సిరీస్ 4-2తో న్యూజిలాండ్ కైవసం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన ఏడు వన్డేల సిరీస్‌ను శ్రీలంక జట్టు ఓదార్పు విజయంతో ముగించింది. గురువారం జరిగిన చివరిదైన ఏడో వన్డేలో పర్యాటక జట్టు 34 పరుగులతో నెగ్గింది. అయితే సిరీస్‌ను మాత్రం ఆతిథ్య జట్టు 4-2తో దక్కించుకుంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.
సీనియర్ బ్యాట్స్‌మన్ కుమార సంగక్కర (105 బంతుల్లో 113 నాటౌట్; 14 ఫోర్లు) అజేయ సెంచరీతో పాటు ఫామ్‌లో ఉన్న దిల్షాన్ (98 బంతుల్లో 81; 5 ఫోర్లు; 1 సిక్స్) మరోమారు బ్యాట్ ఝుళిపించడంతో లంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 287 పరుగులు చేసింది. రెండో వికెట్‌కు వీరు 104 పరుగులు జోడించారు. అండర్సన్ 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 45.2 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
కెప్టెన్ కేన్ విలియమ్సన్ (83 బంతుల్లో 54; 4 ఫోర్లు), రోంచి (42 బంతుల్లో 47; 4 ఫోర్లు; 1 సిక్స్) టాప్ స్కోరర్లు. ఈ మ్యాచ్ ద్వారా సంగక్కర వన్డేల్లో అత్యధిక (474) అవుట్లలో పాలుపంచుకున్న వికెట్ కీపర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు గిల్‌క్రిస్ట్ (472) పేరిట ఉండేది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా సంగక్కర, మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా కేన్ విలియమ్సన్ ఎంపికయ్యారు.
ఆఖరి వన్డేలో లంక విజయం
Published Fri, Jan 30 2015 12:58 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: కశ్మీర్లో కనిపించని కమలం!
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్‌లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్‌తో హెల్దీ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ !
- 200 లోక్‌సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement