నార్సింగిలో జిలుగు విత్తనాల పంపిణీ | Sakshi
Sakshi News home page

నార్సింగిలో జిలుగు విత్తనాల పంపిణీ

Published Fri, May 24 2024 1:40 PM

నార్సింగిలో జిలుగు విత్తనాల పంపిణీ

చిన్నశంకరంపేట(మెదక్‌): ప్రభుత్వ సబ్సిడీ ద్వారా పెద్ద జనుము, జిలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని రైతులు సద్వినియోగం చేసుకోవాలని నార్సింగి ఏఓ యాదగిరి కోరారు. గురువారం నార్సింగి మండల కేంద్రంలో రైతులకు సబ్సిడీ ద్వారా పెద్ద జనుము, జిలుగు విత్తనాలు అందించారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ.. నార్సింగి ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రంలోఈ విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నాయని, ప్రభుత్వం 60 శాతం సబ్సిడీపై విత్తనాలు అందిస్తుందన్నారు. సబ్సిడీ పోను పెద్ద జనుము 40 కిలోల బస్తా రూ.1448, జిలుగు 30 కిలోల బస్తా రూ.1116 ధరను చెల్లించి కొనుగోలు చేయాలని తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు గవ్వలపల్లి ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రంలో సబ్సిడీపై పెద్ద జనుము, జిలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఏఓ లక్ష్మీప్రవీణ్‌ తెలినారు.

Advertisement
 
Advertisement
 
Advertisement