ఆర్మీ దాడి: పాక్ క్రికెటర్ అనూహ్య స్పందన

ఆర్మీ దాడి: పాక్ క్రికెటర్ అనూహ్య స్పందన


లాహోర్: ఉడీ ఉగ్రదాడికి ప్రతీకారంగా పీవోకేలో ఇండియన్ ఆర్మీ సర్జికల్ అటాక్.. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత.. 10 కిలోమీటర్ల మేర గ్రామస్తుల తరలింపు.. ఏక్షణమైనా యుద్ధం మొదలవుతుందనే అనుమానాలు.. వీటన్నింటి నేపథ్యంలో పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ అనూహ్య స్పందించాడు. క్రికెట్ నుంచి దాదాపు రిటైర్ అయి, సామాజికసేవలో నిమగ్నమైన అప్రిదీ.. యుద్ధం గురించి ఏమన్నాడంటే..



'చర్చల ద్వారా వివాదాలు, సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉండగా యుద్ధంలాంటి తీవ్ర నిర్ణయాలు వద్దు. పైగా పాకిస్థాన్ శాంతికాముక దేశం. ఇండియాతో సుహ్రుద్భావ సంబంధాలను కోరుకుంటోంది. యుద్ధమే వస్తేగనుక ఇరు పక్షాలు తీవ్రంగా నష్టపోతాయి. అందుకే 'say No to War'అంటున్నా'నని అఫ్రిదీ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. తాను క్రికెట్ ఆడిన అన్ని దేశాలకంటే ఇండియాలో ఆడటమే గొప్పగా భావించానని గతంలో వ్యాఖ్యానించిన అఫ్రిదీపై స్వదేశంలో విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే.


 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top