నో హిట్టింగ్‌.. ఓన్లీ డిఫెన్స్‌

Published on Mon, 02/02/2026 - 06:28

కొత్త ఆదాయపు పన్ను.. జీఎస్‌టీ మార్పుల వంటి అనూహ్య నిర్ణయాలు చూస్తున్న వీక్షకులంతా... బడ్జెట్‌ కూడా ఈ వారంలో మొదలయ్యే టి–20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లా ఉంటుందనుకున్నారు. తొలి బంతి నుంచే సిక్సర్ల వర్షాన్ని ఆశించారు. అభిషేక్‌ శర్మ స్థాయి పవర్‌ప్లేకి రెడీ అయిపోయారు.  

కానీ... కెప్టెన్‌ మోదీ తమది టి–20 ధనాధన్‌ కాదని.. సుదీర్ఘ టెస్ట్‌ ఇన్నింగ్స్‌తోనే అనుకున్న వృద్ధిని సాధిస్తామని సంకేతాలిచ్చారు. తమ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను ఫుల్‌గార్డ్‌తో పంపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతావనిని సాధిస్తామంటూ రెండు దశాబ్దాల తరువాతి లక్ష్యాన్ని ఆవిష్కరించారు. 

ఆ దిశగా టెస్ట్‌ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టారు. వీరబాదుడు లేదు.. రిస్కీ షాట్లు లేనే లేవు. బౌండరీలు, సిక్సర్లు అస్సలే లేవు. ప్రతి బంతినీ పద్ధతిగా ఆడుతూ సింగిల్స్‌కు పరిమితమయ్యారు. సునీల్‌ గవాస్కర్‌ను మరిపించారు. కళ్లు చెదిరే షాట్లు అక్కర్లేదు... క్రీజ్‌లో ఉంటే చాలనే స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ ద్వారా కెప్టెన్‌ నరేంద్ర మోదీ చెప్పింది ఒక్కటే.. ‘నో హిట్టింగ్‌.. ఓన్లీ డిఫెన్స్‌... ఇది లాంగ్‌టర్మ్‌ ఇన్నింగ్స్‌’’.

ఇన్‌కమ్‌ట్యాక్స్‌ పిచ్‌ ఏమాత్రం మారలేదు. అవే శ్లాబ్స్‌. కాకపోతే టీసీఎస్, టీడీఎస్‌ విషయాల్లో చిన్నచిన్న ఉపశమనాలిచ్చారు. ఎన్నారైలు, ఫారిన్‌ అసెట్స్‌కు సంబంధించి పాత తప్పులు దిద్దుకోవటానికి కొన్ని ఫ్రీహిట్స్‌ ఇచ్చారు. వన్‌టైమ్‌ డిస్‌క్లోజర్‌ అనేది ఓ వారి్నంగ్‌. అంటే... నోబాల్‌గా ప్రకటించిన క్లీన్‌బౌల్డ్‌ అన్నమాట. 7 రంగాల్లో తయారీ సామర్థ్యాన్ని పెంచటం... 7 కొత్త హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లు అంటూ మోదీ ‘7’వ నంబర్లో వచ్చే ధోనీ, కపిల్‌ వంటి కెప్టెన్ల స్థాయిని కళ్లకు కట్టారు. 

ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ 2.0, బయోఫార్మా శక్తి, కెమికల్‌ పార్కులు, రేర్‌ ఎర్త్‌ కారిడార్లు, కంటైనర్‌ తయారీ, ఎల్రక్టానిక్‌ కాంపోనెంట్ల తయారీ వంటి పథకాలన్నీ మున్ముందు స్కోర్‌బోర్డును ముందుకు తీసుకెళ్లబోయే షాట్లు. ఇన్ని ఒత్తిళ్ల నడుమ... ద్రవ్య లోటును 4.3 శాతానికే పరిమితం చేస్తామంటూ... సింగిల్స్‌తోనైనా రన్‌రేటు మాత్రం పడిపోకుండా చూసుకున్నారు.  

ఇక స్టాక్‌ మార్కెట్ల విషయానికొస్తే... ఎస్‌టీటీ రూపంలో మోదీ ప్రభుత్వం ఓ బౌన్సర్‌ వేసింది. ఆదాయ నష్టాన్ని పూడ్చుకోవాలి కనక స్టాక్‌ మార్కెట్లలో ఫ్యూచర్లపై సెక్యూరిటీ లావాదేవీల పన్నును 150 శాతం, ఆప్షన్లపై 50 శాతం పెంచారు. మార్కెట్లకిది నచ్చలేదు. బంతిని బలంగానే కొట్టాయి. ప్రస్తుతానికైతే బంతి గాల్లోకి లేచి మార్కెట్లు పడ్డాయి. అది క్యాచో కాదో మున్ముందు తెలుస్తుంది.  

ఇవీ చదవండి:
రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్‌

అదే పిచ్‌.. కాస్త రిలీఫ్‌

ఖనిజ సంపదకు కారిడార్‌ వెలుగులు

నిధుల సిక్సర్‌

విలేజ్‌.. విన్నర్‌

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)