస్థితికి ఇది దర్పణం పడుతుంది. జగన్ బుధవారం వివిధ అంశాలపై మీడియాతో మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ తీరుతెన్నులు, సూపర్ సిక్స్‌సహా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టో అమలు కాని వైనం, ప్రజాస్వామ్యానికి చంద్రబాబు ప్రభుత్వం తిలోదకాలు ఇస్తున్న తీరులపై సాకల్యంగా మాట్లాడారు. వాటిలో ఈ కామెంట్ చాలా అర్ధవంతంగా ఉందని చెప్పాలి. ఏపీలో పలువురు సీనియర్ పోలీసు అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. కొందరైతే రాష్ట్రం నుంచి ఎలాగొలా బయటపడి కేంద్రానికి వెళదామనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసీ ఇవ్వడం లేదు. దాంతో ఈ చికాకులు తట్టుకోవడం ఇష్టం లేక కొందరు వేరే మార్గాలు వెతుక్కుంటున్నారు. సిద్దార్ధ్ కౌశల్ అనే యువ అధికారి రాష్ట్రంలో పనిచేయడం ఇష్టం లేక ఉద్యోగానికి రాజీనామా చేశారని వార్తలు వచ్చాయి. ఇది ఏపీ పరువు తీసేదిగా ఉంది. మరికొందరు అధికారులను పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్న వైనం ఉండనే ఉంది. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన అభియోగాల మీద దర్యాప్తు చేసి అనేక విషయాలు వెల్లడించి కేసులు పెట్టిన అధికారులు కొంతమందిని ఏదో సాకుతో సస్పెండ్ చేశారు. పీఎస్ఆర్ ఆంజనేయులు అనే డీజీ స్థాయి అధికారిని ఒక కేసులో అరెస్టు చేశారు. ఇవన్ని చర్చనీయాంశాలుగా ఉన్న తరుణంలో జగన్ మీడియా ముఖంగా మరింత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. డీఐజీ స్థాయి అధికారులు కొందరు మాఫియా మాదిరి మారారని, ప్రభుత్వంలోని పెద్దల కోసం కొంతమంది సీఐల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తన హయాంలో ప్రజలకు ఉపయోగపడే స్పందన వంటి కార్యక్రమాలు తీసుకువచ్చి పోలీసు శాఖకు మంచిపేరు తెస్తే, ఇప్పుడు వారితో అరాచకాలు చేయిస్తున్నారని విమర్శించారు. వైసీపీకి చెందిన వారితోపాటు జర్నలిస్టులను కూడా వదలకుండా ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు పెట్టి వేదిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా పలువురి పేర్లను ప్రస్తావించారు. గుడివాడలో జెడ్పీ ఛైర్పర్సన్ హారికపై టీడీపీ గూడాలు దాడి చేస్తే కేసులు పెట్టకపోగా, వాహనంలో వెనుక సీటులో ఉన్న హరిక భర్త రాముపై కేసు పెడతారా? అని ప్రశ్నించారు. మాజీమంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడిచేసి విధ్వంసం సృష్టిస్తే కనీసం చర్య తీసుకోరా? అని ప్రశ్నించారు. వీటిపై అటు ప్రభుత్వ పెద్దలుకాని, ఇటు పోలీసు అధికారులూ వివరణ ఇవ్వలేకపోతున్నారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యేని తన ఇంటికి వెళ్లనివ్వడం లేదని, ఇదేమి పోలీసు వ్యవస్థ అని ఆయన ప్రశ్నించారు. నిజంగానే ఏ పోలీస్ వ్యవస్థకైనా, ప్రభుత్వానికైనా ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఉంటుందా? అన్నదానిపై అంతా ఆలోచిస్తున్నారు. ఎవరో ఒకరి వాంగ్మూలం తీసుకోవడం, కేసు పెట్టడం, అక్రమ అరెస్టులు చేయడం నిత్యకృత్యమైందని, అవకాశం వస్తే చంద్రబాబు సర్కార్ ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా లపై కూడా కేసులు పెట్టగలదని జగన్ విమర్శించారు.ఈ సందర్భంగా 2002లో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ జరిగిన మత కలహాలపై ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు గుర్తుకొస్తాయి. మోడీ హైదరాబాద్‌కు రానివ్వనని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 2019లో ప్రధాని మోడీని కూడా చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. వ్యక్తిగతంగా నిందించారు. కానీ 2024 నాటికి ఎలాగొలా బతిమలాడుకుని మళ్లీ వారితోనే పొత్తుపెట్టుకున్నారు. మీడియా సమావేశంలో జగన్ ఇంకో ఘాటు వ్యాఖ్య చేశారు. మూడేళ్లు కళ్లు మూసుకుంటే వచ్చేది తమ ప్రభుత్వమేనని అప్పుడు తమ పార్టీ వారు ఇదే సంస్కృతిని అనుసరిస్తే టీడీపీ వారి పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం జగన్ ఇలా మాట్లాడుతున్నప్పుడు కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నా, కొద్ది కాలానికే మళ్లీ యథాప్రకారం రెడ్ బుక్ పాలనను కొనసాగిస్తోంది. దానివల్ల దేశ వ్యాప్తంగా ఏపీ ఇమేజీ దెబ్బతింటోంది. వైసీపీని అణచివేస్తే తామే ఎల్లకాలం పాలించవచ్చన్న భ్రమతో చంద్రబాబు ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందనిపిస్తుంది. కాని చరిత్రలో ప్రత్యేకించి ప్రజాస్వామ్య వ్యవస్థలో అది సాధ్యం కాదన్న సంగతి పలుమార్లు రుజువైనా అధికారంలో ఉన్నవారు భ్రమలలో బతుకుంటారనుకోవాలి. ఏపీలో ప్రతిపక్షంగా ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే ఉందని, ప్రజల పక్షాన తాము పని చేస్తున్నామని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చిన హామీలను తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నందునే ప్రభుత్వం భయపడుతోందని జగన్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తమ సమస్యలు తీర్చుతారన్న నమ్మకం లేకే జనం ఆయన వద్దకు వెళ్లడం లేదని కూడా జగన్ వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో చంద్రబాబు, లోకేశ్ పర్యటనలలో ఆశించిన స్థాయిలో ప్రజలు కనిపించడం లేదని అంటారు. అదే జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇక కూటమి హామీల గురించి ప్రశ్నిస్తూ, ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని ప్రకటించిన రూ.18 వేల సంగతి ఏమిటి? ఏమైంది? నిరుద్యోగ భృతి నెలకు రూ.మూడు వేలు ఎందుకు ఇవ్వడం లేదు? రైతులకు ఇస్తామన్న రూ.20 వేల మాట ఏమిటి? మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఏమి చేశారు? ఎన్నికలకు ముందేమో రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్లవచ్చని అన్నారని, ప్రస్తుతం మాట మార్చి జిల్లా పరిధి అంటున్నారని జగన్ ఎద్దేవ చేశారు. ఏభై ఏళ్లకే ఫించన్ హామీతో సహా 143 హామీల మాటేమిటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఎంతమేర ఎగవేసింది, లెక్కలతో సహా ప్రజలకు వివరిస్తుంటే తట్టుకోలేకపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. సహజమే కదా! ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలను పదే, పదే గుర్తు చేస్తే వారు భరించగలుగుతారా? ప్రజాస్వామ్య బద్దంగా ఆలోచిస్తే ఏ పార్టీ వారి కార్యక్రమాలకు అడ్డు తగలరు. కాని చంద్రబాబు ప్రభుత్వం పూర్తి నియంతృత్వంగా వ్యవహరిస్తూ వైసీపీ సభలు, సమావేశాలు సరిగా జరగకుండా చూడడానికి యత్నిస్తోంది. ఇవన్ని భవిష్యత్తులో చెడ్డ సంప్రదాయాలుగా మారతాయి. జగన్ దానినే ఒకటికి రెండుసార్లు వివరిస్తున్నారు. ఒక వైపు హామీలు సజావుగా అమలు చేయకుండా, మరో వైపు కరెంటు ఛార్జీల రూపేణా సుమారు రూ.18 వేల కోట్ల భారం మోపారని జగన్ ధ్వజమెత్తారు. దీనికి ప్రభుత్వం వద్ద సమాధానం లేదనే చెప్పాలి. ఎన్నికలకు ముందు చంద్రబాబు పదే,పదే తాము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని కూడా ఊరించారు. తీరా పవర్ వచ్చాక ప్రజలు వాడుకునే పవర్ ఛార్జీలు మాత్రం ఇబ్బడిముబ్బడి అయ్యాయి. ఏది ఏమైనా జగన్ వేసిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేకే చంద్రబాబు సర్కార్ తీవ్ర అసహనానికి గురి అవుతోంది. తమది మంచి ప్రభుత్వమని ప్రచారం చేసుకోవాలన్నది చంద్రబాబు లక్ష్యమైతే, ఇది మంచి ప్రభుత్వం కాదని, మాట మీద నిలబడే ప్రభుత్వం కాదని జగన్ పదే,పదే రుజువు చేస్తున్నారు.అదే అసలు సమస్య.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నేడు బెంగాల్, బిహార్‌లో ప్రధాని పర్యటన
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో నేడు ప్రధాని మోదీ పర్యటించి రూ.5,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్ పట్టణంలో బీజేపీ చేపట్టిన భారీ ర్యాలీలోనూ ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్–మే కాలంలో పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికలున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈనెల 21వ తేదీన కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో అమరవీరుల దినోత్సవ ర్యాలీ జరగనున్న నేపథ్యంలో అంతకుముందే మోదీ రాష్ట్రంలో పర్యటిస్తుండటం గమనార్హం. ‘‘బిహార్ నుంచి ప్రధాని మోదీ శుక్రవారం దుర్గాపూర్‌కు చేరుకుంటారు. తొలుత వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ప్రాజెక్టుల కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. తర్వాత పార్టీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు’’అని బెంగాల్ బీజేపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. పశ్చిమబెంగాల్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా సమీర్ భట్రాచార్యను బీజేపీ అధిష్టానం నియమించాక రాష్ట్రానికి మోదీ రావడం ఇదే తొలిసారి. త్వరలో ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో టీఎంసీ అధికారికంగా నిర్వహించే చివరి అమరవీరుల దినోత్సవం ఇదేకావడంతో ఈ కార్యక్రమంలోనే టీఎంసీ తన ఎన్నికల అజెండాను ప్రకటించే వీలుందని తెలుస్తోంది. ఓటర్లను ఆకర్షించేందుకు కొత్త పథకాలనూ మమతా బెనర్జీ ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలో అంతకుముందే ఈ తరహా హామీలను శుక్రవారం జరగబోయే బహిరంగ సభలో మోదీ ప్రకటిస్తారని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. రూ.1,950 కోట్లతో బీపీసీఎల్ ప్రాజెక్ట్ రూ.1,950 కోట్లతో చేపట్టనున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్)వారి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. దుర్గాపూర్–హల్దియా గ్యాస్ పైప్‌లైన్‌లోని 132 కిలోమీటర్ల దుర్గాపూర్–కోల్‌కతా సెక్షన్‌ను మోదీ శుక్రవారం జాతికి అంకితంచేయనున్నారు. పీఎం ఉర్జా గంగా ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.1,190 కోట్లతో దీనిని పూర్తిచేశారు. పూర్బ బర్ధమాన్, హూగ్లీ, నదియా జిల్లాల్లో లక్షలాది కుటుంబాలకు సహజవాయువు సరఫరాను సుసాధ్యంచేయడంతోపాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధికి ఈ ప్రాజెక్ట్ బాటలు వేస్తోంది.బిహార్‌లోనూ మోదీ పర్యటనశుక్రవారం బిహార్‌లోనూ మోదీ పర్యటించనున్నారు. రూ.7,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిచనున్నా రు. ఈస్ట్ చంపారన్ జిల్లాలోని మోతిహరీ పట్టణంలోని గాంధీ మైదాన్‌లో భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. ఈ సభకు 5,00,000 మంది హాజరవుతారని అంచనా. అందుకు తగ్గట్లు భారీ ఏర్పాట్లుచేస్తున్నట్లు జిల్లా మేజి్రస్టేట్ సౌరభ్ జోర్వాల్ చెప్పారు. రూ.4,079 కోట్లతో పూర్తిచేసిన దర్భాంగా– నార్కాటియాగంజ్ 256 కిలోమీటర్ల రైల్వేలైన్ డబ్లింగ్‌ను మోదీ జాతికి అంకితంచేయనున్నారు. -
వచ్చే నెలలో మోదీ చైనా పర్యటన!
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ వచ్చే నెలలో చైనాలో పర్యటించబోతున్నారు. ఆగస్టు 31, సెపె్టంబర్ 1వ తేదీల్లో చైనాలోని తియాంజిన్ నగరంలో జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారని సమాచారం. 2020 జూన్‌లో జరిగిన భారత్, చైనా జవాన్ల భీకర ఘర్షణ తర్వాత మోదీ చైనాకు వెళ్తుండడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఆయన చివరిసారిగా 2019లో చైనాలో పర్యటించారు. గల్వాన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి. సంబంధాలు పునరుద్ధరించుకోవాలని ఇరుదేశాలు భావిస్తున్నాయి. ఈ విషయంలో మోదీ చైనా పర్యటన కీలకమైన ముందడుగు అవుతుందని దౌత్య నిపుణులు అంచనా వేస్తున్నారు. మోదీ చైనా పర్యటన సందర్భంగా చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. చైనాలో ఎస్సీఓ సదస్సు నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా సభ్యదేశాల అధినేలతో మోదీ భేటీ అవుతారు. చైనా పర్యటన కంటే ముందు ప్రధానమంత్రి జపాన్‌లో పర్యటిస్తారని సమాచారం. మోదీ ప్రధానమంత్రి హోదాలో ఇప్పటిదాకా ఐదు సార్లు చైనాలో పర్యటించారు. దేశ విదేశాల్లో షీ జిన్‌పింగ్‌తో 18 సార్లు సమావేశమయ్యారు. మరోవైపు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ మంగళవారం చైనా అధినేత జిన్‌పింగ్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. భారత్–చైనా సంబంధాలపై వారు చర్చించారు. -
రైతన్నల సంక్షేమానికి ధన్–ధాన్య కృషి యోజన
న్యూఢిల్లీ: దేశంలో రైతన్నల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన’కు ఆమోద ముద్రవేసింది. రూ.24,000 కోట్లతో రాబోయే ఆరేళ్లపాటు దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు. పంటల ఉత్పత్తిని పెంచడమే పథకం లక్ష్యం. దీంతో 1.7 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమైంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన’ను ఈ ఏడాది అక్టోబర్‌లో రబీ సీజన్ నుంచే అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మూడు సూచికల ఆధారంగా ఎంపిక ధన్–ధాన్య కృషి యోజన అమలుకు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. శిక్షణ, అవగాహన కార్యక్రమాలు ఆగస్టులు ప్రారంభమవుతాయని చెప్పారు. 100 జిల్లాల్లో పంటల సాగు, ఉత్పత్తిపాటు గ్రామ స్థాయిలో పంటల నిల్వ సామర్థ్యాన్ని పెంచడం పథకం ఉద్దేశమని వివరించారు. పొలాలకు నీటి సరఫరాను మెరుగుపర్చడం, రైతులకు దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు ఇవ్వడం ఇందులో భాగమని అన్నారు. పంటల ఉత్పాదకత తక్కువగా ఉండటం, అన్ని రుతువుల్లోనూ పంటలు సాగు పెద్దగా లేకపోవడం, రుణ లభ్యత అత్యంత తక్కువగా ఉండటం అనే మూడు కీలక సూచికల ఆధారంగా 100 జిల్లాలను గుర్తిస్తామని స్పష్టంచేశారు. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక జిల్లాను ఎంపిక చేస్తామన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి పెంచడానికి చర్యలు ప్రస్తుతం అమల్లో ఉన్న 11 శాఖలకు సంబంధించిన 36 కేంద్ర పథకాలు, రాష్ట్ర పథకాల సమ్మేళనంతోపాటు ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో ‘ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన’ను అమలు చేయనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెప్పారు. కేబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు తెలియజేశారు. ఇంధన పరివర్తన ప్రయాణంలో కీలకమైన మైలురాయికి చేరుకున్నట్లు చెప్పారు. శిలాజేతర ఇంధన వనరుల నుంచే 50 శాతం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని, నిర్దేశిత గడువు కంటే ఐదేళ్ల ముందే ఈ ఘనత సాధించామని అన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని మరింత పెంచడానికి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రభుత్వ రంగంలోని ఎన్టీపీసీ పెట్టుబడుల పరిమితిని రూ.20,000 కోట్లకు పెంచినట్లు చెప్పారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో రూ.7,000 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్(ఎన్ఎల్సీఐఎల్)కు అనుమతి ఇచి్చనట్లు వివరించారు. శుభాంశు శుక్లాకు అభినందనలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) వెళ్లి, క్షేమంగా తిరిగివచి్చన భారత వ్యోమగామి శుభాంశు శుక్లాను అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఒక తీర్మానం ఆమోదించారు. భారత అంతరిక్ష కార్యక్రమాల్లో ఇదొక నూతన అధ్యాయమని ప్రశంసించారు. శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర సఫలం కావడం మన దేశానికి గర్వకారణమని తీర్మానంలో పేర్కొన్నారు. -
కోట శ్రీనివాసరావు మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం
న్యూఢిల్లీ: టాలీవుడ్ ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావు మరణం బాధాకరమని, ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞగా ఆయన గుర్తిండిపోతారని మోదీ కొనియాడారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘కోట శ్రీనివాసరావు గారి మరణం బాధాకరం. ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు గుర్తుండిపోతారు. తరతరాలుగా ప్రేక్షకులను తన అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు మరియు పేదలు మరియు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి కృషి చేశారు. ఆయన కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు నా సంతాపం. ఓం శాంతి.’ అని ‘ఎక్స్’ ఖాతా ద్వారా సంతాపం తెలిపారు.శ్రీ కోట శ్రీనివాసరావు గారి మరణం బాధాకరం. ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు గుర్తుండిపోతారు. తరతరాలుగా ప్రేక్షకులను తన అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు మరియు పేదలు మరియు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి కృషి చేశారు. ఆయన…— Narendra Modi (@narendramodi) July 13, 2025 ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నటుడుప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మరణం బాధాకరం. తన అద్భుతమైన నటనా ప్రతిభతో కోట ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన సినిమాకు చేసిన సేవలకు గాను ఆయనకు 2015లో పద్మశ్రీ అవార్డు లభించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిన్నా’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు.Deeply saddened by the demise of illustrious film personality Shri Kota Srinivasa Rao Garu. Admired for his phenomenal acting talent, Shri Kota Srinivasa Rao Garu made his place in people's hearts and won honors for his devotion to uplifting the poor. He was also conferred the…— Amit Shah (@AmitShah) July 13, 2025 ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి -
మోహన్ భాగవత్ (ఆరెస్సెస్ చీఫ్) రాయని డైరీ
శ్రీ మోదీజీకి, నాకు ఈ ఏడాదితో 75 నిండుతాయి. నేను ఆయన కన్నా ఓ ఆరు రోజుల ముందు డెబ్బై ఐదును దాటేస్తాను. డెబ్బై ఐదేళ్లు పూర్తయిన వాళ్లు పదవి నుంచి హుందాగా తప్పుకుని, తర్వాతి వాళ్లకు సగౌరవంగా దారివ్వాలనేమీ ఆరెస్సెస్‌లో రూలు లేదు, రాజ్యాంగమూ లేదు కనుక, రిటైర్మెంట్ ప్లాన్ల గురించి చింతపడే అవసరం డెబ్బై ఐదు దాటిన ఆరెస్సెస్ చీఫ్‌లకు ఏ రోజూ ఉండదు. ‘ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్’ అంటారు! ఆరెస్సెస్‌లో ఏజ్ అసలు నంబరే కాదు. బాలాసాహెబ్ దేవరస్ డెబ్బై ఐదు దాటాక కూడా మూడేళ్లు ఆరెస్సెస్ చీఫ్‌గా ఉన్నారు. రజ్జూ భయ్యా డెబ్బై ఐదు దాటాక కూడా ఐదేళ్లు చీఫ్‌గా ఉన్నారు. కేఎస్ సుదర్శన్ డెబ్బై ఐదు దాటాక కూడా మూడేళ్లు చీఫ్‌గా ఉన్నారు. బీజేపీలో కూడా ఈ డెబ్బై ఐదు అన్నది అసలు ఒక నంబరే కాకపోయేది. కానీ శ్రీ మోదీజీ వచ్చి అత్యవసరంగా దానికొక నంబర్ హోదాను కల్పించారు. డెబ్బై ఐదు దాటిన అద్వానీని, మురళీ మనోహర్ జోషిని, జశ్వంత్ సింగ్‌ని మార్గదర్శకులుగా మార్చి, రాజకీయాల నుంచి వీడ్కోలు ఇప్పించారు. డెబ్బై ఐదు దాటిన ఎవరికైనా ‘‘నో టిక్కెట్’’ అన్నారు. డెబ్బై ఐదు దాటాయని గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్‌ను మధ్యలోనే కుర్చీలోంచి లేపేశారు. ఇప్పుడా డెబ్బై ఐదు అటు తిరిగి ఇటు తిరిగి శ్రీ మోదీజీ వైపే ఒక గ్రహ శకలంలా రాబోతోంది. ఆ గ్రహ శకలం ఆయన్ని ఢీ కొంటుందా, లేక ఆయనే ఆ గ్రహ శకలాన్ని ఢీ కొంటారా అన్నది సెప్టెంబర్ 17న కానీ తెలీదు. ఆ రోజు శ్రీ మోదీజీ బర్త్ డే.‘‘డెబ్బై ఐదు అన్నది మోదీజీ నిర్ణయమే తప్ప, ఆయన పెట్టిన నియమం కాదు’’ అని అమిత్ షా ఎప్పటికప్పుడు పార్టీని, ప్రతిపక్షాలను నెట్టుకొస్తున్నారు. అందుకు ఆయనను అభినందించాలి.ఆరెస్సెస్ వందేళ్ల వేడుకలకు మార్చిలో శ్రీ మోదీజీ నాగపుర్ వచ్చినప్పుడు ఆయన ఎంతో భావోద్వేగంతో కనిపించారు. ఆరెస్సెస్‌ను ఒక పెద్ద మర్రిచెట్టుతో పోల్చారు.ఆరెస్సెస్ కూడా శ్రీ మోదీజీని చూసి అదే స్థాయిలో భావోద్వేగానికి గురైంది. ముఖ్యంగా నేను గురయ్యాను. పదవిలో ఉండగా ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని శ్రీ మోదీజీ! అటల్జీ ఓడిపోయి, బీజేపీ నిర్వేదంలో మునిగి ఉన్నప్పుడు, పార్టీకి ప్రధాని అభ్యర్థిగా నేను చేసిన ఎంపికే శ్రీ నరేంద్ర మోదీజీ. నేను నాటిన మహా మర్రి ఆయన.శ్రీ మోదీజీ నాగపుర్ వచ్చి ఢిల్లీ వెళ్లిపోగానే ఇక్కడ ముంబైలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మొదలు పెట్టేశారు! ‘‘డెబ్బై ఐదు నిండాక కూడా ప్రధానిగా కొనసాగేందుకు పర్మిషన్ కోసం మోదీ నాగపుర్ వచ్చి, మోహన్ భాగవత్‌ను కలిసి వెళ్లారు’’ అని!!నిజానికి శ్రీ మోదీజీ, నేను ఆ రోజు మాట్లాడుకున్నది భారత స్వాతంత్య్ర దినోత్సవానికి 2047లో రానున్న వందేళ్ల గురించే కానీ, 2025లో భారత ప్రధానికి నిండనున్న డెబ్బై ఐదేళ్ల గురించి కాదు. ఆరెస్సెస్ సిద్ధాంత కర్త మోరోపంత్ పింగ్లే అనేవారు... డెబ్బై ఐదు దాటాయని మీకెవరైనా శాలువా కప్పితే దానర్థం మీరిక విశ్రాంతి తీసుకోవాలనీ, కొత్తవారికి అవకాశం ఇవ్వాలనీ! పింగ్లేకి డెడికేట్ చేసిన ఒక సభలో మొన్న నేను ఈ మాట గుర్తు చేసుకున్నప్పుడు, వెంటనే కాంగ్రెస్ నా మాటను బంతిలా క్యాచ్ పట్టేసింది. ‘‘చూశారా, మోదీని దిగిపొమ్మని మోహన్ భాగవత్ ఎంత సంకేతంగా చెబు తున్నారో...’’ అని ప్రచారం మొదలు పెట్టింది. అదే రోజు వేరొక సభలో అమిత్ షా – తను రిటైర్ అయ్యాక వేదాలు, ఉపనిషత్తులలో పడిపోతానని, ప్రకృతి వ్యవసాయం చేస్తానని అన్నారు! సహకార సంఘాల మహిళలతో మాట్లాడే సందర్భంలో ఆయన అలా అన్నారు. నేనైనా, అమిత్ షా అయినా సందర్భాన్ని బట్టే మాట్లాడాం. అయితే మా రెండు సందర్భాలూ... ఏ మాత్రం సమయం,సందర్భం కానీ టైమ్‌లో వచ్చిపడ్డాయంతే! -
ముదురుతున్న భాషా యుద్ధం
-
యువతే మన అసలైన శక్తి
సాక్షి, న్యూఢిల్లీ: యువత సాధికారతకు, దేశ నిర్మాణంలో వారి భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద యువశక్తి, అతిపెద్ద ప్రజాస్వామ్యం మన దేశానికి ఉన్నాయని, ఇవే మనకు అసలైన బలం అని తెలిపారు. యువశక్తి దేశానికి అత్యంత విలువైన మూలధనమని స్పష్టం చేశారు. శనివారం దేశవ్యాప్తంగా 47 నగరాల్లో నిర్వహించిన రోజ్‌గార్ మేళాల్లో ప్రధాని మోదీ వివిధ సంస్థల్లో ఉద్యోగాలు పొందిన యువతకు 51 వేలకు పైగా నియామక పత్రాలు పంపిణీ చేశారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారిని ఉద్దేశించి ప్రసంగించారు. పారదర్శకమైన నియామక ప్రక్రియకు పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని లక్షలాది మంది యువత రోజ్‌గార్ మేళాల ఉద్యోగాలు పొందారని, నేడు జాతి నిర్మాణంలో వారంతా పాలుపంచుకుంటున్నారని హర్షం వ్యక్తంచేశారు. గత 11 ఏళ్లుగా దేశం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి సాధిస్తోందని వ్యాఖ్యానించారు. దేశానికి సేవ చేయడమే ఉమ్మడి లక్ష్యం రోజ్‌గార్ మేళాలు సద్వినియోగం చేసుకొని, కొలువులు పొందిన యువతీ యువకులు రాబోయే రోజుల్లో దేశ అభివృద్ధి వేగాన్ని మరింత వేగవంతం చేస్తారని ప్రధాని మోదీ వివరించారు. కొందరు దేశాన్ని రక్షిస్తారని, మరికొందరు ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’లక్ష్యానికి నిజమైన సైనికులుగా మారతారని పేర్కొన్నారు. యువత వేర్వేరు విభాగాల్లో నియమితులైనప్పటికీ దేశానికి సేవ చేయడమే వారి ఉమ్మడి లక్ష్యమని ఉద్ఘాటించారు. ‘పౌరులే ప్రథమం’అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పుడు సిఫార్సులు లేదా లంచం లేకుండా, సామర్థ్యం ఆధారంగా మాత్రమే పొందవచ్చనే విశ్వాసాన్ని రోజ్‌గార్ మేళాలు సృష్టించాయని చెప్పారు. The Rozgar Mela reflects our Government’s commitment to empowering the Yuva Shakti and making them catalysts in building a Viksit Bharat. https://t.co/2k3WDTVnJc— Narendra Modi (@narendramodi) July 12, 2025ఉద్యోగాల స్వభావం మారుతోంది ప్రస్తుత శతాబ్దంలో ఉద్యోగాల స్వభావం వేగంగా మారుతోందని, ఈ క్రమంలోనే స్టార్టప్ కంపెనీలు, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని మోదీ చెప్పారు. ఇవన్నీ యువత గొప్ప ఆశయాలతో ముందుకు రావడానికి దోహదం చేస్తున్నాయని, ఈ కొత్త తరంపై తనకు ఎంతో విశ్వాసం ఉందన్నారు. యువత కోసం ప్రైవేట్ రంగంలో నూతన ఉపాధి అవకాశాల సృష్టికి ఎంతగానో కృషి చేస్తున్నామని వెల్లడించారు. మరోవైపు రక్షణ తయారీ రంగంలో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతోందని, రూ.1.25 లక్షల కోట్లకుపైగా ఉత్పత్తిని సాధించిందని గుర్తుచేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద రైలింజన్ తయారీ కేంద్రంగా భారత్ ఆవిర్భవించిందని వెల్లడించారు. రైలింజన్లు, రైలు కోచ్‌లు, మెట్రో కోచ్‌ల ఎగుమతిలో భారత్ పురోగతి సాధిస్తోందన్నారు. ఇప్పటికే 1.5 కోట్ల ‘లఖ్పతి దీదీలు’ ‘నమో డ్రోన్ దీదీ’కార్యక్రమం గ్రామీణ మహిళలకు డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇచ్చి, సాధికారత కల్పించిందని ప్రధానమంత్రి తెలిపారు. 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారి దీదీలుగా మార్చే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని, ఇప్పటికే 1.5 కోట్ల మంది మహిళలు ‘లఖ్పతి దీదీ’లుగా సాధికారత సాధించారని వివరించారు. -
‘మోదీజీ.. అలాంటి దేశాలకు వెళ్లడమెందుకు?.. ఇక అవార్డులా?’
ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీ.. ఏయే దేశాలకు వెళ్తున్నారో ఆ దేవుడికే తెలియాలి. కేవలం పది వేల మంది జనాభా ఉన్న దేశాల్లో మోదీ పర్యటించం ఏంటి? అని మాన్ విమర్శించారు. ఈ క్రమంలో సీఎం మాన్ వ్యాఖ్యలపై భారత విదేశాంగశాఖ మండిపడింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా పూర్తిగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం ఏంటని ప్రశ్నించింది.ఇటీవల ప్రధాని మోదీ.. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆయా దేశాల పార్లమెంట్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ పర్యటనలపై తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. ఓ కార్యక్రమంలో సీఎం మాన్ మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ.. చిన్న చిన్న దేశాలకు సైతం వెళ్తున్నారు. ఘనా అని ఎక్కడికో వెళ్లారు. స్వదేశానికి తిరిగివస్తున్న ఆయనకు స్వాగతం. ప్రధాని ఏయే దేశాలకు వెళ్తున్నారో ఆ దేవుడికే తెలియాలి. 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో మన ప్రధాని ఉండరు. కానీ, పది వేల మంది జనాభా ఉన్న దేశాలను మాత్రం సందర్శిస్తున్నారు. అక్కడ ఆయనకు అత్యున్నత అవార్డులు కూడా అందుతున్నాయి’ అని వ్యాఖ్యలు చేశారు.#Punjab CM Bhagwant Mann makes Fun of PM Modiਭਗਵੰਤ ਮਾਨ ਨੇ ਮੋਦੀ ਫਿਰ ਮਜ਼ਾਕ ਉਡਾਇਆ#Punjab CM Doin'it Again !CM Bhagwant Mann makes Fun of PM Modi foreign trips & also asks the Journos now you will ask the questions of Modi also from me. Mann says he didn't do 1 PC in 11 yrs, I… pic.twitter.com/tqmpoyUzt4— Punjab Spectrum (@PunjabSpectrum) July 10, 2025ఈ నేపథ్యంలో సీఎం మాన్ వ్యాఖ్యలపై భారత విదేశాంగశాఖ మండిపడింది. ప్రధాని విదేశీ పర్యటనలపై రాష్ట్రంలోని ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చాయని మాన్ పేరును ప్రస్తావించకుండా పేర్కొంది. అవి పూర్తిగా బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని తెలిపింది. ఈ వ్యాఖ్యలు వారి స్థాయిని తగ్గించేవని మండిపడింది. భారత్‌తో స్నేహపూర్వకంగా మెలిగే దేశాలను తక్కువ చేసి మాట్లాడటం సబబు కాదని పేర్కొంది.కాంగ్రెస్ కౌంటర్..మరోవైపు.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై కాంగ్రెస్ నేతలు సైతం విమర్శిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్.. ప్రధాని మరో విదేశీ పర్యటనకు వెళ్లేలోపు ఓ మూడు వారాలు మన దేశంలో ఉంటారేమో! ఇప్పుడైనా మణిపూర్ వెళ్లడానికి ఆయనకు తీరిక దొరుకుతుందో, లేదో అని ఆయన ఎద్దేవా చేశారు. ఇక, మణిపూర్ విషయమై.. ఇప్పటికే కాంగ్రెస్.. మోదీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. -
మా చరిత్రను తొలగిస్తే ఇక మేమెవరం?: ప్రధాని మోదీకి కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్: భారతదేశ చిత్రపటం నుంచి తెలంగాణను తొలగించడం ఏంటని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మాధవ్ బహుమతిగా ఇచ్చిన మ్యాపులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని మాత్రమే చూపించడం దారుణమన్నారు కేటీఆర్. ఇలా తమ చరిత్రను తొలగిస్తే ఇక మేమెవరం? అని నేరుగా ప్రధాని మోదీకే ట్వీట్ చేశారు కేటీఆర్. తెలంగాణ అస్తిత్వాన్ని భౌగోళిక గుర్తింపుని గుర్తించకపోవడం బీజేపీ అధికారిక విధానమా? అని ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు కేటీఆర్. ఈ మేరకు పలు పశ్నలు సంధించారే కేటీఆర్. ‘దశాబ్దాలపాటు తెలంగాణ సాంస్కృతిక గుర్తింపు కోసం, చరిత్రలో తమకు సరైన చోటు దక్కడం కోసం, ప్రత్యేక భౌగోళిక గుర్తింపు, ప్రత్యేక రాష్ట్రం కోసం ఎనలేని పోరాటాలు చేసింది తెలంగాణ గడ్డ. అయితే మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మా సాంస్కృతిక గుర్తింపుని అస్తిత్వాన్ని ప్రశ్నార్ధకం చేసేలా భారతదేశ చిత్రపటాన్ని ఉపయోగించారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ బహుమతిగా ఇచ్చిన మ్యాపులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని మాత్రమే చూపించడం దారుణం. తెలంగాణ రాష్ట్రం అస్తిత్వాన్ని లెక్కచేయకుండా చేసిన చర్య మమ్మల్ని తీవ్రంగా బాధించింది. ఇది పూర్తిగా అనుచితమైంది. భారతదేశ చిత్రపటం నుంచి మా చరిత్రనే తొలగిస్తే మేమెవరం?, ఇది మీ పార్టీ అధికారిక అభిప్రాయమా?, లేదా ఈ చర్య కేవలం ఒక పొరపాటా అనే విషయంపై మీరు వెంటనే స్పష్టత ఇవ్వాలి. ఇది తెలంగాణ ప్రజల త్యాగాలు, రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలను, బలిదానాలను అగౌరవపరచడమే కాకుండా మా చరిత్రను నిర్లక్ష్యం చేసిన బిజెపి నేతలు క్షమాపణ చెప్పాలి. పొరపాటైతే, తెలంగాణ ప్రజలని అపహాస్యం చేసినందుకు మీ పార్టీ నాయకత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.Honourable PM @narendramodi ji,We have fought for generations for our cultural identity, our rightful place in history, and our geographical position - TELANGANAToday, your Andhra Pradesh state BJP chief; Madhav Garu, has belittled our struggle by gifting a United Andhra… pic.twitter.com/vbFi2t1g2i— KTR (@KTRBRS) July 10, 2025 -
కలిసి సాగుదాం..ప్రగతి సాధిద్దాం.. నమీబియాకు ప్రధాని మోదీ పిలుపు
విండోహెక్: అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆఫ్రికా పాత్రను భారత్ గుర్తిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అధికారం, ఆధిపత్యం ద్వారా కాకుండా, భాగస్వామ్యం, దౌత్యంతో భవిష్యత్తును నిర్ణయించేందుకు భారత్, నమీబియా కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం రిపబ్లిక్ ఆఫ్ నమీబియా పార్లమెంట్ సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఆఫ్రికా ఖండం కేవలం ముడి సరుకులకు వనరుగా మిగిలిపోవద్దని.. విలువ సృష్టి, సుస్థిరాభివృద్ధిలో నాయకత్వ పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.రక్షణ రంగంలో ఆఫ్రికాతో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఇండియా అభివృద్ధి అనుభవాలను నమీబియాతో, ఆఫ్రికాతో పంచుకోవడం గర్వకారణమని చెప్పారు. ‘‘ఆఫ్రికాతో బంధానికి 2018లో 10 సూత్రాలు ప్రతిపాదించా. వాటికి కట్టుబడి ఉన్నాం. గౌరవం, సమానత్వం, పరస్పర ప్రయోజనాల ఆధారంగా ఆ సూత్రాలు రూపొందాయి. మనం ఒకరితో ఒకరు పోటీ పడడం కాదు.. ఒకరికొకరం సహకరించుకోవాలి. కలసికట్టుగా ఎదగడం మన లక్ష్యం కావాలి’’ అని స్పష్టంచేశారు. ఇది క్రికెట్ గ్రౌండ్లో వార్మప్ భారత్, నమీబియా మధ్య బలమైన చరిత్రాత్మక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు. నమీబియాతో స్నేహ సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టంచేశారు. ఇండియాలో చీతాల పునరుద్ధరణ ప్రాజెక్టుకు నమీబియా ఎంతగానో సహకరించిందని అన్నారు. నమీబియాలో తదుపరి తరం శాస్త్రవేత్తలు, డాక్టర్లు, నాయకులకు సహకారం అందిస్తామని ప్రకటించారు. రేడియో థెరఫీ మిషన్లు సరఫరా చేయబోతున్నామని వివరించారు. ఇండియా–నమీబియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 800 మిలియన్ డాలర్లకు చేరిందని, ఇది క్రికెట్ గ్రౌండ్లో వార్మప్ మాత్రమేనని, ఇకపై మరింత వేగంగా పరుగులు చేయాలని పిలుపునిచ్చారు. నమీబియాకు తొలి అధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు నెటుంబో నంది–ఎన్‌డైత్వాను ప్రధాని మోదీ అభినందించారు. భిన్న నేపథ్యం కలిగిన పౌరుల ఎదుగుదలకు నమీబియా రాజ్యాంగం చక్కటి తోడ్పాటు అందిస్తోందని ప్రశంసించారు. భారత రాజ్యాంగం సమానత్వం, స్వేచ్ఛ, న్యాయాన్ని బోధిస్తోందన్నారు. ఒక నిరుపేద గిరిజన మహిళ రాష్ట్రపతి అయ్యారంటే అది భారత రాజ్యాంగం గొప్పతనమేనని వ్యాఖ్యానించారు. సాధారణ కుటుంబంలో జన్మించిన తాను ప్రధానమంత్రి అయ్యానంటే అందుకు తమ రాజ్యాంగమే కారణమన్నారు. సంబంధాలు బలోపేతం చేసుకుందాం ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని, కీలక రంగాల్లో కలిసికట్టుగా పనిచేయాలని, పరస్పరం సహకరించుకోవాలని భారత్, నమీబియా నిర్ణయించుకున్నాయి. ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నమీబియా చేరుకున్నారు. అధికార లాంఛనాలతో ఆయనకు ఘన స్వాగతం లభించింది. తొలుత స్టేట్‌హౌస్‌లో నమీబియా అధ్యక్షురాలు నెటుంబో నంది–ఎన్‌డైత్వాతో మోదీ సమావేశమయ్యారు. డిజిటల్ సాంకేతికత, రక్షణ, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, అరుదైన ఖనిజాలు, విద్య తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులో ఉన్న మార్గాలపై చర్చించారు.నాలుగు ఒప్పందాలపై సంతకాలు నాలుగు ముఖ్యమైన ఒప్పందాలపై భా రత్, నమీబియా సంతకాలు చేశాయి. ఆరోగ్యం, ఔషధ రంగాల్లో సహకారంతోపాటు నమీబియాలో ఆంట్రప్రెన్యూ ర్షిప్ డెవలప్మెంట్ సెంటర్, సీడీఆర్ఐ ఫ్రేమ్‌వర్క్, గ్లోబల్ బయోఫ్యూయెల్స్ అలయెన్స్ ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు కోసం రెండు దేశాల మధ్య ఈ ఒప్పందాలు కుదిరాయి. మోదీకి నమీబియా అత్యున్నత పురస్కారం ప్రధాని మోదీని నమీబియా ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియెంట్ వెలి్వవిషియా మిరాబిలిస్’తో సత్కరించింది. నమీబియా అధ్యక్షురాలు నెటుంబో ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేశారు. భారత్, నమీబియా మధ్య చెదిరిపోని స్నేహానికి ఈ అవార్డు ఒక ప్రతీకగా నిలుస్తోందని మోదీ పేర్కొన్నారు. ఇరుదేశాల ప్రజలకు దీన్ని అంకితం చేస్తున్నానని తెలిపారు. నమీబియా అత్యున్నత పౌర పురస్కారం స్వీకరించిన తొలి భారతీయ నాయకుడిగా మోదీ రికార్డుకెక్కారు. -
ఉగ్రవాదంపై ఒక్కటే మాట
బ్రసీలియా: ఉగ్రవాదంపై భారత్, బ్రెజిల్ సంయుక్త సమరనాదం చేశాయి. ‘‘ఉగ్రవాదాన్ని సహించబోం. ఆ భూతంపై పోరులో మాది ఒకే బాట, ఒకే మాట. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాల మాటే లేదు. ఒకే విధానంతో ముందుకెళ్తాం’’ అని బ్రిక్స్ వేదికగా ప్రకటించాయి. ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డసిల్వాతో మంగళవారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉగ్రవాదంపై భారత్, బ్రెజిల్ ఆలోచనాధోరణి ఒకేలా ఉందంటూ వారు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పహల్గాం ఉదంతం తర్వాత భారత్‌కు సంఘీభావం తెలిపినందుకు బ్రెజిల్‌కు, డసిల్వాకు మోదీ ధన్యవాదాలు తెలిపారు.విస్తృతాంశాలపై చర్చలువాణిజ్యం, అంతరిక్షం, పునరుత్పాదక ఇంధనం, ఆహారం, ఇంధన భద్రత, మౌలికవసతుల అభివృద్ధి, డిజిటల్ ప్రజా వసతులు, రక్షణ, భద్రత, ఆరోగ్యం, ఫార్మాసూటికల్స్, సంస్కృతి, ఇరుదేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు తదితర కీలకాంశాలపై మోదీ, డసిల్వా లోతుగా చర్చించారు. కీలకమైన ఖనిజాలు, అధునాతన, నూతన సాంకేతికతలు, కృత్రిమ మేధ, సూపర్ కంప్యూటర్లు అంశాల్లోనూ సహకారం పెంపొందించుకోవడంపై చర్చించారు. 12 బిలియన్ డాలర్లుగా ఉన్న వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఐదేళ్లలో 20 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇంధనం, వ్యవసాయం, డిజిటల్ రూపాంతరీకరణ, ఉగ్రవాదంపైపోరుపై సంయుక్త సహకారం కోసం ఆరు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.కార్నివాల్.. ఫుట్‌బాల్.. సాంబా‘‘భారత్, బ్రెజిల్ సంబంధాలు కార్నివాల్లాగా వర్ణరంజితంగా ఉండాలి. ఫుట్‌బాల్ క్రీడలాగా స్ఫూర్తిదాయకంగా ఉండాలి. సాంబా నృత్యంలాగా ఇరుదేశాల ప్రజల హృదయాలను రంజింపజేయాలి. ఇరుదేశాల వీసా కేంద్రాల వద్ద పొడవాటి క్యూ వరసలు మాయమయ్యేలా వీసాప్రాసెసింగ్ వేగంగా జరగాలి. అన్నింటా అదే స్ఫూర్తి కనపడాలి’’ అని మోదీ అన్నారు. పశ్చిమాసియా ఎక్కడైనా సరే, వివాదాలకు చర్చలు, సంప్రదింపులతో పరిష్కారాలు కనుగొనాలన్నారు. ‘‘బ్రెజిల్‌తో రక్షణ రంగ ఒప్పందం అనేది ఇరుదేశాల మధ్య లోతైన పరస్పర విశ్వాసానికి ప్రతీక.రక్షణరంగ పరిశ్రమల మధ్య మరింత అనుసంధానం కోసం కృషిచేస్తాం. వ్యవసాయం, పశుసంవర్ధనలో రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా సహకారం ఉంది. ఇప్పుడు వ్యవసాయ రంగ పరిశోధన, ఆహార శుద్ధి రంగాలకూ దీనిని విస్తరిస్తాం. ఆరోగ్యరంగంలోనూ పరస్పర సహకారం అందించుకుంటాం. పర్యావరణం, శుద్ధ ఇంధనం అనేవి రెండు దేశాలకూ కీలకమే. నేటి ఒప్పందాలు మా హరిత లక్ష్యాలను నెరవేరుస్తాయి. యూపీఐ చెల్లింపు వ్యవస్థను బ్రెజిల్‌లోనూ అందుబాటులోకి రావడానికి ప్రయత్నిస్తాం. ఆయుర్వేదం, భారత సంప్రదాయ వైద్యం సైతం బ్రెజిల్‌కు చేరువచేస్తాం’’ అని మోదీ అన్నారు.మోదీకి అత్యున్నత పౌర పురస్కారంమోదీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం ‘ది గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్’ లభించింది. బ్రెజిల్ అధ్యక్షుడు డసిల్వా ఆయనకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ అవార్డును అధ్యక్షుడు స్వయంగా మోదీ మెడలో వేశారు. ఈ సందర్భంగా డసల్వా, మోదీ కరచాలనం, తర్వాత ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ‘‘ నాకీ అవార్డ్ దక్కడం ఎంతో గర్వంగా, ఉద్వేగంగా ఉంది. ఇది నాకు మాత్రమేకాదు 140 కోట్ల భారతీయులకు దక్కిన పురస్కారం’’ అని మోదీ సంయుక్త ప్రకటన వేళ వ్యాఖ్యానించారు. 2014 మేలో ప్రధాని అయ్యాక మోదీకి ఇలా విదేశాల్లో మొత్తంగా 26 అత్యున్నత పౌరపురస్కారాలు లభించాయి. -
ప్రపంచానికి బ్రిక్స్ ఆశాదీపం
రియో డి జనిరో: ‘‘అంతర్జాతీయ సహకారానికి, ఆదర్శ బహుళ ధ్రువ ప్రపంచానికి బ్రిక్స్ కూటమి చక్కని ఉదాహరణగా, విశ్వసనీయతకు మారుపేరుగా నిలవాలి. రానున్న రోజుల్లో ఇతర ప్రపంచ దేశాలకు అన్ని విషయాల్లోనూ దిశానిర్దేశం చేసే దారిదీపం కావాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ‘‘బ్రిక్స్‌పై దక్షిణార్ధ గోళ దేశాలు (గ్లోబల్ సౌత్) ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. వాటిని నెరవేర్చి నమ్మకాన్ని నిలబెట్టుకుందాం. పాలన, అభివృద్ధి, పరస్పర సహకారం తదితరాల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పుదాం’’ అని సభ్య దేశాల అధినేతలకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో సభ్య దేశాలన్నింటితోనూ భుజం భుజం కలిపి ముందుకు సాగేందుకు భారత్ పూర్తిగా కట్టుబడి ఉందని వక్కాణించారు. బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సులో సోమవారం రెండో రోజు ‘భిన్నత్వానికి దన్ను, ఆర్థిక వ్యవహారాలు, ఏఐ’, ‘పర్యావరణం, కాప్–30, ప్రపంచ ఆరోగ్యం’ వంటి అంశాలపై జరిగిన సెషన్లలో మోదీ ప్రసంగించారు. బ్రిక్స్ కూటమి బలం దాని భిన్నత్వంలోనే దాగుందని నొక్కిచెప్పారు. కృత్రిమ మేధకు నానాటికీ అపారంగా పెరిగిపోతున్న ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. ‘ఏఐ’ ఆందోళనలకు అలా చెక్ ‘‘విద్య నుంచి వ్యవసాయం దాకా అన్ని రంగాల్లోనూ ఏఐని భారత్ చురుగ్గా, విస్తృతంగా ఉపయోగిస్తోంది. ఏఐపై నెలకొన్న ఆందోళనలకు సమర్థంగా చెక్ పెట్టాలంటే ఇటు పాలనకు, అటు ఇన్నొవేషన్లకు సమ ప్రాధాన్యమివ్వడమే మార్గం. బాధ్యతాయుతమైన ఏఐ మనందరి లక్ష్యం కావాలి’’ అని మోదీ సూచించారు. ఏఐ ప్రభావంపై వచ్చే ఏడాది భారత్ నిర్వహించనున్న శిఖరాగ్ర భేటీలో పాల్గొనాల్సిందిగా బ్రిక్స్ సభ్య దేశాలన్నింటినీ ఈ సందర్భంగా ఆహా్వనించారు. కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకునేందుకు వీలుగా బ్రిక్స్ సైన్స్ అండ్ రీసెర్చ్ రిపోజిటరీ (బీఎస్ఆర్ఆర్) ఏర్పాటును ప్రతిపాదించారు. అంతర్జాతీయ స్థాయిలో కీలక ఖనిజాలు సరఫరాకు ఆటంకం లేకుండా చూడటంలో కూటమి కీలకపాత్ర పోషించాలని అభిలíÙంచారు. ఆ వనరులను ఏ దేశమూ స్వీయ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి, ఇతర దేశాలపై ఆయుధంగా వాడకుండా చూడాలన్నారు. 18 రకాల కీలక ఖనిజ వనరులకు నిలయమైన చైనా ఇటీవల వాటి ఎగుమతులను బాగా తగ్గించడం తెలిసిందే. పరోక్షంగా దాన్ని ఉద్దేశించి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రధాని లీ కియాంగ్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో కీలక పాలన సంస్కరణలకు బ్రిక్స్ బాటలు పరవాలని సూచించారు. ప్రపంచ శాంతిని కాపాడటంలో, విభేదాలను శాంతియుతంగా పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాలన్నారు. అధినేతలతో భేటీలు బ్రిక్స్ సదస్సు సందర్భంగా సోమవారం పలువురు దేశాధినేతలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. 10 దేశాలతో కూడిన ఆసియాన్ కూటమితో భారత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై మలేసియా ప్రధాని అన్వర్ బిన్ ఇబ్రహీంతో చర్చించారు. వర్తకం, పెట్టబడులు, రక్షణ, విద్య, ఆరోగ్యం, పర్యాటకం తదితరాలపై లోతైన సమీక్ష జరిపారు. బొలీవియా అధ్యక్షుడు లూయిస్ ఆల్బర్టో ఆర్స్ కాటకొరా, ఉరుగ్వే అధ్యక్షుడు యమంద్ ఒర్సీతో ద్వైపాక్షిక అంశాలను గురించి మోదీ చర్చలు జరిపారు. యోగాకు ఉరుగ్వేలో నానాటికీ ఆదరణ పెరగుతుండటంపై హర్షం వెలిబుచ్చారు. పర్యావరణ న్యాయం... మాకు పవిత్ర నైతిక విధి పర్యావరణ న్యాయం భారత్ దృష్టిలో పవిత్రమైన నైతిక విధి అని మోదీ ఉద్ఘాటించారు. పారిస్ పర్యావరణ ఒప్పంద ప్రతిజ్ఞలను గడువుకు ముందే నెరవేర్చిన తొలి దేశం భారతేనని గుర్తు చేశారు. ‘‘భూమి ఆరోగ్యంపైనే ప్రజారోగ్యం ఆధారపడి ఉంది. ఈ విషయంలో సంపన్న దేశాలపై గురుతర బాధ్యత ఉంది’’అన్నారు. ‘‘బ్రిక్స్ సారథిగా మానవత్వం, పర్యావరణ న్యాయం తదితరాలకు భారత్ పెద్దపీట వేస్తుంది. సమర్థ కూటమిగా బ్రిక్స్పనితీరుకే సరికొత్త నిర్వచనమిస్తుంది’’ అని మోదీ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది భారత్ బ్రిక్స్ సారథ్య పగ్గాలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఎలాంటి విపత్తులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్నివేళలా సిద్ధంగా ఉండాల్సిన అవసరం చాలా ఉందంటూ కరోనా మహమ్మారిని ప్రధాని ఉటంకించారు. ‘‘వైరస్లు వీసాలు తీసుకుని రావని కరోనా నిరూపించింది. వాటి పరిష్కారాలు కూడా పాస్‌పోర్టులను చూసి ఎంపిక చేసుకునేవి కావు’’ అంటూ చమత్కరించారు. వర్ధమాన దేశాలు ఆత్మవిశ్వాసం విషయంలో సంపన్న దేశాలకు ఏ మాత్రమూ తీసిపోవద్దని సూచించారు. -
ఘనంగా దలైలామా జన్మదిన వేడుకలు
ధర్మశాల/వాషింగ్టన్: టిబెటన్ల అత్యున్నత ఆధ్యాత్మిక గురువు, బౌద్ధమతాన్ని విస్తృతంగా ప్రచారంచేస్తున్న 14వ దలైలామా టెంజిన్ గ్యాట్సో 90వ పుట్టినరోజు వేడుకలు హిమాచల్‌ప్రదేశ్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. ప్రపంచదేశాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భౌద్ధ భిక్షువులు, బౌద్ధులు, పలువురు ప్రముఖుల సమక్షంలో ట్సుగ్లాంగ్ఖాంగ్ దలైలామా ఆలయం ప్రాంగణంలో జన్మదిన వేడుకలు జరిగాయి. కంగ్రా జిల్లాలోని మెక్లియోడ్గంజ్ పట్టణంలో జరిగిన ఈ వేడుకలకు పెద్దసంఖ్యలో విద్యార్థులు, నృత్యకారులు, నేపథ్యగాయకులు హాజరయ్యారు. ప్రపంచ శాంతి, మత సామరస్యం కోసం అలుపెరగకుండా పోరాడుతున్న దలైలామాకు తమ మద్దతు ఇకమీదటా కొనసాగుతుందని వేడుకల వేదికపై ఆసీనులైన పలు దేశాల రాజకీయ ప్రముఖులు ప్రకటించారు. ఒక్కో దశాబ్ద జీవితానికి ఒక అంతస్తు గుర్తుగా సిద్ధంచేసిన 9 అంతస్తుల కేక్‌ను కట్‌చేశాక వేలాది మంది బౌద్ధుల సమక్షంలో దలైలామా ప్రసంగించారు. ‘‘ జనులందరికీ సేవచేయాలన్న నా సంకల్పానికి మీ ప్రేమే స్ఫూర్తిగా నిలుస్తోంది. శాంతిదేవుడైన ‘బోధిసత్వాచార్యావతార’ చూపిన మార్గంలోనే నిరంతరం నడుస్తున్నా. ఇంద్రియజ్ఞానమున్న జనులంతా నా సోదరసోదరీమణులు, స్నేహితులే. నా శక్తిమేరకు మీకు సేవ చేస్తా. నా పుట్టినరోజు అని తెల్సుకుని అమితానందంతో ఇంతదూరమొచ్చి వేడుకల్లో భాగస్వాములైన మీకందరికీ మనస్ఫూర్తిగా ధాంక్యూ’’ అని దలైలామా వ్యాఖ్యానించారు. ‘‘ఎక్కువ మంది జనముంటే మరింత ఎక్కువగా హృదయానందం పొంగిపొర్లుతుంది. ఆ ఆనందం నాకెంతో స్ఫూర్తినిస్తుంది. బోధిచిత్తాన్నే నేను ఆచరిస్తా. ప్రజల్ని నా వైపునకు తిప్పుకోవాలనే స్వార్థ లక్ష్యాలు పెట్టుకోవడం కంటే ప్రజలకు సేవ చేయడంపైనే నా దృష్టంతా ఉంటుంది’’ అని దలైలామా అన్నారు. కేంద్ర మంత్రులు కిరెణ్ రిజిజు, రాజీవ్ రంజన్ సింగ్, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ, సిక్కిం మంత్రి సోనమ్ లామా, హాలీవుడ్ సీనియర్ నటుడు రిచర్డ్ గెరె తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘ప్రాచీన జ్ఞానసంపదకు, ఆధునిక ప్రపంచానికి సజీవ వారధి దలైలామా. ఆర్యభూమిలో దలైలామా దశాబ్దాలుగా ఉండిపోవడం మనకెంతో సంతోషకరం’’ అని రిజిజు పొగిడారు. శుభాకాంక్షలు తెలిపిన మోదీ దలైలామాకు ప్రధాని మోదీ బర్త్‌డే విషెస్ చెప్పారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘90వ పుట్టినరోజు జరుపుకుంటున్న దలైలామాకు 140 కోట్ల మంది భారతీయులతోపాటు నేను సైతం శుభాకాంక్షలు చెబుతున్నా. ప్రేమ, తపన, సహనం, నైతిక విలువలకు నిలువెత్తు నిదర్శనం దలైలామా. ఆయన ఇచ్చి సందేశం దేశాలకతీతంగా జనులందరికీ శిరోధార్యం. ఆయన ఇలాగే దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నా’’ అని మోదీ అన్నారు. అమెరికా తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సైతం సందేశం పంపించారు. ‘‘ టిబెటన్ల మానవ హక్కుల పరిరక్షణతోపాటు ప్రాథమిక స్వేచ్ఛకు అమెరికా నిత్యం మద్దతిస్తోంది. ఇతరుల(చైనా) జోక్యంలేకుండా టిబెటన్ల భాష, సంస్కృతి, మత వారసత్వ పరిరక్షణకు అమెరికా పాటుపడుతుంది’’ అని ఆయన అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షులు జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా సైతం తమ శుభాకాంక్షల వీడియో సందేశాలు పంపించారు. -
‘గ్లోబల్ సౌత్’కు దారుణ అన్యాయం
రియో డీ జనీరో: ప్రపంచ ఆర్థికవ్యవస్థ పురోగతికి ఎంతగానో తోడ్పాటు అందిస్తున్న దక్షిణార్ధ గోళ దేశాలు (గ్లోబల్ సౌత్) కీలక నిర్ణయాలు, ప్రయోజనాల విషయంలో బాధిత దేశాలుగా మిగిలిపోతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేదికైంది. సదస్సుకు అధ్యక్ష, ఆతిథ్య దేశంగా వ్యవహరిస్తున్న బ్రెజిల్‌లోని రియో డీ జనీరో నగరంలో ఆదివారం బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఆరంభమైంది. సదస్సులో భాగంగా ప్లీనరీ సెషన్లో తొలుత బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డసిల్వా మాట్లాడాక మోదీ మాట్లాడారు. అవన్నీ నెట్‌వర్క్‌లేని ఫోన్లే ‘‘ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడే గ్లోబల్ సౌత్ దేశాలు చివరకు ద్వంద్వ ప్రమాణాల కారణంగా బాధితదేశాలుగా మిగిలిపోతున్నాయి. అభివృద్ది, వనరుల పంపిణీ, భద్రత వంటి ఏ రంగంలో చూసినా గ్లోబల్ సౌత్ దేశాలకు దక్కేది శూన్యం. వాతావరణ మార్పుల కట్టడికి ఆర్థిక సాయం, సుస్థిరాభివృద్ధి, అధునాతన సాంకేతికత బదిలీ వంటి అంశాల్లో గ్లోబల్‌సౌత్ దేశాలు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వంటి అంతర్జాతీయ వ్యవస్థలు, సంస్థలను తక్షణం సంస్కరణల బాట పట్టించి దక్షిణార్ధ గోళ దేశాలకు న్యాయం జరిగేలా చూడాలి. విశ్వ ఆర్థికానికి కీలక భాగస్వామిగా ఉండి కూడా ప్రధాన నిర్ణయాత్మక వేదికలపై గ్లోబల్సౌత్కు స్థానం దక్కడం లేదు. వాటి వాణి వినపడటం లేదు. ఇది ప్రాతినిధ్యం దక్కట్లేదనే మాట కంటే విశ్వసనీయంగా, ప్రభావవంతంగా పనిచేసి కూడా ఎలాంటి ప్రయోజనం, లబ్ధి పొందలేపోవడమే గ్లోబల్ సౌత్ దేశాలకు అశనిపాతమవుతోంది. 20వ శతాబ్దంలో ఆవిర్భవించిన ఎన్నో కీలక అంతర్జాతీయ వ్యవస్థల్లో మూడింట రెండొంతుల జనాభాకు అసలు ప్రాతినిధ్యమే దక్కడం లేదు. గ్లోబల్‌సౌత్ దేశాలు లేకుండా ఇలాంటి వ్యవస్థలన్నీ సిమ్‌కార్డు ఉన్నా నెట్‌వర్క్‌లేని మొబైల్ ఫోన్ లాంటివే’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై సమిష్టి పోరు ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలన్నీ సమిష్టిగా పోరాడాల్సిన అవసరం చాలా ఉందని మోదీ పిలుపునిచ్చారు. పహల్గాంలో అమాయక పర్యాటకులపై పాక్ ప్రేరేపిత జైషే ముష్కర మఠా జరిపిన పాశవిక దాడిని ఈ సందర్భంగా బ్రిక్స్ దేశాధినేతలకు ఆయన గుర్తు చేశారు. బ్రిక్స్ వేదికగా ఆ దాడిని మరోసారి ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ భారత్‌కు అండగా నిలిచాయని గుర్తు చేసుకు న్నారు. మరోసారి అలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా పాక్‌కు మర్చిపోలేని రీతిలో సైనికంగా గుణపాఠం చెప్పామన్నారు. ఉగ్ర మూలాలను పెకిలించివేయనిదే ప్రపంచ శాంతి అసాధ్యమన్నారు.టైప్రైటర్లతో నేటి సాఫ్ట్వేర్ నడవదు ‘‘సమకాలీన ప్రపంచం, కాలానికి తగ్గట్లుగా మేం మారతాం అని ప్రస్ఫుటంగా తెలియజెప్పేందుకే బ్రిక్స్ కూటమిలోకి కొత్త దేశాలను ఆహ్వానిస్తున్నాం. మా బాటలోనే ఐరాస భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థ, బహుళజాతి అభివృద్ధి బ్యాంక్‌లు సంస్కరణలను తీసుకొచ్చి తమ చిత్తశుద్ధిని చాటాలి’’ అని మోదీ హితవు పలికారు. కృత్రిమమేధ యుగంలో సాంకేతికత వారం వారం అప్డేట్ అవుతోంది. అలాంటప్పుడు 80 ఏళ్ల క్రితం ఏర్పడిన ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థల్లో ఎప్పటికప్పుడు సంస్కరణల అప్డేట్లు జరగాల్సిందే. 20వ శతాబ్దినాటి టైప్రైటర్లతో 21వ శతాబ్దంలోని అధునాతన సాఫ్ట్వేర్ నడవదు. స్వీయ ప్రయోజనాలకంటే కూడా భారత్ మానవాళి ప్రయోజనాలకే పట్టకడుతుంది. బ్రిక్స్‌దేశాలతో కలిసి సమష్టిగా అన్ని రంగాల్లో నిర్మాణాత్మకమైన ప్రాతినిధ్యం వహించేందుకు మేం సదా సిద్ధంగా ఉన్నాం’’ అని మోదీ అన్నారు. -
వైవిధ్యమైన వాణిజ్యం
బ్యూనస్ ఎయిర్స్: తమ ఇరు దేశాల మధ్య వ్యాపారం, వాణిజ్యాన్ని మరింత వైవిధ్యంగా తీర్చిదిద్దుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిల్లీ నిర్ణయించుకున్నారు. అలాగే రక్షణ, ఇంధనం, అరుదైన ఖనిజాలు తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని అంగీకారానికి వచ్చారు. మోదీ, జేవియర్ మిల్లీ శనివారం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. వ్యూహాత్మక ప్రయోజనాలు కాపాడుకొనేలా రెండు దేశాల నడుమ రక్షణ రంగంలో సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. రెండు దేశాల వ్యూహాత్మకభాగస్వామ్యాన్ని మరింత ఉన్నతస్థాయికి చేర్చాలని మోదీ, జేవియర్ మిల్లీ తీర్మానించారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శనివారం అర్జెంటీనాకు చేరుకున్నారు. భారత ప్రధాని అర్జెంటీనాలో ద్వైపాక్షిక పర్యటన చేపట్టడం గత 57 ఏళ్లలో ఇదే మొదటిసారి. జేవియర్ మిల్లీతో సమావేశం అనంతరం మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. వ్యవసాయం, రక్షణ, ఇంధనంతోపాటు పలు కీలక రంగాల్లో సహకారంపై చర్చించామని తెలిపారు. ఫార్మాస్యూటికల్స్, క్రీడలు తదితర రంగాల్లో ఇరుదేశాలు కలిసి పనిచేయడానికి అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. జేవియర్‌తో మిల్లీతో అద్భుతమైన భేటీ జరిగిందని మోదీ పేర్కొన్నారు. భారత్–అర్జెంటీనా మధ్య గత 75 ఏళ్లుగా దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయని, ఐదేళ్ల క్రితం ఈ సంబంధాలు ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి వృద్ధి చెందాయని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ఇరుదేశాల ఉమ్మడి ప్రయాణం మరింత అర్థవంతంగా, ప్రగతిశీలకంగా సాగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేద్దాం వ్యవసాయ రంగంలో మరింతగా సహకరించుకోవాల్సిన అవసరం ఉందని మోదీ, మిల్లీ అభిప్రాయపడ్డారు. ఒక దేశానికి చెందిన వ్యవసాయ ఉత్పత్తులను మరో దేశంలో ప్రజలకు సులువుగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. దీనివల్ల ఇరుదేశాల రైతులకు లబ్ధి చేకూరుతుందని వారు అంగీకరించారు. ఇందుకోసం జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని, ఆ దిశగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయించారు. అంతకుముందు ట్రినిడాడ్ అండ్ టొబాగో నుంచి అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాని మోదీకి బ్యూనస్ ఎయిర్స్‌లోని ఎజీజా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అధికారులతోపాటు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్జెంటీనా నేషనల్ హీరో జనరల్ జోస్ డి శాన్ మారి్టన్ స్మారకం వద్ద మోదీ నివాళులరి్పంచారు. భారత్–అర్జెంటీనా మధ్య దశాబ్దాలుగా చక్కటి మైత్రి కొనసాగుతోంది. 2019లో అప్పటి అర్జెంటీనా అధ్యక్షుడు మారిసియో మాక్రీ ఇండియాలో పర్యటించారు. ఆ సమయంలో భారత్, అర్జెంటీనా మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచారు. వాణిజ్యం, రక్షణ, అరుదైన ఖణిజాలు, చమురు, గ్యాస్, అణు ఇంధనం, వ్యవసాయం, సాంస్కృతికం, టెక్నాలజీ వంటి రంగాల్లో రెండు దేశాలు కలిసి పని చేస్తున్నాయి. పలు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. పరస్పరం సహకరించుకుంటున్నాయి. -
పాకిస్తాన్ తో యుద్ధాన్ని ఎందుకు ఆపేశారు? కాంగ్రెస్ సూటి ప్రశ్నకు బీజేపీ రిప్లై ఏంటి?
-
‘ట్రంప్‌కు ప్రధాని మోదీ తలొగ్గుతారు?’.. రాహుల్ ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారతదేశం- అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం జూలై తొమ్మిదిలోగా ఖరారయ్యే అవకాశాలున్న ప్రస్తుత తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలకు సంబంధించి నిర్దేశించిన గడువుకు ప్రధాని మోదీ సాత్వికంగా తలొగ్గుతారని రాహుల్ వ్యాఖ్యానించారు.సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో రాహుల్ ఒక పోస్ట్‌లో ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా లేకపోతే, దానిని ఖరారు చేసేందుకు భారత్ తొందరపడదంటూ కేంద్ర మంత్రి పియూష్ గోయల్ చేసిన ప్రకటనను రాహుల్ గుర్తుచేశారు. పీయూష్ గోయల్ ఈ విధమైన ప్రకటన చేసినప్పటికీ, ప్రధాని మోదీ అమెరికా విధించిన సుంకాల గడువుకు మృదువుగా తలొగ్గుతారని రాహుల్ పేర్కొన్నారు. Piyush Goyal can beat his chest all he wants, mark my words, Modi will meekly bow to the Trump tariff deadline. pic.twitter.com/t2HM42KrSi— Rahul Gandhi (@RahulGandhi) July 5, 2025ప్రతిపాదిత తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై భారత్- అమెరికన్ అధికారుల మధ్య చర్చలు చివరి దశలో ఉన్నాయి. ట్రంప్ యంత్రాంగం విధించిన పరస్పర సుంకాలపై 90 రోజుల సస్పెన్షన్ గడువు జూలై 9తో ముగియనుంది. అప్పటికీ ఎటువంటి ఒప్పందం కుదరని పక్షంలో.. అమెరికన్ వస్తువులపై భారత సుంకాలకు ప్రతిగా ట్రంప్ విధించిన మునుపటి అమెరికా సుంకాలు తిరిగి అమలయ్యే అవకాశాలున్నాయి. ట్రంప్ యంత్రాంగం భారత ఎగుమతుల శ్రేణిపై 26 శాతం సుంకాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై చర్చలు ప్రారంభించిన దరిమిలా ఈ సుంకాన్ని తాత్కాలికంగా ఎత్తివేశారు.న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారత్ పరస్పరం ప్రయోజనకరమైన, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించే అమెరికా వాణిజ్య ఒప్పందంపై మాత్రమే సంతకం చేస్తుందని పునరుద్ఘాటించారు. ఇది విన్-విన్ ఒప్పందంగా ఉండాలని, జాతీయ ప్రయోజనం ఎల్లప్పుడూ అత్యున్నతంగా ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, అమెరికాతో సరైన ఒప్పందం ఏర్పడితే, అభివృద్ధి చెందిన ఆ దేశంతో భారత్ సన్నిహితంగా ఉండటానికి సిద్ధంగా ఉంటుందని గోయల్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: అమర్నాథ్ యాత్రలో అపశృతి.. సహాయక చర్యలు ముమ్మరం -
ఉగ్రవాదులకు హర్రర్ పిక్చర్.. పాక్ పై భారత్ మరో ఆపరేషన్
-
మోదీకి 'హలో' చెప్పేందుకు వచ్చా..! భారత సంతతి వ్యక్తి
పధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనలో ఉన్న సంగతి తెలిసింది. అందులో భాగంగా ఈ రోజు (శనివారం) ఉదయం అర్జెంటినాకు చేరుకున్నారు. ఆయనకు బ్యూనస్ ఎయర్‌లోని భారత సంతతి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఆయన అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీతో చర్చలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో విజయగుప్తా అనే భారత సంతతి వ్యక్తి మోదీని కలిసినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. తాను ప్రధాని మోదీకి హలో చెప్పేందుకే 400 కి.మీ ప్రయాణించి మరి వచ్చానని అన్నారు. ఆయనకు జస్ట్ హలో చెప్పాలనుకున్నా..కానీ నాకు మోదీకే కరచలనం(షేక్‌హ్యాండ్) ఇచ్చే అవకాశం లభించిందంటూ ఉబ్బితబ్బిబవుతున్నాడు. ఇదిలా ఉండగా మోదీ ఒక ట్వీట్లో అర్జెంటీనా పర్యటన గురించి పంచుకున్నారు. "నేను ఈరోజు అర్జెంటీనాతో సంబంధాలను పెంపొందించుకోవడంపై దృష్టి సారించే ద్వైపాక్షిక పర్యటన కోసం బ్యూనస్ ఎయిర్స్లో అడుగుపెట్టాను. ప్రస్తుతం అర్జెంటినా అధ్యక్షుడు జేవియర్ మిలీని కలిసి చర్చలు జరిపేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను" అని ట్వీట్ చేశారు.అలాగే విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కూడా ఈ 57 ఏళ్లలో భారత ప్రధాని అర్జెంటీనాలో చేసిన తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే అని ట్వీట్ చేశారు. కాగా, మోదీ బ్యూనస్ ఎయిర్స్‌లోని హోటల్‌కు చేరుకోగానే 'భారత్ మాతా కీ జై', 'జై శ్రీ రామ్' అనే నినాదాలతో ఘన స్వాగతం పలికారు ప్రవాస భారతీయులు. ఆయన ఇప్పటికే ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగోలను సందర్శించారు. ఇక ఈ అర్జెంటీనా పర్యటన తదనంతరం బ్రెజిల్, నమీబియాలను సందర్శించనున్నారు.#WATCH | Buenos Aires, Argentina: Vijay Kumar Gupta, a member of the Indian diaspora, says, "I have come here from Rosario, which is 400 kilometres from here, just to say hello to Prime Minister Narendra Modi. I got the opportunity to shake hands with him..." https://t.co/7yZBOqwXFT pic.twitter.com/jS0uoHPGUn— ANI (@ANI) July 5, 2025 (చదవండి: ఎవరా 'బీహార్ కీ భేటీ'?.. మోదీ మనసులో కరేబియన్ ప్రధానికి ప్రత్యేక స్థానం) -
అర్జెంటీనా చేరిన ప్రధాని మోదీ.. అధ్యక్షుడు జేవియర్ మిలేతో భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ భారత్-అర్జెంటీనాల సంబంధాలను బలోపేతం చేసే దిశగా తన వంతు ప్రయత్నాలను సాగిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన ఈరోజు (శనివారం) ఉదయం ఆయన అర్జెంటీనాకు చేరుకున్నారు. నేడు ఆయన అధ్యక్షుడు జేవియర్ మిలేతో సమావేశం కానున్నారు. ప్రస్తుతం ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనలో ఉన్నారు. అర్జెంటీనాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆ రోజు సాయంత్రం ప్రధాని మోదీ అర్జెంటీనా నేషనల్ హీరో జనరల్ జోస్ డి శాన్ మార్టిన్ విగ్రహం వద్ద ఆయనకు నివాళులర్పించనున్నారు. అనంతరం అధ్యక్షుడు మిలే అందించే ఆతిథ్యం అందుకోనున్నారు. నగరంలోని ఐకానిక్ క్లబ్ బోకా జూనియర్స్ ఫుట్‌బాల్ స్టేడియంను కూడా ప్రధాని సందర్శించనున్నారు. అర్జెంటీనాలో ప్రధాని పర్యటన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని, పరస్పర సహకారానికి కొత్త మార్గాలను తెరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. Landed in Buenos Aires for a bilateral visit which will focus on augmenting relations with Argentina. I’m eager to be meeting President Javier Milei and holding detailed talks with him.@JMilei pic.twitter.com/ucdbQhgsUj— Narendra Modi (@narendramodi) July 5, 2025ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చలు.. వాణిజ్యం,పెట్టుబడి, ఆరోగ్యం, ఔషధాలు, రక్షణ, మౌలిక సదుపాయాలు, మైనింగ్, వ్యవసాయం, ఆహార భద్రత, గ్రీన్ ఎనర్జీ,డిజిటల్ ఆవిష్కరణ, విపత్తు నిర్వహణ తదితర విభిన్న రంగాలపై దృష్టి సారించనున్నాయి. అధ్యక్షుడు జేవియర్ మిలే ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అర్జెంటీనాకు చేరుకున్నారు. గతంలో ఈ ఇద్దరు నేతలు 2024లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో కలుసుకున్నారు. ఈ ఐదు దేశాల పర్యటనకు ముందు, ప్రధాని మోదీ.. అర్జెంటీనాను లాటిన్ అమెరికాలో కీలక ఆర్థిక భాగస్వామిగా, జీ20 సమూహంలో సన్నిహిత సహకారిగా అభివర్ణించారు. ప్రధాని ఈ అర్జెంటీనా పర్యటన అనంతరం 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.ఇది కూడా చదవండి: మళ్లీ పాక్ అబద్ధం.. అజార్ ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నడంటూ.. -
పాకిస్తాన్‌పై యుద్ధం ఎందుకు ఆపేశారో మోదీ ప్రభుత్వం చెప్పాలి... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్
-
ఆకాశం సైతం హద్దు కాదు
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్ త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం తథ్యమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టంచేశారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత బలంగా ఉందని పేర్కొన్నారు. కృత్రిమ మేధ(ఏఐ), సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో ఇండియా శరవేగంగా దూసుకెళ్తోందని, అవి సరికొత్త గ్రోత్ ఇంజన్లుగా మారాయని వెల్లడించారు. ఆయన స్థానిక కాలమానం ప్రకారం గురువారం కరీబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలోని కౌవా పట్టణంలో ప్రవాస భారతీయుల కార్యక్రమంలో ప్రసంగించారు. ఇండియా నేడు అవకాశాల గనిగా మారిందని, అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. నవ భారతదేశానికి ఆకాశం సైతం హద్దు కాదని వ్యాఖ్యానించారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని భారతీయులు వారి సొంత భూమిని వదిలేసి వచ్చినప్పటికీ భారతీయ ఆత్మను మాత్రం వదులుకోలేని చెప్పారు. గంగా, యమున నుంచి దూరంగా వచ్చారు గానీ రామాయణాన్ని హృదయంలోనే నిలుపుకున్నారని ప్రశంసించారు. ప్రవాస భారతీయులు కేవలం వలసదారులు కాదని.. గొప్ప నాగరికతకు దూతలు అని తెలి పారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే... ‘‘ప్రవాస భారతీయుల సేవలు ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ ప్రగతికి తోడ్పడుతున్నాయి. సాంస్కృతికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా వారు ఎంతో సేవ చేస్తున్నారు. ఇక్కడ ప్రవాస భారతీయుల ప్రభావం ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. అయోధ్య రామమందిర నమూనా, సరయూ నది జలాలను, మహాకుంభమేళా జరిగిన త్రివేణి సంగమం నీటిని ఇక్కడికి నాతోపాటు తీసుకొచ్చా. అందుకు ఎంతగానో గర్విస్తున్నా. ఈ పవిత్ర జలా లను ఇక్కడి గంగాధారలో చల్లాలని ప్రధానమంత్రి కమలకు విజ్ఞప్తి చేశా. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రజలకు ఇదొక ఆశీర్వచనం అవుతుంది. భారత్ ప్రగతికి యువతే చోదక శక్తి పేదల అభివృద్ధి, సాధికారతకు పెద్దపీట వేయడం ద్వారా పేదరికాన్ని ఓడించవచ్చని భారత్ నిరూపించింది. పేదరికం నుంచి దేశానికి పూర్తిగా విముక్తి కల్పించవచ్చన్న విశ్వాసాన్ని పెంచాం. ఇండియా ప్రగతికి శక్తిసామర్థ్యాలు కలిగిన యువతే చోదక శక్తిగా నిలుస్తోంది. నేడు ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ ఇండియాలోనే ఉంది. ఇందులో సగం స్టార్టప్‌లకు మహిళలే డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు. 120 స్టార్టప్‌లు యూనికార్న్ స్థాయికి ఎదిగాయి. ప్రపంచంలోని మొత్త యూపీఐ చెల్లింపుల్లో 50 శాతం ఇండియాలోనే జరుగుతున్నాయి. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో కొత్తగా యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ప్రారంభించినందుకు అభినందనలు తెలియజేస్తున్నా. గుడ్ మారి్నంగ్ అని మెసేజ్ పంపించుకున్నంత సులువుగా డబ్బులు పంపించుకోవచ్చు. వెస్టిండీస్ బౌలింగ్ కంటే కూడా ఇది స్పీడ్‌గా ఉంటుందని నేను ప్రామిస్ చేస్తున్నా’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇవ్వద్దుపోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఉగ్రవాదానికి మానవాళికి శత్రువుగా మారిందని, దానికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరూ ఆశ్రయం ఇవ్వొద్దని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని కలిసికట్టుగా ఎదిరించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశమని వెల్లడించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము సాగిస్తున్న పోరాటానికి ఈ దేశం మద్దతిస్తోందని, అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రభుత్వం తమ అత్యున్నత పురస్కారం ‘ద ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో’తో నరేంద్ర మోదీని సత్కరించింది.బిహార్ వారసత్వం గర్వకారణం ట్రినిడాడ్ అండ్ టొబాగోకు ఇండియాలోని బిహార్ రాష్ట్రంతో చక్కటి అనుబంధం ఉందని నరేంద్ర మోదీ చెప్పారు. బిహార్ వారసత్వం భారతదేశానికి, ప్రపంచానికి గర్వకారణమని అన్నారు. ఇక్కడున్న చాలామంది భారత సంతతి ప్రజల పూర్వీకులు బిహార్ నుంచి వచ్చినవారేనని తెలిపారు. బిహార్‌కు ఘనమైన వారసత్వం ఉందని పేర్కొన్నారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి కమలా పెర్సాద్ బిసెసార్ పూర్వీకులు సైతం బిహార్‌కు చెందినవారేనని చెప్పారు. ఆమె బిహార్‌ను సందర్శించారని, భారతీయులు ఆమెను ‘బిహార్ బిడ్డ’గా పిలుస్తుంటారని అన్నారు. భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాగో మధ్య బలమైన సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. బిహార్‌కు చెందిన భోజ్‌పురి భాషను ట్రినిడాడ్ అండ్ టొబాగోలో కూడా చాలామంది మాట్లాడుతుంటారని వివరించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు.మోదీకి సంప్రదాయ స్వాగతం ఘనా నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగో చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. దేశ ప్రధానమంత్రి కమలా పెర్సాద్ బిసెసార్తోపాటు మంత్రులు, అధికారులు ఆయనకు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. భారత సంతతికి చెందిన కమలా పెర్సాద్ బిసెసార్ ఈ సందర్భంగా భారతీయ సంప్రదాయ చీర ధరించారు. అనంతరం ప్రవాస భారతీయుల సమావేశంలో మోదీతోపాటు ఆమె పాల్గొన్నారు. ‘బిహార్ కీ బేటీ’ అంటూ కమలపై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ రాసిన పుస్తకంలోని ‘ఆంఖ్ కా ధన్యా చే’ పద్యాన్ని కమల ఆలపించి అందరినీ ఆశ్చర్యపర్చారు. భారత్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలాన్ని ఆమెకు మోదీ బహూకరించారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా కమలా పెర్సాద్ బిసెసార్ రికార్డుకెక్కారు. -
యుద్ధాన్ని ఆపేశారేం?
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్‌పై యుద్ధాన్ని ఆకస్మికంగా ఎందుకు ఆపేశారో, అసలు ఆపిందెవరో దేశ ప్రజలకు మోదీ ప్రభుత్వం చెప్పాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. పహల్గాం ఘటనపై దేశం యావత్తు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచిందని చెప్పారు. దేశంలోని అన్ని రాజకీయపార్టీలు మోదీకి మద్దతు ఇస్తూ యుద్ధం చేయాలంటూ గొంతు కలిపాయని గుర్తుచేశారు. అయినా యుద్ధం కొనసాగించకుండా అర్ధాంతరంగా నిలిపివేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.దేశానికున్న బలగంతో వీరోచితంగా పోరాడి పాక్ పీచమణిచి పీఓకేను స్వాదీనం చేసుకునే అవకాశాన్ని చేజేతులా కోల్పోవడం అత్యంత దురదృష్టకరమంటూ ఖర్గే ధ్వజమెత్తారు. జబ్బలు చరుచుకునే మోదీ కి కీలక సమయంలో చేతులు ఎత్తేయడమే చేతనవుతుందని విమర్శించారు. దేశరక్షణ, సైనికులపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరు కావడం ఆయన దేశభక్తికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, కార్యకర్తల సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మోదీ మణిపూర్ ఎందుకు వెళ్లలేదు? ‘గంభీరంగా కనిపిస్తున్నట్లు నటించే మోదీ నిజానికి అత్యంత భయస్తుడు. ప్రధాని మోదీ ఇప్పటివరకు 42 దేశాల్లో పర్యటించారు. కానీ స్వదేశంలో అగి్నగుండంగా మారిన మణిపూర్‌కు మాత్రం వెళ్లలేదు. మణిపూర్ భారత్‌కు అత్యంత కీలకమైన ప్రదేశం. అక్కడ జరుగుతున్న ఆందోళనలను పరిశీలించేందుకు నేను, రాహుల్‌గాంధీ వెళ్లాం. బాధితులను పరామర్శించాం. మరి మోదీ ఎందుకు మణిపూర్ వెళ్లలేదు? వారు దేశ పౌరులు కాదా? దేశ ప్రజలను పట్టించుకోకుండా ప్రపంచ దేశాలు తిరుగుతూ దేశ ప్రజలను మోదీ రోడ్లపై వదిలేశారు. మోదీ మాదిరి అప్పట్లో ఇందిరాగాంధీ భయపడలేదు. బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం కల్పిస్తామని చెప్పి చేసి చూపించారు..’ అని ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాకే అందరికీ అభివృద్ధి ఫలాలు ‘కార్యకర్తల కృషితోనే తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చింది. కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి ఆత్మ. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని చేసిన ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పికొట్టారు. రాహుల్‌గాంధీ పాదయాత్ర సమయంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అర్థమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. కీలక రంగాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు, రైతుభరోసా, రుణమాఫీ లాంటి ఎన్నో పథకాలు అమల్లోకి వచ్చాయి. ఇవన్నీ ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలి. రాజ్యాంగం నుంచి లౌకిక పదాన్ని తొలగించలేరు.. హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలు దాదాపు 50కి పైగా కాంగ్రెస్ పాలనలో ఏర్పడ్డాయి. మరి మోదీ ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏమిచ్చిందో చెప్పాలి. నల్లధనం తెచ్చి ప్రతి వ్యక్తికి రూ.15 లక్షలు ఇస్తానన్న మోదీ ఆ తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. మోదీ, అమిత్‌షా అబద్ధాలు చెప్పి ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు. సెక్యులర్ అనే పదం రాజ్యాంగంలో లేదని బీజేపీ చెప్తోంది. కానీ రాజ్యాంగం నుంచి లౌకిక అనే పదాన్ని తీసేయలేరు. సెక్యులర్ అనే పదంతో ఇబ్బందిగా ఉంటే బీజేపీ పార్టీ ప్రణాళిక నుంచి ఆ పదం తొలగించి చూపించాలి..’ అని ఖర్గే సవాల్ చేశారు. కాంగ్రెస్‌కు కార్యకర్తలే బ్రాండ్ అంబాసిడర్లు: సీఎం ‘తెలంగాణలో అధికార మదంతో తమకు తిరుగులేదనే అహంకారంతో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ కార్యకర్తలకే దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బ్రాండ్ అంబాసిడర్లు. కార్యకర్తల కృషితో ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం..ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ప్రభుత్వం ఏర్పాటైన 18 నెలల్లోనే రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, పేదలకు సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు లాంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. ఈ పథకాలు దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నాయి. తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శంగా మారుతోంది. ఈ పథకాలను కేంద్ర ప్రభుత్వం సైతం అమలు చేయాల్సిన పరిస్థితి వస్తోంది..’ అని సీఎం రేవంత్ చెప్పారు. ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి ‘అద్భుతమైన పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నప్పటికీ వాటిని ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతున్నాం. ప్రతి శాఖలో ఒక సంక్షేమ పథకం ఉంది. ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం కల్పించాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉంది. ప్రజా ప్రభుత్వం ప్రతి హామీ అమలు చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కుల సర్వే హామీ ఇచ్చి అమలు చేసి చూపించాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దానిని జనగణనలో చేర్చింది. మహిళా సంఘాలకు ఆర్టీసీలో బస్సులు అద్దెకు ఇప్పించి లాభాలు గడించేలా ప్రోత్సహిస్తున్నాం. సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్‌బంక్‌లు ఏర్పాటు చేయిస్తూ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నాం. కోటిమంది మహిళలను ఎస్‌హెచ్‌జీల్లో చేర్పించి కోటీశ్వరులుగా చేసే బాధ్యత ప్రభుత్వానిదే. మోదీ, కిషన్‌రెడ్డి, కేసీఆర్ చర్చకు రావాలి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. 18 నెలల్లో రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. వంద నియోజకవర్గాల్లో రూ.20 వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలను స్థాపించాం. ఈ విషయాలన్నీ ప్రజలకు వివరించాలి. నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి. ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వదంటూ కొందరు వెకిలిగా వ్యాఖ్యానించారు. కానీ 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతు భరోసా అందించాం. ఈ అంశంపై మోదీ, కిషన్‌రెడ్డి, కేసీఆర్ చర్చకు రావాలి. రైతులకు ఎవరు మేలు చేశారో అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాం..’ అని ముఖ్యమంత్రి సవాల్ చేశారు. కార్యకర్తల ఎన్నికలొస్తున్నాయి.. ‘రాష్ట్రంలో నియోజకవర్గాల పునరి్వభజనతో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ, 15 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించి అధిష్టానానికి బహుమతి ఇచ్చేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. స్టేజిమీద ఉన్న నాయకుల ఎన్నికలు అయ్యాయి. ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించే బాధ్యత కార్యకర్తలపైనే ఉంది. కార్యకర్తల గెలుపు కోసం పూర్తి సహకారం అందిస్తాం. టిక్కెట్ల కోసం ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు. బీఫామే ఇంటికి వస్తుంది..’ అని సీఎం అన్నారు. కాగా బహిరంగ సభ అనంతరం ఖర్గే బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. -
ఎవరా 'బీహార్ కీ భేటీ'?.. మోదీ మనసులో కరేబియన్ ప్రధానికి ప్రత్యేక స్థానం
ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ట్రినిడాడ్ అండ్ టొబాగోకి చేరుకున్నారు. అక్కడ పోర్ట్ ఆప్ స్పెయిన్‌లోని పియార్కో అంతర్జాతీయ విమానశ్రయంలో ఆయనకు ఆ దేశ మిలటరీ సైనికులచే గౌరవ వందనం లభించింది. అంతేగాదు కరేబియన్ దేశ ప్రధాన మంత్రి కమలా పెర్సాద్-బిస్సేసర్(Kamla Persad-Bissessar)తో సహా 38 మంత్రులు, నలుగురు పార్లమెంట్ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ స్వాగత సమయంలో ట్రినిడాడ్ అండ్ టొబాగొ మంత్రి కమలా పెర్సాద్ భారతీయ దుస్తుల్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కానీ మన మోదీ ఆ దేశ ప్రధాని కమ్లా పెర్సాద్‌ను 'బిహారీకా బేటి' అని పిలవడం విశేషం. అంతేగాదు ఆ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ..భారత్‌కి ట్రినిడాడ్ అండ్ టొబాగోకి ఉన్న సంబంధబాంధవ్యాలతో సహా ఆ దేశ ప్రధాని భారత మూలాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మరి ఆ విశేషంలేంటో సవివరంగా చూద్దామా..!.ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. ఈ కరేబియన్ దేశ ప్రధాని కమలా పెర్సాద్- మా బిహార్ కా భేటి అని సగర్వంగా చెప్పారు. ఆ ప్రధాని పూర్వీకులు బిహార్‌లోని బక్సర్‌కు చెందినవారని, ఆమె కూడా భారతదేశంలోని ఆ ప్రాంతాన్ని సందర్శించారని తెలిపారు. మాకు ఈ దేశంతో కేవలం రక్త సంబంధం లేదా ఇంటి పేరుతోనో బంధం ఏర్పడలేదని అంతకుమించిన బాంధవ్యం ఇరు దేశాల నడుమ ఉందని అన్నారు. స్నేహం చిగురించింది ఇలా..అలాగే ఇరు దేశాల మధ్య స్నేహం ఎలా చిగురించిందో కూడా గుర్తు చేసుకున్నారు. బనారస్, పాట్నా, కోల్‌కతా, ఢిల్లీ వంటి నగరాలు భారతదేశంలోనే కాకుండా ట్రినిడాడ్‌లో వీధి పేర్లుగా కూడా ఉన్నాయని చెప్పారు. అలా ఈ రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు అత్యంత బలంగా ఉన్నాయన్నారు. అందుకు నిదర్శనం ఇక్కడ జరుపుకునే నవరాత్రులు, మహాశివరాత్రి, జన్మాష్టమి వంటి పండుగలేనని అన్నారు. ఈ దేశ పురాతన చౌతల్(సంగీతం), భైతక్(వ్యాయామం) ఎంత ప్రాచుర్యం పొందాయో తెలుసనని అన్నారు. ఇక ఇక్కడ సుమారు 5 లక్షల మందికి పైనే భారత సంతతికి చెందినవారు నివసిస్తున్నారని, వారిలో దాదాపు 1800 మంది ప్రవాస భారతీయులని, మిగిలినివారు 1845, 1917ల మధ్య భారతదేశం నుంచి ఒప్పంద కార్మికులుగా వలస వచ్చిన స్థానిక పౌరులేనని గుర్తుచేశారు. అందువల్ల మిమ్మల్ని భారత్ జాగ్రత్తగా చూసుకుంటుందని హామీ ఇచ్చారు. అంతేగాదు మా దేశం మీకు సదా ఆహ్వానం పలుకుతుందని చెప్పారు. అలాగే బిహార్ కూడా శతాబ్దాలుగా వివిధ రంగాలలో ప్రపంచానికి మార్గం చూపించదని చెప్పారు. 21వ శతాబ్దంలో కూడా బీహార్ నుంచి కొత్త అవకాశాలు ఉద్భవిస్తాయని అన్నారు.ఎవరీ కమలా పెర్సాద్..కమలా పెర్సాద్ బిస్సేసర్ 1987లో రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. అనేక చారిత్రక నిర్ణయాలతో పేరుతెచ్చుకున్న మంత్రి. అంతేగాదు ఆమె కరేబియన్ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి, అటార్నీ జనరల్, ప్రతిపక్ష నాయకురాలు కూడా. అలాగే కామన్వెల్త్ దేశాలకు అధ్యక్షత వహించిన తొలి మహిళ. అదీగాక తొలి భారత సంతతి మహిళా ప్రధానిగా కూడా ఘనత దక్కించుకున్నారామె.ఇక ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో భారతదేశంలోని జోధ్‌పూర్ కంటే చిన్నదేశమే అయినా..మాన భారతదేశ సంస్కృతి, ఆర్థికవ్యవస్థలో కీలక పాత్ర పోషించడం విశేషం. కాగా, ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని నివశిస్తున్న ఆరవతరం భారతీయ ప్రవాసులకు ఓసీఐ(ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(OCI)) కార్డులు అదిస్తామని ప్రకటించారు మోదీ.#WATCH | Trinidad and Tobago | Addressing the Indian community, PM Modi says, "OCI cards will now be given to the 6th generation of the Indian diaspora in Trinidad and Tobago... We are not just connected by blood or surname, we are connected by belonging. India looks out to you… pic.twitter.com/hBU8tqCb9c— ANI (@ANI) July 4, 2025 (చదవండి: అమెరికా ఆఫీసులో భారతీయ మహిళ ఆకలి తిప్పలు..! పాపం ఆ రీజన్‌తో..) -
ప్రధాని మెచ్చిన రొట్టె!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో కర్నాటకలోని కలబుర్గి రొట్టెల గురించి ప్రస్తావించడం ఒక విశేషం అయితే, కొన్ని గంటల వ్యవధిలోనే కలబుర్గి రొట్టెల ఉత్పత్తి సహకార సంఘానికి 60కి పైగా అమెజాన్ ఆర్డర్లు రావడం మరో విశేషం. కలబుర్గి జిల్లాలోని వందలాది మహిళలకు ఈ సంఘం ఉపాధి కల్పిస్తోంది. జిల్లాలోని వివిధ గ్రామాల మహిళల నుంచి రొట్టెలను సేకరించి ఇ–కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయిస్తుంటుంది.‘కలబుర్గి రొట్టెల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించడం వల్ల ఎంతోమంది పేద మహిళలకు మేలు జరుగుతోంది. ఒకప్పుడు మేమందరం ఇంటిపనులకే పరిమితమయ్యేవాళ్లం. రొట్టెల తయారీ ద్వారా వ్యాపారంలోకి అడుగుపెట్టాం’ అంటుంది కొట్నూరు గ్రామంలోని ‘నంది బసవేశ్వర రొట్టి కేంద్ర’కు చెందిన నింగమ్మ.‘కలబుర్గి రొట్టెల గురించి ప్రధాని మాట్లాడడం చాలా సంతోషంగా అనిపించింది. దీని వల్ల మా రొట్టెలకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది’ అంటుంది చిట్టాపూర్ గ్రామానికి చెందిన శరణమ్మ. ఆమె ‘మాతా మల్లమ్మ రోటీ కేంద్ర’ నిర్వాహకురాలు.(చదవండి: "దాల్ తల్లి": ఆ విదేశీ బామ్మ నిస్వార్థ సేవకు మాటల్లేవ్ అంతే..!) -
బలమైన భారత్‌తో స్థిరమైన ప్రపంచం
ఆక్రా: భారతదేశం బలంగా ఉంటే ప్రపంచం మరింత స్థిరంగా, సౌభాగ్యవంతంగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాలు వేగంగా మారిపోతున్న నేపథ్యంలో ప్రపంచ పాలనా విధానంలో విశ్వసనీయమైన, ప్రభావవంతమైన సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టంచేశారు. ఘనా పార్లమెంట్లో గురువారం ప్రధాని మోదీ ప్రసంగించారు. దక్షిణార్ధ గోళ దేశాల (గ్లోబల్ సౌత్) గొంతుకకు బలం, విలువ ఇవ్వకపోతే ప్రపంచ అభివృద్ధి సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ప్రస్తుత ప్రపంచ అనిశ్చిత పరిస్థితుల్లో స్థిరమైన భారత ప్రజాస్వామ్యం ఒక ఆశారేఖగా వెలిగిపోతోందని హర్షం వ్యక్తంచేశారు. ఇండియా సాధిస్తున్న వేగవంతమైన అభివృద్ధి ప్రపంచ ప్రగతికి ఉ్రత్పేరకంగా మారిందన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ప్రపంచానికి ఒక బలమైన మూలస్తంభంగా నిలుస్తోందన్నారు. భారత్ మరింత బలోపేతమైతే ప్రపంచ స్థిరత్వానికి, సౌభాగ్యానికి తిరుగు ఉండదని స్పష్టంచేశారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే... నినాదాలకు మించిన కార్యాచరణ ‘‘అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా అగ్రస్థానంలో ఉంది. స్థిరమైన పాలన, రాజకీయ వ్యవస్థ అనే పునాదిపై ఇండియా త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం తథ్యం. గ్లోబల్ సౌత్‌లో మా వాటా 16 శాతంగా ఉంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ మా దేశంలోనే ఉంది. ఇండియా ఇన్నోవేషన్, టెక్నాలజీ హబ్‌గా మారింది. పెట్టుబడులకు అంతర్జాతీయ కంపెనీలు ముందుకొస్తున్నాయి. మరోవైపు ప్రపంచానికి కొత్తకొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వాతావరణ మార్పులు, మహమ్మారులు, ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ వంటివి సమస్యగా మారాయి. గత శతాబ్దంలో ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థలు వీటిని పరిష్కరించలేకపోతున్నాయి. అందుకే గ్లోబల్ గవర్నెన్స్‌లో విశ్వసనీయమైన, ప్రభావంతమైన సంస్కరణలు కచి్చతంగా రావాలి. ప్రపంచం బాగు కోసం గ్లోబల్ సౌత్‌కు మరింత బలం చేకూరాలి. నినాదాలకు మించిన కార్యాచరణ కావాలి. జీ20 కూటమికి మేము సారథ్యం వహించినప్పుడు ‘ఒకే భూగోళం, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు’ అనే విజన్‌తో పనిచేశాం. మా హయాంలోనే ఆఫ్రికన్ యూనియన్ జీ20లో శాశ్వత సభ్యదేశంగా మారింది. ఆఫ్రికా అభివృద్ధి ఎజెండాకు మద్దతు ఆఫ్రికా అభివృద్ధి ప్రయాణంలో పాలుపంచుకొనేందుకు ఇండియా కట్టుబడి ఉంది. ఆఫ్రికా ప్రజల అభ్యున్నతి కోసం ఆఫ్రికా అభివృద్ధి ఎజెండా–2063కు మద్దతిస్తున్నాం. ఆఫ్రికా లక్ష్యాలు మాకు ప్రాధాన్యతలు. కలిసి పనిచేస్తూ సమానంగా ఎదగాలన్నదే మా విధానం. ఆఫ్రికాతో మా అభివృద్ధి భాగస్వామ్యం కొనసాగుతుంది. స్థానికంగా నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల సృష్టికి కృషి చేస్తాం. ఆఫ్రికాలో కేవలం పెట్టుబడులు పెట్టడమే కాదు, స్థానిక ప్రజల సాధికారతే మా ధ్యేయం. స్ఫూర్తిదాయకమైన చరిత్ర కలిగిన ఘనాలో పర్యటిస్తుండడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది భారత్. మాకు ప్రజాస్వామ్యం అంటే కేవలం ఒక వ్యవస్థ కాదు.. మా ప్రాథమిక విలువల్లో అదొక అంతర్భాగం. ఇండియాలో ప్రజాస్వామ్యానికి వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది. నిజమైన ప్రజాస్వామ్యం చర్చ, సంవాదాన్ని ప్రోత్సహిస్తుంది. అది ప్రజలను ఐక్యం చేస్తుంది. గౌరవం, మానవ హక్కులకు అండగా నిలుస్తుంది. ఏ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకైనా పారదర్శక, స్వేచ్ఛాయుత ఎన్నికలు ఆత్మలాంటివి. ఇండియాలో ఎన్నికల సంఘం పనితీరును దగ్గరగా గమనించడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది’’ అని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. ఘనా పార్లమెంట్లో ఘనా–ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ సొసైటీని స్థాపించడాన్ని ఆయన స్వాగతించారు. ఇండియాలో 2,500 రాజకీయ పారీ్టలున్నాయని మోదీ చెప్పగా ఘనా పార్లమెంట్ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. భారత్–ఘనా మధ్య ‘సమగ్ర భాగస్వామ్యం’ భారత్–ఘనా దేశాలు తమ పరస్పర సంబంధాలను ‘సమగ్ర భాగస్వామ్యం’ స్థాయికి పెంచుకున్నాయి. ఘనా అభివృద్ధి ప్రయాణానికి భారత్ తోడుగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆయన గురువారం ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమానీ మహామాతో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్–ఘనా మధ్య పరస్పర వాణిజ్యాన్ని రాబోయే ఐదేళ్లలో రెండింతలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రెండు రోజుల పర్యటన కోసం మోదీ బుధవారం రాత్రి ఘనా చేరుకున్నారు. తొలుత ఘనా అధ్యక్షుడితో కలిసి ప్రతినిధుల స్థాయి చర్చల్లో పాల్గొన్నారు. గురువారం ఇరువురు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. సంస్కృతి, సంప్రదాయ వైద్యంతోపాటు వేర్వేరు రంగాల్లో సహకారం కోసం ఈ ఒప్పందాలు కుదిరాయి. ఘనాకు భారత్ కేవలం భాగస్వామి మాత్రమే కాదని, ఘనా దేశ నిర్మాణంలో అండగా నిలుస్తోందని మోదీ ఉద్ఘాటించారు.మోదీకి ఘనా జాతీయ గౌరవ పురస్కారం ప్రధాని నరేంద్ర మోదీకి ఘనా జాతీయ గౌరవ పురస్కారం ‘ద ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా’ లభించింది. ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమానీ మహామా ఆయనకు ఈ పురస్కారం ప్రదానం చేశారు. ప్రశంసనీయమైన రాజనీతిజ్ఞత ప్రదర్శించడంతోపాటు ప్రపంచ స్థాయి నేతగా ప్రభావం చూపుతున్నందుకు గాను మోదీని ఘనా ప్రభుత్వం ఈ పురస్కారంతో సత్కరించింది. ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఇది ఎంతో గర్వకారణమని చెప్పారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఘనా జాతీయ గౌరవ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.ముగిసిన ఘనా పర్యటనభారత ప్రధానమంత్రి ఘనాలో రెండు రోజుల పర్యటన ముగించుకొని గురువారం ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి పయనమయ్యారు. శుక్రవారం ఆ దేశ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. -
‘భాగస్వామ్యమే కాదు.. సహ ప్రయాణం’.. ఘనాలో ప్రధాని మోదీ
అక్రా: ఘనా అభివృద్ధి ప్రయాణంలో భారత్ కేవలం భాగస్వామి మాత్రమే కాదని, సహ ప్రయాణం సాగిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధాని తన ఐదు రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ ఆఫ్రికాలోని ఘనాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఘనాలో ప్రధాని మోదీకి ఆ దేశ ప్రతినిధుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఆ తరువాత ఆయన ఘనా అధ్యక్షుడు జాన్ ద్రామానీ మహామాతో పలు భాగస్వామ్య అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాను ఉద్దేశించి ప్రకటన చేశారు. రాబోయే ఐదు సంవత్సరాలలో ఇరు దేశాలు ద్విమార్గ వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని, భారత్.. ఘనాకు కేవలం భాగస్వామి మాత్రమే కాదని, ఘనా అభివృద్ధి ప్రయాణంలో సహ ప్రయాణం చేస్తున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత కంపెనీలు ఘనాలో దాదాపు 900 ప్రాజెక్టులలో రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాయన్నారు. రాబోయే ఐదేళ్లలో పరస్పర వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. I thank the people and Government of Ghana for conferring ‘The Officer of the Order of the Star of Ghana’ upon me. This honour is dedicated to the bright future of our youth, their aspirations, our rich cultural diversity and the historical ties between India and Ghana.This… pic.twitter.com/coqwU04RZi— Narendra Modi (@narendramodi) July 2, 2025ఫిన్‌టెక్ రంగంలో, భారతదేశం ఘనాతో యూపీఐ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువని.. ఇరు దేశాలు స్పష్టం చేశాయని, ఆ ముప్పును ఎదుర్కోవడంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని తెలిపారు. రక్షణ, భద్రతా రంగంలో తాము సంఘీభావం ద్వారా భద్రత అనే సూత్రంతో ముందుకు సాగుతామన్నారు. సాయుధ దళాల శిక్షణ, సముద్ర భద్రత, రక్షణ సరఫరా, సైబర్ భద్రత తదితర రంగాల్లో భారత్-ఘనా దేశాల మధ్య పరస్పర సహకారం పెరుగనున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా సంస్కృతి, సాంప్రదాయ వైద్యంతోపాటు పలు రంగాల్లో సహకారాన్ని అందించే నాలుగు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకం చేశాయి.ఇది కూడా చదవండి: కన్వర్ యాత్రకు అవే నిబంధనలు.. మళ్లీ వివాదం తలెత్తేనా? -
ఘనాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
ఆక్రా: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనాకు చేరుకున్నారు. ఘనా అధ్యక్షుడు జాన్ ద్రామానీ మహామా ఆహ్వానం మేరకు ఆయన ఇక్కడ పర్యటిస్తున్నారు. కొటోకా ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టులో మోదీకి ఘన స్వాగతం లభించింది. సైనికులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. ఘనా ప్రభుత్వాధి నేతలతో మోదీ సమావేశ మవుతారు. భారత్–ఘనా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చిస్తారు. ప్రధాని మోదీ ఘనాలో పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి. అలాగే గత మూడు దశాబ్దాల్లో భారత ప్రధాని ఘనాలో అడుగుపెట్టడం కూడా ఇదే తొలిసారి. ఇండియా నుంచి బయలుదేరే ముందు మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. గ్లోబల్ సౌత్‌లో భారత్‌కు ఘనా అత్యంత విలువైన భాగస్వామి అని పేర్కొన్నారు. ఘనా పర్యటన అనంతరం ఆయన ఈ నెల 3, 4వ తేదీల్లో ట్రినిడాడ్ అండ్ టోబాగోలో, 4, 5వ తేదీల్లో అర్జెంటీనాలో పర్యటిస్తారు. తర్వాత బ్రెజిల్లో 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతారు. చివరగా నమీబియాలో పర్యటించి, స్వదేశానికి చేరుకుంటారు. -
ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటన షురూ.. షెడ్యూల్ ఇదే..
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల విదేశీ పర్యటనకు బుధవారం శ్రీకారం చుట్టారు. తొలుత ఆయన ఢిల్లీ నుంచి ఘనాకు విమానంలో బయలుదేరారు. నేటి నుంచి జూలై 9 వరకు ప్రధానమంత్రి మోదీ విదేశీ పర్యటన సాగనుంది. తన పర్యటనలో భాగంగా ఆయన నేడు, రేపు ఘనాను సందర్శించనున్నారు.మూడు దశాబ్దాల తర్వాత ఒక భారత ప్రధాని ఘనాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఘానా అధ్యక్షునితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఆర్ధిక, ఎనర్జీ, డిఫెన్స్ పరస్పర సహకారంపై చర్చ జరగనుంది. జూలై 3-4 తేదీల్లో ట్రినిడాడ్, టోబాగోలో ప్రధాని పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఆయన ట్రినిడాడ్ అధ్యక్షురాలు, ప్రధాని బిసెసర్‌తో భేటీ కానున్నారు. అలాగే ట్రినిడాడ్ పార్లమెంటులో సంయుక్త సభను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. #WATCH | Delhi: Prime Minister Modi emplanes for Ghana. PM Modi embarks on a five-nation tour including Ghana, Trinidad and Tobago, Argentina, Brazil, and Namibia. PM Modi will also participate in the BRICS Summit in Brazil.#PMModi #Trending pic.twitter.com/Zjzg9Hhp1O— TIMES NOW (@TimesNow) July 2, 2025జూలై 4-5 తేదీల్లో అర్జెంటీనాలో ప్రధాని మోదీ పర్యటన సాగనుంది. అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలేయ్తో సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా డిఫెన్స్, ఖనిజాలు, వ్యవసాయం, ఎనర్జీ, వాణిజ్యంపై చర్చ జరపనున్నారు. ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతంపై చర్చించనున్నారు. జూలై 5-8 తేదీల్లో బ్రెజిల్లో 17వ ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని పాల్గొననున్నారు. ప్రపంచ శాంతి, గ్లోబల్ గవర్నెన్స్, ఏఐ, వాతావరణ మార్పులపై బ్రిక్స్ సదస్సులో చర్చ జరగనుంది. అదే సమయంలో బ్రెజిల్ అధ్యక్షుడు లులాతో కూడా ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. జూలై 9న జరిగే నమీబియా పర్యటనలో ప్రధాని మోదీ అక్కడి పార్లమెంటులో ప్రసంగించనున్నారు. -
మణిపూర్‌ను వదిలేసి విదేశీ ప్రయాణాలా?
న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న అతిముఖ్యమైన విషయాలను వదిలేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ విదేశీ పర్యటనలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మణిపూర్‌లో కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదని, అక్కడికి ఒక్కసారి కూడా వెళ్లలేదని విమర్శించింది. అదేవిధంగా, భారత్–పాక్‌ల మధ్య కాల్పుల విరమణకు తానే కారణమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే ప్రకటనలు చేస్తున్నా మోదీ మౌనంగా ఉంటున్నారంటూ మంగళవారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’లో పలు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నిర్ణయాల కారణంగానే ఆపరేషన్ సిందూర్‌లో మొదటి రెండు రోజుల్లో మనకు నష్టాలు మిగిలాయని రక్షణ శాఖ అధికారులు చేస్తున్న ఆరోపణలకు ఆయన సమాధానమివ్వడం లేదన్నారు. పహల్గాంలో దారుణానికి పాల్పడిన ఉగ్రవాదులను 70 రోజుల తర్వాత కూడా పట్టుకోలేకపోయారని విమర్శించారు. ఇది ప్రధాని తీవ్ర వైఫల్యంగా ఆయన పేర్కొన్నారు. ‘విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవరైనా వాటిని ఎదుర్కొని నిలబడతారు. మన ప్రధాని మాత్రం విదేశాలకు పయనమవుతారు’అని వ్యంగ్యా్రస్తాలు సంధించారు. ఈ నెల 2 నుంచి 8 రోజులపాటు ప్రధాని మోదీ 5 దేశాల పర్యటించనుండటం తెల్సిందే. -
ఆరోజు నేను మోదీతోనే ఉన్నాను.. జేడీ వాన్స్ ఫోన్ చేసి ఏమన్నారంటే..!
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించిన ఎపిసోడ్‌పై విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ పలు విషయాలను తాజాగా వెల్లడించారు. అసలు మే 9వ తేదీ రాత్రి ఏం జరిగింది?, ప్రధాని మోదీకి ఫోన్ చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అసలు ఏం మాట్లాడారు అనే దానిపై క్లారిటీ ఇచ్చారు జై శంకర్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జై శంకర్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ అంశం, కాల్పుల విరమణ అంశాలకు సంబంధించి తన అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఆ రాత్రి తాను మోదీతో పాటే ఉండటంతో అక్కడ ఏం జరిగిందనేది విషయాన్ని వెల్లడించారు.‘ఆ రోజు వాన్స్ ఫోన్ చేసి మీరు కొన్ని విషయాలను ఒప్పుకోకపోతే పాకిస్తాన్ నుంచి భారీ ముప్పు చూడాల్సి ఉంటుందనే హెచ్చరించారు. అది ఏంటనేది మోదీకి కూడా తెలియదు. ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసిన తర్వాతే జరిగిన సంభాషణ అది. పాకిస్తాన్ ఏం చేస్తుందో చూద్దాం.. మా నుంచి కూడా ప్రతిదాడి ఉంటుంది’ అని వాన్స్‌కు మోదీ తెలిపారని జై శంకర్ పేర్కొన్నారు.‘ ఆ రాత్రి పాక్ నుంచి దాడులు ఆరంభం అయ్యాయి. దానికి మనం కూడా అంతే ధీటుగా బదులిచ్చాం. ఆ మరుసటి రోజు ఉదయం పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ రూబియో మాకు ఫోన్ చేశారు. పాకిస్తాన్ చర్చలకు సిద్ధంగా ఉందన్నారు. ఇలా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది. ఇది ఆ ఘటనకు సంబంధించి ఆనాటి నా వ్యక్తిగత అనుభవం’ అని తెలిపారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాత్ర ఏమీ లేదని కొట్టిపారేశారు జై శంకర్. ట్రంప్ చెప్పుకుంటున్నట్లు ట్రేడ్ డీల్ కారణంగానే భారత్ వెనక్కి తగ్గిందనే వార్తల్లో నిజం లేదన్నారు. అసలు ట్రంప్‌కు కాల్పుల విరమణ అంగీకారానికి సంబంధం లేదని తేల్చిచెప్పారు జై శంకర్. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. నేషనల్ స్పోర్ట్స్ పాలసీకి గ్రీన్‌సిగ్నల్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జాతీయ క్రీడా విధానానికి కేంద్ర మంత్రి వర్గం పచ్చజెండా ఊపింది. దేశంలోని క్రీడా రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన కేంద్రం.. కొత్త క్రీడా విధానానికి ఆమోదం తెలిపింది. ఉపాధి లింక్డ్ ప్రోత్సాహక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.ఉత్పాదక రంగంలో ఉద్యోగకల్పన ప్రోత్సహించేందుకు కొత్త పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా రాబోయే రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాల సృష్టికి ప్రోత్సాహకం ఇవ్వనుంది. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 99,446 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఆగస్టు 1, 2025 నుంచి జూలై 31, 2027 వరకు సృష్టించే కొత్త ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుంది. కొత్తగా ఉద్యోగం కల్పిస్తే 15 వేల రూపాయల ప్రోత్సాహం ఇవ్వనుంది.ఈపీఎఫ్ రెండు వాయిదాలలో కేంద్ర ప్రభుత్వం చెల్లించనుంది. లక్ష రూపాయల లోపు జీతం వచ్చే ఉద్యోగులకు వర్తించనుంది. కొత్తగా ఉద్యోగం ఇచ్చిన కంపెనీలకు ప్రతినెల 3 వేల రూపాయల చొప్పున రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం చెల్లించనుంది. పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం కోసం లక్ష కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేయనుంది. ఆర్‌అండ్‌డి రంగంలో ప్రైవేట్ రంగం పెట్టుబడులను ప్రోత్సహించడానికి తక్కువ లేదంటే.. 0 వడ్డీరేట్లతో దీర్ఘకాలిక ఫైనాన్స్న ప్రభుత్వం ఇవ్వనుంది. తమిళనాడు పారమాకుడి-రామంతపురం సెక్షన్ మధ్య నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 1,853 కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేయనుంది. -
పాశమైలారం ఘటన బాధాకరం: ప్రధాని మోదీ
ఢిల్లీ: సంగారెడ్డి ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల బంధువులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 ఎక్స్ గ్రేషియా అందిస్తాం’’ అని ప్రధాని మోదీ తెలిపారు.పటాన్చెరు పారిశ్రామికవాడ పాశమైలారంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. సిగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి కంపెనీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, మ్యాన్‌ఫ్యాక్చరింగ్ యూనిట్ సహా చాలా భాగం దెబ్బతింది. ఆ సమయంలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పరిసరాల్లోనే భారీ సంఖ్యలో కార్మికులు ఉన్నట్లు సమాచారం. తెలంగాణరాష్ట్రం, సంగారెడ్డిలోగల ఒక కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.మృతుల బంధువులకు PMNRF నుండి రూ. 2 లక్షలు,…— PMO India (@PMOIndia) June 30, 2025 -
బుద్ధుడిపై వియత్నాం ప్రజల్లో భక్తి, ఆప్యాయత ఉన్నాయి
సాక్షి, న్యూఢిల్లీ/విజయపురి సౌత్: ప్రపంచ పర్యాటక బౌద్ధ కేంద్రమైన నాగార్జునకొండలోని భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలను దర్శనం చేసుకునేందుకు వీలు కలి్పంచినందుకు వియత్నాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సందేశాల ద్వారా కృతజ్ఞతలు చెబుతున్నారని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. మొదట భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలు రాష్ట్రంలోని పల్నాడు జిల్లా నాగార్జున కొండలో కనుగొన్నట్టు తెలిపారు.ఈ ప్రదేశానికి బౌద్ధ మతంతో లోతైన సంబంధం ఉందన్నారు. ఒకప్పుడు శ్రీలంక, చైనా వంటి సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఈ ప్రదేశానికి వచ్చి సందర్శించే వారని మోదీ వివరించారు. ఆదివారం జరిగిన మన్ కీ బాత్ 123వ ఎపిసోడ్లో మోదీ ప్రసంగించారు. వియత్నాం ప్రజలు పంపించిన సందేశాలలో ప్రతి పంక్తిలో భక్తి, ఆప్యాయత ఉన్నాయన్నారు. బుద్ధుని పవిత్ర అవశేషాలను దర్శనం చేసుకునేందుకు వీలు కల్పించినందుకు వారు భారతదేశానికి తమ కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ఆదివాసీ విద్యార్థులు భేష్ ‘పదేళ్ల క్రితం ప్రారంభమైన అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం గొప్పగా మారుతోంది. విశాఖపట్నంలో జరిగిన యోగా దినోత్సవంలో చాలా ఆకర్షణీయమైన చిత్రాలను మనం చూశాం. బీచ్‌లో 3 లక్షల మంది యోగా చేయడం.. యోగాపై వారికున్న అంకితభావాన్ని గుర్తు చేస్తోంది’ అని మన్ కీ బాత్‌లో మోదీ గుర్తు చేసుకున్నారు. దేశ ప్రజలంతా అంతర్జాతీయ యోగా దినోత్సవం జ్ఞాపకాలతో నిండి ఉండాలని ఆకాంక్షించారు.ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘విశాఖ నుంచే మరో అద్భుతమైన దృశ్యం వెలువడింది. రెండు వేలకు పైగా ఆదివాసీ విద్యార్థులు 108 నిమిషాల పాటు సూర్య నమస్కారాలు చేశారు. వారికి యోగాపై ఎంత క్రమశిక్షణ, ఎంత అంకితభావం ఉందో మీరే ఊహించుకోండి. మన నావికాదళ నౌకలపై కూడా యోగా గొప్పతనం కనిపించింది’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. -
ఎమర్జెన్సీ యోధులు చిరస్మరణీయులు
న్యూఢిల్లీ: దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన వ్యక్తులు రాజ్యాంగాన్ని హత్య చేయడంతోపాటు న్యాయ వ్యవస్థను చెరబట్టారని, కీలుబొమ్మను చేసి ఆడించారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఎమర్జెన్సీ పేరిట అప్పటి ప్రభుత్వం ప్రజలను వేధింపులకు గురి చేసిందని, లెక్కలేనన్ని అఘాయిత్యాలు జరిగాయని ఆరోపించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం సాగించిన నాయకులు చిరస్మరణీయులని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ విషయంలో వారి పోరాటమే మనకు స్ఫూర్తి అని ఉద్ఘాటించారు. ఆదివారం 123వ ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.ప్రజల భాగస్వామ్యం, వారి సమ్మిళిత శక్తితో ఎలాంటి సంక్షోభాలనైనా ఎదుర్కోవచ్చని అన్నారు. కొన్ని ఆడియో రికార్డులను ప్రధానమంత్రి వినిపించారు. సంక్షోభం అంటే ఎంత భయకరంగా ఉంటుందో వీటిద్వారా తెలుస్తుందని అన్నారు. ఎమర్జెన్సీ తర్వాత ప్రధానమంత్రిగా పనిచేసిన మొరార్జీ దేశాయ్ మాట్లాడిన ఆడియో, ఎమర్జెన్సీ దారుణాల గురించి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ మాట్లాడిన ఆడియోలు ఇందులో ఉన్నాయి. నాటి దారుణాలు మరవలేం ‘‘ఇందిర హయాంలో ప్రజలపై దమనకాండ కొన్ని సంవత్సరాలపాటు నిరంతరాయంగా కొనసాగింది. ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత రెండేళ్లపాటు మరింత తీవ్రంగా మారింది. ప్రజల హక్కులను హరించారు. స్వాతంత్య్రపు హక్కును అణచివేశారు. వార్తాపత్రికలపై కఠిన ఆంక్షలు విధించారు. కోర్టులను సైతం వదల్లేదు. వాటికి అధికారాలు లేకుండా చేశారు. లక్ష మందికిపైగా జనాన్ని జైళ్లలో పెట్టారు. అక్షరాలా రాక్షస పాలన సాగించారు’’ అని మొరార్జీ దేశాయ్ మాట్లాడిన ఆడియోలో వినిపించింది. 1975 నుంచి 1977 దాకా 21 నెలలపాటు ప్రజలను చిత్రహింసలకు గురి చేశారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. అప్పటి దారుణాలను ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు.జార్జి ఫెర్నాండెజ్ చేతులకు సంకెళ్లు వేశారని, మీసా చట్టం కింద వేలాది మందిని నిర్బంధించి, వారిపట్ల అమానవీయంగా ప్రవర్తించారని గుర్తుచేశారు. కానీ, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేశారని, చివరకు విజయం సాధించారని చెప్పారు. ఎమర్జెన్సీ విధించినవారికి గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్లయిన సందర్భంగా ఇటీవల ‘సంవిధాన్ హత్య దివస్’ జరుపుకున్నామని మోదీ తెలిపారు. 1977 ఎన్నికల్లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత వాజ్‌పేయ్ ఏం మాట్లాడారంటే.. ‘‘దేశంలో ఇప్పుడు జరిగిన దాన్ని కేవలం ఎన్నికలు అనలేం. ఇదొక శాంతియుత విప్లవం. ప్రజా వెల్లువ ప్రజాస్వామ్య హంతకులను కుర్చీ నుంచి కూలదోసింది. వారిని చెత్తబుట్టలోకి విసిరేసింది’’ దీనిపై మోదీ స్పందిస్తూ.. అత్యవసర పరిస్థితిని ఎదిరించి పోరాడిన వారిని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలని చెప్పారు.ట్రకోమా రహిత దేశంగా భారత్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ‘ట్రకోమా’ రహిత దేశంగా భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని ప్రధాన మోదీ అన్నారు. ఇందుకోసం కృషి చేసినవారికి అభినందనలు తెలియజేశారు. అస్సాంలోని బోడోలాండ్ ఫుట్‌బాల్ క్రీడాకారులుకు కేంద్రంగా మారిందని హర్షం వ్యక్తంచేశారు. మేఘాలయాలో ఎరీ సిల్క్‌కు భౌగోళిక గుర్తింపు(జీఐ) ట్యాగ్ లభించిందని ప్రత్యేకంగా ప్రస్తావించారు. పట్టు పరుగులను చంపకుండా అక్కడ వ్రస్తాలు తయారు చేస్తున్నారని ప్రధాని వెల్లడించారు. -
Mann Ki Baat: తెలంగాణను మెచ్చుకున్న ప్రధాని మోదీ..ఎందుకంటే..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీనెలా నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు (జూన్ 29) పలు అంశాలను ప్రస్తావించారు. భారతదేశాన్ని ట్రకోమా(కంటి వ్యాధి) నుండి విముక్తి పొందిన దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని ప్రధాని పేర్కొన్నారు. ఇది దేశంలోని ఆరోగ్య కార్యకర్తలు సాధించిన విజయమని, 'జల్ జీవన్' మిషన్ దీనికి దోహదపడిందని ప్రధాని వివరించారు.జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారని, ముఖ్యంగా తెలంగాణలో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమంలో మూడువేల మంది దివ్యాంగులు పాల్గొనడం విశేషమన్నారు. యోగా ఎంత శక్తివంతమైన సాధనంగా ఉంటుందో వారు చూపించారన్నారు. ఢిల్లీ ప్రజలు నది ఒడ్డున యోగా చేశారని, ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ వద్ద కూడా యోగా కార్యక్రమాలు జరిగాయన్నారు. న్యూయార్క్, లండన్, టోక్యో, పారిస్ తదితర ప్రాంతాల్లో యోగా వేడుకలు జరిగాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. Sharing this month's #MannKiBaat. Do tune in! https://t.co/N8WrWlWNId— Narendra Modi (@narendramodi) June 29, 2025కైలాశ్-మానసరోవర్ యాత్ర చాలా కాలం తర్వాత తిరిగి ప్రారంభమైందని, జూలై మూడు నుండి అమర్నాథ్ యాత్ర కూడా ప్రారంభం కానున్నదన్నారు. మరోవైపు మన దేశం ఆరోగ్య రంగంలోనూ విజయం సాధించిందని, భారత్ ట్రాకోమా రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందన్నారు. భారతదేశంలోని 64 శాతం జనాభాకు సామాజిక భద్రత అందుబాటులో ఉందంటూ అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ఒక నివేదికను విడుదల చేసిందన్నారు. దేశంలో దాదాపు 95 కోట్ల మంది సామాజిక భద్రతా పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు.ప్రధాని మోదీ నాటి అత్యవసర పరిస్థితి చీకటి రోజులను కూడా గుర్తుచేసుకున్నారు. ఆనాటి సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛను రద్దు చేశారన్నారు. అయితే చివరకు వివిధ పోరాటాలతో ప్రజలు గెలిచారని, ఫలితంగా అత్యవసర పరిస్థితిని ఎత్తివేశారన్నారు. ఆ సమయంలో ధైర్యంగా ముందుకొచ్చి పోరాడిన వారిని మనం గుర్తుంచుకోవాలన్నారు. కాగా మేఘాలయకు చెందిన ఎరి సిల్క్ ఇటీవలే జీఐ ట్యాగ్‌ను పొందిందని, ఎరి సిల్క్‌ను ‘అహింసా సిల్క్’ అని కూడా పిలుస్తారన్నారు. చివరిగా ప్రధాని మోదీ భారత అంతరిక్ష మిషన్ గురించి కూడా మాట్లాడారు. వ్యోమగామి శుభాన్షు శుక్లాను అభినందించారు. -
ఆఖరి వ్యక్తికి సైతం సంక్షేమ పథకాలు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నాగరికత, సజీవ సంస్కృతి మన సొంతమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఎందరో యోగులు, గురువులు, ఆచార్యులు, సాధువులు అందించిన మన ఆలోచనలు, ఆశయాలు, తాతి్వకత శాశ్వతమని, అందుకే భరతజాతి వేలాది సంవత్సరాలుగా సజీవంగా మనగలుగుతోందని వివరించారు. ప్రఖ్యాత జైన ఆధ్యాత్మిక గురువు ఆచార్య శ్రీవిద్యానంద్‌జీ మహారాజ్ శత జయంతి వేడుకలు, ఏడాదిపాటు జరిగే శతాబ్ది ఉత్సవాలు శనివారం ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ, భగవాన్ మహావీర్ అహింసా భారతి ట్రస్టు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఆచార్య స్మారకార్థం తపాలా బిళ్ల ఆవిష్కరించారు. ఆచార్యుడి జీవిత విశేషాలతో కూడిన ఎగ్జిబిషన్ తిలకించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి కార్యక్రమ నిర్వాహకులు ‘ధర్మ చక్రవర్తి’ బిరుదు ప్రదానం చేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ... ఈ బిరుదుకు తాను అర్హుడినని భావించడం లేదని చెప్పారు. కానీ, గురువులు, యోగుల నుంచి ఏదీ లభించినా దాన్ని ప్రసాదంగా స్వీకరించడం మన సంప్రదాయం, సంస్కృతిలో భాగమని తెలిపారు. అందుకే ‘ధర్మ చక్రవర్తి’ ప్రసాదాన్ని స్వీకరించి, భరతమాతకు అంకితం ఇస్తున్నానని ఉద్ఘాటించారు. మానవ జన్మకు అసలైన పరమార్థం అదే భారతీయ తాతి్వక చింతనకు సేవ, మానవత్వం మూల స్తంభాలని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. హింసను హింసతోనే అణచివేసే ధోరణి ప్రపంచంలో కొనసాగిందని, కానీ, మన దేశం అహింస అనే ఆయుధం అందించిందని చెప్పారు. మానవ సేవే మహోన్నతం అని మన దేశం బోధించినట్లు తెలిపారు. షరతులు లేకుండా, నిస్వార్థంగా సాటి మానవులకు సేవ చేయడమే మానవ జన్మకు అసలైన పరమార్థమని వివరించారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు అచార్య శ్రీవిద్యానంద్‌జీ మహారాజ్ ఆశయాలు, బోధనలే స్ఫూర్తి అని తెలిపారు. పీఎం ఆవాస్ యోజన, జల్‌జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ యోజన వంటి పథకాలను సంతృప్త స్థాయిలో అందించాలని నిర్ణయించామని చెప్పారు. సమాజంలో ఆఖరి వ్యక్తికి సైతం ఈ పథకాలు అందాలన్నదే తమ లక్ష్యమని స్పష్టంచేశారు. ‘ప్రజలంతా కలిసి పని చేయాలి.. కలిసికట్టుగా ఎదగాలి’ అని ఆచార్య విద్యానంద్‌జీ మహారాజ్ బోధించారని, అదే తమ సంకల్పమని ప్రధానమంత్రి తేల్చిచెప్పారు. -
ఒక్క రోజులో 16 సూర్యోదయాలు: శుభాంశు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం( ఐఎస్ఎస్)లో కి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో ప్రభాని నరేంద్ర మోదీతో జరిపిన సంభాషణ ఆసక్తికరంగా సాగింది. ఈరోజు(శనివారం, జూన్ 28వ తేదీ) శుభాంశు శుక్లాతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. తొలుత శుభాంశును విష్ చేసిన ప్రధాని మోదీ.. ‘ఇది శుభ్ ఆరంభ్ అని, ఇది నయా శకం’ అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్న మోదీ.. గొప్ప ఘనతను సాధించావంటూ కొనియాడారు. దానికి శుభాంశు బదులిస్తూ ఇది తన ఒక్కడి విజయం కాదని, భారత్ విజయమని వినమ్రతను చాటుకున్నారు. PM @narendramodi interacted with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station. pic.twitter.com/Q37HqvUwCd— PMO India (@PMOIndia) June 28, 2025 అదే సమయంలో అక్కడ ఎలా ఉంది అని మోదీ అడగ్గా... ఇక్కడ వాతావరణం అంతా భిన్నంగా ఉందని శుభాంశు తెలిపారు. ఈ కక్ష నుంచి చూస్తే భారత్ చాలా స్పెషల్‌గా కనిపిస్తుందని శుభాంశు స్పష్టం చేశారు. ఇక్కడ రోజుకు 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలుగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ కక్షలో పరిస్థితులకు అలవాటు పడుతున్నామని, నిద్ర పోవడం అనేది చాలా పెద్ద చాలెంజ్‌గా ఉందన్నారు. ఇక్కడ గ్రావెటీ లేమి కారణంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తుతున్నాయని శుభాంశు తెలిపారు. తల కాస్త భారంగా ఉంటుందని, ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయని, ఇవన్నీ చిన్న చిన్న ఇబ్బందులేనని తెలిపారు. మీ యొక్క ఆశీర్వాదంతో ఐఎస్ఎస్లో అతి సులభంగా అడుగుపెట్టానని పేర్కొన్నారు శుభాంశు. ఇక ఐఎస్ఎస్ నుంచి భారత్ చాలా పెద్దదిగా కనిపిస్తుందని, మ్యాప్ కంటే భిన్నంగా ఉందని మోదీ పేర్కొనగా, ఇక్కడ నుంచి చూస్తే భారత్ చాలా స్పెషల్‌గా కనిపిస్తుందని శుభాంశు తెలిపారు. ఇలా పలు విషయాలను పంచుకుంటూ ప్రధాని మోదీ-శుభాంశుల సంభాషణ కొనసాగింది. #WATCH | Prime Minister Narendra Modi interacts with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station.PM Modi says "Today, you are away from our motherland, but you are the closest to the hearts of Indians...Aapke naam mein bhi shubh hai aur aapki… pic.twitter.com/lWOk7AVlL3— ANI (@ANI) June 28, 2025 -
అంతరిక్షం నుంచి భారత్ ఓ అద్భుత దృశ్యకావ్యం
న్యూఢిల్లీ: ‘‘అంతరిక్షం నుంచి భారత్ ఓ అద్భుత దృశ్యకావ్యంలా కనువిందు చేస్తోంది’’ – మన వ్యోమగామి వాయుసేనాని, యాగ్జియం–4 మిషన్ కెప్టెన్ శుభాంశు శుక్లా (39) చేసిన భావోద్వేగపూరిత వ్యాఖ్యలివి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో క్రమంగా కుదురుకుంటున్న ఆయన శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో లింక్ ద్వారా మాటామంతి జరిపారు. ‘‘మ్యాప్‌లో చూసే భారతావనికి, అంతరిక్షం నుంచి కనిపిస్తున్న దృశ్యానికి పోలికే లేదు. ఇక్కడినుంచి మన దేశం చాలా పెద్దదిగా, ఎంతో గొప్పగా కనిపిస్తోంది. అంతరిక్షం నుంచి భూమి కూడా దేశాల ఎల్లలన్నవే లేకుండా ఎటునుంచి చూసినా నిండుగా, ‘వసుధైక కుటుంబం’లా కనువిందు చేస్తోంది. భూగోళమంతా మన ఇల్లుగా, అన్ని దేశాల ప్రజలందరం సమస్త మానవాళికీ ప్రాతినిధ్యం వహిస్తున్నామని మనసుకు తోస్తోంది’’ అని వివరించారు. ఐఎస్ఎస్లో కాలుపెట్టిన తొలి భారతీయునిగా శుభాంశు తిరుగులేని చరిత్ర సృష్టించారంటూ మోదీ ప్రస్తుతించారు. ‘‘మాతృభూమి నుంచి మీరు అత్యంత దూరంగా ఉండొచ్చు గాక. కానీ ప్రస్తుతం ప్రతి భారతీయుని హృదయానికీ అత్యంత దగ్గరగా ఉన్నారు. మీ పేరులోనే శుభముంది. అందుకు తగ్గట్టే మీ యాత్ర కూడా సరికొత్త యుగానికి శుభారంభం పలికింది. మన దేశ యువతకు కొంగొత్త ఆశలతో కూడిన కొత్త అధ్యాయానికి మీ ప్రస్థానం గొప్పగా బాటలు పరిచింది’’ అంటూ కొనియాడారు. ‘‘ఇప్పుడు మనమిలా మాట్లాడుకుంటున్న ఈ సమయాన ప్రతి ఒక్క భారతీయునికీ భావోద్వేగపరంగా మీతో విడదీయలేనంతటి బంధం పెనవేసుకుపోయింది. ఆ 140 కోట్ల పై చిలుకు అవ్యక్త భావనలను, ఆకాంక్షలను వారి ప్రతినిధిగా మీకు చేరవేస్తున్నాను. త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా వెంట తీసుకెళ్లిన మీకు నా మనఃపూర్వక శుభాభినందనలు. యాగ్జియం–4 మిషన్‌కు నా శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. తన ఐఎస్ఎస్ యాత్రను దేశ ప్రజలందరి సమష్టి ఘనతగా శుభాంశు అభివర్ణించారు.మీ సారథ్యంలో కలలకు కొత్త రెక్కలు‘‘రోజుకు 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు ఆస్వాదిస్తున్నాం. గంటకు 28 వేల కి.మీ. వేగంతో భూమికి ప్రదక్షిణలు చేస్తున్నాం. ఈ వేగం మన దేశ ప్రగతి పరుగులకు అద్దం పడుతోంది’’ అని శుభాంశు తెలిపారు. ఐఎస్ఎస్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటూ మోదీ ఆరా తీశారు. అక్కడి పరిస్థితులకు ఎలా అలవాటు పడుతున్నారని అడిగారు. తాను బావున్నానని శుభాంశు తెలిపారు. కాకపోతే శూన్య గురుత్వాకర్షణ స్థితిలో నిద్రపోవడం కూడా పెను సవాలుగానే ఉందంటూ చమత్కరించారు! అన్నింటికీ ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నట్టు చెప్పారు. ‘‘ఇలాంటి సవాళ్ల కోసమే ఏడాది పాటు కఠోర శిక్షణ పొందాం. కానీ తీరా ఇక్కడికొచ్చాక అంతా మారిపోయింది. శూన్యస్థితి కారణంగా చిన్నచిన్న విషయాలు కూడా భూమి మీదికంటే ఎంతో భిన్నంగా ఉన్నాయి. ఇది నాకు నిజంగా సరికొత్త అనుభూతి. ‘‘అంతరిక్షంలో తరచూ తీవ్ర ఒత్తిళ్లతో కూడిన పరిస్థితులెన్నో ఎదురవుతుంటాయి. అందుకే ఏకాగ్రత, ప్రశాంతచిత్తం చాలా అవసరం. అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోగలం. శిక్షణ సందర్భంగా వీటి గురించి ఎంతో తెలుసుకున్నా. అదంతా బాగా ఉపకరిస్తోంది. భూమికి 400 కి.మీ. ఎత్తుకు చేరిన ఈ ప్రయాణం నా ఒక్కనిది కాదు. మొత్తం దేశానిది. అంతరిక్షంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం పట్ల ఎనలేని సంతోషంగా ఉన్నా. నాకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపిన మీకు, 140 కోట్ల సహచర భారతీయులకు కృతజ్ఞతలు. ఇలా ఒకనాటికి వ్యోమగామిని అవుతానని చిన్ననాడు కలలో కూడా అనుకోలేదు. మీ నాయకత్వంలో దేశం తన కలలకు కొత్త రెక్కలు తొడుక్కుంటోంది’’ అంటూ ప్రధాని నాయకత్వాన్ని ప్రశంసించారు. ‘‘యువతకు నేనిచ్చే సందేశమల్లా ఒక్కటే. ఆకాశమే మీ హద్దు!’’ అని పేర్కొన్నారు. సంభాషణను ముగిస్తూ ‘భారత్ మాతా కీ జై’ అంటూ శుభాంశు చేసిన నినాదాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమంతటా ప్రతిధ్వనించాయి. PM @narendramodi interacted with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station. pic.twitter.com/Q37HqvUwCd— PMO India (@PMOIndia) June 28, 2025 #WATCH | Prime Minister Narendra Modi interacts with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station.PM Modi says "Today, you are away from our motherland, but you are the closest to the hearts of Indians...Aapke naam mein bhi shubh hai aur aapki… pic.twitter.com/lWOk7AVlL3— ANI (@ANI) June 28, 2025అపార అనుభవంతో తిరిగి రండిమన గ‘ఘన’ యాత్రలకు అదే పునాదిశుభాంశుకు ప్రధాని ‘హోంవర్క్’అంతరిక్షాన్ని మరింతగా అన్వేషించాలన్న మన యువత, విద్యార్థుల సంకల్పాన్ని శుభాంశు చరిత్రాత్మక యాత్ర మరింత బలోపేతం చేస్తుందని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఆయనకు ప్రత్యేకమైన ‘హోంవర్క్’ అప్పగించారు. ‘‘తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌కు వీలైనంత త్వరలో శ్రీకారం చుట్టేందుకు భారత్ ఎంతో పట్టుదలతో ఉంది. అలాగే పూర్తి స్వదేశీ ‘భారత అంతరిక్ష కేంద్రం’ నిర్మించేందుకు, భారత వ్యోమగాములను చంద్రునిపైకి పంపేందుకు కూడా! అంతరిక్ష పరిస్థితులపై సంపూర్ణ అనుభవం గడించి విజయవంతంగా తిరిగిరండి. గగన్‌యాన్ తదితర ప్రాజెక్టులన్నింటికీ మీరు వెంటతీసుకొచ్చే వెలకట్టలేని అనుభవమే తిరుగులేని పునాది!’’ అని విశ్వాసం వెలిబుచ్చారు. అంతరిక్షంలో భారత్ సృష్టించబోయే నూతన చరిత్రకు తన యాత్ర కేవలం ఆరంభం మాత్రమేనని శుభాంశు బదులిచ్చారు.క్యారెట్ హల్వా, మామిడి రసం రుచి చూపాతనతో పాటు ఐఎస్ఎస్కు క్యారెట్ హల్వా, మామిడి రసం తీసుకొచ్చానని ప్రధానికి శుభాంశు వివరించారు. వాటిని, చవులూరించే పలు భారతీయు మిఠాయిలను ఐఎస్ఎస్లోని 10 మంది తోటి వ్యోమగాములతో శుభాంశు పంచుకున్నట్టు చెప్పారు. చరిత్ర సృష్టించిన శుభాంశు -
8 రోజులు.. 5 దేశాలు!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 2వ తేదీ నుంచి 8 రోజులపాటు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. బ్రెజిల్‌లోని రియోడీజనిరోలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్రంలో పాల్గొననున్న ప్రధాని మోదీ ఆ తర్వాత.. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, నమీబియాల్లో పర్యటించనున్నారని విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. మొదటగా జూలై 2, 3వ తేదీల్లో ఆఫ్రికా దేశం ఘనా వెళ్తారు. ఈ దేశంలో ప్రధాని మోదీ మొట్టమొదటి పర్యటన ఇదే కాగా, మన ప్రధాని ఒకరు అక్కడ పర్యటించడం దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఇదే ప్రథమం. ఘనా నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగోకు వెళ్తారు. అక్కడ జూలై 3, 4వ తేదీల్లో పర్యటించనున్నారు. 1999 తర్వాత భారత ప్రధాని ఒకరు అక్కడికెళ్లడం ఇదే మొదటిసారి. అనంతరం, జూలై 4, 5వ తేదీల్లో అర్జెంటినా వెళ్తారు. జూలై 5 నుంచి 8 వరకు జరిగే 17వ బ్రిక్స్ సమిట్‌లో పాల్గొంటారు. చివరగా ప్రధాని మోదీ నమీబియా చేరుకుంటారు. మోదీ నమీబియాలో పర్యటించే మూడో భారత ప్రధాని కావడం గమనార్హం. -
మనకు అన్ని ఆదేశాలు అమెరికా నుంచే రావాలా: జైరాం రమేష్
-
విశాఖ భీమిలిలో కూటమి నాయకుల మధ్య వివాదం
-
స్పేస్‌లోకి శుభాంశు శుక్లా.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము ఏమన్నారంటే
సాక్షి,ఢిల్లీ: ఇస్రో-నాసా సంయుక్త యాక్సియం-4 మిషన్ కోసం అంతరిక్షంలోకి బయల్దేరిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా(Shubhanshu Shukla)కు రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ శుభాకంక్షలు తెలిపారు. శుభాంశు శుక్లా స్పేస్‌లోకి 1.4 బిలియన్ల మంది భారతీయుల శుభాకాంక్షల్ని,నమ్మకాల్ని, ఆకాక్షంల్ని మోసుకెళ్తున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. శుభాంశు శుక్లాతో పాటు మిషన్ కమాండర్ అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలాండ్‌కు చెందిన మిషన్ స్పెషలిస్ట్స్లావోష్ ఉజ్నాన్స్కీ,హంగేరీ మిషన్ స్పెషలిస్ట్ టిబోర్ కాపులకు మోదీ శుభాంక్షలు చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణంపై స్పందించారు. గ్రూప్ కెప్టెన్‌గా శుభాంశు శుక్లా భారత అంతరిక్ష విభాగంలో సరికొత్త రికార్డ్లను సృష్టించారు. అంతరిక్షంలోకి ఈ భారతీయుడి ప్రయాణం పట్ల మొత్తం దేశం ఉత్సాహంగా గర్వంగా ఉంది. శుభాంశు తన ఆక్సియం మిషన్ 4లోని అమెరికా, పోలాండ్, హంగేరీ వ్యోమగాములుతో తమదంతా ‘వసుధైవ కుటుంబం (ఒకే కుటుంబం)’గా నిరూపించారని ముర్ము అన్నారు.భారత సంతతికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా. ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ కెప్టెన్‌గా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికా ప్రైవేట్ అంతరిక్ష సంస్థ యాక్సియమ్ స్పేస్ నిర్వహిస్తున్న Ax-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళుతున్నారు. ఈ మిషన్ ద్వారా రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టనున్న రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్రలో నిలవనున్నారు. We welcome the successful launch of the Space Mission carrying astronauts from India, Hungary, Poland and the US. The Indian Astronaut, Group Captain Shubhanshu Shukla is on the way to become the first Indian to go to International Space Station. He carries with him the wishes,…— Narendra Modi (@narendramodi) June 25, 2025 As Group Captain Shubhanshu Shukla creates a new milestone in space for India, the whole nation is excited and proud of an Indian’s journey into the stars. He and his fellow astronauts of Axiom Mission 4 from the US, Poland and Hungary prove the world is indeed one family –…— President of India (@rashtrapatibhvn) June 25, 2025 -
‘ఎమర్జెన్సీ రోజుల్లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్’.. గతం గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: నాడు దేశంలో అత్యవసర పరిస్థితులు విధించిన రోజుల్లో తాను ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా ఉన్నానని.. నాటి రోజులను ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. నాటి నిరసనల్లో కీలకంగా వ్యవహరించిన దేవెగౌడను ప్రధాని ప్రశంసించారు. దేశరాజధాని ఢిల్లీలో బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ‘ది ఎమర్జెన్సీ డైరీస్’ను విడుదల చేసింది. దీనిలో నాటి అత్యవసర పరిస్థితిలో నరేంద్ర మోదీ ప్రారంభ రాజకీయ ప్రతిఘటనలను వివరించారు.నాటి కాలాన్ని అభ్యాస అనుభవంగా అభివర్ణించిన ప్రధాని, నాటి మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడను అత్యవసర పరిస్థితుల వ్యతిరేక ఉద్యమంలో కీలక నేతగా పేర్కొన్నారు. మోదీ తొలి రాజకీయ ప్రయాణాన్ని హైలైట్ చేసిన ఈ పుస్తకంలో.. నాటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితులను మోదీ ఏ విధంగా వ్యతిరేకించారో తెలియజేశారు. ఆ సమయంలో మోదీతో కలిసి పనిచేసిన వారి ప్రత్యక్ష అనుభవాలను సేకరించి, ఈ పుస్తకంలో పొందుపరిచారు. When the Emergency was imposed, I was a young RSS Pracharak. The anti-Emergency movement was a learning experience for me. It reaffirmed the vitality of preserving our democratic framework. At the same time, I got to learn so much from people across the political spectrum. I am… https://t.co/nLY4Vb30Pu— Narendra Modi (@narendramodi) June 25, 2025ఈ పుస్తకం విడుదల సందర్భంగా ప్రధాని మోదీ ఒక ట్వీట్లో ‘అత్యవసర పరిస్థితి విధించినప్పుడు, నేను ఆర్ఎస్ఎస్ యువ ప్రచారక్‌ను. అత్యవసర పరిస్థితి వ్యతిరేక ఉద్యమం నాకు కొత్త పాఠాలను నేర్పింది. రాజకీయ వర్గాల నుంచి, ప్రజల నుంచి నేను చాలా నేర్చుకోగలిగాను. బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్.. నాటి తన అనుభవాలలో కొన్నింటిని పుస్తకం రూపంలో సంకలనం చేసినందుకు ఆనందంగా ఉంది. దీనికి ముందుమాటను.. అత్యవసర పరిస్థితి వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన హెచ్డీ దేవెగౌడ రాశారు’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: అన్నగా భావించిన యువతికి ‘ప్రపోజల్’.. అభ్యంతరం చెప్పడంతో.. -
ఉగ్రవాదంపై ఉక్కుపాదమే: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై భారత్ ఉక్కుపాదం మోపుతుందని ఆపరేషన్ సిందూర్‌తో మరోసారి ప్రపంచానికి చాటామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పాక్‌పై పోరులో మేకిన్ ఇండియా ఆయుధాలు సత్తా చాటాయని గుర్తు చేశారు. జాతి ప్రయోజనాల పరిరక్షణకు ఎలాంటి చర్యలకైనా తమ సర్కారు వెనకాడే సమస్యే ఉండబోదని స్పష్టం చేశారు. ఆధ్యాత్మికవేత్త, సామాజిక సంస్కర్త నారాయణగురు, మహాత్మాగాంధీ మధ్య చరిత్రాత్మక సంభాషణకు వందేళ్లయిన సందర్భంగా సోమవారం జరిగిన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు.బలోపేతమైన భారత్ కోసం వాళ్లు కన్న కలలను నిజం చేసే దిశగా సాగుతున్నట్టు చెప్పారు. ‘‘11 ఏళ్ల క్రితం వరకూ దేశాన్ని పాలించిన వారి హయాంలో కోట్లాది ప్రజలు అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొ న్నారు. మా పాలనలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 11 ఏళ్లుగా దేశం సామాజికంగా, ఆర్థికంగా అత్యంత బలోపే తమవుతూ వస్తోంది. రక్షణ రంగంలో స్వావలంబన సాధిస్తోంది. భారత్ తయారు చేసే ఆయుధాలు ప్రపంచమంతటా జెండా ఎగరేసే రోజులు ఎంతో దూరం లేవు’’ అని ధీమా వెలిబుచ్చారు. -
‘ఇక బీజేపీలో చేరికా?’.. కుండబద్ధలు కొట్టేసిన శశిథరూర్
న్యూఢిల్లీ: పీయూష్ గోయల్‌తో సెల్ఫీ దిగడం, ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను ఆకాశానికి ఎత్తడం, భారత ప్రధాని నరేంద్ర మోదీని పొగడడం, అదే తరుణంలో కాంగ్రెస్‌తో విభేదాలున్నాయని అంగీకరించడం.. ఇవన్నీ వేటికి సంకేతాలుగా భావించొచ్చు!. ఇదే విషయాన్ని తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ వద్ద ప్రస్తావించగా.. ఆయన చిరునవ్వుతో అదేం లేదంటున్నారు. తాజాగా .. సోమవారం(జూన్ 23న) The Hindu పత్రికలో శశిథరూర్ రాసిన ఓ వ్యాసం పబ్లిష్ అయ్యింది. ఆపరేషన్ సిందూర్.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విదేశాంగ ప్రచారం భారతదేశ ఐక్యతను, సంకల్పాన్ని సూచించిందని ఆ కథనంలో థరూర్ రాశారు. ఈ వ్యాసాన్ని ప్రధానమంత్రి కార్యాలయం కూడా షేర్ చేయగా.. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ స్పందిస్తూ ‘‘శశిథరూర్ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లోని లోపాలను.. ఆ పార్టీలోని విభేదాలను బహిర్గతం చేశాయి’’ అని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ బీజేపీలో చేరికకు సంకేతాలుగా భావించొచ్చా? అని మంగళవారం ఎదురైన ప్రశ్నకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. ఇవేవీ నేను బీజేపీలో చేరతానన్న సంకేతం కాదని స్పష్టత ఇచ్చారాయన. ‘‘విదేశాంగ మిషన్ విజయాన్ని మాత్రమే నేను ఆ వ్యాసంలో ప్రస్తావించా. ఇది అన్ని పార్టీల ఐక్యతను ప్రతిబింబించే విషయం మాత్రమే’’ అని అన్నారాయన. "ప్రధాని మోదీ చొరవతో.. ఇతర దేశాలతో భారత్ సంబంధాలు మెరుగుపడ్డాయి. అయితే ఇది బీజేపీనో, కాంగ్రెస్ తీసుకొచ్చిన విదేశాంగ విధానం కాదు. ఇది భారతదేశ విదేశాంగ విధానం. సుమారు 11 ఏళ్ల కిందట పార్లమెంట్లో విదేశాంగ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా ఉన్నప్పుడు కూడా ఇదే విషయం చెప్పాను. అంత మాత్రాన నేను ప్రధాని మోదీ పార్టీలో చేరతానని కాదు. ఇది జాతీయ సమైక్యతకు సంబంధించిన ప్రకటన మాత్రమే’’ అని కుండబద్ధలు కొట్టారాయన. అంతకుముందు.. కాంగ్రెస్ అధిష్టానంతో తనకు కొన్ని విషయాల్లో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని, అయితే అవి నాలుగు గోడల మధ్య చర్చించుకుంటే పరిష్కారం అయ్యే విషయాలేనని, వాటి గురించి సమయం వచ్చినప్పుడు చెబుతానని థరూర్ మీడియా ముఖంగా ప్రకటన చేశారు.‘‘ గత నాలుగేళ్లుగా కాంగ్రెస్ కార్యకర్తలు నా విజయంలో కీలక పాత్ర పోషించారు. నేను ఇప్పటికీ కాంగ్రెస్‌కు విదేయుడినే. పార్టీకి అవసరమైతే పెద్ద పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇతర పార్టీలో చేరే ఆలోచన ఏమాత్రం లేదు’’ అని ఆ సమయంలో అన్నారయన. అలాగే, తాను ప్రజాస్వామ్యవాదిగా, మతతత్వానికి వ్యతిరేకంగా, సామాజిక న్యాయాన్ని నమ్మే వ్యక్తినంటూ గతంలోనూ ఆయన చాలాసార్లు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబడుతోంది. అయితే ఆ పార్టీ సీనియర్ సభ్యులు థరూర్ మాత్రం అందుకు భిన్నంగా ఆకాశానికి ఎత్తుతున్నారు. అలాగే.. ట్రంప్ మధ్యవర్తిత్వం ప్రకటన విషయంలో కాంగ్రెస్ లైన్‌కు భిన్నంగా థరూర్ వ్యవహరించడమూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే థరూర్ తాజా వ్యాఖ్యలతో ఆయన బీజేపీలో చేరతారన్న ఊహాగానాలకు తాత్కాలికంగా తెరపడినట్లయ్యింది. -
గుజరాత్లో బీజేపీకి బిగ్ షాక్
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బీజేపీకి గట్టి షాక్ ఇచి్చంది. రాష్ట్రంలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, ఒక స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ పార్టీ ఘన విజయం సాధించింది. మరో స్థానంలో అధికార బీజేపీ నెగ్గింది. లూథియానా వెస్ట్(పంజాబ్), కాళీగంజ్(పశ్చిమ బెంగాల్), కాడీ, విసావదర్(గుజరాత్), నీలంబూర్(కేరళ) శాసనసభ స్థానాలకు ఈనెల 19న ఉప ఎన్నికలు జరిగాయి. సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. విసావదర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గోపాల్ ఇటాలియా ఘన విజయం సొంతం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి కిరీట్ పటేల్‌పై 17 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గోపాల్ ఇటాలియాకు 75,942 ఓట్లు రాగా, కిరీట్ పటేల్‌కు 58,000 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో విసావదర్ నుంచి గెలుపొందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే భయానీ భూపేంద్రభాయ్ తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. తమ సిట్టింగ్ స్థానాన్ని ఆప్ నిలబెట్టుకుంది. కాడీ ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చావ్డా 39,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే కర్సాన్ సోలంకీ మృతిచెందడంతో ఉప ఎన్నిక జరిగింది. పంజాబ్‌లోని లూథియానా వెస్ట్‌లోనూ ఆప్ మళ్లీ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి సంజీవ్ అరోరా కాంగ్రెస్ అభ్యర్థి భరత్ భూషణ్‌పై 10 వేల ఓట్ల మెజార్టీతో నెగ్గారు. బీజేపీ అభ్యర్థి జీవన్ గుప్తా మూడో స్థానంలో నిలిచారు. లూథియానా వెస్ట్‌లో ఆప్ ఎమ్మెల్యే గుర్ప్రీత్బస్సీ గోగీ మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. బెంగాల్‌లోని కాళీగంజ్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత అలీఫా అహ్మద్ బీజేపీ అభ్యర్థి ఆశీష్ ఘోష్‌పై 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అలీఫా తండ్రి, తృణమూల్ ఎమ్మెల్యే నజీరుద్దీన్ అహ్మద్ మృతిచెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. కేరళలోని నీలంబూర్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అభ్యర్థి అర్యదన్ షౌకత్ వామపక్ష అభ్యర్థి ఎం.స్వరాజ్‌పై 11,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నీలంబూర్ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. గుజరాత్, పంజాబ్‌లో మాదే విజయం: కేజ్రీవాల్ గుజరాత్, పంజాబ్ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థుల విజయం పట్ల ఆప్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ సోమవారం హర్షం వ్యక్తంచేశారు. 2027 అసెంబ్లీ ఎన్నికలకు ఇది సెమీఫైనల్ అని, ఇందులో తామే గెలిచామని స్పష్టంచేశారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లను ఓటర్లు పూర్తిగా తిరస్కరించడం ఖాయమని అన్నారు. ఆప్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. -
ప్రతిపక్షాన్ని చులకన చేస్తే ప్రజలు సహించరు
రాయిచూర్: ప్రతిపక్ష పార్టీలను అల్పంగా భావిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ వైఖరిని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తప్పుబట్టారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఏర్పాటైన అఖిలపక్ష భేటీకి రెండు సందర్భాల్లోనూ ప్రధాని మోదీ రాకపోవడం ప్రతిపక్షాలంటే ఆయనకున్న గౌరవం ఏపాటిదో తెలుస్తోందని వ్యాఖ్యానించారు. అఖిలపక్ష భేటీకి దేశవ్యాప్తంగా ఉన్న నాయకులంతా రాగా, ప్రధాని మోదీ ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. బదులుగా బిహార్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీకి వెళ్లారని ఎత్తి చూపారు. ఇలాంటి వైఖరిని ప్రజలు హర్షించరని, ముఖ్యంగా దేశ యువత సహించబోదని ఆయన హెచ్చరించారు. దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలోని రాయిచూర్‌లో సోమవారం జరిగిన బహిరంగం సభలో ఖర్గే ప్రసంగించారు. ‘కశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టన బెట్టుకున్నారు. ప్రతీకారంగా మన సైన్యం పాక్ భూభాగంపై దాడి జరిపి ఉగ్రవాదులను ఏరిపారేసింది. యావత్తూ దేశం, సైనిక బలగాలు ఏకమై దేశానికి రక్షణగా నిలవగా, కొందరు వ్యక్తులు మాత్రం ఇదంతా తమ ఘనతేనని చెప్పుకుంటున్నారు’అని ఖర్గే పేర్కొన్నారు. ఆ వ్యక్తులు ఆర్మీలో కెపె్టన్, కల్నల్, లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేసిన వారైతే దేశం కోసం పోరాడినందుకు గాను మనం ప్రశంసించి ఉండేవారం. కానీ, అలాంటిదేమీ లేకుండానే గొప్పలు పోతున్నారు’అని మోదీ సర్కారుపై పరోక్షంగా విమర్శలు కురిపించారు. మళ్లీ ట్రంపే అమెరికా అధ్యక్షుడిగా రావాలంటూ అమెరికాలో నినదించిన ప్రధాని మోదీ..మన వస్తు వులపై భారీగా ట్యాక్సులు విధించినా ఒక్క మాటకూడా మాట్లాడలేదని ఆరోపించారు. -
ఈ ఉద్యోగానికి ఓ దండం
విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం గొప్పలకు పోయి నిర్వహించిన ‘యోగాంధ్ర–2025’కార్యక్రమం జీవీఎంసీ పరిధిలోని రిసోర్స్ పర్సన్ల(ఆర్పీ)కు తీవ్ర ఆవేదనను, అవమానాన్ని మిగిల్చింది. అధికారుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు, సౌకర్యాలు కల్పించడంలో వైఫల్యం కారణంగా తాము ప్రజల చేత మాటలు పడాల్సి వచ్చిందని, ఈ ఉద్యోగమే వద్దనుకునేంతగా మానసిక క్షోభ అనుభవించామని ఆర్పీలు వాపోతున్నారు.ప్రధాని మోదీ పాల్గొన్న ‘యోగాంధ్ర’కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో అధికారులు జన సమీకరణ బాధ్యతను పూర్తిగా ఆర్పీల మీద పెట్టారు. ప్రతి ఆర్పీ వందల మందిని కార్యక్రమానికి తీసుకురావాలని లక్ష్యాలు నిర్దేశించారు. ఉదయం 6.30 గంటలకల్లా కార్యక్రమం ముగిసి, 8 గంటలకంతా అందరూ ఇళ్లకు వెళ్లిపోవచ్చని, అక్కడ అల్పాహారం, మంచినీటి సౌకర్యాలు ఉంటాయని జనాలకు నచ్చజెప్పి ఆర్పీలు వారిని తీసుకువచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా మారింది. గంటల తరబడి ప్రజలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. నిర్వాహకులు కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా అందించలేకపోయారు. మ్యాట్ల కోసం కొట్టుకున్నారు. స్నాక్స్ కోసం తోపులాటలు జరిగాయి. దీంతో ఆర్పీలు తీసుకువచ్చిన జనం, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాహంతో, ఆకలితో అలమటించారు. చివరకు తమను తీసుకువచ్చిన ఆర్పీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమం కోసం ఎంతో కష్టపడితే అన్ని వైపుల నుంచి తిట్లు..చీవాట్లు మిగిలాయంటూ ఆర్పీలు వాట్సాప్ గ్రూపుల్లో ఆవేదన చెందుతున్నారు.అధికారుల నిర్లక్ష్యం, ఆర్పీల ఆవేదన‘వేకువ జామున 2 గంటల నుంచి ఇంటింటికి వెళ్లి వారి తలుపులు తట్టి జనాన్ని యోగాంధ్రకు తీసుకెళ్లాం. గుండె జబ్బు ఆపరేషన్ చేయించుకున్న ఓ ఆర్పీ యోగాంధ్రకు 100 మందిని తీసుకెళ్లారు. అయితే ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యాం. ఒకవైపు అధికారుల నుంచి ఒత్తిడి, మరోవైపు స్వయం సహాయక సంఘాల సభ్యులు, ప్రజల నుంచి చీదరింపులు ఎదుర్కొన్నాం. పని పూర్తయ్యాక అధికారులు చల్లగా జారుకున్నారు. కానీ మేం మాత్రం ప్రజల చేత తిట్లు తినాల్సి వచ్చింది. మమ్మల్ని నమ్మి వచ్చినవారికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేకపోయాం. తీసుకెళ్లిన వాళ్లు ప్రాణాలతో తిరిగి వస్తే చాలు అనుకునేంత నరకాన్ని చూశాం’ అని ఆర్పీలు తమ గ్రూపుల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ‘కేవలం రూ.10వేల జీతానికి ఇంతటి అవమానమా? 20 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నాం, కానీ ఇంతటి దారుణమైన పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదు. గతంలో ఏ కార్యక్రమం జరిగినా ఆహారం, నీళ్ల బాధ్యత మాకే అప్పగించేవారు. కానీ ఇప్పుడు మమ్మల్ని కేవలం జన సమీకరణకే వాడుకుని, తర్వాత బలిపశువులను చేశారు’ అని వాపోయారు. ఈ మానసిక వేదనతో ఉద్యోగాలకు రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని పలువురు ఆర్పీలు పేర్కొన్నారు. -
ఇజ్రాయెల్,అమెరికా విరుచుకు పడుతున్న వేళ.. ఇరాన్‌కు ప్రధాని మోదీ ఫోన్ కాల్!
సాక్షి,ఢిల్లీ: ఇరాన్‌పై ఇజ్రాయెల్,అమెరికా దాడులకు తెగబడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాలు శాంతి నెలకొల్పేలా చర్చలు జరపాలంటూ భారత ప్రధాని మోదీ (Narendra Modi) ఇరాన్ అధ్యక్షుడితో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌తో (Masoud Pezeshkian) ఫోన్లో మాట్లాడారు. ఈమేరకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌తో నేను మాట్లాడాను. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా జరుపుతున్న దాడుల గురించి చర్చించాం. ఈ దాడులపై ఆందోళన వ్యక్తం చేశాం. ప్రాంతీయంగా శాంతి, భద్రత, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించడానికి, తక్షణ ఉద్రిక్తతలను తగ్గించడం, శాంతి చర్చలు జరపాలని చెప్పినట్లు ’ పేర్కొన్నారు. Spoke with President of Iran @drpezeshkian. We discussed in detail about the current situation. Expressed deep concern at the recent escalations. Reiterated our call for immediate de-escalation, dialogue and diplomacy as the way forward and for early restoration of regional…— Narendra Modi (@narendramodi) June 22, 2025సుదీర్ఘకాలం నుంచి ఇరాన్‌తో పాటు ఇరాన్ మద్దతిస్తున్న హమాస్, హెజ్బొల్లా వంటి మిలిటెంట్లు గ్రూపులు ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతున్నాయి. ఈ దాడులు తన భద్రతకు ముప్పుగా భావిస్తోంది. అందుకే ఇజ్రాయెల్ హమాస్, హెజ్బొల్లాతో పాటు ఇరాన్‌పై దాడుల్ని తీవ్రతరం చేసింది.ఇరాన్‌పై అమెరికా ఎందుకు దాడులు చేస్తోంది?ఈ ఇరు దేశాల యుద్ధంలో ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో అమెరికా సైన్యం శనివారం (జూన్ 21, 2025న) ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై వైమానిక దాడులు చేసింది. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అనే అణు కేంద్రాలపై B-2 స్పిరిట్ బాంబర్లతో భారీ బాంబుల వర్షం కురిపించింది. ట్రంప్ సైతం ఈ దాడి విజయవంతమైందని పేర్కొన్నారు. ( ఫొటొ:ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా ప్రయోగించిన బీ-2 స్పిరిట్ బాంబార్స్), image source: (యూఎస్ఏ టుడే)ఈ దాడి ద్వారా అమెరికా అధికారికంగా యుద్ధంలోకి దిగినట్టయింది. ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడమే ప్రధాన ఉద్దేశమని ట్రంప్ తెలిపారు. అయితే, ఈ చర్యపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది యుద్ధాన్ని మరింత పెంచుతుందా లేక శాంతికి దారి తీస్తుందా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి నాంది కావొచ్చని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇరాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధానికి కారణంఇరాన్ ప్రధానంగా హమాస్ (పాలస్తీనా), హెజ్బొల్లా (లెబనాన్) వంటి మిలిటెంట్ గ్రూపులకు ఆర్థిక సహాయం, ఆయుధాలు, శిక్షణ అందిస్తోంది. ఈ శిక్షణను ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ)లోని ఖుద్స్ ఫోర్స్ అనే విభాగం నిర్వహిస్తోంది.హమాస్: ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7,2023న జరిగిన దాడికి ముందు, హమాస్ మిలిటెంట్లు ఇరాన్లో శిక్షణ పొందినట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. వీరికి డబ్బు,ఆయుధాలు,సాంకేతిక సహాయం కూడా అందించినట్లు ఆరోపించింది. హెజ్ బొల్లా: ఇది లెబనాన్‌లో ఉన్న షియా మిలిటెంట్ గ్రూప్. దీనికి ఇరాన్ మద్దతు ఇస్తుంది. హెజ్ బొల్లాకు ఆయుధాలు, శిక్షణతో పాటు వ్యూహాత్మక సలహాలు సూచనలు ఇస్తోంది.అందకు హెజ్బొల్లా, హమాస్‌తో పాటు ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్ని తీవ్రతరం చేసింది. హెజ్బొల్లా,హమాస్ గ్రూపుల్ని నిర్విర్యం చేసింది. ఆ రెండు గ్రూపులకు కీలకంగా వ్యవహరిస్తున్న టాప్ కమాండర్లను హతమార్చింది. ఇప్పుడు ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. -
ప్రపంచాన్ని యోగా ఏకం చేసింది... భారతీయుల జీవన విధానంలో యోగా అంతర్భాగం... ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
-
ప్రపంచాన్ని యోగా ఏకం చేసింది: ప్రధాని మోదీ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘ప్రపంచాన్ని యోగా ఏకం చేసింది. నేను అనే భావన నుంచి మనం అనే భావనను యోగా పెంపొందిస్తుంది’అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద అంతర్జాతీయ యోగా డే వేడుకల సందర్భంగా నిర్వహించిన ‘యోగాంధ్ర అభియాన్’ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఉదయం 6.30 నుంచి 8 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి 45 నిమిషాలపాటు యోగాసనాలు వేసి.. వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘భారతీయుల జీవన విధానంలో యోగా అంతర్భాగం. దివ్యాంగులు బ్రెయిలీ లిపి ద్వారా యోగ సూత్రాలు చదవడం, శాస్త్రవేత్తలు అంతరిక్షంలో యోగా చేయడం, యోగా ఒలింపియాడ్‌లో గ్రామీణ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి’ అని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రకటించాలని తాను చేసిన ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు ఇస్తాయని ప్రధాని గుర్తు చేశారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఈ స్థాయిలో ప్రపంచ దేశాలు మద్దతు ఇచ్చాయని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఎక్కడైనా.. సిడ్నీ ఒపెరా హౌస్ మెట్లపై, ఎవరెస్ట్ శిఖరంపై, గగనతలంపై ఎక్కడైనా ‘యోగా అందరికీ’అనే నినాదమే వినిపిస్తుందన్నారు. యోగాను వైద్య కళాశాలల్లో ప్రవేశపెట్టడంతో పాటు కామన్ యోగా ప్రొటోకాల్‌ను తయారు చేస్తున్నామన్నారు. వంటల్లో నూనె వాడకాన్ని 10 శాతం తగ్గించాలని సూచించారు. ప్రపంచాన్ని స్థూలకాయం అనే సమస్య వేధిస్తోందని, యోగా చేయడంతో పాటు వంట నూనెల వాడకాన్ని తగ్గించడం ద్వారా స్థూలకాయ సమస్యను పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు. చికిత్సలకు యోగా దోహదం గుండె, నరాలకు సంబంధించిన వ్యాధుల చికిత్సతో పాటు మహిళల ఆరోగ్యాన్ని కాపాడటంలో యోగా ఎంతో దోహదపడుతుందని ఢిల్లీలోని ఎయిమ్స్ పరిశోధనలో తేలిందని ప్రధాని మోదీ చెప్పారు. భారతదేశంలోని ఆయుర్వేద వైద్యాన్ని, యోగా, యునాని వంటి ప్రాచీన వైద్య పద్ధతులను పొందేందుకు ప్రపంచ ప్రజల కోసం ప్రత్యేకంగా ఈ–ఆయుష్ వీసా కల్పిస్తామన్నారు. విశాఖ నగరం ప్రకృతికి, ప్రగతికి నిలయమైన నగరమని కొనియాడారు. ఈ సందర్భంగా యోగా స్మారక పోస్టల్ స్టాంపును ప్రధాని విడుదల చేశారు. విశాఖ బీచ్ రోడ్లో యోగా ఆసనాలు వేస్తున్న ప్రజలు సెప్టెంబర్‌లో యోగా లీగ్ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సెప్టెంబర్‌లో యోగా లీగ్ ప్రారంభిస్తున్నామని చెప్పారు. 2036లో జరిగే ఒలింపిక్స్‌తో పాటు కామన్వెల్త్ క్రీడల్లోనూ యోగాను చేర్చేందుకు కృషి చేయాలని ప్రధాని మోదీని కోరారు. రాష్ట్రంలో మొత్తం 1.44 లక్షల మందికి యోగాలో శిక్షణ ఇచ్చామని చెప్పారు. ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పారన్నారు. వికసిత్ భారత్‌లో భాగంగా ‘విజన్ స్వర్ణ ఆంధ్ర–2047’ప్రణాళికను అనుసరించి హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జయదేవ్ మాట్లాడుతూ యోగాంధ్ర అభియాన్‌లో ఏకంగా 10 లక్షల మంది పాల్గొంటున్నారని పేర్కొన్నారు. యోగా విశిష్టతను రుగ్వేదంలో మహానుభావులు తెలియజేస్తే... ప్రపంచవ్యాప్తం చేసిన దార్శనికులు ప్రధాని మోదీ అని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కొనియాడారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, పలువురు మంత్రులు పాల్గొన్నారు. గిన్నిస్‌బుక్ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని చూపిస్తున్న ప్రధాని మోదీ,గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు తదితరులు రెండు గిన్నిస్ రికార్డ్స్విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ 26 కిలోమీటర్ల మేర జరిగిన ఈ కార్యక్రమంలో 3.03 లక్షల మంది పాల్గొనడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు లభించిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతంలో సూరత్ వేదికగా 2023లో జరిగిన కార్యక్రమంలో 1.47 లక్షల మంది పాల్గొన్న కార్యక్రమం పేరిట ఇప్పటివరకు గిన్నిస్ రికార్డు ఉందని తెలిపాయి. మరోవైపు ఆంధ్రా యూనివర్సిటీలో ఈ నెల 20న (శుక్రవారం) 22,122 మంది విద్యార్థులు 108 సూర్య నమస్కారాల కార్యక్రమానికి కూడా గిన్నిస్ రికార్డు లభించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆర్కే బీచ్ వద్ద లంగరేసిన 11 నౌకల్లో కూడా తూర్పు నావికాదళ సిబ్బంది యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. -
దేశవ్యాప్తంగా యోగా డే వేడుకలు.. ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
మోదీ వేసిన యోగాసనాలు ఇవే
-
యోగా ప్రపంచాన్ని కలిపింది : ప్రధాని మోదీ
-
యోగాతో వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుంది: మోదీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు పలువురు యోగాసనాలు వేశారు. యోగా ఫర్ వన్ ఎర్త్.. వన్ హెల్త్ నినాదంతో కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు. యోగా ద్వారా ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జీవన శైలిని మార్చింది. 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదు. గత పదేళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపింది. యోగాకు వయసుతో పనిలేదు.. యోగాకు హద్దులు లేవు. వ్యక్తిగత క్రమశిక్షణకు యోగా అద్భుతమైన సాధనం.యోగాతో వ్యతిగత క్రమశిక్షణ అలవడుతుంది. ప్రపంచంతో మన అనుసంధానం కావడానికి యోగా ఉపయోగపడుతుంది. అంతరిక్షంలో కూడా యోగా చేసిన ఘనత మనదే. యోగాతో వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుంది. ప్రజల భాగస్వామ్యానికి ఇదొక స్పూర్తిగా నిలిచింది. యోగా ప్రక్రియతో చికిత్స చేసే విధానాన్ని ఢిల్లీ ఎయిమ్స్ అభివృద్ధి చేస్తోంది. యోగా గురించి మన్ కీ బాత్‌లో కూడా చర్చించాను’ అని చెప్పుకొచ్చారు. -
Watch Live: విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగ దినోత్సవం
-
ప్రజాసేవ చేయకపోతే ప్రశాంతంగా నిద్రించలేను
సివాన్: నిత్యం ప్రజాసేవ చేయకపోతే ప్రశాంతంగా నిద్రించలేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాత్రి పగలు ప్రజల కోసమే పని చేస్తున్నానని చెప్పారు. ఆయన శుక్రవారం బిహార్, ఓడిశాలో పర్యటించారు. తొలుత బిహార్‌లోని సివాన్ జిల్లాలో రూ.5,900 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. బిహార్‌లోని పాటలీపుత్ర జంక్షన్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ వరకు నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. విపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ), కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను ఆర్జేడీ అవమానించిందని ఆరోపించారు. వారసత్వ రాజకీయాలను అంబేడ్కర్ వ్యతిరేకించారని గుర్తుచేశారు. అందుకే అంబేడ్కర్ అంటే ఆర్జేడీ, దాని మిత్రపక్షాలకు ఇష్టం లేదన్నారు. బాబాసాహెబ్ చిత్రపటాన్ని ఆర్జేడీ నేతలు పాదాలతో తొక్కేశారని, దీనిపై క్షమాపణ చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తే ఏమాత్రం స్పందించలేదని మండిపడ్డారు. అంబేడ్కర్ కంటే తామే గొప్పవాళ్లమని ఆర్జేడీ–కాంగ్రెస్ నాయకులు అహంకారం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. అంబేడ్కర్ తన హృదయంలో ఉన్నాడని, ఆయన చిత్రపటాన్ని గుండెకు హత్తుకోవడం తనకు ఇష్టమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆర్థిక వనరులు కొల్లగొట్టడానికి ఆర్జేడీ, కాంగ్రెస్ కాచుకొని కూర్చున్నాయని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కూటమిని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి కోసం శ్రమిస్తున్నాం ‘‘భారతదేశ ప్రగతిని చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. నిన్ననే విదేశాల నుంచి తిరిగొచ్చా. విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు అక్కడి నేతలు మన దేశ అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రశంసించారు. పేదల సాధికారతకు ఎదురవుతున్న అడ్డంకులను ఎన్డీయే ప్రభుత్వం తొలగిస్తోంది. గత 11 ఏళ్లుగా ప్రజాసేవలో నిమగ్నమయ్యాం. అభివృద్ధి కోసం అహోరాత్రులూ శ్రమిస్తున్నాం. బిహార్‌లో మళ్లీ జంగిల్‌రాజ్ రావొద్దంటే విపక్ష ఇండియా కూటమి ఓడించాలి. ఎన్డీయే నినాదం సబ్కా సాత్, సబ్కా విశ్వాస్. విపక్ష కూటమి నినాదం పరివార్‌కా సాత్, పరివార్‌కా వికాస్. సొంత కుటుంబాల అభివృద్ధి తప్ప ప్రజలంటే వారికి లెక్కలేదు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విరుద్ధం కాదా?’’ అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. భువనేశ్వర్‌లో తిరంగా యాత్ర ప్రధాని మోదీ ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో తిరంగా యాత్ర, రోడ్‌షోలో పాల్గొన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి జనతా మైదాన్ వరకు 9 కిలోమీటర్ల మేర జరిగిన ఈ యాత్రలో వేలాది మంది ప్రజలు భాగస్వాములయ్యారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూర్తయిన సందర్భంగా తిరంగా యాత్ర నిర్వహించారు. రూ.18,600 కోట్లకుపైగా విలువైన 105 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. ట్రంప్ ఆహ్వానం తిరస్కరించా.. వాషింగ్టన్లో పర్యటించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించగా, తాను తిరస్కరించానని ప్రధాని మోదీ చెప్పారు. వాషింగ్టన్ పర్యటనకు బదులు ఒడిశాను ఎంచుకున్నానని తెలిపారు. భువనేశ్వర్ సభలో ఆయన మాట్లాడారు. ‘‘జీ7 సదస్సు కోసం కెనడా వెళ్లినప్పుడు ట్రంప్ నాతో ఫోన్లో మాట్లాడారు. వాషింగ్టన్కు రావాలంటూ ఆహ్వానించారు. చర్చించుకుందామని, కలిసి భోజనం చేద్దామని అన్నారు. ఆహ్వానించినందుకు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలియజేశా. జగన్నాథుడు కొలువుదీరిన ఒడిశాకు వెళ్లాల్సి ఉందని చెప్పా. వాషింగ్టన్కు రాలేనంటూ ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించా’’ అని ప్రధానమంత్రి వెల్లడించారు. -
ఎయిరిండియా రద్దుల పద్దు!
చూడబోతే ఎయిరిండియాకు కష్టాలన్నీ ఒక్కసారే కట్టగట్టుకుని వచ్చినట్టున్నాయి. ఈ నెల 12న గుజరాత్లో జరిగిన దురదృష్ట ఘటనలో 272 మంది మరణించిన తర్వాత ఎయిరిండియా విమానాలు ఎక్కాలన్నా, ప్రత్యేకించి ప్రమాదం సంభవించిన బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ రకం విమానాల్లో ప్రయాణించాలన్నా చాలామంది భయపడుతున్నారు. అందుకు తగినట్టే ఆ సంస్థ అంతర్జాతీయ, దేశీయ మార్గాల్లో వినియోగించే దాదాపు 90 విమాన సర్వీసుల్ని అంచెలంచెలుగా రద్దుచేస్తూ పోతోంది. శుక్రవారం కూడా ఎనిమిది విమానాలు రద్దయ్యాయి. నిర్వహణాపరమైన, సాంకేతికమైన సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ చెబుతోంది. వీటికితోడు పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇరాన్ గగనతలాన్ని మూసివేయటం వంటివి కూడా విమాన సర్వీసుల రద్దుకు దోహదపడ్డాయి. జూలై రెండో వారం వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులు 15 శాతంమేర తగ్గించనున్నామని ఎయిరిండియా ప్రకటించింది. ప్రయాణికులు కూడా ఏమంత భరోసాతో లేరు. అసలు విమానయానమే వద్దనుకున్నవారు కొందరైతే, బోయింగ్ విమానాలు ఎక్కరాదని మరికొందరు నిర్ణయించుకుని ప్రయాణాలు రద్దుచేసుకున్నారు. విమానయాన సంస్థలను నియంత్రించే పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఎయిరిండియా విమానాల్లో భద్రతకు సంబంధించిన ప్రధాన లోపాలేమీ లేవని, కేవలం నిర్వహణాపరమైన సమస్యలే ఉన్నాయని చెబుతోంది. భిన్న విభాగాల మధ్య సమన్వయం అవసరమవుతుందని సలహా ఇచ్చింది. ఎక్కడ ఏ చిన్న లోపాన్ని గమనించినా దాన్ని నమోదు చేయటం, వెనువెంటనే సరిదిద్దటం వంటివి జరగాలని సూచించింది. ఎయిర్‌లైన్స్ సంస్థలకు రేటింగ్ ఇచ్చే అంతర్జాతీయ స్వతంత్ర ఆన్లైన్ సంస్థ పరిశీలనలో ఇండిగో, ఆకాశ సంస్థలు ఏడు అంశాల్లో ఆరు పాయింట్లు సాధించాయి. స్పైస్ జెట్ ఏడుకు ఏడు పాయింట్లు పొందగా, ఎయిరిండియా కేవలం నాలుగు పాయింట్లే సాధించటం గమనించదగ్గ అంశం. ఇక బోయింగ్ డ్రీమ్‌లైనర్ భద్రతా లోపాలపై ఫిర్యాదు చేసిన ఇంజినీర్ జార్జి బార్నెట్ అనుమానాస్పద స్థితిలో నిరుడు మార్చిలో మరణించిన ఉదంతం కలవరపరుస్తుంది. ఆ సంస్థ క్వాలిటీ కంట్రోల్లో 32 ఏళ్లు పనిచేసిన బార్నెట్ రెండ్రోజులు విచారణకు హాజరై మూడో రోజు ఎందుకు తుపాకీతో కాల్చుకుంటాడన్నది ప్రశ్నార్థకమైంది.టాటా ఎయిర్‌లైన్స్‌గా ఉన్న సంస్థను 1953లో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జాతీయం చేసి, ఎయిరిండియాగా నామకరణం చేశారు. దేశీయ విమాన సర్వీసుల కోసం ఇండియన్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఆవిర్భవించింది. ఈ రెండూ పబ్లిక్ రంగ సంస్థలు కావటంతో పౌర విమానయాన రంగంలో అవి దిగ్గజ సంస్థలుగా వెలిగాయి. కానీ దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలై విమానయానంలో ప్రైవేటు సంస్థలు ప్రవేశించటం, తక్కువ ధరకే ప్రయాణికులను చేరేవేసే సంప్రదాయాన్ని ప్రారంభించటంతో అంతక్రితమే నష్టాలతో ఉన్న ఆ సంస్థ మరింతగా కుంగిపోవటం మొదలైంది. అసలు విమానయాన రంగంలో ప్రైవేటును అనుమతించినప్పుడే ఎయిరిండియా నిర్వహణను పూర్తిగా నిపుణులకు వదిలేయాల్సింది. కానీ పగ్గాలు ప్రభుత్వం దగ్గరే ఉండటం, దానికి లోబడి సంస్థ పనిచేయాల్సి రావటంతో ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి. టాటా సన్స్ 2022లో ఎయిరిండియాను తీసుకున్నప్పుడు విమానయాన రంగాన్నే సంపూర్ణంగా మారుస్తామని ప్రకటించింది. దశాబ్దాల అసమర్థ ఉద్యోగస్వామ్యాన్ని తొలగించి, గర్వించదగిన గొప్ప సంస్థగా తీర్చిదిద్దుతామని తెలిపింది. మూడేళ్లు గడిచాయి. కానీ చెప్పుకోదగ్గ మార్పుల జాడలేదు. అలాగని ఎయిరిండియా ఏమీ చేయలేదని కాదు. సిబ్బందికి పునఃశిక్షణనిచ్చింది. వారి యూనిఫాంని మార్చింది. యాప్‌ను సరికొత్తగా తీసుకొచ్చింది. అయితే, ప్రాణం మీదికొచ్చే ప్రమాదాలు జరగలేదన్న మాటేగానీ లోపాల పరంపర గురించిన ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇందులో పారిశుద్ధ్యం మొదలుకొని విరిగిపోయిన సీట్లు, నాసిరకం ఉపకరణాలు వగైరాలున్నాయి. అయినా పెద్దగా ఫలితం లేదు. ఇక అస్వస్థతగా ఉండి సెలవు పెట్టినవారిని సైతం ఒత్తిడి తెచ్చి విధినిర్వహణకు పిలిచిన సందర్భాలున్నాయని పైలెట్ల ఫిర్యాదు. ఇవన్నీ విడివిడి ఘటనలుగా కొట్టిపారేయటం కాక వాటివెనక అల్లుకునివున్న నిర్లక్ష్యాన్నీ, అలసత్వాన్నీ సకాలంలో గమనించుకుంటే పరిస్థితి మెరుగుపడేది. నిరుడు ఢిల్లీ–శాన్ఫ్రాన్సిస్కో సర్వీస్ విమానం ఇంజన్ వైఫల్యం కారణంగా రష్యాలో రోజుల తరబడి నిలిచిపోయింది. మరుగుదొడ్లు పనిచేయక చికాగోకు బయల్దేరిన విమానం కాసేపటికే వెనుదిరిగింది. టాటా బ్రాండ్‌కు మార్కెట్లో మంచి పేరుంది. వాటి ఉత్పత్తులపై వినియోగదారుల్లో విశ్వాసం ఉంది. ఎయిరిండియా దాన్ని అందుకోలేకపోయింది. నిరుడు మే నెలలో ముంబై–లండన్ సర్వీసు బోయింగ్ 787 విమానంలో తలుపు సరిగా పనిచేయటం లేదంటూ ఫిర్యాదు చేశాక, దాన్ని వెనక్కు తీసుకోవాలని తమపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని, నిరాకరించినందుకు షోకాజ్ నోటీసులు జారీచేసి, 48 గంటలు దాటకుండా ఉద్యోగం నుంచి తొలగించారని సీనియర్ ఫ్లయిట్ అటెండెంట్లు ఇద్దరు ఈ మధ్యే ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేయటం గమనించదగ్గది. ప్రవర్తన సరిగా లేకపోవటం, విధి నిర్వహణ సక్రమంగా చేయక పోవటం వంటి కారణాలతోనే వారిని తొలగించామని సంస్థ సంజాయిషీ ఇస్తోంది. అంతా సవ్యంగా గడిచినంతకాలం నిర్వాహకులు తమను తాము అభినందించుకుంటూ కాలం గడుపుతారు. ఎప్పటికప్పుడు తనిఖీ చేసే నియంత్రణ వ్యవస్థ ఉంటే ఇలాంటివి చోటుచేసుకోవు. ఈ విషాద ఘటన నుంచి అయినా గుణపాఠం నేర్చుకోవాలి. అత్యంత జాగరూకతతో మెలగాలి. -
అందుకే డొనాల్డ్ ట్రంప్ డిన్నర్ ఆహ్వానాన్ని తిరస్కరించా: ప్రధాని మోదీ
భువనేశ్వర్: తనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిన్నర్‌కు ఆహ్వానించినా అందుకు వెళ్లలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానాన్ని తాను సున్నితంగా తిరస్కరించి, ధన్యవాదాలు తెలిపానన్నారు. తనకు ఒడిశాలో ప్యూరీ జగన్నాథ్ పుణ్యభూమికి వెళ్లడం ముఖ్యమని ట్రంప్‌కు చెప్పినట్లు మోదీ తెలిపారు. ఈ రోజు(శుక్రవారం, జూన్ 20) ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటించారు. సుమారు 18 వేల కోట్ల విలువైన 100కు పైగా ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. దీనిలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మోదీ మాట్లాడారు. ‘నాకు ట్రంప్ నుంచి డిన్నర్ ఆహ్వానం అందింది. నేను జీ-7 సదస్సులో భాగంగా కెనడా పర్యటనకు వెళ్లినప్పుడు నన్ను వాషింగ్టన్కు రమ్మని ట్రంప్ ఆహ్వానించారు. అయితే మహాప్రభు జగన్నాథుని పుణ్యభూమికి వెళ్లే అవసరం ఉండటంతో నేను ట్రంప్ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాను. రెండు రోజుల క్రితం కెనడా పర్యటనలో ఉన్నపపుడు వాషింగ్టన్ మీదుగా రమ్మని ట్రంప్ అన్నారు. కలిసి డిన్నర్ చేసి మాట్లాడుకుందాం అన్నారు. కానీ అంతకంటే ఎక్కువగా ఒడిశా జగన్నాథుని పుణ్యభూమికి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పా’ అని మోదీ తెలిపారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంలో తొలి వార్షికోత్సవ కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. ఈ క్రమంలోనే అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారాయన.#WATCH | Bhubaneswar, Odisha: "Just two days ago, I was in Canada for the G7 summit and the US President Trump called me. He said, since you have come to Canada, go via Washington, we will have dinner together and talk. He extended the invitation with great insistence. I told the… pic.twitter.com/MdLsiYnNCQ— ANI (@ANI) June 20, 2025 ఏడాది విజయవంతంగా పూర్తయ్యిందిఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏడాదిని విజయవంతంగా పూర్తి చేసుకుందని కొనియాడారు. ఇది తమకు చాలా ప్రత్యేకమైన రోజన్నారు. కేవలం ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావడం ఒక్కటే కాదు.. మంచి పరిపాలన అందించినందుకు కూడా తొలి వార్షికోత్సవమన్నారు. ఏడాది కాలంలోనే బీజేపీ ప్రజల నమ్మకాన్ని చూరగొందని మోదీ పేర్కొన్నారు. -
జీ 7 ప్రముఖులకు పీఎం మోదీ అపురూపమైన బహుమతులు
భువనేశ్వర్: కెనడాలో జరిగిన జీ–7 సమ్మిట్‌లో పాల్గొనేందుకు హాజరైన ప్రముఖులకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అద్భుతమైన రాష్ట్ర కళాకృతుల్ని బహుమానంగా అందజేశారు.జీ–7 సదస్సులో పాల్గొన్న కెనడా గవర్నర్ జనరల్ మేరీ సైమన్‌కు ప్రధాన మంత్రి వెండి తీగల అల్లిక క్లచ్ పర్స్‌ను బహుమతిగా ఇచ్చారు. రాష్ట్రంలో కటక్ అందమైన వెండి తీగల సంప్రదాయ అల్లిక చేతి పనులకు (తారొకొసి) ప్రసిద్ధి. ఈ అపురూప కళ 500 సంవత్సరాలు పైబడిన ప్రాచీనమైనది. ఆనాటి మొఘల్ చక్రవర్తుల ఆదరణతో వెలుగొందిన కళ నేటికి నిలకడగా తళుక్కుమంటోంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జర్మనీ చాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్‌కు ప్రపంచ ప్రఖ్యాత 13వ శతాబ్దపు కోణార్క్ సూర్య దేవాలయం కాల చక్రం కానుకగా సమరి్పంచారు. ఇసుక రాయితో రూపుదిద్దుకోన్న కోణార్కు చక్రం ప్రతిరూపం రాష్ట్ర శిల్ప కళా నైపుణ్యాన్ని జీ 7 దేశాల్లో ప్రధాన మంత్రి ప్రతిబింబింపజేశారు. సూర్య రశ్మి ఆధారంగా సమయం సూచించే రీతిలో ఈ చక్రంలో ఊచల్ని శిల్పులు చెక్కు చెదరకుండా పొందుపరచడం విశేషం. ఇది అంతులేని కాల చక్రాన్ని చూపుతుంది. పూరీ జిల్లా కళా గ్రామం రఘురాజపూర్ ప్రాంతపు పొట్టా చిత్రాన్ని క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలనోవిచ్‌కు ప్రధాన మంత్రి బహుమతిగా సమర్పించారు. పొట్టా చిత్రం రాష్ట్రానికి చెందిన అందమైన సంప్రదాయ కళారూపం. ఇది వస్త్రంపై వివరణాత్మక, రంగురంగుల చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. దీంతో ఈ చిత్రాలు పొట్టా (వస్త్రం), చిత్ర (చిత్రం)గా పేరొందాయి. సాధారణంగా భారతీయ పౌరాణిక గాథల శీర్షికల ఇతివృత్తంగా అర చేతిలో ఇమిడే అతి చిన్న చిత్రాలు మొదలుకొని సువిశాల పటాలు రూపొందించడంరఘురాజపూర్ కళాకారుల ప్రత్యేకతని జీ 7 ప్రతినిధులకు ప్రధాన మంత్రి ప్రతిబింబింపజేయించడం విశేషం. -
వెండి, ఇత్తడి కళాకృతులు.. పెయింటింగ్‌లు
న్యూఢిల్లీ: ఇతర దేశాల నేతలను కలిసినప్పు డు కానుకలు అందజేయడమనే ఆనవాయితీని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనసాగి స్తున్నారు. తాజాగా రెండు రోజుల క్రితం కెనడాలోని జరిగిన జీ7 శిఖరాగ్ర భేటీలో ఆయన పాల్గొనడం తెల్సిందే. ఈ సందర్భంగా ఆయన ఆతిథ్య దేశ ప్రధాని మార్క్ కార్నీతోపాటు ఆయా దేశాల నేతలకు కలకాలం గుర్తుండిపోయే, మన ఘన వారసత్వాన్ని ప్రతిబింబించే అద్భుత మైన కానుకల్ని అందజేశారు. వీటిలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఇత్తడి, వెండి కళాకృతులతోపాటు ఆకర్షణీయమైన పెయింటింగ్‌లున్నాయి. కెనడాలోని కననాస్కిస్‌లో జీ7 భేటీ సమయంలో ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీకి ప్రధాని మోదీ ఇత్తడితో రూపొందించిన బోధి చెట్టు కళా ఖండాన్ని కానుకగా అందజేశారు. గౌతమబుద్ధునికి బోధి వృక్షం కిందనే జ్ఞానోదయమైన విషయం తెల్సిందే. జ్ఞానం, శాంతి, ఆధ్యాత్మిక మేల్కొలుపును ప్రతిబింబించేలా బిహార్ కళాకారులు రూ పొందించిన కళారూపమిది. అదేవిధంగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ కు తమిళనాడుకు చెందిన డోక్రా నిపుణులు రూపొందించిన నంది విగ్రహాన్ని బహూక రించారు. పరమ శివుని వాహనం నందీశ్వరుడు. సంప్రదాయ భారతీయ లోహ కళను చాటి చెప్పేలా ఈ విగ్రహం కనిపిస్తుంది. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్ పర్డోకు సంప్రదాయ వర్లి కళాఖండాన్ని కానుకగా ఇచ్చారు. మహారాష్ట్రలోని వర్లి గిరిజనుల జానపద కళ ఇది. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌కు సంప్రదాయ మధుబని పెయింటింగ్‌ను అందజేశారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన డోక్రా కళాకృతిలో రూపుదిద్దుకున్న ఇత్తడి గుర్రం బొమ్మను దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాకు ప్రధాని మోదీ బహూకరించా రు. పురాతన సంప్రదాయ నైపుణ్యంతో గిరి జన చేతిపనివారు రూపొందించిన బొమ్మ ఇది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇన్సియో లులా డ సిల్వాకు వెదురుతో తయారు చేసిన హంస ఆకారంలోని పడవ బొమ్మను అందజేశారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌కు కల్హాపురి వెండి పాత్రను బహుమతిగా ఇచ్చారు. స్వచ్ఛమైన వెండితో తయారైన ఈ పాత్రపై చేతిలో రూపొందించిన పూల నగిషీలున్నాయి. మహారాష్ట్రకు చెందిన ఈ కళాకృతి అందంతోపాటు ఘన వారసత్వాన్ని చాటుతోంది. జర్మనీ చాన్సెలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్‌కు పాలరాతి తో రూపొందించిన సూర్య దేవాలయాన్ని గుర్తుకు తెచ్చే కోణార్క్ చక్రం బొమ్మను బహుమతిగా ఇచ్చారు ప్రధాని మోదీ. -
నేడు విశాఖకు ప్రధాని రాక
సాక్షి, న్యూఢిల్లీ/మహారాణిపేట: ప్రధాని మోదీ శుక్రవారం విశాఖ రానున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 6.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్‌కు వెళతారు. రాత్రి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం 6.25కు రోడ్డు మార్గం ద్వారా ఆర్కే బీచ్‌కు చేరుకుంటారు. 6.30 నుంచి 7.50 వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా యోగా విన్యాసాల్లో పాల్గొంటారు. 7.50కు బయల్దేరి రోడ్డు మార్గం ద్వారా ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్‌కు వెళతారు. ఉదయం 8.15 నుంచి 11.15 వరకు ప్రధాని ప్రొగ్రామ్ రిజర్వ్‌లో ఉంది. మళ్లీ 11.25కు ఐఎన్ఎస్ సర్కార్ పెరేడ్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్లో విశాఖ విమానాశ్రయానికి చేరుకుని 11.50 గంటలకు ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ బయలుదేరతారు. -
రాహుల్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ఈరోజు(జూన్ 19) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్ష నేతకు ఆయన ‘ఎక్స్’లో అందించిన ఒక సందేశంలో రాహుల్ దీర్ఘాయుష్షుతో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందుకోవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. Birthday greetings to the Leader of the Opposition in the Lok Sabha, Shri Rahul Gandhi. May he be blessed with a long and healthy life.@RahulGandhi— Narendra Modi (@narendramodi) June 19, 2025రాహుల్ గాంధీ 55వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్‌లో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా ఇతర అగ్ర నేతలు కూడా రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.సోషల్ మీడియాప్లాట్ఫారం ‘ఎక్స్’లో సింగ్ ఇలా రాశారు, ‘లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాను’ అనిరాశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా కాంగ్రెస్ నేత రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తన ఆదర్శ సోదరుడు రాహుల్ గాంధీకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలని పేర్కొన్నారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ తమ నేత పుట్టినరోజు సందర్భంగా న్యూఢిల్లీలోని తల్కటోరా ఇండోర్ స్టేడియంలో ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. అయితే బీజేపీ ఈ మేళాను ప్రచార స్టంట్‌గా అభివర్ణించింది.ఇది కూడా చదవండి: ‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్‌వర్మ మరెవరో కాదు.. -
మధ్యవర్తిత్వం మాటే లేదు
కననాస్కీస్(కెనడా): ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాల్లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన పరస్పర సైనిక చర్యల ముగింపు పర్వంలో అమెరికా ఎలాంటి మధ్యవర్తిత్వ పాత్ర పోషించలేదని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. పాక్‌తో పోరులో శాంతిస్థాపన కోసం తానే చొరవ తీసుకుని ఇరుదేశాల మధ్య ఆపానని ట్రంప్ పదేపదే ప్రకటించుకోవడం, అమెరికా జోక్యంపై విపక్షాలు దుమ్మెత్తిపోసిన నేపథ్యంలో ట్రంప్‌తో మోదీ మాట్లాడటం విశేషం. ఆపరేషన్ సిందూర్ తర్వాత ట్రంప్‌తో మోదీ మాట్లాడటం ఇదే తొలిసారి. అత్యవసరంగా, అర్ధంతరంగా జీ7 భేటీ నుంచి ట్రంప్ నిష్క్రమించిన నేపథ్యంలో ట్రంప్‌తో మోదీ మంగళవారం ఫోన్లో సుదీర్ఘంగా సంభాషించారని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు. ట్రంప్‌తో మోదీ సంభాషణ వివరాలను మిస్రీ మీడియాకు వెల్లడించారు. ‘‘ ఆపరేషన్ సిందూర్ తర్వాత వెనువెంటనే భారత్, పాక్ మధ్య మొదలైన పరస్పర కాల్పుల ఉదంతంలో ఇరుదేశాల మిలిటరీ విభాగాల చర్చల తర్వాత దాడులు ఆగాయి. ఇందులో అమెరికా ఎలాంటి మధ్యవర్తిత్వ పాత్ర పోషించలేదు. అయినా మూడోవర్గం మధ్యవర్తిత్వాన్ని భారత్ ఏనాడూ అంగీకరించలేదు. పాకిస్తాన్ అభ్యర్థించడం వల్లే భారత్ కాల్పుల విరమణకు ఒçప్పుకుంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఇకపై పరోక్ష యుద్ధంగానే భావించబోం. ప్రత్యక్ష యుద్ధంగానే భావిస్తాం’’ అని ట్రంప్‌కు మోదీ స్పష్టంచేశారు.వాణిజ్య అంశాల ఊసేలేదుయుద్ధం ఆపకపోతే మీతో వాణిజ్యాన్ని ఆపేస్తానని భారత్‌ను ట్రంప్ బెదిరించారని వచ్చిన వార్తలపై మోదీ ట్రంప్‌కు స్పష్టతనిచ్చారు. ‘‘ ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాల్లో అమెరికా అస్సలు జోక్యంచేసుకోలేదు. భారత్, పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తామని అమెరికా నుంచి ఎలాంటి అధికారిక ప్రతిపాదన కూడా అందలేదు. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడా, ఏ స్థాయిలోనూ భారత్–అమెరికా వాణిజ్య సంబంధాలు ప్రస్తావన అస్సలు లేదు. భారత్ ఇంతకుముందుగానీ ఇకమీదటగానీ మధ్యవర్తిత్వాన్ని ఏ రకంగానూ అంగీకరించే ఆస్కారంలేదు. ఈ అంశంలో రాజకీయాలకు అతీతంగా భారత్‌లో ఏకాభిప్రాయం ఉంది. మే9వ తేదీ రాత్రి మీ దేశ ఉపాద్యక్షుడు జేడీ వాన్స్ నాకు ఫోన్‌చేశారు. పాకిస్తాన్ ప్రతిదాడులకు సంసిద్ధ్దమవుతోందని నాతో అన్నారు. అదే నిజమైతే పాక్‌కు కనీవినీ ఎరుగని రీతిలో బుద్ధిచెప్తామని స్పష్టంచేశా. మే 9 అర్ధరాత్రిదాటాక పాకిస్తాన్‌లోని కీలక సైనిక, వైమానిక స్థావరాలపై క్షిపణి దాడులుచేసి నాశనం చేశాం. మా దాడుల్లో వాళ్ల సైనిక ఎయిర్‌బేస్‌లు బద్దలయ్యాయి. నిరుపయోగంగా మారాయి. దీంతో దిక్కుతోచక మాతో కాల్పుల విరమణ ఒప్పందానికి వాళ్లే తొలుత అభ్యర్థించారు’’ అని ట్రంప్‌తో మోదీ చెప్పారు.అమెరికాకు ఆహ్వానించిన ట్రంప్35 నిమిషాలకుపైగా జరిగిన ఈ టెలిఫోన్ సంభాషణలో చివర్లో మోదీని ట్రంప్ అమెరికాకు ఆహ్వానించారు. కెనడాలో జీ7 శిఖరాగ్ర సదస్సు ముగిశాక తిరుగు ప్రయాణంలో అమెరికాకు వచ్చిపోవాలని మోదీని ట్రంప్ కోరారు. క్రొయేషియాలో పర్యటించాల్సి ఉన్నందున అమెరికాలో పర్యటించడం కుదరదని ట్రంప్‌కు మోదీ సుతిమెత్తగా చెప్పి అభ్యర్థనను తిరస్కరించారు. -
ఉగ్రవాదులను పెంచిపోషించే దేశాలకు నిధులు,రుణాలా..?
కనానాస్కిస్: తమ పొరుగుదేశం పాకిస్తాన్ ఉగ్రవాద ఉత్పత్తి కేంద్రంగా మారిపోయిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. పాక్ పాలకులు ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లపై స్పందించకుండా కళ్లు మూసుకొని ఉంటే మానవత్వానికి ద్రోహం చేయడమే అవుతుందని తేలి్చచెప్పారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం కెనడాలో జీ7 కూటమి సదస్సులో ‘ఇంధన భద్రత’ అంశంపై ప్రధాని మోదీ ప్రసంగించారు. సీమాంతర ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తున్న పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడి ప్రతి భారతీయుడి ఆత్మ, గుర్తింపు, గౌరవంపై జరిగిన ప్రత్యక్ష దాడేనని తేలి్చచెప్పారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే ఏ దేశమైనా తగిన మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. ముష్కర మూకలను అంతం చేసే విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు ఉండొద్దని ఉద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని పోషకులను, ఉగ్రవాద బాధితులను ఒకే గాటన కట్టడం, ఒకేలా పరిగణించడం ఏమిటని నిలదీశారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే... నిజంగా నిజాయతీగా పని చేస్తున్నామా? ‘‘ఉగ్రవాదం మానవత్వానికి బద్ధశత్రువు. ప్రజాస్వామ్య విలువలు పాటించే అన్ని దేశాలనూ ఉగ్రవాదం వ్యతిరేకిస్తోంది. ఉగ్రవాద భూతాన్ని సమూలంగా నాశనం చేయాలంటే ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలి. అన్ని దేశాలు ఐక్యంగా ఉంటేనే అనుకున్నది సాధించగలం. దురదృష్టవశాత్తూ మా పొరుగుదేశం ఉగ్రవాదులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారిపోయింది. ప్రపంచ శాంతి, సౌభాగ్యాల కోసం.. ఉగ్రవాదులకు అండగా నిలిచే దేశాలను శిక్షించాలి. అలాంటి దేశాలను జవాబుదారీగా మార్చాలి. కానీ, వాస్తవ పరిస్థితి మరోలా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు నిధులు, రుణాలు ఇచ్చి సత్కరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉగ్రవాదంపై పోరాటంలో మనం నిజంగా నిజాయతీగా పని చేస్తున్నామా? ఉగ్రవాదం మన ఇంటి తలుపు తట్టినప్పుడు మాత్రమే ఉగ్రవాదానికి అసలైన అర్థాన్ని తెలుసుకుంటామా? ఉగ్రవాదులను ఎగదోస్తున్న వారిని, ఉగ్రవాద బాధితులను ఒకేలా చూడడం ఏమిటి? మన అంతర్జాతీయ సంస్థలు విశ్వసనీయత కోల్పోతున్నాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో నిర్ణయాత్మక చర్యలు అవసరం. ఇంధన భద్రత మన బాధ్యత భవిష్యత్తు తరాల కోసం ఇంధన భద్రత సాధించడమే ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద సవాలు. ఇంధన భద్రత సాధించడం కేవలం ప్రాధాన్యత మాత్రమే కాదు.. పౌరుల పట్ల మన బాధ్యత కూడా. ఇంధనం రంగంలో ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవాలి. కలిసి పనిచేయాలి. ‘నేనొక్కడినే కాదు.. మనమంతా’ అనే స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. ప్రపంచంలో ఎక్కడైనా సంక్షోభాలు, అనిశి్చత పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇంధన సరఫరా లేక గ్లోబల్ సౌత్ దేశాలు నష్టపోవాల్సి వస్తోంది. వాటిపై అధిక భారం పడుతోంది. ఆయా దేశాల్లో ఆహార, ఇంధన, ఎరువులతోపాటు ఆర్థిక సంక్షోభాలు తలెత్తుతున్నాయి. తయారీ, రవాణా రంగాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఇంధన రంగంలో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం. కృత్రిమ మేధ(ఏఐ)ను ప్రపంచ సౌభాగ్యం కోసం ఒక శక్తిగా మార్చాలి. డీప్‌ఫేక్స్ పెద్ద ముప్పుగా మారుతున్నాయి. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఏఐతో సృష్టించే కంటెంట్‌లో వాటర్‌మార్క్ ఉండేలా చర్యలు తీసుకోవాలి’’ అని ప్రధాని మోదీ సూచించారు. జీ7 దేశాల అధినేతలతో మోదీ చర్చలు కెనడాలో జీ7 సదస్సు సందర్భంగా కూటమి దేశాల అధినేతలతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టెక్నాలజీ, వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాదంపై పోరాటంతోపాటు ప్రపంచానికి ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారంపై చర్చించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే–మ్యూంగ్, ఫ్రాన్స్ అధినేత ఇమ్మానుయేల్ మాక్రాన్, బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షీన్బామ్ పార్దో, జర్మనీ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇన్సియో లులా డసిల్వా, కెనడా ప్రధాని మార్క్ కార్నీ. యూరోపియన్ కౌన్నిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా తదితరులతో మోదీ భేటీ అయ్యారు. క్రొయేషియా ప్రధాని ప్లెంకోవిచ్‌తో చర్చలు ప్రధాని మోదీ కెనడా పర్యటన ముగించుకొని బుధవారం క్రొయేషియా చేరుకున్నారు. జాగ్రెబ్ ఎయిర్‌పోర్టులో క్రొయేషియా ప్రధానమంత్రి అండ్రెజ్ ప్లెంకోవిచ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. క్రొయేషియాలో పర్యటిస్తున్న మొట్టమొదటి భారత ప్రధానమంత్రి మోదీయే కావడం విశేషం. ట్విట్టర్లో పోరాటం సాగిస్తున్నారా? కెనడాలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, ప్రధాని మోదీ మధ్య సరదా సంభాషణ జరిగింది. ‘‘ఈరోజుల్లో మీరు ట్విట్టర్లో పోరాటం సాగిస్తున్నారా? ట్విట్టర్లో మీరు చాలా చురుగ్గా ఉంటున్నారు’’ అని మాక్రాన్ ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వులు విరిశాయి. మాక్రాన్, మోదీ సైతం బిగ్గరగా నవ్వేశారు. ఇటీవల వియత్నాం పర్యటనకు వెళ్లినప్పుడు విమానం దిగే సమయంలో మాక్రాన్‌ను ఆయన భార్య బ్రిగెట్టా నెట్టివేసినట్లు వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఇలాంటివి జరిగేటప్పుడు తలుపులు మూసి ఉన్నాయో లేదో చూసుకోవాలి అని మాక్రాన్‌కు సలహా ఇచ్చారు. ఈ ఉదంతాన్ని గుర్తుచేస్తూ మోదీ సరదాగా వ్యాఖ్యానించారు. మోదీ–మాక్రాన్ సంభాషణ పట్ల సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. మోదీ నవ్వుతూ మాట్లాతూనే మాక్రాన్‌కు గట్టిగా చురక అంటించారని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. -
‘భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా.. ఐలవ్ పాకిస్తాన్’
వాషింగ్టన్: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే, ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే భారత్-పాక్‌ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ఊదరగొట్టిన ట్రంప్ తాజాగా మరోసారి అదే పాటపాడారు. భారత్-పాకిస్తాన్ సీజ్ఫైర్లో అమెరికా జోక్యం చేసుకోలేదని ప్రధాని మోదీ ప్రకటన చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘యుద్ధాన్ని నేనే ఆపా.. ఐలవ్ పాకిస్తాన్.రెండు న్యూక్లియర్ దేశాలు కావడంతో యుద్ధాన్ని ఆపాను. మోదీ గొప్ప వ్యక్తి ఆయనతో రాత్రి మట్లాడా. గత రాత్రే భారత్ - అమెరికా ట్రేడ్ గురించి ఆయనతో మాట్లాడాను’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
మీ ప్రమేయం లేదు.. ఇక మీదట ఉండబోదు కూడా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ షాకిచ్చారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ యుద్ధాన్ని తానే అడ్డుకున్నానని ట్రంప్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఇరు దేశాల ఉద్రిక్తతలు చల్లారడంలో ఎవరి ప్రమేయం లేదని.. ఇక మీదట కూడా ఉండబోదని ట్రంప్‌నకు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీ: జీ-7 సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోదీ భేటీ జరగాల్సి ఉంది. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తన పర్యటనను కుదించుకుని ట్రంప్ వెళ్లిపోయారు. ఈ తరుణంలో ఇరు దేశాల అధినేతలు ఫోన్ ద్వారా అరగంట మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి.. దానికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వివరాలను మోదీ ట్రంప్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలోనే.. మోదీ ట్రంప్‌తో మాట్లాడుతూ.. పహల్గాం, ఆపరేషన్ సిందూర్ పరిణామాల సమయంలో భారత్-అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగలేదు. భారత్-పాకిస్తాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వానికి అంశంపైనా చర్చలు కూడా జరగలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్పాక్ మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. పాక్ అభ్యర్థన మేరకే ‘ఆపరేషన్ సిందూర్’ను నిలిపివేశాం. ఇప్పుడు, ఎప్పుడూ.. భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు మోదీ స్పష్టంగా చెప్పారు. ఈ విషయంపై భారత్‌లో పూర్తి రాజకీయ ఏకాభిప్రాయం ఉందని అన్నారాయన. దీనికి ట్రంప్ ఉగ్రవాదంపై భారత్ జరిపే పోరునకు అమెరికా మద్ధతు ఉంటుందని తెలిపారు. ట్రంప్-మోదీ మధ్య ఫోన్ కాల్ సంభాషణ సారాంశాన్ని కేంద్ర విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వివరించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఫోన్ కాల్ ద్వారా ట్రంప్ మోదీకి సంతాపం తెలియజేశారని, ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకోవడం ఇదేనని మిస్రీ తెలిపారు. అయితే కెనడా పర్యటన ముగిచుకుని వెళ్లే క్రమంలో అమెరికాకు రావాలంటూ ట్రంప్ మోదీని ఆహ్వానించగా.. షెడ్యూల్ ప్రకారం తాను రాలేనని మోదీ తెలిపినట్లు సమాచారం. భారత్‌లో జరిగే క్వాడ్ తదుపరి సమావేశం కోసం ట్రంప్‌ను మోదీ ఆహ్వానించారు. దీన్ని అంగీకరించిన అమెరికా అధ్యక్షుడు.. భారత్‌లో పర్యటించేందుకు ఉత్సుకతతో ఉన్నానని తెలిపారుఇదిలా ఉంటే.. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లు ట్రంప్ ప్రకటించుకోవడం భారత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ప్రకటనపై స్పష్ట త ఇవ్వాలని ప్రతిపక్షాలు సైతం డిమాండ్ చేశాయి కూడా. -
అది ప్రతీ భారతీయుని ఆత్మపై దాడి: ‘జీ7’లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఐక్యంగా ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కెనడాలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్న ఆయన ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలను వర్తింపజేయయడం తగదని సూచించారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్ర దాడిని ప్రస్తావిస్తూ, ఈ ఘటనను భారతదేశంపైన, మానవత్వంపైన జరిగిన దాడిగా అభివర్ణించారు. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదని, ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి ప్రతి భారతీయుడి ఆత్మపై జరిగిన దాడి అని ప్రధాని అన్నారు. ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇస్తున్న దేశాలకు ప్రతిఫలం లభిస్తున్నదన్నారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువని, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టే అన్ని దేశాలకు అది ఆటంకంగా నిలుస్తున్నదని ప్రధాని పేర్కొన్నారు.ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం ప్రపంచమంతా స్పష్టమైన విధానంతో ముందుకు కదలాలని, అలాకాదని ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే ఏ దేశమైనా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. పశ్చిమ ఆసియా దేశాలు అనిశ్చితి, సంఘర్షణలతో తల్లడిల్లిపోతున్నాయిని, ఆయా దేశాల్లో ఆహారం, ఇంధనం, ఎరువులు,ఆర్థిక సంక్షోభాలు ఎదురవుతున్నాయన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి వీటిని ప్రపంచ వేదికపైకి తీసుకురావడాన్ని భారత్ తన బాధ్యతగా భావిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: నేడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌తో ట్రంప్ భేటీ -
G7 Summit: కెనడా ప్రధాని కార్నీతో మోదీ భేటీ.. సంభాషణ సాగిందిలా..
న్యూఢిల్లీ: భారత్-కెనడాల మధ్య సంబంధాలు ఎంతో ముఖ్యమైనవని, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కెనడాలోని ఆల్బెర్టాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేందర్ మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్నీని కలుసుకున్నారు. గత ఏడాది అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో క్షీణించిన సంబంధాలు తాజా ద్వైపాక్షిక సమావేశాలతో బలోపేతమవుతాయని భారత్ భావిస్తోంది.ఇద్దరు దేశాధినేతలు కలుసుకున్న సమయంలో ప్రధాని మోదీ భారతదేశం-కెనడాల మధ్య సంబంధాలు ఎంతో కీలకమైనవని స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి ఆతిథ్యం ఇవ్వడం తమకు దక్కిన గొప్ప గౌరవం అని కార్నీ అన్నారు. ఇంధన భద్రత, ఏఐ భవిష్యత్తులతో పాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసిపోరాడాలని కెనడా ప్రధాని అన్నారు.ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆల్బెర్టాకు వెళ్లారు. భారతదేశానికి జీ7 దేశాలలో సభ్యత్వం లేదు. అయినా సమావేశాలకు కెనడా ఆహ్వనం మేరకు హాజరయ్యింది. భారతదేశంతో సంబంధాలను బలోపేతం చేసేందుకు బహుళ రంగాలలో కొనసాగుతున్న భాగస్వామ్యాలను తిరిగి గాడిలో పెట్టేందుకు కెనడా.. భారత్‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 2023లో ఖలిస్తానీ అనుకూల వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అనంతరం భారత్‌తో కెనడా సంబంధాలు మరింత దిగజారాయి. ఆ తర్వాత ప్రధాని మోదీ కెనడాకు వెళ్లడం ఇదే తొలిసారి.నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని అప్పటి ప్రధాని ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. జస్టిన్ ట్రూడో ప్రభుత్వం.. ఖలిస్తాన్ అనుకూల గ్రూపులు కెనడాలో బలోపేతం అయ్యేందుకు అనుమతించిందని ఆరోపించింది. ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన ఆర్థికవేత్త కార్నీ, ఏప్రిల్‌లో జస్టిన్ ట్రూడో స్థానంలో ప్రధానిగా అత్యున్నత పదవి చేపట్టారు. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వాలు పెరుగుతున్న నేపథ్యంలో జీ-7 శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. దీనిలో జీ 7 దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించాయి. ఇరాన్ చర్యలను ఖండించాయి.ఇది కూడా చదవండి: ‘హనీమూన్’ కేసు దర్యాప్తు: మేఘాలయకు సోనమ్‌తో పాటు ప్రియుడు.. -
సైప్రస్ అధ్యక్షుడికి మోదీ బహుమతులు
న్యూఢిల్లీ: సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్‌కు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పలు బహమతులు అందజేశారు. చేతితో తయారు చేసిన కాశ్మీరీ సిల్క్ కార్పెట్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ కళాకారులు రూపొందించిన వెండి పర్సును బహూకరించారు. ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి నేతలకు భారతీయ సంప్రదాయాలు, సంస్కృతిని చాటిచెప్పే బహమతులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.సైప్రస్ అధ్యక్షుడికి ఇచ్చిన కాశ్మీరీ సిల్క్ కార్పెట్‌కు ఎన్నో విశిష్టతలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. కాశ్మీర్ లోయలోని కళాకారులు శతాబ్దాల నాటి కుట్టు నైపుణ్యాలను ఉపయోగించి, దీన్ని తయారు చేశారని చెప్పారు. అసలు సిసలైన మల్బరీ పట్టు, సహజసిద్ధమైన రంగులు వాడినట్లు పేర్కొన్నారు.ఇక వెండి క్లచ్ పర్సు కూడా విలువైందేనని అన్నారు. సంప్రదాయ లోహపు పనితనం, ఆధునిక రీతులను మేళవించి దీన్ని రూపొందించినట్లు వెల్లడించారు. పర్సుపై ఉన్న పూల డిజైన్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కళాకారుల నైపుణ్యానికి ఇదొక నిదర్శనమని స్పష్టంచేశారు. -
G7 Summit: కెనడా చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ కెనడా చేరుకున్నారు. నేడు, రేపు(మంగళ,బుధ) ఆయన ఆ దేశంలో పర్యటించనున్నారు. జీ-7 సదస్సులో ప్రధాని పాల్గొనున్నారు. జీ7 కూటమి వార్షిక సదస్సు నిన్న (సోమవారం) కెనడాలో ప్రారంభమైంది.జీ7 ప్రస్తుతం ఫ్రాన్స్, అమెరికా, యూకే, జర్మనీ, జపాన్, ఇటలీ, కెనడా, యూరోపియన్ యూనియన్(ఈయూ) సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇందులో భారత్‌కు సభ్యత్వం లేదు. అయినప్పటికీ ఈ ఏడాది జీ7 సదస్సుకు భారత ప్రధాని మోదీని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. VIDEO | PM Modi (@narendramodi) arrived at Calgary International airport, Canada, earlier today for the G7 summit.(Source: Third Party) pic.twitter.com/YFjno8J9am— Press Trust of India (@PTI_News) June 17, 2025కాగా, పశ్చియాసియా, యూరప్‌లో జరుగుతున్న యుద్ధాలు, సంఘర్షణలపై భారత ప్రధాని మోదీ, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇది యుద్ధాల యుగం కాదని తేల్చిచెప్పారు. వివాదాలు తలెత్తితే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, యుద్ధాలకు ముగింపు పలకాలని కోరారు. సోమవారం సైప్రస్ రాజధాని నికోసియాలో మోదీ, నికోస్ సమావేశమయ్యారు. భారత్–సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు.మరోవైపు, ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ఎంతమాత్రం వాంఛనీయం కాదని జీ7 దేశాల అధినేతలు తేల్చిచెప్పారు. రెండు దేశాలు వెంటనే వెనక్కి తగ్గాలని, యుద్ధానికి స్వస్తి చెప్పాలని కోరారు. ఇజ్రాయెల్–ఇరాన్ వెంటనే చర్చలు ప్రారంభించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. పరస్పరం కలిసి చర్చించుకొని, ఘర్షణకు తెరతించాలని అన్నారు.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నివారించడమే లక్ష్యగా ఒక పరిష్కార మార్గం కనిపెట్టాలని తామంతా అంగీకారానికి వచ్చినట్లు బ్రిటిష్ ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ చెప్పారు. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.గాజాలోనూ పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందన్నారు. అణ్వాయుధాలు సొంతం చేసుకొనేందుకు ఇరాన్‌ను అనుమతించకూడదని జర్మనీ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ చెప్పారు. మరోవైపు జీ7 కూటమిపై డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2014లో రష్యాను ఈ కూటమి నుంచి తొలగించడం పొరపాటేనని చెప్పారు. రష్యాను పక్కనపెట్టడం ప్రపంచాన్ని ఇప్పుడు అస్థిరపరుస్తోందని అభిప్రాయపడ్డారు. -
మోదీ సైప్రస్ యాత్ర...తుర్కియేకు గట్టి హెచ్చరిక!
ప్రపంచ దేశాల్లో మనవారెవరు, పరాయివారెవరు అన్నదానిపై ఆపరేషన్ సిందూర్‌తో భారత్‌కు బాగా స్పష్టత వచ్చింది. ముఖ్యంగా తుర్కియే నైజం పూర్తిస్థాయిలో బయటపడింది. అప్పట్లో భూకంపంతో కకావికలమైన వేళ అందరికంటే ముందుగా స్పందించి అన్నివిధాలైన సాయం పంపి ఆదుకున్న భారత్ పట్ల సిందూర్ వేళ తుర్కియే అక్షరాలా విషం కక్కింది. పాకిస్తాన్‌కు డ్రోన్లతో పాటు అన్నివిధాలా సాయుధ సాయం చేసి మనపట్ల కృతఘ్నత ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్ సిందూర్ తర్వాత తన తొలి విదేశీ పర్యటనకు అనూహ్యంగా సైప్రస్‌ను ఎంచుకోవడం ఆశ్చర్యపరిచింది. ఇది యాదృచ్చికమేమీ కాదని విదేశాంగ నిపుణులు అంటున్నారు. ఈ చర్య ద్వారా తుర్కియేకు గట్టి సందేశమే ఇచ్చారని విశ్లేషిస్తున్నారు. ఆదివారం మోదీ సైప్రస్‌లో పర్యటించారు. ఒక భారత ప్రధాని ఆ దేశానికి వెళ్లడం 23 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఈ ఎంపిక వెనక పలు భౌగోళిక, రాజకీయ ప్రాథమ్యాలు దాగున్నాయి. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆహ్వానం మేరకు మోదీ ఈ యాత్ర చేపట్టారు. అంతేగాక విమానాశ్రయంలో మోదీని ఆయన స్వయంగా స్వాగతించారు. సైప్రస్ అత్యున్నత పురస్కారంతో గౌరవించారు. తద్వారా భారత్‌తో మైత్రీ బంధానికి తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. మోదీ ఆయనతో ద్వైపాక్షిక చర్చలు జరపడమే గాక వ్యాపార దిగ్గజాల సదస్సులో కూడా పాల్గొన్నారు. ప్రధాని సైప్రస్ యాత్రకు పలు రకాలుగా ప్రాధాన్యముంది. ఉగ్రపోరులో దన్ను కశ్మీర్ విషయంలో తుర్కియే తొలి నుంచీ పాక్‌కు మద్దతిస్తూ వస్తోంది. ఇక ఇరుదేశాల మధ్య ఘర్షణలు తలెత్తితే తను ఎటువైపో సిందూర్ వేళ కుండబద్దలు కొట్టింది. ఉగ్రవాదం పట్ల కూడా దానిది తొలినుంచీ మెతక వైఖరే. కానీ సైప్రస్ అలా కాదు. కశ్మీర్ విషయంలో ఎప్పుడూ భారత్‌కు మద్దతుగా ఉంటూ వస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించాల్సిందేనన్న మన వైఖరికి మొదటినుంచీ పూర్తిగా దన్నుగా నిలిచింది. పహల్గాం ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించింది. అంతేగాక పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదాన్ని యూరోపియన్ యూనియన్ వేదికపై ఎండగడతానని హమీ ఇచ్చింది. ఈ విషయమై ఈయూ దేశాల నుంచి మనకు మద్దతు కూడగట్టింది. 2026లో ఈయూ సారథ్య బాధ్యతలు కూడా చేపట్టనుంది. ఈ నేపథ్యంలో సైప్రస్ మద్దతు భారత్‌కు చాలా కీలకం. అంతేగాక ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ఎప్పటినుంచో కోరుతోంది. భారత్–అమెరికా పౌర అణు ఒప్పందానికి కూడా మద్దతుదారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌కు సైప్రస్ పూర్తిగా నమ్మదగ్గ మిత్రుడని విదేశాంగ శాఖ పేర్కొనడంలో అంతరార్థం కూడా అదే. పహల్గాం నేపథ్యంలో ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు తోడు నిలిచిన మిత్ర దేశాలకు కృతజ్ఞత తెలిపేందుకు తాజా మూడు దేశాల పర్యటన చక్కని అవకాశమని మోదీ ప్రకటించారు కూడా. తుర్కియేతో వైరం వీటికి తోడు తుర్కియేతో సైప్రస్‌కు నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వాటి నడుమ విభేదాలు ఈనాటివి కావు. సైప్రస్‌ను ఆక్రమించాలని గ్రీస్ ఎప్పటినుంచో ప్రయతి్నస్తోంది. 1974లో అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రకు గ్రీస్ పూర్తిగా సహకరించింది. అదే అదనుగా తుర్కియే మరోవైపు నుంచి సైప్రస్‌పై దండెత్తింది. నాడు ఆక్రమించిన భూభాగాల నుంచి నేటికీ వైదొలగలేదు. వర్తక పరంగానూ... అంతేగాక మోదీ పర్యటన సందర్భంలో వర్తక, ఇంధన తదితర రంగాల్లో భారత్‌తో సైప్రస్ కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. దీనికి తోడు భారత్–పశ్చిమాసియా–యూరప్ ఆర్థిక కారిడార్‌లో భౌగోళికంగా సైప్రస్ అత్యంత వ్యూహాత్మక స్థానంలో ఉంది. ఆ దేశంలో అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటైన యూరో బ్యాంక్ ముంబైలో ప్రాతినిధ్య కార్యాలయం ఏర్పాటు చేయనుంది. సానుకూల పన్నుల వ్యవస్థ, అద్భుతమైన ఆర్థిక సేవల రంగం, బాగా అభివృద్ధి చెందిన షిప్పింగ్ రంగం మనకు వర్తకపరంగా బాగా అనుకూలించే విషయాలు. తూర్పు మధ్యధరా ప్రాంతంలో సహజ వాయువు వెలికితీత ప్రాజెక్టుల్లో సైప్రస్ కీలక భాగస్వామి కూడా. -
యుద్ధాల యుగం కాదు
నికోసియా: పశ్చియాసియా, యూరప్‌లో జరుగుతున్న యుద్ధాలు, సంఘర్షణలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇది యుద్ధాల యుగం కాదని తేల్చిచెప్పారు. వివాదాలు తలెత్తితే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, యుద్ధాలకు ముగింపు పలకాలని కోరారు. సోమవారం సైప్రస్ రాజధాని నికోసియాలో మోదీ, నికోస్ సమావేశమయ్యారు. భారత్–సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు. రక్షణ, వ్యాపారం, వాణిజ్యం, ఆరోగ్య సంరక్షణ, పునరుత్పాదక ఇంధన వనరులు, వాతావరణ మార్పులు తదితర కీలక అంశాలపై సంప్రదింపులు జరిగాయి. ఇరుదేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయానికొచ్చారు. భేటీ అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. పశ్చిమాసియా, యూరప్‌లో కొనసాగుతున్న యుద్ధాల ప్రభావం ప్రపంచమంతటా ఉంటుందని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. ప్రపంచ మానవాళి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని శాంతి, స్థిరత్వం కోసం అన్ని దేశాలూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. సంఘర్షణలకు తెరదించడానికి చర్చలు, సంప్రదింపులే మార్గమని పునరుద్ఘాటించారు. సీమాంతర ఉగ్రవాదంపై భారత్ సాగిస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించిన సైప్రస్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్–సైప్రస్ ద్వైపాక్షిక సంబంధాల్లో నూతన అధ్యాయాన్ని లిఖించడానికి ఈ పర్యటన తనకు ఒక సువర్ణ అవకాశమని మోదీ వ్యాఖ్యానించారు. రెండు దేశాల సంబంధాలకు ప్రజాస్వామ్యం పట్ల పరస్పర విశ్వాసం, చట్టబద్ధమైన పాలనే పునాది అని స్పష్టంచేశారు. భారత్‌లో పర్యటించాలని సైప్రస్ అధ్యక్షుడిని మోదీ ఆహా్వనించారు. దురాక్రమణకు చరమగీతం పాడాలి: నికోస్ భారత్–సైప్రస్ మధ్య చరిత్రాత్మక స్నేహ సంబంధాలు ఉన్నాయని సైప్రస్ అధ్యక్షుడు నికోస్ గుర్తుచేశారు. విశ్వాసమే ప్రాతిపదికగా రెండు దేశాల నడుమ ఆతీ్మయ సంబంధాలు కొనసాగుతున్నాయని వివరించారు. ఏప్రిల్ 22న జమ్మూకశీ్మర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించినట్లు గుర్తుచేశారు. అంతకుముందు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌కు చేరుకున్న మోదీ ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగాకౌన్సిల్ ఆఫ్ నికోసియా సభ్యుడు మైఖేలా ఖైత్రియోటి మలాపా.. మోదీ పాదాలకు నమస్కరించారు. వ్యాపారాభివృద్ధికి అద్భుత అవకాశాలు భారత్ త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోందని నరేంద్ర మోదీ వెల్లడించారు. వ్యాపారాభివృద్ధికి తమ దేశంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ అవకాశాలు ఉపయోగించుకోవాలని, పెట్టుబడులతో ముందుకు రావాలని సైప్రస్ ఇన్వెస్టర్లకు, పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. సైప్రస్ దక్షిణ కోస్తాతీరంలోని లిమాసోల్ సిటీలో బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో మోదీ మాట్లాడారు. గత 11 ఏళ్లలో ఇండియా సాధించిన ఆర్థిక ప్రగతిని వివరించారు.మోదీకి సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారం ప్రధాని మోదీని సైప్రస్ ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకారియోస్–3’ని మోదీకి ప్రదానం చేశారు. భారత్–సైప్రస్ మధ్య స్నేహబంధానికి ఈ అవార్డును అంకితం ఇస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమని అభివరి్ణంచారు. వసుధైక కుటుంబం అనే భావనకు ఈ పురస్కారం ఒక ప్రతీక అన్నారు. రాబోయే రోజుల్లో మన రెండు దేశాల మధ్య క్రియాశీల భాగస్వామ్యం అత్యున్నత స్థాయికి చేరుకుంటుందన్న విశ్వాసం తనకు ఉందని చెప్పారు. -
సైప్రస్ చేరుకున్న ప్రధాని మోదీ
నికోసియా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం ఆదివారం సైప్రస్ చేరుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడ్స్‌తో ఆయన చర్చలు జరుపుతారు. లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి అధ్యక్షుడు క్రిస్టోడౌలిడ్స్ స్వయంగా స్వాగతం పలికారు. భారత ప్రధాని ఒకరు సైప్రస్‌లో పర్యటించడం రెండు దశాబ్దాల కాలంలో ఇదే ప్రథమం.సైప్రస్ అధ్యక్షుడితో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల వంటి రంగాల్లో బంధాన్ని దృఢతరం చేసుకునేందుకు అవకాశముందని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో తెలిపారు. ప్రధాని మోదీ తమ దేశానికి రావడం చారిత్రక సందర్భమని క్రిస్టోడౌలిడ్స్ తెలిపారు. స్థానిక హోటల్లో ప్రధాని మోదీ బస చేశారు. ఈ సందర్భంగా ‘వందే మాతరం, భారత్ మాతా జీ జై’ అంటూ భారత సంతతి ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. సైప్రస్ పర్యటన అనంతరం కెనడాలో జరిగే జీ7 శిఖరాగ్రానికి ప్రధాని మోదీ వెళ్లనున్నారు. -
నేటి నుంచి మోదీ విదేశీ పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జీ7 శిఖరాగ్ర సదస్సు జరిగే కెనడాతో పాటు సైప్రస్, క్రొయేషియాల్లో ఆయన పర్యటించనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు, జూన్ 16, 17 తేదీల్లో కెనడాలోని కననాస్కిస్‌లో జరిగే జీ7 సమావేశంలో మోదీ పాల్గొంటారు. ఇంధన భద్రత, సాంకేతికత, ఆవిష్కరణలతో సహా కీలక ప్రపంచ సమస్యలపై భారత్ వైఖరిని ప్రపంచ దేశాలతో ఆయన పంచుకోనున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. అందేగాక పలువురు జీ7, ఇతర దేశాధినేతలతో ప్రధాని భేటీ కానున్నారు. పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్ తరువాత ఆయనకు ఇదే తొలి విదేశీ పర్యటన. ఖలిస్తానీ సమస్య కారణంగా కెనడాతో దౌత్య సంబంధాలు క్షీణించాక ఆ దేశంలో పర్యటిస్తుండటమూ ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో దౌత్య బంధాలు మెరుగవుతాయని విదేశాంగ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇందుకు ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోందని విదేశాంగ శాఖ ప్రతినిధి ఇటీవలే చెప్పారు. 2023లో కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య జరగడం తెలిసిందే. అందులో భారత ఏజెంట్ల ప్రమేయముందని నాటి ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అంతేగాక అప్పటి భారత హై కమిషనర్ సంజయ్ వర్మతో సహా అనేక మంది మన దౌత్యవేత్తలకు నిజ్జర్ హత్యతో సంబంధముందని కూడా కెనడా ఆరోపించింది. వీటిపై భారత్ మండిపడింది. ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఈ ఉదంతంతో కెనడాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. తర్వాత ట్రూడో తప్పుకోవడం, ఇటీవలి ఎన్నికల్లో మార్క్ కార్నీ ప్రధాని కావడంతో కొన్ని నెలలుగా, అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. కొత్త హైకమిషనర్లను నియమించే అవకాశాలను రెండు దేశాలూ పరిశీలిస్తున్నాయి. భారత్‌కు ప్రాధాన్యం భారత్ జీ7 సభ్య దేశం కాకపోయినా ఆహ్వానిత దేశంగా 12వసారి పాల్గొంటోంది. ఈ సదస్సుకు మోదీ హాజరవుతుండటం ఇది వరుసగా ఆరోసారి. 1975లో ఫ్రాన్స్ ప్రారంభించిన జీ7కు ఇది 50వ సంవత్సరం. ఫ్రాన్స్‌తో పాటు ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా ఇందులో సభ్య దేశాలు. యూరోపియన్ యూనియన్ కూడా జీ7కు పూర్తిస్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తోంది. అంతర్జాతీయ శాంతిభద్రతలు, ఆర్థిక స్థిరత్వం, వాతావరణ మార్పులు, దేశాల నడుమ సహకారం, అంతర్జాతీయ నేరాల కట్టడికి ఉమ్మడి చర్యలు, మౌలిక వసతులు, పెట్టుబడులు, యువత, ఉపాధి అవకాశాలు తదితరాలపై జీ7 దృష్టి సారిస్తుంది. భారత్ వంటి దేశాలను ‘ప్రచార భాగస్వామి’గా జీ7 ఏటా ఆహ్వానిస్తోంది. సైప్రస్, క్రొయేషియాలకు తొలిసారి మోదీ ఆదివారం తొలుత సైప్రస్ వెళ్తారు. అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్‌తో పలు అంశాలపై చర్చిస్తారు. గత 20 ఏళ్లలో అక్కడ భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. అనంతరం మోదీ కెనడాలో జీ7 సదస్సులో పాల్గొంటారు. అనంతరం 18న క్రొయేషియా వెళ్తారు. భారత ప్రధాని ఒకరు ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కానుంది. క్రొయేషియా ప్రధాని ఆంద్రే ప్లెంకోవిక్‌తో పాటు అధ్యక్షుడు జొరాన్ మిలానోవిక్‌తో కూడా మోదీ భేటీ అవుతారు. -
ఎయిర్ ఇండియా ప్రమాదంపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు విమానయాన రంగంలో అనుభవం లేదు. రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న అంటూ వ్యాఖ్యలు చేశారు. భారత ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని రామ్మోహన్ నాయుడును తొలగించాలి అని అన్నారు.ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఢిల్లీలో సాక్షితో మాట్లాడుతూ..‘ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి. రామ్మోహన్ నాయుడుకు విమానాయన రంగంలో అనుభవం లేదు. ఒక గంట కూడా విమానయాన రంగం గురించి ఆయన చదవలేదు. రామ్మోహన్ నాయుడుతో వ్యక్తిగత గొడవలు లేవు. ఆయనకు ఇంకా కేబినెట్ పదవి రావాలని కోరుకుంటాను. కానీ, భారత ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని రామ్మోహన్ నాయుడును తొలగించాలి. ప్రధాన మంత్రిపై అనేక దేశాల నుంచి ఒత్తిడి రాక ముందే రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి.ప్రధాని మోదీ కూడా రిటైర్మెంట్ ప్రకటించాలి. ప్రధాని బాధ్యతను అమిత్ షా కు అప్పగించాలి. విమాన ప్రమాదం తరువాత ఎయిర్ ఇండియా సీఈఓ, విదేశాంగ మంత్రి రాజీనామా చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. భారత ప్రతిష్ట కాపాడటం కోసం తప్పు చేసిన వారికి శిక్ష విధించాలి. జీ-7 సమ్మిట్‌లో విమాన ప్రమాదం ఏవిధంగా జరిగిందనేది చర్చ జరగనుంది. ముందస్తుగా ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ప్రధాని, విమానయాన శాఖ మంత్రి రాజీనామా చేయాలని సుబ్రమణ్య స్వామి డిమాండ్ చేశారు. అదానీ అభివృద్ధికి తీసుకోవడం, ఎయిర్ పోర్టు పక్కన భవనాలు ఉండటంతో ప్రమాదం జరిగిందంటున్నారు. దీనిపై విచారణ చేపట్టాలి’ అని కామెంట్స్ చేశారు. -
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మోదీ
అహ్మదాబాద్: దేశ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం స్వయంగా పరిశీలించారు. ఆయన ఉదయం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఘటనా స్థలానికి వచ్చారు. 20 నిమిషాల పాటు ఇక్కడే ఉన్నారు. విమానం కూలిపోవడంతో ధ్వంసమైన భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వెంట పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, గుజరాత్ మంత్రి హర్ష్ సంఘావీ ఉన్నారు. ప్రమాదం గురించి వారు ప్రధానమంత్రికి తెలియజేశారు. మెడికల్ కాలేజీ హాస్టల్, మెస్ ధ్వంసమైన తీరును వివరించారు. అనంతరం మోదీ సిటీ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు. విమాన ప్రమాదంలో గాయాలతో బయటపడి చికిత్స పొందుతున్న విశ్వాస్ కుమార్ రమేశ్‌ను పరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో 25 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్న సీ7 వార్డును మోదీ సందర్శించారు. అక్కడున్న డాక్టర్లతో మాట్లాడారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. విజయ్ రూపానీ కుటుంబానికి ఓదార్పు విమాన ప్రమాదంలో మృతిచెందిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబాన్ని ప్రధాని మోదీ ఓదార్చారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలోని గుజ్‌సెయిల్ కార్యాలయంలో విజయ్ రూపానీ భార్య అంజలి రూపానీతోపాటు ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ విపత్కర సమయంలో గుండె నిబ్బరం కోల్పోవొద్దని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. అధికారులతో సమీక్ష ప్రధాని మోదీ గుజ్‌సెయిల్ ఆఫీసులో గుజరాత్ ప్రభుత్వ అధికారులతో, పౌర విమానయాన శాఖ అధికారులతో సమావేశమయ్యారు. విమాన ప్రమా దం, తాజా పరిణామాలపై సమీక్ష నిర్వహించారు. -
నేను ఎలా బతికానంటే..! మృత్యుంజయుడి మాటల్లో
-
విమాన ప్రమాదం.. ఘటనాస్థలిని పరిశీలించిన ప్రధాని మోదీ (ఫొటోలు)
-
సివిల్ ఆస్పత్రిలో క్షతగాత్రులకు ప్రధాని మోదీ పరామర్శ
-
విమాన ప్రమాద ఘటనా స్థలంలో ప్రధాని మోదీ
-
విమాన ప్రమాదం.. బ్లాక్ బాక్స్‌పై ఫేక్ ప్రచారం..
Ahmedabad Incident Updates..బ్లాక్ బాక్స్ రికవరీ నివేదికలు ఊహాగానాలు మాత్రమే: ఎయిర్ ఇండియాఅహ్మదాబాద్ ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్‌పై ఫేక్ ప్రచారంబ్లాక్ బాక్స్ దొరికిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం.తప్పుడు ప్రచారాన్ని ఖండించిన ఎయిర్ ఇండియా.బ్లాక్ బాక్స్‌పై ఎంత దొరకలేదని స్పష్టం చేసిన ఎయిర్ ఇండియా.Till now, the black box is not recovered from the plane.The black box is located in the tail section of the aircraft.The tail of the aircraft is stuck into the building.To access the blackbox safely, the tail needs to be removed from the building.But the work regarding… pic.twitter.com/c9B62v10Ce— Kapil (@kapsology) June 13, 2025మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే ఏర్పాట్లుడీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.ప్రమాదంలో మృతదేహాలన్ని కూడా మాంసపు ముద్దల్లా మారిపోయాయి.తీవ్రంగా కాలిపోయిన మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలను నిర్వహించి వారిని గుర్తించనున్నారు.డీఎన్ఏ కోసం శాంపిళ్ల సేకరణవిమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ కోసం అధికారులు శాంపిళ్లను సేకరించారు.డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతుదేహాలను గుర్తించి వారి కుటుంబీకులకు అప్పగించనున్నారు. విమాన ప్రమాదంపై మోదీ స్పందన..విమాన ఘటన తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యా. ఇంత మంది ప్రాణాలు కోల్పోయిన బాధను మాటల్లో చెప్పలేను.ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. అహ్మదాబాద్ విమానాశ్రయంలో మోదీ సమీక్షఅహ్మదాబాద్ విమానాశ్రయంలో సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీఅహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని సమీక్షసమీక్షలో అధికారులు, సహా మంత్రులు పాల్గొన్నట్టు సమాచారం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్న మోదీ.ఆసుపత్రిలో క్షతగాత్రులను ప్రధాని మోదీ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిన అడిగి తెలుసుకున్నారు. #WATCH | PM Modi meets and enquires about the health condition of those injured in the Air India plane crash in Ahmedabad pic.twitter.com/QCFrmdSEXx— ANI (@ANI) June 13, 2025 #WATCH | PM Modi visits Ahmedabad Civil Hospital to meet those injured in AI-171 plane crash pic.twitter.com/ebUFXSTT8o— ANI (@ANI) June 13, 2025ప్రమాద స్థలికి చేరుకున్న మోదీ.. #WATCH | The wreckage of the AI-171 plane hangs from BJ Medical College's building, which it crashed into soon after take-off from Ahmedabad airport yesterdayPM Modi visited the plane crash site today to assess the ground situation.(video source: DD) pic.twitter.com/ScTDNv5nYz— ANI (@ANI) June 13, 2025ప్రమాద స్థలికి చేరుకున్న మోదీ.. ప్రధాని మోదీ విమాన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మృతుల కుటుంబాలను మోదీ పరామర్శ. ఇప్పటికే టాటా గ్రూప్ చైర్మన్‌తో మాట్లాడిన మోదీ. విమాన ప్రమాదంతో తీవ్ర విషాదం#WATCH | PM Modi visits the site of AI-171 flight crash in Ahmedabad The crash claimed the lives of 241 people, including 12 crew members onboard. pic.twitter.com/gCvP229Vcs— ANI (@ANI) June 13, 2025 ఘటనా స్థలికి ఫోరెన్సిక్ బృందం.. విమాన ప్రమాద ఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిన్ నిపుణుల బృందం#WATCH | A forensic team arrives at the #AirIndiaPlaneCrash site, in Ahmedabad. pic.twitter.com/d49Bnxdjgl— ANI (@ANI) June 13, 2025ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరగాలి..AI-171 విమాన ప్రమాదంపై బాధిత కుటుంబ సభ్యుడి ఆవేదన..అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ వద్ద ఓ వ్యక్తి ఆగ్రహం..ఈ సంఘటన ఎలా జరిగిందనే దానిపై సమగ్ర దర్యాప్తు జరగాలి.మా ప్రాణాలకు విలువ లేదా?కఠిన చర్య తీసుకోవడం ఎయిర్ ఇండియా బాధ్యత.#WATCH | On the AI-171 plane crash, a local at Ahmedabad Civil Hospital says, "There should be a thorough investigation into how this incident happened. Does life have no value?? It is Air India's responsibility to take action." pic.twitter.com/MPbmkHdelr— ANI (@ANI) June 13, 2025అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీప్రధాని మోదీ అహ్మదాబాద్ చేరుకున్నారు. విమానం ప్రమాదానికి గురైన స్థలాన్ని పరిశీలించనున్నారు. PM Narendra Modi will be visiting Gujarat's Ahmedabad today.#AhmedabadPlaneCrash pic.twitter.com/4fN7dla4va— ANI (@ANI) June 13, 2025ప్రమాద ఘటనా స్థలానికి ఎయిరిండియా సీఈవోఅహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగిన చోటుకి ఎయిరిండియా ఎండీ, సీఈవో క్యాంపుబెల్ విల్సన్ చేరుకున్నారు.ఘటనా స్థలాన్ని పరిశీలించారు.మరోవైపు.. ఘటన స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.#WATCH | Air India MD & CEO Campbell Wilson arrives at AI-171 plane crash site in Ahmedabad241 passengers lost their lives in the plane crash yesterday pic.twitter.com/Jw1GOnduUI— ANI (@ANI) June 13, 2025విమాన ప్రమాదం.. ఈవెంట్లు రద్దుఅహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదంఈ ఘటనపై ప్రముఖులు దిగ్భ్రాంతిపలు సినిమా ఈవెంట్లు రద్దుగుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది.#WATCH | Visuals from AI-171 crash site in Ahmedabad, GujaratAir India has confirmed the loss of 241 lives of the 242 passengers on board the aircraft, which crashed soon after takeoff yesterday pic.twitter.com/1alznlNj40— ANI (@ANI) June 13, 2025కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్‌వే సమీపంలో మేఘానీనగర్‌లోని బీజే మెడికల్ కాలేజీ, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు.230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్వాసులు, ఏడుగురు పోర్చుగల్‌వాసులు, ఒకరు కెనడా పౌరుడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్‌లో స్థిరపడ్డ రమేశ్ విశ్వాస్‌కుమార్ బుచర్వాడ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విమానం తొలుత మెడికల్ కాలేజీ క్యాంటీన్‌పై పడి పేలిపోయింది. -
హృదయం ముక్కలైంది: ప్రధాని మోదీ
మాస్కో/లండన్/వాషింగ్టన్/పారిస్/బ్రస్సెల్స్: మాన ప్రమాద వార్త తెలియగానే తన హృదయం ముక్కలైందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ఖాతాలో ఒక సంతాప పోస్ట్ పెట్టారు. ‘‘ అహ్మదాబాద్‌లో పెను విషాదం నన్ను ఎంతగానో కలచివేసింది. మాటలు రావడం లేదు. మాటలకందని మహా విషాదమిది. నా హృదయం ముక్కలైంది. ఈ విషాద సమయంలో నా ఆలోచనలన్నీ మృతుల కుటుంబాల గురించే. సహాయక చర్యల్లో నిగమ్నమైన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నా’’ అని మోదీ అన్నారు. ‘‘ హృదయ విదారక దుర్ఘటన ఇది. ఇంతటి విషాద సమయంలో బాధిత కుటుంబాలకు యావత్భారతావని అండగా నిలుస్తోంది’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తంచేశారు. ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పలు పార్టీల అధినేతలు, అగ్రనేతలు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేస్తూ సంతాప సందేశాలు వెలువర్చారు.ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేసిన ప్రపంచాధినేతలుఅంతులేని విషాదాన్ని మిగిల్చిన గుజరాత్ విమాన ప్రమాద ఘటనపై ప్రపంచదేశాలు నిర్వరపోయాయి. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తంచేస్తూ ప్రపంచవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మొదలు మలేసియా ప్రధాని అన్వర్ఇబ్రహీం దాకా పలువురు ప్రపంచ దేశాల అధినేతలు, పాలకులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేస్తూ సంతాప సందేశాలు పంపించారు. ‘‘ ఎంతో మంది బ్రిటిష్ జాతీయులతో లండన్‌కు బయల్దేరిన విమానం కూలిన దుర్ఘటన దృశ్యాలు అత్యంత హృదయ విదారకంగా ఉన్నాయి. ఈ ఘటన వివరాలను ఎప్పటికప్పుడు తెల్సుకుంటున్నా. తాజా పరిస్థితిపై ఆరాతీస్తున్నా. భాదితుల కుటుంబాలకు నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని బ్రిటన్ ప్రధాన మంత్రి కెయిర్ స్మార్మర్ వ్యాఖ్యానించారు. బ్రిటన్ రాజు ఛార్లెస్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డీర్ లెయిన్ తదితరులు తమ సంతాపాన్ని ప్రకటించారు. -
ఇది మాటల్లో వర్ణించలేని హృదయవిదారక ఘటన : మోదీ
-
విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా..!
-
హసీనా ఎఫెక్ట్.. మోదీ అందుకు అంగీకరించలేదు: యూనస్ అసహనం
ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. తమ డిమాండ్‌ను అంగీకరించలేదని యూనస్ చెప్పుకొచ్చారు. షేక్ హసీనా బంగ్లా వ్యతిరేక విధానాలను పాటిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు.లండన్‌లోని చాఠమ్ హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మహమ్మద్ యూనస్ మాట్లాడారు. కొన్ని నెలల క్రితం బిమ్స్టెక్ సదస్సులో భాగంగా మోదీతో భేటీ అయిన యూనస్.. భారత ప్రధానితో నాటి సంభాషణను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్బంగా యూనస్..‘హసీనాకు భారత్‌లో ఆశ్రయం కల్పించడంపై నేను మాట్లాడను. అది మీ విధానపరమైన నిర్ణయం. కానీ బంగ్లాదేశ్ ప్రజలను రెచ్చగొట్టేలా ఆమె ఆన్లైన్లో ప్రసంగాలు చేస్తున్నారు. దానివల్ల మా దేశంలో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ విషయంలో మీరు (భారత ప్రధానిని ఉద్దేశిస్తూ) జోక్యం చేసుకోండి. అలాంటి ప్రకటనలు, ప్రసంగాలు చేయకుండా ఆమెను అడ్డుకోండి’ అని మోదీని కోరినట్లు యూనస్ తెలిపారు. దీనికి మోదీ బదులిస్తూ.. ‘అది సోషల్ మీడియా. దాన్ని నియంత్రించడం సాధ్యం కాదు’ అని చెప్పినట్లు వెల్లడించారు.ఇదిలా ఉండగా.. విద్యార్థుల ఉద్యమంతో పదవి కోల్పోయిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో షేక్ హసీనా.. యూనస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్‌ను ఆయన అమెరికాకు అమ్మేశాడు. యూనస్ ఉగ్రవాదుల సహాయంతో అధికారాన్ని ఆక్రమించారు. అంతర్జాతీయంగా నిషేధించిన తీవ్రవాద సంస్థలే ఆయనకు బలంగా నిలిచాయి. నా ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రజలను వీరి నుంచి రక్షించేందుకు కఠిన చర్యలు తీసుకుంది. ఒక్క ఉగ్రదాడి తరువాతే అనేక మందిని అరెస్టు చేశాం. ఇప్పుడు జైళ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అందరినీ విడుదల చేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ మళ్లీ తీవ్రవాదుల పాలనలోకి వెళ్ళింది. యూనస్‌ను ‘మిలిటెంట్ నేత’గా పేర్కొంటూ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడం చట్టవిరుద్దం.. రాజ్యాంగ వ్యతిరేకం అంటూ ఘాటు విమర్శలు చేశారు.గొప్పదైన మా బంగ్లా జాతికి ఉన్న రాజ్యాంగం.. అది ఎన్నో ఏళ్ల పోరాటం, విమోచన యుద్ధం ద్వారా లభించింది.. అక్రమంగా అధికారాన్ని ఆక్రమించిన ఈ మిలిటెంట్ నేతకు ఆ రాజ్యాంగాన్ని తాకే హక్కును ఎవరు ఇచ్చారు? ఆయనకు ప్రజల మద్దతు లేదు, రాజ్యాంగపరమైన ఆధారమూ లేదు. ఆయన ఉన్న స్థానమైన 'చీఫ్ అడ్వైజర్' అనే పదవికి కూడా ఎలాంటి చట్టపరమైన ప్రాతినిధ్యం లేదు.. అది రాజ్యాంగంలోనే లేదు. అయితే, పార్లమెంట్ లేకుండా ఆయన చట్టాలను ఎలా మార్చగలరు? ఇది పూర్తిగా అక్రమం. అవామీ లీగ్‌ను నిషేధించారు అని విరుచుకుపడ్డారు. -
11 ఏళ్లలో 33 తప్పులు
కలబురిగి: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 11 ఏళ్లలో 33 తప్పులు చేసిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కేవలం అబద్ధాలు, మోసాలతో మోదీ కాలం గడిపే స్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చాక యువతను నిలువునా దగా చేశారని, ఓట్ల కోసం పేదలను వాడుకున్నారని మోదీపై మండిపడ్డారు. ప్రధానమంత్రి మోసాలపై పార్లమెంట్‌లోనూ తాను గళమెత్తానని తెలిపారు. తాను 65 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, ఇందులో 55 ఏళ్లు పదవుల్లో ఉన్నానని, నరేంద్ర మోదీ లాంటి మోసకారి ప్రధానమంత్రిని ఏనాడూ చూడలేదని ధ్వజమెత్తారు. బుధవారం కర్ణా టకలోని కలబురిగిలో మల్లికార్జున ఖర్గే మీడియా సమావేశంలో మాట్లాడారు. చెప్పింది మోదీ ఏనాడూ చేయలేదని, అదేమిటని ప్రశ్నిస్తే ఆయన దగ్గర సమాధానం ఉండదని విమర్శించారు. ఆయనకు అబద్ధాలు తప్ప మరొకటి తెలి యదన్నారు. మోదీ తప్పుల జాబితాలో పెద్దనోట్ల రద్దు, ఉద్యోగాల సృష్టి జరగకపోవడం, పంటలకు కనీస మద్దతు దక్కపోవడం వంటివి ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఇవన్నీ తప్పులన్న విషయం ప్రధాని అంగీకరించడం లేదని విమర్శించారు. చేసిన తప్పులకు ప్రజలకు క్షమాపణ చెప్పకపోగా మాటలతో మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. 11 ఏళ్లు గడిచిపోయానని, ఇప్పటిదాకా చేసిందేమీ లేదని ఆక్షేపించారు. డిప్యూటీ స్పీకర్‌ను నియమించాలి లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఖాళీగా కొనసాగిస్తుండడాన్ని ఖర్గే తప్పుపట్టారు. రాజ్యాంగం ప్రకారం డిప్యూటీ స్పీకర్‌ను నియమించాలని సూచిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశానని చెప్పారు. రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వం నడుచుకోవాల న్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత డిప్యూటీ స్పీకర్ పోస్టు ఖాళీగా ఉన్న దాఖలాలు ఏనాడూ లేవని వెల్లడించారు. -
కేబినెట్ సమావేశంలో మంత్రులకు మోదీ క్లాస్
-
ప్రధాని మోదీతో భేటీ..‘బీజేపీ నేతలకు ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ తప్పని సరి’
సాక్షి,ఢిల్లీ: దేశంలో కోవిడ్-19 కేసులు విజృంభిస్తున్న తరుణంలో బీజేపీ అధిష్టానం అప్రమత్తమైంది. ప్రధాని మోదీతో భేటీ అయ్యే నేతలు తప్పని సరిగా కోవిడ్-19 ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకోవాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తన నివాసంలో ఢిల్లీ బీజేపీ నేతలకు ఇవాళ సాయంత్రం ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఏడుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ఢిల్లీకి చెందిన దాదాపు 70 మంది బీజేపీ కార్యకర్తలు పాల్గొన్ననున్నారు.అయితే, దేశంలో కోవిడ్-19 నమోదువుతున్న కోవిడ్-19 కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈరోజు (బుధవారం) 7 వేల మార్కును దాటాయి. దీంతో పార్టీ అధినాయకత్వం పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం మోదీతో భేటీ కానున్న నేతలు తప్పని సరిగా ఆర్టీ పీసీఆర్ టెస్టు చేయించుకోవాలని సూచించింది. మరోవైపు దేశంలో కోవిడ్-19 కేసులపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం డేటాను విడుదల చేసింది. ఆ డేటా ఆధారంగా, గడిచిన 24 గంటల్లో దేశంలో 306 కొత్త కేసులు నమోదు కాగా ఆరుగురు మరణించారు. కోవిడ్ కారణంగా కేరళలో ముగ్గురు, మహారాష్ట్ర (1),కర్ణాటక (2) మరణించారు.కేరళలో అత్యధికంగా ఒకే రోజు 170 కొత్త కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో 114 కొత్త ఇన్ఫెక్షన్లు, 1,223 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కర్ణాటకలో 100 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన డేటాలో పేర్కొంది. ఢిల్లీలో గత 24 గంటల్లో 66 కొత్త కేసులు నమోదుగా.. రాజధానిలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 757కు చేరుకుంది. కేరళ మొత్తం 2,000 యాక్టివ్ కేసులు మార్కును దాటడంతో అగ్రస్థానంలో ఉంది. తరువాత గుజరాత్, పశ్చిమ బెంగాల్,ఢిల్లీ ఉన్నాయి. -
విద్యార్థుల సమస్యలపై రాహుల్ ఆవేదన.. ప్రధాని మోదీకి లేఖ
ఢిల్లీ: దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈబీసీల హాస్టళ్లలో నెలకొన్న పరిస్థితులను మెరుగుపరచాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్పులను తగిన సమయంలో అందించి, విద్యార్థులను ఆదుకోవాలని రాహుల్ కోరారు.దేశంలోని దళిత, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ హాస్టళ్లలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని రాహుల్ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల వారికి పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లలో జరుగుతున్న జాప్యాన్ని ఆయన తప్పుబట్టారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన 90 శాతం మంది విద్యార్థుల విద్యకు కలిగించే సమస్యలను వెంటనే పరిష్కరించాలని గాంధీ మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.ఇటీవల బీహార్‌లోని దర్భంగాలోని అంబేద్కర్ హాస్టల్‌ను తాను సందర్శించినప్పుడు అక్కడి అపరిశుభ్రమైన టాయిలెట్లు, అసురక్షిత తాగునీరు, మెస్ సౌకర్యాలు లేకపోవడం, లైబ్రరీలు, ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడాన్ని చూసినప్పుడు తనకు బాధ కలిగిందన్నారు. అలాగే అణగారిన వర్గాల విద్యార్థులకు పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్లు అందించడంలో ఆలస్యం జరుగుతున్నదన్నారు. అక్కడి స్కాలర్షిప్ పోర్టల్ మూడు సంవత్సరాలుగా పనిచేయడంలేదని, 2021-22లో ఏ విద్యార్థికి కూడా స్కాలర్షిప్ లభించలేదని రాహుల్ పేర్కొన్నారు. ఇటువంటి వైఫల్యాలు దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉన్నాయని, వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. అట్టడుగు వర్గాల యువత అభివృద్ధి చెందకపోతే , దేశం అభివృద్ధి చెందదనే విషయాన్ని అందరూ అంగీకరిస్తారని తాను భావిస్తానని ఆ లేఖలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రియాంకకు హైకోర్టు సమన్లు -
‘డిప్యూటీ స్పీకర్ పదవి’పై ప్రధానికి మల్లికార్జున ఖర్గే లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ లేవనెత్తింది. డిప్యూటీ స్పీకర్ పదవికి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ పదవిని ఖాళీగా ఉంచడం భారత ప్రజాస్వామ్య రాజకీయాలకు మంచి సంకేతం కాదని, ఇది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నారు. జూలై 21 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఖర్గే ఈ డిమాండ్ చేశారు.‘లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీకి సంబంధించిన ఆందోళనకరమైన విషయంపై మీ దృష్టిని ఆకర్షించడానికే నేను ఈ లేఖ రాస్తున్నాను’అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రధానికి రాసిన తన లేఖలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరినీ ఎన్నుకోవడానికి వీలు కల్పిస్తుంది. రాజ్యాంగపరంగా, డిప్యూటీ స్పీకర్ లోక్‌సభ స్పీకర్ తర్వాత రెండవ అత్యున్నత ప్రిసైడింగ్ అధికారి. సంప్రదాయంగా లోక్‌సభ రెండవ లేదా మూడవ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ ఎన్నికవుతారని... లోక్‌సభలో కార్యనిర్వహణ, విధాన నియమాలలోని 8(1) నిబంధన ప్రకారం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తేదీని స్పీకర్ నిర్ణయిస్తారు అనేది ఒకే తేడా అని ఖర్గే తెలిపారు.మొదటి లోక్‌సభ నుంచి పదహారవ లోక్‌సభ వరకు ప్రతి సభలో ఒక డిప్యూటీ స్పీకర్ ఉన్నారని ఖర్గే అన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ సభ్యుల నుంచి డిప్యూటీ స్పీకర్‌ను నియమించడం ఒక ఆనవాయితీ అని... స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా, ఈ పదవి వరుసగా రెండు లోక్‌సభ పర్యాయాలు ఖాళీగా ఉందని ఖర్గే విమర్శించారు. పదిహేడవ లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కాలేదని.. ఇదే విధా నం పద్దెనిమిదవ లోక్‌సభలో కూడా కొనసాగుతోందన్నారు. ఇది భారతదేశ ప్రజాస్వామ్య రాజకీయాలకు మంచి సంకేతం కాదని.. ఇది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమే అని ఖర్గే ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అందువల్ల సభ సంప్రదాయాలను, పార్లమెంటు ప్రజాస్వామ్య విలువలను దృష్టిలో ఉంచుకుని, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ఇక ఆలస్యం చేయకుండా ప్రారంభించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు కోరారు. -
అఖిలపక్ష బృందాలకు ప్రధాని మోదీ ప్రశంస
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలు, పాక్ ఉగ్రవాద విష సంస్కృతిని ప్రపంచదేశాల ఎదుట ప్రభావవంతంగా ఎండగట్టినందుకు అఖిలపక్ష బృందాలను ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. 50 మందికిపైగా సభ్యులతో ఏడు బృందాలుగా బయల్దేరి అత్యంతప్రధానమైన దేశాల్లో పర్యటించి పాక్ వైఖరిపై దునుమాడి తిరిగొచ్చిన అఖిలపక్ష సభ్యులను ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం ఢిల్లీలో 7, లోక్‌కళ్యాణ్‌మార్గ్‌లోని తన అధికార నివాసంలో కలిశారు. వారి విదేశీ పర్యటన వివరాలను స్వయంగా అడిగి తెల్సుకున్నారు.అంతర్జాతీయ వేదికపై భారత దృఢవైఖరిని, పాక్ దుష్టనీతిని అత్యంత ప్రభావవంతంగా తెలియజెప్పినందుకు వారందరినీ ప్రధాని ప్రశంసించారు. ఈ సందర్భంగా సభ్యులు తమ పర్యటన అనుభవాలు, విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. ‘‘ ఉగ్రవాదాన్ని అంతంచేసి శాంతిస్థాపనకు భారత్చేస్తున్న కృషిని, భారత్‌పై పాక్ చిమ్ముతున్న ఉగ్రవిషాన్ని ప్రపంచదేశాలకు తెలియజేప్పేందుకు పర్యటనకు వెళ్లివచ్చిన అఖిలపక్ష బృందాలతో భేటీ అయ్యా. భారత వాణిని బలంగా వినిపించినందుకు మేమంతా ఎంతగానో గర్వపడుతున్నాం’’ అని తర్వాత మోదీ తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌చేశారు.రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా(బీజేపీ), శశిథరూర్(కాంగ్రెస్), కనిమొళి(డీఎంకే), శ్రీకాంత్ శిందే(శివసేన), సంజయ్ కుమార్ ఝా(జేడీయూ), సుప్రియా సూలే (ఎన్సీపీ–ఎస్పీ)ల సారథ్యంలోని ఏడు అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలు 33 దేశాల రాజధాని నగరాలు, యురోపియన్ యూనియన్‌లో పర్యటించడం తెల్సిందే. భేటీలు సత్ఫలితాలనిచ్చాయి: శశిథరూర్ అమెరికాతోపాటు మరో నాలుగు దేశాల పర్యటనకు సారథ్యంవహించిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అంతకుముందు మీడియాతో మాట్లాడారు. ‘‘ భేటీ అద్భుతమైన సత్ఫలితాల నిచ్చింది. రాజకీయాలకు అతీతంగా ఎంపీలను పంపి భారత ఐక్యతను ప్రభుత్వం చాటింది. అందుకు తగ్గట్లే భేటీలన్నీ ఫలవంతమయ్యాయి. మా లక్ష్యం నెరవేరింది. పహల్గాం దాడి తర్వాత భారత్ ఎందుకు ఉగ్ర, పాక్ స్థావరాలపై దాడిచేసిందో బలంగా వినిపించాం. ఆయాదేశాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఉన్నతాధికారులు, మీడియా సైతం భారత్‌కు మద్దతు పలికారు’’ అని శశిథరూర్ అన్నారు.‘‘ ఉగ్రవాదం విషయంలో భారత దేశ ఐక్యతను చాటడంతోపాటు భారత వాణిని ప్రపంచదేశాలకు బలంగా వినిపించే లక్ష్యంతో ఈ బృందాలు 30కిపైగా దేశాల్లో పర్యటించాయి’’ అని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదలచేసింది. ఇప్పటికే ఈ బృందాల కృషిని భారత విదేశాంగ శాఖ పొగిడింది. ఇప్పటికే ఈ బృందాలతో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ విడివిడిగా భేటీ అయ్యారు. అమెరికా, యూరప్, పశ్చిమాసియా, ఆఫ్రికా, ఆగ్నేయాసియాలో ఒక్కో బృందం పర్యటించింది. -
ప్రపంచం మన మాట వినట్లేదేం?
పాకిస్తాన్ ఒక విఫల రాజ్యం. పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఏకాకి అయింది. ప్రపంచంలో ముస్లింలు అత్యధికంగా ఉన్న దేశ మైన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబుతొ సుబియాంతో పాక్‌తో ముడిపెట్టకుండా, భారత్‌ను విడిగా సందర్శించారు. ఒక దశాబ్దం నుంచి భారత ప్రజానీకానికి ఈ రకమైన చిత్రాన్ని రూపుకట్టిస్తూ వస్తున్నారు. మరి మనం ‘అంతర్జాతీయ సమాజం’గా చెప్పుకొంటున్నది పాక్‌ను నిలదీయకుండా సంశయ స్థితిలో ఉండిపోవడానికి కారణ మేమిటి? పాక్‌ను గూడుగా చేసుకుని పనిచేస్తున్న ఉగ్ర మూకల వల్ల రెండు దేశాలూ ఘర్షణ పడి ఇంకా నెల కూడా కాకుండానే, కౌంటర్ – టెర్రరిజం కమిటీ ఉపాధ్యక్ష పదవిని ఐరాస భద్రతామండలి జూన్ 4న పాక్‌కు కట్టబెట్టింది. గత నెల రోజులుగా పాక్ సాధించిన దౌత్య విజయాలకు ఇది శిఖరాగ్రం. పాక్‌ను ప్రపంచం ఎలా వీక్షిస్తోంది అనే అంశంపైన దృష్టి సారించవలసిన సమయం ఆసన్నమైంది. మద్దతుగా వచ్చిన దేశాలెన్ని?రెండు దేశాల మధ్య ఘర్షణలు మొదలై రెండు రోజులయ్యాయో లేదో మే 9న మనం దౌత్యపరమైన మొదటి దిగ్భ్రాంతిని చవిచూడ వలసి వచ్చింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) 200 కోట్ల డాలర్ల రుణాన్ని పాక్‌కు అందించడానికి అనుకూలంగా ఓటు వేసింది. ఒక్క భారత్ మినహా, జీ–7 దేశాలతో సహా బోర్డులోని మిగిలిన సభ్య దేశాలన్నీ పాక్ ఊపిరిపీల్చుకునేందుకు ఊతమి చ్చాయి. ఐఎంఎఫ్ బాటలో, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా పాక్‌కు అప్పులిచ్చేందుకు ముందుకొచ్చాయి. ఇక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీనికి సంబంధించి ఓ డజను ప్రకటనలు చేశారు. దాడి, ప్రతిదాడులు చేసుకుంటున్న పొరుగు దేశాలతో కాల్పుల విరమణ ప్రకటింపజేసిన ఘనత తనదే నని ఆయన మొదట చాటుకున్నారు. కాల్పుల విరమణకు, అమె రికాకు ఎలాంటి సంబంధమూ లేదని భారత్ అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా ఆయన ఆ రకమైన మాటలు ఆపలేదు. భారత్ –పాక్‌లను ఒకే గాటన కడుతూ, రెండూ అమెరికాకి మిత్ర దేశాలనీ, ఎందుకంటే, అవి అణ్వాయుధ దేశాలనీ ఆయన అన్నారు. భవిష్యత్తులో ఘర్షణలు తలెత్తకుండా నివారించేందుకు అవి పరస్పరం వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకోవాలని, అమెరికాతో కూడా వ్యాపారం చేయాలని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు మద్దతు ప్రకటించిన దేశాలు చాలా ఉన్నప్పటికీ, కేవలం రెండు –ఇజ్రాయెల్, అఫ్గానిస్తాన్ మాత్రమే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నదిగా పాక్‌ను పేరెత్తి ప్రకటించాయి. చైనా కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లతో ఒక త్రైపాక్షిక సమావేశం నిర్వహించి ఆ రెండింటి మధ్య రాజీ కుదిర్ఛింది. దాంతో, ప్రస్తుతం నిస్సహాయులపై జాతిసంహారం సాగిస్తున్నట్లు నిందపడుతున్న ఇజ్రాయెల్ ఒక్కటే, భారత్‌కు అండగా నిలిచి నట్లవుతోంది. రష్యా కూడా రెండు నాల్కల ధోరణితో మాట్లాడింది. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన కొద్ది రోజుల తర్వాత, భారత్ ‘భాగ స్వాములను కోరుకుంటోంది కానీ, బోధకులను కాదు’ అని యూరో పియన్ యూనియన్ను విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఎద్దేవా చేశారు. ఆ తర్వాత ఎవరూ నీతులు పలికే యత్నం చేయని మాట నిజమేకానీ, భాగస్వాములవుతామన్న దేశాలు కొద్దిగానే ఉన్నాయి.మనకెందుకు మద్దతు రాలేదు?పాకిస్తాన్ అసలు రూపాన్ని అంగీకరించడంలో, దాన్ని నిల దీయడంలో, ‘అంతర్జాతీయ సమాజం’గా మనం భావిస్తున్నదిఎందుకు వెనకడుగు వేస్తున్నట్లు? పాకిస్తాన్ దుశ్చర్యలను చిత్తశుద్ధితో ఎందుకు ఖండించడం లేదు? కనీసం, భారతదేశానికి మరింత హృదయపూర్వకంగానైనా సంఘీభావం వ్యక్తపరచడం లేదు ఎందుకని? భారత రాయబారులు చేయవలసిన పనిని నిర్వర్తించేందుకు వివిధ పార్టీల పార్లమెంట్ సభ్యులతో ప్రతినిధి బృందాలను ప్రధాని నరేంద్ర మోదీ పంపవలసిన అవసరం ఎందుకొచ్చింది?గతంలో ఇలాంటి స్థితి ఎన్నడూ ఉత్పన్నం కాలేదు. మఫ్టీ దుస్తు లలో వచ్చిన పాక్ సైనికులను కార్గిల్ నుంచి 1999లో తరిమి కొట్టినప్పుడు... అంతర్జాతీయ సమాజం భారత్ సరసన నిలిచింది. నియంత్రణ రేఖనే సరిహద్దుగా అంగీకరిస్తున్న సిమ్లా ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తలూపిన తర్వాత, కశ్మీర్ హోదాపై ప్రపంచ అభిప్రాయంలోనూ మార్పు వచ్చింది. క్లింటన్ అప్పట్లో భారత్‌లో ఐదు రోజులు పర్యటించి పాకిస్తాన్లో ఐదు గంటలు మాత్రమే గడిపారు. భారత్‌ను ప్రశంసించి, పాక్‌ను మందలించారు. ముంబయిపై ఉగ్రదాడి సందర్భంలో, 2008 నవంబర్‌లో కూడా మొత్తం ప్రపంచం భారత్‌కు బాసటగా నిలిచింది. ఆ రెండు ఉదంతాలలోనూ పాక్ పాత్ర తేటతెల్లం కావడంతో అది తలదించు కోవలసి వచ్చింది. భారత్ ప్రకటనలకు ప్రపంచం సముచిత గౌరవం ఇవ్వడం కూడా దానిలో అంతే సమానమైన పాత్ర వహించింది. అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల ప్రకట నలను అన్ని ప్రధాన దేశాలూ గౌరవ ప్రపత్తులతో చూశాయి. మన వైఖరి గురించి వివరణ ఇచ్చుకుంటూ, 50 మంది పార్లమెంటేరి యన్లను ప్రపంచం నలుమూలలకు పంపడం ద్వారా ప్రజాధనాన్ని ఇప్పటిలా వృథా చేయవలసిన అవసరం కూడా లేకపోయింది.వృత్తిపరమైన దౌత్యవేత్తలే ఆ బాధ్యతను నిర్వహించారు. పహల్గామ్ దాడిలో పాలుపంచుకున్న ఉగ్రవాదుల జాతీయ తను గుర్తించడంలో, పాక్ అపరాధాన్ని స్పష్టంగా నిరూపించడంలో కేంద్రం విఫలమైంది. అది ఈసారి భారత్ దౌత్య సామర్థ్యాన్ని వికలం చేసింది. సీమాంతర ఉగ్రవాదంపై భారత్ వాదనను బలహీన పరచడంలో భారత అంతర్గత రాజకీయాలు పాత్ర పోషించలేదు కదా అని ప్రపంచంలోని అనేక దేశాలు విస్తుపోతున్నాయి. భారత్ లౌకిక, ప్రజాస్వామిక దేశంగానూ, వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలు బాధ్యతాయుతమైన ప్రభుత్వాలుగానూ పరిగణన పొందాయి. వర్తమానానికొస్తే, భారత్ కేసు బలహీన పడింది. అంత ర్జాతీయ అభిప్రాయంలోనూ సానుభూతి సన్న గిల్లింది. మున్ముందు జరగవలసింది!శత్రుదేశాన్ని ఆచితూచి అంచనా వేయడం జాతీయ భద్రత, విదేశీ విధాన నిర్వహణ కర్తల మొదటి లక్ష్యం కావాలి. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి వీలయ్యే విధంగా వివిధ స్థాయులలో సంబంధాలు కొనసాగేటట్లు చూసుకోవాలి. పాకిస్తాన్‌తో అన్ని దౌత్య పరమైన, వ్యాపార, పౌర సమాజ మార్గాలను మూసివేయడ ద్వారా... పొరుగు దేశం గురించి సమ తూకంతో కూడిన మదింపు చేయడానికున్న మార్గాలను, సరిహద్దుకు ఆవల అభిప్రాయాలను ప్రభావితం చేయడానికున్న అవకాశాన్ని చేజార్చుకున్నట్లయింది. రెండు దేశాల మధ్య ఆర్థిక వ్యత్యాసం పెరిగిందనడంలో సందేహం లేదుగానీ, పాకిస్తాన్‌ను మరీ పనికిరానిదిగా చూడటం కూడా సరికాదు. దానికి చెప్పుకోతగినంత ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక, వ్యావసాయిక పునాదులున్నాయి. దానికి ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలున్నాయి. సమర్థత కలిగిన సైన్యం ఉంది. పాక్ తన భౌతిక శక్తితోపాటు, ఉన్నత వర్గీయుల ‘సాఫ్ట్ పవర్’ను కూడా వినియోగించుకుంటోంది. భూస్వామ్య పెత్తందారీ విధానం, అసమానతలు అధికంగా ఉన్న సమాజంలో, పాశ్చాత్య మధ్యవర్తులతో సమానమైన వర్గంగా, ఆత్మవిశ్వాసంతో మెలిగేలా పాక్ తన ఉన్నత వర్గాన్ని తీర్చిదిద్దుకుంటూ వస్తోంది. భారతదేశపు రాజకీయాలను, దౌత్యాన్ని ప్రభావితం చేస్తున్న మధ్య తరగతి దానికి దీటు కాదు.సంజయ బారు వ్యాసకర్త సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ ఫౌండర్–ట్రస్టీ,మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు -
11 ఏళ్లుగా ‘ప్రగతిశీల భారత్’
న్యూఢిల్లీ: దేశంలో ప్రజలకు సుపరిపాలన అందించడం, వారి జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడంపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నామని, తమ మంత్రివర్గంలో 60 శాతం మంది ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలే ఉన్నారని గుర్తుచేశారు. మంత్రిమండలిలో ఆయా వర్గాలకు ఈస్థాయిలో అత్యధిక ప్రాతినిధ్యం దక్కడం ఇదే మొదటిసారి అని స్పష్టంచేశారు. కేంద్రంలో తమ ప్రభుత్వానికి 11 ఏళ్లు పూర్తికావడంతోపాటు మూడోసారి ప్రధానిగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. నేడు మన దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానే కాకుండా అంతర్జాతీయ వేదికలపై బలమైన గొంతుకగా నిలుస్తోందని ఉద్ఘాటించారు. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణపై మనం గళం వినిపిస్తున్నాయని చెప్పారు. 140 కోట్ల మంది భారతీయుల ఆశీస్సులు, వారి సమ్మిళిత భాగస్వామ్యంతో విభిన్న రంగాల్లో వేగవంతమైన మార్పునకు భారత్ సాక్షిగా నిలుస్తోందని హర్షం వ్యక్తంచేశారు. ‘సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ స్ఫూర్తితో ఎన్డీయే ప్రభుత్వం ప్రజాసేవలో నిమగ్నమైందని వివరించారు. ‘ప్రజలే కేంద్రంగా ప్రగతి’ అనే విధానాన్ని అమలు చేస్తున్నామని, ఆర్థికాభివృద్ధితో సామాజిక మార్పునకు బాటలు వేస్తున్నామని స్పష్టంచేశారు. మన ఉమ్మడి విజయాలు మనందరికీ గర్వకారణమని, అదే సమయంలో ‘వికసిత్ భారత్’ నిర్మాణానికి మనమంతా నడుం బిగించాలని, కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆశ, ఆత్మవిశ్వాసం, నూతన సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. వేర్వేరు రంగాల్లో తమ ప్రభుత్వం సాధించిన విజయాలు, తీసుకొచ్చిన మార్పులను ప్రధాని మోదీ ‘లెవెన్ ఇయర్స్ ఆఫ్ సేవ’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రభుత్వ పథకాలు, లబి్ధదారుల వివరాలు ఇందులో పొందుపర్చారు. -
ప్రచారం తప్ప పారదర్శకత లేదు
న్యూఢిల్లీ: కేంద్రంలో 11 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో ప్రచారం తప్ప పారదర్శకత ఏమాత్రం లేదని కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత, ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. మోదీ సర్కారు వర్తమానం గురించి మాట్లాడడం మానేసి, 2047కు సంబంధించిన కలల్లో విహరిస్తోందని తప్పుపట్టారు. ప్రజలను భ్రమల్లో ముంచేస్తూ కాలం గడుపుతోందని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోమవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఒకవైపు మోదీ ప్రభుత్వం 11వ వార్షికోత్సవాలు చేసుకుంటున్న సమయంలోనే మరోవైపు ముంబైలో ఘోర ప్రమా దం జరిగిందని పేర్కొన్నారు. రైలు నుంచి కిందపడి పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. నిత్యం కోట్లాది మంది ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే రైల్వేశాఖ నేడు అభద్రత, గందరగోళం, విపరీతమైన రద్దీకి మారుపేరుగా మారిందని ఆక్షేపించారు. దేశంలో వాస్తవిక పరిస్థితికి ఈ ఘటన అద్దంపడుతోందన్నారు. మోదీ ప్రభుత్వం ఇదేమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ రోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. 11 ఏళ్ల మోదీ పాలనలో దేశంలో వచ్చిన మార్పేమీ లేదని విమర్శించారు. 2047 నాటి కలలు విక్రయించడం ఆపేసి, 2025 గురించి మాట్లాడాలని ప్రభుత్వానికి హితవు పలికారు. -
మోదీ 11 ఏళ్ల పాలన స్వర్ణయుగం
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సోమవారంతో 11 ఏళ్లు పూర్తయ్యాయి. అలాగే మూడో టర్మ్‌లో మొదటి ఏడాది పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో మోదీ పాలనపై పలువురు కేంద్ర మంత్రులు ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన నాయకత్వ పటిమను కొనియాడారు. ఈ 11 ఏళ్లు ప్రజాసేవలో స్వర్ణయుగం అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభివరి్ణంచారు.మోదీ నాయకత్వంలో నవ భారతదేశం సంస్కరణల శక్తి, మార్పుతో అభివృద్ధి, స్వయం సమృద్ధి దిశగా శరవేగంగా దూసుకెళ్తోందని ఉద్ఘాటించారు. ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడం ద్వారా ప్రతి రంగంలో మన దేశాన్ని నంబర్ వన్‌గా నిలపాలన్న లక్ష్యంతో మోదీ సర్కారు పని చేస్తోందని వెల్లడించారు. ఈ అభివృద్ధి ప్రయాణం ఆగదని స్పష్టంచేశారు. 11 ఏళ్ల ఈ చరిత్రాత్మక ప్రయాణం సేవా ప్రయాణమని వివరించారు. ఈ మేరకు అమిత్ షా సోమవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. నాయకత్వం శక్తివంతంగా, సంకల్పం బలంగా, ఉద్దేశాలు స్పష్టంగా ఉంటే ప్రజాసేవ, భద్రత, సుపరిపాలనలో కొత్త రికార్డులు సృష్టించవచ్చని మోదీ ప్రభుత్వం నిరూపించిందని తెలియజేశారు. మోదీ 2014లో తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో దేశం అచేతనావస్థలో ఉందని, ఎటు చూసినా కుంభకోణాలు తప్ప అభివృద్ధి కనిపించని పరిస్థితి ఉందని గుర్తుచేశారు. మోదీ అధికారంలోకి వచ్చాక 11 ఏళ్లలో దేశ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందన్నారు. ప్రధాని మోదీ దేశంలో బుజ్జగింపు రాజకీయాలకు చరమగీతం పాడేశారని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని అమిత్ షా హర్షం వ్యక్తంచేశారు. రైతులు, మహిళలు, వెనుకబడిన తరగతులు, దళితుల సాధికారతే మోదీ సర్కారు ధ్యేయమని తేలి్చచెప్పారు. దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను కాపాడడంలో మోదీ ప్రభుత్వం తిరుగులేని అంకితభావం ప్రదర్శిస్తోందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశానికి మోదీ సర్కారు బలమైన రక్షణ కవచంగా మారిందన్నారు. దృఢమైన, గర్వకారణమైన ఐక్య భారత్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రపంచంలో మొదటి ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ కూడా చేరిందన్నారు. మోదీ తీసుకుంటున్న నిర్ణయాలతో రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తున్నామని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. మోదీ సర్కారు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో బడుగ బలహీన వర్గాలకు ఎనలేని లబ్ధి చేకూరుతోందన్నారు. మానవ వనరుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ‘న్యూ ఇండియా’కు మోదీ ప్రభుత్వం పునాది వేసిందన్నారు. ప్రపంచ వేదికపై సమున్నత భారత్: గడ్కరీ నరేంద్ర మోదీ దార్శనికత పాలనలో దేశంలో చరిత్రాత్మక మార్పులు సంభవిస్తున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు. సుపరిపాలన, సమగ్రాభివృద్ధిని కళ్లారా చూస్తున్నామని వ్యాఖ్యా నించారు. దేశం ఎవరూ అందుకోలేనంత వేగంతో ఆర్థిక ప్రగతి సాధిస్తోందన్నారు. బలమైన నాయకత్వం, స్వయం సమృద్ధ ఆర్థిక వ్యవస్థ, ప్రజలకే తొలి ప్రాధాన్యం ఇస్తున్న పాలనతో ప్రపంచ వేదికపై సగర్వంగా, సమున్నతంగా నిలుస్తోందని వివరించారు. ఆర్థిక ప్రగతి, సామాజిక న్యాయం, సాంస్కృతిక వైభవం, జాతీయ భద్రత విషయంలో మోదీ పాలన నూతన శకమని కేంద్ర మంత్రి, లోక్‌జనశక్తి పార్టీ అగ్రనేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు.సువర్ణాక్షరాలతో లిఖించాలి: నడ్డాదేశంలో గత 11 ఏళ్లలో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు సువర్ణాక్షరాలతో లిఖించదగనవని కేంద్ర మంత్రి జె.పి.నడ్డా చెప్పారు. మోదీ సర్కారుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్‌కు దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని భగవంతుడిని వేడుకుంటున్నట్లు చెప్పారు. -
11 ఏళ్ల పాలనను 11ఏళ్ల సేవగా నిర్వహిస్తున్న బీజేపీ
-
‘మోదీ 3.0’కు 11 ఏళ్లు.. ఈ ఏడాది మైలురాళ్లివే..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వానికి నేటితో(జూన్ 9) ఏడాది పూర్తయ్యింది. గత ఏడాది జూన్ 9న మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ ప్రభుత్వానికి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘వికసిత్ భారత్‌కా అమృత్ కాల్’ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.ఈ సందర్భంగా వికసిత్ భారత్ ఎజెండానే తమ లక్ష్యమని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు. ఈ ఏడాది పాలనలో ఆపరేషన్ సింధూర్ , వక్ఫ్ సంస్కరణలు, ప్రపంచ దేశాల్లో భారత దేశ ఖ్యాతి పెరిగిందని పేర్కొన్నారు. ఇటీవలే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని, త్వరలోనే మూడో స్థానానికి చేరుతామని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి పాలన, పరివర్తనే లక్ష్యంగా ముందుకువెళుతున్నామన్నారు. A clear focus on good governance and transformation! Powered by the blessings and collective participation of 140 crore Indians, India has witnessed rapid transformations across diverse sectors. Guided by the principle of ‘Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas, Sabka… pic.twitter.com/bCC4MJP3Ii— Narendra Modi (@narendramodi) June 9, 2025140 కోట్ల భారతీయుల ఆశీస్సులతో వివిధ రంగాల్లో వేగవంతమైన మార్పు సాధించామని, ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ అనే సూత్రంతో తమ ప్రభుత్వం అద్భుతమైన మార్పులను అందించిందని, ఆర్థిక వృద్ధి నుంచి సామాజిక ఉన్నతి వరకు, ప్రజాకేంద్రీకృత, సమగ్ర, సర్వతోముఖ అభివృద్ధిపై దృష్టి సారించామని ప్రధాని పేర్కొన్నారు. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని, వాతావరణ మార్పులు , డిజిటల్ ఆవిష్కరణల వంటి కీలక అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా భారత్ కీలక గొంతుకగా మారిందని ప్రధాని అన్నారు. సమిష్టి విజయంపై గర్విస్తూనే, ఆశ, విశ్వాసం, సంకల్పంతో వికసిత భారత్ నిర్మాణం వైపు ముందుకు వెళతున్నామని ప్రధాని మోదీ ఆ ట్వీట్లో పునరుద్ఘాటించారు.ఇది కూడా చదవండి: ప్రధాని మోదీకి బంగ్లా యూనస్ లేఖ.. ఏమన్నారంటే.. -
ప్రధాని మోదీకి బంగ్లా యూనస్ లేఖ.. ఏమన్నారంటే..
ఢాకా: భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌కు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ రాయగా, దానికి అతను స్పందిస్తూ మరో లేఖ రాశారు. ఇరు దేశాల ప్రజల సంక్షేమం కోసం పరస్పర గౌరవం, అవగాహనా స్ఫూర్తి అవసరమని యూనస్ దానిలో పేర్కొన్నారు. ఈ రెండు లక్షణాలే ఇరు దేశాల ప్రజల సంక్షేమం కోసం మార్గదర్శనం చేస్తాయని అన్నారు. యూనస్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ఈ లేఖను పోస్ట్ చేశారు.ఈద్-ఉల్-అధా సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌కు, అక్కడి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ లేఖ రాశారు. దీనికి స్పందించిన యూనస్ ప్రధాని మోదీ ఆలోచనాత్మక సందేశం ఇరు దేశాల మధ్య ఉత్తమ విలువలను ప్రతిబింబిస్తుందని తన లేఖలో పేర్కొన్నారు. ఈ పండుగ చాటిచెప్పే త్యాగం, దాతృత్వం, ఐక్యతా విలువలు ప్రజలను ఒకచోటకు చేరుస్తాయని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా కలిసి పనిచేసేందుకు ప్రేరణ కల్పిస్తాయని పేర్కొన్నారు. pic.twitter.com/gNlLbLv3E6— Chief Adviser of the Government of Bangladesh (@ChiefAdviserGoB) June 8, 2025దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌కు రాసిన లేఖలో భారతదేశపు ఘనత దాని వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వం కారణంగానే వచ్చిందని పేర్కొన్నారు. శాంతియుతమైన, సమ్మిళితమైన ప్రపంచాన్ని నిర్మించడంలో త్యాగం, కరుణ, సోదరభావం విలువలను ఇది మనకు గుర్తు చేస్తుందని అన్నారు. ఇది కూడా చదవండి: రాహుల్ ‘ఫిక్సింగ్’ వ్యాసానికి సీఎం ఫడ్నవీస్ కౌంటర్ ఆర్టికల్