Top Stories
ప్రధాన వార్తలు
కచ్చితంగా ‘పచ్చ’ కుట్రే!
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటమే ఏకైక లక్ష్యంగా పోలింగ్ సందర్భంగా టీడీపీ విధ్వంస కాండకు బరి తెగించిందని పూర్తి ఆధారాలతో బట్టబయలైంది. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు మహిళలు, వృద్ధులను ఓటింగ్‌కు దూరం చేసేందుకు టీడీపీ పక్కా పన్నాగంలో దాడులకు తెగబడి విధ్వంసం సృష్టించిందని స్పష్టమైంది. అందుకు సంబంధించి వీడియో రికార్డింగులు, ఫొటోలతో సహా కీలక ఆధారాలను సిట్ సేకరించింది. పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో యథేచ్ఛగా సాగిన టీడీపీ గూండాగిరీపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వరుసగా రెండో రోజు ఆదివారం విచారణ నిర్వహించింది. సిట్ ఇన్చార్జ్గా ఉన్న అదనపు డీజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలోని బృందం అనంతపురం జిల్లా తాడిపత్రితో పర్యటించగా, ఇతర బృందాలు పల్నాడు, తిరుపతి జిల్లాల్లో పర్యటించి విచారణ నిర్వహించాయి. దాడులు, దౌర్జన్యాలతో భీతిల్లిన ప్రాంతాలను పరిశీలించాయి. పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలను పరిశీలించడంతోపాటు బాధితుల అభిప్రాయాలు తెలుసుకున్నాయి. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు టీడీపీ ఎంత పక్కాగా పన్నాగాన్ని అమలు చేసిందన్న దానిపై సిట్ అధికారులు ఓ అంచనాకు వచ్చినట్టు సమాచారం. దాడులను అరికట్టడంలో పోలీసుల వైఫల్యంపై కూడా సిట్ అధికారులు ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. బాధితులతో మాట్లాడి దాడులు ఎలా జరిగాయన్నది తెలుసుకోవడంతోపాటు కీలకమైన వీడియో, ఫొటో ఆధారాలను సేకరించారు. ప్రధానంగా పల్నాడు, అనంతపురం జిల్లాల్లో పోలీసులు టీడీపీకి కొమ్ము కాసినట్టు.. బాధితులు ఫోన్లు చేసినా సరే స్పందించకుండా ఉదాసీనంగా వ్యవహరించినట్టు నిగ్గు తేలింది. పోలింగ్ రోజున, తరువాత హింసాత్మక ఘటనలపై విచారణ ప్రక్రియను రెండు రోజుల్లో ముగించాలని ఈసీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ రెండు రోజుల విచారణ ద్వారా తాము గుర్తించిన అంశాలతో ప్రాథమిక నివేదికను సిట్ ఇన్చార్జ్ వినీత్ బ్రిజ్‌లాల్ ఈసీకి సోమవారం సమర్పించనున్నారు. పూర్తి స్థాయి విచారణకు మరింత సమయం కావాలని ఆయన కోరే అవకాశం ఉంది.అక్రమాలకు పాల్పడటమే లక్ష్యంగా విధ్వంసంపక్కా పన్నాగంతో దాడులకు తెగబడి ఎన్నికల అక్రమాలకు పాల్పడాలన్నదే టీడీపీ కుట్రన్నది బట్టబయలైంది. అందుకోసమే పల్నాడు నుంచి అనంతపురం జిల్లా వరకు వరుస దాడులతో టీడీపీ శ్రేణులు బీభత్సం సృష్టించాయి. ప్రశాంతమైన తిరుపతి జిల్లాలో టీడీపీ ఏ విధంగా దాడులకు తెగబడిందీ వెలుగులోకి వచ్చింది. చిత్తూరు నుంచి రప్పించిన 2 వేల మంది రౌడీలతో చంద్రగిరి నియోజకవర్గంలోని కూచువారిపల్లెలో టీడీపీ విధ్వంసం.. రామిరెడ్డిపాలెం సర్పంచ్ చంద్రశేఖర్‌రెడ్డిని హత్య చేసేందుకు బరితెగించి దాడులకు పాల్పడిన కుతంత్రం.. అనంతరం తిరుపతిలోని ఎస్వీయూ, శ్రీపద్మావతి విశ్వవిద్యాలయాల ప్రాంతాల్లో దాడులు, ప్రతిదాడులకు సంబంధించిన కీలక ఆధారాలను సిట్ సేకరించింది. తిరుపతి రూరల్ మండలం ఎం ఆర్పల్లి సీఐపై టీడీపీ నేతలు రాడ్లతో దాడి చేస్తే, ఎందుకు కేసు నమోదు చేయలేదని సిట్ అధికారులు ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ దాడిపై కూడా కేసు నమోదు చేసి బాధ్యులను అరెస్ట్ చేయాలని ఆదేశించింది. రెండు కేసుల్లో కూడా నిందితులు అందరినీ అరెస్ట్ చేయాలని స్పష్టం చేసింది. తాడిపత్రిలో అయితే టీడీపీ గుండాగిరికి ఏకంగా పోలీసులే దన్నుగా నిలవడం.. పోలీసులే దాడులకు పాల్పడి ఆస్తులు ధ్వంసానికి పాల్పడిన వీడియో, ఫొటో ఆధారాలను సిట్ సేకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.– పల్నాడు జిల్లా పమిడిపాడు గ్రామంలోని వైఎస్సార్సీపీ పోలింగ్ బూత్ ఏజంట్ షేక్ మాబుపై టీడీపీ వర్గీయుల దాడి, ఉప్పలపాడులో ఇరువర్గాల దాడులు, ప్రతిదాడులు, దొండపాడు గ్రామంలో వాహనాలపై దాడి ఘటనల వెనుక టీడీపీ పక్కా పన్నాగం కూడా బట్టబయలైంది. ఈ ఘటనల వీడియోలను పరిశీలించి దాడుల తీవ్రతపై సిట్ అధికారులు ఓ అంచనాకు వచ్చారు. మాచర్ల నియోజకవర్గం కారెంపూడిలో బీసీ వర్గీయులపై టీడీపీ గుండాలు యథేచ్చగా సాగించిన దాడులు, దాచేపల్లిలో టీడీపీ వర్గీయులు తెగబడి సృష్టించిన విధ్వంసకాండ వెనుక కుట్ర వెలుగులోకి వచ్చింది. పోతురాజుగుట్టలో బేడ బుడగ జంగాల కాలనీపై జరిగిన దాడిని ఆ తర్వాత 14వ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు కారెంపూడిలో వరుసగా టీడీపీ రౌడీ మూకలు సాగించిన విధ్వంసాలకు సంబంధించిన వీడియో ఆధారాలను సేకరించారు.ఇవిగో ఆధారాలు..– పోలింగ్ రోజున పక్కా పన్నాగంతోనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని బాధితులు సిట్‌కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కేవలం ఫిర్యాదులు చేయడమే కాకుండా అందుకు సంబంధించిన వీడియో రికార్డులు, ఫొటోలను సాక్షంగా సిట్ అధికారులకు సమర్పించారు. చంద్రగిరి నియోజకవర్గంలో విధ్వంసకాండకు నాంది పలికిన కూచువారిపల్లిలో టీడీపీ సృష్టించిన బీభత్సం గురించి బాధితులు సిట్ అధికారులకు వివరించారు. – రామిరెడ్డిపల్లి సర్పంచ్ కొటాల చంద్రశేఖర్‌రెడ్డిని అంతమొందించే కుట్రలతోనే టీడీపీ వర్గీయులు దాడులకు పాల్పడ్డారని స్థానికులు సిట్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కారును తగలబెట్టిన ఘటన మొదలు సర్పంచ్ కొటాల చంద్రశేఖర్‌రెడ్డి ఇల్లు, కారు ధ్వంసం చేసి, నిప్పటించడం వరకు విధ్వంసకాండ కొనసాగిన తీరును విడమరచి చెప్పారు. సర్పంచ్ ఇంట్లోని వృద్ధురాలిని బలవంతంగా బయటకు ఈడ్చుకొచ్చారన్నారు. ఇంట్లోని వస్తువులన్నింటినీ ధ్వంసం చేసి, విలువైన వస్తువులను దోచుకెళ్లడంతో పాటు పెట్రోల్ బాంబులతో ఇంటిని దగ్ధం చేశారని చెప్పారు. సమాచారం తెలుసుకున్న సర్పంచ్, గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారని తెలిపారు. అప్పటికే సిద్ధం చేసుకున్న రాళ్లు, కర్రలతో టీడీపీ వర్గీయులు దాడులకు తెగబడ్డారన్నారు. – రామిరెడ్డిపల్లి పోలింగ్ బూత్ వద్ద టీడీపీ వర్గీయులు ఎలా దాడులకు తెగబడిందీ బాధితులు వివరించారు. ఇప్పటికీ టీడీపీ నాయకుల బెదిరింపులు ఆగడం లేదని, రామిరెడ్డిపల్లిలో ఎవరినీ వదలమని.. చంపేస్తామంటూ బెదిరించారని.. మీరే రక్షణ కల్పించాలని మొరపెట్టుకున్నారు. టీడీపీ గుండాల బెదిరింపులకు గ్రామంలో పది కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లి పోయాయని సిట్ అధికారుల దృష్టికి తెచ్చారు. – అనంతపురం జిల్లా తాడిపత్రిలోని విధ్వంసకాండపై సిట్ ఇన్చార్జ్ అదనపు డీజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో అధికారుల బృందానికి బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి సతీమణి కేతిరెడ్డి రమాదేవి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యులు సిట్ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. దాడులు అరికట్టడంలో పోలీసుల వైఫల్యం, బాధితులపై తిరిగి పోలీసులు దౌర్జన్యానికి దిగడం, ఆస్తులు ధ్వంసం చేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటో ఆధారాలను సమర్పించారు.– పల్నాడు జిల్లాలోని నరసారావుపేట, మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో టీడీపీ హింసాకాండపై బాధితులు సిట్ అధికారుల వద్ద తమ ఆవేదన వెళ్లగక్కారు. మంత్రి అంబటి రాంబాబు సిట్ అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల రోజున పలు గ్రామాల్లో వైఎస్సార్సీపీ ఏజెంట్లపై టీడీపీ వర్గీయుల దాడి, రూరల్ సీఐ రాంబాబు వ్యవహరించిన తీరుపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.– పల్నాడు జిల్లా కారెంపూడిలో ఈ నెల 14న ఉదయం నుంచి రాత్రి వరకు టీడీపీ గుండాలు సాగించిన దౌర్జన్యకాండను బాధితులు సిట్ అధికారులకు వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లాలోని దాచేపల్లి నగర పంచాయతీలో ఇరికేపల్లి, కేసానుపల్లి, తంగెడ, మాదినపాడు, దాచేపల్లిలో టీడీపీ రౌడీ మూకలు తెగబడి బీభత్సం సృష్టించిన తీరును బాధితులు వివరించారు.
లోక్‌సభ ఎన్నికలు 2024: కాసేపట్లో ప్రారంభం కానున్న ఐదో విడత పోలింగ్
Updatesకాసేపట్లో ప్రారంభం కానున్న ఐదో విడత పోలింగ్ లోక్‌సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 49 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, స్మృతి ఇరానీ, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, తదితర కీలక నేతలు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లోనూ ఈరోజే పోలింగ్ చేపడుతున్నారు. ఏడు దశలను చూస్తే ఈ ఐదో దశలోనే అత్యంత తక్కువ(49) స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ 49 స్థానాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ 40కిపైగా చోట్ల విజయం సాధించడం విశేషం. దీంతో ఈ దశ బీజేపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఈసారైనా మెరుగైన ఓటింగ్ సాధించేలా ఓటర్లు పోలింగ్ ప్రక్రియలో భారీగా పాలుపంచుకోవాలని ముంబై, థానె, లక్నో నగర ఓటర్లకు ఈసీ ఆదివారం విజ్ఞప్తి చేసింది. బరిలో కీలక నేతలుకేంద్ర మంత్రులు రాజ్‌నాథ్(లక్నో), పియూశ్ గోయల్( నార్త్ ముంబై), కౌశల్ కిశోర్(మోహన్‌లాల్‌గంజ్), సాధ్వి నిరంజన్ జ్యోతి(ఫతేపూర్), శంతను ఠాకూర్ (పశ్చిమబెంగాల్లోని బంగావ్), ఎల్జేపీ(రాంవిలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ (బిహార్‌లోని హాజీపూర్), శివసేన శ్రీకాంత్ షిండే(మహారాష్ట్రలోని కళ్యాణ్), బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య( బిహార్‌లోని సరణ్), ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్(ముంబై నార్త్ సెంట్రల్)ల భవితవ్యం సోమవారమే ఈవీఎంలలో నిక్షిప్తం కాబోతోంది. విపక్షాలు అధికారంలోకి వస్తే అయోధ్య బాలరామాలయం పైకి బుల్డోజర్లను పంపిస్తారని మోదీ తీవ్ర విమర్శలు, ఎన్డీఏ 400 చోట్ల గెలిస్తే రాజ్యాంగాన్ని ఇష్టమొచ్చినట్లు మారుస్తుందని, రిజర్వేషన్లు తీసేస్తుందని కాంగ్రెస్ విమర్శలతో ఐదో దశ ప్రచారపర్వంలో కాస్తంత వేడి పుట్టించింది. ఒడిశాలో ఐదు లోక్‌సభ స్థానాలతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ కింద 35 ఎమ్మెల్యే స్థానాల్లోనూ సోమవారం పోలింగ్ జరగనుంది. బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ పోటీచేస్తున్న హింజీలీ అసెంబ్లీ స్థానంలో ఈరోజే పోలింగ్ ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగోదశ ముగిశాక 543 స్థానాలకుగాను 23 రాష్ట్రాలు,యూటీల్లో ఇప్పటిదాకా 379 స్థానాల్లో పోలింగ్ పూర్తయింది.ఆరో దశ పోలింగ్ మే 25న, ఏడో దశ జూన్ ఒకటిన జరగనుంది.
Rasi Phalalu: ఈ రాశి వారు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.ద్వాదశి ప.3.05 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: చిత్త తె.5.17 వరకు(తెల్లవారితే మంగళవారం), తదుపరి స్వాతి, వర్జ్యం: ఉ.11.43 నుండి 1.27 వరకు, దుర్ముహూర్తం: ప.12.22 నుండి 1.10 వరకు, తదుపరి ప.2.58 నుండి 3.46 వరకు, అమృతఘడియలు: రా.10.05 నుండి 11.34 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.31, సూర్యాస్తమయం: 6.21. మేషం: ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు సఫలం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.వృషభం: కుటుంబంలో సమస్యలు. పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలు ముందుకు సాగవు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.మిథునం: శ్రమ తప్పకపోవచ్చు. కొన్ని వివాదాలు ఇబ్బందిగా మారతాయి. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.కర్కాటకం: బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.సింహం: సమస్యలతో సతమతం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. మీ ఆలోచనలు నిలకడగా ఉండవు. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.కన్య: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొంటారు. పరపతి పెరుగుతుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.తుల: సన్నిహితుల నుండి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో తొందరపాటు. ఆస్తుల వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.వృశ్చికం: వ్యవహారాలలో విజయం. ఆప్తులు, శ్రేయోభిలాషులతో సఖ్యత. విందువినోదాలు. అరుదైన ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.ధనుస్సు: యత్నకార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.మకరం: పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. కష్టపడ్డా ఫలితం ఉండదు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.మీనం: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుండి శుభవర్తమానాలు. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక.
ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబు
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో జరిగిన పలు కుంభకోణాల్లో ప్రధాన నిందితుడుగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు గుట్టుచప్పుడు కాకుండా అమెరికా వెళ్లడం కలకలం రేపుతోంది. ఒకవైపు చంద్రబాబుపై సీఐడీ జారీ చేసిన లుక్ అవుట్ నోటీసు అమలులో ఉండగా మరోవైపు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు సుప్రీంకోర్టులో ఇంకా విచారణలోనే ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు చంద్రబాబును శనివారం తెల్లవారుజామున కొద్దిసేపు నిలువరించారు. చంద్రబాబు దేశం విడిచి వెళ్లకూడదని సీఐడీ గతేడాది లుక్ అవుట్ నోటీసు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విదేశీ ప్రయాణానికి కోర్టు అనుమతి ఉందా? అని ప్రశ్నించడంతో చంద్రబాబు కంగు తిన్నారు. తటపటాయిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చిన తరువాత ఇమిగ్రేషన్ అధికారులు పలు దఫాలు సీఐడీ అధికారులతో చర్చించారు. అనంతరం ఎట్టకేలకు అనుమతించారు. పార్టీ ఖాతాల్లోకి అవినీతి నిధులు..టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌తోపాటు ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ ఆయన్ని అరెస్ట్ చేయగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యారు. కాగా ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సీఐడీ వాదనలు వినిపించింది. కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులను టీడీపీ బ్యాంకు ఖాతాలకు తరలించిన విషయాన్ని న్యాయస్థానానికి నివేదించింది. దీనిపై చంద్రబాబును కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. షరతులు బేఖాతర్!స్కిల్ స్కామ్ కేసులో నిందితులైన చంద్రబాబు, ఆయన మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, కిలారు రాజేష్‌పై సీఐడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. సీఐడీ అదనపు డీజీ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని అందులో స్పష్టం చేసింది. అయితే సీఐడీ ముందస్తు అనుమతి లేకుండానే చంద్రబాబు అమెరికా వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ న్యాయస్థానంలో విచారణలో ఉంది. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో చంద్రబాబు న్యాయవాదులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సీఐడీ అధికారులతో చర్చించారు. స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఇప్పటికే న్యాయస్థానంలో చార్జ్షీట్లు దాఖలు చేసిన విషయాన్ని సీఐడీ అధికారులు ఇమిగ్రేషన్ అధికారులకు తెలియచేశారు. సీఐడీకి సమాచారం ఇచ్చిన తరువాతే విదేశాలకు వెళ్లాలని చెప్పారు. చార్జ్షీట్లను పరిగణలోకి తీసుకున్న తరువాత న్యాయస్థానం విధించే షరతులను పాటించాలన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతానికి అమెరికా వెళ్లేందుకు సమ్మతించారు. సీఐడీ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని మరోసారి చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తామని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. న్యాయస్థానం విధించే షరతులు, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఉండాలన్నారు. అనంతరం ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతించడంతో చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలసి దుబాయి మీదుగా అమెరికా వెళ్లారు.చికిత్స కోసం అంటున్న టీడీపీ వర్గాలుచంద్రబాబు తన విదేశీ పర్యటన గురించి చివరి వరకు ఎవరికీ తెలియనివ్వలేదు. కొద్ది రోజుల పాటు దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించిన ఆయన అమెరికా పర్యటన విషయంలో మాత్రం గోప్యత పాటించారు. వైద్య పరీక్షల కోసమే ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ చంద్రబాబు చికిత్స కోసం అమెరికా వెళ్లారు. వారం తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని పార్టీ నాయకులు తెలిపారు. మరోవైపు నారా లోకేష్ కూడా నాలుగు రోజుల క్రితం చడీ చప్పుడు లేకుండా అమెరికా వెళ్లినట్లు సమాచారం.
కౌంటింగ్ సమయంలో అల్లర్లకు కుట్ర!
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్సీపీ బృందం కోరింది. ఈ మేరకు ఆదివారం వెలగపూడి సచివాలయం అడిషనల్ సీఈవో కోటేశ్వరరావును కలిసి ఫిర్యాదు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ తమకు ఓటు వేయలేదనే ఉక్రోషంతో టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా హింసను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీ అభ్యర్థులే రోడ్లపైకొచ్చి దాడులకు తెగబడుతూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని చెప్పారు. కౌంటింగ్ సమయంలోనూ టీడీపీ అల్లర్లను సృష్టించే అవకాశముందని, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సమయంలో పాటించాల్సిన నిబంధనలను 175 నియోజకవర్గాల్లోనూ తూచా తప్పకుండా పాటించేలా చొరవ తీసుకోవాలని కోరామన్నారు. పోలింగ్ రోజు దెందులూరు నియోజకవర్గం కొప్పులవారిపాలెంలో జరిగిన ఓ దాడి ఘటనలో టీడీపీకి చెందిన రాజశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పోలీసులపైన దౌర్జన్యం చేశారని, తక్షణమే ఆయనను అరెస్ట్ చేసి పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్న టెక్కలి నియోజకవర్గంలోనూ ఆ పార్టీ అరాచకాలకు ఓ నిండు ప్రాణం బలైందన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన తోట మల్లేష్ ఇంటిపై దాడికి తెగబడి.. అతని చావుకు కారణమయ్యారని చెప్పారు. దాడులను ప్రోత్సహించిన అచ్చెన్నాయుడిపైనా కేసు నమోదు చేయాలని కోరినట్టు తెలిపారు. గురజాల, మాచర్ల, నరసరావుపేట, సత్తెనపల్లి, తాడిపత్రి సహా రాష్ట్రంలో జరిగిన అరాచకాలన్నింటికీ మూలకారణం టీడీపీ నాయకులని మల్లాది విష్ణు ఆరోపించారు. కానీ సిట్‌ను తప్పుదోవ పట్టించేలా స్థానిక వైఎస్సార్సీపీ అభ్యర్థులపైనే ఫిర్యాదులు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని, ఈ నేపథ్యంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సిట్ అధికారులను కోరినట్టు వివరించారు.ఉయ్యూరు లోకేశ్ వంటి ఉన్మాదులనుచంద్రబాబు రెచ్చగొడుతున్నారు..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విదేశీ పర్యటనను ఉన్మాది ఆలోచనలతో అడ్డుకునే కుట్ర చేసినందుకే ఉయ్యూరు లోకేశ్‌ను గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు నీచ మనస్తత్వంతో లోకేశ్ వంటి వారిని రెచ్చగొడుతున్నారని ఆదివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. అత్యంత భద్రత మధ్య ఉండే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకోవాలనే లోకేశ్ కుట్ర వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చాలని డిమాండ్ చేశారు. టీడీపీ సానుభూతిపరుడైన లోకేశ్ డాక్టర్ అయినప్పటికీ ఉన్మాద మనస్తత్వంతో టీవీ డిబేట్లలో వైఎస్సార్సీపీపై విషం చిమ్ముతుంటారని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటాయపాలేనికి చెందిన ఉయ్యూరు లోకేశ్ 38 ఏళ్లుగా అమెరికాలో వైద్యుడిగా పని చేస్తున్నారని, ఆయనకు అమెరికా పౌరసత్వం కూడా ఉందని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చారని, ఆ తర్వాత నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని సీఎం జగన్ విదేశీ పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ సానుభూతిç³రులకు మెసేజ్‌లు పెట్టినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయని వెల్లడించారు.
సెల్‌ఫోన్‌తో హై బీపీ!
సాక్షి, అమరావతి: మొబైల్ ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడితే అధిక రక్తపోటు (హై బీపీ) ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దైనందిన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సెల్ఫోన్లతో అంతే స్థాయి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు మొబైల్ ఫోన్లో మాట్లాడేవారిలో దుష్ప్రభావాలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయని, ముఖ్యంగా రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనంలో తేల్చారు. ‘యూరోపియన్ హార్ట్ జర్నల్ – డిజిటల్ హెల్త్’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. చైనాలోని గ్వాంగ్జౌలోని సదరన్ మెడికల్ వర్సిటీ పరిశోధకులు మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే తక్కువ స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీ శక్తి రక్తపోటు పెరుగుదలతో ముడిపడి ఉందని గుర్తించారు.130 కోట్ల మందిలో రక్తపోటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30–79 సంవత్సరాల వయసు గల దాదాపు 130 కోట్ల మంది అధిక రక్తపోటు సమస్య ఎదుర్కొంటున్నారు. ఇందులో 82 శాతం మంది తక్కువ, మధ్య–ఆదాయ దేశాలలో నివసిస్తున్న వారే. భారత్‌లో 120 కోట్ల మందికిపైగా మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉంటే 22 కోట్ల మంది అధిక రక్తపోటు బాధితులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. రక్తపోటు సమస్య గుండెపోటు, అకాల మరణానికి దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. హైబీపీ వల్ల వచ్చే హైపర్ టెన్షన్, ఇతర సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. తాజా పరిశోధనలో వారంలో 30 నిమిషాల కంటే తక్కువ సమయం ఫోన్లో మాట్లాడే వారితో పోలిస్తే మిగిలిన వారిలో రక్తపోటు వచ్చే ప్రమాదం 12 శాతం ఎక్కువగా ఉంటుందని తేల్చారు. వారానికి ఆరుగంటలకు పైగా ఫోన్లో మాట్లాడేవారిలో రక్తపోటు ప్రమాదం 25 శాతానికి పెరిగింది.కండరాలపై ఒత్తిడి..మెడ, భుజాలు, చేతుల్లో కండరాల నొప్పులు అత్యంత సాధారణ దుష్ప్రభావాలలో ఒకటిగా వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ సేపు ఫోన్‌ను పట్టుకోవడంతో కండరాలు ఒత్తిడికి గురవడంతో పాటు తీవ్ర తలనొప్పికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఫోన్‌ను చెవికి చాలా దగ్గరగా పెట్టుకుని మాట్లాడటం, ఇయర్‌ఫోన్లు్ల, హెడ్ఫోన్లను నిరంతరం ఉపయోగించడంతో టిన్నిటస్ (చెవుల్లో నిరంతరం రింగింగ్ సౌండ్ వినిపించే పరిస్థితి) వంటి చెవి సమస్యలు వస్తాయంటున్నారు. ఫోన్ స్క్రీన్‌పై ఎక్కువ సేపు చూడటంతో కంటిపై ఒత్తిడి పెరిగిన కళ్లుపొడిబారడం, చూపు మసకబారడం, తలనొప్పి, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుందని పేర్కొంటున్నారు.
యూకే పోస్టు–స్టడీ వీసాలు రద్దు!
లండన్: యునైటెడ్ కింగ్డమ్(యూకే)లోకి వలసలను అరికట్టడానికి ప్రధానమంత్రి రిషి సునాక్ కొత్తరకం ఆలోచనలు చేస్తున్నారు. యూకేలో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత రెండేళ్లపాటు ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకొనేందుకు వీలు కల్పించే పోస్టు–స్టడీ వీసాను రద్దు చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై సొంత మంత్రివర్గం నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడం గమనార్హం. యూకే పోస్టు–స్టడీ వీసా పథకం 2021లో ప్రారంభమైంది. దీనితో భారతీయ విద్యార్థులు అధికంగా ప్రయోజనం పొందుతున్నారు. యూకేలో యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ అభ్యసించిన తర్వాత రెండేళ్లదాకా ఇక్కడే ఉంటూ ఉద్యోగాలు చేసుకొనే వెసులుబాటు లభిస్తోంది. ఒకవేళ ఈ వీసాను రద్దుచేస్తే భారతీయ విద్యార్థులే ఎక్కువగా నష్టపోతారని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో యూకేలోకి వలసలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవన్నీ చట్టబద్ధంగానే జరుగుతున్నప్పటికీ ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయి. వలసలను అరికట్టే చర్యల్లో భాగంగా పోస్టు–స్టడీ వీసాలపై ఆంక్షలు విధించడమా లేక శాశ్వతంగా రద్దు చేయడమా అనే దానిపై ప్రధాని రిషి సునాక్ తర్జనబర్జన పడుతున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రతిపాదనను పలువురు యూకే మంత్రులు వ్యతిరేకిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి గిలియన్ కీగన్, విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరూన్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
అండమాన్‌కు ‘నైరుతి’.. రానున్న మూడ్రోజులూ వానలే
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ముందుగా అంచనా వేసిన విధంగానే నైరుతి రుతుపవనాలు ఆదివారం దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఇవి చురుగ్గా కదులుతూ దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, మాల్దీవులు, కొమరిన్‌లోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయి. రానున్న రెండ్రోజుల్లో ఇవి మరిన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. ఇక ఈ రుతు పవనాలు మే 31న కేరళను తాకనున్నట్లు భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఇంకా ముందు రావడానికి కూడా అవకాశం ఉంది. ఆ తర్వాత ఏపీలోకి 2–3 తేదీల్లో ప్రవేశిస్తాయి. లా నినా పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది సాధారణంగా కంటే ఎక్కువగానే వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లు ఐఎండీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. బలహీనపడ్డ ద్రోణి.. మూడ్రోజులు వర్షాలు..మరోవైపు.. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు తెలంగాణ, రాయలసీమల మీదుగా సముద్ర మట్టానికి 3.1 కి.మీల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడింది. ప్రస్తుతం రాష్ట్రంపైకి ఆగ్నేయ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న మూడ్రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలలో సోమవారం.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలలో మంగళవారం.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో బుధవారం వర్షాలకు ఆస్కారం ఉందని వివరించింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవిస్తాయని, వీటితో పాటు గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు.పెదకూరపాడులో 55 మిల్లీమీటర్ల వర్షంఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడులో 55.5 మిల్లీమీటర్లు, ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో 40 మిల్లీ మీటర్లు, జగ్గయ్యపేట 39.5, అల్లూరి జిల్లా అడ్డతీగల 38, చింతపల్లి 36, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి 35.2, అనకాపల్లి రావికమతం 35.2, అల్లూరి జిల్లా రాజవొమ్మంగి 35, తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు 31.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు 47 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. తుపానుగా మారనున్న అల్పపీడనం..మరోవైపు.. ఈనెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింతగా బలపడి 24 నాటికి వాయుగుండంగా మారనుంది. అనంతరం తుపానుగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
ఫుల్లు ట్రాఫిక్.. ఐదారు కిలోమీటర్లు వెళ్లాలన్నా అరగంట పట్టేస్తోంది.. హాయిగా గాల్లో ఎగిరెళితే బాగుండు అనిపిస్తుంటుంది కదా..నిజంగానే అలా ఉన్నచోటు నుంచి గాల్లో ఎగిరెళ్లిపోయే..ఫ్లయింగ్ కార్ రెడీ అయింది. దాని పేరు హెక్సా.అమెరికాకు చెందిన ‘లిఫ్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్ కార్పొరేషన్’ సంస్థ దీనిని అభివృద్ధి చేసింది. తాజాగా జపాన్‌లోని టోక్యో నగరంలో జరిగిన ‘సుషి టెక్ టోక్యో–2024’ కార్యక్రమంలో దీన్ని ప్రదర్శించారు. పది మీటర్ల ఎత్తులో తిప్పుతూ.. షోలో ఈ ఫ్లయింగ్ కార్‌ను కేవలం బొమ్మలా పెట్టడం కాదు.. గాల్లో తిప్పి మరీ చూపించారు. కారులో కూర్చున్న వ్యక్తి.. దాన్ని పది మీటర్ల ఎత్తులో అటూ ఇటూ తిప్పాడు. ఈ ‘హెక్సా’ ఫ్లయింగ్ కార్ వెడల్పు 4.5 మీటర్లు, ఎత్తు 2.6 మీటర్లు, 196 కిలోల బరువు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. గాల్లో ఎగిరేందుకు 18 ప్రొపెల్లర్లు (మోటార్లు, రెక్కలు) బిగించారు. సెకన్లలోనే ఎటు కావాలంటే అటు తిప్పగలిగేలా ఏర్పాట్లు చేశారు. ఇది రీచార్జబుల్ బ్యాటరీలతో నడుస్తుంది. ఇది గంటకు 100 కిలోమీటర్ల వరకు వేగంతో వెళ్లగలదని కంపెనీ తెలిపింది. నేల మీదేకాదు.. నీటిలోనూ సురక్షితంగా ల్యాండ్ అవుతుందని పేర్కొంది. త్వరలోనే వీటిని అమ్మకానికి పెట్టనున్నట్టు వెల్లడించింది. ఇంతకీ ధరెంతో తెలుసా.. రూ.4.12 కోట్లు మాత్రమే.భవిష్యత్తు ఫ్లయింగ్ కార్లదే.. కిక్కిరిసిపోయి, అడుగు కూడా కదలని ట్రాఫిక్ సమస్యతో అల్లాడుతున్న నగరాల్లో భవిష్యత్తులో ఇలాంటి ఫ్లైయింగ్ కార్లు దూసుకుపోవడం ఖాయమని సుషి టెక్ షోలో పాల్గొన్న నిపుణులు పేర్కొన్నారు. అత్యవసరమైన మందులు, ఇతర సామగ్రి రవాణాకూ ఇవి అద్భుతంగా తోడ్పడతాయని చెప్పారు. ముఖ్యంగా ప్రమాదాలు, విపత్తులు సంభవించినప్పుడు.. ఫ్లయింగ్ కార్లతో ఎంతో ప్రయోజనం ఉంటుందని టోక్యో గవర్నర్ యురికో కోయికే పేర్కొన్నారు. - సాక్షి, సెంట్రల్‌డెస్క్
నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు.. మంత్రివర్గ భేటీ నిర్వహణ కోసం పలు షరతులతో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాశ్ కుమార్ ఆదివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌కు లేఖ రాశారు.అత్యవసరమైన అంశాలు మాత్రమే..లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు.. అత్యవసరమైన, నిర్ణీత గడువులోగా అమలు చేయాల్సిన అంశాలను మాత్రమే కేబినెట్ భేటీలో చర్చించాలని ఈ లేఖలో ఈసీ స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్న నేపథ్యంలో.. అప్పటి వరకు నిరీక్షించడం సాధ్యం కాని, అత్యవసరమైన అంశాలను మాత్రమే మంత్రివర్గ సమావేశం ఎజెండాలో చేర్చాలని పేర్కొంది. మంత్రివర్గ సమావేశం ఎజెండాలో ప్రతిపాదించిన రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వంటి అంశాలను లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వాయిదా వేసుకోవాలని సూచించింది. ఇక ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకున్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులెవరినీ సమావేశానికి హాజరుకావాలని కోరరాదని ఆదేశించింది.కాళేశ్వరం బ్యారేజీలకు రిపేర్లు, పంటల సాగుపై నిర్ణయాలు!వాస్తవానికి గత శనివారమే కేబినెట్ భేటీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈసీ అనుమతి కోరింది. ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేసుకుంది. సోమవారంలోగా ఈసీ అనుమతించకుంటే మంత్రులతో కలసి ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు కూడా. కానీ తాజాగా ఈసీ అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వం అత్యవసర అంశాలపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి అడ్డంకి తొలగిపోయింది. ఈ భేటీలో కాళేశ్వరం బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులు, ధాన్యం కొనుగోళ్లు, వర్షాకాలం పంటల సాగు, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
తప్పక చదవండి
- నేటి నుంచే టెట్.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- మార్చినచోటే మారణకాండ
- టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
- పశుపోషకులకు బాసటగా..
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- ఖరీఫ్‌లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
సినిమా
హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'హీరామండి: ది డైమండ్ బజార్'. మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌తో దూసుకెళ్తోంది. ఈ సిరీస్‌లో ఏకంగా ఆరుగురు హీరోయిన్లు నటించారు. ఇందులో మనీషా కొయిరాలా, అదితిరావు హైదరి, సోనాక్షి సిన్హా లాంటి స్టార్స్ కనిపించారు. స్వాతంత్య్రానికి ముందు పాకిస్తాన్ లాహోర్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే ఈ సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన మరో నటి షర్మిన్ సెగల్. సంజయ్ లీలీ మేనకోడలైన ఆమె తనదైన నటనతో మెప్పించింది. ఆడియన్స్ నుంచి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా అందుకుంది. అయితే తాజాగా షర్మిన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆమె భర్త అమన్ మెహతా ఓ బిలినీయర్ అన్న వార్త సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్‌గా మారింది.ప్రముఖ టోరెంట్ ఫార్మాస్యూటికల్స్‌లో అమన్ మెహతా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ అంతర్జాతీయ కంపెనీకి కో-ఛైర్మన్లుగా అతని తండ్రి సుధీర్ మెహతా, మామ సమీర్ మెహతా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ సంస్థ బ్లూమ్‌బెర్గ్ 2024- ఇండెక్స్ ప్రకారం సుధీర్ మెహతా, సమీర్ మెహతా నికర విలువ దాదాపు రూ. 53,800 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమన్, అతని తండ్రి సమీర్ కంపెనీ ఫార్మాస్యూటికల్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఒక్క టోరెంట్ ఫార్మా దాదాపు రూ.38,412 కోట్లు రాబట్టిందని ఫోర్బ్స్ అంచనా వేసింది.కాగా.. సంజయ్ లీలా భన్సాలీకి మేనకోడలు అయిన షర్మిన్ సెగల్.. వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన అమన్ మెహతాను నవంబర్ 2023లో వివాహం చేసుకుంది. షర్మిన్ సెగల్ తల్లి బేలా సెగల్ ఫిల్మ్ ఎడిటర్‌గా, ఆమె తండ్రి దీపక్ సెగల్ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్లో కంటెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంజయ్ లీలా బన్సాలీకి చెల్లెలు అయిన బేలా సెగల్ 2012లో షిరిన్ ఫర్హాద్ కి తో నికల్ పాడి అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by Sharmin Segal Mehta (@sharminsegal)
తారక్ అభిమానుల మంచి మనసు.. 'రా ఎన్టీఆర్ 2.0' టీమ్ రక్తదానం
మే 20 వచ్చిందంటే చాలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు పండుగ. తారక్‌పై ఈగ కూడా వాలకుండా ఆయన చుట్టూ వైఫైలా అభిమానులు ఉంటారు. ఎన్టీఆర్‌ను ఎవరైనా కామెంట్ చేస్తే చాలు ఫ్యాన్స్ అంతా ఏకమై దండయాత్ర చేస్తారు. బాద్షాను టచ్ చేస్తే సౌండ్ సాలిడ్‌గా ఉంటుందనేలా వారందరూ తారక్‌పై ప్రేమను చూపుతారు.ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 'రా ఎన్టీఆర్ 2.0' వ్యవస్థాపకులు రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ఆ టీమ్ సేవ చేస్తుంది. విద్యార్థుల కోసం పలు సేవా కార్యక్రమాలను చేసేందుకు వారు ఎప్పుడూ ముందుంటారు. ఇందుకోసం సోషల్ మీడియాలో వారు ఒక పేజీని క్రియేట్ చేసి సాయం అవసరం ఉన్నవారికి తమకు చేతనైనంత వరకు చేస్తున్నారు. మే 20న తారక్ పుట్టినరోజు కావడంతో రక్తదానం కార్యక్రమాన్ని చేపట్టి తమ అభిమానాన్ని ఇలా చూపించారు. దీంతో నెటిజన్ల నుంచి 'రా ఎన్టీఆర్ 2.0' వ్యవస్థాపకుల పట్ల ప్రశంసలు అందుతున్నాయి. View this post on Instagram A post shared by RAW NTR (@rawntrofficial)
ప్రియుడిని పరిచయం చేసిన ఫైమా.. ఇదేంటి రాధికా అంటూ కామెంట్లు
తమదైన కామెడీ టైమింగ్‌తో బుల్లితెర ప్రేక్షకుల్ని నవ్వించే ఫైమా నేడు పుట్టినరోజు జరుపుకుంది. ఈ క్రమంలో తన అభిమానులకు పెద్ద షాకింగ్ న్యూస్ షేర్ చేసింది. తన బాయ్‌ఫ్రెండ్‌ను ఆమె రివీల్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.తాజాగా ఫైమా తన బాయ్‌ఫ్రెండ్‌తో పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. తన ప్రేమికుడు ప్రవీన్ నాయక్ అని పరిచయం చేసింది. ఆ ఫోటోలను ప్రవీన్ నాయక్ కూడా షేర్ చేశాడు. ఈ క్రమంలో అతను ఇలా చెప్పుకొచ్చాడు. 'నా ప్రియిమైన లవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మన ప్రేమ మొదలయ్యి 5 సంవత్సరాలైంది. ఇన్నిరోజులు ఎలా గడిచిపోయాయో తెలీదు. నా జీవితం మొత్తం నీతోనే గడపాలని ఉంది. నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను.' అని అతను తెలిపాడు. దీనికి ఫైమా మద్ధతు ఇస్తూ వాటిని షేర్ చేసింది.ప్రవీణ్‌తో లవ్!ప్రముఖ కామెడీ షోలోని మరో కమెడియన్ ప్రవీణ్‌తో ఫైమా ప్రేమాయణం నడుపుతుందని వార్తలు వచ్చాయి. ఒక ఇంటర్వ్యూలో ప్రవీణ్ మాట్లాడుతూ తన ప్రేమన ఫైమా రిజెక్ట్ చేసిందని కూడా వెళ్లడించాడు. ఫైమాతో బ్రేకప్ అయినట్లు చెప్పాడు. కానీ ఫైమా మాత్రం ప్రవీణ్‌ను ప్రేమించలేదని తెలిపింది. ఆన్‌స్క్రీన్‌లో జోడీగా చూపించేందుకే తమను జంటగా ఆదరించారని పేర్కొంది. కానీ, ప్రవీణ్‌కు, తనకు మధ్య కొన్ని వ్యక్తిగత సమస్యలున్నాయని, అవి చెప్పుకోలేమని అందుకే దూరం కావాల్సి వచ్చినట్లు ఆమె తెలిపింది. ప్రవీణ్ మాత్రం తామిద్దరం లవ్‌లో ఉన్నామని తెలిపాడు.నెటిజన్లు నుంచి విమర్శలుఐదేళ్లుగా ప్రేమలో ఉన్నప్పుడు ప్రవీణ్‌తో ఎందుకు ప్రేమలో ఉన్నావ్ అని కొందరు నెట్టింట ఫైమాను ప్రశ్నిస్తున్నారు. అతన్ని బకరాను చేసి ఆడుకున్నావ్ కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రవీణ్‌ను బాగా ఉపయోగించుకున్నావ్ నీ లిస్ట్‌లో ఇంకా ఎంతమంది ఉన్నారు రాధికా అక్క అంటూ డీజే టిల్లు డైలాగ్స్ పేలుస్తున్నారు. View this post on Instagram A post shared by Praveen Nayak (@praveen_nayak.24)
ఓటీటీకి రూ.150 కోట్ల చిత్రం.. ఈ సారైనా?
పృథ్వీరాజ్ సుకుమార్, అమలాపాల్ జంటగా నటించిన చిత్రం ఆడుజీవితం(ది గోట్ లైఫ్). మార్చి 28న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. సర్వైవల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం కేవల 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ చిత్రాల జాబితాలో చోటు సంపాదించుకుంది.అయితే ఈ సినిమా రిలీజై రెండు నెలల కావొస్తున్నా ఇప్పటి వరకు ఓటీటీకి రాలేదు. గతంలో చాలాసార్లు ఓటీటీ స్ట్రీమింగ్పై రానుందని వార్తలొచ్చాయి. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా మరోసారి ఓటీటీకి సంబంధించిన నెట్టింట వైరలవుతోంది. ఈనెల 26 నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తేదీపై కూడా చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు ఈ మూవీ హక్కులను సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. దీంతో ఈ సారైనా ఓటీటీకి వస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.అసలు కథేంటంటే..?కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి కథే ఈ చిత్రం. వాస్తవ సంఘటనలను ఆధారం చేసుకుని ఆడు జీవితం చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన నజీబ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో తెలియజేస్తూ బెన్యామిన్ ‘గోట్ డేస్’ అనే నవలను రచించారు. దీని ఆధారంగానే ఈ సినిమాను మేకర్స్ నిర్మించారు. నజీబ్ పాత్ర కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ 31 కిలోల బరువు తగ్గారు. అంతే కాకుండా కొన్ని సీన్స్ కోసం 72 గంటలపాటు భోజనం లేకుండా మంచి నీళ్ల సాయంతోనే ఆయన ఉన్నారు. ఈ సినిమా కోసం ఆయన పడిన శ్రమకు తగిన ఫలితం దక్కిందని చెప్పవచ్చు. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది.
ఫొటోలు
హీరోయిన్ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)
Indraja Sankar: విజిల్ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)
సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)
Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)
సుడిగాలి సుధీర్ బర్త్‌డే.. రష్మిగౌతమ్ పిక్స్ వైరల్ (ఫోటోలు)
క్రీడలు
IPL 2024: ముగిసిన లీగ్ మ్యాచ్‌లు.. ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్లు ఇవే
ఐపీఎల్-2024లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. ఈ మెగా ఈవెంట్లో భాగంగా గౌహతి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. టాస్ పడినప్పటకి మరోసారి వర్షం మొదలు కావడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.ఇక లీగ్ స్టేజీ ముగియడంతో ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్లపై ఓ లూక్కేద్దం. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. పాయింట్ల టేబుల్లో కేకేఆర్(19) పాయింట్లతో అగ్రస్ధానంలో ఉండగా.. ఎస్ఆర్హెచ్ 17(నెట్ రన్‌రేట్ +0.414), రాజస్తాన్ 17(నెట్ రన్‌రేట్ +0.273), ఆర్సీబీ(14) పాయింట్లతో వరసగా రెండు, మూడు ,నాలుగు స్ధానాల్లో నిలిచాయి. ఇక మే 21 నుంచి నాకౌట్ మ్యాచ్‌లకు తెరలేవనుంది. మే 21న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి క్వాలిఫియర్‌లో కేకేఆర్, ఎస్ఆర్హెచ్ జట్లు తలపడునున్నాయి. మే 22న ఎలిమినేటర్‌లో ఆర్సీబీ, రాజస్తాన్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. అనంతరం మే 24 క్వాలిఫియర్-2లో ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు, క్వాలిఫియర్-1లో ఓడిన జట్టు తలపడనున్నాయి. మే 26న చెపాక్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
రాజస్తాన్, కేకేఆర్ మ్యాచ్ రద్దు.. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ హ్యాపీ
ఐపీఎల్-2024లో భాగంగా గౌహతి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. గౌహతిలో ఆదివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. అయితే మధ్యలో వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్‌ను 7 ఓవర్లకు కుదించారు. టాస్ కూడా పడింది. కానీ మళ్లీ వర్షం తిరుగుముఖం పట్టడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఇక ఈ మ్యాచ్ రద్దు కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 17 పాయింట్లతో రెండో స్ధానాన్ని సుస్ధిరం చేసుకుంది. అయితే రాజస్తాన్ ఖాతాలో కూడా 17 పాయింట్లు ఉన్నప్పటకి.. ఆ జట్టు కంటే ఎస్ఆర్హెచ్ రన్‌రేట్ మెరుగ్గా ఉంది. ఈ క్రమంలోనే రాజస్తాన్ జట్టు ఎస్ఆర్హెచ్ను పాయింట్ల పట్టికలో అధిగమించలేకపోయింది.మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ 19 పాయింట్లతో అగ్రస్ధానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది సీజన్ ప్లే ఆఫ్స్‌కు కేకేఆర్, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, రాజస్తాన్ రాయల్స్ చేరాయి. మే 21న జరగనున్న తొలి క్వాలిఫియర్‌లో కేకేఆర్, ఎస్ఆర్హెచ్ జట్లు తలపడునున్నాయి. మే 22న ఎలిమినేటర్‌లో ఆర్సీబీ, రాజస్తాన్ అమీతుమీ తెల్చుకోనున్నాయి.
చరిత్ర సృష్టించిన అభిషేక్.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.215 పరుగుల భారీ లక్ష్య చేధనలో పంజాబ్ బౌలర్లకు అభిషేక్ శర్మ చుక్కలు చూపించాడు. 28 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 66 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓవరాల్‌గా ఈ సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 209.42 స్ట్రైక్ రేటుతో 467 పరుగులు చేశాడు.ఈ క్రమంలో అభిషేక్ శర్మ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్స్‌లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా అభిషేక్ రికార్డులకెక్కాడు. ప్రస్తుత సీజన్లో అభిషేక్ 41 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. 2016 సీజన్లో కోహ్లి 38 సిక్స్‌లు బాదాడు. తాజా సీజన్‌తో విరాట్ ఆల్‌టైమ్ రికార్డును అభిషేక్ బ్రేక్ చేశాడు.
రాజస్తాన్-కేకేఆర్ మ్యాచ్ రద్దు అవ్వాలి: ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్
ఐపీఎల్-2024లో గౌహతి వేదికగా చివరి లీగ్ మ్యాచ్‌లో తలపడేందుకు రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు సిద్దమయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. బర్సపరా క్రికెట్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. దీంతో 7:00 గంటలకు పడాల్సిన టాస్ ఆలస్యం కానుంది. కాగా ఇరు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేకేఆర్ 19 పాయింట్లతో అగ్రస్ధానంలో ఉండగా.. రాజస్తాన్ 16 పాయింట్లతో మూడో స్ధానంలో ఉంది. ఇక పంజాబ్‌పై తమ చివరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 17 పాయింట్లతో రెండో స్ధానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో రాజస్తాన్- కేకేఆర్ మ్యాచ్ రద్దవ్వాలని సన్‌రైజర్స్ అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ మ్యాచ్ మొత్తానికి రద్దు అయితే రాజస్తాన్, కేకేఆర్‌కు తలో పాయింట్ లభిస్తుంది. దీంతో ఎస్ఆర్హెచ్ 17 పాయింట్లతో తమ రెండో స్ధానాన్ని పదిలం చేసుకుంటుంది. కాగా మ్యాచ్ రద్దు అయితే రాజస్తాన్ ఖాతాలో కూడా 17 పాయింట్లు ఉంటాయి. కానీ రాజస్తాన్ జట్టు కంటే ఎస్ఆర్హెచ్ రన్‌రేట్ మెరుగ్గా ఉంది. కాబట్టి ఎస్ఆర్హెచ్ సెకెండ్ ప్లేస్‌కు ఎటువంటి ఢోకా లేదు.
బిజినెస్
ఎస్బీఐకి మొట్టికాయలు గట్టిగానే పడ్డాయిగా?
ఎస్బీఐకి కన్జ్యూమర్ కోర్టు మొట్టి కాయలు వేసింది. కస్టమర్ మోసపోయిన రూ.80వేల నగదును వెంటనే బ్యాంక్ చెల్లించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది.జూలై 4, 2015న ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కి నగర నివాసీ పార్థసారథి ముఖర్జీ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నుంచి నేరస్తులు న్యూఢిల్లీలోని ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంల నుంచి రూ.80,000 విత్‌డ్రా చేశారు. విత్ డ్రా అయినట్లు ముఖర్జీ ఫోన్‌కు మెసేజ్ వెళ్లింది. వెంటనే సదరు బ్యాంక్‌కు మెయిల్ పంపాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఎస్బీఐ ఏటీఎం నుంచి ఒక్కొక్కరు రూ.10వేలు చొప్పున మొత్తం ఎనిమిది సార్లు విత్ డ్రా చేసినట్లు మెయిల్ ద్వారా సమాచారం అందించారు. తనకు న్యాయం చేయాలని కోరారు. వెంటనే ఉత్తరాఖండ్ కన్జ్యూమర్ కోర్టునూ ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో కన్జ్యూమర్ కోర్టు సమస్యను పరిష్కరించి, బాధితుడికి న్యాయం చేయాలని ఢిల్లీ ఎస్బీఐకు ఉత్తర్వులు జారీ చేసింది.కోర్టు ఆదేశాలతో స్థానిక పోలీసులు విచారణ చేపట్టేందుకు ఎస్బీఐ బ్యాంక్‌ను సీసీటీవీ పుటేజీ ఇవ్వాలని కోరారు. అందుకు ఎస్బీఐ అధికారులు తిరస్కరించారు. ఎస్బీఐ అధికారుల తీరుపై బాధితుడు కన్జ్యూమర్ కోర్టుకు తన గోడును వెళ్లబోసుకున్నాడు. అయితే, అగంతకులు విత్ డ్రాపై బ్యాంక్ సత్వరమే చర్యలు తీసుకుందని, తన బ్యాంక్ బ్రాంచ్‌తో పాటు ఇతర బ్యాంక్ బ్రాంచీలకు సమాచారం ఇచ్చామని బ్యాంక్ అధికారులు కన్జ్యూమర్ కోర్టుకు తెలిపారు. తమ (ఎస్బీఐ) సేవల్లో ఎలాంటి లోపాలు లేవని, బ్యాంక్ ఖాతాదారుడు అగంతకులకు కార్డ్ వివరాలు, బ్యాంక్ డీటెయిల్స్ అందించారని స్పష్టం చేసింది. ఎస్బీఐ బ్యాంక్ తీరును ప్రశ్నించిన కన్జ్యూమర్ కోర్టు బాధితుడు నష్టపోయిన రూ.80వేల మొత్తాన్ని చెల్లించాలని సూచించింది.వివాదాస్పద లావాదేవీలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ లేకపోవడంతో పోలీసు విచారణను ముగించలేమని రాష్ట్ర కమిషన్ గమనించింది. రికార్డులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా బ్యాంక్ సేవల్లో లోపాలు ఉన్నాయని భావించామనే, కాబట్టే ఈ తీర్పు ఇచ్చినట్లు ఉత్తరా ఖండ్ కన్జ్యూమర్ కోర్టు వెల్లడించింది.
ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్!.. శుభవార్త చెప్పిన కంపెనీ
గత కొన్ని రోజులుగా దిగ్గజ కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియకుండా ఇప్పటికీ చాలామంది బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఈ తరుణంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ తన ఉద్యోగులకు ఎగిరి గంతేసే శుభవార్త ప్రకటించింది. ఇందులో భాగంగానే ఎనిమిది నెలల బోనస్ అందిస్తామని పేర్కొంది.2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ రికార్డు స్థాయిలో 1.98 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు పేర్కొంది. ఏడాది పొడవునా విమాన ప్రయాణాలకు డిమాండ్ భారీగా పెరిగిన కారణంగా ఈ సంస్థ గొప్ప లాభాలను ఆర్జించింది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్ తమ సరిహద్దుల మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో ఎయిర్‌లైన్స్ లాభాలను గడించింది.ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా సింగపూర్ ఎయిర్‌లైన్స్.. 'స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డ్' పొందింది. ఈ అవార్డును ఈ ఎయిర్‌లైన్స్ గతంలో ఐదు సార్లు సొంతం చేసుకుంది. 23 ఏళ్ల చరిత్ర కలిగిం సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఆరు సార్లు ఈ అవార్డును దక్కించుకుని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇండోనేషియాలో స్టార్‌లింక్ సర్వీస్.. 'మస్క్' నెక్స్ట్ ప్లాన్ అదేనా!
విశాలమైన ఇండోనేషియా ద్వీపసమూహంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ యాక్సెస్‌ను మెరుగుపరచాలనే లక్ష్యంతో టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్, ఇండోనేషియా హెల్త్ మినిష్టర్ 'బుడి గునాడి సాదికిన్' ఆదివారం స్పేస్ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రారంభించారు.ఇలాన్ మస్క్ (Elon Musk), ప్రాంతీయ రాజధాని డెన్‌పసర్‌లోని ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో జరిగిన ప్రారంభోత్సవ వేడుకకు హాజరయ్యేందుకు ఆదివారం ఉదయం ప్రైవేట్ జెట్ ద్వారా ఇండోనేషియా రిసార్ట్ ద్వీపం బాలికి చేరుకున్నారు.ఇండోనేషియాలో స్టార్‌లింక్ సర్వీస్ అందుబాటులోకి రావడం వల్ల దేశంలోని సుదూర ప్రాంతాల్లోని లక్షలాది మంది ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయడానికి సహాయపడుతుందని మస్క్ పేర్కొన్నారు. తక్కువ కనెక్టివిటీ ఉన్న ప్రదేశాలకు కనెక్టివిటీని తీసుకురావడానికి నేను చాలా సంతోషిస్తున్నానని అన్నారు. ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే ప్రజలు ఏమైనా నేర్చుకోవచ్చు.ఇండోనేషియా ప్రభుత్వం దేశంలోని గొప్ప నికెల్ వనరులను ఉపయోగించి ఈవీ రంగాన్ని అభివృద్ధి చేయాలనుకుంటోంది. కాబట్టి టెస్లా ఆ దేశంలో తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉంది. ఇండోనేషియాలో టెస్లా తయారీ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
భారత్ ఫార్మా కంపెనీలకు అమెరికా కీలక ఆదేశాలు
భారత్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీలు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, సన్ ఫార్మా మరియు అరబిందో ఫార్మాకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) కీలక ఆదేశాలు జారీ చేసింది. తయారీ సమస్యల కారణంగా యూఎస్ మార్కెట్లో ఉన్న ఉత్పత్తులను రీకాల్ చేయాలని ఆదేశించింది. న్యూజెర్సీలోని ప్రిన్స్టన్లో ఉన్న డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ జావిగ్టర్ (Javygtor), సాప్రోప్టెరిన్ డైహైడ్రోక్లోరైడ్ను రీకాల్‌కు సిద్ధమైంది. సన్ ఫార్మా సైతం ఫంగల్ ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉపయోగించే యాంఫోటెరిసిన్ బి లిపోసోమ్ రీకాల్ చేస్తున్నట్లు యూఎస్ఏఫ్డీఏ తెలిపింది.అదే విధంగా, అరబిందో ఫార్మా అమెరికన్ మార్కెట్లో ఆందోళనకు చికిత్స చేయడానికి ఉపయోగించే క్లోరాజెపేట్ డిపోటాషియం టాబ్లెట్లను (3.75 mg, 7.5 mg) రీకాల్ చేస్తోంది.
వీడియోలు
ఏజన్సీలో డయేరియా ఇద్దరు మృతి
మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు
పరారీలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
టీడీపీపై బొత్స సెటైర్లు
వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర
ఏపీలో మరో 7 రోజులు భారీ వర్షాలు
సాక్షి ఆఫీస్ లో టీ20 వరల్డ్ కప్..
కేబినెట్ భేటీ వాయిదా.. కారణం ఇదే..
బాటిల్స్ లో నో పెట్రోల్...ఈసీ ఆదేశం
తెలంగాణాలో మరో 3 రోజులు వర్షాలు
ఫ్యామిలీ
నిద్రను దూరం చేసేవి ఇవే! నివారించాలంటే..!
నగరజీవితం ప్రతి మారుమూల పల్లెల్నీ తాకాక, జీవితాల్లోకి సెల్‌ఫోన్ దూసుకువచ్చాక ప్రధానంగా మొన్న కరోనా అందరినీ తాకి వెళ్లాక నిద్రలేమి ఓ పెద్ద సమస్యగా మారింది. రాత్రి ఒంటిగంటా, రెండు వరకూ నిద్రపట్టకపోవడం మామూలేంది. వైద్యపరిభాషలో ‘ఇన్సామ్నియా డిజార్డర్’ అని పిలిచే ఈ సమస్య ఆరోగ్యానికి చాలా చేటు చేస్తుంది. నిద్రను దూరం చేసే అంశాలేమిటో, నిద్రపట్టేదెలాగో తెలిపేదే ఈ కథనం. నిద్రలేమి సమస్య అందరిలో ఒకలా ఉండదు. కొందరికి రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపట్టవచ్చు. కొందరికి త్వరగా నిద్రపట్టినప్పటికీ, కాసేపటికే మెలకువ వచ్చి... ఇక ఆపైన ఎంత ప్రయత్నించినా నిద్రరాక΄ోవచ్చు. కొందరికి ఏ తెల్లవారుజామున మూడు, మూడున్నరకు మెలకువ వచ్చాక... మళ్లీ ఏ ఆరు, ఏడు గంటలప్పుడో నిద్ర రావడం, కానీ ఎలాగూ తెల్లవారి΄ోయింది కదాని బలవంతంగా నిద్రలేస్తే... రోజంతా డల్‌గానూ ఉండవచ్చు. ఇవన్నీ నిద్రలేమి సమస్యలే. నిద్రలేమి రెండు రకాలుగా ఉండవచ్చు. మొదటిది తాత్కాలిక నిద్రలేమి, రెండోది దీర్ఘకాలిక నిద్రలేమి. మొదటిది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అదే మూడువారాల కంటే ఎక్కువకాలంగా బాధిస్తుంటే దాన్ని క్రానిక్ ఇన్‌సామ్నియాగా చెప్పవచ్చు. కారణాలను బట్టి నిద్రలేమిలో మరో రెండు రకాలుంటాయి. అవి... ప్రైమరీ ఇన్సామ్నియా: నిర్దిష్టమైన ఎలాంటి కారణాలూ లేకుండా మామూలుగా నిద్రపట్టక పోవడాన్ని ‘ప్రైమరీ ఇన్సామ్నియా’ అంటారు. సెకండరీ ఇన్సామ్నియా: ఇతరత్రా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల వచ్చే నిద్రలేమిని ‘సెకండరీ ఇన్సామ్నియా’ అంటారు. అంటే మానసిక సమస్యలతో బాధపడుతుండటం లేదా గ్యాస్ వల్ల కలిగే ఛాతీలో మంట, ఆస్తమా, క్యాన్సర్ (కొన్ని సందర్భాల్లో క్యాన్సర్‌కు తీసుకునే చికిత్సల వల్ల కూడా); గుండెజబ్బులు, కీళ్లనొప్పులు లేదా దేహంలో మరెక్కడైనా తీవ్రమైన నొప్పి వల్ల నిద్రపట్టకపోవడం; కొన్ని సందర్భాల్లో మత్తుపదార్థాలను అధికంగాతీసుకున్నప్పుడూ నిద్రకు దూరం కావడం మామూలే. పట్టరాని సంతోషమూ లేదా భరించలేనంత దుఃఖం వల్ల కూడా నిద్రపట్టకపోవచ్చు. ఇలా వచ్చే నిద్రలేమిని ‘సెకండరీ ఇన్సామ్నియా’గా చెప్పవచ్చు. ఇన్సామ్నియాకు కారణాలు చిన్నతనంలో తీవ్రవేదనకు గురికావడం డిప్రెషన్, యాంగై్జటీ వంటి మానసిక సమస్యలు నిద్రమేల్కొని షిఫ్టుల్లో పనిచేయడం ∙వాతావరణ పరిస్థితులు (పెద్ద పెద్ద శబ్దాలు, తీక్షణమైన కాంతి, ఎక్కువ వేడి/చలి) జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు (ప్రియమైన వారి మరణం, అకస్మాత్తుగా ఉద్యోగం మారడం, విడాకుల వంటివి) కొన్నిరకాల మందులతో (ఉదా: అలర్జీ, ఆస్తమా, డిప్రెషన్, బీపీలకు వాడే కొన్ని మందులు).మేనేజ్మెంట్ / చికిత్స: తాత్కాలిక నిద్రలేమికి చికిత్స అవసరం లేదు. కాక΄ోతే వేళకు నిద్రపోవడం వంటి మంచి అలవాట్ల ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. కానీ దీర్ఘకాలిక నిద్రలేమి ఉన్నప్పుడు ఏ కారణాల వల్ల ఇలా జరుగుతుందో చూడాలి. అంటే... మానసిక సమస్యల వల్లనా లేదా ఏవైనా శారీరక సమస్యలున్నాయా అని పరీక్షలు జర΄ాల్సిన అవసరముంటుంది. మానసిక సమస్యలతో ఇలా జరుగుతుంటే తగిన చికిత్స తీసుకోవాలి. ∙నిద్రమాత్రలు వాడటం ఒక చికిత్స. అయితే ఇవి తాత్కాలికంగానే వాడాలి. బాధితులు వాటికి అలవాటు పడే (అడిక్షన్‌కు) అవకాశం ఉంటుంది. అప్పుడు వాటిని వదిలించడానికి మరో చికిత్స చేయాల్సిరావచ్చు. అందుకే వాటిని దీర్ఘకాలం వాడటం సరికాదు. అందువల్ల జీవనశైలి మార్పులతో వేళకు నిద్ర΄ోయేలా చేసుకోవడం మంచిది. నిద్రలేమి నివారణ ఇలా... వేళకు నిద్ర΄ోవాలి. నిద్రకు అరగంట ముందర గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది ∙మధ్యాహ్నం నిద్ర ఓ పవర్న్యాప్లా అరగంట చాలు. ఒకవేళ మధ్యానం చాలాసేపు నిద్రపోతే అది రాత్రి నిద్రకు చేటుగా మారవచ్చు కెఫిన్ మోతాదు ఎక్కువగా ఉండే కాఫీతో తోపాటు కొన్ని కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి ∙సిగరెట్లలోని నికోటిన్‌తో కూడా నిద్రను దూరం చేస్తుంది.ఆల్కహాల్‌తో నిద్ర పట్టినప్పటికీ ఒక్కోసారి తెల్లవారుజామున మెలకువ వచ్చి మళ్లీ నిద్రపట్టక΄ోవడం, నిద్ర సమయం తగ్గి΄ోవడం మామూలే. అందుకే మద్యం అలవాటుకు దూరంగా ఉండాలి ∙వ్యాయామంతో అలసిపోతే బాగా నిద్రపడుతుంది. అయితే నిద్రపోవడానికి 4–5 గంటల ముందు వ్యాయామం చేయకూడదు. పడక గదిలో టీవీ ఎట్టిపరిస్థితుల్లో ఉండకూడదు తీవ్రమైన ఉద్విగ్నత, ఆందోళన నిద్రను దూరం చేసే అంశాలు. అందుకే మానసిక ప్రశాంతత అవసరం. ఇందుకోసం యోగా, ధ్యానం చాలావరకు ఉపయోగపడతాయి నిద్ర టైముకు అరగంట ముందర గోరువెచ్చని పాలు తాగాలి. అందులోని ట్రిప్టోఫాన్ అనే ఎసెన్షియల్ అమైనో యాసిడ్ మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. నిద్రమాత్ర కంటే ఇది చాలా ఆరోగ్యకరమైన అలవాటని గుర్తుంచుకోవాలి. డాక్టర్ కిషన్ శ్రీకాంత్ జువ్వా, స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మనాలజిస్ట్ (చదవండి: మగవాళ్లకు స్టయిలింగ్ చేయడమే కష్టం! ఈశా భన్సాలీ)
ఆ బండరాయి.. కేవలం వేళ్లపైనే..! ఎలా అనేది నేటికీ మిస్టరీనే!
అసాధారణమైన దృశ్యాలు కానీ.. శాస్త్రం తేల్చలేని సంఘటనలు కానీ.. ఎప్పటికీ మిస్టరీలుగానే మిగులుతాయి.మహారాష్ట్ర, శివపురిలోని హజ్రత్ ఖమర్ అలీ దర్వేష్ దర్గాలో కూడా అలాంటి మిస్టరీనే దాగి ఉంది. ఆ దర్గాలో ఉన్న ఓ 90 కేజీల రాయి.. కేవలం పదకొండు మంది చూపుడు వేళ్ల మీద నిలబడిపోతుంది. ఆ తర్వాత గాల్లోకి తేలుతుంది.‘దర్వేష్ అలీ సాహెబ్’ అనే ఒక ముస్లిం సాధువు.. ఎక్కడి నుంచో ఆ ప్రదేశానికి వచ్చి.. కొంత కాలం అక్కడే జీవించి, అక్కడే సజీవ సమాధి అయ్యారనేది స్థానికుల కథనం. నిజానికి ఆ దర్గాను ముస్లిమ్‌ల కంటే హిందువులే ఎక్కువగా ఆరాధిస్తుండటం విశేషం. మరీ ముఖ్యంగా హిందువుల్లో కురుమ, యాదవులు తమ పెంపుడు జీవులైన గొర్రె జాతి వృద్ధి చెందాలని, అందుకు దర్వేష్ స్వామి ఆశీస్సులు ఉండాలని.. మొక్కుబడులు కట్టి, స్వామి పేరిట ప్రతి ఏడాది ఒక పొట్టేలును విడిచిపెడతారు. సంవత్సరం పాటు దాన్ని మేపి, ఉర్సు సందర్భంగా ఆ మొక్కు చెల్లించుకుంటారు. ఈ దర్గాను ‘దర్శెల్లి’ అని కూడా పిలుస్తారట. స్థానిక హిందువులు ఎంతో భక్తితో ఈ దర్గా స్వామి పేర్లను తమ పిల్లలకు పెట్టుకుంటారు. అందుకే అక్కడ ఎక్కువగా దర్శం,దర్శెల్లి అనే పేర్లు వినిపిస్తుంటాయి. ఈ అనవాయితీ నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ మొక్కితే కోరిన కోరికలు తీరతాయని నమ్ముతారు చాలామంది.ఇక ఆ రాయి విషయానికి వస్తే.. అది చూడటానికి సాధారణంగానే కనిపిస్తుంది. కానీ చేతి వేళ్ల సాయంతో ఆ బండ ఎలా గాల్లోకి లేస్తుంది? అనేది మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. కండలు తిరిగిన ఆజానుబాహులు కొందరు ఆ బండను బలవంతంగా లేపి.. తమ ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ ఎవరైనా పదకొండు మంది కలసి.. ‘దర్వేష్ అలీ బాబా’ నామాన్ని భక్తితో జపిస్తూ ఆ బండరాయిని లేపితే.. కేవలం వేళ్లపైనే.. అది తేలికగా పైకి లేస్తుంది. ఇది ఎలా సాధ్యమో నేటికీ మిస్టరీనే!సంహిత నిమ్మన (చదవండి:
మగవాళ్లకు స్టయిలింగ్ చేయడమే కష్టం! ఈశా భన్సాలీ
బాలీవుడ్లో రాజ్‌కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానా ఎట్సెట్రా.. హీరోలు కారు. నటులు! వీళ్ల గ్లామర్, గ్రామర్ అంతా కూడా వాళ్ల యాక్టింగ్ టాలెంటే! కానీ ఫ్యాషన్ అండ్ స్టయిల్లో వీళ్లిప్పుడు రణ్వీర్ సింగ్‌తో పోటీపడుతున్నారు! క్రెడిట్.. స్టయిలిస్ట్ ఈశా భన్సాలీదే!ఈశా భన్సాలీ పుట్టిపెరిగింది ముంబైలో! డిజైన్ అండ్ ఇన్నొవేషన్‌లో మాస్టర్స్ చేసింది. చదువైపోయాక చాలామంది ఫ్యాషన్ డిజైనర్స్లాగే ఈశా కూడా ఒక ఫ్యాషన్ మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా వ్యవహరించింది. ఆ బాధ్యతల్లో తలమునకలుగా ఉంటూనే ఫ్యాషన్ షోల్లో పాల్గొనేది. ఆమె అభిరుచి, సూక్ష్మ పరిశీలనే ఈశాకు బాలీవుడ్లో ఎంట్రీ కల్పించాయి. సమకాలీన పోకడలకు సంప్రదాయ సోకును అద్దే ఈశా శైలి బాలీవుడ్లో ఆమెకు ప్రత్యేకతనిచ్చింది.ఆ స్పెషాలిటీయే రాజ్‌కుమార్ రావు ఆమెను సంప్రదించేలా చేసింది.. తనకు స్టయిలిస్ట్‌గా ఉండమని! ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్స్ ఇసుమంత కూడా లేని ఆ నటుడికి స్టయిలిస్ట్‌గా పనిచేయడమంటే సవాలే! ఒకింత రిస్క్ కూడా! తన ఎక్స్పరిమెంట్స్ ఏ కొంచెం అటూ ఇటూ అయినా తన పేరుతో పాటు రాజ్‌కుమార్ రావు ఖ్యాతీ అభాసుపాలవుతుంది. కానీ ఫ్యాషన్ అండ్ స్టయిల్ అంటే పర్సనాలిటీని మెరుగుపరచడమే కదా అనే తన ఫ్యాషన్ స్టెప్ని గుర్తు తెచ్చుకుంది. ఫాలో అయిపోయింది. ఆమె చేసిన స్టయిలింగ్‌తో రాజ్‌కుమార్ రావు సెల్యులాయిడ్ మీద అపియర్ అయ్యాడు. ఆడియెన్స్ మురిసిపోయారు ఆయన నటనతోపాటు ఆ స్టయిల్‌కీ! రాజ్‌కుమార్ రావు న్యూ లుక్స్ అజయ్ దేవ్గణ్నీ అబ్బురపరచాయి. ఆరా తీస్తే ఈశా భన్సాలీ పేరు వినిపించింది. అంతే కబురు పంపాడు. తనకు పర్సనల్ స్టయిలిస్ట్ అవసరం లేదు కానీ సినిమాల్లో తనకు కాస్ట్యూమ్ డిజైన్ చేసేపెట్టే బాధ్యతను తీసుకోమన్నాడు. రాజ్‌కుమార్ రావును మించిన చాలెంజ్ అది. అజయ్ దేవ్గణ్కున్న హీరో ఇమేజే పెద్ద హర్డల్. అయినా అధిగమించింది ఏకంగా ఒక ప్రయోగంతో. ఆ కటౌట్ పర్సనాలిటీకి వైట్ జీన్స్, చెక్స్ బ్లేజర్ కాంబినేషన్ కాస్ట్యూమ్ని డిజైన్ చేసి! ఆ ప్రతిభతో బాలీవుడ్ అటెన్షన్ అంతా ఈశా మీదకు మళ్లింది. చాలామంది డైరెక్టర్స్ తమ సినిమాలకు ఆమెను కాస్ట్యూమ్ డిజైనర్‌గా పెట్టుకున్నారు. వాటిల్లో పీకూ, హిందీ మీడియం చిత్రాలూ ఉన్నాయి.ఈశా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్‌ని ధరించిన స్టార్స్‌లో ఇర్ఫాన్ ఖాన్ కూడా ఉన్నాడు. పని పట్ల ఆమెకున్న కమిట్మెంట్, ఎక్స్‌పరిమెంట్స్‌కి స్టార్స్‌ని ఆమె కన్విన్స్ చేసే విధానం నచ్చిన ఆయుష్మాన్ ఖురానా.. ఈశాను తనకు పర్సనల్ స్టయిలిస్ట్‌గా ఉండమని రిక్వెస్ట్ చేశాడు. ఆయుష్మాన్ ఖురానాకు ఫ్యాషన్ స్పృహ మెండు. ఇది కూడా ఆమెకు చాలెంజే అయింది. అన్నిట్లో ప్రవేశం .. కొన్నిట్లో ప్రావీణ్యం ఉన్న ఆయుష్మాన్లాంటి వాళ్లను మెప్పించడం మహా కష్టం. అయితే ఆ నటుడు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంది ఈశా.. ఆయన వ్యక్తిత్వానికి తగిన స్టయిల్ని జోడించి.. ఆ పర్సన్‌ని మరింత ఎలిగెంట్‌గా ప్రెజెంట్ చేసి! ఆ కాంబినేషన్ ఆఫ్ జర్నీ ఇంకా కొనసాగుతోంది!‘ఆడవాళ్లకు స్టయిలింగ్ చేయడం కష్టం అనుకుంటారు కానీ.. ఈజీ! మగవాళ్లకే కష్టం. ఫర్ ఎగ్జాంపుల్.. రెడ్‌కార్పెట్ కోసం ఫీమేల్ స్టార్స్‌కి స్టయిలింగ్ చేయాలనుకోండి.. గౌను.. దానికి తగ్గ జ్యూలరీ అండ్ షూస్ మీద దృష్టి పెడితే చాలు. అదే మగవాళ్లకైతే.. జాకెట్, టై ఉండాలా.. వద్దా.. ఉంటే మ్యాచింగ్ టై, లేపల్ పిన్, షూస్, సాక్స్, కఫిన్స్.. ఓ మై గాడ్.. ఎన్ననీ! ఆయుష్మాన్ ఖురానాతో ప్రమోషన్స్ అంటే చాలా ఎక్సయిట్మెంట్గా ఉంటుంది. క్రియేటివిటీ హై లెవెల్లో ఉంటుంది! నా పర్సనల్ స్టయిల్ని డిస్క్రైబ్ చేయాలంటే నేను మినిమలిజమ్ని ఇష్టపడతాను. నా స్టేట్మెంట్ పీస్ ఒక్కదానితో నా ఎంటైర్ లుక్‌ని ప్రెజెంట్ చేస్తాను. ఒక్కమాటలో చెప్పాలంటే సింప్లిఫైడ్ వెర్షన్ ఆఫ్ ఎలెక్టిక్ అన్నమాట!’ --ఈశా భన్సాలీ
ఈ డివైజ్‌తో క్షణాల్లో సిల్కీ హెయిర్ సొంతం!
సాఫ్ట్ అండ్ సిల్కీ హెయిర్‌ని ఇష్టపడనిదెవరు.. దానికోసం కష్టపడనిదెవరు! ఆ తలకట్టు కోసం పార్లర్లు, హెయిర్ స్పాల చుట్టూ తిరగడం ఆపి ఈ చిత్రంలోని హెయిర్ ట్రీట్మెంట్ అప్లికేటర్‌ను తెచ్చుకోండి. ఇది జుట్టును క్షణాల్లో మృదువుగా మార్చేస్తుంది.ఈ డివైస్.. అరచేతిలో అమరిపోయే చంద్రవంకలా కనిపిస్తుంది. వెనుకవైపు ఉన్న మినీ ట్యాంకర్లో నీళ్లతో పాటు.. సీరమ్ లేదా లోషన్ వంటివి మిక్స్ చేసి బటన్ నొక్కితే ఆవిరి రూపంలో బయటికి వస్తుంది. ఆ ఆవిరిని జుట్టు మొత్తానికి పట్టించుకుంటే చాలు.. సెట్ చేసిన హెయిర్ స్టైల్ సెట్ చేసినట్లుగా.. కదలకుండా ఆకర్షణీయంగా నిలుస్తుంది.అధునాతన మైక్రోటెక్నాలజీతో రూపొందిన ఈ మెషిన్‌తో.. జుట్టుకే కాదు ముఖానికీ ఆవిరి పట్టుకోవచ్చు. ఈ మినీ ట్యాంకర్‌ను డివైస్ నుంచి సులభంగా వేరు చేసుకోవచ్చు. అలాగే ఆ ట్యాంకర్‌కి ప్రత్యేకమైన లాకర్ లాంటి మూత ఉంటుంది. దాన్ని బాటిల్ మూతలా బిగించుకుంటే సరిపోతుంది. ఈ డివైస్ చాలా రంగుల్లో లభిస్తోంది. ఇది అన్ని రకాల జుట్టు స్వభావాలకు అనుకూలమైనది! (చదవండి:
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్న ఆలోచన మానుకోండి... కాంగ్రెస్ పార్టీకి హితవు పలికిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాకాండపై వినీత్ బ్రిజ్‌లాల్ నేత్వత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
రుణమాఫీకి ఏర్పాట్లు చేయండి, ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే.. అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 81.3 శాతం పోలింగ్... వెల్లడించిన సీఈవో కార్యాలయం వర్గాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన ఓటర్లు. కడపటి వార్తలు అందే సమయానికి 76.50 శాతం పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో వన్స్‌మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావు, ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 57 నెలలకే అంతం చేసే కుట్రలు.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది పెత్తందార్ల కూటమి... ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా కోట»ొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ చిన్నవెంకటాపురంలో టీడీపీ మూకలు అన్యాయంగా ఓ ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఈ పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్వస్థలం కావడం గమనార్హం. చిన్నవెంకటాపురం పోలింగ్ బూత్‌లో వైఎస్సార్సీపీ తరఫున తోట మాధవరావు ఏజెంట్‌గా ఉండడంతో టీడీపీ కార్యకర్తలు కక్ష పెంచుకుని అతని తండ్రి మల్లేష్ పై ఇటీవల దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆయన మృత్యువుతో పోరాడుతూ ఆదివారం ప్రాణాలు విడిచారు. అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడు హరివరప్రసాద్ డైరెక్షన్లో ఈ నెల 16న గ్రామ దేవత పండగను ఆసరాగా చేసుకుని మల్లేష్‌పై దాడి చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు పూతి లక్ష్మణరావు, పూతి భానుచందర్, పూతి కర్రెన్న, పూతి రమణ తదితరులు ఈ దాడికి పాల్పడ్డారు. ఇది అచ్చెన్నాయుడు చేసిన హత్యేనని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. సుమారు 40 ఏళ్లుగా నిమ్మాడ పంచాయతీలో శాంతియుతంగా ఎన్నికలు జరగలేదని, ఈ సారీ ఎన్నికల్లో రిగ్గింగ్‌కు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో అచ్చెన్నాయుడుకు ఓటమి భయం పట్టుకుందని పేర్కొన్నారు. నిమ్మాడ పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ తరఫున బూత్ ఏజెంట్‌గా వ్యవహరించిన కింజరాపు అప్పన్నను చంపేస్తామని బెదిరించారని దువ్వాడ ఆరోపించారు. మల్లేష్ మృతికి బాధ్యులైన అచ్చెన్నాయుడు, హరివరప్రసాద్తో పాటు టీడీపీ వర్గీయులను అరెస్టు చేయాలని దువ్వాడ డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ హామీ ఇచ్చారు.
విజయవాడ: వాహనం ఢీ కొట్టి ఏఎస్ఐ మృతి
ఎన్టీఆర్ జిల్లా: ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు వెళ్తండగా మృత్యువు రూపంలో వచ్చిన కారు ఏఎస్ఐ ప్రాణాలను బలిగొంది. ఈ దిగ్బ్రాంతికర ఘటన హైదరాబ్ టు విజయవాడ హైవేలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.హైవేకి ఆనుకుని ఉన్న సడక్ రోడ్డు వద్ద అధికారులు పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేశారు. సరిగ్గా ఆ ప్రదేశంలోనే రోడ్డు దాటుతుండగా సీపీఎస్‌లో పనిచేస్తున్న ఏఎస్ఐ రమణ మీదకు కారు దూసుకుపోయింది. దీంతో ఏఎస్ఐ రమణ తీవ్రగాయాల పాలయ్యారు. సంఘటన స్థలంలో ఉన్న మిగతా పోలీసులు స్పందించి హుటహుటాని రమణను విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమోన్మాది నాగరాజుకు ఉరిశిక్ష విధించాలి
నెల్లూరు(అర్బన్): ప్రేమ పేరుతో వెంటపడి వేధించి పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంతో తల్లీకూతుళ్లపై హత్యాయత్నం చేసిన క్రూరుడు నాగరాజును సమాజంలో తిరగనీయకూడదని, అలాంటి వ్యక్తికి ఉరిశిక్ష విధించాలని మహిళా కమిషన్ రాష్ట్ర చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి అన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులో పూజిత, ఆమె తల్లి కాంతమ్మలపై నిందితుడు నాగరాజు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి నెల్లూరులోని ఎనెల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పూజిత, కాంతమ్మను మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి శనివారం పరామర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ మహిళలపై దాడులకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదన్నారు. బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి యాజమాన్యానికి ఆదేశాలిచ్చామన్నారు. అనంతరం ఆమె దర్గామిట్టలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆవరణలో ఉన్న వన్‌స్టాప్ సఖి సెంటర్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి వల్లెం విమల, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయనిర్మల, రాజ్యలక్ష్మి, అధికార ప్రతినిధి సుప్రియ పాల్గొన్నారు.
ప్రజా ప్రతినిధులకే కుచ్చుటోపి
సాక్షి, హైదరాబాద్ : ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శినంటూ ప్రజా ప్రతినిధులనే మోసం చేస్తున్న ఘరానా మోసగాణ్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ ఎస్ మట్టం రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తోట బాలాజీ నాయుడు అలియాస్ మల్లారెడ్డి/ దాసరి అనిల్ కుమార్ మై నేత.కామ్ వెబ్సైట్ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్ నంబర్లు సేకరించేవాడు. వారికి ఫోన్ చేసి ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా పరిచయం చేసుకునేవాడు. ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించనుందని, గ్రాంట్‌ను విడుదల చేయనుందని వివరించేవాడు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కావాలని కోరేవాడు. నిజమేనని నమ్మిన ప్రజా ప్రతినిధులు బాలాజీ నాయుడు సూచించిన మ్యూల్ బ్యాంక్ ఖాతాకు నగదు బదిలీ చేసేవారు. ఆ తర్వాతి నుంచి ఫోన్ స్విఛాఫ్ చేసేవాడు. ఈ క్రమంలో ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి.. కొత్త ప్రభుత్వం రుణ పథకాన్ని ప్రారంభిస్తుందని, తనతో పాటు వంద మంది సభ్యులు పాల్గొనాల్సి ఉంటుందని సూచించాడు. నిజమేనని నమ్మిన సదరు శాసనసభ సభ్యుడు రూ.3.60 లక్షలు నిందితుడు సూచించిన మ్యూల్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేశారు. నగదు విత్‌డ్రా చేసిన తర్వాత నిందితుడు కాల్స్ చేయడం మానేశాడు. దీంతో మోసపోయామని గ్రహించిన ఎమ్మెల్యే సూచన మేరకు తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడు బాలాజీని అరెస్టు చేశారు.లంచం కేసులో దొరికే, జాబ్ పోయే.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తోట బాలాజీ నాయుడు 2008లో రామగుండంలోని ఎనీ్టపీసీలో ఏఈగా ఉద్యోగంలో చేరాడు. చేరిన ఏడాది కాలంలోనే 2009 ఫిబ్రవరిలో ఓ ఎమ్మెల్యే పీఏ నుంచి లంచం తీసుకుంటుండగా.. సీబీఐ చేతికి చిక్కాడు. దీంతో బాలాజీని అరెస్టు చేసి, రిమాండ్ నిమిత్తం కరీంనగర్ జైలుకు తరలించారు. దీంతో ఎనీ్టపీసీ సంస్థ బాలాజీని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. జైలు నుంచి బయటికి వచ్చిన కొంత కాలం తర్వాత బాలాజీ మళ్లీ విశాఖ పరవాడ సింహాద్రీ పవర్ ప్లాంట్‌లో తిరిగి ఉద్యోగంలో చేరాడు. కానీ, అతని ప్రవృత్తిలో మార్పు రాకపోవడంతో 2009లో అతన్ని సరీ్వస్ నుంచి తొలగించారు. ఇక అక్కడ్నుంచి మోసాలకు పాల్పడటే వృత్తిగా ఎంచుకున్నాడు. బాలాజీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 37 కేసులున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతని చేతిలో మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు.