హీరోయిన్ పై పోలీసు నిఘా | police search for mamata kulakrni | Sakshi
Sakshi News home page

హీరోయిన్ పై పోలీసు నిఘా

Apr 29 2016 11:02 AM | Updated on Apr 3 2019 6:34 PM

హీరోయిన్ పై  పోలీసు నిఘా - Sakshi

హీరోయిన్ పై పోలీసు నిఘా

రూ. 2 వేల కోట్ల మాదకద్రవ్యాల కేసులో బాలీవుడ్ నటి మమతా కులకర్ణి, ఆమె భర్త వికీ గోస్వామిల కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు.

ముంబై: రూ. 2 వేల కోట్ల మాదకద్రవ్యాల కేసులో బాలీవుడ్ నటి  మమతా కులకర్ణి, ఆమె భర్త వికీ గోస్వామిల కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. గతవారం థానే పోలీసులు షోలాపూర్ ఔషధ తయారీ కర్మాగారం, థానేలోని వివిధ ప్రాంతాల నుంచి 18.50 టన్నుల ఎఫెడ్రై న్, 2.5 టన్నుల ఎసిటిక్ ఎన్‌హైడ్రై డ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసు గురించి థానే పోలీసు కమిషనర్ పరాంబిర్ సింగ్ మాట్లాడుతూ... నైజీరియాకు చెందిన సిప్రెన్ చినాస్సాతో పాటు ఎనిమిది మందిని అరెస్టు చేశామని చెప్పారు. మరో నలుగురి కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశామన్నారు. కెన్యాలో గోస్వామిని కలిసి ఆ దేశంలో మాదకద్రవ్యాల కర్మాగారం ఏర్పాటుపై చర్చించామంటూ నిందితులు విచారణలో వెల్లడించారని కమిషనర్ తెలిపారు.  2014లో వికీ, మమతలను మాదకద్రవ్యాల సరఫరా నేరంపై కెన్యా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వారిద్దరు బెయిల్‌పై ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement