'నిజాలు తొక్కిపెడుతున్నారు..' | ysrcp takes on ap governement | Sakshi
Sakshi News home page

'నిజాలు తొక్కిపెడుతున్నారు..'

Jul 22 2017 11:46 AM | Updated on Aug 18 2018 8:05 PM

ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న భూకుంభకోణం విచారణ విషయంలో నిజాలను కావాలనే తొక్కిపెడుతున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న భూకుంభకోణం విచారణ విషయంలో నిజాలను కావాలనే తొక్కిపెడుతున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కుంభకోణంలో ముమ్మాటికీ ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

విశాఖపట్నం తదితర భూకబ్జాలపై సీబీఐ విచారణ మాత్రమే జరపాలని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. విశాఖతోపాటు పలు ప్రాంతాల్లో భారీగా భూకుంభకోణాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం పక్కన బెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement