'లాప్‌టాప్ లే మా కొంపముంచాయి' | Laptop scheme cost us Lok Sabha polls, Mulayam Singh Yadav | Sakshi
Sakshi News home page

'లాప్‌టాప్ లే మా కొంపముంచాయి'

Nov 17 2014 5:54 PM | Updated on Sep 2 2017 4:38 PM

'లాప్‌టాప్ లే మా కొంపముంచాయి'

'లాప్‌టాప్ లే మా కొంపముంచాయి'

గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పంపిణీ చేసిన లాప్‌టాప్ లే తమ కొంప ముంచాయని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ అభిప్రాయపడ్డారు.

లక్నో: గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పంపిణీ చేసిన లాప్‌టాప్ లే తమ కొంప ముంచాయని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ అభిప్రాయపడ్డారు. గత లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ ఓటమికి ఆ లాప్ టాప్ లే కారణమన్నారు. కుర్రోళ్లంతా నరేంద్ర మోదీ ప్రసంగాలు చూసి ప్రభావితులయ్యారన్నారని ములాయం తెలిపారు.

 

సోమవారం పార్టీ జాతీయ స్థాయి మహిళా విభాగం సమావేశానికి హాజరైన ములాయం.. ఏడో తరగతి పిల్లలకు లాప్ టాప్ లు ఇవ్వటాన్ని తాను ఎప్పుడూ వ్యతిరేకించానని స్పష్టం చేశారు. ఆ లాప్ టాప్ లలో మోదీ ప్రసంగాలతో ప్రజలు ఆకర్షితులయ్యారన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ, అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కూడా హాజరయ్యారు. 2012 లో జరిగిన అసెంబ్లీకి జరిగిన ఎన్నికలకు సంబంధించి అఖిలేష్ యాదవ్ లాప్ టాప్ ల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement