లేడీ ప్రొఫైల్‌తో కేడీ పనులు | Sakshi
Sakshi News home page

లేడీ ప్రొఫైల్‌తో కేడీ పనులు

Published Fri, Jan 27 2017 4:28 AM

లేడీ ప్రొఫైల్‌తో కేడీ పనులు - Sakshi

డేటింగ్‌ సైట్లలో యువతిగా నైజీరియన్‌ యువకుడు
ఆస్ట్రేలియన్‌ యువకుడికి రూ.64 లక్షల గాలం
అరెస్ట్‌ చేసిన సీఐడీ అధికారులు  


సాక్షి, హైదరాబాద్‌: అందమైన యువతి ఫొటోలతో డేటింగ్‌ సైట్లతో యువకులను ఆకర్షించి... ప్రేమ, పెళ్లి అని కోట్లు కొట్టేశారు. చివరకు లక్షలు సమర్పించుకున్న ఆస్ట్రేలియన్‌ ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు... సూత్రధారి నైజీరియన్‌ను గురువారం అరెస్టు చేశారు. నైజీరియా నుంచి వచ్చిన మహ్మద్‌ హుస్సాని బౌరా కోకాపేట్‌లో నివసిస్తున్నాడు. టోలిచౌకికి చెందిన మెహసీన్‌ ఆగా, మరో మహిళతో కలసి డేటింగ్‌ సైట్లలో ప్రేమ పేరుతో యువకులను టార్గెట్‌ చేయడం వీరి పని. గతేడాది జనవరిలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తితో నైజీరియా వాసి మహ్మద్‌ హుస్సాని బౌరా అలియాస్‌ సారా హైమిస్‌ (లేడీ ప్రొఫైల్‌)తో చాటింగ్‌ చేయడం ప్రారంభించాడు. మెయిల్స్, ఫోన్‌ కాంటాక్ట్‌లతో దగ్గరయ్యారు. తానూ ఆస్ట్రేలియన్‌ యువతినే అని నమ్మించాడు. ఇండియాలో ఫ్యాబ్రిక్స్‌ అండ్‌ జెమ్స్‌ వ్యాపారం చేసేందుకు వచ్చానని తెలిపాడు. భారత ప్రభుత్వం నుంచి రూ.14.29 కోట్లు రావాల్సి ఉందని... ఆస్ట్రేలియన్‌ను నమ్మించాడు. ఇందుకు ట్యాక్స్‌ చెల్లించేం దుకు రూ.1.43కోట్లు కావాల్సి ఉందని, కొంచెం డబ్బులు సమకూర్చాలని కోరాడు.

రూ.64 లక్షలు సమర్పించుకున్న ఆస్ట్రేలియన్‌...
పెళ్లి చేసుకోబోయే అమ్మాయే కదా అని... ఆస్ట్రేలియా వ్యక్తి రూ.64 లక్షలు మెహసీన్‌ ఆగా అకౌంట్‌కు బదిలీ చేశాడు. నగదు బదిలీ కాగానే... నిందితులు మెయిల్స్, చాటింగ్‌ బంద్‌ చేసేశారు. దీంతో యువతిని కలిసేందుకు నేరుగా హైదరాబాద్‌ వచ్చి న ఆస్ట్రేలియన్‌... అది కుదరకపోవడంతో సీఐడీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చే శాడు. దీనిపై విచారణ చేపట్టిన సీఐడీ పోలీసులు గురువారం హుస్సాని, మెహసీన్‌ను అరెస్ట్‌ చేశారు. ఓ మహిళను పలుసార్లు ఆస్ట్రేలియా వ్యక్తితో మాట్లాడిం చినట్టు పోలీ సులు గుర్తించారు. ఆ మహిళ పరారీలో ఉందని సీఐడీ ఐజీ తెలిపారు. రూ.20 లక్షలు న్న బ్యాంక్‌ ఖాతాను సీజ్‌ చేశామని, ల్యాప్‌ట్యాప్, పెన్‌డ్రైవులు, మొబైల్‌ ఫోన్లు స్వాధీ నం చేసుకున్నామన్నారు. వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించిందని తెలిపారు.

Advertisement
 
Advertisement