breaking news
Donald Trump
-
వాణిజ్య చర్చలు విఫలం.. ఇక ట్రేడ్ వార్
అమెరికా–కెనడా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. మూడు రోజుల పాటు కొనసాగిన వాణిజ్య ఒప్పందం కోసం జరిగిన చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. చర్చలు విఫలం కావడంతో.. కెనడా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 50 శాతం సుంకాలను విధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ టారిఫ్‌లు తక్షణమే అమల్లోకి వస్తాయని అమెరికా అధికారులు వెల్లడించారు.కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఈ పరిణామంపై స్పందిస్తూ.. అమెరికా నిర్ణయానికి సమాన స్థాయిలో ప్రతీకార చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల ప్రకారం.. శనివారం అర్ధర్రాతి నుంచి ఈ సుంకాలు అమల్లోకి రానున్నాయి. అయితే అమెరికా విధించే ప్రతి డాలర్ టారిఫ్‌కు ప్రతిగా కెనడా కూడా అంతే మొత్తంలో సుంకాలు విధిస్తుందని కార్నీ స్పష్టం చేశారు. చివరి దశలో విఫలమైన చర్చలుఅమెరికా–కెనడా మధ్య వాణిజ్య ఒప్పందం కోసం మూడు రోజుల పాటు వాషింగ్టన్లో చర్చలు జరిగాయి. కెనడా వాణిజ్య మంత్రి డొమినిక్ లెబ్లాంక్, అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ చర్చల్లో పాల్గొన్నారు. ప్రారంభంలో ఇరు దేశాలు ఒప్పందానికి దగ్గరయ్యాయని భావించినా.. కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. చర్చలు విఫలమైన తర్వాత కెనడా చర్చలను తాత్కాలికంగా నిలిపివేసి, తమ ప్రతినిధులను తిరిగి ఒట్టావాకు రావాలని ప్రధాని కార్నీ ఆదేశించారు.ఏ వస్తువులపై ప్రభావం?అమెరికా విధించనున్న 50 శాతం టారిఫ్‌లు దాదాపు 20 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.7 లక్షల కోట్లకు పైగా) విలువైన కెనడా ఉత్పత్తులపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్, ఉక్కు, అల్యూమినియం, కలప వంటి రంగాలకు ఈ నిర్ణయం భారీ దెబ్బగా మారే అవకాశం ఉంది. అమెరికా అధికారులు మాత్రం కెనడా కోరిన కొన్ని రాయితీలకు అంగీకరించలేదని తెలిపారు. ముఖ్యంగా కార్ల తయారీ రంగం, స్టీల్, అల్యూమినియం, లంబర్ రంగాల్లో కెనడా డిమాండ్లపై విభేదాలు కొనసాగినట్లు వెల్లడించారు."కెనడా ప్రయోజనాల కోసం పోరాడతాం": కార్నీఅమెరికాతో ఒప్పందం కుదరకపోయినా.. తమ దేశ కార్మికులు, వ్యాపారాలను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మార్క్ కార్నీ తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతినకుండా చూసేందుకు ప్రయత్నించామని, అయితే కెనడా ప్రయోజనాలకు విరుద్ధమైన ఒప్పందాన్ని అంగీకరించబోమని పేర్కొన్నారు.ట్రంప్ హెచ్చరికకెనడా ప్రతీకార టారిఫ్‌లు విధిస్తే.. పరిస్థితిని సమతుల్యం చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని ట్రంప్ పరిపాలన హెచ్చరించింది. "వాళ్ల చర్యను సమం చేసేందుకు.. మరోసారి కఠిన చర్యలు తీసుకుంటాం" అని అమెరికా అధికారి వ్యాఖ్యానించారు.రెండు దేశాలపై ప్రభావంఅమెరికా–కెనడా ప్రపంచంలోనే అతిపెద్ద ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్యాల్లో ఒకటి. ఇరు దేశాల మధ్య ప్రతి ఏడాది వందల బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరుగుతుంది. తాజా టారిఫ్‌ల నిర్ణయం అమల్లోకి వస్తే.. వినియోగదారులపై ధరల భారం పెరగడం, పరిశ్రమల సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇప్పటికే అమెరికా ఇతర దేశాలపై టారిఫ్‌ల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో.. కెనడాతో తాజా వివాదం అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కొత్త ఉద్రిక్తతలకు దారితీసే అవకాశముంది.ఇదీ చదవండి: ట్రంప్.. కాస్కో, మా దాడి ఓ రేంజ్‌లోనే ఉంటుంది! -
ట్రంప్ కొత్త అస్త్రం.. ప్రతీకారం భీకరంగా ఉంటుందన్న ఇరాన్
అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఇరాన్‌పై చరిత్రలోనే అత్యంత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించగా.. దానికి ఇరాన్ తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించింది. కొత్త ఆంక్షలు, బెదిరింపులకు సమాధానం విధ్వంసకరంగా ఉంటుందని టెహ్రాన్ వార్నింగ్ ఇచ్చింది.‘అమెరికా బెదిరింపులకు గట్టి సమాధానం’.. అమెరికా నుంచి ఎదురయ్యే ఎలాంటి కొత్త బెదిరింపులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఇరాన్ సాయుధ దళాలు ప్రకటించాయి. ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ అలీ అబ్దొల్లాహీ మాట్లాడుతూ.. “భూమి, సముద్రం, గగనం, వాయు రక్షణ, సైబర్ రంగాల్లో మా బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి. శత్రువుల కొత్త బెదిరింపులకు శిక్షాత్మక, వినాశకర ప్రతిస్పందన ఇస్తాం” అని హెచ్చరించారు.ఆంక్షల యుద్ధం విఫలమవుతుంది: అరాఘ్చీఅమెరికా ప్రతిపాదిస్తున్న ఆర్థిక ఆంక్షలు విఫలమవుతాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. ఆర్థిక ఒత్తిళ్లతో ఇరాన్‌ను లొంగదీసుకోవాలన్న ప్రయత్నాలు ఫలించవని అన్నారు. దౌత్య మార్గమే సమస్యలకు పరిష్కారమని పేర్కొంటూనే.. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని మార్గాల్లో సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ట్రంప్ లక్ష్యం.. ఇరాన్‌పై గరిష్ఠ ఒత్తిడిఇరాన్కు సహకరించే ఏ దేశంపైనైనా ఆర్థిక చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ సోమవారం కొత్త ఆంక్షల వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అయితే ట్రంప్ మాత్రం.. “ఇరాన్ ఒక ఒప్పందాన్ని కోరుకుంటోంది. కానీ సరైన ఒప్పందానికి ఇంకా సిద్ధంగా లేదు” అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, హర్ముజ్ జలసంధిని ప్రస్తుతం “అమెరికా భూభాగంగా చూస్తున్నాను” అంటూ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి కారణమయ్యాయి.హర్ముజ్.. ఇరాన్ చేతిలో కీలక ఆయుధంప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గం హార్ముజ్ జలసంధి. ఈ మార్గం ద్వారా రోజూ భారీ స్థాయిలో చమురు రవాణా జరుగుతుంది. ఇరాన్ వద్ద ఉన్న క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యంతో ఈ ప్రాంతంలో నౌకా రవాణాకు అంతరాయం కలిగించే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే హర్ముజ్ ప్రాంతంలో జరిగిన ఘటనల్లో పలువురు నావికులు ప్రాణాలు కోల్పోయారు.చమురు మార్కెట్లపై ఆందోళనఅమెరికా కొత్త ఆంక్షల హెచ్చరికలతో అంతర్జాతీయ చమురు ధరలు పెరిగాయి. ఇరాన్ చమురు సరఫరాపై ఆంక్షలు మరింత కఠినమైతే ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇరాన్ నుంచి ఎగుమతి అయ్యే చమురులో ఎక్కువ భాగాన్ని చైనా కొనుగోలు చేస్తోంది. దీంతో అమెరికా ఒత్తిడి ప్రధానంగా బీజింగ్పైనా పడే అవకాశముంది. చైనా మాత్రం.. “ఆంక్షలు, ఒత్తిళ్లు సమస్యను పరిష్కరించవు. చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యం” అని స్పష్టం చేసింది.చర్చలకు ఒమన్ ప్రయత్నాలుహర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఒమన్ మధ్యవర్తిత్వం చేస్తోంది. ఒమన్, ఇరాన్ విదేశాంగ మంత్రులు ఫోన్లో చర్చించి.. నౌకా రవాణాపై కొత్త ఒప్పందం కోసం చర్చలు పునఃప్రారంభించే అంశాన్ని పరిశీలించారు.యెమెన్ హౌతీలతో మరో సమస్యఇదే సమయంలో యెమెన్‌కు చెందిన హౌతీ గ్రూప్ బాబ్ అల్ మందెబ్ జలసంధిలో సౌదీ నౌకలపై దిగ్బంధం ప్రకటించడంతో ఎర్ర సముద్ర రవాణాపైనా ప్రభావం పడింది. సౌదీ అరేబియాలోని యన్బు పోర్టుకు వచ్చే ట్యాంకర్ రాకపోకలు గణనీయంగా తగ్గినట్లు సమాచారం.అమెరికా ఆర్థిక ఆంక్షల బెదిరింపులు.. ఇరాన్ ప్రతీకార హెచ్చరికలు.. హర్ముజ్‌పై ఆధిపత్య పోరు.. ఇవన్నీ పశ్చిమాసియా సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తున్నాయి. దౌత్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఇరు దేశాల నుంచి వస్తున్న కఠిన ప్రకటనలు కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.ఇదీ చదవండి: ప్లీజ్.. ప్లీజ్.. మా చక్కెర కొనరా? -
బ్రెజిల్‌పై అమెరికా పడగ!
లాటిన్ అమెరికా దేశాల్లో నియంతలను గద్దెనెక్కించిన గతకాలపు పోకడలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. వచ్చే అక్టోబర్ మొదటివారం బ్రెజిల్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత దేశాధ్యక్షుడు, మధ్యేవాద వామపక్ష నేత లూలా డి సిల్వాను ఓడించి మితవాద పక్ష నాయకుడు ఫ్లేవియో బోల్సోనారో అధికారంలోకి రాలేనట్టయితే సైనిక జోక్యం చేసుకోవటానికి పథక రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా రెండు నేరస్త ముఠాలు సీవీ, పీసీసీలను ఉగ్రవాద సంస్థలుగా అమెరికా ప్రకటించింది. వీరినుంచి అమెరికాకు ఏర్పడిన ముప్పును తొలగించటంలో బ్రెజిల్ విఫలమైందన్న సాకుతో సైనిక దాడి చేయటమే ఈ పథకం ఆంతర్యం. వెనిజులాలో సైతం నిరుడు ట్రంప్ ఇదే తరహా డ్రామా నడిపించారు. మాదకద్రవ్య ముఠాలు అమెరికా భద్రతకు ముప్పుగా మారాయనీ, వాటిని అధ్యక్షుడు మదురో ప్రోత్సహిస్తున్నారనీ ఆరోపించారు. ఈ ఏడాది జనవరిలో మదురో దంపతుల్ని కిడ్నాప్ చేసి అమెరికాకు తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ అమెరికా కోర్టులో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. లాటిన్ అమెరికా దేశాలన్నిటా 1964 మొదలుకొని రెండు దశాబ్దాలపాటు అమెరికా ఇలాంటి దుర్మార్గాలకే పాల్పడింది. ఇదే బ్రెజిల్లో 1964లో వామపక్ష ప్రభుత్వాధినేత జివావో గౌలార్ట్‌ను సైనిక కుట్రలో తొలగించి హుంబెర్టో కాస్టిలోను గద్దెనెక్కించింది. అదే సంవత్సరం బొలీవియాపై సైతం ఇదే కుట్ర కొనసాగించింది. చిలీలో 1973లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సోషలిస్టు నాయకుడు సాల్వెడార్ అలెండీని సైనిక తిరుగుబాటులో హతమార్చి అగస్టో పినోచెట్‌ను అధినేతగా కూర్చోబెట్టింది. ఇలా ఉరుగ్వే, అర్జెంటీనా, ఎల్ సాల్వెడార్, గ్వాటెమాలా దేశాల్లో సైతం 1985 వరకూ ఈ కుట్రలు సాగుతూనే వచ్చాయి. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో తన పొరుగున ఆనాటి సోవియట్ ప్రభావం పడితే తన ప్రాభవం కొడిగడుతుందన్న భయాందోళనలే ఈ కుట్రలకు కారణం. నియంతల రాకతో లాటిన్ అమెరికా దేశాల ప్రజానీకం భయానక పాలన చవిచూశారు. ఒక్క అర్జెంటీనాలోనే ‘డర్టీ వార్’ పేరుతో పదివేలమంది ప్రాణాలు తీశారు. చిలీలో, ఎల్‌సాల్వెడార్‌లో, గ్వాటెమాలాలో సాగించిన నరమేధాలు దాదాపు యాభైవేలమంది ఉసురుతీశాయి.మళ్లీ ఇన్నాళ్లకు అమెరికా అస్తిత్వ ఆందోళనలో పడింది. మొన్న మే నెలలో జరిగిన కొలంబియా ఎన్నికల్లో ట్రంప్ తెరవెనక సాగించిన కుట్రల ఫలితంగా ఆయన అనుకూలుడు ఎబెలార్డో ఎస్ప్రియెల్లా స్వల్ప ఆధిక్యతతో అధికారంలోకొచ్చారు. అందుకే బ్రెజిల్లో సైతం ఆ పాచిక పారుతుందనుకుంటున్నారు. లూలా బ్రిక్స్ కూటమిలో చురుగ్గా పాలుపంచుకోవటం, చైనాతో సాన్నిహిత్యం పెంచుకోవటం, అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవటం ట్రంప్‌కు కంటగింపుగా మారాయి. తన కీలుబొమ్మ జైర్ బోల్సొనారో 2023 ఎన్నికల్లో పదవీభ్రష్టుడు కావటంనుంచే ట్రంప్ బుసలుకొడుతున్నారు. తిరుగుబాటు కుట్రలో బోల్సొనారోను శిక్షిస్తే తీవ్ర పరిణామాలుంటాయని న్యాయవ్యవస్థను సైతం హెచ్చరించారు. కానీ ఈ ఏడాది మొదట్లో బోల్సొనారోకు 27 యేళ్ల ఖైదు పడింది. ప్రస్తుతం డి సిల్వాతో తలపడేందుకు రంగంలో 13 మంది అభ్యర్థులున్నారు. ఆయనకు 40 శాతం మద్దతుంటే, సమీప ప్రత్యర్థి ఫ్లేవియో 28 శాతంవద్ద ఆగిపోయారు. దీన్నెలాగైనా తారుమారు చేయటానికి అమెరికా పడరాని పాట్లు పడుతోంది. బ్రెజిల్ పాత్రికేయులకూ, వివిధ మాధ్యమాల్లో ప్రభావం చూపగల వారికీ ఉదారంగా వీసాలు మంజూరుచేసి ‘భావప్రకటనా స్వేచ్ఛ’పై పాఠాలు చెబుతోంది. తప్పుడు ప్రచారాలు సాగిస్తోంది. అయినా పరిస్థితి ఆశాజనకంగా లేకపోవటంతో కొత్త ఎత్తుకు తెరలేపింది. ఇరాన్లో ఓటమి ఎదురుకావటం, ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినటం, డాలర్ మనుగడకు ముప్పు ఏర్పడటం ట్రంప్‌ను వేధిస్తున్నాయి. ఇప్పటికే పెరూ, ఎల్‌సాల్వెడార్ దేశాల్లో మితవాదులు గెలిచారు. బ్రెజిల్‌ను సైతం లోబరుచుకోగలిగితే దేశంలో తన కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయని ట్రంప్ భావిస్తున్నారు. పొరుగు దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటంలాంటి అనాగరిక పోకడలకు అమెరికా ఇకనైనా స్వస్తిచెప్పాలి. -
ప్రపంచం అంతం కావడానికి ఇక ఇది చాలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది చివరలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ను కలిసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఉత్తరకొరియాతో దౌత్య చర్చలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో ఉత్తర కొరియా వద్ద 80 నుంచి 120 వరకు అణు వార్హెడ్లు ఉండొచ్చని దక్షిణ కొరియా అంచనా వేసింది. అణు బాంబును మోసుకెళ్లి పేల్చగల అణ్వాయుధ భాగాలను అణు వార్హెడ్లు అంటారు.దక్షిణ కొరియా రక్షణ మంత్రి ఆన్ గ్యూ బ్యాక్ గురువారం ఈ అంచనాను వెల్లడించారు. ఉత్తర కొరియా వద్ద 80 నుంచి 120 అణు వార్హెడ్లు ఉండొచ్చని ఆయన తెలిపారు. ఈ సంఖ్య ట్రంప్ ఒక రోజు ముందు చెప్పిన అణ్వాయుధాల కంటే గణనీయంగా ఎక్కువ. ఉత్తర కొరియా వద్ద 57 చాలా శక్తిమంతమైన అణ్వాయుధాలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు.పార్లమెంటరీ కమిటీ ముందు ఆన్ మాట్లాడుతూ.. ఉత్తర కొరియా వద్ద సాధారణంగా 80 నుంచి 120 అణు వార్హెడ్లు ఉన్నట్లు భావిస్తున్నామని చెప్పారు. అయితే కచ్చితమైన సంఖ్యను నిర్ధారించడం కష్టమని హెచ్చరించారు. అనంతరం ఈ అంచనా ప్రైవేట్ పరిశోధనా సంస్థల నుంచి వచ్చిందని, దక్షిణ కొరియా సైన్యం అధికారికంగా ధ్రువీకరించలేదని స్పష్టం చేశారు.కిమ్‌ను మళ్లీ కలుస్తానన్న ట్రంప్కిమ్తో మళ్లీ సంబంధాలను ఏర్పరచుకునేందుకు తాను చేసిన ప్రయత్నాలకు ఆయన నుంచి స్పందన వచ్చిందని ట్రంప్ తెలిపారు. ఈ ఏడాది చివరలో ఉత్తర కొరియా నేతను కలుస్తానని భావిస్తున్నట్లు ధ్రువీకరించారు. ఈ వ్యాఖ్యలతో 2018, 2019లో ఇద్దరు నేతలు నిర్వహించిన అపూర్వమైన సమావేశాల తర్వాత మరో ట్రంప్-కిమ్ శిఖరాగ్ర సమావేశంపై ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. ఉత్తర కొరియా అణు కార్యక్రమం, ఆంక్షల సడలింపుపై విభేదాలతో ఆ దౌత్య ప్రయత్నాలు చివరకు విఫలమయ్యాయి. ట్రంప్ తన రెండో పదవీకాలంలో కిమ్‌తో మళ్లీ చర్చలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారు.చర్చల గురించి నాకు తెలియదు: కిమ్ సోదరిట్రంప్తొ మళ్లీ సంబంధాలు ఏర్పడుతున్నాయన్న ప్రకటనపై ఉత్తరకొరియా నుంచి జాగ్రత్తతో కూడిన స్పందన వచ్చింది. ట్రంప్, కిమ్ మధ్య ఇటీవల ఎలాంటి సంప్రదింపులు జరిగాయో తనకు తెలియదని కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ తెలిపారు. దక్షిణ కొరియాతో కలిసి నిర్వహించే సంయుక్త సైనిక విన్యాసాల్లో అమెరికా భాగస్వామ్యాన్ని తగ్గించాలని ట్రంప్ ఆదేశించిన తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విన్యాసాలను ఉత్తర కొరియాపై వైరంగా ట్రంప్ అభివర్ణించారు. వార్షిక ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ సైనిక విన్యాసాలను 11 రోజుల నుంచి 5 రోజులకు తగ్గించారు. అయితే ఈ మార్పులతో విన్యాసాలు రెచ్చగొట్టే లేదా దూకుడు చర్యలు ఏమీ తగ్గలేదని కిమ్ యో జోంగ్ అన్నారు.57 అణ్వాయుధాలా?ట్రంప్ 57 అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పడం అసాధారణంగా మారింది. ఎందుకంటే ఉత్తర కొరియా అణ్వాయుధ నిల్వల పరిమాణంపై అమెరికా ప్రభుత్వం అధికారిక అంచనాను బహిరంగంగా వెల్లడించదు. దక్షిణ కొరియా కూడా ఉత్తరకొరియా వద్ద ఉన్న అణ్వాయుధ నిల్వలపై వివరణాత్మక అంచనాలను బహిరంగంగా వెల్లడించకుండా సంప్రదాయంగా వ్యవహరిస్తోంది. ఉత్తర కొరియాను అణ్వాయుధ దేశంగా అధికారికంగా గుర్తించదు.ప్రయోగిస్తే ప్రపంచం ఏమైపోతుంది?చిన్న స్థాయి అణు యుద్ధం కూడా ప్రపంచ ఆహార వ్యవస్థను ప్రభావితం చేయగలదని శాస్త్రీయ నమూనాలు సూచిస్తున్నాయి. ఉత్తరకొరియా ఒకవేళ 120 అణు వార్హెడ్లు ప్రయోగిస్తే ప్రపంచవ్యాప్తంగా అపారమైన ప్రాణనష్టం, ఆహార సంక్షోభం, పర్యావరణ నష్టం సంభవించే అవకాశం ఉంది. అయితే, ఒక్క అణ్వాయుధమే జనసాంద్రత ఉన్న ప్రాంతంలో పేలితే భారీ ప్రాణనష్టం, మౌలిక వసతుల విధ్వంసం, దీర్ఘకాలిక రేడియేషన్ ప్రభావాలు సంభవించవచ్చు. పెద్ద సంఖ్యలో అణ్వాయుధాలు ఉపయోగిస్తే పేలుళ్ల వల్ల ఏర్పడే పొగ వాతావరణంలోకి చేరి సూర్యకాంతిని తగ్గించవచ్చు. దీనివల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు పడిపోవడం, పంటల దిగుబడి భారీగా తగ్గడం, ప్రపంచవ్యాప్తంగా కరువు ఏర్పడటం వంటి పరిణామాలు సంభవించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే, ప్రభావాన్ని వార్హెడ్ల సంఖ్యతో మాత్రమే నిర్ణయించడానికి వీల్లేదు. వాటి పేలుడు శక్తి, ఎక్కడ పేలుతాయి, ఎంతమేర నగరాలు లేదా పారిశ్రామిక ప్రాంతాలు దెబ్బతింటాయి వంటి అంశాలు కూడా కీలకం. వాటిని ప్రయోగిస్తే మానవ నాగరికతకు అత్యంత తీవ్రమైన విపత్తును రావచ్చు. ఇదీ చదవండి: యువతి దుర్మరణం కేసులో ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు -
ఇరాన్‌పై ట్రంప్ కొత్త గేమ్.. మద్దతుదారులకు మూడినట్లే!
ఇరాన్‌ను ఒంటరి చేసేందుకు అమెరికా ఇక నేరుగా రంగంలోకి దిగింది! టెహ్రాన్‌ను మాత్రమే కాదు.. దానికి అండగా నిలిచే దేశాలు, సంస్థలను కూడా టార్గెట్ చేస్తానంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన హెచ్చరిక చేశారు. ఇరాన్‌కు డబ్బు అందించినా.. వ్యాపారం చేసినా.. చమురు తరలింపులో సహకరించినా భారీ ఆర్థిక మూల్యం చెల్లించాల్సిందే అని తేల్చిచెప్పారు. ఇరాన్‌ను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి పూర్తిగా వేరుచేసేలా ఇప్పటివరకు ఎన్నడూ లేనంత కఠినమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. దీంతో టెహ్రాన్‌కు అండగా నిలిచే దేశాలపై కూడా అమెరికా ఆంక్షల పిడుగు పడబోతోందా? అన్న ఉత్కంఠ మొదలైంది.ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో చేసిన పోస్టులో.. ఇరాన్‌కు ఆర్థిక సంస్థలు, వ్యాపారాలు, విమానాశ్రయాలు లేదా ప్రభుత్వ సంస్థలు ఎలాంటి సహాయం చేసినా ఆయా దేశాలు “భారీ ఆర్థిక పరిణామాలు” ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అయితే ఏ దేశాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇరాన్‌కు సహాయం చేసే మార్గాలపై కూడా ట్రంప్ ప్రత్యేకంగా హెచ్చరించారు. చమురు అక్రమ రవాణా, ఆర్థిక స్వాప్ ఒప్పందాలు, నగదు బదిలీలు, ఎక్స్ఛేంజ్ హౌస్‌లు, నౌకల రిజిస్ట్రీలు, ఫ్రంట్ కంపెనీల ద్వారా టెహ్రాన్‌కు మద్దతు ఇచ్చినా అమెరికా చర్యలు తప్పవన్న సంకేతాలు ఇచ్చారు. అంటే ఇరాన్‌తో నేరుగా వ్యాపారం చేసే సంస్థలతో పాటు పరోక్షంగా ఆ దేశానికి ఆర్థిక చేయూత అందించే వ్యవస్థలపైనా అమెరికా కన్నేయనుంది.ఇరాన్‌తో ఒప్పందం చేసుకునేందుకు తన ప్రభుత్వం అనేక అవకాశాలు ఇచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు. కానీ టెహ్రాన్ వాటిని ఉపయోగించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు ఇరాన్‌పై అపూర్వ స్థాయిలో ఆర్థిక యుద్ధం, అంతర్జాతీయ ఒంటరితనం ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. అమెరికా మిత్రదేశాలు కూడా ఈ చర్యలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇరాన్ సైనిక సామర్థ్యం ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్నదని ట్రంప్ అన్నారు. ఆ దేశ నౌకాదళం ధ్వంసమైందని, వైమానిక దళం బలహీనపడిందని, సైనిక కర్మాగారాలు భారీగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర ఒత్తిడిలో ఉందని పేర్కొన్న ఆయన.. కొత్త చర్యలతో టెహ్రాన్ అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం మరింత తగ్గిపోతుందని అన్నారు.ఇరాన్ అణు కార్యక్రమంపైనా ట్రంప్ మరోసారి కఠిన వైఖరి వ్యక్తం చేశారు. “ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండదు” అంటూ తన పరిపాలన వైఖరిని పునరుద్ఘాటించారు. ట్రంప్ తాజా హెచ్చరికతో ఇప్పుడు అసలు ప్రశ్న ఇరాన్ గురించే కాదు.. ఇరాన్‌కు అండగా నిలిచే దేశాల సంగతేంటి? అన్నదే. టెహ్రాన్‌తో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు కొనసాగించే దేశాలపై అమెరికా చర్యలు మొదలుపెడితే అంతర్జాతీయ వాణిజ్య సమీకరణాలు కూడా మారే అవకాశం ఉంది. దీంతో ఇరాన్‌ను ఒంటరి చేయాలన్న ట్రంప్ వ్యూహం.. ఇప్పుడు ఆ దేశానికి మద్దతిచ్చే వారిని కూడా చుట్టుముట్టే స్థాయికి చేరిందా? అన్న చర్చ మొదలైంది. -
ట్రంప్ మ్యాప్‌ల సంబరం!
హార్మూజ్ జలసంధిని ‘చాలా త్వరలోనే’ అమెరికా భూభాగంగా మారుస్తానని గతవారం ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పుడు ఇరాన్‌పై మళ్లీ భీకర దాడులకు తెగబడొచ్చని కొందరు అనుమానించారు. తీరా మంగళవారం ఆయన చేసిందల్లా ‘అమెరికా కొత్త భూభాగం’ అని రాసివున్న హార్మూజ్ జలసంధి మ్యాప్‌ను విడుదల చేయటమే. దీంతో ఇరాన్ దౌత్యవేత్తలు ప్రతిదాడికి దిగారు. కాలిఫోర్నియాను ఇరాన్ భూభాగంగా చూపుతూ ఇరాన్ కాన్సులేట్ ఒక చిత్రపటాన్ని విడుదల చేసింది. వేరే దేశాల భూభాగాలు డిమాండ్ చేయటం, వాటిని అమెరికా భౌగోళిక చిత్రపటాల్లో భాగంగా చూపటం ట్రంప్‌కు కొత్తేం కాదు. రెండోసారి అధికారంలోకొచ్చిన వెంటనే గ్రీన్‌లాండ్‌పై ఆయన కన్నుపడింది. అలాగే కెనడాను అమెరికాలో విలీనం చేసుకుని 51వ రాష్ట్రంగా మారుస్తామనీ, పనామా కాల్వ ఇకపై తమదేననీ, గాజాను ‘సొంతం’ చేసుకుంటామనీ కూడా పలుమార్లు చెప్పారు. అందుకు సంబంధించి ఒక వీడియో రూపొందించి విడుదల చేశారు. వెనిజులా మ్యాప్‌లో అమెరికా జెండాను సూచించే రంగులు నింపారు. అలాగే ఇకపై గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా వ్యవహరించాలంటూ ఉత్తర్వులు జారీచేశారు. అట్లాంటిక్ మహాసముద్రంలోని ఈ ప్రాంతం మెక్సికోకు పశ్చిమ, దక్షిణ దిశల్లో, అమెరికాకు ఉత్తరంవైపు, క్యూబాకు ఆగ్నేయంవైపు ఉంది. పేరు మార్చినా ప్రాదేశిక జల పరిధులేమీ మారడంలేదు గనుక మెక్సికో, క్యూబాలు ఈ విషయంలో మౌనంగా ఉండిపోయాయి. ఇక పర్షియన్ గల్ఫ్ పేరును గల్ఫ్ ఆఫ్ అరేబియాగా మారుస్తామని తొలి ఏలుబడిలో 2017లో ప్రకటించారు. దాంతో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ జాగ్రఫీ చదువుకోమని ట్రంప్‌కు సలహా ఇచ్చారు. నిరుడు మే నెలలో సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ పర్యటనకెళ్లే ముందు పేరు మార్పు ఉంటుందని ప్రకటించారు. అటు తర్వాత ఎందుకో దాని జోలికి పోలేదు. ఈ ‘భౌగోళిక చిత్రపట దురాక్రమణల్ని’ చూసి జనం కాలక్షేపానికి నవ్వుకోవచ్చు. ట్రంప్ ప్రదర్శిస్తున్న అమాయకత్వమో, అజ్ఞానమో చూసి జాలిపడే వారూ ఉండొచ్చు. కానీ అగ్ర రాజ్యాల చరిత్ర తెలిసినవారు దాన్నంత తేలిగ్గా వదిలేయరు. ఒక విశాల పాలస్తీనా భూభాగంలోకి కొన్ని దశాబ్దాల్లో భారీయెత్తున యూదుల్ని తరలించి, అక్కడ నరమేధాలకు పాల్పడి ఇజ్రాయెల్‌ను సృష్టించి, అందుకు ఐక్యరాజ్యసమితి ఆమోదాన్ని ‘రాబట్టిన’ చరిత్ర ఆ దేశాలది. కనుక ఇప్పుడు ఉబుసుపోక మాట్లాడే మాటల్లో వేరే అర్థాలు ఉండొచ్చన్న అనుమానాలు రావటం సహజం. రాజకీయావతారం ఎత్తి దాదాపు పదిహేనేళ్లవుతున్నా పూర్వాశ్రమంలో నిర్వహించిన రియలెస్టేట్ వ్యాపార ప్రభావంనుంచి ట్రంప్ బయటపడలేకపోతున్నారన్నది వాస్తవం. రియలెస్టేట్ యజమాని మాదిరే ఆయన భూదాహంతో అల్లాడిపోతున్నారు. ‘మళ్లీ అమెరికాను ఉన్నతంగా చేద్దాం’ అనే నినాదం సారాంశం ఖనిజ సంపద పుష్కలంగా ఉండే ప్రాంతాలను అమెరికాలో విలీనం చేసుకోవటమేనన్న సందేశాన్ని ట్రంప్ పంపుతున్నారు. అందుకే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ గ్రీన్లాండ్ సందర్శనకెళ్లినప్పుడు డెన్మార్క్, గ్రీన్లాండ్ల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. దాంతో చేసేదిలేక ఆమె మధ్యలోనే ఆ పర్యటనను విరమించుకుని వెనక్కిపోవాల్సి వచ్చింది. జనం భావోద్వేగాలు రెచ్చగొట్టి అధికారంలోకొచ్చినవారు వాటిపైనే మనుగడ సాగించాలనుకోవటం సహజం. అలాగైతేనే వారి వైఫల్యాలు మరుగునపడతాయి మరి. ఈ బాపతు నేతలు అందరి దృష్టి తమపైనే ఉండాలన్న తపనతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ట్రంప్ దీనికి భూదాహాన్ని కూడా చేర్చారు. ఈ భౌగోళిక చిత్రపటాల్ని చూసిన ‘మాగా’ జనం నిజంగానే ట్రంప్ వాటిని జయించుకొస్తారన్న భ్రమల్లో ఉంటారు. ఒకపక్క అరేబియా సముద్రంలో లంగరేసిన విమానవాహక నౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్‌లో దుర్భర పరిస్థితులున్నాయనీ, కొందరు ఆత్మహత్యా యత్నం కూడా చేశారనీ వార్తలొస్తున్నాయి. అందులో పనిచేసే రక్షణ సిబ్బందిని వెనక్కు పిలిపించాలని వారి కుటుంబాలనుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. అందుకే చవకబారు చిత్రపట వివాదాలు కట్టిపెట్టి ఇరాన్‌తో సంధికి ప్రయత్నించడం అమెరికా శ్రేయస్సుకు, రాజకీయంగా ట్రంప్‌కు మంచిది. -
పశ్చిమాసియానే కాదు యూరప్‌లోనూ దాడులకు ఇరాన్ భారీ స్కెచ్?
టెహ్రాన్: ఇప్పటివరకు పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ప్రాంతానికే పరిమితమైన ఇరాన్-అమెరికా ఘర్షణలు.. ఇప్పుడు క్రమంగా యూరప్ (ఐరోపా) దేశాలకు విస్తరిస్తూ అంతర్జాతీయ యుద్ధ మేఘాలను అలుముకునేలా చేస్తున్నాయి.ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై తాము క్రమంగా పట్టు కోల్పోతున్నామనే నివేదికలు ఇరాన్‌ను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఇదే తరుణంలో, హర్మూజ్ జలసంధి తమదేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో ఒక కొత్త మ్యాప్‌ను విడుదల చేయడం ఇరాన్ ఆగ్రహాన్ని కట్టలు తెంచుకునేలా చేసింది.ఈ పరిణామాలే ఇరాన్‌ను రక్షణాత్మక వైఖరి వీడి, యూరప్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై పూర్తి స్థాయి దాడికి యోచించేలా చేశాయంటూ ‘ఫైనాన్షియల్ టైమ్స్’సంచలన నివేదికను వెలుగులోకి తెచ్చింది. ఆ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది మార్చి నెలలో డ్రోన్ దాడికి గురైన సైప్రస్‌లోని బ్రిటిష్ వైమానిక స్థావరం కూడా ఇరాన్ దాడి చేసే లక్ష్యాల జాబితాలో ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో బ్రిటిష్ సైనిక స్థావరంపై జరిగిన మొదటి దాడి ఇదే కావడంతో, ఇది అప్పట్లోనే ఇరు దేశాల మధ్య సంఘర్షణ తీవ్రతరం కావడానికి నాంది పలికింది.అలాగే, గత నెలలో తన ‘బెజ్మర్ వైమానిక స్థావరం’ నుండి అమెరికాకు చెందిన 8 బోయింగ్ కేసీ-135 స్ట్రాటోట్యాంకర్ ఇంధన విమానాలకు, 250 మంది సైనిక సిబ్బందికి ఆశ్రయమిచ్చి, వారు పనిచేసేందుకు అనుమతించిన ఆగ్నేయ ఐరోపా దేశమైన బల్గేరియాను కూడా ఇరాన్ తన ప్రతీకార లక్ష్యంగా గుర్తించినట్లు ఈ నివేదిక పేర్కొంది.అమెరికాతో శాంతి చర్చలు పూర్తిగా నిలిచిపోవడంతో.. ఇరాన్ తన రక్షణాత్మక వైఖరిని వీడి పూర్తిగా దాడి చేసే సైనిక వ్యూహానికి మారాలని నిర్ణయించుకుందని సీనియర్ ఇరాన్ అధికారి రాయిటర్స్ వార్తా సంస్థకు వెల్లడించారు. ఈ సుదీర్ఘ సంఘర్షణకు శాశ్వత ముగింపు పలకడానికి, అలాగే హర్మూజ్ జలసంధి నియంత్రణపై ఉన్న వివాదాలను పరిష్కరించడానికి జరుగుతున్న చర్చలు పూర్తిగా నిలిచిపోయిన తరుణంలో ఇరాన్ ఈ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. -
ట్రంప్-కిమ్ స్నేహం.. విన్యాసాలకు ముందే ముగింపు
దక్షిణ కొరియా, అమెరికా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక ‘ఉల్చి ఫ్రీడం షీల్డ్’ (UFS) సంయుక్త సైనిక విన్యాసాలను వారం రోజుల ముందుగానే ముగించాలని యుఎస్ నిర్ణయించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విన్యాసాలను కుదించాలని పెంటగాన్‌ను ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ కొరియా సైన్యం బుధవారం వెల్లడించింది. కాగా ట్రంప్ సైతం దీనిపై ప్రకటన చేశారు. ఈ విన్యాసాలు “అనుచితమైనవి, శత్రుత్వపూరితమైనవి” అంటూ వాటిని తగ్గించాలని అమెరికా రక్షణ శాఖను ఆదేశించారు.ఉత్తర కొరియా ఒకవేళ తమ దేశాలపై దాడి చేస్తే వాటిని ఎదుర్కొనే సన్నద్ధతలో భాగంగా భాగంగా అమెరికా, దక్షిణ కొరియా ప్రతి ఏడాది ఈ సైనిక విన్యాసాలను నిర్వహిస్తాయి. అయితే ఉత్తర కొరియా వీటిని చాలాకాలంగా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమపై దాడికి దక్షిణ కొరియా, అమెరికాలు చేస్తున్న సన్నాహక చర్యలుగా ప్యాంగ్యాంగ్ వీటిని అభివర్ణిస్తోంది. తనకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని, కిమ్ తన పట్ల గౌరవంగా వ్యవహరిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉత్తరకొరియాను లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపించే సైనిక విన్యాసాలు నిర్వహించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.ట్రంప్ ఆదేశాల నేపథ్యంలో ఉల్చి ఫ్రీడం షీల్డ్ విన్యాసాల వ్యవధిని దక్షిణ కొరియా సైన్యం కుదించింది. మొదట ఈ విన్యాసాలను ఆగస్టు 17 నుంచి ఆగస్టు 27 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు వీటిని ఆగస్టు 17 నుంచి 21 వరకు జరపాలని నిర్ణయించారు. అంటే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కంటే ఆరు రోజుల ముందుగానే సైనిక విన్యాసాలు ముగియనున్నాయి.ఇదిలా ఉండగా, ఉత్తర కొరియా అధికారిక మీడియా బుధవారం ఈ సైనిక విన్యాసాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. అయితే ట్రంప్ ఈ విన్యాసాలను కుదించాలని ఆదేశించిన విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ప్రభుత్వ ఆధీనంలోని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఈ సైనిక విన్యాసాలను ఉత్తర కొరియాకు “అత్యంత తక్షణమైన, బహిరంగ ముప్పు”గా పేర్కొంది. ఇవి ఉత్తర కొరియాకు మాత్రమే కాకుండా మొత్తం ప్రాంతీయ భద్రతకు కూడా ముప్పుగా మారుతున్నాయని ఆరోపించింది.ఉత్తర కొరియా చాలాకాలంగా అమెరికా–దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇవి తమ దేశంపై దాడి చేయడానికి నిర్వహించే “దాడి రిహార్సల్స్” అని ప్యాంగ్యాంగ్ ఆరోపిస్తోంది. మరోవైపు, ఈ సైనిక విన్యాసాలకు ఉత్తర కొరియాపై దాడి చేయాలన్న ఉద్దేశం లేదని దక్షిణ కొరియా స్పష్టం చేసింది. ఈ విన్యాసాలు ఉత్తర కొరియాపై దాడి చేయాలన్న ఉద్దేశాన్ని లేదా కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచాలన్న లక్ష్యాన్ని ప్రతిబింబించవని దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం మంగళవారం తెలిపింది.1950–53 మధ్య జరిగిన కొరియా యుద్ధం అనంతరం అమెరికా దక్షిణ కొరియాకు భద్రతా పరంగా మద్దతు ఇస్తోంది. ఆ యుద్ధం పూర్తిస్థాయి శాంతి ఒప్పందంతో కాకుండా కాల్పుల విరమణ ఒప్పందంతోనే ముగిసింది. ప్రస్తుతం దక్షిణ కొరియాలో సుమారు 28,500 మంది అమెరికా సైనికులు మోహరించి ఉన్నారు. ఉత్తర కొరియా నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు వీరు దక్షిణ కొరియాకు మద్దతుగా ఉన్నారు. అయితే అమెరికా సాంప్రదాయ మిత్రదేశాలతో ఉన్న భద్రతా ఒప్పందాలను ట్రంప్ పదేపదే ప్రశ్నించడం తూర్పు ఆసియాలో అమెరికా భద్రతా హామీలపై అనుమానాలకు కారణమవుతోంది. -
ట్రంప్ కితాబుపై భారత్ రియాక్షన్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ఎన్నికల వ్యవస్థను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అమెరికా ఎన్నికల్లో ఓటరు గుర్తింపు నిబంధనలను కఠినతరం చేయాలన్న తన వాదనకు భారత్ ఎన్నికల విధానాన్ని ట్రంప్ ఉదాహరణగా చూపించారు. భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొనే భారత్‌లో గుర్తింపు ఆధారిత ఓటింగ్ విధానం అమలవుతోందని.. అందుకే అమెరికాలోనూ ఆ తరహా చట్టం రావాలంటూ ఆయన చట్టసభలపై ఒత్తిడి పెంచారు. దీంతో భారత్ స్పందించింది.భారత ఎన్నికల యంత్రాంగం విశ్వసనీయత, పటిష్ఠత ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడో నిరూపితమయ్యాయని విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ట్రంప్ వ్యాఖ్యలపై విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై తాను ప్రత్యేకంగా స్పందించబోనని చెప్పారు. అయితే భారత ఎన్నికల నిర్వహణ వ్యవస్థ విశ్వసనీయత, పటిష్ఠత ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన వాస్తవమని పేర్కొన్నారు. భారత్‌లో ఎన్నికలు భారీ స్థాయిలో జరిగినప్పటికీ.. ఓటింగ్ ప్రక్రియలో గుర్తింపు, పారదర్శకతకు ప్రాధాన్యం ఉంటుందని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేశాయి.అమెరికాలో ఓటర్ల అర్హతను మరింత కఠినంగా నిర్ధారించాల్సిన అవసరం ఉందని వాదిస్తున్న ట్రంప్.. ఇందుకు భారత్ ఎన్నికల వ్యవస్థను ఉదాహరణగా చూపించారు. ఇటీవల భారత్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సుమారు 64.6 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ట్రంప్ పేర్కొన్నారు. అంత భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొన్నప్పటికీ.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన వారి సంఖ్య ఒక శాతానికి లోపే ఉందని చెప్పారు. అంతేకాకుండా ప్రతి ఓటరుకూ చెల్లుబాటయ్యే ఫొటో గుర్తింపు పత్రం అవసరమని ప్రస్తావించారు.భారత్ సీఈసీతో అమెరికా అధికారుల చర్చలుట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పేరును కూడా ప్రస్తావించారు. ఈ నెల ప్రారంభంలో ఆయన అమెరికా ప్రభుత్వ అధికారులతో మాట్లాడినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో చెల్లుబాటయ్యే ఫొటో గుర్తింపు కార్డు లేకుండానే ఎన్నికలు ఎలా నిర్వహించగలుగుతున్నారని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రశ్నించినట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఓటరు గుర్తింపు నిబంధనలను మరింత కఠినతరం చేయాలని ఆయన వాదిస్తున్నారు.‘సేవ్ అమెరికా యాక్ట్’కు ట్రంప్ పట్టుదలఅమెరికా ఎన్నికల ప్రక్రియలో పౌరసత్వ ధ్రువీకరణ, ఓటరు గుర్తింపును తప్పనిసరి చేయాలన్న ఉద్దేశంతో ట్రంప్ ‘SAVE America Act’కు మద్దతు కూడగడుతున్నారు. అమెరికా ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హతను నిర్ధారించే నిబంధనలను ఈ బిల్లు మరింత కఠినతరం చేయాలని ప్రతిపాదిస్తోంది. ఓటరుగా నమోదు చేసుకునే సమయంలో అమెరికా పౌరసత్వానికి ఆధారాలు సమర్పించడంతో పాటు.. దేశవ్యాప్తంగా ఓటరు గుర్తింపు నిబంధన అమలు చేయాలని ట్రంప్ కోరుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్‌పైనా ఆంక్షలు విధించాలన్నది ఆయన ప్రతిపాదనలో కీలక అంశం.భారత్ మోడల్‌నే ఎందుకు ప్రస్తావిస్తున్నారు?అమెరికా ఎన్నికల్లో ఓటరు అర్హత, పౌరసత్వ ధ్రువీకరణపై రాజకీయ చర్చ తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో ట్రంప్ భారత్ ఎన్నికల విధానాన్ని ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొనే ఎన్నికలను భారత్ నిర్వహిస్తున్న తీరును ఆయన తన వాదనకు మద్దతుగా ఉపయోగించుకున్నారు.అయితే ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం మాత్రం ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా.. భారత ఎన్నికల వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం, విశ్వసనీయత ఉన్నాయన్న విషయాన్ని మాత్రమే స్పష్టం చేసింది. దీంతో అమెరికా ఎన్నికల సంస్కరణల చర్చలో భారత్ ఓటరు గుర్తింపు విధానం మరోసారి అంతర్జాతీయంగా ప్రస్తావనకు వచ్చింది. -
హర్ముజ్‌లో ఒక్కసారిగా మారిన సీన్
ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ ముదురుతున్న వేళ.. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరు మరింత ఉత్కంఠగా మారింది. ఈ వ్యూహాత్మక జలమార్గంపై తమదే పైచేయి అని ఇరాన్ చెప్పుకుంటోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ అడుగు ముందుకేసి తమ భూభాగంలోకే వస్తుందంటూ మ్యాప్ రిలీజ్ చేశారు. అయితే.. తాజా షిప్పింగ్ గణాంకాలు మాత్రం ఆసక్తికర విషయాన్ని వెల్లడిస్తోంది.గత రెండు వారాల్లో హర్ముజ్ గుండా ప్రయాణించిన నౌకల్లో అత్యధిక శాతం ఒమన్ వైపు ఉన్న మార్గాన్ని ఎంచుకున్నాయి. దీంతో హర్ముజ్‌పై ఇరాన్ గతంలో ఉన్నంత స్థాయిలో నియంత్రణ కొనసాగించడం కష్టమవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో అమెరికా నౌకాదళ బలగాల ఉనికి, ఇరాన్ నౌకలపై దాడుల భయం, చమురు రవాణా మార్గాల్లో మార్పులు.. ఈ జలసంధిలో శక్తి సమీకరణాలు వేగంగా మారుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి.షిప్పింగ్ డేటా సంస్థ కేప్లర్ గణాంకాల ప్రకారం.. గత రెండు వారాల్లో హర్ముజ్ జలసంధి గుండా వెళ్లిన నౌకల్లో 80 శాతానికి పైగా ఒమన్ వైపు ఉన్న మార్గాన్ని ఉపయోగించాయి. ఈ మార్గాన్ని ఐక్యరాజ్యసమితి అనుమతించినప్పటికీ.. ఇరాన్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.నెల రోజుల క్రితం వరకు ఈ మార్గంలో దాదాపు ఎలాంటి నౌకా రాకపోకలు లేవని కేప్లర్ తెలిపింది. ఇప్పుడు మాత్రం పెద్ద సంఖ్యలో వాణిజ్య నౌకలు ఇరాన్ అభ్యంతరాలను పక్కనబెట్టి ఒమన్ వైపు నుంచి ప్రయాణిస్తున్నాయి. ఇరాన్ ఉత్తర ఒమన్ తీరానికి సమీపంలోని మార్గాలను ఉపయోగించే నౌకలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ.. అమెరికా నౌకాదళ రక్షణపై ఆధారపడుతూ కొన్ని నౌకలు ఆ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి.కేప్లర్ క్రూడ్ ఆయిల్ విశ్లేషణ విభాగం అధిపతి హోమయూన్ ఫలక్‌షాహీ స్పందిస్తూ.. హర్ముజ్‌పై ఇరాన్ కొంతవరకు నియంత్రణ కోల్పోయినట్లు కనిపిస్తోంది అని అంటున్నారు.ఇరాన్ టోల్ వసూళ్లకూ బ్రేక్!హర్ముజ్ గుండా ప్రయాణించే నౌకల నుంచి రవాణా రుసుములు వసూలు చేయాలని ఇరాన్ గతంలో ప్రయత్నించింది. అయితే నౌకలు ఇరాన్ ప్రాధాన్యమిస్తున్న మార్గాన్ని కాకుండా ఒమన్ వైపు ఉన్న మార్గాన్ని ఎంచుకోవడంతో ఆ ప్రయత్నాలను అమలు చేయడం కష్టంగా మారింది. ఇరాన్ టోల్ వసూలు చేయాలన్న ప్రతిపాదనను మధ్యప్రాచ్యంలోని చాలా దేశాలు అంగీకరించడం లేదని పికరింగ్ ఎనర్జీ పార్ట్నర్స్ వ్యవస్థాపకుడు డాన్ పికరింగ్ పేర్కొన్నారు.అంటే.. నౌకల రాకపోకలను బెదిరించడం మాత్రమే కాకుండా వాటి నుంచి తన నిబంధనల ప్రకారం రుసుములు వసూలు చేయాలన్న ఇరాన్ ప్రయత్నానికీ ఇప్పుడు పరిమితులు ఏర్పడుతున్నాయి.చమురు ట్యాంకర్లలో ‘డార్క్ ట్రాఫిక్’హర్ముజ్ ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు చమురు రవాణాలో కొత్త మార్గాలను అనుసరిస్తున్నాయి. కువైట్, సౌదీ అరేబియా, యూఏఈలు వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్స్ (వీఎల్సీసీ)ను ఉపయోగించి పెర్షియన్ గల్ఫ్ నుంచి హర్ముజ్ మీదుగా చమురును తరలిస్తున్నాయి. ప్రమాదకర ప్రాంతాన్ని దాటిన తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఇతర ట్యాంకర్లకు చమురును బదిలీ చేస్తున్నట్లు సమాచారం.ఇరాన్ దాడుల ముప్పు నుంచి తప్పించుకునేందుకు కొన్ని ట్యాంకర్లు తమ ట్రాన్స్పాండర్లను ఆపివేస్తున్నాయి. కొన్ని నౌకలు వారాలపాటు తమ గుర్తింపు సంకేతాలను నిలిపివేస్తున్నాయి. దీంతో సాధారణ షిప్పింగ్ ట్రాకింగ్ వ్యవస్థలకు అవి కనిపించకుండా పోతున్నాయి. ఈ విధానాన్ని ‘డార్క్ ట్రాఫిక్’గా వ్యవహరిస్తున్నారు. ఉపగ్రహ చిత్రాలు, ఇతర సాంకేతిక వ్యవస్థలతో కొన్ని నౌకలను గుర్తించగలిగినా.. వాటి కదలికలను పూర్తిస్థాయిలో అంచనా వేయడం కష్టమవుతోంది.ట్రంప్.. అదే మాటమరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం హర్ముజ్‌పై అమెరికాదే పైచేయి అని స్పష్టం చేస్తున్నారు. అమెరికా నౌకాదళ బలగాలు ఈ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. హర్ముజ్‌పై తమకు పూర్తి నియంత్రణ ఉందని ట్రంప్ ప్రకటించారు.మంగళవారం మరింత దూకుడుగా స్పందించిన ఆయన.. హర్ముజ్‌ను అమెరికా నియంత్రణలోకి తీసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. అంతేకాదు.. జలసంధి మ్యాప్‌ను షేర్ చేస్తూ దానిని ‘కొత్త అమెరికా భూభాగం’గా అభివర్ణించారు. అమెరికా ఇంధనశాఖ మంత్రి క్రిస్ రైట్ స్పందిస్తూ.. హర్ముజ్ గుండా వెళ్తున్న చమురు, హర్ముజ్‌ను తప్పించి ఇతర మార్గాల ద్వారా తరలిస్తున్న చమురు కలిపి ఒక వారంలో రోజుకు సుమారు 1.5 కోట్ల బ్యారెళ్లకు చేరుకుంది.యుద్ధానికి ముందు హర్ముజ్ ప్రాంతం గుండా రోజుకు సుమారు 2 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా జరిగేది. ప్రస్తుత ప్రవాహం దానికి దగ్గరగా ఉండటాన్ని చూపిస్తూ.. ఇరాన్ హర్ముజ్‌ను పూర్తిగా మూసివేయడంలో విఫలమైందని అమెరికా వాదిస్తోంది.అరాఘ్చీ కౌంటర్ఇరాన్–అమెరికా మధ్య మాటల యుద్ధం కూడా తీవ్రంగా కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్‌తో ఎలాంటి చర్చలు జరగడం లేదని, ప్రస్తుతం ఎలాంటి చర్చలు షెడ్యూల్ కాలేదని చెప్పారు. అమెరికా నౌకాదళ దిగ్బంధం కొనసాగుతోందని, హర్ముజ్‌లోని సముద్రపు గనులను తొలగించినట్లు కూడా ఆయన ప్రకటించారు. దీనికి భిన్నంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఘాటుగా స్పందించారు. అమెరికా తన లక్ష్యాలను సాధించలేకపోవడంతో ఇప్పుడు ఇరాన్ షరతులపై చర్చలు జరపాలని ‘వేడుకుంటోంది’ అని వ్యాఖ్యానించారు.ఇరాన్–యూఏఈ మధ్యా ఉద్రిక్తత!హర్ముజ్ సంక్షోభం నేపథ్యంలో ఇరాన్–యూఏఈ మధ్య కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సముద్ర రవాణాను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. వాటిలో ఒక క్షిపణి యూఏఈ ప్రాదేశిక జలాల్లో పడిందని.. మరో క్షిపణి ఆ జలాలకు వెలుపల సముద్రంలో పడిందని తెలిపింది.అయితే ఈ ఆరోపణలను ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ ఖండించారు. అవి నిరాధార ఆరోపణలని.. ఇలాంటి వ్యాఖ్యలు ఇరుగు పొరుగు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసి ప్రాంతీయ నమ్మకాన్ని బలహీనపరుస్తాయని అన్నారు.మరోవైపు.. ఇరాన్‌తో వాణిజ్యం, వాణిజ్య మార్పిడి, ఆర్థిక లావాదేవీలన్నింటినీ తదుపరి ఆదేశాలు వెలువడే వరకు నిలిపివేస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది.చమురు ధరలపై ప్రభావంహర్ముజ్ ఉద్రిక్తతలు అంతర్జాతీయ చమురు మార్కెట్‌పైనా ప్రభావం చూపుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 59 సెంట్లు లేదా 0.7 శాతం పెరిగి బ్యారెల్‌కు 91.46 డాలర్లకు చేరాయి. మూడు వారాల తర్వాత తొలిసారిగా ఈ స్థాయికి చేరడం గమనార్హం. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) ధర 75 సెంట్లు లేదా 0.9 శాతం పెరిగి 85.25 డాలర్లకు చేరింది. హర్ముజ్ మీదుగా చమురు రవాణాకు అంతరాయం కొనసాగితే.. సరఫరా భయాలు మరింత పెరిగి ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.ఇరాన్–ఒమన్ చర్చలపై ఆశలుహర్ముజ్లో నౌకాయానాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇరాన్, ఒమన్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇరుదేశాలకు జలసంధి తీర ప్రాంతాలు ఉండటంతో స్వేచ్ఛాయుత నౌకాయానంపై ఒక ఒప్పందం కుదిరే అవకాశాలపై ఆసక్తి నెలకొంది. అమెరికా ప్రత్యక్ష భాగస్వామ్యం లేకుండా ఈ చర్చలు జరగడం ట్రంప్‌కు అసంతృప్తి కలిగించినట్లు తెలుస్తోంది.ఇరాన్–ఒమన్ మధ్య హర్ముజ్ రవాణా ఒప్పందం కుదిరిన తర్వాతే అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలను పునఃప్రారంభించేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు ప్రయత్నించే అవకాశం ఉందని ఖతార్ విదేశాంగశాఖ ప్రతినిధి మాజెద్ అల్ అన్సారీ తెలిపారు.‘షరతులు నెరవేర్చే వరకు క్లోజ్’ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ మాత్రం తమ వైఖరిని స్పష్టం చేశారు. అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఆంక్షలను తొలగించడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం వంటి షరతులను అమెరికా నెరవేర్చే వరకు హర్ముజ్ జలసంధి మూసే ఉంటుందని ఆయన ప్రకటించారు. దీంతో హర్ముజ్ కేవలం నౌకాయాన సమస్యగా కాకుండా.. ఇరాన్–అమెరికా మధ్య రాజకీయ, సైనిక, ఆర్థిక పోరాటానికి ప్రధాన వేదికగా మారింది.ఎవరి పట్టు ఎంత?ఇరాన్ దాడుల ముప్పుతో కొన్ని వాణిజ్య నౌకలు తమ కదలికలను గుర్తించే ట్రాన్స్పాండర్లను ఆపేస్తున్నాయి. మరికొన్ని నౌకలు ప్రమాదకర మార్గాలను వదిలి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. అదీ అమెరికా రక్షణ నడుమ. అయితే 80 శాతానికి పైగా నౌకలు ఒమన్ మార్గాన్ని ఎంచుకోవడం మాత్రం హర్ముజ్‌పై ఇరాన్ సంప్రదాయ ఆధిపత్యానికి గట్టి సవాలుగా మారింది. అదే సమయంలో చమురు రవాణా యుద్ధానికి ముందు స్థాయికి ఇంకా చేరుకోకపోవడం అమెరికా పూర్తి నియంత్రణ వాదనకూ పరిమితులు ఉన్నాయని చెబుతోంది. అందుకే ప్రస్తుతం హర్ముజ్‌లో కనిపిస్తున్నది ఒకరి సంపూర్ణ విజయం కాదనేది విశ్లేషకుల మాట. -
ట్రంప్ రేటింగ్ ఢమాల్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజా ఆమోద రేటింగ్ 33 శాతానికి పడిపోయింది. ఇది ఆయన ప్రస్తుత పదవీకాలంలో అత్యంత కనిష్ట స్థాయి. వలస విధానాలు, వాణిజ్య పరమైన సుంకాల ప్రభావం కూడా ఆయన రేటింగ్ పడిపోవడానికి కారణమయ్యాయి. కేవలం 33 శాతం మంది మాత్రమే ట్రంప్ పనితీరును ఆమోదించారు. ఇది ఆయన మొదటి పదవీకాలంలో, డిసెంబర్ 2017లో నమోదైన అత్యల్ప స్థాయికి సమానం. 2025లో దేశంలో దాదాపు సగం మంది అధ్యక్ష పదవికి ఆమోదం తెలిపారు. అయితే, ఇటీవల నాలుగు రోజుల పాటు నిర్వహించిన పోల్‌లో, 64 శాతం మంది అమెరికన్లు ఆయన పనితీరును వ్యతిరేకిస్తున్నట్లు తేలింది. ఆర్థిక విధానాలు.. వలసలు.. పెరుగుతున్న ధరలు, నిత్యావసరాల భారం, ద్రవ్యోల్బణం నియంత్రణలో ప్రభుత్వం విఫలమవ్వటం వలన ఆర్థిక విధానాల్లో ట్రంప్ పట్ల వ్యతిరేకత పెరిగింది. ఆర్థిక వ్యవస్థను మెరుగ్గా నిర్వహించగలరనడంలో ఓటర్లు అధికార రిపబ్లికన్ల కంటే డెమొక్రాట్లకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడైంది. డెమొక్రాట్లే ఆర్థిక వ్యవస్థను మెరుగ్గా నిర్వహిస్తారని 38 శాతం మంది భావిస్తుండగా, 35 శాతం మంది రిపబ్లికన్ల విధానాన్ని ఇష్టపడుతున్నారు. వలసల విషయంలో డెమొక్రాట్ల విధానం కంటే రిపబ్లికన్ల విధానానికే ఒకింత ఎక్కువ ప్రజాదరణ లభించింది. అయితే, ప్రాణాంతక ఘర్షణలు, పిల్లలతో సహా నిర్బంధంలో ఉన్నవారి సంఖ్య పెరగడంతో రిపబ్లికన్లు తమ పట్టును కోల్పోతున్నారు. వలస విధానంపై రిపబ్లికన్ల విధానమే మెరుగైనదని సుమారు 40 శాతం అంటుండగా.. 38 శాతం మంది డెమొక్రాట్లను ఎంచుకున్నారు. ఈ 2 శాతం పాయింట్ల వ్యత్యాసం ట్రంప్ పదవీకాలంలోనే అత్యల్పం. వీటికి తోడు అమెరికా–ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్‌తో కొనసాగుతున్న దీర్ఘకాలిక యుద్ధంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రతి ఐదుగురు అమెరికన్లలో ఒకరు, రిపబ్లికన్లలో సగం మంది మాత్రమే ఈ యుద్ధం విలువైనదని భావిస్తున్నారని పోల్ వెల్లడించింది. -
‘హర్మూజ్ జలసంధి మాదే’.. మ్యాప్ విడుదల చేసిన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్/టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రపంచంలోనే అత్యంత వ్యూహాత్మక చమురు రవాణా మార్గం హర్మూజ్ జలసంధి కొత్త అమెరికా భూభాగంగా పేర్కొంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ఏఐ జనరేటెడ్ మ్యాప్ ఫొటోను పోస్ట్ చేశారు. ఇరాన్‌తో నెలకొన్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.అయితే, ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. హర్మూజ్ జలసంధి తమదేనని, అది తమ నియంత్రణలోనే ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. గతంలో ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాదీ మాట్లాడుతూ.. హర్మూజ్ ‘ఇరాన్‌దే, ఇరాన్దిగానే ఉంటుంది’ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం హర్మూజ్‌ను తిరిగి తెరవడం అమెరికా,ఇరాన్ చర్చల్లో ప్రధాన అంశంగా మారింది. అమెరికా ఆంక్షలు, నౌకాదళ చర్యలను ఉపసంహరించుకోవాలని ఇరాన్ కోరుతుండగా.. అమెరికా మాత్రం జలసంధి స్వేచ్ఛగా తెరవాలని ఒత్తిడి చేస్తోంది. ఇరువైపులా రాజీ కుదరకపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. చర్చలు ఎందుకు విఫలమవుతున్నాయి?అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన 60 రోజుల అవగాహన గడువు ఆగస్టు 17న ముగిసింది. అయితే, కీలక అంశాలపై పురోగతి లేకపోవడంతో ఆ ఒప్పందాన్ని పొడిగించబోమని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. హర్మూజ్‌ను తెరవడం,ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు, అమెరికా నౌకాదళ చర్యలు, ఇరాన్ అణు కార్యక్రమం వంటి అంశాలపై ఇరువర్గాల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ఇరాన్ మాత్రం అమెరికా ముందుగా తన సైనిక ఒత్తిడిని తగ్గించి ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తోంది. అమెరికా మాత్రం ఇరాన్‌పై ఒత్తిడిని కొనసాగిస్తూ హర్మూజ్ జలసంధి పూర్తిగా తెరవాలని కోరుతోంది.ప్రపంచ చమురు మార్కెట్‌పై ప్రభావంహర్మూజ్ జలసంధి మూసివేత లేదా రవాణాపై పరిమితులు కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాకు భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతంలోని ఉద్రిక్తతల కారణంగా నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా చమురు ధరలు, రవాణా వ్యయాలు, బీమా ఖర్చులు పెరిగే ప్రమాదం ఉంది. -
భారత్ ఎన్నికలపై ట్రంప్ ఫోకస్..! అమెరికాలో కొత్త రూల్స్ కు పిలుపు
-
‘భారత్‌ను చూడండి’.. ఓటర్ ఐడీపై అమెరికాకు ట్రంప్ క్లాస్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎన్నికల సంస్కరణల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అమెరికాలో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు, పౌరసత్వ ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని డిమాండ్ చేస్తున్న ఆయన.. ఈసారి తన వాదనకు భారత్ ఎన్నికల విధానాన్ని ఉదాహరణగా చూపించారు. అమెరికా కాంగ్రెస్ సేవ్ అమెరికా యాక్ట్(SAVE America Act)ను ఆమోదించాల్సిందేనని పట్టుబడుతూ.. భారత్‌లో ఓటర్ల గుర్తింపు కోసం అమలవుతున్న విధానాన్ని ప్రశంసించారు.భారత్‌లో ఎన్నికల సమయంలో ఓటర్లు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు పత్రంతో ఓటు వేస్తున్న విషయాన్ని ట్రంప్ ప్రస్తావించారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో తనకు జరిగిన సంభాషణను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. ‘‘ఎన్నికల నిర్వహణపై భారత సీఈసీ మా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమెరికాలో తగిన గుర్తింపు కార్డు లేకుండా ఎన్నికల నిర్వహణను ఆయన తప్పుబట్టారు. 2024లో సుమారు 60 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత్‌లో ప్రతీ ఓటర్ దగ్గర గుర్తింపు కార్డు ఉంది’’ అని ట్రంప్ అన్నారు. భారత్‌లో ఓటర్ల గుర్తింపునకు ఉన్న ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ.. అమెరికాలోనూ ఇలాంటి విధానం ఉండాల్సిన అవసరం ఉందని ట్రంప్ వాదిస్తున్నారు. అమెరికా ఫెడరల్ ఎన్నికల్లో అర్హత కలిగిన పౌరులు మాత్రమే ఓటు వేసేలా పౌరసత్వాన్ని నిర్ధారించడంతో పాటు గుర్తింపు కార్డును తప్పనిసరి చేయాలని ఆయన కోరుతున్నారు.SAVE America Act అంటే..ట్రంప్ మద్దతు ఇస్తున్న SAVE America Act ప్రధానంగా అమెరికా ఎన్నికల్లో ఓటరు నమోదు ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని ప్రతిపాదిస్తోంది. ఓటరుగా నమోదు చేసుకునే సమయంలో అమెరికా పౌరసత్వాన్ని నిరూపించే పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం అవసరమయ్యేలా నిబంధనలు తీసుకురావాలని ప్రతిపాదించారు.ఓటర్ల జాబితాల్లో పౌరసత్వ అర్హత లేని వ్యక్తులు ఉంటే వారిని గుర్తించి తొలగించే ప్రక్రియను కూడా కఠినతరం చేయాలని ఈ బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయి. మెయిల్ ద్వారా ఓటింగ్‌పైనా పరిమితులు విధించే నిబంధనలు ఇందులో ఉన్నాయి. వైద్య కారణాలు, వైకల్యం, సైనిక సేవ, ప్రయాణం వంటి కొన్ని పరిస్థితులకు మినహాయింపులు ఇవ్వాలని ప్రతిపాదించారు. తక్షణమే ఈ బిల్లును ప్రతిపాదించాలని ట్రంప్ కోరుతున్నారు.‘పౌరులే ఓటు వేయాలి’అమెరికా ఎన్నికల్లో పౌరసత్వం లేని వ్యక్తులు ఓటు వేస్తున్నారన్న ఆరోపణలను ట్రంప్ చాలాకాలంగా ప్రస్తావిస్తున్నారు. **‘అమెరికా ఎన్నికల్లో ఓటు హక్కు అమెరికా పౌరులకే ఉండాలి’** అన్నది ఆయన ప్రధాన వాదన. అందుకే ఓటరు నమోదు దశలోనే పౌరసత్వాన్ని నిర్ధారించాలని కోరుతున్నారు. అయితే అందుబాటులో ఉన్న పరిశోధనలు, ఎన్నికల డేటా ప్రకారం పౌరేతరుల అక్రమ ఓటింగ్ చాలా అరుదైన ఘటన అని విశ్లేషణలు చెబుతున్నాయి. అయినప్పటికీ ఈ అంశాన్ని ట్రంప్ ఎన్నికల సంస్కరణల చర్చలో కీలకంగా ముందుకు తీసుకెళ్తున్నారు.భారత్‌నే ఎందుకు ఉదాహరణగా చూపించారు?భారత్‌లో ఎన్నికల సమయంలో ఓటర్ల గుర్తింపు కోసం ఫొటో ఓటర్ ఐడీతో పాటు ఎన్నికల సంఘం ఆమోదించిన ఇతర గుర్తింపు పత్రాలను ఉపయోగిస్తారు. ఓటరు జాబితాలో పేరు ఉండటంతో పాటు పోలింగ్ కేంద్రంలో గుర్తింపు నిర్ధారణకు ఈ పత్రాలు కీలకంగా ఉంటాయి. ఈ విధానాన్ని ప్రస్తావిస్తూ.. అమెరికాలోనూ ఓటర్ల గుర్తింపు, పౌరసత్వ ధ్రువీకరణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని ట్రంప్ వాదిస్తున్నారు. అయితే భారత్, అమెరికా ఎన్నికల వ్యవస్థలు, ఓటరు నమోదు విధానాలు, చట్టపరమైన నిబంధనలు ఒకేలా ఉండవు. కాబట్టి భారత్‌లోని విధానాన్ని అమెరికాలో యథాతథంగా అమలు చేయడం సాధ్యమా? అనేది వేరే ప్రశ్న.అమెరికాలో రాజకీయ దుమారంSAVE America Actపై అమెరికాలో తీవ్ర రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయి. ట్రంప్, రిపబ్లికన్లు ఈ బిల్లును ‘ఎన్నికల సమగ్రతను కాపాడే కీలక సంస్కరణ’గా అభివర్ణిస్తున్నారు. మరోవైపు డెమొక్రాట్లు, పౌరహక్కుల సంస్థలు మాత్రం అదనపు గుర్తింపు, పౌరసత్వ పత్రాలను తప్పనిసరి చేయడం వల్ల అర్హత ఉన్న కొంతమంది ఓటర్లు కూడా ఓటు హక్కును వినియోగించుకోలేకపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా పాస్‌పోర్టు, జనన ధ్రువీకరణ పత్రం వంటి పత్రాలను సమర్పించడం తప్పనిసరి అయితే.. వాటిని సులభంగా పొందలేని ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని విమర్శకులు చెబుతున్నారు.మధ్యంతర ఎన్నికల వేళ మళ్లీ చర్చ2026 అమెరికా మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల భద్రత, ఓటర్ల గుర్తింపు, పౌరసత్వ ధ్రువీకరణ అంశాలు మరోసారి రాజకీయ చర్చలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ SAVE America Actపై తన ఒత్తిడిని మరింత పెంచుతున్నారు. ఈ క్రమంలో భారత్ ఓటర్ ఐడీ విధానాన్ని ఆయన ఉదాహరణగా చూపించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భారత్‌లో అమలవుతున్న గుర్తింపు ఆధారిత ఓటింగ్ విధానాన్ని ప్రశంసిస్తూ.. అమెరికాలోనూ ఓటర్ల గుర్తింపు, పౌరసత్వ ధ్రువీకరణకు కఠిన నిబంధనలు ఉండాలన్న తన వాదనకు ట్రంప్ మరింత బలం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ ఓటర్ ఐడీ విధానం ట్రంప్ రాజకీయ వాదనలో కొత్తగా ప్రస్తావనకు రావడం.. అమెరికా ఎన్నికల సంస్కరణలపై సాగుతున్న చర్చకు మరో కోణాన్ని జోడించింది. -
"మా దారికి అడ్డొస్తే బాంబులతో లేపేస్తా"
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒమన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఇరాన్‌తో నడుస్తున్న యుద్ధంలో ఒమన్ గనుక తలదూర్చితే వారిపై తీవ్రమైన దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు జరిగే ఈ అత్యంత కీలకమైన జలసంధిని తన గుప్పిట్లో ఉంచుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరాన్‌తో కలిసి ఒమన్ దేశం ఒక ఒప్పందానికి వస్తోందని, ఆ జలసంధి నిర్వహణ లేదా టోల్స్ వసూలు బాధ్యతలను ఇరాన్‌తో కలిసి పంచుకుంటుందనే ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలో ట్రంప్ ఆ దేశంపై రెచ్చిపోయారు.ఫాక్స్ న్యూస్‌కిచ్చిన ఇంటర్వూలో ట్రంప్ మాట్లాడుతూ "ఇరాన్ వెంటనే లొంగిపోవాలి, శ్వేత పతాకాన్ని ఎగరవేయాలి.ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాలను కలిగి ఉండకూడదు. అదే అమెరికా ప్రధాన లక్ష్యం. ఒకవేళ ఈ అంశంలో ఒమన్ కనుక మా దారికి అడ్డువస్తే, వారిపై తీవ్రమైన దాడులు చేస్తాం" అని హెచ్చరించారు. హర్ముజ్ జలసంధి నిర్వహణకు సంబంధించి ఇరాన్ దౌత్యవేత్తలతో ఒమన్ అధికారులు ఇటీవల చర్చలు జరుపుతున్నారు. ఈ పరిణామాలపై ట్రంప్ ఈ విధంగా మాట్లాడారు.కాగా అమెరికా, ఇరాన్ మధ్య (జూన్ 17న) 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం హర్ముజ్ జలసంధిని తెరవడం, శాంతి చర్చలు జరపాల్సి ఉంది. అయితే ఈ 60 రోజుల గడువు ముగిసే సమయానికి ఇరు దేశాల మధ్య భద్రతా హామీలు, నౌకా ప్రయాణ స్వేచ్ఛ వంటి కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ఆందోళన పెంచుతున్నాయి. -
అమెరికా రాజకీయాలను కుదిపేస్తున్న 'MAGA' అంతర్గత పోరు!
అమెరికా అధ్యక్ష పీఠం కోసం 2028లో జరగనున్న ప్రైమరీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది..! అయితే, అప్పుడే అమెరికా రాజకీయాల్లో, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ 'MAGA' (Make America Great Again) ఉద్యమంలో ఒక పెద్ద సైద్ధాంతిక యుద్ధం రాజుకుంది. విదేశాంగ విధానం, ముఖ్యంగా ఇరాన్‌తో యుద్ధం, భవిష్యత్తులో అమెరికా సైనిక జోక్యం వంటి కీలక అంశాలపై ట్రంప్ పరిపాలనలో మరియు రిపబ్లికన్ పార్టీలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. దాంతో.. ట్రంప్ రాజకీయ వారసుడు ఎవరవుతారనే దానిపై ఈ పోరు కేంద్రంగా ఉంది.వాన్స్వైపు ట్రంప్ మొగ్గు..!తన తర్వాత ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ (JD Vance) తన వారసుడిగా రావాలని ట్రంప్ ప్రైవేట్‌గా డోనర్లకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ట్రంప్ వాన్స్‌ను అధికారికంగా ఎండార్స్ చేయకపోవడం వల్ల.. మితవాద రిపబ్లికన్లలో ఆశలు సజీవంగానే ఉన్నాయి. సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో(Marco Rubio) 2028లో ట్రంప్ వారసుడిగా నిలుస్తారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.ఆన్లైన్ రైట్ ప్రభావం - కొత్త సమీకరణాలుఆన్లైన్ రైట్ వర్గాల ప్రభావం ఈ రాజకీయ సమీకరణాలను మరింత సంక్లిష్టం చేస్తోంది. ఫాక్స్ న్యూస్ మాజీ హోస్ట్ టక్కర్ కార్ల్సన్(Tucker Carlson) భవిష్యత్తులో మూడో పార్టీ తరఫున అధ్యక్ష బరిలోకి దిగే సూచనలు చేస్తున్నారు. మరోవైపు, నిక్ ఫ్యూంటెస్ వంటివారు కూడా యువతను ఆకట్టుకునేలా MAGA ఉద్యమానికి తమదైన తీవ్రరూపాన్ని ఇస్తున్నారు.రెండు వర్గాల పోరు2024 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించినప్పటి నుంచి.. ట్రంప్ తర్వాత MAGA సిద్ధాంతాన్ని ఏది శాసించాలనే విషయంలో రిపబ్లికన్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. ఇందులో ప్రధానంగా రెండు శిబిరాలు ఉన్నాయి:నియోకన్జర్వేటివ్ (Neoconservative) వర్గం: సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో దీనికి నేతృత్వం వహిస్తున్నారు. ఇజ్రాయెల్‌కు, ఉక్రెయిన్‌కు బలమైన మద్దతు ఇవ్వాలని, మధ్యప్రాచ్యం, దక్షిణ అమెరికాలలో అమెరికా సైన్యాన్ని దూకుడుగా ఉపయోగించాలని వీరు కోరుకుంటారు.యాంటీ-ఇంటర్వెన్షనిస్ట్ (Anti-interventionist) వర్గం: ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ దీనికి నాయకత్వం వహిస్తున్నారు. నాటో మిత్రదేశాలు, ఇజ్రాయెల్, ఉక్రెయిన్లపై ఆధారపడటాన్ని తగ్గించాలని, ఇరాన్‌తో సైనిక చర్య కంటే దౌత్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని వీరు కోరుకుంటున్నారు.ట్రంప్ ఈ రెండు భిన్నమైన విదేశాంగ విధానాలను తన పాలనలో మిక్స్ చేసి అమలు చేయడానికి ప్రయత్నించారు. మార్కో రూబియోను వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించడానికి అనుమతించడం ద్వారా నియోకాన్లకు ఒక విజయాన్ని అందించారు. అదే సమయంలో ఇరాన్‌తో యుద్ధానికి వెళ్లినప్పటికీ, జూన్ నుంచి ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలు జరిపే బాధ్యతను జె.డి.వాన్స్‌కు అప్పగించారు. ఇలా రెండు వైపులా అవకాశాలు ఇవ్వడం వల్ల MAGA అధికారిక విధానం ఏమిటనే దానిపై పార్టీలో మరింత గందరగోళం పెరిగింది.ఓటర్లలో ‘తరాల’వారీగా చీలికఈ సైద్ధాంతిక విభేదాలు కేవలం నాయకుల మధ్యే కాకుండా ఓటర్లలోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్యూ రీసెర్చ్ ప్రకారం.. 50 ఏళ్లు పైబడిన రిపబ్లికన్లలో 63% మంది విదేశాంగ విధానంలో అమెరికా మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నారు. కానీ 50 ఏళ్ల లోపు యువ రిపబ్లికన్లలో కేవలం 38% మంది మాత్రమే దీనికి మద్దతు ఇస్తున్నారు. పెద్ద వయసు వారిలో నియోకన్జర్వేటివ్ ఆలోచనలు, యువతలో సైనిక జోక్య వ్యతిరేక (Anti-interventionist) భావనలు బలంగా ఉన్నాయని ఇది స్పష్టం చేస్తోంది.వాన్స్ ఎదుట ఉన్న సవాళ్లివే..!2028 ఎన్నికల్లో అధ్యక్ష రేసులో నిలవాలనుకుంటున్న జె.డి.వాన్స్‌కు టక్కర్ కార్ల్సన్, నిక్ ఫ్యూంటెస్ వంటి వారి ప్రభావం పెద్ద తలనొప్పిగా మారుతోంది.టక్కర్ కార్ల్సన్ మూడో పార్టీ ప్రయత్నాలు: కార్ల్సన్ యాంటీ-ఇంటర్వెన్షనిస్ట్ ఎజెండాతో ఒక కొత్త రాజకీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల మార్జరీ టేలర్ గ్రీన్, థామస్ మాస్సీ వంటి మాజీ ట్రంప్ మద్దతుదారులతో సమావేశమై 10 అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు. కార్ల్సన్ ప్రత్యక్షంగా మూడో పార్టీ పెట్టినా పెట్టకపోయినా.. MAGA ఓటర్లను చీల్చడం ద్వారా వాన్స్ అవకాశాలను దెబ్బతీయగలరు.నిక్ ఫ్యూంటెస్ ప్రభావం: వైట్ నేషనలిస్ట్ అయిన నిక్ ఫ్యూంటెస్ యువ రిపబ్లికన్ స్టాఫ్‌పై ప్రభావం చూపుతున్నారు. కాంగ్రెస్ నుంచి థింక్ ట్యాంకుల వరకు అనేక మంది యువ ఉద్యోగులు ఫ్యూంటెస్ భావనలకు ఆకర్షితులవుతున్నారు. వాన్స్ తన భార్యపై జాతిపరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఫ్యూంటెస్‌ను విమర్శించారు. అయితే.. పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోకపోవడం నియోకాన్లు, బెన్ షాపిరో వంటి వారి ఆగ్రహానికి కారణమవుతోంది.టక్కర్ కార్ల్సన్ రాజకీయ ఆకర్షణ కావచ్చు, లేదా నిక్ ఫ్యూంటెస్ వివాదాస్పద నేపథ్యం కావచ్చు.. అంతర్గత కుమ్ములాటలు 2028 అధ్యక్ష రేసుపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. ఒకవైపు పార్టీని ఏకం చేస్తూనే, మరోవైపు మారుతున్న ఈ రాజకీయ సమీక్షలను జేడీ వాన్స్ ఎలా ఎదుర్కొంటారనేది రాబోయే కాలంలో అమెరికా రాజకీయాల గమనాన్ని నిర్దేశిస్తుందనేది నిర్వివాదాంశం..!-సాక్షి వెబ్ డెస్క్ -
ఇరాన్ కొత్త వార్ ప్లాన్.. అమెరికా సైనికుడి ప్రాణానికి భారీ బౌంటీ!
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికా సైనికుడిని హతమార్చినా, సజీవంగా పట్టుకుని అప్పగించినా 30 వేల డాలర్ల నజరానా అందిస్తామని ప్రకటించింది. ఈ చర్యకు పాల్పడేది మహిళ అయితే రివార్డును రెట్టింపు చేసి 60 వేల డాలర్లు ఇస్తామని ఇరాన్ సైన్యం ప్రకటించినట్లు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది.ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ ఈ నజరానా పథకాన్ని ప్రకటించినట్లు సమాచారం. అమెరికాపై పోరాటానికి ఆర్థికంగా మద్దతు ఇచ్చేందుకు ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థనలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నట్లు ఐఆర్ఎన్ఏ కథనాన్ని ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా తెలిపింది. అయితే అమెరికా సైనికులను ఎక్కడ, ఎప్పుడు పట్టుకోవాలనే విషయంపై ఎలాంటి వివరాలను ఇరాన్ వెల్లడించలేదు.హార్మూజ్ ప్రతిష్ఠంభన వేళ..హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్న సమయంలో ఇరాన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికాతో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న నేపథ్యంలో ఇరాన్ తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అయితే ప్రస్తుతం ఇరాన్ భూభాగంలో అమెరికా బలగాల పెద్దఎత్తున మోహరింపు లేదని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఏప్రిల్‌లో కూలిపోయిన అమెరికా యుద్ధ విమాన పైలట్‌ను రక్షించేందుకు చేపట్టిన చర్య మినహా ఇరాన్లో అమెరికా బలగాల ప్రత్యక్ష మోహరింపునకు సంబంధించిన ఘటనలు పరిమితంగానే ఉన్నట్లు సమాచారం.ట్రంప్‌పైనా గతంలో ముప్పు?ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కూడా ఇరాన్ వైపు నుంచి గతంలో హత్యా ముప్పులు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలో ట్రంప్ భద్రతా ఏర్పాట్లపై కూడా అప్పట్లో పలు కథనాలు వెలువడ్డాయి. తాజాగా అమెరికా సైనికులపై నేరుగా నజరానా ప్రకటించడం.. ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలతో ఉన్న అమెరికా-ఇరాన్ సంబంధాలను మరింత ప్రమాదకర దిశలోకి తీసుకెళ్లే పరిణామంగా మారింది. -
ట్రంప్‌కు మళ్లీ కోపమొచ్చింది! ఈసారి..
ఇరాన్‌పై యుద్ధ వ్యూహంలో తమతో కలిసిరాని మిత్రదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. ఇప్పుడు మరో మిత్రదేశంపై గుర్రుగా ఉన్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా చేపడుతున్న చర్యలకు మద్దతు ఇవ్వకపోవడంపై దక్షిణ కొరియాపై అసహనం వ్యక్తం చేసిన ఆయన.. సంయుక్త సైనిక విన్యాసాలను గణనీయంగా తగ్గించాలని పెంటగాన్‌ను ఆదేశించారు.ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌ను అణు ఆయుధాల నుంచి దూరం చేసే ప్రయత్నాల్లో అమెరికాతో కలిసి పనిచేయాలా అని దక్షిణ కొరియా అధ్యక్షుడిని ఇటీవల అడిగానని.. అందుకు సియోల్ "వద్దు, ధన్యవాదాలు" అంటూ సమాధానం ఇచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు. సైనిక విన్యాసాలపై ట్రంప్ నిర్ణయందక్షిణ కొరియా నిర్ణయంతో అసంతృప్తి చెందిన ట్రంప్.. అమెరికా, దక్షిణ కొరియా మధ్య జరిగే వార్షిక సంయుక్త సైనిక విన్యాసాలను భారీగా తగ్గించాలని రక్షణ శాఖకు ఆదేశించినట్లు తెలిపారు. అయితే ఈ ఏడాది జరగనున్న ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ (Ulchi Freedom Shield) విన్యాసాలను పూర్తిగా రద్దు చేసే అవకాశం లేకపోయిందని చెప్పారు. ముందుగానే ప్రణాళిక ఖరారైందని, అందుకే పూర్తిగా నిలిపివేయలేకపోతున్నామని స్వయంగా ట్రంపే తెలిపారు. ఈ సైనిక విన్యాసాలు ఆగస్టు 17 నుంచి 27 వరకు జరగనున్నాయి.ఉత్తర కొరియాపై ట్రంప్ వ్యాఖ్యలుఅమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలపై తన అసంతృప్తికి మరో కారణంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో తనకు ఉన్న మంచి సంబంధాలను కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఈ విన్యాసాలు భారీ ఖర్చుతో కూడుకున్నవని, ఉత్తర కొరియాకు అనవసరంగా శత్రుత్వ సంకేతాలు పంపుతున్నాయని ఆయన అన్నారు. తన అధ్యక్ష పదవీకాలంలో ఉత్తర కొరియా ఎలాంటి ముప్పు కలిగించకుండా గౌరవప్రదంగా వ్యవహరించిందని పేర్కొన్నారు.మాంచి స్నేహంఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య సంబంధాలు అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారితీశాయి. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. పరస్పరం ఇద్దరు నేతలు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. అయితే 2018లో సింగపూర్‌లో జరిగిన చారిత్రక భేటీతో ట్రంప్–కిమ్ సంబంధాల్లో కీలక మలుపు వచ్చింది. ఆ తర్వాత కూడా కిమ్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు.ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి వ్యూహంఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా ఒత్తిడి పెంచుతున్న సమయంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్‌ను అణు ఆయుధాల నుంచి దూరంగా ఉంచేందుకు మిత్రదేశాల మద్దతును కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగానే అమెరికా చర్యలు కొనసాగుతున్నాయి. దక్షిణ కొరియా వైఖరి, అమెరికా సైనిక నిర్ణయం రెండు దేశాల మధ్య భద్రతా సహకారంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.ఉ.కొరియా సవాల్‌కు..ఇటు.. దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలను తగ్గిస్తామని ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆసియా భద్రతా వర్గాల్లో చర్చకు దారితీసింది. సాధారణంగా అమెరికా-దక్షిణ కొరియా నిర్వహించే ఈ డ్రిల్స్ ఉత్తర కొరియా క్షిపణి, అణు బెదిరింపులకు ప్రతిస్పందనగా భావిస్తారు. ఇటీవలి కాలంలో ఉత్తర కొరియా వరుసగా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ అమెరికా, దాని మిత్రదేశాలకు సవాలు విసురుతోంది. ఇలాంటి సమయంలో సంయుక్త సైనిక విన్యాసాల తీవ్రత తగ్గితే అది కిమ్ దేశానికి ఎలాంటి సంకేతాలు ఇస్తుందనే చర్చ మొదలైంది.అయితే ట్రంప్ మాత్రం ఈ నిర్ణయాన్ని ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలతో ముడిపెట్టలేదు. కిమ్ జోంగ్ ఉన్‌తో తనకు ఉన్న సంబంధాలు, భారీ ఖర్చుతో కూడిన సైనిక విన్యాసాల అవసరంపై ఆయన ఎక్కువగా ప్రస్తావించారు. మరోవైపు దక్షిణ కొరియాకు అమెరికా భద్రతా హామీలు కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నప్పటికీ.. డ్రిల్స్ తగ్గింపు ఉత్తర కొరియా వైఖరిపై ప్రభావం చూపుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. -
ట్వీట్ తో హార్మోజ్ ను స్వాధీనం చేసుకోలేరు.. ట్రంప్ కు ఇరాన్ కౌంటర్
-
అలా చేస్తేనే.. దారి తెరుస్తాం.. ట్రంప్‌కు ఇరాన్ దిమ్మతిరిగే కౌంటర్
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి. హార్ముజ్ జలసంధిని ఎప్పుడు తెరవాలి, ఎప్పుడు మూసివేయాలన్నది ఇరాన్ నిర్ణయమేనని ఆ దేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది స్పష్టం చేశారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటమి వాస్తవాన్ని అంగీకరించండి.. ఊహల్లో విహరించడం ఆపండి. అప్పటివరకు ఇరాన్ దిగ్బంధాన్ని కొనసాగిస్తుంది అంటూ హెచ్చరించారు. కేవలం ఆదేశాలు ఇవ్వడం, ట్వీట్ చేయడం లేదా యుద్ధనౌకలను మోహరించడం ద్వారా జలసంధిపై నియంత్రణ సాధించలేరని అమెరికాకు కౌంటరిచ్చారు.మరోవైపు, ప్రపంచంలోని కీలక చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధిలో రాకపోకలు భారీగా పడిపోయాయి. శుక్రవారం కేవలం రెండు నౌకలు మాత్రమే ఈ మార్గం గుండా వెళ్లినట్లు షిప్ ట్రాకింగ్ సంస్థ Kpler విశ్లేషణ తెలిపింది. వాటిలో ముడి చమురు రవాణా కనిపించకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. యుద్ధానికి ముందు రోజుకు 130కి పైగా నౌకలు ఈ మార్గంలో ప్రయాణించేవి. జలసంధి మూసివేత కొనసాగితే చమురు, ఇంధన సరఫరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే అమెరికాలో పెరుగుతున్న పెట్రోల్ ధరలను ప్రజలు భరించాల్సి ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి.ఇదే సమయంలో హార్ముజ్ జలసంధిని త్వరలో అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని ట్రంప్ చెప్పడం పరిస్థితిని మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. ఇరాన్‌తో ఒప్పందం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, అవసరమైతే ఆ దేశంపై ఆర్థికంగా మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. ఒకవైపు హార్ముజ్‌పై ఇరాన్ పట్టు.. మరోవైపు దాన్ని అమెరికా భూభాగంగా ప్రకటిస్తామంటున్న ట్రంప్.. ఈ ప్రతిష్ఠంభన ఎటు దారితీస్తుందన్నదే ఇప్పుడు ప్రపంచ దేశాల ఆందోళన.చర్చలకు నో ఛాన్స్?ఇదిలా ఉండగా.. అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్చలు కూడా ముందుకు కదలడం లేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి.. అమెరికాతో చర్చలు పునఃప్రారంభించడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఖతార్, పాకిస్తాన్ వంటి దేశాలు మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. అవి అధికారిక శాంతి చర్చలు కాదని ఇరాన్ స్పష్టం చేసింది. -
స్వాతంత్ర్య దినోత్సవం వేళ రూబియో కీలక సందేశం
వాషింగ్టన్: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. భారత ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్-అమెరికా సంబంధాలు ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహపూర్వక సంబంధం ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తోందని రూబియో అన్నారు.అమెరికా తరఫున భారత ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు రూబియో తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న స్నేహం, కుటుంబ సంబంధాలే భారత్-అమెరికా భాగస్వామ్యానికి బలమైన పునాది అని ఆయన వివరించారు. రక్షణ, ఇంధన భద్రత, కీలక ఖనిజాలు, కృత్రిమ మేధస్సు (AI), అంతరిక్ష రంగం, వాణిజ్యం తదితర కీలక రంగాల్లో ఇరు దేశాల సహకారం కొనసాగుతోందని తెలిపారు. ఈ సహకారం భారత్, అమెరికాతో పాటు మొత్తం హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని మరింత సురక్షితంగా, బలంగా, సుసంపన్నంగా మార్చేందుకు దోహదపడుతోందని అన్నారు. భవిష్యత్తులో ఇరు దేశాలు కలిసి నిర్మించబోయే భాగస్వామ్యంపై అమెరికా ఆశాభావంతో ఉందని పేర్కొన్నారు.అమెరికాలోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలోని పలు రాష్ట్రాలు ప్రత్యేక ప్రకటనలు జారీ చేశాయి. ఆగస్టు 15, 2026ను ‘ఇండియా డే’గా గుర్తిస్తూ భారతీయులకు శుభాకాంక్షలు తెలిపాయి. అమెరికాలోని భారతీయ ప్రవాసుల సేవలు, ఆ దేశ అభివృద్ధికి వారు అందిస్తున్న సహకారాన్ని పలువురు అమెరికన్ సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు కొనియాడారు. భారత్-అమెరికా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు ఇరు దేశాల ప్రజల మధ్య బలపడుతున్న సంబంధాలు కూడా ఈ సందర్భంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
హర్ముజ్‌ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తా!: ట్రంప్
ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హర్ముజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా కేవలం దాని నియంత్రణ మాత్రమే తమదేనంటూ ఆయన ప్రకటించుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సైన్యం మోహరించామని చెబుతున్నారు. అయితే తాజాగా ఈ వ్యూహాత్మక జలమార్గాన్ని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని మరో సంచలనానికి తెర తీశారు. “ఇరాన్‌ను ఓడించడం ఖాయం. ఆ తర్వాత.. అతి త్వరలో హర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తాను” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఈ నిర్ణయం ఎలా అమలు చేస్తారు? దీనికి అంతర్జాతీయంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే అంశాలపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడమే తమ లక్ష్యమని ట్రంప్ చెబుతుండగా.. ఇరాన్‌పై మరింత కఠిన ఆర్థిక చర్యలు తీసుకుంటామని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.‘కొంత ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు’.. అమెరికన్లకు ట్రంప్ఇరాన్పై చర్యల కారణంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని ట్రంప్ అంగీకరించారు. “అమెరికన్లు పెట్రోల్ కోసం కొంచెం ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు. కానీ ఇరాన్ అణ్వాయుధ శక్తిగా మారకుండా అడ్డుకోవడం ప్రపంచానికి చేసే సేవ” అని అన్నారు.హర్ముజ్‌పై అధికారం మాదే: ఇరాన్ స్పష్టంట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ ఘాటుగా స్పందించింది. హర్ముజ్ జలసంధిపై నియంత్రణ తమదేనని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది స్పష్టం చేశారు. “ఒక ట్వీట్‌తోనో, విమాన వాహక నౌకతోనో హార్ముజ్‌ను స్వాధీనం చేసుకోలేరు. ఇరాన్ ఓటమిని అంగీకరించే వరకు ఈ మార్గంపై మా నియంత్రణ కొనసాగుతుంది” అని ఆయన పేర్కొన్నారు.ప్రపంచానికి చమురు షాకే!ప్రపంచ ఇంధన మార్కెట్లకు హర్ముజ్ జలసంధి అత్యంత కీలకం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, ఎల్ఎన్జీలో దాదాపు 20 శాతం ఈ మార్గం గుండా రవాణా అవుతుంది. అయితే ఫిబ్రవరి 28వ తేదీన మొదలైన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో నౌకల రాకపోకలు భారీగా తగ్గాయి. ఫలితంగా ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 90 డాలర్లకు చేరువైంది. అమెరికాలో పెట్రోల్ ధర గ్యాలన్‌కు 4 డాలర్ల స్థాయికి చేరింది.నిలిచిన చర్చలు.. పెరుగుతున్న ఉద్రిక్తతఅమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు నిలిచిపోయాయి. యుద్ధాన్ని ముగించే దిశగా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. మరోవైపు ఇరాన్‌పై మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తెలిపారు.హర్ముజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం సాగుతున్న ఈ పోరు కొనసాగితే.. ప్రపంచ చమురు సరఫరా, ఇంధన ధరలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఇరాన్ నెత్తిన అమెరికా మరో పిడుగు! అవసరమైతే..
తమ డిమాండ్లు, షరతుల విషయంలో రాజీ పడబోమని.. అవసరమైతే ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం యుద్ధం కొనసాగిస్తామని ఇరాన్ కుండబద్ధలు కొట్టేసింది. ఈ తరుణంలో అమెరికా ఒత్తిడి మరింత పెంచింది. హర్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ‘ నో ఎండ్ ప్లాన్’తో మరింత దూకుడుగా వ్యవహరించాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే జలసంధిలో నౌకా దిగ్బంధాన్ని (బ్లాకేడ్) కొనసాగిస్తున్న అమెరికా సైన్యం.. అవసరమైతే నిరవధికగా ఆ పని చేయాలని భావిస్తోంది. అంటే నిర్దిష్ట కాలపరిమితి అంటూ ఏదీ లేకుండా ఇరాన్ పోర్టులకు వచ్చి పోయే నౌకలపై నిఘా కొనసాగించడం(అవసరమైతే దాడులు జరపడం) అన్నమాట.కాల్పుల విరమణ చర్చలు నిలిచిపోవడం, ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో నౌకాదళాన్ని కొనసాగించే సామర్థ్యం అమెరికాకు ఉందని చెప్పారు. అవసరమైనప్పుడు యుద్ధ నౌకలను మార్చుతూ హర్ముజ్ ప్రాంతంలో పహారా కొనసాగిస్తామని తెలిపారు.ఇరాన్‌పై మరిన్ని ఆర్థిక ఆంక్షలునౌకా దిగ్బంధంతో పాటు ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఆంక్షల చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అమెరికా లక్ష్యం ఇరాన్‌ను చర్చల బల్లపైకి తీసుకురావడమేనని వాషింగ్టన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటివరకు విధించిన ఆంక్షలు, ఒత్తిళ్లు ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదని కూడా విశ్లేషణలు ఉన్నాయి.హర్ముజ్ జలసంధే కేంద్రంగా పోరుఅణు ఒప్పందంతో మొదలైన పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఇప్పుడు హర్ముజ్ జలసంధి చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ రవాణాలో ఈ మార్గం అత్యంత కీలకం. యుద్ధం ప్రారంభానికి ముందు ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం ద్వారానే జరిగేది. తమపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ ఈ వ్యూహాత్మక మార్గంపై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. మరోవైపు హర్ముజ్ తమ ఆధీనంలోనే ఉందని ఇరాన్ చెబుతోంది.రెండు చమురు నౌకలపై దాడిహర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి చెందిన రెండు నౌకలపై దాడి జరిగినట్లు యూఏఈ అధికారిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనకు ఇరాన్ కారణమని యూఏఈ ఆరోపించింది. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ఆందోళనలు మరింత పెరిగాయి. నౌకల రాకపోకలు కూడా భారీగా తగ్గిపోయాయి.నౌకల రాకపోకలకు బ్రేక్యుద్ధానికి ముందు హర్ముజ్ జలసంధి ద్వారా రోజుకు 130 నుంచి 140 వరకు నౌకలు ప్రయాణించేవి. ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఒక దశలో రోజుకు కేవలం ఎనిమిది నౌకలు మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించినట్లు సమాచారం. అమెరికా గతంలో ఇరాన్ నౌకలు, పోర్టులపై ఉన్న దిగ్బంధాన్ని కొంతకాలం సడలించినప్పటికీ.. తర్వాత మళ్లీ పునరుద్ధరించింది. దీనివల్ల ఇరాన్‌కు కీలకమైన విదేశీ మారక ఆదాయంపై ప్రభావం పడుతోంది.ప్రపంచ చమురు మార్కెట్లో కలవరంఇరాన్ సంక్షోభం కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ఈ ఏడాది ప్రపంచ చమురు సరఫరా రోజుకు 43 లక్షల బ్యారెళ్ల మేర తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది దాదాపు 4 శాతానికి సమానం. అయితే మరోవైపు డిమాండ్ తగ్గడం, అమెరికా ముడిచమురు నిల్వలు పెరగడంతో చమురు ధరలు కొంత తగ్గాయి. గురువారం ధరలు 2 శాతానికి పైగా పడిపోయాయి.ట్రంప్‌పై దేశీయ ఒత్తిడిఇరాన్తో యుద్ధం ముగించాలని అమెరికాలోనూ ఒత్తిడి పెరుగుతోంది. పెరిగిన ఇంధన ధరలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగా కీలకంగా మారింది. ట్రంప్ ఈ మధ్య హర్ముజ్‌పై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని వ్యాఖ్యానించారు. అయితే ఇరాన్ దీనిని ఖండిస్తూ.. ఆంక్షలు ఎత్తివేయడం, తమ నిలిపివేసిన ఆస్తులను విడుదల చేయడం వంటి షరతులు నెరవేరే వరకు జలసంధిని పూర్తిగా తెరవబోమని స్పష్టం చేసింది.యుద్ధం కంటే ఆర్థిక దెబ్బే వ్యూహమా?ఇరాన్‌పై సైనిక చర్యలు చేపడతామని ట్రంప్ గతంలో హెచ్చరించినప్పటికీ.. ప్రస్తుతం ఆర్థిక ఒత్తిడిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా ఇప్పటికే ఇరాన్‌కు ఆయుధాల సరఫరాకు సహకరిస్తున్న వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు విధించింది. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని పొందకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని హెగ్సెత్ తెలిపారు.అబ్రహం లింకన్ నౌకపై వదంతులుహర్ముజ్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకపై సిబ్బంది మరణించారన్న వార్తలను అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఖండించింది. ఈ యుద్ధం ఆగదని.. తమ జీవితాలు ఇంతేనన్న వైరాగ్యంతో ఏడుగురు నేవీ సిబ్బంది బలవన్మరణానికి పాల్పడ్డారన్నది ఇరాన్ మీడియా కథనాల సారాంశం. అయితే అది తప్పు సమాచారమని అమెరికా తెలిపింది. 260 రోజులకు పైగా సముద్రంలో ఉన్నప్పటికీ అబ్రహం లింకన్ క్యారియర్ గ్రూప్ సిబ్బంది ధైర్యంగా ఉన్నారని CENTCOM పేర్కొంది. ఆగస్టు 3న సముద్రంలో పడిపోయిన ఒక నావికుడిని కూడా సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించింది. ఈ తరుణంలో.. లింకన్ నౌకను ఒడ్డుకు రప్పించి జార్జ్ వాషింగ్టన్ నౌకతో రిప్లేస్ చేశామని, ఇది సాధారణ చర్యేనని ప్రకటించుకుంది.హర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరు ఇప్పుడు అమెరికా–ఇరాన్ ఘర్షణలో కీలక అంశంగా మారింది. ఒకవైపు అమెరికా నిరవధిక బ్లాకేడ్, ఆర్థిక ఆంక్షలతో ఒత్తిడి పెంచుతుండగా.. మరోవైపు ఇరాన్ వ్యూహాత్మక మార్గాన్ని తన ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ పోరు ఎంతకాలం కొనసాగుతుందన్నది చమురు మార్కెట్లతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపనుంది. -
బర్త్ టూరిజంపై ట్రంప్ ఉక్కుపాదం.. అమెరికాలో బిడ్డను కంటే.. వీసా క్యాన్సిల్
-
‘ఆయనకేం.. చెత్తబుట్టలో కూడా దాక్కుంటారు!’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతకు సంబంధించిన రహస్య ఆపరేషన్ అంతర్జాతీయ చర్చకు దారితీసింది. టర్కీలోని అంకారాలో నాటో సదస్సు పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఆయన్ని మరో చిన్న విమానంలోకి మార్చిన ఘటనపై విశ్లేషణలు నడుస్తున్నాయి. అయితే ఈ ఘటనపై ఇరాన్ మీడియా తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ ఘటన అమెరికా అధ్యక్షుడి భద్రతా ఆందోళనలను బయటపెట్టిందంటూ వ్యాఖ్యానించింది.నాటో సదస్సు కోసం టర్కీ వెళ్లిన ట్రంప్ తిరుగు ప్రయాణం సందర్భంగా ఎయిర్‌ఫోర్స్ వన్‌పై క్షిపణి (shoulder-fired missile) దాడి ముప్పు ఉందన్న సమాచారంతో అమెరికా సీక్రెట్ సర్వీస్ అప్రమత్తమైంది. ముప్పు నమ్మదగినదిగా, తక్షణ చర్య అవసరమయ్యే స్థాయిలో ఉందని భావించి ఈ రహస్య మార్పిడి చేపట్టినట్లు సమాచారం.ఇరాన్ మీడియా వ్యంగ్యంఈ ఘటనను ఇరాన్ ప్రభుత్వ మీడియా తమ ప్రచారానికి ఉపయోగించుకుంది. అమెరికా అధ్యక్షుడు ఇరాన్ సైనిక శక్తికి భయపడుతున్నారనే సంకేతంగా ఈ విమాన మార్పిడిని చిత్రీకరించింది. ట్రంప్ తాజా “స్కాండల్”గా అభివర్ణిస్తూ.. ఇది ఆయనకు అవమానకర పరిస్థితి అని ఇరాన్ టీవీ వ్యాఖ్యాత పేర్కొన్నారు. ఇరాన్ దక్షిణాఫ్రికా రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ట్రంప్‌ను కేటరింగ్ బాక్స్‌లో దాచినట్లు చూపించే మీమ్‌ను కూడా షేర్ చేసింది. “త్వరలో చెత్త బుట్టలో దాచాల్సి వస్తుంది” అనే వ్యాఖ్యను జోడించింది.He will be hidden in a trash can before long. pic.twitter.com/ZTkAahNIKw— Iran Embassy SA (@IraninSA) August 11, 2026Brave American hero, or a coward hiding in a catering truck? pic.twitter.com/t1vcmrdcHw— Iran Embassy SA (@IraninSA) August 12, 2026కేటరింగ్ వాహనంలో రహస్య తరలింపుజూలై 8న అంకారా నుంచి బ్రిటన్‌కు బయలుదేరే సమయంలో ట్రంప్, ఆయనతో ఉన్న కొద్దిమంది సిబ్బందిని కేటరింగ్ ట్రక్కు ద్వారా పెద్ద విమానం నుంచి చిన్న ప్రభుత్వ విమానం C-32Aలోకి మార్చినట్లు నివేదికలు వెల్లడించాయి. అదే సమయంలో అసలు ఎయిర్‌ఫోర్స్ వన్ వేరుగా బయలుదేరింది. అందులో సీనియర్ అధికారులు, వైట్‌హౌస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఉన్నారు.ఈ ఆపరేషన్ వివరాలను తొలుత వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ట్రంప్ ప్రయాణ వివరాలు, ఆయన అంకారాలో ఉన్న హోటల్ అంతస్తు వరకు ఇరాన్‌కు తెలిసినట్లు అమెరికా అధికారులు ఆందోళన చెందారని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అలాగే ఇలాంటి డీకాయ్ ఆపరేషన్లు(మోసపూరిత భద్రతా వ్యూహం) సర్వసాధారణమేనని వ్యాఖ్యానించింది. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ఘటనఅమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్‌పై గతంలోనూ దాడి కుట్ర ఆరోపణలు వచ్చాయి. 2024లో ట్రంప్ అప్పటి అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో ఆయన హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై అమెరికా న్యాయశాఖ ఓ ఇరానియన్పై కేసు నమోదు చేసింది. అయితే ఆ ఆరోపణలను ఇరాన్ ఖండించింది.ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ఇజ్రాయెల్-అమెరికా.. ఇరాన్‌ల యుద్ధం మొదలైంది. అయితే గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులకు శాశ్వత ముగింపు కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో ఇప్పటికీ ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే విమాన మార్పిడి ఘటన రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.భద్రతా చర్యా? రాజకీయ ప్రచారమా?అమెరికా వర్గాల ప్రకారం ఇది అధ్యక్షుడి భద్రత కోసం తీసుకున్న ముందస్తు జాగ్రత్త మాత్రమే. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన సమాచారంతోనే డీకాయ్ ఆపరేషన్ చేపట్టింది. అయితే కేవలం ఒక ఏజెన్సీ సమాచారంతోనే.. అదీ ధృవీకరణ చేసుకోకుండానే అమెరికా భద్రతా బలగాలు ట్రంప్‌ను అలా తరలించారని తర్వాత తెలిసింది. ఏది ఏమైనా.. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇరాన్ మాత్రం దీన్ని అమెరికా బలహీనతకు సంకేతంగా చూపిస్తూ ప్రచారం చేస్తోంది. ట్రంప్‌ను రక్షించేందుకు చేపట్టిన అత్యంత రహస్య ఆపరేషన్ ఇప్పుడు ఇరు దేశాల మధ్య మాటల యుద్ధానికి కొత్త కారణంగా మారింది. -
ట్రంప్ ప్రెస్ సెక్రటరీ లెవిట్ రాజీనామా
వాషింగ్టన్: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ రాజీనామా చేశారు. ఆగస్టు నెలాఖరులో పదవి నుంచి వైదొలగనున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బయటినుంచి సలహాదారుగా కొనసాగుతారు. తన ఇద్దరు పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి వైట్‌హౌస్‌లోని ఈ ఒత్తిడితో కూడిన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఉన్నత స్థాయి పదవిని చేపట్టిన వారిలో అత్యంత చిన్న వయస్సు వ్యక్తైన లెవిట్, తన 18 నెలల పదవీకాలంలో ట్రంప్‌కు గట్టి విధేయురాలిగా పేరు సంపాదించారు. వైట్‌హౌస్ బ్రీఫింగ్ సమయంలో విలేకరులతో తీవ్ర వాగ్వాదాలకు దిగి నిత్యం వార్తల్లో నిలిచారు. 28 ఏళ్ల లెవిట్.. మే నెలలో తన రెండో బిడ్డకు జన్మనిచ్చారు. ప్రసూతి సెలవు తర్వాత ఇటీవలే వైట్‌హౌస్‌కు తిరిగి వచ్చారు. అయితే, కష్టమైన ఉద్యోగమైన ప్రెస్సెక్రటరీగా, తల్లిగా తన బాధ్యతలను సమతుల్యం చేసుకోవడం కష్టంగా మారిందని రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. రెండు బాధ్యతలకు సంపూర్ణంగా న్యాయం చేయలేనని గ్రహించానన్నారు. ప్రెస్ సెక్రటరీ పదవి తన జీవితంలో లభించిన గొప్ప గౌరవంగా అభివర్ణించారు. అయితే, లెవిట్ వైట్‌హౌస్ నుంచి నిష్క్రమించినా రాజకీయ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటారని, బయటి కమ్యూనికేషన్స్ సలహాదారుగా పనిచేస్తారని, ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ ఉద్యమంతో కలిసి పనిచేస్తారని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. లెవిట్ పనితీరును ప్రశంసిస్తూ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఆమెను వైట్ హౌస్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రెస్ సెక్రటరీల్లో ఒకరిగా అభివర్ణించారు. 2018 నుంచి 2024 ఎన్నికల ప్రచారం వరకు అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. ఇదిలా ఉండగా, జులైలో టర్కీలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశానికి హాజరైన ట్రంప్ భద్రతా చర్యలు మీడియాకు తెలిసిన సమయంలో లెవిట్ నిష్క్రమణ చర్చనీయాంశమవుతోంది. అధ్యక్షుడితో ప్రయాణించే జర్నలిస్టులకు ఆయన కదలికల గురించి తెలిసేలా చూసుకునే సాధారణ పద్ధతికి విరుద్ధంగా జరగడం ఆమె నిష్క్రమణకు కారణమైందనే చర్చ జరుగుతోంది.అతి పిన్న వయస్కురాలైన ప్రెస్ సెక్రటరీ2025 జనవరిలో 26 ఏళ్లవయసులో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా నియమితులైన అతి చిన్న వయస్కురాలిగా ఆమె నిలిచారు. వార్తా మాధ్యమాలతో వైట్ హౌస్ సంబంధాలను పునర్వ్యవస్థీకరించారు. వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చెంగ్‌తో కలిసి పనిచేస్తూ, ఏ జర్నలిస్టులకు అధ్యక్షుడిని కలిసే అవకాశం ఇవ్వాలనే నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయడంలో సహాయపడ్డారు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ రొటేటింగ్ ప్రెస్ పూల్‌ను నిర్ణయించే సాంప్రదాయ వ్యవస్థనుంచి తొలగించారు. బదులుగా, పరిపాలన పాడ్‌కాస్ట్‌లు, న్యూస్లెటర్లు, కొత్త డిజిటల్ మాధ్యమాలకు ఎక్కువ పాధాన్యత ఇచ్చారు. బ్రీఫింగ్ గదిలో ప్రత్యేకంగా న్యూ మీడియా సీటును సృష్టించారు. అయితే, ఈ కొత్త వ్యవస్థ సానుభూతి కవరేజీ మాధ్యమాలకు అనుకూలంగా వ్యవహరించే పరిపాలనకు అవకాశం కల్పిస్తుందని విమర్శించారు. -
ట్రంప్ విమాన ఎపిసోడ్లో భారీ ట్విస్ట్.. ఇజ్రాయెల్ వార్నింగ్‌పై కొత్త డౌట్?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టర్కీ నుంచి తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్న వేళ ఇజ్రాయెల్ ఇచ్చిన ఓ కీలక హెచ్చరిక అమెరికా భద్రతా వ్యవస్థను అప్రమత్తం చేసినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్ నుంచి ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంపై క్షిపణి దాడి జరిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అమెరికా అధికారులను హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో ట్రంప్‌ను అసలు విమానం నుంచి రహస్యంగా దించి.. మరో చిన్న మిలిటరీ జెట్‌లోకి తరలించారు. అయితే, ఇజ్రాయెల్ ఇచ్చిన హెచ్చరికపై అమెరికా నిఘా వర్గాల్లోనే అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కొత్త చర్చ ప్రారంభమైంది.టర్కీలో జరిగిన నాటో సదస్సు ముగిసిన తర్వాత ట్రంప్ తొలుత ఎయిర్‌ఫోర్స్ వన్‌గా భావించిన విమానంలోకి ఎక్కారు. అదే విమానంలో విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్, వైట్‌హౌస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు. అయితే ఇజ్రాయెల్ నుంచి వచ్చిన హెచ్చరిక నేపథ్యంలో సీక్రెట్ సర్వీస్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ట్రంప్‌ను ఎవరికీ తెలియకుండా మరో చిన్న సైనిక విమానంలోకి మార్చినట్లు ది వాషింగ్టన్ పోస్ట్, NPR వంటి అమెరికా మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇందుకోసం క్యాటరింగ్ వాహనాన్ని ఉపయోగించినట్లు సమాచారం. దీంతో మీడియా, కొంతమంది వైట్‌హౌస్ సిబ్బందికి తెలియకుండానే ట్రంప్ మరో విమానంలో అమెరికా బయలుదేరారు.అయితే ఇజ్రాయెల్ ఇచ్చిన హెచ్చరికపై అమెరికా నిఘా వర్గాల్లోనే అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం ఒక్క వర్గం నుంచే వచ్చిందని, దానికి బలమైన ఆధారాలు లేవని కొందరు అమెరికా అధికారులు భావించినట్లు కథనాలు చెబుతున్నాయి. CIA విశ్లేషకులు కూడా ఈ సమాచారాన్ని అధిక విశ్వసనీయత కలిగినదిగా పరిగణించలేదని సమాచారం. టర్కీ భద్రతా సంస్థలు కూడా ఈ అంశాన్ని పరిశీలించినప్పటికీ.. అంకారాలో ట్రంప్‌ను హత్య చేసేందుకు నిర్దిష్టమైన కుట్ర ఉన్నట్లు గుర్తించలేదని అమెరికా మీడియా పేర్కొంది. అయినప్పటికీ, ట్రంప్‌పై గతంలో జరిగిన హత్యాయత్నాలను దృష్టిలో పెట్టుకుని సీక్రెట్ సర్వీస్ ఎలాంటి రిస్క్ తీసుకోలేదని తెలుస్తోంది.మరోవైపు ట్రంప్ రహస్యంగా విమానం మార్చినా.. విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మాత్రం మొదటి విమానంలోనే కొనసాగారు. ట్రంప్ విమానం మార్చిన విషయం రూబియోకు తెలుసని ఓ అమెరికా అధికారి వెల్లడించారు. ఇక ఈ ఘటన ఇజ్రాయెల్ నిఘా సమాచారంపై కూడా చర్చకు దారితీసింది. ముప్పుపై అమెరికా నిఘా వర్గాలకు సందేహాలు ఉన్నప్పటికీ.. ఇజ్రాయెల్ హెచ్చరికను సీరియస్‌గా తీసుకుని ట్రంప్ ప్రయాణాన్నే మార్చడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు ఇరాన్ నుంచి నిజమైన ముప్పు ఉందా? లేక ముందుజాగ్రత్త చర్యగానే ఈ రహస్య ఆపరేషన్ చేపట్టారా? అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. -
విమానం కాదు! మన సారే సీక్రెట్‌గా వెళ్తున్నారు!
విమానం కాదు! మన సారే సీక్రెట్‌గా వెళ్తున్నారు! -
ట్రంప్ బిగ్ వార్నింగ్: హర్ముజ్ మాదే.. ఇక వదులుకోం!
పశ్చిమాసియా సంక్షోభంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ.. హర్ముజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గంపై పూర్తి నియంత్రణ అమెరికాదేనని.. ఇక మీదట దానిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. హర్ముజ్ జలసంధిపై అమెరికాకు సంపూర్ణ ఆధిపత్యం ఉందని, ఇరాన్ దీనిని ఎదుర్కొనే పరిస్థితిలో లేదని వ్యాఖ్యానించారు. అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని ‘‘ఉక్కు గోడ’’గా అభివర్ణించారు. అయితే తన పోస్ట్ చివర్లో ‘అల్లాహ్‌కు స్తుతి’ అంటూ ట్రంప్ ముగించారు. సాధారణంగా ఇస్లామిక్ సందర్భాల్లో వినిపించే ఈ పదబంధాన్ని ట్రంప్ ఇరాన్ అంశాన్ని ప్రస్తావిస్తూ వ్యంగ్య ధోరణిలో ఉపయోగించినట్లు భావిస్తున్నారు.వీక్ ఇరాన్!ఇరాన్‌కు నౌకాదళం, వైమానిక దళం బలహీనంగా ఉన్నాయని ట్రంప్ అంటున్నారు. ఇరాన్ సైనికులకు జీతాలు కూడా అందడం లేదని వ్యాఖ్యానించారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) తీవ్రంగా దెబ్బతిన్నదని, వెనక్కి తగ్గుతోందని పేర్కొన్నారు.తగ్గమంటున్న ఇరాన్ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ కొట్టిపారేసింది. హార్ముజ్ జలసంధిపై అమెరికా పూర్తి నియంత్రణ సాధించిందన్న వాదన వాస్తవాన్ని మార్చలేదని పేర్కొంది. హార్ముజ్ ఇంకా మూసివేసే ఉందని, ఇరాన్ పెట్టిన షరతులు అంగీకరించే వరకు దానిని తిరిగి తెరవబోమని పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ (PGSA) స్పష్టం చేసింది. అమెరికా అధికారులు పదేపదే చేస్తున్న ప్రకటనలు పరిస్థితిని మార్చలేవని వెల్లడించింది. అమెరికా నౌకాదళ దిగ్బంధం ఎత్తివేయడం, తమ ఆస్తులపై ఆంక్షలు తొలగించడం, యుద్ధ నష్టాలకు పరిహారం చెల్లించడం వంటి డిమాండ్లను ఇరాన్ ముందుకు తెస్తోంది. ఈ షరతులు నెరవేరే వరకు జలసంధి విషయంలో వెనక్కి తగ్గబోమని చెబుతోంది.ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావంప్రపంచ చమురు సరఫరాలో హార్ముజ్ జలసంధి అత్యంత కీలకమైన మార్గం. ఇక్కడ నెలకొన్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. నౌకల రాకపోకలు తగ్గడం, భద్రతా భయాలు పెరగడంతో చమురు ధరలు, రవాణా వ్యయాలపై ప్రభావం కనిపిస్తోంది.చర్చలపై ట్రంప్ వ్యూహంఇరాన్తో చర్చల విషయంలో ట్రంప్ భిన్నమైన వైఖరి ప్రదర్శిస్తున్నారు. తాము తక్కువ స్థాయిలో చర్చలు జరుపుతున్నామని, ఇది ఒక చెస్ ఆటలా ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందని, ద్రవ్యోల్బణం పెరిగిందని పేర్కొన్నారు. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మాత్రం అమెరికాతో నేరుగా చర్చలు జరగడం లేదని, మధ్యవర్తుల ద్వారా కేవలం సందేశాల మార్పిడి మాత్రమే జరుగుతోందని తెలిపారు. -
శత్రువులను ఏమార్చడానికే విమాన మార్పిడి
వాషింగ్టన్: నాటో శిఖరాగ్ర సమావేశం అనంతరం టర్కీ నుంచి నిష్క్రమించే సమయంలో విమానం మార్పును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. బెదిరింపుల నేపథ్యంలో శత్రువులను ఏమార్చడానికే మరో విమానంలో సీక్రెట్‌గా ప్రయాణించినట్లు అంగీకరించారు. అయితే బెదిరింపుల వివరాలేవీ వెల్లడించని ఆయన.. సీక్రెట్ సర్వీస్, అమెరికా సైన్యం నుంచి వచ్చిన సూచనలను తాను పాటించానని చెప్పారు. ‘నేను సీక్రెట్ సర్వీస్, సైన్యం ఆదేశాల మేరకు వెళ్తాను. వారు నన్ను వేరే విమానంలో, మరో ఫ్లైట్‌లో వెళ్లమన్నారు. వారు చెప్పినట్లే చేశాను. బహుశా బయట ఏదో ముప్పు పొంచి ఉందనుకున్నాను. దాని గురించి పెద్దగా అడగలేదు. నాకు చాలా బెదిరింపులు వస్తుంటాయి’అని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడికి బెదిరింపులు రావడం సాధారణమేనన్న ట్రంప్.. ‘ప్రాముఖ్యత ఉన్న ఏ అధ్యక్షుడికైనా చాలా బెదిరింపులు ఉంటాయని, ప్రాముఖ్యత లేని అధ్యక్షులకు బెదిరింపులుండవు. అత్యంత ప్రాముఖ్యత ఉన్న అధ్యక్షుడిని నేనే అనుకుంటున్నా. అయితే ప్రమాదాల గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదు. నేను దేని గురించీ చింతించను. ఏదేమైనా సరే, నా వైఖరి మీకు తెలుసు కదా?’అని వ్యాఖ్యానించారు. ట్రంప్ టర్కీ నుంచి బయలుదేరేటప్పుడు ఏమి జరిగింది జులైలో అంకారాలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశానికి అమెరికా అధ్యక్షుడు హాజరైనప్పుడు ఇరాన్ నుంచి హత్య బెదిరింపు రావడంతో ట్రంప్ రహస్యంగా విమానం మార్చారని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. ఖతార్ విరాళంగా ఇచ్చిన బోయింగ్ 747–8 విమానంలో ట్రంప్ టర్కీకి చేరుకున్నారు. అయితే, ట్రంప్‌ను లేదా ఆయన విమానాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉందని అమెరికా అధికారులకు నిఘా సమాచారం అందింది. వచ్చిన విమానంలోనే ట్రంప్ తిరిగి ప్రయాణించకూడదని సీక్రెట్ సర్వీస్ నిర్ణయించింది. అందుకు, ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం ఎక్కిన ట్రంప్‌ను ఆ విమానం నుంచి ఒక చిన్న ఎయిర్ ఫోర్స్ సి–32ఏ సైనిక జెట్‌లోకి మార్చారు. విమాన మార్పు విషయం బయటపడకుండా ఆయనను ఒక విమానాశ్రయ క్యాటరింగ్ వాహనంలో తీసుకెళ్లారు. వెంట ఉన్న జర్నలిస్టులు, వైట్ హౌస్ సిబ్బంది ఆ విమానంలోనే ట్రంప్ తమతోనే ప్రయాణిస్తున్నారని నమ్మారు. అయితే, ఈ ముప్పు గురించి తెలియకుండా, పాత్రికేయులను, కొంతమంది సిబ్బందిని ఆ విమానంలోనే ఉంచాలన్న నిర్ణయంపై కూడా ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ చర్య అధ్యక్షుడిని రక్షించడానికి ఉద్దేశించినప్పటికీ, దీని వెనుక ఉన్న భద్రతాపరమైన ఆందోళన గురించి తెలియజేయకుండా విమానంలోని వారిని ప్రమాదకరమైన స్థితిలో ఉంచిందని విమర్శలొచ్చాయి. -
ట్రంప్‌కే షాక్ ఇచ్చిందా? ఐయామ్ ప్రెగ్నెంట్ అంటూ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ మరోసారి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే ఈసారి కారణం ట్రంప్ తీసుకున్న నిర్ణయం కాదు.. ఆయన పక్కన నిల్చున్న ఓ మహిళ. ట్రంప్ కీలక ఆదేశంపై సంతకం చేస్తున్న సమయంలో ఆయన పక్కన కనిపించిన మహిళపై నెట్టింట రకరకాల ఊహాగానాలు వైరల్ అయ్యాయి. చివరకు ఆ మహిళే స్పందించి అసలు విషయం వెల్లడించాల్సి వచ్చింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో వ్యాక్సినేషన్ విధానానికి సంబంధించి కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేస్తున్నారు. ఆ సమయంలో ఓ మహిళ ఆయన పక్కన నిల్చున్నారు. వీడియోలో ఆమె పదేపదే తల ఊపుతూ, ఒక చేయిని తన పొట్టపై ఉంచుకున్నట్లు కనిపించింది. ఆ వెంటనే మత్తులోకి జారుకున్నట్లు కనిపించిన ట్రంప్.. హఠాత్తుగా అప్రమత్తం అయ్యారు. దీంతో కొందరు సోషల్ మీడియా యూజర్లు విచిత్రమైన వాదనలు మొదలుపెట్టారు.Claims she has a button fitted on her belly, and when she gets the nod that he’s asleep she moves her hand and presses a button that wakes him. They’re calling her The Zapper. No idea if it’s true but it *appears* to line up. pic.twitter.com/hgx4x6iQp6— Tim Brannigan (@tim_brannigan) August 11, 2026ట్రంప్‌కు షాక్ ఇచ్చిందా?..కొందరు నెటిజన్లు ఆమె చేతిలో ఏదో పరికరం ఉందని, ట్రంప్‌ను అప్రమత్తం చేసేందుకు విద్యుత్ షాక్ ఇచ్చిందంటూ ఊహాగానాలు ప్రచారం చేశారు. ఈ ప్రచారం వేగంగా వ్యాపించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆమె పేరు జేమీ లీగ్ ఫ్రాంక్లిన్ (Jayme Leagh Franklin). ఆమె అమెరికాలోని కన్జర్వేటివ్ మీడియా, లైఫ్‌స్టైల్ బ్రాండ్ ది కన్జర్వేటర్ (The Conservateur) వ్యవస్థాపకురాలు, సీఈవో.నెట్టింట వస్తున్న వింత ఆరోపణలపై స్పందించిన ఫ్రాంక్లిన్.. తాను గర్భవతినని వెల్లడించారు. తన పొట్టపై చేయి పెట్టుకోవడానికి కారణం అదే అని స్పష్టం చేశారు. “నేను కేవలం గర్భవతిని మాత్రమే” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ట్రంప్‌కు తాను షాకిచ్చి అప్రమత్తం చేశానంటూ తనపై వస్తున్న ఊహాగానాలను చూసి ఆశ్చర్యపోయినట్లు ఆమె తెలిపారు.ఆ కార్యక్రమంలో ఎందుకు ఉన్నారు?వైట్‌హౌస్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ట్రంప్, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్ల మధ్య ఫ్రాంక్లిన్ నిల్చున్నారు. బాలల వ్యాక్సినేషన్ సిఫార్సుల్లో మార్పులకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేస్తున్న సమయంలో ఈ వీడియో రికార్డ్ అయింది. ఆ తర్వాత ఫ్రాంక్లిన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ట్రంప్‌తో కలిసి ఓవల్ ఆఫీస్‌లో ఉండటం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.ఎవరు జేమీ లీగ్ ఫ్రాంక్లిన్?జేమీ లీగ్ ఫ్రాంక్లిన్ గతంలో ట్రంప్ పాలనలో పనిచేశారు. నార్త్ కరోలినాకు చెందిన ఆమె కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్క్లీ నుంచి 2020లో పట్టా పొందారు. 2019లో అమెరికా సెనేట్‌లో లెజిస్లేటివ్ ఇంటర్న్‌గా పనిచేసిన ఆమె.. 2020 ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కోయలిషన్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. అనంతరం ట్రంప్ తొలి వైట్‌హౌస్ పాలనలో కరస్పాండెన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆమె నడుపుతున్న ది కన్జర్వేటర్.. రాజకీయాలు, సంస్కృతి, విశ్వాసం, ఫ్యాషన్, బ్యూటీ అంశాలపై కంటెంట్ అందించే కన్జర్వేటివ్ మీడియా సంస్థగా కొనసాగుతోంది. అదీ అసలు ముచ్చట. -
వాళ్లు ఏం చెబితే నేను అదే చేస్తా: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణంలో జరిగిన రహస్య మార్పు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నాటో సదస్సు తర్వాత అంకారా నుంచి బయలుదేరే సమయంలో ఆయన్ని ఎవరి కంటా పడకుండా మరో విమానంలో తరలించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఎక్కినట్లు కనిపించేలా ఓ డమ్మీ ఆపరేషన్ నిర్వహించి.. అనంతరం ఓ క్యాటరింగ్ ట్రక్కు ద్వారా ట్రంప్‌ను మరో సైనిక విమానంలోకి తరలించినట్లు సమాచారం. అయితే ఈ ప్రచారంపై ట్రంప్‌కు తాజాగా ప్రశ్న ఎదురైంది. భద్రతా కారణాలతో ఎయిర్‌ఫోర్స్ వన్ నుంచి మరో విమానానికి తనను తరలించారన్న ప్రచారాన్ని ట్రంప్ ధృవీకరించారు. ‘‘విమానం మార్చాలన్న నిర్ణయం పూర్తిగా సీక్రెట్ సర్వీస్, సైనిక అధికారులదే. వాళ్లు ఏం చెబితే నేను అదే చేస్తా” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.“నేను సీక్రెట్ సర్వీస్, మిలిటరీ చెప్పినట్లే చేస్తాను. వారు వేరే విమానంలో వెళ్లాలని చెప్పారు. అది కూడా అంతే భద్రత కలిగిన విమానమే. వారు కోరడంతో నేను అలా చేశాను. వాళ్లు ఏం చెబితే నేను అదే చేస్తా” అని ట్రంప్ అన్నారు. అయితే ఆ ముప్పు ఇరాన్ నుంచే ఉందా? అనే విషయంపై ఆయన ధాటవేత ధోరణి ప్రదర్శించారు. తనపై ఉన్న ముప్పు వివరాలను తాను సీక్రెట్ సర్వీస్ వాళ్లను ఎక్కువగా అడగలేదని ఆయన చెప్పారు. “నాకు చాలా బెదిరింపులు వస్తుంటాయి” అని పేర్కొన్నారు.“మీకు తెలియని చాలా బెదిరింపులు నాకు ఉన్నాయి. ప్రభావవంతమైన అధ్యక్షులకు ఇలాంటి బెదిరింపులు సహజమే. దాదాపు ఆరు సంవత్సరాల కాలంలో నా కంటే ఎక్కువ చేసిన అధ్యక్షుడు ఎవరూ లేరని నేను భావిస్తున్నాను. నిజం చెప్పాలంటే నేను దేని గురించి ఆందోళన చెందను. ఏదైనా సరే.. నా వైఖరి అదే” అని అన్నారు.ఇరాన్‌ను నమ్మను: ట్రంప్ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై కూడా ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నేను ఇరాన్‌ను నమ్మను. వారు నాతో నిరంతరం అబద్ధాలు చెప్పారు. ఇరాన్‌ను నమ్మే చివరి వ్యక్తి నేనే” అని అన్నారు. హర్ముజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని పేర్కొంటూ.. అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.“ప్రస్తుతం హార్ముజ్ జలసంధిపై మాకు పూర్తి నియంత్రణ ఉంది. ఎవరైనా ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని ట్రంప్ అన్నారు.ఆనాడు జరిగింది ఇదే..టర్కీలోని అంకారా నుంచి బయలుదేరే సమయంలో ట్రంప్ తొలుత ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం ఎక్కారు. అయితే కొద్దిసేపటికే భద్రతా వ్యూహాన్ని మార్చిన అధికారులు ఆయనను రహస్యంగా మరో విమానంలోకి తరలించారు. సాధారణంగా విమానాలకు ఆహారం, సరఫరాలు తరలించే క్యాటరింగ్ ట్రక్‌ను ఉపయోగించి ట్రంప్‌ను విమానాశ్రయంలో మరో ప్రాంతానికి తీసుకెళ్లి, ఎయిర్‌ఫోర్స్ C-32A విమానంలో ఎక్కించారు.అదే సమయంలో అసలు ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం మాత్రం ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ ఆపరేషన్‌ను భద్రతా వర్గాలు ఒక “డీకాయ్ ఆపరేషన్”గా పరిగణిస్తున్నాయి. ఇరాన్‌కు చెందిన వర్గాల నుంచి ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకునే ముప్పు ఉందన్న నిఘా సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అగ్ర దేశాధినేతల ప్రయాణాలు ఎప్పుడూ అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య సాగుతుంటాయి. అయితే “దేనికీ భయపడను” అంటూ చెప్పుకునే ట్రంప్ విషయంలో ఇరాన్ ముప్పు నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ రహస్య విమాన మార్పు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నేతల్లో ఒకరిగా చెప్పుకునే ట్రంప్ ప్రయాణంలో జరిగిన ఈ “సీక్రెట్ స్విచ్” భవిష్యత్తులో అధ్యక్షుల రక్షణ వ్యూహాలకు మరో కొత్త అధ్యాయంగా మారుతుందా? అన్నదే ఆసక్తికరంగా మారింది. -
హర్ముజ్‌పై ఉడుంపట్టు.. ట్రంప్ సంచలన ప్రకటన
పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. ఇరాన్‌పై ఆంక్షలు, నౌకా దిగ్బంధం కొనసాగుతున్న వేళ.. అమెరికా దళాలు రంగంలోకి దిగాయి. హర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఓ కార్గో నౌకపై నిబంధనలు ఉల్లంఘించిందని చెబుతూ చర్యలు చేపట్టింది. దీంతో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో.. హర్ముజ్‌పై పూర్తి నియంత్రణ మాదే అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హర్ముజ్‌లో అమెరికా ఇప్పటిదాకా బ్లాకేడ్కే పరిమితం కాగా.. తాజా దాడులకూ దిగింది. ఇరాన్ పోర్టు వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన పనామా జెండా కలిగిన ఓ కార్గో నౌకను అమెరికా దళాలు అడ్డుకున్నాయి. హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో ఆ నౌక స్టీరింగ్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని రెండు హెల్ఫైర్ క్షిపణులు ప్రయోగించి దాన్ని నిర్వీర్యం చేశాయి. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అధికారంగా ప్రకటించింది. హర్ముజ్ దిగ్బంధాన్ని దాటేందుకు ప్రయత్నించిన వాణిజ్య నౌకల్లో ఇప్పటివరకు 55 నౌకలను దారి మళ్లించామని, మూడు నౌకలను నిలిపివేశామని, రెండు నౌకలను తనిఖీ చేశామని అమెరికా వెల్లడించింది. తద్వారా హర్ముజ్‌పై తాము పూర్తిగా పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉన్నట్లు సంకేతాలిచ్చింది. అయితే.. హర్ముజ్ మా నియంత్రణలోనే.. ట్రంప్ఇరాన్ పరిస్థితి “బాగానే సాగుతోంది” అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. హర్ముజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని, తమ నౌకాదళం అత్యంత శక్తివంతమైనదని పేర్కొన్నారు. ఇరాన్‌ను నమ్మలేమని, గతంలో ఆ దేశం పలుమార్లు అబద్ధాలు చెప్పిందని మండిపడ్డారు. అంతేకాదు ఇరాన్‌తో చర్చల్లో గత దశాబ్దాల ఘర్షణల్లో జరిగిన నష్టాలకు పరిహారం కోరుతామని ట్రంప్ ప్రకటించడం మరింత ఉద్రిక్తతకు కారణమైంది. అయితే ట్రంప్ తాజా ప్రకటనను ఇరాన్ ఎలా స్వీకరిస్తుందనేది చూడాలి.మా ఈ డిమాండ్లు.. నిబంధనలు నేరవేరాల్సిందే!: ఇరాన్హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలంటే అమెరికా తమ డిమాండ్లను అంగీకరించాలని ఇరాన్ స్పష్టం చేసింది. అవి..అమెరికా యుద్ధ చర్యలు, బెదిరింపులకు పూర్తిగా ముగింపుఇరాన్ పోర్టులపై నౌకా దిగ్బంధం ఎత్తివేతఅమెరికా సైనిక బలగాల ఉపసంహరణయుద్ధ నష్టాలకు పరిహారంఆంక్షల తొలగింపుస్తంభింపజేసిన ఇరాన్ నిధుల విడుదలప్రాంతీయ కాల్పుల విరమణ.. ఈ షరతులు నెరవేరే వరకు హర్ముజ్ మూసివేత కొనసాగుతుందని ఇరాన్ జాతీయ భద్రతా మండలి అధికారి మొహ్సెన్ రెజాయి తెలిపారు.ఒమన్ మధ్యవర్తిత్వం.. చర్చలు తుది దశలో?అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు లేవని ఇరాన్ చెబుతున్నప్పటికీ.. ఒమన్ మధ్యవర్తిత్వంతో హర్ముజ్ భవిష్యత్ నిర్వహణపై చర్చలు జరుగుతున్నాయి. నౌకల రాకపోకల కోసం కొత్త మార్గాలపై ఒప్పందం చివరి దశకు చేరుకుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తెలిపారు. ఖతార్ కూడా ఇరాన్, ఒమన్ మధ్య చర్చలు గణనీయమైన పురోగతిలో ఉన్నాయని పేర్కొంది.90 డాలర్లకు చేరువలో.. “ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన ఈ మార్గం ద్వారా గతంలో చమురు, ఎల్ఎన్జీ రవాణాలో దాదాపు ఐదో వంతు సాగేది. అయితే సంక్షోభంతో ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు దాదాపు 90 డాలర్లకు చేరువైంది. హర్ముజ్ మార్గం ద్వారా గతంలో ప్రపంచంలోని చమురు, ఎల్ఎన్జీ సరఫరాలో ఐదో వంతు రవాణా అయ్యేది.బాబ్ అల్ మందెబ్‌లో హౌతీ దాడి.. నలుగురు మృతిమరోవైపు ఎర్ర సముద్రంలోని బాబ్ అల్ మందెబ్ జలసంధిలో హౌతీలు వాణిజ్య నౌకపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు పాకిస్థానీలు, ఒక ఇండోనేషియా పౌరుడు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. సౌదీ సైనిక సామగ్రిని తరలిస్తున్న నౌకను లక్ష్యంగా చేసుకున్నామని హౌతీలు ప్రకటించారు. అయితే ఆ నౌక సౌదీ యాజమాన్యంలో లేదని, ఈజిప్టు కంపెనీలకు చెందినదని సమాచారం.అటు.. వెస్ట్ బ్యాంక్‌లో ఉద్రిక్తతలుఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోనూ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 76 మంది పాలస్తీనియన్లు, వారిలో 18 మంది చిన్నారులు మరణించారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.ప్రపంచం చూపు హర్ముజ్‌పైనే!హర్ముజ్ జలసంధిపై అమెరికా, ఇరాన్ వైఖరులు పరస్పర విరుద్ధంగా కొనసాగుతున్న వేళ.. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఉత్కంఠగా మారింది. ఒకవైపు అమెరికా పూర్తి నియంత్రణ తమదేనని చెబుతుండగా.. మరోవైపు తమ షరతులు నెరవేరే వరకు హర్ముజ్ తెరవబోమని ఇరాన్ స్పష్టం చేస్తోంది.చర్చలు పురోగమిస్తాయా? లేదంటే ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా? అన్నదే ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న అతిపెద్ద ప్రశ్న. హర్ముజ్ సంక్షోభం పరిష్కారం కాకపోతే.. దాని ప్రభావం చమురు ధరల నుంచి అంతర్జాతీయ వాణిజ్యం వరకు పడే అవకాశం ఉంది. -
ఇరాన్ నుంచి ముప్పు.. ఏమార్చి కేటరింగ్ ట్రక్కులో ట్రంప్ ప్రయాణం!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రత చుట్టూ ఎప్పుడూ అత్యంత కట్టుదిట్టమైన వలయం ఉంటుంది. అయితే, కొన్ని సందర్భాల్లో భద్రతా ముప్పులు, నిరసనలు లేదా వ్యక్తిగత కారణాల వల్ల ఆయన అనుకోని రీతుల్లో, అత్యంత గోప్యంగా ప్రయాణించాల్సి వచ్చింది. వెనుక ద్వారాల నుంచి దొంగచాటుగా వెళ్లడం, భూగర్భ బంకర్లోకి మారడం, బుల్లెట్ ప్రూఫ్ గోల్ఫ్ కార్ట్‌లలో తరలింపుతో పాటు.. ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉండటంతో తాజాగా ఎయిర్‌పోర్టులో కేటరింగ్ ట్రక్కులో ప్రయాణించిన ఉదంతం తీవ్ర చర్చనీయాంశమైంది.గత నెలలో టర్కీలోని అంకారాలో జరిగిన నాటో సదస్సుకు హాజరైన ట్రంప్‌పై ఇరాన్ నుంచి హత్యాయత్నం ముప్పు పొంచి ఉందన్న నిఘా సమాచారంతో భద్రతా సిబ్బంది వినూత్న వ్యూహాన్ని అమలు చేశారు. విలేకరుల సమక్షంలో ట్రంప్ పాత బోయింగ్ 747 విమానం ఎక్కారు. అయితే, విమానం లోపల నుంచి ఆయన్ను అత్యంత రహస్యంగా ఒక 'కేటరింగ్ ట్రక్'లోకి ఎక్కించి విమానాశ్రయం గుండా మరో చిన్న ఎయిర్‌ఫోర్స్ సీ-32ఏ విమానానికి తరలించారు.ట్రంప్ అందులోనే ఉన్నాడనే భ్రమ కల్పించడానికి బ్రిటన్‌కు వెళ్లింది. అందులోని రిపోర్టర్లు, సిబ్బందిని కూడా కిటికీల కర్టెన్లు మూసేయాలని ఆదేశించారు. ట్రంప్ వేరే విమానంలో సురక్షితంగా బ్రిటన్ చేరుకున్నారు. కొన్ని వారాల తర్వాత గానీ ఈ విషయం బయటకు రాలేదు.2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా శాన్ఫ్రాన్సిస్కోలోని హయత్ రీజెన్సీ హోటల్లో కాలిఫోర్నియా రిపబ్లికన్ సమావేశానికి ట్రంప్ హాజరుకావాల్సి వచ్చింది. వందలాది మంది నిరసనకారులు ప్రధాన మార్గాన్ని దిగ్బంధించడంతో ఆయన కాన్వాయ్ దారి మళ్లించారు. హైవే 101 నుంచి దిగి, హోటల్ వెనుక ఉన్న తక్కువ ఎత్తున్న రక్షణ గోడను ట్రంప్ స్వయంగా దూకి లోపలికి వెళ్లారు. వేదికపైకి చేరుకున్నాక నేను నా జీవితంలో ఇంత కష్టపడి ఎప్పుడూ వేదికపైకి రాలేదు అంటూ స్వయంగా ఆయనే చమత్కరించారు.జార్జ్ ఫ్లాయిడ్ మృతి తర్వాత అమెరికా వ్యాప్తంగా చెలరేగిన నిరసనలు వైట్ హౌస్ సరిహద్దుల వరకు చేరాయి. ఆందోళనకారులు వైట్ హౌస్ బారికేడ్లపై వస్తువులు విసురుతుండటంతో సీక్రెట్ సర్వీస్ విభాగం ట్రంప్‌ను వైట్ హౌస్ కింద ఉన్న అత్యవసర భూగర్భ బంకర్లోకి తరలించింది. ఆయన దాదాపు గంటపాటు అక్కడే ఉన్నారు. విపక్షాలు ఆయన్ను బంకర్ బాయ్ అని ఎగతాళి చేయగా.. తాను దాక్కోవడానికి వెళ్లలేదని, కేవలం బంకర్‌ను పరిశీలించడానికే వెళ్లానని ట్రంప్ వివరణ ఇచ్చారు.సెప్టెంబర్ 15, 2024న వెస్ట్ పామ్ బీచ్‌లోని తన గోల్ఫ్ క్లబ్లో ట్రంప్ ఆడుతుండగా, ఫెన్సింగ్ పొదల్లోంచి తుపాకీ గురిపెట్టిన దుండగుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గుర్తించి కాల్పులు జరిపారు. వెంటనే ఏజెంట్లు ట్రంప్‌కు రక్షణ వలయంగా ఏర్పడి, స్టీల్ రీఇన్ఫోర్స్డ్తో తయారుచేసిన బుల్లెట్ ప్రూఫ్ 'ఫాస్ట్ గోల్ఫ్ కార్ట్'లోకి ఆయన్ను ఎక్కించి క్లబ్‌హౌస్‌కు సురక్షితంగా తరలించారు. ఈ సంఘటనపై స్పందించిన ట్రంప్, నాలుగైదు బుల్లెట్ శబ్దాలు వినిపించాయి.. చిట్టచివరి షాట్ కొట్టాలని ఉండేది కానీ, వెంటనే అక్కడి నుంచి సురక్షితంగా బయటపడటమే మంచిదనిపించిందిఅని సరదాగా పేర్కొన్నారు.అధ్యక్షుడిగా గెలిచిన వారం రోజులకే అంటే నవంబర్ 2016 భద్రతా ప్రెస్ బృందానికి సమాచారం ఇవ్వకుండా ట్రంప్ డిన్నర్‌కు వెళ్లారు. ఆ రాత్రి ఆయన బయటకు రారని అధికారికంగా ప్రకటించిన తర్వాత, ఆయన తన కుటుంబంతో కలిసి రహస్యంగా మాన్‌హట్టన్‌లోని '21 క్లబ్' రెస్టారెంట్‌కు వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న రిపోర్టర్లు ఆయనను కవర్ చేయడానికి పరుగులు తీశారు. అధ్యక్షుడికి అత్యవసర రక్షణ కవరేజ్ వ్యవస్థ ఉన్నప్పటికీ, వారికి తెలియకుండా డిన్నర్‌కు వెళ్లడం ఆ సమయంలో తీవ్ర చర్చకు దారితీసింది. -
అమెరికాలో కల్లోలం.. వాటర్ సిస్టమ్స్‌పై సైబర్ దాడులు
అమెరికాలో కీలక మౌలిక వసతులపై సైబర్ దాడుల ముప్పు మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి హ్యాకర్ల లక్ష్యంగా మారింది తాగునీటి సరఫరా వ్యవస్థలు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వాటర్ సిస్టమ్స్, వేస్ట్‌వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లపై జరిగిన సైబర్ దాడులు భద్రతా వర్గాలను అప్రమత్తం చేశాయి. ఈ దాడుల వెనుక ఎవరు ఉన్నారు? అని అమెరికా దర్యాప్తు సంస్థలు పరిశీలన ప్రారంభించాయి.జూలై చివరి వారంలో మిన్నెసోటాలోని 30కి పైగా స్థానిక నీటి సరఫరా వ్యవస్థలు సమన్వయ సైబర్ దాడులకు గురయ్యాయి. ఆ తర్వాత ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI), సైబర్ భద్రతా సంస్థలు రంగంలోకి దిగాయి. కనీసం ఏడు రాష్ట్రాల్లోని నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి వ్యవస్థల్లోకి హ్యాకర్లు చొరబడినట్లు అధికారులు గుర్తించారు.అమెరికాలోని నీటి సరఫరా వ్యవస్థలు కోట్లాది మంది ప్రజల రోజువారీ జీవితంతో ముడిపడి ఉన్నాయి. సరస్సులు, నదులు, భూగర్భ జలాల నుంచి సేకరించిన నీటిని శుద్ధి చేసి.. పైపుల ద్వారా ఇళ్లు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ ఆధునిక సాంకేతిక వ్యవస్థలపై ఆధారపడి ఉంటుంది.నీటి ఒత్తిడి, పంపుల పనితీరు, రసాయనాల మోతాదు వంటి అంశాలను నియంత్రించే ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్లు (PLCs) ఈ వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇప్పుడు ఇవే పరికరాలు హ్యాకర్ల టార్గెట్‌గా మారాయి. ఇంటర్నెట్కు అనుసంధానమైన కంట్రోల్ వ్యవస్థల్లోని లోపాలను గుర్తించి వాటిలోకి ప్రవేశించేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.బలహీనమైన పాస్వర్డ్లు, భద్రతా లోపాలు, అప్డేట్ చేయని సాఫ్ట్వేర్లను ఉపయోగించుకుని హ్యాకర్లు వ్యవస్థల్లోకి చొరబడే అవకాశం ఉంటుంది. ఒకసారి నియంత్రణ వ్యవస్థలపై పట్టు సాధిస్తే.. పాస్‌వర్డ్‌లను మార్చడం, ఆదేశాల్లో మార్పులు చేయడం, పరికరాల పనితీరును ప్రభావితం చేయడం వంటి చర్యలకు పాల్పడే ప్రమాదం ఉంటుంది.ఈ దాడుల వెనుక ఇరాన్ హ్యాకర్ల పాత్ర ఉందా? అనే అంశంపై అమెరికా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇరాన్‌కు అనుబంధంగా పనిచేసే సైబర్ గ్రూపులు గతంలో కూడా కీలక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకున్న ఘటనలు ఉన్నాయని అధికారులు గుర్తుచేస్తున్నారు. అయితే ఇప్పటివరకు అమెరికా ప్రభుత్వం అధికారికంగా ఏ దేశాన్నీ ఈ దాడులకు బాధ్యుడిగా ప్రకటించలేదు. మరోవైపు ఇరాన్ పేరుతో మరో దేశం లేదంటే గ్రూప్ ఉద్దేశపూర్వకంగా దాడులు చేసి దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందా? అనే కోణంలోనూ అధికారులు పరిశీలిస్తున్నారు.ప్రస్తుతం జరిగిన దాడుల వల్ల తాగునీరు కలుషితమైనట్లు.. ప్రజల ఆరోగ్యానికి ప్రత్యక్ష ముప్పు ఏర్పడినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా నీటి వ్యవస్థలను మాన్యువల్‌గా నిర్వహించాల్సి వచ్చింది. కొన్ని చోట్ల ప్రజలకు నీటిని మరిగించి వినియోగించాలని సూచనలు కూడా ఇచ్చారు.సైబర్ భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇలాంటి దాడుల అసలు లక్ష్యం కేవలం నీటి సరఫరాను నిలిపివేయడం మాత్రమే కాకపోవచ్చు. ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకాన్ని దెబ్బతీయడం కూడా సైబర్ యుద్ధ వ్యూహాల్లో భాగమని వారు హెచ్చరిస్తున్నారు.ఈ ఘటనల నేపథ్యంలో అమెరికా నీటి సరఫరా సంస్థలు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేస్తున్నాయి. నీటి వ్యవస్థలను నేరుగా ఇంటర్నెట్కు అనుసంధానం చేయకుండా చూడటం, బలమైన ఫైర్‌వాల్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం, మల్టీ-లేయర్ అథెంటికేషన్ అమలు చేయడం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే డిఫాల్ట్ పాస్‌వర్డ్‌లను మార్చడం, అవసరం లేని రిమోట్ యాక్సెస్‌లను నిలిపివేయడం, అత్యవసర పరిస్థితుల్లో వ్యవస్థలను మాన్యువల్‌గా నడిపించే సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.డిజిటల్ యుగంలో యుద్ధాలు కేవలం సరిహద్దుల్లోనే జరగవని.. విద్యుత్, నీరు, రవాణా వంటి కీలక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే సైబర్ దాడులు భవిష్యత్తులో మరింత పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని తాజా ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. -
ట్రంప్ నకు ఇరాన్ ముప్పు టర్కీలో ట్రంప్ సీక్రెట్ ఆపరేషన్
-
యుద్దానికి ముగింపు పలకాలంటే నష్టపరిహారం ఇవ్వాల్సిందే
-
‘అతడి జోలికి వెళ్లొద్దు’.. ఫిఫాకు ట్రంప్ వార్నింగ్!
ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో పదవి నుంచి తప్పించాలని ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనకు మద్దతుగా నిలవడం ఆసక్తి కలిగిస్తోంది. ఇన్ఫాంటియానోను పదవి నుంచి తప్పించాలని ప్రపంచ ఫుట్‌బాల్ నియంత్రణ సంస్థ నిర్ణయం తీసుకుంటే అంతకంటే పెద్ద పొరపాటు ఇంకేమి ఉండదని తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో ఘాటుగా వ్యాఖ్యానించారు.ఫిఫా వరల్డ్ కప్ వంటి ప్రపంచ స్థాయి టోర్నమెంట్ల వాణిజ్య హక్కులను నిర్వహించేందుకు 20 బిలియన్ డాలర్ల విలువైన ఒక కొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేయాలని ఫిఫా యోచిస్తోంది. ఇందులో 20 శాతం వాటాను ప్రైవేట్ పెట్టుబడిదారులకు విక్రయించాలని ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రణాళికను విరమించుకునేంత వరకు ‘ఫిఫా’ అన్నీ టోర్నమెంట్లను బహిష్కరించనున్నట్లు యూరోపియన్ సాకర్ సంస్థ హెచ్చరించింది. ఫిఫా అధ్యక్ష పదవి నుంచి కూడా ఇన్ఫాంటినో తప్పుకోవాలనే డిమాండ్లు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ అతడికి మద్దతు పలకడం గమనార్హం.ఇక ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో ఇలా రాసుకొచ్చారు. "ఏ కారణం చేతనైనా, అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినోను తొలగించాలని ఫీఫా కనీసం ఆలోచించినా అది ఒక ఘోరమైన పొరపాటే అవుతుంది. ఆయన అద్భుతమైన వ్యక్తి. ఇప్పటివరకు నిర్వహించిన ప్రపంచ కప్లలోకెల్లా అత్యంత విజయవంతమైన దానిని నాలుగుసార్లు నిర్వహించారు. ఆయన లేకపోయుంటే ఇంత లాభదాయకంగా ఉండేది కాదేమో! ఈ విషయంపై శ్రద్ధ వహించినందుకు ధన్యవాదాలు’’ అని ట్రంప్ పేర్కొన్నారు.2016 నుంచి గియాని ఇన్ఫాంటినో ఫిఫా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. 2019, 2023 ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన... వచ్చే ఏడాది మార్చిలో మొరాకో వేదికగా జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో చివరిసారి పోటీ చేయనున్నారు. ‘ఫిఫా’లో మొత్తం 211 సభ్య దేశాలు ఉండగా... యూరప్, దక్షిణామెరికాలోని 90 దేశాలతో పాటు ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్యలోని 46 దేశాలు కూడా ఇన్ఫాంటినో ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఎన్నికలపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది.Read: ఆ ముగ్గురి నుంచి ఫోన్‌కాల్.. అందరికీ ఒకటే సమాధానం! -
అయ్యో ట్రంప్.. మరీ ఇలానా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రత కోసం చేపట్టిన ఓ అసాధారణ ఆపరేషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టర్కీ రాజధాని అంకారాలో జరిగిన నాటో సదస్సుకు హాజరైన ట్రంప్.. అక్కడి నుంచి బయలుదేరే సమయంలో కనిపించిన దృశ్యాల వెనుక ఓ రహస్య వ్యూహం ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.కెమెరాల ముందు ట్రంప్ పాత ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ఎక్కినట్లు కనిపించారు. కానీ అది కేవలం డీకాయ్ (మభ్యపెట్టే ఏర్పాటు) మాత్రమేనని.. అసలు ఆయనను ఓ చిన్న సైనిక విమానంలోకి రహస్యంగా తరలించినట్లు సమాచారం. ఈ మొత్తం ఆపరేషన్‌లో ఓ సాధారణ క్యాటరింగ్ ట్రక్ కీలక పాత్ర పోషించడం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది.టర్కీ నుంచి బయలుదేరే ముందు ట్రంప్ పాత ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ప్రయాణిస్తారని అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ సమయంలో ఇరాన్ నుంచి ముప్పు ఉందన్న నిఘా సమాచారంతో భద్రతా అధికారులు చివరి నిమిషంలో ప్రణాళిక మార్చినట్లు తెలుస్తోంది.ట్రంప్ ముందుగా ఎయిర్‌ఫోర్స్ వన్‌లోకి ఎక్కినట్లు కనిపించిన తర్వాత.. విమానం మరో వైపు నుంచి క్యాటరింగ్ ట్రక్ దగ్గరకు వెళ్లింది. సాధారణంగా విమానాలకు ఆహారం, ఇతర సరఫరాలు అందించే ఆ వాహనాన్ని ఈసారి భద్రతా వ్యూహంలో భాగంగా ఉపయోగించారు. ట్రక్ సహాయంతో ట్రంప్, ఆయన సిబ్బందిని ఎవరికీ కనిపించకుండా బయటకు తీసుకొచ్చి C-32A సైనిక విమానంలోకి తరలించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.డీకాయ్‌గా పాత విమానం.. అసలు ప్రయాణం మరో విమానంలోఈ వ్యూహం కారణంగా మీడియా ప్రతినిధులు, కొంతమంది సిబ్బంది కూడా ట్రంప్ పాత ఎయిర్‌ఫోర్స్ వన్‌లోనే ప్రయాణిస్తున్నారని భావించారు. కానీ ఆయన మాత్రం C-32A విమానంలో బ్రిటన్‌కు చేరుకున్నట్లు సమాచారం.ఎందుకీ రహస్య ఆపరేషన్?ట్రంప్ టర్కీలో ఉన్న సమయంలో ఇరాన్ అనుబంధ వర్గాల నుంచి ముప్పు ఉందన్న నిఘా సమాచారం అందినట్లు నివేదికలు తెలిపాయి. అధ్యక్షుడి ప్రయాణ మార్గం, విమానం వివరాలు బయటకు వెళ్లకుండా ఉండేందుకు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.ఖతార్ విమానంపై మళ్లీ చర్చఈ ఘటనతో ఖతార్ అందించిన కొత్త బోయింగ్ 747-8 విమానం భద్రతా సామర్థ్యాలపై మరోసారి చర్చ మొదలైంది. అయితే వైట్‌హౌస్ మాత్రం అధ్యక్షుడి రక్షణ కోసం అత్యున్నత భద్రతా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.అగ్రరాజ్య అధ్యక్షుడి ప్రయాణం(అందునా ట్రంప్).. రెండు విమానాలు.. రహస్య మార్గం.. ఓ క్యాటరింగ్ ట్రక్.. ట్రంప్ భద్రతా ఆపరేషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చగా మారింది. -
రివర్స్ రీయింబర్స్మెంట్.. ట్రంప్ నయా గేమ్!
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి చుట్టూ మొదలైన వివాదం ఇప్పుడు దౌత్యపరమైన ఆధిపత్య పోరుగా మారింది. ఐదు నెలలపాటు కొనసాగిన ఘర్షణల తర్వాత పరిస్థితులు కొంత చల్లబడతాయని భావిస్తున్న సమయంలో.. ఇరు దేశాలు పరస్పరం కొత్త డిమాండ్లు, ఆరోపణలతో ముందుకు రావడం అంతర్జాతీయ ఆందోళనలకు కారణమవుతోంది.యుద్ధంలో తమకు జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించాలని, అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ డిమాండ్లను తిరస్కరించడమే కాకుండా.. గత ఘర్షణల్లో అమెరికా పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోవడానికి ఇరాన్ బాధ్యత వహించాలని, తమ నష్టాలకు టెహ్రాన్ నుంచే పరిహారం కోరుతామని స్పష్టం చేశారు.హర్ముజ్ తెరవాలంటే ఇరాన్ షరతులుహర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన వైఖరిని కఠినంగా వెల్లడించింది. అమెరికా చర్యల కారణంగా తమ దేశానికి జరిగిన నష్టాలను భర్తీ చేయాలని, అంతర్జాతీయ ఆంక్షల నుంచి ఉపశమనం కల్పించాలని కోరుతోంది. యుద్ధ పరిస్థితుల్లో నిలిచిపోయిన తమ ఆస్తులను విడుదల చేయాలని, మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించాలని కూడా టెహ్రాన్ డిమాండ్ చేస్తోంది.ఈ డిమాండ్లపై స్పష్టమైన హామీ లభించే వరకు హర్ముజ్ విషయంలో తమ వైఖరిలో మార్పు ఉండకపోవచ్చనే సంకేతాలను ఇరాన్ ఇస్తోంది. హర్ముజ్ జలసంధి తమ భద్రత, ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశమని టెహ్రాన్ చెబుతోంది.ట్రంప్ ఎదురుదాడి.. ‘పరిహారం మాకే రావాలి’ఇరాన్ డిమాండ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. యుద్ధంలో అమెరికన్ల ప్రాణ నష్టానికి, గత ఘర్షణల్లో జరిగిన నష్టాలకు ఇరాన్ బాధ్యత వహించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ నుంచి పరిహారం కోరుతామని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌కు అమెరికా పరిహారం చెల్లించాలన్న డిమాండ్‌ను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. గతంలో ఇరాన్ చర్యల వల్ల అమెరికా ఎదుర్కొన్న నష్టాలను ప్రస్తావిస్తూ.. బాధ్యత టెహ్రాన్పైనే ఉందని వాదిస్తున్నారు.ఆంక్షలతో ఒత్తిడి పెంచాలన్న అమెరికా వ్యూహంప్రస్తుతం ఇరాన్‌పై సైనిక చర్యల కంటే ఆర్థిక ఒత్తిడి పెంచడంపైనే అమెరికా దృష్టి పెట్టిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు తీవ్రతరం అయితే ఇరాన్ చర్చలకు రావాల్సి వస్తుందని ట్రంప్ వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఇరాన్ మాత్రం అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని చెబుతోంది. ఆంక్షలు తమను బలహీనపర్చేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నమని ఆరోపిస్తూ.. తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని మార్గాల్లో పోరాడతామని స్పష్టం చేస్తోంది.ప్రపంచానికి ఎందుకు కీలకం హర్ముజ్?పర్షియన్ గల్ఫ్‌ను ఒమన్ గల్ఫ్‌తో కలిపే సన్నని సముద్ర మార్గమే హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో ఇది అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటి. మధ్యప్రాచ్యం నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు వెళ్లే భారీ స్థాయి ఇంధన సరఫరా ఈ మార్గంపైనే ఆధారపడి ఉంటుంది. హర్ముజ్‌లో ఏదైనా అంతరాయం ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇంధన సరఫరాలో అనిశ్చితి ఏర్పడటంతో పాటు అంతర్జాతీయ వాణిజ్యంపైనా ప్రభావం పడే ప్రమాదం ఉంది. అందుకే ఇరాన్–అమెరికా వివాదంలో హర్ముజ్ జలసంధి కేంద్ర బిందువుగా మారింది.ట్రంప్‌పై ఎన్నికల ఒత్తిడి.. ఇరాన్‌కు కలిసొస్తుందా?అమెరికాలో రాజకీయ పరిణామాలు కూడా ఈ సంక్షోభంపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్‌తో దీర్ఘకాలిక ఘర్షణ కొనసాగితే దేశీయంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మాజీ అమెరికా అధికారి చార్లెస్ కుప్చాన్ అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ఒత్తిడి కారణంగా చర్చల్లో ఇరాన్‌కు కొంత వ్యూహాత్మక ఆధిక్యం లభించే అవకాశం ఉంది. అయితే అదే సమయంలో టెహ్రాన్ చేస్తున్న డిమాండ్లు అమెరికాకు అంగీకరించలేని స్థాయిలో ఉన్నాయని ఆయన విశ్లేషించారు.కొనసాగుతున్న ఉద్రిక్తతలుఇరాన్–అమెరికా వివాదం ప్రభావం పశ్చిమాసియాలో ఇతర ప్రాంతాలపైనా కనిపిస్తోంది. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండగా.. యెమెన్‌లో హౌతీ దళాల చర్యలు పరిస్థితులను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. గాజా శాంతి ప్రయత్నాలపైనా అనిశ్చితి కొనసాగుతోంది.హర్ముజ్ తాళం ఎవరి చేతిలో?ప్రస్తుతం అమెరికా–ఇరాన్ మధ్య అసలు పోరు కేవలం పరిహారం, ఆంక్షల అంశానికే పరిమితం కాలేదు. ఇది మిడిల్ఈస్ట్లో ఆధిపత్యం, భద్రత, ప్రపంచ ఇంధన సరఫరాలపై ప్రభావం చూపే పెద్ద సంక్షోభంగా మారింది.ఇరాన్ తన డిమాండ్లపై పట్టుబడుతుండగా.. ట్రంప్ కూడా వెనక్కి తగ్గే సూచనలు ఇవ్వడం లేదు. చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందా? లేదంటే హర్ముజ్ జలసంధి మరోసారి ప్రపంచ సంక్షోభానికి కేంద్రంగా మారుతుందా? అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న. -
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ షాక్.. ఇక పరిహారం కూడా చెల్లించాల్సిందే!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. భవిష్యత్‌లో జరిగే శాంతి చర్చల్లో భాగంగా.. దశాబ్దాలుగా ఇరాన్ మద్దతుతో జరిగిన దాడులు, ఘర్షణల్లో అమెరికన్లకు జరిగిన నష్టానికి ఇరాన్ నుంచి నష్టపరిహారం కోరాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో ఆయన ఓ పోస్ట్ చేశారు.గత ఐదు నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇరాన్‌కు జరిగిన నష్టానికి ఆ దేశం పరిహారం కోరుతున్న విషయాన్ని ప్రస్తావించిన ట్రంప్.. అదే తరహాలో అమెరికా కూడా ఇరాన్ నుంచి పరిహారం కోరడం ‘ఆసక్తికరమైన ఆలోచన’ అని పేర్కొన్నారు. ఇరాన్ కోరుతున్న నష్టపరిహారం అంశం అమెరికాతో జరిగిన చర్చల్లో ఇప్పటివరకు ప్రస్తావనకు రాలేదని ఆయన అన్నారు.దశాబ్దాల నాటి ఘటనల ప్రస్తావనతన నష్టపరిహారం డిమాండ్‌కు మద్దతుగా గతంలో జరిగిన పలు ఘటనలను ట్రంప్ ప్రస్తావించారు. ఇరాన్ మద్దతుతో జరిగిన రోడ్డు పక్క బాంబు దాడులు, ఇతర ఘర్షణల్లో అమెరికా సైనికులు మరణించడం, తీవ్రంగా గాయపడటాన్ని ఆయన ప్రస్తావించారు. ఇరాన్ మాజీ సైనిక కమాండర్ ఖాసిమ్ సొలైమానీ పేరు కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.2000 అక్టోబర్‌లో యెమెన్‌లోని ఓడరేవులో అమెరికా నావికాదళానికి చెందిన యూఎస్ఎస్ కోల్‌పై జరిగిన బాంబు దాడిని కూడా ట్రంప్ ఉదహరించారు. ఆ ఘటనలో 17 మంది అమెరికా నావికులు మరణించగా.. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ దాడికి అల్‌ఖైదానే కారణమని ఎఫ్‌బీఐ గతంలో పేర్కొంది.నిరసనకారుల కుటుంబాలకూ పరిహారం?గత ఐదు దశాబ్దాల్లో ఇరాన్లో జరిగిన ప్రజా ఉద్యమాలు, నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా పరిహారం అందించాలని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత ఐదు నెలల యుద్ధంలో మరణించినట్లు తాను పేర్కొన్న సుమారు 52 వేల మందికి సంబంధించిన నష్టపరిహారం అంశాన్ని కూడా చర్చల్లో చేర్చాలని తన ప్రతినిధులకు సూచించినట్లు తెలిపారు.హర్మూజ్‌పై ఇరాన్ కీలక డిమాండ్మరోవైపు హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన వైఖరిని స్పష్టం చేసింది. అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు.. యుద్ధం కారణంగా జరిగిన నష్టానికి పరిహారం చెల్లించి, ఆర్థిక ఆంక్షలను తొలగించి, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేసే వరకు హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవబోమని ఇరాన్ చెబుతోంది.ప్రాంతీయ వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోవద్దని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కూడా డిమాండ్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్-అమెరికా మధ్య భవిష్యత్ శాంతి చర్చలు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం కనిపిస్తోంది. -
విషమంగా జో బైడెన్ పరిస్థితి!
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయనకు క్యాన్సర్ మరింత విస్తరించిందని, చికిత్సలో తీవ్ర నొప్పితో బాధపడుతున్నారని ఆయన కుమారుడు హంటర్ బైడెన్ వెల్లడించారు. క్యాన్సర్ ఎముకలను దాటి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించిందని ఆయన తెలిపారు.బీబీసీ ‘న్యూస్‌నైట్’ కార్యక్రమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో హంటర్ బైడెన్ మాట్లాడుతూ.. తన తండ్రి క్యాన్సర్ చాలా బాధాకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. శారీరకంగా జో బైడెన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలపై బైడెన్ ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించారు.జో బైడెన్ చెబితేనే.. 2025 మేలో తనకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు జో బైడెన్ వెల్లడించారు. అది దూకుడుగా వ్యాప్తి చెందే రకమని, అప్పటికే ఎముకలకు పాకిందని వైద్యులు గుర్తించినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. అనంతరం ఆయన రేడియేషన్ చికిత్స, హార్మోన్ థెరపీ తీసుకుంటున్నట్లు సమాచారం.వయసుతోపాటు ఆరోగ్యంపై చర్చ83 ఏళ్ల బైడెన్.. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన అత్యంత వృద్ధుల్లో ఒకరు. 2021–2025 మధ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన శారీరక ఆరోగ్యం, మానసిక చురుకుదనంపై పలుమార్లు చర్చ జరిగింది. 2024 ఎన్నికల సమయంలోనూ ఆయన వయసు, ఆరోగ్య అంశాలు రాజకీయంగా ప్రధాన చర్చగా మారాయి.రాజకీయ జీవితంలో కీలక అధ్యాయండెలావేర్ నుంచి దీర్ఘకాలం సెనేటర్‌గా ఉన్న బైడెన్.. 2009 నుంచి 2017 వరకు బరాక్ ఒబామా హయాంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం 2020 ఎన్నికల్లో విజయం సాధించి అమెరికాకు 46వ అధ్యక్షుడయ్యారు. ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆయన.. తన రాజకీయ జీవితంపై ఆధారిత జ్ఞాపకాల పుస్తకాన్ని నవంబర్‌లో విడుదల చేయనున్నారు. (Joe Biden Health Condition)ట్రంప్ ఏమన్నారంటే.. బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధారణ అయినప్పుడు ట్రంప్ తొలుత “ఇది చాలా బాధాకరం” అంటూ ఆయన త్వరగా కోలుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు. అయితే దీనిపైనా ఆయన రాజకీయం చేశారు. ఈ విషయం ప్రజలకు ఆలస్యంగా ఎందుకు వెల్లడైందంటూ ప్రశ్నలు లేవనెత్తారు. అయితే హంటర్ తాజా స్టేట్మెంట్పై ట్రంప్ ఇంకా స్పందించలేదు. -
ఇరాన్‌ను లొంగదీసుకునేందుకు మరో మాస్టర్‌ప్లాన్!
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు ఇరాన్‌పై తీవ్ర హెచ్చరికలు చేస్తూ.. మరోవైపు చర్చలకు తలుపులు తెరిచి ఉంచుతున్న ఆయన తీరు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. “ఇది యుద్ధం కాదు.. చెస్ గేమ్ లాంటిది” అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆయన వ్యూహానికి అద్దం పడుతున్నాయి. సైనిక చర్యల కంటే ముందుగా ఆర్థిక ఒత్తిడి, ఆంక్షలు, దౌత్యపరమైన ఎత్తుగడలతో ఇరాన్‌ను చర్చల బాట పట్టించాలన్నది అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది. ఇరాన్‌తో అమెరికా ప్రస్తుతం “పాక్షిక చర్చలు మాత్రమే” జరుపుతోందని ట్రంప్ తాజాగా స్పష్టం చేశారు. “ఇరాన్లో భారీ ద్రవ్యోల్బణం ఉంది. వారి వద్ద డబ్బు లేదు. మేం పరిస్థితిని గమనిస్తున్నాం” అని ట్రంప్ పేర్కొన్నట్లు అమెరికా మీడియా సంస్థ ఆక్సియోస్ తెలిపింది.వెంటనే మరో సైనిక చర్యకు దిగకుండా.. ఇరాన్ ఆర్థిక పరిస్థితిని మరింత ఒత్తిడికి గురిచేసే విధానాన్ని అనుసరిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.ఇటీవల ఇరాన్‌పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ట్రంప్.. ఇప్పుడు మాట మార్చడం వెనుక వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం వల్ల అమెరికాపై పడే ఆర్థిక, రాజకీయ ప్రభావాలను అంచనా వేసుకుంటూనే.. ఒత్తిడి ద్వారా ఫలితం సాధించాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.ఓసారి దాడుల మాట.. మరోసారి చర్చల బాట!ట్రంప్ విదేశాంగ విధానంలో ఈ మార్పు కొత్తది కాదు. ప్రత్యర్థి దేశాలపై గరిష్ఠ ఒత్తిడి తీసుకురావడం.. ఆ తర్వాత చర్చలకు మార్గం సుగమం చేయడం ఆయన శైలిలో కనిపించే అంశం. ఇరాన్ విషయంలోనూ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు సైనిక శక్తిని ప్రదర్శిస్తూ హెచ్చరికలు చేయడం.. మరోవైపు చర్చలకు అవకాశం ఉందని చెప్పడం ద్వారా టెహ్రాన్‌పై మానసిక ఒత్తిడి పెంచే ప్రయత్నం జరుగుతోందని అంచనాలు ఉన్నాయి.“ఇది చెస్ ఆట లాంటిది. చివరకు అంతా సర్దుకుంటుంది” అని ట్రంప్ చెప్పడం కూడా ఈ వ్యూహాన్నే సూచిస్తోంది. చమురు ధరలు తగ్గుతున్నాయని, దీంతో యుద్ధ ప్రభావం అమెరికా ప్రజలపై పెద్దగా పడటం లేదని ఆయన పేర్కొన్నారు.మారిన సమీకరణాలుఅమెరికా–ఇరాన్ వివాదం కొత్తది కాదు. ఇరాన్ అణు కార్యక్రమం చుట్టూ మొదలైన వివాదం.. ఆంక్షలు, చమురు ఎగుమతులు, ప్రాంతీయ ఆధిపత్య పోరు వరకు విస్తరించింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ప్రధాన పట్టు హర్ముజ్ జలసంధిపై ఉంది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ మార్గం ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది.హర్ముజ్‌ను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలంటే అమెరికా ముందుగా నౌకాదళ ఆంక్షలు, చమురు ఆంక్షలను తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మాట్లాడుతూ.. అమెరికాతో నేరుగా చర్చలు జరగడం లేదని, కానీ మధ్యవర్తుల ద్వారా చర్చలకు అనుకూల వాతావరణం కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.అదసలు సాధ్యమేనా?ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి అమెరికాకు కొత్త వ్యూహం కాదు. దశాబ్దాలుగా అమలు చేస్తున్న ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. చమురు ఎగుమతులు, విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థపై ఆంక్షలు ఆ దేశ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేశాయి. అయితే ఇరాన్‌ను పూర్తిగా లొంగదీయడం మాత్రం అంత సులభం కాలేదు. ఆంక్షల మధ్య కూడా చైనా వంటి దేశాలకు చమురు విక్రయించడం, ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలు అనుసరించడం ద్వారా టెహ్రాన్ కొంతవరకు నష్టాన్ని భర్తీ చేసుకుంటోంది.అంటే.. ఆంక్షలు ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతున్నప్పటికీ, అవి ఇప్పటివరకు ఆ దేశాన్ని పూర్తిగా అమెరికా షరతులకు తలొగ్గే స్థాయికి తీసుకురాలేదని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు ట్రంప్ ఆర్థిక ఒత్తిడితో పాటు దౌత్యపరమైన ఒత్తిడిని కూడా కలిపి ప్రయోగిస్తున్నట్లు కనిపిస్తోంది.ట్రంప్‌కు నెతన్యాహూ షాక్ఇదిలా ఉండగా.. గాజా అంశంలో అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ పూర్తిగా ఆయుధాలు పక్కన పెట్టేంత వరకు గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ ఉండదని నెతన్యాహూ స్పష్టం చేశారు. ఈ అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. తన దేశ ప్రజల ముందు తాను కఠిన వైఖరినే కొనసాగిస్తున్నానని చూపించుకోవాల్సిన రాజకీయ ఒత్తిడి కూడా ఆయనపై ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.హౌతీల దాడులతో మరింత ఉద్రిక్తతమరోవైపు యెమెన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలోని అల్-మఖా పోర్టుపై దాడి చేశారు. ఈ ఘటనలో కనీసం ఏడుగురు మరణించినట్లు సమాచారం. హౌతీల చర్యలు, హార్ముజ్ వివాదం, గాజా యుద్ధ పరిణామాలు కలిసి మధ్యప్రాచ్య పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి.ట్రంప్ వ్యూహం ఫలిస్తుందా?ఇరాన్‌తో ఘర్షణను పూర్తిస్థాయి యుద్ధంగా మార్చకుండా.. ఆర్థిక ఒత్తిడి, చర్చలు, వ్యూహాత్మక బెదిరింపులతో తన లక్ష్యాలను సాధించాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. అయితే ఇరాన్ కూడా వెనక్కి తగ్గే పరిస్థితిలో లేదు. అణు కార్యక్రమం, చమురు ఆంక్షలు, హార్ముజ్ జలసంధి వంటి అంశాలపై రెండు దేశాల మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ట్రంప్ ఆడుతున్న ఈ ‘చెస్ గేమ్’లో ఇరాన్ చివరకు ఏ ఎత్తు వేస్తుంది? లేదంటే ఈ వ్యూహం మరోసారి పశ్చిమాసియా యుద్ధం అంచులకు తీసుకెళ్తుందా?.. రాబోయే రోజుల్లోనే తెలిసేది. -
ట్రంప్‌కు ఝలకిచ్చిన బెంజిమిన్ నెతన్యాహు
టెల్ అవీవ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ షాక్ ఇచ్చారు. గాజాలో శాంతి కోసం ట్రంప్ ప్రతిపాదించిన 15 సూత్రాల శాంతి ప్రణాళికను ఇజ్రాయెల్ తిరస్కరించిందన్నారు. ఈ ప్రతిపాదనను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని తెలిపారు. హమాస్ పూర్తిగా నిరాయుధులయ్యే వరకు గాజా నుంచి వైదొలగబోలేదని నెతన్యాహు తేల్చిచెప్పారుఇజ్రాయెల్- హమాస్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు, ముఖ్యంగా ప్రస్తుత యుద్ధానికి ముగింపు పలకడానికి ట్రంప్ గాజా శాంతి ఫార్ములా రూపొందించారు. దీని ప్రకారం గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమలు చేసి, హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను ,ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను పరస్పరం విడుదల చేయాలి. అదే విధంగా ఇజ్రాయెల్ బలగాలు గాజా నుండి క్రమంగా తమ దళాలను ఉపసంహరించుకోవాలి. ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ తొలుత అంగీకారం తెలిపింది. అమెరికా అధ్యక్షుడి మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చల తర్వాత, ఇజ్రాయెల్ ఈ శాంతి ప్రణాళికలోని మొదటి దశ ఒప్పందంపై సంతకం చేసింది.కాగా తాజాగా ఈ పాలసీని వ్యతిరేకిస్తూ నెతన్యాహూ బాంబు పేల్చారు. నెతన్యాహూ తన వ్యాఖ్యల్లో "15-సూత్రాల పత్రాన్ని ఇజ్రాయెల్ తిరస్కరిస్తుంది. హమాస్ నిజంగా నిరాయుధులయ్యే వరకు ఐడిఎఫ్ ఎలాంటి ఉపసంహరణ చేపట్టదు. మన బలగాలకు, మన పౌరులకు ఎదురయ్యే ముప్పులను అడ్డుకుంటూనే ఉంటుంది," అని ఇజ్రాయెల్ రక్షణ దళాలను ప్రస్తావిస్తూ నెతన్యాహు క్యాబినెట్ సమావేశంలో అన్నారు. దీంతో మరోసారి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇజ్రాయెల్ నిర్ణయంతో గాజాలో శాంతిని స్థాపించడానికి హమాస్‌ను నిరాయుధులను చేయడానికి జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలు మళ్లీ నిలిచిపోయే ప్రమాదం ఉంది. హమాస్ పూర్తిగా ఆయుధాలు విడిచిపెట్టే వరకు ఇజ్రాయెల్ సైన్యం తమ ప్రస్తుత స్థానాల నుంచి వెనక్కి వెళ్లేది లేదని తేల్చిచెప్పడంతో.. గాజాలో సైనిక ఉద్రిక్తతలు దాడులు కొనసాగే అవకాశం ఉంది. -
సాక్షి కార్టూన్: 09-08-2026
సాక్షి కార్టూన్: 09-08-2026 -
గ్రేస్ పీరియడ్ కట్..? H-1B వీసాదారులకు కొత్త టెన్షన్..
-
భారత్‌పై 100 శాతం టారిఫ్.. తిప్పలు అమెరికాకే?
రష్యా చమురు వంకతో.. భారత్, చైనాలపై 100 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించే ప్రతిపాదన అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఈ నిర్ణయం అమెరికా ప్రయోజనాలకే నష్టం కలిగిస్తుందని రిపబ్లికన్ సెనేటర్ రాండ్ పాల్ హెచ్చరించారు. భారీ టారిఫ్‌లు విధించడం అంటే.. స్వయంకృతాపరాధమేనని వ్యాఖ్యానించారు.రష్యాపై ఆంక్షలకు సంబంధించిన బిల్లుపై అమెరికా సెనేట్‌లో చర్చ సందర్భంగా భారత్, చైనాల నుంచి వచ్చే వస్తువులపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే సెనేట్ ఆమోదం పొందడంతో.. నెక్స్ట్ ప్రతినిధుల సభ వద్దకు వెళ్తుంది. ఆ తర్వాత ట్రంప్ దాని మీద సంతకం చేస్తే.. అమల్లోకి వస్తుంది. అయితే ఈ బిల్లుపై చర్చ సందర్భంగా స్పందించిన సెనేటర్ రాండ్ పాల్.. ఇలాంటి చర్యలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు.“భారం అమెరికన్లపైనే పడుతుంది”టారిఫ్‌ల వల్ల విదేశీ కంపెనీలే నష్టపోతాయన్న ట్రంప్ వాదనను రాండ్ పాల్ కొట్టిపారేశారు. దిగుమతి సుంకాల అసలు భారం అమెరికా దిగుమతిదారులు, వినియోగదారులపైనే పడుతుందని అన్నారు. ఇప్పటికే జీవన వ్యయాల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న అమెరికన్లపై మరింత భారం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.Breaking: "America imposing 100% tariffs on India and China is the economic equivalent of shooting ourselves in the foot," warns US Senator Rand Paul pic.twitter.com/C2GvQOg3HY— Shashank Mattoo (@MattooShashank) August 8, 2026“100 శాతం టారిఫ్‌లు విధించడం ఆర్థికంగా మన కాళ్లపై మనమే తుపాకీతో కాల్చుకున్నట్లే” అని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి నిర్ణయాలు అమెరికా వాణిజ్య ప్రయోజనాలను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.భారత్‌తో సంబంధాలపై ప్రభావం?భారత్ అమెరికాకు కీలక భాగస్వామి అని పేర్కొన్న రాండ్ పాల్.. ఇలాంటి భారీ సుంకాలు రెండు దేశాల మధ్య సంబంధాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని సూచించారు. సెనేటర్ రాన్ వైడెన్ కూడా ఈ టారిఫ్ ప్రతిపాదనలపై వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు సమాచారం.రష్యా చమురు కొనుగోళ్లే కారణంరష్యా నుంచి చమురు, సహజ వాయువు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచేందుకు ఈ టారిఫ్ ప్రతిపాదన తీసుకొచ్చారు. భారత్, చైనాలతో పాటు రష్యా ఇంధన వాణిజ్యానికి సహకరిస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఇచ్చేలా బిల్లు రూపొందించారు. ఈ బిల్లు అమెరికా సెనేట్‌లో 86-11 ఓట్లతో ఆమోదం పొందింది. అయితే ఇది చట్టంగా మారాలంటే ప్రతినిధుల సభ ఆమోదం పొందాల్సి ఉంది.ట్రంప్ విధానాలపై చర్చగతంలో కూడా రష్యా నుంచి భారత్ ఇంధనం కొనుగోలు చేయడాన్ని కారణంగా చూపుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై 25 శాతం టారిఫ్‌లు విధించారు. అయితే విస్తృత వాణిజ్య ఒప్పందం కోసం ప్రయత్నాల నేపథ్యంలో తర్వాత వాటిని సడలించారు.ప్రస్తుతం 100 శాతం టారిఫ్‌ల ప్రతిపాదన మళ్లీ తెరపైకి రావడంతో భారత్‌పై ప్రభావం కంటే.. అమెరికా వినియోగదారులపై పడే భారం, రెండు దేశాల సంబంధాలపై దాని ప్రభావంపై చర్చ మొదలైంది. -
ట్రంప్‌కు మరో షాక్.. కోర్టు తీర్పుతో కొత్త చిక్కులు!
అమెరికా న్యాయస్థానాలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వరుస షాకులు ఇస్తున్నాయి. తాజాగా.. ఆయన ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వైట్‌హౌస్ బాల్రూమ్ ప్రాజెక్టుకు న్యాయపరమైన అడ్డంకి ఎదురైంది. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఈ భారీ నిర్మాణాన్ని కొనసాగించేందుకు అధ్యక్షుడికి ఏకపక్ష అధికారం లేదని అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు స్పష్టం చేసింది. దీంతో 400 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.3,400 కోట్లకు పైగా) వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుపై తాత్కాలికంగా బ్రేక్ పడింది.వైట్‌హౌస్ ఈస్ట్ వింగ్ ఉన్న ప్రాంతంలో సుమారు 90 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ బాల్‌రూమ్‌ను నిర్మించాలని ట్రంప్ నిర్ణయించారు. దాదాపు 999 మంది అతిథులు ఒకేసారి పాల్గొనేలా ఈ హాల్‌ను నిర్మించాలన్నది ప్రణాళిక. దీనిని ఆయన తన కలల ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు. అయితే చారిత్రక భవన పరిరక్షణ సంస్థలు ఈ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించాయి. వైట్‌హౌస్ నిర్మాణ రూపకల్పనలో ఇంత పెద్ద మార్పు చేయాలంటే చట్టపరమైన అనుమతులు అవసరమని వాదించాయి.కాంగ్రెస్ అనుమతి కంపల్సరీ!వాషింగ్టన్ డీసీ సర్క్యూట్ అప్పీల్ కోర్టులోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం 2-1 మెజారిటీతో ట్రంప్ పరిపాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. “భారీ బాల్రూమ్ నిర్మించాలా వద్దా అన్నది కాంగ్రెస్ నిర్ణయించాల్సిన విషయం. కార్యనిర్వాహక అధికారంతో స్వయంగా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు” అని కోర్టు పేర్కొంది. అయితే ఈ తీర్పు బాల్రూమ్ నిర్మాణం పూర్తిగా నిలిచిపోవాలని చెప్పడం కాదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ అనుమతి పొందిన తర్వాత నిర్మాణం కొనసాగించే అవకాశం ఉందని తెలిపింది.ట్రంప్ ఆగ్రహం..ఇంతకుముందు నిర్మాణాన్ని నిలిపివేయాలని దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. తనను వ్యతిరేకించే న్యాయమూర్తులు ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వైట్‌హౌస్ భద్రత కోసం ఈ ప్రాజెక్టు అవసరమని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది. డ్రోన్లు, క్షిపణులు, జీవాయుధ ముప్పుల నుంచి అధ్యక్షుడు, ఆయన కుటుంబం, సిబ్బంది రక్షణ కోసం ఆధునిక భద్రతా ఏర్పాట్లు ఇందులో భాగమని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.భద్రత పేరుతో నిర్మాణం కొనసాగించలేరు..అయితే నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న సంస్థలు ఈ వాదనలను తోసిపుచ్చాయి. బాల్రూమ్ లేకపోవడం జాతీయ భద్రతా అత్యవసర పరిస్థితి కాదని పేర్కొన్నాయి. కోర్టు కూడా భద్రతకు సంబంధించిన భూగర్భ పనులను కొనసాగించేందుకు అనుమతించింది. బంకర్లు, ఇతర భద్రతా సదుపాయాల నిర్మాణానికి మాత్రం ఈ ఆదేశాలు వర్తించవని స్పష్టం చేసింది.ఇప్పుడేం జరగనుంది?అప్పీల్ కోర్టు తన తీర్పు అమలును రెండు వారాల పాటు నిలిపివేసింది. ఈ సమయంలో ట్రంప్ ప్రభుత్వం అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. 70 ఏళ్లకు పైగా వైట్‌హౌస్‌లో అతిపెద్ద నిర్మాణ మార్పుగా భావిస్తున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు కోర్టు, కాంగ్రెస్ నిర్ణయాలపై ఆధారపడి ఉంది. ట్రంప్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు న్యాయస్థానం బ్రేక్ వేయడంతో.. ఇది ఆయన పాలనలో మరో కీలక న్యాయపోరాటంగా మారింది. -
బిల్లు పాస్.. భారత్‌పై ట్రంప్ 100% టారిఫ్ అస్త్రం!
ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాకు అందుతున్న ఆర్థిక వనరులను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించే అధికారాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇచ్చే బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించింది. ఈ పరిణామం ఇప్పుడు ప్రపంచ ఇంధన మార్కెట్లలోనే కాకుండా భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లోనూ చర్చకు దారితీసింది.రష్యా ఇంధన ఆదాయాన్ని తగ్గించడం ద్వారా మాస్కోపై ఒత్తిడి పెంచాలన్నది అమెరికా వ్యూహం. అయితే ఈ బిల్లు చట్టంగా మారి అమల్లోకి వస్తే.. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాలు కొత్త ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంది.ఏమిటీ రష్యా శాంక్షన్స్ బిల్లు?అమెరికా సెనేట్ ఆమోదించిన ఈ బిల్లు పేరు “లిండ్సే ఓ. గ్రాహమ్ శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026”. రష్యా చమురు, గ్యాస్ ద్వారా వస్తున్న ఆదాయాన్ని తగ్గించడం, ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఉపయోగపడుతున్న ఆర్థిక వనరుల ప్రవాహాన్ని అడ్డుకోవడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.ఈ బిల్లు సెనేట్‌లో 86-11 ఓట్లతో భారీ మెజారిటీతో ఆమోదం పొందింది. ఇక ఇది అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ఆమోదం పొందాల్సి ఉంది. అక్కడ కూడా ఆమోదం లభిస్తే అధ్యక్షుడు ట్రంప్ సంతకం తర్వాత ఇది చట్టంగా మారనుంది.అయితే.. ఈ బిల్లు పేరులో ఇరాన్ ఉన్నప్పటికీ ప్రస్తుత పరిణామాల్లో ప్రధాన దృష్టి రష్యా చమురు ఆదాయాన్ని అడ్డుకోవడంపైనే ఉంది. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే దేశాలపై టారిఫ్‌లు విధించే అధికారం ట్రంప్‌కు ఇవ్వడమే ఈ బిల్లులో అత్యంత కీలక అంశంగా మారింది.రష్యా ఇంధనం కొనే దేశాలపై టారిఫ్ పిడుగురష్యా చమురు, సహజ వాయువు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచడం ద్వారా మాస్కో ఆదాయానికి గండికొట్టాలని అమెరికా భావిస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. రష్యా ఇంధనాన్ని అత్యధికంగా కొనుగోలు చేసే టాప్ ఐదు దేశాలపై అమెరికా అధ్యక్షుడికి 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారం లభిస్తుంది.అంటే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగించే దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై భారీ సుంకాలు విధించే అవకాశం ఉంటుంది. దీంతో ఇంధన కొనుగోళ్ల అంశం కేవలం ఆర్థిక వ్యవహారంగా కాకుండా అంతర్జాతీయ దౌత్య అంశంగా మారనుంది.భారత్, చైనాలపైనే ఎందుకు గురి?ప్రస్తుతం రష్యా చమురు, గ్యాస్‌కు అతిపెద్ద కొనుగోలుదారుల జాబితాలో చైనా, భారత్, అజర్బైజాన్, హంగేరీ, స్లోవేకియా ఉన్నాయి. ఈ దేశాల ఇంధన కొనుగోళ్లే రష్యా ఆర్థిక వ్యవస్థకు కీలక మద్దతుగా మారాయని అమెరికా వాదిస్తోంది.2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత పాశ్చాత్య దేశాలు మాస్కోపై అనేక ఆంక్షలు విధించాయి. అయితే రష్యా చమురు తక్కువ ధరకు లభించడంతో భారత్, చైనా వంటి దేశాలు కొనుగోళ్లను కొనసాగించాయి. దీంతో రష్యా ఇంధన ఆదాయాన్ని పూర్తిగా నిలువరించాలన్న అమెరికా ప్రయత్నాల్లో ఈ దేశాలు ప్రధానంగా మారాయి.భారత్‌కు అసలు పరీక్ష ఎక్కడ?రష్యా చమురు భారత్‌కు గత కొన్నేళ్లుగా కీలక ఇంధన వనరుగా మారింది. తక్కువ ధరకు ముడి చమురు లభించడం వల్ల దేశ ఇంధన అవసరాలను తీర్చుకోవడంలో ఇది ఉపయోగపడుతోంది. 2026 జూన్‌లో భారత్ రష్యా ముడి చమురు కొనుగోళ్లు భారీగా పెరిగాయి. మే నెలతో పోలిస్తే 34 శాతం పెరిగి 4.5 బిలియన్ యూరోలకు చేరినట్లు నివేదికలు పేర్కొన్నాయి.అయితే ఇప్పుడు భారత్ ముందు రెండు కీలక అంశాలు నిలిచాయి. ఒకవైపు తక్కువ ధరకు లభించే రష్యా చమురు ద్వారా ఇంధన భద్రతను కొనసాగించాల్సి ఉంది. మరోవైపు అమెరికాతో ఉన్న వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాలను కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.చైనాపైనా భారీ ప్రభావంఈ బిల్లు ప్రభావం ఎక్కువగా చైనాపై ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా శిలాజ ఇంధనాల అతిపెద్ద కొనుగోలుదారుగా చైనా కొనసాగుతోంది. 2026 జూన్ గణాంకాల ప్రకారం రష్యా ఇంధన ఎగుమతుల నుంచి వచ్చే ఆదాయంలో చైనా వాటా గణనీయంగా ఉంది. ఐదు అతిపెద్ద కొనుగోలుదారుల ఆదాయంలో 41 శాతం చైనా నుంచే వచ్చినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.రష్యా చమురు ఎగుమతుల్లో చైనా దాదాపు సగం కొనుగోలు చేస్తుండగా.. భారత్ కూడా 36 శాతం వాటాతో కీలక కొనుగోలుదారుగా ఉంది. దీంతో ఈ బిల్లు రష్యాపైనే కాకుండా అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.లిండ్సే గ్రాహమ్ పేరుతో ఎందుకు?ఈ బిల్లుకు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ కీలక రూపకర్తల్లో ఒకరు. ఉక్రెయిన్ పర్యటన అనంతరం జూలై 11న ఆయన ఆకస్మికంగా మరణించారు. అయినప్పటికీ ఆయన రూపొందించిన ఆంక్షల ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని రెండు పార్టీల నేతలు నిర్ణయించారు. ఆయనకు గౌరవంగా ఈ బిల్లుకు ఆయన పేరు పెట్టారు.పుతిన్, రష్యా సంస్థలపైనా చర్యలుఈ బిల్లు కేవలం రష్యా చమురు కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకోవడం మాత్రమే కాదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉన్నతాధికారులు, సంపన్న వర్గాలు, ఆర్థిక సంస్థలపై కూడా ఆంక్షలు విధించే నిబంధనలు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా ఉపయోగిస్తున్న “షాడో ఫ్లీట్” చమురు నౌకల నెట్‌వర్క్‌పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.500 శాతం నుంచి 100 శాతానికి తగ్గిన టారిఫ్ ప్రతిపాదనఈ బిల్లు మొదటి రూపంలో మరింత కఠినంగా ఉంది. రష్యా ఇంధనం కొనుగోలు చేసే దేశాలపై ఏకంగా 500 శాతం వరకు టారిఫ్‌లు విధించే ప్రతిపాదన ఉండేది. అయితే అమెరికా ప్రభుత్వం, చట్టసభ సభ్యుల మధ్య జరిగిన చర్చల తర్వాత దీనిని సవరించారు. చివరకు రష్యా ఇంధన కొనుగోలుదారులపై గరిష్ఠ టారిఫ్‌ను 100 శాతానికి పరిమితం చేశారు.ట్రంప్‌కు అధికారం ఇవ్వడంపై విమర్శలుఈ బిల్లుకు అమెరికాలోనే భిన్న స్పందనలు వస్తున్నాయి. కొందరు డెమొక్రాట్లు ట్రంప్‌కు విస్తృత టారిఫ్ అధికారాలు ఇవ్వడం ప్రమాదకరమని అభిప్రాయపడుతున్నారు. టారిఫ్‌ల భారం చివరకు అమెరికా వ్యాపారాలు, వినియోగదారులపైనే పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఈ చర్య అవసరమని బిల్లు మద్దతుదారులు వాదిస్తున్నారు.ఇక ముందు ఏం జరగనుంది?ప్రస్తుతం ఈ బిల్లు అమెరికా ప్రతినిధుల సభ ముందుకు వెళ్లనుంది. అక్కడ కూడా ఆమోదం పొందితే ట్రంప్ సంతకం తర్వాత ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే అసలు ప్రశ్న.. ట్రంప్ ఈ అధికారాన్ని వెంటనే ఉపయోగిస్తారా? లేదంటే భారత్, చైనా వంటి దేశాలతో చర్చలు, మినహాయింపులు, దౌత్య మార్గాలను ఎంచుకుంటారా? అన్నదే. అయితే..టారిఫ్‌లు అమల్లోకి రాకముందే వాటి ప్రభావం మొదలయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే అమెరికా చర్యల భయంతో చమురు కంపెనీలు, బ్యాంకులు, షిప్పింగ్ సంస్థలు తమ భవిష్యత్ వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉంది.రష్యా చమురు ఆదాయాన్ని అడ్డుకోవాలన్న అమెరికా వ్యూహం ఇప్పుడు భారత్, చైనా వంటి దేశాలకు కొత్త ఆర్థిక పరీక్షగా మారింది. ట్రంప్ తీసుకునే తదుపరి నిర్ణయాలపైనే ప్రపంచ ఇంధన మార్కెట్లు, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల భవిష్యత్ ఆధారపడనుంది. -
పుట్టుకతో పౌరసత్వంపై మళ్లీ ట్రంప్ కత్తి!
వాషింగ్టన్: అమెరికాలో పుడితే చాలు.. ఆ దేశ పౌరసత్వం వచ్చేసినట్టే అన్న భరోసాకు ఇక కాలం చెల్లనుంది. ఎందుకంటే ఈ రకమైన ‘‘బర్త్ టూరిజమ్’’ను కట్టడి చేసే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసేశాడు. దీంతోపాటే పుట్టుకతో వచ్చే పౌరసత్వ అర్హతను మరింత కఠినతరం చేస్తూ ఇంకో ఆదేశమూ జారీ అయ్యింది. పుట్టుకతో వచ్చే పౌరసత్వంపై గతంలో జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసిన కొన్ని వారాలకే ఈ కొత్త ఆర్డర్లు వెలువడటం గమనార్హం. పర్యాటకులుగా అమెరికా వచ్చి... ఉద్దేశపూర్వకంగా అక్కడే ప్రసవం జరిగేలా చూసుకుని పౌరసత్వం అర్హత సాధించే వారు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యారని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. ట్రంప్ జారీ చేసిన తాజా ఉత్తర్వు వీరినే లక్ష్యంగా చేసుకుంటోంది. రెండో ఉత్తర్వు ప్రకారం.. పుట్టుకతో అమెరికా పౌరసత్వానికి అనర్హులుగా పరిగణించే వ్యక్తుల పరిధిని విస్తరించారు. విదేశీ ప్రభుత్వాల తరఫున లాబీయింగ్ చేసే విదేశీ పౌరుల పిల్లలతోపాటు మరికొంత మందికి పుట్టుకతో పౌరసత్వం రాదు. ట్రంప్ గతంలో కూడా ఇదే తరహా ఆదేశాలు జారీ చేయగా... జూన్ 30వ తేదీ దేశ అత్యున్నత న్యాయస్థానం వాటిని కొట్టివేసింది. కొన్ని మార్పులు చేస్తున్నాం: ట్రంప్ ఉత్తర్వులపై సంతకం చేసిన తరువాత ట్రంప్ ఓవల్ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరమని, అందుకే కొన్ని మార్పులు చేస్తున్నామని తెలిపారు. 1868 జూలై 9న ఆమోదించిన అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం.. అమెరికాలో జని్మంచిన లేదా సహజీకరణ (నాచురలైజేషన్, దీర్ఘకాలం నివాసం వల్ల వచ్చే పౌరసత్వం) పొందిన ప్రతి ఒక్కరికీ పౌరసత్వం లభిస్తుంది. గతంలో బానిసలుగా ఉన్నవారి పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది. అయితే ట్రంప్ మాత్రం ‘‘బానిసల పిల్లల కోసం అంతర్యుద్ధం తర్వాత ఈ సవరణ తీసుకొచ్చారు. కానీ ఇప్పుడేం జరుగుతోంది? ఇప్పుడు కొందరు దీని సాయంతో వ్యాపారం చేస్తున్నారు’’అని అంటున్నారు. ఈ సందర్భంలోనే వైట్‌హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ మాట్లాడుతూ...పుట్టుకతో పౌరసత్వం విషయంలో ప్రస్తుత విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, కొందరు ఇక్కడకు పర్యాటకులుగా వచ్చి బిడ్డను కనడం ద్వారా పౌరసత్వం పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇకపై వారిపైనా అనర్హత... ట్రంప్ జారీ చేసిన తాజా ఉత్తర్వుల్లో రెండోది అమెరికా పౌరసత్వ పత్రాలు జారీ చేయకూడని వ్యక్తుల పలు వర్గాలకు సంబంధించినది. తల్లి అమెరికాలో ప్రసవించేందుకు వీలుగా వాణిజ్య లావాదేవీ చేసిన వ్యక్తుల పిల్లలకు పౌరసత్వ పత్రాలు జారీ చేయరు. అలాగే ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న తల్లిదండ్రుల పిల్లలకు, విదేశీ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, ఫెడరల్ చట్టం ప్రకారం పౌరసత్వం లభించని అమెరికా భూభాగాల్లో జని్మంచిన పిల్లలకు ఇకపై పుట్టుకతో పౌరసత్వం దొరకదు. అయితే ఈ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని వలస వ్యవహారాల నిపుణులు విమర్శిస్తున్నారు. అమెరికాలో బర్త్ టూరిజం ద్వారా పుట్టే పిల్లల సంఖ్య ఏటా 22,000 నుంచి 26,000 వరకూ ఉన్నట్లు మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ అంచనా వేస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2024లో విదేశీ చిరునామా కలిగిన తల్లులు 9,600 మంది పిల్లలకు అమెరికాలో జన్మనిచ్చారు. -
పౌరసత్వంపై ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌పై ట్రంప్ మరోసారి బాంబు పేల్చారు. ఆ దేశంలోకి వచ్చే శత్రుదేశాల పిల్లలకు జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అమెరికాలో జన్మించడంతో వచ్చే ఆటోమెటిక్ పౌరసత్వ నిబంధనపై సరికొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు. బర్త్ టూరిజంపై ఇటీవలే అక్కడి సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కొద్ది వారాల్లోనే మరోసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు.ట్రంప్ మాట్లాడుతూ.. శత్రుదేశాల పౌరులు, విదేశీ ఉగ్రవాద సంస్థల సభ్యుల పిల్లలు మోసపూరిత మార్గాల్లో వీసాలు పొందిన వారి పిల్లలకు జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ బానిసల పిల్లల కోసమని ప్రస్తుతం దీనిని కొంతమంది వ్యాపారంగా మార్చుకున్నారని ట్రంప్ విమర్శించారు.ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ నేపథ్యంలో అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారా రాజ్యాంగ హక్కులను మార్చలేరని ఈ ఆదేశాలను కూడా కోర్టులో సవాలు చేస్తామని పేర్కొంది.ట్రంప్ తెచ్చిన నూతన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్1. మొదటి ఆర్డర్ : ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అమెరికాలో పుట్టే పిల్లలకు ఆటోమేటిక్‌గా లభించే పౌరసత్వం విషయంలో కొన్ని నిర్దిష్ట వర్గాలను అనర్హులుగా చేర్చారు. శత్రు దేశాల వ్యక్తులు, ఉగ్రవాద సంస్థలకు చెందిన సభ్యులు విదేశీ ప్రభుత్వాల తరఫున లాబీయింగ్ చేసేవారు లేదా ఆ దేశాల కోసం పనిచేసే వ్యక్తులు 2. రెండవ ఆర్డర్ (బర్త్ టూరిజంపై పూర్తి నిషేదం: అమెరికా పౌరసత్వాన్ని (పాస్‌పోర్ట్‌ను) సంపాదించడం కోసమే టూరిస్ట్ వీసాలపై అమెరికాకు వచ్చి పిల్లలను కనే అక్రమ పద్ధతిని అరికట్టడానికి ఈ ఆర్డర్ తెచ్చారు. విదేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు/కాన్సులేట్లలోని వీసా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా గర్భిణీలు కేవలం అమెరికాలో ప్రసవించి పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో (మోసపూరితంగా లేదా తప్పుడు సమాచారంతో) వీసా కోరితే, అటువంటి వారి వీసాలను తిరస్కరించాలని ఈ ఆర్డర్ నిర్దేశిస్తుంది.సుప్రీంకోర్టు తీర్పు అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం.. అమెరికా గడ్డపై జన్మించే ప్రతి ఒక్కరికీ (అక్రమ వలసదారులు లేదా తాత్కాలిక వీసాలపై ఉన్నవారి పిల్లలతో సహా) ఆటోమేటిక్‌గా పౌరసత్వం లభిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత (జనవరి 2025లో) బర్త్‌రైట్ సిటిజెన్‌షిప్‌ను నిరోధిస్తూ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను 6-3 మెజారిటీతో సుప్రీంకోర్టు కొట్టివేసింది. పౌరసత్వ నిబంధనలను మార్చాలంటే అధ్యక్షుడి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు సరిపోవని, రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని కోర్టు తేల్చిచెప్పింది. ఆ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు. -
అమెరికా వీసాల్లో భారతీయులకు భారీ షాక్
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులకు 2025లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది అడ్మిషన్ సీజన్లో భారతీయ విద్యార్థులకు జారీ చేసిన F-1 స్టూడెంట్ వీసాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 62 శాతం మేర తగ్గింది. ఇదే సమయంలో చైనా విద్యార్థులకు కూడా వీసాల సంఖ్య తగ్గినప్పటికీ, భారతీయులతో పోలిస్తే ఆ తగ్గుదల చాలా తక్కువగా నమోదైంది.అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ (CIS) విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం.. 2025 మే నుంచి ఆగస్టు మధ్య భారతీయులకు కేవలం 22,149 స్టూడెంట్ వీసాలు(F-1) మాత్రమే జారీ అయ్యాయి. ఇక, 2024లో 58,694 వీసాలు జారీ కాగా, ఈసారి దాదాపు 62 శాతం తగ్గుదల నమోదైంది. చైనా విద్యార్థుల విషయంలో 2024లో 61,075 వీసాలు జారీ కాగా, 2025లో ఆ సంఖ్య 40,034కు పడిపోయింది. అక్కడ తగ్గుదల 34 శాతం మాత్రమే నమోదైంది.ప్రతి ఏడాది మే నుంచి ఆగస్టు వరకు అమెరికా విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు ప్రారంభమవుతుండటంతో ఈ కాలంలోనే అత్యధికంగా స్టూడెంట్ వీసాలు జారీ అవుతాయి. అందువల్ల ఈ నాలుగు నెలల గణాంకాలను అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాలపై కీలక సూచికగా పరిగణిస్తారు. వీసాల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే ఇప్పటికీ మొదటి స్థానంలో ఉన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (IIE) గణాంకాల ప్రకారం.. 2024–25 విద్యా సంవత్సరంలో అమెరికా విద్యాసంస్థల్లో 3,63,019 మంది భారతీయ విద్యార్థులు చదువుతుండగా, చైనా నుంచి 2,65,919 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 11.7 లక్షల అంతర్జాతీయ విద్యార్థుల్లో ఈ రెండు దేశాల విద్యార్థులే సగానికి పైగా ఉన్నారు.2020 కరోనా మహమ్మారి కాలాన్ని మినహాయిస్తే, 2017–19 మరియు 2021–24 మధ్య మే-ఆగస్టు కాలంలో భారతీయులకు సగటున 55,717 F-1 వీసాలు జారీ అయ్యాయి. ఆ సగటుతో పోల్చినా 2025లో నమోదైన 22,149 వీసాల సంఖ్య దాదాపు 60 శాతం తక్కువగా ఉందని CIS పేర్కొంది. చదువు పూర్తయ్యాక అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశాన్ని కల్పించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) కార్యక్రమంలో కూడా భారతీయులే అత్యధికంగా ఉన్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో OPT కింద పనిచేస్తున్న మొత్తం 2,94,253 మంది అంతర్జాతీయ గ్రాడ్యుయేట్లలో 1,43,740 మంది భారతీయులు ఉండగా, చైనా నుంచి 61,981 మంది ఉన్నారు.F-1 వీసా అంటే?F-1 వీసా అనేది అమెరికాలోని గుర్తింపు పొందిన కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, భాషా శిక్షణా సంస్థలు లేదా ఇతర విద్యాసంస్థల్లో పూర్తికాలం (Full-time) చదువుకోవడానికి విదేశీ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం జారీ చేసే విద్యార్థి (Student) నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా.60 రోజుల నుంచి 30 రోజులకు...ఇదిలా ఉండగా.. CIS విశ్లేషణ ప్రకారం, ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన ఇమ్మిగ్రేషన్ విధానాలు కూడా ఈ తగ్గుదలకు ఒక కారణంగా కనిపిస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం F-1 వీసాదారులకు ఇప్పటి వరకు అమలులో ఉన్న "డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్" విధానాన్ని మార్చి నిర్దిష్ట కాలపరిమితితో వీసా మంజూరు చేసే విధానాన్ని తీసుకొచ్చారు. సాధారణంగా నాలుగేళ్ల వరకు మాత్రమే అమెరికాలో ఉండే అవకాశం ఉండగా, కోర్సు ఎక్కువ కాలం కొనసాగితే అదనపు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే చదువు పూర్తైన తర్వాత అమెరికాలో ఉండేందుకు ఇచ్చే గ్రేస్ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించారు. కళాశాల లేదా కోర్సు మార్చుకునే నిబంధనలను కూడా మరింత కఠినతరం చేశారు. అయితే, వీసాల జారీ తగ్గుదలకు కేవలం కొత్త విధానాలే కారణమని నిర్ధారించలేమని నిపుణులు చెబుతున్నారు. దరఖాస్తుల సంఖ్య, వీసా అపాయింట్మెంట్ల లభ్యత, పరిపాలనా ప్రక్రియలు వంటి ఇతర అంశాలు కూడా ఈ తగ్గుదలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఇరాన్ యుద్ధం.. ట్రంప్ బిగ్ సిగ్నల్
పశ్చిమాసియాను కుదిపేస్తున్న యుద్ధ మేఘాలు క్రమంగా తొలగిపోతున్నాయా? నెలల తరబడి కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ ఘర్షణకు తెరపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఆయుధ నిల్వలు, యుద్ధ సామర్థ్యంపై చర్చలు సాగుతుండగా.. మరోవైపు కీలక దేశాల మధ్య దౌత్య ప్రయత్నాలు వేగం పుంజుకోవడం ఆసక్తిని రేపుతోంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం “చాలా త్వరలోనే ముగుస్తుందని భావిస్తున్నా” అని ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. ఇరాన్ ఈ యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగించే పరిస్థితిలో లేదని ఆయన పేర్కొన్నారు.క్షిపణుల నిల్వలపై వస్తున్న ప్రశ్నలపైనా ట్రంప్ స్పందించారు. కొన్ని అత్యంత శక్తివంతమైన ఆయుధాలు తమ వద్ద భారీగా ఉన్నాయని, మరికొన్ని ఆయుధాల నిల్వలు పరిమితంగా ఉన్నాయని అంగీకరించారు. అయితే అమెరికా సైన్యం మాత్రం “చాలా మంచి స్థితిలోనే ఉందని” స్పష్టం చేశారు.ఇటీవల ఇరాన్‌తో నెలల తరబడి సాగిన యుద్ధంలో అమెరికా సైన్యం అత్యంత ఖచ్చితమైన దీర్ఘశ్రేణి క్షిపణుల నిల్వలను భారీగా వినియోగించిందని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఆయుధాల లభ్యతపై చర్చ మొదలైంది. అయితే ఆయుధాల కొరతను అధిగమించేందుకు అమెరికా రక్షణ సంస్థలు కొత్త తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయని ట్రంప్ తెలిపారు. ముఖ్యంగా పేట్రియాట్, టామాహాక్ క్షిపణుల ఉత్పత్తిని పెంచుతున్నట్లు వెల్లడించారు.హర్ముజ్ జలసంధిపై కీలక నిర్ణయం?మరోవైపు ఇరాన్, అమెరికా, ఒమన్ మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి తాత్కాలిక ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నట్లు సమాచారం. ఈ మార్గంలో ఆంక్షలు, భద్రతా సమస్యలు ప్రపంచ చమురు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.మోదీ–నెతన్యాహు ఫోన్కాల్పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్లో చర్చించారు. భారత్–ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కూడా ఇరువురు నేతలు సమీక్షించినట్లు మోదీ తెలిపారు.Received a phone call from Prime Minister Benjamin Netanyahu. We reviewed progress on various aspects of the India-Israel Special Strategic Partnership which continues to grow from strength-to-strength.We also exchanged views on the current situation in West Asia.@netanyahu— Narendra Modi (@narendramodi) August 6, 2026ప్రాంతీయ భద్రతపై సౌదీ–ఫ్రాన్స్ చర్చలుతాజా పరిస్థితులు, ఎర్ర సముద్రంలో నౌకా రవాణా స్వేచ్ఛపై సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ చర్చించారు. హౌతీ దాడుల నేపథ్యంలో ప్రాంతీయ భద్రతపై ఇరువురు నేతలు దృష్టి సారించారు.చమురు ధరలు మళ్లీ పైకిపశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 82 డాలర్లకు పైగా చేరింది. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ధర కూడా 77 డాలర్లకు ఎగబాకింది. హర్ముజ్ జలసంధిలో అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలపై ఆంక్షలు విధించేలా ఇరాన్ పార్లమెంట్లో ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. నిబంధనలు ఉల్లంఘించే నౌకలకు భారీ జరిమానాలు విధించే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది.ఇరాన్ తీవ్ర ఆరోపణలు.. గ్యాస్ నష్టంపై వ్యాఖ్యలుఅమెరికా గరిష్ఠ ఆర్థిక ఒత్తిడి విధానాన్ని కొనసాగిస్తోందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆరోపించారు. అమెరికా–ఇజ్రాయెల్ దాడుల కారణంగా రోజుకు దాదాపు 230 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ నష్టపోతున్నామని పేర్కొన్నారు.కొనసాగుతున్న ఉద్రిక్తతలుఇరాన్–అమెరికా యుద్ధ వాతావరణం కొనసాగుతుండగా, ప్రాంతంలోని ఇతర దేశాల్లోనూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. యెమెన్‌లో హౌతీ దాడుల్లో కనీసం 18 మంది సైనికులు మరణించినట్లు సమాచారం. డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో దాడులు జరిగినట్లు హౌతీ వర్గాలు ప్రకటించాయి. లెబనాన్–ఇజ్రాయెల్ మధ్య రోమ్‌లో జరిగిన చర్చలు ముగిశాయి. చర్చలు ఫలప్రదంగా సాగాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడులు నిర్వహించింది. కాల్పుల విరమణ చర్చలు పక్కకు జరిగిన సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం.గాజాలో పిల్లల మరణాలపై యూనిసెఫ్ ఆందోళనగాజాలో పరిస్థితిపై యూనిసెఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 2025 అక్టోబర్ కాల్పుల విరమణ తర్వాతి 300 రోజుల్లో కనీసం 300 మంది పిల్లలు మరణించినట్లు తెలిపింది. రోజుకు సగటున ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.ఇరాన్‌పై యుద్ధం ముగింపుకు చేరుకుంటోందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, హర్ముజ్ ఒప్పంద ప్రయత్నాలు, చమురు ధరల పెరుగుదల.. పశ్చిమాసియా సంక్షోభం కీలక మలుపులోకి ప్రవేశించిన సంకేతాలుగా కనిపిస్తున్నాయి. -
ట్రంప్‌కు తప్పిన పెను ప్రమాదం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెను ప్రమాదం తప్పింది. వాషింగ్టన్ నేషనల్ విమానాశ్రయం నుంచి ఆయనను తీసుకెళ్తున్న సైనిక హెలికాప్టర్ ‘మెరైన్ వన్’, ఫ్లోరిడాలోని పెన్సకోలాకు బయలుదేరుతున్న ‘ఎన్వాయ్ ఎయిర్’ప్రయాణికుల విమానానికి అతి దగ్గరగా వచ్చింది. కొన్ని క్షణాల తరువాత రెండు విమానాలు వెంటనే ఒకదానికొకటి దూరంగా వెళ్ళిపోయాయి. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్ (ఎఫ్ఏఏ), నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్టీఎస్బీ) దర్యాప్తు ప్రారంభించాయి. మంగళవారం మధ్యా హ్నం రెండు విమానాల మధ్య కొన్నిక్షణాల పాటు దగ్గరగా వచ్చాయని, వెంటనే ఒకదానికొకటి దూరంగా వెళ్ళిపోయాయని, అధ్యక్షుడికి ఎటువంటి ప్రమాదం జరగలేదని ఎఫ్ఏఏ పేర్కొంది. ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయినప్పటికీ, ముందుజాగ్రత్త చర్యగా మరో విమానాన్ని కూడా దారి మళ్లించామని తెలిపింది. రెండు విమానాల మధ్య దూరం తగ్గిన సమయంలో ఏటీసీ ఇద్దరు పైలట్లతో సంప్రదింపులు జరిపిందని పేర్కొంది. ఈ సంఘటన కట్టుదిట్టమైన నియంత్రణలో ఉండే వాషింగ్టన్ గగనతలంలో విమాన భద్రతపై ఆందోళనలను మళ్లీ రేకెత్తించింది. అధ్యక్షుడు ట్రంప్ స్థానిక సమయం మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మెరైన్ వన్ హెలికాప్టర్లో వైట్ హౌస్ నుంచి జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు వెళ్తున్నారు. సమాచార లోపంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు సమీపంలోని ట్రాఫిక్‌ను క్లియర్ చేయడంలో ఆలస్యం అయ్యింది. దీంతో అధ్యక్ష హెలికాప్టర్, ఎన్వాయ్ ఎయిర్ జెట్‌కు ఒక మైలు కంటే తక్కువ దూరం వచ్చింది. హెలికాప్టర్ మూడు నిమిషాల్లో గాల్లోకి లేస్తుందని కంట్రోలర్లకు తెలియజేయడానికి మెరైన్ వన్ సిబ్బంది మూడుసార్లు ప్రయతి్నంచింది. కానీ ఆ సమాచారం వారికి చేరడంలో ఆలస్యం అయింది. హెలికాప్టర్ సిబ్బంది కంట్రోల్ టవర్‌ను ముందే హెచ్చరించినట్లు ఏటీసీ ఆడియో సమీక్షలో రికార్డయ్యింది. ఆ తర్వాత, హెలికాప్టర్ బయలుదేరుతున్నట్లు సిబ్బంది ప్రకటించింది. అయితే, అప్పటికే ప్యాసింజర్ జెట్ టేకాఫ్ ప్రారంభించింది. విమానాశ్రయానికి కొన్ని మైళ్ల దూరంలోనే ఉన్న వైట్ హౌస్ నుంచి అధ్యక్షుడి హెలికాప్టర్ టేకాఫ్ అయినప్పుడు, సాధారణ విమానాలు బయలుదేరడాన్ని నిలిపివేస్తారు. అయితే, మెరైన్ వన్ ప్రయాణం సాధారణమైనదేనని భావించిన వాషింగ్టన్ నేషనల్ టవర్, హెలికాప్టర్ సిబ్బందిని ఆలస్యం చేయలేదు. ఆగమని అడగలేదు. ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపలేదు. మెరైన్ వన్ విమానాలను ప్రపంచంలోని అత్యుత్తమ విమానయాన నిపుణులలో కొందరు నడుపుతారు. ఇంతవరకూ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానాలకు ప్రమాదం జరగలేదు. దీంతో, ఈ ఘటనపై సమీక్షను కొనసాగిస్తామని, అవసరమైతే దిద్దుబాటు చర్యలు చేపడతామని ఎఫ్ఏఏ తెలిపింది. ఎన్టీఎస్బీ ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తును ప్రారంభించింది. -
ఇరాన్ విషయంలో ట్రంప్ చేయని ఒకేఒక్క ‘తప్పు’ ఇదే..
టెహ్రాన్: ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత దూకుడుగా వ్యవహరించినప్పటికీ ప్రస్తుత చిక్కు నుంచి బయటపడే మార్గం కనుక్కోలేకపోతున్నారు. ఇరాన్‌పై ట్రంప్ దాడులు చేయిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఒక పొరపాటును మాత్రం చేయలేదని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. అదే తన సామర్థ్యాన్ని దాటి ఘర్షణను అతి భారీ స్థాయికి తీసుకెళ్లకపోవడం. ఇరాన్‌పై పరిమిత దాడిని పూర్తి స్థాయి, అతి దీర్ఘకాల యుద్ధంగా మార్చలేదు ట్రంప్.ట్రంప్ ఈ యుద్ధాన్ని పూర్తిస్థాయి భూతల యుద్ధంగా మార్చలేదు. తన ప్రతిష్ఠను కాపాడుకోవాలనే ఉద్దేశాలకు దూరంగానే ఉండి, అదనపు భారీ సైనిక చర్యలకు వెళ్లలేదు. అప్పట్లో వియత్నాం, ఇరాక్, అఫ్గానిస్థాన్ యుద్ధాల్లో అమెరికా మాజీ అధ్యక్షులు ఓటమిని అంగీకరించకుండా యుద్ధాన్ని నిరంతరం పెంచుకుంటూ వెళ్లారు. ట్రంప్ మాత్రం అటువంటి పని చేయడం లేదు.మొదట ట్రంప్ చేసిన పెద్ద పొరపాటు యుద్ధంలోకి వెళ్లడమే కావొచ్చు. కానీ, ఇప్పటివరకు ఆయన చేయని ఒక ప్రమాదకరమైన తప్పు ఏమిటంటే యుద్ధాన్ని తన నియంత్రణ దాటేలా భారీగా విస్తరించకపోవడమని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షులు లిండన్ బి. జాన్సన్, రిచర్డ్ నిక్సన్, జార్జ్ డబ్ల్యూ బుష్ వారు చేసిన యుద్ధాలను మొదట పరిమిత సైనిక చర్యలతో ప్రారంభించి, తర్వాత క్రమంగా పెద్ద యుద్ధాల్లో చిక్కుకున్నారు. ఒకసారి యుద్ధం మొదలైన తర్వాత వెనక్కి తగ్గడం కష్టమై, వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీనినే slippery slope (చిన్న నిర్ణయం క్రమంగా పెద్ద సమస్యగా మారే పరిస్థితి) అంటారు.సమీప భవిష్యత్తులో ఆ తప్పు చేస్తారా?ట్రంప్ ఆ తప్పును ఇంకా చేయలేదు. కానీ, సమీప భవిష్యత్తులో ఇరాన్ యుద్ధాన్ని విస్తరిస్తే గత అధ్యక్షులలాగే అదే ఉచ్చులో పడే ప్రమాదం ఉంది. చరిత్ర ఏమి చెబుతుందంటే, బయటపడే మార్గం వెతుకుతూ లేదా తమ ప్రతిష్ఠను, అమెరికా ప్రతిష్ఠను కాపాడాలనే ప్రయత్నంలో యుద్ధాలను తీవ్రతరం చేసిన అధ్యక్షులు ప్రమాదకర మార్గంలో జారిపోయారు.ఒకసారి గీత దాటితే వెనక్కి తిరగలేని కీలక నిర్ణయాత్మక దశకు ట్రంప్ చేరుకుంటారా? అన్నదే సందేహాత్మకంగా ఉంది. ట్రంప్ ముందున్న మరో మార్గం నష్టాలను అంగీకరించి, ప్రధాన లక్ష్యాలు నెరవేరకపోయినా ఈ ఘర్షణ నుంచి వైదొలగడమే మంచిదని ఒప్పుకోవడం.ట్రంప్ గెలవలేని, ఓడిపోలేని యుద్ధంలో చిక్కుకుపోయారు. అమెరికా ప్రభుత్వం పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణ ఏమిటంటే, ఇరాన్‌ను ఎలా శిక్షించాలనే కొత్త ఐడియాలు ఇవ్వాలని పెంటగాన్ సైనిక విశ్లేషకుల బృందాన్ని కోరిందని అమెరికా మీడియా తెలిపింది. ఒకవేళ ట్రంప్ పూర్తిస్థాయి యుద్ధం చేయిస్తే పరిణామాలు అతి ఘోరంగా ఉంటాయి.ఇరాన్‌కు హెచ్చరికల మీద హెచ్చరికలుఇరాన్ తన తాజా ప్రయత్నాన్ని తిరస్కరించిన తర్వాత ఇటీవల ట్రంప్ అసహనం ట్రూత్ సోషల్ ఖాతాలో.. ‘‘ఒప్పందం త్వరలో కుదిరే అవకాశం ఉంది’’ అని చెప్పారు. “ఇరాన్ నాయకత్వం నమ్మశక్యంకానంత మోసపూరితంగా ఉంది” అని కూడా ట్రంప్ ప్రకటించారు. బలవంతపు దౌత్యంపై ఇస్లామిక్ రిపబ్లిక్ చేసే విమర్శలనే ఆయన వ్యంగ్యంగా ప్రతిధ్వనించినట్టైంది. ఆ తర్వాత ఆయన మళ్లీ మరో హెచ్చరిక చేశారు. “ఒప్పందంపై సంతకం చేయడానికి వారికి ఇదే చివరి అవకాశం” అని ఓవల్ ఆఫీస్‌లో చెప్పారు. -
ఆ పెద్దమనిషిలా కాదు.. నేనైతే కుట్ర అనను!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాని మార్క్ కార్నీల మధ్య మాటల యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న కార్నీకి అనుకోని అవాంతరం ఎదురైంది. అయితే ఇదే అదనుగా ఆయన ట్రంప్‌పై పరోక్షంగా సెటైర్లు సంధించారు. కెనడాలో గృహ నిర్మాణ విధానంపై టొరంటోలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని మార్క్ కార్నీ మాట్లాడుతుండగా టెలిప్రాంప్టర్ అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోయింది. దీంతో ఆయన చిరునవ్వుతో స్పందిస్తూ.. “టెలిప్రాంప్టర్ పనిచేయడం నిలిచిపోయిందని మీకు తెలియజేస్తున్నాను. అయితే ఆ పెద్దమనిషిలా.. ప్రత్యేక ప్రపంచ నేతలా కాకుండా దీనైతే నేను కుట్రగా భావించడం లేదు” అని వ్యాఖ్యానించారు. కార్నీ వ్యాఖ్యలతో అక్కడున్నవారు ఘోల్లున నవ్వారు. PM Carney trolls Donald Trump: "I would like to inform you that the teleprompter has ceased to function. Unlike a certain world leader, I do not view this as a conspiracy." pic.twitter.com/JxKIzTNwZJ— National broadcaster (@broadcast0147) August 6, 2026కార్నీ చేసిన ఈ వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఉద్దేశించినవేనన్న చర్చ నడుస్తోంది. గతంలో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి హెడ్ ఆఫీస్‌కు వెళ్లిన ట్రంప్.. జనరల్ అసెంబ్లీలో ప్రసంగించే సమయంలో టెలిప్రాంప్టర్, ఎస్కలేటర్ సమస్యలు ఎదురయ్యాయి. ఆ ఘటనల వెనుక కుట్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్రంప్ విచారణకు డిమాండ్ చేయడం అప్పట్లో చర్చకు దారితీసింది.ట్రంప్ విధానాలపై కార్నీ పోరాటంట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా–కెనడా సంబంధాల్లో పలు విభేదాలు చోటుచేసుకున్నాయి. కెనడా దిగుమతులపై అమెరికా సుంకాలు విధించడం, కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మార్చాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ.. దేశ ఆర్థిక, దౌత్య విధానాల్లో అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రంప్ వాణిజ్య విధానాలను వ్యతిరేకిస్తూ కెనడా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రపంచంలోని బలమైన దేశాలు ఆర్థిక సంబంధాలను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగిస్తున్నాయని కార్నీ చేసిన వ్యాఖ్యలు కూడా గతంలో చర్చకు వచ్చాయి. -
హోర్ముజ్ దౌత్యంలో ఇరాన్ సామ్రాజ్య కాంక్ష.. అమెరికా ఉక్కుపాదం!
టెహ్రాన్/వాషింగ్టన్: హోర్ముజ్ జలసంధిపై ఒమన్‌తో కుదుర్చుకుంటున్న ఒప్పందం తుది దశకు చేరుకుందని ఇరాన్ వెల్లడించింది. త్వరలోనే ఈ అంశంపై ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన ఈ జలసంధిని మళ్లీ తెరిచే దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు ఈ పరిణామాలు కొత్త ఆశలు కల్పిస్తున్నాయి. అయితే ఈ ఒప్పందం అమలులో పలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. వ్యూహాత్మక జలమార్గంపై ఇరాన్ తన ప్రభావాన్ని నిలుపుకోవాలని ప్రయత్నిస్తుండగా, ఇరాన్‌కు నియంత్రణ కల్పించే లేదా రవాణా సుంకాలు వసూలు చేయడానికి అనుమతించే ఏ ఒప్పందాన్నయినా అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.ఒమన్‌తో ఒప్పందానికి సంబంధించి ముసాయిదా తయారీ తుది దశకు చేరుకుందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘీ తెలిపారు. కొన్ని వర్గాలు దీనికి ఆటంకం కలిగించకపోతే త్వరలోనే సంయుక్త ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు. ఈ చర్చల గురించి తెలిసిన ఇద్దరు ప్రాంతీయ అధికారులు మాట్లాడుతూ, ఇరాన్, ఒమన్ ప్రతినిధులు ముసాయిదా ఒప్పందాన్ని ఖరారు చేశారని, ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతొల్ల అలి ఖమేనీ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.మరోవైపు, ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు కష్టతరంగానే ఉన్నాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. ఈ ఘర్షణలను ముగింపునకు తెచ్చే ప్రయత్నాలు క్లిష్టంగా మారాయని, కొన్నిసార్లు చర్చలు ముందుకు వెళ్లడానికి బదులు వెనక్కి వెళ్లాల్సి వస్తుందని అన్నారు. కాగా, ప్రపంచ దేశాలకు సరఫరా అయ్యే చమురు, సహజ వాయువులో ఐదో వంతు హోర్ముజ్ జలసంధి గుండానే రవాణా అవుతుంది. ఈ ఘర్షణల కారణంగా ఈ సముద్ర మార్గంలో రవాణా తీవ్రంగా దెబ్బతిని, ఇంధన ధరలు భారీగా పెరిగాయి.ఇదిలాఉంటే, యెమెన్‌లోని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు సౌదీకి చెందిన చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ప్రకటించారు. గల్ఫ్‌లోనూ ఒక వాణిజ్య నౌక సమీపంలో పేలుడు సంభవించినట్లు సమాచారం. మరోవైపు, ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి మళ్లీ తూట్లు పడ్డాయి. దక్షిణ లెబనాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడులతో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.ఇది కూడా చదవండి: మనిషికి బదులు ఏఐని బాస్‌గా పెడితే.. -
అమెరికాకు కొత్త పవర్.. చైనా, రష్యాకు వార్నింగ్ బెల్స్?
ప్రపంచ భద్రతా సమీకరణాలను మార్చే నిర్ణయం దిశగా అమెరికా అడుగులు వేస్తోందా? చైనా లేదా రష్యాతో యుద్ధం జరిగితే ఇప్పటివరకు ఉన్న అణు వ్యూహాన్ని పూర్తిగా మార్చాలని పెంటగాన్ ఆలోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీర్ఘ శ్రేణి అణు క్షిపణులకే పరిమితం కాకుండా, యుద్ధభూమిలో వినియోగించే టాక్టికల్ అణు ఆయుధాలకు ప్రాధాన్యం పెంచే ప్రతిపాదనపై సమీక్ష జరుగుతున్నట్లు సమాచారం. ఈ మార్పు అమల్లోకి వస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంక్షోభ సమయంలో మరిన్ని సైనిక ఎంపికలు లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రతిపాదనపై మద్దతుతో పాటు తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం అమెరికా ప్రధానంగా దీర్ఘ శ్రేణి వ్యూహాత్మక (Strategic) అణు క్షిపణులపై ఆధారపడుతోంది. అయితే కొత్త ప్రతిపాదనలో తక్కువ శ్రేణి టాక్టికల్ అణు ఆయుధాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సమీక్షకు పెంటగాన్ విధానాల విభాగం అధిపతి ఎల్బ్రిడ్జ్ కోల్బీ నాయకత్వం వహిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.మరిన్ని సైనిక ఎంపికలే లక్ష్యమా?ఈ ప్రతిపాదన వెనుక ప్రధాన ఉద్దేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంక్షోభ సమయంలో మరిన్ని ప్రతిస్పందన ఎంపికలు అందుబాటులో ఉంచడమేనని అధికారులు చెబుతున్నారు. రష్యా లేదా చైనా.. అమెరికా మిత్రదేశాలపై దాడి చేసిన సందర్భంలో, భారీ స్థాయి అణు దాడికి మాత్రమే పరిమితం కాకుండా పరిస్థితికి అనుగుణంగా స్పందించే అవకాశాలు ఉండాలని ఈ సమీక్ష సూచిస్తోంది. ఒక సీనియర్ రక్షణ శాఖ అధికారి ప్రకారం..‘అమెరికాకు విశ్వసనీయమైన అణు ప్రతిస్పందన ఎంపికలు అవసరం. అధ్యక్షుడికి ఎక్కువ ప్రత్యామ్నాయాలు ఉంటేనే శత్రుదేశాలను సమర్థంగా నిరోధించవచ్చు’ అని అభిప్రాయపడ్డారు.టాక్టికల్ అణు ఆయుధాలు అంటే?టాక్టికల్ అణు ఆయుధాలు వ్యూహాత్మక అణు బాంబులతో పోలిస్తే తక్కువ శక్తి కలిగి ఉంటాయి. ఇవి యుద్ధభూమిలోని సైనిక స్థావరాలు, దళాలు లేదా ఇతర సైనిక లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుని ఉపయోగించేందుకు రూపొందించబడతాయి. అయినప్పటికీ, ఇవి కూడా భారీ ప్రాణనష్టం, విధ్వంసం సృష్టించే సామర్థ్యం కలిగిన అణు ఆయుధాలేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే, ఈ ప్రతిపాదనపై ఇప్పటికే చర్చ మొదలైంది. అనుకూల వర్గాలు ఇది అమెరికా అణు నిరోధక శక్తిని (Deterrence) మరింత బలపరుస్తుందని చెబుతుండగా, విమర్శకులు మాత్రం టాక్టికల్ అణు ఆయుధాలకు ప్రాధాన్యం పెరగడం వల్ల వాటి వినియోగానికి ఉన్న మానసిక అడ్డంకి తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి అణు ఆయుధం ఉపయోగిస్తే అది మరింత పెద్ద స్థాయి ఘర్షణకు దారితీయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.కాగా, ఈ ప్రతిపాదన ఇప్పటికీ విధాన సమీక్ష (Policy Review) దశలోనే ఉంది. అమెరికా ప్రభుత్వం అధికారికంగా కొత్త అణు విధానాన్ని ప్రకటించలేదు. కాబట్టి ప్రస్తుతం దీనిని పరిశీలనలో ఉన్న ప్రతిపాదనగా మాత్రమే పరిగణించాలి. అయితే, 1945లో హిరోషిమా, నాగసాకిపై అణుబాంబులు పడిన తర్వాత ప్రపంచంలో యుద్ధ రంగంలో అణు ఆయుధాలు మళ్లీ ఉపయోగించబడలేదు. అందుకే అమెరికా అణు వ్యూహంలో ఎలాంటి మార్పు ప్రతిపాదన వచ్చినా, అది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి, ఆందోళనలకు కారణమవుతోంది. -
మిలిటరీ కుటుంబాలపైనా ఇమ్మిగ్రేషన్ దాడులు
వాషింగ్టన్: అక్రమ వలసదారులపై చర్యల పేరుతో డొనాల్డ్ ట్రంప్ చేపడుతున్న చర్యలు వింత పోకడలకు పోతున్నాయి. రెండోసారి అధికారం చేపట్టిన తరువాత ఇమ్మిగ్రేషన్ అధికారులు జరిపిన పలు దాడుల్లో అక్రమ వలసదారులు మాత్రమే కాకుండా సర్వీసులో ఉన్న మిలిటరీ వాళ్ల కుటుంబ సభ్యులు కనీసం యాభై మంది ఉన్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ నిర్వహించిన పరిశోధన తెలిపింది. అరెస్ట్ అయిన వారిలో మిలటరీ అధికారుల తల్లిదండ్రులు, భార్యలు ఉండగా వీరిలో ఆరుగురిని వారి స్వదేశాలకు తిప్పి పంపారని, ఎనిమిది మంది కస్టడీలో ఉన్నారని ఈ పరిశోధన బయటపెట్టింది. సాధారణంగా మిలటరీ అధికారుల కుటుంబాలకు ఇలాంటి విషయాల్లో రక్షణ ఉంటుంది కానీ ట్రంప్ కొత్త విధానాల కారణంగా ఇప్పుడు వారిపై కూడా ఇమ్మిగ్రేషన్ దాడులు, కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఒక ప్రకటన చేస్తూ మిలటరీలో పనిచేస్తున్నారన్న ఒకే కారణం వల్ల వారి బంధువులు ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించడం నుంచి మినహాయింపు ఇవ్వలేమని తెలిపింది. ఆర్మీ సార్జెంట్ హెదర్ టుర్కియోస్ జునెజ్ భార్యను సంతానం ముందే ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారని, వాయుసేన టెక్నికల్ సార్జెంట్ వెంటీ జిబీవ్ తండ్రిని మెక్సికో తిప్పి పంపారని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. జనవరి 2025 నుంచి జనవరి 2026 మధ్యకాలంలోనే డీహెచ్ఎస్ 125 మంది రిటైర్ అయిన మిలటరీ వారిని, 150 కంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుందని సమాచారం. వీరిలో కొంతమందిని అమెరికా నుంచి బయటకు పంపించే ప్రక్రియ కూడా ప్రారంభించినట్లు సమాచారం. -
రేపో ఎల్లుండో హార్మూజ్‌ను తెరవడమే
కైరో: ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించి, పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు దోహదపడే కీలక జలమార్గమైన హార్మూజ్‌ను తిరిగి తెరిచే అంశంపై ఇరాన్, ఒమన్‌లు ఒక ఒప్పందానికి చాలా సమీపంలోకి వచ్చాయి. ఒకట్రెండు రోజుల్లో దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కాలిఫోర్నియాలో స్థానిక కాలమానం ప్రకారం ట్రంప్ మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ‘‘హార్మూజ్ జలసంధిని రేపో లేదా ఎల్లుండో తెరిచేందుకు ఆస్కారం ఉంది. ఈ విషయంలో ఇప్పటికే చాలా పురోగతి సాధించాం’’అని చెప్పారు. హార్మూజ్‌ను తెరిచే విషయంలో సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బుధవారం బ్యారెల్‌కు సుమారు 80 డాలర్ల వద్ద ఉంది. ఇది సంఘర్షణ ఉధృతంగా ఉన్నప్పటి స్థాయి కంటే చాలా తక్కువ. ఇరాన్, ఒమన్ మధ్య చర్చల ఫలితంగా కుదిరే అవకాశం ఉన్న ఒప్పందం ప్రకారం... నౌకలు ఇరాన్ నియంత్రణలో ఉన్న మార్గం ద్వారా పర్షియన్ గల్ఫ్‌లోకి ప్రవేశించి, ఒమన్ నియంత్రణలో ఉన్న మార్గం ద్వారా నిష్క్రమిస్తాయి. నౌకలకు భద్రత కల్పించినందుకు, సముద్ర పర్యావరణాన్ని పరిరక్షించినందుకు ఇరాన్, యెమెన్లు సేవా రుసుములు వసూలు చేస్తాయి. మరోవైపు హార్మూజ్ జలసంధికి సంబంధించి ఒక ఒప్పందం త్వరలోనే కుదిరే అవకాశం ఉందన్న ఆశలు పెరుగుతున్నప్పటికీ ఆ ప్రాంతంలో నౌకలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఎర్ర సముద్రంలో వాఫా అనే సౌదీ చమురు ట్యాంకర్‌పై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ అండదండలున్న హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. సౌదీ ఓడరేవు పట్టణమైన యాన్బు సమీపంలో ఆ నౌకను లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారు. అయితే, అందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు చూపలేదు. దీనిపై సౌదీ అరేబియా కూడా స్పందించలేదు. మంగళవారం యెమెన్ తీరంలోని ఎర్ర సముద్రంలో పేలుడు పదార్థాలతో నిండిన పడవ ఢీకొనడంతో భారత జెండా ఉన్న వాణిజ్య నౌక మునిగిపోయిందని యెమెన్, భారత అధికారులు తెలిపారు. ఆ నౌకలోని సిబ్బందిని యెమెన్ తీరరక్షక దళం రక్షించింది. వీరిలో 13 మంది భారతీయులు, ఒక యెమెన్ దేశస్థుడు ఉన్నారు. -
ట్రంప్‌ను టార్గెట్ చేశారా?.. గోల్ఫ్ క్లబ్ వద్ద హైటెన్షన్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాలిఫోర్నియా పర్యటన వేళ తీవ్ర కలకలం చోటుచేసుకుంది. ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్లో నిర్వహించనున్న నిధుల సేకరణ కార్యక్రమానికి (ఫండ్‌రైజింగ్ డిన్నర్) హాజరుకానున్న నేపథ్యంలో, అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద గన్, బుల్లెట్స్ లభించడం మరింత టెన్షన్‌కు గురిచేసింది. సదరు వ్యక్తిని జీనైన్ జాన్ టేలే (38)గా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై అధికారుల వివరాల ప్రకారం.. జీనైన్ జాన్ టేలే గోల్ఫ్ కోర్స్‌లో తిరుగుతూ ఫోటోలు, వీడియోలు తీస్తూ భద్రతా ఏర్పాట్లను గమనిస్తున్నట్లు కనిపించాడు. తనిఖీలో అతని వద్ద దాచిన పిస్టల్, నిషేధిత సామర్థ్యం గల మ్యాగజైన్లు, హాలో-పాయింట్ బుల్లెట్లు లభించాయి. అనంతరం అతని ఇంటిపై జరిపిన సోదాల్లో అక్రమంగా మార్పులు చేసిన AR-శైలి రైఫిల్, మరో పిస్టల్, బాడీ ఆర్మర్, అధిక మొత్తంలో మందుగుండు సామగ్రి, అలాగే ఆందోళన కలిగించే నోట్‌బుక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎఫ్‌బీఐ జాయింట్ టెర్రరిజం టాస్క్ ఫోర్స్, యు.ఎస్. సీక్రెట్ సర్వీస్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. ట్రంప్ పర్యటనతో ఈ ఘటనకు ఏమైనా సంబంధం ఉందా? దాడి చేసే ఉద్దేశం ఉందా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. అయితే, ట్రంప్‌పై దాడి చేయాలనే కుట్ర జరిగినట్లు లేదా నిందితుడు అలాంటి ఉద్దేశంతో అక్కడికి వచ్చినట్లు ఇప్పటివరకు అధికారులు అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం అతనిపై ఆయుధాలకు సంబంధించిన అభియోగాలే నమోదు కాగా, దర్యాప్తు కొనసాగుతోంది. < /p>BREAKING: A HEAVILY ARMED MAN has been arrested outside Trump National Golf Club in California after he CAMPED OUT before 47's visit. ANOTHER WOULD-BE ASSASSINATION ATTEMPT.pic.twitter.com/JPOMSxyYrC— iexclusivenews (@iexclusivenews) August 5, 2026 -
H-1B, L-1 వీసాలు.. భారతీయులకు బిగ్ షాక్!
హెచ్-1బీ, ఎల్-1 వీసాల నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు కొత్త వీసాలు, ఉద్యోగ మార్పుల సమయంలో మాత్రమే వసూలు చేస్తున్న అదనపు రుసుమును.. ఇకపై వీసా రెన్యూవల్ (పొడిగింపు) సమయంలోనూ వర్తింపజేయాలని ప్రతిపాదించింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. అటు పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ నిపుణులను కొనసాగించే కంపెనీలపై భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS), కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) సంస్థలు తాజాగా ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం.. H-1B, L-1 వీసాలపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల స్టే పొడిగింపు దరఖాస్తులపైనా అదనపు ఫీజు విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రుసుము కొత్త H-1B, L-1 వీసా దరఖాస్తులు లేదంటే ఉద్యోగ మార్పు సమయంలో మాత్రమే వర్తిస్తోంది. అయితే కొత్త ప్రతిపాదన ఆమోదం పొందితే.. అదే కంపెనీలో కొనసాగుతున్న ఉద్యోగుల వీసా పునరుద్ధరణ సమయంలో కూడా సంస్థలు ఈ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పు ప్రధానంగా అమెరికాలో 50 మందికి పైగా ఉద్యోగులు కలిగి ఉండి.. వారిలో కనీసం సగం మంది H-1B లేదా L-1 వీసాలపై పనిచేస్తున్న సంస్థలకు వర్తించే అవకాశం ఉంది.భారతీయులపై ఎందుకు ప్రభావం ఎక్కువ?H-1B వీసా వ్యవస్థలో భారతీయ నిపుణుల వాటా అత్యధికంగా ఉంది. ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్వేర్, ఇంజినీరింగ్ రంగాల్లో వేలాది మంది భారతీయులు ఈ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్నారు. అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) గణాంకాల ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో ఆమోదమైన H-1B పిటిషన్లలో కొనసాగుతున్న ఉద్యోగాలకు సంబంధించినవి 2.91 లక్షలకు పైగా ఉన్నాయి. వీటిలో భారతీయుల వాటా సుమారు 77 శాతానికి పైగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఈ కొత్త ఫీజు విధానం అమల్లోకి వస్తే.. భారతీయ ఉద్యోగులను కొనసాగించే ఐటీ కంపెనీల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.ఐటీ కంపెనీలపై అదనపు భారంఅమెరికాలో భారీ సంఖ్యలో H-1B ఉద్యోగులను కలిగి ఉన్న టెక్నాలజీ సంస్థలు ఈ మార్పుతో ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అమెజాన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్, గూగుల్ వంటి సంస్థలు H-1B ఉద్యోగుల విషయంలో ముందంజలో ఉన్నాయి. వీసా పొడిగింపుల సమయంలో అదనపు రుసుము చెల్లించాల్సి వస్తే.. విదేశీ నిపుణులను కొనసాగించడం కంపెనీలకు మరింత ఖరీదైన వ్యవహారంగా మారవచ్చు.ఎంత ఫీజు?ప్రస్తుతం అర్హత కలిగిన కొన్ని సంస్థలు కొత్త H-1B దరఖాస్తుల సమయంలో సుమారు 4,000 డాలర్లు, L-1 వీసాల కోసం సుమారు 4,500 డాలర్లు వరకు అదనపు రుసుము చెల్లిస్తున్నాయి. ప్రతిపాదిత మార్పు అమల్లోకి వస్తే.. ఇదే భారం వీసా పొడిగింపు దరఖాస్తులకూ వర్తించే అవకాశం ఉంది.ఎందుకీ పెంపు?అమెరికా అధికారులు చెబుతున్న ప్రకారం.. ఈ అదనపు రుసుమును 9/11 భద్రతా చర్యల్లో భాగమైన బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ వ్యవస్థ నిర్వహణకు ఉపయోగించనున్నారు. ముఖ గుర్తింపు వంటి సాంకేతికతలతో ప్రయాణికుల ప్రవేశ, నిష్క్రమణలను పర్యవేక్షించే వ్యవస్థకు నిధులు సమకూర్చడమే లక్ష్యమని తెలిపారు. ఈ ప్రతిపాదన ద్వారా ఏడాదికి సుమారు 157 మిలియన్ డాలర్ల అదనపు ఆదాయం వస్తుందని అమెరికా అంచనా వేస్తోంది.తుది నిర్ణయం ఎప్పుడంటే..అయితే ఈ ప్రతిపాదన ఇంకా తుది నిబంధనగా మారలేదు. అమెరికా పరిపాలన తుది నిబంధనలను విడుదల చేసిన తర్వాతే అమలు తేదీ, పూర్తి వివరాలు స్పష్టమవుతాయి. ఇప్పటికే H-1B వీసా విధానంపై కఠిన వైఖరి అవలంబిస్తున్న ట్రంప్ ప్రభుత్వం.. తాజా ప్రతిపాదనతో విదేశీ నిపుణులను నియమించుకునే కంపెనీలపై మరింత నియంత్రణ తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది.మొత్తంగా.. H-1B, L-1 వీసాలపై ప్రతిపాదిత కొత్త ఫీజు విధానం అమల్లోకి వస్తే.. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులు, వారిని నియమించుకునే ఐటీ కంపెనీలపై ఖర్చుల భారం పెరిగే అవకాశం ఉంది. -
ట్రంప్‌నకు భారీ షాకిచ్చిన నెతన్యాహు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు షాకిచ్చారు. ట్రంప్ ప్రతిపాదించిన గాజా కాల్పుల విరమణ ముసాయిదాకు నెతన్యాహు బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. హమాస్ పూర్తిగా నిరాయుధీకరణ చేయకముందు గాజాలో ప్రస్తుతం తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లదని ఆయన స్పష్టం చేశారు. దీంతో, గాజా విషయంలో ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.కాగా, ట్రంప్ ప్రతిపాదించిన ముసాయిదా ప్రకారం, హమాస్ నిరాయుధీకరణ ప్రక్రియను ప్రారంభిస్తే, ఇజ్రాయెల్ దాడులను నిలిపివేసి గాజాలో ఆక్రమించిన సుమారు 60 శాతం ప్రాంతాల నుంచి దశలవారీగా ఉపసంహరణ ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ ప్రతిపాదనను ఇజ్రాయెల్ అంగీకరించలేదని నెతన్యాహు వెల్లడించారు.ఈ సందర్భంగా నెతన్యాహు..‘ట్రంప్ ప్రభుత్వం ఒక ముసాయిదా పంపింది. అది మా ముసాయిదా కాదు. మేము దానికి అంగీకరించలేదు. మా అభిప్రాయాలను వారికి పంపించాం. హమాస్ పూర్తిగా ఆయుధాలు వదిలిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయి’ అని సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో తెలిపారు. ఈ వ్యాఖ్యలతో ట్రంప్ ప్రతిపాదించిన ఒప్పందంపై ఇజ్రాయెల్ వైఖరి మరింత కఠినంగా మారినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో ఇజ్రాయెల్-అమెరికా మధ్య గాజా అంశంపై బహిరంగ విభేదాలు బయటపడినట్లు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.Netanyahu REJECTS US’ Gaza proposal‘Trump and his team think they can get Hamas to DISARM and DEMILITARIZE Gaza’‘They sent us a draft, we did not agree to it’Israel will NOT WITHDRAW from Gaza until ‘Hamas COMPLETELY DISARMED’ pic.twitter.com/wGn4EfJMMa— RT Intl (@RT_on_X) August 4, 2026మరోవైపు, గాజా నగరంలోని సబ్రా ప్రాంతంలో 2023 నవంబర్‌లో జరిగిన భారీ వైమానిక దాడి శిథిలాల నుంచి ఇటీవల వెలికితీసిన 112 మంది మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. ఆ దాడిలో 300 మందికిపైగా మరణించినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. వీరిలో అనేక మంది మృతదేహాలు ఇప్పటివరకు శిథిలాల కిందే ఉండిపోయాయని తెలిపారు. స్థానిక పౌర రక్షణ సంస్థ ప్రకారం, ఇంకా 157 మంది మృతదేహాలు శిథిలాల కిందే ఉన్నాయని అంచనా.73వేల మరణాలు.. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 73 వేల మందికిపైగా పాలస్తీనీయులు మరణించారు. ఇంకా వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ గణాంకాలపై ఇజ్రాయెల్ భిన్న అభిప్రాయం వ్యక్తం చేస్తూ, తమ దాడులు ఉగ్రవాద లక్ష్యాలపైనే జరుగుతున్నాయని చెబుతోంది. కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ, గాజాలో హింస పూర్తిగా ఆగలేదు. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు ఒప్పంద ఉల్లంఘన ఆరోపణలు చేసుకుంటున్నాయి. -
ట్రంప్ టారిఫ్‌లపై కోర్టుకెక్కిన 25 రాష్ట్రాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌పై మరోసారి వ్యతిరేకత వ్యక్తమైంది. బలవంతపు చాకిరిని నియంత్రణ పేరుతో ట్రంప్ ప్రభుత్వం గత నెలలో 60 దేశాలపై విధించిన టారిఫ్‌లపై అమెరికాలోని 25 డెమొక్రటిక్ పార్టీ పాలిత రాష్ట్రాలు అంతర్జాతీయ వాణిజ్య కోర్టుకు ఎక్కాయి. అమెరికా దిగుమతుల్లో సుమారు 99.4 శాతం వాటా ఉన్న ఉత్పత్తులపై ట్రంప్ ప్రభుత్వం 10 నుంచి 12.5 శాతం టారిఫ్ విధించిన విషయం తెలిసిందే.భారత్‌పై మొదట 12.5 శాతం పన్ను విధించినప్పటికీ జూలై 14న తాము వాణిజ్య విధానంలో మార్పులు చేసి బలవంతపు చాకిరి కారణంగా ఉత్పత్తి అయిన వస్తువుల దిగుమతిని నిషేధించామని స్పష్టం చేయడంతో టారిఫ్‌ను పది శాతానికి పరిమితం చేశారు. ఈ పన్నులు వినియోగదారులతోపాటు వ్యాపారాలపై అదనపు భారం మోపుతాయని కోర్టుకు ఎక్కిన రాష్ట్రాలు వాదిస్తున్నాయి.ఈ పన్నులు అక్రమమని ప్రకటిస్తూ రద్దు చేయాలని డెమొక్రటిక్ పాలిత రాష్ట్రాల తరఫున వాదిస్తున్న న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటీషియా జేమ్స్ డిమాండ్ చేశారు. టారిఫ్‌ల విషయంలో ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో ఓటమి చవిచూసిందని, దీంతో ఇప్పుడు మరో రకంగా వ్యాపారాలపై టారిఫ్‌లను రుద్దేందుకు ప్రయత్నిస్తోందని అని జేమ్స్ వ్యాఖ్యానించారు. -
క్రూడ్ ఆయిల్ ధరలు ఢమాల్!
అంతర్జాతీయ చమురు మార్కెట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపు 4 శాతం తగ్గి బ్యారెల్‌కు 77.11 డాలర్లకు చేరుకున్నాయి. ప్రపంచ చమురు మార్కెట్లలో సరఫరా, డిమాండ్ అంచనాలు, భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావంతో ధరల్లో ఈ భారీ మార్పు కనిపించింది.ఇటీవల వరకు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు కొంత స్థిరంగా ఉన్నప్పటికీ.. తాజాగా క్రూడ్ ఆయిల్ ధరలు క్షీణించాయి. ట్రేడింగ్ సమయంలో ధరలు వేగంగా పడిపోవడం మార్కెట్లో ఆందోళనకు దారితీసింది. దీనికి ప్రధాన కారణం అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్చల్లో పురోగతి వస్తుందన్న అంచనాలు.ప్రపంచంలోని కీలక చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గితే, భవిష్యత్తులో చమురు సరఫరా సులభతరం అవుతుందని మార్కెట్లు భావిస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారులు కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా.. ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఉన్న అనిశ్చితి కూడా చమురు ధరలపై ప్రభావం చూపుతోంది. ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తే ఇంధన డిమాండ్ తగ్గుతుందనే అంచనాలు ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి.చమురు ధరలు తగ్గుదల.. వినియోగదారులకు కొంత ఊరటనిస్తుంది. ఎందుకంటే.. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గితే పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అలాగే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో కూడా ఇది సహాయపడవచ్చు. -
మనీ లాండరింగ్ సందేహాలు.. యూఎస్ కోర్టులో క్యాపిటల్ వన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన ‘ట్రంప్ ఆర్గనైజేషన్’ బ్యాంక్ ఖాతాల రద్దు వివాదంలో మలుపు చోటుచేసుకుంది. 2021లో ట్రంప్ కుటుంబానికి చెందిన 300కి పైగా ఖాతాలను మూసివేయడానికి ఎలాంటి రాజకీయ కారణాలు లేవని, మనీ లాండరింగ్ సమీక్షలో వెల్లడైన తీవ్రమైన ఆర్థిక లావాదేవీల సందేహాలే అసలు కారణమని ప్రముఖ ఆర్థిక సంస్థ ‘క్యాపిటల్ వన్’ అమెరికా ఫెడరల్ కోర్టుకు స్పష్టం చేసింది.రాజకీయ కక్షసాధింపు కాదన్న బ్యాంక్2021 జనవరి 6న వాషింగ్టన్ క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి అనంతరం తమ రాజకీయ భావజాలం నచ్చక బ్యాంక్ అక్రమంగా తమ ఖాతాలను మూసివేసిందని (‘డీ-బ్యాంకింగ్’) ట్రంప్, ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్ ఫ్లోరిడాలోని ఫెడరల్ కోర్టులో దావా వేశారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ క్యాపిటల్ వన్ కోర్టులో కీలక పిటిషన్ దాఖలు చేసింది.తమ 'యాంటీ మనీ లాండరింగ్' నిపుణుల బృందం నెలల తరబడి జరిపిన సమగ్ర విశ్లేషణ, సందేహాస్పద ఆర్థిక లావాదేవీల తీరుతెన్నుల పరిశీలన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ తెలిపింది. ఫెడరల్ బ్యాంకింగ్ మార్గదర్శకాలు, బ్యాంక్ అంతర్గత నియమావళి ప్రకారమే ఖాతాలను క్లోజ్ చేశామని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రేరేపిత కోణం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా వేరే బ్యాంకుల్లో ఖాతాలు తెరుచుకోవడానికి ట్రంప్ బృందానికి అనేక నెలల సమయం, పొడిగింపులు కూడా ఇచ్చామని నివేదికలో పేర్కొంది.బిలియన్ డాలర్ల లీగల్ పోరాటంక్యాపిటల్ వన్‌తో పాటు మరొక దిగ్గజ బ్యాంక్ ‘జేపీమోర్గన్ ఛేజ్’పై కూడా ట్రంప్ 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.41,500 కోట్లు) పరిహారం కోరుతూ దావా వేశారు. అమెరికాలో కన్జర్వేటివ్ నాయకులు, వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని బ్యాంకింగ్ వ్యవస్థల నుంచి తొలగిస్తున్నారని ట్రంప్ వర్గం తీవ్రంగా ఆరోపిస్తోంది. అయితే, చట్టపరమైన లేదా ఇమేజ్ పరమైన ముప్పు ఉన్న ఖాతాలపై రిస్క్ నిర్వహణలో భాగంగా చర్యలు తీసుకోవడం సాధారణ ప్రక్రియ అని బ్యాంకింగ్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.పెరిగిన డీ-బ్యాంకింగ్ వివాదంఈ వివాదం అమెరికా రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ట్రంప్ తన రెండో విడత పాలనలో ‘అమెరికన్లందరికీ న్యాయమైన బ్యాంకింగ్ హక్కులు’ పేరుతో ప్రత్యేక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. రాజకీయ ప్రాతిపదికన కస్టమర్ల ఖాతాలను మూసివేయడాన్ని ఇది నిషేధిస్తుంది. ఒకవైపు మనీ లాండరింగ్ నిబంధనలను బ్యాంకింగ్ దిగ్గజాలు కోర్టులో తెరపైకి తెస్తుండగా, మరొకవైపు ట్రంప్ న్యాయ బృందం దీనిని వ్యాపార ప్రత్యర్థుల కుట్రగా అభివర్ణిస్తుండటంతో ఈ చట్టపరమైన పోరాటం అంతర్జాతీయ ఆర్థిక వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.ఇదీ చదవండి: మెరుపు తగ్గిన మేలిమి బంగారం -
యుద్ధం ఆపేందుకు తలపట్టుకుంటున్న ట్రంప్?
వాషింగ్టన్: ఇరాన్‌పై దాడులకు అమెరికా సెంట్రల్ కమాండ్ సరికొత్త వ్యూహం అనుసరించనుందా అంటే అవుననే సమాధానమస్తుంది.. ఈ విషయమై ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చేలా సరికొత్త వ్యూహాలను తెలియజేయాలని ఆ దేశంలోని సైనికులను కోరిందట.. సంప్రదాయేతర, సృజనాత్మక మార్గాలను" సూచించాల్సిందిగా విస్తృత శ్రేణి సైనిక విశ్లేషకులను సంప్రదించిందని కథనాలు పేర్కొన్నాయి.ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ఉంది.. ఇరాన్‌పై దాడి చేసి వారం రోజుల్లోగా యుద్ధాన్ని ముగించవచ్చు అనకున్న ట్రంప్‌కు యుద్దం ప్రారంభమై ఐదునెలలు గడుస్తోన్నా యుద్ధం ముగించే దారి దొరకడం లేదు. అలా అని ఇరాన్ భూభాగంలోకి సైనికులను పంపితే పెద్దఎత్తున ప్రాణనష్టం జరిగే అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అలాగని దాడులు ఆపేస్తే అమెరికా పట్టు సడలిపోతుంది. దీంతో ఏం చేయాలో తోచక తల పట్టుకోవాల్సిన పరిస్తితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో యూఎస్ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ కొత్తగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఇరాన్‌ను ఏవిధంగా మరింతగా దెబ్బతీయవచ్చు లేదా కట్టడి చేయవచ్చు అనే అంశంపై ఆర్మీ విశ్లేషకులు, అధికారుల నుంచి కొత్త ప్రతిపాదనలను సేకరించాలని ఒక సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంతర్గతంగా ఈ అభ్యర్థనను పంపినట్లు సమాచారం. ఇరాన్‌తో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడటం ,పరిమితమైన సైనిక ప్రత్యామ్నాయాలు ఉన్న నేపథ్యంలో అమెరికా ఈ సరికొత్త విశ్లేషణలు లేదా ఆలోచనల కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.సీఎన్ఎన్ (CNN) నివేదిక ప్రకారం.. గత వారం సెంట్రల్ కమాండ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌లోని ఒక అధికారి ఈమెయిల్ ద్వారా ఈ బ్రెయిన్‌స్టార్మింగ్ (ఆలోచనల సేకరణ) సెషన్‌ను ప్రారంభించారు. ఈమెయిల్ ద్వారా ఇలా ప్రజల లేదా సిబ్బంది అభిప్రాయాలను సేకరించడం (క్రాగ్సోర్సింగ్ పద్ధతి) సైన్యంలో చాలా అరుదైన విషయం, ఈ విషయాన్ని పట్టి చూస్తే తన నిబంధనల ప్రకారం ఇరాన్‌ను ఒప్పందానికి అంగీకరించేలా చేయడానికి అధ్యక్షుడు ట్రంప్‌కు చాలా కష్టమని తెలుస్తోందని కథనాలు ప్రచురించాయి.అమెరికా గత కొన్ని వారాలుగా ఇరాన్‌పై పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేస్తున్నప్పటికీ, ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం, తమ వైఖరి మార్చుకోకపోవడంతో అమెరికా రక్షణ రంగానికి ఒక రకమైన ప్రతిష్టంభన ఏర్పడింది. కేవలం బాంబులు వేయడం వల్ల ఇరాన్‌ను లొంగదీసుకోవడం సాధ్యం కాదనే వాస్తవం అమెరికాకు అర్థమయ్యింది. ఒకవేళ ఇరాన్ భూభాగంలోకి గ్రౌండ్ ట్రూప్స్ (భూతల సైన్యం)ను పంపడం లేదా భూగర్భంలో ఉన్న అణు కేంద్రాలపై భారీ దాడులు చేయడం వల్ల అమెరికాకు ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంది. అలాగే ఆయుధ నిల్వలు తరిగిపోవడం, చమురు ధరలు పెరగడం వంటి సమస్యల వల్ల అమెరికా ప్రత్యక్షంగా పెద్ద యుద్ధానికి వెనుకంజ వేస్తోంది.దీంతో కొత్త దారుల కోసం అన్వేషణ ఇప్పటివరకు అనుసరించిన పద్ధతులు కాకుండా, ఎలాంటి పెద్ద యుద్ధ నష్టం లేకుండా ఇరాన్‌ను దెబ్బతీయడానికి లేదా చర్చల ముందుకు రప్పించడానికి పూర్తిగా భిన్నమైన, ఎవరూ ఊహించని మార్గాలు అవసరమని అమెరికా సైనిక వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరగా ఒక విజయాన్ని లేదా స్పష్టమైన ఒప్పందాన్ని కోరుకుంటున్నప్పటికీ, దానికి తగిన సరైన సైనిక ప్రత్యామ్నాయాలు తక్షణమే అందుబాటులో లేకపోవడాన్ని ఈ అంతర్గత ఈమెయిల్ స్పష్టం చేస్తోంది. -
‘మీకు బోలెడు లాభాలొచ్చాయ్’
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టినప్పటికీ పెట్రోల్ బంకుల్లో సామాన్య వినియోగదారులకు ధరల ఉపశమనం లభించకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలోని ప్రధాన చమురు కంపెనీలు అనైతికంగా విపరీతమైన లాభాలు ఆర్జిస్తున్నాయని ఆరోపిస్తూ పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను తక్షణమే తగ్గించాలని ఆదేశించారు. ‘చమురు దిగ్గజాలు అధిక లాభాలు గడిస్తున్నాయి. పెట్రోల్ బంకుల్లో ఇంధన ధరలను వెంటనే తగ్గించండి’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో హెచ్చరిక జారీ చేశారు.ఇటీవల పశ్చిమాసియాలో ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలు, సరఫరా అడ్డంకుల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగి ఎక్సన్ మొబిల్, షెవ్రాన్ వంటి అమెరికన్ చమురు సంస్థలు గత త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలను నమోదు చేశాయి. అయితే, మిలిటరీ చర్యలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 83 డాలర్ల స్థాయికి పడిపోయాయి. ముడిచమురు ధరలు పడిపోయినా రిటైల్ మార్కెట్లో పెట్రోల్ ధరలను తగ్గించకుండా కంపెనీలు లాభపడటంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈక్రమంలో షెవ్రాన్ సీఈఓ మైక్ విర్త్‌ను ట్రంప్ నేరుగా లక్ష్యంగా చేసుకున్నారు. తమ ప్రభుత్వ వ్యూహాత్మక విధానాలు, మద్దతు వల్లే వెనిజువెలా వంటి ప్రాంతాల్లో షెవ్రాన్ తిరిగి బలమైన స్థానానికి చేరుకుని భారీగా ఆర్జిస్తోందని, కానీ ఆ క్రెడిట్‌ను యాజమాన్యం గుర్తించడం లేదని విమర్శించారు. ‘ప్రభుత్వ పరిపాలన అందించిన మద్దతు, స్థిరత్వం లేకపోతే అమెరికా చమురు పరిశ్రమ దెబ్బతినేది. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన కంపెనీలు ఆ ప్రయోజనాన్ని ధరల తగ్గింపు రూపంలో ప్రజలకు అందించాల్సిందే’ అని స్పష్టం చేశారు.అమెరికాలో త్వరలో జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో పెరుగుతున్న జీవన వ్యయం, ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు రిపబ్లికన్ పార్టీకి రాజకీయంగా పెద్ద సవాలుగా మారాయి. దీంతో ఓటర్ల అసంతృప్తిని చల్లార్చేందుకు ట్రంప్ ఇంధన దిగ్గజాలపై ఒత్తిడి పెంచుతున్నారు. చమురు కంపెనీలు వెంటనే స్వీయ నియంత్రణ పాటించి బంకుల్లో ధరలు తగ్గించకపోతే ధరల పెంపుపై జస్టిస్ డిపార్ట్మెంట్ ద్వారా విచారణ జరిపించేందుకు సైతం వైట్‌హౌస్ వెనుకాడకపోవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: దేశంలోనే అత్యధిక శ్రీమంతులున్న టాప్-10 ఇంటిపేర్లు -
ట్రంప్‌కు బిగ్ షాక్.. టారిఫ్‌లపై కోర్టుకెక్కిన 25 రాష్ట్రాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న టారిఫ్ విధానానికి సొంత దేశంలోనే సవాళ్లు ఎదురవుతున్నాయి. భారత్ సహా 60 దేశాలపై విధించిన కొత్త దిగుమతి సుంకాలను నిలిపివేయాలని కోరుతూ అమెరికాలోని 25 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్ ప్రభుత్వం తన అధికారాలను మించి వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ దాఖలైన ఈ పిటిషన్.. ఆయన వాణిజ్య విధానానికి మరో న్యాయ పరీక్షగా మారింది.ట్రంప్ ప్రభుత్వం గత నెలలో ట్రేడ్ యాక్ట్-1974లోని సెక్షన్ 301 కింద కొత్త టారిఫ్‌లను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ సుంకాలు 10 శాతం నుంచి 12.5 శాతం వరకు ఉన్నాయి. భారత్, యూరోపియన్ యూనియన్ సహా మొత్తం 60 వాణిజ్య భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఇవి వర్తిస్తున్నాయి. అయితే బలవంతపు కార్మిక వ్యవస్థ ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతులను అడ్డుకోవడం, వాణిజ్య నిబంధనలను కఠినతరం చేయడమే ఈ టారిఫ్‌ల ఉద్దేశమని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది.“అధ్యక్ష అధికారాలను ఆయన దాటారు”ఈ టారిఫ్‌లను వ్యతిరేకిస్తూ 25 డెమొక్రటిక్ పాలిత రాష్ట్రాలు అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టులో పిటిషన్(U.S. Court of International Trade) దాఖలు చేశాయి. ఒరెగాన్, న్యూయార్క్ వంటి రాష్ట్రాలు ఈ న్యాయపోరాటంలో ఉన్నాయి. ట్రంప్ ప్రభుత్వం గతంలో కోర్టులు తప్పుబట్టిన విస్తృత టారిఫ్ విధానాన్నే మరో చట్టపరమైన మార్గంలో అమలు చేస్తోందని రాష్ట్రాలు ఆరోపించాయి. సెక్షన్ 301ను సాధారణంగా నిర్దిష్ట దేశాలు లేదంటే పరిశ్రమల అన్యాయ వాణిజ్య చర్యలపై ఉపయోగిస్తారని.. దాదాపు అన్ని దిగుమతులపై భారీ సుంకాలు విధించేందుకు ఉపయోగించలేమని వాదించాయి.ఈ కేసు ప్రస్తుతం అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టు పరిశీలనలో ఉంది. పిటిషన్‌పై తదుపరి విచారణ షెడ్యూల్ కోసం ఇరు వర్గాలు ఎదురుచూస్తున్నాయి. కోర్టు నిర్ణయం ట్రంప్ టారిఫ్ విధాన భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశముంది.భారత్‌పై ప్రభావం ఎంత?ట్రంప్ కొత్త టారిఫ్‌ల పరిధిలో భారత్ కూడా ఉంది. తొలుత భారత్‌పై 12.5 శాతం సుంకం విధించగా.. కొన్ని చర్యల తర్వాత దాన్ని 10 శాతానికి తగ్గించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. అయితే చమురు, సహజ వాయువు, ఎరువులు వంటి కొన్ని ఉత్పత్తులకు ఈ కొత్త సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చారు. అయినప్పటికీ భారత్ నుంచి అమెరికాకు వెళ్లే పలు ఉత్పత్తులపై ఈ టారిఫ్‌ల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.ట్రంప్ టారిఫ్ విధానంపై వరుస ఎదురుదెబ్బలుటారిఫ్లను అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు కీలక ఆయుధంగా ట్రంప్ భావిస్తున్నారు. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి.. అమెరికా తయారీ రంగాన్ని ప్రోత్సహించడమే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు. అయితే ఆయన తీసుకున్న టారిఫ్ నిర్ణయాలకు ఇప్పటికే న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. గతంలో అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద విధించిన భారీ సుంకాలపై అమెరికా కోర్టులు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అనంతరం ట్రంప్ ప్రభుత్వం ఇతర చట్టపరమైన మార్గాలను అనుసరిస్తోంది.మరోసారి కోర్టు తీర్పుపైనే ఉత్కంఠతాజాగా 25 రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్.. ట్రంప్ వాణిజ్య విధానానికి కీలక పరీక్షగా మారింది. కోర్టు ఈ టారిఫ్‌లను నిలిపివేస్తే ట్రంప్ ఆర్థిక ఎజెండాకు పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది. ఒకవేళ కోర్టు ప్రభుత్వం వైపు మొగ్గుచూపితే.. భవిష్యత్తులో మరిన్ని దేశాలపై సుంకాల విధింపుకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతం అమెరికా కోర్టు నిర్ణయం కోసం వాణిజ్య వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ తీర్పు భారత్ సహా పలు దేశాలతో అమెరికా వాణిజ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశముంది. -
ఇరాన్‌పై ట్రంప్ ‘టూ ఆప్షన్స్’ బాంబ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చర్చల విషయంలో ఇరాన్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరాన్ ముందు ఇప్పుడు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని.. వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవడం తప్ప మరో మార్గం లేదని అల్టిమేటం జారీ చేశారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ బహిరంగంగా అమెరికాతో చర్చలు జరగడం లేదని చెబుతున్నప్పటికీ, సమస్య పరిష్కారం కోసం చర్చలకు ప్రయత్నించిందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఇరాన్ సృష్టించిన సమస్యకు పరిష్కారం కోసం తాము చర్చలు జరుపుతున్నామని అన్నారు.“ఒకటి ఒప్పందం చేసుకోవడం.. లేదంటే పూర్తిగా లొంగిపోవడం” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.హర్ముజ్ జలసంధిపై ట్రంప్ హెచ్చరికప్రపంచంలోని అత్యంత కీలకమైన వాణిజ్య మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధి అంశంపైనా ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతంపై అమెరికా నౌకాదళానికి పూర్తి నియంత్రణ ఉందని, తమ అనుమతి లేకుండా ఇరాన్‌కు ఎలాంటి రాకపోకలు జరగవని స్పష్టం చేశారు. “ఒప్పందం కుదిరే వరకు లేదా పూర్తిగా లొంగిపోయే వరకు ఎలాంటి మార్పు ఉండదు” అనే రీతిలో ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి.దాడి నుంచి చర్చల వైపు ట్రంప్ అడుగుఇరాన్పై రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద దాడి చేస్తామని మొన్న హెచ్చరించిన ట్రంప్.. నిన్న ఆ సైనిక చర్యను తాత్కాలికంగా నిలిపివేశారు. గల్ఫ్ దేశాలు ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ నేతల సూచనలతో పాటు దౌత్య మార్గాలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు సోమవారం ప్రారంభమవుతాయని ట్రంప్ చెప్పినప్పటికీ.. వాటి వివరాలను వెల్లడించలేదు.ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ రియాక్షన్ ఇదేఅంతకు ముందు అమెరికా వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. ప్రస్తుతం వాషింగ్టన్‌తో ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ.. అమెరికాతో చర్చలు జరుగుతున్నాయన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ప్రస్తుతం తాము ఒమన్‌తో మాత్రమే సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. హర్ముజ్ జలసంధిలో తాత్కాలిక సురక్షిత రాకపోకల ఏర్పాటుకు సంబంధించిన చర్చలు మాత్రమే జరుగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇరాన్‌కు డీల్ లేదంటే పూర్తిగా లొంగిపోవడం అనే ఆప్షన్లు ఉంచారు. అయితే ట్రంప్ ఫ్రెష్వార్నింగ్పై ఇరాన్ స్పందన రావాల్సి ఉంది. మరోవైపు.. ఇరాన్ తన సార్వభౌమత్వంపై రాజీపడబోదనే సంకేతాలు ఇస్తోంది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని చెబుతూనే, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా దౌత్య మార్గాలను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే క్షిపణి బెదిరింపులు, సైనిక కదలికలతో వేడెక్కిన పరిస్థితుల్లో.. ట్రంప్ తాజా అల్టిమేటం, ఇరాన్ తిరస్కరణతో తదుపరి పరిణామాలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. -
మళ్లీ చర్చల వంతు: ట్రంప్
కైరో/వాషింగ్టన్: ఇరాన్ విషయంలో గత కొన్ని వారాలుగా క్షిపణులు, డ్రోన్లకు పనిచెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మంతనాల కోసం మధ్యవర్తులకు పనిచెప్పారు. యుద్ధంలో మారణహోమం తప్పితే సత్ఫలితాలు ఏమీ ఉండవని, అందుకే చర్చల పర్వానికి తెరతీస్తున్నానని సోమవారం ప్రకటించారు. ఈ మేరకు అధ్యక్షుని అధికార విమానం ‘ఎయిర్‌ఫోర్స్ వన్’లో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ‘‘ఇరాన్‌పై కనివినీ ఎరుగని స్థాయిలో దాడులకు సిద్ధమయ్యాం. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఎన్నడూ ఎవరూ చూడని భీకరస్థాయిలో ఇరాన్‌పై దాడులు చేయాలని నిర్ణయించాం. తీరా రణరంగంలోకి దూకే వేళ పశ్చిమాసియాలో సౌదీ అరేబియాసహా మా మిత్రదేశాలు వద్దు అని వారించాయి. చర్చల మార్గం తెరచే ఉందని గుర్తుచేశాయి. అందుకే మళ్లీ చర్చల మార్గంలో అమెరికా పయనిస్తోంది. చర్చలకు రావాలని ఇరాన్ అధికారులు సైతం ఆహ్వానాలు అందాయి. అందుకే సోమవారం నుంచి మధ్యవర్తుల ద్వారా చర్చలు మొదలుపెడతాం’’అని ట్రంప్ ప్రకటించారు. చర్చలు లేవన్న ఇరాన్ ఇరాన్ సోమవారం ట్రంప్ ప్రకటనకు భిన్నంగా స్పందించింది. ‘‘ఒమన్‌తో మాత్రమే మేం చర్చలు జరుపుతున్నాం. అది కూడా నౌకల సురక్షిత ప్రయాణ అంశంపై చర్చిస్తున్నాం. అమెరికాతో ప్రస్తుతం సంప్రతింపుల ప్రక్రియ నిలిచిపోయింది’’అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ సోమవారం స్పష్టంచేశారు. -
ట్రంప్.. అబ్బో! చాలా దూరం వెళ్లారా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం ఇచ్చే అంశాల్లో వలస విధానం ఒకటి. అక్రమ వలసదారులపై కఠిన చర్యలు, భారీ స్థాయిలో బహిష్కరణలు, సరిహద్దు నియంత్రణ వంటి నిర్ణయాలతో ట్రంప్ తన మద్దతుదారుల్లో బలమైన గుర్తింపు సంపాదించారు. అయితే ఇప్పుడు అదే వలస విధానం ఆయనకు రాజకీయ సవాల్‌గా మారుతోందా?.. తాజా సర్వే ఫలితాలు అలాంటి సంకేతాలనే ఇస్తున్నాయి.ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాల విషయంలో పెద్ద సంఖ్యలో అమెరికన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్–NORC సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. అక్రమ వలసదారులపై చర్యలు తీసుకోవడంలో, చట్టబద్ధ వలసలను పరిమితం చేయడంలో ట్రంప్ తన అధికార పరిధిని మించుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ప్రారంభంలో ఆయన వలస విధానానికి ఉన్న మద్దతు 49 శాతంగా ఉండగా.. ప్రస్తుతం అది 39 శాతానికి పడిపోయింది. అంటే కేవలం కొన్ని నెలల్లోనే మద్దతు 10 శాతం పాయింట్లు తగ్గినట్లు సర్వే చెబుతోంది. 2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో వలసల అంశం ట్రంప్ ప్రచారంలో కీలకంగా మారిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను దేశం నుంచి పంపించే విషయంలో ట్రంప్ తన అధికారాన్ని మించి వ్యవహరిస్తున్నారని 47 శాతం మంది అమెరికన్లు భావిస్తున్నారు. చట్టబద్ధ వలసలపై ఆంక్షలు విధించే విషయంలోనూ దాదాపు సగం మంది ప్రజలు ఆయన చర్యలు మరీ కఠినంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అయితే ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్లలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. దాదాపు 80 శాతం మంది రిపబ్లికన్ ఓటర్లు ట్రంప్ వలస విధానాలను సమర్థిస్తున్నారు. వలసల అంశం ఇప్పటికీ ఆయన బేస్ ఓటర్లను ఏకం చేసే ప్రధాన అంశంగానే కొనసాగుతోంది. అయితే కొన్ని చర్యలపై మాత్రం విస్తృత స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. వలసదారులను గుర్తించేందుకు ట్రాఫిక్ తనిఖీలను ఉపయోగించడం, ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లను నగరాల్లోకి పంపించడం వంటి చర్యలు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయని పలువురు అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. వలస నియంత్రణ అవసరమే అయినప్పటికీ.. దాని అమలు విధానం ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా ఉండాలని కోరుతున్నారు.వలస విధానంతో పాటు ఆర్థిక అంశాల్లోనూ ట్రంప్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆయన నిర్వహిస్తున్న తీరుపై కేవలం 32 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదని దాదాపు 70 శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడటం గమనార్హం. అయితే రిపబ్లికన్ ఓటర్లలో మాత్రం ట్రంప్‌పై నమ్మకం కొనసాగుతోంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆయన పనితీరును 69 శాతం మంది రిపబ్లికన్లు సమర్థించారు.వలసలపై కఠిన వైఖరి ట్రంప్ రాజకీయ గుర్తింపులో కీలక భాగం. సరిహద్దు భద్రత, అక్రమ వలసల నియంత్రణ అంశాలతో ఆయన తన మద్దతు వర్గాన్ని బలపరిచారు. కానీ తాజా సర్వే మరో విషయాన్ని సూచిస్తోంది. ట్రంప్ ప్రధాన మద్దతుదారులు ఆయన వెంటే ఉన్నప్పటికీ.. మధ్యస్థ ఓటర్లు, స్వతంత్ర ఓటర్లలో అసంతృప్తి పెరుగుతోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.వలసలపై ట్రంప్ దూకుడు.. అదే అంశం ఇప్పుడు ఆయనకు కొత్త సవాల్‌గా మారుతోందా? తాజా సర్వే మాత్రం అమెరికన్లలో మారుతున్న అభిప్రాయాలకు అద్దం పడుతోంది. రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ అంశం కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. కఠిన వలస విధానాలు ట్రంప్‌కు రాజకీయ బలాన్నిస్తాయా? లేక సాధారణ అమెరికన్లలో వ్యతిరేకతను పెంచుతాయా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
యుద్ధానికి బ్రేక్.. ఇరాన్ కీలక ప్రకటన
అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నడుమ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. క్షిపణులు, దాడుల హెచ్చరికలతో హోరెత్తిన వాతావరణం ఒక్కసారిగా చర్చల వైపు మళ్లింది. ఇరాన్‌పై భారీ సైనిక చర్యకు సిద్ధమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు దౌత్య మార్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని ప్రకటించిన ట్రంప్.. సోమవారం నుంచి చర్చలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. దీంతో పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ భయాలు కొంత తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఇరాన్ కీలక మౌలిక వసతులపై భారీ దాడులకు అమెరికా ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ.. చివరి దశలో వాటిని నిలిపివేసినట్లు ట్రంప్ తెలిపారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతార్ వంటి గల్ఫ్ దేశాలు యుద్ధాన్ని విస్తరించకుండా దౌత్య పరిష్కారానికి అవకాశం ఇవ్వాలని కోరినట్లు ట్రంప్ చెప్పారు.ఇరాన్‌పై తాను చేపట్టబోయిన సైనిక చర్య సాధారణ దాడి కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆ దాడి జరిగి ఉంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద దాడుల్లో ఒకటిగా నిలిచేదని వ్యాఖ్యానించారు. “నేను ప్రజలను చంపాలని కోరుకోవడం లేదు. యుద్ధంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. ఒకవేళ దాడి జరిగి ఉంటే భారీ విధ్వంసం జరిగేది.. తిరిగి నిర్మించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టేది” అని ట్రంప్ పేర్కొన్నారు.అందుకే యుద్ధం కంటే చర్చల ద్వారా పరిష్కారం సాధించడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌తో ఒప్పందం కుదిరితే ప్రాణనష్టం, విధ్వంసం రెండింటినీ నివారించవచ్చని తెలిపారు.“ఇరాన్‌తో ఒక ఒప్పందం దగ్గరలోనే ఉంది” అని ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. అయితే ఈ ఒప్పందంలో ఏ అంశాలపై రాజీ కుదరబోతోందన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.ఇరాన్ కీలక వ్యాఖ్యలుమరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ కూడా అమెరికాతో చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి అమెరికా కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. “అమెరికా తన హామీలను గౌరవించాలి.. పరస్పర నమ్మకంతో ముందుకు సాగాలి” అనే సంకేతాలను పెజెష్కియన్ ఇచ్చారు.జూన్‌లో కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందమే భవిష్యత్‌లో ఇరాన్ విదేశాంగ విధానానికి కీలక ఆధారంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఇరాన్ తన ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో వెనక్కి తగ్గబోదని కూడా ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.టెహ్రాన్‌కు దౌత్య బృందాలు!అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు మార్గం సుగమం చేసేందుకు మధ్యవర్తి దేశాలు రంగంలోకి దిగుతున్నాయి. గత 24 గంటల్లో చోటుచేసుకున్న పరిణామాల తర్వాత.. టెహ్రాన్‌లో పరోక్ష చర్చలకు వేదిక సిద్ధమవుతోందని సమాచారం. అమెరికా, ఇరాన్ మధ్య నేరుగా చర్చలు కాకుండా.. ఒమన్, ఖతార్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉంది.ఇప్పటికే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.. సౌదీ అరేబియా, పాకిస్థాన్ తదితర దేశాలతో సంప్రదింపులు జరిపారు. ప్రాంతీయ దేశాల సహకారంతో యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించి, హార్ముజ్ జలసంధి విషయంలో ఒక అవగాహనకు రావడమే లక్ష్యంగా దౌత్య ప్రయత్నాలు సాగుతున్నాయి.హర్ముజ్ జలసంధిపై అసలు పోరుఅమెరికా-ఇరాన్ చర్చల్లో అత్యంత కీలక అంశంగా హర్ముజ్ జలసంధి మారింది. ప్రపంచ చమురు రవాణాలో ఈ మార్గానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ మార్కెట్లకు వెళ్లే భారీ స్థాయి చమురు రవాణా ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. అందుకే ఏ చిన్న అంతరాయం ఏర్పడినా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.. ఒమన్‌తో హార్ముజ్ నిర్వహణపై జరుగుతున్న చర్చలు చివరి దశకు చేరుకున్నాయని వెల్లడించారు. అయితే ఇవి అమెరికాతో నేరుగా జరుగుతున్న చర్చలు కావని ఇరాన్ స్పష్టం చేసింది. యుద్ధానికి ముందు ఉన్న పరిస్థితులకు హర్ముజ్‌ను పూర్తిగా తీసుకెళ్లడం సాధ్యం కాదని కూడా సంకేతాలు ఇచ్చింది.హర్ముజ్ కోసం తెర వెనుక డీల్!హర్ముజ్ జలసంధి విషయంలో కొత్త విధానం రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరు పర్యవేక్షిస్తారు? నౌకల రాకపోకలు ఎలా ఉంటాయి? భద్రతా ఏర్పాట్లు ఎలా ఉండాలి? వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల్లో ఒమన్ కీలక పాత్ర పోషిస్తోంది. గతంలోనూ అమెరికా-ఇరాన్ మధ్య రహస్య దౌత్య చర్చలకు ఒమన్ వేదికగా నిలిచింది.ఇరాన్ వ్యూహం.. చర్చలు కూడా, ఒత్తిడి కూడాఇరాన్ ఒకవైపు చర్చలకు సిద్ధమని చెబుతూనే.. మరోవైపు తన వ్యూహాత్మక బలాన్ని కొనసాగిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.. సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తదితరులతో సంప్రదింపులు జరిపారు. ప్రాంతీయ భద్రత, స్థిరత్వంపై చర్చించినట్లు ఇరాన్ వెల్లడించింది. అయితే హార్ముజ్‌పై తన ప్రభావాన్ని మాత్రం కొనసాగించాలని భావిస్తున్నట్లు స్పష్టం చేసింది.అణు అంశమే అసలు పరీక్ష!అమెరికా-ఇరాన్ మధ్య జరిగే ఏ ఒప్పందానికైనా అణు కార్యక్రమం ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఇరాన్ అణు సామర్థ్యాలను పరిమితం చేయాలని అమెరికా కోరుతోంది. మరోవైపు తమపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఈ రెండు అంశాలపై రాజీ కుదిరితేనే చర్చలు విజయవంతమయ్యే అవకాశం ఉంది.ట్రంప్ ప్రకటనతో చమురు ధరలు దిగొచ్చాయియుద్ధ భయాల మధ్య పెరిగిన చమురు ధరలు ట్రంప్ తాజా ప్రకటనతో తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 4 డాలర్లకు పైగా పడిపోయింది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరట లభిస్తుందని మార్కెట్లు భావిస్తున్నాయి.ఎర్రసముద్రంలో ఉత్కంఠ!మరోవైపు సౌదీ అరేబియా నుంచి బయలుదేరిన రెండు చమురు నౌకలు బాబ్ అల్ మందెబ్ జలసంధిని దాటాయి. హౌతీల హెచ్చరికల మధ్య కూడా చమురు రవాణా కొనసాగుతుండటం గమనార్హం. అయితే భద్రతా కారణాలతో కొన్ని నౌకలు తమ ఆటోమేటిక్ ట్రాకింగ్ వ్యవస్థలను నిలిపివేసినట్లు సమాచారం.ఇజ్రాయెల్ చూపు చర్చలపైనేఅమెరికా-ఇరాన్ చర్చలను ఇజ్రాయెల్ కూడా నిశితంగా పరిశీలిస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమంపై ఎలాంటి రాజీ వచ్చినా అది తమ భద్రతకు ముప్పుగా భావించే ఇజ్రాయెల్.. గతంలో ఇరాన్‌పై కఠిన వైఖరి ప్రదర్శించింది. అందుకే ఈ చర్చలు కేవలం వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య వ్యవహారం కాకుండా మొత్తం పశ్చిమాసియా భవిష్యత్తును ప్రభావితం చేసే పరిణామంగా మారాయి.యుద్ధానికి ముగింపా? లేదంటే.. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు మార్గం సుగమమైనప్పటికీ.. పూర్తి ఒప్పందం ఇంకా దూరంలోనే ఉంది. హర్ముజ్ నియంత్రణ, అణు కార్యక్రమం, ఆంక్షల తొలగింపు, భద్రతా హామీలపై ఇరు దేశాల మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయి. యుద్ధం అంచుల నుంచి చర్చల బల్లపైకి వచ్చిన అమెరికా-ఇరాన్ సంబంధాలు.. నిజంగా శాంతి దిశగా అడుగులు వేస్తాయా? లేక ఇది కేవలం వ్యూహాత్మక విరామమేనా? అన్నది రాబోయే చర్చలే తేల్చనున్నాయి. -
త్వరలోనే యుద్ధానికి ముగింపు
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ముద్ధం త్వరలో ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలిచ్చారు. ఇరాన్‌పై యుద్ధాన్ని ముగించడానికి గల్ఫ్‌లోని మిత్రదేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయని తెలిపారు. ఐదు నెలలుగా కొనసాగుతున్న ఈ సంఘర్షణలో ప్రస్తుతానికి కొత్త దాడులకు ఆదేశాలు జారీ చేయడాన్ని వాయిదా వేస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రంప్ శనివారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. యుద్ధానికి ముగించడానికి వీలుగా ఇరాన్‌తో ఒప్పందాన్ని పూర్తి చేసే విషయంలో అమెరికాతో కలిసి పనిచేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించిందని వెల్లడించారు. త్వరగా ఘర్షణ ముగించండి: సౌదీ యువరాజు హార్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌పై దాడులను అమెరికా మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు రావడంపై సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన శనివారం ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడారు. సంఘర్షణకు సాధ్యమైనంత త్వరగా తెరదించాలని, శాంతి సాధన కోసం చొరవ చూపాలని ట్రంప్‌ను కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ అమెరికా సైన్యం ఇరాన్ ఇంధన, మౌలిక సదుపాయాలపై దాడులు ఉధృతం చేస్తే అందుకు ప్రతిస్పందనగా గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు, మౌలిక సదుపాయాలపై ఇరాన్ సైన్యం భీకర స్థాయిలో విరుచుకుపడే ప్రమాదం ఉందని సౌదీ అరేబియా ఆందోళన చెందుతోంది. -
పశ్చిమాసియాలో ప్రమాదకర పాచికలాట
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ 2025 నవంబర్ 18న అమెరికా సందర్శించారు. పౌర అణు శక్తి వినియోగ సహకారంపై సంప్రదింపులు పూర్తయ్యాయని అదే రోజు సంయుక్త ప్రకటన వెలువడింది. ఆ మేరకు ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న కోట్లాది డాలర్ల పౌర అణు శక్తి భాగస్వా మ్యానికి దీనితో చట్టపరమైన పునాది ఏర్పడిందని వైట్ హౌస్ పేర్కొంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ప్రమాణాలను పకడ్బందీగా పాటిస్తూ సహకారాన్ని ఇచ్చిపుచ్చు కోనున్నట్లు ప్రకటించారు. అయినా, అణ్వస్త్ర నిర్మాణ వ్యాప్తిపై ఇది అటు ఇజ్రాయెల్, ఇటు యూఏఈలలో ఆందోళనను రేకెత్తించడంతో ఈ అంశం మరింత జటిలంగా మారింది. అబ్రహాం ఒప్పందాలతో ముడిఇపుడు అమెరికా–సౌదీ ఒప్పందాన్ని సౌదీ అరేబియా అబ్రహాం ఒప్పందాలకు కట్టుబడి ఉండే అంశంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముడిపెట్టారు. పౌర అణు ఒప్పందానికి ఆమోదం తెలుపడం చిటికెలో పని. కాకపోతే ‘చాలా మన్నన పొందిన, సఫలమైన అబ్రహాం ఒప్పందాలకు సౌదీ అరేబియా పూర్తిగా కట్టుబడి ఉండాలి’ అని ట్రంప్ జూలై 23న బాహాటంగానే వెల్లడించారు. యురేనియంను ‘శుద్ధి చేసే సామగ్రి’ ఉండబోదని కూడా ట్రంప్ తెలిపారు. కానీ, యురేనియంను శుద్ధి చేయడాన్ని నివారించే నియమ నిబంధనలు ఒప్పందం ముసాయిదాలో కొరవడ్డాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా రెండింటిని ముడిపెట్టడంతో మొత్తం పరిస్థితి మారి పోయినట్లు అయింది. ఇది ఇక ఎంతమాత్రం అణు శక్తిని పౌర అవస రాలకు వినియోగించుకునేందుకు సంబంధించినదిగానో లేదా రష్యా, చైనాలను దూరం పెట్టేందుకు కుదుర్చుకున్నదిగానో లేదు. దౌత్యం ఒక లావాదేవీగా తయారైంది. అసలే అణు శక్తి చిక్కు ముడులతో కూడుకున్న దక్షిణాసియాలో ఇది ఇంకా గుబులు రేపు తోంది. ట్రంప్ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం వెంటనే స్వాగతించింది. సౌదీ గుర్తింపు ‘మధ్య ప్రాచ్యంలో శాంతి స్థాపనకు సంబంధించి ఒక చారిత్రక ముంద డుగు’ అని అది జూలై 23న వ్యాఖ్యానించింది. ఇజ్రాయెల్ అంగీకరించినట్టేనా?తెరవెనుక పరిస్థితులను బట్టి ఈ సమన్వయం ఒక ఎత్తుగడగా కనిపిస్తోంది. తుర్కియేకు అధునాతన ఎఫ్–35 విమానాల విక్ర యాన్ని వ్యతిరేకించాలని నెతన్యాహు కోరుకుంటున్నారనీ, సౌదీ అణు ఒప్పందం ఈ ప్రాంతంలో ఆయుధ పోటీని రేకెత్తిస్తుందని ఆందోళన చెందుతున్నారనీ ఇజ్రాయెలీ అధికారులు మీడియాకు తెలిపారు. ఇటీవల ట్రంప్‌ను కలుసుకునేందుకు ముందు నెతన్యాహు తన మనసులో మాటను వెల్లడించారు. సౌదీ అరేబి యాతో అమెరికా అణు సహకారం సైనిక శక్తి విషయంలో ఇజ్రా యెల్కున్న గుణాత్మక పైచేయిపై రాజీపడేటట్లు చేయదని హామీ లభించాలని ఆయన అన్నారు. ఏదైతేనేం జెరూసలెం కోరుకున్నది సాధించింది. సౌదీ అణు ఒప్పందం ఇజ్రాయెల్‌తో ముడిపడినఅంశమని ఇపుడు తేటతెల్లమైంది. రెండవసారి అధికారానికి వచ్చినప్పటి నుంచి కూడా అబ్రహాం ఒప్పందాలను మరింత విస్తరించాలని ట్రంప్ కోరుకున్నారు. సాధా రణ పరిస్థితులు నెలకొనాలంటే ‘పాలస్తీనా ఒక ప్రత్యేక రాజ్యంగా అవతరించేందుకు స్పష్టమైన బాటలు పరవా’లని సౌదీలు స్పష్టం చేశారు. గాజాలో పరిస్థితులు క్షీణించాక సౌదీ మరింత పట్టుసడలని వైఖరిని కనబరచింది. సాధారణ పరిస్థితుల స్థాపనపై చర్చలను అది 2023 అక్టోబర్ 14న విరమించుకుంది. ‘పాలస్తీనా రాజ్య స్థాప నను వ్యతిరేకిస్తున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రస్తుత ప్రభు త్వాన్ని శాంతి స్థాపనకు చిత్తశుద్ధితో పనిచేసే భాగస్వామిగా’ చూడ లేమనే మొన్నీమధ్య జూలై 25 వరకు రియాద్ భావిస్తూ వచ్చింది. మారిన అమెరికా తీరుఅణ్వస్త్ర వ్యాప్తి నిరోధక విధానం విషయంలో అమెరికాలో వచ్చిన మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గల్ఫ్‌లో యురేనియం శుద్ధికి అనుమతించకూడదనే వైఖరినే అమెరికా 15 ఏళ్ళుగా అనుస రిస్తూ వచ్చింది. యూఏఈ కూడా 2009లోనే దాన్ని విరమించుకుంది. తాజా అమెరికా ఒప్పందం కింద సౌదీ ఆ నిబంధనను తిర స్కరించింది. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ అదే పనిగా పర్యవేక్షించడాలు, పరిశీలించడాలు చేయకూడదని కూడా సౌదీ పేర్కొంది. తెహ్రాన్ రహస్యంగా యురేనియంను శుద్ధి చేసే సదుపా యా లను నిర్వహిస్తోందనే కారణంతోనే ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడికి దిగాయి. ఈ ఒప్పందం ఏ విధంగా ఆవిష్కృత మవుతుందోనని అబుదాబి, కైరో, అమ్మాన్, అంకారా ఎదురు చూస్తున్నాయి. ఇంతవరకు యురేనియంను శుద్ధి చేసే శక్తి పశ్చిమా సియాలో ఒక్క ఇరాన్‌కే పరిమితం అనుకున్నారు. ఇపుడు యురేని యంను శుద్ధి చేయగల సామర్థ్యాన్ని ఆ ప్రాంతంలో దాదాపు ఐదు దేశాలు సంతరించుకోగలవని కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. ‘‘ఇజ్రాయెల్ వద్ద బాంబు ఉందనుకుందాం. ఇపుడు అమెరికా ఆమోదంతో సౌదీ అరేబియా కూడా యురేనియంను శుద్ధి చేయగల శక్తిని సంతరించుకుంటుంది. మరి మేం మాత్రం ఆ పని ఎందుకు చేయకూడదు?’’ అని ఇరాన్ వాదిస్తోంది. ఇరాన్‌తో అమెరికా కుదు ర్చుకోవాలని భావించిన అణు ఒప్పందం అటకెక్కింది. ఇరాన్ లోపలికి వెళ్ళి తనిఖీలు జరపడానికి అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు ఉన్న అవకాశం పరిమితం. ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా ఆశీర్వా దంతో సౌదీ అరేబియా నిర్వహించే అణుశక్తి కార్యక్రమం పూర్తి ఆత్మవంచన, ద్వంద్వ ప్రమాణాల కిందకే వస్తుంది. ఇజ్రాయెల్ వైపు నుంచి చూస్తే ఈ ఒప్పందం దాని చాపకిందకు నీరు తేవడమే. అణ్వాయుధాలు కలిగిన దేశంగా ఇజ్రాయెల్ 50 ఏళ్ళుగా గుత్తాధిపత్యాన్నే అనుభవిస్తూ వచ్చింది. అది ఆ పనిని చాటుమాటునే నిర్వహిస్తూ వచ్చి ఉండవచ్చు. సౌదీ పౌర అణుశక్తి కార్యక్రమాన్ని అబ్రహాం ఒప్పందాలతో ముడిపెట్టడాన్ని పైకి స్వాగ తించి ఉండవచ్చు. కానీ, లోలోపల అణ్వస్త్ర నిర్మాణ సామర్థ్యం కలి గిన మరో అరబ్ దేశం అవతరిస్తోందని మథన పడుతోంది. సుస్థిరతకు అవకాశమెక్కడ? తాజా ఒప్పందంతో ఆ ప్రాంతంలో ఏ దేశానికాదేశం రక్షణకంచెలు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తాయి. ఆయుధాల సమీకర ణకు పోటీపడతాయి. తప్పుడు అంచనాలు ప్రమాదకర స్థితినిసృష్టిస్తాయి. ఇంక ప్రాంతీయ సుస్థిరతకు అవకాశమెక్కడ? రష్యా అణు శక్తి సంస్థ రోసటామ్, చైనా నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్లను కట్టడి చేయడానికి సౌదీ అణు కార్యక్రమం దోహద పడుతుందనీ, అమెరికా విస్తృత వ్యూహాత్మక ప్రయోజనాలను నెరవేరుస్తుందనీ అమెరికా మొదట్లో భావించింది. ఇపుడు అబ్రహాం ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని చెప్పడం ద్వారా సౌదీ–ఇజ్రా యెల్ మధ్య కూడా రాజీ కుదిర్చినట్లు అవడం తన విదేశాంగ విధానానికి కలికితురాయిగా మారుతుందని ట్రంప్ సంబరపడు తున్నారు. అందుకు రియాద్‌కు పౌర అణు శక్తి పేరుతో తీపిని తిని పిస్తున్నారు. ఈ క్రమంలో, నియమ నిబంధనలను తుంగలో తొక్కారు. పౌర అణు శక్తి వినియోగానికి సౌదీకున్న హక్కును కాదనలేం. రష్యా–చైనాలతో పోటీ పడేందుకు అమెరికాకు ఉన్న హక్కును కూడా తోసిపుచ్చలేం. కానీ, ఉద్రిక్తతలతో అట్టుడుకుతున్న ప్రాంతంలో యురేనియం శుద్ధికి ద్వారాలు తెరవడం ఎంతవరకు సబబు? ఇజ్రాయెల్‌తో సయోధ్య కుదుర్చుకోవాలనీ, సాధారణ పరిస్థితుల స్థాపనకు తోడ్ప డాలనీ అమెరికా పెడుతున్న షరతును సౌదీ ఇప్పటికే తిరస్కరించింది. ఒకవేళ ఒప్పందం మూలపడ్డా, అది తెచ్చిన ప్రమాణం నిలిచే ఉంటుంది: అణు శక్తిని సంపాదించుకునేటట్లు చేయడంలో అమెరికా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాజకీయ ప్రయోజనాలు చూసు కుంటోంది. ఒకసారి భూతాన్ని బయటకు తెస్తే, దాన్ని తిరిగి సీసాలో బంధించడం కష్టం. -వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్, న్యూఢిల్లీ-సి. ఉదయ్ భాస్కర్ -
అమెరికా ప్రజలు అప్పుల్లో కూరుకుపోతున్నారా?
డొనాల్డ్ ట్రంప్ తరచూ.. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేనంత బలంగా ఉందని చెబుతున్నారు. దేశంలో ఉపాధి అవకాశాలు పెరిగాయని, ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉందని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు పీటర్ షిఫ్ (Peter Schiff) మాత్రం ఈ వాదనను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు.పీటర్ షిఫ్ ప్రకారం.. అమెరికా ఆర్థిక వ్యవస్థ నిజంగా బలంగా ఉంటే ప్రజలు తమ రోజువారీ ఖర్చులు, రుణాల చెల్లింపులు సకాలంలో చేయగలగాలి. కానీ.. ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించలేకపోతున్న వారి సంఖ్య 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత ఎన్నడూ లేనంత స్థాయికి చేరిందని ఆయన పేర్కొన్నారు.Trump claims the U.S. economy is booming like never before, yet serious credit-card delinquencies are at their highest rate since the aftermath of the 2008 financial crisis. This shows that Americans are struggling to pay their bills, which is consistent with bad, not good times.— Peter Schiff (@PeterSchiff) August 2, 2026క్రెడిట్ కార్డు బకాయిలు ఎక్కువకాలం చెల్లించకుండా ఉండటాన్ని ఆర్థిక రంగంలో 'సీరియస్ క్రెడిట్ కార్డ్ డెలింక్వెన్సీ'గా పరిగణిస్తారు. ఇలాంటి కేసులు పెరగడం అంటే.. ప్రజలు తమ ఆదాయంతో ఖర్చులను నిర్వహించలేకపోతున్నారని, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అర్థం. అందుకే ట్రంప్ చెబుతున్నట్లుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందనే వాదనకు ఈ గణాంకాలు సరిపోవని పీటర్ షిఫ్ అంటున్నారు.ప్రజలు అప్పులు తీర్చలేకపోతుంటే.. దానిని మంచి ఆర్థిక పరిస్థితిగా ఎలా చెప్పగలమని పీటర్ షిఫ్ ప్రశ్నించారు. అయితే.. ప్రస్తుత అమెరికా ఆర్థిక పరిస్థితిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఉద్యోగాల పెరుగుదల, ఆర్థిక వృద్ధి వంటి సూచీలను ప్రస్తావిస్తే, మరికొందరు ప్రజలపై పెరుగుతున్న రుణభారం, అధిక జీవన వ్యయం, క్రెడిట్ కార్డు బకాయిలను ప్రధాన సమస్యలుగా చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అమెరికా ఆర్థిక వ్యవస్థపై చర్చ కొనసాగుతూనే ఉంది.ఇదీ చదవండి: బ్యాంకులు మీ డబ్బుతో ఏం చేస్తాయో తెలుసా? -
ఇరాన్ దాడులపై ట్రంప్ కీలక నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై దాడి ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. టెహ్రాన్‌తో పాటు కొన్ని మధ్య ప్రాచ్యదేశాల అభ్యర్థనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరోసారి హర్ముజ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఎవరికీ తెలియదు. ఇటీవలే మరోసారి ఇరాన్‌పై రెచ్చిపోతూ వస్తున్న ట్రంప్ ఆ దేశాన్ని హెచ్చరిస్తూ పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ సారి ఇరాన్‌పై కనీవినీ ఎరుగని రీతిలో దాడి చేస్తామని హెచ్చరించారు. ఇంతలోనే మరోసారి ప్లేటు ఫిరాయంచారు. ట్రంప్ మాట్లాడుతూ.. "ఇరాన్‌పై అమెరికా ప్రతిపాదిత దాడి వాయిదాపడింది. దానికోసం ఇరాన్‌తో పాటు కొన్ని మధ్యప్రాచ్య దేశాలు ఒక రాజీ ప్రతిపాదన తెచ్చాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.హర్ముజ్ జలసంధిని తక్షణమే తిరిగి తెరవడం, ఈ నేపథ్యంలోనే ఇరాన్ అణు ముప్పును తొలగించే ఒప్పందం ముసాయిదాపై అంగీకారం కుదిరింది" అని ట్రంప్ అన్నారు.ఇరాన్‌పై దాడి విరమణపై కీలక నిర్ణయంలో అమెరికాతో పాటు ఇజ్రాయెల్ సైతం ఉంది అని ట్రంప్ పేర్కొన్నారు.కాగా ఆక్సియోస్ నివేదిక ప్రకారం సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడినట్లు కథనాలు వచ్చాయి. ఇరాన్‌పై దాడి విషయంలో సంయమనం పాటించాలని, ఇరాన్‌పై జరగబోయే పెద్ద దాడిని ఎట్టిపరిస్థితుల్లో నివారించాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నాయి. ప్రస్తుత పరిస్థితులుప్రస్తుతం అమెరికా-ఇరాన్‌ల మధ్య పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై భారీ వైమానిక దాడులు చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఇటీవల కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై గతంలో ఎన్నడూ చూడని విధంగా దాడులు చేస్తామని హెచ్చరించారు. అయితే, ఇరాన్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల విజ్ఞప్తి మేరకు ఒక తాత్కాలిక యుద్ధ విరామానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. గత మూడు రోజులుగా ఇరు దేశాలు దాడులను నిలిపివేశాయి. -
నెతన్యాహు దూకుడు.. ట్రంప్‌కు బిగ్ షాక్!
గాజాలో యుద్ధ మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఇజ్రాయెల్ మాత్రం తన సైనిక చర్యలను కొనసాగిస్తోంది. ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు అనుగుణంగా పరిస్థితులు మారుతాయని భావించిన వేళ.. గాజాపై వరుసగా జరుగుతున్న వైమానిక దాడులు మరోసారి ఉద్రిక్తతలను పెంచుతున్నాయి.పాలస్తీనా ఆరోగ్య అధికారుల ప్రకారం, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గాజా సిటీ, మధ్య గాజాలోని దెయిర్ అల్-బలాహ్ ప్రాంతాల్లో దాడులు నిర్వహించాయి. దెయిర్ అల్-బలాహ్లోని ఓ నివాస భవనంపై జరిగిన దాడిలో ఓ వ్యక్తి, అతని భార్య మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. గాజా సిటీలో జరిగిన మరో దాడిలో ఇద్దరు మరణించగా, వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.గాజా యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ నేతృత్వంలో అమెరికా దౌత్య ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. హమాస్ ఆయుధాలను వదులుకునేందుకు అంగీకరించిందని ట్రంప్ ప్రకటించినప్పటికీ.. ఆ ప్రతిపాదన అమలు దశకు చేరుకోవడంలో ఇజ్రాయెల్ వైఖరి కీలక అడ్డంకిగా మారిందని పరిస్థితులు సూచిస్తున్నాయి. ట్రంప్‌కు చెందిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ విడుదల చేసిన 15 అంశాల రోడ్‌మ్యాప్‌లో కాల్పుల విరమణ, భద్రతా ఏర్పాట్లు, యుద్ధం ముగింపు దిశగా చర్యలు ప్రతిపాదించారు. అయితే, హమాస్ నిరాయుధీకరణ, ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరణ వంటి అంశాలపై ఇరు వర్గాలు తమ వైఖరుల నుంచి వెనక్కి తగ్గడం లేదు.హమాస్ మాత్రం ఇజ్రాయెల్ దాడులను నిలిపివేసి, సైన్యాన్ని వెనక్కి తీసుకున్న తర్వాతే ఆయుధాల అంశంపై చర్చకు సిద్ధమని చెబుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం హమాస్ పూర్తిగా ఆయుధాలను వదిలేసిందనే స్పష్టమైన ఆధారాలు కనిపించే వరకు సైనిక చర్యలను ఆపబోమని స్పష్టం చేస్తోంది. ఈ పరిణామాలతో ట్రంప్ శాంతి ప్రయత్నాలకు ఇజ్రాయెల్ వైఖరి పెద్ద సవాల్‌గా మారింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ ప్రతిపాదనపై బహిరంగంగా స్పందించకపోయినా, ఆయన ప్రభుత్వంలోని కొందరు మంత్రులు మాత్రం శాంతి ఒప్పందంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్-గ్విర్ హమాస్‌పై సైనిక చర్యలు కొనసాగించాలని డిమాండ్ చేశారు.ఇక దౌత్య ప్రయత్నాల్లో భాగంగా మాజీ ఫతా నేత మహ్మద్ దహ్లాన్ మాట్లాడుతూ.. ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఇజ్రాయెల్‌తో గాజాపై దాడులు నిలిపివేయడానికి చర్చలు జరుపుతున్నారని తెలిపారు. అయితే ఒప్పందం విజయవంతం కావాలంటే ఇజ్రాయెల్ సైనిక చర్యలను నిలిపివేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఒత్తిడి, అంతర్జాతీయ పిలుపులు ఉన్నప్పటికీ గాజాలో దాడులు కొనసాగుతుండటం ట్రంప్ దౌత్య ప్రయత్నాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. కాల్పుల విరమణకు మార్గం సుగమం కావాలంటే హమాస్ నిరాయుధీకరణ, ఇజ్రాయెల్ భద్రతా హామీలు, గాజా భవిష్యత్ పాలనపై ఇరు వర్గాల మధ్య రాజీ తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం గాజాలో పరిస్థితి చూస్తే.. వాషింగ్టన్ నుంచి వస్తున్న శాంతి పిలుపులకు మించిన ప్రాధాన్యతను ఇజ్రాయెల్ తన భద్రతా లక్ష్యాలకు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రణాళిక భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. -
గల్ఫ్ దేశాలను వీడండి.. అమెరికా పౌరులకు ట్రంప్ అత్యవసర హెచ్చరిక
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్, అమెరికా వరుస దాడులు తీవ్రతరమయ్యాయి. దీంతో, మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న అమెరికా పౌరులకు అమెరికా విదేశాంగ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. భద్రతా ముప్పులు పెరుగుతున్నందున వీలైతే మధ్యప్రాచ్య దేశాలను విడిచి వెళ్లాలని, లేకపోతే ఎప్పుడైనా అత్యవసరంగా బయలుదేరాల్సిన పరిస్థితి రావచ్చని ముందస్తుగా సిద్ధంగా ఉండాలని సూచించింది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్, లెబనాన్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియాలోని అమెరికా రాయబార కార్యాలయాల ద్వారా తాజా ప్రయాణ సూచనలను విడుదల చేసింది. గగనతల మూసివేతలు, విమాన సర్వీసుల రద్దు, ప్రయాణాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అమెరికా పౌరులకు సూచించింది. మధ్యప్రాచ్యానికి వెళ్లే ప్రయాణాలను కూడా పునరాలోచించాలని విదేశాంగ శాఖ పేర్కొంది. అంతకుముందు చేసిన సూచనల కంటే తాజా సూచన మరింత కఠినంగా ఉండటం గమనార్హం.ఇక, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అవసరమైతే ఇరాన్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించగా, అమెరికా దాడులకు తగిన ప్రతీకారం తప్పదని ఇరాన్ ప్రకటించింది. ఇదే సమయంలో ఇరాన్‌కు చెందిన డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని కువైట్ సైన్యం వెల్లడించింది. రెండు రోజుల క్రితం ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులు నిర్వహించినట్లు అమెరికా సైన్యం ప్రకటించడంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ ఘర్షణలు మరిన్ని దేశాలకు విస్తరించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండగా, ఇంధన ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.Middle East: Americans currently in the Middle East should exercise caution and heightened vigilance and should be prepared for flight cancellations, periodic airspace closures, and potential travel disruptions. Some airlines in the region have postponed resumption of earlier… pic.twitter.com/d1ZmzRBBHN— TravelGov (@TravelGov) August 1, 2026మరోవైపు.. అమెరికా హెచ్చరికలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మాట్లాడుతూ.. అమెరికా మరోసారి సైనిక చర్యలకు దిగితే దానికి ‘నిర్ణయాత్మక, తీవ్రమైన ప్రతిస్పందన’ ఇస్తామని హెచ్చరించారు. అలాగే సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, ఇజ్రాయెల్‌లోని ఇంధన మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇరాన్‌పై దాడులకు తమ భూభాగాన్ని లేదా సౌకర్యాలను ఉపయోగించేందుకు ఏ దేశం అనుమతించవద్దని ప్రాంతీయ దేశాలకు ఆయన హెచ్చరించారు. అదే సమయంలో, అమెరికా హెచ్చరికలు ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలని ఇరాన్ విమర్శించింది. తమపై ఎలాంటి దాడి జరిగినా తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని, ప్రాంతీయ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, అయితే తమ భద్రత విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేసింది. -
వలసదారులపై ‘మెగా హియరింగ్’ కత్తి!
హార్లింగన్ (అమెరికా): డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో వలసదారులపై మెగా హియరింగ్ కత్తి వేలాడుతోంది. నాలుగు రాళ్లు వెనకేసుకుందామనో.. తిండికి కొరత ఉండదనో.. రాజకీయ కక్షల కారణమో తెలియదు కానీ... అమెరికాకు వలసవెళ్లే వారి సంఖ్య ఏటికేడాదీ ఎక్కువ అవుతోంది. సరైన పత్రాలు, వీసాలతో వస్తే తప్పు లేకపోవచ్చు. కానీ.. చాలామంది అక్రమంగా అమెరికాలోకి చొరబడి తిష్టవేస్తూండటంతోనే సమస్య. ఇలాంటి అక్రమ వలసదారులను గుర్తించి, విచారించి వారి స్వదేశాలకు తిప్పి పంపడమూ ఏళ్లుగా జరుగుతున్న కార్యక్రమం. అయితే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత ఈ ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. ఇందుకు తార్కాణమే ఈ మెగా హియరింగ్స్. వలసదారులకు సంబంధించిన కేసులు కేసులు దశాబ్దకాలంలో 37 లక్షలకు చేరుకున్న నేపథ్యంలో అధికారులు వాటిని చకచక తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నమే ఈ మెగా హియరింగ్. పెండింగ్ కేసులను తగ్గించడానికి ఒక్కో జడ్జికి ఎక్కువ సంఖ్యలో కేసులు కేటాయిస్తున్నారు. ఈ ఏడాది జూన్ నెలలో మాత్రమే అమెరికా వ్యాప్తంగా 1300 మెగా హియరింగ్స్ జరిగినట్లు వలసదారుల హక్కుల కోసం పోరాడే సంస్థ ‘మొబైల్ పాథ్వేస్’ విశ్లేషణలో తేలింది. గత ఏడాది జూన్‌తో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. అక్రమ వలసదారుల కేసుల విచారణ సమయాన్ని ఆరు నెలల నుంచి నెలకు తగ్గించింది. అయితే ఈ హడావుడి కార్యక్రమం వల్ల అక్రమవలసదారుల మాట ఎలా ఉన్నా... సరైన కారణాలతో అక్కడకు వెళ్లిన వారిపై కూడా తిరస్కరణ వేటు పడుతోందని మొబైల్ పాథ్వేస్ సీఈవో బార్ట్లో మెయిజ్ స్కోరుప తెలిపారు. మెగా హియరింగ్స్‌లో ఒక్కో న్యాయమూర్తికి రోజుకు 50 నుంచి 150 వరకు కేసులు కేటాయిస్తున్నారు. ఫలితంగా కోర్టు బయట గంటల తరబడి వేచి ఉండటం.. తీరా న్యాయమూర్తి ముందుకు వెళ్లిన తరువాత నిమిషాల్లో వాదనలు పూర్తయి ప్రతికూల తీర్పులు వెలువడటం సాధారణమవుతోందని తెలుస్తోంది. విచారణ సమయం తగ్గిపోవడం వల్ల కొంతమంది సరైన న్యాయవాదిని కూడా వెతుక్కోలేకపోతున్నారు. ఇంకొందరు లాయర్ల చేతిలో మోసపోతున్నారు కొలంబియా వ్యక్తి ఒకరు ఆశ్రయం (అసైలమ్) హోదా కోరుతూ 1,500 పేజీల సాక్ష్యాలు సమరి్పంచారు. అవి చాలవు మరికొన్ని కావాలని న్యాయమూర్తి కోరినా.. వాటిని సమర్పిందుకు సమయం ఇవ్వకపోవడంతో అతడు వెనుదిరగాల్సి వచ్చింది. ఏ కారణం చేతనైనా విచారణకు హాజరు కాకపోతే ఇక అంతే సంగతులు. ‘‘అసైలమ్ క్లెయిమ్ వదిలేశారు’’అని పరిగణించి, వెంటనే స్వదేశాలకు పంపేయాలని ఆర్డర్లు జారీ చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఇలా హాజరు కాని వారి సంఖ్య కూడా రెట్టింపయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2025 జనవరిలో ఈ సంఖ్య 20% ఉండగా, 2026 జూన్ నాటికి 40%కి చేరింది. 2025 జనవరిలో స్వదేశాలకు తిప్పి పంపాలన్న ఆదేశాలు 33,000 వరకూ ఉంటే 2026 జూన్ నాటికి ఇది 79,000కి పెరిగింది. న్యూయార్క్, చికాగో వంటి నగరాల్లో కేసు విచారణకు హాజరు కాని వారి రేటు మిగిలిన చోట్ల కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. పద్ధతి లేకుండా పోతోంది.. మెగా హియరింగ్స్ కారణంగా వలసదారుల కేసులు ఒక పద్ధతి లేకుండా విచారణ పూర్తి చేసుకుంటున్నాయని ఇమ్మిగ్రేషన్ హక్కులపై పోరాడుతున్న సంఘాలు వాపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో కేసులు విచారణలో ఉన్న వారు కోర్టు భవనంలోనే ఉన్నప్పటికీ, నిర్దిష్టమైన విచారణ ప్రాంతానికి రాలేదన్న కారణంతో ‘‘హాజరు కాలేదు’’అని ముద్ర వేసి స్వదేశాలకు తిప్పి పంపినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఇమ్మిగ్రేషన్ చట్టాలు కఠినంగానే ఉండాలని కోరుకునే వారు మాత్రం ఇలాంటి మెగా హియరింగ్స్ వల్ల పెండింగ్ కేసులు తగ్గుతాయని వాదిస్తున్నారు. 2025లో 37 లక్షల పెండింగ్ కేసులు ఉండగా, 2026లో అది 35 లక్షలకు తగ్గింది. అంటే ఏడాది కాలంలో రెండు లక్షల కేసులు విచారించారన్నమాట. సహజంగానే ఇంతటి పనిభారం న్యాయవాదులకు కూడా మోయలేని భారంగా మారింది. ఒక లాయర్ ఒకే రోజులో 20 కేసులు వాదించాడని, ఇది మునుపటితో పోలిస్తే పది రెట్లు ఎక్కువని సమాచారం. -
వినాశకర దాడులు చేస్తాం
వాషింగ్టన్/కైరో: హార్మూజ్ జలసంధిపై ఇరాన్ తనదైన పట్టును నిలుపుకోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మరింత చిర్రెత్తిపోతోంది. దీంతో ఇకమీదట అత్యంత విశానకర స్థాయిలో దాడులు చేస్తామని ఇరాన్‌ను ట్రంప్ తాజాగా హెచ్చరించారు. మేరీల్యాండ్‌లో క్యాంప్ డేవిడ్ ప్రెసిడెన్షియల్ రీట్రీట్ కార్యక్రమంలో తన కేబినెట్ సహచరులతో భేటీలో ట్రంప్ మాట్లాడారు. ‘‘హార్మూజ్‌ను బేషరతుగా ఇరాన్ తెరవాల్సిందే. మధ్యవర్తిత్వం ద్వారా చర్చల ప్రక్రియ పూర్తిగా విఫలమైతే ఇరాన్‌పై మళ్లీ విధ్వంసకదాడుల పర్వం మొదలవుతుంది. మా దాడులను ఇరాన్ విజయవంతంగా అడ్డుకుంటుందని అస్సలు అనుకోను. ఎందుకంటే వాళ్ల నేవీ నాశనమైంది. గగనతల రక్షణ వ్యవస్థ నిరీ్వర్యమైంది. ఈమధ్య అమెరికా దాడుల తీవ్రతను తగ్గించడంతో వాళ్లు సాయుధ శక్తిసామర్థ్యాలపరంగా కాస్తంత పుంజుకున్నారేమో. కానీ అమెరికా దాడులను తీవ్రతరంచేయనుంది. గెలవడమే మా ధ్యేయం. ఇక దాడులను తట్టుకోలేం అని ఇరాన్ కాళ్లబేరానికొచ్చేస్థాయిలో దాడులు చేస్తాం’’అని ట్రంప్ ప్రకటించారు. కువైట్‌పై ఇరాన్ దాడులు అమెరికాకు మిత్రదేశంగా ఉన్న కువైట్‌పై ఇరాన్ శనివారం దాడులుచేసింది. అయితే ఇరాన్ డ్రోన్లను నేలకూల్చామని కువైట్ రక్షణశాఖ తెలిపింది. అత్యంతకీలకమైన ప్రాంతాలపై ఇరాన్ దాడులకు ప్రయతి్నంచింది. బుబియాన్ ద్వీపంలోని వాహన తయారీ కర్మాగారంపై దాడికి యతి్నంచింది. ఆ ప్రయత్నాలను మేం వమ్ముచేశాం’అని కువైట్ రక్షణశాఖ అధికార ప్రతినిధి జనరల్ అబ్బుల్అజీజ్ తెలిపారు. మరోవైపు ఒమన్‌లోని లీమా సమీపంలోని హార్మూజ్ జలసంధిలో ట్యాంకర్నౌకపై ఇరాన్ దాడిచేసిందని బ్రిటన్ నావికాదళం తెలిపింది. ఖాసాబ్ సిటీకి వాయవ్యంగా 21 నాటికల్ మైళ్లదూరంలో సముద్రజలాల్లో మరో సరుకు రవాణా నౌక సమీపంలో పేలుడు సంభవించింది. ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. -
ఇంతకీ ఖమేనీ ఎక్కడ?.. ఆ రహస్యం ఇదేనా?
ప్రపంచంలోనే దిగ్గజ నిఘా సంస్థలు ఏవని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఠక్కున వచ్చే సమాధానాలు.. ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్.. అమెరికాకు చెందిన సీఐఏ..! తమ శత్రువు ప్రపంచంలోని ఏ మూలన దాక్కొన్నా.. లేపేస్తామనే ధీమా ఈ రెండు సంస్థలకు ఉంది. అయితే.. మధ్యప్రాశ్చ్యంలో ఇప్పుడు ఈ రెండు సంస్థల విషయంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఏకు మేకై కూర్చున్నాడు. ఈ రెండు నిఘా సంస్థల టెక్నాలజీకి దొరకకుండా జాగ్రత్తపడుతున్న ఖమేనీ.. ఇప్పుడు అటు ట్రంప్.. ఇటు నెతన్యాహుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఇంతకీ ఖమేనీ ఎక్కడున్నాడు? ఆయన విషయంలో మొస్సాద్, సీఐఏ ఎందుకు విఫలమవుతున్నాయి?కంటిమీద కునుకు లేకుండా..అది 2020 నవంబరు 27వ తేదీ.. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో ఇరాన్ అణు సాంకేతికతకు పెద్దదిక్కుగా ఉన్న మోహాసేన్ ఫాఖ్రిజాదేహ్ (Mohsen Fakhrizadeh) కారులో ప్రయాణిస్తున్నారు. మొస్సాద్, సీఐఏ నిఘా సంస్థల టార్గెట్‌గా ఆయన ఉన్నారు. ఆ కారుపై దాడికి ఈ సంస్థలు ఒక్క ఏజెంట్‌ని కూడా నియమించలేదు. కానీ, ఉపగ్రహ చిత్రాల ద్వారా ఆయనను గుర్తించి.. ఏఐ ఆధారిత మెషీన్ గన్ సాయంతో అత్యంత కచ్చితత్వంతో అతణ్ని మట్టుబెట్టాయి. హాలీవుడ్ చిత్రాలను తలపించిన ఈ డిజిటల్ ఆపరేషన్‌తో ప్రపంచదేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అత్యాధునిక శాటిలైట్లు, ప్రపంచంలోనే నంబర్ వన్ హ్యాకర్లతో ఇజ్రాయెల్, అమెరికాలు అతణ్ని అంతమొందించాయి. అంతటి టెక్నాలజీ ఉన్నా.. ఖమేనీ జాడను కనిపెట్టలేకపోవడం ఇప్పుడు ఈ రెండు నిఘా సంస్థలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.చిన్న ఫోన్ కాల్ మాట్లాడినా..ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని హతమార్చిన ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ అప్పట్లోనే ఓ భారీ ప్రకటన చేసింది. తమ తదుపరి టార్గెట్ కొత్తగా నియమితులయ్యే సుప్రీం లీడరేనన్నది అందులోని సారాంశం. లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హిజ్బుల్లా చీఫ్‌లను, గాజా కేంద్రంగా ఉన్న హమాస్ నేతలను లేపేసిన విధానాన్ని ఈ సందర్భంగా ఉటంకించింది. ఆ తర్వాత మొజ్తబా ఖమేనీ ఇరాన్‌కు కొత్త సుప్రీం లీడర్ అయ్యారు.అయితే.. ఆయనను ఇంతవరకు ఎవరూ బహిరంగంగా చూడలేదు. చివరికి ఇటీవల జరిగిన ఆయన తండ్రి ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియలకు సైతం మొజ్తబా హాజరుకాలేదు. దీంతో.. ఆయనను ట్రేస్ చేయడంలో మొస్సాద్, సీఐఏ చతికిలపడిపోతున్నాయి. ముఖ్యంగా.. మొజ్తబా ఇప్పుడు జీరో డిజిటల్ పాలసీని అందిపుచ్చుకున్నట్లు తెలుస్తోంది. అంటే.. ఎలాంటి డిజిటల్ గాడ్జెట్స్‌ను తన దరిచేరనీయకుండా ఆయన జాగ్రత్తపడుతున్నారు. చిన్న ఫోన్‌కాల్ మాట్లాడినా.. తనను మొస్సాద్ గుర్తింస్తుందని ఆయనకు బాగా తెలుసు. అందుకే.. ఆయన డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.మొజ్తబా.. అదే ఫాలో అవుతున్నారా?ఇంకా వివరంగా చెప్పాలంటే.. ఒకప్పుడు అమెరికాను గడగడలాడించిన అల్-ఖాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ అవలంబించిన మోడల్‌ను మొజ్తబా ఫాలో అవుతున్నారు. లాడెన్ చేసిన పొరపాట్లు తన విషయంలో రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. నిజానికి పాకిస్థాన్‌లో తలదాచుకున్న లాడెన్‌ను చేరడానికి.. అతని కమ్యూనికేటర్లను సీఐఏ ట్రాక్ చేసింది. మొజ్తబా విషయానికి వస్తే.. ఆయన కమ్యూనికేటర్లు.. అంటే.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అధికారులు ఎవరనే విషయం కూడా బయటి ప్రపంచానికి తెలియదు. కేవలం మొజ్తబా రాసి ఇచ్చే చిన్నచిన్న చీటీలు మాత్రమే అడపాదడపా వెలుగులోకి వస్తున్నాయి.మొజ్తబా ఎక్కడ? ఇంతకీ మొజ్తబా ఇప్పుడు ఎక్కడున్నారు? ఈ ప్రశ్నకు రెండు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ జరిపిన దాడిలో మొజ్తబా భవనం ధ్వంసమైంది. ఆయన భార్య ఈ దాడిలో మరణించినట్లు వార్తలొచ్చాయి. తీవ్రంగా గాయపడిన మొజ్తబా ప్రస్తుతం ఓ బంకర్లో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. ఇక రెండో వాదన విషయానికి వస్తే.. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుంచి తననుతాను కాపాడుకునేందుకు మొజ్తబా తనకు అత్యంత నమ్మకమైన మిత్రదేశం రష్యాలోని ఓ బంకర్లో తలదాచుకుంటున్నారనే ప్రచారం ఉంది. ప్రస్తుతం మొజ్తబా తెరవెనకే ఉంటూ.. ఇరాన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దేశ రక్షణ, విదేశీ విధానాల వంటి కీలక నిర్ణయాలను ఐఆర్జీసీ కమాండర్లు నిర్వర్తిస్తున్నారు.ఇరాన్ మైండ్‌గేమ్ ఆడుతోందా?ఏఐ ఆధారిత టెక్నాలజీ ఎంతగా అందుబాటులోకి వచ్చినా.. అంతరిక్షం నుంచి భూగాళాన్నే జల్లెడ పట్టేలా శాటిలైట్లు ఉన్నా.. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా మాత్రం పాతకాలపు రహస్య పద్ధతులకు జైకొట్టారు. అందుకే.. మొస్సాద్, సీఐఏలకు షాక్‌ల మీద షాక్ ఇస్తున్నారు. అయితే.. మొజ్తబా నిజంగానే బంకర్లలో తలదాచుకుంటున్నారా? లేక ఇరాన్ ఆయన పేరుతో మైండ్‌గేమ్ ఆడుతోందా? అనేది ఆసక్తికరంగా మారింది.-హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్ట్ -
సాక్షి కార్టూన్: 01-08-2026
సాక్షి కార్టూన్: 01-08-2026 -
ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్.. ఈ సారి దాడి ఎప్పుడు చూడనిది
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై రెచ్చిపోయారు. ఈ వారాంతంలో ఇరాన్‌పై కనీవినీ ఎరుగని రీతిలో దాడులు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో టెహ్రాన్‌ని లొంగిపోయేలా చేసేలా అత్యంత కఠినమైన దాడులు చేయాలని సైన్యాన్ని హెచ్చరించినట్లు సమాచారం.పశ్చిమాసియా యుద్ధంలో ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తున్నాయి. యుద్ధం ముగుస్తుందనుకునేలోపే మళ్లీ తీవ్రస్థాయికి చేరింది.ఇది చాలదన్నట్లు ఇటీవలే అమెరికాకు మద్ధతుగా సౌదీ అరేబియా సైతం రంగప్రవేశం చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఇరాన్‌కు ఝలకిచ్చారు.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.." టెహ్రాన్‌ను లొంగిపోయేలా ఇరాన్‌పై కఠినమైన దాడులు చేయండి. వారు అబద్ధాలు చెబుతారు. తప్పుగా అన్వయిస్తారు. ఇరాన్‌పై విశ్వాసం కోల్పోతున్నాము మనము వారిని చాలా తీవ్రంగా దెబ్బతీద్దాం. దీంతో ఏదో ఒక సమయంలో, ఇకపై దీనిని భరించలేమని వారు చెబుతారు," అని ట్రంప్ అన్నట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ యుద్ధంలో అమెరికా ఎట్టిపరిస్థితుల్లో గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపాయి.అత్యంత కఠినమైన బాంబు దాడిగా?కాగా అక్కడి కథనాల ప్రకారం, ఇరాన్ యొక్క ఇంధన మౌలిక సదుపాయాల లక్ష్యాలు, రిఫైనరీలే టార్గెట్‌గా ఈ దాడులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన బాంబుదాడులలో అత్యంత తీవ్రమైనదిగా నిలిచేలా ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. ఈ భారీ దాడులను అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపేలా ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం. -
ఇరాన్ రహస్య కోట.. ట్రంప్ బాంబులు చేరగలవా?
ఒక పర్వతం.. దాని లోపల అంతుచిక్కని సొరంగాలు.. ప్రపంచ శక్తుల కళ్లన్నీ దానిపైనే. ఇరాన్ అణు కార్యక్రమంలో అత్యంత రహస్యంగా భావిస్తున్న ‘పికాక్స్ మౌంటెన్’ ఇప్పుడు మరోసారి అంతర్జాతీయ చర్చకు కేంద్రంగా మారింది. ఇందుకు కారణం.. ఇటీవలి కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న వరుస హెచ్చరికలు. ‘ఆ ప్రాంతాన్ని త్వరలోనే.. చాలా తీవ్రంగా లక్ష్యంగా చేసుకుంటాం’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మధ్యప్రాచ్యంలో కొత్త ఉద్రిక్తతలకు తెరతీశాయి. ఇప్పటికే ఇరాన్‌లోని కొన్ని అణు కేంద్రాలపై దాడులు జరిగిన నేపథ్యంలో.. ఇప్పుడు అమెరికా చూపు పికాక్స్ మౌంటెన్‌పై పడిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.పర్వతం లోపల ఏముంది?ఇరాన్‌లోని నటాంజ్ అణు సముదాయానికి దక్షిణంగా ఉన్న ఈ పర్వత ప్రాంతం బయటికి చూస్తే సాధారణ కొండలా కనిపిస్తుంది. కానీ దాని లోపల భారీ భూగర్భ నిర్మాణం ఉందని ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. ‘కుహ్-ఎ కొలాంగ్’గా పిలిచే ఈ ప్రాంతానికి ఆంగ్లంలో పికాక్స్ మౌంటెన్ అనే పేరు వచ్చింది. పికాక్స్ అంటే కొండను తవ్వే పనిముట్టు. పేరు మాదిరిగానే ఈ ప్రాంతం లోపల భారీ సొరంగ వ్యవస్థ ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఉపగ్రహ చిత్రాల్లో ఈ ప్రాంతంలో నాలుగు సొరంగ ప్రవేశ మార్గాలు కనిపిస్తున్నాయి. రెండు తూర్పు వైపు, మరో రెండు పడమర వైపు ఉన్నట్లు గుర్తించారు. ఇటీవలి చిత్రాల్లో అక్కడ నిర్మాణ వాహనాలు, కొత్త రహదారి పనులు, సొరంగాల వద్ద కదలికలు కనిపించడం అనుమానాలను పెంచింది.అణు కేంద్రానికి ప్రత్యామ్నాయమా?2020లో నటాంజ్ అణు కేంద్రంలో జరిగిన అనుమానాస్పద విధ్వంసం తర్వాత.. మరింత సురక్షితమైన, ఆధునిక భూగర్భ కేంద్రాన్ని నిర్మిస్తామని ఇరాన్ ప్రకటించింది. ఆ కేంద్రం పికాక్స్ మౌంటెన్ అయి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇక్కడ అధునాతన సెంట్రిఫ్యూజ్‌లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. సెంట్రిఫ్యూజ్‌లు యురేనియం శుద్ధికి ఉపయోగపడతాయి. తక్కువ స్థాయి శుద్ధితో అణు విద్యుత్ అవసరాలకు ఉపయోగించే యురేనియం తయారు చేయవచ్చు. అయితే అత్యధిక స్థాయి శుద్ధి చేస్తే అణ్వాయుధాల తయారీలోనూ ఉపయోగించే అవకాశం ఉంటుంది.Iran : ( Video ) Israeli Channel 14 explains what Pickaxe Mountain is and what it has become . Iran's most strategic asset in its necular program. 👇 pic.twitter.com/TipMFrNOM9— Kbar57 (@kbar57) July 30, 2026ట్రంప్ ఎందుకు గురి పెట్టారు?పికాక్స్ మౌంటెన్‌లో అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉండవచ్చని కొన్ని వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇదే అమెరికా ఆందోళనకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. జూలై 21న ట్రంప్ మాట్లాడుతూ.. “ఆ ప్రాంతాన్ని త్వరలోనే భారీగా దెబ్బతీస్తాం” అని వ్యాఖ్యానించారు. తర్వాత కూడా ఒప్పందం కుదరకపోతే పికాక్స్ మౌంటెన్‌ను లక్ష్యంగా చేసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అయితే ఇరాన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. అక్కడ ఎలాంటి అణు కార్యకలాపాలు జరగడం లేదని చెబుతోంది. అమెరికా బెదిరింపులు దాడికి సాకులు మాత్రమేనని విమర్శిస్తోంది.అమెరికా బాంబులతోనైనా కూలుతుందా?పికాక్స్ మౌంటెన్కు ఉన్న అతిపెద్ద రక్షణ.. దాని లోతు. ఈ కేంద్రం భూమికి దాదాపు 100 మీటర్ల లోపల ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. భూగర్భ లక్ష్యాలను ఛేదించేందుకు అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధాల్లో GBU-57 బంకర్ బస్టర్ బాంబులు ఒకటి. ఇవి భారీగా రక్షణ కలిగిన నిర్మాణాలను ఛేదించేందుకు రూపొందించబడ్డాయి. అయితే ఇంత లోతులో ఉన్న పికాక్స్ మౌంటెన్‌ను పూర్తిగా ధ్వంసం చేయడం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. లోపలి నిర్మాణం ఎలా ఉందో స్పష్టంగా తెలియకపోవడం కూడా మరో సమస్య. కేంద్రంలోని సొరంగ మార్గాలు, విద్యుత్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, సరఫరా మార్గాలను దెబ్బతీయడం ద్వారా కార్యకలాపాలను నిలిపివేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) అంచనాల ప్రకారం.. 2025లో ఇరాన్ వద్ద దాదాపు 440 కిలోల (970 పౌండ్ల) 60 శాతం శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వల్లో కొంత భాగం లేదా మొత్తం పికాక్స్ మౌంటెన్ భూగర్భ కేంద్రంలో ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి ఇప్పటివరకు ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లేవు. అంతేకాదు.. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత నటాంజ్, ఫోర్డో అణు కేంద్రాల్లో దెబ్బతినకుండా మిగిలిన కొన్ని అధునాతన సెంట్రిఫ్యూజ్‌లను కూడా పికాక్స్ మౌంటెన్కు తరలించి ఉండవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.ఒక పర్వతం.. రెండు దేశాల పోరుపికాక్స్ మౌంటెన్ ఇప్పుడు కేవలం ఓ అణు కేంద్రం అనుమానంతో ఉన్న ప్రాంతం మాత్రమే కాదు.. అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలకు ప్రతీకగా మారింది. ఒకవైపు అమెరికా “అణు బెదిరింపును అడ్డుకోవాలి” అంటోంది. మరోవైపు ఇరాన్ “దాడికి ప్రతీకారం తప్పదు” అని హెచ్చరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భూమి లోపల దాగిన ఈ రహస్య కేంద్రంపై నిజంగా బాంబులు పడతాయా? లేక ఇది కేవలం ఒత్తిడి వ్యూహమా? అన్నది ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. -
ఇరాన్ ఉలిక్కిపడేలా.. ట్రంప్, నెతన్యాహు మెగా ఆపరేషన్!
మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ భారీ స్థాయి వైమానిక దాడులకు సిద్ధమవుతున్నాయా? అంటే తాజా పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. ఇరాన్ ఇంధన మౌలిక వసతులపై ఇప్పటివరకు జరగని స్థాయిలో దాడుల ప్రణాళిక సిద్ధమవుతున్నట్లు అమెరికా అధికారులను ఉటంకిస్తూ సీబీఎస్ న్యూస్ వెల్లడించింది.ఈ దాడుల్లో ఇరాన్‌లోని కీలక విద్యుత్ కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలు వంటి వ్యూహాత్మక లక్ష్యాలను ఎంచుకున్నట్లు సమాచారం. ఇరాన్ సైనిక కార్యకలాపాలు, ప్రభుత్వ వ్యవస్థను కొనసాగించే సామర్థ్యాన్ని బలహీనపర్చడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ ఉండొచ్చని అమెరికా అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ భారీ ఆపరేషన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా తుది అనుమతి ఇవ్వలేదని సమాచారం. పెంటగాన్ కూడా లక్ష్యాలపై స్పందించేందుకు నిరాకరించింది.ప్రపంచ మార్కెట్లు సోమవారం ప్రారంభమయ్యేలోపు ఈ ఆపరేషన్‌ను ముగించాలని అమెరికా వర్గాల్లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇరాన్ ఇంధన సరఫరాలపై దాడులు జరిగితే ప్రపంచ చమురు మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఈ అంశంపై జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్‌ను కూడా ఈ ప్రణాళికల్లో భాగస్వామిగా ఉంచినట్లు తెలుస్తోంది. వాషింగ్టన్‌తో టెల్ అవీవ్ సన్నిహిత సమన్వయం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్‌పై పూర్తి స్థాయి సైనిక చర్యకు తిరిగి వెళ్లే నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఓ ఇజ్రాయెల్ అధికారి స్పష్టం చేశారు.ట్రంప్ అధ్యక్షతన క్యాంప్ డేవిడ్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఇరాన్‌పై సైనిక ఎంపికలపై చర్చ జరిగినట్లు సమాచారం. కొందరు అధికారులు ఈ చర్యకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ట్రంప్ మాత్రం ఇరాన్‌పై కఠిన వైఖరిని ప్రదర్శిస్తూ చాలా తీవ్రంగా దెబ్బతీస్తాం అనే సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా లక్ష్యం ఇరాన్ అణ్వస్త్ర సామర్థ్యాన్ని అడ్డుకోవడమేనని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. అధ్యక్షుడి నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా అమలు చేసేందుకు అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని పెంటగాన్ పేర్కొంది. టెహ్రాన్ నగర విద్యుత్ సరఫరాను దెబ్బతీయడం వంటి ప్రత్యామ్నాయాలపైనా అమెరికా అధికారులు చర్చించినట్లు సమాచారం.మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ చర్యలపై ఇరాన్ తీవ్ర హెచ్చరికలు చేసింది. ఎలాంటి అమెరికా దాడి జరిగినా ప్రతీకార చర్యలకు సమగ్ర ప్రణాళిక సిద్ధంగా ఉందని ఇరాన్ భద్రతా వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్‌లోని కీలక మౌలిక వసతులు, ప్రాంతీయంగా ఉన్న అమెరికా ఇంధన వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం తమకు ఉందని హెచ్చరించాయి. -
జాగ్రత్త.. అమెరికాలోనూ ఇదే పరిస్థితి రావొచ్చు: ట్రంప్
ఒకవైపు స్పెయిన్ సరిహద్దులో వేలాది మంది వలసదారుల ప్రవాహం.. మరోవైపు అమెరికా సరిహద్దులపై రాజకీయ చర్చ. స్పెయిన్‌లోని సియుటా ప్రాంతంలో చోటుచేసుకున్న భారీ వలస సంక్షోభాన్ని ఉదాహరణగా చూపిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అక్రమ వలసల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. యూరప్‌లో కనిపిస్తున్న ఈ దృశ్యాలు భవిష్యత్‌లో అమెరికాలోనూ పునరావృతమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.“ఆ దృశ్యాన్ని గుర్తుంచుకోండి. తప్పు విధానాలు కొనసాగితే మూడేళ్లలో అమెరికాలోనూ ఇదే పరిస్థితి రావొచ్చు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. స్పెయిన్‌లోని సియుటా(Ceuta)లో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ.. సరిహద్దుల రక్షణ, అక్రమ వలసల నియంత్రణపై కఠిన చర్యలు అవసరమని ఆయన అన్నారు.అమెరికా వలసలపై ట్రంప్ ఆందోళనఅక్రమ వలసల నియంత్రణ ట్రంప్ రాజకీయ అజెండాలో మొదటి నుంచీ కీలక అంశంగా ఉంది. అమెరికా–మెక్సికో సరిహద్దు నుంచి పెద్ద సంఖ్యలో వలసదారులు ప్రవేశించడంపై ఆయన గతంలోనూ తీవ్ర విమర్శలు చేశారు. సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేయాలని, అక్రమంగా వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పదేపదే డిమాండ్ చేశారు.స్పెయిన్ సరిహద్దులో జరిగిన ఘటనను కూడా ట్రంప్ ఇదే వాదనకు ఉదాహరణగా చూపించారు. నియంత్రణ లేని వలసలు ఏ దేశానికైనా సామాజిక, భద్రతా సమస్యలు సృష్టించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.అసలేం జరిగింది?ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో నుంచి స్పెయిన్‌కు చెందిన చిన్న భూభాగం సియుటాలోకి గత రెండు రోజులుగా వేలాది మంది వలసదారులు ఒక్కసారిగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. యూరప్‌లోకి చేరేందుకు ప్రయత్నించే వలసదారులకు సియుటా కీలక మార్గంగా మారింది.గురువారం నుంచి సరిహద్దు వద్ద పరిస్థితులు తీవ్రంగా మారాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు కంచెలు దాటేందుకు ప్రయత్నించడంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. కొందరు సముద్ర మార్గంలో ఈదుకుంటూ స్పెయిన్ భూభాగంలోకి చేరేందుకు ప్రయత్నించారు.ఈ క్రమంలో జరిగిన ప్రమాదాల్లో కనీసం 57 మంది మృతి చెందినట్లు సియుటా ప్రాంత అధ్యక్షుడు జువాన్ జీసస్ వివాస్ వెల్లడించారు. కొందరు సముద్రంలో మునిగి చనిపోగా, మరికొందరు సరిహద్దు కంచె వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.24 గంటల్లోనే 60 వేల మంది?సియుటా ప్రాంతంలోకి గత 24 గంటల్లోనే దాదాపు 60 వేల మంది ప్రవేశించినట్లు ప్రాంతీయ అధికారులు తెలిపారు. అయితే స్పెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ మాత్రం గురువారం నుంచి సుమారు 50 వేల మంది సరిహద్దు దాటినట్లు అంచనా వేసింది. వీరిలో చాలా మందిని తిరిగి మొరాకోకు పంపించినట్లు స్పెయిన్ అధికారులు తెలిపారు. 48 వేల మందికి పైగా ఇప్పటికే మొరాకోకు తిరిగి వెళ్లిపోయారని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరికొందరు కూడా గంటల వ్యవధిలో వెనక్కి వెళ్తున్నారని పేర్కొంది.ఎందుకు ఒక్కసారిగా పెరిగింది వలసల ప్రవాహం?సియుటా వైపు ఇంత భారీ సంఖ్యలో వలసదారులు రావడానికి ప్రధాన కారణం.. యూరప్‌లోకి ప్రవేశించే అవకాశంగా ఈ మార్గాన్ని భావించడమే. ఆఫ్రికాలోని పేదరికం, నిరుద్యోగం, రాజకీయ అస్థిరత, మెరుగైన జీవితం కోసం చేసే ప్రయత్నాలు అనేక మందిని యూరప్ వైపు నడిపిస్తున్నాయి. అయితే ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి సరిహద్దు దాటే ప్రయత్నం జరగడం అసాధారణమని అధికారులు చెబుతున్నారు. మానవ అక్రమ రవాణా ముఠాలు కూడా వలసదారులను ప్రేరేపిస్తున్నాయని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ఆరోపించారు.స్పెయిన్ చర్యలు.. యూరప్‌లో ఆందోళనపరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్పెయిన్ అదనపు భద్రతా బలగాలను సియుటాకు పంపింది. సైన్యం, పోలీసులు, డ్రోన్లు, సముద్ర భద్రతా బృందాలను రంగంలోకి దించింది. ఈ ఉదంతంపై యూరోపియన్ యూనియన్(EU) కూడా స్పందించింది. యూరప్ నిబంధనలను పాటించకుండా ఎవరినీ అనుమతించబోమని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ స్పష్టం చేశారు.స్పెయిన్‌లోని సియుటా సంక్షోభం ఇప్పుడు కేవలం ఆ దేశ సమస్యగా కాకుండా.. యూరప్ సరిహద్దు భద్రత, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వలసల సమస్యపై మరోసారి చర్చకు దారితీసింది. ట్రంప్ వ్యాఖ్యలతో ఈ అంశం అమెరికా రాజకీయాల్లోనూ మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. -
గాజాలో శాంతికి ట్రంప్ డీల్?
వాషింగ్టన్/కైరో: ఇజ్రాయెల్ – పాలస్తీనా సమస్యకు ఒక పరిష్కారం దొరికిందా? పాలస్తీనా హక్కుల కోసం పోరాడుతున్న హమాస్ ఆయుధాలు త్యజించేలా.. ఇజ్రాయెల్ గాజా ప్రాంతం నుంచి తన బలగాలను ఉపసంహరించుకునేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రతిపాదన చేయడం.. ఇందుకు హమాస్ సైతం అంగీకరించడంతో ఆశలు కొద్దిగా చిగురిస్తున్నాయి. ఇజ్రాయెల్–గాజాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తొమ్మిది నెలలకు అమెరికా గురువారం తాజా ప్రకటన చేయడం గమనార్హం. ఈ ఒప్పందంలోని రెండు దశలో భాగంగా హమాస్ ఆయుధాలు వీడాల్సి ఉంది. అదే సమయంలో గాజా పునర్ నిర్మాణానికి ఒక అవగాహన కుదరాల్సి ఉంది. అయితే అప్పట్లో ఇరుపక్షాల మధ్య చర్చలు స్తంభించిపోగా.. తాజాగా దశలవారీగా దీన్ని అమలు చేసేందుకు అంగీకారం కుదిరిందని ట్రంప్ తన ఎక్స్ ఖాతాలో ప్రకటించారు. ‘‘హమాస్ ఆయుధాలు వీడిన వెంటనే ఇజ్రాయెల్ తన బలగాలను ఉపసంహరించుకుంటుంది. అంతర్జాతీయ స్థిరీకరణ బలగాలు కొత్త పాలస్తీనా పోలీస్ వ్యవస్థతో కలిసి గాజా ప్రాంతంలోని పౌరుల భద్రత బాధ్యతలు తీసుకుంటుంది’’అని ఆయన వివరించారు. ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం హమాస్ తన ఆయుధాలు వీడటమే కాకుండా... గాజా ప్రాంతంలోని తమ సొరంగ మార్గాలు అన్నింటినీ ధ్వంసం చేయాల్సి ఉంది. ట్రంప్ ప్రతిపాదనలకు తాము అంగీకారం తెలిపినట్లు హమాస్ కూడా శుక్రవారం ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ కూడా ఘర్షణ వైఖరిని వీడాలని, బలగాలను ఉపసంహరించుకోవాలని హమాస్ అధికారి ఒకరు తెలిపారు. ట్రంప్ ఒప్పందంపై ఇజ్రాయెల్ తన వైఖరిని ఇంకా ప్రకటించాల్సి ఉంది. దశలవారీగా అమలు ట్రంప్ ప్రతిపాదన వాస్తవరూపం దాల్చేందుకు మంచి అవకాశాలే ఉన్నట్టు అమెరికాతోపాటు గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి ఏర్పాటైన బోర్డ్ ఆఫ్ పీస్ అధికారులు కూడా ఆశాభావంతో ఉన్నారు. ఎంత సమయం పడుతుందన్నది మాత్రం కచ్చితంగా చెప్పలేమని వీరు అంటున్నారు. అయితే రానున్న రెండు వారాల్లో గాజా పోలీసు బలగాలు మాత్రం టెక్నక్రటిక్ బోర్డ్ ఆఫ్ పీస్‌కు అందజేయనున్నారని తెలిపారు. గాజా పోలీసు బలగాలతోపాటు అనేక ఇతర సంస్థలు కూడా భారీ ఎత్తున ఆయుధాలు కలిగి ఉండటం గమనార్హం. వీరంతా ఒప్పందంలో భాగంగా ఉంటారా? అన్నది ప్రశ్న. హమాస్ వద్ద ఉన్న భారీ ఆయుధాల అప్పగింత, ధ్వంసం, సొరంగాల విధ్వంసం వంటివి తరువాతి దశల్లో జరగవచ్చునని, ఇందుకు కనీసం ఏడాది సమయం పట్టవచ్చునని పేరు చెప్పేందుకు ఇష్టపడని బోర్డ్ ఆఫ్ పీస్ అధికారి ఒకరు తెలిపారు. అనుమానంగానే ఇజ్రాయెల్.. ట్రంప్ శాంతి ప్రతిపాదనపై హమాస్ అంగీకారం తెలిపినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం ఇంకా సంశయంలోనే కొట్టుమిట్టాడుతోంది. హమాస్ ఆయుధాలు అప్పగిస్తుందన్న నమ్మకం ఇజ్రాయెల్‌కు లేదు. అయితే ఇజ్రాయెల్ ఇప్పుడు కొత్తగా చేయాల్సిందేమీ లేదని, గతంలో వారు అంగీకరించినట్టు గాజా ప్రాంతం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవడం మాత్రమే చేస్తే చాలని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. దాంతోపాటే గాజా ప్రాంతంపై వైమానిక దాడులు నిలిపివేసేందుకు కూడా ఇజ్రాయెల్ గతంలోనే అంగీకరించిందని చెప్పారు. ఒకవేళ ఇజ్రాయెల్ తానిచ్చిన మాటకు కట్టుబడకపోతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘‘తీవ్రంగా నిరాశ చెందుతారు’’అని వ్యాఖ్యానించారు. డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నేతన్యాహూలు మంగళవారమే వైట్‌హౌస్‌లో సమావేశమైన సంగతి ఇక్కడ చెప్పుకోవాలి. ఈ సమావేశం సందర్భంగా చర్చించిన అంశాలపై మాత్రం ఇద్దరు నేతలు నోరు విప్పలేదు. ఇజ్రాయెల్‌పై దాడులు మొదలైన తరువాత ఇరువురు నేతలు కలుసుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. తాజా పరిణామాలపై ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం కూడా ఏ రకమైన వ్యాఖ్య చేసేందుకు ఇష్టపడలేదు. -
అమెరికా ఉద్యోగానికి లక్ష డాలర్ల ఫీజు?
వాషింగ్టన్: చదువు తరువాత అమెరికాలోనే ఉద్యోగం చేసేందుకు వీలు కల్పించే ఆప్షన్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) వీసా ఫీజు లక్ష డాలర్లు కానుందా? అవునంటోంది వాల్‌స్ట్రీట్ జర్నల్. హెచ్–1బీ వీసా ఫీజులను లక్ష డాలర్లకు పెంచేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలు న్యాయస్థానాల్లో బెడిసికొట్టడంతో ఇప్పుడు ‘డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ’(డీహెచ్ఎస్)ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. విదేశీ విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ తరువాత తాము చదువుకున్న సబ్జెక్టులోనే ఏడాది నుంచి మూడేళ్లు ఉద్యోగం చేసేందుకు ఈ ఓపీటీ వీసా ఉపయోగపడుతుంది. యూఎస్ యూనివర్శిటీల్లో అత్యధిక నియామకాలు చేపట్టే టెక్నాలజీ ఆధారిత కంపెనీలు హెచ్–1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే ఓపీటీ ఫీజు లక్ష డాలర్లకు పెంచే విషయంపై డీహెచ్ఎస్ ఆచితూచి ఒక ప్రకటన చేసింది. అధికారిక ప్రకటన వెలువడేంత వరకూ ఏదీ ఫైనల్ కాదని స్పష్టం చేసింది. ‘‘అందుబాటులో ఉన్న విషయాలన్నింటిపై చర్చలు జరుగుతూనే ఉంటాయి. చట్టపరంగా ఈ దేశానికి వలస వచ్చే వ్యవస్థ సమగ్రతను కాపాడేందుకు వీటిని ఉపయోగిస్తాం’’అని అధికార ప్రతినిధి ఒకరు ప్రకటించారు. ఇతర దేశాల నుంచి గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకునే వారు దరఖాస్తుతోపాటు లక్ష డాలర్ల బాండ్ ఒకటి సమర్పించేలా కూడా డీహెచ్ఎస్ ఆలోచన చేస్తున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం తెలిపింది. దరఖాస్తుదారు అమెరికా వచ్చి పౌరసత్వం పొందిన తరువాత బాండ్ మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. -
ట్రంప్‌ను టెన్షన్ పెడుతున్న ఇజ్రాయెల్
అంతా తన ప్లాన్ ప్రకారమే సాగుతుందని భావించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అనూహ్యంగా ఓ కొత్త సవాల్ ఎదురైంది. సన్నిహిత మిత్రదేశం నుంచే వస్తున్న సంకేతాలు ఇప్పుడు వాషింగ్టన్లో చర్చకు దారితీస్తున్నాయి. ఒకవైపు కీలక అంతర్జాతీయ సంక్షోభానికి ముగింపు పలికేందుకు ట్రంప్ ప్రయత్నిస్తుండగా.. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వైఖరి ఈ ప్రక్రియకు పరీక్షగా మారుతోంది.గాజాలో మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హమాస్, ఇతర సాయుధ గ్రూపులు పూర్తిగా నిరాయుధీకరణకు అంగీకరించాయని, దీనితో శాశ్వత శాంతి దిశగా ముందడుగు పడిందని ఆయన వెల్లడించారు.ట్రంప్ ప్రతిపాదించిన 20 అంశాల ప్రణాళికలో హమాస్ ఆయుధాలు వదిలేయడం ప్రధాన అంశంగా ఉంది. ఇప్పటివరకు దీనిపై ప్రతిష్ఠంభన కొనసాగగా.. తాజాగా అంగీకారం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. ఒప్పందం అమలులో భాగంగా బందీల విడుదల, ఖైదీల మార్పిడి, సైనిక బలగాల క్రమంగా ఉపసంహరణ వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. అయితే ఈ పరిణామాల మధ్య ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వైఖరే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఒప్పందం అమలు, భద్రతా హామీలు, భవిష్యత్ పరిస్థితులపై ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని కోరుతోంది. తమ దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని నెతన్యాహు ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.ట్రంప్ దృష్టి మాత్రం ఈ పరిణామాలను దౌత్య విజయంగా మార్చుకోవడంపైనే ఉంది. అమెరికా మధ్యవర్తిత్వంతో దీర్ఘకాలిక పరిష్కారం సాధించాలని ఆయన భావిస్తున్నారు. అయితే ఒప్పందంలోని నిబంధనలు అమలు కావడం, వాటిపై ఇజ్రాయెల్ రాజకీయ వర్గాల స్పందన ఇప్పుడు కీలకంగా మారనుంది.గాజా పాలనలో హమాస్ పాత్ర ఉండకూడదని, ఆయుధ వ్యవస్థలు తొలగించాల్సి ఉంటుందని ప్రతిపాదనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ పర్యవేక్షణలో కొత్త పరిపాలనా వ్యవస్థ ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని ప్రణాళికలో ఉంది. అనంతరం పాలస్తీనా అథారిటీ సంస్కరణలతో గాజా బాధ్యతలు చేపట్టే అంశం కూడా ఇందులో భాగంగా ఉంది.అయితే నెతన్యాహు ప్రభుత్వంలోనే ఈ ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. కఠిన వైఖరి కలిగిన వర్గాలు ఎలాంటి రాజీ చర్యలనైనా వ్యతిరేకించే అవకాశం ఉంది. దీంతో ట్రంప్ ప్రయత్నాలు కేవలం హమాస్‌తో ఒప్పందానికే పరిమితం కాకుండా.. ఇజ్రాయెల్ రాజకీయ సమీకరణాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది.మరోవైపు పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులపై కూడా దృష్టి పెరుగుతోంది. కీలక జలమార్గాల్లో నౌకాయాన రక్షణ కోసం పలు దేశాలు కలిసి మారిటైమ్ డిఫెన్స్ అలయన్స్‌ను ఏర్పాటు చేశాయి. ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సముద్ర మార్గాల భద్రతకు ఈ కూటమి ప్రాధాన్యం ఇస్తోంది.ఇప్పుడు అసలు పరీక్ష ఒప్పందం ప్రకటించడం కాదు.. దాన్ని అమలు చేయడమే. ట్రంప్ దౌత్య ప్రయత్నాలకు నెతన్యాహు ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుంది? గాజాలో శాంతి ప్రక్రియ ముందుకు సాగుతుందా? లేదంటే కొత్త అడ్డంకులు ఎదురవుతాయా?.. హమాస్ ఏదైనా సడన్ ట్విస్ట్ ఇస్తుందా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.ట్రంప్ తీవ్రంగా నిరాశ చెందుతారు: అమెరికా అధికారిఇజ్రాయెల్ తన అంగీకారాలకు కట్టుబడి ట్రంప్ 20 అంశాల ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలని అమెరికా సీనియర్ అధికారి కోరారు. ప్రణాళిక అమలుకు ఇజ్రాయెల్ సహకరించకపోతే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ “చాలా నిరాశ చెందుతారని” హెచ్చరించారు. బందీల విడుదల, యుద్ధం ముగింపు కోసం కుదిరిన ఒప్పందాన్ని ఇరు పక్షాలు గౌరవించాలని ఆయన అన్నారు. గతంలో అనుమానాలు ఉన్నప్పటికీ హమాస్ బందీలను అప్పగించిందని, ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా తన హామీలను నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. -
అమెరికాలో భారతీయ విద్యార్థులకు భారీ షాక్!
అమెరికాలో చదువు పూర్తి చేసి ఉద్యోగం పొందాలని కలలు కనే విదేశీ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలో పని చేసేందుకు ఉపయోగించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) విధానంపై భారీగా 1 లక్ష డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.అమెరికాలో F-1 విద్యార్థి వీసాపై చదివే విదేశీ విద్యార్థులకు చదువు పూర్తయిన తర్వాత కొంతకాలం అక్కడే ఉండి తమ విద్యకు సంబంధించిన రంగంలో ఉద్యోగం చేసే అవకాశం OPT ద్వారా లభిస్తుంది. ప్రస్తుతం సాధారణ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు గరిష్ఠంగా ఒక సంవత్సరం వరకు OPT కింద పనిచేయవచ్చు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) కోర్సులు చేసిన వారికి ఈ గడువు మూడు సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు ఉద్యోగ అనుభవం సంపాదించడంతో పాటు, తర్వాత H-1B వర్క్ వీసా పొందేందుకు ప్రయత్నిస్తారు.అయితే ఈ అవకాశానికి ఏకంగా 100,000 డాలర్ల ఫీజు విధించే ఆలోచన ఇప్పుడు చర్చకు వచ్చింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల మార్గం మరింత ఖరీదైనదిగా మారే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయంపై ఇంకా తుది ప్రకటన వెలువడలేదు.ఎవరిపై భారం పడనుంది?ప్రతిపాదిత ఫీజును విద్యార్థులే చెల్లించాలా? లేక వారిని ఉద్యోగంలోకి తీసుకునే కంపెనీలే చెల్లించాలా? అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. విద్యార్థులే చెల్లించాల్సి వస్తే.. చాలా మందికి ఇది అందనంత భారంగా మారే అవకాశం ఉంది. కంపెనీలు చెల్లించాల్సి వస్తే.. విదేశీ గ్రాడ్యుయేట్లను నియమించుకోవడంపై సంస్థలు వెనుకడుగు వేసే పరిస్థితి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీంతో అమెరికన్ విద్యార్థులకు ప్రాధాన్యం పెరిగి, అంతర్జాతీయ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.భారతీయ విద్యార్థులపై ప్రభావం ఎంత?అమెరికా ఉన్నత విద్యకు భారతీయ విద్యార్థులు ప్రధాన వర్గంగా ఉన్నారు. ప్రస్తుతం లక్షలాది మంది భారతీయులు అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. చాలామంది విద్యార్థులు కేవలం డిగ్రీ కోసం మాత్రమే కాకుండా.. చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేసి అంతర్జాతీయ అనుభవం పొందాలనే లక్ష్యంతో అమెరికాకు వెళ్తున్నారు.అమెరికా విద్య కోసం కుటుంబాలు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెడుతున్న నేపథ్యంలో.. OPTపై భారీ ఫీజు ప్రతిపాదన విద్యార్థులపై ఆర్థిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.నాలుగేళ్ల వీసా పరిమితి కూడా!OPT ఫీజు ప్రతిపాదనతో పాటు అంతర్జాతీయ విద్యార్థుల వీసా నిబంధనల్లో మరో కీలక మార్పు కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు విదేశీ విద్యార్థులు “డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్” విధానంలో అమెరికాలో ఉండేవారు. అంటే.. వారు తమ కోర్సును నిబంధనల ప్రకారం కొనసాగిస్తున్నంత కాలం అమెరికాలో ఉండే అవకాశం ఉండేది.తాజా ప్రతిపాదనల ప్రకారం.. విద్యార్థులకు గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు మాత్రమే ఉండే అనుమతి ఇవ్వాలనే ఆలోచన ఉంది. అంతకంటే ఎక్కువ సమయం అవసరమైతే.. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది.ట్రంప్ ప్రభుత్వం చెబుతున్న కారణంఅమెరికా వలస విధానాన్ని మరింత పర్యవేక్షించడం, చట్టబద్ధమైన వలస వ్యవస్థను బలోపేతం చేయడం, దేశ భద్రతను పెంచడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. అయితే విద్యా రంగ నిపుణులు మాత్రం.. ఇలాంటి నిబంధనలు అమెరికాను అంతర్జాతీయ విద్యార్థులకు తక్కువ ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికిప్పుడు ఆందోళన అవసరం లేదా?$100,000 OPT ఫీజు ప్రతిపాదన ఇంకా చర్చల దశలోనే ఉంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే అమెరికా వలస విధానంలో క్రమంగా కఠినమైన మార్పులు వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో చదువు పూర్తి చేసి అక్కడే కెరీర్ నిర్మించుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఇకపై మార్గం మరింత ఖరీదైనదిగా, నిబంధనలతో కూడుకున్నదిగా మారే అవకాశం ఉంది. -
గాజా శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గాజాలో శాంతిస్థాపనే లక్షంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని ఇకపై హమాస్ చేతిలో ఎటువంటి ఆయుధాలుండవని పూర్తి నిరాయుధీకరణ జరుగుతుందని పేర్కొన్నారు.గాజా స్ట్రీట్‌లో శాంతి స్థాపన కోసం ఏర్పాటైన బోర్ట్ ఆఫ్ పీస్ సాధించిన అత్యంత కీలక విజయమని పేర్కొన్నారు.2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య తీవ్రమైన భీకర యుద్ధం ప్రారంభమైంది. ఈ సంఘర్షణలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగడంతో పాటు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. గాజాలో చెలరేగిన ఈ యుద్ధం కారణంగా ఇప్పటివరకు 73,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా అంటే పరిస్థితి ఎంత తీవ్రతరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ట్రంప్ గాజాలో శాంతిస్థాపన పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి 'బోర్డ్ ఆఫ్ పీస్' ఏర్పాటు చేశారు.కాగా ప్రస్తుతం గాజాలో శాంతి స్థాపన కోసం ఒక కీలక ఒప్పందం జరిగినట్లు తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా పోస్ట్ చేశారు. "ఈ రోజు బోర్డ్ ఆఫ్ పీస్ ఒక చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గాజాలో శాంతి, భద్రతలు నెలకొనడానికి ఇది ఒక అద్భుతమైన ముందడుగు ఈ నిరాయుధీకరణ ప్రక్రియ జాగ్రత్తగా దశలవారీగా జరుగుతుంది " అని పేర్కొన్నారు. ఈ ఒప్పందాన్ని కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన ఈజిప్ట్, ఖతార్, టర్కీ మధ్యవర్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.కాగా ఈ ఒప్పందంపై హమాస్ నుండి ఎలాంటి తక్షణ అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, తమ ఆయుధాలను విడనాడే ప్రక్రియ దిశగా హమాస్ అడుగులు వేస్తోందని కైరోలోని మధ్యవర్తులతో చర్చలు జరుపుతున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం గాజాలో శాంతి స్థాపనను అక్కడి పోలీసులతో పాటు 'ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్' (ISF) చేపడుతుంది.అయితే పాలస్తీనాలో ఇప్పటికీ హింస చెలరేగుతోంది. గత గురువారం గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇద్దరు పిల్లలతో సహా కనీసం నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య అధికారులు వెల్లడించారు. హమాస్ తన ఆయుధాలను పూర్తిగా విడిచిపెట్టాలని ఆ సంస్థను సైనికంగా నిరాయుధీకరణ చేయాలనేది ఇజ్రాయెల్ ప్రధాన డిమాండ్ ఒకవేశ ఇది కార్యరూపం దాలిస్తే త్వరలోనే ఆ ప్రాంతంలో శాంతి నెలకొనే అవకాశం ఉంది. -
అమెరికా ‘హెవీ వేవ్’ దాడులు.. విస్తరిస్తున్న యుద్ధం!
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రాంతీయ యుద్ధం దిశగా సాగుతున్నాయి. ఇరాన్ నుంచి అమెరికా స్థావరాలపై జరిగిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా అమెరికా భారీ వైమానిక దాడులు చేపట్టింది. దక్షిణ ఇరాన్‌లోని కీలక ప్రాంతాలపై ‘హెవీ వేవ్’ పేరుతో దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ దాడులతో పాటు ఇరాక్‌లో ఇరాన్ అనుకూల మిలీషియాలపై అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త చర్యలు చేపట్టడం, యెమెన్‌లో హౌతీల కదలికలు, హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరగడం.. మొత్తం ప్రాంతాన్ని యుద్ధ వాతావరణంలోకి నెట్టాయి.ఇరాన్‌లోని రెవల్యూషనరీ గార్డ్ (IRGC)కు చెందిన స్థావరాలే లక్ష్యంగా తాజాగా అమెరికా దాడులు జరిపింది. సైనిక కమాండ్ కేంద్రాలు, మిసైల్, డ్రోన్ సదుపాయాలు, తీర రక్షణ వ్యవస్థలు, సముద్ర కార్యకలాపాలకు సంబంధించిన కేంద్రాలను టార్గెట్ చేసినట్లు అమెరికా వెల్లడించింది. అబాదాన్, బుషెహర్, కిష్, క్విష్మ్ దీవులు, ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. కిష్ దీవిలోని కజెరూన్ ప్రాంతంలోనూ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం.క్విష్మ్లో నివాస భవనంపై మిసైల్.. రెస్క్యూ కొనసాగింపుఅమెరికా దాడుల్లో క్విష్మ్ దీవిలోని ఓ నివాస భవనం దెబ్బతింది. మిసైల్ దాడితో భవనం కూలిపోవడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి ఇద్దరు చిన్నారులను రక్షించి ఆస్పత్రికి తరలించాయి. మరో ముగ్గురి కోసం శిథిలాల తొలగింపు, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటన యుద్ధంలో పౌర ప్రాంతాలు కూడా ప్రభావితమవుతున్నాయన్న ఆందోళనలను పెంచింది.‘ఇప్పుడు మా వంతు’.. ట్రంప్ హెచ్చరికల తర్వాతే దాడులుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా బలగాలపై దాడులకు ప్రతిస్పందన తప్పదని స్పష్టం చేసిన ఆయన.. “ఇప్పుడు కొట్టే వంతు మాది” అనే సంకేతాలు ఇచ్చారు. ఇరాన్ నుంచి దాడులను ఆపాలని కోరినా అమెరికా చర్యలు తప్పవని ట్రంప్ వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే వైమానిక దాడులు ప్రారంభమయ్యాయి.జోర్డాన్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులుఇటీవల జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసినట్లు అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతీకారంగానే తాజా ఆపరేషన్ చేపట్టినట్లు వాషింగ్టన్ వెల్లడించింది. మరోవైపు ఇరాన్ మాత్రం తమ చర్యలను అమెరికా బెదిరింపులకు ప్రతిస్పందనగా సమర్థించుకుంది. అమెరికా ఒత్తిడి కొనసాగితే ప్రతిఘటన కూడా కొనసాగుతుందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ హెచ్చరించింది.ఇరాక్‌లో అమెరికా–సౌదీ దాడులు.. తీవ్ర ఉద్రిక్తతయుద్ధ ప్రభావం ఇరాక్‌కు కూడా చేరింది. ఇరాన్‌కు అనుబంధంగా ఉన్న మిలీషియా గ్రూపుల స్థావరాలపై అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త దాడులు జరిపాయి. ఈ దాడుల్లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ (PMF)కు చెందిన పలువురు సభ్యులు మరణించినట్లు సమాచారం. కనీసం 20 మంది మృతి చెందినట్లు ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఇరాక్ ప్రభుత్వం ఈ చర్యలను తీవ్రంగా ఖండించింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించారని, అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించింది.రంగంలోకి హౌతీలు.. యెమెన్ నుంచి మరో ముప్పుఇరాన్కు మద్దతుగా వ్యవహరిస్తున్న యెమెన్‌లోని హౌతీ గ్రూపు కూడా ఈ ఘర్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. సౌదీ అరేబియా చమురు రవాణా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని హౌతీలు దాడులు చేసినట్లు సమాచారం. దీనికి ప్రతిగా హోడెయిడా ప్రావిన్స్‌లోని హౌతీ స్థావరాలపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో యుద్ధ ప్రభావం గల్ఫ్ ప్రాంతం దాటి యెమెన్ వరకు విస్తరించింది.హర్ముజ్ జలసంధిలో పెరుగుతున్న టెన్షన్ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మరోసారి యుద్ధ కేంద్రంగా మారింది. ఈ మార్గంలో ప్రయాణించే నౌకలపై ఇరాన్ ఆంక్షలు విధించడం, అనుమతి లేని మార్గాల్లో వెళ్లే ట్యాంకర్లను అడ్డుకుంటామని హెచ్చరించడం ఉద్రిక్తతలకు కారణమైంది. ఇరాన్ నౌకాదళం మూడు చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. మరోవైపు అమెరికా మాత్రం అంతర్జాతీయ నౌకాయానానికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. హర్ముజ్‌లో అమెరికా ఆంక్షలను దిక్కరించిన లావిన్ ట్యాంకర్‌పై దాడి జరిగింది. ఇంజిన్ రూమ్‌పై కాల్పులు జరపడంతో నౌక దెబ్బతింది. ఈజిప్ట్ పోర్టులో డ్రోన్ దాడి కలకలం?యుద్ధం కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోందన్న సంకేతంగా ఈజిప్ట్‌లోని డమియెట్టా పోర్టులో అమెరికాకు చెందిన ఎల్ఎన్జీ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి ఘటన కలకలం రేపింది. దాడి తర్వాత నౌకలో మంటలు చెలరేగాయి. మంటలు మరో నౌకకు కూడా వ్యాపించాయి. అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇది ఇరాన్ జరిపిన డ్రోన్ దాడియేనా?.. లేదంటే అగ్నిప్రమాదమా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. చమురు ధరలకు యుద్ధ సెగమిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్లపై పడుతోంది. యుద్ధ భయాలతో క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఏకంగా సెంచరీ దాటేశాయి. ఇరాన్ చమురు స్థావరాలు, హర్ముజ్ జలసంధి భద్రతపై అనిశ్చితి కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రాంతీయ యుద్ధంగా మారుతున్న ఘర్షణఅమెరికా–ఇరాన్ మధ్య మొదలైన పోరు ఇప్పుడు ఇరాక్, యెమెన్, సౌదీ అరేబియా, సముద్ర మార్గాల వరకు విస్తరించింది. ఒకవైపు ప్రతీకార దాడులు.. మరోవైపు చమురు మార్గాలపై ముప్పు.. ఇంకోవైపు మిత్ర దేశాల జోక్యం.. ఇవన్నీ కలిసి మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చుతున్నాయి. -
ట్రంప్-నెతన్యాహు భేటీ.. ఇరాన్‌పై ఫైనల్ గేమ్‌కు రంగం సిద్ధం?
ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన కీలక భేటీ ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వైట్‌హౌస్‌లో దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ఇరాన్‌ను ఎదుర్కొనే భవిష్యత్ వ్యూహాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.అమెరికాను వెంటనే మరో యుద్ధంలోకి నెట్టాలనే ఉద్దేశంతో కాకుండా.. దౌత్య చర్చలు, ఆర్థిక ఆంక్షలు, అవసరమైతే సైనిక చర్య అనే మూడు మార్గాలను పరిశీలించడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశమని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు.ఇరాన్‌పై మూడు మార్గాలు.. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్ ముందున్న అవకాశాలపై చర్చ జరిగింది.1. చర్చల మార్గం:ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లు చర్చల్లో పాల్గొంటున్నప్పటికీ.. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరుదేశాల మధ్య ఇంకా తీవ్ర విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో నెతన్యాహుకు అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది.2. ఆర్థిక ఒత్తిడి:ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధించడం, నౌకా నిర్బంధాన్ని కొనసాగించడం ద్వారా ఒత్తిడి పెంచే అంశాన్ని కూడా పరిశీలించారు.3. సైనిక చర్య:చర్చలు, ఆంక్షలు ఫలించని పరిస్థితుల్లో తిరిగి సైనిక దాడులను విస్తరించే అవకాశాన్ని కూడా చర్చించినట్లు సమాచారం.చమురు ధరలపై ట్రంప్ ఆందోళనఇరాన్తో ఘర్షణ కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చమురు ధరలు పెరగడం, ఇంధన మార్కెట్లలో అస్థిరత వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇరాన్‌కు ప్రస్తుతం ఉన్న ప్రధాన వ్యూహాత్మక ఆధారం హార్మూజ్ జలసంధి అని, దానిని ఒత్తిడి సాధనంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోందని నెతన్యాహు పేర్కొన్నట్లు సమాచారం.సిరియా నుంచి సౌదీ వరకు.. ఇరాన్‌తో పాటు మధ్యప్రాచ్యంలోని ఇతర పరిణామాలపైనా ట్రంప్, నెతన్యాహు చర్చించారు. సిరియాలో ఇజ్రాయెల్, టర్కీ సైనిక ఉనికి, దక్షిణ సిరియాలో భద్రతా పరిస్థితులపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం. అలాగే, అమెరికా-సౌదీ అణు ఒప్పందం, భవిష్యత్‌లో సౌదీ అరేబియా-ఇజ్రాయెల్ సంబంధాల సాధారణీకరణ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక, రక్షణ రంగంలో అమెరికాపై ఆధారాన్ని క్రమంగా తగ్గించుకోవాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. వచ్చే పదేళ్లలో స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు, కొత్త తరం యుద్ధ విమానాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని నెతన్యాహు ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతోందన్న అంశం ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. ట్రంప్-నెతన్యాహు భేటీ తర్వాత మధ్యప్రాచ్య పరిణామాలు మరింత కీలక దశలోకి ప్రవేశించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. -
మళ్లీ భీకర యుద్ధం.. ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులకు ప్రతీకారంగా అమెరికా బుధవారం రాత్రి ఇరాన్‌పై భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. ఇరాన్ భూభాగంపై దాదాపు వారం రోజుల తర్వాత అమెరికా చేపట్టిన తొలి ప్రత్యక్ష దాడులు ఇవే.అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఈ దాడులను ధ్రువీకరించింది. ఇరాన్ నుంచి అమెరికా బలగాలపై జరిగిన దాడులకు ఇది “శక్తివంతమైన ప్రతిస్పందన” అని పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు దాడులు ప్రారంభమైనట్లు తెలిపింది.U.S. forces began launching strikes against Iran at 8 p.m. ET today. The strikes are a powerful response to yesterday's attempted Iranian attacks on U.S. forces based in the Middle East.— U.S. Central Command (@CENTCOM) July 30, 2026ట్రంప్ హెచ్చరికల తర్వాతే..ఇరాన్‌పై దాడులకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడి చేసిన నేపథ్యంలో.. ‘‘ఇరాన్‌కు గట్టి సమాధానం ఇస్తాం.. చాలా బలంగా ఎదురుదాడి చేస్తాం’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘వాళ్లు దాడి చేశారు.. ఇప్పుడు మా వంతు వచ్చింది’’ అంటూ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ చర్యలకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.🚨 BREAKING: President Trump is warning adversaries that a forceful U.S. response is coming after a drone attack on an LNG tanker off the coast of Egypt."We're going to hit them very hard."Trump confirmed five rockets were fired and signaled that retaliation is imminent,…— Stephen Gardner (@StephenGardnerX) July 29, 2026దక్షిణ ఇరాన్లో పేలుళ్ల శబ్దాలుఅమెరికా దాడుల తర్వాత దక్షిణ ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అయితే అమెరికా దాడుల లక్ష్యాలు, నష్టం వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడికాలేదు.ప్రతిఘటన ఉంటుంది: ఇరాన్అమెరికా బెదిరింపులు కొనసాగినంత కాలం తమ ప్రతిఘటన కొనసాగుతుందని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. అమెరికా బలగాలపై తాము చేపట్టిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించింది.ఇరాన్ నావికా దళాలు హార్ముజ్ జలసంధి వైపు వెళ్తున్న మూడు చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు కూడా సమాచారం వెలువడింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ఈ మార్గంపై ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయంగా ఆందోళనకు కారణమవుతోంది.ఇరాక్‌లోనూ ఉద్రిక్తతలు..ఇరాక్‌లో అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త దాడులపై అక్కడి ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ దాడుల్లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్‌కు చెందిన 20 మంది మరణించగా.. మరో 32 మంది గాయపడినట్లు సమాచారం. ఈ పరిణామాలు ఇరాక్‌ను కూడా ప్రాంతీయ ఘర్షణలోకి లాగుతున్నాయని అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.చర్చల నుంచి యుద్ధం వైపు?..కొద్ది రోజుల క్రితం ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని ట్రంప్ చెప్పినప్పటికీ.. తాజా పరిణామాలతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇరాన్ తీవ్ర చర్యలకు దిగితే యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించాల్సి వస్తుందని ట్రంప్ గతంలో హెచ్చరించారు.అమెరికా తాజా దాడులతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ ప్రతిస్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి పరిణామాలు ప్రపంచ చమురు మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. -
అమెరికాకు బిగ్ షాక్.. ఆ సంచలన సర్వేలో ఏముంది?
ఈ మధ్య ఒక ఆసక్తికరమైన వార్త.. 'ప్యూ రీసెర్చ్ సెంటర్' (Pew Research Center) ఒక సంచలన సర్వే రిపోర్ట్ రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 37 దేశాల్లో ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ సర్వే చేశారు. దీంట్లో బైటపడిన మోస్ట్ ఐ-క్యాచింగ్, షాకింగ్ విషయం ఏంటంటే..? ఆధునిక చరిత్రలో మొట్టమొదటిసారిగా, ప్రజలు అమెరికా కంటే చైనానే ఎక్కువగా ఇష్టపడుతున్నారట..! అవును..! మీరు చదివింది నిజమే..! ప్రపంచవ్యాప్తంగా అమెరికా సాధించుకున్న 'సాఫ్ట్ పవర్' క్రమక్రమంగా ఎలా కరిగిపోతుందో చెప్పడానికి ఇదొక పెద్ద నిదర్శనం.ఈ సర్వే అసలు ఏం చెబుతుందంటే..అసలు అమెరికా మీద ఈ వ్యతిరేకత ఎందుకు పెరుగుతోంది..? చైనా గ్రాఫ్ ఎందుకు అకస్మాత్తుగా పైకి వెళ్తోంది..? దీనివల్ల ప్రపంచ రాజకీయాల్లోనే కాకుండా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నిజంగానే ఏమైనా మార్పు వస్తుందా? ముందుగా ఈ సర్వే అసలు ఏం చెబుతుందంటే.. అమెరికా గ్రాఫ్ పడిపోవడానికి కేవలం అమెరికా తప్పులే కారణం కాదు..! చైనా తన ఇమేజ్ను గతంతో పోలిస్తే చాలా మెరుగుపరుచుకుంది. సర్వే చేసిన 37 దేశాల సగటు చూసుకుంటే.. చైనాకు అనుకూలంగా 51 శాతం మంది ఓటు వేస్తే, వ్యతిరేకత 39 శాతమే ఉంది..! అంటే చైనాకు నెట్ పాజిటివ్ ఇమేజ్ ఉందన్నమాట..! ముఖ్యంగా దక్షిణ అమెరికా, ఆఫ్రికా, సౌత్-ఈస్ట్ ఆసియా దేశాల్లో చైనాకు మంచి మద్దతు ఉంది. మన ఇండియా మాత్రం దీనికి మినహాయింపు అనుకోండి..!కారణం ఇదే..అలాగే, పేద దేశాల్లో చైనాకు ఆదరణ చాలా ఎక్కువగా ఉంది. ఐరోపా లాంటి ధనిక దేశాల్లో చూస్తే.. స్వీడన్, జర్మనీ, నెదర్లాండ్స్ లాంటి అత్యంత ధనిక దేశాల ప్రజలు చైనాను కాస్త తక్కువగా ఇష్టపడినా, ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 తర్వాత చైనా మీద ఉన్న నెగెటివిటీ అయితే చాలావరకు తగ్గిపోయింది. కానీ, అమెరికా పరిస్థితి పూర్తిగా తారుమారైంది..! ఆ 37 దేశాల సగటు తీసుకుంటే.. అమెరికాను కేవలం 37 శాతం మందే ఇష్టపడుతున్నారు. ఏకంగా 57 శాతం మంది అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడారు.కేవలం 9 దేశాల్లో మాత్రమే..గత ఏడాదితో పోలిస్తే, ఒక్క మెక్సికో మినహా ప్రతి దేశంలోనూ అమెరికా మీద అభిమానం దారుణంగా పడిపోయింది. ఒకప్పుడు అమెరికా అంటే పడిచచ్చే జర్మనీ లాంటి దేశాల్లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే.. జర్మనీలో కేవలం 27 శాతం మందే అమెరికాను ఇష్టపడుతున్నారు. కానీ చైనాను ఇష్టపడేవాళ్ళు మాత్రం దానికంటే ఎక్కువే ఉన్నారు..! ప్రపంచంలో కేవలం 9 దేశాల్లో మాత్రమే.. అంటే బ్రెజిల్, ఘనా, హంగేరి, పోలాండ్, ఫిలిప్పీన్స్, సౌత్ కొరియా, ఇండియా, జపాన్, ఇజ్రాయెల్ ఇప్పటికీ చైనా కంటే అమెరికానే బెటర్ అనుకుంటున్నారు.ఇదొక్కటే సమస్య కాదు..సరే..! అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి..? ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది 'డొనాల్డ్ ట్రంప్' గురించి. అమెరికా వెలుపల ట్రంప్‌కు పాపులారిటీ ఎంత తక్కువగా ఉందో ఈ సర్వే మరోసారి నిరూపించింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 23 శాతం మందికి మాత్రమే ట్రంప్ మీద నమ్మకం ఉందట..! జో బైడెన్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ..! అయితే ఇదొక్కటే సమస్య కాదు..! అమెరికా గత దశాబ్ద కాలంగా ప్రతి నాలుగేళ్లకోసారి వైట్‌హౌస్‌లో నాయకులు మారినప్పుడల్లా తన విదేశాంగ విధానాన్ని మార్చేస్తూ వస్తోంది. దీనివల్ల 'అమెరికా ఒక నమ్మకమైన భాగస్వామి కాదు' అనే అభిప్రాయం ప్రపంచ దేశాల్లో బలపడింది.కానీ.. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది..! కానీ, ఇక్కడ ట్రంప్ లాంటి వాళ్ళైతే ఒకటే మాట అనొచ్చు.. 'ఐ డోంట్ కేర్!' అని..! ఎందుకంటే, మెత్తగా మాట్లాడితే సాఫ్ట్ పవర్ వస్తుంది. కానీ, అందరూ మనల్ని మోసం చేస్తారనేది ఆయన వాదన. టారిఫ్‌లు, మిలిటరీ బెదిరింపులు లాంటి 'హార్డ్ పవర్' ఉపయోగించడం ద్వారానే అమెరికా తన పనులు సాధించుకోవచ్చని ట్రంప్ గట్టిగా నమ్ముతారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది..! హార్డ్ పవర్‌ని మాత్రమే నమ్ముకోవడం వల్ల కొన్ని షార్ట్-టర్మ్ లాభాలు రావచ్చు. కానీ, లాంగ్-టర్మ్‌లో అమెరికా చాలా నష్టపోతోంది. ఇప్పుడు చైనా లాంటి మరో పెద్దన్న ఉన్నాడు..ఇందులో మొదటిది.. ఇతర దేశాలు అమెరికా దెబ్బకు భయపడి తమని తాము రక్షించుకోవడానికి కొత్త దారులు వెతుక్కుంటాయి. రెండవది.. ఇది మల్టీపోలార్ (Multipolar) ప్రపంచం..! ఇప్పుడు చైనా లాంటి మరో పెద్దన్న ఉన్నాడు. కండబలం చూపిస్తే మిగతా దేశాలు చైనాతో చేతులు కలిపేస్తాయి. అప్పుడు అమెరికా బొక్క బోర్లా పడాల్సిందే..!. ఇక మూడవది.. అమెరికా నాయకులు ఒక భ్రమలో ఉంటారు..! 'మా దగ్గర బలం ఉంది. కాబట్టి మిగతా దేశాలు మేము చెప్పినట్లు వింటాయి' అని. కానీ, ఇది తప్పు..! బ్రెజిల్ లాంటి దేశాల ఉదాహరణే తీసుకోండి. ట్రంప్ బ్రెజిల్ మీద టారిఫ్ బాంబులు వేస్తామని బెదిరించినా, అక్కడి అధ్యక్షుడు 'లూలా' వెనక్కి తగ్గలేదు సరికదా.. మరింత గట్టిగా బదులిచ్చారు. ఎందుకంటే అక్కడ ప్రజలకు జాతీయవాదం ముఖ్యం. కాబట్టి, లూలా అలా చేయడం వల్ల అక్కడి ప్రజల్లో ఆయన గ్రాఫ్ ఇంకా పెరిగింది..!అమెరికా నెగ్గుకురాగలదా..?మొత్తానికి చూస్తే.. రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ హయాం, అమెరికాకు ఒక పెద్ద టెస్ట్ కేస్ అని చెప్పవచ్చు..! దశాబ్దాలుగా అమెరికా అంటే 'సాఫ్ట్ పవర్'.. 'హార్డ్ పవర్' రెండింటి కలయిక. మరి ఇప్పుడు కేవలం కండబలం అదే.. Hard Power మాత్రమే చూపించి అమెరికా నెగ్గుకురాగలదా..? లేదా తన గ్లోబల్ లీడర్షిప్ను కోల్పోతుందా..? రాబోయే రోజుల్లో కాలమే సమాధానం చెబుతుంది.-హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్ట్ -
పుతిన్‌కు ఉచ్చు బిగిస్తున్న అమెరికా.. రష్యాకు డబుల్ స్ట్రైక్
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యాపై మరింత ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలనే లక్ష్యంతో రూపొందించిన కీలక ఆంక్షల బిల్లుకు అమెరికా సెనేట్ తొలి ఆమోదం తెలిపింది. బిల్లును తదుపరి దశకు తీసుకెళ్లేందుకు నిర్వహించిన విధానపరమైన (ప్రొసీజరల్) ఓటింగ్‌లో 86-12 ఓట్లతో తీర్మానం ఆమోదం పొందింది. దీంతో ఈ బిల్లుపై సెనేట్‌లో పూర్తి స్థాయి చర్చకు మార్గం సుగమమైంది.ఈ కీలక ఓటింగ్ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ అమెరికా క్యాపిటల్ భవనానికి హాజరయ్యారు. ఇటీవల మరణించిన రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అమెరికా వెళ్లిన జెలెన్స్కీ, ఓటింగ్‌కు ముందు పలువురు రిపబ్లికన్, డెమోక్రాటిక్ సెనేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం సెనేట్ గ్యాలరీలో కూర్చొని ఓటింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించారు.సెనేటర్లతో సమావేశంలో జెలెన్స్కీ మాట్లాడుతూ.. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ ప్రస్తుతం కీలక పురోగతి సాధిస్తోందని, అయితే విజయం సాధించాలంటే అమెరికా నుంచి మరింత సైనిక, ఆర్థిక, రాజకీయ మద్దతు అవసరమని తెలిపారు. ఈ ఆంక్షల బిల్లు ఉక్రెయిన్ ప్రజలకు నైతిక బలాన్ని ఇవ్వడమే కాకుండా, రష్యాపై అంతర్జాతీయ ఒత్తిడిని మరింత పెంచుతుందని ఆయన పేర్కొన్నట్లు సమావేశానికి హాజరైన సెనేటర్లు వెల్లడించారు. కాగా, ఈ బిల్లును రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్, డెమోక్రాటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథల్ సంయుక్తంగా రూపొందించారు. జూలై 10న వైట్ హౌస్‌తో ఈ బిల్లుపై ఒప్పందానికి వచ్చిన మరుసటి రోజే గ్రాహమ్ ఆకస్మికంగా మరణించారు. ఆయన మరణానికి ముందు ఉక్రెయిన్ వెళ్లి జెలెన్స్కీతో కూడా సమావేశమయ్యారు. ఈ బిల్లు గ్రాహమ్ రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైన వారసత్వంగా నిలుస్తుందని బ్లూమెంథల్ పేర్కొన్నారు.బిల్లులోని ముఖ్యాంశాలు:రష్యా నుంచి చమురు, సహజ వాయువు, ఇతర ఎగుమతులను కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించే అవకాశం.పుతిన్‌తో పాటు రష్యా ఉన్నత రాజకీయ, సైనిక నాయకులు, ఆర్థిక సంస్థలు, ఇంధన రంగంపై కొత్త ఆంక్షలు.ఇప్పటికే ఉన్న ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా ఉపయోగిస్తున్న పాత చమురు ట్యాంకర్లపై కూడా చర్యలు.జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే కొన్ని ఆంక్షలను తాత్కాలికంగా మినహాయించే అధికారం అమెరికా అధ్యక్షుడికి కల్పించే నిబంధన.అయితే అధ్యక్షుడికి అదనపు టారిఫ్ అధికారాలు ఇవ్వడంపై కొందరు డెమోక్రాటిక్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనలను సవరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సవరణలపై చర్చ అనంతరం బిల్లుపై అమెరికా సెనేట్‌లో తుది ఓటింగ్ జరగనుంది. ఈ బిల్లు చట్టంగా మారితే రష్యా యుద్ధ ఆర్థిక వనరులపై గట్టి దెబ్బ పడటంతో పాటు, ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతు మరింత బలపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
రెచ్చిపోయిన ఇరాన్.. ట్రంప్ రియాక్షన్‌పై టెన్షన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతున్నాయన్న సమయంలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇస్తున్న వేళ.. ఇరాన్ మరోసారి తన సైనిక శక్తిని ప్రదర్శించింది. అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. మంగళవారం సాయంత్రం ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నుంచి పలు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు CENTCOM తెలిపింది. జోర్డాన్‌లో ఉన్న అమెరికా బలగాల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. అయితే వాటన్నింటినీ విజయవంతంగా అడ్డుకున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది.‘‘ఇది ఆకస్మిక దాడికి చేసిన ప్రయత్నం. ప్రయోగించిన అన్ని క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నాం’’ అని అమెరికా కమాండ్ వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా సమాచారం లేదని తెలిపింది.ట్రంప్ చర్చల మాటలు.. ఇరాన్ క్షిపణుల బదులుఇటీవల ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలకు తాత్కాలిక విరామం ప్రకటించిన ట్రంప్.. చర్చలకు అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో మంచి చర్చలు జరుగుతున్నాయని, ఒప్పందం కుదిరే అవకాశం ఉందని కూడా చెప్పారు. అయితే చర్చలు విఫలమైతే మళ్లీ సైనిక చర్యలు ప్రారంభిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామాల మధ్యే ఇరాన్ క్షిపణి దాడి జరగడం అంతర్జాతీయంగా ఆసక్తిని రేపుతోంది.ట్రంప్‌కు ఇరాన్ హెచ్చరిక సంకేతమా?ఇరాన్ తాజా చర్యను అమెరికాకు ఒక బలమైన సందేశంగా విశ్లేషకులు చూస్తున్నారు. తమను పక్కన పెట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అంగీకరించబోమని చెప్పే ప్రయత్నంగానే ఈ దాడిని భావిస్తున్నారు. ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన ఘర్షణల్లో భాగంగా అమెరికా బలగాలు ఇరాన్‌కు చెందిన పలు లక్ష్యాలపై దాడులు చేశాయి. ఆ తర్వాత ట్రంప్ దౌత్యానికి అవకాశం కల్పిస్తూ సైనిక చర్యలను నిలిపివేశారు.మళ్లీ మొదలైన యుద్ధం?తాజా క్షిపణి దాడి నేపథ్యంలో అమెరికా తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ ఇప్పటికే ఇరాన్‌పై కఠిన వైఖరి ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఇప్పుడు జరిగిన దాడికి అమెరికా ఎలా స్పందిస్తుందన్నది కీలకంగా మారింది. మరోవైపు మధ్యప్రాచ్యంలో అమెరికా నౌకాదళం, సైనిక బలగాల మోహరింపు కొనసాగుతోంది. ఇరాన్-అమెరికా మధ్య మరోసారి ప్రత్యక్ష ఘర్షణకు దారితీస్తుందా? లేదంటే దౌత్య మార్గంలోనే పరిష్కారం దొరుకుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది.హౌతీల దాడులతో మరింత టెన్షన్ఇదే సమయంలో యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో సౌదీ చమురు నౌకను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించినట్లు ప్రకటించారు. మరోవైపు సౌదీ అరేబియా, అమెరికా కలిసి ఇరాక్‌లోని ఇరాన్ అనుకూల మిలీషియా స్థావరాలపై దాడులు చేసినట్లు CENTCOM తెలిపింది. ఈ పరిణామాలన్నీ కలిసి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.ఇక ట్రంప్ నిర్ణయం ఏంటి?ఇరాన్ క్షిపణి దాడికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. చర్చలకు అవకాశం ఇస్తూనే.. సైనికంగా కఠిన చర్యలకు వెనుకాడబోమన్న ట్రంప్ వైఖరి నేపథ్యంలో తదుపరి పరిణామాలు కీలకం కానున్నాయి. -
వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో నెతన్యాహూ భేటీ
వాషింగ్టన్: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ మంగళవారం వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు ఏకాంతంగా దాదాపు గంటన్నరపాటు చర్చలు జరిపారు. ఇరాన్‌తో యుద్ధం మొదలయ్యాక వీరిద్దరూ సమావేశమవ్వడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వీరి మధ్య చర్చలు సానుకూలంగా, ఫలప్రదంగా జరిగాయని అనంతరం వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరొలిన్ లీవిట్ చెప్పారు. ఇద్దరు నేతలు చర్చించిన అంశాలపై వైట్‌హౌస్‌గానీ, ఇజ్రాయెల్ ప్రభుత్వం గానీ స్పందించలేదు. కాగా, ట్రంప్, నెతన్యాహూలకు ఇది కీలక సమావేశం.ఎన్నికలు సమీపిస్తున్న వేళ సొంత దేశంలో ప్రజాదరణ తగ్గిపోతుండటంపై నెతన్యాహూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ సైతం ఇరాన్‌తో యుద్ధం ప్రారంభించి, తలనొప్పులు తెచ్చుకున్నారు. నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలు జరుగనుండగా ఇరాన్‌తో యుద్ధం కొనసాగించలేక, నిలిపివేసి ఓటమిని అంగీకరించలేక ఆపసోపాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరు నేతల మధ్య దెబ్బతిన్న సంబంధాలు తిరిగి గాడినపడే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు. -
పట్టువదలని ట్యారిఫ్ విక్రమార్కుడు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పట్టువదలని విక్రమార్కునివలె ఈ నెల 24న భారత్ సహా మొత్తం 60 దేశాలపై మరో విడత దిగుమతి సుంకాలను పెంచారు. అవి అదే రోజు నుంచి అమ లుకు కూడా వచ్చాయి. ఈసారి ఆయన చెప్పిన కారణం: ఈ దేశాలు కార్మికులతో బలవంతపు చాకిరీ చేయించి ఉత్పత్తి చేస్తున్న సరకులను తమ దేశానికి ఎగు మతి చేస్తున్నాయని! ట్రంఫ్ ట్యారిఫ్ల పరంపర ఎప్పుడు మొదలై ఎట్లా సాగుతున్నదో, అందుకు తను చెప్తూ వస్తున్న ఛప్పన్నారు కారణాలేమిటో తెలిసినవే. అత్యవసర చట్టం నెపంతో...2025 జనవరిలో అధ్యక్షునిగా బాధ్యత స్వీకరించిన వెంటనే, ‘అమెరికా ఫస్ట్ ట్రేడ్ పాలసీ మెమోరాండం’ పత్రంపై సంతకం చేశారు. తర్వాత వారం రోజులకు సమస్త దేశాలపై 10 శాతం నుంచి 25 శాతం దిగుమతి సుంకాలు పెంచారు. అందులో చిన్న దేశాలు, పెద్ద దేశాలు, మిత్ర దేశాలు, శత్రు దేశాలనే తేడాలు చూప లేదు. ఇతరులతో అమెరికాకు గల వాణిజ్య లోటు ఈ చర్యకు కారణ మన్న ఆయన, తమకు వాణిజ్య మిగులు ఉన్న దేశాలనూ మినహా యించలేదు. ఒక్క మానవ మాత్రుడైనా నివసించక పెంగ్విన్స్ మాత్రమే ఉండే దీవులనూ తన జాబితాలో చేర్చారు. ఆయన విధానాలను, తీరును చూడగా తన పదవీ కాలం ముగిసే 2029 జనవరి వరకు ఈ ధోరణి ముగియక పోవచ్చునని పిస్తున్నది. ఆ చర్చలోకి వెళ్లే ముందు ఈ నెల 24 నాటి సుంకాల గురించి చెప్పుకోవాలి. సుంకాలను మొదట భారీగా పెంచినప్పుడు, అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని (ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనమిక్ పవర్స్ యాక్ట్) ఉపయోగించారు. ఇతర దేశా లతో వాణిజ్య లోటు అమెరికా ఆర్థిక వ్యవస్థకే ముప్పు కలిగించగల స్థాయికి పెరిగిందనీ, కనుక ఇటువంటి అత్యవసర చర్యలను అమెరి కన్ కాంగ్రెస్ ఆమోదం లేకుండానే తీసుకునే అధికారం ఆ చట్ట ప్రకారం అధ్యక్షునికి ఉందనీ అన్నారు. కానీ, అటువంటి పరిస్థి తులు లేవనీ, కనుక ఆ చర్యలు చెల్లవనీ అక్కడి సుప్రీంకోర్టు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కొట్టివేసింది. అంతవరకు ప్రపంచ దేశాల నుంచి వసూలు చేసిన వందలకొద్ది బిలియన్ల అదనపు సుంకాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.దానితో ఆందోళనకు గురైన అమెరికా అధ్యక్షుడు ఆ నష్టాన్ని పూడ్చుకోవటానికి కొత్తదారులు వెతకటం మొదలు పెట్టారు. సుప్రీం తీర్పు నుంచి తప్పించుకునేందుకు తనకు ప్రత్యామ్నా యాలు ఉన్నాయని వెంటనే ప్రకటించిన ఆయన, కాంగ్రెస్ అను మతి వెంటనే అక్కరలేని 1974వ సంవత్సరపు వాణిజ్య చట్టాన్ని ఆశ్రయించారు. అందులోని 301వ నిబంధన మేరకు వేర్వేరు దేశాలపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు ట్యారిఫ్‌లు ప్రకటించారు. అయితే ఆ నిబంధన ఒక పరిమిత కాలం వరకే అమలులో ఉంటుంది. ఆ గడువు తీరటంతో ఈ నెల 24న అదే స్థాయి శాతా లతో ట్యారిఫ్లను శాశ్వతంగా మార్చారు. ఆ ప్రకారం ఇండియాపై రేటు 10 శాతం అయింది.సుంకాల మజిలీలుఈ ట్యారిఫ్ల యాత్రలో భారత దేశానికి, ఇతరులకు సంబంధించి కూడా పలు మజిలీలు ఉన్నాయి. 2025 ఫిబ్రవరిలో మొదటి విడత సుంకాలలో భాగంగా ఇండియాపై 25 శాతం విధించిన ఆయన, మనం రష్యా చమురును ఖరీదు చేస్తున్నందుకు ఆగ్రహించి మరో 25 శాతం పెంచారు. అట్లా అది 50 శాతం అయింది. ఇతరత్రా డబ్ల్యూటీవోతో నిమిత్తం లేకుండా, ఇంకా చెప్పాలంటే ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ, వేర్వేరు దేశాలతో వేర్వేరు వాణిజ్య ఒప్పందాలను తమకు అనుకూలంగా చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకోసం చర్చల పద్ధతిని గాక ఒత్తిడులు, బ్లాక్‌మెయిలింగ్‌ను ఎంచుకున్నారు. అది తట్టుకోలేని దేశాలు విడిగా ఒప్పందాలకు ఒప్పుకోగా ట్యారిఫ్ల శాతం అపుడు కొంత తగ్గించారు. ఆ విధంగా ఇండియాపై సుంకాలు 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గాయి. ఇపుడు 10 శాతంతో కలిపి 28 శాతం అవుతున్నాయి.జపాన్, దక్షిణ కొరియా వంటి బలమైన ఆర్థిక వ్యవస్థలు కూడా ఇందుకు మినహాయింపు కాలేదు, అమెరికాకు సన్నిహిత రాజ్యాలై నప్పటికీ– కెనడా, యూరప్ వంటి మిత్ర దేశాలు ఒకమేర రాజీ పడుతూ ప్రత్యామ్నాయ వాణిజ్య సంబంధాల కోసం అన్ని ఖండా లలో అన్వేషణలు మొదలు పెట్టాయి. రష్యాకు అమెరికాతో గల వాణిజ్య సంబంధం అతి స్వల్పం అయినందున ఇరువురి మధ్య వచ్చేదీ పోయేదీ ఏమీ లేకపోయింది. ఆంబోతులు పోట్లాడితే లేగదూడల కాళ్లు విరిగాయన్నట్లుగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలను అమెరికా విధించటంతో ఇతరులతో పాటు ఇండియా చాలానే నష్టపోయింది. ఆ ట్యారిఫ్‌లకు ప్రతిగా తాము కూడా అమెరికాపై ఎదురు సుంకాలు వేయగలమని కెనడా, యూరప్ హెచ్చరికలు చేసి ఆ పని కొంత మేర చేశాయి గానీ, పూర్తిగా ధిక్కరించి నిలిచింది చైనా ఒక్కటే.బలవంతపు చాకిరీలు నిజమేనా?ఇపుడు మాట్లాడుకోవలసిన ఆసక్తికరమైన విషయం ఒకటు న్నది. అది ఇండియా తదితర దేశాలు బలవంతపు చాకిరీతో ఉత్ప త్తులు చేసి అమెరికాకు విక్రయిస్తున్నాయనే ఆరోపణ. ఈ విషయమై యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) జరిపిన విచారణలో ధ్రువీకరణలు లభించాయని ట్రంప్ ప్రభుత్వం చెప్తు న్నది. అమెరికా, యూరప్ వర్ధమాన దేశాలను ఒత్తిడి చేసేందుకు బాలకార్మికులు, మితిమీరిన పని గంటలు, బలవంతపు చాకిరీ వంటి వాదనలు ఎప్పటినుంచో చేస్తున్నాయి. విచిత్రమేమంటే, సాక్షాత్తూ అమెరికాలోనే రకరకాలుగా బలవంతపు చాకిరీ, శ్రామి కుల దోడిపీ జరుగుతున్నదని చెప్పే నివేదికలున్నాయి. కనుక, ఈ వాదన ఇతరులను ఒత్తిడి చేసే సాధనం మాత్రమే. ఇంతకూ జనవరి 2025తో ఆరంభించి శవం కోసం చెట్టెక్కు తూనే ఉన్న అమెరికా అధ్యక్షుని లక్ష్యాలు ఎంతవరకు నెరవేరు తున్నట్లు? అన్ని దేశాలూ తమను దోచుకుంటున్నాయంటూ సుంకాల హెచ్చింపును ఆరంభించినపుడు 900 బిలియన్ల మేర ఉండిన వాణిజ్య లోటు నేడు కూడా ఇంచుమించు అంతే ఉంది. కేవలం పారిశ్రామిక ఉత్పత్తులను తీసుకుంటే మరింత పెరిగి 1.2 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ట్యారిఫ్ల హెచ్చింపుతో ఏమీ ఒరగ లేదు. పన్నులు పెంచుతామని హెచ్చరించినా బయటి నుంచి తిరిగి వచ్చిన అమెరికన్ కంపెనీలు చాలా కొద్ది. కనుక ‘మాగా’ నినాదం మేర ఉద్యోగాలూ పెరగలేదు. ఆ విధంగా విక్రమార్కుని భుజంపై శవం నిలవకుండా ఉంది.మనమిక చూడవలసింది అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఏ విధంగా జరగనున్నదనేది. అందుకోసం ఫ్రేమ్ వర్క్ అనేది కుదిరినా, తుదిరూపపు చర్చలు సాగుతున్నాయి. ప్రభుత్వం కొంత పట్టుదలగా ఉన్నమాట నిజం. అదే సమయంలో అది హానికరంగా ఉండకూడదని రైతులు, మత్స్యకారులు, జౌళి రంగం, ఇతర వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయి. చివరకు ఏమయేదీ చూడాలి!టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నెతన్యాహుకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టర్కీకి ఎఫ్-35 యుద్ధ విమానాల విక్రయంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యక్తపరిచిన అభ్యంతరాలను స్పష్టంగా తోసిపుచ్చారు. అమెరికా రక్షణ సామగ్రి విక్రయాలను ఏ విదేశీ నాయకుడూ శాసించలేరని ఆయన తేల్చిచెప్పారు. సోమవారం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడుతూ, వాషింగ్టన్ రక్షణ రంగ విక్రయాలపై ఇజ్రాయెల్ జోక్యం చేసుకోవడాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘మేము ఏది విక్రయించాలో ఎవరూ మాకు చెప్పలేరు’ అని స్పష్టం చేశారు.టర్కీ ఒక అద్భుతమైన మిత్రదేశమని, సిరియాతో సహా ప్రాంతీయ వ్యవహారాలలో అంకారా పాత్ర ఎంతో కీలకమని ట్రంప్ ప్రశంసించారు. టర్కీ, ఇజ్రాయెల్ మధ్య సత్సంబంధాలు లేనప్పటికీ, అమెరికా-టర్కీ బంధం బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అధునాతన ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమానాలను టర్కీకి అందించడం వల్ల మధ్యప్రాచ్యంలో అధికార సమీకరణాలు మారుతాయని, ఆ దేశానికి ఈ సాంకేతికత ఇస్తే ప్రాంతీయ అస్థిరత పెరుగుతుందని నెతన్యాహు ఇటీవల సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో హెచ్చరించిన విషయం తెలిసిందే. టర్కీకి దురాక్రమణ పూరిత ఆశయాలు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.రష్యా నుంచి ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసిన కారణంగా, ట్రంప్ మొదటి హయాంలోనే 2019లో టర్కీని ఎఫ్-35 ఉమ్మడి ప్రాజెక్ట్ నుంచి అమెరికా తప్పించింది. నాటో భద్రతా ఆందోళనల నడుమ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, తాజా పరిణామాలు అంకారాతో రక్షణ రంగ సహకారాన్ని పునరుద్ధరించడానికి ట్రంప్ సుముఖంగా ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ భయాందోళనలను పక్కనపెట్టి, అమెరికా అధ్యక్షుడి ఈ నిర్ణయం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.ఇది కూడా చదవండి: అస్సాం: నీటిలో 631 గ్రామాలు.. 4.45 లక్షల మంది విలవిల -
ట్రంప్ శాంతి మంత్రం.. ఇరాన్ షాక్!
అమెరికా–ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కాస్త చల్లబడుతున్న వేళ.. శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష దాడులు మూడు రోజులుగా నిలిచిపోవడంతో చర్చలకు అవకాశం ఏర్పడిందని చెప్పారు. అయితే దౌత్య ప్రయత్నాలు విఫలమైతే తిరిగి సైనిక చర్యలకు దిగుతామని హెచ్చరించారు.‘‘ఇరాన్‌తో మంచి చర్చలు జరుగుతున్నాయి. ఏదో ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది’’ అని ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. అయితే చర్చలు ఫలించకపోతే గతంలో చేపట్టిన చర్యలను తిరిగి కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దౌత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తే అది అందరికీ మంచిదేనని పేర్కొన్న ఆయన.. అమెరికా ప్రయోజనాలు, భద్రత విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదని సంకేతాలు ఇచ్చారు. ఇరాన్‌తో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, అవసరమైతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ట్రంప్ తెలిపారు.ప్రత్యక్ష చర్చలు లేవంటున్న ఇరాన్అమెరికాతో నేరుగా ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. మధ్యవర్తుల ద్వారా అమెరికా నుంచి కొన్ని సందేశాలు అందుతున్నాయని, కానీ ప్రస్తుతం అధికారిక చర్చలు మాత్రం లేవని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. ఇటీవలి కాలంలో అమెరికా దాడులతో ఇరాన్‌లోని పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయని, ప్రతిగా ఇరాన్ కూడా అమెరికా అనుబంధ లక్ష్యాలపై దాడులు చేసిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఎంతకాలం కొనసాగుతుందన్నది ఆసక్తిగా మారింది.‘అమెరికా ఆయుధ నిల్వలు తగ్గలేదు’.. ట్రంప్ఇరాన్పై దీర్ఘకాలిక సైనిక చర్యలకు అమెరికా వద్ద క్షిపణులు, ఆయుధ నిల్వలు సరిపోవడం లేదన్న వార్తలను ట్రంప్ ఖండించారు. అమెరికా వద్ద భారీగా ఆయుధ నిల్వలు ఉన్నాయని, అవసరానికి మించి ఉన్నాయని పేర్కొన్నారు. అయితే గత బైడెన్ ప్రభుత్వ హయాంలో ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధాలు పంపడం వల్ల నిల్వలపై ఒత్తిడి ఏర్పడిందని ట్రంప్ ఆరోపించారు. ప్రస్తుతం అత్యాధునిక ఆయుధ వ్యవస్థల ఉత్పత్తిని వేగవంతం చేస్తున్నామని చెప్పారు.సౌదీ చమురు స్థావరాలపై డ్రోన్ దాడులుపశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గలేదు. సోమవారం సౌదీ అరేబియాలోని చమురు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు జరిగాయి. ఇరాన్ అనుకూల వర్గాలే ఈ దాడులకు కారణమని సౌదీ ఆరోపించింది. మరోవైపు యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు కూడా సౌదీ చమురు మౌలిక వసతులపై దాడులు చేసినట్లు ప్రకటించారు. అయితే దీనిపై సౌదీ నుంచి అధికారిక స్పందన రాలేదు.హర్ముజ్ జలసంధిపైనే అసలు పంచాయితీప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి ఇప్పుడు ప్రధాన వివాదంగా మారింది. ఈ మార్గంపై నియంత్రణ తమదేనని ఇరాన్ చెబుతుండగా.. నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని అమెరికా పట్టుబడుతోంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇటీవల ఈ మార్గంలో ప్రయాణిస్తున్న కొన్ని నౌకలను అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో ప్రపంచ చమురు మార్కెట్లు ఆందోళనకు గురయ్యాయి. అయితే తాజా కాల్పుల విరమణ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో కొంత ఉపశమనం కనిపించింది.చర్చలా? దాడులా? ఉత్కంఠ కొనసాగింపుఅమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలపై ఆశలు కనిపిస్తున్నప్పటికీ.. ఇరు దేశాల ప్రకటనల్లో భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు చర్చలకు సిద్ధమంటూ సంకేతాలు ఇస్తూనే.. మరోవైపు సైనిక చర్యలకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరికలు రావడం మిడిల్ఈస్ట్ సంక్షోభాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తోంది.ట్రంప్ మాటల్లో శాంతి సంకేతాలు కనిపిస్తున్నా.. హర్ముజ్ జలసంధి, ఆయుధ నిల్వలు, ప్రాంతీయ దాడులు ఈ ఒప్పందానికి అసలు పరీక్షగా మారనున్నాయి. -
ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ ‘ఏఐ’ దండయాత్ర
వాషింగ్టన్: ఖర్గ్ ద్వీపం విషయంలో ట్రంప్ మరోసారి ఇరాన్‌ని రెచ్చగొట్టారు. ఆ ఐలాండ్‌పై దాడి చేస్తున్నట్లు ఉన్న ఏఐ చిత్రాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదే విధంగా అమెరికా వద్ద అవసరానికి మించి ఆయుధాలున్నాయని తమ వద్ద ఉన్నాయని ఇరాన్ శక్తిమంతమైన చమురు కూడలి అయిన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం అమెరికాకు పెద్ద కష్టమైన పనేం కాదన్నారు.ఇరాన్‌కు చెందిన ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ కన్ను ఇప్పటిది కాదు.. యుద్ధం ప్రారంభం నుంచే తరచుగా ఆ ద్వీపంపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఖర్గ్ ద్వీపాన్ని అమెరికా బలగాలు "చాలా సులభంగా" ఆక్రమించగలవని, అమెరికా కావాలనుకుంటే ఇరాన్ చమురు సంపదను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవచ్చని ఆయన గతంలో పేర్కొన్నారు. సైనిక దాడులపై వ్యాఖ్యలు: గతంలో జరిగిన దాడుల సమయంలో, ఖర్గ్ ద్వీపంలోని సైనిక స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశామని, సరదాగా మరోసారి దాడులు చేయగలమని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మరోసారి కయ్యానికి కాలు దువ్వారు.ఇరాన్‌తో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా అమెరికా వద్ద ఉన్న పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలు తగ్గిపోతున్నాయని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలో ట్రంప్ స్పందించారు " "ప్రపంచంలోనే అత్యధికంగా, అమెరికా అవసరానికి మించి మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి.వాటిలో శక్తిమంతమైన చమురు కూడలి అయిన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం అమెరికాకు పెద్ద కష్టమైన పనేం కాదు." అని అన్నారు.ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన 'ట్రూత్ సోషల్'లో అనేక AI చిత్రాలను పంచుకున్నారు. వాటిలో ఒక చిత్రం, ఇరాన్ యొక్క అతిపెద్ద చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపంపై జరిగిన వైమానిక దాడిని చూపించింది. దానికి ఆయన, ఖర్గ్పై దాడి అని శీర్షిక పెట్టారు. -
ట్రంప్ బాంబు పేలుతుందనుకుంటే.. తుస్సుమంది!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా ఒకే ఆరోపణను బలంగా వినిపిస్తున్నారు. ‘‘అమెరికా పౌరులు కాని వాళ్లు భారీ సంఖ్యలో.. అక్రమంగా ఓట్లు వేస్తున్నారు. అదే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తోంది’’ అని పదేపదే చెబుతున్నారు. ఈ వాదననే ఆధారంగా చేసుకుని ఓటరు నమోదు సమయంలో పౌరసత్వాన్ని తప్పనిసరిగా నిరూపించాలనే వాదన తెరపైకి తెస్తున్నారు. అయితే ఆ వాదనలో ఏమాత్రం పస లేదనే ఆసక్తికరమైన విషయం ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది.ఎన్నికల భద్రతను కాపాడాలంటే పౌరసత్వ ధ్రువీకరణను మరింత కఠినతరం చేయాల్సిందేనని ట్రంప్ వాదిస్తున్నారు. అందుకే సేవ్ అమెరికా యాక్ట్(SAVE America Act) లాంటి చట్టాలకు మద్దతు తెలుపుతున్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడాలంటే ఇవి అవసరమని ఇటు రిపబ్లికన్ పార్టీ కూడా చెబుతోంది. అయితే డెమొక్రటిక్ పార్టీ మాత్రం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇటు ఈ అంశం భారత పాఠకులకు కొత్తగా అనిపించాల్సిన అవసరం లేదు. ఇటీవల భారత్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన Special Intensive Revision (SIR) ప్రక్రియపై కూడా తీవ్ర రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించి అర్హుల పేర్లను కొనసాగించడం, అనర్హుల పేర్లను తొలగించడం లక్ష్యంగా ఈ ప్రక్రియ చేపట్టామని ఎన్నికల సంఘం చెప్పగా.. ప్రతిపక్షాలు మాత్రం పలు ప్రాంతాల్లో నిజమైన ఓటర్ల పేర్లు తొలగించే అవకాశం ఉందంటూ ఆందోళనలు వ్యక్తం చేశాయి. దీంతో ఓటరు నమోదు, ధ్రువీకరణ, ఎన్నికల జాబితాల విశ్వసనీయత దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు అమెరికాలోనూ ఇదే తరహాలో SAVE America Act చుట్టూ చర్చ సాగుతోంది. అయితే అక్కడ అసలు వివాదం విదేశీయుల అక్రమ ఓటింగ్ నిజంగానే విస్తృతంగా జరుగుతోందా? లేదా అనే అంశంపైనే కేంద్రీకృతమైంది.అమెరికాలో 1996 నుంచి ఫెడరల్ ఎన్నికల్లో పౌరులు కానివారు ఓటు వేయడం చట్టరీత్యా నేరం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నమోదైన ఫెడరల్ కోర్టు రికార్డులను రాయిటర్స్ విశ్లేషించగా, దేశవ్యాప్తంగా కేవలం 129 కేసులు మాత్రమే నమోదైనట్లు తేలింది. అందులో 73 మంది మాత్రమే నేరాన్ని అంగీకరించడమో లేదంటే కోర్టులు దోషులుగా నిర్ధారించాయి. అంటే.. అధ్యక్ష ఎన్నికలో కోట్లాది ఓట్లు నమోదయ్యే అమెరికాలో ఈ సంఖ్య చాలా స్వల్పమని పరిశీలన చెబుతోంది.ఈ కేసులను లోతుగా పరిశీలిస్తే మరో విషయం కూడా బయటపడింది. నమోదైన చాలా ఘటనలు పెద్ద ఎత్తున పన్నిన ఎన్నికల కుట్రలకు సంబంధించినవి కావు. గ్రీన్ కార్డు కలిగిన కొందరు శాశ్వత నివాసితులు తాము కూడా ఓటు వేయడానికి అర్హులమని పొరపాటుగా భావించడం, మరికొన్ని సందర్భాల్లో పరిపాలనా లోపాల వల్ల పేర్లు ఓటరు జాబితాలో చేరడం వంటి కారణాలే ఎక్కువగా కనిపించాయి. దేశవ్యాప్తంగా విదేశీయులు సమన్వయంతో ఎన్నికలను ప్రభావితం చేశారనే ఆధారాలు మాత్రం బయటపడలేదు. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తన వాదనపై వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు ఎన్నికల నిపుణులు, పౌరహక్కుల సంస్థలు మాత్రం ఈ వాదనను ప్రశ్నిస్తున్నాయి. విదేశీయుల అక్రమ ఓటింగ్ విస్తృతంగా జరుగుతోందని నిరూపించే బలమైన ఆధారాలు లేనప్పుడు కఠిన నిబంధనలు తీసుకురావడం వల్ల చట్టబద్ధమైన అమెరికా పౌరులే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సహజీకృత అమెరికా పౌరులు(అంటే విదేశాల్లో పుట్టి, తర్వాత అమెరికా పౌరసత్వం పొందిన వారు) అవసరమైన పత్రాలు వెంటనే సమర్పించలేక ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఇటీవల న్యూజెర్సీలో సాఫ్ట్వేర్ లోపం కారణంగా కొందరు పౌరులు కానివారి పేర్లు పొరపాటున ఓటరు జాబితాలో నమోదైన ఘటన కూడా చర్చనీయాంశమైంది. అయితే ఆ ఘటనలో కూడా వాస్తవంగా ఓటు వేసిన వారి సంఖ్య చాలా పరిమితంగానే ఉందని, దానిని దేశవ్యాప్తంగా జరుగుతున్న భారీ ఎన్నికల మోసానికి నిదర్శనంగా చెప్పలేమని అధికారులు స్పష్టం చేశారు.మొత్తంగా చూస్తే, అమెరికా ఎన్నికల్లో విదేశీయులు భారీ సంఖ్యలో అక్రమంగా ఓటు వేస్తున్నారన్న ట్రంప్ ఆరోపణలకు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అధికారిక రికార్డులు బలమైన మద్దతు ఇవ్వడం లేదని ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ పరిశీలన తేల్చింది. ఎన్నికల భద్రతపై రాజకీయ వాదోపవాదాలు కొనసాగుతున్నప్పటికీ, నమోదైన కేసులు మాత్రం సమస్య పరిమిత స్థాయిలోనే ఉందని సూచిస్తున్నాయి. దీంతో ట్రంప్ చేసిన ఆరోపణలు ఒకవైపు ఉంటే... అధికారిక రికార్డులు మాత్రం మరో చిత్రాన్ని చూపిస్తున్నాయని ఈ విశ్లేషణ స్పష్టం చేసింది. -
భారీ దాడులకు సిద్ధమైన అమెరికా.. ఒక్కసారిగా ఎందుకు ఆగింది?
వాషింగ్టన్: ఇరాన్‌పై భారీ సైనిక దాడి చేపట్టాలన్న ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి పక్కన పెట్టారు. పెంటగాన్ వద్ద ఉన్న వాయు రక్షణ ఆయుధ నిల్వలు ప్రమాదకర స్థాయిలో తగ్గిపోతాయని సీనియర్ సలహాదారులు హెచ్చరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. శుక్రవారం ట్రంప్, ఆయన కేబినెట్ సభ్యులు, సీనియర్ సలహాదారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అమెరికా సైన్యం వద్ద పేట్రియట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణులు, ఇతర రక్షణ వ్యవస్థల నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయన్న అంశమే ప్రధానంగా చర్చకు వచ్చింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్ కూడా ఇరాన్‌పై యుద్ధాన్ని మరింత పెంచాలన్న అంశాన్ని ట్రంప్ పరిశీలిస్తున్న సమయంలో అమెరికా వద్ద ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నాయని హెచ్చరించారు.వాయు రక్షణ ఆయుధ నిల్వలు తగ్గిపోవడమే అమెరికా వరుస రాత్రి దాడులను నిలిపివేయడానికి ప్రధాన కారణమా, లేక ఈ విరామం కొనసాగుతుందా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు పశ్చిమాసియాలో పెద్ద యుద్ధం చెలరేగడం, గల్ఫ్ దేశాలతో సంబంధాలు దెబ్బతినడం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, ఇంధన సరఫరా అంతరాయం, శరణార్థుల సంక్షోభం మరింత పెరగడం వంటి అంశాలపై కూడా ట్రంప్, ఆయన సలహాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, ఇరాన్‌పై పెద్ద స్థాయి యుద్ధ చర్యలు చేపట్టడం సాధ్యమేనని, కానీ అలా చేస్తే పశ్చిమాసియాలో అమెరికా సైనిక చర్యలను పర్యవేక్షించే సెంట్రల్ కమాండ్ వద్ద ఉన్న ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలు ప్రమాదకరంగా తగ్గిపోతాయని జనరల్ డాన్ కేన్ వ్యక్తిగతంగా ట్రంప్‌కు వివరించారు.ముగ్గురు అమెరికా సైనికులు మృతితో.. గత వారం జోర్డాన్‌లో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి అమెరికా వాయు రక్షణ వ్యవస్థను దాటి దాడి చేయడంతో ముగ్గురు అమెరికా సైనికులు మరణించిన ఘటన తర్వాత ఈ చర్చలు జరిగాయని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.శుక్రవారం అమెరికా బలగాలు పూర్తి సిద్ధంగా ఉన్నాయని, దాడికి రెడీగా ఉన్నాయని ట్రంప్ ప్రకటించినా, చివరకు భారీ బాంబు దాడులకు ఆయన అనుమతి ఇవ్వలేదు. ఈ వారం ప్రారంభంలో ఆక్సియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో "ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత భారీ దాడి చేయించాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నాను. నిర్ణయానికి చాలా దగ్గరగా ఉన్నాను. అందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాం" అని ట్రంప్ చెప్పారు.ఇరాన్ తీర ప్రాంత రాడార్లు, నౌకలపై దాడి చేసే క్షిపణి ప్రయోగ కేంద్రాలు, నౌకాదళ వాహనాలు, రవాణా వ్యవస్థలు, పిక్‌యాక్స్ పర్వతం అడుగున ఉన్న భూగర్భ అణు కేంద్రం వంటి వ్యూహాత్మక లక్ష్యాలపై పలుదశల్లో దాడి చేసే ప్రణాళికలను పెంటగాన్ సిద్ధం చేసింది. అయితే దీర్ఘకాలం దాడులు కొనసాగితే ఇప్పటికే తగ్గిపోయిన క్షిపణి నిల్వలపై తీవ్ర ఒత్తిడి పడుతుందని అధికారులు హెచ్చరించారు.ట్రంప్ సీనియర్ సలహాదారుల్లో పలువురు, జారెడ్ కుష్నర్ సహా, భారీ సైనిక దాడికి బదులుగా నిరంతర దౌత్య చర్చలు, ఆర్థిక ఒత్తిడి కొనసాగించే వ్యూహానికే మద్దతు ఇస్తున్నారు. ఇదే సమయంలో, అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం.. దాదాపు రెండు వారాలుగా నిరంతరంగా సాగిన వైమానిక దాడుల తర్వాత అమెరికా సైన్యం తొలిసారి రాత్రి దాడులను నిలిపివేసింది. తాత్కాలిక కాల్పుల విరమణను పునరుద్ధరించే ప్రయత్నాలు కూడా వేగం పుంజుకున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలపై రాజీ మార్గం కనుగొనేందుకు మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.అయితే ప్రాంతీయ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇరాన్ మద్దతుతో ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని యాన్బు, జిజాన్ ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్టు ప్రకటించారు.హోదైదాపై సౌదీ వైమానిక దాడులకు ప్రతీకారంగానే అరామ్కోకు చెందిన కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నామని వారు తెలిపారు. -
విమానం మార్చేసిన ట్రంప్.. ఎందుకలా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల ప్రారంభంలో టర్కీలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశాన్ని ముగించుకుని తిరిగి వెళ్లే సమయంలో తన ప్రయాణ విమానాన్ని అత్యవసరంగా మార్చవలసి వచ్చింది. ఇరాన్ ప్రాక్సీ దళాల నుండి ఆయనకు ముప్పు ఉందని నిఘా వర్గాల సమాచారం అందడంతో సీక్రెట్ సర్వీస్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రముఖ పత్రిక 'ది న్యూయార్క్ టైమ్స్' వెల్లడించింది.ట్రంప్ టర్కీకి వెళ్లేటప్పుడు ఖతార్ ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిన సరికొత్త 'బోయింగ్ 747-8' విమానంలో ప్రయాణించారు. అయితే భద్రతా కారణాల రీత్యా తిరిగి వస్తున్నప్పుడు పాత 'ఎయిర్ ఫోర్స్ వన్' విమానంలో ప్రయాణించాలని సీక్రెట్ సర్వీస్ అధికారులు ఆయనను కోరారు. ఈ ముప్పు ప్రత్యేకించి ఖతార్ విమానానికి మాత్రమే కాకుండా, అధ్యక్షుడితో పాటు ఆయన ప్రయాణించే ఏ విమానాన్నైనా టార్గెట్ చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. మొదట్లో ఈ విమానం మార్పును వైట్‌హౌస్ సాధారణ విషయంగానే పేర్కొంది. బ్రిటన్‌లోని అమెరికా సైనికులు.. కొత్త విమానాన్ని తిలకించేందుకే తాను విమానం మార్చినట్లు ట్రంప్ బహిరంగంగా తెలిపారు. కానీ.. అసలు కారణం భద్రతా ప్రమాదాలేనని అధికారులు తరువాత స్పష్టం చేశారు. ఖతార్ బహుమతిగా ఇచ్చిన బోయింగ్ 747-8 విమానంలో పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ఉండే అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థలు లేవు.ఈ నేపథ్యంలో ఈ విమానం భద్రతపై గతంలోనూ విమర్శలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత ఈ విమానాన్ని మరింత అప్‌గ్రేడ్ చేసేందుకు త్వరలో సుమారు ఒక నెలపాటు సర్వీస్ నుంచి తప్పించనున్నట్లు వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి కరెలిన్ లీవిట్ వెల్లడించారు. అమెరికా అగ్రనేతలకు ముప్పు తీవ్రత ఊహించని స్థాయిలో పెరిగిందని సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ సీన్ కుర్రాన్ పేర్కొన్నారు. -
మీడియాపై నోరు పారేసుకున్న ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. వైట్‌హౌస్ వ్యవహారాలను చూసే పత్రికా విలేకరులతో జరిగిన విందు సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరిని విమర్శించి.. మరికొందరిపై ప్రశంసలు కురిపించి ప్రజా ప్రతినిధులు కొందరిపై జోకులేస్తూ సుమారు గంట సేపు మాట్లాడిన ట్రంప్ తాను మూడోసారి కూడా గద్దెనెక్కవచ్చునని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఈ వైట్‌హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే జరగాల్సి ఉండింది. అయితే ఆ సమావేశంలో అజ్ఞాత వ్యక్తి ఒకరు కాల్పులు జరపడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ నేపథ్యంలో వాయిదా పడ్డ డిన్నర్ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ తాను ఎన్నో మాట్లాడాలి అనుకున్న చాలా అంశాలను కొట్టేశానని అన్నారు. ‘‘ఏప్రిల్‌లోనే ఈ స్పీచ్ ఇవ్వాలని అనుకున్నా.. కాకపోతే గన్‌మాన్ కాల్పులతో తప్పనిసరిగా వాయిదా వేయాల్సి వచ్చింది’’అని వ్యాఖ్యానించారు. ‘‘మూడు నెలల క్రితం చెప్పినట్లే... షో నడుస్తూనే ఉండాలి’’అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన ట్రంప్ ఆ రోజు మూక హత్యలు జరిగి ఉండేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తరువాత ఆయన తనదైన శైలిలో హాస్యం, వ్యంగ్యం కలిపేస్తూ విమర్శలు, తిట్లు అందుకున్నారు. కరెస్పాండెంట్స్ డిన్నర్‌కు తాను వచ్చే ఏడాదీ హాజరవుతానని వ్యాఖ్యానించారు. మీడియాతో ట్రంప్ సంబంధాల్లో ఈ డిన్నర్ ఒక అరుదైన క్షణంగా నిలిచిపోనుంది. ఎందుకంటే రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి ఇదే మీడియా ప్రతినిధులపై ట్రంప్ రకరకాలుగా మాటల దాడులు చేయడం, కొందరిపై కేసులేయడం, మరికొందరిపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలోనే తన సమావేశాలకు హాజరు కావొద్దంటూ నిషేధం విధించిన కొందరు విలేకరులు కూడా ఈ డిన్నర్ సమావేశాలకు హాజరు కావడం గమనార్హం. ట్రంప్‌కు మొదటనుంచి కొంతమంది రాజకీయ నేతలన్నా.. మీడియా ప్రతినిధులన్నా పీకలదాకా కోసం. జేన్ ఫోండా, బ్రూస్ స్ప్రింగ్స్టీన్ వంటి వారితోపాటు మాజీ అధ్యుక్షుడు ఒబామాకు ఆయన రకరకాల పేర్లు పెట్టి పిలుస్తూంటాడు. ఒబామాను కాస్తా ‘బరాక్ హుస్సేన్ ఒబామా’అంటూంటారు. అలాగే జిమ్మీ ఫాలన్, జిమ్మీ కిమ్మెల్, ప్రజా ప్రతినిధులు ఇల్హాన్ ఒమార్, డి–మిన్, కాలిఫోరి్నయా రాష్ట్ర గవర్నర్ గావిన్ న్యూసోమ్, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ వంటి వారిపై కూడా తన గంట ప్రసంగంలో తనదైన రీతిలో విమర్శలు కురిపించారు ట్రంప్. వీటిల్లో కొన్ని వివక్షాపూరితమైనవి కూడా ఉండటం విశేషం. జర్నలిజమ్ వృత్తి అంటే తనకు గౌరవమేనని అన్న ట్రంప్ తనను సవాలు చేస్తూ రాసిన కథనాలపై మాత్రం విమర్శలు కురిపించారు. వచ్చేసారి తాను ‘ట్రంప్–2028’అన్న టోపీ వేసుకుని అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానని నవ్వుతూ చెప్పిన ఆయన ఆ వెంటనే జోక్ చేస్తున్నానని సర్దుకున్నారు. సాహసవీరులకు అవార్డులు.. ఏప్రిల్ కాల్పుల సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన సీక్రెట్ సరీ్వస్ ఏజెంటు విక్టర్ గోంజాల్వెజ్తోటు, వాషింగ్టన్ హిల్టన్ (సమావేశం జరిగిన హోటల్) హోటల్ సిబ్బంది కొందరిని తాజా డిన్నర్ సమావేశంలో సత్కారం జరిగింది. గత అనుభవం దృష్ట్యా ఈసారి కొంచెం చిన్న వేదికను ఎంచుకున్నారు. అలాగే భద్రతను కట్టుదిట్టంగా నిర్వహించారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.... పత్రికా స్వేచ్ఛ సంబరాలు అన్న పేరుతో ఈ సమావేశాలు జరగడం. సుమారు 700 మంది ఈ డిన్నర్ సమావేశాల్లో పాల్గొన్నారు. రెడ్ కార్పెట్ వంటి హంగులేవీ కనిపించలేదు. అయితే ఈ సమావేశానికి హాజరైన వారిలో కొంతమంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజా సమావేశం ఒకప్పుటి ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ ప్రస్తుత వాల్డ్రాఫ్ అస్టోరియాలో జరగడం కొసమెరుపు. -
లక్ష డాలర్ల వీసా ఫీజుకు అమెరికా కోర్టు బ్రేక్!
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాల కోసం చెల్లించాల్సిన ఫీజులను లక్ష డాలర్లకు పెంచాలన్న ట్రంప్ నిర్ణయం బెడిసికొట్టింది. ఫీజు పెంపును తిరస్కరిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసేందుకు ఫెడరల్ అప్పీల్స్ కోర్టు సమర్థించింది. యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి లియో టి సొరోకిన్ జూన్ 8వ తేదీ ఒక తీర్పునిస్తూ హెచ్–1బీ వీసా కోసం లక్ష డాలర్ల ఫీజు వసూలు చేయడం అక్రమమని, కాంగ్రెస్ ఆమోదం లేదని స్పష్టం చేశారు. అయితే అమెరికన్ ప్రభుత్వం ఈ తీర్పును అప్పీల్స్ కోర్టులో సవాలు చేసింది. బోస్టన్లోని ఫస్ట్ సర్క్యూట్ అప్పీల్ కోర్టులో ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ దీనిపై విచారణ జరిపి డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పును సమర్థించింది. ఈ కేసులోకక్షిదారులైన ఇరవై రాష్ట్రాల డెమోక్రాట్ ప్రభుత్వాల వాదన సరైందేనని స్పష్టం చేసింది. 1989 సుప్రీం కోర్టు తీర్పును ఉటంకిస్తూ, ఎగ్జిక్యూటివ్ శాఖ ఆర్థిక భారాలు (ఫీజులు లేదా పన్నులు) విధించాలంటే కాంగ్రెస్ స్పష్టమైన అనుమతి అవసరం అని పేర్కొంది. ఈ ఫీజు వల్ల రాష్ట్రాలకు పెద్ద నష్టం జరగదని కేంద్రం వాదించినా, కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. 2025 సెపె్టంబర్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త హెచ్–1బీ వీసాలకు 100,000 అమెరికన్ డాలర్ల ఫీజును ప్రకటించిన విష యం తెలిసిందే. భారతీయ ఐటీ నిపుణులు అమెరికాలో స్థిరపడేందుకు ఈ హెచ్–1బీ వీసాను ఎక్కువగా ఉపయోగిస్తూంటారు. ప్రత్యేక నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు అమెరికన్ కంపెనీలకు ఈ వీసా అవకాశమిస్తుంది. అమెరికన్ టెక్ కంపెనీలు భారత్, చైనా వంటి దేశాల నుంచి సుమారు 65 వేల మందిని ఈ వీసా ద్వారా నియమిస్తాయి. అధిక విద్యార్హత కలిగిన విదేశీ ఉద్యోగులు మరో 20 వేల మంది కూడా ఈ వీసాల ద్వారా అమెరికాలో ఉద్యోగాలకు అర్హులవుతూంటారు. సాధారణంగా ఈ వీసాల ఫీజులు 2,000–5,000 డాలర్ల వరకూ ఉంటాయి. -
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాల్.. సెక్షన్ 301తో దర్యాప్తు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ (EU)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూఎస్ కంపెనీలపై ఈయూ ఉద్దేశపూర్వకంగా భారీ జరిమానాలు విధిస్తుండటాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై సెక్షన్ 301 కింద దర్యాప్తు ప్రారంభిస్తామని హెచ్చరించారు. అవసరమైతే.. ఈయూపై భారీ దిగుమతి సుంకాలు కూడా విధిస్తామని ప్రకటించారు.ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో.. యూరోపియన్ యూనియన్ అమెరికా కంపెనీలను ఆదాయ వనరుగా చూస్తోందని విమర్శించారు. ''ఎలాంటి కారణం లేకుండా యాపిల్‌కు 15 బిలియన్ డాలర్లు, మెటాకు 3 బిలియన్ డాలర్లు, అమెజాన్‌కు 2.5 బిలియన్ డాలర్లు, ఇంకా అనేక ఇతర సంస్థలకు జరిమానా విధించిన తర్వాత, గూగుల్‌కు మరో 1 బిలియన్ డాలర్ల జరిమానా విధించారని మాకు ఇప్పుడే సమాచారం అందింది" అని అన్నారు. ఈ జరిమానాలన్నీ అన్యాయమైనవని, అమెరికా కంపెనీలపై వివక్ష చూపే చర్యలని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ పరిస్థితి ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పాలన ప్రారంభమైన తర్వాత మరింత ఎక్కువైందని ట్రంప్ ఆరోపించారు. అయితే తన ప్రభుత్వం అలాంటి చర్యలను సహించబోదని స్పష్టం చేశారు. అమెరికా కంపెనీల ప్రయోజనాలను కాపాడటం తమ బాధ్యత అని ట్రంప్ స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో ట్రంప్ సెక్షన్ 301 ఇన్వెస్టిగేషన్ చేపడతామని ప్రకటించారు. అమెరికా ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 301 ప్రకారం.. ఇతర దేశాలు అమెరికా వ్యాపారాలకు అన్యాయం చేస్తున్నాయనే అనుమానం ఉంటే అమెరికా ప్రభుత్వం దర్యాప్తు చేయవచ్చు. దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలితే, ప్రతిస్పందనగా ఆయా దేశాలపై అదనపు సుంకాలు విధించే అధికారం అమెరికాకు ఉంటుంది.అయితే.. యూరోపియన్ యూనియన్ మాత్రం, ఈ జరిమానాలను చట్టబద్ధమైన నియమాల ప్రకారమే విధిస్తున్నట్లు చెబుతోంది. కానీ ట్రంప్ చేసిన హెచ్చరికతో అమెరికా-యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ అమెరికా నిజంగానే భారీ సుంకాలు విధిస్తే, రెండు దేశాల మధ్య వాణిజ్యం మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఒంటిపై చొక్కాలేదు.. కానీ రూ.100 కోట్ల సంపద! -
ట్రంప్ ప్రాణాలకు ముప్పు? విమాన మార్పు వెనుక రహస్యం!
-
ఇరాన్ అణు బాంబు ప్లాన్ ట్రంప్ వార్నింగ్ తో ..!
-
కమలా హారిస్‌కు ఓటు వేశారని.. ట్రంప్ దురాగతం!
వాషింగ్టన్: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌కు మద్దతు తెలిపి, డెమోక్రాట్ సెనేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాలకు కేటాయించిన వందలాది సమాఖ్య ఇంధన గ్రాంట్లను రద్దు చేసినట్లు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కోర్టులో అంగీకరించింది. బైడెన్ హయాంలో మంజూరైన బిలియన్ల డాలర్ల నిధుల రద్దును సవాల్ చేస్తూ పలువురు లబ్ధిదారులు దాఖలు చేసిన వ్యాజ్యానికి సంబంధించి ఈ నెలలో సమర్పించిన కోర్టు ధృవీకరణ పత్రంలో ఈ సంచలన వాస్తవం వెలుగు చూసింది.ట్రంప్ ప్రభుత్వంలోని ఇంధన శాఖ (డీఓఈ) రద్దు చేసిన మొత్తం 284 గ్రాంట్ల నిర్ణయం పూర్తిగా రాజకీయ ప్రాతిపదికనే తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ప్రాజెక్టుల పనితీరు, చట్టపరమైన అంశాలు, ఖర్చుల తగ్గింపు లేదా ఇతర కార్యాచరణ కారణాల వల్ల ఈ నిధులను నిలిపివేయలేదని, కేవలం బ్లూ స్టేట్స్ (డెమోక్రాట్ల ఆధిపత్యం ఉన్న రాష్ట్రాలు)లో ఉన్నందువల్లే వాటిని రద్దు చేసినట్లు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దాదాపు రద్దు అయిన అన్ని ప్రాజెక్టులు డెమోక్రాట్ రాష్ట్రాలకే చెందిపవి కావడం గమనార్హం.ఈ పరిణామంపై డెమోక్రాట్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఓట్లు వేయలేదనే కక్షతో పన్ను చెల్లింపుదారుల సొమ్మును ట్రంప్ యంత్రాంగం నిలిపివేసిందని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ధ్వజమెత్తారు. తాము ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంతృత్వంలోనా అని ఆయన ప్రశ్నించారు. ఈ నిర్ణయం పూర్తిగా అమెరికా వ్యతిరేక చర్య అని సెనేటర్ ప్యాటీ ముర్రే, ప్రతినిధి మార్సీ కప్టర్ సంయుక్త ప్రకటనలో విమర్శించారు. కాగా, కోర్టు దాఖలు చేసిన పత్రాలకు, గతంలో ఇచ్చిన ప్రకటనలకు ఎలాంటి విరుద్ధత లేదని ఇంధన శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: జంతర్‌మంతర్‌లో ఇన్ఫెక్షన్ల కలకలం.. తల్లడిల్లిపోతున్న విద్యార్థులు! -
డబుల్ గేమ్ మొదలుపెట్టిన ట్రంప్
ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని చెబుతూనే.. అవసరమైతే భారీ సైనిక చర్యకు వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ఇప్పుడు చర్చల్లో మరింత సీరియస్‌గా వ్యవహరిస్తోందని చెప్పిన ఆయన.. ఒప్పందం కుదరకపోతే గతం కంటే తీవ్ర స్థాయి దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్‌పై భారీ దాడులకు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అయితే అమెరికా సైన్యం మాత్రం పూర్తిగా సిద్ధంగా ఉందని, ‘‘మేం సిద్ధంగా ఉన్నాం.. అవసరమైతే ముందుకు వెళ్తాం’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘డీల్ లేదంటే భారీ దాడులు’ఇరాన్‌కు ఇప్పుడు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాతో ఒక ఒప్పందానికి రావడం లేదా మరింత తీవ్ర స్థాయి సైనిక చర్యలను ఎదుర్కోవడం అని హెచ్చరించారు. ‘‘మేము వారితో మాట్లాడుతున్నాం. గతంతో పోలిస్తే ఇరాన్ ఇప్పుడు మరింత సీరియస్‌గా కనిపిస్తోంది. అయితే చర్చలు ఫలిస్తాయని ఇప్పుడే చెప్పలేం’’ అని ట్రంప్ అన్నారు.‘లాక్డ్ అండ్ లోడెడ్’అమెరికా సైనిక సామర్థ్యంపై ట్రంప్ మరోసారి స్పష్టత ఇచ్చారు. అవసరమైతే ఇరాన్‌పై మరింత భారీ దాడులకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దౌత్య మార్గానికి అవకాశం ఇస్తున్నప్పటికీ.. సైనిక ఎంపికను పూర్తిగా పక్కన పెట్టలేదని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమమే ఈ వివాదానికి ప్రధాన కారణమని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.ఇరాన్ మాత్రం..మరోవైపు అమెరికా ఒత్తిళ్లకు తాము తలొగ్గబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు. బెదిరింపులు, ఒత్తిళ్లతో ఇరాన్‌ను నియంత్రించలేరని స్పష్టం చేశారు. చర్చలకు తాము సిద్ధమే అయినప్పటికీ.. బలవంతపు షరతులను అంగీకరించబోమని పేర్కొన్నారు. మరోవైపు మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వారాలుగా అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణలు, సైనిక చర్యల నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్ముజ్ జలసంధిపై ప్రభావం పడుతోంది. గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో వాణిజ్య నౌకల రాకపోకలు, సముద్ర రవాణాపై అనిశ్చితి నెలకొంది.ఈ పరిణామాల నేపథ్యంలో హర్ముజ్ ప్రాంతంలో వేలాది మంది నౌకా సిబ్బంది భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వందలాది నౌకలు ఆగిపోయాయని.. దాదాపు 6 వేల మంది నౌకా సిబ్బంది ఈ ప్రాంతంలోని ఉద్రిక్త పరిస్థితుల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO) పేర్కొంది. నౌకల రాకపోకలకు అంతరాయాలు, భద్రతా పరమైన సవాళ్ల కారణంగా సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది.రష్యా, చైనాపైనా ట్రంప్ దృష్టిఇరాన్కు రష్యా, చైనా ఆయుధ సహాయం అందిస్తున్నాయన్న వార్తలపైనా ట్రంప్ స్పందించారు. ఆ దేశాల అధినేతలు ఇరాన్‌కు ఆయుధాలు అందించబోమని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఇరాన్ విషయంలో అమెరికా తదుపరి నిర్ణయం ఏంటన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధిలో ఏదైనా పెద్ద పరిణామం చోటుచేసుకుంటే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు సఫలం అవుతాయా? లేక పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారతాయా? అన్నది ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. -
అమెరికా-సౌదీ అణు ఒప్పందంలో ఊహించని మలుపు!
వాషింగ్టన్: అమెరికా-సౌదీ అరేబియా మధ్య కుదిరిన పౌర అణు ఒప్పందంపై ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరిస్తేనే ఈ ఒప్పందం అమలవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అబ్రహాం ఒప్పందంలో భాగంగా సౌదీ అరేబియా ఇజ్రాయెల్‌ను అధికారికంగా గుర్తించాలని ఆయన షరతు విధించారు. ఈ అనూహ్య నిర్ణయంపై సర్వత్రా చర్చనీయాంశమవుతుండగా, వైట్‌హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ దీనిని గట్టిగా సమర్థించారు.సౌదీ అరేబియా మనస్తత్వాన్ని, అక్కడి నాయకుల విధానాలను ట్రంప్ అద్భుతంగా అర్థం చేసుకున్నారని మిల్లర్ తెలిపారు. ‘అమెరికాలో మరే ఇతర నాయకుడికన్నా ట్రంప్‌కు సౌదీ మనస్తత్వంపై సంపూర్ణ అవగాహన ఉంది. ఆయన నిర్ణయాలపై ప్రజలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా నమ్మకం ఉంచాలి’ అని ఆయన పేర్కొన్నారు. వాషింగ్టన్, రియాద్ దేశాలు అణు సహకార ఒప్పందంపై సంతకాలు చేసిన మరునాడే ట్రంప్ ఈ కొత్త షరతును తెరపైకి తేవడం గమనార్హం.మరోవైపు పాలస్తీనా సమస్యకు స్పష్టమైన పరిష్కారం లభించే వరకు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు నెరకొనే ప్రసక్తే లేదని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. ప్రస్తుత పరిణామాలపై సౌదీ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని సమాచారం. ఈ తాజా పరిణామం మధ్యప్రాచ్య రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అణు ఒప్పందం అమలు కావాలంటే అమెరికా కాంగ్రెస్ ఆమోదం కూడా తప్పనిసరి కావడంతో, భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.ఇది కూడా చదవండి: ఇరాన్ డేంజర్ ప్లాన్.. అమెరికా సంచలన నివేదిక! -
భారత్‌పై పదిశాతం సుంకాలు!
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా మరోసారి భారత్‌పై టారిఫ్‌ల కొరడా ఝళిపించింది. బలవంతపు చాకిరితో వచ్చిన ఉత్పత్తులను నియంత్రించే లక్ష్యంతోనే ఈ టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించింది. తాజా ఆదేశాలతో అమెరికా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే 99 శాతం వస్తువులపై పది నుంచి 12.5 శాతం టారిఫ్ వర్తిస్తుంది. బలవంతపు చాకిరి ద్వారా వచ్చిన ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం విధిస్తూ చట్టసవరణలు చేసిన కారణంగా భారత్‌పై పది శాతం పన్ను మాత్రమే విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. వాణిజ్య సంస్థల ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ భారత్ లాంటి దేశాలను మరింత ప్రోత్సహించేందుకు పది శాతం టారిఫ్ విధించాలని వాణిజ్య సంస్థల ప్రతినిధులు సూచించారని తెలిపారు. కొత్త టారిఫ్‌లు మొత్తం అరవై దేశాల దిగుమతులకు వర్తిస్తాయని, బలవంతపు చాకిరితో ఉత్పత్తి అయిన వస్తువుల ఎగుమతులపై నిషేధం లేని చైనా, యునైటెడ్ కింగ్డమ్, జపాన్లతోపాటు మొత్తం 43 దేశాలకు 12.5 శాతం, మిగిలిన దేశాలపై 10 శాతం టారిఫ్‌లు వర్తిస్తాయని వాణిజ్య సంస్థల ప్రతినిధి జేమిస్ గ్రీర్ తెలిపారు. కొత్త టారిఫ్‌లు అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి తరువాత అమల్లోకి రానున్నాయి. -
అలా చేస్తే మీ పని అంతే.. చైనా,రష్యాలకు ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ రష్యా,చైనాలపై ఫైరయ్యారు. ఈ రెండు దేశాలు ఇరాన్‌కు ఎట్టిపరిస్తితుల్లో ఆయుధాలు విక్రయించవద్దని తీవ్రంగా హెచ్చరించారు. ఒకవేళ ఆ పని చేస్తే అది ఆ దేశాలకే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని అది వారి దేశ ప్రయోజనాలకు ఏమాత్రం మంచిది కాదని స్పష్టం చేశారు.ట్రంప్ తన అధికారిక ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేస్తూ "చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ ఏడాది మే నెలలో బీజింగ్‌లో జరిగిన సమావేశంలో తమ దేశం నుంచి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇరాన్‌కు ఆయుధాలు విక్రయించబోమని హామీ ఇచ్చారు. మా మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా ఆయన మాటను నమ్ముతున్నాను" అని అన్నారు.అదే విధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్నప్పటికీ, ఇరాన్‌కు ఆయుధాలు అమ్మబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా తనకు హామీ ఇచ్చారని ట్రంప్ చెప్పారు.అదే సమయంలో ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధాలు అమ్మడంపై మాట్లాడుతూ "నేను ఉక్రెయిన్‌కు నేరుగా ఆయుధాలు అమ్మడం లేదని, కేవలం నాటో (NATO) దేశాలకే విక్రయిస్తున్నానని పుతిన్‌కు తెలుసు. నాటో దేశాలు పూర్తి ధర చెల్లించి కొనుగోలు చేస్తాయి, ఆ తర్వాత ఆ ఆయుధాలు ఎలా పంపిణీ అవుతాయో నాకు తెలియదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఇటీవలి కాలంలో అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన వరుస దాడులకు సంబంధించి, ఇరాన్‌కు రష్యా మరియు చైనాలు లక్ష్యాల సమాచారాన్ని అందిస్తున్నాయా లేదా అనే అంశంపై వాషింగ్టన్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు జరుపుతోంది. ఇంతలోనే ట్రంప్ ఇరుదేశాలకు వార్నింగ్ ఇచ్చారు. -
ఇరాన్ ఆస్తులపై ట్రంప్ గురి.. టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌కు చెందిన స్తంభింపజేసిన నిధులను(ఫ్రీజ్డ్ ఫండ్స్) వినియోగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. అయితే ఈ ప్రకటనపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. అమెరికా ఆధీనంలో ఉన్న ఇరాన్‌కు చెందిన స్తంభింపజేసిన నిధులను.. అమెరికా నౌకలు, సరుకు రవాణా నౌకలు, ఇతర సంబంధిత ఆస్తులకు జరిగిన నష్టాల భర్తీకి ఉపయోగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఇరాన్ చర్యల వల్ల జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించేందుకు ఈ నిధులను వినియోగిస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే అమెరికా–ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ట్రంప్ ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాషింగ్టన్ మళ్లీ దాడులు ప్రారంభించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత వేడి పెంచాయి.“ఇకపై నౌకలు, సరుకు లేదా వాటికి సంబంధించిన ఏదైనా ఆస్తికి జరిగే నష్టాలను అమెరికా ఆధీనంలో ఉన్న ఇరాన్ డబ్బుతో చెల్లిస్తాం” అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నష్టాలు భారీగా ఉండొచ్చని, అయినప్పటికీ ఇది న్యాయమైన చర్య అని ఆయన సమర్థించారు. ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో రెండు సౌదీ చమురు నౌకలపై దాడులకు పాల్పడినట్లు ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ ఘాటు కౌంటర్ట్రంప్ ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తీవ్రంగా స్పందించారు. ఇతర దేశాల ఆస్తులను స్వాధీనం చేసుకుని భవిష్యత్తు నష్టపరిహారాలకు వినియోగించడం “పేలుడు స్వభావం కలిగిన ప్రమాదకరమైన సంప్రదాయానికి నాంది” అని వ్యాఖ్యానించారు. “ఒక దేశానికి చెందిన ఆస్తులను మరో దేశం సంబంధం లేని అంశాలకు ఉపయోగించడం సాధారణమైతే.. భవిష్యత్తులో ఏ దేశ ఆస్తులకూ భద్రత ఉండదు. దీని ఫలితంగా ఏర్పడే గందరగోళం శాంతియుతంగా ఉండదు” అని అరాఘ్చీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అంతర్జాతీయ నిబంధనలను బలహీనపరిచే చర్యగా ఆయన ట్రంప్ నిర్ణయాన్ని అభివర్ణించారు.నిధుల విలువ ఎంత?ఇరాన్‌పై అమెరికా ఆంక్షల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ఆర్థిక వ్యవస్థల్లో ఆ దేశానికి చెందిన భారీ మొత్తంలో నిధులు నిలిచిపోయాయి. ఈ నిధుల ఖచ్చితమైన విలువ స్పష్టంగా తెలియకపోయినా.. కొన్ని నివేదికల ప్రకారం వాటి విలువ సుమారు 124 బిలియన్ డాలర్ల నుంచి 167 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా. ఈ స్తంభింపజేసిన నిధుల విడుదల ఇరాన్–అమెరికా మధ్య గత చర్చల్లో కీలక డిమాండ్‌గా ఉంది. అయితే ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం కూడా ముందుకు సాగలేదు.హౌతీల దాడులతో మళ్లీ ఉద్రిక్తతలుఇటీవల ఎర్ర సముద్రంలో సౌదీకి చెందిన రెండు చమురు నౌకలపై దాడులకు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు బాధ్యత వహించారు. హౌతీ అధికార ప్రతినిధి యాహ్యా సరీ మాట్లాడుతూ.. “ఎన్సీలియా (ENCELIA), లైలా (LAYLA)” అనే రెండు సౌదీ నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. సౌదీ రవాణా అధికారులు కూడా ఎన్సీలియా నౌకపై దాడి జరిగిందని, బాబ్ అల్-మందెబ్ జలసంధి వద్ద నౌక ముందుభాగంలో మంటలు చెలరేగినట్లు ధ్రువీకరించారు. ఇరాన్ కూడా హార్ముజ్ జలసంధిలో నిబంధనలు పాటించని వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుంటోందని అమెరికా ఆరోపిస్తోంది.యుద్ధం నుంచి ఆర్థిక పోరాటం వరకుఅమెరికా–ఇరాన్ ఘర్షణ ఇప్పటివరకు ప్రధానంగా సైనిక, దౌత్య స్థాయిలో కొనసాగింది. అయితే తాజా పరిణామాలతో ఆర్థిక ఆస్తులు కూడా ఈ పోరాటంలో కీలక ఆయుధాలుగా మారుతున్నాయి. ఒక దేశానికి చెందిన విదేశీ నిధులను మరో దేశం నష్టపరిహారాల కోసం వినియోగించడం అంతర్జాతీయ చట్టపరంగా కొత్త చర్చలకు దారితీయొచ్చని నిపుణులు చెబుతున్నారు. అమెరికా మాత్రం తన చర్యలను సమర్థిస్తూ.. తమ వాణిజ్య ప్రయోజనాలు, నౌకల భద్రతకు జరిగిన నష్టాలకు బాధ్యులను జవాబుదారీ చేయడమే లక్ష్యమని చెబుతోంది.న్యూయార్క్‌లో కత్తిపోట్ల కలకలంఇదిలా ఉండగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన రెండు కత్తిపోటు ఘటనలు కూడా చర్చనీయాంశంగా మారాయి. మాన్హాటన్లోని అప్పర్ వెస్ట్ సైడ్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసిన 51 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దాడి సమయంలో నిందితుడు “అల్లాహు అక్బర్” అని నినదించినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొనడంతో.. ఇది విద్వేష నేరమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రాథమిక విచారణలో నిందితుడి మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా కారణం అయి ఉండొచ్చని అధికారులు వెల్లడించారు. దాడిలో గాయపడిన ఇద్దరు బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ప్రపంచానికే ప్రమాదకర సంకేతమా?ఒక దేశానికి చెందిన స్తంభింపజేసిన ఆస్తులను మరో దేశం తన ప్రయోజనాలకు వినియోగించడం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కొత్త వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇతర దేశాల విదేశీ నిధుల భద్రతపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆస్తుల స్వాధీనం వంటి చర్యలు సాధారణ పరిణామంగా మారితే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నమ్మకం, పెట్టుబడుల భద్రతపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ప్రపంచానికి పెరుగుతున్న సవాళ్లుఒకవైపు ఇరాన్ స్తంభింపజేసిన నిధుల వినియోగంపై అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా.. మరోవైపు అమెరికాలో భద్రత, విద్వేష నేరాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. తాజా పరిణామాలు యుద్ధాలు కేవలం యుద్ధ రంగానికే పరిమితం కావని.. అవి ఆర్థిక వ్యవస్థలు, అంతర్జాతీయ నిబంధనలు, ప్రపంచ భద్రతపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని మరోసారి స్పష్టం చేస్తున్నాయి. -
సౌదీ ఆఫర్‌తో కొత్త పవర్ గేమ్... పాక్ ఎంట్రీతో బిగ్ ట్విస్ట్!
ప్రపంచ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, సౌదీ అరేబియా మధ్య కుదిరిన కొత్త పౌర అణు ఒప్పందం మధ్యప్రాచ్య శక్తి సమీకరణాలను మార్చే అంశంగా మారింది. బయటకు చూస్తే ఇది అణు విద్యుత్ అవసరాల కోసం కుదిరిన ఒప్పందంలా కనిపిస్తున్నా, దీని వెనుక ఉన్న వ్యూహాత్మక అవకాశాలే ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు కారణమవుతున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదించిన ఈ ఒప్పందం ద్వారా సౌదీ అరేబియాకు తన దేశంలోనే యురేనియం శుద్ధి చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. అణు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఈ సాంకేతికతను ఒక నిర్దిష్ట స్థాయికి మించి అభివృద్ధి చేస్తే, అణు ఆయుధాల తయారీకి అవసరమైన పదార్థాలను కూడా ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఒప్పందం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.ఈ పరిణామం ఇజ్రాయెల్‌లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఇప్పటికే ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ ఉద్రిక్తతలు, భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్, సౌదీ భవిష్యత్తులో అణు సామర్థ్యం సాధించే అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఒక దేశం అణు సాంకేతికతను అభివృద్ధి చేసిన తర్వాత దాని వినియోగం పూర్తిగా శాంతియుతంగానే ఉంటుందని ఎప్పటికీ హామీ ఇవ్వలేమన్నది ఇజ్రాయెల్ వాదన. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ గతంలో చేసిన ఒక వ్యాఖ్య కూడా ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది. ఇరాన్ అణు ఆయుధాన్ని అభివృద్ధి చేస్తే, సౌదీ కూడా అదే దిశలో అడుగులు వేయాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే సౌదీ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ అప్రమత్తంగా ఉంది.ఈ పరిణామంలో మరో దేశం పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అదే పాకిస్థాన్. సౌదీ అరేబియా, పాకిస్థాన్ మధ్య దశాబ్దాలుగా బలమైన వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. రక్షణ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రెండు దేశాలు సన్నిహితంగా వ్యవహరిస్తున్నాయి. పాకిస్థాన్ అణు కార్యక్రమానికి గతంలో సౌదీ మద్దతు ఇచ్చిందనే ఆరోపణలు అంతర్జాతీయ స్థాయిలో వినిపించినప్పటికీ, ఇరు దేశాలు వాటిని అధికారికంగా అంగీకరించలేదు. 1980లలో పాకిస్థాన్ అణు కార్యక్రమం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో సౌదీతో రహస్య అవగాహన ఉందనే వార్తలు వచ్చాయి. భవిష్యత్తులో ప్రాంతీయ సంక్షోభం ఏర్పడితే పాకిస్థాన్ నుంచి అణు సహకారం పొందే అవకాశం ఉందనే ఊహాగానాలు అప్పటి నుంచి కొనసాగుతున్నాయి. ఇప్పుడు సౌదీకి అణు సాంకేతికతపై మరింత సానుకూలత లభించే అవకాశం రావడంతో ఈ పాత చర్చలు మరోసారి తెరపైకి వచ్చాయి.అయితే ఒక దేశం అణు ఆయుధాన్ని తయారు చేయడం అంత సులభమైన ప్రక్రియ కాదు. యురేనియం శుద్ధి సామర్థ్యం ఒక భాగం మాత్రమే. దానికి తోడు అణు వార్‌హెడ్ రూపకల్పన, క్షిపణి వ్యవస్థల అభివృద్ధి, సాంకేతిక పరీక్షలు, భద్రతా వ్యవస్థలు వంటి అనేక అంశాలు అవసరం. అయినప్పటికీ, అణు సామర్థ్యానికి దారితీసే సాంకేతిక మార్గం తెరుచుకోవడం కూడా అంతర్జాతీయ భద్రతలో కీలక పరిణామంగానే పరిగణిస్తారు. అమెరికా దృష్టిలో ఈ ఒప్పందం కేవలం అణు విద్యుత్ ప్రాజెక్టు కాదు. మధ్యప్రాచ్యంలో తన ప్రభావాన్ని కొనసాగించడం, సౌదీతో సంబంధాలను మరింత బలోపేతం చేయడం, చైనా వంటి దేశాల ప్రభావాన్ని పరిమితం చేయడం వంటి వ్యూహాత్మక లక్ష్యాలు కూడా ఇందులో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇక ఇజ్రాయెల్ మాత్రం భద్రతా కోణంలో ఈ పరిణామాన్ని చూస్తోంది. భవిష్యత్తులో సౌదీ అణు సామర్థ్యం ప్రాంతీయ శక్తి సమతుల్యతను మార్చే అవకాశం ఉందని ఆ దేశంలోని పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఒప్పందం ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రావాల్సి ఉంది. అమెరికా కాంగ్రెస్ పరిశీలన, అంతర్జాతీయ పర్యవేక్షణ, భద్రతా నిబంధనలు వంటి అనేక దశలు ముందున్నాయి. అయినప్పటికీ, ఈ పరిణామం ఒక విషయం స్పష్టం చేస్తోంది. -
అమెరికా-ఇజ్రాయెల్ కొత్త డీల్.. భారత్‌కు జాక్‌పాట్?
ప్రపంచ రాజకీయాల్లో, రక్షణ రంగంలో నిశ్శబ్దంగా జరిగిన ఒక పరిణామం ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు దారి తీస్తోంది. అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించిన 2027 నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (NDAA) సాధారణ రక్షణ బిల్లు మాత్రమే కాదు. రాబోయే దశాబ్దాల్లో ప్రపంచ శక్తి సమీకరణాలను ప్రభావితం చేసే కీలక అడుగుగా విశ్లేషకులు చూస్తున్నారు.చాలామంది అనుకుంటున్నట్లుగా ఇది అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాల విలీనం కాదు. యుద్ధభూమిలో రెండు దేశాల సైనికులు ఒకే కమాండ్ కింద పనిచేయబోరు. కానీ అంతకంటే శక్తివంతమైన అంశాన్ని ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. అదే రక్షణ సాంకేతిక ప్రపంచాన్ని ఒక్కటిగా మార్చడం. కృత్రిమ మేధస్సు, డ్రోన్ స్వార్మ్స్, సైబర్ వార్ఫేర్, క్వాంటమ్ టెక్నాలజీ, లేజర్ ఆయుధాలు, తదుపరి తరానికి చెందిన క్షిపణి రక్షణ వ్యవస్థలు.. ఇవన్నీ ఇక నుంచి అమెరికా, ఇజ్రాయెల్ కలిసి అభివృద్ధి చేయనున్నాయి. పరిశోధన నుంచి తయారీ వరకు, పరీక్షల నుంచి ఉత్పత్తి వరకు ఒకే రక్షణ ఆవిష్కరణ వ్యవస్థను నిర్మించేందుకు ఈ బిల్లు బాటలు వేస్తోంది.ఇటీవలి యుద్ధాల్లో ఇజ్రాయెల్ సాధించిన అనుభవం, చైనాతో పెరుగుతున్న సాంకేతిక పోటీ, భవిష్యత్తు యుద్ధాల్లో ఆధిపత్యం సాధించాలన్న అమెరికా వ్యూహం.. ఈ మూడు అంశాలే ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ భాగస్వామ్యానికి వందల మిలియన్ డాలర్ల నిధులు కేటాయిస్తూ అమెరికా ముందడుగు వేసింది. సుమారు 750 మిలియన్ డాలర్ల నిధులను కేటాయించాలని ప్రతిపాదించారు. ఇందులో క్షిపణి రక్షణ, డ్రోన్ నిరోధక వ్యవస్థలు, సొరంగాల గుర్తింపు సాంకేతికతలు, కొత్త రక్షణ సాంకేతికతల అభివృద్ధికి నిధులు వినియోగించనున్నారు.భారత్ పేరు ఎందుకు వినిపిస్తోంది?ఈ పరిణామం భారత్‌కు కూడా కీలక అవకాశాలను తీసుకురాగలదని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇజ్రాయెల్ ఇప్పటికే భారతదేశానికి ప్రధాన రక్షణ భాగస్వామిగా ఉంది. ఫాల్కన్ ఎయిర్‌బోర్న్ వార్నింగ్ వ్యవస్థలు, బరాక్ క్షిపణులు, హెరాన్ డ్రోన్లు, హారోప్ లోయిటరింగ్ మ్యూనిషన్స్, రాడార్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పరికరాలు వంటి అనేక కీలక వ్యవస్థలను భారత్ ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసింది. మరోవైపు అమెరికాతో iCET, INDUS-X వంటి కార్యక్రమాల ద్వారా రక్షణ సాంకేతిక సహకారాన్ని భారత్ విస్తరిస్తుండగా, ఇజ్రాయెల్‌తో కూడా పరిశోధన, ఆవిష్కరణల కోసం ప్రత్యేక భాగస్వామ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ రెండింటితోనూ ఆధునిక రక్షణ సాంకేతిక రంగంలో కలిసి పనిచేసే అరుదైన స్థానంలో భారత్ నిలిచింది.అయితే, ఇది అవకాశమే గానీ హామీ కాదు. అమెరికా ఎగుమతి నియంత్రణలు, మేధోసంపత్తి హక్కులు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఈ మార్గంలో సవాళ్లుగా మారే అవకాశమూ ఉంది. అందుకే భారత్ విదేశీ భాగస్వామ్యాలపై మాత్రమే ఆధారపడకుండా, స్వదేశీ రక్షణ సాంకేతిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. -
ఇది చాల్లేదు.. ఇరాన్‌కు ఇంకా నొప్పి తెలియట్లేదు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఇరాన్ మౌలిక వసతులపై అమెరికా బలగాలు దాడులు కొనసాగిస్తుండగా.. ప్రతిగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ కౌంటర్ అటాక్‌లు జరుపుతోంది. మరోవైపు ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు కూడా రంగంలోకి దిగడంతో ఈ ఘర్షణ మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై మరింత కఠిన చర్యలకు దిగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇరాన్‌పై భారీ స్థాయి సైనిక చర్యను పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇప్పటికే జరుగుతున్న దాడులు సరిపోలేదని భావిస్తున్న ఆయన.. “ఇరాన్‌కు ఇంకా తగినంత నొప్పి తెలియలేదు” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆక్సియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌పై గతంలో కంటే పెద్ద స్థాయిలో దాడి చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. “నేను భారీ దాడి గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పటివరకు జరిగిన వాటికంటే పెద్దదిగా ఉంటుంది. నిర్ణయం తీసుకునే దశకు చేరుకున్నాను” అని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది. అయితే కొత్త దాడికి సంబంధించి అధ్యక్షుడు తుది నిర్ణయం తీసుకోలేదని అమెరికా అధికారులు వెల్లడించారు. ఎలాంటి కొత్త సైనిక ఆదేశాలు కూడా జారీ కాలేదని తెలిపారు.చర్చలకు ఇరాన్ సిద్ధంగా లేదు: ట్రంప్ఇరాన్ చర్చలకు ఆసక్తి చూపుతున్నప్పటికీ.. ఒప్పందానికి రావడానికి సిద్ధంగా లేదని ట్రంప్ ఆరోపించారు. “వారికి ఇంకా తగినంత నొప్పి తెలియలేదు” అని వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై ఒత్తిడి కొనసాగాల్సిన అవసరం ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు.13వ రోజూ అమెరికా దాడులుమరోవైపు ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం.. వరుసగా 13వ రాత్రి కూడా ఇరాన్ సైనిక లక్ష్యాలపై దాడులు జరిగాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సామర్థ్యాన్ని తగ్గించడం, వాణిజ్య నౌకలపై ముప్పును అడ్డుకోవడమే తమ లక్ష్యమని అమెరికా చెబుతోంది.ఇజ్రాయెల్ మద్దతుపై ట్రంప్ వ్యాఖ్యలుఇటు.. ఇరాన్‌పై కొత్త ఆపరేషన్ జరిగితే ఇజ్రాయెల్ వెంటనే అమెరికాతో కలిసి వస్తుందని ట్రంప్ అన్నారు. “నేను అడిగితే ఇజ్రాయెల్ రెండు నిమిషాల్లో చేరుతుంది” అని వ్యాఖ్యానించారు. అయితే అమెరికా చర్యలకు ఇజ్రాయెల్ సహకారం తప్పనిసరి కాదని స్పష్టం చేశారు.హర్ముజ్ జలసంధిపై ఉత్కంఠఅమెరికా–ఇరాన్ ఘర్షణ ప్రభావం ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధిపై పడుతోంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళనలు నెలకొన్నాయి. ఇరాన్ కూడా తనపై దాడులు కొనసాగితే ప్రాంతీయ చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలపై ప్రతీకారం ఉంటుందని హెచ్చరించింది.యుద్ధం విస్తరిస్తుందా?ఇరాన్‌కు మద్దతుగా ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో సౌదీ నౌకలపై దాడులు చేసినట్లు ప్రకటించారు. దీంతో మధ్యప్రాచ్య సంక్షోభం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ట్రంప్ పన్నుల బాంబు .. 60 దేశాలకు చుక్కలే?
వాషింగ్టన్ డీసీ: డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచానికి షాకిచ్చారు. ఉత్పత్తుల తయారీల వెట్టిచాకిరీ (ఫైర్డ్ లేబర్) అడ్డుకట్ట నిబంధనలను సరిగ్గా అమలు చేయడం లేదనే ఆరోపణలతో పన్నుల మోత మోగించారు. దాదాపు 60 భాగస్వామ్య దేశాలకు చెందిన వస్తువులపై దిగుమతి సుంకాలు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు.డొనాల్ట్ ట్రంప్ మరోసారి పన్నుల యుద్ధం ప్రకటించారు. గతంలో విధించిన సుంకాల గడువు ముగుస్తుండడంతో వాటి స్థానంలో కొత్త సుంకాలను అమల్లోకి తెచ్చారు. ఈ నూతన పన్నులు 10 శాతం నుండి 12.5 శాతం వరకు ఉండనున్నాయి. ఈ పన్నులతో భారత్, చైనా, జపాన్, బ్రిటన్ యురోపియన్ యూనియన్ (EU) వంటి ప్రముఖ ఆర్థిక వ్యవస్థలపై ఈ ప్రభావం పడనుంది.ఈ విషయమై అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ మాట్లాడుతూ "అమెరికాలో దాదాపు ఒక శతాబ్దం నుంచి వెట్టిచాకిరీ ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతిపై నిషేధం ఉంది. దానిని మేము కఠినంగా అమలు చేస్తున్నాం. మన వాణిజ్య భాగస్వామ్య దేశాలు కూడా అదే పని చేయాల్సిన సమయం వచ్చింది." అని అన్నారు.గత ఫిబ్రవరిలో ట్రంప్ విధించిన అనేక సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత ప్రత్యామ్నాయ అధికారాలను ఉపయోగించి 150 రోజుల పాటు విధించిన 10 శాతం తాత్కాలిక సుంకం గడువు తీరడంతో, 'ట్రేడ్ యాక్ట్ 1974 - సెక్షన్ 301' కింద నెలల తరబడి విచారణ జరిపి చట్టబద్ధంగా నిలిచేలా ఈ కొత్త సుంకాలను రూపొందించారు. ఏ దేశంపై ఎంత?10 శాతం సుంకం వెట్టిచాకిరీపై కఠిన చట్టాలను అమలు చేస్తున్న కెనడా, బ్రిటన్, యురోపియన్ యూనియన్ వంటి దేశాలకు తక్కువ రేటైన 10% సుంకం వర్తిస్తుంది. 12.5 శాతం సుంకం: వెట్టిచాకిరీ నిరోధంలో తగిన చర్యలు తీసుకోలేదని అమెరికా భావించిన చైనా, జపాన్ వంటి భాగస్వామ్య దేశాలపై 12.5% సుంకం పడనుంది. కాగా ఉక్కు, అల్యూమినియం వంటి ఇదివరకే ప్రత్యేక రక్షణ సుంకాలు ఉన్న రంగాలకు, అలాగే 'యుఎస్-మెక్సికో-కెనడా ఉచిత వాణిజ్య ఒప్పందం కింద అమెరికాలోకి వచ్చే వస్తువులకు ఈ కొత్త సుంకాల నుంచి మినహాయింపు లభించింది. -
సౌదీలో ‘అణు’కుంపటి
అందరి సలహాలూ బేఖాతరు చేసి ఇరాన్‌పై యుద్ధ భేరి మోగించి పశ్చిమాసియాను అగ్నిగుండంగా మార్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... ఇప్పుడు మరో ప్రమాదకర క్రీడకు సిద్ధపడ్డారు. సౌదీ అరేబియాతో తమకు ‘శాంతియుత అణు సహకార ఒప్పందం’ కుదిరిందంటూ అమెరికా ఇంధన శాఖ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకంపనలు రేపుతోంది. తన నిర్ణయం పర్యవసానాలూ, పరిణామాల గురించి పూర్తిగా తెలిసే ట్రంప్ ఇందుకు సిద్ధపడ్డారా అనే సందేహం అందరిలో తలెత్తుతోంది. ఇది పశ్చిమాసియా అమరికను సంపూర్ణంగా మార్చే... ఇప్పటికే సాగుతున్న ఆయుధ పోటీని మరింత పెంచే ప్రమాదకర నిర్ణయం. 30 యేళ్లపాటు కొనసాగే ఈ ఒప్పందం కింద యురేనియం శుద్ధికి అవసరమైన సామర్థ్యాన్ని సౌదీ సంతరించుకుంటుందని, అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ప్రమాణాలను సాధించటంతోపాటు ప్రాంతీయ భద్రతకూ, అమెరికా భద్రతకూ కూడా తోడ్పడుతుందని అమెరికా అంటోంది. రాగలకాలంలో దేశానికి ఇది వందలకోట్ల వాణిజ్యాన్ని తీసుకొస్తుందనీ... దేశ ఆర్థిక, వ్యూహాత్మక లక్ష్యాలు నెరవేరటానికి దోహదపడుతుందనీ కూడా చెప్పుకుంటోంది. ఒకపక్క తన చర్యల ద్వారా అణ్వాయుధ తయారీకి దోహదపడుతూ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధమే ధ్యేయమని చెప్పటం ఉత్త వంచన. ఈ అణు ఒప్పందం 2008లో మన్మోహన్ సింగ్ తొలి ఏలుబడిలో మన దేశంతో అమెరికా కుదుర్చుకున్న ‘123’ ఒప్పందమే కదా అనిపిస్తుంది. అగ్రరాజ్యాలతోపాటు మనతోసహా పలు దేశాల దగ్గర అణ్వాయుధాలున్నాయి. అదనంగా సౌదీ దగ్గర ఉంటే నష్టమేమిటన్న సందేహాలు కూడా కలుగుతాయి. పైగా ఇది పౌర అణు ఒప్పందమే అనిపిస్తుంది. కానీ తరచిచూస్తే ఇందులో లొసుగులు బయటపడతాయి. సౌదీ అణువిద్యుత్ ప్రాజెక్టులు స్థాపించుకోవటానికే ఇది ఉపయోగపడుతుందని అమెరికా వాదన. ప్రకృతిలో లభించే యురేనియంలోని రెండు ఐసోటోపుల్లో ఒకటైన యూ– 235 మాత్రమే అణు విచ్ఛేదనానికీ, గొలుసు చర్య జరిగి అపారమైన శక్తి విడుదలకూ తోడ్పడు తుంది. యురేనియంను 3 నుంచి 5 శాతంవరకూ శుద్ధి చేస్తే అణు విద్యుత్ ఉత్పాదన సాధ్యమవుతుంది. శుద్ధి 90 శాతానికి చేరితే అణుబాంబు తయారీకి ఉపయోగపడుతుంది. అయితే విద్యుదుత్పాదన తర్వాత వాడేసిన ఇంధనంతో ప్లూటోనియం తయారీ అవకాశం ఎప్పుడూ ఉంటుంది. దాన్ని నిరోధించేందుకే ‘గోల్డ్ స్టాండర్డ్’ పేరుతో అమెరికా కఠినమైన షరతు విధిస్తోంది. దాన్నుంచి సౌదీకి మినహాయింపు ఇవ్వటం పైనే అందరికీ ఆందోళన. ఆ షరతు ఉంటుందని తాజాగా అమెరికా ఇస్తున్న వివరణ నమ్మశక్యంగా లేదు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ)పై ఇరాన్ సంతకం చేసినా, అణుబాంబు తయారీకి వ్యతిరేకంగా అక్కడ ఫత్వా అమల్లో ఉన్నా ఆ దేశం అణు బాంబుకు సిద్ధపడుతోందన్న సంశయాలు అమెరికాకూ, ఇజ్రాయెల్‌కూ ఉన్నాయి. తరచు ఇరాన్‌పై అమెరికా విరుచుకుపడటానికి కారణం అదే. ‘ఇరాన్ ఆ పని చేస్తే... మేం సైతం ఆ బాటలోనే వెళ్తాం’ అని సౌదీ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ గత కొన్నేళ్లుగా పదే పదే చెబుతున్నారు. అలాంటి దేశానికి మినహాయింపు ఇవ్వటమంటే బాహాటంగా దాన్ని అణ్వస్త్ర దేశంగా మారడానికి ప్రోత్సహించటమే అవుతుంది. అమెరికా మిత్రులు ఏం చేసుకున్నా మినహాయింపునిస్తాం... శత్రుదేశాలను మాత్రం నిరుత్సాహపరుస్తాం’ అనే నైజం అత్యంత ప్రమాదకరమైనది. ‘మనిషి అణుబాంబును కనిపెట్టాడు. కానీ ప్రపంచంలో ఏ ఎలుకా ఎలుకలబోను తయారుచేసుకోదు’ అని ఐన్‌స్టీన్ చేసిన వ్యాఖ్య ఆంతర్యం స్పష్టమే. ఇది స్వీయ హననానికి దారితీసే తెలివిమాలిన చర్య. భవిష్యత్తులో అణుశక్తి దేశంగా మారాక సౌదీ, అమెరికా చెప్పుచేతల్లో ఉండదు. తాము చేస్తే తప్పేమిటని ఇరాన్ సైతం ఆ బాట పడుతుంది. చిన్న నిప్పురవ్వ కూడా ఆ ప్రాంతాన్ని ఇప్పుడే భగ్గున మండిస్తుంటే ఇక అణ్వాయుధాలుంటే చెప్పేదేముంది? ఇప్పటికే ఇజ్రాయెల్ స్వీయరక్షణకంటూ అమెరికా దానికి అణ్వాయుధాలు సరఫరా చేసింది. దాని రక్షణ పేరుచెప్పే తరచు ఇరాన్‌పై దాడులు చేస్తోంది. నిజానికి స్వతంత్ర పాలస్తీనా ఆవిర్భవిస్తే ఇజ్రాయెల్‌కు ఇలాంటి రక్షణల అవసరమే ఉండదు. దాన్ని సాకారం చేయకుండా ఈ ప్రాంతాన్ని అణ్వస్త్రాల మయం చేయటం క్షమించరాని నేరం. -
ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్.. ఇకపై హర్మూజ్ లో ఒక్క నౌకపై దాడి చేసినా
-
మార్కెట్‌కు చమురు సెగ
ముంబై: ముడిచమురు ధరలు పరుగులు తీయడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా సుంకాల హెచ్చరికలతో దేశీయ స్టాక్ మార్కెట్ మూడో రోజూ నష్టపోయింది. బ్యాంకు షేర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో బుధవారం సెన్సెక్స్ 715 పాయింట్లు కోల్పోయి 76,755 వద్ద నిలిచింది. నిఫ్టీ 191 పాయింట్లు పతనమై 24,000 స్థాయి దిగువన 23,996 వద్ద స్థిరపడింది. దలాల్ స్ట్రీట్ ఒక శాతం పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.25 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం మార్కెట్ క్యాప్ రూ.480 లక్షల కోట్లకు దిగివచ్చింది. రోజంతా నష్టాల్లోనే అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల ప్రభావంతో సూచీలు ఉదయమే బలహీనంగా ప్రారంభమయ్యాయి. ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. సూచీలు ఏ దశలో కోలుకోలేక, రోజంతా నష్టాల్లో ట్రేడయ్యాయి. ఒకానొక దశలోనూ సెన్సెక్స్ 829 పాయింట్లు క్షీణించి 76,641 వద్ద, నిఫ్టీ 226 పాయింట్లు కుప్పకూలి 23,961 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. నష్టాలు ఎందుకంటే ఎర్రసముద్రంలో సౌదీ చమురు ట్యాంకర్లపై హౌతీల ముప్పు తీవ్రమవడం, హార్మూజ్ జలసంధిలో సరఫరా అడ్డంకులు తలెత్తడంతో ముడిచమురు (బ్రెంట్ క్రూడ్) ధర బ్యారెల్‌కు 92 డాలర్లపైకి చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెనరిక్ మందుల దిగుమతులపై దశలవారీగా 200% వరకు సుంకాలు (టారిఫ్‌లు) విధిస్తామని ప్రకటించారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకపోగా, ఈ ఏడాది పెంచే అవకాశం ఉందన్న అంచనాలు బలపడ్డాయి. పదేళ్ల కాలపరిమితి కలిగి బాండ్లపై రాబడులు 4.63 శాతానికి పెరిగాయి. గత నాలుగు రోజులుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) రూ. 6,000 కోట్లకు పైగా విలువైన భారతీయ షేర్లను విక్రయించారు. ఈ పరిణామాలన్నీ, దేశీయ స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడి పెంచాయి.28 పైసలు తగ్గిన రూపాయిడాలర్ మారకంలో రూపాయి విలువ 28 పైసలు బలహీనపడి 96.53 వద్ద స్థిరపడింది. ముడిచమురు ధరలు అనూహ్యంగా పెరగడం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి అధికమవడం రూపాయిపై తీవ్ర ఒత్తిడి పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకునేందుకు వెనుకాడారు. దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనం సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 96.36 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 96.25 – 96.60 పరిధిలో ట్రేడైంది. ట్రంప్ సుంకాల హెచ్చరికలపై మళ్లీ నెలకొన్న ఆందోళనలు కూడా ఫారెక్స్ ట్రేడర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఫార్మా షేర్లకు ‘సుంకాల’ భయాలుఅమెరికాకు ఎగుమతి అయ్యే జెనరిక్ ఔషధాలపై దిగుమతి సుంకాలను (టారిఫ్) విధిస్తామంటూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో భారతీయ ఫార్మా కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ‘‘ఫార్మా కంపెనీలు అమెరికాలోనే స్వదేశీ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు రెండేళ్ల గడువు ఇస్తున్నాం. 2026 ఆగస్టు 1 నుంచి రెండేళ్ల పాటు సున్నా శాతం సుంకాన్ని కొనసాగిస్తాం. ఆ తర్వాత ఒక ఏడాది పాటు (2028 ఆగస్టు నుంచి) 100 శాతం, ఆపై (2029 ఆగస్టు నుంచి) 200 శాతం చొప్పున దిగుమతి సుంకాలు ఉంటాయి’’ అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాకు అత్యధికంగా జెనరిక్ మందులను ఎగుమతి చేసే దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. దీంతో ఫార్మా కంపెనీల మార్జిన్లు, ఎగుమతి ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. బీఎస్ఈలో లుపిన్ షేరు అత్యధికంగా 4.21 శాతం పతనమైంది. అరబిందో ఫార్మా (1.99%), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ (1.95%), గ్లెన్‌మార్క్ (1.49%), ఆల్కెమ్ ల్యాబ్స్ (1.43%), సిప్లా (1.08%), సన్ ఫార్మా (0.98%), బయోకాన్ (0.57%) షేర్లు నష్టాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాప్ లక్ష కోట్లు ఆవిరిహెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిసింది. బీఎస్ఈలో ఈ షేరు ఒక శాతానికి పైగా నష్టపోయి రూ.753.15 వద్ద స్థిరపడింది. ఒక దశలో 1.50 శాతం పతనమై రూ.750.25 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు జూన్ త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడం, నికర వడ్డీ మార్జిన్ల తగ్గదలతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు రేకెత్తించాయి. ముఖ్యంగా, మార్జిన్ ఒత్తిళ్ల కారణంగా గడిచిన మూడు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేరు ఏకంగా 8.11% మేర పతనమైంది. ఈ ఊహించని పతనంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. లక్ష కోట్లు ఆవిరై, రూ. 11.59 లక్షల కోట్లకు దిగివచ్చింది. -
అణు కేంద్రంపై బాంబులేస్తాం
వాషింగ్టన్/దుబాయ్: ఇరాన్ అణ్వాయుధ ఆశను శాశ్వతంగా చెదరగొట్టేందుకు ఎంతకైనా తెగిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దక్షిణ ఇరాన్‌లోని నటాంజ్ అణు శుద్ధి కర్మాగారం సమీపంలో పర్వతం అడుగున నిర్మాణ దశలో ఉన్న ‘పిక్‌యాక్స్ మౌంటేన్’అణుకేంద్రంపై దాడులు చేయాలని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. మంగళవారం శ్వేతసౌధంలో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. 2025లో 12 రోజులపాటు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబులేశాయి. కానీ పిక్‌యాక్స్ పర్వత ప్రాంతం జోలికి పోలేదు. ఇప్పుడు ఆ ప్రాంతం పని పడతామని ట్రంప్ వెల్లడించారు. హార్మూజ్‌లో స్వేచ్ఛాయానం చేసే నౌకలపై ఇరాన్ దాడి చేసినప్పుడల్లా ఆ దేశంలోని ఒక విద్యుత్‌ఉత్పత్తి కేంద్రం లేదా ఒక వంతెనను నేలమట్టంచేస్తానని ట్రంప్ హెచ్చరించారు. ‘‘ఇరాన్ క్షిపణి, రాకెట్, డ్రోన్ మరేదైనా ఆయుధ వ్యవస్థను ప్రయోగిస్తే ఒక్కో దాడికి అమెరికా బదులుతీర్చుకుంటుంది. ఇరాన్ దాడిచేస్తే ప్రతిసారీ ఒక పవర్ ప్లాంట్ లేదా బ్రిడ్జిని బద్దలుకొడతాం’’అని ట్రంప్ ‘ట్రూత్‌సోషల్’లో ఒక పోస్ట్‌పెట్టారు. హెచ్చరికలతోడు అమెరికా వైమానిక దళా లు మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉద యం దాకా ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై దాడు లు చేశాయి. ఈ దాడులను ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ)లోని గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకునే ప్రయత్నంచేశాయి. దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌లోని ఏలాట్ నగర శివారు ప్రాంతం అఖాబాపై దాడులు చేసింది. -
ఫిఫా అధ్యక్షుడికి ఐరాస అత్యున్నత పదవి..?
2026 ఫిఫా ప్రపంచకప్ విజయవంతంగా ముగిసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినోపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురాగల నాయకత్వ లక్షణాలు ఇన్ఫాంటినోకు ఉన్నాయని ప్రశంసిస్తూ, ఆయన ఐక్యరాజ్యసమితి (UN) తదుపరి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాలని ట్రంప్ కోరుకుంటున్నట్లు నివేదికలు వెల్లడించాయి.అయితే, ట్రంప్ వ్యాఖ్యలు చేసినంత మాత్రాన ఇన్ఫాంటినో యూఎన్ ప్రధాన కార్యదర్శి కాలేరు. ఆ పదవికి ఎంపిక కావాలంటే ముందుగా 15 సభ్య దేశాలున్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UN Security Council) మద్దతు అవసరం. ఐదు శాశ్వత సభ్య దేశాల్లో (అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా) ఏ ఒక్క దేశం వీటో విధించినా అభ్యర్థిత్వం నిలిచిపోతుంది.భద్రతా మండలి ఆమోదం లభించిన తర్వాతే అభ్యర్థి పేరును యూఎన్ సర్వసభ్య సమావేశం (General Assembly) తుది ఆమోదానికి పంపుతుంది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ పదవీకాలం ఈ ఏడాది డిసెంబరుతో ముగియనుండటంతో, కొత్త ప్రధాన కార్యదర్శి ఎంపిక ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.ఇప్పటివరకు జియానీ ఇన్ఫాంటినో ఈ పదవికి పోటీ చేయాలనే ఆసక్తి వ్యక్తం చేసినట్లు లేదా ట్రంప్‌తో అధికారికంగా చర్చలు జరిపినట్లు ఎలాంటి నిర్ధారణ లేదు.ఇక యూఎన్ ప్రధాన కార్యదర్శి రేసులో చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్ బాచెలెట్, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సీ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి.కాగా, ప్రపంచకప్ విజయవంతంగా నిర్వహించిన తర్వాత భవిష్యత్తులో మరోసారి టోర్నీని అమెరికాలో నిర్వహించాలని ట్రంప్ ఫిఫాను కోరనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట ముగిసిన ఫైనల్లో అర్జెంటీనాపై గెలిచి స్పెయిన్ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. విజేతకు ట్రంప్ చేతుల మీదుగా ట్రోఫీని బహుకరించారు. ఈ టోర్నీని అమెరికా,కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా నిర్వహించాయి. -
ఇరాన్ కు ట్రంప్ స్టాంగ్ వార్నింగ్
-
భారత్ ‘ఫార్మా’కు ట్రంప్ భారీ షాక్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు దిగుమతి అయ్యే జనరిక్ ఔషధాలపై భారీ టారిఫ్‌లు విధించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా ఔషధ తయారీని తిరిగి అమెరికాలోనే ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కొత్త విధానం భారత ఔషధ పరిశ్రమపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ట్రంప్ సోషల్ మీడియా వేదిక ట్రూత్ వేదికగా చేసిన పోస్టులో.. రానున్న ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్ ఔషధాలపై రెండేళ్ల పాటు సున్నా శాతం టారిఫ్ కొనసాగుతుందని తెలిపారు. ఆ గడువు ముగిసిన తర్వాత ఒక సంవత్సరం పాటు 100 శాతం టారిఫ్, ఆ తర్వాత 200 శాతం టారిఫ్ అమల్లోకి వస్తుందని వెల్లడించారు. అమెరికాలోనే జనరిక్ ఔషధాల తయారీని పెంచేందుకు, విదేశీ కంపెనీలు అక్కడ ప్లాంట్లు, తయారీ సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని పేర్కొన్నారు. నిర్ణయించిన గడువులోగా అమెరికాలో ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయని కంపెనీలపై ఈ టారిఫ్‌లు ఒక విధమైన జరిమానాగా పనిచేస్తాయని ట్రంప్ చెప్పారు.అమెరికా ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకే ఈ విధానాన్ని తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు. పేటెంట్ ఉన్న బ్రాండెడ్ లేదా ఇన్నోవేటివ్ ఔషధాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం యథాతథంగా కొనసాగుతుందని కూడా స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో భారత ఔషధ పరిశ్రమలో ఆందోళన నెలకొనే అవకాశం ఉంది. ప్రపంచానికి తక్కువ ధరలో నాణ్యమైన జనరిక్ మందులను సరఫరా చేస్తున్నందుకు భారత్‌ను ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్‌గా పిలుస్తారు. ముఖ్యంగా భారత ఔషధ ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది.గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) నివేదిక ప్రకారం, 2025లో భారత్ అమెరికాకు 9.7 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను ఎగుమతి చేసింది. ఇది భారత్ మొత్తం ఔషధ ఎగుమతులైన 25.8 బిలియన్ డాలర్లలో 38 శాతానికి సమానం. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, అంటువ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలకు అమెరికాలో విస్తృతంగా ఉపయోగించే జనరిక్ మందుల్లో భారత కంపెనీల వాటా కీలకంగా ఉంది.ట్రంప్ ప్రకటించిన విధానం అమల్లోకి వస్తే, అమెరికాకు ఎగుమతులు చేసే భారత ఫార్మా కంపెనీలు అక్కడే తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. లేకపోతే భారీ టారిఫ్‌ల కారణంగా అమెరికా మార్కెట్లో తమ ఉత్పత్తుల ధరలు పెరగడంతో పాటు పోటీ సామర్థ్యం కూడా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు, అమెరికాలో తయారీని విస్తరించే కంపెనీలకు మాత్రం దీర్ఘకాలంలో ప్రయోజనం కలగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ విధానం తుది రూపంలో ఎలా అమలవుతుంది, ఎలాంటి మినహాయింపులు ఉంటాయి, అంతర్జాతీయ ఔషధ కంపెనీలు ఎలా స్పందిస్తాయి అనే అంశాలపై దీని వాస్తవ ప్రభావం ఆధారపడి ఉంటుంది. -
ట్రంప్ నిర్ణయంతో మిడిల్ ఈస్ట్‌లో కొత్త టెన్షన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సౌదీ అరేబియాతో న్యూక్లియర్ డీల్‌కు ఆమోదం తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా సౌదీ తన భూభాగంలోనే యురేనియం శుద్ధి (ఎన్రిచ్మెంట్) చేపట్టే అవకాశం లభించనుంది. అయితే గతంలో అమెరికా కుదుర్చుకున్న అణు ఒప్పందాలతో పోలిస్తే.. సౌదీ డీల్‌లో కీలక భద్రతా నిబంధనలు లేకపోవడంపై అంతర్జాతీయంగా కలకలం రేగింది.ట్రంప్ ప్రభుత్వం ఆమోదించిన ఈ ఒప్పందం దాదాపు 30 ఏళ్ల పాటు కొనసాగనున్నట్లు సమాచారం. దీని విలువ పదుల బిలియన్ల డాలర్లుగా ఉండనుంది. ఈ ఒప్పందం అమలైతే సౌదీ అరేబియాలో పౌర అణు విద్యుత్ కార్యక్రమాల నిర్మాణంలో అమెరికా కంపెనీలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇతర దేశాల కంపెనీలకు అవకాశాలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. అణు ఇంధన రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని పెంచే వ్యూహంలో భాగంగానే ఈ ఒప్పందాన్ని చూస్తున్నారు.సంప్రదాయ భద్రతా నిబంధనలు లేవా?అమెరికా గతంలో కుదుర్చుకున్న అణు ఒప్పందాల్లో.. అణు సాంకేతికత దుర్వినియోగం కాకుండా కఠినమైన నిబంధనలు ఉండేవి. కానీ సౌదీతో కుదుర్చుకున్న తాజా ఒప్పందంలో అలాంటి కొన్ని కీలక రక్షణ చర్యలు లేకపోవడం చర్చకు దారితీసింది. ముఖ్యంగా యురేనియం ఎన్రిచ్మెంట్ అనుమతి ఇవ్వడం భవిష్యత్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.వైట్‌హౌస్‌లో కీలక భేటీ తర్వాత నిర్ణయంఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం అణు ఒప్పందంపై ముందడుగు పడింది. ఈ ఒప్పందానికి సంబంధించిన ప్యాకేజీని త్వరలోనే అమెరికా కాంగ్రెస్ పరిశీలనకు పంపనున్నట్లు సమాచారం.‘123 అగ్రిమెంట్’లో భాగంగా..అమెరికా విదేశీ దేశాలతో అణు సహకారం కోసం రూపొందించే ప్రత్యేక ఒప్పందాన్ని సాధారణంగా ‘123 Agreement’ అని పిలుస్తారు. తాజా ఒప్పందంలో భాగంగా అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్, సౌదీ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్అజీజ్ బిన్ సల్మాన్ సంతకాలు చేసినట్లు సమాచారం.మిడిల్ ఈస్ట్‌లో కొత్త అణు సమీకరణాలు?చమురు సంపదతో ప్రపంచంలో కీలక శక్తిగా ఉన్న సౌదీ.. ఇప్పుడు అణు ఇంధన రంగంలో అడుగులు వేయడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా-సౌదీ అణు ఒప్పందం మిడిల్ ఈస్ట్ వ్యూహాత్మక సమీకరణాలను మార్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం నేపథ్యంలో ఈ ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది. -
కెనడాపై ట్రంప్ టారిఫ్ కొరడా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొరుగు దేశం కెనెడాపై మరోసారి టారిఫ్‌ల కొరడా ఝళిపించారు. అమెరికాలో తయారయ్యే వాహనాలు, మద్యం, పాల ఉత్పత్తులపై కెనెడా వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఆ దేశపు దిగుమతులు అత్యధికంపై యాభై శాతం టారిఫ్ విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. కొత్త పన్నులు మరో ముప్ఫై రోజుల్లో అమల్లోకి రానున్నాయి. ఈ పరిణామం కాస్తా ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న ఇరుదేశాల సంబంధాలను మరింత దిగజార్చడమే కాకుండా ఆర్థిక గందరగోళానికి దారితీస్తుందని అంచనా. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ట్రంప్ పలు దేశాలపై టారిఫ్‌లతో విరుచుకుపడగా చైనా, కెనెడాలు మాత్రమే ప్రతీకార పన్నులను విధించిన విషయం తెలిసిందే.ఈ కారణంగానే కెనెడాకు బుద్ది చెప్పాలని ట్రంప్ తాజా టారిఫ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా పేరు చెప్పేందుకు ఇష్టపడని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. టారిఫ్‌లను ప్రకటిస్తూ ట్రంప్ మూడు ఉత్తర్వులపై సంతకాలు చేశారని, అది కూడా 1930 నాటి వాణిజ్య చట్టంలోని వివాదాస్పద సెక్షన్ 338 కింద ఉత్తర్వులు వెలువడ్డాయని ఆ అధికారి తెలిపారు. ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు ట్రంప్ వాడే అవకాశం ఉన్నందున ఈ సెక్షన్‌ను రద్దు చేయాలని డెమోక్రాటిక్ పార్టీ ప్రతినిధులు ఏడాదిగా కోరుతున్నారు. ట్రంప్ కొత్తగా విధించిన టారిఫ్‌ల నుంచి ఇంధన ఉత్పత్తులు, పొటాష్, చేపలు, కొన్ని కీలకమైన ఖనిజాలకు మాత్రమే మినహాయింపు ఉంది.దిగుమతి పన్నుల విషయమై జరిగిన యునైటెడ్ స్టేట్స్–మెక్సికో–కెనెడా ఒప్పందంలో రక్షణ కల్పించిన వస్తువులకు కొత్త టారిఫ్‌లు వర్తిస్తాయని అమెరికా చెబుతోంది. అయితే ఈ ఒప్పందం 2020లోనే ముగియడం తదుపరి పునరుద్ధరించకపోవడంతో పరిస్థితి గందరగోళంగా ఉంది. తాజా టారిఫ్‌లపై కెనెడా ఇప్పటివరకూ స్పందించలేదు కానీ... ఒంటారియో అధ్యక్షుడు డగ్ ఫోర్డ్ మాత్రం ఈ నిర్ణయం కాస్తా వాణిజ్య పోరుకు దారితీసే అవకాశముందని వ్యాఖ్యానించారు.ప్రతి అదనపు టారిఫ్‌కు కెనెడా దీటుగా ప్రతి టారిఫ్‌లు విధిస్తుందని ఫోర్డ్ తన సోషల్‌మీడియా పోస్టులో తెలిపారు. కెనెడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీఈఓ కాన్డేస్ లియాంగ్ కూడా ట్రంప్ నిర్ణయం దురదృష్టకరమని చెబుతూ కొత్త టారిఫ్‌లు అమల్లోకి వచ్చేందుకు 30 రోజుల గడువు ఉన్నందున ఏమైనా జరగవచ్చునని అన్నారు. మరోవైపు కెనెడాపై విధించిన తాజా టారిఫ్‌లు అంతార్జతీయంగానూ ఆర్థిక అస్థిరతకు దారితీయవచ్చునని కాటో ఇన్స్టిట్యూట్కు చెందిన స్కాట్ లిన్సికోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ ముందు బోలెడన్ని రిస్‌్కలు కెనెడాపై విధించిన తాజా టారిఫ్‌లు రాజకీయంగా, ఆర్థికంగానూ ట్రంప్‌కు ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పించవచ్చునని పరిశీలకుల అంచనా. నవంబరులో మధ్యంతర ఎన్నికలు జరుగుతూండటం ఒక కారణం. గత ఏడాది లిబరేషన్ డే సందర్భంగా విధించిన పన్నులు స్టాక్మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ట్రంప్ టారిఫ్‌లపై వెనక్కు తగ్గారు. ఈ సారి ఏం చేస్తారన్నది వేచి చూడాల్సిందే. -
లెబనాన్‌కు ఇతోధిక సాయమందిస్తాం
వాషింగ్టన్: లెబనాన్‌కు తాము అవసరమైన మేర సాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మంగళవారం వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు జోసెఫ్‌తో సమావేశం అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఇజ్రాయెల్, ఇరాన్ అనుకూల హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపునకు మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో లెబనాన్‌లో శాంతి నెలకొంది. ఇవే పరిస్థితులను కొనసాగేలా చూడాలని, ఇజ్రాయెల్ బలగాలు ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి తమ మిలటరీకి అప్పగించాలని జోసెఫ్ అమెరికా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.‘లెబనాన్ తీవ్ర నిర్లక్ష్యానికి గురైన దేశం. తగిన గౌరవం కల్పించేందుకు చర్యలు తీసుకోబోతున్నాం. ఆ దేశానికి ఎంతగానో సాయం అందజేబోతున్నాం’అని తెలిపారు. ‘లెబనాన్‌లో శాంతి కోసం కృషి చేస్తున్నాం. అయితే, ఇరాన్‌తో యుద్ధం తీవ్రతరం కావడంతో మా దృష్టంతా అటువైపు ఉంది. ఇరాన్ యుద్ధం పశ్చిమాసియాలో అస్థిరతను సృష్టించింది. యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ నాయకుడితో చర్చలపై నాకు పెద్దగా ఆసక్తి లేదు’అని ట్రంప్ అన్నారు. కాగా, 2009 తర్వాత లెబనాన్ అధ్యక్షుడు వైట్ హౌస్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి. -
ఇరాన్ దెబ్బకు అమెరికా విలవిల
-
భారతీయులకు ట్రంప్ బిగ్ షాక్.. ఇక అమెరికా ఆశలు గల్లంతే
-
ఓడరేవులే టార్గెట్ గా అమెరికా భీకర దాడులు
-
నెతన్యాహుకు ట్రంప్ కవచం.. అమెరికా గడ్డపై అది అసాధ్యం!
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ‘అరెస్ట్ వ్యవహారం’ అమెరికాలో ఈసారికి రాజకీయ దుమారం రేపుతోంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ నేపథ్యంలో.. న్యూయార్క్ పర్యటనకు వస్తే నెతన్యాహును అరెస్ట్ చేసే అవకాశం ఉందని నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలకు స్వయానా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి కౌంటర్ ఇచ్చారు.‘‘బెంజమిన్ నెతన్యాహు అమెరికాలో ఎక్కడా, ఎప్పుడూ అరెస్ట్ కాబోరు’’ అంటూ ట్రంప్ స్పష్టం చేశారు. సెప్టెంబర్‌లో ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాల కోసం నెతన్యాహు న్యూయార్క్‌కు వచ్చే అవకాశం ఉండటంతో ఈ అంశం తెరపైకి వచ్చింది.‘అరెస్ట్ చేయాలనే ప్రశ్నే లేదు’.. ట్రంప్ స్పష్టంనెతన్యాహు అమెరికా పర్యటనపై చర్చ జరుగుతున్న వేళ.. ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అమెరికా భూభాగంలో ఇజ్రాయెల్ ప్రధానిని అరెస్ట్ చేసే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని పేర్కొన్నారు. ఇటీవల ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ పాత్రను కూడా ట్రంప్ ప్రశంసించారు. అయితే న్యూయార్క్ మేయర్ మమ్దానీ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. ఆయన వ్యాఖ్యలకు సమాధానంగానే ట్రంప్ ప్రకటన వెలువడినట్లు భావిస్తున్నారు.మమ్దానీ వ్యాఖ్యలతో మొదలైన వివాదంన్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నెతన్యాహు నగరానికి వస్తే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో పరిశీలిస్తున్నామని తెలిపారు. ‘‘నెతన్యాహు ది హేగ్‌లో ఉండాల్సిన వ్యక్తి’’ అని వ్యాఖ్యానించిన ఆయన.. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆయనపై వారెంట్ జారీ చేసిందని గుర్తుచేశారు. అయితే అదే సమయంలో చట్టాలకు లోబడే తాము పనిచేస్తామని కూడా మమ్దానీ స్పష్టం చేశారు. రాజకీయ అభిప్రాయాల ఆధారంగా కాకుండా.. న్యూయార్క్ చట్టాలు, అమెరికా నిబంధనల ప్రకారమే నిర్ణయం ఉంటుందని తెలిపారు.ఐసీసీ వారెంట్ చుట్టూ వివాదంగాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలకు సంబంధించి ఆరోపణలపై 2024లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే ఇజ్రాయెల్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. ఐసీసీకి తమపై అధికార పరిధి లేదని పేర్కొంది. ఇదిలా ఉండగా.. అమెరికా, ఇజ్రాయెల్ రెండూ ఐసీసీని ఏర్పాటు చేసిన రోమ్ ఒప్పందంలో భాగస్వాములు కావు. దీంతో ఐసీసీ వారెంట్లను అమలు చేయాల్సిన చట్టపరమైన బాధ్యత అమెరికాకు లేదని నిపుణులు చెబుతున్నారు.ఇజ్రాయెల్ ఆగ్రహంమమ్దానీ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ కూడా తీవ్రంగా స్పందించింది. ఐసీసీని ‘నకిలీ న్యాయస్థానం’గా అభివర్ణిస్తూ.. నెతన్యాహుపై జారీ చేసిన వారెంట్ అసంబద్ధమని పేర్కొంది. మమ్దానీ దేశీయ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది.సెప్టెంబర్ పర్యటనపై ఉత్కంఠప్రతి ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాలకు ప్రపంచ దేశాల నేతలు న్యూయార్క్‌కు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో నెతన్యాహు గత రెండేళ్ల పర్యటనల సందర్భంగా.. ఇలాంటి చర్చే నడుస్తూ వస్తోంది. అరెస్ట్ భయంతోనే ఆయన ప్రత్యామ్నాయ మార్గాల్లో.. అతి గోప్యంగా న్యూయార్క్‌కు చేరుకుంటున్నారనే చర్చా జరుగుతోంది. అంతేకాదు.. ఐరాసలోనూ ఆయనకు ‘నిరసన గళం’తో చేదు అనుభవం ఎదురవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో.. మామ్దానీ కామెంట్ల నేపథ్యంలో ఈసారి పర్యటనపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఐసీసీ వారెంట్.. మరోవైపు అమెరికా రక్షణగా నిలవడం.. ఇంకోవైపు న్యూయార్క్ మేయర్ వ్యాఖ్యలు.. ఈ పరిణామాలతో నెతన్యాహు అమెరికా పర్యటన అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. -
స్పెయిన్ చేతిలో ట్రోఫీ.. ట్రంప్‌ను ఆటాడుకున్నారు!
ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో స్పెయిన్ చారిత్రక విజయం సాధించిన వేళ.. అసలు మ్యాచ్ కంటే ట్రోఫీ ప్రదానోత్సవమే ఎక్కువగా చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేదికపైకి రావడం, ఆ తర్వాత ట్రోఫీ లిఫ్ట్ సమయంలో అక్కడే నిలబడిపోవడం సోషల్ మీడియాలో సెటైర్లకు కారణమైంది.న్యూజెర్సీ: అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి స్పెయిన్ రెండోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. మ్యాచ్ అనంతరం న్యూయార్క్–న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ట్రోఫీ ప్రదానోత్సవానికి ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినోతో కలిసి ట్రంప్ మైదానంలోకి వచ్చారు. అయితే ట్రంప్ ఎంట్రీకి ప్రేక్షకుల్లోని ఓ వర్గం నుంచి భారీగా ‘బూస్’(నిరసన నినాదాలు) వినిపించాయి. కొద్దిసేపటికే ప్రేక్షకులు చల్లబడ్డా.. ఆ తర్వాత జరిగిన పరిణామం మాత్రం వైరల్‌గా మారింది.ట్రోఫీ ఇచ్చి అలాగే.. స్పెయిన్ కెప్టెన్ రోడ్రికి ట్రంప్ వరల్డ్‌కప్ ట్రోఫీ అందించారు. సాధారణంగా ట్రోఫీ అందుకున్న కెప్టెన్ తన జట్టుతో కలిసి దానిని ఎత్తి సంబరాలు చేసుకుంటాడు. అదే సమయంలో ట్రంప్ అక్కడి నుంచి తప్పుకోవాల్సి ఉండగా.. కొద్దిసేపు ఆటగాళ్ల మధ్యే నిలబడి ఉన్నారు. దీంతో అధికారులు సంకేతాలు ఇవ్వడంతో ట్రంప్ పక్కకు జరిగారు. ఆ తర్వాత రోడ్రి తన సహచరులతో కలిసి ప్రపంచకప్ ట్రోఫీని పైకెత్తి ఘనంగా సంబరాలు చేసుకున్నారు.President Donald J. Trump presents the World Cup Trophy to Spain, the 2026 @FIFAWorldCup Champions! 🏆 pic.twitter.com/SHsoBhYm1b— The White House (@WhiteHouse) July 19, 2026ఈ చిన్న ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. ‘‘ట్రోఫీ ఇచ్చారు కానీ ఫోటోలో ఉండాలనుకున్నారు’’ అంటూ నెటిజన్లు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.క్లబ్ వరల్డ్‌కప్ ఘటన గుర్తొచ్చిందా?ఈ ఘటనపై గతంలో జరిగిన క్లబ్ వరల్డ్‌కప్ ఫైనల్ ట్రోఫీ వేడుకను కూడా పలువురు గుర్తు చేస్తున్నారు. అప్పట్లోనూ ట్రంప్ విజేత జట్టు ఆటగాళ్లతో కలిసి స్టేజ్‌పై ఎక్కువసేపు ఉండటంపై చర్చ జరిగింది. అయితే ఈసారి ఫిఫా ప్రోటోకాల్ ప్రకారం చివరకు ఆయన పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.స్పెయిన్ చరిత్ర.. వేదికపై ట్రంప్ హైలైట్ఇక ఫైనల్ మ్యాచ్‌లో ఫెర్రాన్ టోరెస్ అదనపు సమయంలో చేసిన గోల్‌తో స్పెయిన్‌కు విజయం దక్కింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో అర్జెంటీనా ఆటగాడు ఎంజో ఫెర్నాండెజ్ రెడ్‌కార్డ్‌తో బయటకు వెళ్లడంతో ఆ జట్టు 10 మందితో మ్యాచ్‌ను ముగించింది. లియోనెల్ మెస్సీ వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలవాలన్న కల నెరవేరలేదు. స్పెయిన్ ఆటగాళ్లు చరిత్ర సృష్టించిన రాత్రి.. ట్రోఫీ వేడుకలో ట్రంప్ ఎపిసోడ్ కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. -
ఫ్యామిలీకి అదే చివరి కాల్ అనుకున్నా.. ఇరాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో శాంతి చర్చలు జరుపుతున్న సమయంలో ఇరాన్ ప్రతినిధులు తీవ్ర ప్రమాద పరిస్థితుల్లో పనిచేశారని ఆయన వెల్లడించారు. మేము ఎప్పుడు చనిపోతామో.. మాపై బాంబులు ఎప్పుడు వేస్తారోననే భయంతో వణికిపోయినట్టు చెప్పుకొచ్చారు.ఇరాన్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరాఘ్చి మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్య ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్తో జరిగిన సంభాషణను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన.. ‘చర్చలు జరుగుతున్న సమయంలో ఏ క్షణంలోనైనా సమావేశంపై బాంబు దాడి జరగొచ్చనే భయం ఉండేది. కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇది చివరి సంభాషణ కావచ్చేమో అన్న ఆలోచన వచ్చేది’ అని తెలిపారు.అనంతరం.. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి వస్తున్న ఒత్తిళ్లకు ఇరాన్ తలొగ్గలేదని ఆయన స్పష్టం చేశారు. అణు కార్యక్రమంలో యురేనియం ఎన్రిచ్మెంట్ను పూర్తిగా నిలిపివేయాలన్న డిమాండ్‌ను అంగీకరించలేదని, తమ హక్కుల విషయంలో వెనక్కి తగ్గబోమని పేర్కొన్నారు. ‘చర్చలు జరపాలి.. బెదిరింపులు లేదా ప్రలోభాలతో మమ్మల్ని మార్చలేరు’ అని అరాఘ్చి వ్యాఖ్యానించారు. చర్చల ద్వారా తమ లక్ష్యాలను సాధించలేమని భావించిన తర్వాతే అమెరికా యుద్ధ మార్గాన్ని ఎంచుకుందని ఆయన ఆరోపించారు. అమెరికా సైనిక ఒత్తిడితో ఇరాన్‌ను లొంగదీయవచ్చన్న వాదనలను కూడా అరాఘ్చి ఖండించారు. ‘ఇరాన్ వెనిజులా కాదు. ఒక నాయకుడిని తొలగిస్తే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోదు. ఇరాన్లో అధికార వ్యవస్థ అనేక స్థాయిల్లో పనిచేస్తుంది’ అని ఆయన అన్నారు.ఇదిలా ఉండగా, అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్‌పై వరుసగా తొమ్మిదో రోజు వైమానిక దాడులు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులకు ఉపయోగిస్తున్న ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే తమ లక్ష్యమని అమెరికా తెలిపింది. మరోవైపు ఇరాన్ మీడియా ప్రకారం.. తబ్రిజ్, చాబహార్, కొనారక్, బందర్ మహ్షహర్ తదితర ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్లు సమాచారం వెలువడింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కూడా సిరియాలోని అల్-తన్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా ప్రత్యేక ఆపరేషన్స్ కేంద్రంపై దాడి చేసినట్లు ప్రకటించింది. -
ఇరాన్ యుద్ధం తీవ్రరూపం.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక
మధ్యప్రాచ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు కొనసాగుతున్న వేళ, ఇరాక్‌లో జరిగిన ఓ ఆపరేషన్‌లో అమెరికా సైనికుడు మరణించగా, మరో సైనికుడు గాయపడ్డాడు. దీంతో, ఇరాన్‌పై దాడుల మరింత పెంచాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలిచ్చారు. ఇదే సమయంలో ఇరాన్‌కు ప్రయాణాలను నివారించాలని, ఇప్పటికే అక్కడ ఉన్న భారతీయులు భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేశం విడిచి రావడాన్ని పరిశీలించాలని భారత్ సూచించింది.అమెరికా సైనికుడు మృతిఅమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం, ఉత్తర ఇరాక్‌లో కూలిపోయిన ఇరాన్‌కు చెందిన ఒక డ్రోన్లోని పేలని ఆయుధ భాగాలను నిర్వీర్యం చేసే సమయంలో అమెరికా సైనికుడు ప్రాణాలు కోల్పోగా, మరో సైనికుడు స్వల్పంగా గాయపడ్డాడు. జూలై 18న ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో సైనికుల వివరాలను వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చిన తర్వాత వెల్లడిస్తామని CENTCOM తెలిపింది. ఈ తాజా మరణంతో గత దాదాపు ఐదు నెలలుగా కొనసాగుతున్న ఘర్షణల్లో మరణించిన అమెరికా సైనికుల సంఖ్య 17కు చేరింది.ఇరాన్‌పై వరుస దాడులుఉద్రికత్తల నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా మరోసారి వైమానిక దాడులు ప్రారంభించింది. ఇది వరుసగా తొమ్మిదో రాత్రి దాడులుగా CENTCOM పేర్కొంది. హర్మూజ్ జలసంధి ద్వారా ప్రయాణించే వాణిజ్య నౌకలు, పౌర నావికులపై దాడులకు ఉపయోగిస్తున్న ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే తమ లక్ష్యమని అమెరికా తెలిపింది. అయితే తాజా దాడుల్లో ఏ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారో, ఎంత నష్టం జరిగిందో అమెరికా అధికారులు ఇంకా వెల్లడించలేదు. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు అక్కడి మీడియా తెలిపింది.ఇరాన్ ప్రయాణంపై భారత్ కీలక సూచనపశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం భారత పౌరులకు ప్రయాణ సూచన జారీ చేసింది. ఇరాన్‌కు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని భారత్ కోరింది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు తమ భద్రతను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా దేశం విడిచి వెళ్లే అవకాశాలను పరిశీలించాలని సూచించింది. ఇరాన్లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని, తాజా భద్రతా పరిస్థితులను గమనించాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.బహ్రెయిన్‌లో అమెరికా పౌరులకు హెచ్చరికఇదే సమయంలో బహ్రెయిన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కూడా భద్రతా హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ నుంచి ముప్పు ఉందని సమాచారం అందినట్లు పేర్కొంది. అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
ట్రంప్ పోస్టులు ముందుగా చూడాలంటే రూ.85 లక్షలు ఇవ్వాలి..
వాషింగ్టన్: ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ ‘పెయిడ్ డేటా సర్వీస్ ప్లాన్’ను ప్రకటించింది. దీని ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ట్రూత్ సోషల్లోని ప్రముఖ ఖాతాల పోస్టులు అత్యంత వేగంగా అందుతాయి. ట్రూత్ ఏపీఐ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్.. ప్రభావం ఎక్కువగా చూపే 10 ఖాతాల కంటెంట్‌ను బ్యాంకులు, హెడ్జ్ ఫండ్లు, ట్రేడింగ్ సంస్థలకు సాధారణ యాప్ నోటిఫికేషన్ల కంటే వేగంగా అందిస్తుంది. ట్రూత్ ఏపీఐ సేవ ధర $60,000 నుంచి $100,000 మధ్య (సుమారు రూ.51 లక్షల నుంచి రూ.85 లక్షల మధ్య) ఉండొచ్చని సమాచారం.రాయిటర్స్ నివేదిక ప్రకారం.. కొన్ని సెకన్ల ఆలస్యం కూడా ఆర్థికంగా కొందరికి నష్టాలను తెచ్చిపెడుతుంది. అటువంటి ఖాతాదారులను దృష్టిలో పెట్టుకుని ఈ సర్వీస్ రూపొందించారు. తాజా సమాచారం వచ్చిన వెంటనే చర్యలు తీసుకునే ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ సంస్థలు ఇందులో ఉన్నాయి. ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు ముందే నిర్ణయించిన నియమాల ఆధారంగా ఆటోమేటిక్‌గా కొనుగోలు, అమ్మకాలు చేసే విధానం.ఇప్పటి వరకూ ఇలాంటి సంస్థలు ట్రూత్ సోషల్ను అందరిలాగే గమనించేవి లేదా ప్లాట్‌ఫాం నిబంధనలకు విరుద్ధంగా డేటాను సేకరించేవి. ట్రూత్ ఏపీఐ ఆ లోటును భర్తీ చేసే పరిష్కారంగా తీసుకొచ్చారు. సోషల్ మీడియా వ్యాపారానికి బయట కొత్త ఆదాయ మార్గాన్ని ఓపెన్ చేయాలనే లక్ష్యంతో డేటా లైసెన్సింగ్‌లో ట్రంప్ మీడియా వేసిన తొలి అధికారిక అడుగు ఇదే. ప్లాట్‌ఫాంలో వచ్చే పోస్టులకు మార్కెట్లు ఇప్పటికే స్పందిస్తున్నాయని, వేగంగా సమాచారం పొందాలనే డిమాండ్ పెరుగుతుందని తాత్కాలిక సీఈవో కెవిన్ మెక్‌గర్న్ తెలిపారు.ఇందుకే పోస్టులను వేగంగా చదవాలి ట్రంప్ పోస్టులు సుంకాల ప్రకటనల నుంచి చైనా వాణిజ్య విధానంపై వ్యాఖ్యల వరకు ఎన్నో సందర్భాల్లో మార్కెట్లపై ప్రభావం చూపించాయి. 2025 ఏప్రిల్ 9న కొత్త సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఆయన పోస్టు చేసిన వెంటనే వాల్ స్ట్రీట్ సూచీలు భారీగా ఎగిశాయి.మార్కెట్ వర్గాలు కూడా ఈ ప్రభావాన్ని అంగీకరిస్తున్నాయి. ట్రూత్ సోషల్‌లో మార్కెట్‌ను నిరంతరం ప్రభావితం చేసేది ట్రంప్ ఒక్కరేనని ఒక ఫండ్ మేనేజర్ చెప్పారు. అందుకే ఆయన పోస్టులు ముందుగానే అందడం అత్యంత విలువైనదిగా భావిస్తున్నారు.అయితే ఈ చెల్లింపు సర్వీసు అసమానతలను పెంచుతుందని విమర్శకులు అంటున్నారు. వేగంగా సమాచారం అందడం వల్ల భారీ నిధులు ఉన్న సంస్థలకు, చిన్న సంస్థలపై పైచేయి లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. సెనేటర్ రాన్ వైడెన్ ఈ చర్య వల్ల ట్రంప్ కుటుంబానికి ఆర్థిక లాభం చేకూరడంతో పాటు వాల్ స్ట్రీట్ లాభాలు కూడా పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్థాయుల వారీగా డేటా అందించడం కొత్త విషయం కాదు. ఇది సెక్యూరిటీస్ చట్టాలను ఉల్లంఘించకపోవచ్చు. అయినా సమాన అవకాశాలపై సందేహాలు తలెత్తొచ్చు. ఈ సర్వీసు రోజంతా పర్యవేక్షణ సౌకర్యంతో పాటు 2022 నుంచి ఉన్న పాత పోస్టుల భద్రపరిచిన రికార్డులను కూడా అందిస్తుంది. ఆగస్టు 1న ప్రారంభం కానున్న ఈ సేవకు ఇప్పటికే తొలి ఖాతాదారులు చేరారు. రాజకీయ ప్రభావాన్ని ఆదాయంగా మార్చే ప్రయత్నాలను ట్రంప్ మీడియా మరింత దూకుడుగా విస్తరిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. -
ఇరాన్‌పై అమెరికా ఉక్కుపాదం.. దాడికి దాడే సమాధానం..
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో జరిపిన దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఆదివారం తెల్లవారుజామున ఇరాన్‌పై అమెరికా తాజాగా మరోసారి భీకర వైమానిక దాడులు నిర్వహించింది.అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం, జోర్డాన్ దాడిలో మరో అమెరికా సైనికుడు ఇంకా గల్లంతయ్యాడు. నలుగురు గాయపడగా చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చే వరకు వారి పేర్లను వెల్లడించబోమని సెంట్కామ్ తెలిపింది. అలాగే, హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, జోర్డాన్ దాడికి బాధ్యులైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) బలగాలనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా వెల్లడించింది.🚨 Cluster missiles from Iran are raining down on U.S. military bases in Bahrain and Jordan.In one of the fiercest attacks on the Epstein Club since the war began... pic.twitter.com/c5RYWJ7gp3— IRGC (@IRGC_NEWS) July 18, 2026ఈ సందర్భంగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ.. ఇద్దరు అమెరికా సైనికుల మరణం తమ సంకల్పాన్ని మరింత బలపరిచిందని, దీనికి తగిన ప్రతిస్పందన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఇరాన్‌కు చెందిన మెహర్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం, దక్షిణ ఇరాన్‌లోని సిరిక్ పోర్టు నగరంతో పాటు హాజీబాద్ సమీప ప్రాంతాలపై అమెరికా దాడులు జరిపింది. అయితే ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు.మరోవైపు, ఇరాన్ సుప్రీం నాయకుడు మొజ్తబా ఖమేనీ అమెరికాకు "మరచిపోలేని గుణపాఠం నేర్పుతాం" అంటూ హెచ్చరించారు. అమెరికా ఒప్పందాలను పదేపదే ఉల్లంఘిస్తోందని, అధ్యక్షుడు ట్రంప్ హామీలకు విశ్వసనీయత లేదని ఆయన విమర్శించారు. హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నిస్తోందని ఇరాన్ ఆరోపిస్తుండగా.. వాణిజ్య నౌకలను ఇరాన్ బెదిరిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.After death of 2 American soldiers in Jordan due to Iranian missile strikes, US forces launched a massive strikes campaign against IRGC targets across Iran. Currently over 30 US fighter jets are hitting the IRGC targets across Iran. pic.twitter.com/fjNH7MxQh2— Baba Banaras™ (@RealBababanaras) July 19, 2026ఇక గల్ఫ్ దేశాలు పరిస్థితిని అత్యంత నిశితంగా గమనిస్తున్నాయి. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అన్ని పక్షాలు వెంటనే కాల్పులు నిలిపి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మరోసారి పిలుపునిచ్చింది.🚨 U.S. President Donald Trump has reportedly ordered CENTCOM to “open the gates of hell” on Iran following the deaths of American service members in Jordan.U.S. officials say tonight’s strikes are expected to be significantly larger than previous rounds.Meanwhile, U.S.… pic.twitter.com/G5jhqPtgcQ— The Iran Watcher 🇮🇷 (@TheIranWatcher) July 18, 2026 -
కొనసాగిన దాడుల పర్వం
దుబాయ్: ఇరాన్‌తో తాత్కాలిక శాంతి ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజు నుంచి వరుసగా ఏడోరోజూ ఇరాన్‌పై అమెరికా సేనలు రాత్రిపూట దాడులను శనివారమూ కొనసాగించాయి. దీంతో ఇరాన్‌వ్యాప్తంగా అమెరికా దాడుల్లో గత ఏడు రోజుల్లో చనిపోయిన ఇరానియన్ల సంఖ్య 50కి పెరిగిందని ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం ప్రకటించింది. జూన్ 27 తర్వాత అమెరికా మొదలెట్టిన భీకర దాడుల్లో ఇప్పటిదాకా 500 మందికిపైగా గాయపడ్డారు. శనివారం సైతం ఇరాన్‌లోని మౌలిక వసతులు, సైనిక లక్ష్యాలపై అమెరికా పదులకొద్దీ ఆత్మాహుతి డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడి భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించింది. నిఘా ప్రాంతాలు, సాయుధ ఉపకరణాలు, రహదారులు, వంతెనలు, భూగర్భ ఆయుధాగారాలు, నావికాదళ సామర్థ్యాలను నాశనంచేశామని శనివారం ఉదయం అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అమెరికా దాడిలో దక్షిణ ఇరాన్‌లోని డీసాలినేషన్ ప్లాంట్ ధ్వంసమైంది.దీంతో ఈ ప్లాంట్ నుంచి 20 గ్రామాలకు తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో జనం అల్లాడిపోయారని హార్మూజన్ ప్రావిన్స్ డెప్యూటీ గవర్నర్ ఇస్లాయిల్ దెహస్తానీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిదాడులు ఆరంభించిన ఇరాన్.. దాడులకు ఇరాన్ దీటుగా బదులిచ్చింది. అమెరికా పేట్రేగిపోతున్నా మౌనం దాల్చిన దాని మిత్రదేశాలపై ఇరాన్ క్షిపణులకు పనిజెప్పింది. దీంతో కువైట్‌లోని నీటి శుద్ధీకరణ(డీసాలిలేషన్)ప్లాంట్, విద్యుత్‌ఉత్పత్తి కేంద్రాలు పేలుళ్లతో మార్మోగిపోయాయి. చమురుశుద్ధి కర్మాగారంపై దాడిలో పలువురు కువైట్ సిబ్బంది గాయాలపాలయ్యారు. దాడులతో పల విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాల్లో ఉత్పత్తిని వెంటనే నిలిపేశారు. కువైట్‌లోని డీసాలినేషన్ ప్లాంట్లపై ఇరాన్ దాడిచేయడం వరుసగా ఇది రెండోరోజు. కువైట్ తన తాగునీటి అవసరాల కోసం 90 శాతం డీసాలినేషన్ ప్లాంట్ల మీదనే ఆధారపడుతోంది. ఇరాన్ దాడుల కారణంగా మంటల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు అగ్నిమాపక సిబ్బంది,కారి్మకులు గాయపడ్డారని కువైట్ ఫైర్ ఫోర్స్ తెలిపింది. క్షిపణులు పడుతుండటంతో ముందు జాగ్రత్తగా విమానాశ్రయాల నుంచి రాకపోకలను కువైట్ నిలిపేసింది. ఇరాక్‌లోని ఇర్బిల్ నగరంపైనా ఇరాన్ డ్రోన్లను ప్రయోగించింది. ఇరాన్ మిస్సైళ్లను విజయవంతంగా అడ్డుకున్నామని జోర్డాన్ ప్రకటించింది. బహ్రెయిన్‌లో ముందుజాగ్రత్తగా సైరన్లు మోగించి ప్రజలను ప్రభుత్వం అప్రమత్తంచేసింది. సౌదీ అరేబియా సైతం రెండు ప్రాంతాల్లో హెచ్చరికలగా సైరన్లు మోగించి తర్వాత నిలిపేసింది. అమెరికా సేనలకు ఆశ్రయం కల్పించే ప్రతి పశ్చిమాసియా దేశంపై దాడులు కొనసాగుతాయని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్(ఐఆర్జీసీ) శనివారం పునరుద్ఘాటించింది.మర్చిపోలేని గుణపాఠం చెప్తాం: మొజ్తబా అమెరికాకు ఖమేనీ హెచ్చరిక దుబాయ్: తమ దేశంపై ఇంకా దాడులు కొనసాగిస్తే మర్చిపోలేని గుణపాఠం చెప్తామని అమెరికాను ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ ఘాటుగా హెచ్చరించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. దీన్ని ప్రభుత్వ టీవీ ఛానల్లో చదివి వినిపించారు. తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత నూతన సుప్రీంలీడర్‌గా నియమితుడైన మొజ్తబా ఖమేనీ ఇప్పటిదాకా బహిరంగంగా ప్రజలకు కనిపించలేదు. మధ్యంతర ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంతకం విలువలేనిది, చెల్లనిది అని మొజ్తబా తేల్చిచెప్పారు. జోర్డాన్‌పై దాడిలో ఇద్దరు అమెరికా సైనికుల మృతి దుబాయ్: జోర్డాన్‌లోని తమ స్థావరాలపై ఇరాన్ శనివారం జరిపిన దాడిలో ఇద్దరు సైనికులు చనిపోయారని, ఒకరి జాడ గల్లంతైందని అమెరికా సైన్యం ప్రకటించింది. గత కొంతకాలంగా జరుగుతున్న ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికులు చనిపోవడం ఇదే తొలిసారి. ఇరాన్ నుంచి దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను నిలువరించేందుకు అమెరికా, జోర్డాన్ సైనిక సిబ్బంది ప్రయత్నిస్తుండగా తమ సైనికులు ప్రాణాలు కోల్పోయారని అమెరికా శనివారం పేర్కొంది. ఇరాన్ దాడుల్లో నలుగురు సైనికులు సైతం గాయపడ్డారు. వాళ్లకు సమీప ఆస్పత్రుల్లో ప్రథమ చికిత్స చేసి డిశ్చార్జ్‌చేశారు. చనిపోయిన ఇద్దరు అమెరికా సైనికుల పూర్తి వివరాలను సైన్యం ఇంకా బయటపెట్టలేదు. -
ఇరాన్ పై భారీ వైమానిక దాడులకు ట్రంప్ ప్లాన్
వాషింగ్టన్ డీసీ: ఇరాన్‌పై పెద్దఎత్తున దాడులకు ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం అందుతోంది.ఈ మేరకు వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి దేశానికి చెందిన మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలే టార్గెట్‌గా దాడులు జరపాలని అందుకు గానూ పెద్దఎత్తున గగనతల ఇంధన సరఫరా విమానాలను ఇజ్రాయెల్ పంపినట్లు ఆక్సియోస్ కథనాలు ప్రచురించింది. కాగా ఇదివరకే ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ సమీపంలో ఉన్న బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయం ,దక్షిణ ఇజ్రాయెల్‌లోని రామోన్ ఎయిర్‌పోర్టులలో పదుల సంఖ్యలో ఇంధన సరఫరా విమానాలున్నాయి. అయితే వీటికి అదనంగా భారీగా రీప్యూయలింగ్ విమానాలను పంపేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.దాడులు ప్రధానంగా అణుఇంధన కేంద్రాలు, విద్యుత్ ప్లాంట్లు, ఇతర వ్యూహాత్మక లక్ష్యాలపై ఉండనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ట్రంప్ తుది నిర్ణయం తీసుకోనప్పటికీ దాడికి ప్రణాళికలు ఖచ్చితంగా రచించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘ దూరం ప్రయాణించి దాడులు చేసే యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపడానికి ఈ ట్యాంకర్ విమానాలు చాలా కీలకం.కాగా ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఇటీవల పూర్తిగా విఫలమైంది. దీంతో దౌత్యపరమైన చర్చలు ఆగిపోయి, మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇరాన్ సైతం ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. -
డొనాల్డ్ ట్రంప్‌ను హతమారిస్తే. రూ. 96కోట్లు
ఇరాన్‌పై వరుసగా ఏడవ రాత్రి కూడా అమెరికా దాడులు నిర్వహించింది. ఇరాన్ సైనిక సామర్థ్యాలను మరింత బలహీనపరిచేలా ఈ దాడులు జరిగాయని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) శుక్రవారం నాటి ప్రకటనలో పేర్కొంది. మరోవైపు అమెరికా యుద్ధ విమానాల్ని కూల్చి వేశామని, మరికొన్నింటికి తీవ్ర నష్టాన్ని కలిగించామని ఇరాన్ గురువారం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇరాన్ మద్దతు ఉన్న ఇరాకీ మిలీషియా (సాయుధ ముఠాల) సంకీర్ణ కూటమి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల (సుమారు 96.28 కోట్ల రూపాయలు) బహుమతిని ఇస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన రగులుతున్న ఇప్పటికే యుద్ధ జ్వాలలకు మరింత ఆజ్యం పోసింది. డొనాల్డ్ ట్రంప్‌ను చంపిన వారికి లేదా ఆ ఆపరేషన్‌కు నిధులు సమకూర్చిన వారికి, సహాయం చేసిన వారికి ఈ బహుమతి అందుతుందని 'ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్' (IRI) తెలిపింది. ఈ 10 మిలియన్ డాలర్ల మొత్తాన్ని తమ సభ్యులు, మద్దతుదారుల నుండి సేకరించిన విరాళాల ద్వారా సమకూర్చినట్లు వారు పేర్కొన్నారు. అయితే దీనిని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు చూపలేదు.ఇటీవల వైట్ హౌస్‌లో ఇరాక్ ప్రధాన మంత్రి అలీ అల్-జైదీతో జరిగిన సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ... 2020లో ఇరాన్ అగ్ర సైనిక కమాండర్ మేజర్ జనరల్ ఖాసీం సులేమానీ, ఇరాకీ మిలీషియా నాయకుడు అబూ మహదీ అల్-ముహందిస్లను చంపడంలో తన పాత్రను బహిరంగంగా ప్రస్తావించారు. దీనికి ప్రతిచర్యగా ఐఆర్ఐ ఈ ప్రకటన చేసింది.ఇరాక్, సిరియా , గల్ఫ్ ప్రాంతంలోని ఇతర చోట్ల ఉన్న అమెరికా దళాలు, దౌత్య కార్యాలయాలు మరియు మిత్రదేశాలపై వందలాది డ్రోన్, రాకెట్, క్షిపణి దాడులకు ఈ గ్రూపులే కారణమని అమెరికా ఆరోపిస్తోంది. ప్రస్తుత అమెరికా-ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో, ఇరాన్ సరిహద్దుల వెలుపల తన సైనిక ఒత్తిడిని కొనసాగించడానికి టెహ్రాన్‌కు ఈ మిలీషియాలు ప్రధాన ఆయుధాలుగా మారాయి. -
విదేశీ ట్రక్కు డ్రైవర్లకు ఉద్వాసన: ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలో వలసదారులైన డ్రైవర్లలో గుబులు మొదలైంది. వారి స్థానంలో అమెరికన్ మాజీ సైనికులను నియమించాలన్న ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెరపైకి తీసుకొచ్చారు. వలసవచ్చి డ్రైవర్లుగా పనిచేస్తున్న వారిలో చాలామంది మత్తుమందులు, మద్యం ప్రభావంతో అనేక ప్రమాదాలకు కారణమవుతున్నారని ఆయన ఆరోపించారు. వారివల్ల ప్రజల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆ డ్రైవర్లను తొలిగించాలని స్పష్టం చేశారు. ఒకవేళ ట్రంప్ ప్రతిపాదన అమల్లోకి వస్తే అమెరికాలోని భారతీయ వలసదారులకు నష్టం తప్పదని ఆందోళన వ్యక్తమవుతోంది. వీరిలో వేలాది మంది ఇటీవలి కాలంలో రవాణా రంగంలో ప్రవేశించారు. అమెరికాలో దాదాపు లక్షన్నర మంది భారతీయులు డ్రైవర్లుగా పని చేస్తున్నట్లు అంచనా. వీరిలో ఎక్కువ మంది పంజాబ్, హరియాణాకు చెందినవారే ఉన్నారు. తాజాగా పెన్సిల్వేనియాలో జరిగిన సైనిక పెట్టుబడుల సదస్సులో ట్రంప్ మాట్లాడారు. వలసదారులైన ట్రక్కు డ్రైవర్లపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. వీరిలో చాలామంది అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినవారే కాకుండా, భారీ ట్రక్కులను నడపడానికి సరైన పత్రాలు, లైసెన్సులు వారివద్ద లేవని తెలిపారు. అలాంటి డ్రైవర్లు అమెరికాలో ఉండడంతమకు ఇష్టం లేదన్నారు. నిబంధనలు తెలియనివారిని, మద్యం మత్తులో వాహనాలు నడిపేవారిని ఎలా భరించాలని ప్రశ్నించారు. విదేశీ డ్రైవర్ల స్థానంలో అమెరికా మాజీ సైనికులను నియమించాలని భావిస్తున్నట్లు స్పష్టంచేశారు. -
ఇరాన్‌పై నిప్పుల వర్షం
దుబాయ్: పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య దాడులు నానాటికీ తీవ్రతరం అవుతున్నాయి. తాత్కాలిక శాంతి ఒప్పందం అకస్మాత్తుగా ముగిసిన తర్వాత రెండు దేశాలు పరస్పరం కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ప్రధానంగా హార్మూజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగుతున్నాయి. హార్మూజ్‌పై టెహ్రాన్ పట్టును సడలించేలా ఒత్తిడి పెంచడానికి బలప్రయోగం తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా గురువారం అర్ధరాత్రి తర్వాత అమెరికా తన వైమానిక దాడుల పరంపరను మరింత ఉధృతంచేసింది. ఇరాన్లో కీలక వంతెనలు, విద్యుత్ వ్యవస్థలపై దాడి చేయడంతోపాటు గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో చాబహార్ ఓడరేవు వద్ద ముఖ్యమైన నిఘా టవర్‌ను కూల్చివేసింది. ఇరాన్ సైతం వెంటనే ప్రతిదాడికి దిగింది. ఖతార్, కువైట్, జోర్డాన్‌పై క్షిపణులు ప్రయోగించింది. బహ్రెయిన్, ఒమన్, సిరియాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. కువైట్‌లో విద్యుత్, నీటి శుద్ధి ప్లాంట్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెద్ద సంఖ్యలో విద్యుత్ ఉత్పాదన యూనిట్లకు నష్టం వాటిల్లిందని కువైట్ ఆందోళన వ్యక్తంచేసింది. గల్ఫ్‌లో అమెరికా యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) ప్రకటించింది. జోర్డాన్‌లో మోహరించిన అమెరికా యుద్ధ విమానాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి, డ్రోన్ దాడులు జరిపినట్లు స్పష్టంచేసింది. ఈ దాడుల్లో పలు అమెరికన్ యుద్ధ విమానాలు, గగనతల ఇంధన సరఫరా విమానాలు ధ్వంసం కాగా, మరికొన్ని తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. అయితే, తమ భూభాగం మీదుగా వచ్చిన మూడు క్షిపణులను అడ్డుకొని, కూల్చివేసినట్లు జోర్డాన్ సైన్యం తేల్చిచెప్పింది. విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లోని దక్షిణ హార్మూజ్గాన్ ప్రావిన్స్‌లో వంతెనలపై అమెరికా సైన్యం వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో కనీసం ఏడుగురు మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ టీవీ వెల్లడించింది. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ తీర నగరమైన బందర్ ఖమీర్పైనా దాడులు జరిగాయి. ప్రధాన రహదారులు, రైల్వే వంతెనలను కూడా విడిచిపెట్టలేదు. ప్రధాన రేవు పట్టణమైన బందర్ అబ్బాస్, రాజధాని టెహ్రాన్ మధ్య అనుసంధానం లేకుండా చేయడమే అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది. తమ దేశంలో విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడులు జరిగినట్లు ఇరాన్ అంగీకరించింది. దక్షిణ ప్రావిన్స్‌లలో ప్రజలు విద్యుత్‌ను చాలా పొదుపుగా వాడుకోవాలని ఇరాన్ ఇంధన మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. టార్గెట్ చాబహార్ పోర్టు! ఇరాన్లో పదుల సంఖ్యలో లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు అమెరికా సైనిక దళాల సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. వరుసగా ఆరో రోజు ఇరాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్లు వెల్లడించింది. అమెరికా వైమానిక దాడిలో చాబహార్ ఓడరేవు వద్ద ఒక టవర్ కూలిపోయినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ తెలియజేసింది. ఓడరేవులోకి వచ్చే నౌకలను ఈ టవర్ నుంచే పర్యవేక్షిస్తారు. నిఘా టవర్ కూలిపోతున్న ఫొటోను అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. భారత ప్రభుత్వ సహకారంతో ఇరాన్ నిర్వహిస్తున్న చాబహార్ ఓడరేవు అమెరికా దాడులకు పదేపదే లక్ష్యంగా మారుతోంది. ఇక్కడ దాడులు జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా సైతం ధ్రువీకరించింది. శుక్రవారం ఉదయం 6 గంటల కల్లా అమెరికా దాడుల కారణంగా ఇరాన్లో కనీసం 38 మంది మరణించారని, 400 మందికి పైగా గాయపడ్డారని ఆరోగ్య శాఖ ప్రతినిధి హొస్సేన్ కెర్మన్పూర్ వెల్లడించింది. కుర్దిష్ రెబెల్ గ్రూప్‌పై ఇరాన్ దాడులు ఇరాన్ దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలంటూ ఖతార్ ప్రభుత్వం తమ పౌరులను రెండుసార్లు హెచ్చరించింది. ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడానికి గగనతల రక్షణ వ్యవస్థలను సన్నద్ధం చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు ఖతార్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్ ప్రయోగించిన మూడు క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నట్లు జోర్డాన్ సైన్యం ప్రకటించింది. మరోవైపు ఉత్తర ఇరాన్‌లోని కుర్దిష్ రెబెల్ గ్రూప్ ‘కొమాలా’పై దాడులు జరిగాయి. ఈ ఘటనలో కనీసం తొమ్మిది మంది మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఇరాన్ సైన్యమే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఒక ట్యాంకర్ దాడికి గురైందని బ్రిటిష్ సైన్యం తెలిపింది. -
2020 నాటి ఎన్నికల్లో చైనా జోక్యం
వాషింగ్టన్: 2020 నాటి అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికా ఓటింగ్ వ్యవస్థలో అత్యంత ఆందోళనకరమైన లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన గురువారం రాత్రి వైట్‌హౌస్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రైమ్‌టైమ్ ప్రసంగం చేశారు. దాదాపు అరగంట పాటు మాట్లాడారు. అప్పట్లో తన ప్రత్యర్థి జో బైడెన్‌కు అనుకూలంగా ఎన్నికలను ప్రభావితం చేయడానికి చైనా కుట్రలు సాగించిందని, ఆ విషయాన్ని నిర్ధారించే వందలాది నిఘా ఫైళ్లను తాను బహిర్గతం చేశానని చెప్పారు. తన వ్యక్తిగత సమాచారంతో సహా 22 కోట్ల మంది ఓటర్ల వివరాలను చైనా అక్రమంగా సేకరించిందని మండిపడ్డారు. 18 రాష్ట్రాల్లోని ఓటర్ల డేటాను చైనా కొనుగోలు చేసిందని, దొంగిలించిందని లేదా హ్యాక్ చేసిందని ట్రంప్ అన్నారు. ఈ విషయాన్ని నిఘా అధికారులు ప్రభుత్వానికి గానీ, కాంగ్రెస్‌కు గానీ చెప్పలేదని నిందించారు. అమెరికా పౌరులు కాని 2,78,000 మంది ఓటర్లుగా నమోదైనట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం గుర్తించిందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో ఓటర్లకు సంబంధించిన సమాచారం చాలావరకు బహిరంగంగానే అందుబాటులో ఉంటుంది. అయితే, ఓటింగ్ విధానాలను మార్చడానికి లేదా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి చైనా ఈ సమాచారాన్ని వాడుకుందని తేల్చడానికి ట్రంప్ ఎటువంటి ఆధారాలనూ చూపలేదు. 2020 నాటి ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ట్రంప్ ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, విదేశీ జోక్యం వల్ల ఫలితాలు తారుమారు అయ్యాయని ఆయన పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు సాక్ష్యాధారాలను మాత్రం బయటపెట్టడం లేదు. మరోవైపు, కాంగ్రెస్‌పై నియంత్రణను నిర్ణయించే రాబోయే మధ్యంతర ఎన్నికలపై ప్రజల్లో సందేహాలు రేకెత్తించడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారని విపక్ష డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకోలేదని బలమైన నమ్మకం ఉన్నట్లు అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ 2021 నాటి నివేదికలో పేర్కొంది. ఇదిలా ఉండగా, ట్రంప్ ప్రజామోద రేటింగ్ 37 శాతానికి పడిపోయినట్లు వాషింగ్టన్ పోస్ట్–ఇప్సోస్ నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. జీవన వ్యయం పెరగడం, ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం పట్ల చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడయ్యింది. ప్రత్యక్ష ప్రసారం చేయాలా? వద్దా? తన ప్రసంగాన్ని తప్పనిసరిగా ప్రత్యక్ష ప్రసారం చేయాలని మీడియా సంస్థలకు ట్రంప్ తేల్చిచెప్పారు. ప్రత్యక్ష ప్రసారం చేయకపోతే ఆంక్షలు విధిస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని ప్రసార, కేబుల్ వార్తా సంస్థలు అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొన్నాయి. ప్రసారం చేయాలా? వద్దా? అనేదానిపై ఎటూ తేల్చుకోలేకపోయాయి. అమెరికా మీడియా సంస్థల్లో తన వ్యతిరేకులు ఉన్నారని ట్రంప్ చాలా రోజులుగా ఆక్షేపిస్తున్నారు. మీడియాపై పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ‘‘మీడియా సంస్థలు మోసాలకు పాల్పడుతున్నాయి. అలాంటి సంస్థల లైసెన్సులను రద్దు చేయాలి. కోట్లాది డాలర్ల విలువైన మన ప్రజా ఆస్తి ఎయిర్‌వేవ్స్‌ను (ప్రసార తరంగాలను) ఎలాంటి రుసుమూ చెల్లించకుండానే వాడుకుంటున్నాయి. మాకు కావాల్సిందల్లా ఎన్నికలు, వార్తల ప్రసారంలో నిజాయితీ మాత్రమే’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, ట్రంప్ ప్రసంగాన్ని కొన్ని చానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేయగా, మరికొన్ని చేయలేదు. ట్రంప్ ఆరోపణలు అవాస్తవం: చైనా అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందంటూ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఆరోపణలను చైనా తిప్పికొట్టింది. అమెరికా అధ్యక్షుడి వాదనలు కల్పితం, దురుద్దేశపూర్వకం అని స్పష్టంచేశారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేసింది. నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని ట్రంప్‌కు సూచించింది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తమ విధానం కాదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ శుక్రవారం పేర్కొన్నారు. అమెరికా ఎన్నికలపై తమకు ఎలాంటి ఆసక్తి లేదని, ఎన్నడూ జోక్యం చేసుకోలేదని వెల్లడించారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో ఎల్లప్పుడూ ఎవరు జోక్యం చేసుకుంటారో, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, వ్యాపారాలు, సాధారణ పౌరులపై ఎవరు నిఘా పెడతారో, విదేశీ పౌరుల డేటాను ఎవరు దొంగిలిస్తారో అంతర్జాతీయ సమాజానికి బాగా తెలుసని స్పష్టంచేశారు. సొంత ప్రవర్తనను సమీక్షించుకోవాలని అమెరికాకు హితవు పలికారు. చైనాను ఎన్నికల అంశంగా వాడుకోవద్దని, చైనా–అమెరికా సంబంధాలను మెరుగుపరిచే దిశగా మరింత కృషి చేయాలని అమెరికాకు స్పష్టంచేశారు. -
ట్రంప్ దూసిన వీసా కత్తి!
మితవాద రాజకీయం ఊరకే ఉండదు. నిరంతరం కొత్త శత్రువుల్ని వెదుక్కుంటుంది. తన చర్యల పర్యవసానంగా పుట్టుకొచ్చే సంక్షోభాలనుంచి జనం దృష్టి మరల్చడానికి నానా తంటాలూ పడుతుంది. ఆ రాజకీయంలోనే పుట్టి, దాన్ని మరింత దిగజార్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండో దఫా వచ్చాక వలసలపై కత్తిగట్టారు. అమెరికాలో చదువుకోవటానికొచ్చినవారు గరిష్ఠంగా నాలుగేళ్లకు మించి ఉండటానికి వీల్లేదంటూ తాజాగా తీసుకురావాలనుకుంటున్న నిబంధన ఆ పరంపరలో భాగమే. ఇతరేతర వీసాల సంగతి సరేసరి. ప్రపంచ దేశాల్లోని వారందరికీ ఉన్నత చదువుల గమ్యస్థానం అమెరికాయే. అక్కడ చదువుకుంటే సాఫ్ట్వేర్, ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ) రంగాల్లో మెరుగైన జీతాలతో కొలువులొస్తాయన్న నమ్మకమే అందుకు కారణం. అయితే ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయంవల్ల విద్యార్థులకు మాత్రమే కాదు... అక్కడి విద్యాలయాలు, టెక్ రంగ సంస్థలకు కూడా సమస్యలొస్తాయి. విద్యాలయాల వేల కోట్ల ఆదాయం పడిపోతే, టెక్రంగ సంస్థలకు నిపుణుల కొరత ఏర్పడుతుంది. ఎందుకంటే స్థానికులతో పోలిస్తే విదేశాలనుంచి వచ్చే విద్యార్థులు చదువుల్లో, తెలివితేటల్లో చాలా ముందంజలో ఉంటారు. డిగ్రీ చదువులకొచ్చేవరకూ స్వదేశీయులకు అంతా ఉచితమే అయినా, అటుపై తడిసిమోపెడవుతుంది. వారితో పోలిస్తే నిజానికి విదేశీ విద్యార్థులు రెండు మూడు రెట్లు అధికంగా చెల్లించాలి. ఆ మొత్తంతోనే స్థానికులకు స్కాలర్‌షిప్‌లిస్తారు. వారినుంచి తక్కువ ఫీజు వసూలు చేస్తారు. స్థానికులు హ్యూమనిటీస్, ఆర్ట్స్, బిజినెస్ మేనేజ్మెంట్, లా తదితర కోర్సుల్లో ఆసక్తి కనబరుస్తారు. సాంకేతిక రంగంలో దూసుకెళ్లే అమెరికాకు ‘స్టెమ్’(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) విభాగంలో నిపుణులు అవసరం. విదేశీయులు కఠినమైన వడపోత తర్వాత ఆ కోర్సులు చదవడానికి వెళ్లినవారు గనుక ఆ కోర్సులను సులభంగా ఆకళింపు చేసుకుంటారు. స్టెమ్ కోర్సుల్లో మాస్టర్స్, పీహెచ్డీ స్థాయిలో 70 శాతం సీట్లు విదేశీయులకే లభించటం ఇందుకే. స్థానికుల్ని వారితో పోటీపడేలా తీర్చిదిద్దటానికి తాము చేయాల్సిందేమిటన్న దృష్టి ట్రంప్‌కుగానీ, ఆయన ముందున్న పాలకులకుగానీ లేదు. తగినంతమంది సాంకేతిక నిపుణులు స్థానికంగా లభ్యంకాకపోవటంవల్లనే అమెరికా దిగ్గజ టెక్ సంస్థలు విదేశాలనుంచి వచ్చేవారిని ఎంపిక చేసుకోవాల్సివస్తున్నది. అలా భర్తీ చేసుకోనట్టయితే ఇన్నోవేషన్ రంగంలో ఆ దేశం వెనకబడిపోతుంది. అదిగాక విదేశీ విద్యార్థులు చెల్లించే వేలాది కోట్ల డాలర్ల ఫీజులు, టెక్ సంస్థల విస్తరణ, లాభార్జనల వల్ల మరిన్ని వేలకోట్ల డాలర్లు పన్నుల రూపంలో ఖజానాకు సమకూరుతాయి. ఇతరత్రా సంస్థల సంగతలావుంచి మన భారత సంస్థలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కార్పొరేట్ పన్ను రూపంలోనే నిరుడు 867 కోట్ల డాలర్లు (రూ. 73,000 కోట్లకు పైగా) చెల్లించాయి. మొత్తంగా అన్ని సంస్థలూ 13,008 కోట్ల డాలర్లకు పైగా (రూ. 10,99,166 కోటు్ౖలపైగా) చెల్లించాయి. ఇవిగాక జీఎస్టీ, కస్టమ్స్ సుంకం, ఉద్యోగులు చెల్లించే టీడీఎస్‌లు అదనం. ఇంతగా లాభపడుతూ బాధిత దేశంగా శోకించటం అమెరికాకే చెల్లింది. వీసా వ్యవస్థ దశాబ్దాలుగా దుర్వినియోగమవుతున్నదనీ, దేశ భద్రత ప్రమాదంలో పడిందనీ గొంతుచించుకుంటున్న అమెరికా తాను ఎడాపెడా వర్ధమాన, వెనకబడిన దేశాలనుంచి దశాబ్దాలుగా కొల్లగొడుతున్న సంపద గురించి మాట్లాడదు. ఇందులో ఆ దేశాల పాలకుల తప్పు కూడా ఉంది. మన దేశం సంగతే తీసుకుంటే 2047 కల్లా ‘వికసిత్ భారత్’ తీసుకొస్తామంటారు. కానీ అమెరికా మాదిరిగా కనీసం డిగ్రీవరకూ ఉచిత విద్య, నామమాత్రపు ఫీజులతో ఆపై విద్య అందుబాటులోకి తెచ్చే ఆలోచన చేయరు. జీడీపీలో కనీసం 6 శాతం విద్యకు వ్యయం చేయాలన్న లక్ష్యం పాటించరు. హైస్కూల్ విద్యవరకూ శ్రద్ధ పెడుతున్నట్టు కనబడుతూ ఆపై చదువుల్ని కార్పొరేట్లకు వదిలేశారు. వేలాదిమంది ప్రొఫెసర్ల కొరతతో విశ్వవిద్యాలయాలు దయనీయ స్థితిలో పడినా పట్టదు. కొలువుల సంగతి సరేసరి. ఇలాంటి స్థితిలో ట్రంప్ బెదిరిస్తే, పరిమితులు విధిస్తే నిస్సహాయంగా మిగలటం తప్ప మన యువత చేయగలిగేది ఏముంది? -
ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌కు ట్రంప్
అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరుగనున్న ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకానున్నారు. ఈ సమాచారాన్ని వైట్‌హౌస్ అధికారికంగా ధృవీకరించింది.వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ట్రంప్ శుక్రవారం న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో ఫిఫా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని, ఆదివారం ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.ఇప్పటికే ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో కూడా ఫైనల్ అనంతరం ట్రంప్‌తో కలిసి విజేత జట్టుకు ప్రపంచకప్ ట్రోఫీ అందజేస్తామని ప్రకటించారు.అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన 102 మ్యాచ్‌లకు ట్రంప్ గానీ, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గానీ హాజరుకాలేదు. అయితే అమెరికా జట్టు ఆడిన కొన్ని మ్యాచ్‌లకు కేబినెట్ సభ్యులు హాజరయ్యారు.అమెరికా చరిత్రలో అత్యధికంగా వీక్షించబడిన, అత్యంత భద్రతతో నిర్వహించిన, అత్యంత విజయవంతమైన ప్రపంచకప్‌కు ట్రంప్ హాజరుతో ఘన ముగింపు లభిస్తుందని లెవిట్ పేర్కొన్నారు.ఫైనల్ మ్యాచ్ న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఆదివారం మధ్యరాత్రి (సోమవారం) 12:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్త క్రీడాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉంటే, ఇటీవల అమెరికా ఆటగాడు ఫోలారిన్ బాలోగన్ రెడ్‌కార్డు సస్పెన్షన్ వ్యవహారంలో ట్రంప్ ఫిఫా అధ్యక్షుడు ఇన్ఫాంటినోతో మాట్లాడిన విషయం వివాదాస్పదమైంది. ట్రంప్ విజ్ఞప్తి చేసినప్పటికీ నిర్ణయ ప్రక్రియలో తాను జోక్యం చేసుకోలేదని ఇన్ఫాంటినో స్పష్టం చేశారు.అనంతరం బాలోగన్పై విధించిన ఒక మ్యాచ్ నిషేధాన్ని ఫిఫా తాత్కాలికంగా ఎత్తివేయడం విమర్శలకు దారితీసింది. అయినప్పటికీ, ప్రీక్వార్టర్‌లో బెల్జియం చేతిలో అమెరికా 1-4 తేడాతో ఓటమి పాలైంది. -
'మాకేం అవసరం'.. పెద్దన్నకు చైనా స్ట్రాంగ్ కౌంటర్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి 2020 అధ్యక్ష ఎన్నికల వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. చైనా అమెరికా ఎన్నికల డేటాలో భారీ స్థాయిలో జోక్యం చేసుకుందని, దాదాపు 22 కోట్ల (220 మిలియన్) మంది అమెరికన్ ఓటర్ల వివరాలను అక్రమంగా సేకరించిందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రపంచ రాజకీయాల్లో "పెద్దన్న"గా భావించే ఆయన.. అమెరికా ఎన్నికల భద్రతపైనే విదేశీ జోక్యం జరిగిందంటూ చేసిన ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు దారితీశాయి. అయితే, ట్రంప్ ఆరోపణలకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చైనా కౌంటర్ ఇచ్చింది. వైట్‌హౌస్‌లో ప్రైమ్‌టైమ్‌లో ప్రసంగించిన ట్రంప్.. 2020 ఎన్నికల సమయంలోనే చైనా అమెరికా ఓటర్ల డేటాను లక్ష్యంగా చేసుకుని చరిత్రలోనే అతిపెద్ద డేటా చోరీకి పాల్పడిందని ఆరోపించారు. దీంతో అమెరికా ఎన్నికల భద్రత తీవ్ర ప్రమాదంలో పడిందన్నారు. ఎన్నికల వ్యవస్థలోని లోపాలను "డీప్ స్టేట్"లోని కొందరు కావాలనే దాచిపెట్టారని కూడా విమర్శించారు.ట్రంప్ ఆరోపణలకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి లియూ చాంగ్ స్పందించారు. "అమెరికా ఎన్నికలతో మాకేం అవసరం?. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదన్న సూత్రాన్ని చైనా ఎప్పుడూ పాటిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తిగా అమెరికా అంతర్గత అంశం. వాటి ఫలితాన్ని అమెరికా ప్రజలే నిర్ణయిస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనా ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు.. భవిష్యత్తులో కూడా జోక్యం చేసుకోదు. అలాంటి అవసరం కూడా మాకు లేదు" అని స్పష్టం చేశారు.ఇక ట్రంప్ తన ప్రసంగంలో.. రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా నుంచి అమెరికా ఎన్నికల వ్యవస్థ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న అమెరికా ఎన్నికల విధానం నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికలకు ఏమాత్రం సరిపోదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రతి ఓటు ఖచ్చితంగా లెక్కించబడేలా, హ్యాకింగ్ లేదంటే విదేశీ జోక్యానికి అవకాశం లేకుండా ఎన్నికల వ్యవస్థను పూర్తిగా పునర్నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఎన్నికల మౌలిక వసతుల్లో ఉన్న బలహీనతలను వెల్లడించే కీలక నిఘా సమాచారాన్ని ప్రజలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు.అమెరికాలో ఓటర్ల నమోదుకు పౌరసత్వ ధ్రువీకరణ తప్పనిసరి చేసే సేవ్ యాక్ట్ SAVE Actను వెంటనే ఆమోదించాలని కాంగ్రెస్‌ను ట్రంప్ కోరారు. అయితే, ఈ బిల్లు అమలైతే లక్షలాది మంది చట్టబద్ధ ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఓటర్ల హక్కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికా చట్టాల ప్రకారం విదేశీయులు ఓటు వేయడం ఇప్పటికే నిషేధితమే.ఇక 2020 ఎన్నికల్లో భారీ మోసం జరిగిందన్న ట్రంప్ ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి న్యాయపరమైన నిర్ధారణ లభించలేదు. ట్రంప్, ఆయన మద్దతుదారులు దాఖలు చేసిన 60కుపైగా కేసుల్లో ఎన్నికల ఫలితాలను మార్చే స్థాయి అక్రమాలు జరిగాయని ఏ కోర్టూ తేల్చలేదు. రీకౌంట్లు, ఆడిట్లు, ట్రంప్ హయాంలోని న్యాయశాఖ కూడా అలాంటి ఆధారాలు గుర్తించలేదు.అంతేకాకుండా, ఎన్నికల మోసంపై తన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయని ఏబీసీ, ఎన్బీసీ వంటి టీవీ నెట్‌వర్క్‌లపై కూడా ట్రంప్ మండిపడ్డారు. అవి ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసే కుట్రలో భాగమని ఆరోపిస్తూ.. వాటి ప్రసార లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
ఓట్ల చోరీ.. చైనాపై ట్రంప్ సంచలన ఆరోపణలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో భారీ అక్రమాలు జరిగాయని పాత పాటే పాడిన ఆయన.. ఈసారి ఆసియా దేశమైన చైనాపై తీవ్ర ఆరోపణలు చేశారు. కోట్ల సంఖ్యలో అమెరికన్ల ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని ఆ దేశం దొంగిలించిందని ఆరోపించారు. అంతేకాదు అమెరికా ఎన్నికల చరిత్రలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘన (Data Breach)గా దీనిని అభివర్ణించారు. అమెరికా ప్రైమ్ టైమ్ స్పీచ్‌లో భాగంగా.. ట్రంప్ సంచలన ఆరోపణలకు దిగారు. ఎన్నికల భద్రతపై దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. కోట్ల 22 కోట్ల (220 మిలియన్ల) అమెరికన్ ఓటర్ల డేటాను చైనా చోరీ చేసిందన్నారు. ఇటీవల గోప్యత నుంచి తొలగించిన (డీక్లాసిఫై చేసిన) నిఘా పత్రాల్లో చైనా భారీ స్థాయిలో అమెరికా ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినట్లు పేర్కొన్నారని చెప్పారు. ఆ డేటాలో ఓటర్ల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, రాజకీయ పార్టీ అనుబంధం వంటి సున్నితమైన వివరాలు ఉన్నాయని తెలిపారు. ఈ సమాచారాన్ని ఓటరు నమోదు ప్రక్రియతో పాటు ఇతర దురుద్దేశపూర్వక కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు.#WATCH | US President Donald Trump says, "The documents cover five major areas of concern. They show that over a period of years, starting during the 2020 election cycle, the People's Republic of China carried out what is believed to be the largest compromise of election data in… pic.twitter.com/V8efjdVqT1— ANI (@ANI) July 17, 2026'డీప్ స్టేట్ నిజాలను దాచింది'అమెరికా ఎన్నికల వ్యవస్థపై దాడి చేసే సామర్థ్యం చైనాతో పాటు రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్‌కు ఉందని అమెరికా నిఘా వ్యవస్థ గుర్తించినట్లు ట్రంప్ తెలిపారు. చైనా ఎన్నికల జోక్యానికి సంబంధించిన కీలక నిఘా సమాచారాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థలోని కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని ఆరోపించారు. తన తొలి అధ్యక్ష పదవీకాలంలో ఈ సమాచారం తనకు, అమెరికా ప్రజలకు తెలియకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని ఇప్పటికే జాతీయ నిఘా విభాగం (ODNI), న్యాయశాఖ (DOJ), ఎఫ్‌బీఐ, సీఐఏలను ఆదేశించినట్లు వెల్లడించారు. సమాచారం దాచిన వారిపై ఉద్యోగాల నుంచి తొలగింపుతో పాటు అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని సూచించినట్లు చెప్పారు.మళ్లీ అదే మాట2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ అక్రమాలు జరిగాయని ట్రంప్ మరోసారి పునరుద్ఘాటించారు. ఆ ఎన్నికల్లో ఉపయోగించిన కొన్ని ఓటింగ్ యంత్రాల్లో లోపాలు ఉన్నాయని, ఎన్నికల వ్యవస్థలో అనేక బలహీనతలు బయటపడ్డాయని ఆరోపించారు. అమెరికా ఎన్నికల భద్రతను బలోపేతం చేయాలంటే కఠినమైన ఎన్నికల సంస్కరణలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.ఓటర్లకు పౌరసత్వ ధ్రువీకరణ తప్పనిసరి?భవిష్యత్తులో ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు ఓటర్ల నమోదు సమయంలో అమెరికా పౌరసత్వాన్ని నిరూపించే అధికారిక పత్రాలు తప్పనిసరి చేయాలని ట్రంప్ ప్రతిపాదించారు. ఫొటో ఐడీ లేకుండా ఓటు హక్కు కల్పించకూడదని, రాష్ట్రాలు-కేంద్రం మధ్య ఓటర్ల సమాచార మార్పిడిని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ లక్ష్యంతో రిపబ్లికన్లు మద్దతిస్తున్న సేవ్ అమెరికా యాక్ట్ SAVE America Act వంటి చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఆధారాలు చూపలేదు.. నిఘా వర్గాల వేర్వేరు అభిప్రాయాలుఅయితే తన ప్రసంగంలో ట్రంప్ ఈ ఆరోపణలకు ప్రత్యక్ష ఆధారాలు మాత్రం వెల్లడించలేదు. ఇదిలా ఉండగా, అమెరికా నిఘా వర్గాలకు చెందిన కొన్ని సమాచారం ప్రకారం.. చైనా ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేసి ఉండవచ్చన్న అనుమానాలు ఉన్నప్పటికీ, 2020 ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును మార్చిందని లేదంటే ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేసిందని నిర్ధారించే ఆధారాలు లేవని పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.అలాగే 2020 ఎన్నికల ఫలితాలను ట్రంప్ గతంలోనూ పలుమార్లు ప్రశ్నించినప్పటికీ, అమెరికా కోర్టులు, రీకౌంట్లు, అధికారిక సమీక్షల్లో ఎన్నికల ఫలితాన్ని మార్చే స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు వెలుగుచూడలేదని గతంలో తేలింది. అయినప్పటికీ ఎన్నికల భద్రత అంశాన్ని ట్రంప్ మరోసారి జాతీయ చర్చగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.


