-
లేడీ ప్రొఫైల్‌తో కేడీ పనులు
డేటింగ్ సైట్లలో యువతిగా నైజీరియన్ యువకుడు ఆస్ట్రేలియన్ యువకుడికి రూ.64 లక్షల గాలం అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు సాక్షి, హైదరాబాద్: అందమైన యువతి ఫొటోలతో డేటింగ్ సైట్లతో యువకులను ఆకర్షించి... ప్రేమ, పెళ్లి అని కోట్లు కొట్టేశారు. చివరకు లక్షలు సమర్పించుకున్న ఆస్ట్రేలియన్ ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు... సూత్రధారి నైజీరియన్‌ను గురువారం అరెస్టు చేశారు. నైజీరియా నుంచి వచ్చిన మహ్మద్ హుస్సాని బౌరా కోకాపేట్లో నివసిస్తున్నాడు. టోలిచౌకికి చెందిన మెహసీన్ ఆగా, మరో మహిళతో కలసి డేటింగ్ సైట్లలో ప్రేమ పేరుతో యువకులను టార్గెట్ చేయడం వీరి పని. గతేడాది జనవరిలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తితో నైజీరియా వాసి మహ్మద్ హుస్సాని బౌరా అలియాస్ సారా హైమిస్ (లేడీ ప్రొఫైల్)తో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. మెయిల్స్, ఫోన్ కాంటాక్ట్‌లతో దగ్గరయ్యారు. తానూ ఆస్ట్రేలియన్ యువతినే అని నమ్మించాడు. ఇండియాలో ఫ్యాబ్రిక్స్ అండ్ జెమ్స్ వ్యాపారం చేసేందుకు వచ్చానని తెలిపాడు. భారత ప్రభుత్వం నుంచి రూ.14.29 కోట్లు రావాల్సి ఉందని... ఆస్ట్రేలియన్ను నమ్మించాడు. ఇందుకు ట్యాక్స్ చెల్లించేం దుకు రూ.1.43కోట్లు కావాల్సి ఉందని, కొంచెం డబ్బులు సమకూర్చాలని కోరాడు. రూ.64 లక్షలు సమర్పించుకున్న ఆస్ట్రేలియన్... పెళ్లి చేసుకోబోయే అమ్మాయే కదా అని... ఆస్ట్రేలియా వ్యక్తి రూ.64 లక్షలు మెహసీన్ ఆగా అకౌంట్‌కు బదిలీ చేశాడు. నగదు బదిలీ కాగానే... నిందితులు మెయిల్స్, చాటింగ్ బంద్ చేసేశారు. దీంతో యువతిని కలిసేందుకు నేరుగా హైదరాబాద్ వచ్చి న ఆస్ట్రేలియన్... అది కుదరకపోవడంతో సీఐడీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చే శాడు. దీనిపై విచారణ చేపట్టిన సీఐడీ పోలీసులు గురువారం హుస్సాని, మెహసీన్ను అరెస్ట్ చేశారు. ఓ మహిళను పలుసార్లు ఆస్ట్రేలియా వ్యక్తితో మాట్లాడిం చినట్టు పోలీ సులు గుర్తించారు. ఆ మహిళ పరారీలో ఉందని సీఐడీ ఐజీ తెలిపారు. రూ.20 లక్షలు న్న బ్యాంక్ ఖాతాను సీజ్ చేశామని, ల్యాప్‌ట్యాప్, పెన్డ్రైవులు, మొబైల్ ఫోన్లు స్వాధీ నం చేసుకున్నామన్నారు. వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందని తెలిపారు. -
ఫేస్బుక్ అమ్మాయి ఫ్రెండ్షిప్ రిక్వస్ట్!
‘ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్లకుంటాయి...’ ఫేస్బుక్ స్నేహాంలో కూడా ఈ వాక్యాన్ని అన్వయించుకోవచ్చు. తాము ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయాలనుకొంటున్నామో, చాటింగ్ చేద్దామనుకొంటున్నామో అమ్మాయిలకూ, అబ్బాయిలకూ చాలా క్లారిటీ ఉంటుందని చెప్పవచ్చు. ‘‘డియర్ గర్ల్... నీకు నేను ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పెట్టినంత మాత్రాన నిన్ను లవ్ చేస్తున్నట్టు కాదు, నిన్ను లవ్‌లో పడేయాలని కాదు, ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్‌ను డిలీట్ చేయడం నీ గొప్పతనమూ కాదు..!’’ తన ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయని అమ్మాయికి ఒక అబ్బాయి పెట్టిన మెసేజ్ ఇది... విరిసే ప్రతి పువ్వూ పరిమళాన్ని వెదజల్లలేదు. ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెట్టిన వాళ్లంతా ‘ఫ్రెండ్స్’ కాలేరు! తను తిరస్కరించిన రిక్వెస్ట్‌కు కొంచెం ఘాటుగా, స్వీటుగా అమ్మాయి చెప్పిన సమాధానం ఇది! అమ్మాయిలతో స్నేహం చేయడానికి అబ్బాయిలు కెరటాల్లా ఎగసి పడుతున్నారు! ఇగోలు చంపుకొని ఫ్రెండ్షిప్ కోసం రిక్వెస్ట్ పెడుతూ స్నేహం కోసం అర్థిస్తున్నారు. కానీ ఇలాంటి అబ్బాయిలు ఎక్కువమంది ఉండటం అమ్మాయిలకు ఇబ్బందిగా మారుతోంది. సోషల్నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో అమ్మాయి, అబ్బాయిల మధ్య కొత్త పోరాటానికి దారి తీస్తోంది. అబ్బాయిలు ఇంతగానా..! ఒక లేడీ ప్రొఫైల్ మీద ఒక అకౌంట్ ఉంటే దానికి రోజుకు సగటున పదిమంది అబ్బాయిల నుంచి ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్స్ వస్తున్నాయి. లాగిన్ అయిన మరుక్షణం డజన్ల సంఖ్యలో ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్‌లు కనిపిస్తుండే సరికి చాలా మంది అమ్మాయిలు నివ్వెర పోతున్నారు! మరోవైపు - డెరైక్ట్‌గా మన మొహం చూపించాల్సిన పని లేదు, ఒకే క్లిక్‌తో స్నేహాన్ని సంపాదించే అవకాశం ఉంది. అమ్మాయి ఫ్రెండ్షిప్కు ఓకే చెబితే పర్వాలేదు, లేదంటే.. లివిట్! - ఇదీ అబ్బాయిల తీరు. నిజమైన ఫ్రెండ్షిప్కు స్థానముందా?! ఇద్దరు అపరిచితులైన అమ్మాయి, అబ్బాయిల మధ్య ఫేస్బుక్లో స్నేహం చిగురించే అవకాశం ఉందా? అంటే సమాధానానికి చాలా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడంతో మొదలు కొని, వారి స్నేహం కొనసాగాలంటే చాలా ఫ్యాక్టర్స్ పనిచే యాల్సి ఉంటుంది. అవన్నీ సహకరిస్తే ఫేస్బుక్స్నేహం ఫలప్రదం అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి ఫ్యాక్టర్స్‌లో చదువు, ఉద్యోగం, కులం... అన్నీ ప్రభావం చూపుతున్నాయి. అందమైన ప్రొఫైల్.. ‘ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్లకుంటాయి...’ ఫేస్బుక్ స్నేహాంలో కూడా ఈ వాక్యాన్ని అన్వయించుకోవచ్చు. తాము ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయాలనుకొంటున్నామో, చాటింగ్ చేద్దామనుకొంటున్నామో అమ్మాయిలకూ, అబ్బాయిలకూ చాలా క్లారిటీ ఉంటుందని చెప్పవచ్చు. తమ స్టడీస్‌కూ, కెరీర్‌కు, లైఫ్‌కు, లైఫ్‌స్టైల్‌కు... రీచ్ అవుతారనుకొనే వారికే అమ్మాయిలు తమ ఎఫ్బీ అకౌంట్‌కు స్వాగతం చెప్పే ట్రెండ్ కనిపిస్తోందిప్పుడు. దీన్ని బట్టి అబ్బాయిల ఎఫ్బీ ప్రొఫైల్‌ను బట్టి అమ్మాయిలు స్పందిస్తున్నారని అనుకోవచ్చు. సామాజిక ‘వర్గం’ కూడా..! ఫేస్బుక్ స్నేహాల్లో వ్యక్తిగత అభిరుచులు చాలా వరకూ ప్రభావాన్ని చూపిస్తున్నాయనేది చెప్పుకొన్న విషయమే. ఇందులో సామాజికవర్గాన్ని బట్టి యాక్సెప్టెన్స్ ఉంటుందనేది బహిరంగ రహస్యం. అయితే ప్రతి సారీ ఇది చెల్లుబాటు కావడం లేదు. అమ్మాయిలే అల్టిమేట్! అమ్మాయిల నుంచి అబ్బాయిలకు రిక్వెస్ట్ వచ్చే పరిస్థితులు అత్యంత అరుదు. అమ్మాయిలు తమ రిక్వైర్‌మెంట్స్‌కు రీచ్ అయిన వారినే స్నేహితులుగా సమ్మతినిచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ విషయంలో అమ్మాయిలే అల్టిమేట్ అని చెప్పవచ్చు! - జీవన్‌రెడ్డి.బి మారు పేరే మంచిది! ఒక అమ్మాయి బస్టాప్‌లో కనిపిస్తే పది మంది అబ్బాయిలు బైకులు ఆపుకొని చూస్తారు. ఫేస్బుక్లో కూడా అంతే. ఒక రాయి వేద్దామని అబ్బాయిలు రిక్వెస్ట్ పెట్టవచ్చు. తనకూ ఒక గర్ల్‌ఫ్రెండ్ ఉందని చెప్పుకోవడానికి వీలుంటుందని అబ్బాయిలు ఇలాంటి ప్రయత్నం చేయవచ్చు. ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ రావడం అంటే అమ్మాయిలకు ఒక రకంగా ఇగో శాటిష్ఫ్యాక్షనే. తన పోస్టింగ్స్‌కు ఎక్కువ లైక్స్ కోరుకొనే అమ్మాయిలు ఫ్రెండ్స్ సంఖ్యను పెంచుకొంటారు. భావాలను పంచుకోవడానికే ఫేస్బుక్ కావాలనుకొనే అమ్మాయిలు మారు పేర్లమీద, ఫోటోలు పెట్టకుండా, అకౌంట్‌ను అపరేట్ చే సే అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. - యండమూరి వీరేంద్రనాథ్, ప్రముఖ రచయిత.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
Advertisement