
సీమంతం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం భార్య, హీరోయిన్ రహస్య గోరఖ్ సీమంతం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇంతకీ విషయం ఏంటి?
Read More

టీవీలోకి వచ్చేస్తున్న ‘రాబిన్‌హుడ్’
నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్.. ఈ ఏడాది మార్చిలో విడుదలై డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది. ఓటీటీలో అయినా ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం చిత్రబృందంలో బలంగా ఉంది. అయితే ఓటీటీ కంటే ముందే ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ని కొనుగోలు చేసిన జీ5 సంస్థ.. మే 10న ఈ చిత్రాన్ని టీవీలో టెలికాస్ట్ చేయనుంది. ఆ తర్వాతే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.
Read More

సింహాచలం బాధితులకు రెండు లక్షలు అందజేత
సింహాచలం ఘటనలో చనిపోయిన ప్రతి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రెండు లక్షల ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకు అందించాము. సింహాచలం కొండపై ప్రమాదానికి సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఎండోమెంట్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలి. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి.
Read More

భారత సైన్యానికి అండగా ఉందాం.. జైహింద్: వైఎస్ జగన్
ఆపరేషన్ సిందూర్‌పై వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘పహల్గాంలో ఉగ్ర దాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాయి. మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. దేశ ప్రజలను రక్షించడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ పోరాటంలో మేమంతా అండగా నిలుస్తాం. జైహింద్’ అని పోస్టు చేశారు.
Read More

హ్యాపీ దివాళీ, హ్యాపీ మిడ్ నైట్ సన్‌రైజ్.. పాకిస్తాన్‌పై ఫన్నీ కామెంట్స్
భారత దాడుల సందర్భంగా పాకిస్తాన్‌లో పరిస్థితులపై సోషల్ మీడియా వేదికగా పలువురు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అర్థరాత్రి రెండు గంటలకే పాకిస్తాన్‌లో సూర్యోదయం వచ్చిందని కర్ణాటక బీజేపీ ట్విట్టర్‌లో ఫన్నీ పోస్టును పెట్టింది. ఇక, పలువురు నెటిజన్లు వీడియోలు ఫోస్టు చేస్తూ దివాళి ముందే వచ్చేసిందనే సినిమా డైలాగ్‌తో పోస్టులు చేస్తున్నారు.
Read More

ఆపరేషన్ సిందూర్.. అర్ధరాత్రి దాడులు ఇలా..
ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యల్లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం (Indian Army) మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మౌలిక
Read More

ఆపరేషన్ సిందూర్.. పాక్ ప్రధాని రియాక్షన్ ఇదే..
భారత్ దాడులను పాక్ సైన్యం ధ్రువీకరించింది. భారత్ దాడులపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘పాక్ శత్రువు భారత్.. మా దేశంలోని ఐదు ప్రాంతాల్లో దాడులు జరిపింది. ఈ చర్యలకు పాకిస్తాన్ కచ్చితంగా బదులు తీర్చుకుంటుంది. ఈ సమయంలో పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడి ఉంది. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ ఆర్మీకి తెలుసు. ప్రత్యర్థి దుష్ట ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లోనూ..
Read More

ప్రభుత్వ రుణం దిగిరావాలి
పెరిగిన ప్రభుత్వ రుణం మోస్తరు స్థాయికి దిగిరావాల్సి ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌సేత్ అన్నారు. తద్వారా వడ్డీ చెల్లింపులు తగ్గుతాయని, అప్పుడే రేటింగ్ అప్‌గ్రేడ్ అవుతుందన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. అనిశ్చితులు పెరిగిపోతున్న నేపథ్యంలో భారత్ ఏదో ఒక నిర్ధిష్టమైన మార్గానికి పరిమితం కాకూడదన్నారు.
Read More

టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకే
గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) స్పందించాడు. ఆఖరి వరకు తమ జట్టు పోరాడిన తీరు అద్భుతమని కొనియాడాడు. అయితే, నో బాల్స్ వేయడం ప్రభావం చూపిందన్న హార్దిక్.. టీ20లలో ఇలా చేయడం నేరంతో సమానమని పేర్కొన్నాడు.
Read More

ఆపరేషన్ సిందూర్.. స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత?
భారత త్రివిధ దళాల సహాయంతో ఆర్మీ బలగాలు పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడి చేశాయి. ఇందులో సుమారు 80 మందికిపైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. గతంలో జమ్మూకశ్మీర్‌లో భారత పర్యాటకులను ఊచకోత కోసిన ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత్ దాయాది దేశంపై పంజా విసిరింది.
Read More

ఎన్‌బీఎఫ్‌సీ గోల్డ్ లోన్లకు కష్టాలు
ఆర్‌బీఐ ప్రతిపాదించిన నూతన ముసాయిదా నిబంధనలు ఎన్‌బీఎఫ్‌సీ (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు) బంగారం రుణ ఆస్తులు నిదానించేలా చేస్తాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. లోన్ టు వ్యాల్యూ (బంగారం విలువలో ఇచ్చే రుణం), రుణాల పునరుద్ధరణ, టాపప్ బుల్లెట్ రుణాలపై ఈ ముసాయిదా దృష్టి పెట్టిందని.. ఈ నిబంధనలు ఎన్‌బీఎఫ్‌సీ రుణ ఆస్తుల వృద్ధిపై ప్రభావం చూపిస్తాయని తెలిపింది.
Read More

'బలగం' నటుడికి తీవ్ర అనారోగ్యం
బలగం సినిమాలో నటించిన జీవీ బాబు అనే నటుడు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఆయనకు ఏమైంది? ఇప్పుడెలా ఉందంటే?
Read More

చదరపు అడుగు రూ.2.75 లక్షలు: రియల్టీలోనే సరికొత్త రికార్డ్!
కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ 'ఉదయ్ కోటక్'.. ముంబైలోని వర్లి సీ-ఫేస్‌లో ఒక నివాస భవనాన్ని రూ. 400 కోట్లకంటే ఎక్కువ వెచ్చించి కొనుగోలు చేశారు. ఇక్కడ చదరపు అడుగు ధర రూ.2.75 లక్షలు అని సమాచారం. దీంతో ఇది దేశీయ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అత్యధిక ధరగా రికార్డ్ క్రియేట్ చేసింది.
Read More

IPL 2025: చెత్త ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రిషబ్ పంత్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఘెరంగా విఫలమవుతున్న ఆటగాళ్లతో ఓ జట్టును రూపొందించింది ఐస్‌ల్యాండ్ క్రికెట్. ఈ జట్టుకు సారధిగా రిషబ్ పంత్‌ను ఎంపిక చేసింది. ఈ జట్టుకు ఐపీఎల్ 2025 మోసగాళ్లు, స్కామర్ల జట్టని నామకరణం చేసింది. ఈ జట్టులో రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, మ్యాక్స్‌వెల్, లివింగ్‌స్టోన్, దీపక్ హుడా, అశ్విన్, పతిరణ, షమీకి చోటు కల్పించింది.
Read More

దుబాయ్‌లో భారతీయ బిలియనీర్‌కు జైలు శిక్ష
దుబాయ్‌లో నివసిస్తూ.. విలాసవంతమైన జీవితం గడుపుతున్న భారతీయ బిలియనీర్ 'బల్వీందర్ సింగ్ సాహ్ని'కి మనీలాండరింగ్ కేసులో 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ అక్కడి కోర్టు ఆదేశించింది. ఈ శిక్షా కాలం పూర్తయిన తరువాత దేశాన్ని వదిలిపోవాలని సాహ్నిని దుబాయ్ కోర్టు ఆదేశించినట్లు స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.
Read More

అందుకే టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్‌గా తప్పుకొన్నా: విరాట్ కోహ్లి
టీమిండియా బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు విరాట్ కోహ్లి (Virat Kohli). అయితే, 2021 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో పొట్టి ఫార్మాట్ పగ్గాలు వదిలేశాడు. అదే ఏడాది ఆర్సీబీ కెప్టెన్‌గానూ వైదొలిగాడు. ఆ మరుసటి సంవత్సరం టీమిండియా వన్డే, టెస్టు జట్టు సారథిగానూ తప్పుకొన్నాడు.ప్రస్తుతం ఐపీఎల్-2025 (IPL 2025)తో బిజీగా ఉన్న కోహ్లి ఈ విషయాలపై తాజాగా మాట్లాడాడు.
Read More

క్షిపణి దాడి.. మే 8 వరకు విమానాల నిలిపివేత
అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ఎయిరిండియా ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్ బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి రాకపోకలు సాగిస్తున్న విమాన సర్వీసులను మే, 8 వరకు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్‌పోర్ట్ సమీపంలో జరిగిన క్షిపణి దాడి కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దాంతో ఎయిరిండియా ఢిల్లీ-టెల్ అవీవ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఏఐ 139ను ఇటీవల అబుదాబికి మళ్లించినట్లు తెలిపింది.
Read More

Thudarum Movie: మోహన్ లాల్ సినిమాకు పైరసీ బెడద
మలయాళ సూపర్ స్టార్ మెహన్ లాల్ నటించిన తాజా చిత్రం 'తుడరుమ్'. ఈ చిత్రంలో శోభన హీరోయిన్‌గా కనిపించింది. మలయాళంలో హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరు దాదాపు 15 ఏళ్ల తర్వాత మరోసారి జతకట్టారు. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే వందకోట్లకు పైగా వసూళ్లతో మలయాళ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
Read More

ఎకాఎకి భారీగా పెరిగిన బంగారం ధరలు!
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి రెండు రోజుల నుంచి క్రమంగా పెరుగుతోంది. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
Read More

ఢిల్లీ క్యాపిటల్స్‌ది తప్పుడు నిర్ణయం: వాట్సన్
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (SRH vs DC) అనుసరించిన వ్యూహాలను ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ విమర్శించాడు.ప్లే ఆఫ్స్ చేరాలంటే కీలకమైన మ్యాచ్‌లోనూ ఓపెనింగ్ జోడీని మార్చడం తనను విస్మయానికి గురిచేసిందన్నాడు. ఢిల్లీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని బుద్ధిలేని చర్యగా అభివర్ణించాడు.
Read More

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అగ్రస్థానం ఈ బ్రాండ్‌దే..
దేశీయంగా మార్చి త్రైమాసికంలో టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 25 శాతం పెరిగాయి. దీంతో కంపెనీ 8 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ పెరుగుతుండటం, రిటైల్ స్టోర్స్‌ను కంపెనీ విస్తరించడం, ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు ఇందుకు గణనీయంగా దోహదపడ్డాయి.
Read More

ఈ ఏడాదిలో ఆర్‌బీఐ మరోసారి తీపికబురు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ మొత్తం మీద 125 బేసిస్ పాయింట్ల మేర (1.25–1.5 శాతం) రేట్లను తగ్గించొచ్చని ఎస్‌బీఐ అధ్యయన నివేదిక అంచనా వేసింది. దీంతో మొత్తం మీద రేట్ల తగ్గింపు 150 బేసిస్ పాయింట్లుగా ఉంటుందని పేర్కొంది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ అంచనాలకు వచ్చింది. 0.25 శాతం స్థానంలో 0.50 శాతం చొప్పున జంబో రేటు తగ్గింపు చేపడితే అది మరింత ప్రభావవంతంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చే
Read More

సన్‌రైజర్స్ అవుట్.. మరి ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేసులోనే ఉందా?
ఐపీఎల్ గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట ఈసారి ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలుండగానే ముగిసింది. సొంతగడ్డపై సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ముందుకెళ్లే మార్గాలన్నీ మూసుకుపోయాయి. మరి ఢిల్లీ పరిస్థితి ఏమిటి?...
Read More

చిరంజీవికి హీరోయిన్ దొరికేసిందా?
మెగాస్టార్ చిరంజీవి.. దర్శకుడు అనిల్ రావిపూడితో త్వరలో సినిమా చేయబోతున్నారు. దీని షూటింగ్ కూడా త్వరలోనే మొదలవనుంది. ఇప్పుడీ ఈ చిత్రంలో హీరోయిన్ గా కేథరిన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈమె గతంలో బన్నీ సరసన ఇదరమ్మాయిలతో, సరైనోడు చిత్రాల్లో చేసింది.
Read More

అతడు మరో ఆరేళ్లపాటు ఐపీఎల్ ఆడతాడు
కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ (Andre Russel)పై ఆ జట్టు బౌలర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) ప్రశంసలు కురిపించాడు. ఇప్పట్లో అతడు రిటైర్ కాబోడని.. కనీసం మరో ఆరేళ్లపాటు ఐపీఎల్ ఆడతాడని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలానికి ముందు కేకేఆర్ రసెల్‌ను రూ. 12 కోట్లకు అతడిని రిటైన్ చేసుకుంది.

బనానాతో హెల్దీగా.. టేస్టీగా!
వేసవి సెలవులొచ్చేశాయి. ఈ సమయంలో పిల్లలకి పోషకమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడం చాలా అవసరం. పిల్లలు సైతం సిద్ధం చేసుకోగలిగే ఈజీ రెసిపీల గురించి తెలుసుకుందాం. వీటిల్లో బనానా రెసిపీలు మొదటి వరసలో ఉంటాయి. పైగా అవి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా.
Read More

పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలు
దిగ్గజ ఇన్వెస్టర్ & బెర్క్‌షైర్ హాత్వే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) వారెన్ బఫెట్.. ఇటీవల తన వాటాదారుల ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక లోటుకు సంబందించిన విషయాలను హైలెట్ చేస్తూ.. పెట్టుబడిదారులు కేవలం యూఎస్ డాలర్ మీద మాత్రమే కాకుండా, ఇతర కరెన్సీలలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు.
Read More

తప్పతాగి పిచ్చి చేష్టలు, తిక్క కుదిర్చిన ఇండిగో
ఢిల్లీ-షిర్డీ వెళ్తున్న ఇండిగో విమానంలో ఎయిర్‌హోస్టెస్‌ను వేధింపులకు గురిచేశాడో వ్యక్తి. మద్యం తాగి, ఆమె పట్ల అనుచితంగా తాకి లైంగికంగా వేధించాడు. మే 2న ఢిల్లీ నుంచి షిర్డీ వెళ్లే 6E 6404 ఇండిగో విమానంలో ఎయిర్ హోస్టెస్‌ను వేధించాడన్న ఫిర్యాదు మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఇండిగో విమానం షిర్డీ విమానాశ్రయంలో దిగిన తర్వాత నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read More

ఫారం 16లో జరిగిన మార్పులు ఇవే.. గమనించారా?
2024–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫారంలో 16 మార్పులు వచ్చాయి. మీ యజమాని ఈ మార్పులు చేసిన తర్వాత మీకు ఫారం 16 జారీ చేస్తారు.
Read More

భువనగిరి సినిమాలకు సిరి
హైదరాబాద్ శివారులోని యాదాద్రి భువనగిరి జిల్లా.. సినిమాలు, టెలిఫిల్మ్‌లు, యాడ్ ఫిల్మ్‌ల షూటింగ్‌లకు అనుకూలంగా ఉండటం దర్శక నిర్మాతలకు కలిసొస్తోంది. పేరు మోసిన డైరెక్టర్లు, హీరో, హీరోయిన్లతో ఇక్కడ సినిమాలు చేస్తున్నారు. పల్లె వాతావరణం, ప్రకృతి రమణీయత, పచ్చని వరి పొలాలు, చెరువులు, దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, గుట్టలు ఫిలిం సిటీ పక్కనే ఉండటం..సినిమా నిర్మాణానికి అనుకూలంగా ఉంది.
Read More

కాపురాల్లో డబ్బు చిచ్చు!
మానవ సంబంధాల్లో డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రేమగా మాట్లాడాలన్నా, అభిమానాన్ని ఎదుటివ్యక్తికి తెలియజేయాలన్నా డబ్బు అవసరం లేకపోవచ్చు.. కానీ ఆ ప్రేమను, అభిమానాన్ని కలకాలం నిలబెట్టుకోవాలంటే మాత్రం కచ్చితంగా డబ్బు కావాల్సిందే. ప్రస్తుత రోజుల్లో విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య పెరుగుతోంది.
Read More

IND vs ENG: బుమ్రాకు భారీ షాక్!
ఇంగ్లండ్ పర్యటనలో రోహిత్ స్థానాన్ని పేస్ దళ నాయకుడు, టెస్టు జట్టు వైస్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)తో భర్తీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం రోహిత్‌నే కెప్టెన్‌గా కొనసాగించేందుకు మొగ్గు చూపిన బోర్డు.. బుమ్రా పేరును కనీసం వైస్ కెప్టెన్సీ రేసులోనూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇందుకు కారణం ఏమిటంటే..
Read More

విశాఖలో విషాదం
విశాఖలోని సీతమ్మధారలో విషాదం నెలకొంది. సితార అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న పూర్ణిమ (38) ఈరోజు ఉదయం తన స్కూటీపై రోడ్డు మీద వెళ్తోంది. ఈ సందర్భంగా ఆమెపై చెట్టు విరిగి పడిపోయింది. ఈ ఘటనలో బాధితురాలు అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ప్రమాదంలో కారు, బైక్ సహా ఇతర వాహనాలు దెబ్బతిన్నాయి.
Read More

హైవే-363ని జాతికి అంకితమిచ్చిన గడ్కరీ
సిర్పూర్ కాగజ్‌నగర్‌లో నితిన్ గడ్కరీ జాతీయ రహదారి 363ని గడ్కరీని జాతికి అంకితం చేశారు. జాతీయ రహదారులతో దేశాన్ని అనుసంధానిస్తున్నాం. వెనుకబడిన జిల్లాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. కేంద్రమంత్రిగా ప్రజల సమస్యలను అర్థం చేసుకునే అవకాశం వచ్చింది. గడ్చిరోలి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. నేను ఇంజనీర్‌ను కాదు.. కానీ, 13 డాక్టరేట్లు వచ్చాయి. చీకటి ఉన్న చోటనే వెలుగు
Read More

బోర్డర్ టెన్షన్.. జమ్ముకశ్మీర్‌లో జైళ్లకు భద్రత పెంపు
కశ్మీర్ జైళ్లలో ఉన్న హైప్రొఫైల్ ఉగ్రనాయకులను విడిపించేందుకు భారీ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. ఈక్రమంలో శ్రీనగర్ సెంట్రల్ జైల్, కోట్ బాల్వాల్ జైల్, జమ్మూలోని జైళ్లకు భారీఎత్తున భద్రత కల్పించారు. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా చాలామంది స్లీపర్ సెల్స్, ఓవర్ గ్రౌండ్ వర్కర్లను తీసుకొచ్చి ఈ జైళ్లలో ఉంచారు. వీరితోపాటు ఆర్మీ వాహనంపై దాడి కేసులో నిందితులైన..
Read More

రైతులకు బాసటగా..
తాడేపల్లి: అకాల వర్షాలు పడతాయని తెలుసు. అయినా ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయలేదు. అధికార యంత్రాంగం నిస్తేజంలో ఉండిపోయింది. ఫలితంగానే.. రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. కానీ, ప్రభుత్వం నుంచి వాళ్లకు పరిహారం ఇప్పించాల్సిన బాధ్యత మనది. అందుకే నష్టపోయిన రైతుల వద్దకు వెళ్లండి. వాళ్లను పరామర్శించండి అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
Read More

వచ్చే మూడేళ్లలో ఒకే రంగంలో కోటిన్నర ఉద్యోగాలు
ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లభిస్తే దేశీయంగా రెస్టారెంట్ రంగం 2028 నాటికి 1.5 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పించగలదని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) వైస్ ప్రెసిడెంట్ జొరావర్ కల్రా తెలిపారు. ఇందుకోసం ‘పరిశ్రమ’ హోదా కల్పించాలని, జీఎస్‌టీపై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రయోజనాల్లాంటివి ఇవ్వాలని కోరారు.
Read More

యుద్దానికి సిద్దమంటున్న పాక్..
భారత్ యుద్ధ సన్నద్దత వేళ పాకిస్తాన్ అలర్ట్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా పాక్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌తో నెలకొన్న పరిస్థితులను సివిల్, మిలిటరీ నాయకత్వం.. అఖిలపక్ష భేటీలో చర్చించినట్టు సమాచారం. భారత్ దాడి చేస్తే తమ సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో రాజకీయ పార్టీలకు పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి వివరించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షం పీటీఐ..
Read More

నీతా అంబానీ ఫిట్‌నెస్, కోచ్ చెప్పి రహస్యాలు
వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీ భార్య రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ ఆరుపదుల వయసులో కూడా ఫిట్‌గా ఉంటారు. మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం తన ఫిట్‌నెస్ రహస్యాన్ని వెల్లడిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. తాజాగా నీతా ఫిట్‌నెస్ కోచ్ వినోద్ చన్నా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Read More

పడి లేచిన పసిడి ధర! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి ఈరోజు మళ్లీ పెరిగింది. వివిధ ప్రాంతాల్లో సోమవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
Read More

వైభవ్ ఆట ఆకట్టుకుంది: ప్రధాని మోదీ ప్రశంసలు
ఐపీఎల్-2025 (IPL 2025)లో సంచలన బ్యాటింగ్‌తో అందరికంటా పడిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ని భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రశంసలతో ముంచెత్తారు. అతడు పడిన కష్టం, ఆడిన తీరు తనని అమితంగా ఆకట్టుకుందని అన్నారు. బిహార్‌లో ‘ఖేలో ఇండియా’ గేమ్స్ ఆరంభోత్సవం సందర్భంగా మోదీ వీడియో సందేశం ఇచ్చారు.
Read More

ఎన్నడూ లేనంత ఆర్థిక అనిశ్చితి
ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) గణనీయంగా తగ్గించేసింది. కరోనా సమయం కంటే అధిక అనిశ్చితి నెలకొన్నట్టు పేర్కొంది. ప్రపంచ జీడీపీ 2025లో 2.8 శాతం, 2026లో 3 శాతం చొప్పున వృద్ధి సాధిస్తుందని తాజాగా అంచనా వేసింది. యూరో ప్రాంతంలో వృద్ధి 2025లో 0.8 శాతం, 2026లో 1.2 శాతంగా ఉండొచ్చని పేర్కొంది.
Read More

IPL 2025: సన్‌రైజర్స్ జట్టులో చరిత్ర సృష్టించిన బౌలర్
గాయపడిన స్మరణ్ రవిచంద్రన్ స్థానంలో విదర్భ లెఫ్డ్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబే (30 లక్షలు) సన్‌రైజర్స్ జట్టులోకి వచ్చాడు. 22 ఏళ్ల హర్ష్ .. తాజాగా ముగిసిన రంజీ సీజన్‌లో రికార్డు స్థాయిలో 10 మ్యాచ్‌ల్లో 69 వికెట్లు (7 ఐదు వికెట్ల ప్రదర్శనలతో పాటు రెండు 10 వికెట్ల ప్రదర్శనలు) తీసి, రంజీ చరిత్రలోనే ఓ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు.
Read More

కూకట్‌పల్లిలో కాజల్ అగర్వాల్ సందడి
కూకట్‌పల్లిలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సందడి చేశారు. నెక్సస్ మాల్ ఎదురుగా ఉన్న వాసవి శ్రీశ్రీ సిగ్నేచర్‌లో ఓ బంగారు ఆభరణాల షోరూంను ఆదివారం ఆమె ప్రారంభించారు. కాజల్‌ను చూసేందుకు జనాలు పెద్ద ఎత్తున అక్కడకు తరలి వచ్చారు. వారికి కాజల్ అభివాదం చేసి ఆత్మీయంగా పలకరించారు.

లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 10:16 సమయానికి నిఫ్టీ(Nifty) 132 పాయింట్లు పెరిగి 24,478కు చేరింది. సెన్సెక్స్(Sensex) 391 పాయింట్లు పుంజుకుని 80,891 వద్ద ట్రేడవుతోంది.
Read More

IPL 2025: అప్పుడే అంతా అయిపోలేదు: లక్నో కెప్టెన్ రిషబ్ పంత్
నిన్న (మే 4) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీపై పంజాబ్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 5 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేయగా.. ఛేదనలో ఆదిలోనే చేతులెత్తేసిన లక్నో 7 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. కీలక దశలో మ్యాచ్ కోల్పోయినా లక్నో కెప్టెన్ పంత్ ప్లే ఆఫ్స్ బెర్త్‌పై ధీమా వ్యక్తం చేశాడు.
Read More

సినిమాపై 100 శాతం సుంకం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలపై వంద శాతం సుంకాలు విధించారు. అమెరికా చలన చిత్ర పరిశ్రమ తిరిగి బాగుపడడమే తన ఉద్దేశమని, కొన్ని దేశాలు అమెరికా సినిమాను చంపే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారాయన. ఈ క్రమంలో హాలీవుడ్, అమెరికా లోని ఇతర లొకేషన్లలో షూటింగ్ జరగాలనే కామెంట్ చేశారు.
Read More

సరళతర ఎఫ్‌డీఐ విధానం.. అవకాశాలు అపారం
భారత్ అమలు చేస్తున్న సరళతర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం (ఎఫ్‌డీఐ) విదేశీ ఇన్వెస్టర్లకు అపారమైన పెట్టుబడి అవకాశాలను ఆఫర్ చేస్తోందని డెలాయిట్ ఇండియా తెలిపింది. ఫార్మాస్యూటికల్స్, ఆటో, పర్యాటక రంగాలకు ఎఫ్‌డీఐలను ఆకర్షించే శక్తితోపాటు ఉపాధి కల్పనకు చోదకాలుగా నిలవగలవని పేర్కొంది. వీటికితోడుగా ఎగుమతులు, ఆవిష్కరణలు భారత్ తదుపరి దశ వృద్ధిని నడిపించగలవని తెలిపింది.
Read More

మార్కెట్లపై రెండింటి ఎఫెక్ట్
దేశీ స్టాక్ మార్కెట్లలో ఈ వారం ట్రెండ్ పలు కీలక అంశాలపై ఆధారపడనుంది. దేశీయంగా కార్పొరేట్ ఫలితాలు ప్రభావం చూపనున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పరపతి సమీక్షకు తెరతీయనుంది. మరోపక్క భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ వారం ఆటుపోట్లకు అవకాశమున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
Read More

త్వరలో కేంద్రీకృత కేవైసీ వ్యవస్థ
కేంద్రీకృత కేవైసీ (నో యువర్ కస్టమర్) వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఆర్థిక శాఖ, ఆర్థిక నియంత్రణ సంస్థలతో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. కస్టమర్ల కేవైసీ వివరాలను ఒకే చోట నిర్వహించేదే సెంట్రల్ కేవైసీ. దీనివద్ద కేవైసీ వివరాలను అప్‌డేట్ చేస్తే.. అన్ని ఆర్థిక సంస్థల వద్ద ఆటోమేటిక్‌గా అది అప్‌డేట్ అయిపోతుంది.
Read More