ఎముక క్యాన్సర్‌కు హోమియో వైద్యం

ఎముక క్యాన్సర్‌కు హోమియో వైద్యం


క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ప్రారంభదశలోనే గుర్తించి, అనుభవజ్ఞుడైన హోమియో వైద్యుని ఆధ్వర్యంలో చికిత్స జరిగితే వ్యాధిని అదుపులో ఉంచవచ్చు. కాన్‌స్టిట్యూషనల్ హోమియోవైద్యం ద్వారా క్యాన్సర్ కణాన్ని నియంత్రణలో ఉంచవచ్చు. రేడియోథెరపీ, కీమోథెరపీ తీసుకుంటూనే హోమియో చికిత్సనూ అనుసరిస్తే... ఇతర దుష్ర్పభావాలు రాకుండా అరికట్టవచ్చు.

 

కొన్ని ముఖ్యమైన హోమియో మందులు

హెక్లాలావా: ‘ఆస్టియోసార్కోమా’ వంటి ఎముక క్యాన్సర్, దవడ ఎముక, చీలమండ లోపలి ఎముక (టిబియా)లో వచ్చే క్యాన్సర్లకు వాడదగిన ఔషధం.



హైడ్రాస్టిస్ కెనడెన్సిస్: పూర్తి క్యాన్సర్ దశలో వాడదగిన ఔషధం. ఇది ముఖ్యంగా ఎముకలు, నాలుక, ఉదరం, జననాంగాలపై వచ్చే క్యాన్సర్లలో ఉపయోగపడుతుంది. క్యాన్సర్ చికిత్స తర్వాత వచ్చే కండరాల బలహీనతను అధిగమించడానికి ఉపయోగపడుతూనే కండరాల పటుత్వాన్నీ పెంచుతుంది.



కాల్కేరియా ఫాస్: వివిధ రకాల క్యాన్సర్ మందులు పూర్తిస్థాయిలో పనిచేయకుండా ఉన్నప్పుడు వాటిని క్రియాశీలం చేసేందుకు కాల్కేరియా ఫాస్ చక్కగా పనిచేస్తుంది.  చిన్నపిల్లల్లో ఎదుగుదల లోపాలు లేదా ఎముకల ఫ్రాక్చర్లు త్వరగా తగ్గిపోడానికీ, చిన్నపిల్లల్లో వచ్చే ఎముక క్యాన్సర్లు తగ్గడానికి పనిచేస్తుంది.

     

మెజీరియం: ఇది ఎముక, దాని చుట్టూ ఉండే కవచంపైన ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఎముక నుంచి ఏర్పడే ద్రవంతో కూడిన సిస్టిక్ ట్యూమర్, నుదురు, దవడ ఎముకల్లో వచ్చే చీముగడ్డల నివారణకు ఉపయోగపడుతుంది. సవాయిరోగాన్ని (సిఫిలిస్‌ను) అణచివేయడం వల్ల వచ్చే కపాల వాపు, కపాలంపై వచ్చే కణుతులకు చక్కగా పనిచేస్తుంది.

 

ఫాస్ఫరస్: ఎముక క్యాన్సర్ ముఖ్యంగా తొడ ఎముక (ఫీమర్), కాలిచీలమండ లోపలి ఎముక (టిబియా) పెరుగుదల ఉన్నవారిలో, చీముతో కూడిన కాలి పుండ్లు ఉన్నవారిలో  ఉపయోగపడుతుంది. క్యాన్సర్ కారణంగా అధిక రక్తస్రావం జరగడం, ఎముక చుట్టూ ఉండే కవచం పుండుగా మారి ఊడిపోవడం... ఎముక గరుకుగా మారడం, మంటతో కూడిన నొప్పులు, జ్వరం, చల్లటిపదార్థాలు తీసుకోవాలనిపించడం, అస్థిమితం వంటి వాటికి ఇది మంచి మందు.

 

రేడియం బ్రోమాటం: మొటిమలు, డర్మటైటిస్ అనే చర్మవ్యాధి కి, ఎముకల్లో నొప్పులు, కీళ్లనొప్పులు, ఎముక క్యాన్సర్‌కు  పనిచేస్తుంది.

 

ఆరమ్ మెట్: క్యాన్సర్‌తో మనోవ్యాకులతకు గురై ఆత్మహత్య చేసుకోవాలనిపించేవారికి పనిచేస్తుంది.

 

సింఫైటమ్:
అన్నిరకాల ఎముక సంబంధ వ్యాధులు... ముఖ్యంగా ఎముక వాపు, దవడవాపు, సార్కోమా వంటి సమస్యలకు వాడదగిన మందు. అంతేకాకుండా సింఫైటమ్‌ను ఎముక చీలికలు లేదా ఫ్రాక్చర్లు త్వరగా మానడానికి ప్రథమ చికిత్సగా వాడతారు. నరాల నొప్పి, మోకాలి నొప్పి, టెండన్స్ ఇబ్బందులకు కూడా ఇది చక్కగా పనిచేస్తుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top