బాంబులు వేసిన రష్యా.. ముక్కలు.. | The dramatic moment 200 ISIS militants were annihilated by Russian air strikes | Sakshi
Sakshi News home page

బాంబులు వేసిన రష్యా.. ముక్కలు..

Aug 23 2017 11:10 AM | Updated on Sep 17 2017 5:53 PM

బాంబులు వేసిన రష్యా.. ముక్కలు..

బాంబులు వేసిన రష్యా.. ముక్కలు..

సిరియాలోని డిర్‌ ఎల్‌ జోర్‌ పట్టణంపై రష్యా బాంబుల వర్షం కురిపించింది.

సిరియా‌: సిరియాలోని డిర్‌ ఎల్‌ జోర్‌ పట్టణంపై రష్యా బాంబుల వర్షం కురిపించింది. రష్యా యుద్ధ విమానాలు చేసిన ఈ మెరుపు దాడిలో దాదాపు 200 మంది మిలిటెంట్లు హతమయ్యారు. ఈ మేరకు రష్యా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సిరియా సేనలకు సహకారంగా రష్యా.. డిర్‌ ఎల్‌ జోర్‌ నగరంలోని ఐసిస్‌ తీవ్రవాదుల స్ధావరాలను ముక్కలు చేసి, వారిని మట్టుబెట్టినట్లు పేర్కొంది.

ఆగష్టు నెలలో ఇప్పటివరకూ 800 ఉగ్రవాదులను రష్యా బలగాలు అంతమొందించాయని చెప్పింది. అంతర్యుద్ధం జరగుతున్న ప్రదేశానికి ఐసిస్‌ తీవ్రవాదులు వెళ్లకుండా అడ్డుకుంటున్నామని తెలిపింది. మోసుల్‌, రక్కా నగరాలపై అమెరికా, రష్యా సేనలు పట్టు సాధించిన అనంతరం డిర్‌ ఎల్‌ జోర్‌ నగరానికి పెద్ద ఎత్తున ఉగ్రవాదులు తరలివచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement